ప్రజల ఆశలు వమ్ము చేయొద్దు
- కలెక్టర్ కేవీ రమణ
కడప సెవెన్‌రోడ్స్: ప్రజలు ఎన్నో ఆశలు నింపుకుని ‘మీ కోసం’ కార్యక్రమంలో అర్జీలు ఇస్తుంటారని, వారి ఆశలు వమ్ము కాకుండా వాటిని పరి ష్కరించాలని కలెక్టర్ కేవీ రమణ అధికారులను ఆదేశించారు. సోమవారం సబా భవనంలో నిర్వహించిన మీకో సం కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి పరిశీ లించారు. పరిష్కార నిమిత్తం ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏవైనా పరిష్కారం కాని సమస్యలుంటే అర్జీదారునికి రాతమూలకం గా తెలుపాలని స్పష్టం చేశారు. అలా కాకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుకోరాదని సూచించారు. జేసీ రామారావు, జేసీ-2 చంద్రశేఖర్‌రెడ్డి, డీఆర్వో సులోచన తదితరులు పాల్గొన్నారు.
‘మీ కోసం’లో వచ్చిన అర్జీల్లో కొన్ని..
- ప్రొద్దుటూరులో ఉన్న రేషన్‌కార్డును చాపాడు మండలానికి మార్చాలని ప్రొద్దుటూరులోని విశ్వనాథపురం గ్రామానికి చెందిన వెంకయ్య కోరారు.
- మైనార్టీ కార్పొరేషన్ ద్వారా బోరు, మామిడిచెట్లు మంజూరు చేయించాలని కమలాపురం మండలం మారుతీనగర్‌వాసి అబ్దుల్‌ఖాదర్ విన్నవించారు.
- హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా పక్కా గృహం మంజూరు చేయించాలని రాజంపేట మండలం తాళ్లపాక గ్రామానికి చెందిన నాగేంద్రరాజు విజ్ఞప్తి చేశా రు.
- తన భూమిలో సర్వే రాళ్లను ఇతరులు తొలగించారని, వారిపై చర్య తీసుకోవడంతోపాటు సర్వే ద్వారా హద్దులు నిర్ణయించాలని జమ్మలమడుగు మండలం సిరిగేపల్లెకు చెందిన శివశంకర్ కోరారు.
- తెలుగుగంగ ప్రాజెక్టు కింద 4 ఎకరాల భూమి కోల్పొయిన తమకు ఎకరన్నర భూమి మాత్రమే ప్రభుత్వం ఇ చ్చిందని, పంటలకు అవసరమైన రు ణం, బోరు మంజూరు చేయాలని మై దుకూరు మండలం ఏకర్లపాలెం గ్రా మానికి చెందిన జయరాములు అర్జీ ఇచ్చారు.
- వికలాంగుల కోటా కింద తనకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణం ఇప్పించాలని ఖాజీపేట మండలం కొత్తనెల్లూరుకు చెందిన లక్ష్మినారాయణ కోరారు.