న్యూఢిల్లీ : మనుషులకు మాత్రమే స్పందించే గుణం ఉందనుకుంటాం. కానీ కొన్ని సార్లు జంతువులు కూడా మనుషుల్లానే స్పందిస్తాయి. విచారం, ప్రేమ, బాధ వంటి ఫీలింగ్స్‌ను వ్యక్తం చేస్తాయి. ఇందుకు ఉదాహరణగా నిలిచిందో సంఘటన. మన ఆప్తులు చనిపోతే.. శోకించడం.. సంతాపం తెలపడం సహజం. కానీ జంతువులు కూడా ఇలానే ప్రవర్తిస్తే ఆశ్చర్యం కలగక మానదు. ప్రస్తుతం సోషల్ మీడియలో వైరలవుతోన్న ఈ వీడియోను చూస్తే నమ్మక తప్పదనిపిస్తుంది.
ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరలవుతోన్న ఈ వీడియోలో ఓ ఏనుగు చనిపోయిన పిల్ల ఏనుగును తీసుకొని రోడ్డు మీదకు వచ్చింది. ఆ వెంటనే చిన్నాపెద్దా ఏనుగులు దాని వెనకే వచ్చాయి. అవి అన్ని చనిపోయిన పిల్ల ఏనుగు మృతదేహం చుట్టూ చేరి.. ఓ నిమిషం పాటు సంతాపం తెలిపాయి. ఆ తర్వాత పిల్ల ఏనుగు మృతదేహాన్ని తిరిగి అడవిలోకి తీసుకెళ్లాయి. ఈ తతంగాన్నంతా ప్రవీణ్ కస్వాన్ అనే ఫారెస్ట్ అధికారి వీడియో తీసి ట్విటర్‌లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. మనుషులకే కాదు జంతువులు కూడా శోకాన్ని ప్రకటిస్తాయి.. వాటికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి అంటున్నారు నెటిజన్లు.
This will move you !! Funeral procession of the weeping elephants carrying dead body of the child elephant. The family just don’t want to leave the baby. pic.twitter.com/KO4s4wCpl0
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) June 7, 2019
Comments
Please login to add a commentAdd a comment