ఖమ్మం జెడ్పీసెంటర్ : భానుడి ప్రభావం గ్రీవెన్స్‌పై కూడా పడింది. ప్రతి సోమవారం కలెక్టర్ సమక్షంలో అధికారులందరితో నిర్వహించే గ్రీవెన్స్ భూ సమస్యలు, ఇళ్లు, సర్టిఫికెట్లు, పింఛన్లు, రేషన్ తదితర సమస్యలపై వందల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చేవి. గత నాలుగు రోజులుగా ఎండతీవ్రత అధికం కావడంతో జిల్లా నలుమూలల నుంచి వచ్చే ఫిర్యాదుదారుల సంఖ్య తగ్గింది. సోమవార జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుదారులు తక్కువ సంఖ్యలో వచ్చారు. ఎండతీవ్రతకు గంట వ్యవధిలోనే తిరుగుముఖం పట్టారు.
హాలులో కూర్చున్న అధికారులు ఎండ అధికంగా ఉండడంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తొలుత కలెక్టర్ ఇలంబరితి అదనపు జేసీ బాబూరావుతో కలిసి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలనుంచి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిస్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్లుఎస్ అధికారులను ఆదే శించారు. కోర్టు కేసులకుసంబందించిన విషయాలపై అధికారులు ప్రత్యేకదృష్టి సారించాలన్నారు. గ్రీవెన్స్‌లో వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని ఇలా ఉన్నాయి.
* గత కొన్నేళ్లుగా పింఛన్ పొందుతున్నానని, 2015 మార్చి నుంచి పింఛ న్ నిలుపుదల చేశారని, తిరిగి పింఛన్ పునరుద్దరించాలని ముదిగొండ మం డలం యడవల్లి గ్రామానికి చెందిన పుష్పమ్మ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది.
* తన కుమార్తె 5 వ తరగతి చ దువుతుందని, తనకు చదివించే ఆర్థికస్థోమతలేదని, సాంఘిక సంక్షేమ హాస్టల్ లో సీటు ఇప్పించాలని పెనుబల్లి మం డలానికి చెందిన బి.కృష్ణ కోరాడు.
* తాను తల్లాడ ఆంధ్రాబ్యాంక్‌లో పంట రుణం పొందగా, రుణమాఫీ జాబితాలో పేరువచ్చిందని, రీ షెడ్యూల్ కోసం వెళ్లగా రుణమాఫీ కాలేదని అధికారులు చెబుతున్నారని, తనకు న్యాయం చేయాలని తల్లాడ మండలం మిట్టపల్లికి చెందిన కాపా నాగరత్నం పేర్కొంది.
* బీసీలకు కల్యాణ లక్ష్మి పథకాన్ని వర్తింపజేయాలని కుల సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు.
గ్రీవెన్స్‌పై సూర్య ప్రతాపం
Published Tue, May 26 2015 4:21 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM
Advertisement
Advertisement