మే నెల అమ్మకాల్లో 5.28% క్షీణత
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎండల తీవ్రత.. మరోవైపు ఎన్నికలు. వెరసి దేశవ్యాప్తంగా మే నెలలో వాహన పరిశ్రమపై ఈ రెండు అంశాలు ప్రభావం చూపాయి. షోరూంలకు వచ్చే కస్టమర్ల సంఖ్య గత నెలలో 18 శాతం తగ్గినట్టు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఏడీఏ) వెల్లడించింది.
2024 ఏప్రిల్‌తో పోలిస్తే అన్ని విభాగాల్లో కలిపి అమ్మకాలు మే నెలలో 5.28 శాతం క్షీణించాయి. 2023 మే నెలతో పోలిస్తే గత నెల విక్రయాల్లో 2.61% వృద్ధి నమోదైంది. మే నెలలో మొత్తం 20,89,603 యూనిట్ల వాహనాలు రోడ్డెక్కాయి. 2024 ఏప్రిల్‌తో పోలిస్తే గత నెలలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు 6.61% తగ్గి 15,34,856 యూనిట్లకు చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment