ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్:గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, వారిని కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవద్దని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్, జిల్లా రెవెనూ అధికారి శివశ్రీనివాస్‌తో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని, మండల స్థాయిలోని సమస్యలను అక్కడే పరిష్కరించేలా చొరవ చూపాలని అన్నారు. సోమవారం గ్రీవెన్స్‌లో వచ్చిన కొని ఫిర్యాదుల వివరాలిలా ఉన్నాయి.
రఘునాధపాలెం మండలం వీవెంకటాయపాలెంలో 2010 నుంచి ఇప్పటి వరకు 650 ఇందిరమ్మ గృహాలు మంజూరయ్యాయని, వాటిల్లో వివిధ వర్గాల లబ్ధిదారులకు తెలియకుండా కొంత మంది ఒక్కో ఇంటిపై నాలుగు బిల్లులు డ్రా చేశారని, ఈ వ్యవహారంలో హౌసింగ్ అధికారుల పాత్ర కూ డా ఉందని, అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆ గ్రామ సర్పంచ్ హేమలత, ఉపసర్పంచ్ శంకర్‌లు ఫిర్యాదు చేశారు. పాల్వంచలోని బసవతారక కాలనీలో సర్వే నంబర్ 817లో ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.
బూర్గంపాడు మండలంలోని 2011 -12 వరకు విద్యా వలంటీర్లుగా పని చేశామని, ఇప్పటి వరకు వేతనాలు ఇవ్వలేదని షౌకత్ అలీ, సరోజా, భాగ్యలక్ష్మిలు ఫిర్యాదు చేశారు.
తన కుమారుడు బాణోత్ రాములుకు కన్ను లేదని, అతనికి సంవత్సర కాలంగా పింఛన్ ఇవ్వడం లేదని, పింఛన్ ఇప్చించాలని పెనుబల్లి మండలం బ్రహ్మలకుంటకు చెందిన రాములు తండ్రి ఫిర్యాదు చేశారు.
తమ గ్రామానికి చెందిన గోరేపాటి తిరుపతమ్మ గ్రామదీపికగా, ఆశ కార్యకర్తగా కొనసాగుతోందని, ఏడు సంత్సరాల వయసున్న విద్యార్థికి తప్పుడు సర్టిఫికెట్లు తయారు చేసి అభయహస్తం పథకం కింద స్కాలర్‌షిప్ కాజేసిందని తల్లాడ మండలం ముద్దునూరుకు చెందిన నాగేశ్వరరావు ఫిర్యాదు చేశారు. తన మేనల్లుడు రజాలీపాషా వికలాంగుడ(చెవిటి)ని, అతను 2012 డీఎస్పీలో స్కూల్ అసిస్టెంట్‌గా సెలక్టయ్యాడని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యోగం ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష ్యంగా వ్యవహరిస్తున్నారని ఇల్లెందుకు చెందిన గౌస్‌మోహినుద్దీన్ ఫిర్యాదు చేశారు.
ప్రజలను తిప్పించుకోవద్దు
Published Tue, Aug 27 2013 4:02 AM | Last Updated on Thu, Mar 21 2019 8:29 PM
Advertisement
Advertisement