
భర్త అంత్యక్రియల్లో రాజేశ్వరి
సాక్షి, పాపన్నపేట(మెదక్): అకాల మరణం చెందిన భర్తకు భార్య తల కొరివి పెట్టి కర్మకాండ నిర్వహించిన విషాధకర సంఘటన చూసి పలువురు కన్నీరు పెట్టారు. పాపన్నపేట మండలం తమ్మాయిపల్లి గ్రామానికి చెందిన వడ్ల సాయి రాములు(38) గురువారం అకాల మరణం చెందగా శుక్రవారం ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. మృతునికి భార్య రాజేశ్వరితో పాటు ముగ్గురు ఆడపిల్లలు, వృద్ధాప్యంలో ఉన్న తల్లి ఉన్నారు.
పదేళ్లలోపు కూతుర్లు ఉండడంతో భార్యనే అన్నీ తానై కుటుంబ సభ్యుల బంధువుల సహకారంతో అగ్గి పెట్టి కర్మకాండ నిర్వహించింది. సాయిరాం తన కులవృత్తి అయిన కార్పెంటర్ పని చేస్తూ మండల విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శిగా సంఘసేవలో కలిసిమెలిసి ఉండేవాడు. సాయిరాం మరణం పట్ల మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు మిన్‌పూర్ ఎంపీటీసీ వడ్ల కుబేరుడు, సంఘ బాధ్యులు శ్రీహరి, లక్ష్మణ్, రమేష్, లింగాచారి, సాయి లింగం, పాపన్నపేట బీజేపీ మండల అధ్యక్షుడు వడ్ల సంతోష్ తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment