Intensity of sun
-
వాహన పరిశ్రమ నెమ్మది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎండల తీవ్రత.. మరోవైపు ఎన్నికలు. వెరసి దేశవ్యాప్తంగా మే నెలలో వాహన పరిశ్రమపై ఈ రెండు అంశాలు ప్రభావం చూపాయి. షోరూంలకు వచ్చే కస్టమర్ల సంఖ్య గత నెలలో 18 శాతం తగ్గినట్టు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఏడీఏ) వెల్లడించింది. 2024 ఏప్రిల్‌తో పోలిస్తే అన్ని విభాగాల్లో కలిపి అమ్మకాలు మే నెలలో 5.28 శాతం క్షీణించాయి. 2023 మే నెలతో పోలిస్తే గత నెల విక్రయాల్లో 2.61% వృద్ధి నమోదైంది. మే నెలలో మొత్తం 20,89,603 యూనిట్ల వాహనాలు రోడ్డెక్కాయి. 2024 ఏప్రిల్‌తో పోలిస్తే గత నెలలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు 6.61% తగ్గి 15,34,856 యూనిట్లకు చేరాయి. -
వేడికి ‘కోడి’ విలవిల!
సాక్షి, భీమవరం: మండుతున్న ఎండలు పౌల్ట్రీ పరిశ్రమకు గుబులు పుట్టిస్తున్నాయి. వేడిగాలులకు తాళలేక ఫారాల వద్ద వందల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. గుడ్ల ఉత్పత్తి తగ్గిపోవడం కోళ్ల రైతులను కలవరపరుస్తోంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా కోట్లలో నష్టం వాటిల్లి పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతోందని పౌల్ట్రీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. కోస్తాలోని ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గుడ్లు పెట్టే లేయర్ కోళ్లు నాలుగు కోట్ల వరకు ఉండగా, ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, రాయలసీమలోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కోటి వరకూ ఉన్నాయి. గుడ్లు పెట్టే దశకు చేరువలోని బ్రోయర్, చిక్స్ మూడు కోట్ల వరకు ఉంటాయి. లక్ష కోళ్లు ఉన్న పౌల్ట్రీలో సాధారణంగా రోజుకు 60 నుంచి 80 కోళ్లు వరకు చనిపోతుంటాయి. ప్రస్తుతం ఈ మరణాల సంఖ్య 450 నుంచి 500 వరకు చేరింది. ఆరోగ్యంగా ఉన్న కోళ్లు 40 డిగ్రీల ఉష్ణోగ్రత వరకూ తట్టుకుంటాయి. గత మూడు రోజులుగా 40 డిగ్రీలకు పైబడి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం, వేడిగాలుల ప్రభావంతో ముందెన్నడూ లేనంతగా ఈ ఏడాది కోళ్ల మరణాలు పెరిగాయి. కోస్తా ప్రాంతంలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉందంటున్నారు. ఒక కోడి చనిపోవడం వల్ల రూ.250 వరకు నష్టం వాటిల్లుతుంది.. ఈ మేరకు గత మూడు రోజుల్లో రోజుకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల కోళ్లు చనిపోగా పరిశ్రమకు రూ.30 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అంచనా. పడిపోయిన గుడ్ల ఉత్పత్తి ఎండల తీవ్రత వల్ల గుడ్ల ఉత్పత్తి 15 శాతం మేర తగ్గింది. సాధారణ పరిస్థితుల్లో రాష్ట్రంలో రోజుకు 4.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతుండగా వడగాలుల తీవ్రతకు ఆ ఉత్పత్తి 3.49 కోట్లకు తగ్గిపోయింది. డ్రాపింగ్ కారణంగా రోజుకు 61.5 లక్షల గుడ్లను రైతులు కోల్పోవాల్సి వస్తోంది. ప్రస్తుతం గుడ్డు రైతు ధర రూ.4.85 ఉండగా.. రోజుకు రూ.2.98 కోట్ల చొప్పున మూడు రోజుల్లో రూ.8.95 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పౌల్ట్రీ వర్గాలంటున్నాయి. అధిక ఉష్ణోగ్రతల నుంచి కోళ్లకు ఉపశమన చర్యలతో ఖర్చులు పెరిగిపోయాయి.వడదెబ్బకు గురికాకుండా కోళ్లకు ప్రత్యేక మందులివ్వడం, ఫారాల్లో వాతావరణాన్ని చల్లబర్చేందుకు చుట్టూ గోనె సంచులు కట్టి వాటికి వాటరింగ్ చేయడం, స్ప్రింక్లర్ల ఏర్పాటు తదితర జాగ్రత్తలకు తోడు.. పెరిగిన మేత ధరలు, కూలి రేట్లతో నిర్వహణ భారం మారిందని కోళ్ల రైతులంటున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు గుడ్డు సరఫరా లేక స్థానిక వినియోగం తగ్గి గుడ్డుకు రైతు ధర పతనమవుతోందని చెబుతున్నారు.ప్రభుత్వం ఆదుకోవాలి.. ఎప్పుడూ లేనంతగా ఈసారి ఎండల తీవ్రతకు కోళ్ల మరణాలు ఎక్కువగా ఉన్నాయి. గుడ్ల ఉత్పత్తి తగ్గిపోయింది. ప్రభుత్వం ఆదుకోకుంటే కోళ్ల పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతుంది. ఎఫ్‌సీఐ, సివిల్ సప్లయిస్ గోదాముల్లోని మనుషులు తినడానికి పనికిరాకుండా నిల్వ ఉన్న గోధుమలు, మొక్కజొన్న, నూకలను తక్కువ ధరపై కోళ్ల రైతులకు ప్రభుత్వం అందజేయాలి. – పడాల సుబ్బారెడ్డి, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
Hyderabad: పగటిపూట సిటీ బస్సుల సంఖ్య తగ్గింపు
సాక్షి, హైదరాబాద్: ఎండల తీవ్రత దృష్ట్యా నగరంలో మధ్యాహ్నం సమయంలో బస్సుల సంఖ్యను తగ్గించనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. కొద్ది రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయని, దీంతో ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని పేర్కొన్నారు. ఈ మేరకు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నగరంలో సిటీ బస్సుల ట్రిప్పులను తగ్గించనున్నారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు అన్ని రూట్లో బస్సులు యథావిధిగా రాకపోకలు సాగిస్తాయని అధికారులు పేర్కొన్నారు. -
ఎండల తీవ్రత ముదురుతున్నా.. జూన్ వరకు నీటి సమస్య రాదు
సాక్షి, హైదరాబాద్: ఎండల తీవ్రత ముదురుతున్నా.. వచ్చే జూన్ వరకు రాష్ట్రంలో తాగునీటి సమస్య అధికం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఖమ్మం, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లలో తాగునీటి ఎద్దడి కాస్త అధికంగా ఉన్నట్లు గుర్తించామనీ, అలాగే 67 మున్సిపాలిటీలను సమస్యాత్మకంగా ఉన్నట్లు గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది. తాగునీటి సమస్యపై ప్రతీరోజు ఉన్నతస్థాయిలో సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. తాగునీటి సమస్య పర్యవేక్షణకు ఉమ్మడి పది జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించిన విషయాన్ని గుర్తు చేసింది. ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందన తాగునీటి సమస్య ఉన్నట్లు ఫిర్యాదులు వచ్చినా, వార్తలు వచ్చినా వెంటనే అధికార యంత్రాంగం స్పందిస్తోందని ఆ మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం 143 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు ఉంటే.. అందులో 130 మునిసిపాలిటీల్లో సాధారణ రోజులతో పోలిస్తే పదిశాతం మేరకు నీటి కొరత ఉన్నా.. ప్రజలకు సరిపడే తాగునీటి సరఫరా జరుగుతోందని వివరించింది. సాధారణ రోజుల్లో ఈ పట్టణాల్లో సగటున 1398.05 ఎల్ఎండీ(మిలియన్స్లీటర్స్ పర్ డే) తాటి సరఫరా జరిగితే ప్రస్తుతం 1371 ఎల్‌ఎండీల నీటి సరఫరా జరుగుతోందని, 26.31 ఎల్‌ఎండీల కొరత ఏర్పడిందని స్పష్టం చేసింది. పది మునిసిపాలిటీలతోపాటు, రెండు కార్పొరేషన్లలో అధికంగా నీటి ఎద్దడి ఉన్నట్లు గుర్తించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఖమ్మం, కరీంనగర్లో ప్రత్యామ్నాయ చర్యలు ఖమ్మం, కరీంనగర్లో ఎండలు ముదిరే కొద్ది నీటి ఎద్దడి పెరుగుతుందన్న అంచనాతో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. 27 పట్టణాల్లో 135 ఎల్ పీసీడీ(లీటర్స్ పర్ పర్సన్ పర్డే) కంటే ఎక్కువ నీటి సరఫరా జరుగుతుంటే, 48 పట్టణాల్లో 100 నుంచి 135 ఎల్పీసీడీల మధ్య, 67 మునిసిపాలిటీల్లో 100 ఎల్పీసీడీ కంటే తక్కువ సరఫరా జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 23,839 ఆవాసాలకు మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా జరుగుతుందని, గ్రామాల్లో నీటి ఎద్దడి లేదని భగీరథ అధికారవర్గాలు చెబుతున్నాయి. గ్రామాల్లో వంద ఎల్పీసీడీ నీటి సరఫరా జరుగుతోంది. అందుబాటులో గ్రిడ్, స్టాండ్ బై పంపులు మంచినీటి సమస్య ఎక్కడైనా తలెత్తితే గ్రిడ్ పంప్‌లతోపాటు, స్టాండ్‌బై పంపులు అందుబాటులో ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లా స్థాయిలో అత్యవసరంగా చేపట్టాల్సిన పనులకు జిల్లా కలెక్టర్లకు మొత్తం రూ. 100 కోట్లు నిధులు విడుదల చేసినట్లు తెలిపింది. నాగార్జునసాగర్ నుంచి పాలేరు, ఉదయ సముద్రం రిజర్వాయర్ల నుంచి నల్గొండ, ఖమ్మం పట్టణాలకు నీటిని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేట్టింది. మిడ్ మానేర్, లోయర్ మానేరు నుంచి కరీంనగర్ నగరానికి నీటిని అందించే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. అవసరమైతే కర్ణాటక లోని నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి కొంత నీటిని విడుదల చేయాలంటూ అక్కడి ప్రభుత్వాన్ని కోరాలని ఇప్పటికే ఇరిగేషన్ విభాగం ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంది. నారాయణపూర్ నుంచి జూరాల రిజర్వాయర్‌కు వచ్చే నీటితో గద్వాల మిషన్ భగీరథకు తాగునీటి సరఫరా చేసుకోవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు 131 పట్టణాల్లో అందుబాటులో ఉన్న 294 ప్రభుత్వ ట్యాంకర్లతో పాటు 97 ట్యాంకర్లను అద్దెకు తీసుకుని, అత్యవసరమైతే ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. నీటి మట్టాలు తగ్గడం వల్లనే ఎద్దడి గడిచిన అక్టోబర్ నుంచి వర్షాలు లేకపోవడం, గోదావరి, కృష్ణా రిజర్వాయర్లలో నీటి మట్టాలు తగ్గడం వల్ల తాగునీటి సమస్య ఉత్పన్నం అయినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
అధిక ఉష్ణోగ్రత.. ఆపై ఉక్కపోత
సాక్షి, హైదరాబాద్: ఎండ తీవ్రత మరింత పెరిగింది. అధిక ఉష్ణోగ్రతలకు తోడు ఉక్కపోత జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత రెండ్రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్త ఎక్కువగానే నమోదవుతుండగా... రానున్న వారం రోజుల పాటు వాతావరణం ఇదే తరహాలో ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శనివారం రాష్ట్రంలో దాదాపు 50కి పైగా ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ప్రణాళికా విభాగం గణాంకాలు చెబుతున్నాయి. రానున్న వారం రోజులూ అధిక ఉష్ణోగ్రతతో పాటు ఉక్కపోత తీవ్రంకానుంది. వాయవ్యదశ నుంచి వడగాల్పులు మరోవైపు రాష్ట్రానికి వాయవ్య దిశ నుంచి వడగాల్పులు కూడా వీస్తుండటంతో పిల్లలు, వృద్ధులు ఎండ సమయంలో బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల నుంచి తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వానలు నమోదయ్యే అవకాశం ఉంది. ఆదివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్ నుంచి 44 డిగ్రీ సెల్సియస్ మధ్యన నమోదయ్యే అవకాశం ఉంది. -
జూన్ మొదటి వారం వరకూ మంటలే!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండల తీవ్రత జూన్ మొదటి వారం వరకూ కొనసాగనుంది. నైరుతి రుతు పవనాలు నెమ్మదిగా కదులుతుండటమే దీనికి కారణమని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రుతుపవనాలు గత మూడు రోజుల నుంచి బంగాళాఖాతంలో నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ సమయానికి బంగాళాఖాతంలో ఎక్కువ ప్రాంతాలకు విస్తరించి అండమాన్ నికోబార్ దీవులను తాకాల్సి ఉంది. కానీ ఇంకా అవి బంగాళాఖాతంలోనే నెమ్మదిగా కదులుతుండడంతో నెలాఖరుకు కేరళను తాకే అవకాశం తక్కువేనంటున్నారు. వాతావరణం అనుకూలించి రెండు, మూడు రోజుల్లో రుతు పవనాలు ముందుకు కదిలితే వచ్చే 3, 4 తేదీల్లో కేరళలో ప్రవేశించి.. ఆ తర్వాత జూన్ రెండో వారానికి రాష్ట్రాన్ని తాకే అవకాశముంటుందని భావిస్తున్నారు. ఎల్‌నినో పరిస్థితుల వల్లే ఈ పరిస్థితి నెలకొన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. దీన్నిబట్టి జూన్ 8వ తేదీ వరకు రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతుందని చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో అక్కడక్కడా కురుస్తున్న వర్షాలకు కారణం అరేబియన్ సముద్రం నుంచి వస్తున్న గాలులేనని వాతావరణ శాఖ చెబుతోంది. 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అన్ని జిల్లాల్లోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో అత్యధికంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు జిల్లా మాచర్ల మండలం విజయపురి సౌత్‌లో 44.7, ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం జువ్విగుంటలో 44.5, పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం, నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరులో 44.4, బాపట్ల జిల్లా బల్లికురువు మండలం కొప్పెరపాడులో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కంచికచర్ల, నందిగామ, పెనుగంచిప్రోలు, గుంటూరు జిల్లా గుంటూరు, దుగ్గిరాల, మంగళగిరి, మేడికొండూరు, పెదకాకాని, తాడేపల్లి, తాడికొండ, తుళ్లూరు, పల్నాడు జిల్లా అమరావతి, అచ్చంపేట, పెదకూరపాడు మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేడ్కర్ చెప్పారు. -
మూడు రోజులు మంటలే..
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. వచ్చే మూడు రోజులూ భానుడు సెగలు కక్కనున్నాడు. నడి వేసవిని తలపించేలా ఎండలు మండుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర భారతదేశం నుంచి తేమగాలులు, బంగాళాఖాతం నుంచి పొడిగాలులు వీస్తున్నాయని, దీనికితోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అధికపీడనం కారణంగా ఎండలు పెరిగే వీలుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందన్నారు. మంగళవారం కర్నూలు, తునిలో 39.5, విశాఖ, కడప, జంగమహేశ్వరపురంలో 38.5 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, రాయలసీమలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇలా ఉండగా,ఈ నెలాఖరులో దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. -
రేపు ఆంధ్రా తీరంలో అల్పపీడనం
మహారాణిపేట (విశాఖ దక్షిణ): బిహార్ నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్ వరకు ద్రోణి కొనసాగుతోంది. దక్షిణ భారతదేశంలో కొనసాగుతున్న తూర్పు, పడమర ద్రోణి క్రమేపీ ఉత్తరం వైపునకు ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 13న ఆంధ్రా తీరం ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ► ద్రోణులు, ఎండల తీవ్రత ప్రభావంతో కోస్తా, రాయలసీమ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో రానున్న 48 గంటల్లో అంటే శనివారం, ఆదివారం రాష్ట్రంలో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ తదితర ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ► రాష్ట్రంలో వేసవిని తలపించే రీతిలో ఎండలు మండుతున్నాయి. వాతావరణ సమతుల్యం లేకపోవడం వల్ల ఎండ వేడిమి, వేడి గాలులు ఎక్కువగా ఉన్నాయి. దీని వల్ల పగటి పూట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. విజయవాడ –36.2, తుని– 36.1, గుంటూరు– 33.8, శ్రీకాకుళం– 33.7, చిత్తూరు, నందిగామ, విజయనగరంలలో 33.6, కావలి, రాజమహేంద్రవరంలలో 30.6, ఏలూరు– 30.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
పెరిగిన పగటిపూట ఉష్ణోగ్రతలు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఎండలు మండుతున్నాయి. పగటి పూట పెరుగుతున్నాయి. మధ్యాహ్న సమయంలో ఉక్కపోత ఎక్కువగా ఉంటోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎండల తీవ్రత మంగళవారం కూడా కొనసాగింది. పగటి పూట ఉష్ణోగ్రతల వల్ల ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మచిలీపట్నంలో 36.4, కడపలో 36.3, రాజమహేంద్రవరం, తునిల్లో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనేక ప్రాంతాల్లో రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగాయి. ► ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. తూర్పు మధ్య అరేబియా సముద్రం ప్రాంతంలో కొనసాగుతున్న అల్పపీడనం, లక్షద్వీప్ ప్రాంతానికి దగ్గరగా కొనసాగుతున్న ద్రోణిలో విలీనం అయ్యింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో అంటే బుధ, గురు వారాల్లో రాయలసీమ, ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రాలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. -
పెరిగిన ఎండల తీవ్రత
మహారాణిపేట (విశాఖ దక్షిణ): రాష్ట్రంలో ఎండల తీవ్రత ఆదివారం కూడా కొనసాగింది. రుతుపవనాలు బలహీనపడడంతో ఎండలు మండుతున్నాయి. అక్కడక్కడా వర్షాలు పడినా పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగాయి. అమరావతిలో 36, విజయవాడలో 35.5, కడపలో 35.9, గుంటూరులో 36, రాజమహేంద్రవరంలో 36.2, ఏలూరులో 34.6, విజయనగరంలో 34, చిత్తూరులో 33.9, విశాఖపట్నంలో 33.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేడు, రేపు పలుచోట్ల వర్షాలు ► ఆగ్నేయ అరేబియా సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న తూర్పు, మధ్య అరేబియా సముద్ర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ► దీనికి అనుబంధంగా 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించింది. ► రానున్న 48 గంటల్లో ఉత్తర దిశ వైపు ప్రయాణిస్తూ అల్పపీడనం బలహీనపడుతుంది. ► దీని ప్రభావంతో సోమవారం, మంగళవారం రాయలసీమ, ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్రల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. -
కొండెక్కిన కోడి
నిజామాబాద్ అర్బన్: కోడి ధర కొండెక్కింది. చికెన్ ధర ఒక్కసారిగా రూ. 270కి చేరింది. వారం వ్యవధిలో రూ.50 పెరగడం గమనార్హం. నిజామాబాద్‌లో గత వారం స్కిన్లెస్ చికెన్ ధర రూ.220. అయితే, ఆదివారం ఒక్కసారిగా రూ.50 పెంచేసి రూ.270కి కిలో చొప్పున విక్రయించారు. ఎండలు మండిపోతున్న తరుణంలో కోళ్ల దిగుమతి తగ్గిపోయిందని, అందుకే ధర పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. వడగాలుల తీవ్రతకు పౌల్ట్రీ ఫామ్‌లలో కోళ్లు చనిపోతున్నాయంటున్నారు. ఎండల తీవ్రత పెరిగే కొద్దీ చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. చికెన్ ధర పెరుగుతుండడంతో మాంస ప్రియులు ఆందోళన చెందుతున్నారు. -
భానుడి ప్రతాపం
నెల్లూరు(సెంట్రల్) : జిల్లాలో భానుడి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. మార్చి నెల రెండో వారం నుంచే మాడు పగులుతోంది. మూడు రోజుల నుంచి వరుసగా 34, 35, 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 9 గంటలు దాటితే ఇంటి నుంచి బయటకు రావడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా పాఠశాలలు, పరీక్ష కేంద్రాలకు వెళ్లే విద్యార్థులు ఎండ వేడిమి తట్టుకోలేక పోతున్నారు. చాలా చోట్ల పరీక్ష సెంటర్లలో కనీస వసతులు లేక పోవడం మరిన్ని ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. జిల్లాలో చాలా చోట్ల ఉపాధి కూలీలు, రోడ్డు పక్కన ఉంటున్న చిరు వ్యాపారులకు ఎండ తీవ్రత చాలా ఇబ్బందికరంగా మారింది. రానున్న రోజులలో ఎండ తీవ్రత మరింతగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో శనివారం పలువురికి వడ దెబ్బ కూడా తగిలింది. భానుడి ప్రతాపం నుంచి తట్టుకోవాలంటే ఎక్కువగా మంచినీరు, చలువ పదార్థాలు తీసుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
దూపకేడ్చి.. ఊపిరొదిలిన లేగదూడ
ఖమ్మం: విపరీతమైన ఎండలు.. తాగునీటి ఎద్దడి.. అంతటా అలుముకున్న కరువుతో మనుషులే కాదు.. మూగజీవాలు తల్లడిల్లుతున్నాయనడానికి ఈ దృశ్యం సాక్ష్యం. ఖమ్మం జిల్లా మణుగూరు మండలం సమితిసింగారం గ్రామ పంచాయతీ పీవీ కాలనీ రోడ్డు రైల్వేగేట్ వద్ద బుధవారం మధ్యాహ్నం ఓ లేగదూడ ఎండతీవ్రత, దాహంతో ప్రాణాలొదిలింది. సింగరేణి బొగ్గు గనుల కారణంగా ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో మేతకొచ్చిన దూడ దప్పికకు తాళలేక సమీపంలోని ఇళ్ల వద్దకు వెళ్లినా నీటి జాడ కనిపించలేదు. డ్రెయినేజీలో నీళ్లు తాగేందుకు ప్రయత్నించింది. కానీ మురుగునీటిని మింగలేక చివరికి ఊపిరొదిలింది. కొద్దిసేపటికే అక్కడికొచ్చిన తల్లిఆవు.. దూడ శరీరాన్ని నాలుకతో నాకుతూ తలతో ఆటూఇటూ నెట్టుతూ లేపేందుకు ప్రయత్నిస్తూ ‘తల్లి’డిల్లింది. స్థానికులు గ్రహించి బకెట్లో నీళ్లు పెట్టగా ఆవు ఆతృతగా తాగడం, అప్పటికే దూడ ఊపిరి వదలడం స్థానికులను కలచివేసింది. - మణుగూరు రూరల్ -
నీలగిరి @ 45 డిగ్రీలు...
* మండుతున్న ఎండలు * బోసిపోయిన రహదారులు నల్లగొండ రూరల్ : ఎండ తీవ్రత, వడగాల్పుల కారణంగా జిల్లా నిప్పుల కొలిమిగా మారింది. శుక్రవారం జిల్లా అంతటా వడగాల్పులు, ఎండతీవ్రత ఉండటంతో జనం విలవిలాడిపోయారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. వ్యవసాయ బావుల వద్ద రైతులు, గొర్రెలు, పశువుల పెంపకం దారులు వడగాల్పులకు ఉక్కిరి బిక్కిరయ్యారు. చెట్ల నీడచాటును పశువులు, జీవాలు తలదాచుకోగా పక్షులు నీళ్ల కోసం నోర్లు తెరిచాయి. అన్ని పట్టణ కేంద్రాల్లో 11 గంటలకే రోడ్లన్ని నిర్మాణుష్యంగా మారాయి. అత్యవసర పరిస్థితి అయితే తప్ప ప్రజలు రోడ్లపైకి రావడానికి ఆసక్తి చూపడంలేదు. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు చల్లని పానియాలను ఆశ్రయించారు. -
ఎండ నుంచి వాహనాలకు రక్షణ ఇలా..
రాయవరం : భానుడు రోజు రోజుకు విశ్వరూపం చూపిస్తున్నాడు. మండే ఎండలను తట్టుకునేందుకు ప్రజలు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. నేడు మారిన జీవనశైలిలో భాగంగా వాహనాల పట్ల కూడా కాస్త జాగ్రత్తలు వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. వేసవి వచ్చిందంటే వాహనదారులు వివిధ రకాల సమస్యలు ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా పార్కింగ్ లేకపోవడంతో ఎండలోనే వాహనాలు ఉంచడం ద్వారా రంగు వెలిసిపోతాయి. ఇంజన్ నుంచి పొగలు రావడం, పెట్రోల్ ఆవిరైపోవడం, టైర్ పంక్చర్ కావడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. వీటిని అరికట్టేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఇంజన్ ఆయిల్ మార్పిడిలో అప్రమత్తం .. వేసవిలో వాహనాల ఇంజన్ ఆయిల్ మార్పిడి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వేడి కారణంగా ఇంజన్ ఆయిల్ ఆవిరయ్యే అవకాశం ఉంది. వాహనాలు నడుపుతున్నప్పుడు వచ్చే వేడి .. ఎండ వేడి కలిసి ఇంజన్ ఓవర్‌హీట్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఇంజన్ నుంచి పొగలు వస్తుంటాయి. దీంతో పాటు ఎయిర్ లాక్ ఏర్పడి వాహనం స్టార్ట్ కాక మొరాయించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంజన్ ఆయిల్‌ను ఎప్పటికప్పుడు మార్చుకుంటే ఇబ్బందులు తప్పుతాయి. సాధారణంగా 2వేల కి.మీలకు ఒకసారి మార్చే ఇంజన్ ఆయిల్‌ను వేసవిలో 1,000 నుంచి 1,500 కిలో మీటర్లకు మార్చుకోవడం మంచిది. రక్షణ నిచ్చే సీట్ కవర్లు.. క్లాత్ కవర్లు ఎండ తీవ్రతను తగ్గించడంలో సీట్ కవర్లది ప్రముఖ పాత్ర ఉంటుంది. కేవలం సీటుకే కాకుండా పెట్రోల్ ట్యాంక్‌కు కూడా కవర్లు వేయడం మరింత సురక్షితం. వేడిని తగ్గించే వెల్వెట్, పోస్ట్క్లాత్ వంటి సీట్ కవర్లు వేయిస్తే మంచిది. వాకడం విషయంలో జాగ్రత్తలు వేసవిలో ద్విచక్ర వాహనాలను అవసరం ఉంటే తప్ప అదేపనిగా వినియోగించకుండా ఉంటే మంచిది. దూర ప్రాంతాలకు వాహనా ల్లో ప్రయాణం చేసే వారు ద్విచక్ర వాహనాన్ని పక్కన పెట్టి బస్సులో ప్రయాణిస్తే మంచిది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చిన మార్గమధ్యంలో కాస్త చల్లటి ప్రదేశాల్లో ఆగి కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేయడం ద్వారా వాహనం ఇంజన్ కండిషన్లో ఉంటుంది. పార్కింగ్ ముఖ్యం.. వాహనాలను ఎండ తీవ్రత నుంచి కాపాడుకునేందుకు ముఖ్యంగా స్థల సేకరణ అవసరం. పార్కింగ్ స్థలాలు లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుకాణాల వద్ద పార్కింగ్ చేస్తుండడంతో పాటు ఎటువంటి నీడలేని రహదారుల పైనే పార్కింగ్ వచేయాల్సి వస్తుంది. దీంతో ఎండ అధికంగా ఉండే సమయంలో వాహనాల్లోని పెట్రోల్ ఆవిరైపోతుంది. రాత్రి వేళల్లో ఒకసారి ట్యాంక్ మూతను తీసి మళ్లీ పెట్టడం ద్వారా వేడికారణంగా ట్యాంక్‌లో ఏర్పడ్డ గ్యాస్ బయటకు వెళ్లి ఇంజన్‌లోకి ఆయిల్ సులువుగా వెళ్తుందని నిపుణులు తెలుపుతున్నారు. వేసవిలో వాహనాలపై జాగ్రత్త అవసరం వేసవిలో వాహనాలపై జాగ్రత్త అవసరం. వీలైనంత మేరకు వాహనాలను నీడలోనే పార్కింగ్ చేసేందుకు ప్రయత్నం చేయాలి. వాహనాలను ఎండ నుంచి కాపాడేందుకు క్లాత్ కవర్లు ఉపయోగపడతాయి. ఇక ఇంజన్ ఆయిల్‌ను మిగతా సమయంలో కంటే వే సవిలో కాస్త ముందుగానే మార్చుకుంటే మంచిది. - కె.విజయకుమార్, సీనియర్ మెకానిక్, రాయవరం -
ఎండలే అసలు పరీక్ష
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు * 74,756 మంది విద్యార్థుల హాజరు * ఉదయం 9 నుంచే సూర్యప్రతాపం * ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఎండల భయం పట్టుకుంది. ఉదయం 9 గంటలకే భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండడం ఇందుకు కారణం. దీనికితోడు గాలి, వెలుతురు రాని గదులను పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటు చేయడం, అందులో ఫ్యాన్లు, లైట్లు, మంచినీరు, ఇతర సౌకర్యాలు సరిగా లేకపోవడంపై కూడా విద్యార్థిలోకంలో ఒకింత ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి నిర్వహిస్తున్న ఇంటర్ పరీక్షలను ఎదుర్కోవడం విద్యార్థులకు అగ్ని పరీక్షగా మారింది. నాలుగు డిగ్రీల సెల్షియస్ ఎక్సెస్.. గత ఏడాది ఇంటర్ పరీక్షల సమయంలో భానుడి ప్రతాపం 36 డిగ్రీల సెల్షియస్‌కు పరిమితం కాగా ఈ ఏడాది ఆ తీవ్రత 39-40 డిగ్రీల మధ్య ఉంది. ఈ కారణంగా ఉదయం 9 గంటలకే జనాలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఉదయం 9నుంచి 12 గంటల మధ్య ఇంటర్ పరీక్షల నిర్వహణ సమయంలో ఇటు ఉక్కపోత, అటు ఎండ వేడిమితో విద్యార్థులు ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితి నెలకొంది. 101 కేంద్రాలు, 74,576 మంది విద్యార్థులు మర్చి 2 నుంచి 19 వరకు మొదటి సంవత్సరం, 3 నుంచి 21 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తున్నారు. 74,576 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 36,094 మంది, రెండో సంవత్సరం విద్యార్థులు 38,662 మంది ఉన్నారు. వీరికోసం జిల్లావ్యాప్తంగా 101 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో ప్రభుత్వ/ఎయిడెడ్ కాలేజీల పరిస్థితి పర్వలేదనిపిస్తుండగా ప్రయివేట్ జూనియర్ కళాశాలల కేంద్రాల్లో మాత్రం వసతులు సరిగా లేనట్లు తెలుస్తోంది. గాలి, వెలుతురు సక్రమంగా రానివి, ఫ్యాన్లు, లైట్లు లేని గదులున్నట్లు సమాచారం. మరికొ న్ని కేంద్రాల్లో బెంచీలు లేని కారణంగా నేలబారు రాతలు తప్పని పరిస్థితి నెలకొంది. 13 స్క్వాడ్ బృందాలతో పర్యవేక్షణ పరీక్షల నిర్వహణను 13 స్క్వాడ్ బృందాలు పర్యవేక్షించనున్నాయి. ఇందులో నాలుగు ఫ్లైయింగ్ స్వ్కాడ్స్, హైపవర్ కమిటీ, ఆర్ఐఓ, డీవీఈఓ, డీఈసీ, ఐదు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు విరివిగా పరీక్షలో మాల్ ప్రాక్టీస్‌ను నివారించేందుకు కృషి చేస్తాయి. సమస్యాత్మకంగా గుర్తించిన ఆలూరు, కౌతాళం, హొళగుంద కేంద్రాల్లో పర్యవేక్షణ అధికంగా ఉంటుంది. ఇక ప్రతి కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులుంటారు. మూడు సెట్ల ప్రశ్న పత్రాలు.. ప్రతి పరీక్షకు మూడు సెట్ల ప్రశ్న పత్రాలను కేంద్రాల సమీపంలోని పోలీసు స్టేషన్లలో ఉంచారు. ఉదయం 8.30 గంటలకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నుంచి కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారుల సెల్ఫోన్లకు వచ్చే మెసేజ్ ఆధారంగా ఎంపిక చేసిన సెట్ ప్రశ్నపత్రాలను తీసుకెళ్తారు. అన్ని పరీక్షల కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. కంట్రోల్ రూం ఏర్పాటు.. పరీక్షలకు సంబంధించిన ఫిర్యాదులు, సూచనలు అందజేయడానికి ఆర్ఐఓ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఇక్కడ సీనియర్ ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో సభ్యులు.. సందేహాలను నివృత్తి చేస్తారు. ఇందుకోసం 040-24603317,0866-2974130, 08518-222407 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. ఏర్పాట్లు పూర్తి ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఎవరైనా మాల్ ప్రాక్టీస్‌ను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవు. - పరమేశ్వరెడ్డి, ఆర్ఐఓ -
ఏవండీ సీ దిస్ న్యూస్ ఎప్పుడూ ఏసీలోనే ఉంటే... ఆరోగ్యం వేడెక్కుద్దట!
ఇప్పుడు ఎయిర్కండిషన్ల వాడకం ఎగువ మధ్యతరగతి నుంచి మధ్యతరగతికీ వచ్చేసింది. గతంలో ఏసీలు అమర్చుకోవడం పెద్ద సమస్య కాదుగానీ... దాని కరెంటు ఖర్చు ఎక్కువ అనే ఆందోళన ఉండేది. ఇప్పుడు కరెంటు వినియోగాన్నీ ఆదా చేసే అనేక బ్రాండ్లు వస్తుండటంతో ఏసీల వాడకం పెరిగింది. అనేక కారణాలు ఏసీల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఇంట్లో అప్పుడే పుట్టిన చిన్నారి ఎండల తీవ్రత భరించలేదనో, రోగులైన పెద్దవారు ఈ ఎండలను ఎదుర్కోలేరనో ఏసీలను ఆశ్రయించడం మామూలైపోయింది. ఇలాంటి కారణాలతో గతంలో ధనిక వర్గాలకు పరిమితమైన ఏసీలు ఇప్పుడు ఓ మోస్తరు ఆదాయవర్గాలకు దగ్గరవుతున్నాయి. ఏసీల వాడకం కూడా అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతోంది. ఆ సమస్యలను అధిగమించడం ఎలాగో చూద్దాం. ఏసీలతో ఉండే ప్రయోజనాలివి... ♦ వాతావరణంలో ఉండే మార్పులేవీ మనపై దుష్ర్పభావం చూపకుండా, మనం ఎప్పుడూ ఒకే తరహా వాతావరణంలో ఉండేందుకు ఏసీలు ఉపయోగపడతాయి ♦ కొన్ని అధునాతన ఎయిర్ కండిషనర్స్‌తో ఉండే కొన్ని ఫిల్టర్స్ చాలా సూక్ష్మస్థాయిలో ఉండే కాలుష్యాల (మైక్రోస్కోపిక్ పొల్యుటెంట్స్) నుంచి మనల్ని కాపాడతాయి. ♦ బయటి చప్పుళ్లు లోపలికి వినిపించనివ్వకుండా శబ్ద కాలుష్యం నుంచి ఎయిర్ కండిషనర్స్ మనల్ని కాపాడుతాయి. పై ప్రయోజనాలను ఇచ్చే ఎయిర్ కండిషన్ల వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలూ ఉంటాయి. ఏసీలతో వచ్చే ఆరోగ్య సమస్యలివి... ఎయిర్ కండిషన్లతో వచ్చే ఆరోగ్య సమస్యలు అన్నీ ఇన్నీ కావు. తీవ్రమైన తలనొప్పులు, చర్మం పొడిబారిపోవడం, శ్వాసకోశ సమస్యలు వస్తాయి. దీనితో పాటు అనేక ఇతర సమస్యలూ వచ్చేందుకు అవకాశం ఉంది. ఒక్కొక్కటిగా కొన్ని సమస్యలివే... తీవ్రమైన అలసట - తలనొప్పి : ఎయిర్ కండిషన్ వల్ల వచ్చే చల్లదనం ఎప్పుడూ ఒకేలా స్థిరంగా ఉంచడం కోసంతో పాటు... ఆ చల్లదనం గది దాటి బయటకు వెళ్లకుండా ఉంచేందుకు ఏసీ ఉన్న గదిని ఎప్పుడూ మూసే ఉంచాల్సి ఉంటుంది. దాంతో అక్కడి గాలి అక్కడే ఉండిపోతుంది. మనం విడిచే కార్బన్ డై ఆక్సైడ్ కూడా ఆ గదిలోనే ఉంటుంది. ఒకవేళ పరిమితికి మించి జనం ఉన్నప్పుడు అక్కడ ఉన్న గాలిలో అందరూ విడిచే కార్బన్ డై ఆక్సైడ్ పాళ్లు పెరిగిపోతాయి. ఆక్సిజన్ పాళ్లు తగ్గిపోతాయి. దాంతో ఎయిర్ కండిషన్ గదిలో ఉన్నవారికి మెల్లగా తలనొప్పి (డల్ హెడేక్) మొదలవుతుంది. తగినంత ఆక్సిజన్ సరఫరా లేనందువల్ల రక్తంలోని ఎర్ర రక్త కణాలలో ఆక్సిజన్‌ను తీసుకెళ్లే సామర్థ్యం ఒకింత తగ్గుతుంది. దాంతో ఏసీలో చాలాసేపు ఉన్నవారికి బాగా అలసిపోయినట్లుగా అనిపిస్తుంటుంది. ఇలా మన రక్తకణాలకు తగినంత ఆక్సిజన్ అందకపోవడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యపరమైన చేటు జరిగే అవకాశాలూ ఎక్కువ. పొడిచర్మం: ఒకింత వేడిమికీ, ఎండకూ ఉన్నప్పుడు మన చెమట గ్రంథులు చురుగ్గా పనిచేస్తుంటాయి. కానీ ఎప్పుడూ అతి చల్లటి వాతావరణంలో ఉండటం వల్ల చెమట గ్రంథులు పనిచేయడానికి అవకాశం ఉండదు. దాంతో చాలాకాలం పాటు ఎయిర్ కండిషన్లలో ఉన్నవారి చర్మంపై చెమ్మ ఎప్పుడూ ఉండదు. ఇదే పరిస్థితి దీర్ఘకాలం పాటు కొనసాగితే వారి చర్మంపై తేమ పూర్తిగా ఆరిపోయి చర్మం పొడిబారిపోయినట్లుగా మారుతుంది. చర్మం ఇలా పూర్తిగా పొడిబారిపోయిన కొన్ని సందర్భాల్లో చర్మంపై దురదలు కూడా రావచ్చు. అప్పటికే ఉన్న వ్యాధుల తీవ్రత పెరగడం : కొందరు వ్యక్తులు అప్పటికే కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఉదాహరణకు ఆస్తమా, రక్తపోటు తక్కువగా ఉండేవారు (లో-బ్లడ్ ప్రెషర్), ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడేవారికి ఎయిర్ కండిషన్ ఉపశమనంలా పనిచేయకపోగా... అది వారి సమస్యలను తీవ్రతరం చేస్తుంది. కిడ్నీలో రాళ్లు : ఎయిర్ కండిషన్లో ఉన్నవారికి దాహం తక్కువ కావడం వల్ల వారు రోజు తాగాల్సిన నీళ్ల కంటే చాలా తక్కువగా నీళ్లు తాగుతుంటారు. దాంతో మూత్రపిండాలలో రాళ్లు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఇది చాలా తీవ్రమైన సమస్యకు దారితీయవచ్చు. ఒకరకం నిమోనియా వచ్చే అవకాశం: కొందరిలో ఏసీ వల్ల ఒకరకం నిమోనియా అయిన లెజియోన్నేరిస్ వంటి వ్యాధులు రావచ్చు. ఎండ తీవ్రతకు తట్టుకోలేకపోవడం : చాలాకాలం పాటు ఎయిర్ కండిషన్ గదుల్లో ఉండేవారికి క్రమంగా ఎండ తీవ్రతను, వేడిమిని తట్టుకోగల సామర్థ్యం తగ్గిపోతుంది. దాంతో వారు బయటకు వచ్చినప్పుడు కొద్దిపాటి ఎండ తీవ్రతనూ భరించలేరు. ఇలా దీర్ఘకాలం పాటు ఏసీల్లో ఉండి బయటకు వచ్చాక వారిలో అకస్మాత్తుగా తల తిరిగినట్లు అనిపించడం, తలనొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది అనిపించడం వంటి సమస్యలతో బాధపడతారు. శ్వాసకోశ సమస్యలు : ఏసీలు అమర్చి ఉన్న కార్లను పరిశీలించినప్పుడు ఒక రకమైన ఫంగస్‌తో పాటు కొన్ని రకాల చాలా సూక్ష్మజీవులు ఉన్నట్లు గుర్తించారు. ఈ సూక్ష్మజీవుల వల్ల అలర్జీలు రావచ్చు. ఈ అలర్జీ తీవ్రతరమైనప్పుడు శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు, ఆస్తమా వంటి పరిణామాలకు దారితీయవచ్చు. కొన్ని చెవి సమస్యలు కూడా : కొన్ని ఏసీల సామర్థ్యం తక్కువ. చవక రకాలకు చెందిన ఏసీలలో ఒక రకమైన శబ్దం నిరంతరం వస్తుంటుంది. ఈ నిరంతర శబ్దానికి గురైన వారి చెవులలో అదే హోరు వినిపిస్తూ ఉంటుంది. దీర్ఘకాలం పాటు ఈ హోరు వింటున్నవారి చెవులు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక ఏసీ వాతావరణంలో పెరిగే ఒక రకం బూజు (మోల్డ్) వల్ల కూడా శ్వాసకోశ సమస్యతో పాటు చెవులు దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాగని ఒకసారి ఏసీకి అలవాటు పడ్డ తర్వాత అందులో ఉన్నా లేకపోయినా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఏసీలోని ఒకే రకమైన స్థిరమైన ఉష్ణోగ్రతకు అలవాటు పడ్డవారు తరచూ బయటకు వెళ్తూ, లోపలికి వస్తూ ఉండాల్సి వస్తుంటే తరచూ తమ పరిసర వాతావరణం మారిపోతూ ఉండటం వల్ల పై బాధలు మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలున్నాయి. అనర్థాలను అధిగమించడం ఇలా... ఎయిర్ కండిషనర్స్‌తో ఆరోగ్యపరమైన కొన్ని ప్రయోజనాలతో పాటు, మరికొన్ని నష్టాలు కూడా ఉన్నాయని తేలిపోయింది. కాబట్టి వృత్తిరీత్యా ఏసీలో గడపాల్సి వచ్చి వాటి కారణంగా ఆరోగ్యంపై దుష్ర్పభావం పడుతుంటే ఆ నష్టాలను తెలుసుకుని వాటి గురించి అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే వాటి నుంచి ఆశించే ప్రయోజనం ఉంటుంది. ♦ ఎప్పుడూ ఏసీలో ఉండేవారు అప్పుడప్పుడూ చల్లగాలికి వచ్చి ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటూ ఉండాలి. అయితే చల్లటి వాతావరణం నుంచి అకస్మాత్తుగా బయటకు రాకూడదు. లోపలి వాతావరణంతో పాటు బయటి వాతావరణం కూడా దగ్గర దగ్గరగా ఉండే సమయాలైన ఉదయం, సాయంత్రాలలో బయటకు రావాలి. పైగా ఆ సమయాల్లో వాతావరణంలో కాలుష్యం కూడా ఒకింత తక్కువ. ఏసీలో తప్పక ఉండాల్సి వచ్చిన వారు ఆ వాతావరణానికి అనువైన దుస్తులను ధరించాలి. ఒకవేళ ఆ ఏసీ చల్లదనాన్ని భరించలేకపోతే ఉన్ని దుస్తుల వంటివి వాడాలి. చర్మం పొడిబారుతుండే వాళ్లు తరచూ మాయిశ్చరైజింగ్ క్రీమ్ మేనిపైన రాస్తూ ఉండాలి. ♦ ఏసీలో ఉండేవారు దాహం వేయకపోయినా అప్పుడప్పుడూ నీళ్లు తాగుతూ ఉండాలి. దాంతో కిడ్నీలో ఏర్పడే రాళ్లను నివారించవచ్చు. ♦ ఏసీలోని ఫిల్టర్స్‌ను తరచూ శుభ్రపరుస్తూ ఉండాలి. ఏసీలోని ఫిల్టర్స్‌ను సబ్బుతో కడగాల్సి వచ్చినప్పుడు అవి పూర్తిగా ఆరిన తర్వాతే మళ్లీ వాటిని బిగించాలి. ♦ ఏసీ కారణంగా ఆరోగ్యంపై దుష్ర్పభావాలు కనిపిస్తుంటే వాటిని వీలైనంతగా అవాయిడ్ చేయాలి. ఎయిర్ కండిషన్ వల్ల కలిగే ప్రయోజనాలూ - నష్టాలను బేరీజు వేసుకొని, దుష్ర్పభావాలను సాధ్యమైనంత తగ్గించుకుంటూ విచక్షణతో ఎయిర్ కండిషన్‌ను వాడితే, దానివల్ల ఒనగూరే ప్రయోజనాలు దక్కుతాయి. ఆరోగ్యమూ కాపాడుకోవచ్చు. డాక్టర్ డి. అరవింద్ కుమార్ కన్సల్టెంట్, ఇంటర్నల్ మెడిసిన్, కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్ -
నేటితో కత్తిరకు కత్తెర
* 25 రోజుల చండ ప్రచండానికి ముగింపు * వర్షాలతో చల్లబడిన రాష్ట్రం చెన్నై,సాక్షి ప్రతినిధి: వేసవి బాధితులకు శుభవార్త. 25 రోజులుగా నిప్పు లు చెరిగిన కత్తెర వెయిల్కు నేటితో తెరపడనుంది. రాష్ట్రం ఇక క్రమేణా చల్లబడే అవకాశం ఉంది. ఎండవేడిమి భగభగలతో నిప్పుల కొలిమిలా మారిన రాష్ట్రం ఇక వర్షానుభూతులతో పరవశించనుంది. తమిళ పంచాగం ప్రకారం అగ్నినక్షత్రాన్ని కత్తిరివెయిల్ అని పిలుస్తారు. గత ఏడాది కత్తిరి వెయిల్ కాలంలో 118 డిగ్రీల అత్యథిక ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెల 4వ తేదీన కత్తిరి వెయిల్ ప్రారంభమై తన ప్రతాపాన్ని చూపింది. కత్తిరి వెయిల్ ఆరంభ దినాల్లో కొద్దిపాటూ వర్షాలు కురిసిన కారణంగా ఎండవేడిమిని ప్రజలు పెద్దగా ఎదుర్కొనలేదు. అయితే క్రమేణా ఎండల తీవ్రత పెరిగిపోయి రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. మిట్టమధ్యాహ్నం వేళల్లో ప్రజలు ఇంటి నుండి బయటకు రావడమే మానేశారు. రోడ్లు నిర్మానుష్యంగా మారిపోయాయి. తగిన జాగత్రలు తీసుకోకుండా ఇళ్లను వదిలి రావద్దని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ ఏడాది కత్తిరి వెయిల్ కాలంలో చెన్నైలో 108 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. చల్లబడుతున్న రాష్ట్రం: కత్తిరివెయిల్ ఈనెల 29వ తేదీతో ముగుస్తున్నందుకు సూచనగా బుధ, గురువారాల్లో రాష్ట్రమంతా మేఘావృతమైంది. గత 25 రోజులుగా ఎండవేడిమికి అల్లాడుతున్న జనానికి ఊరటనిస్తూ అనేకచోట్ల వర్షాలు కురిసాయి. ఉత్తరచెన్నై, పుదుచ్చేరీలలో మరో రెండురోజలు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. కత్తిరి వెయిల్కు శుక్రవారంతో కత్తెరపడుతున్నందున రాష్ట్రం క్రమేణా చల్లబడుతుందని అంచనావేస్తున్నారు. వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా రాష్ట్రంలో పలుచోట్ల బుధవారం రాత్రి వర్షాలు కురిసాయి. ముఖ్యంగా డెల్టా జిల్లాలు మండువేసవి నుండి వర్షంతో ఉపశమనం పొందాయి. బుధవారం రాత్రి 7 గంటలకు ప్రారంభమైన వర్షం గంటపాటూ ఎడతెరిపి లేకుండా కురిసింది. కుంభకోణం, తిరునాగేశ్వరం, పాపనాశం తదితర ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షం పడింది. తిరువారూరు, నాగపట్టినంలో కూడా వర్షం పడింది. వేలూరులో బుధవారం సాయంత్రం తుంపర్లతో ప్రారంభమైన వాన క్రమేణా భారీ వర్షంగా మారింది. ఆంబూరులో రెండుగంటల పాటూ కురుసిన భారీ వర్షానికి ఈదురుగాలులు, పిడుగులు తోడైనాయి. చెన్నై నగరం సహా రాష్ట్రంలోని అనేక జిల్లాలు గురువారం ఉదయం నుండి దట్టమైన మబ్బులు కమ్ముకుని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాయి. ఊటీ, కున్నూరు, కడలూరు, కొత్తేరీ, అవలాంజీ ఆ పరిసర ప్రాంతాలు గురువారం తెల్లవారుజామున ఓ మోస్తరు వర్షం కురిసింది. తిరుపూరులో బుధవారం రాత్రి 10.30 గంటలకు చినుకులతో ప్రారంభమై జోరందుకుంది. కోవైలో గురువారం తెల్లవారుజామున గంటపాటూ భారీ వర్షం కురిసింది. పొల్లాచ్చిలో బుధవారం రాత్రి 10.30గంటలకు ప్రారంభమైన గురువారం తెల్లవారుజాము వరకు కుండపోతగా వర్షం పడింది. తిరుచ్చి, కరూరు, పుదుక్కోట్టై, పెరంబలూరు, సేలం, పుదుచ్చేరీలో సైతం భారీ వర్షాలు కురిసాయి. భువనగిరిలోని వడతలై గ్రామంలో కలైమణి అనే రైతు పెంచుతున్న 3 పశువులు పిడుగుపడి మృతిచెందాయి. అంతేగాక అతని గుడిసెతోపాటు సమీపంలోని మరో మూడు గుడిసెలు పిడుగుతాకిడికి రేగిన అగ్నికి ఆహుతయ్యాయి. -
సన్ డే
-
తెలంగాణలో సూర్యుడి సెగలు..
-
గ్రీవెన్స్‌పై సూర్య ప్రతాపం
ఖమ్మం జెడ్పీసెంటర్ : భానుడి ప్రభావం గ్రీవెన్స్‌పై కూడా పడింది. ప్రతి సోమవారం కలెక్టర్ సమక్షంలో అధికారులందరితో నిర్వహించే గ్రీవెన్స్ భూ సమస్యలు, ఇళ్లు, సర్టిఫికెట్లు, పింఛన్లు, రేషన్ తదితర సమస్యలపై వందల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చేవి. గత నాలుగు రోజులుగా ఎండతీవ్రత అధికం కావడంతో జిల్లా నలుమూలల నుంచి వచ్చే ఫిర్యాదుదారుల సంఖ్య తగ్గింది. సోమవార జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుదారులు తక్కువ సంఖ్యలో వచ్చారు. ఎండతీవ్రతకు గంట వ్యవధిలోనే తిరుగుముఖం పట్టారు. హాలులో కూర్చున్న అధికారులు ఎండ అధికంగా ఉండడంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తొలుత కలెక్టర్ ఇలంబరితి అదనపు జేసీ బాబూరావుతో కలిసి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలనుంచి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిస్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్లుఎస్ అధికారులను ఆదే శించారు. కోర్టు కేసులకుసంబందించిన విషయాలపై అధికారులు ప్రత్యేకదృష్టి సారించాలన్నారు. గ్రీవెన్స్‌లో వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని ఇలా ఉన్నాయి. * గత కొన్నేళ్లుగా పింఛన్ పొందుతున్నానని, 2015 మార్చి నుంచి పింఛ న్ నిలుపుదల చేశారని, తిరిగి పింఛన్ పునరుద్దరించాలని ముదిగొండ మం డలం యడవల్లి గ్రామానికి చెందిన పుష్పమ్మ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. * తన కుమార్తె 5 వ తరగతి చ దువుతుందని, తనకు చదివించే ఆర్థికస్థోమతలేదని, సాంఘిక సంక్షేమ హాస్టల్ లో సీటు ఇప్పించాలని పెనుబల్లి మం డలానికి చెందిన బి.కృష్ణ కోరాడు. * తాను తల్లాడ ఆంధ్రాబ్యాంక్‌లో పంట రుణం పొందగా, రుణమాఫీ జాబితాలో పేరువచ్చిందని, రీ షెడ్యూల్ కోసం వెళ్లగా రుణమాఫీ కాలేదని అధికారులు చెబుతున్నారని, తనకు న్యాయం చేయాలని తల్లాడ మండలం మిట్టపల్లికి చెందిన కాపా నాగరత్నం పేర్కొంది. * బీసీలకు కల్యాణ లక్ష్మి పథకాన్ని వర్తింపజేయాలని కుల సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు. -
ఏపిలో భానుడి ప్రతాపం
-
ఒక్క గుక్కకు... రెండు కిక్కులు!
పానీయాలు... ఎండ తీవ్రతను అధిగమించే ఉపాయాలెన్నో. గొడుగులు విప్పి అడుగులు ముందుకేస్తారు కొందరు. మడుగుల్లో దిగి ఈదులాడుతూ సేద దీరుతారు ఇంకొందరు. రుచీ పచీ లేని ఇలాంటి ఉపాయాలు మనకేల? ఎండకు మండే డ్యూటీ కొండలకు వదిలేసి... గ్లాసు నిండా పానీయాలను నింపుకునేలాంటివీ, నోటి నిండా రుచులను ఒంపుకునేలాంటివీ ప్లాన్ చేద్దాం. టెంప్టయిపోయి మగ్గును ఎంప్టీ చేసే ఈ ప్లాన్‌తో ఒక్క గుక్కకు రెండు కిక్కులు! మొదటిది వడదెబ్బకు, రెండోది రుచులు కోరే జిహ్వకు. జిహ్వకో రుచి అన్న సామెతను అబద్ధం చేస్తూ... షడ్రుచులకు ఒకటి తగ్గించి అచ్చంగా ఐదు రుచుల పానీయాలను ఏర్పాటు చేస్తున్నాం. నాల్కపై ఒక్కో చుక్క వేస్తూ ఎండను ఏడిపించండి. వడదెబ్బను ఓడించండి. పానీయాల స్విమ్మింగ్ పూల్‌లో నాల్కలను ఈదులాడిద్దాం రండి. ఆమ్ పన్నా కావలసినవి: పచ్చి మామిడికాయ - 1 (పెద్దది); జీలకర్ర పొడి - టేబుల్ స్పూను; నల్ల ఉప్పు - టీ స్పూను; పంచదార / బెల్లం - తగినంత; మిరియాలు - 4; పుదీనా ఆకులు - గుప్పెడు; చల్లటి నీళ్లు - తగినన్ని తయారీ: ఒక గిన్నెలో మామిడికాయ, మూడు కప్పుల నీళ్లు పోసి కుకర్‌లో ఉంచి ఉడికించాలి బయటకు తీసి చల్లారాక మామిడికాయ తొక్క, టెంక వేరు చేసి, గుజ్జును మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ఒక గిన్నెలో ముప్పావు కప్పు నీళ్లు, పావు కప్పు పంచదార వేసి కరిగేవరకు ఉంచి, దించేసి చల్లారాక ఫ్రిజ్‌లో ఉంచాలి. (బెల్లం వాడుతుంటే కప్పుడు బెల్లం తురుము, రెండు కప్పుల నీళ్లు పోసి బెల్లం కరిగించి, వడపోయాలి. అలా చేయడం వల్ల తుక్కు వంటివి ఉంటే పోతాయి. ఆ తరువాత స్టౌ మీద ఉంచి పాకం చిక్కబడేవరకు సన్నని మంట మీద ఉంచి ఉడికించి, దించేయాలి. చల్లారాక ఫ్రిజ్‌లో ఉంచి సుమారు గంట తరువాత బయటకు తీయాలి. మామిడికాయలో ఉండే పులుపును బట్టి ఉపయోగించే పదార్థాల పరిమాణం పెంచుకోవడం లేదా తగ్గించుకోవడం చేయాలి. మామిడికాయ మరీ పీచు ఉన్నదైతే రసం తయారుచేసుకున్నాక వడకట్టాలి) మిక్సీలో నాలుగు టేబుల్ స్పూన్ల మామిడికాయ గుజ్జు, 2 టేబుల్ స్పూన్ల పంచదార పాకం, పావు టీ స్పూను జీలకర్ర పొడి, పావు టీ స్పూను నల్ల ఉప్పు, మిరియాలు, పుదీనా ఆకులు వేసి మెత్తగా చేయాలి పావు కప్పు చల్లటి నీళ్లు జత చేసి, మరో మారు మిక్సీలో తిప్పాలి గ్లాసులలోకి పోసి చల్లగా అందించాలి. రాగి ఆల్మండ్ డ్రింక్ కావలసినవి: రాగి పిండి - 2 టేబుల్ స్పూన్లు; బాదం పప్పులు - 10 +4 (వేయించి మెత్తగా పొడి చేయాలి); చల్లటి నీళ్లు - అర కప్పు; బెల్లం తురుము / డేట్స్ సిరప్- 3 టేబుల్ స్పూన్లు; చల్లటి పాలు - గ్లాసు తయారీ: ముందుగా కప్పు చల్లటి నీళ్లలో రాగిపిండి, బాదం పప్పుల పొడి వేసి బాగా కలపాలి నాలుగు కప్పుల నీళ్లలో బె ల్లం తురుము వేసి స్టౌ మీద ఉంచి కరిగించాలి మంట తగ్గించి రాగి పిండి + బాదం పప్పుల నీళ్లు పోయాలి సుమారు రెండు మూడు నిమిషాలు ఉడికిస్తే మిశ్రమం చిక్కగా తయారవుతుంది మంట మీద నుంచి దింపి, చల్లారనివ్వాలి చల్లబడేసరికి మిశ్రమం బాగా చిక్కగా అవుతుంది చల్లటి పాలు జత చేసి గిలక్కొట్టాలి బాదం పలుకులతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి కుకుంబర్ మింట్ స్మూతీ కావలసినవి: కీర దోసకాయ ముక్కలు - అర కప్పు (దోసకాయ చెక్కు తీసి చిన్న ముక్కలు గా తరగాలి); పుదీనా ఆకులు - 5; ఐస్ క్యూబ్స్ - కొన్ని; గట్టి పెరుగు - రెండు కప్పులు; నీళ్లు - కొద్దిగా; చాట్ మసాలా - చిటికెడు; నల్ల ఉప్పు - కొద్దిగా తయారీ: కీరదోసకాయ ముక్కలు, పుదీనా ఆకులను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ఒక పాత్రలో పెరుగు, నల్ల ఉప్పు, చాట్ మసాలా, టేబుల్ స్పూను నీళ్లు వేసి గిలక్కొట్టాలి కీరదోస + పుదీనా పేస్ట్ జత చేసి మరోమారు గిలక్కొట్టాలి గ్లాసులలో ఈ మిశ్రమం వేసి ఐస్ క్యూబ్స్ జత చేసి అందించాలి. ఐస్డ్ లెమన్ మింట్ టీ కావలసినవి: చల్లటి నీళ్లు - కప్పు; మామూలు నీళ్లు - ఒకటిన్నర కప్పులు; పంచదార / తేనె - 2 టేబుల్ స్పూన్లు; నిమ్మరసం - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; టీ బ్యాగ్ - ఒకటి; ఐస్ క్యూబ్స్ - కొద్దిగా; పుదీనా ఆకులు - 5; నిమ్మ చెక్కలు - 2 తయారీ ఒక పాత్రలో అర కప్పు నీళ్లు పోసి పంచదార జత చేసి స్టౌ మీద ఉంచి పంచదార కరిగించాలి కిందకు దించి, అందులో ఒక టీ బ్యాగ్ వేసి చల్లారే వరకు ఉంచాలి చల్లబడిన టీకి, చల్లటి నీళ్లు, నిమ్మరసం జత చేయాలి పుదీనా ఆకులను చేతితో గట్టిగా నలిపి మెత్తగా చేయాలి రెండు గ్లాసులు తీసుకుని, ఒక్కో గ్లాసులో పుదీనా ఆకులు, ఐస్ క్యూబ్స్ నిమ్మ చెక్క వేయాలి నిమ్మరసంతో తయారైన టీని గ్లాసులలో పోసి అందించాలి. స్పైసీ బటర్‌మిల్క్ కావలసినవి: మజ్జిగ - 4 గ్లాసులు (ఒక భాగం పెరుగు, 3 భాగాలు నీళ్లు పోసి చేయాలి); ఉప్పు - తగినంత; నిమ్మ రసం -2 టేబుల్ స్పూన్లు; నూనె - పావు టీ స్పూను; ఆవాలు - పావు టీ స్పూను; కరివేపాకు - రెండు రెమ్మలు; అల్లం తురుము - అర టీ స్పూను; పచ్చి మిర్చి - 4 (చిన్న ముక్కలుగా కట్ చేయాలి); కొత్తిమీర తరుగు - టీ స్పూను; నిమ్మ ఆకులు - 2 (చిన్న ముక్కలుగా చేయాలి) తయారీ: ఒక పాత్రలో మజ్జిగ, ఉప్పు, నిమ్మ రసం వేసి కవ్వంతో బాగా గిలక్కొట్టాలి స్టౌ మీద బాణలి ఉంచి నూనె కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి కొద్దిగా కరివేపాకు జత చేసి దించేయాలి మజ్జిగ ఉన్న పాత్రలో... వేయించి ఉంచుకున్న ఆవాలు, కరివేపాకు వేయాలి అల్లం తురుము, పచ్చిమిర్చి, నిమ్మ రసం వేసి గిలక్కొట్టాలి కొత్తిమీర, నిమ్మ ఆకులు వేసి గాజు గ్లాసులలో పోసి అందించాలి.