Prajavani programe
-
నిర్లక్ష్యం చేస్తే ఎండలో నిలబెడతా: వనపర్తి కలెక్టర్
సాక్షి,వనపర్తి: ‘ప్రజావాణిలో సమస్యల పరిష్కారం కోసం వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి.. నిర్లక్ష్యం చేసిన అధికారులను ఎండలో నిలబెట్టేందుకు వెనుకాడబోం..’ అంటూ కలెక్టర్ షేక్‌యాస్మిబాషా మండిపడ్డారు. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ‘ప్రజావాణి’లో అడిషనల్ కలెక్టర్ ఆశిష్‌సంగ్వాన్‌తో కలిసి ఆమె మొత్తం 20అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకే సమస్యపై అర్జీదారులు రెండోసారి రాకుండా పరిష్కరించాలన్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని, ఉదయం 11 గంటలలోగా క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలన్నారు. ఆ తర్వాత అధికారులు తమ కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని, ‘ప్రజావాణి’కి వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. హెచ్‌హెచ్‌పీపై కలెక్టర్ ఆగ్రహం వేరే వారి విద్యుత్ లైన్‌ను తమ పొలంలో వేయటంతో ఇటీవల షార్ట్ సర్క్యూట్ అయిందని కలెక్టర్‌కు గోపాల్పేట మండలం ధర్మాతండాకు చెందిన నార్యానాయక్ ఫిర్యాదు చేశారు. దీంతో ఎనిమిది ఎకరాల్లోని మామిడితోటలో కొన్ని చెట్లు కాలిపోయాయన్నారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదన్నారు. విద్యుత్ అధికారులను ఎప్పుడు అడిగినా.. ‘కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒత్తిడి ఉందంటూ..’ ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితుడు చెప్పారు. కలెక్టరేట్ నుంచి ఎవరు ఒత్తిడి తెచ్చారని గట్టిగా అడిగితే ధరణి ఆపరేటర్ (హ్యాండ్ హోల్డింగ్ పర్సన్) అనడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాను ఎవరికీ ఫోన్ చేయలేదని హెచ్‌హెచ్‌పీ చెప్పుకొచ్చారు. ఇక జిల్లా కేంద్రంలో 8సమస్యలను పరిష్కరించాలని అఖిలపక్షం నాయకులు కోరారు. కొందరు నాయకులు ఉపాధ్యాయ భవన్ స్థలంలో షాపులు నిర్మించి స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నారు. చదవండి: వంట విషయంలో తల్లి, కూతురు గొడవ.. ఖాళీ బీరు సీసా తీసుకుని.. ∙ -
కలెక్టరేట్ ఎదుట యువతి ఆత్మహత్యాయత్నం
సాక్షి, సూపర్‌బజార్(ఖమ్మం): రాజకీయ అండతో తమ స్థలాన్ని కొందరు ఆక్రమించుకునే యత్నం చేస్తున్నారనే ఆవేదనతో కొత్తగూడెంలోని కలెక్టరేట్ ఎదుట సోమవారం ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. దీంతో పక్కనే ఉన్నవారు గుర్తించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. యువతి బండి హైమావతి తల్లి సరళ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొత్తగూడెంలోని రామవరం 7వ నంబర్ బస్తీకి చెందిన సరళ భర్త మృతి చెందగా, ఇద్దరు కుమార్తెలతో కలిసి నివసిస్తోంది. వీరి ఇంటిపక్కనే ఉన్న వంద గజాల స్థలాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకుడు మోత్కూరి ధర్మారావు అండతో అజయ్‌సింగ్ అనే వ్యక్తి ఆక్రమించే యత్నం చేస్తుండగా, రామవరంలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, ఎలాంటి న్యాయం జరగకపోగా మళ్లీ స్థల ఆక్రమణకు యత్నించడంతో సోమవారం కలెక్టర్‌లో ప్రజావాణికి సరళ తన చిన్నకుమార్తె హైమావతితో వచ్చింది. అప్పటికి ప్రజావాణి ప్రారంభం కాకపోగా ఆవేదనతో హైమావతి తన వెంట తెచ్చుకున్న హెయిర్ డై తాగింది. దీంతో అక్కడే ఉన్న ఆరోగ్య కార్యకర్త, మరికొందరు ఆమెను ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. కాగా, కొత్తగూడెం తహసీల్దార్ రామకృష్ణ ఆస్పత్రికి చేరుకుని యువతితో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. చదవండి: ఏడు రోజుల్లో పెళ్లి.. బండరాయితో కొట్టుకొని పెళ్లి కొడుకు ఆత్మహత్య -
అధికారుల గైర్హాజరుపై జేసీ ఆగ్రహం
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ప్రజా ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా తక్షణమే పరిష్కరించాలని, ఆలస్యం చేయవద్దని జేసీ స్వర్ణలత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక రెవెన్యూ సమావేశ మందిరంలో ప్రజల నుంచి ఆమె ఫిర్యాదులు స్వీకరించారు. అయితే, ప్రజావాణికి మున్సిపల్ అధికారులు హాజరు కాకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సోమవారం ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖ అధికారులు కచ్చితంగా హాజరు కావాలని అన్నారు. మున్సిపల్ కమిషనర్‌కు ఫోన్ చేసి ప్రజావాణికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. శాఖ నుంచి ఓ అధికారిని ఖచ్చితంగా హాజరు కావాలని ఆదేశించారు. ఎక్కువ సంఖ్యలో మున్సిపల్ శాఖకు చెందిన ఫిర్యాదులు వస్తాయని ఆ శాఖ అధికారి లేకుంటే ఎలా అన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ ప్రేమ్‌రాజు, ఐసీడీఎస్‌పీడీ శంకరచారీ, ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్యాంసుందర్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు నారాయణపేట: సమస్యలు పరిష్కరించాలని ప్రజలు ఇచ్చిన ప్రతీ ఫిర్యాదును వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ వెంకట్రావ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ కార్యాయలంలో ప్రధానంగా భూసమస్యలు, కొత్తపాసుపుస్తకాలు, రికార్డుల సవరణ, భూ సర్వే, పించన్లు తదితర వాటిపై వినతలను అందజేశారు. సంబంధిత అధికారులకు వినతులను పంపించి సత్వరమే సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని కలెక్టర్ ఫిర్యాదుదారులకు భరోసానిచ్చారు. కార్యక్రమంలో ఆర్డీఓ చీర్ల శ్రీనివాసులు, జడ్పీ సీఈఓ కాళిందిని, ఏఓ బాలాజీ, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎస్పీకి 12 ఫిర్యాదులు ప్రజావాణిలో భాగంగా జిల్లా ఎస్పీ డాక్టర్ చేతనకు 12 ఫిర్యాదులు అందాయి. ఈమేరకు ఎస్పీ వారితో మాట్లాడుతూ చట్టప్రకారం పరిష్కరించాల్సినవి తమ పరిధిలో ఉన్నవాటిని పరిశీలిస్తామని, కోర్టు పరిధిలో ఉంటే ఆవి అక్కడే పరిష్కారమవుతాయని తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత సీఐ, ఎస్ఐలకు పంపించి పరిష్కరిస్తామన్నారు. -
ఆంక్షలు లేవ్, ప్రజావాణికి ఎవరైనా రావొచ్చు
సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ‘ప్రజావాణి’కి ఎవరైనా రావొచ్చని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ మాణిక్ రాజ్ కన్నన్ స్పష్టం చేశారు. ప్రజావాణికి జర్నలిస్టులకు అనుమతి లేదంటూ సమావేశ మందిరం నుంచి బయటికి పంపించిన జాయింట్ కలెక్టర్ రవి తీరును మంగళవారం పాత్రికేయులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కలెక్టర్.. జర్నలిస్టుల ప్రవేశం, కవరేజ్‌పై ఎలాంటి ఆకాంక్షలు లేవని వెల్లడించారు. ప్రజావాణికి అందరూ హాజరు కావచ్చని, సమావేశ మందిరంలో ఉండవచ్చన్నారు. ప్రత్యేకంగా ఆహ్వానం కానీ, రావద్దన్న ఆంక్షలు గానీ లేవన్నారు. సమావేశ మందిరంలో అధికారుల మాదిరిగా మీడియాకు ప్రత్యేకంగా సీట్ల కేటాయింపు లేకున్నా.. ఖాళీగా ఉన్న సీట్లలో అధికారులకు ఇబ్బంది కలుగకుండా జర్నలిస్టులు కూర్చోవచ్చన్నారు. ఎప్పుడూ లేని విధంగా ప్రజావాణి సమావేశ మందిరం నుంచి జర్నలిస్టులను బయటికి పంపించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో, దానికి గల కారణాలపై విచారణ చేస్తానన్నారు. జాయింట్ కలెక్టర్ రవి నుంచి వివరాలు తెలుసుకుంటానని కలెక్టర్ మాణిక్ రాజ్‌తెలిపారు. -
మాకు ఆ సారే కావాలి..
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఆ సారు రాకపోతే మా పిల్లలు బడికి వెళ్లమంటున్నారు.. ఇంటింటికీ వచ్చి మా పిల్లలను బడికి తీసుకువెళ్లి చదువుపై శ్రద్ధ కలిగే విధంగా కృషి చేశారు.. తీరా మాకు ఇష్టం కలిగి బుద్ధిగా పాఠశాలకు వెళ్తుంటే ఆ సారును బదిలీ చేశారు. ఇప్పుడు మా పిల్లలు బడికి వెళ్లాలంటే ఇష్టపడడం లేదు. అందుకే మాకు ఆ సారు కావాలని ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడానికి వచ్చామంటూ పాల్వంచ మున్సిపాలిటీ వెంగళరావు కాలనీవాసులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ‘సాక్షి’తో మాట్లాడారు. వెంగళరావుకాలనీలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ నారాయణ నేతృత్వంలో గ్రామస్తులు ప్రజావాణిలో ఈ మేరకు దరఖాస్తు ఇచ్చిన తరువాత మాట్లాడారు. పాఠశాలకు ఎస్జీటీగా వచ్చిన ఎస్.రాజశేఖర్ పాఠశాలలో విద్యార్థులకు ఇంగ్లిష్ సొంతంగా చెప్పించేవారని, పాఠశాలకు ఎల్ఈడీ టీవీని కూడా తీసుకువచ్చి పాఠాలు బోధించేవారని చెప్పారు. ఎవరైనా బడికి రాకపోతే ఇంటికి వచ్చిమరీ తీసుకువెళ్లేవారని వివరించారు. అలాంటి వారిని బదిలీ చేశారని, ఈ విషయంపై ఇప్పటికే ఎంఈఓకు, డీఈఓకు పలుమారు విన్నవించినా స్పందన కరువైందన్నారు. కార్యక్రమంలో బానోత్ శరత్, బోడా నాగరాజు, సపావత్ సక్రి, భూక్యా శారద, సీతమ్మ, రమణ తదితరులు ఉన్నారు. -
రైతుల ఇబ్బందులు తొలగిస్తాం
సాక్షి, కందుకూరు: భూ సమస్యలన్నీ పరిష్కరించి రైతుల ఇబ్బందులు తొలగించేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ లోకేశ్‌కుమార్ అన్నారు. అందులో భాగంగానే ప్రతి రెవెన్యూ డివిజన్లో వారానికి ఓసారి ప్రజావాణిని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సోమవారం కందు కూరు ఆర్డీఓ కార్యాలయంలో జేసీ హరీష్, ఆర్డీఓ రవీందర్‌రెడ్డితో కలిసి ఆయన ప్రజావాణిని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. తాను ప్రతి నెలా మొదటి సోమవారం చేవెళ్ల, రెండో సోమవారం షాద్‌నగర్, మూడో వారం కందుకూరు, నాలుగో సోమ వారం ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటానని తెలిపారు. తొలి ప్రాధాన్యం భూసమస్యల పరిష్కారానికే ఇచ్చినట్లు చెప్పారు. భూ సమస్యలు పరిష్కారమైన తర్వాత మిగతా శాఖల అధికారుల్ని కూడా ప్రజావాణిలో భాగస్వామ్ముల్ని చేస్తామని వివరించారు. ప్రస్తుతం భూప్రక్షాళనకు సంబం« దించిన పార్ట్ బి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా సర్వే నంబర్ వాస్తవ విస్తీర్ణంతో సరిపోలని సమస్యలు దాదాపు 28 వేలు ఉంటే అందులో దాదాపు 17 వేల సమస్యలు పరిష్కరించినట్లు చెప్పారు. మిగతావి కూడా పరిష్కార దశలో ఉన్నాయన్నారు. 22ఏ లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. కడ్తాల్‌లో 361 మ్యుటేషన్లకు గాను 150 కేవైసీ పెండింగ్ ఉన్నాయన్నారు. మహేశ్వరంలో 2030కి 900, కందుకూరులో 1524కు 430 కేవైసీ, తలకొండపల్లిలో 293కు గాను 260 కేవైసీ పెండింగ్ ఉన్నాయన్నారు. గ్రామాల్లో వారానికి మూడు రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహించి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించేలా చర్యలు చేపట్టినట్లు ఈ సందర్భంగా కలెక్టర్ లోకేశ్‌కుమార్ తెలియజేశారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు, మహేశ్వరం, కడ్తాల్, ఆమన్‌గల్లు, బాలాపూర్, సరూర్‌నగర్, తలకొండపల్లి తహసీల్దార్లు యశ్వంత్, సుజాత, జానకీ, శ్రీనివాస్, చంద్రశేఖర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్పందన కరువు సోమవారం కందుకూరు ఆర్డీఓ కార్యాలయంలో కలెక్టర్ లోకేశ్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావాణికి స్పందన కరువైంది. అధికారులు ముందస్తుగా తగినంత ప్రచారం కల్పించకపోవడంతో రైతులకు సమాచారం లేక సమస్యలను వివరించడానికి రాలేకపోయారు. డివిజన్ పరిధిలోని కందుకూరు, మహేశ్వరం, కడ్తాల్, ఆమనగల్లు, తలకొండపల్లి, సరూర్‌నగర్, బాలాపూర్ మండలాల నుంచి రెవెన్యూ అధికారులు, సిబ్బంది కార్యక్రమానికి హాజరైయ్యారు. కానీ, ఆయా మండలాల్లో కనీసం ప్రచారం చేపట్టలేదు. దీంతో గత నెలలో పెద్దఎత్తున హాజరైన ప్రజలు, ఈసారి అతి తక్కువగా వచ్చారు. కేవలం 11 అర్జీలు మాత్రమే అందినట్లు సమాచారం. -
అర్జీలు సత్వరం పరిష్కారం కావాలి
కాకినాడ రూరల్: ప్రజావాణి–మీకోసం కార్యక్రమంలో స్వీకరించిన ప్రజల దరఖాస్తులు, అర్జీలపై అధికారులు సత్వరమే చర్యలు చేపట్టి పరిష్కరించాలని జేసీ ఎ.మల్లికార్జున ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టు హాలులో సోమవారం నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో ఆయనతోపాటు జేసీ–2 రాధాకృష్ణమూర్తి ప్రజల నుంచి 278 అర్జీలను స్వీకరించారు. వీటిపై తీసుకున్న చర్యలను అర్జీదారులకు తెలియజేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డివిజన్, మండలాల్లో నిర్వహిస్తున్న మీకోసం అర్జీల పరిష్కారంపై సమీక్ష చేసి జేసీ ఈ ఆదేశాలు జారీ చేశారు. మండల స్థాయిలో ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ప్రలోభాలకు లొంగినా, అవకతవకలకు పాల్పడినా చర్యలు తప్పవని హెచ్చరించారు. సీతానగరం మండలం వంగలపూడికి చెందిన చెల్లూరి మంగయ్యమ్మ ఎకరం భూమికి పట్టాదారు పాస్‌పుస్తకం కోసం దరఖాస్తు చేసినా చర్యలు తీసుకోలేదన్న అర్జీపై సీతానగరం తహసీల్దార్‌ను విచారణ చేసి చర్యలు తీసుకోవాలని జేసీ ఆదేశించారు. సామర్లకోట మండలం చింతపల్లి నాగార్జున తన స్థలంలో అంగన్వాడీ కేంద్రం నిర్మించి, వేరే స్థలం ఇస్తానని చెప్పారని, ఇప్పుడు స్థలం ఇవ్వకుండా రూ.2 లక్షలు ఇవ్వాలని ప్రెసిడెంట్, గ్రామస్తులు అడుగుతున్నారని ఇచ్చిన అర్జీపై సామర్లకోట తహసీల్దార్ నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కాకినాడ అర్బన్‌కు చెందిన పెమ్మాడ సత్యవతి మున్సిపాలిటీలో నాలుగేళ్లుగా కాంట్రాక్టు స్వీపరుగా పని చేస్తుంటే చెప్పకుండా విధుల నుంచి తొలగించారని, వేతనం కూడా ఇవ్వలేదని అర్జీ అందజేసింది. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ను విచారణ చేసి ఆమెకు పని కల్పించాలని జేసీ ఆదేశించారు. తాళ్లరేవు మండలం పటవల పంచాయతీ శాంతిమూలకు చెందిన పిట్లా అర్జునరావు అందజేసిన అర్జీలో...పోరంబోకు భూమి ఆక్రమణపై తహసీల్దారుకు అర్జీ పెట్టినా పట్టించుకోలేదని వాపోయారు. తాళ్లరేవు తహసీల్దార్ విచారణ చేసి చర్యలు చేపట్టాలని జేసీ ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంపైనివేదిక ఇవ్వాలి గత వారంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలుపై సమగ్రమైన నివేదిక అందజేయాలని అధికారులను జేసీ ఆదేశించారు. తీసుకున్న చర్యలు, పెండింగ్‌లో ఉంచడానికి కారణాలు తెలియజేయాలన్నారు. మీకోసం పోర్టల్‌లో తీసుకున్న చర్యలు, పరిష్కరించిన వాటి వివరాల నివేదిక అప్లోడ్ చేసి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పీడీ జి.రాజకుమారి, జెడ్పీ సీఈఓ గోవిందరావు, ఎస్డబ్ల్యూ డీడీ శోభారాణి, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
‘నివేదన’కు స్పందించండి
గద్వాల అర్బన్ : గ్రామీణులు దూర ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయప్రాయాలకోర్చి ‘ప్రజావాణి’కి రావద్దనే ఉద్దేశంతోనే నివేదన యాప్ రూపొందిం చా మని జాయింట్ కలెక్టర్ సంగీత తెలి పారు. వీలైనంత వరకు దీని ద్వారా నే ఫిర్యాదులు చేయాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ‘ప్రజావాణి’కి 52 ఫిర్యాదులు అందా యి. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన ప్రజల నుంచి ఆమె అర్జీలు స్వీకరించారు. నివేదన యాప్ ద్వారా లేదా నేరుగా ఫిర్యాదు చేసిన సమస్యలపై అధికారులు నిబద్ధతతో పరిష్కరించాలని ఆదేశించారు. ఇందులో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గ్రీవెన్స్‌కు 13 అర్జీలు గద్వాల క్రైం: ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకు 13 అర్జీలు అందాయి. గద్వాల, మల్దకల్, గట్టు, ధరూరు, వడ్డేపల్లి, ఇటిక్యాల, అయిజ మండలాల ప్రజలు ఎస్పీ విజయ్‌కుమార్‌ను కలసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని సమస్యలను వీలైనంత త్వరలో పరిష్కరిస్తామన్నారు. రేషన్ సరుకులు ఇవ్వడం లేదు కట్టెల మిషన్‌లో పనిచేసేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు చేతివేళ్ల సరిగా పని చేయడం లేదు. దీంతో వేలిముద్రలు పడటం లేదని మూడు నెలలుగా రేషన్ షాపులో సరుకులు ఇవ్వడం లేదు. ఎలాగైనా అందేలా చూడాలి. – పద్మ, వెంకటస్వామి దంపతులు, వడ్డెవీధి, గద్వాల ‘కల్యాణలక్ష్మి’ వర్తింపజేయాలి నా కూతురు కళావతికి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకుంటే వివిధ కారణాలతో మండల అధికారులు ఇంతవరకు ఆమోదించడం లేదు. ఇప్పటికైనా ఈ పథకం డబ్బులు వచ్చేలా చూడాలి. – మునెమ్మ, చెనుగోనిపల్లి, గద్వాల మండలం -
సైకిల్ దొరికింది.. స్వాతి మురిసింది!
పాన్‌గల్ మండలం మల్లాయపల్లికి చెందిన 11ఏళ్ల స్వాతి పుట్టుకతోనే దివ్యాంగురాలు. అమ్మానాన్నలు నిరుపేద కూలీలు.. తల్లి తోడు లేనిదే బయటికి రాలేదు. ఎక్కడికి వెళ్లాలన్నా అమ్మ చంకనెక్కాల్సిందే..! బిడ్డకు ట్రైసైకిల్ మంజూరు చేయాలని ఆమె తల్లి సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో డీఆర్వో చంద్రయ్యకు విన్నవించింది. ఆయన ఆదేశాల మేరకు డీడబ్ల్యూఓ వరప్రసాద్ ఆమెకు అరగంటలోనే ట్రై సైకిల్‌ను సమకూర్చారు. జేసీ నిరంజన్, డీఆర్వో చంద్రయ్య తదితరులు అందజేశారు. ఈ సందర్భంగా స్వాతికి మోములో చిరునవ్వు వెల్లివిరిసింది. – ఎం.యాదిరెడ్డి, సాక్షి ఫొటోగ్రాఫర్, వనపర్తి -
న్యాయం జరగకుంటే మళ్లీ సంప్రదించండి
మెదక్ మున్సిపాలిటీ: ఫిర్యాదుదారులకు న్యాయం జరగకుంటే మళ్లీ తనను సంప్రదించాలని జిల్లా అదనపు ఎస్పీ నాగరాజు తెలిపారు. సోమవారం మెదక్ ఎస్పీ కార్యాలయంలో ఆయన ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి 6 దరఖాస్తులు వచ్చాయి. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని సీఐలు, ఎస్ఐలను ఆదేశించారు. విడాకులు ఇవ్వాలంటూ వేధిస్తున్నాడని, తనకు న్యాయం చేయాలని పాపన్నపేట మండలం ఎల్లాపూర్ గ్రామానికి చెందిన భూపాలపల్లి స్వప్న ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం కోసం భర్త, భావలు, అత్త, మామ వేధిస్తున్నారని, తనకు న్యాయం చేయాలని మెదక్ మండలం బాలనగర్ తండాకు చెందిన బానోత్‌రాణి ఫిర్యాదు చేవారు. ప్రేమ పెళ్లి చేసుకున్నాం.. తమకు రక్షణ కల్పించాలని మెదక్ మండలం రాజ్‌పల్లి గ్రామానికి చెందిన మధులత, భరత్ ఫిర్యాదు చేశారు. -
సమస్యలు పరిష్కరించరూ...!
భువనగిరి టౌన్ : స్థానిక కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి విశేష స్పందన లభించింది. జిల్లాలోని వివిధ మండలాల నుంచి ప్రజలు వచ్చి సమస్యలు పరిష్కరించాలని కోరారు. రేషన్‌కార్డు, పెన్షన్ ఇప్పించాలని వేడుకున్నారు. మరికొందరు వ్యక్తిగత సమస్యలపై జాయిం ట్ కలెక్టర్ జి.రవినాయక్, జిల్లా రెవెన్యూ అధికారి రావుల మహేందర్‌రెడ్డికి వినతులు సమర్పించారు. చౌటుప్పుల్ మండలం కేసారం గ్రామానికి చెందిన జె.నరేష్ ఎస్సీ కార్పొరేషన్ రుణం కోసం తనను ఎంపిక చేశారని, ఇప్పటి వరకు లోను మంజూరు చెయ్యలేదని వినతి పత్రం అందజేశారు. చౌటుప్పుల్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మర్చాలని, అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికలు ప్రత్యక్షంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ చౌటుప్పుల్ మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో విన్నవించారు. బీసీ కార్పొరేషన్ ద్వారా రుణం ఇప్పించాలని కోరుతూ రాజాపేట మండలం బేగంపేట గ్రామానికి చెందిన జెల్ల స్వరూప వినతి పత్రం అందజేశారు. బస్వాపురం ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న బీఎన్ తిమ్మాపురంలో ఇంటి పన్నులు వసూలు చేయకుండా మినహాయింపు ఇవ్వాలని కోరుతూ బీఎన్ తిమ్మాపురం గ్రామ మాజీ సర్పంచ్ రావుల అనురాధనందు విన్నవించారు. విలీన ప్రతిపాదన విరమించుకోవాలి భువనగిరి మున్సిపాలిటీ విలీనం కోసం ప్రతిపాదించిన గ్రామాల నుంచి గూడూరును మినహాయించాలి. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అనే నానుడి మరిచి పట్టణాలను సుందరీకరించుకునేందుకు విలీనం చేయడం సబుకాదు. మున్సిపాలిటీలో మా గ్రామం కలపడం ద్వారా ఉపాధి హామీ పథకం కోల్పోతాము. దీంతో గ్రామంలో ఉన్న బడుగు, బలహీన వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుంది. తక్షణమే మున్సిపాలిటీలో విలీన ప్రతిపాదన విరమించుకోవాలి. – గూడూరు గ్రామప్రజలు అన్ని మగ్గాలకు జియో ట్యాగింగ్ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్ నంబర్లు ఇస్తుంది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా నిజమైన చేనేత కార్మికులు ఇంత వరకు జియో ట్యాగింగ్ నంబర్ కేటాయించలేదు. కొంత మంది మగ్గం పని చెయ్యని వారికి జియో ట్యాగింగ్ నంబర్ కేటాయించారు. జియో ట్యాగింగ్ లేకపోవడంతో కార్మికులు త్రిఫ్ట్ ఫండ్, నూలు యారన్ సబ్సిడీ, ముద్ర రుణాలు పొందలేక పోతున్నారు. తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలి. – తెలంగాణ చేనేత కార్మిక సంఘం నాయకులు మోదుగుకుంటలో ఎలకబావిని చేర్చొద్దు ఆత్మకూర్(ఎం) మండలంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న మోదుగుకుంట గ్రామ పంచాయతీలో ఎలకబావిని చేర్చొద్దు. మొరిపిరాల గ్రామ పంచాయతీ పరిధిలో యాధావిధిగా ఉంచాలి. ఈ గ్రామమే దగ్గరగా ఉంటుంది. రవాణా సౌకర్యానికి అనువుగా ఉంది. తక్షణమే అధికారులు స్పదించి యాధావిధిగా మొరిపిరాల గ్రామ పంచాయతీలో ఎలకబావిని ఉంచాలి. – ఎలకబావి గ్రామ ప్రజలు -
అర్జీలు వెంటనే పరిష్కరించాలి
నిర్మల్అర్బన్ : ప్రజావాణికి వచ్చే అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్ ప్రశాంతి గ్రీవెన్స్‌సెల్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతీ సోమవా రం నిర్వహించే ప్రజావాణికి వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు సత్వరమే పరిష్కరించి ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. దరఖాస్తులను కేటగిరీల వారీగా తీసుకుని ‘ఎ’ కేటగిరి కింద వచ్చిన దరఖాస్తులకు వారంరోజుల్లో సమాధానం ఇవ్వాలన్నారు. ఆసరా పింఛ న్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులు కార్యాలయానికి అందగా నే, వాటి నివేదికను వారం రోజుల్లోగా అందజేయాలన్నారు. ఈ సందర్భంగా ఆయా శాఖల్లో పెండింగ్‌లో ఉన్న ప్రజాఫిర్యాదులను సమీ క్షించారు. వెంటనే వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. దాదాపు 30 వినతులు రాగా, అందులో అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల నియామకాల్లో అన్యాయం జరిగిందంటూ అందిన అర్జీలే ఎక్కువగా ఉండడం గమనార్హం. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా ఏరి యాస్పత్రి సూపరింటెండెంట్ సురేశ్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి బాల సురేందర్, లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ దేబ్ జాని ప్రమానిక, ఆర్డీవో ప్రసూనాంబా, డీఎంహెచ్‌వో జలపతినాయక్ తదితరులున్నారు. గుడిసెలు ఖాళీ చేయమంటుండ్రు 1309 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిలో 20 ఏళ్లుగా నివాసముంటున్నాం. రెండేళ్లుగా కొందరు గుడిసెలు ఖాళీ చేయమంటుండ్రు. ప్రభుత్వ భూమిని తమ భూమిగా చెబుతుండ్రు. మా నిరుపేదల గుడిసెలు ఖాళీ చేయించకుండా చూడాలి. – నిర్మల్‌లోని శాంతినగర్‌వాసులు -
‘ప్రజావాణి’కి దరఖాస్తుల వెల్లువ
బెల్లంపల్లి : పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి దరఖాస్తులు వెల్లువెత్తాయి. అసెంబ్లీ నియోజకవర్గంలోని మారు మూల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సబ్ కలెక్టర్ రాహుల్‌రాజ్‌కు అర్జీలు అందజేశారు. అర్జీలను స్వీకరించిన సబ్ కలెక్టర్ సంబంధిత శాఖలకు బదలాయింపు చేశారు. మొత్తం 40 వరకూ అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. -
చదువుకోవాలనుంది... సార్ !
మెదక్ : కన్నతల్లి చనిపోయింది. తండ్రి ఉన్నా పట్టించుకోవడం లేదు.. ఉన్నత చదువులు చదవాలనుంది. ఆదుకోండమ్మా! అంటూ కలెక్టర్ భారతి హొళికేరిని ప్రజావాణిలో పన్నెండేళ్ల ఓ చిన్నారి వేడుకుంది. రైల్వేలైన్ ఏర్పాటులో తమ వ్యవసాయ భూములు కోల్పోయామని, న్యాయం చేయండంటూ అవుసులపల్లికి చెందిన పలువురు రైతులు మొర పెట్టుకున్నారు. ఒకచేయి లేకపోవడంతో ఏ పనీ చేయలేక బతుకు భారమవుతోందని, పింఛన్ ఇప్పించాలని కంచన్‌పల్లికి చెందిన లలిత అనే మహిళ వేడుకుంది. సోమవారం మెదక్ కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలపై వినతులు సమర్పించారు. ఈ సందర్భంగా సుమారు 138 దరఖాస్తులు వచ్చాయి. కన్నతల్లి లేదు...తండ్రి ఉన్నా పట్టించుకుంట లేడు: కన్నతల్లి చనిపోయింది.. తండ్రి ఉన్నా పట్టించుకుంటలేడు.. ఉన్నత చదువులు చదవాలని ఉంది. అవకాశం కల్పించి ఆదుకోండమ్మా! అంటూ హవేళిఘనాపూర్ మండలం బ్యాతోల్ తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన నిరీక్షణ అనే పన్నెండేళ్ల బాలిక వేడుకుంది. బ్యాతోల్ తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన నాగమణి, శ్రీనివాస్ దంపతుల కూతురు నిరీక్షణ మెదక్ పట్టణంలోని వెస్లి పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. తల్లి నాగమణి చనిపోవడంతో తండ్రి శ్రీనివాస్ తనను పట్టించుకోవడం లేదని వాపోయింది. నాకు బాగా చదవాలనుంది.. అవకాశం కల్పించి ఆదుకోవాలని కలెక్టర్ భారతి హోళికేరిని వేడుకుంది. స్పందించిన కలెక్టర్ బాలికను కేజీబీవీలో చేర్పించి భవిష్యత్ కల్పించాలని అధికారులను ఆదేశించారు. తల్లిదండ్రులు లేని పిల్లలు.. ఆదుకోండమ్మా! తల్లిదండ్రులు చనిపోయి అనాథలుగా మారిన ముగ్గురు పిల్లలను పోషించడం భారంగా తయారైందని, వారిని ఆదుకోవాలని మెదక్ మండలం మక్తభూపతిపూర్ గ్రామానికి చెందిన లచ్చమ్మ అనే వృద్ధురాలు కలెక్టర్‌ను వేడుకుంది. నా కొడుకు, కోడలు ఆర్నేళ్ల క్రితం చనిపోయారు. దీంతో వారి సంతానమైన ముగ్గురు పిల్లలు కృష్ణ, జ్యోతి, చింటుల పోషణ నాపై పడిందని వాపోయింది. ఉన్న ఒక్క కొడుకు, కోడలు చనిపోగా, కాటికి కాలు చాపిన వయస్సులో ఉన్న నా కాలు విరిగి నడవలేని స్థితిలో బతుకే భారంగా మారి దుర్భరమైన బతుకు బతుకుతున్నామని వాపోయింది. ఈ వయస్సులో వారిని పోషించలేక పడరాని పాట్లు పడుతున్నానని, వారికి దారిచూపి ఆదుకోవాలని వేడుకుంది. స్పందించిన కలెక్టర్ చిన్నారులను హాస్టళ్లలో చేర్పించి భవిష్యత్ కోసం చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైల్వేలైన్‌లో భూములు కోల్పోయాం..న్యాయం చేయండి రైల్వేలైన్ ఏర్పాటులో మా వ్యవసాయ భూములు కోల్పోయాం. పరిహారం చెల్లించి ఆదుకోవాలని మెదక్ మండలం అవుసులపల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు ప్రజావాణిలో కలెక్టర్‌కు మొర పెట్టుకున్నారు. అక్కన్నపేట–మెదక్ రైల్వేలైన్ ఏర్పాటుకు కావాల్సిన భూమిని తాము ఇచ్చినదానికంటే ఎక్కువ భూమిని కోల్పోవాల్సి వచ్చిందన్నారు. అధికారులు ఎలాంటి సర్వే చేయకుండానే రైల్వేలైన్ పనులు చేస్తున్నారని ఆరోపించారు. దీంతో తాము బతుకుదెరువు కోల్పోవాల్సి వస్తోందని, అదనంగా కోల్పోయిన భూమికి సంబంధించి పరిహారం అందించి ఆదుకోవాలని అవుసులపల్లి గ్రామానికి చెందిన నరేష్, యాదయ్య, మల్లయ్య, లక్ష్మి, సత్యనారాయణ, సత్తయ్య, లక్ష్మి, గొండయ్య తదితరులు వేడుకున్నారు. వంట చేస్తూ చేయి కోల్పోయా... పింఛన్ ఇప్పించి ఆదుకోండి ఇంట్లో వంట చేస్తుండగా పిట్స్ రావడంతో చేయి పొయ్యిలో పడి కాలిపోయిందని, దీంతో ఒంటి చేతి బతుకు భారంగా మారిందని, పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని కౌడిపల్లి మండలం కంచన్‌పల్లి గ్రామానికి చెందిన లలిత కలెక్టర్‌ను కోరింది. సదరన్ క్యాంపులో దరఖాస్తు చేసుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, సర్టిఫికెట్ ఇవ్వడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లింది. ఈ విషయంపై స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారిని పిలిచి మందలించి సదరన్ క్యాంపులో దరఖాస్తు చేసుకున్న వారికి వెంట వెంటనే అర్హత సర్టిఫికెట్ అందజేయాలని, ప్రజలను ఇబ్బందులు పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే బాధితురాలైన లలితకు సర్టిఫికెట్ ఇప్పించి న్యాయం చేయాలని ఆదేశించారు. సర్దన స్కీంను ప్రారంభించి తాగునీటి సమస్య తీర్చండి ఆర్డబ్ల్యూఎస్ సర్దన స్కీంను ప్రారంభించి 38 గ్రామాలకు మంచినీటి సౌకర్యం కల్పించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా నాయకుడు మల్లేశం కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. హవేళిఘణాపూర్ మండలంలోని 38 గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. సర్దన పథకం ప్రారంభించి ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య తీర్చాలని కోరారు. 2016లో పథకం మోటార్ చెడిపోయిందన్న సాకుతో పథకాన్ని నిలిపివేశారన్నారు. దీంతో పథకంలో పనిచేస్తున్న 17మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. గ్రామాల్లో నీటి సమస్య అధికమైందని వాపోయారు. ► పుట్టుకతో మూగ, మానసిక వికలాంగురాలైన తమ కూతురు రేణుకకు పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని మెదక్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన హేమలత, శ్రీనివాస్‌లు ప్రజావాణిలో మొర పెట్టుకున్నారు. ► ప్రమాదంలో కాలు విరిగి బతుకు భారంగా మారింది.. ఉపాధి కల్పించి ఆదుకోవాలని పాపన్నపేట మండలం గాంధారిపల్లికి చెందిన బేగరి రాజు ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. 2015సెప్టెంబర్‌లో ఆటో బోల్తాపడగా కాలు విరిగిందని, దీంతో తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్నట్లు తెలిపారు. ఏదైనా ఉపాధి కల్పించి ఆదుకోవాలని కోరారు. ► డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరుతూ హవేళిఘణాపూర్ మండలం ఔరంగాబాద్ తండాకు చెందిన పలువురు గిరిజనులు ప్రజావాణిలో మొర పెట్టుకున్నారు. అలాగే మెదక్ మండలం ఖాజిపల్లికి చెందిన లస్మవ్వ అనే వృద్ధురాలు డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పించి ఆదుకోవాలని దరఖాస్తు చేసుకుంది. జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో బ్రోకరిజాన్ని అరికట్టండి జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో బ్రోకరిజాన్ని అరికట్టాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి బందెల సాయిలు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యాలయంలో అధికారులు సామాన్య ప్రజలకంటే బ్రోకర్ల ద్వారా వచ్చే వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
చదువుకోవాలనుంది... సార్ !
మెదక్ : కన్నతల్లి చనిపోయింది. తండ్రి ఉన్నా పట్టించుకోవడం లేదు.. ఉన్నత చదువులు చదవాలనుంది. ఆదుకోండమ్మా! అంటూ కలెక్టర్ భారతి హొళికేరిని ప్రజావాణిలో పన్నెండేళ్ల ఓ చిన్నారి వేడుకుంది. రైల్వేలైన్ ఏర్పాటులో తమ వ్యవసాయ భూములు కోల్పోయామని, న్యాయం చేయండంటూ అవుసులపల్లికి చెందిన పలువురు రైతులు మొర పెట్టుకున్నారు. ఒకచేయి లేకపోవడంతో ఏ పనీ చేయలేక బతుకు భారమవుతోందని, పింఛన్ ఇప్పించాలని కంచన్‌పల్లికి చెందిన లలిత అనే మహిళ వేడుకుంది. సోమవారం మెదక్ కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలపై వినతులు సమర్పించారు. ఈ సందర్భంగా సుమారు 138 దరఖాస్తులు వచ్చాయి. కన్నతల్లి లేదు...తండ్రి ఉన్నా పట్టించుకుంట లేడు: కన్నతల్లి చనిపోయింది.. తండ్రి ఉన్నా పట్టించుకుంటలేడు.. ఉన్నత చదువులు చదవాలని ఉంది. అవకాశం కల్పించి ఆదుకోండమ్మా! అంటూ హవేళిఘనాపూర్ మండలం బ్యాతోల్ తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన నిరీక్షణ అనే పన్నెండేళ్ల బాలిక వేడుకుంది. బ్యాతోల్ తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన నాగమణి, శ్రీనివాస్ దంపతుల కూతురు నిరీక్షణ మెదక్ పట్టణంలోని వెస్లి పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. తల్లి నాగమణి చనిపోవడంతో తండ్రి శ్రీనివాస్ తనను పట్టించుకోవడం లేదని వాపోయింది. నాకు బాగా చదవాలనుంది.. అవకాశం కల్పించి ఆదుకోవాలని కలెక్టర్ భారతి హోళికేరిని వేడుకుంది. స్పందించిన కలెక్టర్ బాలికను కేజీబీవీలో చేర్పించి భవిష్యత్ కల్పించాలని అధికారులను ఆదేశించారు. తల్లిదండ్రులు లేని పిల్లలు.. ఆదుకోండమ్మా! తల్లిదండ్రులు చనిపోయి అనాథలుగా మారిన ముగ్గురు పిల్లలను పోషించడం భారంగా తయారైందని, వారిని ఆదుకోవాలని మెదక్ మండలం మక్తభూపతిపూర్ గ్రామానికి చెందిన లచ్చమ్మ అనే వృద్ధురాలు కలెక్టర్‌ను వేడుకుంది. నా కొడుకు, కోడలు ఆర్నేళ్ల క్రితం చనిపోయారు. దీంతో వారి సంతానమైన ముగ్గురు పిల్లలు కృష్ణ, జ్యోతి, చింటుల పోషణ నాపై పడిందని వాపోయింది. ఉన్న ఒక్క కొడుకు, కోడలు చనిపోగా, కాటికి కాలు చాపిన వయస్సులో ఉన్న నా కాలు విరిగి నడవలేని స్థితిలో బతుకే భారంగా మారి దుర్భరమైన బతుకు బతుకుతున్నామని వాపోయింది. ఈ వయస్సులో వారిని పోషించలేక పడరాని పాట్లు పడుతున్నానని, వారికి దారిచూపి ఆదుకోవాలని వేడుకుంది. స్పందించిన కలెక్టర్ చిన్నారులను హాస్టళ్లలో చేర్పించి భవిష్యత్ కోసం చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైల్వేలైన్‌లో భూములు కోల్పోయాం..న్యాయం చేయండి రైల్వేలైన్ ఏర్పాటులో మా వ్యవసాయ భూములు కోల్పోయాం. పరిహారం చెల్లించి ఆదుకోవాలని మెదక్ మండలం అవుసులపల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు ప్రజావాణిలో కలెక్టర్‌కు మొర పెట్టుకున్నారు. అక్కన్నపేట–మెదక్ రైల్వేలైన్ ఏర్పాటుకు కావాల్సిన భూమిని తాము ఇచ్చినదానికంటే ఎక్కువ భూమిని కోల్పోవాల్సి వచ్చిందన్నారు. అధికారులు ఎలాంటి సర్వే చేయకుండానే రైల్వేలైన్ పనులు చేస్తున్నారని ఆరోపించారు. దీంతో తాము బతుకుదెరువు కోల్పోవాల్సి వస్తోందని, అదనంగా కోల్పోయిన భూమికి సంబంధించి పరిహారం అందించి ఆదుకోవాలని అవుసులపల్లి గ్రామానికి చెందిన నరేష్, యాదయ్య, మల్లయ్య, లక్ష్మి, సత్యనారాయణ, సత్తయ్య, లక్ష్మి, గొండయ్య తదితరులు వేడుకున్నారు. వంట చేస్తూ చేయి కోల్పోయా... పింఛన్ ఇప్పించి ఆదుకోండి ఇంట్లో వంట చేస్తుండగా పిట్స్ రావడంతో చేయి పొయ్యిలో పడి కాలిపోయిందని, దీంతో ఒంటి చేతి బతుకు భారంగా మారిందని, పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని కౌడిపల్లి మండలం కంచన్‌పల్లి గ్రామానికి చెందిన లలిత కలెక్టర్‌ను కోరింది. సదరన్ క్యాంపులో దరఖాస్తు చేసుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, సర్టిఫికెట్ ఇవ్వడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లింది. ఈ విషయంపై స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారిని పిలిచి మందలించి సదరన్ క్యాంపులో దరఖాస్తు చేసుకున్న వారికి వెంట వెంటనే అర్హత సర్టిఫికెట్ అందజేయాలని, ప్రజలను ఇబ్బందులు పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే బాధితురాలైన లలితకు సర్టిఫికెట్ ఇప్పించి న్యాయం చేయాలని ఆదేశించారు. సర్దన స్కీంను ప్రారంభించి తాగునీటి సమస్య తీర్చండి ఆర్డబ్ల్యూఎస్ సర్దన స్కీంను ప్రారంభించి 38 గ్రామాలకు మంచినీటి సౌకర్యం కల్పించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా నాయకుడు మల్లేశం కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. హవేళిఘణాపూర్ మండలంలోని 38 గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. సర్దన పథకం ప్రారంభించి ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య తీర్చాలని కోరారు. 2016లో పథకం మోటార్ చెడిపోయిందన్న సాకుతో పథకాన్ని నిలిపివేశారన్నారు. దీంతో పథకంలో పనిచేస్తున్న 17మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. గ్రామాల్లో నీటి సమస్య అధికమైందని వాపోయారు. -పుట్టుకతో మూగ, మానసిక వికలాంగురాలైన తమ కూతురు రేణుకకు పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని మెదక్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన హేమలత, శ్రీనివాస్‌లు ప్రజావాణిలో మొర పెట్టుకున్నారు. - ప్రమాదంలో కాలు విరిగి బతుకు భారంగా మారింది.. ఉపాధి కల్పించి ఆదుకోవాలని పాపన్నపేట మండలం గాంధారిపల్లికి చెందిన బేగరి రాజు ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. 2015సెప్టెంబర్‌లో ఆటో బోల్తాపడగా కాలు విరిగిందని, దీంతో తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్నట్లు తెలిపారు. ఏదైనా ఉపాధి కల్పించి ఆదుకోవాలని కోరారు. - డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరుతూ హవేళిఘణాపూర్ మండలం ఔరంగాబాద్ తండాకు చెందిన పలువురు గిరిజనులు ప్రజావాణిలో మొర పెట్టుకున్నారు. అలాగే మెదక్ మండలం ఖాజిపల్లికి చెందిన లస్మవ్వ అనే వృద్ధురాలు డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పించి ఆదుకోవాలని దరఖాస్తు చేసుకుంది. జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో బ్రోకరిజాన్ని అరికట్టండి జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో బ్రోకరిజాన్ని అరికట్టాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి బందెల సాయిలు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యాలయంలో అధికారులు సామాన్య ప్రజలకంటే బ్రోకర్ల ద్వారా వచ్చే వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.