papannapeta mandal
-
ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగినా.. మేం.. హరీశ్‌రావు
పాపన్నపేట (మెదక్ జిల్లా): కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ వాళ్లు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రంలో ఎక్కడైనా నీటి తీరువా రద్దు చేశారా అని ప్రశ్నించారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారా..ఎకరానికి రూ.10 వేలు ఏ రాష్ట్రమైనా ఇస్తోందా? అని నిలదీశారు. పేదింటి అమ్మాయి పెళ్లికి రూ.లక్ష, రైతు బీమాకు రూ.5 లక్షలు ఎక్కడైనా ఇస్తున్నారా అని అడిగారు. మన పథకాలే కేంద్రం కాపీ కొడుతోందని పునరుద్ఘాటించారు. మన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం గాజులగూడెం, ఛత్రియాల్లో 48 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను బుధవారం ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. కరోనా వల్ల సొంత జాగాలో ఇళ్లు కట్టుకోలేకపోయామని తెలిపారు. ఆదాయం తగ్గింది.. ఖర్చు పెరిగిందని తెలిపారు. అయినా కూడా కల్యాణలక్ష్మి, రైతుబంధు, పింఛన్లు ఆపలేదని మంత్రి హరీశ్ గుర్తుచేశారు. రైతులంతా ఆలోచన చేయాలని సూచించారు. రుణమాఫీ, సొంత జాగాలో ఇల్లు మాత్రమే ఆగాయని చెప్పారు. ఉగాది తర్వాత ఈ కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం హామీ నెరవేరుస్తాం అని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నీటి తీరువాను రద్దు చేసి ఎకరానికి రూ.పది వేలు ఇస్తోందని తెలిపారు. 2014 తర్వాత నీరు వదలమని హైదరాబాద్‌కు ఒక్క రైతన్నా వెళ్తున్నాడా అని ప్రశ్నించారు. అప్పుడు ఊరికి 2 జీప్లలో రైతులంతా హైదరాబాద్ వెళ్లి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి అని గుర్తుచేశారు. ప్రస్తుతం ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంచుతున్నామని.. నీటికి ఇబ్బంది లేదని తెలిపారు. కాళేశ్వరం నీటిని పాపన్నపేటకు తెస్తున్నట్లు చెప్పారు. సింగూరుకు కాళేశ్వరం నీరు నింపుతాం.. రెండు పంటలు పండించుకుంటామని పేర్కొన్నారు. మూడో పంట వేయాలన్న ఆలోచన వచ్చే రీతిలో పరిస్థితులు మారనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
భర్తకు తలకొరివి పెట్టిన భార్య
సాక్షి, పాపన్నపేట(మెదక్): అకాల మరణం చెందిన భర్తకు భార్య తల కొరివి పెట్టి కర్మకాండ నిర్వహించిన విషాధకర సంఘటన చూసి పలువురు కన్నీరు పెట్టారు. పాపన్నపేట మండలం తమ్మాయిపల్లి గ్రామానికి చెందిన వడ్ల సాయి రాములు(38) గురువారం అకాల మరణం చెందగా శుక్రవారం ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. మృతునికి భార్య రాజేశ్వరితో పాటు ముగ్గురు ఆడపిల్లలు, వృద్ధాప్యంలో ఉన్న తల్లి ఉన్నారు. పదేళ్లలోపు కూతుర్లు ఉండడంతో భార్యనే అన్నీ తానై కుటుంబ సభ్యుల బంధువుల సహకారంతో అగ్గి పెట్టి కర్మకాండ నిర్వహించింది. సాయిరాం తన కులవృత్తి అయిన కార్పెంటర్ పని చేస్తూ మండల విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శిగా సంఘసేవలో కలిసిమెలిసి ఉండేవాడు. సాయిరాం మరణం పట్ల మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు మిన్పూర్ ఎంపీటీసీ వడ్ల కుబేరుడు, సంఘ బాధ్యులు శ్రీహరి, లక్ష్మణ్, రమేష్, లింగాచారి, సాయి లింగం, పాపన్నపేట బీజేపీ మండల అధ్యక్షుడు వడ్ల సంతోష్ తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. -
న్యాయం జరగకుంటే మళ్లీ సంప్రదించండి
మెదక్ మున్సిపాలిటీ: ఫిర్యాదుదారులకు న్యాయం జరగకుంటే మళ్లీ తనను సంప్రదించాలని జిల్లా అదనపు ఎస్పీ నాగరాజు తెలిపారు. సోమవారం మెదక్ ఎస్పీ కార్యాలయంలో ఆయన ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి 6 దరఖాస్తులు వచ్చాయి. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని సీఐలు, ఎస్ఐలను ఆదేశించారు. విడాకులు ఇవ్వాలంటూ వేధిస్తున్నాడని, తనకు న్యాయం చేయాలని పాపన్నపేట మండలం ఎల్లాపూర్ గ్రామానికి చెందిన భూపాలపల్లి స్వప్న ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం కోసం భర్త, భావలు, అత్త, మామ వేధిస్తున్నారని, తనకు న్యాయం చేయాలని మెదక్ మండలం బాలనగర్ తండాకు చెందిన బానోత్‌రాణి ఫిర్యాదు చేవారు. ప్రేమ పెళ్లి చేసుకున్నాం.. తమకు రక్షణ కల్పించాలని మెదక్ మండలం రాజ్‌పల్లి గ్రామానికి చెందిన మధులత, భరత్ ఫిర్యాదు చేశారు. -
అందని బిల్లులు
మధ్యాహ్న భోజన బిల్లుల చెల్లింపులేవి అప్పుల పాలవుతున్న ఏజెన్సీ మహిళలు 3 నెలలుగా బిల్లులు రాక అవస్థలు పాపన్నపేట: మధ్యాహ్న భోజన బిల్లులు పెంచినప్పటికీ వాటి చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండటంతో ఏజెన్సీ మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ మూడు నెలల బిల్లులు రాక వంటలు చేసేందుకు ముప్పు తిప్పలు పడుతున్నారు. పాపన్నపేట మండలంలో 61 పాఠశాలలున్నాయి. ప్రతి రోజు సుమారు 6 వేల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనాలు చేస్తున్నారు. అయితే ఏజెన్సీ మహిళలకు కనీస సౌకర్యాలు లేక ..బిల్లులు సకాలంలో రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సారి వలసలను నివారించాలనే లక్ష్యంతో వేసవి సెలవుల్లో కూడా మధ్యాహ్న భోజనాలు అందజేశారు. వాటికి సంబంధించి ఇటీవలే బిల్లులు వచ్చాయి. అయితే మండలంలో ఇప్పటి వరకు జూన్ నెల నుంచి వంట బిల్లులు రాలేదు. దీంతో కిరాణం సామానుకు కష్టమవుతుందని ఏజెన్సీ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ అవసరాన్ని గ్రహిస్తు గ్రామాల్లోని కిరాణం దుకాణాల యాజమానులు సామానుకు రేట్లు ఎక్కువ వేసి ఉద్దెర ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల దాటగానే బిల్లులు చెల్లించక పోతే వాటికి వడ్డీ కూడా వేస్తున్నారని తెలిపారు. దీంతో తాము చేసిన వంటలకు వచ్చే బిల్లులు గిట్టుబాటు కావడం లేదని వాపోతున్నారు.ముఖ్యంగా తక్కువ విద్యార్థు«లున్న స్కూళ్లలో వంట బిల్లులు సరిపోవడం లేదని చెపుతున్నారు.పొద్దంతా కష్టపడే తమకు జీతాలు మాత్రం రూ.1000 చెల్లించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు రూ.50 కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదంటున్నారు.నెలకు కనీసం రూ.3000 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.అలాగే సుమారు 45 పాఠశాలల్లో వంట గదులు లేక ఆరుబయట వంటలు చేసేందుకు అష్టకష్టాలు పడుతున్నట్లు తెలిపారు.వంట గదులు మంజూరైనట్లు చెపుతున్నా ఇంకా నిర్మాణ పనులు ప్రారంభం కావడం లేదని వాపోతున్నారు. ఈ విషయమై ఎంఇఓ మోహన్‌రాజు మాట్లాడుతు జూన్ నెల నుంచి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు.త్వరలో బిల్లులు చెల్లిస్తామని తెలిపారు.వంట గదులు మంజూరయ్యాయని వాటి నిర్మాణాలు త్వరలో ప్రారంభమవుతాయన్నారు.