► తక్కువ సంఖ్యలో వినతులు
► అర్జీలు స్వీకరించిన కలెక్టర్
ఆదిలాబాద్‌టౌన్: ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగానికి వినతులు తగ్గాయి. అర్జీదారులతో కిటకిటలాడే కలెక్టరేట్ ఎండ తీవ్రతతో ప్రజలు నామమాత్రంగా కనిపించారు. అర్జీదారుల నుంచి కలెక్టర్ జ్యోతి బుద్ధప్రకా‹శ్, సంయుక్త కలెక్టర్ కృష్ణారెడ్డి వినతులు స్వీకరించారు. వాటిని త్వరగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఈ వారం వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని..
అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు
ఉట్నూర్(ఖానాపూర్): అర్జీల పరిష్కారంలో అలసత్వం వహించొద్దని ఆర్డీవో విద్యాసాగర్ అన్నారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో గిరిజనుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ అర్హులైన వారికి న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. డీటీడీవో కృష్ణనాయక్, ఐటీడీఏ ఏపీవో(జనరల్) నాగోరావ్, ఏవో భీంరావ్ పాల్గొన్నారు.
♦ టాటా మ్యాజిక్ ఆటో కొనుగోలుకు రుణం అందించాలని ఉట్నూర్ మండలం మారుతిగూడకు చెందిన కొడప జంగు అర్జీ సమర్పించాడు.
♦ ఎడ్ల జత మంజూరు చేయాలని ఉట్నూర్ మండలం చెక్‌డ్యాంగూడకు చెందిన సోయం శకుంతల వేడుకుంది.
♦ వ్యవసాయ బావి మంజూరు చేయాలని సిర్పూర్(యు) మండలం మహగావ్‌కు చెందిన గెడం కిషన్‌రావ్ విన్నవించాడు.
♦ కిరాణ దుకాణం ఏర్పాటుకు రుణం అందించాలని నేరడిగొండ మండలం అరెపల్లికి చెందిన మాడవి మారు అర్జీ సమర్పించాడు.
♦ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని సోనాపూర్‌కు చెందిన గిరిజనులు అర్జీ సమర్పించారు.
గ్రీవెన్స్‌పై భానుడి ప్రభావం
Published Tue, May 2 2017 10:19 PM | Last Updated on Thu, Mar 21 2019 7:25 PM
Advertisement