
ఫిర్యాదులను స్వీకరిస్తున్న అదనపు ఎస్పీ నాగరాజు
మెదక్ మున్సిపాలిటీ: ఫిర్యాదుదారులకు న్యాయం జరగకుంటే మళ్లీ తనను సంప్రదించాలని జిల్లా అదనపు ఎస్పీ నాగరాజు తెలిపారు. సోమవారం మెదక్ ఎస్పీ కార్యాలయంలో ఆయన ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి 6 దరఖాస్తులు వచ్చాయి. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని సీఐలు, ఎస్‌ఐలను ఆదేశించారు. విడాకులు ఇవ్వాలంటూ వేధిస్తున్నాడని, తనకు న్యాయం చేయాలని పాపన్నపేట మండలం ఎల్లాపూర్ గ్రామానికి చెందిన భూపాలపల్లి స్వప్న ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం కోసం భర్త, భావలు, అత్త, మామ వేధిస్తున్నారని, తనకు న్యాయం చేయాలని మెదక్ మండలం బాలనగర్ తండాకు చెందిన బానోత్‌రాణి ఫిర్యాదు చేవారు. ప్రేమ పెళ్లి చేసుకున్నాం.. తమకు రక్షణ కల్పించాలని మెదక్ మండలం రాజ్‌పల్లి గ్రామానికి చెందిన మధులత, భరత్ ఫిర్యాదు చేశారు.