సాక్షి, హైదరాబాద్: కల్వకుంట్ల కన్నారావుపై మరో కేసు నమోదైంది. గెస్ట్‌హౌస్‌లో ఒకరిని నిర్బంధించడంతో పాటు దాడి చేసి 60 లక్షల నగదు, 97 తులాల బంగారం దోపిడీ చేసినట్లు అందిన ఫిర్యాదుపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బిందు మాధవి అలియాస్ నందిని అనే మహిళతో కలిసి అరాచకానికి పాల్పడ్డారు.
న్యాయం కోసం కన్నరావు వద్దకు వెళ్లిన సాప్ట్ వేర్ ఉద్యోగి విజయవర్ధన్‌రావు వద్ద నగలు, నగదు ఉన్నాయని తెలుసుకున్న నందిని స్కెచ్ వేసింది. కన్నారావు, శ్యామ్ ప్రసాద్ లతో కలిసి పక్కా ప్లాన్ వేసింది. టాస్క్ ఫోర్స్ అధికారి భుజంగ రావు, ఏసీపీ కట్టా సుబ్బయ్య తమకు క్లోజ్ అంటూ బెదిరింపులకు దిగారు.
బాధితుడి ఫిర్యాదుతో కన్నారావుతో సహా ఐదుగురిపై కేసును పోలీసులు నమోదు చేశారు. అప్పటి ఏసీపీ భుజంగ రావు సైతం కన్నారావుకు సహకరించాలని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై ఒత్తిడి తెచ్చారు. లేకపోతే ఎన్‌కౌంటర్ చేస్తానని భుజంగ రావు తనను బెదిరించినట్లు బాధితుడు తెలిపారు. కాగా, గతంలోనూ బిందు మాధురిపై పలు కేసులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment