
ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న జేసీ సంగీత
గద్వాల అర్బన్ : గ్రామీణులు దూర ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయప్రాయాలకోర్చి ‘ప్రజావాణి’కి రావద్దనే ఉద్దేశంతోనే నివేదన యాప్ రూపొందిం చా మని జాయింట్ కలెక్టర్ సంగీత తెలి పారు. వీలైనంత వరకు దీని ద్వారా నే ఫిర్యాదులు చేయాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజావాణి’కి 52 ఫిర్యాదులు అందా యి. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన ప్రజల నుంచి ఆమె అర్జీలు స్వీకరించారు. నివేదన యాప్ ద్వారా లేదా నేరుగా ఫిర్యాదు చేసిన సమస్యలపై అధికారులు నిబద్ధతతో పరిష్కరించాలని ఆదేశించారు. ఇందులో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
గ్రీవెన్స్‌కు 13 అర్జీలు
గద్వాల క్రైం: ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకు 13 అర్జీలు అందాయి. గద్వాల, మల్దకల్, గట్టు, ధరూరు, వడ్డేపల్లి, ఇటిక్యాల, అయిజ మండలాల ప్రజలు ఎస్పీ విజయ్‌కుమార్‌ను కలసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని సమస్యలను వీలైనంత త్వరలో పరిష్కరిస్తామన్నారు. రేషన్ సరుకులు ఇవ్వడం లేదు కట్టెల మిషన్‌లో పనిచేసేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు చేతివేళ్ల సరిగా పని చేయడం లేదు. దీంతో వేలిముద్రలు పడటం లేదని మూడు నెలలుగా రేషన్ షాపులో సరుకులు ఇవ్వడం లేదు. ఎలాగైనా అందేలా చూడాలి.
– పద్మ, వెంకటస్వామి దంపతులు, వడ్డెవీధి, గద్వాల
‘కల్యాణలక్ష్మి’ వర్తింపజేయాలి
నా కూతురు కళావతికి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకుంటే వివిధ కారణాలతో మండల అధికారులు ఇంతవరకు ఆమోదించడం లేదు. ఇప్పటికైనా ఈ పథకం డబ్బులు వచ్చేలా చూడాలి.
– మునెమ్మ, చెనుగోనిపల్లి, గద్వాల మండలం

బాధితుడి అర్జీని పరిశీలిస్తున్న ఎస్పీ విజయ్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment