Hyderabad: పగటిపూట సిటీ బస్సుల సంఖ్య తగ్గింపు  | Reduction in number of city buses | Sakshi
Sakshi News home page

Hyderabad: పగటిపూట సిటీ బస్సుల సంఖ్య తగ్గింపు 

Published Tue, Apr 16 2024 8:16 AM | Last Updated on Tue, Apr 16 2024 8:17 AM

Reduction in number of city buses - Sakshi

సాక్షి, హైదరాబాద్: ఎండల తీవ్రత దృష్ట్యా నగరంలో మధ్యాహ్నం సమయంలో బస్సుల సంఖ్యను తగ్గించనున్నట్లు ఆర్టీసీ  గ్రేటర్‌ హైదరాబాద్‌ ఈడీ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. కొద్ది రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయని, దీంతో ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని పేర్కొన్నారు.

ఈ మేరకు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నగరంలో సిటీ బస్సుల ట్రిప్పులను తగ్గించనున్నారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు అన్ని రూట్లో బస్సులు యథావిధిగా రాకపోకలు సాగిస్తాయని అధికారులు పేర్కొన్నారు.       

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement