సినీనటి శ్రీదేవి అంతిమ యాత్ర కొనసాగుతోంది. ఆమె అంతిమ యాత్రకు తారాలోకం తరలి వచ్చింది. తన అభిమాన నటిని కడసారి చూసుకునేందుకు అభిమానులు పెద్ద ఎత్తున అంతిమ యాత్రలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన శ్రీదేవి అంతిమ యాత్ర నేడు కిలోమీటర్ల మేర సాగనుంది