Greater Hyderabad
-
సమాజ్‌వాదీ పార్టీ ఎస్సీ ఎస్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నర్సింగ్ రావు
హైదరాబాద్: సమాజ్ వాది పార్టీ ఎస్సీ ఎస్టి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మదిరె నర్సింగ్ రావు నియమితులయ్యారు. లక్నోలోని సమాజ్ వాదీ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆదేశాల మేరకు సమాజ్ వాది పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు, మాజీ మంత్రి వ్యాస్ జి గోండ్ చేతుల మీదుగా మదిరె నర్సింగ్ రావు నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా లక్నోలోని సమాజ్ వాదీ పార్టీ కేంద్ర కార్యాలయంలో నగరానికి చెందిన సామాజికవేత్త, సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత దండు బోయిన నిత్య కళ్యాణ యాదవ్‌తో కలిసి నర్సింగ్ రావు సోమవారం అఖిలేష్ యాదవ్ ను కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీ సిద్ధాంతాలను వివరిస్తూ పార్టీ పట్ల యువతను, మహిళలను రైతులను ఆకర్షించే విధంగా కృషి చేయాలని అఖిలేష్ యాదవ్ సూచించారు. కళ్యాణ్ యాదవ్ మాట్లాడుతూ త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాలతో పాటు పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. నర్సింగ్ రావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళితులకు, గిరిజనులకు సమాజ్‌వాది పార్టీ సిద్ధాంతాలను వివరిస్తూ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తామని, తనపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద పదవిని తనకు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మజ్దూర్ సభ జాతీయ అధ్యక్షుడు రాహుల్ నిగమ్ వసి తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తరానికి వెళ్లే రైలు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఉత్తర ప్రాంత ప్రజలకు నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభవార్త చెప్పారు. నగర ఉత్తర ప్రాంతాలను అనుసంధానిస్తూ రెండు కీలకమైన మెట్రో రైలు కారిడార్లను నిర్మించాలని నిర్ణయించారు. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు 23 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ వరకు 22 కిలోమీటర్ల పొడవుతో రెండు కారిడార్లకు ఆమోదం తెలిపారు. వీటికి సంబంధించి డీపీఆర్ తయా రు చేయాలని.. మెట్రో రైల్ ఫేజ్–2 ‘బీ’లో భాగంగా ఈ రెండు కారిడార్లను కూడా కేంద్రం అనుమతి కోసం పంపించాలని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని ఆదేశించారు. సీఎం బుధవారం ఈ అంశంపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, ఎన్వీఎస్ రెడ్డిలతో చర్చించారు. ప్రతిపాదిత కారిడార్లు ఇవీ.. ప్యారడైజ్ మెట్రోస్టేషన్ నుంచి తాడ్‌బండ్, బోయినపల్లి, సుచిత్ర సర్కిల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్ వరకు దాదాపు 23 కిలోమీటర్లు కారిడార్ ఉంటుంది. ఇది నిజామాబాద్/ఆదిలాబాద్ వెళ్లే మార్గం (నేషనల్ హైవే నంబర్ 44) వెంట కొనసాగుతుంది. అలాగే జేబీఎస్ (జూబ్లీ బస్‌స్టేషన్) మెట్రోస్టేషన్ నుంచి విక్రంపురి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, అల్వాల్, బొల్లారం, హకీంపేట్, తూముకుంట, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా శామీర్‌పేట్ వరకు 22 కిలోమీటర్ల కారిడార్ నిర్మిస్తారు. ఇది కరీంనగర్/రామగుండం వెళ్లే రాజీవ్ రహదారి వెంట కొనసాగుతుంది. ఇప్పటికే ఈ రెండు మార్గాల్లో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ కారిడార్ల నిర్మాణానికి హెచ్ఎండీఏ నిర్ణయించింది కూడా. ఈ క్రమంలో ఎక్స్‌ప్రెస్ కారిడార్లు, మెట్రో కలసి డబుల్ డెక్కర్ మార్గంగా నిర్మించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇవి పూర్తయితే ట్రాఫిక్ సమస్యకు మంచి పరిష్కారం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. గతంలో తాను మల్కాజిగిరి ఎంపీగా ఉన్నందున ఆ ప్రాంతం ట్రాఫిక్ సమస్యలపై, కారిడార్ల రూట్ మ్యాప్‌లపై అవగాహన ఉందని... అయినా రూట్‌మ్యాప్ విషయంలో ప్రస్తుత మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సూచనలు, సలహాలను తీసుకోవాలని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి సీఎం రేవంత్ సూచించారు. మూడు నెలల్లో డీపీఆర్ సీఎం ఆదేశాల మేరకు ఉత్తర ప్రాంతంలోని రెండు మెట్రో కారిడార్లకు సంబంధించి మూడు నెలల్లో డీపీఆర్ రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ రెండు కారిడార్లను మెట్రో రెండో దశలోని పార్ట్ ‘బీ’లో భాగంగా పరిగణిస్తామని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి డీపీఆర్‌కు అనుమతి లభించిన వెంటనే కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపిస్తామని వెల్లడించారు. వీటి నిర్మాణాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా చేపట్టనున్నట్టు తెలిపారు. రెండు నెలల కిందే రెండోదశ ఆమోదం హైదరాబాద్ మెట్రో రైల్ రెండోదశ పనులకు రాష్ట్ర ప్రభుత్వం గత నవంబర్లోనే ఆమోదం తెలిపింది. రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో 76.4 కిలోమీటర్ల మేర పార్ట్–ఏ కింద ఐదు కారిడార్ల నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేశారు. అలాగే పార్ట్–బి కింద శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్త్ సిటీ (స్కిల్ యూనివర్సిటీ) వరకు 40 కిలోమీటర్ల పొడవున ఆరో కారిడార్ నిర్మించనున్నారు. ఇప్పుడు కొత్తగా ప్రతిపాదించిన ప్యారడైజ్– మేడ్చల్, జేబీఎస్– శామీర్‌పేట కారిడార్లను కూడా పార్ట్–బిలోనే చేర్చనున్నారు. ఇప్పటికే మూడు కారిడార్లలో నడుస్తున్న 69 కిలోమీటర్ల తొలిదశ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రపంచంలోనే పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్టుగా అధికారులు చెబుతున్నారు. రెండో దశలోని పార్ట్–ఏ, పార్ట్–బి మార్గాలు కూడా పూర్తయితే... హైదరాబాద్ మెట్రోరైల్ 11 కారిడార్లు, 240.4 కిలోమీటర్లకు చేరుతుంది. ఉత్తర ప్రాంతాలకు ఎంతో మేలు: మంత్రి పొన్నం ప్రభాకర్ శామీర్‌పేట, మేడ్చల్‌లకు రెండు కొత్త మెట్రో కారిడార్లను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయం మంచి పరిణామమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాలు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ వైపు వెళ్లే వాహనాలకు, ప్రయాణికులకు నగరంలోని ట్రాఫిక్‌తో తీవ్ర ఇబ్బంది ఎదురవుతోందని గుర్తు చేశారు. ఈ రూట్లలో ఇప్పటికే ఎక్స్‌ప్రెస్ రోడ్లు మంజూరువడం, తాజాగా మెట్రో నిర్మాణం చేపట్టనుండటంతో.. ఈ ప్రాంతాల ప్రజల కష్టాలు తీరుతాయని మంత్రి చెప్పారు. -
అక్టోబర్‌లో.. రియల్ బ్యాక్!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రియల్ ఎస్టేట్ మార్కెట్ మళ్లీ పుంజుకుంది. వరుస ఎన్నికలు, కొత్త ప్రభుత్వ విధానాలు, అంతర్జాతీయ మార్కెట్లో ఆర్థిక ఒడిదుడుకుల నేపథ్యంలో ఏడాదిన్నర కాలంగా నగర స్థిరాస్తి రంగంలో కొంతకాలంగా ప్రతిష్టంభన నెలకొంది. అయితే, ఇటీవల ప్రభుత్వం కుదురుకోవటం, ఆర్థిక స్థిరత్వం చేకూరడం, అనుకూలమైన వడ్డీ రేట్లు ఉండటంతో కొనుగోలుదారుల్లో విశ్వాసం పెరిగింది. దీంతో గృహ విక్రయాలు ప్రతి నెలా పెరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సెప్టెంబర్‌లో రూ.2,820 కోట్ల విలువైన 4,903 అపార్ట్మెంట్లు రిజిస్ట్రేషన్ కాగా.. అక్టోబర్ నాటికి రూ.3,617 కోట్ల విలువైన 5,894 యూనిట్లు అమ్ముడుపోయాయి. నెలరోజుల్లో ప్రాపర్టీ వ్యాల్యూలో 28 శాతం, విక్రయాల్లో 20 శాతం వృద్ధి నమోదైందని నైట్‌ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది.14 శాతం వాటా లగ్జరీదే..గ్రేటర్లో గతేడాది జనవరి–అక్టోబర్ మధ్య కాలంలో రూ.30,464 కోట్ల విలువైన 58,390 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ ఏడాది అదే 10 నెలకాలంలో 65,280 అపార్ట్మెంట్లను విక్రయించారు. వీటి విలువ రూ.40,078 కోట్లు. గత నెలలో అమ్ముడైన వాటిల్లో రూ.కోటి విలువైన, 2 వేల చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న లగ్జరీ గృహాలదే 14 శాతం వాటా. గత నెలలో రూ.497 కోట్ల విలువైన 811 లగ్జరీ యూనిట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. రూ.50 లక్షల నుంచి రూ.కోటి ధర ఉన్న 1,601 ప్రాపరీ్టలు, రూ.50 లక్షల లోపు ధర ఉన్న 3,482 యూనిట్లు అమ్ముడుపోయాయి. -
సమాజ్‌వాదీ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలి
గ్రేటర్ హైదరాబాద్‌లో సమాజ్‌వాదీ పార్టీ బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యలపై పోరాడాలని ఏపీ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు పాశం వెంకటేష్ సూచించారు. ఆదివారం గ్రేటర్ హైదరాబాద్ సమాజ్‌వాదీ పార్టీ నేత, సామాజిక కార్యకర్త దండుబోయిన కళ్యాణ్ యాదవ్, తెలంగాణ మాదిగ దండోరా అధ్యక్షుడు మదిరె నర్సింగ్‌రావుతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల పార్టీలో చేరిన నేతలు వారి వారి ప్రాంతాల్లో శ్రేణులను ఐక్యం చేస్తూ ప్రజా సమస్యలపై పోరాడాలని తీర్మానించారు. త్వరలోనే సమాజ్‌వాదీపార్టీ జాతీయ అద్యక్షుడు అఖిలేష్ యాదవ్ సూచనలతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్థాయిల్లో కమిటీలు వేస్తామని పెద్ద ఎత్తున పార్టీ సభ్యత్వ నమోదును నిర్వహిస్తామని తెలిపారు. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో యూపీలో ఏ విధంగా అయితే సమాజ్‌వాదీ విజయం సాధించిందో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే తరహా ఫలితాలు రాబట్టి యూపీలో అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. -
Property Tax: ఇక నెలవారీగా ఆస్తి పన్ను చెల్లింపులు..!
సాక్షి, సిటీబ్యూరో: ఆస్తి పన్ను సంవత్సరంలో రెండు దఫాలుగా ఆర్నెల్లకోసారి చెల్లించే విధానం ప్రస్తుతం అమల్లో ఉంది. ఇకనుంచి అలా కాకుండా ఏకమొత్తంలో ఆర్థిక సంవత్సరం మొదటి నెలలోనే చెల్లించేవారికి ‘ఎర్లీబర్డ్’ ద్వారా అయిదు శాతం రాయితీ సదుపాయం ఉంది. ఆస్తిపన్ను ఏడాదికో, ఆర్నెల్లకో కాకుండా కరెంటు బిల్లు మాదిరిగానే నెలనెలా చెల్లిస్తే తమకు సదుపాయంగా, పెద్ద భారంగా కనిపించకుండా ఉంటుందని భావిస్తున్నవారూ ఉన్నారు. అలాంటి వారికి సదుపాయంగా ఆస్తిపన్నును సైతం నెలనెలా చెల్లించే విధానాన్ని ప్రభుత్వం త్వరలో అందుబాటులోకి తేనుంది. అంతేకాదు.. ఆస్తిపన్ను, కరెంటు, నల్లా బిల్లులు వేర్వేరు పర్యాయాలు వేర్వేరు సంస్థలకు చెల్లించనవసరం లేకుండా ఒకే విండో ద్వారా, ఏకకాలంలో అన్ని పనులు నెలవారీగా చెల్లించే సదుపాయం కలి్పంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇంటింటి నుంచి చెత్త సేకరించే వారికి చెల్లించే మొత్తాన్ని కూడా వాటితో పాటే చెల్లించే సదుపాయం అందుబాటులోకి తేవాలనుకుంటోంది. సీఎం ఆలోచనతో.. 👉 గ్రేటర్ పరిధిలో ప్రస్తుతమున్న పన్నుల విధానాన్ని సరళీకృతం చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. సిటీలో ప్రస్తుతం ఆస్తి పన్నులను జీహెచ్ఎంసీ, నల్లా బిల్లులను హైదరాబాద్ జలమండలి వసూలు చేస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని నివాసాలకు నెలకు 20 వేల లీటర్ల వరకు తాగు నీటిని ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తోంది. అంతకు మించి నీటిని వాడుతున్న అపార్ట్మెంట్ల నుంచి మాత్రమే నల్లా బిల్లులను జలమండలి వసూలు చేస్తోంది. జీహెచ్ఎంసీ ఆస్తి పన్ను ఆర్నెల్లకోసారి చెల్లించే సదుపాయం ఉండగా, జలమండలి నల్లా బిల్లులను నెలకోసారి జారీ చేస్తోంది. ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించేందుకు కొన్ని ప్రాంతాల్లో నామమాత్రంగా రూ.50 వసూలు చేస్తున్నారు. ఈ బిల్లుల చెల్లింపు వినియోగదారులకు మరింత వెసులుబాటుగా ఉండేలా కొత్త విధానం ఉండాలనే తలంపులో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారు. ఇటీవల అధికారులతో చర్చల సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. 👉 డిస్కంలు ప్రతి నెలా కరెంట్ బిల్లు పద్ధతి ప్రకా రం జారీ చేస్తున్నాయి. గడువు తేదీలోగా చెల్లించే విధానం అనుసరిస్తున్నాయి. యూపీఐ ద్వారా ఆన్లైన్లోనే ప్రతి నెలా కరెంట్ బిల్లు చెల్లించే సదుపాయం అందుబాటు లో ఉంది. దీంతో వినియోగదారులు క్రమం తప్పకుండా బిల్లులు చెల్లిస్తున్నారు. ఇదే తరహాలో ఆస్తి పన్ను, నల్లా బిల్లు, చెత్త సేకరణ బిల్లు కూడా నెల వారీగా జారీ చేసే లా కొత్త విధానం పై అధికారులు కసరత్తు చేస్తున్నారు. అలా చేయడంవల్ల ఒకేసారి ప్రజలపై ఎక్కువ ఆర్థిక భారం పడకుండా ఉంటుందని, సులభ వాయిదాల పద్ధతిలో బిల్లులు చెల్లించినట్లు ఉంటుందని వచ్చిన విజ్ఞప్తులు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న సీఎం నెల నెలా బిల్లుల జారీకి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. యూపీఐతో పాటు అన్ని ఈ పేమెంట్ ప్లాట్ ఫామ్ ల ద్వారా నెల నెలా ఈ బిల్లులు చెల్లించేలా సిటిజన్ ప్రెండ్లీ ఈజీ పేమెంట్ విధానం ఉండాలని సూచించారు.కరెంట్ బిల్లు చెల్లించకుంటే గడువు దాటిన తర్వాత అపరాధ రుసుము విధింపుతో పాటు కరెంటు కట్ చేసేలా చర్యలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. అలాగే కొత్త గా జీహెచ్ఎంసీ, జలమండలి అనుసరించే విధానంలోనూ ఆస్తి పన్ను, నల్లా బిల్లులకు కూడా నిరీ్ణత గడువు ఉండాలని, గడువు దాటితే ఒకదానికొకటి లింక్ ఉండేలా తగిన చర్యలకు అధికారులు కసరత్తు చేయనున్నారు.సక్రమంగా చెల్లించేవారికి ప్రోత్సాహకాలు.. క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించే వారికి ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాంటి వారికి ఆర్థిక సంవత్సరం చివరి నెల బిల్లులో రాయితీలు ఇవ్వాలని, లేదా కాలనీల వారీగా కొందరికి బహుమతులు ఇవ్వాలనే ఆలోచనలున్నాయి. బిల్లుల చెల్లింపుల విషయంలో కచి్చతంగా ఉన్నట్లుగా అంతే బాధ్యతగా మున్సిపల్ సేవలను మహా నగర ప్రజలకు అందించే విషయంలో జవాబుదారీగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు.భారీ బకాయిలకు అడ్డుకట్ట.. నెలనెలా ఆస్తిపన్ను విధానం వల్ల బకాయిలు పేరుకుపోకుండా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం బకాయిలపై నెలకు 2 శాతం చొప్పున పెనాల్టీ విధిస్తుండటంతో చాలామందికి అసలు కంటే పెనాలీ్టల భారం ఎక్కువ కావడంతో చెల్లించడంలేదు. ముఖ్యంగా, వాణిజ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న భవనాల యజమానులు వీరిలో ఎక్కువగా ఉన్నారు. వన్‌టైమ్ సెటిల్మెంట్ల ద్వారా పెనాలీ్టల్లో 90 శాతం రాయితీలిచ్చినప్పటికీ చెల్లించని వారూ ఉన్నారు. నెలనెలా చెల్లించే విధానంతో, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నందున ఆస్తిపన్ను బకాయిలు భారీగా పేరుకుపోకుండా ఉంటాయనే అభిప్రాయాలున్నాయి. -
ఫ్యూచర్ సిటీపై ఆచితూచి
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ శివారులో నాలుగో నగరంగా ఏర్పాటు చేసే ‘ఫ్యూచర్ సిటీ’పై ఆచితూచి అడుగులు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భూసేకరణ సమస్యలు, ఇప్పటికే జరిగిన భూసేకరణపై స్థానిక రైతులు కోర్టును ఆశ్రయించడం తదితరాలు ‘ఫ్యూచర్ సిటీ’ఏర్పాటుపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. ఫార్మాసిటీ ఏర్పాటు కోసం సేకరించిన భూములను ఇతర అవసరాలకు మళ్లిస్తే ఎదురయ్యే న్యాయపరమైన అడ్డంకులపై మల్లగుల్లాలు పడుతోంది. మరోవైపు గతంలో ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం తాజాగా కాలుష్యరహిత ‘గ్రీన్ ఫార్మాసిటీ’ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. భూములు కోల్పోయిన వారిని భాగస్వాములను చేస్తూ పరిసర గ్రామాలకు ఇబ్బంది లేకుండా ముచ్చర్ల ప్రాంతంలో ఇప్పటికే ఎంపిక చేసిన ప్రదేశాల్లో గ్రీన్ ఫార్మాసిటీని అభివృద్ధి చేయాలని సీఎం రెండు రోజుల క్రితం ఆదేశించారు. ఈ నేపథ్యంలో ‘ప్యూచర్ సిటీ’మాస్టర్ ప్లాన్‌లో భారీ మార్పులు చోటుచేసుకొనే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఫార్మాసిటీ ప్రతిపాదన కొనసాగుతున్నదీ లేనిదీ ఈ నెల 20లోగా చెప్పాలని రెవెన్యూ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో ‘ఫ్యూచర్ సిటీ’ఏర్పాటుకు సంబంధించి స్పీడ్ తగ్గించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. హైకోర్టు నిర్ణయాలకు అనుగుణంగా ఫ్యూచర్ సిటీపై ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. మాస్టర్ ప్లాన్ మరింత ఆలస్యం న్యూయార్క్ కంటే ఆధునికంగా రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో ‘ఫ్యూచర్ సిటీ’ని నాలుగో నగరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాలుష్యంలేని ‘నెట్ జీరో కార్బన్ సిటీ’గా తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది. ముచ్చర్లలో గత ప్రభుత్వం ప్రతిపాదించిన ‘హైదరాబాద్ ఫార్మాసిటీ’స్థానంలో ‘ఫ్యూచర్ సిటీ’ఏర్పాటు చేస్తామని వివిధ సందర్భాల్లో సీఎం రేవంత్ ప్రకటనలు చేశారు. ఫ్యూచర్ సిటీని 8 జోన్లుగా విభజించి కృత్రిమ మేథస్సు, లైఫ్‌సైన్సెస్, ఆరోగ్యం, క్రీడలు, ఎలక్ట్రానిక్స్ తయారీ, విద్యాసంస్థలు, వినోద కేంద్రాలు, జనావాసాలు ఏర్పాటు చేసేలా మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ‘హైదరాబాద్ ఫార్మా సిటీ’మాస్టర్ ప్లాన్ రూపొందించిన సింగపూర్ సంస్థ సుర్బానా జురోంగ్కు ఫ్యూచర్ సిటీ మాస్టర్‌ప్లాన్ తయారు చేసే బాధ్యత అప్పగించింది. అయితే ఫ్యూచర్ సిటీ ఏర్పాటుపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్న నేపథ్యంలో మాస్టర్ ప్లాన్ రూపకల్పన ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఫార్మాసిటీ స్థానంలో ఫార్మా క్లస్టర్లు ఔషధ ఉత్పత్తి రంగంలో హైదరాబాద్‌ను అగ్రస్థానంలో నిలిపేందుకు రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల ప్రాంతంలో 19,333 ఎకరాల్లో ‘హైదరాబాద్ ఫార్మా సిటీ’ఏర్పాటు చేస్తున్నట్లు గత ప్రభుత్వం ప్రకటించింది. సుమారు 13 వేల ఎకరాలకుపైగా భూమిని కూడా సేకరించింది. 2019లో హైదరాబాద్ ఫార్మాసిటీకి కేంద్ర ప్రభుత్వం ‘నిమ్జ్’హోదాను ప్రకటించింది. ఫార్మాసిటీ ఏర్పాటుకు సంబంధించిన మాస్టర్‌ప్లాన్ కూడా గత ప్రభుత్వం సిద్ధం చేసింది. అయితే నిధుల లేమితో ఈ ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదు. ప్రభుత్వ మార్పుతో.. గతేడాది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీర్ఘకాల పర్యావరణ సమస్యలు, రైతుల అభ్యంతరాలు, భూసేకరణ వివాదాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఫార్మాసిటీకి బదులుగా వెయ్యి నుంచి రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో రాష్ట్రవ్యాప్తంగా పది చోట్ల ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో ‘ఫ్యూచర్ సిటీ’నిర్మిస్తామని ప్రకటించింది. ఫ్యూచర్ సిటీలో భాగంగా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో ఆగస్టు 1న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి సీఎం శంకుస్థాపన చేశారు. దీంతోపాటు ఏఐ సిటీ, బీసీసీఐ సహకారంతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వంటి వాటిపై ఇప్పటికే ప్రకటనలు కూడా చేశారు. ప్రస్తుతం ముచ్చర్ల గ్రీన్ ఫార్మాసిటీ పనులు వేగవంతం చేయాలనే ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో ఫ్యూచర్ సిటీ విషయంలో ప్రభుత్వం అనుసరించబోయే వైఖరిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
హైడ్రా ఎన్ఓసీ ఇస్తేనే నిర్మాణాలు!
సాక్షి, హైదరాబాద్: భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియలో హైడ్రా కూడా భాగస్వామ్యం కానుంది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్ఓసీ) ఉంటేనే నిర్మాణ అనుమతులు జారీ చేయనున్నారు. చెరువులు, నాలాలకు సమీపంలో నిర్మించే నివాస, వాణిజ్య సముదాయాలకు హైడ్రా ఎన్ఓసీ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. ఒకవేళ అక్రమంగా నిర్మాణాలు చేపడితే ఆయా భవనాలకు ఇంటి నంబరు, నల్లా, విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయరు. ఈ మేరకు భవన నిర్మాణ నిబంధనల చట్ట సవరణపై పురపాలకశాఖ కసరత్తు చేస్తోంది. ఇది అమలులోకి వస్తే గ్రేటర్ హైదరాబాద్‌లో గృహ కొనుగోలుదారులకు భరోసా కలుగుతుందని స్థిరాస్తి రంగం నిపుణులు చెబుతున్నారు. కొనుగోలుదారుల భరోసాకే... దొడ్డిదారిలో అనుమతులు తీసుకొని.. చెరువులను ఆక్రమించిన భవన నిర్మాణాలను హైడ్రా కూల్చుతోంది. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షిస్తూ, జలాశయాలను కాపాడాలన్న ప్రభుత్వ ఉద్దేశం మంచిదే. కానీ.. హైడ్రా పనితీరుతో స్థిరాస్తి కొనుగోలుదారుల్లో గందరగోళం నెలకొంది. ఏ ప్రాజెక్ట్ సరైనదో తెలియక సందిగ్ధంలో పడిపోయారు. దీంతో గృహ కొనుగోళ్లు తగ్గడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. ఈ నేపథ్యంలో కొనుగోలుదారులకు భరోసా కలిగించేందుకు నిర్మాణ అనుమతుల జారీలో హైడ్రాను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. గతంలో రెరా తీసుకొచ్చిందీ ఇలాగే.. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ (రెరా) కంటే ముందు డెవలపర్లు నిర్మాణ అనుమతులు రాకముందే అబద్ధపు హామీలతో ముందుగానే విక్రయించేవారు. తీరా న్యాయపరమైన చిక్కులతో సంబంధిత ప్రాజెక్ట్‌కు అనుమతులు మంజూరు కాకపోవడంతో కస్టమర్లు రోడ్డున పడేవారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో కొనుగోలుదారులకు భరోసా కల్పించేందుకు కేంద్రం రెరాను అమలులోకి తీసుకొచ్చింది. దీంతో స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు భద్రత, పారదర్శకత, నిర్మాణంలో నాణ్యత పెరిగాయి. నిర్మాణ అనుమతులతోపాటు రెరా ఆమోదం పొందిన ప్రాజెక్టులలో కొనుగోళ్లకే కస్టమర్లు మొగ్గు చూపిస్తున్నారు. ఇదే తరహాలో ఇప్పుడు భవన నిర్మాణాలకు ఎలాగైతే రెవెన్యూ, ఇరిగేషన్, ఫైర్, ఎని్వరాన్‌మెంట్ వంటి పలు శాఖల ఎన్ఓసీ తప్పనిసరో...అలాగే హైడ్రా అనుమతి కూడా కావాల్సిందే. కేవైసీ లాగే కేవైఎల్ చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు ఏర్పాటైన హైడ్రా కూల్చివేతలతో ఇబ్బందులు ఎదురవుతున్నా.. దీర్ఘకాలంలో మాత్రం ప్రయోజనం చేకూరుతుంది. వరదలు, నీటికొరత, భూగర్భ జలాల తగ్గుదల వంటి ఇబ్బందులు తలెత్తవు. భావితరాలకు సమృద్ధిగా జల వనరులు, ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. బ్యాంక్‌లు, బీమా సంస్థలు ఎలాగైతే ‘నో యువర్ కస్టమర్’(కేవైసీ) నిర్థారించిన తర్వాతే సేవలు అందిస్తాయో.. అచ్చం అలాగే గృహ కొనుగోలుదారులు ‘నో యువర్ లొకాలిటీ’(కేవైఎల్) ఆయా ప్రాంతం గురించి తెలుసుకున్న తర్వాతే కొనుగోలు నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కస్టమర్లకు నమ్మకం కలుగుతుంది ప్రస్తుతం గృహ కొనుగోలుదారుల్లో నెలకొన్న గందరగోళానికి హైడ్రా ఎన్ఓసీ చక్కని పరిష్కారం. దీంతో భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోననే భయం కస్టమర్లలో తొలగిపోతుంది. రియల్టీ రంగంపై విశ్వాసం పెరిగి, మార్కెట్ తిరిగి పుంజుకుంటుంది. – నరేంద్రకుమార్, ప్రణీత్ గ్రూప్ డైరెక్టర్ సింగిల్ విండో తీసుకురావాలి ఇప్పటికే పలు విభాగాల నుంచి ఎన్ఓసీలు తీసుకురావాలంటే 6–9 నెలల సమయం పడుతుంది. కొత్తగా హైడ్రా ఎన్ఓసీ అంటే ఏడాది సమయం పడుతుంది. దీంతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జరగదు. అందుకే సింగిల్‌విండో ద్వారా అన్ని విభాగాల ఎన్ఓసీలు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలి. – పోశం నర్సిరెడ్డి, ఐరా రియాల్టీ ఎండీ -
‘దుర్గం చెరువు’ దోషులు అధికారులే!
సాక్షి, హైదరాబాద్/గచ్చిబౌలి: ‘‘హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హుడా) అనుమతులు ఇచ్చిందంటే ప్రభుత్వం ఇచ్చినట్టే కదా! నీటి పారుదల శాఖ ఇచ్చిన నిరభ్యంతర పత్రాల(ఎన్వోసీ) మేరకే ఇళ్లు, భవనాలు నిర్మించాం. 30 ఏళ్లు దాటింది. ఇప్పుడు ఏకంగా 204 నిర్మాణాలు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయంటూ నోటీసులు ఇచ్చారు. ఇక్కడ దోషులెవరు? ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో ఈ లేఅవుట్లు ఉన్నట్టు అప్పుడే నిర్ధారిస్తే.. ఇప్పుడు కూల్చివేతలు ఉండేవి కాదు కదా’’.. .. దుర్గం చెరువు సమీపంలోని నెక్టార్ గార్డెన్‌కు చెందిన ఓ ఇంటి యజమాని ఆందోళన ఇది. ఆయనే కాదు.. గత 30 ఏళ్లుగా అక్కడ నివాసం ఉంటున్న చాలా మంది తమ ఇళ్లు, భవనాలు చెరువు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో ఉన్నాయంటూ నోటీసులు ఇవ్వడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క దుర్గం చెరువు ప్రాంతంలోనే కాదు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, నాలాలను ఆనుకొని నిర్మించిన విల్లాలు, అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాలకు ఇరిగేషన్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, తదితర ప్రభుత్వ విభాగాలు అనుమతులు ఇచ్చాయి. ఇప్పుడేమో అధికారులు ఆ ఇళ్లు ఎఫ్టీఎల్ పరిధిలో, బఫర్‌జోన్‌లో ఉన్నట్టు నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది. నోటీసులు ఇచ్చిన తహసీల్దార్ దుర్గం చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఇళ్లు నిర్మించారంటూ.. శేరిలింగంపల్లి తహసీల్దార్ వెంకారెడ్డి ఈ నెల 5న వాల్టా చట్టం కింద అమర్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, కావూరిహిల్స్, నెక్టార్ గార్డెన్లలో ఉన్న 204 నిర్మాణాలకు నోటీసులు ఇచ్చారు. 30 రోజుల్లో నిర్మాణాలను తొలగించుకోవాలని పేర్కొన్నారు. ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చే నిర్మాణాలకు ‘ఎఫ్’అని.. కొంతభాగం ఎఫ్టీఎల్లోకి వస్తే ‘ఎఫ్/పీ’అని.. బఫర్‌జోన్‌లోకి వచ్చే నిర్మాణాలపై ‘బీ’అని గోడలపైన రాశారు. రాజకీయ, సినీ ప్రముఖులు, ఉన్నతాధికారులు కూడా ఈ నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. ఓ పర్యావరణవేత్తకు చెందిన ఇల్లు కూడా ఉన్నట్టు సమాచారం. అమర్ సొసైటీలో సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు కూడా ఉంది. ఎకరా రూ.వంద కోట్లపైనే..! దుర్గం చెరువు ప్రాంతంలో ఆక్రమణకు గురైన భూముల ప్రస్తుత మార్కెట్ విలువ ఎకరానికి రూ.వంద కోట్లపైనే ఉంటుందని అంచనా. చదరపు గజం విలువే రూ.2 లక్షలపైన ఉంటుంది. హైటెక్‌సిటీని ఆనుకొని ఉన్న దుర్గం చెరువు ప్రాంతం రియల్టర్లకు, బిల్డర్లకు హాట్‌కేక్‌లా మారింది. దాంతో రెండు, మూడు దశాబ్దాల క్రితం నుంచే కబ్జాల పర్వం మొదలైంది. ఈ అక్రమ నిర్మాణాలకు అందరూ బాధ్యులే. అప్పటి ప్రభుత్వ పెద్దలు, రాజకీయ ప్రముఖుల నుంచి అక్రమ లేఅవుట్లకు అడ్డగోలుగా అనుమతులిచ్చిన హుడా అధికారులు.. చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు ఆక్రమణకు గురవుతున్నట్టు తెలిసినా ఎన్వోసీలు ఇచ్చిన నీటిపారుదల, రెవెన్యూ అధికారులు కూడా బాధ్యులే. నిజాం కాలంలో నిర్మించిన దుర్గం చెరువు రెండు గుట్టల మధ్య సుమారు 160.7 ఎకరాలకుపైగా విస్తరించి ఉండేది. రాయదుర్గం పాయెగాలో 62ఎకరాలు, మాదాపూర్ సర్వే నం.63, 64లలో 28 ఎకరాలు, గుట్టల బేగంపేట్ సర్వే నంబర్లు 42 నుంచి 61 వరకు 70.7 ఎకరాల విస్తీర్ణంలో దుర్గంచెరువు ఉండేది.హుడా ఆమోదంతో నిర్మాణాలు.. ఈ ప్రాంతంలో 1991లో మొదట అమర్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సోసైటీ 15 ఎకరాల విస్తీర్ణంలో 150 ప్లాట్లతో లేఅవుట్ చేసింది. అయితే చెరువు చుట్టూ 30 అడుగుల పరిధిలో స్థలాన్ని గ్రీన్‌బెల్ట్ కోసం కేటాయించిన హుడా.. 130 ప్లాట్లకు 1995లో తుది ఆమోదం ఇచ్చింది. ఈ క్రమంలోనే వరుసగా కావూరి హిల్స్, నెక్టార్ గార్డెన్ గేటెడ్ కమ్యూనిటీలకు కూడా హుడా ఆమోదం లభించింది. నెక్టార్ గార్డెన్ పూర్తిగా, కావూరి హిల్స్‌లోని కొంత భాగం దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఉంది. గతంలో భారీ వర్షాలు వచ్చినప్పుడు కావూరి హిల్స్, నెక్టార్ గార్డెన్, అమర్ సొసైటీలలోకి వరద నీరు చేరేది. దీనితో దుర్గంచెరువు పూర్తిగా నిండకుండా, ఎప్పటికప్పుడు నీటిని కిందికి వదిలేస్తూ.. ఎఫ్‌టీఎల్‌పై ఫోకస్ పడకుండా చేశారు. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఒత్తిడి తీసుకొచ్చి వర్షాకాలంలో దుర్గం చెరువు గేట్లు మూసివేయ కుండా చూసుకుంటూ వస్తున్నారు. అయితే చెరువు సుందరీకరణ పేరిట చుట్టూ వాకింగ్ ట్రాక్ వేయడంతో.. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వారికి అదో రక్షణ గోడగా మారిపోయింది.అధికారులు ఏమంటున్నారు? 2013లో సుమారు 160.7 ఎకరాల్లో దుర్గం చెరువు విస్తీర్ణాన్ని గుర్తిస్తూ ఎఫ్టీఎల్ను నిర్ధారించామని ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. నీటిపారుదల, రెవెన్యూ శాఖల నుంచి వచ్చిన ఎన్వోసీల మేరకు అనుమతులను ఇచ్చినట్లు హెచ్ఎండీఏ అధికారులు అంటున్నారు. ఇక ‘‘ప్రభుత్వం ఆమోదించిన మాస్టర్ ప్లాన్‌ను పరిగణనలోకి తీసుకుంటాం. చాలా చోట్ల కాలువలను పూర్తిగా మూసివేయడం వల్ల బ్యాక్ వాటర్ వచ్చి చేరుతుంది. దీంతో ఎఫ్టీఎల్ నిర్ధారణలో శాస్త్రీయత లోపిస్తోంది’’అని హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగానికి చెందిన అధికారి ఒకరు పేర్కొనడం గమనార్హం.అక్రమమైతే కూల్చేయండి.. వాల్టా చట్టం రాకముందే 1995లో లేఅవుట్‌కు ఆమో దం లభించింది. హుడా అనుమతితోనే ఇళ్లు నిర్మించారు. 2016లో 600 చదరపు గజాల స్థలంలో ఇల్లు కొనుగోలు చేశాం. ఈ ప్రాంతం చెరువు పరిధిలోకి వస్తుందన్న సమాచారమేదీ లేదు. ఇప్పుడు బఫర్ జోన్లోకి వస్తుందంటూ అధికారులు నోటీసులు ఇచ్చారు. అక్రమ మైతే కూల్చేయండి, ముఖ్యమంత్రి నా ఒక్కడి కోసం పనిచేయడం లేదు కదా! బీఆర్ఎస్ నాయకులు నా ఇంటి విషయంలో రాజకీయం చేస్తున్నారు. – సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డిభయభ్రాంతులకు గురిచేయొద్దు 1995లో హుడా అనుమతి ఇవ్వడంతోనే ప్లాట్లు కొనుగోలు చేసి ఇ ళ్లు కట్టుకున్నాం. ఇప్పటికీ ఈఎంఐలు కట్టేవారు ఉన్నారు. 2023 లో జీహెచ్ఎంసీ హైపవర్ కమిటీ ఈ ప్రాంతం ఎఫ్టీఎల్లోకి రాదని తేల్చింది. ప్రభుత్వాలు మారితే ఎఫ్టీఎల్ మారుతుందా? – అమర్ కో–ఆపరేటివ్ సొసైటీ ప్రధాన కార్యదర్శి గోపాల కృష్ణారెడ్డిఇళ్లు కట్టాలంటే ఏ అనుమతులు ఉండాలిగ్రీన్బెల్ట్ను వదిలి అమర్ సొసైటీ లేఅవుట్‌కు హుడా అధికారులు ఆమోదం తెలిపారు. అనుమతి ఉన్న లేఅవుట్లో ప్లాట్ తీసుకొని, ఇంటి నిర్మాణం కోసం జీహెచ్ఎంసీ అనుమతి తీసుకున్నాం. హైదరాబాద్‌లో ఇళ్లు కట్టుకోవాలంటే ఇంకా ఏమేం అనుమతులు తీసుకోవాలో చెప్పండి. – పోలవరపు శ్రీనివాస్, అమర్ సొసైటీ వాసి -
రాంగ్‌సైడ్‌లో వెళ్తే లైసెన్స్ రద్దు!
సాక్షి, హైదరాబాద్: ఒకరు కాదు ఇద్దరు కాదు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏటా వందల సంఖ్యలో రాంగ్ సైడ్ డ్రైవింగ్, అతివేగం కారణంగా మృత్యువాత పడుతున్నారు. ఆయా ప్రమాదాలలో వాహనదారులే కాదు పాదచారులు, తోటి ప్రయాణికులు సైతం మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్) రద్దయ్యేలా చేస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపరిచేటప్పుడు.. అభియోగపత్రాల్లో మందుబాబుల వ్యవహార శైలి, మద్యం మత్తులో చేసిన ప్రమాదాల వివరాలను నమోదు చేస్తున్నారు. న్యాయస్థానాలు వారికి రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకూ జరిమానాలు విధించడంతో పాటు కొందరికి 3 నెలల నుంచి 6 నెలల వరకు లైసెన్స్‌లు రద్దు చేస్తున్నాయి. తాజాగా అపసవ్య దిశలో (రాంగ్ సైడ్) వాహనాలు నడపడం, అతివేగం కారణంగా సంభవిస్తున్న రోడ్డు ప్రమాదాలు, మరణాలను తగ్గించడం లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారి డ్రైవింగ్ లైసెన్స్‌లు కూడా రద్దయ్యేలా అభియోగ పత్రాలు దాఖలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రవాణా శాఖకు ప్రతిపాదనలు పంపించినట్లు, త్వరలోనే గ్రేటర్లో అమల్లోకి రానున్నట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. హైవేలపై ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు: జాతీయ రహదారులపై పాదచారులు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. దీంతో హైవేలపై ప్రజలు రోడ్డు దాటేందుకు వీలుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే రాచకొండ కమిషనరేట్ పరిధిలో 103 బ్లాక్స్పాట్లు (ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రదేశాలు) ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. వీటి మరమ్మతులు, నిర్వహణపై జీహెచ్ఎంసీ, ఆర్అండ్బీ, ఇతరత్రా విభాగాలతో జరిగిన సమావేశంలో చర్చించారు. రోడ్డు మధ్యలో డివైడర్ల ఎత్తును పెంచడంతో పాటు వీధి దీపాలను ఏర్పాటు చేసేలా చూడాలని నిర్ణయించారు. మరోవైపు ప్రమాదాలకు ప్రధాన కారణాలను కూడా పోలీసులు గుర్తించారు.ప్రమాదాలకు ప్రధాన కారణాలు» జాతీయ రహదారులపై డ్రైవర్లు 15–18 గంటల పాటు ఏకధాటిగా డ్రైవింగ్ చేయడం. » హైవేలపై లైనింగ్ నిబంధన పాటించకపోవడం. ఇతర వాహనాలను ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించడం. » రాత్రివేళ సరైన నిద్రలేకపోవడం, మద్యం తాగి వాహనాలు నడపడం. » హైవేలపై కేటాయించిన స్థలంలో కాకుండా రోడ్డు మధ్యలో వాహనాలను నిలపడం. » పాదచారులు జాతీయ రహదారులపై లైట్లు లేని ప్రాంతంలో రోడ్లను దాటుతుండటం.భవిష్యత్తు అంధకారమే.. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి వాహనాలు నడపడంతో పాటు ఇతరుల మరణానికి కారణం అయితే చేజేతులా భవిష్యత్తును అంధకారం చేసుకున్నట్లే. మోటార్ వాహన చట్టం (ఎంవీ) కేసులలో పోలీసులు న్యాయస్థానాల్లో సమర్పిస్తున్న అభియోగపత్రాల ఆధారంగానే ఉల్లంఘనల విషయంలో చర్యలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో జైలుకు వెళ్లాల్సి వస్తే ఉన్న ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఉద్యోగ అవకాశాల సమయంలో విద్యార్థులు, యువకులను ఈ కేసులు ఇబ్బంది పెడతాయి. – వి.శ్రీనివాసులు, డీసీపీ, ట్రాఫిక్, రాచకొండ -
రోజంతా ముంచెత్తిన వాన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిశాయి. అయితే తెల్లవారు జామునుంచే గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమై చెరువులను తలపించాయి. ఫలితంగా ఆయా రహదారుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాలు కురుస్తాయనే ముందస్తు సమాచారంతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాల్లోని కొన్ని పాఠశాలల యాజమాన్యాలు ముందస్తుగా సెలవు ప్రకటించాయి. హైదరాబాద్ సమీప జిల్లాలతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలు సైతం నమోదయ్యాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు లోటు వర్షపాతంలో ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు సమీప జిల్లాలకు ఈ వర్షంతో భారీ ఊరట దక్కింది. రాష్ట్రంలో 2.2 సెంటీమీటర్ల సగటు వర్షపాతం...ఉత్తర ప్రాంత జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవగా, దక్షిణ ప్రాంత జిల్లాల్లో ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ క్రమంలో మంగళవారం ఒక్కరోజే రాష్ట్రంలో 2.2 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 7.31 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాల సీజన్లో ఇప్పటివరకు రాష్ట్రంలో 50.6 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, మంగళవారం నాటికి 58.27 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 15శాతం అధికంగా వానలు కురిసినట్టు ప్రణాళిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం రానున్న రెండు రోజులు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుంలాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు, ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది.– భారీ వర్షాలతో హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఇళ్లలోకి వరద నీరు చేరింది. ముషీరాబాద్ పార్శిగుట్టకు చెందిన విజయ్‌కుమార్(43) వరద నీటిలో కొట్టుకుపోయి మృతి చెందారు. కారులు, బైకులు కూడా కొట్టుకొని పోయాయి. ఒక అపార్ట్‌మెంట్‌పై పిడుగు పడి కొద్దిమేర ధ్వంసమై బీటల వారింది.పలు ప్రాంతాల్లో గోడలు కూలి వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎగువ ప్రాంతాల నుంచి మూసీకి వరద పోటెత్తోంది. దీంతో మూసారాంబాగ్ వద్ద ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలకు హుస్సేన్‌సాగర్ నిండుకుండలా మారింది. దీంతో దిగువకు నీటిని విడుదల చేశారు. మూసీ పరీవాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జంటజలాశయాల్లో సైతం భారీ వరద నీరు వచ్చి చేరింది.– ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని వంద పడకల ఆస్పత్రి భవన ప్రాంగణం జలమయమైంది. ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద రెండు అడుగుల వరద నీరు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లాయి. గద్వాల జిల్లా అయిజ మండలంలో ఓ అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది. – రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో వాగులు, వంకలు ఉరకలెత్తాయి. లోతట్లు ప్రాంతాలు, కాలనీలు జలమయమయ్యాయి. కడ్తాల్ మండలం మేడికుంట చెరువుకు గండి పడి, నీరంతా వృథాగా పోయింది. -
‘ఫోర్త్ సిటీ’ కోసం ప్రత్యేక అథారిటీ!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ శివారులోని ముచ్చర్ల కేంద్రంగా అభివృద్ధి చేయనున్న ‘ఫోర్త్ సిటీ’కోసం ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆ ప్రాంతాన్ని అన్ని వర్గాలకు అనువుగా ఉండే ఫ్యూచర్ సిటీ మాదిరి నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ప్రక్రియలో వివిధ విభాగాల మధ్య సమన్వయంతోపాటు ప్రభుత్వ ఆలోచనల అమలును పర్యవేక్షించేలా అథారిటీ పనిచేయనుంది. ఈ అథారిటీకి సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వం వహించనున్నారని తెలిసింది. ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ప్రభుత్వం... హైదరాబాద్ మహానగరంలో ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. ఫోర్త్ సిటీ అభివృద్ధిని ప్రణాళికాబద్ధంగా చేయాలని నిర్ణయించింది. దీనికోసం ఏర్పాటు చేయనున్న అథారిటీ సైబరాబాద్‌లోని ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్‌తోపాటు దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో ఉన్న నేషనల్ క్యాపిటల్ రీజియన్, గ్రేటర్ నోయిడా సహా మరికొన్ని సంస్థల పనితీరును అధ్యయనం చేయనుంది. ఆయా విభాగాల ఏర్పాటు తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు, తలెత్తిన ఇబ్బందులు, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగనుంది. సింగిల్ విండో విధానం ఉండేలా... కొత్తగా ఏర్పాటవుతున్న నగరం కావడంతో పారిశ్రామిక, పర్యాటక, ఆతిథ్య రంగాలకు కీలక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం కొన్ని జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు సైతం జరుపుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక అథారిటీ అదీనంలో పని చేయడానికి రెవెన్యూ, పట్టణాభివృద్ధి తదితర విభాగాల సిబ్బందిని తీసుకురానున్నారని తెలిసింది. దీనివల్ల భూములు సమీకరణ, కేటాయింపు, అనుమతుల మంజూరు, మౌలిక వసతుల అభివృద్ధి.. ఇలా ప్రతి అంశంలోనూ సింగిల్ విండో విధానం అమలు చేయడం ద్వారా పెట్టుబడిదారులను ప్రోత్సహించినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. సుదీర్ఘకాలం సజావుగా సాగేలా... ‘గ్రేటర్’పరిధిలో రోడ్డు, డ్రైనేజీ, ఫుట్‌పాత్‌ల వంటి విషయాల్లో అనేక ఇబ్బందులు వస్తున్నాయి. పాత నగరం, ఏళ్ల క్రితమే అభివృద్ధి చెందిన కొత్త నగరంలోనే కాదు.. గత కొన్నేళ్లుగా కొత్త హంగులు సంతరించుకుంటున్న ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్‌తోపాటు పశి్చమ ప్రాంతంలోనూ సమస్యలు తప్పట్లేదు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా సమకాలీన అంశాలనే పరిగణనలోకి తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ సైతం రూపొందించాలని యోచిస్తోంది. కనిష్టంగా రానున్న 50 ఏళ్ల అవసరాలకు తగ్గట్లు మౌలిక వసతులు ఉండేలా చర్యలు తీసుకోనుంది. దీనికోసం అవసరమైతే ప్రత్యేక అ«థారిటీతో అభివృద్ధి చెందిన దేశాల్లోనూ అధ్యయనం చేయించే అవకాశం ఉంది. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు... త్వరలో జరగబోయే కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు ఉండనున్నాయని తెలిసింది. ఫ్యూచర్ సిటీ కోసం ప్రత్యేక అథారిటీ సహా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) సిబ్బంది, చట్టబద్ధతపైనా నిర్ణయాలు ఉండనున్నాయి. ప్రస్తుతానికి హైడ్రాను కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌గా పిలిచే జీవోతో ఏర్పాటు చేశారు. దీనికి పూర్తిస్థాయి చట్టబద్ధత లభించాలంటే చట్టం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం మంత్రివర్గ సమావేశంలో విధాన నిర్ణయం తీసుకోనుంది. దీని ఆమోదం తర్వాత ముసాయిదా బిల్లు రూపొందించి అసెంబ్లీ సమావేశాలు ప్రొరోగ్ అయ్యాక ఆర్డినెన్స్ జారీ చేయనుంది. వచ్చే శాసనసభ సమావేశాల్లో హైడ్రా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. హైడ్రాలోకి నేరుగా నియమించుకొనే, డిప్యుటేషన్‌పై తీసుకొనే సిబ్బందిపైనా కేబినెట్లో నిర్ణయం ఉండనుందని సమాచారం. -
లేక్‌లు లేఔట్లపాలు
సాక్షి, హైదరాబాద్: ఒకనాడు నిండుగా చెరువులతో, వాటి పక్కన తోటలతో కళకళలాడిన నగరం హైదరాబాద్.. కానీ నాటి చెరువులు కుంటలు అయిపోతే.. కుంటలన్నీ బస్తీలుగా మారిపోయాయి. చెరువు కనిపిస్తే చెరపట్టడమే లక్ష్యంగా చెలరేగిపోయిన కబ్జాదారులతో ఎక్కడికక్కడ భారీ నిర్మాణాలు వెలిశాయి. దశాబ్దాలుగా ఈ తతంగం జరుగుతున్నా ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల కమీషన్ల కక్కుర్తితో.. వందల కొద్దీ చెరువులు నామరూపాలు లేకుండా పోయాయి. పెద్ద పెద్ద కాలనీలను చూపించి.. ఒకప్పుడు ఇక్కడ పెద్ద చెరువు ఉండేదని చెప్పుకునే రోజులు వచ్చాయి. గత 45 ఏళ్లలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 61 శాతం చెరువులు మాయమైపోయినట్టు ‘నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)’ తేల్చింది. దీనికి సంబంధించి ఇటీవల ‘హైదరాబాద్ విపత్తు స్పందన, ఆస్తుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (హైడ్రా)’కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. దీనిపై స్పందించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్జోన్ల పరిధిలో ఉన్న నిర్మాణాల తొలగింపుపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. అనేక ప్రాంతాలకు అవే గుర్తింపు హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల పేర్లలో బాగ్, తలాబ్, కుంట, కట్ట వంటి పదాలు ఉంటాయి. అవన్నీ నగరంలో చెరువులు, కుంటలు, తోటలు ఉన్న ప్రాంతాలే. దానికితోడు పెద్ద పెద్ద చెరువులూ ఎన్నో ఉండేవి. రియల్ఎస్టేట్ బూమ్‌తో కబ్జాలు, ఆక్రమణలతో పరిస్థితులు మారిపోయాయి. చెరువుల శిఖం భూములతోపాటు తూములు,అలుగులు, నాలాలపై అడ్డగోలుగా నిర్మాణాలు వచ్చి చేరాయి. ఈ క్రమంలో 1979, 2024 మధ్య హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో చెరువుల పరిస్థితిపై అధ్యయనం చేసిన ఎన్ఆర్ఎస్సీ.. పెద్ద సంఖ్యలో చెరువులు మాయమైనట్టు తేల్చింది. బుధవారం ఎన్ఆర్ఎస్సీలో జరిగిన సమావే«శంలో ఈ వివరాలను వెల్లడించింది. ఉదాహరణకు శాతం చెరువు విస్తీర్ణం గతంలో 70 ఎకరాలుకాగా.. ఇప్పుడు మిగిలింది పదెకరాలే. ఎల్బీనగర్ కప్రాయి చెరువు 71 ఎకరాలకుగాను 18 ఎకరాలే మిగిలింది. హెచ్ఎండీఏ యంత్రాంగం నిర్లక్ష్యంతో.. ఇటీవలి వరకు గ్రేటర్లో చెరువుల బాధ్యతలను హైదరాబాద్ మహా నగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పర్యవేక్షించింది. దీని పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 1,728 చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల పూర్తి నీటి మట్టం (ఎఫ్టీఎల్), బఫర్ జోన్ హద్దులను నిర్ధారించడంలో దశాబ్దాలుగా నిర్లక్ష్యం చూపారు. కేవలం 200 చెరువుల హద్దులను మాత్రమే నోటిఫై చేశారు. ఈ కారణంగానే కబ్జాల పర్వం యథేచ్చగా కొనసాగింది. 472 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఫాక్స్‌సాగర్‌లో.. ఇప్పటివరకు 120 ఎకరాలు ఆక్రమణల పాలయ్యాయి. ఈ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే రసాయన గోదాములు, భారీ నిర్మాణాలు వెలిశాయి. 2003లో అప్పటి ప్రభుత్వం చెరువు భూముల్లోనే 11 ఎకరాల్లో పేదలకు పట్టాలివ్వడం గమనార్హం. ఇక మూసాపేట మైసమ్మ చెరువు భూముల్లో ఏకంగా ఆకాశ హరŠామ్యలే వెలిశాయి. శేరిలింగంపల్లిలోని దేవునికుంట, సున్నం చెరువు, మంగలి కుంటలు దాదాపు కనుమరుగయ్యాయి. ఒకప్పుడు గోల్కొండ రాజులకు మంచినీరు అందించిన దుర్గం చెరువు చిక్కిపోయింది. దీని 125 ఎకరాల విస్తీర్ణంలో 25 ఎకరాల మేర గార్డెన్స్ వెలిశాయి. నేతలు, రియల్టర్లు, అధికారులు కుమ్మక్కై చెరువులు, కుంటలు కబ్జా చేసి నిర్మించిన, నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలు, లేఔట్ల వెనుక రాజకీయ నాయకులు, రియల్టర్లు ఉంటున్నారు. కొందరు రాజకీయ నాయకులు బినామీ పేర్లతో చెరువుల్లో వెంచర్లు, లేఔట్లు వేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దానికి కొందరు అధికారుల కక్కుర్తి తోడుకావడంతో అక్రమాలు విచ్చలవిడిగా కొనసాగాయి. కొన్ని సందర్భాల్లో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు అక్రమ నిర్మాణాలను గుర్తించి, హడావుడి చేయడం పరిపాటిగా మారిపోయింది. వాటిని పూర్తిగా కూల్చివేయడానికి బదులు నిర్మాణాల పైకప్పు, గోడలకు పెద్ద పెద్ద రంధ్రాలు చేసి వదిలేస్తూ వచ్చారు. నేతలు, రియల్టర్లు తమ పలుకుబడి వినియోగించి తర్వాతి చర్యలు లేకుండా చూసుకుంటున్నారు. భవనాలకు పెట్టిన రంధ్రాలను పూడ్చేసి తమ దందా కొనసాగించేస్తున్నారు. తాజాగా ఎన్ఆర్ఎస్సీ ప్రజెంటేషన్ నేపథ్యంలో ‘హైడ్రా’ డైరెక్టర్ ఏవీ రంగనాథ్ వేగంగా స్పందించారు. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలను పూర్తిగా కూల్చేయాలని అధికారులను ఆదేశించారు. మొదటి దశలో నిర్మాణంలో ఉన్నవాటిని కూల్చాలని, తర్వాత పాత నిర్మాణాలపై ఫోకస్ చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో.. ఎనిమిది భవనాలను (ఐదు అంతస్తులు, అంతకంటే ఎక్కువ ఎత్తయినవి) అధికారులు కూల్చేశారు. రెండు లేఔట్లను ధ్వంసం చేశారు. స్థిరాస్తి కొనుగోళ్లలో జాగ్రత్తలు తీసుకోండి చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఆ భవనాలను కూల్చేయడంతోపాటు వారికి సహకరించిన ప్రభుత్వ అధికారులపైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. శనివారం రెండు ప్రాంతాల్లో నిర్మాణాలను కూల్చివేసి దాదాపు 15 ఎకరాలు స్వాధీనం చేసుకున్నాం. చెరువుల పరిసరాల్లో ఇళ్లు, ఫ్లాట్లు, ప్లాట్లు వంటి స్థిరాస్తులు కొనుగోలు చేసే ముందు అప్రమత్తంగా ఉండాలి. తక్కువ ధరకు వస్తున్నాయని.. తెలుసుకోకుండా ముందుకెళ్తే నష్టపోవాల్సి వస్తుంది. ఎలాంటి సహాయ సహకారాలు కావాల్సి వచ్చినా హైడ్రా కార్యాలయాన్ని సంప్రదించాలి. అక్రమ నిర్మానాలు, కబ్జాలపై సమాచారం ఇవ్వాలి. – ఏవీ రంగనాథ్, హైడ్రా కమిషనర్ -
అర్ధరాత్రి ఒంటి గంట వరకు షాపులు తెరవచ్చు..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో ఇక నుంచి అర్ధరాత్రి 1 గంట వరకూ వాణిజ్య సముదాయాలు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచి్చంది. పోలీసులు బలవంతంగా షాపులు మూసి వేయిస్తున్నారని సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడం, ఇదే అంశంపై అసెంబ్లీలోనూ చర్చ జరగడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో అర్ధరాత్రి ఒంటి గంట వరకూ దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇస్తూ ముఖ్యమంతి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. మద్యం దుకాణాలు మినహా రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు ఇతరత్రా వ్యాపార కేంద్రాలకు ఈ అనుమతి వర్తిస్తుంది. -
Telangana: కరువుతీరా వర్షాలు
సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్: కరువుతీరేలా.. వరుణుడు కరుణించాడు. వానాకాలం ప్రారంభమైన నలభై రోజుల అనంతరం ఒకేసారి రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలోని పలు వాగులు, ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు జలకళను సంతరించుకుంటున్నాయి. పలుచోట్ల పంట పొలాల్లోకి నీరు చేరింది. శనివారం జిల్లాల వారీ గణాంకాలు పరిశీలిస్తే.. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో సగటున 4.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆ తర్వాత ములుగు జిల్లాలో 4.19 సెంటీమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4.0 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో 12.15 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా అంతటా.. ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతటా రెండురోజులుగా వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదు కాగా, ఇంకొన్ని చోట్ల భారీ వర్షం కురిసింది. శనివారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అత్యధికంగా ఖమ్మం ఎన్నెస్పీ గెస్ట్‌హౌస్ ప్రాంతంలో 2.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా ముసురు వాన ఉండడంతో పలుచోట్ల వరి నారుమడులు, పత్తి చేన్లలో వరద నీరు నిలిచింది. పలుచోట్ల చెరువులు నిండి అలుగు పోస్తుండగా అక్కడక్కడా రహదారులు, లోలెవల్ బ్రిడ్జిలపైకి వరద చేరింది. ఉధృతంగా జంపన్న, ముసలమ్మ వాగులు ములుగు జిల్లాలో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో ఏజెన్సీలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఏటూరునాగారం మండలంలోని కొండాయి, ఎలిశెట్టి గ్రామాల సమీపంలో జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మర పడవలను ఏర్పాటు చేశారు. ఎలిశెట్టిపల్లి సమీపంలో జంపన్న వాగు ఉధృతి ఎక్కువ కావడం, దబ్బగట్ల శైలజ, పులిసె అనూష అనే గర్భిణులు పురిటి నొప్పులతో బాధపడుతుండటంతో వారిని పడవల్లో వాగు దాటించి ఆస్పత్రికి తరలించారు. రామన్నగూడెం పుష్కరఘాట్‌కు 6 కిలోమీటర్ల దూరంలో కరకట్ట కోతకు గురవుతుండటంతో ఇరిగేషన్ శాఖ అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. మంగపేట మండలంలోని రాజుపేట ముసలమ్మవాగు వరద ఉధృతికి ఒడ్డు కోతకు గురవుతుండటంతో ఒడ్డు వెంట నివాసం ఉంటున్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాజేడు మండల పరిధిలోని కొప్పుసూరు గుట్టల వద్ద ఉన్న గుండ్లవాగు ప్రాజెక్టు కట్ట ప్రమాదకరంగా ఉండటంతో అధికారులు పరిస్థితిని సమీక్షించారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం పోతుల్వాయి సమీపంలోని బొర్రవాగు, గుండ్రాత్‌పల్లి సమీపంలోని అలుగువాగులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద కాజ్‌వేల పైనుంచి వెళ్తుండడంతో పలు గ్రామాలకు మండలం మీదుగా రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాల్లో పత్తి చేలల్లోకి వరద నీరు చేరింది. బొగ్గు ఉత్పత్తికి అంతరాయం వర్షాలతో మల్హర్ మండలం తాడిచర్ల ఓపెన్‌కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని ఏఎమ్మార్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్‌రెడ్డి, మైన్ మేనేజర్ కేఎస్ఎన్ మూర్తిలు తెలిపారు. వర్షాల కారణంగా 1.30 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ, 6 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు. గోదావరిలో కలెక్టర్, ఎస్పీ బోటు ప్రయాణం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్, పలిమెల మండలాల్లో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరే పర్యటించారు. గోదావరిలో బోటులో ప్రయాణించి వరద ఉధృతిని పరిశీలించారు. అక్కడి నుండి ఛత్తీస్‌గఢ్ సరిహద్దు మారుమూల గ్రామమైన దమ్మూరుకు చేరుకొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉమ్రి–సాంగిడి దారి మూసివేత ఎడతెరిపిలేని వర్షాలతో వరద నీరు పోటెత్తడంతో ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని ఉమ్రి వాగుపై ఉన్న తాత్కాలిక వంతెన తెగిపోయింది. దీంతో ఉమ్రి–సాంగిడి దారిని పోలీసులు మూసి వేశారు. రెండు మండలాల పరిధిలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వాగుపై కొత్త బ్రిడ్జి పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో, తాత్కాలిక వంతెన గుండానే రాకపోకలు కొనసాగుతున్నాయి. 60 గ్రామాలకు నిలిచిన రాకపోకలు మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. జిల్లాలోని ఎల్లంపల్లి, ర్యాలీవాగు, గొల్లవాగు, నీల్వాయి ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో పలు మండలాల్లో 60 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సింగరేణి ప్రాంతాల్లోని శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్, మందమర్రి, బెల్లంపల్లి, కైరిగూడ, డొర్లి ఏరియాల్లోని ఓపెన్ కాస్టుల్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడి రూ.కోట్ల నష్టం వాటిల్లింది. నిర్మల్ జిల్లా కడెం మండలంలో అత్యధికంగా 65.5మి.మీ వర్షపాతం నమోదైంది. ఖానాపూర్ మండలంలోని దిలావర్పూర్ వెళ్లే మార్గంలో రెంకోనివాగుపై వేసిన తాత్కాలిక రోడ్డు వర్షాలకు కొట్టుకుపోయింది. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మూడురోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు జిల్లాలో 13.9 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. సింగరేణి ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇక నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో శనివారం రోజంతా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. కమ్మర్‌పల్లిలో 34.3 మిల్లీమీటర్లు, మెండోరాలో 28.0, నవీపేట్లో 27.5, బాల్కొండలో 24.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పాలమూరులో ముసురు వాన వనపర్తి జిల్లాలో 2.7 సెంటీమీటర్లు, నారాయణపేట జిల్లాలో 2.69, మహబూబ్‌నగర్ జిల్లాలో 2.49, జోగుళాంబ గద్వాల జిల్లాలో 2.04, నాగర్‌కర్నూల్ జిల్లాలో 1.42 సెంమీటర్ల వర్షపాతం నమోదైంది.ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా మహమ్మదాబాద్ మండలంలో 4.9 సెంమీ వర్షపాతం నమోదైంది. కొత్తకోట, జడ్చర్ల, ఆత్మకూరులో ముసురు వర్షానికి తడిసిన మట్టి ఇళ్లు కూలిపోయాయి. వీడని ముసురు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రెండు రోజులుగా ముసురు కొనసాగుతోంది. అక్కడక్కడా తేలికపాటి వర్షాలు నమోదవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో శనివారం 1.43 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదవగా కడ్తాలలో అత్యల్పంగా 0.95 సెంటీమీటర్లు నమోదైంది. వికారాబాద్ జిల్లాలోని పలు వాగులు ఉరకలెత్తుతున్నాయి. సగటు వర్షపాతం కంటే ఎక్కువగా.. శనివారం రాష్ట్రంలో 1.79 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోంది. శనివారం 0.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా రెట్టింపు వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాల సీజన్లో భాగంగా జూన్1 నుంచి ఈనెల 20వ తేదీ వరకు రాష్ట్రంలో కురవాల్సిన సగటు సాధారణ వర్షపాతం 26.46 సెంటీమీటర్లు కాగా, ఇప్పటివరకు 33.11 సెంటీమీటర్ల వర్షపాతం (25 శాతం అధికం) నమోదైంది. గతేడాది ఇదే సీజన్లో 32.84 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత నైరుతి సీజన్లో శనివారం నాటికి రాష్ట్రంలోని జోగుళాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఖమ్మం, నాగర్‌కర్నూల్, వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, ములుగు, కరీంనగర్, సూర్యాపేట, పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షం కురిసింది. మిగిలిన జిల్లాలో గడిచిన నాలుగు రోజుల క్రితం వరకు సాధారణం కంటే తక్కువ నమోదైనా.. శుక్ర, శనివారాల్లో ఎడతెరిపిలేని వర్షాలతో సాధారణ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ శనివారం రాత్రి ప్రకటించింది. వాయుగుండానికి తోడు ఉపరితల ద్రోణి పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం శనివారం మరింత ముందుకు సాగి ఒడిశాలోని చిలికా సరస్సు వద్ద కేంద్రీకృతమైంది. రానున్న ఆరు గంటల్లో వాయుగుండం తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టంపై 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండురోజులు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. నేడు అతిభారీ, అత్యంత భారీ వర్షాలు!ఆదివారం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భద్రాది కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కుమ్రుంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ.. ఆ మేరకు పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెద్ద ఎత్తున ఈదురుగాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు. -
తెల్లనివన్నీ పాలు కాదు!
తెల్లనివన్నీ పాలు కాదు.. పాలు అనుకుని మనం తాగుతున్నవన్నీ అచ్చమైన పాలు కానే కాదు.. కుళాయి నీళ్ల నుంచి యూరియా, ఇతర రసాయనాల దాకా ఏవేవో కలిపిన కల్తీ పాలు.. నకిలీ పాలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ పెరిగిపోయి.. పాడి పశువుల పెంపకం తగ్గిపోయి.. పాల ఉత్పత్తి పడిపోతోంది. నగరంలో డిమాండ్‌కు, సరఫరాకు మధ్య భారీగా వ్యత్యాసం ఏర్పడుతోంది. దీనితో కొందరు వ్యాపారులు అడ్డదారులు తొక్కి.. కల్తీ, నకిలీ పాలను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.సాక్షి, రంగారెడ్డి జిల్లా : గ్రేటర్ హైదరాబాద్, శివారు ప్రాంతాలకు కలిపి రోజుకు సగటున 28 లక్షల లీటర్ల పాలు అవసరమని అంచనా. ఇందులో 22 లక్షల లీటర్లు పాల ప్యాకెట్ల రూపంలో సరఫరా అవుతున్నాయి. డెయిరీ రైతులు, డబ్బావాలాలు, ఇతర వ్యాపారులు నేరుగా మరో ఆరు లక్షల లీటర్లు విక్రయిస్తున్నారు. ఇందులో పెద్ద సంఖ్యలో రెండు, మూడు లక్షల లీటర్ల మేర కల్తీ చేసినవో, కృత్రిమంగా తయారు చేసినవో ఉంటున్నాయని అంచనా. ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు ఇటీవల చేవెళ్ల, నందిగామ, ఆల్మాస్‌గూడ, నాదర్గుల్, ముచ్చింతల్, పసుమాములలోని పలు ప్రైవేటు డెయిరీల నుంచి నమూనాలు సేకరించి.. పరిశీలించగా అక్రమాలు వెలుగుచూశాయి. నిర్దేశించిన ప్రమాణాల మేరకు పాలు లేకపోవడంతో ఆయా డెయిరీల యజమాన్యాలకు నోటీసులు కూడా జారీ చేసినట్టు అధికారులు చెప్తున్నారు. ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు.. బీర్ దాణా » పాలకు డిమాండ్ నేపథ్యంలో కొందరు డెయిరీల నిర్వాహకులు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించేందుకు అడ్డగోలు మార్గం పడుతున్నారు. అధిక పాల దిగుబడి కోసం గేదెలు, ఆవులకు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. ప్రమాదకరమైన ‘బీర్ దాణా’ తాగిస్తున్నారు. దీనికితోడు పాలలో పాలపొడి, కుళాయి నీళ్లు, రసాయనాలు కలుపుతూ కల్తీ చేస్తున్నారు. ఆ పాలు నాసిరకంగా, రుచి లేకుండా ఉంటున్నాయి. పెరుగు తోడుకోకపోవడం, తోడుకున్న పెరుగు కూడా సాయంత్రానికే దుర్వాసన వెదజల్లుతుండటం వంటివి జరుగుతున్నాయి. ఇదీ పాడి లెక్క » ఒకప్పుడు సిటీలో వాడే పాలలో చాలా వరకు శివారు జిల్లాల్లోని వ్యక్తిగత డెయిరీల నుంచే సరఫరా అవుతుండేవి. ప్రస్తుతం వ్యవసాయ భూములన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఆవులు, గేదెల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం మేడ్చల్ జిల్లాలో 27,068 గోజాతి, 59,895 గేదె జాతి పశువులు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 1,88,182 గోజాతి, 1,22,587 గేదె జాతి పశువులు ఉన్నాయి.వీటిలో 1,25,246 ఆవులు, గేదెలు మాత్రమే పాలు ఇస్తున్నట్టు గుర్తించారు. వాటి నుంచి రోజుకు సగటున 5,56,055 లీటర్ల పాల దిగుబడి వస్తుండగా.. అందులో 43,688 లీటర్లు రైతులు సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. 97,998 లీటర్లు ప్రభుత్వ డెయిరీలకు విక్రయిస్తున్నారు. మరో 1,80,382 లీటర్ల పాలను స్వయంగా ఔట్లెట్లు తెరిచి విక్రయిస్తున్నారు.ఇంటింటా తిరిగి పాలు పోసే డబ్బావాలాలు మరో 1,27,965 లీటర్ల మేర అమ్ముతున్నారు. ప్రైవేటు డెయిరీలు 1,60,556 లీటర్లు విక్రయిస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ సరిహద్దు జిల్లాల నుంచి కూడా నగరానికి పాలు దిగుమతి అవుతున్నాయి.కృత్రిమంగా పాలు తయారు చేస్తూ.. »ఇటీవల రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నక్కర్తి మేడిపల్లికి చెందిన ఓ పాడి రైతు ఇంటిపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. కృత్రిమంగా తయారు చేసి, అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 120 లీటర్ల కృత్రిమ పాలు, పది పాల పౌడర్ ప్యాకెట్లను స్వా«దీనం చేసుకుని కేసు కూడా నమోదు చేశారు.» పాశమైలారానికి చెందిన ఓ వ్యాపారి.. స్థానికంగా మూతపడ్డ ఓ పరిశ్రమను అద్దెకు తీసుకుని, గుట్టుగా కల్తీ పాలు తయారు చేయడం మొదలుపెట్టారు. దీనిపై సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఓ ప్రముఖ డెయిరీ లేబుళ్లతో కల్తీ పాలు, పెరుగు, ఇతర పాల పదార్థాలు విక్రయిస్తున్నట్టు గుర్తించి అరెస్ట్ చేశారు. పాల స్వచ్ఛతను గుర్తించొచ్చు ఇలా..» స్వచ్ఛమైన పాలు 0.55 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద గడ్డకడతాయి. ఒకవేళ అంతకన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద గడ్డకడితే అందులో నీళ్లు కలిశాయని అర్థం.» లాక్టోమీటర్ సాయంతో పాలలోని కొవ్వు, ఇతర ఘనపదార్థాలు ఎంత శాతం ఉన్నాయో గుర్తించవచ్చు.» పాలను వేడి చేసినప్పుడు వచ్చే ఆవిరి.. మూతపై నీటిలా ఏర్పడితే సరే. అలాకాకుండా స్పటికాల్లా ఏర్పడితే యూరియా కలిసి ఉండే చాన్స్ ఎక్కువ. » స్వచ్ఛమైన పాలను నున్నటి తలంపై వేస్తే.. అది పారినంత మేర తెల్లటి చార ఏర్పడుతుంది. అలా చార ఏర్పడకుంటే.. నీళ్లు ఎక్కువగా కలిసినట్టే.»వేడి చేసినప్పుడు పాలపై పసుపు రంగులో మీగడ ఏర్పడటం, పెరుగు సరిగా తోడుకోకపోవడం జరిగితే.. అందులో వనస్పతి కలిసి ఉన్నట్టే.»పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు హైడ్రోజన్ పెరాక్సైడ్ కలుపుతుంటారు. అలాంటి పాలను మరిగించి, తోడు వేస్తే పెరుగు సరిగా ఏర్పడదు. అంతా నీళ్లలా కనిపిస్తుంది.పాలలో ఎన్నో రసాయనాలు కలుపుతున్నారు.. » పాడి పశువుల సంఖ్య తగ్గి, పాలలో కల్తీ పెరిగింది. నీళ్లు కలిపితే పెద్దగా నష్టం లేదు. కానీ పాలు చిక్కగా కనిపించేందుకు కార్న్‌ఫ్లోర్.. వెన్నశాతం కోసం యూరియా, వనస్పతి వంటివి కలుపుతున్నారు. పాలు విరిగిపోకుండా ఉండేందుకు డిటర్జెంట్స్, తినే సోడా, అమ్మోనియం సల్ఫేట్, హైడ్రోజన్ పెరాక్సైడ్, రుచి మారకుండా ఉండేందుకు బోరిక్ యాసిడ్ కలుపుతున్నారు. అలాంటి పాలు తాగడం ప్రమాదకరం. అయోడిన్ సొల్యూషన్‌తో పాలను పరీక్షించడం ద్వారా పిండి పదార్థాలు కలిపారా? రెడ్ లిట్మస్ పేపర్ ద్వారా యూరియా కలిపారా గుర్తించొచ్చు. – ఎన్.రాజు, రసాయన శాస్త్రవేత్త ఆ పాలు తాగితే అనారోగ్యమే.. » కొందరు పాల విక్రేతలు, చిన్న డెయిరీల నిర్వాహకులు పాల కల్తీకి పాల్పడుతున్నారు. ప్యాకెట్ పాలను నమ్మకుండా.. బయట కొనేవారి బలహీనతను ఆసరాగా చేసుకుని అక్రమ మార్గం పడుతున్నారు. అపరిశుభ్ర పరిస్థితులతో.. వాటిలో ఈ–కొలి వంటి ప్రమాదకర బ్యాక్టీరియా చేరుతోంది. సరిగా మరిగించకుండా తాగితే రోగాల బారినపడటం ఖాయం. రసాయనాలు కలిపిన పాలు వాడితే అనారోగ్యమే. – డాక్టర్ అమరవాది ప్రభాకరాచారి, సీనియర్ సర్జన్ (రిటైర్డ్) సబ్ స్టాండర్డ్ కేసులే.. » ప్రైవేటు డెయిరీల నిర్వాహకులు సరఫరా చేసే పాలు, ప్యాకెట్ పాల నాణ్యతా ప్రమాణాలను తరచూ పరిశీలిస్తున్నాం. చాలా వరకు సబ్ స్టాండర్డ్ (వెన్నశాతం, నాణ్యతలో తేడాలు)గా గుర్తించారు. ప్రమాదకర స్థాయిలో ఏమీ దొరకలేదు. ఇక కృత్రిమ పాల తయారీ కేంద్రాలపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసి, కేసులు నమోదు చేస్తున్నారు. – ఉదయ్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, రంగారెడ్డి జిల్లా -
దరి చేర్చని దారి!.. గ్రేటర్లో 80లక్షలు దాటిపోయిన వాహనాల సంఖ్య
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ మెట్రోరైల్‌స్టేషన్‌కు 2 కిలోమీటర్ల దూరంలో సుమారు 1500కుపైగా కాలనీలు ఉంటాయి. ఆ కాలనీల నుంచి ప్రతి రోజూ వేలాది మంది నగరంలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే మెట్రో ఉన్నా వినియోగించుకొనే పరిస్థితి లేదు. దానికి కారణం ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ సరిగా లేకపోవడమే. అంటే కాలనీ నుంచి మెట్రో స్టేషన్‌కు.. రైలు దిగాక మెట్రోస్టేషన్ నుంచి ఆఫీసుకో, మరేదైనా చోటికో వెళ్లడానికి సరైన ప్రజా రవాణా సదుపాయాలు లేకపోవడమే. మెట్రోలో అయితే త్వరగా వెళ్లగలిగినా.. ఇంటి నుంచి స్టేషన్‌కు, స్టేషన్ నుంచి ఆఫీసుకు వెళ్లడానికి ఆటో ఎక్కితే ఖర్చు అడ్డగోలుగా పెరిగిపోతోంది. దీంతో జనం సొంత వాహనాలతో రోడ్డెక్కుతున్నారు. ఇది నగరంలో భారీగా ట్రాఫిక్, పొల్యూషన్ పెరిగిపోవడానికి కారణమవుతోంది.ఉదాహరణకు..: ఉప్పల్ సమీపంలోని కాలనీ వ్యక్తి రాయదుర్గంలోని ఆఫీసుకు వెళ్లాలంటే.. కాలనీ నుంచి మెట్రోస్టేషన్‌కు వెళ్లేందుకు రూ.75 నుంచి రూ.100 చార్జీతో ఆటోలో ప్రయాణించాలి. అక్కడి నుంచి మెట్రోలో రాయదుర్గం వరకు రూ.55 చార్జీ ఉంటుంది. రైలు దిగి ఆఫీసుకు చేరేందుకు మరో రూ.50 వెచ్చించాలి. తిరిగి ఇంటికి వెళ్లడానికి మళ్లీ ఖర్చు తప్పదు. ఉప్పల్ మెట్రోస్టేషన్‌కు ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల వచి్చన దుస్థితి ఇది. ఒక్క ఉప్పల్ మెట్రోస్టేషన్ మాత్రమే కాదు. మూడు మెట్రో కారిడార్లలోని అన్ని మెట్రో స్టేషన్లు, ప్రధాన రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు, ఎంఎంటీఎస్ స్టేషన్లకు సరైన కనెక్టివిటీ లేకపోవడం వల్ల ప్రయాణం భారంగా మారుతోంది. దీంతో నగరవాసులు సొంత వాహనాల వినియోగానికే మొగ్గుచూపుతున్నారు.సవాల్‌గా మారిన సమన్వయం..గ్రేటర్లో మొదటి నుంచీ ప్రజారవాణా సదుపాయాల మధ్య సమన్వయం లేదు. సిటీబస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లు, మెట్రో రైళ్ల సేవలు ఇప్పటికీ విడివిడిగానే ఉన్నాయి. 2017లో మెట్రో సేవలను ప్రారంభించినప్పుడు అన్ని స్టేషన్లకు చేరేందుకు బస్సులను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. చుట్టుపక్కల కాలనీలకు చెందిన ప్రయాణికులను స్టేషన్లకు చేరవేసేందుకు ఆర్టీసీ మినీ బస్సులను ప్రతిపాదించింది. ఫీడర్ చానళ్లను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. కానీ ఇప్పటివరకు అవేవీ అమల్లోకి రాలేదు. గతంలో ఎంఎంటీఎస్ స్టేషన్లకు అనుసంధానంగా ప్రత్యేకంగా సిటీబస్సులను ప్రవేశపెట్టినా ఎంతో కాలం కొనసాగలేదు. దీంతో ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ సమస్య అలాగే ఉండిపోయింది.మెట్రోకు అనుసంధానం లేక..నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్ మధ్య ప్రస్తుతం ప్రతిరోజూ 5 లక్షల మంది మెట్రో రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు. రోజుకు 1,000 ట్రిప్పులకుపైగా మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. కానీ ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ లేక ఇంకా లక్షలాదిమంది మెట్రోకు దూరంగానే ఉంటున్నారు. మెట్రోస్టేషన్‌కు కనీసం 5 కిలోమీటర్ల పరిధిలో ఫీడర్ చానల్స్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన పూర్తిగా అటకెక్కింది.ఓలా, ఉబర్, ర్యాపిడో,యారీ వంటి యాప్ ఆధారిత క్యాబ్‌లు, ఆటోలు మినహాయిస్తే మెట్రోస్టేషన్ల నుంచి ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ చాలా తక్కువ. 16 ఆర్టీసీ సైబర్ లైనర్ బస్సులు, 135 మెట్రో సువిధ (12 సీట్లవి) వాహనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. హైటెక్‌సిటీ, రాయదుర్గం స్టేషన్ల నుంచి ఐటీ కారిడార్‌లోని ప్రాంతాలకు వెళ్లే సైబర్ లైనర్లు, సువిధ వాహనాలకు డిమాండ్ ఉంది.జనాభా పెరుగుతున్నా.. సదుపాయాలు అంతే! గ్రేటర్ హైదరాబాద్ జనాభా సుమారు 2 కోట్లకు చేరువైంది. ఏటా లక్షలాది మంది నగరానికి వచ్చి స్థిరపడుతున్నారు. అన్ని వైపులా పెద్ద సంఖ్యలో కొత్త కాలనీలు ఏర్పడుతున్నాయి. కానీ ఇందుకు తగినట్టుగా ప్రజారవాణా సదుపాయాలు పెరగడం లేదు. బెంగళూరు వంటి నగరాల్లో సుమారు 6,000 బస్సులు అందుబాటులో ఉంటే.. గ్రేటర్ హైదరాబాద్‌లో 2,550 బస్సులే ఉన్నాయి. ఇక 70 ఎంఎంటీఎస్ సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయి. నగర అవసరాల మేరకు మరో 100 ఎంఎంటీఎస్ రైళ్లను నడపాల్సి ఉంది. మెట్రో రైళ్లు కూడా మూడు కోచ్‌లతోనే నడుస్తున్నాయి. అన్ని సర్వీసులు కిటకిటలాడుతున్నాయి.‘వాహన విస్ఫోటనం’!హైదరాబాద్ నగరంలో వాహన విస్ఫోటనం ఆందోళన కలిగిస్తోంది. ఏటా 2 లక్షలకు పైగా కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. ప్రస్తుతం వాహనాల సంఖ్య 80 లక్షలకుపైనే ఉంది. వీటిలో 70 శాతానికిపైగా వ్యక్తిగత వాహనాలే కావడం గమనార్హం.కోవిడ్ అనంతరం 2022 నుంచి ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ అవసరం బాగా పెరిగింది. మొదట 15 రూట్లలో ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం 58 స్టేషన్లకు విస్తరించినట్లు అధికారులు చెప్తున్నారు. మెట్రో రైడ్ ఆఫ్ ఇండియా (ఎంఆర్ఐ), ఈవీ ఆటోలు నడుపుతున్నట్టు పేర్కొంటున్నారు. కానీ ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ సదుపాయం ఉన్న మెట్రో స్టేషన్లు చాలా తక్కువ. కనెక్టివిటీ పెరిగితే మరో 5 లక్షల మందికిపైగా మెట్రోలో ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంది.నగరంలో ప్రతి కిలోమీటర్‌కు 1,732 ద్విచక్రవాహనాలు, మరో 1,000 కార్లు ప్రయాణిస్తున్నాయి. అన్ని మార్గాల్లో కలిపి ఒకే సమయంలో సుమారు 55,000 బైకులు, మరో 30,000 కార్లు వెళ్తున్నాయి. రవాణా నిపుణుల అంచనా మేరకు రోడ్లపై వాహనాల సంఖ్య 25,000 దాటితే అత్యధిక వాహన సాంద్రత ఉన్నట్లుగా పరిగణించాలి. సొంత బండితోనూ.. తప్పని కష్టాలుమెట్రోలు, ఎంఎంటీఎస్లలో ప్రయాణించలేక.. చాలా మంది సొంత కారు, ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. దీనితో వాహనాల రద్దీ భారీగా పెరిగిపోతోంది. గంటల తరబడి రోడ్లపైనే ఉండాల్సి వస్తోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో మెట్రోలో నాగోల్ నుంచి రాయదుర్గం చేరుకొనేందుకు 45 నిమిషాల సమయం పడితే.. బైక్ జర్నీకి గంటన్నర, కారులో అయితే 2 గంటలకుపైగా సమయం పడుతుంది. పైగా మానసిక ఒత్తిడి, పొల్యూషన్ సమస్య. ముంబైలో కనెక్టివిటి బాగుండటంతో.. ఎక్కువ దూరం ప్రయాణించేవారిలో చాలా మంది రైళ్లలోనే వెళ్తారు.కామన్ మొబిలిటీ టికెట్ ప్రవేశపెట్టాలి ప్రజారవాణా సదుపాయాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకొనేలా ప్రభుత్వం ప్రోత్సహించాలి. నేషనల్ కామన్ మొబిలిటీ టికెట్ (ఎన్‌సీఎంటీ)ను ప్రవేశపెట్టాలి. సిటీ బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్, క్యాబ్‌లు, ఆటోలు, బైక్ ట్యాక్సీలు తదితర అన్ని రవాణా సదుపాయాలను ఒకే కార్డుతో వినియోగించుకొనే అవకాశం ఉండాలి. దాని వల్ల ప్రయాణికులు ఒక రవాణా సదుపాయం నుంచి మరో రవాణా సదుపాయానికి ఈజీగా మారుతారు. ప్రస్తుతం మెట్రో కనెక్టివిటీ లేని ఎల్బీనగర్– నాగోల్ వంటి రూట్లలో ఆర్టీసీ ఉచిత బస్సులను ప్రవేశపెడితే ప్రయాణికులకు ఎంతో సదుపాయంగా ఉంటుంది. – మురళి వరదరాజన్, ఎల్అండ్టీ మెట్రో చీఫ్ స్ట్రాటజీ అధికారి రవాణా అవసరాలు తేల్చేందుకు ఇంటింటి సర్వే.. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రజారవాణా అవసరాలపై హుమ్టా సంస్థ ప్రత్యేక అధ్యయనం చేపట్టింది. లీ అసోసియేషన్ ద్వారా ఈనెల 18 నుంచి ఇంటింటి సర్వే నిర్వహించనున్నాం. ప్రతి ఇంటి రవాణా అవసరాలు, వినియోగిస్తున్న వాహనాలపై ఈ అధ్యయనం ఉంటుంది. అలాగే ఏయే ప్రాంతాల్లో ఏ విధమైన ట్రాఫిక్ రద్దీ ఉత్పన్నమవుతోందనేది కూడా పరిశీలిస్తాం. లీ అసోసియేషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా ఏ ప్రాంతంలో ఏ రకమైన రవాణా సదుపాయాలను అభివృద్ధి చేయాల్సి ఉందనేదానిపై స్పష్టత వస్తుంది. తదనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 3 నెలల్లో లీ అసోసియేషన్ నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. – జీవన్‌బాబు, హుమ్టా ఎండీ ప్రజా రవాణా విస్తరించకపోవడం వల్లే.. ప్రజారవాణా విస్తరించకపోవడం వల్ల కూడా సొంత వాహనాల వినియోగం పెరిగింది. బ్యాంకుల నుంచి తేలిగ్గా రుణాలు లభించడం, వడ్డీరేట్లు తక్కువగా ఉండటం వల్ల కూడా వాహనాల కొనుగోళ్లు పెరిగాయి. సొంత కారు, సొంత బైక్ సిటీ కల్చర్‌లో ఒక భాగంగా మారింది. ఒకప్పుడు సైకిళ్ల నగరంగా పేరొందిన హైదరాబాద్ ఇప్పుడు బైక్‌ల నగరంగా మారింది. – ఎం.చంద్రశేఖర్‌గౌడ్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, రంగారెడ్డి -
Telangana: ప్రారంభమైన టెట్ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్) సోమవారం ఉదయం ప్రారంభమైంది. పూర్తిగా కంప్యూటర్ బేస్డ్గా.. రోజుకు రెండు సెషన్లు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఇంకో సెషన్లో పరీక్ష జరగనుంది. వచ్చే నెల 2వ తేదీ వరకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 80 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 42 కేంద్రాలు ఉన్నాయి. ఈసారి కొత్తగా బయోమెట్రిక్ హాజరును ప్రవేశపెట్టారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని గంటన్నర ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేయాలని ఆదేశాలిచ్చారు. ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి సొంత ప్రాంతాల్లోనే పరీక్ష కేంద్రాన్ని కేటాయించారు. ఆలస్యంగా దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రం దూర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు అలాట్ అయ్యాయి. సెంటర్ల వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని.. సెల్ఫోన్లు, ఇతర ఎలాంటి ఎల్రక్టానిక్స్ వస్తువులను అనుమతించరని అధికారులు తెలిపారు. 2.86 లక్షల మందికిపైగా దరఖాస్తు.. మొత్తంగా టెట్ పరీక్షకు 2,86,386 మంది దరఖాస్తు చేసుకున్నారు. డీఈడీ అర్హత ఉన్నవారు పేపర్–1 రాయనున్నారు. వారు ప్రాథమిక పాఠశాలల్లో బోధించేందుకు అర్హులవుతారు. పేపర్–1కు 99,588 మంది దరఖాస్తు చేశారు. బీఈడీ అర్హత ఉన్నవారు టెట్ పేపర్–2 రాయనున్నారు. వారు ఉన్నత పాఠశాలల్లో బోధించేందుకు అర్హత ఉంటుంది. దీనికి 1,86428 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల్లో భాగంగా ముందుగా పేపర్–2 నిర్వహిస్తారు. తర్వాత పేపర్–1 నిర్వహిస్తారు. ఇక పదోన్నతులు పొందాలనుకునే సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయాల్సి ఉంటుంది. మొత్తం 80 వేల మంది సర్వీస్ టీచర్లు పరీక్ష రాయాల్సి ఉండగా.. 48 వేల దరఖాస్తులే వచ్చాయి. వాస్తవానికి టెట్ గడువు పెంచడం వల్లే దరఖాస్తులు పెరిగాయి. తొలుత ఏప్రిల్ 10 వరకు గడువు ఇవ్వగా 2 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. తర్వాత అదనంగా పది రోజులు గడువు పెంచగా.. సర్వీస్ టీచర్లు సహా మరో 80 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. 2016లో టెట్‌కు 3.40 లక్షలు, 2017లో 3.29 లక్షలు, 2022లో 3.79 లక్షలు, 2023లో 2.91 లక్షల దరఖాస్తులు వచ్చాయి. మేథ్స్ సబ్జెక్టు వాళ్లే ఎక్కువ గణితం, సైన్స్ సబ్జెక్టుల నేపథ్యం ఉన్న వారే ఎక్కువగా టెట్‌కు దరఖాస్తు చేశారు. మొత్తం అప్లికేషన్లలో ఈ సబ్జెక్టు వారే 99,974 మంది ఉన్నారు. సోషల్ నేపథ్యంతో టెట్ రాసేవారు 86,454 మంది ఉన్నారు. పేపర్–1కు ఎక్కువగా ఆదిలాబాద్ (7,504), వికారాబాద్ (5,879) జిల్లాల నుంచి.. అతి తక్కువగా జయశంకర్ భూపాలపల్లి (771) జిల్లా నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఇక పేపర్–2కు నల్గొండ (7,163) జిల్లా నుంచి అధికంగా.. జయశంకర్ భూపాలపల్లి (935), ములుగు (963) జిల్లాల నుంచి అతి తక్కువగా దరఖాస్తులు వచ్చాయి. ప్రశాంతంగా పరీక్షలు రాయాలి విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో టెట్ రాయాలి. ఎలాంటి ఒత్తిడికి లోనుకావద్దు. పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం. పరీక్ష కేంద్రంలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఇన్విజిలేటర్ల దృష్టికి తీసుకురావాలి. పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోవాలి. – రాధారెడ్డి, టీఎస్ టెట్ కన్వీనర్ -
సోలార్‌ప్యానెల్స్ పెట్టుకుంటేనే...గ్రేటర్లో ఇళ్లకు అనుమతి!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇళ్లపై సోలార్‌ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటేనే ఇంటి అనుమతులు మంజూరు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత దీనికి సంబంధించి విధానపరమైన నిర్ణయం తీసుకోనుంది. సౌర విద్యుత్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రతీ ఇంటిపై సోలార్‌ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవాలనే కచ్చితమైన నిబంధన తీసుకురావాలనుకుంటోంది. తద్వారా నగరాల్లో విపరీతంగా పెరిగిపోతున్న విద్యుత్ అవసరాలను స్థానికంగానే ఉత్పత్తి చేసుకొని వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాలుష్యరహిత విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటోంది. గ్రామాలను కూడా సోలార్ ఎనర్జీ హబ్‌లుగా మార్చాలని భావిస్తోంది. ప్రతీ గ్రామంలోనూ నాలుగైదు ఎకరాల విస్తీర్ణంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి స్థానికంగా ఉండే సబ్స్టేషన్లకు వీటిని అనుసంధానిస్తారు. తద్వారా ఆ గ్రామాలకు విద్యుత్ సమస్య ఎదురుకాకుండా చూడాలన్న అభిప్రాయానికి వచ్చారు. దీనిపై విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆ శాఖ ఉన్నతాధికారులతో చర్చించి రోడ్‌మ్యాప్ రూపొందించారు. ఎన్నికల తర్వాత ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోనూ పూర్తిస్థాయిలో చర్చించిన అనంతరం మంత్రివర్గంలో ఈ కీలక నిర్ణయం తీసుకొని అమలు చేయాలని భావిస్తున్నారు. విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటే.. సోలార్ ఎనర్జీనే ప్రధానం అన్న అభిప్రాయానికి వచ్చారు. ప్రస్తుతం థర్మల్, హైడల్ జనరేషన్తోపాటు సౌర, పవనవిద్యుత్ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతోంది. హైడల్ పవర్ అందుబాటులో లేని సమయంలో రాష్ట్రంలో విద్యుత్ అవసరాలకు బయట నుంచి ఎక్కువ మొత్తానికి విద్యుత్ కొనాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో సౌర విద్యుత్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిజర్వాయర్లలోనూ..: నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లోనూ ఫ్లోటింగ్ సోలార్‌ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనితోపాటు చిన్న, మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ ఉత్పాదనతోపాటు, నీరు ఆవిరవ డాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. అవసరమైతే రిజర్వాయర్ల నుంచి నీరు వెళ్లే కాలువ గట్లపై కూడా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం వల్ల వేలాది మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనకు అవకాశం ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఎల్లంపల్లి రిజర్వాయర్‌లో ఇప్పటికే సింగరేణి సంస్థ ఫ్లోటింగ్ సోలార్‌ప్యానెల్స్ ఏర్పాటు చేసిన సంగతి విదితమే. సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్స్‌లో బొగ్గు తవ్విన తర్వాత ఆ ప్రాంతాలనూ ఈ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గ్రీనర్ ఎనర్జీకి స్కాండినేవియన్ దేశాలు అధిక ప్రా ధాన్యం ఇస్తున్న మాదిరిగానే తెలంగాణలోనూ ఆ మోడల్‌ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంతోపాటు వాటి నిర్వహణ, బొగ్గు ధరలు ఏటేటా పెరుగుతున్న తరుణంలో విద్యుత్ ధర పెరుగుతూ వస్తోంది. ఇది ప్రభుత్వంపైనే కాకుండా వినియోగదారులకు మోయలేని భారంగా మారుతున్న తరుణంలో సోలార్ పవర్‌ను ప్రోత్సహించాలని నిర్ణయానికి వచ్చింది. థర్మల్ కేంద్రాలతో భారీగా వెలువడే కాలుష్యాన్ని కూడా అరికట్టడానికి వీలవుతుందని అధికారులు చెబుతున్నారు. -
Hyderabad: పగటిపూట సిటీ బస్సుల సంఖ్య తగ్గింపు
సాక్షి, హైదరాబాద్: ఎండల తీవ్రత దృష్ట్యా నగరంలో మధ్యాహ్నం సమయంలో బస్సుల సంఖ్యను తగ్గించనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. కొద్ది రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయని, దీంతో ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని పేర్కొన్నారు. ఈ మేరకు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నగరంలో సిటీ బస్సుల ట్రిప్పులను తగ్గించనున్నారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు అన్ని రూట్లో బస్సులు యథావిధిగా రాకపోకలు సాగిస్తాయని అధికారులు పేర్కొన్నారు. -
‘బైరామల్ గూడ’ ఫ్లై ఓవర్‌తో.. రయ్ రయ్!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో మరో ఫ్లై ఓవర్ త్వరలో అందుబాటులోకి రానుంది. బైరామల్‌గూడ సెకండ్ లెవెల్ ఫ్లై ఓవర్ ఈ నెల 8వ తేదీన ప్రారంభమయ్యే అవకాశముంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించనున్నారు. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే నాగార్జునసాగర్ రింగ్‌రోడ్, బైరామల్‌గూడ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ చిక్కులు తగ్గుతాయి. త్వరలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని, అది వెలువడేలోగా దాదాపు వారం రోజుల్లో ఈ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత సమాచారం మేరకు ఈ నెల 8న ప్రారంభించాలని తాత్కాలికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ఫ్లైఓవర్ వినియోగంలోకి వచ్చాక శంషాబాద్ విమానాశ్రయం, ఓవైసీ హాస్పిటల్ వైపుల నుంచి విజయవాడ(చింతలకుంట వైపు), నాగార్జునసాగర్ (బీఎన్ రెడ్డి నగర్ వైపు)ల వైపు ఈ ఫ్లై ఓవర్ మీదుగా ట్రాఫిక్ జంజాటం లేకుండా వెళ్లవచ్చు. ఈ ఫ్లై ఓవర్లతోపాటు రెండు లూప్‌లు కూడా అందుబాటులోకి వస్తే ఎడమవైపు లూప్ నుంచి నాగార్జునసాగర్, చింతలకుంట వైపుల నుంచి ఎల్బీనగర్, సికింద్రాబాద్‌ల వైపు వెళ్లే వారికి సదుపాయం కలుగుతుంది. అలాగే కుడివైపు లూప్ అందుబాటులోకి వస్తే ఎల్బీనగర్ నుంచి కర్మాన్‌ఘాట్, ఐఎస్ సదన్ల వైపు వెళ్లే వారికి సౌలభ్యంగా ఉంటుంది. తద్వారా ప్రయాణ సమయం కలిసి రావడంతోపాటు వాహనదారులకు ఇంధన వ్యయం తగ్గుతుంది. వాయు, ధ్వని కాలుష్యాలు తగ్గుతాయి. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణంలో క్రాష్ బారియర్స్, ఫ్రిక్షన్ శ్లాబ్స్, శ్లాబ్ ప్యానెల్స్ వంటి వాటికి ఆర్సీసీ ప్రీకాస్ట్ టెక్నాలజీ వినియోగించారు. ఎస్సార్డీపీ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఫ్లైఓవర్ల నిర్మాణంతోనే నగరంలో తొలిసారిగా ఈ టెక్నాలజీని వినియోగించడం తెలిసిందే. బైరామల్‌గూడ సెకండ్ లెవెల్ ఫ్లై ఓవర్ ఇలా.. నిర్మాణ వ్యయం: రూ.148.05 కోట్లు, పొడవు: 1.78 కి.మీ, వెడల్పు ఓవైసీ వైపు (ర్యాంప్1): 12 మీటర్లు, 3లేన్. నాగార్జునసాగర్ వైపు(ర్యాంప్2): 8.5మీటర్లు, 2 లేన్. చింతల్‌కుంట వైపు(ర్యాంప్3): 8.5 మీటర్లు, 2 లేన్. ప్రయాణ మార్గం.. ఒకవైపు సిద్ధమైన బైరామల్‌గూడ ఫ్లైఓవర్ బైరామల్‌గూడ జంక్షన్ వద్ద మొదటి, రెండవ లెవెల్ ఫ్లై ఓవర్లు, లూప్స్ వినియోగంలోకి వస్తే బైరామల్‌గూడ జంక్షన్‌వద్ద 95 శాతం, నాగార్జునసాగర్ రింగ్‌రోడ్ వద్ద 43 శాతం ట్రాఫిక్ చిక్కులకు పరిష్కారం లభించనుందని ఇంజినీర్లు పేర్కొన్నారు. -
బీఆర్ఎస్కు ఊహించని ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు దెబ్బ తగిలినా.. గ్రేటర్ హైదరాబాద్‌లో క్లీన్ స్వీప్ చేసిన బీఆర్ఎస్కు లోక్‌సభ ఎన్నికల ముందు ఊహించని షాక్ తగులుతోంది. గులాబీ దండు నుంచి అధికార కాంగ్రెస్‌లోకి వలసలు జోరందుకుంటున్నాయి. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ బాటలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు తెలుస్తోంది.ఆదివారం సాయంత్రం బొంతు రామ్మోహన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం ఇందుకు ఊతమిస్తోంది. త్వరలోనే తన అనుచరులతో కలిసి ‘కారు’ దిగి కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. చిన్నచూపు చూశారనే.. ► విద్యార్థి దశ నుంచే ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న బొంతు రామ్మోహన్ బాబా ఫసియుద్దీన్లకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి వచి్చన తర్వాత బల్దియాలో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులతో తగిన గుర్తింపును ఇచి్చంది. రెండో దఫా అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ ఉద్యమ వీరులను చిన్నచూపు చూసిందని, అసలు లక్ష్యమే పక్కదారి పట్టిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ► మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ టికెట్ ఆశించి భంగపడ్డ బొంతు రామ్మోహన్ నాటి నుంచి పారీ్టతో అంటీ ముట్టన్నట్లుగానే ఉంటూ వస్తుండగా... మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ మాత్రం తనకు స్థానిక ఎమ్మెల్యేతో ప్రాణహాని ఉందని చెప్పినా బీఆర్ఎస్ అధిష్టానం పట్టించుకో లేదంటూ ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా బొంతు రామ్మోహన్ సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో.. ఆయన కాంగ్రెస్‌లో ఆయన చేరిక లాంఛనప్రాయమేనని తెలుస్తోంది. అధికార కాంగ్రెస్ కూడా నగరంలో పట్టు కోసం బీఆర్ఎస్ ముఖ్యనేతలు, కార్పొరేటర్లను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ టచ్‌లో 20 మంది కార్పొరేటర్లు ► బీఆర్ఎస్కు చెందిన సుమారు 20 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ వీడిన మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డితో పాటు పలువురు మాజీ కార్పొరేటర్లు కూడా తిరిగి సొంత గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి దంపతులు బీఆర్ఎస్ పారీ్టపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవచ్చనే ప్రచారం సాగుతోంది. మరోవైపు గులాబీలు చేజారకుండా కట్టడి చేయాల్సిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల సమావేశంలో పార్టీ నుంచి పోతే పోనీ.. వాళ్ల కర్మ అన్నట్లు వ్యాఖ్యానించడంతో పలువురు కాంగ్రెస్ బాట పడుతున్నట్లు సమాచారం. -
టీచర్లు సిటీకి.. చదువులు గాలికి!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో కొన్నిరోజులుగా కొత్త టీచర్లు కొలువుదీరుతున్నారు. ఉపాధ్యాయుల బదిలీలేమీ లేకున్నా.. కొత్త నియామకాలేవీ జరగకున్నా.. కొత్త టీచర్లు వస్తుండటంపై తోటి టీచర్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ కొత్త టీచర్లంతా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లోని గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో పనిచేయాల్సిన వారు. కానీ డిçప్యుటేషన్లపై పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలలకు వచ్చి తిష్టవేస్తున్నారు. తమకు పోస్టింగ్ ఇచ్చిన గ్రామీణ పాఠశాలలో పనిచేయడం ఇష్టం లేకనో, మరేదైనా కారణాలతోనో.. జిల్లా విద్యాశాఖ అధికారులు (డీఈఓలు), పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలోని అధికారులు, రాజకీయ నేతల సహకారంతో ఇలా పట్టణ ప్రాంత బడుల్లోకి మారుతున్నారు. ఈ జిల్లాల పరిధిలో వంద మందికిపైగా టీచర్లు ఇలా డిçప్యుటేషన్లపై ఇతర చోట్లకు వెళ్లినట్టు అంచనా. దీంతో ఇప్పటికే ఉపాధ్యాయుల కొరతతో సతమతం అవుతున్న గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో బోధనకు మరింతగా ఇబ్బంది ఎదురవుతోంది. రూ.3 లక్షల దాకా ముట్టజెప్పి.. కోరిన చోటికి డిప్యూటేషన్‌పై వెళ్లేందుకు కొందరు టీచర్లు.. స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలతో పైరవీలు చేయించుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. మరికొందరు విద్యాశాఖ అధికారులను ఆశ్రయించి డిప్యుటేషన్ పొందుతున్నారు. ఈ క్రమంలో ఒక్కో టీచర్ రూ.3 లక్షల వరకు ముట్టజెప్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు డీఈఓలు అందినకాడికి వసూలు చేసి, ఇలా డిప్యుటేషన్లు ఇస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లోపల, శివార్లలోని దగ్గరి ప్రాంతాల స్కూళ్లకు వెళ్లేందుకు అంతకంటే ఎక్కువే చేతులు మారుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 2న యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం జెడ్పీ హైస్కూల్‌కు చెందిన ఓ టీచర్‌ను ఏకంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాగోల్ జెడ్పీ హైసూ్కల్‌కు డిప్యూటేషన్‌పై పంపుతూ యాదాద్రి జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి అంతర్ జిల్లా డిప్యూటేషన్ ఇచ్చే అధికారం డీఈఓలకు ఉండదు. అయినా ఇలాంటి ఆదేశాలు రావడం గమనార్హం. అయితే రాష్ట్రంలో ఎక్కడా డిప్యూటేషన్లు ఇవ్వలేదని, పాఠశాల విద్య కమిషనరేట్ నుంచి అలాంటి ఉత్తర్వులేవీ జారీ చేయలేదని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చెప్తుండటం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొన్ని డిప్యూటేషన్లు ఇలా.. ► రంగారెడ్డి జిల్లా మంచాల మండలం రంగాపూర్ జెడ్పీ హైసూ్కల్ నుంచి ఓ ఉపాధ్యాయుడు అబ్దుల్లాపూర్‌మెట్ మండలం రాగన్నగూడ జెడ్పీహెచ్‌ఎస్‌కు డిప్యూటేషన్‌పై వెళ్లారు. ► మాడ్గుల మండలం అవురుపల్లి జెడ్పీహెచ్ఎస్లో పనిచేయాల్సిన ఓ టీచర్.. చంపాపేట్ జెడ్పీహెచ్ఎస్లో డిప్యూటేషన్‌పైన విధులు నిర్వహిస్తున్నారు. ► మాడ్గుల మండలం పుట్టగడ్డతండా ప్రాథమిక పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు.. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కవాడిపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. ఇదే మండలం అన్నబోయినపల్లి పాఠశాలకు చెందిన టీచర్.. శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ పాఠశాలకు డిప్యూటేషన్‌పై వెళ్లారు. ► ఇలా మాడ్గుల మండలానికి చెందిన సుమారు ఇరవై మంది టీచర్లు డిప్యూటేషన్లపైన ఇతర మండలాల్లో పనిచేస్తున్నట్టు సమాచారం. ► షాద్‌నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని దాదాపు 60 మంది టీచర్లు.. గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాలైన రాజేంద్రనగర్, శంషాబాద్, శేరిలింగంపల్లి మండలాల్లో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. ఈ సెగ్మెంట్ పరిధిలో దాదాపు 12 పాఠశాలల్లో టీచర్లెవరూ లేరని సమాచారం. మానవతా దృక్పథంతో చేస్తున్నాం.. పక్షవాతం, కేన్సర్ తదితర వ్యాధుల బాధితులు, అఖిల భారత సర్వీసు ఉద్యోగుల జీవిత భాగస్వాములు వంటి వారి డిప్యూటేషన్లను అనుమతిస్తున్నాం. అలాంటి వారు ఎవరున్నా దరఖాస్తు చేసుకోవాలని కూడా చెప్తున్నాం. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. ఇలాంటి దరఖాస్తులను మానవతా దృక్పథంతో ఆమోదించి పోస్టింగ్‌లు ఇస్తున్నాం. విద్యాశాఖ కమిషనర్ నుంచి వస్తున్న ప్రతిపాదనలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాం. – బుర్రా వెంకటేశం, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఒక్క డిప్యూటేషన్ కూడా ఇవ్వలేదు డిప్యూటేషన్లు, బదిలీలకు సంబంధించి నేను ఎక్కడా సంతకాలు చేయలేదు. నాకు ఎలాంటి సంబంధం లేదు. గత మూడున్నరేళ్లలో నేను ఒక్క ఆర్డర్‌పై కూడా సంతకం చేయలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే అమలు చేస్తా. – దేవసేన, విద్యాశాఖ కమిషనర్ -
రికార్డు బ్రేక్.. మన టార్గెట్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించిన స్ఫూర్తితో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లోనూ సికింద్రాబాద్ ఎంపీని భారీ మెజారీ్టతో గెలిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో జరిగిన హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశంలో ఒక్కో నియోజకవర్గం నుంచి ఐదుగురు సభ్యులతో మాట్లాడిన కేటీఆర్ పార్టీ పరిస్థితి తదితర అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గత ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మన పార్టీ ఎమ్మెల్యేలే గెలిచారు. వారందరికీ రెండు లక్షలకుపైగా మెజార్టీ ఓట్లు వచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లోనూ సులభంగానే గెలిచే అవకాశాలున్నాయి. ఇప్పటివరకున్న రికార్డుల్ని బ్రేక్ చేసేందుకు మరింత కష్టపడాలి. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో లేమని నిరాశ చెందవద్దు. పక్క పారీ్టవాళ్ల ప్రలోభాలకు లొంగవద్దు. రాజీలేని పోరాటంతో విజయం సాధిస్తాం. మళ్లీ గెలుపు మనదే. అవసరమైతే హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలోనూ గెలిచేలా తయారు కావాలి’ అని కేటీఆర్ పేర్కొన్నారు. బీజేపీతో అయ్యేదేమీ లేదని, మళ్లీ పోరాట పటిమతో మన సత్తా చాటాలన్నారు. ప్రజలు పోరాడేలా చేయండి కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు సాధ్యం కాదని, వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని, అమలు చేయకపోతే తిరగబడేలా చైతన్యం తేవాలని కేటీఆర్ సూచించారు. అభయహస్తం కింద దరఖాస్తులు స్వీకరించినప్పటికీ ఒక కుటుంబంలో ఒకరికంటే ఎక్కువమంది పెన్షన్‌కు అర్హులుంటే ఎంతమందికి వర్తింపజేస్తారో పరిశీలించాలని సూచించారు. సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికమని చెబుతున్నప్పటికీ, రేషన్‌కార్డులు లేని వారికి ఎప్పటిలోగా ఇస్తారో ఇప్పటికీ స్పష్టత లేదన్నారు. వాటితోపాటు ప్రజల నుంచి అందిన ఇతర ఫిర్యాదులనూ ఆన్లైన్లో నమోదు చేయలేదని, ఈ ప్రక్రియలన్నీ ముగిసి ప్రజలకు లబ్ధి చేకూర్చేందుకు ఎంత సమయం పడుతుందో తెలియదని చెబుతూ వీటన్నింటినీ ప్రజల్లోకి ముమ్మరంగా తీసుకెళ్లి వారు పోరాడేలా చేయాలని చెప్పారు. సమీక్ష సమావేశాలను తేలికగా తీసుకోవడం మంచిది కాదని, భద్రాచలం నుంచి వచి్చన నేతలు సమావేశం ఆసాంతం ఉండగా.. నగర నాయకులు మాత్రం మాట్లాడి వెళ్లిపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. -
ఫార్మాసిటీ స్థానంలో మెగా టౌన్షిప్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ శివార్లలోని కందుకూరు వద్ద ఫార్మా సిటీ నిర్మాణం కోసం సేకరించిన భూముల్లో పర్యావరణహితమైన మెగా టౌన్షిప్ నిర్మాణానికి ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నగరానికి దగ్గర్లో ఫార్మాసిటీ ఉండకూడదని.. దాన్ని నగరానికి దూరంగా తరలించడం మంచిదని అభిప్రాయపడ్డారు. మరోవైపు గత ప్రభుత్వం శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు ప్రతిపాదించిన మెట్రోరైల్ విస్తరణ అలైన్‌మెంట్‌ను నిలిపివేయాలని ఆదేశించారు. దానికి బదులు ఎంజీబీఎస్, ఎల్బీనగర్ మార్గాల్లో ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రైల్ పొడిగింపుపై ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి పలు అంశాలపై మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, చీఫ్ సెక్రెటరీ శాంతికుమారి, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్విఎస్ రెడ్డి, సీఎంఓ అధికారులు వి.శేషాద్రి, బి.శివధర్‌రెడ్డి, షానవాజ్ ఖాసీం తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఇప్పటికే ఔటర్‌రింగ్‌రోడ్డు, జీవో 111 ప్రాంతాల్లో ఎంతో అభివృద్ధి జరిగిందని, మెరుగైన రవాణా సదుపాయాలు ఉన్నాయని ఈ సందర్భంగా సీఎం రేవంత్ చెప్పారు. హైదరాబాద్ నగరం నలువైపులా సమంగా అభివృద్ధి చెందాల్సి ఉందని, ఈ క్రమంలో ఎయిర్‌పోర్టు మెట్రో అలైన్మెంట్ మార్చాలని పేర్కొన్నారు. ఆ రెండు రూట్ల మీదుగా.. ‘‘హైదరాబాద్ జనాభా ఎక్కువగా సిటీ మధ్యలో, తూర్పు ప్రాంతంలో, పాతబస్తీలో ఉంది. ఈ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందేందుకు మెట్రో అలైన్మెంట్ మార్చాలి. ఈ మేరకు ఎంజీబీఎస్, ఓల్డ్‌సిటీ, ఫలక్‌నుమా నుంచి ఎయిర్‌పోర్టు వరకు.. అలాగే ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట రూట్లో ఎయిర్‌పోర్టు వరకు మెట్రో నిర్మాణం చేపట్టాలి. అలాగే మైలార్‌దేవ్‌పల్లి, జల్పల్లి, పీ–7 రోడ్, లేదా బార్కాస్, పహడీషరీఫ్, శ్రీశైలం రోడ్డు రూట్లను కూడా పరిశీలించాలి..’’ అని రేవంత్ సూచించారు. ఈ రూట్లలో మెట్రో నిర్మాణానికి అయ్యే ఖర్చును అంచనా వేయాలని మెట్రో రైల్ అధికారులను ఆదేశించారు. ఎలాంటి మలుపులు లేకుండా నేరుగా ఉండే మార్గాల్లో మెట్రో నిర్మించడం వల్ల వ్యయం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ఎయిర్‌పోర్టు మెట్రోను శ్రీశైలం రోడ్డులోని తుక్కుగూడ వరకు పొడిగించే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఓల్డ్ సిటీ మెట్రో ఎందుకు చేపట్టలేదు? పాతబస్తీలోని 5.5 కిలోమీటర్ల మెట్రో రైల్‌ను ఎల్అండ్టీ ఇప్పటివరకు నిర్మించకపోవడంపై సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ఎన్నో ప్రయోజనాలు పొందినా ఓల్డ్‌సిటీ మెట్రోను పూర్తి చేయకపోవడం సరికాదన్నారు. ఈ అంశంపై న్యాయ నిపుణులతో చర్చించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఎయిర్‌పోర్టు మెట్రో ప్రస్తుత అలైన్మెంట్ నిలిపివేత నేపథ్యంలో.. జీఎంఆర్‌తో కుదుర్చకున్న ఒప్పందంపై కూడా నివేదిక కోరారు. నగర అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ హైదరాబాద్ నగరాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని రేవంత్ ఆదేశించారు. మూసీ సుందరీకరణ చేపట్టాలన్నారు. తూర్పు నుంచి పడమర వరకు మూసీ మార్గంలో నాగోల్ నుంచి గండిపేట్ దాకా ఎంజీబీఎస్‌ను కలుపుతూ రోడ్, మెట్రో కనెక్టివిటీ ఉండాలని సూచించారు. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని.. ప్రస్తుతం నగర జనాభా 2 కోట్లకు చేరువలో ఉందని చెప్పారు. భవిష్యత్తులో 3 కోట్ల జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఔటర్ చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. నేడు కేబినెట్ భేటీ సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం అసెంబ్లీలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక ప్రక్రియ పూర్తయి, సభ వాయిదా పడ్డాక ఈ భేటీని నిర్వహించనున్నారు. -
గ్రేటర్ హైదరాబాద్‌పై బీఆర్ఎస్ ఫోకస్
గ్రేటర్ హైదరాబాద్‌లో గులాబీ పార్టీకి ముళ్ళు గుచ్చుకుంటున్నాయా? సిటీలో నివసిస్తున్న తెలంగాణేతర ప్రాంతాల ప్రజల ఓట్ల కోసం బీఆర్ఎస్ శ్రమిస్తోందా? హోరా హోరీగా జరిగే ఈ ఎన్నికల్లో బయటి ప్రాంతాలవారి ఓట్లే కీలకంగా మారనున్నాయా? సామాజిక వర్గాల వారీగా ఓట్లు కూడగట్టేందుకు బీఆర్ఎస్ అభ్యర్థులు అనుసరిస్తున్న వ్యూహం ఏంటి? బయటి ప్రాంతాల ప్రజల ఓట్లు సాధించడంలో గులాబీ పార్టీ సక్సెస్ అవుతుందా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంటోంది. ప్రధాన రాజకీయ పార్టీలు హోరా హోరీగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. అన్ని పార్టీలు చావో రేవో అన్నట్లుగా తలపడుతున్నాయి. ప్రాంతం, సామాజిక వర్గాల వారీగా ఓటర్లకు చేరుయ్యేందుకు పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ...అమలు చేస్తున్నాయి. ఇటు గ్రేటర్ హైదరాబాద్ లో రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి వచ్చినవారు.. ఇతర రాష్ట్రాల వారు ఉండడంతో వారి ఓట్లపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. గ్రేటర్లో మెజార్టీ సీట్లు గెలవాలంటే వారి ఓట్లు కీలకం కాబట్టి...ఇతర ప్రాంతాల ప్రజల విశ్వాసం పొందేందుకు గులాబీ పార్టీ అభ్యర్థులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. 2014, 2018 ఎన్నికల్లో కూడా తెలంగాణేతర ప్రజల ఓట్లను అన్ని పార్టీలు కీలకంగా భావించాయి. ఇతర ప్రాంతాలకు చెందిన ఓటర్లతో సామాజిక వర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే గులాబీ పార్టీ అభ్యర్థులు ఆయా సామాజికవర్గ నేతల భేటీలు పూర్తి చేసే పనిలో ఉన్నారట. చివరి దశలో ఒకరిద్దరు బీఆర్ఎస్ సీనియర్ నేతలు ఆయా సామాజికవర్గాలతో భేటీలు నిర్వహించి మద్దతు కోరతారని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో గ్రేటర్ లో ఎక్కువ సీట్లు గెలవకపోయినా...2018 వచ్చే సరికి పూర్తి స్థాయిలో విపక్ష పార్టీలపై ఆధిక్యం సాధించింది బీఆర్ఎస్. ఇప్పుడు కూడా గ్రేటర్ లో అదే స్థాయిలో సీట్లు తమ ఖాతాలో వేసుకోవాలని వ్యూహాలలో మునిగి తేలుతున్నది గులాబీ పార్టీ. గ్రేటర్ హైదరాబాద్ లో ఈసారి ఓటర్లు ఎటువైపు ఉంటారు అన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. ఎంఐఎం ప్రాతినిత్యం వహిస్తున్న స్థానాలు మినహా మిగిలిన స్థానాల్లో గులాబీ పార్టీ పాగా వేస్తుందా లేదా అనే చర్చ మాత్రం జరుగుతోంది. గ్రేటర్ ప్రజలు ఎవరిని కరుణిస్తారో తెలియాలంటే డిసెంబర్ 3 వరకు ఆగాల్సిందే. -
కౌన్ బనేగా కిస్మత్ వాలా!
హైదరాబాద్: శాసనసభలో అడుగు పెట్టాలని ఎన్నికలలో పోటీ చేసే ప్రతీ రాజకీయ నాయకుడి కల. గెలిచిన అభ్యర్థులకేమో ప్రభుత్వం ఏర్పాటయ్యాక మంత్రివర్గంలో చోటు దక్కించుకోవాలనే ఆశ. ఇందుకోసం గెలుపు కోసం ఓటర్లను, చోటు కోసం పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకుంటుంటారు. ఈ నెల 30న జరగనున్న శాసనసభ ఎన్నికల్లో పలువురు తాజా, మాజీ మంత్రులు గ్రేటర్ హైదరాబాద్ నుంచి బరిలోకి దిగారు. వీరిలో తలసాని శ్రీనివాస్ యాదవ్ వరుసగా రెండుసార్లు కేసీఆర్ కేబినెట్లో చోటు దక్కించుకొని రికార్డు సృష్టించారు. ఒకే శాఖకు రెండుసార్లు మంత్రిగా.. 2014లో శాసనసభ ఎన్నికలలో తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ టికెట్‌తో సనత్‌నగర్ నుంచి పోటీ చేసి, టీఆర్ఎస్ అభ్యర్థి దండె విఠల్పై గెలుపొందారు. ఆ తర్వాత తలసాని కారెక్కి, కేసీఆర్ కేబినెట్లో చేరిపోయారు. పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా పనిచేశారు. 2018 ఎన్నికలలో టీఆర్ఎస్ టికెట్‌తో బరిలోకి దిగిన తలసాని వరుసగా రెండోసారి గెలుపొంది, మళ్లీ కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. రెండోసారి కూడా ఇదే శాఖకు మంత్రిగా పనిచేశారు. ప్రస్తుత ఎన్నికల్లో తలసాని మరోసారి సనత్‌నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. తొలి మహిళా హోంమంత్రిగా.. కాంగ్రెస్ అభ్యర్థిగా ఉమ్మడి రాష్ట్రంలో అప్పటికే వరుసగా మూడుసార్లు గెలిచిన సబితా ఇంద్రారెడ్డి.. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన తొలి శాసనసభ ఎన్నికలలో పోటీ చేయలేదు. ఆ తర్వాత 2018లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ కండువాతో పోటీ చేసి, సిట్టింగ్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డిపై గెలుపొందారు. ఆ తర్వాత సబితా టీఆర్ఎస్ పార్టీలో చేరి, విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సమైక్య రాష్ట్రంలో 2009 నుంచి 2014 వరకు దేశంలోనే తొలి మహిళా హోం శాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి చరిత్ర సృష్టించారు. సబితా మరోసారి మహేశ్వరం నుంచి పోటీ చేస్తున్నారు. పార్టీలో చేరి.. కేబినెట్లోకి.. 2014లో టీడీపీ పార్టీలో చేరిన చామకూర మల్లారెడ్డి మల్కాజిగిరి లోకసభ సభ్యుడిగా పోటీ చేసి గెలుపొందారు. తెలంగాణలో టీడీపీ నుంచి గెలుపొందిన ఏకై క పార్లమెంట్ సభ్యుడు మల్లారెడ్డే. 2016లో మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 శాసనసభ ఎన్నికలలో మేడ్చల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టికెట్‌తో పోటీ చేసి.. కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మారెడ్డిపై గెలుపొందారు. కేసీఆర్ కేబినెట్లో కార్మిక, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. మళ్లీ మేడ్చల్ నుంచి బరిలోకి దిగారు. సికింద్రాబాద్ నుంచి డిప్యూటీ స్పీకర్.. 1984, 2001లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపల్ కౌన్సిలర్‌గా పనిచేసిన పద్మారావు గౌడ్.. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2004లో సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2009లో సనత్‌నగర్ నుంచి పోటీ చేసిన ఆయన.. కాంగ్రెస్ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికలలో మళ్లీ సికింద్రాబాద్ నుంచి పోటీ చేసిన పద్మారావు గెలుపొందారు. తొలి కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్, క్రీడా శాఖ మంత్రిగా పనిచేసి.. డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత ఎన్నికలలో సికింద్రాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోనిలిచారు బరిలో మాజీ ‘ఉమ్మడి’ మంత్రులు.. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా పనిచేసిన కృష్ణ యాదవ్, మర్రి శశిధర్ రెడ్డి, దానం నాగేందర్ ఈసారి శాసనసభ ఎన్నికలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేసిన కృష్ణ యాదవ్.. అంబర్‌పేట నుంచి బీజేపీ అభ్యర్థిగా.. టూరిజం మంత్రిగా పనిచేసిన మర్రి.. బీజేపీ కండువాతో సనత్‌నగర్ నుంచి.. గతంలో మంత్రిగా పని చేసిన దానం నాగేందర్ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. -
బల్దియా టు అసెంబ్లీ
చెరుపల్లి వెంకటేశ్: కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఎదిగిన వారెందరో ఉన్నారు. హైదరాబాద్ బల్దియా నుంచే ఇలా ఎదిగిన వారూ చాలామంది ఉన్నారు. కార్పొరేటర్లుగా పోటీ చేసి గెలిచినా, ఓడి నా పట్టు వదలకుండా కృషి చేసి పైమెట్టు ఎక్కారు. ఎక్కువ పర్యాయాలు ఎమ్మెల్యేలుగా గెలవడంతోపాటు మంత్రులైన తలసాని శ్రీనివాస్ యాదవ్, టి.పద్మారావుగౌడ్, సి.కృష్ణయాదవ్, ముఖేశ్‌గౌడ్ తదితరులు నగరపాలకసంస్థ కార్పొరేటర్లుగా పోటీచేసిన వారే. ఎంసీహెచ్ నుంచే మొదలు తొలిసారిగా చాలామంది ఎంసీహెచ్(మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్) 1986 ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ ఎన్నికల్లో మోండా డివిజన్ నుంచి జనతాపార్టీ అభ్యర్థిగా పోటీచేసిన తలసాని, పద్మారావు చేతిలో ఓడిపోయారు. అనంతరం తలసాని 5 పర్యాయాలు ఎమ్మెల్యే గా గెలిచి టీడీపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాల్లో మంత్రిగా పలుశాఖలు నిర్వహించారు. ఇక 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పద్మారావు బీఆర్ఎస్ ప్రభు త్వంలో మంత్రిగానూ, డిప్యూ టీ స్పీకర్‌గా నూ పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కృష్ణయాదవ్ టీడీపీ హయాంలో మంత్రిగానూ, ప్ర భుత్వ విప్‌గానూ పనిచేశారు. మూడుసార్లు ఎమ్మె ల్యే అయిన ముఖేశ్‌గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. తొలుత టీడీపీ కార్పొరేటర్‌గా ఉన్న రాజాసింగ్ బీజేపీ నుంచి రెండు పర్యాయాలు ఎమ్యెల్యేగా ఎన్నికై మూడోసారి పోటీ చేస్తున్నారు. ఓటమి నుంచి గెలుపు.. దోమలగూడ, జవహర్‌నగర్ నుంచి కార్పొరేటర్లుగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ జి.సాయన్న, డా.కె.లక్ష్మణ్ తర్వాతి కాలంలో ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరిలో సాయన్న ఐదు పర్యాయాలు, లక్ష్మణ్ రెండుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. లక్ష్మణ్ ప్రస్తు తం రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. సాయన్న మరణానంతరం ప్రస్తుతం ఆయన కుమార్తె లాస్య నందిత తండ్రి ప్రాతినిధ్యం వహించిన కంటోన్మెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. మూసారాంబాగ్ కార్పొరేటర్‌గా ఓడిపోయిన తీగల కృష్ణారెడ్డి 2002లో జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో మేయర్‌గా గెలిచారు. ఆ తర్వాత మహేశ్వరం నియోజకవర్గం నుంచి 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సీన్ రివర్స్ ►మోండా డివిజన్‌కు పోటీ చేసిన పద్మారావు చేతిలో శ్రీనివాస్‌యాదవ్ కార్పొరేటర్‌గా ఒకసారి, సికింద్రాబాద్ నుంచి శాసనసభ ఎన్నికల్లో ఒకసారి ఓడిపోగా, శ్రీనివాస్‌యాదవ్ చేతిలో ఎమ్మెల్యే ఎన్నికల్లో పద్మారావు ఒకసారి ఓడిపోయారు. ►జవహర్‌నగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గోపాల్ చేతిలో ఓటమిపాలైన లక్ష్మణ్, ముషీరాబాద్‌లో 2014లో గోపాల్‌పై ఎమ్మెల్యేగా గెలిచారు. తిరిగి 2018లో గోపాల్ గెలవగా లక్ష్మణ్ ఓడారు. పార్టీ అధ్యక్షులుగానూ కార్పొరేటర్లుగా పోటీ చేయడం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలైన శ్రీనివాస్‌యాదవ్, కృష్ణయాదవ్ , సాయన్న, ముఠా గోపాల్ హైదరాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్షులుగానూ పనిచేశారు. పద్మారావు టీఆర్ఎస్ గ్రేటర్ అధ్యక్షుడిగా పనిచేశారు. లక్ష్మణ్ బీజేపీ జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. ఎంపీలుగానూ.. ఎంఐఎం వ్యవస్థాపకుడు సలావుద్దీన్ ఒవైసీ సైతం కార్పొరేటర్ నుంచి ఎంపీ స్థాయికి ఎదిగారు. బంజారాహిల్స్ కార్పొరేటర్‌గా చేసిన రేణుకాచౌదరి ఎంపీగా, కేంద్రమంత్రిగానూ పనిచేశారు. ఇలా బల్దియా నుంచి రాజకీయప్రస్థానం ప్రారంభించి తదనంతరం గెలిచినవారు, ఓడిన వారు ఇంకా ఎందరో ఉన్నారు. పలువురు వివిధ ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్లు, డైరెక్టర్లుగానూ పనిచేశారు. కృష్ణారెడ్డి, సు«దీర్‌రెడ్డి హుడా చైర్మన్లుగానూ వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో... పోటీలో సిట్టింగ్ కార్పొరేటర్లు ప్రస్తుతం బల్దియా సిట్టింగ్ కార్పొరేటర్లలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన జగదీశ్వర్‌గౌడ్ శేరిలింగంపల్లి నుంచి , విజయారెడ్డి ఖైరతాబాద్ నుంచి శాసనసభకు పోటీ చేస్తున్నారు. తోకల శ్రీనివాసరెడ్డి(బీజేపీ) రాజేంద్రనగర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. శాస్త్రిపురం కార్పొరేటర్‌గా ఉన్న మహ్మద్ మోబిన్ బహదూర్‌పురా నుంచి ఎంఐఎం అభ్యర్థిగా బరిలో ఉన్నారు. షేక్‌పేట కార్పొరేటర్ రాషెద్ ఫరాజుద్దీన్ జూబ్లీహిల్స్ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. మాజీలు సైతం.. మాజీ కార్పొరేటర్ పరమేశ్వర్‌రెడ్డి ఉప్పల్ నుంచి కాంగ్రెస్ తరపున బరిలో ఉన్నారు. ఎంఐఎం మాజీ కార్పొరేటర్ బి.రవియాదవ్ రాజేంద్రనగర్ నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ మేయర్లు, డిప్యూటీ మేయర్ కూడా జీహెచ్ఎంసీ మేయర్లుగా పనిచేసిన జులి్ఫకర్ అలీ, మాజిద్‌హుస్సేన్ ఎంఐఎం అభ్యర్థులుగా చారి్మనార్, నాంపల్లి నియోజకవర్గాల నుంచి ప్రస్తుతం పోటీ చేస్తున్నారు. డిప్యూటీ మేయర్‌గా పనిచేసిన జాఫర్ హుస్సేన్ ఇప్పటికే రెండు పర్యాయాలు నాంపల్లి ఎమ్మెల్యేగా చేసి మూడోసారి యాకుత్‌పురా నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. వీరిలో జుల్ఫికర్‌అలీ, మాజిద్ హుస్సేన్‌లు మేయర్ల పదవీకాలం ముగిశాక సైతం తిరిగి కార్పొరేటర్లుగానూ పనిచేశారు. మాజిద్ ప్రస్తుతం సిట్టింగ్ కార్పొరేటర్‌గా కూడా ఉన్నారు. తలసాని శ్రీనివాస్‌యాదవ్ సనత్‌నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. సుదీర్‌రెడ్డి ఎల్బీనగర్ నుంచి రెండుపర్యాయాలు గెలిచి మళ్లీ బరిలో ఉన్నారు. ముఠాగోపాల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి, తిరిగి పోటీ చేస్తున్నారు. పద్మారావు సికింద్రాబాద్‌లో మూడుసార్లు గెలిచారు. మళ్లీ బరిలో నిలిచారు. హిమాయత్‌నగర్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణయాదవ్ రూపాంతరం చెందిన అంబర్‌పేట నియోజకవర్గం నుంచి ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా బరి లో ఉన్నారు. -
అప్పు చేసి.. ఆస్తి అమ్మి..
ఎన్నికల బరిలో నిలిచి గెలిచేందుకు అభ్యర్థుల తంటాలు ఎన్నికల ఖర్చు కోసం దొరికిన చోటల్లా అప్పు చేసేవారు కొందరైతే... భూములు, ఆస్తులు అమ్ముతున్నవారు మరికొందరు ఉన్నారు. ఎలాగైనా గెలవాలనే భావనతో ఖర్చు ఎంత అయినా సరే అంటూ బరిలో ఉంటున్నారు. ఆయన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ నియోజకవర్గానికి చెందిన ప్రధాన పార్టీ అభ్యర్థి.. చాలా ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా ఏం వెనకేసుకున్నాడో ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి తెలిసినవారిని, పరిచయం ఉన్నవారిని కలుస్తూ.. కాస్త డబ్బులు సర్దాలంటూ కోరుతున్నారు. చేబదులుగానే కాదు భూమిని తాకట్టు పెట్టి, అప్పులు చేసి మరీ ఎన్నికల ఖర్చు కోసం వీలైనంత సొమ్మును రెడీ చేసుకుంటున్నారు. ‘‘నా దగ్గర ఉన్న డబ్బుకు తోడు అక్కడా ఇక్కడా మరింత సర్దుబాటు చేసుకుంటున్నాను. అవసరం మనది. నానా రకాల పత్రాల మీద సంతకాలు చేయించుకోనిదే ఎవరూ డబ్బులు ఇవ్వట్లేదు..’’ అని సదరు అభ్యర్థి పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యే ఆయన.. ఎన్నికల ఖర్చు కోసం ఇటీవలే తన భూమిని అమ్మేశారు. గతంలో ఇతరులకు అప్పుగా, చేబదులుగా ఇచ్చి న సొమ్మును తిరిగి వసూలు చేసుకునే పనిలో ఉన్నారు. ‘‘ఎన్నికల్లో పోటీ ఎక్కువై, ఖర్చు తడిసిమోపెడు అవుతోంది. భూమిపోతే మళ్లీ కొనుక్కోవచ్చు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలవకపోతే.. ఐదేళ్లదాకా ఆగాల్సిందే. అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు.. దొరికిన చోటల్లా డబ్బు సిద్ధం చేసుకుని అయినా ఈసారి గట్టెక్కాల్సిందే..’’ అని సదరు ఎమ్మెల్యే అంటున్నారు. ... ఇలా ఈ ఇద్దరే కాదు, ఎన్నికల బరిలోకి దిగుతున్న అభ్యర్థులందరిదీ ఇదే మాట. ఇప్పటికే ఎమ్మెల్యేలుగా ఉన్నవారి నుంచి కొత్తగా బరిలోకి దిగుతున్న వారి వరకు ఇదే వరుస. ముందు జాగ్రత్తగా ఇప్పటికే సొమ్ము రెడీ చేసుకుంటున్నవారు కొందరు.. పార్టీల నుంచి టికెట్ ఖరారుకాగానే బరిలోకి దూకేందుకు ప్రయత్నిస్తున్నవారు మరికొందరు. స్వతంత్రులుగానో, ఏదైనా చిన్న పార్టీ నుంచో పోటీ చేయడానికి సిద్ధమైనవారు ఇంకొందరు.. ఎవరిని కదిలించినా ఆఫ్ ది రికార్డుగా ‘ఖర్చు’ కష్టాలను ఏకరవు పెడుతున్నారు. సమయం దగ్గరపడుతుండటంతో..: బీఆర్ఎస్ తరఫున మెజారిటీ ఎమ్మెల్యేలే మళ్లీ బరిలోకి దిగుతున్నారు. బీ–ఫారాలు కూడా అందుకుని ప్రచారమూ ముమ్మరం చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా రెండు జాబితాలు విడుదల చేసింది. బీజేపీ కూడా 53 మంది అభ్యర్థులను ప్రకటించింది. మిగతా సీట్లపై కసరత్తు చేస్తోంది. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో.. ఇప్పటికే టికెట్లు ఖరారైనవారు దూకుడుగా ముందుకు వెళ్తుండగా.. టికెట్ కచ్చి తంగా దక్కుతుందన్న భరోసా ఉన్నవారూ ‘ఖర్చు’ మొదలుపెట్టేశారు. ఇక టికెట్ ఆశిస్తున్నవారూ అస్త్రశ్రస్తాలను సిద్ధంగా పెట్టుకుంటున్నారు. అంతా డబ్బు సమీకరణ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఎంత ఖర్చవుతుంది, ఎంత సమకూరింది, ఇంకా ఎంత అవసరమనే లెక్కలు వేస్తున్నారు. ఎన్నికల కోడ్, తనిఖీల నేపథ్యంలో ఎక్కడికక్కడే నమ్మకస్తులు, అనుచరుల వద్ద డబ్బును సిద్ధంగా పెట్టి.. ఏయే సమయంలో, ఏ ఖర్చులకు వాడాలో సూచిస్తున్నారు. - గౌటే దేవేందర్ -
పీపుల్స్మేనిఫెస్టో
రాష్ట్రంలోని మొత్తం ఓటర్లు 3,17,32,727 మంది. వీరిలో గ్రేటర్‌ను ఆనుకొని రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ఓటర్లు 1,04,90,621 మంది. అంటే దాదాపు మూడోవంతు మంది ఇక్కడే ఉన్నారు. వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారూ ఎందరో ఉన్నారు. నగర ప్రజల మేనిఫెస్టోను అమలు చేయడమంటే రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను అమలు చేసినట్లే. – సాక్షి, హైదరాబాద్ రవాణా.. అతిపెద్ద సమస్య నగరంలోని ప్రజలే కాక ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వస్తున్నవారు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య రవాణా. జిల్లాల నుంచి నగర శివార్లలోకి రెండు గంటలలోపే చేరుకుంటున్నప్పటికీ, అక్కడి నుంచి నగరంలోని గమ్యస్థానాలకు చేరుకునేందుకు రెండున్నర గంటలు పడుతోంది. ఇందుకు పరిష్కారంగా ఇస్నాపూర్ నుంచి షాద్‌నగర్ వరకు, యాదాద్రి నుంచి చౌటుప్పల్ వరకు.. నగరం నలువైపులా ఎటునుంచి ఎటు వెళ్లేందుకైనా మెట్రో రైలు కావాలంటున్నారు. అందరికీ అందుబాటు ధరల్లో ప్రజారవాణా పెరగాలి. ఇప్పటికే పలు ఫ్లై ఓవర్లు నిర్మించినా ట్రాఫిక్ ఇక్కట్లు తీరలేదు. ట్రాఫిక్ జామ్‌లు తప్పేలా లింక్‌రోడ్లు పెరగాలి. అన్ని రద్దీప్రాంతాల్లో ఫుట్ఓవర్ బ్రిడ్జీలుండాలి. వరద ముంపు తప్పాలి విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో వానొస్తే నాలాల్లో మరణాలు తప్పడం లేదు. ఈ సమస్య పరిష్కారానికి నాలాలన్నింటినీ ఆధునీకరించాలి. నాలాల మరణాలు తప్పేలా పటిష్ట చర్యలు చేపట్టాలి. ప్రయాణ దూరాభారం తగ్గించేందుకు మూసీపై 14 వంతెనలు అందుబాటులోకి రావాలి. అపరిమిత ఇంటర్నెట్.. మొబైల్ లేనిదే చేయి విరిగినట్లుగా భావిస్తున్న రోజుల్లో ప్రతి ప్రాంతంలో అన్ని వేళలా ఉచిత ఇంటర్నెట్ ఉంటే ఎంతో మేలంటున్నారు. ప్రజలకు ఆన్లైన్లోనే ఫిర్యాదు చేసే సదుపాయం ఉన్నా, ఇంటర్నెట్కు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉండరాదని, అందులోనూ అంతరాయాలు ఉండొద్దని బలంగా కోరుకుంటున్నారు. గమ్యస్థానాలకు చేరుకునేందుకు, ఆయా ప్రాంతాల్లో రద్దీ తెలుసుకునేందుకు సింగిల్యాప్ లాంటిది కావాలని కోరుకుంటున్నవారెందరో ఉన్నారు. ఉద్యోగాలు.. సొంతిళ్లు.. ఆరోగ్య బీమా పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లతోపాటు సొంతిళ్లు లేనివారికి నెలనెలా ఈఎంఐలతో గృహ సదుపాయం కల్పించాలని నగర ప్రజలు కోరుతున్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ లేదా కనీసం ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అన్ని అలవెన్సులు, సకాలంలో ఉద్యోగాల భర్తీ, పేదలకు ఉచిత వైద్యంతోపాటు అవసరమైన పక్షంలో శస్త్రచికిత్సలకు ఉపకరించేలా ప్రభుత్వమే ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలంటున్నారు. 24 గంటలు స్వచ్ఛమైన నీరు కరెంటు కష్టాలు తీరినప్పటికీ నగరంలో నీటి ఇబ్బందులున్నాయి. నిర్ణీత వేళల్లో కాకుండా 24 గంటలు ఎప్పుడు నల్లా తిప్పినా తాగునీరొచ్చే సదుపాయం ఉండాలంటున్నారు ప్రజలు. -
గ్రేటర్ బీఆర్ఎస్ తొలిజాబితాలో పాతవారికే చోటు
హైదరాబాద్: ఊహించినట్లుగానే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ తొలిజాబితాలో ఒక్కరికి తప్ప సిట్టింగ్ ఎమ్మెల్యేలకే తిరిగి టిక్కెట్లు లభించాయి. కొంత సంశయాత్మకంగా కనిపించిన అంబర్‌పేటలో కాలేరు వెంకటేశ్‌కు, ముషీరాబాద్‌లో ముఠాగోపాల్లకే టిక్కెట్లు ఇచ్చారు. ఎలాంటి ప్రచారం జరిగినా వారు టిక్కెట్లు తమకే లభిస్తాయనే ధీమాను వ్యక్తం చేయగా, అందుకు తగ్గట్లే వారికే తిరిగి అవకాశం లభించింది. కంటోన్మెంట్‌లోనూ సిట్టింగ్‌కు ఇచ్చినట్లే లెక్క. సాయన్న మృతితో ఆ నియోజకవర్గం ఖాళీగా ఉంది. సాయన్న స్థానే ఆయన కుమార్తె లాస్యనందితకు అవకాశం కల్పించారు. లాస్యనందితకు గతంలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఉప్పల్ తిప్పల్.. ఉప్పల్ సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి స్థానంలో బండారి లక్ష్మారెడ్డికి ఇచ్చారు. బండారికి టిక్కెట్ రాకుండా ఉండేందుకు ఆ సీటు కోసం ఎంతో కాలంగా ఆశలు పెట్టుకున్న మాజీ నగర మేయర్ బొంతు రామ్మోహన్, సిట్టింగ్ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి విభేదాలు వీడి సంయుక్తంగా చివరి క్షణంలో ఎమ్మెల్సీ కవితను కలిసినప్పటికీ వారి కోరిక నెరవేరలేదు. అప్పటికే జాబితా ఖరారు కావడంతో వారి ఆశ నిరాశే అయినట్లు తెలిసింది. అంబర్‌పేటలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌కు, స్థానికంగా ఐదుగురు మాజీ కార్పొరేటర్లు, ఒక సిట్టింగ్ కార్పొరేటర్‌కు పొసగడం లేదు. మంత్రి కేటీఆర్ వార్డు కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చిన సమయంలోనూ వారి వైషమ్యాలు బయటపడ్డాయి. కాలేరుకు టిక్కెట్ ఇవ్వొద్దంటూ కూడా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కొంత అయోమయం నెలకొన్నప్పటికీ కాలేరుకే తిరిగి టిక్కెట్ లభించింది. ముషీరాబాద్‌లో వయోభారం వల్లనే ముఠాగోపాల్‌పై కొంత సందిగ్ధత నెలకొన్నప్పటికీ ఆయనకే కేటాయించారు. తమ నాయకులకే తిరిగి టిక్కెట్లు రావడంతో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఓల్డ్‌సిటీలో.. ఓల్డ్‌సిటీలో నాలుగు నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసిన వారికి మళ్లీ టిక్కెట్లు లభించాయి. చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా, యాకుత్‌పురా నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ఓడినా మళ్లీ వారికే టిక్కెట్లిచ్చారు. ఆ నియోజకవర్గాల్లో గెలిచే అవకాశాల్లేకపోవడంతో ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. నాంపల్లి, గోషామహల్ పెండింగ్.. కోర్‌సిటీ (పాత ఎంసీహెచ్) పరిధిలోని నాంపల్లి, గోషామహల్వి మాత్రం పెండింగ్‌లో ఉంచారు. గత 2018 ఎన్నికల్లోనూ నాంపల్లి విషయంలో కొంత గందరగోళం జరిగింది. తొలుత ఎం.ఆనంద్‌కుమార్‌గౌడ్‌కు కేటాయించినప్పటికీ, బీ ఫారం ఇచ్చే సమయానికి మరో ఆనంద్‌గౌడ్‌కు కేటాయించారు. గోషామహల్ ఈసారి నందుబిలాల్కు ఇవ్వనున్నట్లు భావించారు. ఈరెండు స్థానాలు పెండింగ్‌లో ఉంచడంతో అధిష్ఠానం ఆంతర్యం ఏమిటన్నది అంతుబట్టడం లేదు. గోషామహల్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ (బీజేపీ) సస్పెండ్ కాకముందు పకడ్బందీ ప్రణాళికతో ఆయనను ఓడించే అభ్యర్థిని ఎంపిక చేయాలని బీఆర్ఎస్ నేతలు భావించినట్లు సమాచారం. ఆయనపై సస్పెన్షన్‌ను బీజేపీ ఇప్పటికీ తొలగించలేదు. ఈ నేపథ్యంలో రాజాసింగ్‌ను తమవైపు తిప్పుకునే ఆలోచనల్లో బీఆర్ఎస్ ఉందనే అభిప్రాయాలున్నప్పటికీ, తాను ఎట్టిపరిస్థితుల్లోనూ వేరే పార్టీలోకి వెళ్లనని రాజాసింగ్ కుండబద్దలు కొట్టడం తెలిసిందే. మేడ్చల్‌లో ఇలా... మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, ఇందులో నాలుగింటిలో మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే అధిష్థానం అవకాశం కల్పించింది. మేడ్చల్ నియోజకవర్గం నుంచి మంత్రి చామకూర మల్లారెడి, కుత్బుల్లాపూర్ నుంచి కేవీ వివేకానందగౌడ్, కూకట్పల్లి నియోజకవర్గం నుంచి మాధవరం కృష్ణారావు, మ ల్కాజిగిరి నియోజకవర్గం నుంచి మైనంపల్లి హన్మంతరావులను బీఆర్ఎస్ అభ్యర్థులుగా అధిష్థానం ప్రకటించింది. ఉప్పల్ నియోజకవర్గంలో మాత్రం బండారి లక్ష్మారెడ్డికి కొత్తగా అవకాశం ఇచ్చారు. రంగారెడ్డి జిల్లాలో... రంగారెడ్డి జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అన్నిచోట్లా సిట్టింగ్‌లకే అవకాశం కల్పించారు. మహేశ్వరం నియోజకవర్గం నుంచి సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్– దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం–మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కల్వకుర్తి– గుర్క జైపాల్ యాదవ్, షాద్‌నగర్–ఎల్గమోని అంజయ్య యాదవ్, చేవెళ్ల– కాలే యాదయ్య, రాజేంద్రనగర్ ప్రకాష్‌గౌడ్, శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి ఆరికెపూడి గాంధీల పేర్లను అధినేత కేసీఆర్ ప్రకటించారు. అసంతృప్తులు క్షణికమే ? కొన్ని నియోజకవర్గాల్లో టిక్కెటు వారి అసంతృప్తి క్షణికమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉప్పల్‌లో బొంతు రామ్మోహన్, కంటోన్మెంట్లో మన్నె క్రిశాంక్, గజ్జెల నగేష్ వంటి వారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి లేదు. కాగా, కంటోన్మెంట్‌కు చెందిన శ్రీగణేశ్, శేరిలింగంపల్లిలో పార్టీ ప్రధాన కార్యదర్శి బండి రమేశ్‌లు పార్టీ మారనున్నట్లు వారి అనుయాయులు చెబుతున్నారు. ఉప్పల్‌లో బండారి..కంటోన్మెంట్లో లాస్య నందిత 24 స్థానాల్లో ఇద్దరే మహిళలు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో మహిళలకు పెద్దగా చోటు దక్కలేదు. ఈసారి కూడా ఊరించి ఉస్సూరనిపించారని పలువురు ఆశావహ మహిళానేతలు అభిప్రాయపడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని 24 స్థానాల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి సబితా ఇంద్రారెడ్డి యథావిధిగా ఈసారి కూడా పోటీ చేయనున్నారు. కొత్తగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానాన్ని మాత్రం దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందితకు ఈసారి అవకాశం కల్పించారు. దీంతో మొత్తం 24 నియోజకవర్గాల్లో కేవలం ఇద్దరు మహిళలకే అవకాశం లభించింది. అందులోనూ సాయన్న కన్నుమూయడం వల్ల ఆయన కూతురు లాస్య సందితకు అవకాశం ఇచ్చారు. కానీ మహిళా అభ్యర్థిగా ఆ స్థానాన్ని కేటాయించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచాలని ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. వివిధ రాజకీయ పార్టీలు కూడా మద్దతుగా నిలిచాయి. బీఆర్ఎస్ మహిళాశ్రేణులు పెద్ద సంఖ్యలో ఆ ఆందోళనలో పాల్గొన్నారు. కానీ బీఆర్ఎస్లోనే మహిళలకు ఆశించిన స్థాయిలో చోటు దక్కలేదు. మొత్తం 119 స్థానాల్లో ఆరుగురికి మాత్రమే అవకాశం కల్పించగా, గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఇద్దరు మహిళలకు ఆ అవకాశం దక్కింది. మజ్లిస్–బీఆర్ఎస్ ఫ్రెండ్లీ పోటీ బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో పాతబస్తీ రాజకీయాలపై మరోసారి చర్చ మొదలైంది. ఈసారీ ఇక్కడ బీఆర్ఎస్–మజ్లిస్ మధ్య స్నేహపూర్వక పోటీనే ఉంటుందని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే నాంపల్లి మినహా బీఆర్ఎస్ గతంలో ఓడిపోయిన తమ పాత అభ్యర్థులనే తాజాగానూ బరిలోకి దింపింది. గత ఎన్నికల్లో సైతం మజ్లిస్ పార్టీ పోటీ చేయని స్థానాల్లో బాహాటంగా బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించడంతో పాటు ఎన్నికల ప్రచార సభల్లో సైతం అసదుద్దీన్ ఒవైసీ పాల్గొని సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అయితే ఈసారి 50 స్థానాల్లో బరిలో దిగి కనీసం 15 స్థానాలతో అసెంబ్లీలో అడుగుపెడుతామని అక్బరుద్దీన్ ప్రకటించడం ఇటీవల రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. పోటీ చేసే స్థానాలపై ఎలాంటి స్పష్టత ఇవ్వకున్నా..బీఆర్ఎస్తో దోస్తి ఉందంటూ ఒవైసీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. తాజాగా సీఎం కేసీఆర్ కూడా ఫ్రెండ్లీ పార్టీ అంటూనే ఎన్నికల్లో స్నేహపూర్వక పోటీ ఉటుందని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో రెండుమూడు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని క్షేత్రస్థాయి పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సున్నిత ప్రాంతాల్లో నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. రాజధానిలోని దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ఆశావహులు ఉండటం సాధారణం. అధికార పార్టీతో పాటు విపక్షాల్లోనూ ఈ పరిస్థితులు కనిపిస్తుంటాయి. ఆఖరి నిమిషం వరకు అనేక ప్రయత్నాలు చేసే వీళ్ళు టిక్కెట్ దొరక్కపోతే అసమ్మతి రాగం అందుకుంటారు. నిరాశపడిన ఆశావహుల్లో మరికొందరు తన అనుచరులతో కలిసి నేరుగా నిరసనలకు దిగడం, కొందరైతే తాము తెర వెనుక ఉండి అనుచరులను రెచ్చగొట్టడం చేస్తుంటారు. వీళ్ళు చేపట్టే నిరసన కార్యక్రమాల వల్ల ఒక్కోసారి శాంతిభద్రతల సమస్యలు తలెత్తడం, ట్రాఫిక్ ఇబ్బందులు చోటు చేసుకోవడం జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలోనే నగర నిఘా విభాగాలు, రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు అలర్ట్ అయ్యాయి. టిక్కెట్ లభించని ఆశావహులు, వారి ముఖ్య అనుచరుల కదలికలను ఎప్పటికప్పుడు గమనించడంపై దృష్టి పెట్టాయి. దీని కోసం కొన్ని ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అభివృద్ధే విజయానికి సోపానం సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయానికి సోపానాలవుతాయి. జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధే మళ్లీ గెలిపిస్తుంది. – పి.సబితారెడ్డి ప్రజలకు అందుబాటులో ఉంటా ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ పార్టీ ఆదేశాల మేరకు ముందుకెళ్తున్నాం. గత కొన్నేళ్లుగా పార్టీకి అందిస్తున్న సేవలను గుర్తించి సీఎం కేసీఆర్ రెండోసారి యాకుత్‌ఫురా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం సంతోషంగా ఉంది. – సామ సుందర్‌రెడ్డి హమీలన్నీ నెరవేర్చా.. మరోసారి అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు విస్తృతంగా అమలు చేశాం. ఇక్కడి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ దాదాపు నెరవేర్చాను. వచ్చే ఎన్నికల్లోనూ అభివృద్ధే ప్రధాన నినాదంగా ముందుకెళ్తా. విజయం సాధిస్తా. – టి.ప్రకాష్‌గౌడ్ సాక్షి, సిటీబ్యూరో: బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో రాజకీయ వారసత్వానికి బ్రేకులు పడ్డాయి. బీఆర్ఎస్ యువనాయకులుగా కొనసాగుతున్న పలువురు ఎమ్మెల్యేల తనయులకు ఈసారి అవకాశం దక్కలేదు. సీఎం కేసీఆర్ తాజాగా ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ఆ పార్టీ వారసత్వ యువ కిశోరాలను ఊరించి ఉస్సూరుమనిపించింది. మరోసారి వారే... సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కుమారుడు సాయికిరణ్‌కు ఈసారి అవకాశం లభించవచ్చునని భావించారు. ఈ మేరకు ఆయన సనత్‌నగర్‌లో రాజకీయంగా ఎదిగేందుకు సన్నద్ధమయ్యారు. బీఆర్ఎస్ కార్యక్రమాల్లో క్రియాశీలంగా పాల్గొన్నారు. ఆ పార్టీ శ్రేణుల్లోనూ తలసాని వారసుడిగా ఆయన కొడుకు పోటీచేయనున్నట్లు ప్రచారం కూడా జరిగింది. కానీ ఈసారి సాయికిరణ్‌కు అవకాశం దక్కలేదు. మహేశ్వరం నియోజకవర్గం నుంచి మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డికి సైతం అవకాశం లభించలేదు. క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న కార్తీక్‌రెడ్డికి నిరాశే ఎదురయ్యింది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తనయుడు డాక్టర్ రోహిత్ సైతం మైనంపల్లి వారసుడిగా ఎన్నికల బరిలోకి దూకేందుకు సన్నద్ధమయ్యాడు. ఈ మేరకు విస్తృతంగా ప్రచారం సైతం జరిగింది. కానీ యథావిధిగా మైనంపల్లి హనుమంతరావుకే అవకాశం లభించింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కుమారుడు ప్రశాంత్‌రెడ్డి కూడా టిక్కెట్ ఆశించనా ఫలితం దక్కలేదు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కుమారుడు జయసింహ పేరు దాదాపు ఖరారు అని భావించిన తరుణంలో చివరి నిమిషంలో నిలిపివేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మాత్రం ఎమ్మెల్యే సాయన్న కన్నుమూయడంతో ఆ స్థానాన్ని ఆయన కూతురు లాస్యకు కేటాయించారు. -
కామారెడ్డి నుంచే కేసీఆర్ పతనం: షబ్బీర్ అలీ
న్యూఢిల్లీ: సీఎం కేసీఆర్ పతనం కామారెడ్డి నుంచే మొదలవుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. సీఎం పోటీ చేసినా.. ఎవరు పోటీ చేసినా కామారెడ్డి అంటే షబ్బీర్ అని పేర్కొన్నారు. నేను కామారెడ్డి బిడ్డను, ఆశీర్వదించండి అని అడుగుతానన్నారు. గజ్వేల్ నుంచి కేసీఆర్ ఎందుకు పారిపోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ గెలిస్తే ఫామ్‌హౌస్‌కు వెళ్తారు.. నేను గెలిస్తే ప్రజల్లో ఉంటానని తెలిపారు. సంబంధిత వార్త: KCR Press Meet: బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల అభ్యర్థుల ప్రకటనపై కేసీఆర్ ముందే కూశారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారన్న భయంతోనే లిస్ట్ అనౌన్స్ చేశారని విమర్శించారు. గజ్వేల్‌లో ఓటమి భయంతోనే కేసీఆర్ మరోచోటికి వెళ్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్లో కేసీఆర్‌కే దిక్కు లేకుండా పోయిందని, ఆయన బొమ్మ పెట్టుకొని గెలిచే పరిస్థితి లేదని దుయ్యబట్టారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు భట్టి విక్రమార్క. తెలంగాణ తెచ్చుకున్న లక్ష్యం కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని అన్నారు. పీపుల్స్ ప్రభుత్వ ఏర్పాటుకు సమయం వచ్చిందని తెలిపారు. సీఎల్పీ లీడర్‌గా పీపుల్స్ మార్చ్ చేశాక నేడు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిసినట్లు చెప్పారు. పాదయాత్ర అనుభవాలు, రాష్ట్ర రాజకీయాల గురించి ఖర్గేతో చర్చించినట్లు తెలిపారు. ఫిబ్రవరిలోనే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం మొదలైందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. చదవండి: మైనంపల్లి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ సీరియస్.. -
మైనంపల్లి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ సీరియస్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావుపై ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. మంత్రిపై మైనంపల్లి వ్యాఖ్యలు సరికాదని, తామంతా హారీష్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. ఈ మేరకు కేటీఆర్ ట్విటర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ‘తన కుటుంబ సభ్యునికి టికెట్ నిరాకరించారనే ఆవేశంతో మన ఎమ్మెల్యే ఒకరు హరీష్‌పై అవమానకర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే తీరును తీవ్రంగా ఖండిస్తున్నా అంతేగాక మేమంతా హరీష్ రావుకు అండగా ఉంటామని స్పష్టం చేస్తున్నాను. హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. ఆయన పార్టీకి మూలస్తంభంగా కొనసాగుతున్నారు.’ అని పేర్కొన్నారు. అదే విధంగా ఎమ్మెల్సీ కవిత సైతం మైనంపల్లి వ్యాఖ్యలను ఖండించారు.‘తెలంగాణ పట్ల సీనియర్ నాయకులు హరీష్ రావు నిబద్ధత,BRS పార్టీకి, ప్రజలకు వారు చేసిన సేవలు అనిర్వచనీయమైనవి. హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను.’ అని ట్వీట్ చేశారు. చదవండి: మంత్రి హరీష్ రావుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి వార్నింగ్ తెలంగాణ పట్ల సీనియర్ నాయకులు హరీష్ రావు గారి నిబద్ధత మరియు BRS పార్టీకి, ప్రజలకు వారు చేసిన సేవలు అనిర్వచనీయమైనవి. హరీష్ రావు గారి పై చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. — Kavitha Kalvakuntla (@RaoKavitha) August 21, 2023 One of our MLAs who was denied a ticket to his family member in an outburst has made some derogatory comments on Minister Harish Rao Garu I not only strongly condemn the MLA’s behaviour and also want to make it clear that we all stand with @BRSHarish Garu He has been an… — KTR (@KTRBRS) August 21, 2023 మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ తరపున టికెట్ లభించిన వారందరికీ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. అదే విధంగా సిరిసిల్ల అభ్యర్థిగా తనకు మరోసారి అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రజాజీవిత ప్రయాణంలో నిరాశను ఒక అడుగుగా భావించి ముందుకుసాగాలని టికెట్ లభించని వారిని ఉద్ధేశిస్తూ పేర్కొన్నారు. చాలా సామర్థ్యం, అర్హత ఉన్న కే.కృష్ణ (కంటోన్మెంట్ నుంచి టికెట్ ఆశించిన వ్యక్తి) లాంటి కొంతమందికి సీట్లు కేటాయించలేకపోవడం దురదృష్టకరం. ఎమ్మెల్యేగా పోటీకి అవకాశం దక్కని వారికి వేరే రూపంలో ప్రజలకు సేవ చేసుకునే అవకాశం తప్పక లభిస్తుంది’ అని కేటీఆర్ అన్నారు. కాగా 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ సోమవారం ప్రకటించారు. ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. చదవండి: తెలంగాణ కేబినెట్ విస్తరణ.. ఉద్వాసన ఎవరికో? -
‘కమ్యూనిస్టు పార్టీని కేసీఆర్ కరివేపాకులా పడేశారు’
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా చూసి కాంగ్రెస్గెలుపు ఖాయమనే నమ్మకం తెలంగాణ ప్రజలకు కలిగిందని కాంగ్రెస్ ఎంపీ, తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్ రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయడం అంటే.. తన ఓటమిని అంగీకరించినట్లే. ఓటమి భయం ఉన్న కేసీఆర్ కచ్చితంగా ఓడిపోతారు. మధ్యాహ్నం 12.08కి అభ్యర్థులను ప్రకటిస్తామని ముందుగా చెప్పారు. కానీ, ఆ టైంకి లిక్కర్ టెండర్ల డ్రా తీశారు. మహిళల టికెట్ల విషయంలో ఎమ్మెల్సీ కవిత బయటకు వచ్చి మాట్లాడాలి. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో దోస్తానా చేసుకుని.. ఇప్పుడు కరివేపాకులా కమ్యూనిస్టు పార్టీలను వాడుకొని పారేశారు. మోసం చేసిన కమ్యూనిష్టులు కేసీఆర్‌పై తిరుగుబాటు చేయాలి. తెలంగాణ కోసం అత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లిని కేసీఆర్ అవమానించారు అని రేవంత్ మండిపడ్డారు. 12,500 గ్రామ పంచాయతీలకు విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్పోర్ట్, మెట్రో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. బినామీల భూముల విలువ పెంచడానికే ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో వేస్తున్నారు అంటూ ఆరోపణలు గుప్పించారు రేవంత్. నాడు వైఎస్ హయాంలో హైదరాబాద్ ఇంచార్జీ మంత్రి గా షబ్బీర్ ఆలీ సేవలు అందించారు. మైనార్టీ నాయకుడిని ఓడించాలనే కేసీఆర్ కామారెడ్డి లో పోటీ చేస్తున్నారు. ఉచిత విద్యుత్ అంటే నాడు కొందరు బట్టలు అరేసుకోవాలని వెటకారం చేశారు. తెలంగాణ కాడి కేసీఆర్ కింద పడేస్తేనే జానారెడ్డి, కోదండ రామ్ కలిసి JAC ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ హయంలోనే చాలా ప్రాజెక్టులు పూర్తి చేశారు. గత 50 ఏళ్లలో కాంగ్రెస్ ఎం చేసిందో కేసీఆర్ చర్చకు వస్తే చెప్పడానికి సిద్దంగా ఉన్నా అంటూ ప్రతిసవాల్ విసిరారు రేవంత్. రెండు పంటలకు మాత్రమే రైతు బంధు ఎందుకు ఇస్తున్నారు. మూడో పంటకు రైతు బంధు ఎందుకు ఇవ్వడం లేదు. పేదలకు నాలుగు వేల పెన్షన్ ఇస్తాం.. కేసీఆర్ గోడ మీద రాసి పెట్టుకోవాలి. రాష్ట్రంలో ప్రభుత్వం ఏ అగ్రిమెంట్ చేసుకున్నా.. వారంలోపే విదేశాలకు వెళ్తారు. ఓట్ల కోసం డబ్బులు, మద్యం పంచబోము అని యదాద్రి, నాంపల్లి దర్గా, మెదక్ చర్చిలో ప్రమాణం చేయడానికి సిద్దమా ! అంటూ కేసీఆర్‌కు సవాల్ విసిరిన రేవంత్.. పార్టీ ఆదేశిస్తే, కార్యకర్తలు కోరితే నేను ఎక్కడైనా పోటీచేస్తానని ప్రకటించారు. ఇదీ చదవండి: అధిష్టానం చెప్పింది అందుకే కామారెడ్డిల పోటీ- కేసీఆర్ -
BRS List: వివాదాలున్నా... వాళ్లకే టికెట్లు
సాక్షి, హైదరాబాద్: విజయంపై పూర్తి ధీమాతో ఉన్నామని, అందుకే ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులకు ప్రకటిస్తున్నామని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. అలాగే తమది క్రమశిక్షణ ఉన్న పార్టీ అని, పూర్తి స్థాయి వడపోత తర్వాత అభ్యర్థుల ఎంపిక జరిగిందన్నారాయన. అందుకే కేవలం.. ఏడు మార్పులు మాత్రమే చేసినట్లు హైలెట్ చేశారు. అయితే.. చెన్నమనేని లాంటి ఉత్తముడికి పౌరసత్వ వివాదం కారణంగా సీటు కేటాయించలేకపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేసిన కేసీఆర్.. వివాదాలతో వార్తల్లోకి ఎక్కిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్యకు మాత్రం గట్టి షాకే ఇచ్చారు. ఒకవైపు మహిళా సర్పంచ్ ఆరోపణలు, మరోవైపు కడియంతో పొసగక పోవడం.. చివరకు పిలిపించుకుని అధిష్టానం మందలించినా ఆయన వైఖరిలో మార్పు రాలేదని బీఆర్ఎస్ అధిష్టానం భావించింది. దీంతో.. ఆయన స్థానంలో అంతే దూకుడుగా ప్రతివిమర్శలతో విరుచుకుపడుతున్న కడియం శ్రీహరికి అవకాశం ఇచ్చింది. అయితే.. ఏకంగా లైంగిక ఆరోపణలతో వార్తల్లో నిలిచారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. శేజల్ అనే బాధితురాలు వరుసగా చిన్నయ్యపై ఆరోపణలు చేయడం, ఏకంగా ఆత్మహత్యకు యత్నించడం, ఢిల్లీకి చేరి చిన్నయ్యపై వేటు వేయాలంటూ బీఆర్ఎస్ అధినేతకు సైతం విజ్ఞప్తి చేస్తూ రకరకాల రూపాల్లో నిరసనలు కొనసాగించింది. అయినా కూడా దుర్గయ్యకే మరో అవకాశం ఇచ్చారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా విషయంలోనూ అలాగే జరిగింది. పాల్వంచకు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్య కేసులో.. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్ర రావు ఏకంగా అరెస్ట్ అయ్యాడు. ఈ వివాదం ఆధారంగా ప్రతిపక్షాలు ఎమ్మెల్యేపై పలు ఆరోపణలతో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి కూడా. మరోవైపు తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకు ఏకంగా హైకోర్టు ఆయన ఎమ్మెల్యే ఎన్నికపై అనర్హత వేటు వేయడం సంచలనం సృష్టించింది కూడా. అయినప్పటికీ బీఆర్ఎస్ అధిష్టానం వనమాకే మళ్లీ టికెట్ కేటాయించడం గమనార్హం. వీళ్లతో పాటు చిన్న చిన్న వివాదల్లో నిలిచిన మరికొందరికి.. పెద్ద కంప్లయింట్లాగా పరిగణించకుండానే అసెంబ్లీ టికెట్ తిరిగి కేటాయించడం గమనార్హం. మరోవైపు జనగాంలో కిరికిరి జరుగుతున్న నేపథ్యంలో ఆ టికెట్‌ను జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఇవ్వకుండా.. పెండింగ్‌లో ఉంచినట్లు బీఆర్ఎస్ అధినేత స్పష్టం చేశారు. ముత్తిరెడ్డి చుట్టూ వివాదాలున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: కల్వకుంట్ల కవితకు టికెట్ అందుకే ఇవ్వలేదా? బీఆర్ఎస్ అభ్యర్థుల పూర్తి జాబితా.. 1. శ్రీ. కోనేరు కోనప్ప, సిర్పూర్ 2. శ్రీ బాల్క సుమన్, చెన్నూర్ (SC) 3. శ్రీ దుర్గం చిన్నయ్య, బెల్లంపల్లి (SC) 4. శ్రీ నడిపెల్లి దివాకర్ రావు, మంచిర్యాల 5. శ్రీమతి కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ (ఎస్టీ) 6. శ్రీ భూక్య జాన్సన్ రాథోడ్ నాయక్, ఖానాపూర్ (ST) 7. శ్రీ జోగు రామన్న, ఆదిలాబాద్ 8. శ్రీ అనిల్ జాదవ్, బోత్ (ST) 9. శ్రీ. అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, నిర్మల్ 10. శ్రీ గడ్డిగారి విట్టల్ రెడ్డి, ముధోలే 11. శ్రీ ఆశన్నగారి జీవన్ రెడ్డి, ఆర్మూర్ 12. శ్రీ మహమ్మద్ షకీల్ అమీర్, బోధన్ 13. శ్రీ హన్మంత్ షిండే, జుక్కల్ (SC) 14. శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి, బాన్సువాడ 15. శ్రీ జాజాల సురేందర్, ఎల్లారెడ్డి 16. శ్రీ కె. చంద్రశేఖర్ రావు (కెసిఆర్), కామారెడ్డి 17. శ్రీ బిగాల గణేష్ గుప్తా, నిజామాబాద్ అర్బన్ 18. శ్రీ గోవర్ధన్ బాజిరెడ్డి, నిజామాబాద్ రూరల్ 19. శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, బాల్కొండ 20. శ్రీ డా. సంజయ్ కల్వకుంట్ల, కోరుట్ల 21. శ్రీ డా. ఎం. సంజయ్ కుమార్, జగిత్యాల 22. శ్రీ కొప్పుల ఈశ్వర్, ధర్మపురి (SC) 23. శ్రీ కోరుకంటి చందర్, రామగుండం 24. శ్రీ పుట్ట మధు, మంథని 25. శ్రీ దాసరి మనోహర్ రెడ్డి, పెద్దపల్లి 26. శ్రీ గంగుల కమలాకర్, కరీంనగర్ 27. శ్రీ సుంకే రవిశంకర్, చొప్పదండి (SC) 28. శ్రీ చల్మెడ లక్ష్మీ నరసింహారావు, వేములవాడ 29. శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్), సిరిసిల్ల 30. శ్రీ ఎరుపుల బాలకిషన్ (రసమయి), మానకొండూర్ (SC) 31. శ్రీ పాడి కౌశిక్ రెడ్డి, హుజూరాబాద్ 32. శ్రీ వొడితెల సతీష్ కుమార్, హుస్నాబాద్ 33. శ్రీ తన్నీరు హరీష్ రావు, సిద్దిపేట 34. శ్రీమతి ఎం. పద్మా దేవేందర్ రెడ్డి, మెదక్ 35. శ్రీ మహారెడ్డి భూపాల్ రెడ్డి, నారాయణఖేడ్ 36. శ్రీ చంటి క్రాంతి కిరణ్, ఆందోల్ (SC) 37. -------------------- నర్సాపూర్ (పెండింగ్) 38. శ్రీ కొణింటి మాణిక్ రావు, జహీరాబాద్ (SC) 39. శ్రీ చింతా ప్రభాకర్, సంగారెడ్డి 40. శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి, పటాన్చెరు 41. శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక 42. శ్రీ కె. చంద్రశేఖర్ రావు (కెసిఆర్), గజ్వేల్ 43. శ్రీ చామకూర మల్లా రెడ్డి, మేడ్చల్ 44. శ్రీ మైనంపల్లి హనుమంత రావు, మల్కాజిగిరి 45. శ్రీ కూన పాండు వివేకానంద్, కుత్బుల్లాపూర్ 46. శ్రీ మాధవరం కృష్ణారావు, కూకట్పల్లి 47. శ్రీ బండారు లక్ష్మా రెడ్డి, ఉప్పల్ 48. శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం 49. శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎల్.బి.నగర్ 50. శ్రీ పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి, మహేశ్వరం 51. శ్రీ తొలకంటి ప్రకాష్ గౌడ్, రాజేంద్రనగర్ 52. శ్రీ అరెకపూడి గాంధీ, శేరిలింగంపల్లి 53. శ్రీ కాలె యాదయ్య, చేవెళ్ల (SC) 54. శ్రీ కొప్పుల మహేష్ రెడ్డి, పరిగి 55. శ్రీ డా. మెతుకు ఆనంద్, వికారాబాద్ (SC) 56. శ్రీ పైలట్ రోహిత్ రెడ్డి, తాండూరు 57. శ్రీ ముటా గోపాల్, ముషీరాబాద్ 58. శ్రీ తీగల అజిత్ రెడ్డి, మలక్ పేట 59. శ్రీ కాలేరు వెంకటేష్, అంబర్పేట్ 60. శ్రీ దానం నాగేందర్, ఖైరతాబాద్ 61. శ్రీ మాగంటి గోపీనాథ్, జూబ్లీ హిల్స్ 62. శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, సనత్‌నగర్ 63. -------------నాంపల్లి (పెండింగ్) 64. శ్రీ ఐందాల కృష్ణయ్య, కార్వాన్ 65. ---------------- గోషామహల్(పెండింగ్) 66. శ్రీ ఇబ్రహీం లోడి, చార్మినార్ 67. శ్రీ ఎం. సీతారాం రెడ్డి, చాంద్రాయణగుట్ట 68. శ్రీ సామ సుందర్ రెడ్డి, యాకుత్‌పురా 69. శ్రీ అలీ బక్రి, బహదూర్‌పురా 70. శ్రీ టి పద్మారావు, సికింద్రాబాద్ 71. జి. లాస్య నందిత, సికింద్రాబాద్ కాంట్ (SC) 72. శ్రీ పట్నం నరేందర్ రెడ్డి, కొడంగల్ 73. శ్రీ ఎస్. రాజేందర్ రెడ్డి, నారాయణపేట 74. శ్రీ శ్రీనివాస్ గౌడ్ వీరసనోళ్ల, మహబూబ్ నగర్ 75. శ్రీ చర్లకోల లక్ష్మ ర్‌రెడ్డి, జడ్చర్ల 76. శ్రీ ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, దేవరకద్ర 77. శ్రీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి, మక్తల్ 78. శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వనపర్తి 79. శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల్ 80. శ్రీ వి.ఎం. అబ్రహం, అలంపూర్ (SC) 81. శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి, నాగర్ కర్నూల్ 82. శ్రీ గువ్వల బాలరాజు, అచ్చంపేట (SC) 83. శ్రీ గుర్కా జైపాల్ యాదవ్, కల్వకుర్తి 84. శ్రీ అంజయ్య యెలగానమోని, షాద్‌నగర్ 85. శ్రీ బీరం హర్షవర్ధన్ రెడ్డి, కొల్లాపూర్ 86. శ్రీ రవీంద్ర కుమార్ రమావత్, దేవరకొండ (ఎస్టీ) 87. శ్రీ నోముల భగత్, నాగార్జున సాగర్ 88. శ్రీ నల్లమోతు భాస్కర్ రావు, మిర్యాలగూడ 89. శ్రీ శానంపూడి సైదిరెడ్డి, హుజూర్నగర్ 90. శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్, కోదాడ 91. శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి, సూర్యాపేట 92. శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి, నల్గొండ 93. శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మునుగోడు 94. శ్రీ పైళ్ల శేఖర్ రెడ్డి, భోంగిరి 95. శ్రీ చిరుమర్తి లింగయ్య, నక్రేకల్ (SC) 96. శ్రీ గాదరి కిషోర్ కుమార్, తుంగతుర్తి (SC) 97. శ్రీమతి గొంగిడి సునీత, అలైర్ 98. ------------- జనగాం(పెండింగ్) 99. శ్రీ కడియం శ్రీహరి, ఘన్పూర్ స్టేషన్ (SC) 100. శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, పాలకుర్తి 101. శ్రీ D.S. రెడ్యా నాయక్, డోర్నకల్ 102. శ్రీ బానోత్ శంకర్ నాయక్, మహబూబాబాద్ (ST) 103. శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి, నర్సంపేట 104. శ్రీ చల్లా ధర్మారెడ్డి, పర్కల్ 105. శ్రీ దాస్యం వినయ భాస్కర్, వరంగల్ వెస్ట్ 106. శ్రీ నన్నపునేని నరేందర్, వరంగల్ తూర్పు 107. శ్రీ అరూరి రమేష్, వర్ధన్నపేట (SC) 108. శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి, భూపాలపల్లి 109. శ్రీమతి బడే నాగజ్యోతి, ములుగు (ఎస్టీ) 110. శ్రీ రేగా కాంత రావు, పినపాక (ఎస్టీ) 111. శ్రీమతి బానోత్ హరిప్రియ నాయక్, యెల్లందు (ఎస్టీ) 112. శ్రీ పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం 113. శ్రీ కందాల ఉపేందర్ రెడ్డి, పాలేరు 114. శ్రీ లింగాల కమల్ రాజు, మధిర (SC) 115. శ్రీ బానోత్ మదన్‌లాల్, వైరా (ST) 116. శ్రీ సండ్ర వెంకట వీరయ్య, సత్తుపల్లి (SC) 117. శ్రీ వనమా వెంకటేశ్వరరావు, కొత్తగూడెం 118. శ్రీ మెచ్చా నాగేశ్వర్ రావు, అశ్వారావుపేట (ఎస్టీ) 119. శ్రీ డా. తెల్లం వెంకట్ రావు, భద్రాచలం (ఎస్టీ) -
95 నుంచి 105 స్థానాల్లో గెలుస్తాం.. అక్టోబర్ 16న బీఆర్ఎస్ మేనిఫెస్టో
సాక్షి, హైదరాబాద్: అక్టోబరు 16న వరంగల్‌లో సింహగర్జన సభ ఏర్పాటు చేసి.. అదే రోజు బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రకటిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే తొలి అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. నేడు శ్రావణ మాసం మంచి ముహూర్తం కావడంతో ఇదే శుభఘడియగా భావించి మధ్యాహ్నం 2.38 గంటలకు తర్వాత అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 105 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థుల్లో పెద్దగా మార్పులు చేర్పులూ చేయలేదని తెలిపారు. అయితే మొత్తంగా తొమ్మిది స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను మార్చారు. ఇదిలా ఉండగా సీఎం గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్ల నుంచి పోటీలోకి దిగనున్నారు. నాలుగు స్థానాలకు అభ్యర్థుల్ని పెండింగ్ పెట్టారు. చదవండి: BRS List: వివాదాలున్నా వాళ్లకే టికెట్లు బీఆర్ఎస్ సముద్రం లాంటింది అవకాశాలు రాని అభ్యర్థులు హడావిడీ చేసి భవిష్యత్తును పాడుచేసుకోవద్దు అని హితవు పలికారు. పార్టీలోనే ఉండి, అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో తమకు కూడా అవకాశాలు ఉంటాయని చెప్పారు. టికెట్లు రానంత మాత్రాన చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. బీఆర్ఎస్ సముద్రం లాంటిదని, పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికీ అవకాశాలుంటాయని చెప్పారు. రాజకీయ జీవితమంటే ఎమ్మెల్యేగా పని చేయడమే కాదని, ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎంపీ, నామినేటెడ్.. ఇలా అనేక అవకాశాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. చాలా మంది జిల్లా పరిషత్ ఛైర్మన్లు అయ్యే అవకాశం ఉంటుందని, గతంలో అలా చేశాం కూడా అని చెప్పారు. ఈ ఎన్నికల్లోనూ అఖండ విజయం సాధించి తెలంగాణను మరిన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. చదవండి: ‘హైదరాబాద్‌లోని మొత్తం 29 స్థానాల్లో బీఆర్ఎస్, మజ్లిసే గెలుపు’ ఎన్నికలంటే ఇతర పార్టీలకు ఒక గేమ్ మాకు మాత్రం ఒక టాస్క్ - బీఆర్ఎస్ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్ pic.twitter.com/PQcfVb0kI6 — BRS Party (@BRSparty) August 21, 2023 ఎన్నికలంటే బీఆర్ఎస్కు ఓ టాస్క్ ఎన్నికలంటే ఇతర పార్టీలకు పొలిటికల్ గేమ్ అని, బీఆర్ఎస్కు మాత్రం ఓ టాస్క్ అని కేసీఆర్ తెలిపారు. ఎన్నికలను ఒక పవిత్రమైన యజ్ఞంలా ముందుకు తీసుకెళ్తామన్నారు. పూర్తి స్థాయిలో చర్చించి, సంపూర్ణ అవగాహనతోనే అభ్యర్థుల జాబితాను ప్రకటించామన్నారు. నర్సాపుర్, జనగామ, నాంపల్లి, గోషామహల్ స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయని, రాబోయే నాలుగు రోజుల్లో కమిటీ మరోసారి భేటీ అయ్యి, ఈ స్థానాల్లోనూ అభ్యర్థులను వెల్లడిస్తామన్నారు. సీట్లు ప్రకటించిన అభ్యర్థులు పూర్తిగా ప్రజల్లో ఉన్నందునే గుర్తింపు ఇచ్చి మరోసారి టికెట్లు కేటాయించామన్నారు. టికెట్లు పొందిన వారందరికీ అభినందనలు తెలుపుతూ.. అద్భుత విజయం సాధించాలని ఆకాంక్షించారు. -
‘హైదరాబాద్‌లోని మొత్తం 29 స్థానాల్లో బీఆర్ఎస్, మజ్లిసే గెలుపు’
సాక్షి, హైదరాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 95 నుంచి 105 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మజ్లిస్, తాము కలిసి ఉమ్మడి హైదరాబాద్ జిల్లాల్లోని మొత్తం 29 స్థానాల్లో ఇరవై తొమ్మిది తామే గెలుస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్, మజ్లిస్ గెలుస్తాయి కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా మొత్తం 17 ఎంపీ స్థానాల్లోనూ విజయం సాధిస్తాయని తెలిపారు. 2014 నుంచి ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీ మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉందని సీఎం పేర్కొన్నారు. ఇప్పుడు కూడా తమ మధ్య స్నేహం అలాగే కొనసాగుతుందని పేర్కొన్నారు. అలాగే మిత్రపక్షాలను కూడా కలుపుకొని ముందుకు వెళ్తామని చెప్పారు. మరింత ఉజ్వలమైన తెలంగాణ సాధన కోసంప్రజల ఆశీర్వాదం కావాలని కోరారు. బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థులను మనస్పూర్తిగా స్వీకరించి, అందర్నీ గెలిపించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. చదవండి: Kavitha : కూతురు కవిత విషయంలో కేసీఆర్ వ్యూహమేంటీ? -
రెండు చోట్ల పోటీపై కేసీఆర్ స్పందన ఇది
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. సిట్టింగ్ నియోజకవర్గం గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే ఈ నిర్ణయం వెనుక కారణం గురించి మీడియా ఆయన్ని ప్రశ్నించగా.. తనదైన స్టైల్లో స్పందించారాయన. పార్టీ నిర్ణయించింది కాబట్టే తాను రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిపారాయన. ‘‘కేసీఆర్ చరిత్ర మీకు తెల్వదు. కరీంనగర్, రివర్స్‌ల మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచా. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రి నన్ను వ్యక్తిగతంగా కోరారు. వాళ్లే కాదు.. ఇంకొన్ని జిల్లాల వాళ్లు కూడా అడిగారు. చివరగా పార్టీ సంప్రదింపులతో కామారెడ్డి ఫిక్స్ అయ్యాం. అంతేగానీ.. ఇందులో ఏం ప్రత్యేకత లేదు అని తెలిపారాయన. -
బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన.. సీట్లు పోయిన సిట్టింగ్‌లు వీరే
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ షాక్ ఇచ్చారు. మొత్తం తొమ్మిది చోట్ల సిట్టింగ్ అభ్యర్థులను మార్చుతున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ సోమవారం ప్రకటించారు. వేములవాడ, స్టేషన్ ఘన్పూర్, కోరుట్ల, ఉప్పల్, ఖానాపూర్, అసిఫాబాద్, కామారెడ్డి, బోథ్,వైరా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఎన్నికలంటే ఇతర పార్టీలకు ఒక గేమ్ మాకు మాత్రం ఒక టాస్క్ - బీఆర్ఎస్ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్ pic.twitter.com/PQcfVb0kI6 — BRS Party (@BRSparty) August 21, 2023 వీరిలో 2009 నుంచి కామారెడ్డిలో వరుసగా నాలుగు సార్లు గెలిచిన గంపగోవర్దన్ రెడ్డి.. కేసీఆర్ కోసం సీటు త్యాగం చేశారు. ఇక కోరుట్లలో ప్రస్తుత ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయన కొడుకు డాక్టర్ సంజయ్‌కు టికెట్ కేటాయించారు. మిగిలిన ఏడుచోట్ల అభ్యర్థులను మార్చారు. టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు వీరే ►ఉప్పల్ - సుభాష్ రెడ్డి ►బోథ్ - రాథోడ్ బాపూరావు ►ఖానాపూర్ - రేఖా నాయక్ ►అసిఫాబాద్ - ఆత్రం సక్కు ►వైరా - రాములు నాయక్ ►కామారెడ్డి - గంప గోవర్ధన్ ►స్టేషన్ ఘన్పూర్ - రాజయ్య పెండింగ్ స్థానాలు ఇవే ►నర్సాపుర్ ►జనగామ ►నాంపల్లి ►గోషామహల్ కోర్టు కేసు కారణంగా నిరాకరణ ►వేములవాడ - చెన్నమనేని రమేష్ సిట్టింగ్ ల వారసులు వీరే ►కోరుట్ల - ప్రస్తుత ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కొడుకు డాక్టర్ సంజయ్ ►సికింద్రాబాద్ కంటోన్మెంట్ - దివంగత సాయన్న కూతురు లాస్య ఇక హుజూరాబాద్ స్థానంలో కౌశిక్‌రెడ్డి, వేములవాడలో చల్మెడ లక్ష్మీనరసింహారావులు పోటీ చేయనున్నట్లు కేసీఆర్ తెలిపారు. కామారెడ్డి, గజ్వేల్ స్థానాల నుంచి కేసీఆర్ పోటీ చేయనున్నారు. నాలుగు స్థానాలు మాత్రం పెండింగ్‌లో ఉన్నాయని(నర్సాపుర్, జనగామ, నాంపల్లి, గోషామహల్) , ఆక్కడ ఎవరిని నిలబెట్టాలో ఇంకా పరిశీలిస్తున్నట్లు సీఎం చెప్పారు. సీట్లు ప్రకటించిన అభ్యర్థులు పూర్తిగా ప్రజల్లో ఉన్నందునే మరోసారి టికెట్లు కేటాయించామని, వారందరికీ అభినందనలు తెలుపుతూ.. మరోసారి అద్భుత విజయం సాధించాలని కోరారు. మొత్తం 119 స్థానాల్లో ప్రస్తుతం 114 మంది అభ్యర్థులను ప్రకటించగా.. నాలుగు స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. ఎమ్మెల్యే మైనంపల్లికి మల్కాజ్ గిరిలో టికెట్ ఇచ్చామని, ఆయన కొడుకు రోహిత్ కు మెదక్ లో అడిగినా ఇవ్వలేకపోయామన్నారు. ఇవ్వాళ తిరుమలలో మైనంపల్లి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి మాట్లాడిన కెసిఆర్.. మైనంపల్లి పోటీ చేయడం, చేయకపోవడం ఆయన ఇష్టానికే వదిలేస్తున్నామని అన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడాలా? వద్దా? అన్నది మైనంపల్లి నిర్ణయించుకోవాలని చెప్పారు. చదవండి: CR Press Meet: బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల -
CM KCR : కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పోటీ ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. గజ్వేల్ సురక్షితమే అని ప్రచారం జరుగుతున్నా.. మరో స్థానం కూడా సీఎం కెసిఆర్ పోటీ చేయాలని పార్టీలో కొందరు ముఖ్యులు సూచించినట్టు తెలిసింది. గజ్వేల్ వేడేక్కిన రాజకీయం ఇద్దరు ప్రధాన ప్రత్యర్థులు ఇప్పటికే గజ్వేల్ ను లక్ష్యంగా చేసుకున్నారు. ఒకరు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అయితే మరొకరు బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రకటించారు. వీరిద్దరు కూడా గజ్వేల్ లో సీఎం కెసిఆర్ పై పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. అయితే దీనితో సంబంధం లేకుండా.. కెసిఆర్ మరో నియోజకవర్గం కూడా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఉత్తర తెలంగాణపై కామారెడ్డి ఎఫెక్ట్ కామారెడ్డి ఓ రకంగా భౌగోళికంగా కీలకమైన స్థానంలో ఉంది. ఉత్తర తెలంగాణలో పార్టీకి ఉన్న ఊపు కొనసాగాలంటే కామారెడ్డి నుంచి పోటీ చేయడం సరైన నిర్ణయం అని భావించినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కామారెడ్డి నుంచి గంప గోవర్ధన్ విజయం సాధించారు. కామారెడ్డిలో పోటీపై కాంగ్రెస్ విమర్శలు కామారెడ్డిలో పోటీ చేయాలన్న సీఎం కెసిఆర్ నిర్ణయాన్ని తప్పుబట్టారు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ. గజ్వేల్ లో ఓడిపోతననే భయంతోనే కామారెడ్డి వస్తున్నట్లు తెలుస్తోంది, కామారెడ్డిలో ఎవరు పోటీ చేసినా నేనే గెలుస్తానని షబ్బీర్ అలీ తెలిపారు. వైఎస్సార్ హయాంలో ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల పూర్తయితే లక్షలాది ఎకరాలకు సాగు నీరు వచ్చేదని, సాగు నీరు కామారెడ్డి లో ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చారో చెప్పి కేసీఆర్ నామినేషన్ వేయాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. -
బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ తొలి జాబితా ఇదే.. ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా 1. సిర్పూర్ - కోనేరు కోనప్ప 2. చెన్నూర్ (SC) - బాల్క సుమన్ 3. బెల్లంపల్లి (SC) - దుర్గం చిన్నయ్య 4. మంచిర్యాల - నడిపల్లి దివాకర్ రావు 5. ఆసిఫాబాద్ (ST) - కోవా లక్ష్మి 6. ఖానాపూర్ (ST) - భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్ 7. ఆదిలాబాదు - జోగు రామన్న 8. బోథ్ (ST) - అనిల్ జాదవ్ 9. నిర్మల్ - అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి 10. ముధోల్ - జి.విఠల్ రెడ్డి ఉమ్మడి నిజామాబాదు జిల్లా 11. ఆర్మూర్ - ఆశన్నగారి జీవన్ రెడ్డి 12. బోధన్ - షకీల్ అహ్మద్ 13. జుక్కల్ (SC) - హన్మంతు షిండే 14. బాన్సువాడ - పోచారం శ్రీనివాస్ రెడ్డి 15. ఎల్లారెడ్డి - జాజల సురేందర్ 16. కామారెడ్డి - సీఎం కెసిఆర్ 17. నిజామాబాదు (పట్టణ) - గణేష్ గుప్తా బిగాల 18. నిజామాబాదు (రూరల్) - బాజిరెడ్డి గోవర్థన్ 19. బాల్కొండ - వేముల ప్రశాంత్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా 20 కోరుట్ల - కల్వకుంట్ల సంజయ్ 21 జగిత్యాల - డాక్టర్ సంజయ్ కుమార్ 22 ధర్మపురి (SC) - కొప్పుల ఈశ్వర్ 23 రామగుండం - కోరుకంటి చందర్ 24 మంథని - పుట్టా మధు 25 పెద్దపల్లి - దాసరి మనోహర్ రెడ్డి 26 కరీంనగర్ - గంగుల కమలాకర్ 27 చొప్పదండి (SC) - సుంకె రవిశంకర్ 28 వేములవాడ - చలిమెడ లక్ష్మీ నర్సింహారావు 29 సిరిసిల్ల - కె.తారక రామారావు 30 మానుకొండూరు (SC) - రసమయి బాలకిషన్ 31 హుజురాబాద్ - పాడి కౌశిక్ రెడ్డి 32 హుస్నాబాద్ - వడితెల సతీష్ ఉమ్మడి మెదక్ జిల్లా 33 సిద్దిపేట - తన్నీరు హరీష్ రావు 34 మెదక్ - పద్మాదేవేందర్ రెడ్డి 35 నారాయణ్‌ఖేడ్ - మహారెడ్డి భూపాల్ రెడ్డి 36 ఆందోల్ (SC) - చంటి క్రాంతి కిరణ్ 37 నర్సాపూర్ - పెండింగ్ 38 జహీరాబాద్ (SC) - కొనింటి మాణిక్‌రావు 39 సంగారెడ్డి తూర్పు - జయప్రకాశ్ రెడ్డి 40 పటాన్చెరు - గూడెం మహిపాల్ రెడ్డి 41 దుబ్బాక - కొత్తా ప్రభాకర్ రెడ్డి 42 గజ్వేల్ - సీఎం కెసిఆర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉప్పల్ మినహా మిగతా సీట్లలో అభ్యర్థులు యధాతధంగా ఉన్నారు. తనయులకు ఛాన్స్ ఇవ్వాలని సబితారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అంజయ్య యాదవ్ కోరినా.. సీఎం కెసిఆర్ అంగీకరించలేదు. సామాజిక పరంగా చూస్తే.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో 7 రెడ్డిలకు, 2 గౌడ్స్, ఒకటి కమ్మ, ఇద్దరు వెలమ, ఇద్దరు మాదిగ ఉన్నారు. 43 మేడ్చల్ చామకూర మల్లారెడ్డి 44 మల్కాజ్గిరి మైనంపల్లి హన్మంతరావు 45 కుత్బుల్లాపూర్ కూన పండు వివేకానంద 46 కూకట్పల్లి మాధవరం కృష్ణారావు 47 ఉప్పల్ బండారు లక్ష్మా రెడ్డి 48 ఇబ్రహింపట్నం మంచిరెడ్డి కిషన్ రెడ్డి 49 ఎల్బీ నగర్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి 50 మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి 51 రాజేంద్రనగర్ ప్రకాష్ గౌడ్ 52 శేరిలింగంపల్లి అరికెపూడి గాంధీ 53 చేవెళ్ళ (SC) కాలె యాదయ్య 54 పరిగి కొప్పుల మహేశ్వర్ రెడ్డి 55 వికారాబాద్ (SC) మెతుకు ఆనంద్ 56 తాండూరు పైలట్ రోహిత్ రెడ్డి ఉమ్మడి హైదరాబాదు జిల్లా హైదరాబాద్ లో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలుండగా.. రెండు స్థానాలు పెండింగ్ ఉంచారు. ఇద్దరు మైనార్టీలు, ఐదుగురు బీసీలు ( మున్నూరు కాపు, వంజెర, యాదవ్, గౌడ్, గంగపుత్ర), ఒకటి కమ్మ , ఇద్దరు రెడ్డి , ఒకటి మాదిగ అభ్యర్థులు ఉన్నారు. 57 ముషీరాబాద్ ముఠా గోపాల్ 58 మలక్‌పేట్ తీగల అజిత్ రెడ్డి 59 అంబర్పేట్ కాలేరు వెంకటేశ్ 60 ఖైరతాబాద్ దానం నాగేందర్ 61 జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ 62 సనత్‌నగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ 63 నాంపల్లి పెండింగ్ 64 కార్వాన్ అయిందాల కృష్ణయ్య 65 గోషామహల్ పెండింగ్ 66 చార్మినార్ ఇబ్రహీం లోడి 67 చాంద్రాయణగుట్ట సీతారాం రెడ్డి 68 యాకుత్‌పురా సామా సుందర్ రెడ్డి 69 బహదుర్‌పురా అలీ బక్రీ 70 సికింద్రాబాదు టి.పద్మారావు 71 సికింద్రాబాద్ కంటోన్మెంట్ (SC) - లాస్య నందిత ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా 72 కొడంగల్ - పట్నం నరేందర్ రెడ్డి 73 నారాయణపేట - ఎస్.రాజేందర్ రెడ్డి 74 మహబూబ్ నగర్ - శ్రీనివాస్ గౌడ్ 75 జడ్చర్ల - చర్లకోల లక్ష్మారెడ్డి 76 దేవరకద్ర - ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి 77 మఖ్తల్ - చిట్టెం రామ్మోహన్ రెడ్డి 78 వనపర్తి - సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 79 గద్వాల - బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 80 ఆలంపూర్ (SC) - అబ్రహాం 81 నాగర్‌కర్నూల్ - మర్రి జనార్థన్ రెడ్డి 82 అచ్చంపేట్ (SC) - గువ్వల బాలరాజ్ 83 కల్వకుర్తి - గుర్క జైపాల్ యాదవ్ 84 షాద్‌నగర్ - అంజయ్య యాదవ్ 85 కొల్లాపూర్ - బీరం హర్షవర్థన్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా 86 దేవరకొండ (ST) రమావత్ రవీంద్రనాయక్ 87 నాగార్జున సాగర్ నోముల భగత్ 87 మిర్యాలగూడ నల్లమోతు భాస్కర్ రావు 88 హుజుర్నగర్ శానంపూడి సైది రెడ్డి 89 కోదాడ బొల్లం మల్లన్నయాదవ్ 90 సూర్యాపేట గుంటకండ్ల జగదీశ్ రెడ్డి 91 నల్గొండ కంచర్ల భూపాల్ రెడ్డి 92 మునుగోడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 93 భువనగిరి పైళ్ళ శేఖర్ రెడ్డి 94 నకిరేకల్ (SC) చిరుమర్తి లింగయ్య 95 తుంగతుర్తి (SC) గ్యాదరి కిశోర్ 96 ఆలేరు గొంగడి సునీత ఉమ్మడి ఖమ్మం జిల్లా 110 పినపాక (ST) రేగా కాంతారావు 111 ఇల్లెందు (ST) బానోత్ హరిప్రియ నాయక్ 112 ఖమ్మం పువ్వాడ అజయ్ కుమార్ 113 పాలేరు కందాల ఉపేందర్‌రెడ్డి 114 మధిర (SC) లింగాల కమల్ రాజు 115 వైరా (ST) బానోత్ మదన్ లాల్ 116 సత్తుపల్లి (SC) సండ్ర వెంకట వీరయ్య 117 కొత్తగూడెం వనమా వెంకటేశ్వరరావు 118 అశ్వారావుపేట (SC) మచ్చా నాగేశ్వరరావు 119 భద్రాచలం (ST) తెల్లం వెంకట్ రావు I congratulate all the nominees of the @BRSparty for ensuing assembly elections Also thank the Hon’ble Party President Sri KCR Garu for renominating me as a candidate from Siricilla 🙏 Disappointments are to be taken in stride in public life. Unfortunately some very deserving,… — KTR (@KTRBRS) August 21, 2023 -
అప్పుడు సార్ హ్యాండిచ్చింది వీళ్లకే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల నేపథ్యంలో.. సర్వత్రా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సిట్టింగ్‌లలో కొందరికి మళ్లీ సీటు దక్కదనే ఊహాగానాలు బలంగా వినిపిస్తుండడం.. దీనికి తోడు 105 స్థానాలకే ప్రకటిస్తారనే ప్రచారం నేపథ్యంలో.. జాబితాలో ఎవరుంటారనే ఉత్కంఠ బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది. అయితే సిట్టింగ్‌లకు గులాబీ బాస్ హ్యాండ్ ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. 2018 ఎన్నికల సమయంలోనూ ఆయన కొందరు సిట్టింగ్‌లను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేశారు. ఆ జాబితాను పరిశీలిస్తే.. ఉద్యమ సమయంలో క్రియాశీలకంగా వ్యవహరించి.. ఓరుగల్లు రాజకీయాల్లో పట్టున్న కొండా సురేఖకు తిరిగి అవకాశం ఇవ్వలేదు కేసీఆర్. అలాగే.. వికారాబాద్, ఆందోల్, చొప్పదండి, చెన్నూరూ రిజర్వ్డ్ స్థానాల క్యాండిడేట్లను సైతం పక్కన పెట్టేశారు. అప్పటి రంగారెడ్డి జిల్లా పరిధిలోని మేడ్చల్, మల్కాజ్గిరి స్థానాల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సైతం తిరిగి టికెట్లు కేటాయించలేదు. -
KCR Press Meet: బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 2023 ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితా ప్రకటించారు. అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించి అభ్యర్థులను ప్రకటించారు. వరుసగా రెండు పర్యాయాలు తెలంగాణలో అధికారం చేపట్టిన సీఎం కేసీఆర్.. హ్యాట్రిక్ లక్ష్యంగా ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. గెలుపుపై ధీమాతో ఉన్న గులాబీ బాస్.. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే అభ్యర్థుల జాబితా.. అదీ వందకు పైనే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారనే ఊహాగానాలు వినిపించాయి. అందుకు తగ్గట్లే 115 స్థానాలకు అభ్యర్థులకు ప్రకటించారాయన. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, గజ్వేల్, కామారెడ్డి రెండు స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. ఏడు సిట్టింగ్ స్థానాలకు అభ్యర్థులను మార్చారు. నాలుగు స్థానాలకు అభ్యర్థుల్ని పెండింగ్ పెట్టారు(నర్సాపూర్, నాంపల్లి, జనగామ, గోషామహల్ స్థానాలకు అభ్యర్థలను ప్రకటించలేదు). ‘‘2023 ఎన్నికలకు పెద్దగా మార్పుల్లేవ్. మంచి ముహూర్తం ఉండడంతోనే అభ్యర్థుల్ని ప్రకటించాం’’ అని ఈ సందర్భంగా కేసీఆర్ మీడియాకు తెలియజేశారు. పంచమి తిథి కావడంతో.. ఇదే శుభముహూర్తంగా అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. బీఆర్ఎస్ అభ్యర్థుల పూర్తి జాబితా.. 1. శ్రీ. కోనేరు కోనప్ప, సిర్పూర్ 2. శ్రీ బాల్క సుమన్, చెన్నూర్ (SC) 3. శ్రీ దుర్గం చిన్నయ్య, బెల్లంపల్లి (SC) 4. శ్రీ నడిపెల్లి దివాకర్ రావు, మంచిర్యాల 5. శ్రీమతి కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ (ఎస్టీ) 6. శ్రీ భూక్య జాన్సన్ రాథోడ్ నాయక్, ఖానాపూర్ (ST) 7. శ్రీ జోగు రామన్న, ఆదిలాబాద్ 8. శ్రీ అనిల్ జాదవ్, బోత్ (ST) 9. శ్రీ. అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, నిర్మల్ 10. శ్రీ గడ్డిగారి విట్టల్ రెడ్డి, ముధోలే 11. శ్రీ ఆశన్నగారి జీవన్ రెడ్డి, ఆర్మూర్ 12. శ్రీ మహమ్మద్ షకీల్ అమీర్, బోధన్ 13. శ్రీ హన్మంత్ షిండే, జుక్కల్ (SC) 14. శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి, బాన్సువాడ 15. శ్రీ జాజాల సురేందర్, ఎల్లారెడ్డి 16. శ్రీ కె. చంద్రశేఖర్ రావు (కెసిఆర్), కామారెడ్డి 17. శ్రీ బిగాల గణేష్ గుప్తా, నిజామాబాద్ అర్బన్ 18. శ్రీ గోవర్ధన్ బాజిరెడ్డి, నిజామాబాద్ రూరల్ 19. శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, బాల్కొండ 20. శ్రీ డా. సంజయ్ కల్వకుంట్ల, కోరుట్ల 21. శ్రీ డా. ఎం. సంజయ్ కుమార్, జగిత్యాల 22. శ్రీ కొప్పుల ఈశ్వర్, ధర్మపురి (SC) 23. శ్రీ కోరుకంటి చందర్, రామగుండం 24. శ్రీ పుట్ట మధు, మంథని 25. శ్రీ దాసరి మనోహర్ రెడ్డి, పెద్దపల్లి 26. శ్రీ గంగుల కమలాకర్, కరీంనగర్ 27. శ్రీ సుంకే రవిశంకర్, చొప్పదండి (SC) 28. శ్రీ చల్మెడ లక్ష్మీ నరసింహారావు, వేములవాడ 29. శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్), సిరిసిల్ల 30. శ్రీ ఎరుపుల బాలకిషన్ (రసమయి), మానకొండూర్ (SC) 31. శ్రీ పాడి కౌశిక్ రెడ్డి, హుజూరాబాద్ 32. శ్రీ వొడితెల సతీష్ కుమార్, హుస్నాబాద్ 33. శ్రీ తన్నీరు హరీష్ రావు, సిద్దిపేట 34. శ్రీమతి ఎం. పద్మా దేవేందర్ రెడ్డి, మెదక్ 35. శ్రీ మహారెడ్డి భూపాల్ రెడ్డి, నారాయణఖేడ్ 36. శ్రీ చంటి క్రాంతి కిరణ్, ఆందోల్ (SC) 37. -------------------- నర్సాపూర్ (పెండింగ్) 38. శ్రీ కొణింటి మాణిక్ రావు, జహీరాబాద్ (SC) 39. శ్రీ చింతా ప్రభాకర్, సంగారెడ్డి 40. శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి, పటాన్చెరు 41. శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక 42. శ్రీ కె. చంద్రశేఖర్ రావు (కెసిఆర్), గజ్వేల్ 43. శ్రీ చామకూర మల్లా రెడ్డి, మేడ్చల్ 44. శ్రీ మైనంపల్లి హనుమంత రావు, మల్కాజిగిరి 45. శ్రీ కూన పాండు వివేకానంద్, కుత్బుల్లాపూర్ 46. శ్రీ మాధవరం కృష్ణారావు, కూకట్పల్లి 47. శ్రీ బండారు లక్ష్మా రెడ్డి, ఉప్పల్ 48. శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం 49. శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎల్.బి.నగర్ 50. శ్రీ పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి, మహేశ్వరం 51. శ్రీ తొలకంటి ప్రకాష్ గౌడ్, రాజేంద్రనగర్ 52. శ్రీ అరెకపూడి గాంధీ, శేరిలింగంపల్లి 53. శ్రీ కాలె యాదయ్య, చేవెళ్ల (SC) 54. శ్రీ కొప్పుల మహేష్ రెడ్డి, పరిగి 55. శ్రీ డా. మెతుకు ఆనంద్, వికారాబాద్ (SC) 56. శ్రీ పైలట్ రోహిత్ రెడ్డి, తాండూరు 57. శ్రీ ముటా గోపాల్, ముషీరాబాద్ 58. శ్రీ తీగల అజిత్ రెడ్డి, మలక్ పేట 59. శ్రీ కాలేరు వెంకటేష్, అంబర్పేట్ 60. శ్రీ దానం నాగేందర్, ఖైరతాబాద్ 61. శ్రీ మాగంటి గోపీనాథ్, జూబ్లీ హిల్స్ 62. శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, సనత్‌నగర్ 63. -------------నాంపల్లి (పెండింగ్) 64. శ్రీ ఐందాల కృష్ణయ్య, కార్వాన్ 65. ---------------- గోషామహల్(పెండింగ్) 66. శ్రీ ఇబ్రహీం లోడి, చార్మినార్ 67. శ్రీ ఎం. సీతారాం రెడ్డి, చాంద్రాయణగుట్ట 68. శ్రీ సామ సుందర్ రెడ్డి, యాకుత్‌పురా 69. శ్రీ అలీ బక్రి, బహదూర్‌పురా 70. శ్రీ టి పద్మారావు, సికింద్రాబాద్ 71. జి. లాస్య నందిత, సికింద్రాబాద్ కాంట్ (SC) 72. శ్రీ పట్నం నరేందర్ రెడ్డి, కొడంగల్ 73. శ్రీ ఎస్. రాజేందర్ రెడ్డి, నారాయణపేట 74. శ్రీ శ్రీనివాస్ గౌడ్ వీరసనోళ్ల, మహబూబ్ నగర్ 75. శ్రీ చర్లకోల లక్ష్మ ర్‌రెడ్డి, జడ్చర్ల 76. శ్రీ ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, దేవరకద్ర 77. శ్రీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి, మక్తల్ 78. శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వనపర్తి 79. శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల్ 80. శ్రీ వి.ఎం. అబ్రహం, అలంపూర్ (SC) 81. శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి, నాగర్ కర్నూల్ 82. శ్రీ గువ్వల బాలరాజు, అచ్చంపేట (SC) 83. శ్రీ గుర్కా జైపాల్ యాదవ్, కల్వకుర్తి 84. శ్రీ అంజయ్య యెలగానమోని, షాద్‌నగర్ 85. శ్రీ బీరం హర్షవర్ధన్ రెడ్డి, కొల్లాపూర్ 86. శ్రీ రవీంద్ర కుమార్ రమావత్, దేవరకొండ (ఎస్టీ) 87. శ్రీ నోముల భగత్, నాగార్జున సాగర్ 88. శ్రీ నల్లమోతు భాస్కర్ రావు, మిర్యాలగూడ 89. శ్రీ శానంపూడి సైదిరెడ్డి, హుజూర్నగర్ 90. శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్, కోదాడ 91. శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి, సూర్యాపేట 92. శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి, నల్గొండ 93. శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మునుగోడు 94. శ్రీ పైళ్ల శేఖర్ రెడ్డి, భోంగిరి 95. శ్రీ చిరుమర్తి లింగయ్య, నక్రేకల్ (SC) 96. శ్రీ గాదరి కిషోర్ కుమార్, తుంగతుర్తి (SC) 97. శ్రీమతి గొంగిడి సునీత, అలైర్ 98. ------------- జనగాం(పెండింగ్) 99. శ్రీ కడియం శ్రీహరి, ఘన్పూర్ స్టేషన్ (SC) 100. శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, పాలకుర్తి 101. శ్రీ D.S. రెడ్యా నాయక్, డోర్నకల్ 102. శ్రీ బానోత్ శంకర్ నాయక్, మహబూబాబాద్ (ST) 103. శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి, నర్సంపేట 104. శ్రీ చల్లా ధర్మారెడ్డి, పర్కల్ 105. శ్రీ దాస్యం వినయ భాస్కర్, వరంగల్ వెస్ట్ 106. శ్రీ నన్నపునేని నరేందర్, వరంగల్ తూర్పు 107. శ్రీ అరూరి రమేష్, వర్ధన్నపేట (SC) 108. శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి, భూపాలపల్లి 109. శ్రీమతి బడే నాగజ్యోతి, ములుగు (ఎస్టీ) 110. శ్రీ రేగా కాంత రావు, పినపాక (ఎస్టీ) 111. శ్రీమతి బానోత్ హరిప్రియ నాయక్, యెల్లందు (ఎస్టీ) 112. శ్రీ పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం 113. శ్రీ కందాల ఉపేందర్ రెడ్డి, పాలేరు 114. శ్రీ లింగాల కమల్ రాజు, మధిర (SC) 115. శ్రీ బానోత్ మదన్‌లాల్, వైరా (ST) 116. శ్రీ సండ్ర వెంకట వీరయ్య, సత్తుపల్లి (SC) 117. శ్రీ వనమా వెంకటేశ్వరరావు, కొత్తగూడెం 118. శ్రీ మెచ్చా నాగేశ్వర్ రావు, అశ్వారావుపేట (ఎస్టీ) 119. శ్రీ డా. తెల్లం వెంకట్ రావు, భద్రాచలం (ఎస్టీ) -
'కాళేశ్వరం అవినీతిపై యాక్షన్ ఎప్పుడో ప్రారంభమైంది..'
హైదరాబాద్: కాళేశ్వరం అవినీతి మీద యాక్షన్ ఎప్పుడో ప్రారంభమైందని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జి ప్రకాష్ జవదేకర్ అన్నారు. తొందరలోనే బీజేపీ అభ్యర్థుల లిస్టు వస్తుందని చెప్పారు. తమ పార్టీలోకి వచ్చే వాళ్ళే తప్ప.. వెళ్ళే వారు లేరని అన్నారు. బీజేపీలో చేరేవారిని ఈ నెల 27న అందరూ చూస్తారని పేర్కొన్నారు. నేటి ప్రెస్ మీట్ ట్రైలర్ మాత్రమే.. మూవీ త్వరలో చూపిస్తామని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ ఎన్నికల ఇంఛార్జి ప్రకాష్ జవదేకర్ మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో గద్దెనెక్కిన కేసీఆర్.. 9 ఏళ్లలో టీచర్, యూనివర్శిటీల్లో రిక్రూట్మెంట్ చేయలేదని మండిపడ్డారు. ఇచ్చిన నోటిఫికేషన్ లోనూ పేపర్ లీకేజీకి పాల్పడ్డారని దుయ్యబట్టారు. కేసిఆర్ కుటుంబంలో కేటీఆర్, కవిత , సంతోష్, హరీష్ రావు లకు మాత్రమే ఎంప్లాయిమెంట్ దొరికిందని అన్నారు. కేసిఆర్ పర్యటన ఉన్న ప్రాంతాల్లో ప్రతిపక్షాల ముందస్తు అరెస్టు చేస్తున్నారని ప్రకాష్ జవదేకర్ దుయ్యబట్టారు. మాజీ మంత్రి, మహిళ అని చూడకుండా డీకే అరుణను అడ్డుకుని అరెస్ట్ చేయడం ఎంటని మండిపడ్డారు. తాము తెలంగాణ ప్రజల కోసం పోరాడతామని అన్నారు. బీజేపీకి భయపడే తమ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ గణ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: Hanumanth Rao Warns Harish Rao: సిద్దిపేటలో హరీష్ రావు అడ్రస్ గల్లంతు చేస్తా... మైనంపల్లి హనుమంత రావు -
హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్‌కు మంత్రి హరీష్ క్లాస్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్‌గా పని చేస్తున్న గడల శ్రీనివాస్‌కు మంత్రి హరీష్‌రావు క్లాస్ పీకారు. ఇటీవల కాలంలో పలు సందర్భాల్లో రాజకీయ ప్రకటనలు చేస్తూ హడావుడి చేస్తున్న శ్రీనివాస్‌ను హరీష్ సుతిమెత్తగా హెచ్చరించారు. హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్‌కు ఫోన్ చేసిన హరీష్.. రాజకీయ ప్రకటనలు మానుకోవాలంటూ చిన్నపాటి వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారిగా ఉన్నశ్రీనివాస్ వరుసగా రాజకీయ ప్రకటనలు చేయడంతో హరీష్‌రావు ఎట్టకేలకు రంగప్రవేశం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు రంగం సిద్ధం చేసిన నేపథ్యంలో శ్రీనివాస్‌ను హరీష్ హెచ్చరించారు. కొత్తగూడెం టికెట్ ఆశిస్తున్న శ్రీనివాస్‌కు హరీష్‌రావు ఇలా ఫోన్ చేసి చెప్పడం స్వీట్ వార్నింగ్ లాంటిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఆచితూచి..అత్యున్నత హోదా
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక కమిటీ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో తెలంగాణ నేతలకు చోటు కల్పించే విషయంలో అధిష్టానం ఆచితూచి వ్యవహరించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మాజీ ఉప ముఖ్యమంత్రి, మాదిగ సామాజిక వర్గానికి చెందిన దామోదర రాజనర్సింహను సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వనితుడిగా నియమించడం వెనుక పార్టీ హైకమాండ్‌కు భారీ వ్యూహమే ఉందనే చర్చ జరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలోని పార్టీ పరిస్థితులు, సామాజిక సమతుల్యతలను దృష్టిలో ఉంచుకునే, ఎవరూ ఊహించని విధంగా దామోదరకు స్థానం కల్పించారని, దళిత వర్గాలను ఆకట్టుకోవాలనే ఆలోచనతోనే ఆయనకు అత్యున్నత హోదాను కట్టబెట్టారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరో నాయకుడు, విద్యార్థి సంఘం నుంచి పార్టీలో పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డికి కూడా పార్టీ తగిన గుర్తింపు ఇచ్చిందనే చర్చ జరుగుతోంది. చాలాకాలంగా ఆయన ఢిల్లీ కేంద్రంగా పార్టీ వ్యవహారాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఇప్పటికే ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న వంశీ.. పార్టీ పెద్దలకు అనేక అంశాల్లో సహాయకారిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ కేంద్రంగా వంశీ సేవలను వినియోగించుకోవాలన్న ఆలోచనతో ఆయనను ప్రత్యేక ఆహ్వనితుడిగా నియమించినట్టు సమాచారం. అయితే, సీడబ్ల్యూసీలో స్థానం కల్పిస్తారంటూ ప్రచారం జరిగిన కొందరికి చోటు దక్కకకపోవడం, పార్టీపరంగా ఏ మాత్రం ప్రభావం లేని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాయకులకు నేరుగా స్థానం కల్పించి, అధికారంలోకి రావాలని భావిస్తున్న తెలంగాణ నేతలను మాత్రం ఆహ్వనితుల హోదాకు మాత్రమే పరిమితం చేయడంపై రాష్ట్ర పార్టీలో చర్చ జరుగుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి సీడబ్ల్యూసీలో స్థానం దక్కవచ్చనే చర్చ గతంలో జరిగింది. మరో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఆ రేసులో ఉన్నారని, గిరిజన మహిళ కోటాలో సీతక్కకు అవకాశం ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావించారు. కానీ, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం అనూహ్యంగా దామోదర, వంశీలకు స్థానం కల్పించడం గమనార్హం. రేవంత్, భట్టి అభినందనలు కాంగ్రెస్ అత్యున్నత స్థాయి కమిటీ అయిన సీడబ్ల్యూసీలో స్థానం పొందిన తెలంగాణ నేతలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కలు అభినందనలు తెలిపారు. తెలంగాణకు సీడబ్ల్యూసీలో స్థానం కల్పించినందుకు గాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీకి ఆదివారం వారు వేర్వేరు ప్రకటనల్లో కృతజ్ఞతలు తెలిపారు. రాహుల్ వర్గంలో కీలకంగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజుకు కూడా సీడబ్ల్యూసీలో చోటు దక్కడం పట్ల భట్టి హర్షం వ్యక్తం చేశారు. ఆశావహుల్లో అసంతృప్తి! ఇదిలా ఉండగా సీడబ్ల్యూసీలో కచ్చితంగా అవకాశం లభిస్తుందని ఆశించిన రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్గీయులు నారాజ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్ష పదవిని ఆశించిన కోమటిరెడ్డి కొంతకాలం పాటు అసమ్మతితో ఉన్నా ఆ తర్వాత క్రమంగా సర్దుకున్నారు. అయితే అధిష్టానం మాత్రం ఆయనను స్టార్ క్యాంపెయినర్ హోదాకు మాత్రమే పరిమితం చేసింది. ఇటీవల నియమించిన స్క్రీనింగ్ కమిటీలోనూ ఆయనకు చోటు దక్కకపోవడంతో అధిష్టానం ఏదైనా మంచి హోదా కల్పిస్తుందనే ఆశతో కోమటిరెడ్డి శిబిరం ఉంది. కానీ సీడబ్ల్యూసీ లోనూ పేరు కనిపించకపోవడంతో కోమటిరెడ్డి అనుచరులు నైరాశ్యంలో మునిగిపోయారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో తమకు సీడబ్ల్యూసీలో స్థానం దక్కుతుందని భావించిన సీనియర్ నేతలు వీహెచ్, పొన్నాల కూడా హైకమాండ్ తాజా నిర్ణయంతో అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మొదటి నుంచి కాంగ్రెస్ వర్గాల చర్చలో ఉన్న నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి కూడా అవకాశం రాకపోవడం, రాహుల్ దృష్టిలో ఉన్నారని, రేవంత్ కూడా సిఫారసు చేశారని ప్రచారం జరిగి, గిరిజన కోటాలో ఈ సారి చాన్స్ ఉంటుందని భావించిన ఎమ్మెల్యే సీతక్కపేరు కూడా జాబితాలో కనిపించక పోవడంతో వారి మద్దతుదారులు అసంతృప్తిలో మునిగిపోయారు. మొత్తం మీద ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణకు చెందిన మరో ఒకరిద్దరు నేతలకు సీడబ్లూసీలో చోటు కల్పిస్తే బాగుండేదనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో కనిపిస్తోంది. -
కేసీఆర్ సర్కార్‌ది రియల్ ఎస్టేట్ కంపెనీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ అధీనంలోని భూములతోపాటు రైతుల భూములకూ ఎలాంటి రక్షణ లేకుండా పోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పరిపాలనను పక్కనబెట్టిన కేసీఆర్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కంపెనీగా మారిందని మండిపడ్డారు. గ్రామాల్లో ధరణి పేరుతో రైతుల భూములను లాక్కుంటున్నారని, ఇవ్వకుంటే కేసులు పెట్టి బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎన్నికల ముందు ప్రభుత్వ భూములను అమ్ముతోందని. ఇదేమిటని ప్రశ్నించేవారిని అణచివేస్తోందని మండిపడ్డారు. 111 జీవో ఎత్తేసి, హైదరాబాద్ సమీపంలోని విలువైన భూములను కావాల్సిన వ్యాపారులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. నిర్మల్‌లో నిలదీస్తే దాడులా? నిర్మల్ పట్టణంలో మాస్టర్ ప్లాన్ పేరిట భూమాయ జరుగుతోందని.. అధికార పార్టీ నేతలకు అనుకూలంగా, రైతుల భూములను అన్యాక్రాంతం చేసేందుకు కుట్ర జరుగుతోందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. నిర్మల్‌లో సోఫీనగర్ ఇండ్రస్టియల్ జోన్‌ను రెసిడెన్షియల్‌గా మార్చేందుకు జీవో తెచ్చి రైతులకు నష్టం కలిగిస్తున్నారని.. దీనికి వ్యతిరేకంగా రైతులు, ప్రజలు ఆందోళన చేస్తుంటే పోలీసులతో లాఠీచార్జీ చేయిస్తున్నారని విమర్శించారు. పోలీసుల దాడిలో దాదాపు 30 మంది యువకులు తీవ్రంగా గాయపడ్డారని, పలువురి తల పగిలి గాయాలయ్యాయని చెప్పారు. నిర్మల్‌లో మహేశ్వర్‌రెడ్డి చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపేందుకు వెళుతున్న మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను పోలీసులు అడ్డుకున్నారని, మహిళా నాయకురాలనే గౌరవం లేకుండా బలవంతంగా ఈడ్చుకెళ్లి అరెస్ట్‌చేశారని మండిపడ్డారు. పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రశ్నిస్తే అణచివేస్తారా? ఆదిలాబాద్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీజేపీ కార్యకర్తలు, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిపైనా లాఠీచార్జి చేసి, బట్టలు చించారని కిషన్‌రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి సూర్యాపేటకు వెళితే అక్కడి బీజేపీ నేతలను అరెస్టు చేశారన్నారు. సీఎం, ఆయన కుమారుడు ఎక్కడికి వెళ్లినా బీజేపీ, ఇతర ప్రతిపక్షాల నేతలు, కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబంలో అభద్రతాభావం ఏర్పడిందని.. వారి అవినీతికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రశ్నిస్తే అణచివేసే ధోరణి నడుస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం అధికారంలో ఉండేది నాలుగు నెలలేనని, తర్వాత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలని, పక్షపాతం మంచిది కాదని హితవు పలికారు. పోలీసులు మహిళలనూ కొట్టారు: ఈటల తెలంగాణలో పోలీసులు చట్టానికి లోబడి కాకుండా కేసీఆర్ చెప్పినట్టుగా పనిచేస్తున్నారని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. నిర్మల్‌లో వందలమంది మహిళలను మగ పోలీసులు విపరీతంగా కొట్టారని ఆరోపించారు. లంబాడీ మహిళల పట్ల కేసీఆర్ నీచంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాళోజీ టీవీ దాసరి శ్రీనివాస్, బీజేపీ ఐటీ సెల్లో పనిచేసే బొమ్మ శరత్‌లను మఫ్టీలో ఉన్న పోలీసులు పట్టుకుపోయి బయటి ప్రాంతాల్లో తిప్పుతూ విపరీతంగా కొట్టారని.. హుజూరాబాద్‌లో చెల్పూరు సర్పంచ్ మహేందర్‌ను అలాగే కొట్టి హింసించి, పైశాచికానందనం పొందారని ఆరోపించారు. గిరిజన, దళిత మహిళలకు కేసీఆర్ ప్రభుత్వంలో రక్షణ లేదన్నారు. -
23 నుంచి బీజేపీ ఆందోళనలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ తమ కార్యాచరణను వేగవంతం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 23 నుంచి ఆందోళనలను చేపట్టేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సునీల్ బన్సల్, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్‌ల నేతృత్వంలో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు పలు పార్టీ సమావేశాలను నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా నిరసనలు, ఆందోళనలకు యాక్షన్ ప్లాన్ రూపొందించారు. 23 నుంచి ప్రజా ఆందోళనలు: కె.లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన ఉద్యమ కమిటీ సమావేశంలో.. ఈనెల 23 నుంచి నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో ఆందోళన కార్యక్రమాల ప్రణాళికను ఖరారు చేశారు. 23న అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నాలు, నిరసనలు చేపట్టి.. ఆయా ఎమ్మెల్యేలు గత ఐదేళ్ల చేసిన అవినీతి, అక్రమాలు, హామీల ఉల్లంఘనపై చార్జిషిటును విడుదల చేస్తారు. 24న మంత్రుల ఇళ్ల ముట్టడి, ధర్నాలు చేపట్టి.. మంత్రుల అవినీతిపై చార్జిషిటును విడుదల చేస్తారు. 25న జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించి.. కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తారు. అమిత్‌షా పర్యటన, బస్సు యాత్రలపై..: 27న ఖమ్మంలో నిర్వహించే అమిత్‌షా సభకు ఏర్పాట్లపైనా రాష్ట్ర బీజేపీ నేతలు మరో సమావేశంలో చర్చించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాలని నిర్ణయించిన బస్సు యాత్రలపై స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. భద్రాచలం సీతారామ దేవాలయం, బాసర సరస్వతి దేవాలయం, అలంపూర్ జోగులాంబ దేవాలయాల నుంచి బీజేపీ బస్సుయాత్రలను ప్రారంభించనున్నారు. అధికార పార్టీ ఉల్లంఘనలపై ఫోకస్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో.. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీ చేపట్టే కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు స్పందించేలా చేపట్టాల్సిన చర్యలపై చర్చించినట్టు తెలిసింది. ఇక ఈటల రాజేందర్ అధ్యక్షతన జరిగిన ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో.. నియోజకవర్గాల వారీగా పార్టీ అభ్యర్థుల విజయానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. కాగా సోమవారం పార్టీ అనుబంధ సంఘాలైన ఏడు మోర్చాల సమావేశాలను పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించనున్నారు. -
రాజీవ్ కృషితోనే ఐటీ, టెలికాం అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: దేశంలో సాంకేతిక విప్లవం తీసుకురావడమేకాక, రాజ్యాంగ సవరణలతో పల్లెసీమలకు సర్వ హక్కులు కలి్పంచి, సర్వతోముఖాభివృద్ధి కోసం కృషి చేసిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఈనాటి యువతకు ఒక స్ఫూర్తి అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కొనియాడారు. రాజీవ్ కృషితోనే దేశంలో ఐటీ, టెలికాం రంగాల అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ 79వ జయంతి సందర్భంగా ఆదివారం సోమాజీగూడలోని రాజీవ్ విగ్రహానికి టీపీసీసీ నేతలతో కలసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి అధికారాన్ని పేదల చేతిలో పెట్టిన నాయకుడు రాజీవ్ గాంధీ అన్నారు. మహిళలకు స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు, 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత కూడా ఆయనదేనన్నారు. ప్రధాని మోదీ దేశ సంపదను తన మిత్రుడికి దోచిపెడుతుంటే, తెలంగాణలో కేసీఆర్ తన కుటుంబానికి దోచిపెడుతున్నారని, బీజేపీ, బీఆర్ఎస్లది ఫెవికాల్ బంధమని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఈ రెండు పార్టిలకు బుద్ధిచెప్పి రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాలని రేవంత్ పిలుపునిచ్చారు. గాందీభవన్‌లోనూ.. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా గాం«దీభవన్లోనూ ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీపీసీసీ డాక్టర్స్ సెల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, యూత్‌కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఫిషర్మెన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేశారు. రాజీవ్ గాంధీ జీవిత చరిత్రను వివరిస్తూ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఇతర నేతలు దీపాదాస్ మున్షీ, వి.హనుమంతరావు, మధుయాష్కీగౌడ్, మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, సంగిశెట్టి జగదీశ్వర్‌రావు, శివసేనారెడ్డి, మెట్టుసాయికుమార్, రోహిణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ దరఖాస్తులపై విచారణ
-
TSRTC: మహిళలకు శుభవార్త.. రూ.80కే సిటీ మొత్తం చుట్టేయొచ్చు!
సాక్షి, హైదరాబాద్: మహిళలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. వేసవి నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే మహిళల ఆర్థికభారం తగ్గించేందుకు వారికి టీ-24 టికెట్‌ను రూ.80కే అందించాలని నిర్ణయించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించే ఆ టికెట్ ధరను సాధారణ ప్రయాణికులకు రూ.90గా, సీనియర్ సిటిజన్లకు రూ.80గా ఇటీవల టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తగ్గించింది. తాజాగా మహిళా ప్రయాణికులకూ రూ.10 తగ్గించి రూ.80కే అందించాలని నిర్ణయించింది. ఈ కొత్త టి-24 టికెట్ ధర మంగళవారం నుంచి అందుబాటులోకి వస్తుంది. సిటీ పరిధిలో తిరిగే ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోని కండక్టర్ల వద్ద ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయి. అనూహ్య స్పందన ప్రయాణికుల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అందుబాటులోకి తెచ్చిన టి-24 టికెట్‌కు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ తెలిపారు. ''సిటీ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించే ఆ టికెట్ ధరను రూ.100 నుంచి రూ.90కి సంస్థ ఇటీవల తగ్గించింది. కొత్తగా సీనియర్ సిటీజన్లకు రూ.80కే ఆ టికెట్‌ను అందిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు టి-24 టికెట్లను ఎక్కువగా కొనుగోలు చేసి బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఆ ధర తగ్గింపు తర్వాత ప్రతి రోజు సగటున 40 వేల వరకు టి-24 టికెట్లు అమ్ముడవుతున్నాయి. గతంలో రోజుకి 25 వేలు మాత్రమే ఉండే ఆ సంఖ్య గణనీయంగా పెరిగింది. మహిళా ప్రయాణికులకు మరింతగా దగ్గరఅయ్యేందుకు రూ.80కే టి-24 టికెట్ అందించాలని సంస్థ నిర్ణయించింది." అని వారు పేర్కొన్నారు. మహిళలు, సీనియర్ సిటీజన్ల కోసం టి-6 టికెట్ ను ఇటీవల ప్రారంభించామని, రూ.50 కి ఆ టికెట్ ను కొనుగోలు చేస్తే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వారు ప్రయాణించవచ్చని చెప్పారు. అలాగే, కుటుంబ సభ్యులు, స్నేహితుల సౌకర్యార్థం ఎఫ్-24 టికెట్ ను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. వీకెండ్స్, సెలవు రోజుల్లో రూ.300 చెల్లించి నలుగురు 24 గంటల పాటు ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. హైదరాబాద్ సిటీలో తీసుకువచ్చిన టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లను కొనుగోలు చేసి.. క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తోన్న టీఎస్ఆర్టీసీని ప్రజలు ఆదరించాలని కోరారు. సంస్థ ఏ కార్యక్రమం తీసుకువచ్చిన ప్రజలు ప్రోత్సహిస్తున్నారని, వారి ఆదరణ మరువలేనిదని సంస్థ చైర్మన్, ఎమ్యెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ అన్నారు. (చదవండి: TS: జేపీఎస్‌లకు ప్రభుత్వం నోటీసులు.. జాబ్స్ నుంచి తొలగిస్తాం!) -
సొంతింటి ఆశలు తీరే సమయం!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఎన్నోఏళ్లుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారి ఆశలు త్వరలో తీరనున్నాయి. మంత్రి కేటీఆర్ కొత్త సచివాలయం ప్రారంబోత్సవం రోజున డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాల ఫైల్‌పైనే తొలి సంతకం చేయనున్నారు. దీనితో ల ర్థిదారుల ఎంపిక చేపట్టి, ఇళ్లను పంపిణీ చేసేందుకు మార్గం సుగమం కానుంది. నాలుగైదు నెలల్లో ఎన్నికలున్న నేపథ్యంలో.. త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. కొనసాగుతున్న వివరాల అప్లోడింగ్ జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టిన లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో దాదాపు 63వేల వరకు పూర్తయ్యాయి. ల ర్థిదారులను ఎంపిక చేయగానే వాటిని పంపిణీ చేయవచ్చు. మిగతా ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఏడు లక్షలమందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. వారిలో అర్హులను గుర్తించేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించి ఓటరు కార్డు ఆధారంగా వివరాలను అప్లోడ్ చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 3.6 లక్షల మంది వివరాలు అప్లోడ్ చేసినట్టు అధికారులు చెప్తున్నారు. నిజానికి రెండేళ్ల క్రితమే చాలా ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయి. కానీ పంపిణీ చేయకపోవడంతో.. పలుచోట్ల ఇళ్లలోని సామగ్రి దొంగల పాలైంది. మేడ్చల్ జిల్లా పరిధిలో ఎక్కువ ఇళ్లు జీహెచ్ఎంసీలో నిర్మాణం చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఎక్కువశాతం మేడ్చల్ జిల్లా పరిధిలో ఉన్నాయి. ఆ జిల్లాలో 38,419 ఇళ్లు ఉండగా.. హైదరాబాద్ జిల్లాలో 9,453, రంగారెడ్డి జిల్లాలో 23,908, సంగారెడ్డి జిల్లాలో 28,220 ఇళ్లున్నాయి. వీటిలో పాత ఇళ్లు, గుడిసెలను కూల్చి అక్కడే కొత్తగా నిర్మించిన వాటిని మాత్రం ఇప్పటికే పంపిణీ చేశారు. నగరంలో లక్ష ఇళ్ల నిర్మాణానికి సరిపడా స్థలాలు లేనందున శివారు ప్రాంతాల్లో ఎక్కువగా నిర్మించారు. నగరంలో ఉంటున్న వారికి కూడా ఆయా ప్రాంతాల్లో ఇళ్లు కేటాయించనున్నారు. మూడు కేటగిరీలుగా ‘డబుల్’ఇళ్లు అవసరాన్ని బట్టి, ఆయా ప్రాంతాల్లో అందుబాటును బట్టి జీహెచ్ఎంసీలో మూడు కేటగిరీల్లో డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించారు. ♦ సెల్లార్+స్టిల్ట్+9 అంతస్తులు, లిఫ్టులు, ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు. ఒక్కో ఇంటి వ్యయం రూ.8.65 లక్షలు. ♦ స్టిల్ట్+ 5 అంతస్తులు, లిఫ్టులు, మౌలిక సదుపాయాలు. ఒక్కో ఇంటి వ్యయం రూ.8.50 లక్షలు. ♦ లిఫ్టులు లేకుండా గ్రౌండ్+3 అంతస్తులు. మౌలిక సదుపాయాలు. ఒక్కో ఇంటి వ్యయం రూ.7.75 లక్షలు. పేదలకు ఇళ్ల పంపిణీపై కేటీఆర్ తొలి సంతకం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయ భవనంలోని మూడో అంతస్తులో తనకు కేటాయించిన చాంబర్లోకి ఆదివారం మంత్రి కేటీఆర్ అడుగుపెట్టబోతున్నారు. ఈ కార్యాలయం నుంచే ఐటీ, మున్సిపల్, పట్ట ణాభివృద్ధి, పరిశ్రమల శాఖల మంత్రిగా విధులు నిర్వర్తించనున్నారు. కొత్త సచివాలయం నుంచి విధుల నిర్వహణ సందర్భంగా కీలకమైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి సంబంధించిన ఫైల్‌పై తొలి సంతకం చేయనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు మార్గదర్శకాలకు సంబంధించిన ఫైల్ ఇది అని మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. -
ఆకాశ భవనాలు.. రోడ్లపై వాహనాలు ‘ఇంపాక్ట్’..పడేదెప్పుడు?
సాక్షి, హైదరాబాద్ : ట్రాఫిక్‌లో గంటల కొద్దీ ప్రయాణం.. నివాస, వాణిజ్య సముదాయాల నుంచి ఒక్కసారిగా బయటికొచ్చే జనంతో రోడ్లు జామ్.. మూడు, నాలుగు కిలోమీటర్ల దూరానికీ అరగంటకుపైగా పట్టడం.. ఇప్పటికే హైదరాబాద్ వాసులు ఎదుర్కొంటున్న సమస్య ఇది. దీనికితోడు భవిష్యత్తులో మరింత పెరిగే ట్రాఫిక్ చిక్కులకు పరిష్కారంగా తెరపైకి వచ్చినదే ‘ట్రాఫిక్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (టీఐఏ)’. కొత్తగా భారీ భవనాలు, అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాలు నిర్మించదలిస్తే.. ఆయా రహదారుల్లో ఇప్పటికే ఉన్న ట్రాఫిక్, అదనంగా పెరిగే ట్రాఫిక్‌ను పరిశీలించి తగిన నిబంధనలతో అనుమతులు ఇవ్వడమే ‘టీఐఏ’. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) నాలుగేళ్ల కిందటే ఈ మేరకు ప్రతిపాదనలు చేసింది. ఇప్పటికీ అడుగు ముందుకు పడలేదు. ఇదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా రద్దీ ప్రదేశాలు, ప్రధాన రోడ్ల పక్కన భారీ నివాస, వాణిజ్య భవనాలు వెలుస్తూనే ఉన్నాయి. ట్రాఫిక్ ఇబ్బంది పెరిగి పోతూనేఉంది. ‘ట్రాఫిక్ ఇంపాక్ట్’ అంచనా ఇలా.. ఉదాహరణకు ఒక మల్టీప్లెక్స్ భవనం నిర్మించేందుకు అనుమతి ఇవ్వాలంటే భవనం బిల్టప్ ఏరియా, అందులోని సినిమా స్క్రీన్లు, షాపులు ఇలా అన్నీ పరిగణనలోకి తీసుకుంటారు. వీటికి వచ్చిపోయే వారి సంఖ్య, ఆ ప్రాంతంలో పెరగబోయే రద్దీ, సినిమా షోల ప్రారంభ, ముగింపు సమయాల్లో ప్రభావం తదితర అంశాలు బేరీజు వేస్తారు. అక్కడ ప్రస్తుతం ఉన్న రహదారి òపెరగ నున్న రద్దీకి సరిపోతుందో లేదో అంచనా వేస్తారు. ఒకవేళ సరిపోని పక్షంలో రహదారిని విస్తరించేందుకున్న అవకాశాలు, ప్రత్యామ్నాయ మార్గాలు, సమీపంలోని జంక్షన్లు, వాటి వద్ద ఏర్పడబోయే ట్రాఫిక్ పరిస్థితి వంటి వివిధ అంశాలను పరిశీలి స్తారు. తర్వాత షరతులతో అనుమతులిస్తారు. ట్రాఫిక్ సమస్య తలెత్తే పరిస్థితి ఉంటే.. దాని పరిష్కారానికి వీలుగా బిల్డర్ ఎక్కువ సెట్బ్యాక్లు వదలాల్సి ఉంటుంది. లేదా లింక్ రోడ్ల వంటి వాటికి చాన్స్ ఉంటే వేసేందుకు అనుమతిస్తారు. ఒకవేళ జీహెచ్ఎంసీయే రోడ్లు వేస్తే అందుకయ్యే వ్యయాన్ని బట్టి ఇంపాక్ట్ ఫీజు వసూలు చేస్తారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎలాంటిప్రత్యా మ్నాయ పరిష్కారాలు లేని పక్షంలో బహుళ అంతస్తులకు అనుమతులు ఇవ్వకుండా నిరాకరిస్తారు. ఒక్క అడుగూ పడక.. హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ మ రింత జటిలం కాకుండా ఉండేందుకు‘ఇంపాక్ట్’ ఆలోచన చేశారు. కొత్తగా నిర్మించే భవ నాల వల్ల ఆ ప్రాంతంలో ఎంత రద్దీ పెరగనుంది? అప్ప టికే ఉన్న ట్రాఫిక్ ఎంత? కొత్తగా పెరగబోయే వాహనాలు ఎన్ని ఉంటాయి? ఎన్ని వాహనాలకు పార్కింగ్ సదుపాయం ఉంది? పెరిగే ట్రాఫిక్ నుంచి ఉపశమనంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అన్న అంశాలతో ‘ట్రాఫిక్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (టీఐఏ)’ సర్టిఫికెట్‌ను జత పరిచేలా భవన నిర్మాణ నిబంధనల్లో పొందు పర్చేందుకు సిద్ధమయ్యారు. ఇది జరిగి నాలుగేళ్లయినా.. ఇప్పటికీ ముందడుగు పడలేదు. ప్రధాన ప్రాంతాల్లోనూ ఆకాశ హర్మ్యాలు కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ఆకాశ హర్మ్యాలు పెరుగుతున్నాయి. ఎల్బీ నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్‌సిటీ వంటి అత్యధిక రద్దీ ఉండే ప్రధాన ప్రాంతాల్లోనూ ఈ పరిస్థితి కనిపిస్తోంది. దీనితో ప్రభుత్వం వేల కోట్ల ఖర్చుతో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించినా ట్రాఫిక్ సమస్యలు తగ్గకపోగా.. పెరిగిపోతూనే ఉన్నాయి. బంజారాహిల్స్‌లో ఇదివరకు ఉన్న భవనాల గరిష్ట ఎత్తు నిబంధనలను సైతం సవరించి ఆకాశ హర్మ్యాలు అనుమతులు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ ఇక్కట్లున్న కేబీఆర్ పార్కు చుట్టుపక్కల ప్రాంతాల్లో సమస్య మరింత పెరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. గతేడాది వంద ఆకాశ హర్మ్యాలు: గతంలో జీహెచ్ఎంసీ వెలుపల మాత్రమే ఆకాశ హర్మ్యాలను ఎక్కువగా నిర్మించేవారు. ఇటీవలి కాలంలో బల్దియా పరిధిలోనూ ఇవి పెరుగుతున్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో దాదాపు వంద హైరైజ్ భవనాలకు జీహెచ్ఎంసీ అనుమతులిచ్చింది. అంతకుముందు ఏడాది వాటి సంఖ్య 80కిపైనే ఉంది. వారిని తప్పనిసరి చేస్తే మంచిదే.. పెద్ద బిల్డర్లు హైరైజ్, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులలో పార్కింగ్ స్థలం వినియోగం కోసం ట్రాఫిక్ కన్సల్టెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ నిబంధన తప్పనిసరి చేస్తే ప్రతీ ఒక్కరూ పాటిస్తారు. దీనితో ప్రాజెక్టుతోపాటు సదరు ప్రాంతంపై ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు అవకాశం ఉంటుంది. డివైడర్లు, బారికేడ్లు, వీధి దీపాలు వంటి ట్రాఫిక్ వ్యయా లను సీఎస్ఆర్ కింద బిల్డర్ చేపట్టేలా చేయాలి. – నరేంద్ర కుమార్ కామరాజు, ప్రణీత్ గ్రూప్ ఎన్ఓసీ ఉంటేనే.. భవనాల నుంచి వచ్చే వాహనాలు, బయట పార్కింగ్ చేసే వాహనాలతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ పెరుగుతుంది. అందుకే వాణిజ్య సముదాయాలతో పాటు హైరైజ్ నివాస భవనాలకు కూడా ట్రాఫిక్ పోలీసు ఎన్ఓసీ ఉంటేనే అనుమతులు జారీ చేయాలి. 25 అంతస్తులకు మించిన ప్రతి భవనానికి ఈ విధానాన్ని అమలు చేస్తే మంచిది. – కె.నారాయణ్ నాయక్, ట్రాఫిక్ జాయింట్ సీపీ, సైబరాబాద్ -
నేడు, రేపు భగభగలే...!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. పలుచోట్ల 40 డిగ్రీల సెల్సియస్ కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా ఉన్నప్పటికీ మిగతా ప్రాంతాల్లో మాత్రం భానుడి ప్రతాపం కొనసాగింది. గురు, శుక్రవారాల్లో కూడా పలుప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ నుంచి 43 డిగ్రీల సెల్సియస్ మధ్యన ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 41.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 22.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. -
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారు
బహిరంగ సభకు భారీగా ఏర్పాట్లు ప్రధాని మోదీ హాజరయ్యే పరేడ్‌గ్రౌండ్స్ సభకు బీజేపీ రాష్ట్రశాఖ ఆధ్వర్యంలో భారీస్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే జనసమీకరణపై దృష్టి పెట్టిన పార్టీ నాయకత్వం.. పెద్ద సంఖ్యలో కార్యకర్తలను, ప్రజలను తరలించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి జనాన్ని తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సభలో ప్రధాని మోదీతోపాటు పలువురు కేంద్రమంత్రులు, జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు పాల్గొననున్న నేపథ్యంలో భారీస్థాయిలో సభను విజయవంతం చేయడం ద్వారా పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపాలని భావిస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన ఖరారైంది. ఈ నెల 8వ తేదీన రాష్ట్రానికి రానున్న మోదీ.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణతోపాటు పలు రైల్వే, రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దీనితోపాటు పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభలో పాల్గొననున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటనకుప్రాధాన్యత ఏర్పడింది. అటు అభివృద్ధి, ఇటు రాజకీయం అనే ద్విముఖ వ్యూహంతో మోదీ తెలంగాణ పర్యటన సాగనున్నట్టు బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాజకీయ ప్రకంపనల మధ్య.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారిస్తుండటం, కవితను ఈడీ అరెస్టు చేస్తుందనే ప్రచారం, రాష్ట్రంలో సంచలనంగా మారిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు, దానిపై బీఆర్ఎస్–బీజేపీ నేతల మధ్య మాటల మంటలు కొనసాగుతున్నాయి. అంతేగాకుండా ఈసారి ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలన్న ఉత్సాహంతో కమల దళం వ్యూహాలు పన్నుతోంది. బీఆర్ఎస్ సర్కారు, సీఎం కేసీఆర్ కుటుంబం, ఆ పార్టీ నేతలపై దూకుడుగా విమర్శలు ఆరోపణలు చేస్తోంది. ఇందుకు దీటుగా బీఆర్ఎస్ నేతలు విమర్శలు, ప్రత్యారోపణలతో విరుచుకుపడుతున్నారు. ఇలాంటి సమయంలో మోదీ రాష్ట్ర పర్యటన ఉత్కంఠ రేపుతోంది. బహిరంగ సభలో మోదీ ఏం మాట్లాడుతారు, ఎలాంటి విమర్శలు చేస్తారన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. కొన్ని నెలల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రధాని మాట్లాడే అంశాలు, ఆ తర్వాత జరిగే పరిణామాలు.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసేలా ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి వచ్చే 40 ఏళ్ల వరకు కూడా ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలను అందించగలిగేలా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో చేపట్టబోయే అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నారు. ప్రస్తుతం స్టేషన్‌కు 25 వేల మంది ప్రయాణికుల సామర్థ్యం ఉండగా.. భవిష్యత్తులో రద్దీ సమయాల్లో 3,25,000 మందికి సరిపోయేలా రైల్వేస్టేషన్ సామర్థ్యాన్ని పెంచనున్నారు. రైల్వేస్టేషన్లో ప్రస్తుతమున్న 11,427 చదరపు మీటర్ల బిల్డింగ్ ఏరియాను అంతర్జాతీయ ప్రమాణాలతో 61,912 చదరపు మీటర్లకు పెంచటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. టెర్మినల్ బిల్డింగ్ నుంచి అన్ని ప్లాట్‌ఫామ్‌లను కలిపేలా 108 మీటర్ల ప్రత్యేక డబుల్ లెవెల్ వంతెనను ఏర్పాటు చేయనున్నారు. ఆధునీకరణ పనుల్లో భాగంగా ఈస్ట్, వెస్ట్ మెట్రోస్టేషన్లకు, రేతిఫైల్ బస్‌స్టేషన్‌కు నేరుగా కనెక్టివిటీని ఏర్పాటు చేయనున్నారు. మల్టీలెవెల్ కార్ పార్కింగ్, ప్రయాణికులకు ప్రత్యేక మార్గాల ఏర్పాటు వంటి వసతులను కల్పిస్తారు. ప్రధాని కార్యక్రమాలు ఇవీ ఈ నెల 8న తెలంగాణ పర్యటనలో భాగంగా మొత్తం రూ.11,355 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శ్రీకారం చుడతారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి వెల్లడించారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఆయన విడుదల చేశారు. ఆ షెడ్యూల్ ప్రకారం.. ► మోదీ ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి వస్తారు. అక్కడి నుంచి నేరుగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ సికింద్రాబాద్– తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (ఇది దేశంలో ప్రవేశపెట్టనున్న 13వ వందేభారత్ రైలు)ను పచ్చజెండా ఊపి ప్రారంభిస్తారు. ► రూ.715 కోట్ల ఖర్చుతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ చేస్తారు. సికింద్రాబాద్– మహబూబ్‌నగర్ మధ్య రూ.1,410 కోట్ల వ్యయంతో నిర్మించిన 85 కిలోమీటర్ల డబ్లింగ్ రైల్వేలైన్‌ను జాతికి అంకితం చేస్తారు. ► సామాన్య ప్రజల రైలుగా మన్ననలు పొందిన ఎంఎంటీఎస్ ఫేస్–2 లో భాగంగా హైదరాబాద్ శివారు పట్టణాల వరకు నిర్మించిన నూతన రైల్వే లైన్ల మీదుగా నడిచే 13 కొత్త ఎంఎంటీఎస్ సర్వీసులను ప్రారంభిస్తారు. ► ఎంఎంటీఎస్ ఫేస్–2లో భాగంగా బొల్లారం– మేడ్చల్ మధ్య 14 కిలోమీటర్లు, ఫలక్‌నుమా–ఉందానగర్ మధ్య 14 కిలోమీటర్ల కొత్త డబ్లింగ్ లైన్లను నిర్మించారు. ఈ అభివృద్ధి పనులు, వాటి ప్రయోజనాలపై రూపొందించిన షార్ట్ ఫిల్మ్‌ను ప్రధాని తిలకించనున్నారు. ► తర్వాత సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుండి పరేడ్‌గ్రౌండ్‌లో బహిరంగ సభా స్థలికి ప్రధాని చేరుకుంటారు. ► సభా వేదిక వద్దే రూ.7,864 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 6 జాతీయ రహదారులకు, రూ.1,366 కోట్లతో బీబీనగర్ ఎయిమ్స్‌లో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ► అనంతరం బహిరంగ సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. -
ఆకలైతుందా.. తినేసిపో! అంతేరా! దా–తిను!
రెస్టారెంట్ల వ్యాపారంలోకి దిగుతున్నవారు.. భోజన ప్రియుల్ని, ఇంట్లో వంటకు విరామం ఇచ్చి వెరైటీగా హోటల్లో తిందామనుకుని వచ్చే వారిని ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. హంగులు, ఆర్భాటాలతో మెప్పించేవారు కొందరైతే, వినూత్నమైన ఆలోచనలతో థీమ్ బేస్డ్ రెస్టారెంటుల ఏర్పాటు వైపు మరికొందరు మొగ్గుచూపుతున్నారు. ఇంకొందరు మాత్రం..తమ రెస్టారెంట్లు, టేక్ అవేలు, కర్రీ, బిరియానీ పాయింట్లకు..ప్రత్యేక ప్రాంతం, వంటకం, రుచి, అంకెలు, అక్షరాలు ఆధారంగా పేర్లు పెట్టేస్తున్నారు. మనం రోజువారీ ఉపయోగించే కొన్ని పదాలు, వాక్యాలు కూడా రెస్టారెంట్ల పేర్లుగా మారిపోతున్నాయి. వీటిల్లో కొన్ని సరదాగా ధ్వనించే, నవ్వు పుట్టించే పేర్లు కూడా ఉంటుండటం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్‌లో ఈ తరహా ట్రెండ్ ఇటీవల బాగా పెరిగిపోయింది. – సాక్షి, సిటీడెస్క్ ఉడిపి, విలాస్, మిలటరీ స్థానంలో.. ► గతంలో చాలా హోటళ్లకు అన్నపూర్ణ, అజంతా లాంటి సాధారణ పేర్ల తర్వాత ఉడిపి అనో, విలాస్ అనో, మిలటరీ హోటల్ అనో ఉండేది. దేవుళ్లు, కుటుంబసభ్యులు, పిల్ల లు, పెద్దల పేర్లు, ఇంటిపేర్లు కలిసొచ్చేలా పెట్టేవారు. ఇప్పుడ లాంటి పేర్లకు చాలావరకు కాలం చెల్లింది. కొత్త, వింతైన, సరదా పేర్లదే హవా. గ్రేటర్ హైదరాబాద్‌లో అలాంటి పేర్ల మీద ఓ లుక్కేద్దామా.. అన్ని రుచులూ ఇక్కడే.. ఉప్పు కారం (కొండాపూర్), పెప్పర్ అండ్ సాల్ట్ (షేక్‌పేట్), సిల్వర్ సాల్ట్ (బంరాహిల్స్), సాల్ట్ అండ్ పెప్పర్ (లక్డీకాపూల్), టామరిండ్ ట్రీ (చింతచెట్టు (సికింద్రాబాద్), టామరిండ్ (మణికొండ), రాయలసీమ రుచులు (చాలాచోట్ల ఉంది), తెలు గింటి రుచులు (కూకట్పల్లి), రాజుగారి రుచులు (కొత్తగూడ), గోదావరి రు చులు (జూబ్లీహిల్స్), నెల్లూరు రుచులు (మోతీనగర్), రాయలవారి రుచులు (యూసుఫ్‌గూడ), కోనసీమ వంటిల్లు (కూకట్పల్లి), కృష్ణపట్నం (బంజారాహిల్స్), సింప్లీ సౌత్ (జూబ్లీహిల్స్), సింప్లీ తెలంగాణ (కొత్తపేట్), మా పల్లె వంటకాలు (గచ్చిబౌలి). వంటకాలనూ వదలకుండా.. కోడికూర–చిట్టిగారె (జూబ్లీహిల్స్, కొండాపూర్), దిబ్బరొట్టి (మణికొండ), రాజుగారి పులావ్, పొట్లం పులావ్ (శ్రీనగర్ కాలనీ), పకోడా పాపారావు (కేపీహెచ్‌బీ ఫేజ్–1), ఉలవచారు (జూబ్లీహిల్స్), ముద్దపప్పు ఆవకాయ అండ్ మోర్ (గచ్చిబౌలి), నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు (కేపీహెచ్‌బీ, మణికొండ), పంచెకట్టు దోశ (ప్రగతినగర్), పులిహోరాస్ (మణికొండ), బిరియానీ వాలా, బిర్యానీ హౌస్ (బంజారాహిల్స్), కిచిడీ ఎక్స్‌ప్రెస్ (మాదాపూర్). ఆహా.. ఏమి పేర్లు.. ► వివాహ భోజనంబు (సికింద్రాబాద్, బంజారాహిల్స్), వియ్యాలవారి విందు (కొత్త పేట్), అద్భుత: (దిల్సుఖ్నగర్), తినే సిపో (కొంపల్లి), తిన్నంత భోజనం (ఉప్ప ల్, సికింద్రాబాద్), దా–తిను (హఫీజ్‌పేట), పొట్ట నింపు (గుండ్ల పోచంపల్లి), కడుపు నిండా (ఉప్పల్), భలే బంతి భోజనం (మియాపూర్), రా బావా తిని చూడు (కూకట్పల్లి), సెకండ్ వైఫ్, పందెం కోడి (వెంగళరావునగర్), అంతేరా (జూబ్లీహిల్స్), ఆకలైతుందా?.. పంచభక్ష్య (కూకట్పల్లి), మాయా బజార్ (కార్ఖానా), పందెం కోడి (వెంగళరావునగర్), విలేజ్ వంటకాలు, ఆహా (షేక్‌పేట), పాకశాల (కూకట్పల్లి), విస్తరాకు, అరిటాకు భోజనం (అమీర్‌పేట), లలితమ్మగారి భోజనం (బంజారాహిల్స్), బాబాయ్ భోజనం (నేరేడ్మెట్), తాళింపు (అమీర్‌పేట), గోంగూర (బంజారాహిల్స్), ఘుమఘుమలు (మాదాపూర్). ప్రాంతీయతకు ప్రతిరూపం..‘అంతేరా’ రెస్టారెంట్ ప్రారంభించాలనుకున్నప్పుడు ప్రాంతీయత ప్రతిబింబించేలా పేరు పెట్టాలనుకున్నాం. ఏదో ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా ’ఆంధ్రా తెలంగాణ రాయలసీమ’ సమ్మేళనంతో ఆ పేర్ల లోని మొదటి అక్షరాలతో ‘అంతేరా’పేరును ఎంచుకున్నాం. ఈ మూడు ప్రాంతాల రుచులను అందిస్తున్నాం. – నిర్వాహకులు,అంతేరా రెస్టారెంట్ థీమ్‌తో ఫామ్‌లోకి.. ► కొందరు నిర్వాహకులు థీమ్/కాన్సెప్ట్ బేస్డ్ రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తూ భోజనప్రియుల్ని ఆకర్షిస్తున్నారు. రైలు, గుహలు, అడవులు, పల్లె వాతావరణం, జైళ్లు, బీచ్ ఆధారంగా చేసుకుని రెస్టారెంట్లు వెలుస్తుండటం గమనార్హం. గుహను తలపించేలా ఏర్పాటు చేసిన గుఫా ఓహ్రీస్ (బషీర్‌బాగ్), అడవి వాతావరణాన్ని తలపించేలా ఏర్పా టు చేసిన మారేడుమిల్లి (గచ్చి బౌలి), జైలును గుర్తుకు తెచ్చే జైల్ మండి (చాలాచోట్ల ఉంది).. ఖైదీ కిచెన్ (బంజారాహిల్స్), రైల్లో ఉన్నట్టుగా ఉండే జర్నీ 1853 (బంజారాహిల్స్) ఈ కోవలోనివే. ఇక బొమ్మ రైలు మీద భోజనం రావడం (ప్లాట్‌ఫామ్ 65), రోబో ఆహారం సర్వ్ చేయడం (రోబో కిచెన్, జూబ్లీహిల్స్) లాంటి ప్రత్యేకతలతో కూడిన రెస్టారెంట్లు కూడా నగరంలో వెలిసి కస్టమర్లను అలరిస్తున్నాయి. వియ్యాలవారి విందు. బహు పసందు మా హోటల్లో అన్నీ ప్రత్యేక వంటకాలే. తెలుగు రుచులు మా సొంతం. వెరైటీగా ఉంటుందని వియ్యాలవారి విందు పేరు పెట్టాం. అందరూ వియ్యాల వారిని ఏ లోటు లేకుండా ఎలా చూసుకుంటారో అదే తరహాలో ఆతిథ్యం ఇస్తున్నాం. – సీహెచ్ఆర్వీ నర్సింహారెడ్డి, వియ్యాల వారి విందు నిర్వాహకుడు బావలకు ఇచ్చే మర్యాదే ఇస్తాం ఇంటికి వచ్చిన బావకి ఏ విధంగా మర్యాద చేస్తారో అదే విధంగా మా హోటల్‌కు వచ్చినవారికి ఇస్తాం. ఈ ఆలోచనతోనే ‘రా బావా.. తిని చూడు’అని మా హోటల్‌కి పేరు పెట్టాం. – రామకృష్ణారెడ్డి, ‘రా బావ తిని చూడు’యజమాని అక్షరాలు, నంబర్లు.. ► మండీ 36 (జూబ్లీహిల్స్), 1980 మిలటరీ హోటల్ (మణికొండ, సైనిక్‌పురి),అంగారా 5 (బంజారాహిల్స్), శ్యాల 95ఏ (మాదా పూర్), వై2కే (పంజగుట్ట), ఎన్ గ్రాండ్ (కార్ఖానా), ఎం గ్రాండ్ (వనస్థలిపురం), బీ ప్లేస్ (అయ్యప్ప సొసైటీ), డీ కార్పెంటర్ (మాసబ్‌ట్యాంక్), ఏ2జెడ్ (జీడిమెట్ల). కడుపారా ’తిన్నంత భోజనం’.. ‘తిన్నంత భోజనం’లో ఆత్మీయత, అనుబంధం కనిపిస్తుంది. మా వద్దకు వచ్చే కస్టమర్ మాకు బంధువుతో సమానం. చుట్టాల ఇంటికి వెళితే కడుపు నిండా అన్నం పెట్టి తమ ప్రేమను చాటుకుంటారు. మా రెస్టారెంట్‌కు వచ్చినా అంతే. – గాంధీ మిర్యాల, తిన్నంత భోజనం వ్యవస్థాపకులు -
గ్రేటర్ హైదరాబాద్ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఆఫర్స్
-
HYD: డొక్కు బస్సులే దిక్కా?
సాక్షి, సిటీబ్యూరో: ఏడాదికోసారి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెడుతూనే ఉంది. ప్రతి సంవత్సరం ఊరించి ఉసూరుమనిపిస్తూనే ఉంది. ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్లో ఏళ్లకు ఏళ్లుగా కాలం చెల్లిన సిటీ బస్సులే నడుస్తున్నాయి. దశాబ్ద కాలంగా ఒక్క కొత్త బస్సు కూడా రోడ్డెక్కలేదు. మరోవైపు హైదరాబాద్ మహానగరం విస్తరిస్తోంది. ఔటర్‌కు వెలుపల సైతం వదలాది కాలనీలు వెలిశాయి. ఆయా కాలనీలన్నీ ప్రజా రవాణాకు దూరంగానే ఉన్నాయి. ప్రైవేట్ వాహనాలు, ఆటోలు, వ్యక్తిగత వాహనాలపైనే ఆధారపడి లక్షలాది మంది నగరవాసులు రోజువారీ రాకపోకలు సాగిస్తున్నారు. పొరుగున ఉన్న ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో ప్రజా రవాణా పరుగులు తీస్తుండగా హైదరాబాద్‌లో మాత్రం చతికిలపడటం గమనార్హం. ఈ– బస్సులేవీ? రెండేళ్లుగా ఎలక్ట్రిక్ బస్సులపై ఊరిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్క సర్వీసు కూడా అందుబాటులోకి రాలేదు. అద్దె ప్రాతిపదికన ఈ బస్సులను నడిపేందుకు గతేడాది టెండర్ల ఆహ్వానించారు. కొన్ని సంస్థలు ముందుకొచ్చాయి. వాటిలో ఒక సంస్థ సాంకేతిక సామర్థ్యంపై అనర్హత కారణంగా టెండర్ల ప్రక్రియలో వివాదం చోటుచేసుకుంది. అనంతరం న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ వివాదం పరిష్కారమైనప్పటికీ ఇంకా ప్రతిష్టంభన తొలగిపోలేదు. దీంతో గతేడాది డిసెంబర్ నాటికే నగరంలోని వివిధ మార్గాల్లో సుమారు 300 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని భావించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. ప్రస్తుతం గ్రేటర్‌లోని 28 డిపోల పరిధిలో సుమా రు 2,850 బస్సులు ఉన్నాయి. వీటిలో కనీసం వెయ్యికిపైగా డొక్కు బస్సులే. కాలం చెల్లిన వీటితోనే ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నారు. ప్రతి రోజు సుమారు 22 లక్షల మంది ప్రయాణం చేస్తుండగా ఈ అరకొర బస్సులతోనే ఆర్టీసీ అధికారులు పాట్లు పడుతున్నారు. ప్రయాణికుల డిమాండ్ మేరకు బస్సులను ఏర్పాటు చేయలేకపోతున్నట్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. శివారు ప్రాంతాల్లోని కాలనీలకు రోజుకు 8 ట్రిప్పుల డిమాండ్ ఉంటే కేవలం 4 ట్రిప్పులే నడుపుతున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 6 వేల బస్సులు అవసరం.. రవాణారంగ నిపుణుల అంచనా మేరకు విస్తరిస్తున్న హైదరాబాద్ అవసరాల మేరకు ఇప్పటికిప్పుడు కనీసం 6 వేల బస్సులు కావాలి. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో వేలకొద్దీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. బెంగళూరులో నిత్యం 6వేల బస్సులు నడుస్తుండగా అదనంగా మరిన్ని కొనుగోలుకు చర్యలు చేపట్టారు. ముంబైలో ఎలక్ట్రిక్ డ బుల్ డెక్కర్ బస్సులు అందుబాటు లోకి వచ్చాయి. వాహన కాలుష్య నియంత్రణ కోసం ఢిల్లీలో సీఎన్జీ బస్సులను భారీ ఎత్తున కొనుగోలు చేసి నడుపుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో అందుకు విరుద్ధంగా బస్సుల సంఖ్య తగ్గిపోవడం గమనార్హం. -
పని మధ్యలో ఆఫీసులో కునుకేస్తే! దీనిపై నిపుణులు ఏమంటున్నారు?
సాక్షి, హైదరాబాద్: పొద్దున లేస్తే హడావుడి. ఇంట్లో పనులు చక్కబెట్టుకుని ఆఫీసుకు పరుగులు పెట్టాలి. ఉదయం 9–10 గంటల నుంచి సాయంత్రం 5–6 గంటల వరకు పనేపని. ఆఫీసు నుంచి బయల్దేరగానే సరుకులు తీసుకెళ్లడమో, మరేదైనా చోటికి వెళ్లడమో ఆలోచనలు. మొత్తంగా అన్నీ కలిసి ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి నెలకొంటుంది. ఆఫీసులో ఉదయం ఉత్సాహంగానే ఉన్నా.. మధ్యాహ్నం కల్లా నీరసం వచ్చేస్తుంది. ఈ క్రమంలోనే కాసేపు కునుకు తీసి, రీఫ్రెష్ అయ్యేందుకు కంపెనీలు వీలు కల్పిస్తున్నాయి. ‘షార్ట్ స్లీప్ ఇన్ ఆఫీస్’ కరోనా మహమ్మారి తర్వాతి పరిస్థితుల్లో ఆఫీసు పని విధానాల్లో చాలా మార్పులు వచ్చాయి. వర్క్ ఫ్రం హోంతో మొదలై హైబ్రిడ్ మోడల్ వరకు చేరాయి. ఇటీవలికాలంలో షార్ట్ స్లీప్ ఇన్ ఆఫీస్ (స్వల్ప నిద్ర) విధానం మొదలైంది. ఆఫీసు పని సమయంలో మధ్యలో స్వల్ప విశ్రాంతి తీసుకునే వెసులుబాటును పలు సంస్థలు కల్పిస్తున్నాయి. ఇందుకోసం కార్యాలయంలోనే నిద్ర పోయేందుకు వీలుగా ఏర్పాట్లను చేస్తున్నాయి. ఇలా విశ్రాంతి ఇవ్వటంతో ఉద్యోగుల్లో ఒత్తిడి తగ్గి, రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారని, ఉత్పాదకత పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. స్టార్టప్ కంపెనీల్లో ఎక్కువగా.. సాధారణ ఆఫీసులలో లాగా స్టార్టప్ కంపెనీలలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు అంటూ పనివేళలు ఉండవు. ఉదయం, సాయంత్రం మరింత ఎక్కువ సమయం పనిచేయాల్సి ఉంటుంది. అలాంటి సంస్థలలో ఉద్యోగులకు పనిమధ్యలో కాసేపు విశ్రాంతి ఇస్తే.. అన్ని వేళల్లో ఒకేరకమైన ఏకాగ్రతతో పనిచేయగలుగుతారని నిపుణులు చెప్తున్నారు. ఫర్నిచర్ కంపెనీ వేక్‌ఫిట్ తాజాగా ‘రైట్ టు న్యాప్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో ప్రతి ఉద్యోగి రోజూ మధ్యాహ్నం 2 నుంచి 2.30 గంటల వరకు కునుకు తీయవచ్చు. నిద్ర ఒక్కటే కాదు.. ఆఫీసులో నిద్ర గదులేకాదు.. బ్రేక్ అవుట్ జోన్లు, మీటింగ్‌లు లేనిరోజు వంటి వినూత్న పని విధానాలను కూడా సంస్థలు అందుబాటులోకి తెస్తున్నాయి. ఉద్యోగుల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నాయి. ఎక్కువసేపు ఒకేచోట కూర్చోకుండా మధ్యలో కాసేపు వాకింగ్, ధ్యానం చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నాయి. టేబుల్ టెన్నిస్, క్యారమ్స్ వంటి ఇండోర్ గేమ్స్‌లను కూడా అందిస్తున్నాయి. వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగులకు మీటింగ్‌లు లేని వారం, రోజు అని ముందుగానే సమాచారం ఇస్తున్నాయి. దీంతో ఉద్యోగులు జాబ్ తర్వాత వ్యక్తిగత పనుల షెడ్యూల్‌ను ప్లాన్ చేసుకునే వీలు ఉంటుంది. ఏ కంపెనీలలో ఉందంటే.. లీసియస్, సింప్లీ లెర్న్, సాల్వ్, నో బ్రోకర్, వేక్‌ఫిట్, రేజర్‌పే వంటి యువ యాజమాన్య కంపెనీలు, స్టార్టప్స్ తమ ఉద్యోగులు ఆఫీసులో స్వల్ప సమయం పాటు కునుకుతీసే వెసులుబాటును కల్పిస్తున్నాయి. నిపుణులు చెప్తున్న లాభాలివీ.. ►పని మధ్యలో విశ్రాంతి వల్ల ఉద్యోగులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు. ►పనిలో ఉత్పాదకత మరింతగా పెరుగుతుంది. ►దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగేలా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ►మానసిక, శారీరక ఒత్తిడి లేకుండా ఉద్యోగులు ఎక్కువ గంటలు పనిచేయగలుగుతారు. ►చీటికి మాటికీ అనారోగ్య సమస్యలతో గైర్హాజరు కావటం తగ్గుతుంది. ►ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటుండటంతో ఉద్యోగులకు యాజమాన్యంపై గౌరవం పెరుగుతుంది. వీ హబ్‌లో మదర్స్ రూమ్ పని మధ్యలో కొంత సమయం విశ్రాంతి అనేది మహిళా ఉద్యోగులకు అత్యవసరం. అందుకే వీ–హబ్‌లో మదర్స్ రూమ్, రిలాక్స్ రూమ్ వంటి ప్రత్యేక వసతులను ఏర్పాటు చేశాం. ఉద్యోగులకు 24/7 భద్రత, అవసరమైన వసతులను కల్పించినప్పుడే వారు ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. – దీప్తి రావుల, సీఈఓ, వీ–హబ్ కాసేపు నిద్ర మా పాలసీలో భాగం మా కంపెనీలో ఉద్యోగుల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. మధ్యాహ్నం అరగంట సేపు ఉద్యోగులకు నిద్ర సమయం అనేది పాలసీలో భాగం చేశాం. కాసేపు విశ్రాంతితో ఉద్యోగులు రెట్టింపు ఉత్సాహంతో పనిమీద ఏకాగ్రత చూపుతున్నారు. – ఉమానాథ్ నాయక్, హెచ్ఆర్ హెడ్, వేక్‌ఫిట్ -
Hyderabad: సమస్యకు చెక్.. చెత్త దూరం.. కరెంటు లాభం!
సాక్షి, హైదరాబాద్: రోజురోజుకు మరింతగా జనాభా పెరిగిపోతున్న గ్రేటర్ హైదరాబాద్ నగరంలో వెలువడుతున్న చెత్త కూడా అంతే స్థాయిలో పెరిగిపోతోంది. ఈ చెత్తను డంప్ చేస్తే కాలుష్యం, మురికి, అనారోగ్య సమస్యలు. ఈ క్రమంలోనే అటు చెత్త సమస్యకు చెక్ పెట్టడం, ఇటు విద్యుత్‌ను ఉత్పత్తి చేసి ప్రయోజనం పొందడం లక్ష్యంగా జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను ప్రోత్సహిస్తోంది. జవహర్‌నగర్‌లో తొలుత 19.8 మెగావాట్ల ఉత్పత్తితో ప్రారంభమైన రాంకీ సంస్థ (రీసస్టెయినబిలిటీగా పేరు మారింది) ప్లాంట్ సామర్ధ్యం ప్రస్తుతం 24 మెగావాట్లకు పెరిగింది. మరో 24 మెగావాట్ల ఉత్పత్తికి ప్రభుత్వం అనుమతించింది. ఈ సంస్థ మార్చి చివరినాటికి దుండిగల్‌లో 14.5 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ప్రారంభించనుంది. ఇదిగాక నగర శివార్లలో ఏర్పాటు కానున్న పలు ప్లాంట్లతో రెండేళ్లలో వంద మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు చెత్త ప్రాసెస్ చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే చెత్తగుట్టలు పోగుపడవు. ఘన వ్యర్థాలు (చెత్త) ఎప్పటికప్పుడు ప్రాసెస్ అవుతాయి. శివార్లలోని పలు ప్రాంతాల్లో చెత్త ట్రీట్మెంట్తోపాటు ఆ సమీపంలోనే ఉండే ప్లాంట్లతో విద్యుత్ ఉత్పత్తి జరగనుంది. మున్సిపల్ కార్మికులు సేకరించే చెత్తలో విద్యుత్‌కు పనికొచ్చేది దాదాపు 50 శాతం ఉంటుంది. మిగతా చెత్తను కంపోస్టు, రీసైక్లింగ్‌తో ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ వంటి వాటికి వినియోగిస్తారు. అంతిమంగా ఎందుకూ పనికిరానిదాన్ని పాతిపెడతారు. మరోవైపు చెత్తనుంచి విద్యుత్ ఉత్పత్తిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అది అంత శ్రేయస్కరం కాదని, ఖర్చు కూడా ఎక్కువని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా.. హైదరాబాద్ నగరంలో ఏటికేడు పెరుగుతున్న చెత్తను, తద్వారా ఉత్పత్తి చేయగల విద్యుత్‌ను జీహెచ్ఎంసీ అధికారులు 2018లో అంచనా వేశారు. ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి 70–100 టన్నుల చెత్త అవసరమవుతుంది. వంద మెగావాట్ల ఉత్పత్తికి దాదాపు పదివేల టన్నులు కావాలి. ప్రస్తుతం నగరంలో రోజూ 7000 టన్నుల చెత్త వెలువడుతోంది. పరిసర మున్సిపాలిటీలను కలిపితే ఇది పదివేల టన్నులకు చేరుకుంటుందని అంచనా. దీనికి తగినట్టుగా విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. సిటీ శివార్లలోని విద్యుత్ ప్రాజెక్టుల పరిస్థితి ఇదీ.. ►యాచారంలో శ్రీవెంకటేశ్వర గ్రీన్ పవర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌కు 12 మెగావాట్ల ఉత్పత్తికి ప్రభుత్వ అనుమతి ఉంది. మరో 2 మెగావాట్లు పెంచి 14 మెగావాట్లకు అనుమతించాల్సిందిగా ఆ సంస్థ కోరింది. అనుమతి వస్తే 14 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. ►బీబీనగర్‌లో ఆర్డీఎఫ్ పవర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ 11 మెగావాట్ల ప్లాంట్ పనులు ప్రారంభమై చాలాకాలమైనా వివిధ కారణాలతో జాప్యం జరుగుతోంది. ఇటీవల యాజమాన్య మార్పు జరగడంతో పనులు వేగంగా అవుతాయని అధికారులు చెప్తున్నారు. ►‘రీసస్టెయినబిలిటీ లిమిటెడ్’ ప్యారానగర్లో 15 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ►జవహర్‌నగర్‌లో ప్రస్తుతం 24 మెగావాట్లు, అదనంగా రానున్న 24 మెగావాట్లు, దుండిగల్‌లో 14.5 మెగావాట్లతోపాటు కొత్తగా రానున్న ప్లాంట్లన్నీ కలిపితే మొత్తం 102.5 మెగావాట్లకు ‘చెత్త విద్యుత్’ ఉత్పత్తి సామర్థ్యం పెరగనుంది. మున్సిపల్ వ్యర్థాల నుంచి తక్కువే.. గత సంవత్సరం కేంద్ర మంత్రి ఆర్కేసింగ్ రాజ్యసభలో ఇచ్చిన సమాచారం మేరకు దేశంలో చిన్నవి, పెద్దవి కలిపి 249 ప్లాంట్లు చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. వీటిలో మున్సిపల్ వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసేవి 11 ప్లాంట్లే. వీటి సామర్ధ్యం 132.1 మెగావాట్లు. ఇటీవల మరికొన్ని ప్లాంట్లు ఏర్పాటు చేయడంతోపాటు మరికొన్ని ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకున్నాయి. ఇక దేశంలోని అన్ని నగరాల్లో భారీగా చెత్త వెలువడుతున్నా.. దాన్ని విద్యుత్‌గా మార్చే ప్లాంట్లు కొన్ని నగరాల్లోనే ఉన్నాయి. జీరో వేస్ట్ లక్ష్యంగా.. హైదరాబాద్ నగరంలో చెత్తను వివిధ రకాలుగా వేరు చేయడంతో బయోగ్యాస్, కంపోస్టు ఎరువు వంటివాటితోపాటు విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ‘జీరో వేస్ట్’ లక్ష్యంతో పనులు చేస్తున్నాం. తద్వారా చెత్త పేరుకు పోదు. చెత్త వస్తున్న చోటనే తడి–పొడిగా వేరుచేయడంలో ఇంకా కృషి జరగాల్సి ఉంది. మిగతా దశలకు సంబంధించి చాలా నగరాల కంటే మనం ముందంజలో ఉన్నాం. – బి.సంతోష్, అడిషనల్ కమిషనర్ (పారిశుధ్యం, ఆరోగ్యం), జీహెచ్ఎంసీ వ్యయమెక్కువ.. శ్రేయస్కరం కాదు.. చెత్త నుంచి విద్యుదుత్పత్తికి అధిక వ్యయం అవుతుంది. వాతావరణ కాలుష్యం సమస్య కూడా ఉంటుంది. విద్యుత్ కోసమే అయితే సోలార్ పవర్ ఖర్చు తక్కువ. చెత్త కుప్పలు కనిపించకుండా ఉండేందుకు విద్యుత్ ఉత్పత్తికి మొగ్గుచూపుతున్నారు. దీనికి ఎక్కువ ఇంధనం అవసరమవుతుంది. ఏర్పాటు చేసే కంపెనీలకు రాయితీలిస్తారు. ఇది శ్రేయస్కరం కాదు. చెత్తను ప్రాథమికంగానే వేరు చేయడం ఉత్తమ మార్గం. రీసైకిల్, రీయూజ్, రెడ్యూస్ విధానమే మేలైనది. దానివల్ల ఎక్కువమందికి జీవనోపాధి లభిస్తుంది. – ప్రొఫెసర్ దొంతి నరసింహారెడ్డి, పర్యావరణవేత్త -
Hyderabad: ప్రమాదం అంచున ప్రయాణం.. ఏమాత్రం పట్టుతప్పినా!
సాక్షి, హైదరాబాద్: అదో బస్టాపు.. స్కూలుకు, కాలేజీకి బయలుదేరిన విద్యార్థులు.. ఆఫీసుకు వెళుతున్న ఉద్యోగులు.. ఏవో పనుల మీద ఇతర ప్రాంతాలకు వెళ్తున్న మరికొందరు ప్రయాణికులు.. 40–50 మందిదాకా వేచి ఉన్నారు. అంతలో బస్సు వచ్చింది. అప్పటికే దాదాపు సీట్లన్నీ నిండిపోయి ఉన్నాయి. మరో బస్సు ఎప్పుడు వస్తుందో తెలియదు. సమయం మించిపోతోందంటూ అంతా ఎక్కేశారు. లోపల స్థలం లేక ఫుట్బోర్డుపైనా నిలబడ్డారు. అక్కడక్కడా గుంతలు, మలుపులు, పక్కపక్కనే దూసుకెళ్లే వాహనాలు.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, పట్టుతప్పినా ప్రమాదం బారినపడే పరిస్థితి. హైదరాబాద్ నగరం చుట్టూరా శివార్లలో సిటీ బస్సుల్లో పరిస్థితి ఇది. ఆర్టీసీ బస్సులు తగ్గిపోవడం, ప్రైవేటు రవాణా చార్జీలు పెరిగిపోవడంతో ప్రయాణికులు ఫుట్‌బోర్డులపై నిలబడి ప్రయాణాలు చేస్తున్నారు. పలుమార్లు ప్రమాదాల బారినపడుతున్నారు. ప్రమాదకరం, నేరం అయినా.. మోటారు వాహన చట్టం ప్రకారం ఫుట్‌బోర్డు ప్రయాణం నేరం. ఈ చట్టాన్ని అమలు చేసేందుకు గతంలో మొబైల్ కోర్టులు ఉండేవి. ఫుట్‌బోర్డు ప్రయాణికులపై జరిమానాలు విధించేవారు. ఇప్పుడు మొబైల్ కోర్టులు లేవుగానీ.. ఫుట్‌బోర్డు జర్నీ మాత్రం ఆగలేదు. ఎంతోమంది మంది ప్రయాణికులు పట్టుతప్పి పడిపోతున్నారు. గాయాలపాలవుతున్నారు. పలుమార్లు బాధితులు చనిపోయిన ఘటనలూ ఉన్నాయి. ఇది రహదారి భద్రతకు సవాల్‌గా మారింది. వందలాది రూట్లకు బస్సుల్లేవు.. ప్రపంచ నగరాలకు దీటుగా ఎదుగుతున్న హైదరాబాద్ నగరం ప్రజారవాణాలో మాత్రం వెనుకబడిపోతోంది. యునిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (హుమ్టా) అధ్యయనం ప్రకారం హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా (హెచ్ఎంఏ) 7,228 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించింది. నగరంలో అందుబాటులో ఉన్న ప్రజారవాణా సదుపాయం 31 శాతమే. బస్సుల కొరత కారణంగా వందలాది రూట్లను ఆర్టీసీ వదిలేసుకుంది. హైదరాబాద్‌లో గతంలో 1,150 రూట్లలో ప్రతిరోజూ 42 వేల ట్రిప్పులు నడిచిన సిటీ బస్సులు.. ఇప్పుడు 795 రూట్లలో కనీసం 25 వేల ట్రిప్పులు కూడా తిరగడం లేదు. ఏమూల చూసినా అంతే.. ►ఎల్బీనగర్ నుంచి ఇబ్రహీంపట్నం, చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లే సిటీబస్సుల్లో విద్యార్ధులు, సాధారణ ప్రయాణికులు ప్రతిరోజూ ఫుట్‌బోర్డుపై నిలబడి ప్రయాణం చేస్తుంటారు. ఉదయం, సాయంత్రం రద్దీవేళల్లో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ►ఉప్పల్ నుంచి ఘట్కేసర్ మీదుగా ఏదులాబాద్ వైపు వెళ్లే విద్యార్ధులు, ఉద్యోగులు ఉదయం 8 గంటలకల్లా బస్సు అందుకోగలిగితేనే సకాలంలో విధులకు హాజరవుతారు. ఆ రూట్లో వెళ్లే ఒకేఒక్క బస్సులో వేలాడుతూ ప్రయాణం చేయాల్సిందే. ఏ కొంచెం ఆలస్యమైనా సెవెన్ సీటర్ ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయించాల్సిందే. ఇందుకోసం అయ్యే ఖర్చు అదనపు భారం. ►ఘట్కేసర్, ఇబ్రహీంపట్నం, కీసర, నాగారం, షామీర్పేట్ వంటి రూట్లలోనే కాదు. హైదరాబాద్ చుట్టూ ఉన్న వందలాది కాలనీలకు ఉదయం, సాయంత్రం రెండు, మూడు ట్రిప్పులు మాత్రమే బస్సులు తిరుగుతున్నాయి. ►సికింద్రాబాద్–కోఠీ, ఉప్పల్–కోఠీ వంటి సుమారు 150 రూట్లలో ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సు ఉంటే.. పలు మార్గాల్లో అరగంట నుంచి గంటకు ఒకటి చొప్పున మాత్రమే నడుస్తున్నాయి. ►మేడ్చల్ నుంచి పటాన్చెరు మీదుగా గండి మైసమ్మ వరకు ప్రతిరోజు కనీసం 25 బస్సులు నిరంతరం రాకపోకలు సాగించే స్థాయిలో ప్రయాణికుల డిమాండ్ ఉంది. కానీ నడుపుతున్నది 5 బస్సులే. సికింద్రాబాద్–బహదూర్‌పల్లి, సికింద్రాబాద్–మణికొండ తదితర రూట్లలోనూ అదే పరిస్థితి. అక్కడ పెంచుతుంటే.. ఇక్కడ తగ్గాయి.. ►గ్రేటర్ హైదరాబాద్‌లో బస్సుల సంఖ్య మూడేళ్లలో 3,850 నుంచి 2,550కి తగ్గింది. ►ఢిల్లీ నగరంలో బస్సుల సంఖ్య 6 వేలు ఉండగా.. 7 వేలకు పెంచారు. ►బెంగళూరు సిటీలో ప్రస్తుతం 7,000 బస్సులు తిరుగుతున్నాయి. వాటిని 13 వేలకు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రజారవాణాలో హైదరాబాద్.. ►హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా విస్తీర్ణం 7,228 చదరపు కిలోమీటర్లు ►రోడ్ నెట్వర్క్ 5,400కి.మీ. ►జనాభా: సుమారు కోటీ 8 లక్షలు (రాష్ట్ర జనాభాలో 29.6%) సరిగా బస్సులు రాక సమస్య బస్సులు సరిగా అందుబాటులో లేకపోవడం వల్ల ఇబ్బందిపడుతున్నాం. కిక్కిరిసి ప్రయాణించాలి. లేదా ఆటోలు, క్యాబ్‌లలో వెళ్లాల్సి వస్తోంది. ఆర్ధికంగా ఎంతో భారం అవుతోంది. – ఎస్.అనిత, టీచర్ రహదారి భద్రతకు విఘాతం బస్సులే కాదు ఆటోలు, క్యాబ్‌లు వంటి ఏ వాహనాల్లోనైనా సామర్థ్యానికి మించి ప్రయాణికులను తీసుకెళ్లడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ప్రధాన రహదారుల్లో జరుగుతున్న ప్రమాదాల్లో ఎక్కువ శాతం ఇలాంటి ఓవర్‌లోడ్ జర్నీయే. అలాంటి ప్రతి ప్రయాణికుడిపై జరిమానా విధించే అవకాశం ఉంది. – డాక్టర్ పుప్పాల శ్రీనివాస్, ఉప రవాణా కమిషనర్ ప్రమాదం అనిపించినా తప్పడం లేదు ఫుట్‌బోర్డు మీద నిలబడి ప్రయాణం చేయాలని ఎవరూ కోరుకోరు కదా. బస్సులు లేకపోవడం వల్లే చాలా మంది పిల్లలు ఫుట్‌బోర్డ్ జర్నీ చేయాల్సి వస్తోంది. – యాదగిరి, ప్రయాణికుడు -
హైదరాబాద్‌ను ఆగం చేస్తున్న బయో వ్యర్థాలు.. రోగాల కుంపటిగా..!
సూదిమందు.. వాడిపడేసిన కాటన్.. టానిక్ సీసా.. ఇతరత్రా ఆస్పత్రి వ్యర్థాలు మహానగరాన్ని ముంచెత్తుతున్నాయి. వాటిలోని బ్యాక్టీరియా, వైరస్లు వాతావరణంలో కలిసి నగరాన్ని రోగాల కుంపటిగా మారుస్తున్నాయి. ఇప్పటికీ అనేక ఆస్పత్రులు తమ వ్యర్థాలను ఆరు బయట తగులబెడుతుండడంతో అనేక మంది అంటురోగాల బారిన పడుతున్నారు. అత్యాధునిక వైద్యానికి, అనేక అరుదైన చికిత్సలతో మెడికల్ హబ్‌గా గుర్తింపు పొందిన గ్రేటర్‌ను ప్రస్తుతం ఆస్పత్రి వ్యర్థాలు దడ పుట్టిస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా గ్రేటర్ జిల్లాల పరిధిలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యారోగ్య శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. మెజారిటీ క్లినిక్‌లు, నర్సింగ్ హోమ్‌లకు పీసీబీ అనుమతులు, జీవ వ్యర్థాల నిర్వహణ సర్టిఫికెట్లు లేకపోవడం గమనార్హం. సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల్లో ఉన్న 3,919 ఆస్పత్రుల్లో 60 వేలకుపైగా పడకలు ఉన్నట్లు అంచనా. ఒక్కో పడక నుంచి సగటున రోజుకు 300 నుంచి 400 గ్రాముల వరకు జీవవ్యర్థాలు వెలువడుతున్నట్లు పీసీబీ లెక్కవేసింది. గ్రేటర్ నుంచి నిత్యం 35 టన్నులు, శివారు పురపాలికల నుంచి మరో 15 టన్నుల వరకు ఆస్పత్రి వ్యర్థాలు వెలువడుతున్నట్లు అంచనా వేసింది. ఈ వ్యర్థాలను కార్పొరేట్ ఆస్పత్రులు మినహా ఇతర ఆస్పత్రులు శాస్త్రీయ పద్ధతిలో కాకుండా సాధారణ చెత్తతో పాటే పడవేస్తుండడంతో బ్యాక్టీరియా, వైరస్లు గాలిలో కలిసి వివిధ రకాల వ్యాధులకు కారణమవుతున్నట్లు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాధారణ చెత్తతోనే వ్యర్థాలు ఆస్పత్రి వ్యర్థాల నిర్వహణ చట్టం– 1998 ప్రకారం ఆస్పత్రుల్లో రోజువారీ ఉత్పత్తయ్యే చెత్తను వేర్వేరు రంగుల డబ్బాల్లో నింపాలి. 48 గంటలకు మించి ఆస్పత్రుల్లో నిల్వ ఉంచరాదు. వీటిని శాస్త్రీయ పద్ధతిలో రీసైక్లింగ్ చేసేందుకు ప్రత్యేకంగా నెలకొల్పిన కేంద్రాలకు తరలించాలి. రవాణాలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆచరణలో ఈ నిబంధనలు అమలు కావడంలేదు. గాందీ, ఉస్మానియా, కోఠి ప్రసూతి ఆస్పత్రి, నిమ్స్ సహా పలు ఆస్పత్రుల యాజమాన్యాలు సాధారణ చెత్తతో పాటే ఆస్పత్రి వ్యర్థాలను గుట్టలుగా పోగుచేసి తగులబెడుతుండడంతో వాతావరణం కలుషితమవుతోంది. ఈ పొగ పీల్చుకున్న వారిలో 20 శాతం మంది అస్వస్థతకు గురవుతున్నారు. విదేశాల్లో ఇలా.. అమెరికా, ఆ్రస్టేలియా, ఇంగ్లాడ్ తదితర విదేశాల్లో ఆస్పత్రి వ్యర్థాలను పర్యావరణానికి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జీవ వ్యర్థాల వల్ల ఉత్పన్నమయ్యే ప్రమాదకర రసాయనాలు, ఇతర ఉద్గారాలు గాలిలో కలువకుండా ఎప్పటికప్పుడు దహనం చేస్తున్నారు. వ్యర్థాలను వేర్వేరు డబ్బాల్లో నింపి వాటిని నిర్వహణ కేంద్రాలకు జాగ్రత్తగా తరలిస్తున్నారు. అక్కడ ఆటో క్లీనింగ్, మైక్రోవేవింగ్, కెమికల్ ట్రీట్ మెంట్ నిర్వహించి వ్యర్థాల్లో బ్యాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మజీవులు లేకుండా చేస్తున్నారు. ఆ తర్వాత భూమిపై పెద్ద గుంత తీసి వాటిలో పూడుస్తున్నారు. ప్రస్తుతం మన కార్పొరేట్ ఆస్పత్రులు ఈ విధానాన్ని సొంతంగా అమలు చేస్తుండగా..మిగతావారు ఈ అంశాన్ని పట్టించుకోకపోవడంతోనే అనర్థాలు తలెత్తుతున్నట్లు పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వ్యర్థాలతో అనర్థాలివే: హెచ్ఐవీ రోగులు వాడిపడేసిన సూదులు, బ్లేడులు ఆరుబయట పడేయడంతో ఇవి ఇతరులకు గుచ్చుకున్నప్పుడు వారికి ఆయా రోగాలు సోకే ప్రమాదం ఉంది. హెపటైటిస్ బి వంటి రోగాలు ప్రబలుతాయి. చీము తుడిచిన కాటన్‌ను వథాగా పడవేస్తుండడంతో అందులోని ఫంగస్ ఇతరులకు వ్యాపిస్తుంది. ఆస్పత్రి వ్యర్థాల్లోని బ్యాక్టీరియా, వైరస్ ఇతరులకు త్వరగా వ్యాపించి జీర్ణకోశ, శ్వాసకోశ, చర్మ వ్యాధులు ప్రబలుతాయి. ప్రజారోగ్యానికి పెద్ద ముప్పు రోగుల రక్తంతో తడిసిన దుప్పట్లు, సర్జికల్ డ్రెస్సులు నగరంలోని శివారు చెరువుల్లో శుభ్రం చేస్తుండటంతో చెరువుల్లోని నీరు కలుషితమవుతోంది. వాతావరణ కాలుష్యానికి కారణమవుతూ ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్న ఆస్పత్రులను గుర్తించి, చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా లేకపోవడంతో పలు ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. గతంలో ఇదే అంశంపై ప్రభుత్వానికి, గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం. అయినా జీవ వ్యర్థాల నిర్వహణ విషయంలో మార్పు కనిపించడం లేదు. – ఎం.పద్మనాభరెడ్డి, కార్యదర్శి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (చదవండి: మద్యం ‘మత్తు’లో ఎవరెవరు?) -
Hyderabad: ఫ్లాట్ నుంచి 'ఇంటి' వైపు!.. ఆ గృహాలకు భారీ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అపార్ట్మెంట్ల కొనుగోళ్లు భారీగా తగ్గిపోతున్నాయి. అదే సమయంలో వ్యక్తిగత (ఇండివిడ్యువల్) గృహాలకు మాత్రం డిమాండ్ పెరిగింది. కరోనా అనంతర పరిణామాలు, ఆర్థిక పరిస్థితులే దీనికి కారణమని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అంటున్నారు. అప్పట్లో అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల కొనుగోళ్లకు ఆసక్తిచూపిన కొనుగోలుదారులు.. ఇప్పుడు వ్యక్తిగత గృహాలకే మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా కాస్త పచ్చదనంతో, రణగొణధ్వనులకు దూరంగా, ఆహ్లాద వాతావరణం ఉండే ప్రాంతాలవైపు కొనుగోలుదారులు దృష్టిసారిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కరోనాతో మారిన అభిరుచులు కరోనా వ్యాప్తి, తదనంతర పరిణామాలతో ప్రజల జీవన విధానంలో, గృహ కొనుగోలుదారుల తీరులో మార్పులు వచ్చాయి. గతంలో ప్రధాన నగరంలో, ప్రజా రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉన్న ప్రాంతాల్లోనే గృహాలను కొనుగోలు చేసేవారు. కోవిడ్ తర్వాత ఒకేచోట ఎక్కువ కుటుంబాలు నివాసం ఉండే అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల కొనుగోళ్లపై ఆసక్తి తగ్గిపోయింది. దానికితోడు ఆన్లైన్ క్లాసులు, వర్క్ ఫ్రం హోమ్‌తో ఇంట్లో ప్రత్యేకంగా గది, ఓపెన్ జిమ్ వంటివి అవసరమయ్యాయి. దీనివల్ల విస్తీర్ణం ఎక్కువగా ఉన్న వ్యక్తిగత గృహాలు, విల్లాలపై కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారని స్పేస్ విజన్ గ్రూప్ సీఎండీ టీవీ నరసింహారెడ్డి తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు, కొత్త రోడ్లు, మెట్రో కనెక్టివిటీలతో శివారు ప్రాంతాల నుంచి ప్రధాన నగరానికి ప్రయాణం సులువు కావడం దీనికి మరింత ఊతమిచ్చిందని చెప్పారు. హైదరాబాద్ నలువైపులా.. గతంలో పటాన్చెరు, బెంగళూరు జాతీయ రహదారుల మార్గంలో అభివృద్ధి ఉండేది. ఆయా ప్రాంతాల్లోనే వ్యక్తి గత గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు హైదరాబాద్ నలువైపులా కొత్త రోడ్లు వచ్చాయి. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ లింక్ రోడ్లు ఏర్పడ్డాయి. విద్యుత్, నీరు వంటి మౌలిక వసతులు మెరుగయ్యాయి. దీంతో మెట్రో, 100 ఫీట్ల రోడ్లు ఉన్న మార్గాల్లో 10 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఇండిపెండెంట్ గృహాలకు డిమాండ్ పెరిగింది. శ్రీశైలం హైవే, ముంబై రహదారి, బీజాపూర్ రోడ్, నాగ్‌పూర్ రోడ్డు, వరంగల్ హైవేలో ఘట్ కేసర్ వరకు కూడా వ్యక్తిగత గృహాలు, విల్లాలను కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా కొత్త ప్రాంతాల్లో ముందుగా ఇండిపెండెంట్ ఇళ్లు, విల్లాలు వచ్చి.. రద్దీ పెరిగాక అపార్ట్మెంట్ కల్చర్ ప్రారంభమవుతుందని యార్డ్స్ అండ్ ఫీట్స్ కన్సల్టెన్సీ ఎండీ కళిశెట్టి నాయుడు తెలిపారు. మారిన పరిస్థితులతో.. ఐటీ మినహా ఇతర రంగాల్లో కొత్త ఉద్యోగ నియామకాలు లేకపోవటం, పలు రంగాల్లో వర్క్ ఫ్రం హోమ్ విధానం అమలవుతుండటంతో హైదరాబాద్‌లో ఇళ్ల కొనుగోళ్లు తగ్గాయని రియాల్టీ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు బ్యాంకులు కూడా గతంలో తరహాలో గృహ రుణాలను మంజూరు చేయడం లేదు. గతేడాది 7.30 శాతం దాకా తగ్గిన వడ్డీ రేట్లు ప్రస్తుతం 8.25 శాతానికి పెరిగాయి. దీనికితోడు నిర్మాణ వ్యయాలూ పెరగడంతో.. ప్రజల ఇళ్ల కొనుగోలు శక్తి తగ్గిందని నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక తెలిపింది. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ (మూడో త్రైమాసికం) ముగింపు నాటికి బెంగళూరు, చెన్నై వంటి దక్షిణాది నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే అత్యధిక గృహాల ఇన్వెంటరీ (అమ్ముడుపోకుండా ఉన్న ఇళ్లు) ఉండటం గమనార్హం. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో 7.85 లక్షల అపార్ట్మెంట్లు అమ్ముడుపోకుండా ఉన్నాయని ప్రాప్ టైగర్ నివేదిక వెల్లడించింది. హైదరాబాద్‌లోని ఇళ్లే లక్షకుపైగా ఉన్నాయని తెలిపింది. దక్షిణాదిలో ఇన్వెంటరీ ఎక్కువగా ఉన్నది హైదరాబాద్‌లోనేనని తెలిపింది. ఇక మొత్తం దేశవ్యాప్తంగా చూస్తే.. 2,72,960 ఇళ్ల ఇన్వెంటరీతో ముంబై తొలిస్థానంలో ఉందని పేర్కొంది. -
చదువులు సాగేదెలా?
సాక్షి, హైదరాబాద్: సర్కారు బడుల్లో పాఠ్య పుస్తకాలే కాదు... ఏకరూప దుస్తులు సైతం అందని ద్రాక్షగా తయారయ్యాయి, ఒకవైపు విద్యార్థులకు పూర్తిస్థాయి పాఠ్య పుస్తకాలు లేకుండానే చదువులు సాగుతుండగా.. యూనిఫాంల జాడ కూడా లేకుండా పోయింది. 2022– 23 విద్యా సంవత్సరం ప్రారంభమై 6 నెలలు గడిచినా 60 శాతం మించి పాఠ్యపుస్తకాలు సరఫరా కాలేదని అధికారుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రధాన ప్రచురణ కేంద్రం నుంచి గోదాములకే అరకొర స్టాక్ వచ్చి చేరడంతో పాఠశాలలకు పుస్తకాల సరఫరా అంతంత మాత్రంగా ఉంది. ఇప్పటి వరకు వచి్చన వాటిలో సైతం ఏ ఒక్క తరగతికి సైతం పూర్తి స్థాయి పుస్తకాల సెట్ అందలేనట్లు తెలుస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభంలో పాఠ్యపుస్తకాల పంపిణీ ఆలస్యం కావడంతో అప్పటిదాకా బ్రిడ్జి కోర్సులు నిర్వహించారు. అనంతరం బోధన ప్రారంభించినప్పటికీ పూర్తి స్థాయి పాఠ్య పుస్తకాల కొరత వెంటాడుతోంది. పాత పుస్తకాలతోనే.. గత విద్యా సంవత్సరం ప్రభుత్వ బడుల్లో చాలా తరగతులకు సగం పుస్తకాలే పంపిణీ చేశారు. పాత వాటిని సైతం ఈసారి సేకరించి సర్దుబాటు చేసినా విద్యార్థులందరికీ సరిపోని పరిస్థితి నెలకొంది. కొన్ని పాఠశాలల్లో అయిదుగురు విద్యార్థులను ఒక గ్రూప్‌గా చేసి వారికి ఒక్కో పాఠ్య పుస్తకాన్ని ఇచ్చి సర్దుబాటు చేశారు. దీంతో చేతిలో పుస్తకాలు లేక విద్యార్థులు దిక్కు తోచని స్థితిలో పడ్డారు. తోటి విద్యార్థుల పుస్తకాలపై ఆధారపడి చదువులు కొనసాగించడం ఇబ్బందిగా తయారైంది. తరగతి గదిలో బోధన తర్వాత ఇంటివద్ద హోంవర్కు సమస్యగా తయారైంది. పాఠ్య పుస్తకాలపై విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు శాపంగా తయారైంది. 24.73 లక్షలపైనే.. గ్రేటర్‌లోని హైదరాబాద్–రంగారెడ్డి–మేడ్చల్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ బడులకు సుమారు 24.73 లక్షల పాఠ్యపుస్తకాల అవసరం ఉంటాయని విద్యాశాఖాధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ఇండెంట్ పెట్టారు. అందులో 60 శాతం మాత్రమే ప్రింటింగ్ ప్రెస్ నుంచి గోదాములకు చేరాయి. అందులో సైతం తరగతులకు సంబ ంధించిన అన్ని పాఠ్యపుస్తకాలు అందలేదు. ఈ విద్యా సంవత్సరం ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడంతో ఒకే సా రి ఇంగ్లి‹Ù, తెలుగు మీడియం పుస్తకాల ప్రచురణ తలపెట్టడంతో పూర్తి స్థాయి కోటాకు ఆటంకంగా తయారైంది. ఊసే లేని యూనిఫాంలు.. సర్కారు బడుల విద్యార్థులకు ఇప్పటి వరకు యూనిఫాంల ఊసే లేకుండా పోయింది. విద్యార్థులకు రెండు జతల చొప్పున ఉచితంగా యూనిఫాంలను అందించాల్సి ఉంది. సాధారణంగా వేసవి సెలవుల్లోనే వీటికి అవసరమైన వ్రస్తాన్ని టెస్కో ద్వారా కొనుగోలు చేసి, ఆయా జిల్లాలు, మండలాల వారీగా స్కూళ్లకు అందించాలి. ఈ ఏడాది యూనిఫాంలకు అవసరమైన వస్త్రం కొనుగోలు ప్రక్రియలో తీవ్ర జాప్యం ఏర్పడింది. దీంతో సకాలంలో దుస్తుల పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. (చదవండి: ఆ సొమ్మంతా ఎవరికి వెళ్లింది?) -
BJP Telangana: గ్రేటర్‌పై కమలం కన్ను
సాక్షి, సిటీబ్యూరో/కుత్బుల్లాపూర్: గ్రేటర్‌పై కమలం పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. అత్యధిక స్థానాలున్న మహానగరంలో పట్టు సాధించేందుకు శరవేగంగా పావులు కదుపుతోంది. ఆ దిశగా ప్రత్యేక కార్యాచరణ మొదలుపెట్టింది. తాజాగా బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు బండి సంజయ్ నిర్వహించ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర నాలుగో విడత పాదయాత్ర ఈ నెల 12న నగరంలో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యతలను ఆ పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నగర శివార్లు..ప్రధాన నగరాన్ని అనుసంధానిస్తూ సాగే విధంగా పాదయాత్ర రూట్‌మ్యాప్ సిద్ధం చేశారు. అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. ఈ యాత్రతో బీజేపీ శ్రేణుల్లో మరింత ఊపునిచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ నెల 12న పాదయాత్ర కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో ప్రారంభం కానుంది. భక్తుల కొంగు బంగారమైన గాజులరామారం చిత్తారమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుంచి యాత్ర ప్రారంభించనున్నారు. సూరారం రామ్‌లీలా మైదానం వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ అధిష్టానానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. మల్కాజ్గిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఈ యాత్ర సాగనుంది. చివరగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ముగింపు సభ ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ముగింపు సభకు కమలం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొనేలా పార్టీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. భారీ జన సమీకరణకు ఏర్పాట్లు.. గ్రేటర్ పరిధిలో ఏడు నియోజకవర్గాలను చుట్టేస్తూ సాగే యాత్రకు భారీగా జనసమీకరణ చేయాలని ఆ పార్టీ నేతలు ప్రణాళికలు సిద్ధంచేస్తున్నారు. ముందుగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి ప్రారంభించే పాదయాత్ర, బహిరంగ సభకు భారీగా జనసమీకరణ చేసేందుకు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కూన శ్రీశైలంగౌడ్ పార్టీ శ్రేణులతో చర్చించారు. నియోజకవర్గంలో బీజేపీ ఓటు బ్యాంకు పెంచుకునేందుకు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు బండి సంజయ్ పాదయాత్ర ఎంతో ఉపయోగపడుతుందని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: అక్టోబర్ 24 నుంచి రాష్ట్రంలో రాహుల్ పాదయాత్ర -
Telangana: సైకిల్ సవారీకి సై
సాక్షి హైదరాబాద్: గ్రేటర్ ప్రజలకు సైకిల్ అలవాటు చేసేందుకు ప్రస్తుతం జోన్‌కు రెండు మూడు సైకిల్‌ట్రాక్‌ల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. క్రమేపీ ప్రజలకు అలవాటయ్యాక నగరవ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేయాలనే యోచనలో ఉంది. సైకిల్ వినియోగంతో ఆరోగ్యానికి మంచి వ్యాయామంతో పాటు పర్యావరణ హితం, ఇంధన వినియోగం తగ్గడం, ఇతర వాహనాల వినియోగం వల్ల వెలువడే కాలుష్యం తగ్గడం వంటి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు సైకిళ్లకు అలవాటు పడేందుకు ప్రస్తుతానికి జోన్‌కు రెండుమూడు సైకిల్‌ట్రాక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో జోన్లో ఒక్కో డిజైన్‌తో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అన్నీ పరిశీలించాక అన్ని విధాలా యోగ్యమైన డిజైన్‌తో నగరవ్యాప్తంగా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో అధికారులున్నారు. ఎంపిక చేసే డిజైన్లతో తాత్కాలిక, శాశ్వత రెండు రకాలైన సైకిల్ట్రాక్స్ను ఏర్పాటు చేసే యోచనలోనూ అధికారులున్నారు. రోడ్లు 3 లేన్లు, అంతకంటే ఎక్కువ ఉన్న మార్గాల్లో శాశ్వత సైకిల్ట్రాక్స్ ఏర్పాటు చేస్తారు. కొత్తగా మోడల్ కారిడార్లుగా అభివృద్ధి చేసే ప్రాంతాల్లోనూ శాశ్వత సైకిల్ట్రాక్స్ ఏర్పాటు చేస్తారు. అంతకంటే తక్కువ లేన్లున్న మార్గాల్లో మాత్రం తాత్కాలిక సైకిల్ట్రాక్స్ ఏర్పాటు చేస్తారు. వీటిని ఉదయం వేళల్లో దాదాపు రెండుగంటలు మాత్రం సైకిల్ ట్రాక్స్‌గా కేవలం సైకిళ్లను మాత్రమే వినియోగిస్తారు. ఆ సమయాల్లో మిగతా వాహనాలు ఆ ట్రాక్‌లోకి రాకుండా బొలార్డ్స్ వంటివి ఉంచుతారు. మిగతా సమయాల్లో వాటిని తొలగించడం వల్ల అన్ని వాహనాలు ప్రయాణిస్తాయి. ఇక తాత్కాలిక, శాశ్వత సైకిల్ట్రాక్స్ రెండింటిలోనూ విపరీతమైన వాహన రద్దీ ఉండే సమయాల్లో ఆ ట్రాక్స్‌లో మోటార్‌బైక్స్ ప్రయాణానికి అనుమతించే యోచన ఉన్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ ప్రాంతాల్లో ఏర్పాటు.. టోలిచౌకి–షేపేట, బయోడైవర్సిటీ జంక్షన్–లెదర్‌పార్క్, ఖాజాగూడ–నానక్‌రామ్‌గూడ, బయోడైవర్సిటీపార్క్– ఐకియా, గచ్చిబౌల జంక్షన్–బయోడైవర్సిటీ, మెహిదీపట్నం–గచ్చిబౌలి, నర్సాపూర్రోడ్ తదితర మార్గాల్లోని సైకిల్ ట్రాక్స్ అందుబాటులోకి వస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఐడీఎల్ లేక్–జేఎన్టీయూ–ఫోరమ్‌మాల్ సర్క్యూట్ ట్యాంక్‌బండ్–పీవీఎన్ఆఆర్ మార్గ్‌రోడ్–ఎన్టీర్ మార్గ్‌రోడ్ సర్క్యూట్గానూ సైకిల్ట్రాక్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తొలిదశలో మారి్నంగ్‌వాక్ మాదిరిగా సైకిల్ తొక్కడం అలవాటయ్యేందుకు మాత్రమే నిరీ్ణత దూరాల వరకు మాత్రమే వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రజలు బాగా అలవాటుపడ్డాక ఎక్కువ దూరాలు వెళ్లేందుకు సైకిల్ ట్రాక్స్‌తో పాటు సైకిళ్లు అద్దెలకిచ్చేందుకు షేరింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసే యోచనలో అధికారులున్నారు. (చదవండి: ప్రపంచానికే మానవ వనరుల శక్తిగా భారత్) -
గ్రేటర్‌లోనూ కమలం వల! ఆకర్ష ఆపరేషన్
సాక్షి, హైదరాబాద్: కమలం ఆకర్ష ఆపరేషన్ వేగం పెరిగినట్లు కనిపిస్తోంది. తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంటున్న నేపథ్యంలో గ్రేటర్ కాంగ్రెస్ ముఖ్య నేతలపైనా కమలం వల విసురుతోంది. హస్తం పార్టీలోని అసంతృప్తులను చేర్చుకునేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. మరోవైపు రాజకీయ భవిష్యత్తు కోసం ఉవ్విళ్లూరుతున్న ముఖ్య నేతలపై సైతం దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. రాష్ట్ర బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సూచన మేరకు ఇప్పటికే కమలం ముఖ్యనేతలు రంగంలోకి దిగి పలువురితో సంప్రదింపులకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యనేతల చేరిక పూర్తిగా నిర్ధారణ అయి, చేరే దాకా ఆ నేతల పేర్లు బయటకు రాకుండా కమలనాథులు జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. నగరంలోని ముఖ్య నేతే టార్గెట్.. కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయికి ఎదిగిన నగరానికి చెందిన ముఖ్యనేతపై కమలం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలై ఆ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ కీలకంగా మారినప్పటికీ.. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో ఓ నాయకుడి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా తయారైంది. ఇటీవల తన నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ కార్పొరేటర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం ఆయనను అసంతృప్తికి గురిచేసింది. రెండోసారి అక్కడి నుంచి బరిలో దిగేందుకు నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని స్థానిక సమస్యలపై సమరం సాగిస్తుండగా.. కార్పొరేటర్ చేరిక ఆయన ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. పార్టీ రాష్ట్ర నాయకత్వం తనతో కనీసం సంప్రదింపులు జరపకుండా పార్టీలో చేర్చుకోవడంపై ఆయన తన అనుచరుల వద్ద అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీనిని పసిగట్టిన కమలనాథులు ఆయనపై వల విసురుతున్నారు. బీజేపీతో పాత పరిచయాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయికి ఎదిగిన కారణంగా కమలంపై మొగ్గు చూపాలా? వద్దా? అనే సందిగ్ధంలో పడిపోయినట్లు తెలుస్తోంది. మైనారిటీ నేతపై కన్ను.. నగరం నడిబొడ్డున ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మూడు నాలుగు పర్యాయాలు బరిలో దిగి స్వల్ప తేడాతో ఓటమి పాలైన కాంగ్రెస్ మైనారిటీ నేతపైనా కమలం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సదరు నాయకుడితో కమలనాథులు టచ్‌లో ఉన్నారు. మజ్లిస్‌ను టార్గెట్‌గా చేసుకుని మాట్లాడే మైనారిటీ నేత ఇటీవల పార్టీ ముఖ్యనేతల నిర్ణయాలను సైతం బహిరంగా విమర్శించడం కాంగ్రెస్‌లో దుమారం రేపింది. దీంతో ఆయనపై అధిష్టానం గుర్రుగా ఉంది. దీనిని తమకు అనువుగా మల్చుకొని పార్టీలో చేర్చుకునేందుకు కమలనాథులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నా చేరికపై మాత్రం ఇంకా స్పష్టత రానట్లు సమాచారం. మరోవైపు నగర శివారులోని కాంగ్రెస్ ముఖ్య నేత సైతం బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. (చదవండి: రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఊరట.. రూ.10,200 కోట్ల రుణాలకు ఓకే) -
మూసీ ముంచేసి..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ భాగ్యరేఖ చారిత్రక మూసీనది ఉగ్రరూపం దాల్చింది. వారం రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్సాగర్లకు వరదనీరు పోటెత్తుతోంది. దీంతో జలమండలి అధికారులు వరుసగా జలాశయాల గేట్లను తెరచి మూసీలోకి వరద నీటిని వదిలిపెడుతున్నారు. బుధవారం ఏకంగా గండిపేట్‌కు 13, హిమాయత్‌సాగర్‌కు 8 గేట్లను ఎత్తివేశారు. దీంతో మూసీలో వరదనీటి ఉద్ధృతి అనూహ్యంగా పెరిగింది. నగరంలో మూసీ ప్రవహించే బాపూఘాట్–ప్రతాపసింగారం (44 కి.మీ)మార్గంలో మూసీ మునుపెన్నడూ లేనివిధంగా పరవళ్లు తొక్కుతోంది. ఇదే క్రమంలో చాదర్‌ఘాట్ మూసీ చిన్న వంతెనపై నుంచి వరద ప్రవాహం పెరగడంతో ట్రాఫిక్పోలీసులు ఈ బ్రిడ్జీని మూసివేశారు. మూసారాంబాగ్ వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో వంతెన పైనుంచి రాకపోకలను నిలిపివేశారు. నగరంలో బుధవారం కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించింది. మూసారాంబాగ్ వంతెన మూసివేయడంతో అంబర్పేట్ కొత్త బ్రిడ్జీపైనుంచి వాహనాల రాక పెరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక మూసీ పరివాహక ప్రాంతమైన మూసానగర్, కమలానగర్ పరిసరాలను మూసీ వరదనీరు చుట్టేసింది. మన్సూర్‌నగర్, చాదర్నగర్ సమీపంలోని ఇళ్లలో చేరిన నీరు అంబర్పేట్, మలక్‌పేట్, చాదర్‌ఘాట్ పరిసరాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. రత్నానగర్, పటేల్‌నగర్, గోల్నాక ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. మదర్సా, శంకర్‌నగర్, మూసానగర్ నుంచి సుమారు రెండు వేల మందిని ఈ కేంద్రాలకు తరలించినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. హరే కృష్ణ సంస్థ ఆధ్వర్యంలో బాధితులకు ఆహారం సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయ కార్యక్రమాలు చేపట్టారు. జంట జలాశయాలకు వరద ప్రవాహం ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో జంట జలాశయాలకు వరద నీరు పోటెత్తుతోంది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు నిండుకుండల్లా మారాయి. ఇన్‌ఫ్లో భారీగా పెరుగుతుండడంతో రెండు జలాశయాల గేట్లు ఎత్తి నీటిని మూసీలోకి వదులుతున్నారు. బుధవారం ఉస్మాన్ సాగర్‌కు 13 గేట్లు, హిమాయత్ సాగర్ 8 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. భారీగా వరద చేరుతున్న జంట జలాశయాలను బుధవారం ఉదయం జలమండలి ఎండీ దానకిశోర్ సందర్శించారు. వరద ప్రవాహాన్ని పరిశీలించిన ఆయన అధికారులతో సమీక్షించారు. రెండు జలాశయాల వద్ద భద్రత మరింత పెంచాలని పోలీసులకు సూచించారు. సామాన్య ప్రజలు, సందర్శకులు జంట జలాశయాల వద్దకు రావొద్దని ఆయన కోరారు. మూడు పోలీస్ కమిషనరేట్లతో జలమండలి నిరంతరం సమన్వయం చేసుకుంటుందని తెలిపారు. జాతీయ రహదారి జలదిగ్బంధం జియాగూడ/దూద్‌బౌలి/అఫ్జల్‌గంజ్: జంట జలాశయాల గేట్లను ఎత్తివేయడంతో పురానాపూల్ పరిసర ప్రాంతాలు, జాతీయ రహదారి పూర్తిగా మునిగాయి. పురానాపూల్ వంతెన, సమాంతర వంతెనలు శిథిలావస్థకు చేరడంతో ముందు జాగ్రత్త చర్యగా రాకపోకలను నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. జాతీయ రహదారిపై వరదనీరు పొంగిపొర్లుతుండగా అర్ధరాత్రి ప్రాంతంలో జియాగూడ దుర్గానగర్ నుండి జాతీయ రహదారి పైకి వెళ్లిన లారీ, పురానాపూల్ నుండి అత్తాపూర్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు నీట మునిగాయి. పురానాపూల్ లోతట్టు ప్రాంతం కావడంతో వంతెన కానాలు సగానికి పైగా మునిగాయి. అలాగే జాతీయ రహదారి పక్కనే ఉన్న నివాసాలు, చాకిరేవులు నీట మునిగాయి. మూసీ సమీపంలోని మన్సూర్‌నగర్‌లో నీట మునిగిన ఇళ్లు కాలనీని ముంచెత్తిన వరద నీరు వ్యక్తిని కాపాడిన పోలీసులు అర్ధరాత్రి 1:30 గంటల ప్రాంతంలో పురానాపూల్ ఇక్బాల్‌గంజ్ నుండి మూసీనదిలోకి ఓ వ్యక్తి మద్యం మత్తులో జాతీయ రహదారికి రాగా అప్పటికే పొంగిపొర్లుతున్న నీటిలోకి పడిపోయి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న హబీబ్‌నగర్ ఇన్స్పెక్టర్ సైదబాబు, మంగళ్‌హాట్ ఎస్.ఐ రాంబాబు ప్రాణాలకు తెగించి ఆ వ్యక్తిని రక్షించారు. అపస్మారక స్థితిలోకి చేరుకున్న అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పురానాపూల్ మూసీనది పరిసరాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. ఈ మేరకు ఆయన మూసీనది పరివాహక ప్రాంతం జాతీయ రహదారిని సందర్శించారు. సీపీ స్టీఫెన్ రవీంద్ర పరిశీలన బండ్లగూడ: బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హిమాయత్‌సాగర్ జలాశయాన్ని బుధవారం సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పరిశీలించారు. మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మంగళవారం హిమాయత్‌సాగర్ సరీ్వస్ రోడ్డులో వరదలో చిక్కుకుపోయిన యువకుడిని కాపాడిన రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ హెచ్ కానిస్టేబుల్ బేగ్, డ్రైవర్ మల్లాంగ్షా, హెల్పర్స్ రాకేష్, విజయ్‌లను సీపీ స్టీఫెన్ రవీంద్ర, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్‌రావు, శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్‌నాయుడు, రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లవకుమార్రెడ్డిలు అభినందించారు. సహాయక చర్యలకు సిద్ధం: ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మూసీ, ఈసీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకా‹Ùగౌడ్ సూచించారు. జంట జలాశయాల గేట్లను ఎత్తడంతో బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని టిప్పుఖాన్ బ్రిడ్జీ, హైదర్షాకోట్, గంధంగూడ, కాలనీలు, బస్తీలు, ఈసీ,మూసీ వాగులను ఆయన సందర్శించారు. సహాయక చర్యలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సందర్శకులకు అనుమతి లేదు.. రాజేంద్రనగర్ నుంచి హిమాయత్‌సాగర్‌కు వెళ్లే ఓఆర్ఆర్ సబ్ రోడ్డును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అంధకారంలో పరీవాహక ప్రాంతాలు మూసీ ఇరువైపులా ఉన్న లోతట్టు ప్రాంతాల్లోని పలు సబ్స్టేషన్లకు వరద ముప్పు ఏర్పడింది. సబ్‌స్టేషన్లలోకి నీరు చేరడం, డిస్ట్రబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు నీట మునగడంతో ఆయా ప్రాంతాలకు విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇబ్రహీంబాగ్ డివిజన్ నార్సింగ్ సెక్షన్ పరిధిలోని 11 కేవీ గండిపేట ఫీడర్ సహా 33/11 కేవీ సీబీఐటీ స బ్స్టేషన్లోకి గండిపేట చెరువు నీరు వచ్చి చేరింది. మెహిదీపట్నం డివిజన్ లంగర్‌హౌస్ సెక్షన్ పరిధిలోని బాపూఘాట్, లంగర్‌హౌస్ టుప్ఖాన్ బ్రిడ్జ్‌పై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో దాని కింద ఉన్న ఆరు ఎల్టీ విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో ఆయా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయి ంది. పురానాపూల్, కుల్సుంపుర, రహీంపుర ఫీడర్ల పరిధిలోనూ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆస్మాన్‌ఘడ్, చాదర్ఘట్, వెంకట్‌నగర్, శంకర్‌నగర్, మూసా నగర్, యశోద ఆస్పత్రి, హనుమాన్‌నగర్ ఫీడర్ల పరిధిలోని 12 గంటల పాటు సరఫరా నిలిచిపోయింది. సరూర్‌నగర్ ఆర్కేపురం ప్రజయ్‌నివాస్ అపార్ట్మెంట్స్ ఫేజ్–1 మూడు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు నీటమునిగాయి. వీటిలో రెండు డీటీఆర్లను పునరుద్ధరించారు. పురానాపూల్ బ్రిడ్జి వద్ద నీటిలో మునిగిన లారీ,సాలార్జంగ్ బ్రిడ్జి వద్ద నీటిలో మునిగిన ఆలయం ఆలయంలోకి నీరు.. దూద్‌బౌలి పరిధిలోని శివాలయఘాట్ ఆలయంలోకి వరద నీరు ప్రవేశించింది. నవగ్రహాల గుడి నీటిలో మునిగిపోయింది. పక్కనే ఉన్న నివాసితులు భయాందోళనకు గురయ్యారు. పురానాపూల్ శ్మశాన వాటికలో వరదనీరు పూర్తిగా నిండిపోవడంతో బుధవారం చనిపోయిన వారి బంధువులు ఆందోళనకు గురయ్యారు. దహన సంస్కారాలకు ఎలాంటి స్థలం లేకపోవడంతో ఇబ్బందులకు గురయ్యారు. ప్రమాదకరంగా ఎంజీబీఎస్ ప్రహరీ నిత్యం వేలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే ఎంజీబీఎస్ వరద నీటిలో మునిగింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల గేట్లు ఎత్తడంతో మూసీ పరిహక ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో మూసీ నది దారి మధ్యలో ఉండే ఎంజీబీఎస్ సైతం నీట మునిగింది. ఎంజీబీఎస్ చుట్టూ రహదారుల వెంట ఉన్న ప్రహరీ ప్రమాదకరంగా మారింది. ఎప్పుడు కూలుతుందో ఏమోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. (చదవండి: గాడి తప్పిన ‘గ్యాస్’!) -
మేఘాల దారుల్లో... వియత్నాంకు సైతం..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు భారీగా పెరిగాయి. కోవిడ్‌కు ముందున్న అంతర్జాతీయ విమాన సర్వీసులతో పాటు మరిన్ని సర్వీసులు నేరుగా అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక, వ్యాపార, పర్యాటక రంగాల్లో విశేషంగా ఆకర్షిస్తున్న హైదరాబాద్ మహానగరంపై అన్ని దేశాలూ దృష్టి సారించాయి. దీంతో అనేక దేశాల నుంచి నేరుగా విమాన సర్వీసులు నడిపేందుకు పలు ఎయిర్‌లైన్స్‌కి ఆసక్తి చూపిస్తున్నాయి. గతంలో హైదరాబాద్ నుంచి దుబాయ్, సౌదీ, ఖతార్ వంటి అరబ్ దేశాలకు మాత్రమే విమానాలు నడిచాయి. కోవిడ్ దృష్ట్యా ఆయా సరీ్వసులపై కూడా ఆంక్షలు విధించారు. కరోనా అనంతరం క్రమంగా 12 దేశాలకు మొదట సర్వీసులను పునరుద్ధరించగా ఇప్పుడు కొత్తగా మరిన్ని దేశాలకు నేరుగా అంతర్జాతీయ కనెక్టివిటీ పెరిగింది. దీంతో 18కి పైగా దేశాలకు హైదరాబాద్ నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి రావడం గమనార్హం. కోవిడ్‌కు ముందు.. తర్వాత.. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు ప్రధాన అనుసంధానంగా ఉన్న హైదరాబాద్ మహానగరం నుంచి దేశీయంగా, అంతర్జాతీయంగా ఏటా రాకపోకలు పెరగడంతో విమానాశ్రయం విస్తరణ పనులు చేపట్టారు. అంతర్జాతీయ విమానాలు రాకపోకల కోసం రెండేళ్ల క్రితమే అదనపు టరి్మనల్స్ అందుబాటులోకి వచ్చాయి. కాగా.. కోవిడ్ కారణంగా అన్ని రకాల పౌర విమానయాన సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కోవిడ్ కాలంలో అత్యవసర సర్వీసులు మాత్రమే నడిపారు. ఈ ఏడాది ఆంక్షలను సడలించడంతో ప్రయాణికుల రద్దీ పెరిగింది. దేశీయ గమ్యస్థానాల సంఖ్య అసాధారణంగా పెరిగింది. కోవిడ్‌కు ముందు 55 గమ్యస్థానాలకు మాత్రమే డొమెస్టిక్ సర్వీసులు నడిచాయి. కోవిడ్ తర్వాత 15 నగరాలకు మొదటీ సర్వీసులను పునరుద్ధరించారు. ఇప్పుడు ఏకంగా 70కి పైగా డొమెస్టిక్ గమ్యస్థానాలకు అనుసంధానం పెరిగింది. కొత్తగా గుల్బర్గా, హుబ్లీ తదితర నగరాలకు సర్వీసులు ప్రారంభమయ్యాయి. కొత్తగా అంతర్జాతీయ గమ్యస్థానాలైన చికాగో, మాల్దీవులకు విమాన సర్వీసులను జోడించారు. ఈ సర్వీసులకు ప్రయాణికుల నుంచి అసాధారణమైన స్పందన లభించింది. త్వరలో హైదరాబాద్ నుంచి వియత్నాంకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇటీవల థాయ్ స్మైల్ ఎయిర్‌లైన్స్ హైదరాబాద్ నుంచి బ్యాంకాక్‌కు డైరెక్ట్ విమాన సరీ్వసును పునరుద్ధరించింది. అలాగే ఎయిర్ ఏషియా హైదరాబాద్–కౌలాలంపూర్ విమాన సర్వీసులను కూడా పునరుద్ధరించింది. దీంతో ఈ ఏడాది అబుదాబి, బహ్రెయిన్, కొలంబో, సింగపూర్, దుబాయ్, దోహా, లండన్, జెడ్డా, రియాద్, కౌలాలంపూర్, కువైట్, మస్కట్, షార్జా, బ్యాంకాక్, చికాగో, మాలే, ఢాకా నగరాలకు డైరెక్ట్ ఫ్లైట్లు అందుబాటులోకి వచ్చాయి. (చదవండి: కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించలేం: కేంద్రం) -
నవీకరణ.. నవ్విపోదురు గాక!
సరూర్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ మలయ్యకు అయిదుగురు సంతానం. రేషన్ కార్డులో కుటుంబ సభ్యులుగా భార్యాభర్తలతోపాటు మరో ఇద్దరి (పిల్లల) పేర్లు మాత్రమే ఉన్నాయి. అయిదేళ్ల క్రితం మిగిలిన కుటుంబ సభ్యుల పేర్ల నమోదు కోసం మీ సేవ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు కుటుంబ సభ్యుల జాబితాలో మిగతావారి పేర్లు చేరలేదు. దీంతో నెలవారీ రేషన్ బియ్యంతో పాటు వివిధ రెవెన్యూ ధ్రువీకరణ పత్రాలకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. సాక్షి హైదరాబాద్: గత అయిదేళ్లుగా ఆహార భద్రత (రేషన్ ) కార్డులో నవీకరణ (మార్పులు, చేర్పులు) కోసం ఆన్లైన్ ద్వారా నమోదైన దరఖాస్తులు పెండింగ్‌లో మగ్గుతూనే ఉన్నాయి. పౌరసరఫరా శాఖ అధికార లాగిన్‌లో కార్డులోని యూనిట్లు (పాత సభ్యులు) తొలగించేందుకు అవకాశం ఉన్నప్పటికీ కొత్త యూనిట్ల (అదనపు సభ్యులు)ను ఆమోదించేందుకు అనుమతి లేకుండా పోయింది. కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతున్నా కార్డుల్లో యూనిట్లు (సభ్యులు) పెరగకపోవడం పేదల పాలిట శాపంగా పరిణమించింది. రాష్ట్ర ఆవిర్భావానంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులు రద్దు చేసి వాటిని పూర్తిగా ఆహార భద్రత కార్డులుగా బదిలీ చేసింది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ కార్డులు మంజూరు చేసింది. ఏడాది పాటు కార్డులో చేర్పు లు, మార్పులు ప్రక్రియ సైతం కొనసాగించి అర్ధంతరంగా నిలిపివేసింది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రి య మాత్రం కొనసాగిస్తోంది. దీంతో రోజురోజుకూ దరఖాస్తుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. ధ్రువీకరణ పత్రాలకు తిప్పలు.. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు సంక్షేమ ఉపకాల వేతనాల కోసం తిప్పలు తప్పడం లేదు. ఉపకార వేతనాల కోసం కుటుంబ ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. రెవెన్యూ అధికారులు వార్షిక ఆదాయ నిర్ధారణ కోసం రేషన్ కార్డును ప్రామాణికంగా పరిగణించి ధ్రువీకరణ పత్రాన్ని మంజూరు చేస్తారు. రేషన్ కార్డులో పేర్లు లేని కారణంగా ధ్రువీకరణ పత్రం జారీ సమస్యగా తయారైంది. ఆదాయ ధ్రువీకరణ పత్రాలు లేక సంక్షేమ ఉపకార వేతనాలకు అర్హత కోల్పోతున్నారు. అయిదేళ్ల వయసు దాటితే.. ఆహార భద్రత చట్టం ప్రకారం కుటుంబంలోని సభ్యుల వయసు అయిదేళ్లు పైబడితేనే యూనిట్‌గా పరిగణిస్తారు. కార్డులు మంజూరైన నాటికి అయిదేళ్లలోపు సభ్యులు అర్హత సాధించలేక పోయారు. ఆ తర్వాత సభ్యులుగా చేరి్పంచేందుకు దరఖాస్తు చేసుకుంటే నమోదు ప్రక్రియ మాత్రం ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. కార్డు కలిగిన కుటుంబాల్లో కొత్త సభ్యుల సంఖ్య పెరుగుతున్నా.. కార్డులో మాత్రం యూనిట్లుగా నమోదు కాని పరిస్థితి నెలకొంది. గ్రేటర్ జిల్లాల పరిధిలో సుమా రు 2.13 లక్షల కుటుంబాల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో కనీసం క్షేత్ర స్థాయి విచారణలో 55 శాతానికిపైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, విచారణ పూర్తయి ఏఎస్వో లు, ఎమ్మార్వో లాగిన్‌లో 25 శాతం దరఖాస్తులు, డీఎస్వో లాగి¯న్లో 20 శాతం దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు ఆన్లైన్ నివేదిక స్పష్టం చేస్తోంది. (చదవండి: ఇంజనీరింగ్ పట్టాతో ఎగిరిపోవాల్సిందే.. ఉద్యోగం వచ్చినా వద్దే వద్దు) -
Hyderabad: చినుకు రాలితే.. వాన వరదైతే.. వెళ్లే దారేది? ‘డంపెత్తిన కంపు ’
సాక్షి, సిటీబ్యూరో: ఐటీ హబ్‌కు కేరాఫ్‌గా మారిన గ్రేటర్ సిటీ.. విశ్వనగరం బాటలో దూసుకెళుతున్నా.. మురుగు, వరదనీరు సాఫీగా వెళ్లే దారి లేక కంపుకొడుతోంది. గత వారం రోజులుగా తెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో సుమారు 200కు పైగా బస్తీలను మురుగు, వరదనీరు ముంచెత్తింది. దీంతో ఆయా బస్తీలవాసులు రోగాల బారినపడుతున్నారు. వాహనదారులు, ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. దశాబ్దాలుగా ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఈ దుస్థితికి పరిష్కారం లభించడంలేదు. ఏళ్లుగా నాలాలు విస్తరించకపోవడం, స్మార్ట్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడంతో ఏటా పరిస్థితి విషమిస్తోంది. మురుగుకు మోక్షం కల్పించాలిలా.. గ్రేటర్ విస్తీర్ణం 625 చదరపు కిలోమీటర్లు.. జనాభా కోటి దాటింది. నగరంలో నిత్యం 1400 మిలియన్ లీటర్ల మురుగు నీరు ఉత్పన్నమవుతోంది. ఇందులో 700 మిలియన్ లీటర్ల మురుగు నీటిని జలమండలి 23 ఎస్టీపీల్లో శుద్ధి చేస్తోంది. మిగతా మురుగు నీరు ఎలాంటి శుద్ధి ప్రక్రియ లేకుండానే సమీప చెరువులు, మూసీలో కలుస్తోంది. 2007లో జీహెచ్ఎంసీలో విలీనమైన 11 మున్సిపల్ సర్కిళ్ల పరిధిలోని సుమారు వెయ్యి కాలనీలు, బస్తీల్లో డ్రైనేజీ ఔట్లెట్ సదుపాయం లేకపోవడంతో మురుగు నీరు సెప్టిక్ ట్యాంకులు, బహిరంగ ప్రదేశాలు, ఓపెన్ నాలాలు, చెరువులు, కుంటలను ముంచెత్తుతోంది. ఆయా మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో రూ.3723 కోట్ల అంచనా వ్యయంతో సుమారు 2 వేల కిలోమీటర్ల మార్గంలో డ్రైనేజి పైపులైన్ వ్యవస్థ ఏర్పాటుచేయాల్సి ఉంది. ఈ పైపులైన్ల ద్వారా మురుగు నీటిని నూతనంగా రూ.1046 కోట్లతో నిర్మించనున్న 17 ఎస్టీపీల్లోకి మళ్లించి శుద్ధి చేసిన అనంతరమే మూసీ, నాలాల్లోకి వదిలిపెట్టాలి. మురుగు శుద్ధి కేంద్రాల్లో శుద్ధిచేసిన నీటిని గార్డెనింగ్, పారిశ్రామిక, నిర్మాణరంగ అవసరాలు, కార్‌వాషింగ్, ఫ్లోర్ క్లీనింగ్ తదితర అవసరాలకు వినియోగించాలి. వరద కష్టాలు లేకుండా.. గ్రేటర్ మొత్తానికీ సమగ్ర మాస్టర్‌ప్లాన్.. సూక్ష్మస్థాయి వరదనీటి పారుదల నెట్వర్క్ ప్లాన్.. మేజర్, మైనర్ వరద కాల్వల ఆధునికీకరణకు గతంలో ఓయంట్స్ సొల్యూషన్ సంస్థ సిద్ధం చేసిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక ప్రకారం పనులు చేపట్టాలి. నగరంలో 1500 కి.మీ మేర విస్తరించిన నాలాలపై ఉన్న 10 వేల అక్రమ నిర్మాణాలను తొలగించాలి. నాలాలను సమూలంగా ప్రక్షాళన చేయాలి. విస్తరించాలి. నాలాల ఆధునికీకరణ ఆవశ్యకతను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి. ఇందుకోసం రాజకీయ పార్టీలు, ఎన్జీఓల సహకారం తీసుకోవాలి. వరద నీటి కాల్వల్లో మురుగునీరు పారకుండా జలమండలికి స్పష్టమైన ఆదేశాలివ్వాలి. మురుగునీటి పారుదలకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలి. స్టార్మ్ వాటర్ డ్రైనేజి (వరదనీటి కాల్వల) మాస్టర్ ప్లాన్‌ను పరిగణనలోకి తీసుకొని టౌన్‌ప్లానింగ్ విభాగం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను అనుమతించరాదు. జీహెచ్ఎంసీ పరిధిలోని 185 చెరువుల పునరుద్ధరణ చేపట్టాలి. దీంతో వర్షపు నీరు చెరువుల్లోకి చేరి జలకళ సంతరించుకుంటాయి. చదవండి: రెండ్రోజులు మరిన్ని వానలు! ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ -
కమలోత్సాహం! మినీ ఇండియాలాంటి నగరం పైనే ఫోకస్
భాగ్యనగరం కాషాయమైంది. గల్లీగల్లీ నేతలతో నిండిపోయింది. ఫ్లెక్సీలు, కటౌట్లతో సందడి నెలకొంది. ఎన్నికల సమయంలో ఉండే హడావుడి ఇప్పుడే కన్పిస్తోంది. అగ్రనేతల దూకుడుతో కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శల కౌంటర్..ఎన్కౌంటర్లతో రాజకీయ వేడి రగులుకుంది. శనివారం నుంచి ప్రారంభమయ్యే భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ...రానున్న ఎన్నికలకు రాష్ట్ర శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. మూడవ రోజు బహిరంగ సభలో ప్రధాని మోదీ ఏం మాట్లాడుతారోనన్న ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా భాగ్యనగరంలో జరుగుతున్న బీజేపీ సమావేశాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. సాక్షి, హైదరాబాద్: కమలం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ కార్యవర్గ సమావేశాలకు నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ కార్యవర్గ సభ్యులు ఇతర దిగ్గజ నేతలు హాజరవుతోన్న ఈ సమావేశానికి మినీ ఇండియా లాంటి గ్రేటర్ సిటీ అతిథ్యమిస్తోంది. నగరంలోని అన్ని ప్రధాన రహదారులు కాషాయ శోభ సంతరించుకున్నాయి. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, పార్టీ పతకాలతో అన్ని దారులూ హైటెక్స్ వైపే అన్నట్లుగా తీర్చిదిద్దారు. భిన్న రాష్ట్రాల..సంస్కృతులు..ఆచార వ్యవహారాలు కలగలిసిన భాగ్యనగరంలో గంగా జమునా తహజీబ్ లాంటి మిశ్రమ సంస్కృతి ఏళ్లుగా కొనసాగుతుండడంతో ఇక్కడే సమావేశాల నిర్వహణకు బీజేపీ అధినాయకత్వం ఆసక్తి చూపింది. ఇదే క్రమంలో మహానగరం పరిధిలో పాతనగరంలోని 8 నియోజకవర్గాలు మినహా మిగతా 16 శాసనసభ స్థానాలపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టిసారించింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో పాగా వేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో నగరంలో పలు ప్రాంతాల్లోనివసిస్తున్న 15 రాష్ట్రాలకు చెందిన వివిధ సామాజిక వర్గాలు,నేతలు,ప్రముఖులతో ఆపార్టీ అగ్రనేతలు సదస్సులు, సమావేశాలు, సాంస్కృతిక వేడుకలు, సమాలోచనలు,విందు సమావేశాలను గురు,శుక్రవారాల్లో నిర్వహించడం విశేషం. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తల నివాసాల్లోనే అల్పాహారం,భోజనం స్వీకరిస్తూ అందరితో మమేకమవుతోన్న ఆపార్టీ అగ్రనేతలు కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో అన్ని వర్గాల్లో పార్టీ ఎజెండానూ ముందుకు తీసుకెళ్లడంతోపాటు గ్రూపు తగాదాలు లేకుండా బీజేపీ అనుబంధ సంఘాలను సమన్వయం చేస్తూ పార్టీని బలోపేతం చేయడం, బూత్‌స్థాయి కార్యకర్తలు, నేతల్లో కొత్త ఉత్సాహం నింపడమే లక్ష్యంగా పార్టీ నేతల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం విశేషం. ఎన్నికలకు ముందుగానే వ్యూహాత్మకంగా కమలం పార్టీ పావులు కదుపుతుండడంతో ఆ పార్టీ క్యాడర్, నేతల్లో జోష్ నెలకొంది. ముఖ్యమైన నేతలు మాత్రమే హాజరయ్యే కార్యవర్గ సమావేశాల అనంతరం ఆదివారం పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్టీ క్యాడర్‌కు సరికొత్తగా దిశానిర్దేశం చేయనున్నారు. ఈనేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో తెలంగాణాలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా పార్టీ దూసుకుపోతోందని ఆ పార్టీ వర్గాలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేడర్‌లో జోష్.. గ్రేటర్లో కమలం పార్టీ కేడర్‌లో నయా జోష్ నెలకొంది. జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యేందుకు పార్టీ అగ్రనేతలు నగరాన్ని సందర్శిస్తుండడం, వీరంతా ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తుండడంతో వారిలో నూతన ఉత్సాహం నెలకొంది. నగరంలో పలు చోట్ల కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి పేరిట వెలిసిన ఫ్లెక్సీలు, స్థానిక నాయకులు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు, కన్వీనర్లు ఏర్పాటు చేసిన కటౌట్లు అగ్రనేతలకు ఘనంగా స్వాగతం పలుకుతున్నాయి. నగరవ్యాప్తంగా ముఖ్య కూడళ్లలో భారీ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నలిచాయి. హైటెక్స్ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన భారీ స్వాగత ద్వారం హైలెట్‌గా నిలిచింది. పరేడ్‌గ్రౌండ్స్ మైదానంలో ఆదివారం నిర్వహించనున్న ప్రధాని బహిరంగ సభ సందర్భంగా ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ప్రధానమంత్రి మోదీ,ముఖ్య నాయకులు సభ అనంతరం బయటకు వెళ్లేందుకు టివోలి రోడ్డులో మరో ద్వారం ఏర్పాటు చేశారు. జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరవుతోన్న పలువురు కేంద్ర మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఇప్పటికే నగరంలోని పలు కీలక నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించడం, కిందిస్థాయి నేతలు, కార్యకర్తలతో మమేకమయి సరికొత్తగా దిశానిర్దేశం చేయడంతోపాటు పలువురు నేతలు క్షేత్రస్థాయిలోనే కార్యకర్తల ఇళ్లలో బస చేయడంతో పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహం నిండింది. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో సినీనటి, బీజేపీ నేత ఖుష్భూ ప్రత్యేక పూజలు చేయడంతో పాతనగరంలోనూ కమలం పార్టీ కేడర్‌లో జోష్ నిండింది. (చదవండి: రాష్ట్రంలో బీజేపీదే అధికారం) -
సామాజిక భద్రతలో సిటీ భేష్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో మహిళలపై వేధింపులు, లైంగిక దాడుల కేసులు నిత్యం పెరుగుతున్నప్పటికీ.. వారి సామాజిక భద్రత విషయంలో దేశంలో పలు మెట్రో నగరాలతో పోలిస్తే గ్రేటర్లో పరిస్థితి కాస్త మెరుగేనని తాజా సర్వేలో వెల్లడైంది. ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాల్లో పనిచేసే మహిళల విషయానికి వస్తే సిటీలో జీవన వ్యయం కూడా వారికి భారంగా పరిణమించడంలేదని.. అన్ని వర్గాల వారికీ అందుబాటులోనే ఉందని నెస్ట్అవే అనే రెంటల్ సంస్థ ఆన్లైన్ మాధ్యమంలో నిర్వహించిన తాజా సర్వేలో తేల్చింది. ఈ సంస్థ ప్రధానంగా హైదరాబాద్, పుణె, బెంగళూరు, ఢిల్లీ నగరాల్లో మహిళా నెటీజన్ల అభిప్రాయాలు సేకరించి ఈ సర్వే నిర్వహించింది. ఇందులో విద్య, వ్యాపార, వాణిజ్య, సేవారంగాల్లో పని చేస్తున్న మహిళల భద్రత విషయంలో హైదరాబాద్ నగరం 4.2 పాయింట్లు సాధించి అత్యంత మెరుగైన స్థానంలో ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాత 4 పాయింట్లు సాధించిన పుణె రెండోస్థానంలో నిలిచిందని పేర్కొంది. మూడో స్థానంలో ఉన్న బెంగళూరు స్కోరు 3.9 పాయింట్లు. 3.4 పాయింట్లు సాధించిన ఢిల్లీ నాలుగో స్థానంలో నిలిచిందని ప్రకటించింది. జీవన వ్యయమూ అందుబాటులోనే.. నగరంలోని మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, శంషాబాద్, మియాపూర్, కేపీహెచ్‌బీ, శేరిలింగంపల్లి, చందానగర్ తదితర ప్రాంతాల్లో ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇంటి అద్దెలు, హాస్టల్ రెంట్లు పనిచేసే మహిళలకు ఆర్థిక భారంగా పరిణమించడంలేదని వెల్లడించింది. పలు మెట్రో నగరాల్లో ఉద్యోగంచేసే ఒంటరి మహిళలు తమకు లభిస్తోన్న వేతనంలో 50 శాతం వరకు నివాస వసతి, భోజనం ఇతరత్రా జీవన వ్యయానికి వెచ్చిస్తున్నట్లు తేలింది. ఇక వసతి విషయంలో హైదరాబాద్ నగరంలోని పలు హాస్టళ్లలో రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు లభ్యమవుతున్నాయని పేర్కొంది. పనిచేసే ప్రదేశానికి అయిదు లేదా పది కిలోమీటర్ల పరిధిలోని హాస్టళ్లు, ఇళ్లలో నివాసం ఉండేవారికి ఇతర అవసరాలకు చేసే జీవన వ్యయం కూడా అందుబాటులోనే ఉన్నట్లు సర్వేలో పాల్గొన్న పలువురు మహిళలు అభిప్రాయపడినట్లు వెల్లడించింది. నగరంలో ప్రధాన ప్రాంతాలైన మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో ఇంటి అద్దెలు మహిళలకు అందుబాటులో ఉన్నట్లు తేలింది. హాస్టళ్లలో ఉండే వసతులను బట్టి పురుషుల నుంచి వసూలు చేస్తున్న అద్దెలతో పోలిస్తే మహిళలు చెల్లిస్తున్న అద్దెలు కూడా వారికి ఏమాత్రం భారంగా పరిణమించడంలేదని.. ఈ విషయంలో తాము ఎలాంటి వివక్ష ఎదుర్కోవడం లేదని పలువురు వర్కింగ్ ఉమెన్స్ అభిప్రాయపడ్డారని తెలిపింది. ఆయా నగరాల్లో జీవనవ్యయాలిలా... హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లోని హాస్టళ్లలో నివాస వసతి పొందేందుకు ఒక మహిళ సగటున సుమారు రూ.6 నుంచి రూ.7 వేలు ఖర్చు చేస్తున్నట్లు ఈ సర్వే తెలిపింది. పుణె నగరంలో సగటున రూ.8 నుంచిరూ.9 వేలు, బెంగళూరులో సగటున రూ.9 నుంచి 10వేలు, ఢిల్లీలో రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ఖర్చుచేస్తున్నట్లు ఈసర్వే తెలిపింది. (చదవండి: రోబోలు మనుషుల స్థానాన్ని భర్తీ చేయలేవు) -
గ్రేటర్ హైదరాబాద్: సాగర ‘గోస’ పట్టదా
సాక్షి, హైదరాబాద్: నగరం నడిబొడ్డున ఉన్న చారిత్ర క హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిని పరిరక్షించడంలో గ్రేటర్ యంత్రాంగం విఫలమైంది. సాగర్‌లో కూకట్పల్లి నాలా కలిసే ప్రాంతంలో నూతనంగా పలు నిర్మాణాలు చేపడుతున్నా.. జీహెచ్ఎంసీ,హెచ్ఎండీఏ యంత్రాంగాలు ప్రేక్షక పాత్రకే పరిమితమౌతున్నాయంటూ ఇటీవల పలువురు పర్యావరణ వేత్తలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ రెండు విభాగాలు తక్షణం..ఎఫ్టీఎల్ పరిధి పరిరక్షణ విషయంలో ఎందుకు విఫలమౌతున్నారన్న అంశంపై నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. లేని పక్షంలో హెచ్ఎండీఏ,జీహెచ్ఎంసీ కమిషనర్లు కోర్టుకు హాజరు కావాలని స్పష్టం చేసింది. హుస్సేన్‌సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలను కట్టడి చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యం విషయంలో కోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చినట్లు సేవ్ అవర్ అర్భన్‌లేక్స్ సంస్థ ప్రతినిధి లుబ్నాసర్వత్ ‘సాక్షి’కి తెలిపారు. కాగా రెండున్నరేళ్ల క్రితం..హుస్సేన్‌సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాల నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై తమకు నివేదిక అందించాలని కోర్టు అప్పట్లో ఆదేశించినప్పటికీ జీహెచ్ఎంసీ,హెచ్ఎండీఏ విభాగాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆమె ఆరోపించారు. సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో భారీగా నూతన కాంక్రీట్ నిర్మాణాలను అక్రమంగా నిర్మిస్తున్నారన్నారు. బీటీ రహదారులను సైతం ఏర్పాటు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పైపై మెరుగులే.. స్వచ్ఛమైన జలాలతో చారిత్రక హుస్సేన్‌సాగర్‌ను నింపాలన్న సర్కారు సంకల్పం అటకెక్కింది. సాగరమధనంతో ప్రక్షాళన చేపట్టేందుకు ఆర్భాటంగా ప్రారంభించిన మిషన్ గాడి తప్పింది. దశాబ్దకాలంగా సాగర ప్రక్షాళనకు సుమారు రూ.326 కోట్లు ఖర్చు చేసినా ఫలితం శూన్యం. కూకట్పల్లి నాలా మళ్లింపు పనులను పూర్తిచేసినట్లు ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ ఈ నాలానుంచి పారిశ్రామిక వ్యర్థాలు జలాశయంలోకి నేటికీ చేరుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు జలాశయం అట్టడుగున గడ్డకట్టుకుపోయిన ఘన వ్యర్థాల తొలగింపు పనులను తాత్కాలికంగా నిలిపివేయడంతో ప్రక్షాళనపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇదే తరుణంలో జలాశయం ఉపరితల భాగంలో తెట్టులా పేరుకున్న వ్యర్థాల తొలగింపునకు విదేశాల్లో వినియోగించే ఎనిమిది కాళ్ల ఎక్స్‌కవేటర్‌ను వినియోగిస్తున్నప్పటికీ ఇవన్నీ పైపై మెరుగులేనన్న వాదనలు వినిపిస్తుండడం గమనార్హం. జలాశయం ప్రక్షాళన పర్వంలో ప్రస్తుతానికి సాధించింది గోరంతేనని...చేయాల్సిన పనులు కొండంత ఉన్నాయని పర్యావరణ వాదులు స్పష్టం చేస్తున్నారు. (చదవండి: తెలంగాణ: నకిలీ సర్టిఫికెట్స్‌తో 230 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు) -
‘కిక్కు’ తగ్గింది!
సాక్షి, హైదరాబాద్: భారీగా పెరిగిన మద్యం ధరలు గ్రేటర్లో మద్యం ప్రియులకు శరాఘాతంగా మారాయి. అనూహ్యంగా పెరిగిన ధరల దృష్ట్యా లిక్కర్ వినియోగం కొంత వరకు తగ్గింది. కానీ ఆబ్కారీశాఖ ఆదాయం మాత్రం పెరిగింది. అన్ని రకాల బీర్లు, మద్యం బ్రాండ్లపైన ప్రభుత్వం కనిష్టంగా రూ. 20 నుంచి గరిష్టంగా సుమారు రూ.160 వరకు ధరలను పెంచిన సంగతి తెలిసిందే. ఒక్కో బ్రాండ్ ధర ఒక్కో విధంగా పెరిగింది. సామాన్య, మధ్యతరగతి వర్గాలకు చెందిన మద్యం ప్రియులపైన ధరల భారం పడింది. అనూహ్యంగా పెరిగిన ధరలు నిరాశకు గురిచేశాయి. ధరల పెంపునకు ముందు రోజు అమ్మకాలను నిలిపివేశారు. ఆ తరువాత కొత్త ధరలతో అమ్మకాలు మొదలయ్యాయి. తగ్గుదల ఇలా... ధరల పెంపునకు ముందు రంగారెడ్డి జిల్లాలో సుమారు 4 లక్షల కేసుల బీర్లు విక్రయించగా ధరల పెంపు తరువాత ఈ నెల 19 నుంచి 28 వరకు 3.6 లక్షల కేసుల బీర్లు మాత్రమే అమ్ముడయ్యాయి. సుమారు 40 వేల కేసుల వరకు బీర్ల అమ్మకాలు పడిపోయాయి. గ్రేటర్లో అత్యధికంగా మద్యం విక్రయాలు జరిగే రంగారెడ్డి జిల్లాలో ధరల పెంపునకు ముందు 1.86 లక్షల కేసుల ఐఎంఎల్ మద్యం విక్రయిస్తే ధరలు పెరిగిన తరువాత 1.84 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరిగాయి. సుమా రు 20 వేల కేసులు తగ్గుముఖం పట్టాయి. అలాగే హైదరాబాద్, మేడ్చెల్ ఎక్సైజ్ జిల్లాల పరిధిలోనూ ధరల పెంపునకు ముందు, తరువాత లిక్క ర్ అమ్మకాల్లో వ్యత్యాసం స్పష్టంగా నమోదైంది. పెరిగిన ధరల దృష్ట్యా మద్యం వినియోగం కొంత మేరకు తగ్గిందని పలు వైన్‌షాపులకు చెందిన నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. వేసవి ఇంకా నిప్పులు చెరుగుతున్నప్పటికీ బీర్ల అమ్మకాలు కూడా తగ్గుముఖం పట్టడం గమనార్హం. బీరుపైన పెరిగిన ధరలు స్వల్పమే అయినా గత వారం కంటే వినియోగం తగ్గింది. మేడ్చల్ జిల్లా పరిధిలో ఈ నెల మొదటి పది రోజుల్లో 85 వేల కేసుల బీర్లు విక్రయిస్తే ఈ నెల 19 నుంచి 28 వరకు 80 వేల కేసుల బీర్లు అమ్మారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆదాయం పెరిగింది... లిక్కర్ ధరలు పెంచడంతో అమ్మకాలు తగ్గినా ఆదాయం మాత్రం కొద్దిగా పెరిగింది. ఈ నెల 8వ తేదీ నుంచి 17 వరకు గ్రేటర్‌లోని మూడు జిల్లాల పరిధిలో రూ.315 కోట్ల ఆదాయం నమోదు కాగా, 19వ తేదీ నుంచి 28 వరకు రూ.351 కోట్లకు ఆదాయం పెరిగింది. మూడు జిల్లాల్లోనూ రంగారెడ్డి టాప్‌లో ఉంది. ధరల పెంపునకు ముందు రూ.192 కోట్ల ఆదాయం లభించగా, ప్రస్తుతం రూ.212 కోట్లకు పెరిగింది. (చదవండి: ‘న్యాక్’కు దూరంగా కాలేజీలు!) -
Hyderabad: సొంత బండి సో బెటర్!
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా మౌలిక, రవాణా సదుపాయాలు విస్తరిస్తాయి. కానీ గ్రేటర్లో అందుకు విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. ఏటేటా జనాభా పెరుగుతోంది. నలువైపులా నగరం విస్తరిస్తోంది. కానీ ప్రజారవాణా సదుపాయాలు మాత్రం పరిమితంగానే విస్తరించాయి. కొత్తగా మెట్రో రైలు సదుపాయం మినహా అదనంగా ప్రజారవాణా ఏ మాత్రం మెరుగుపడకపోవడం గమనార్హం. అదే సమయంలో వ్యక్తిగత వాహనాలు భారీగా రోడ్డెక్కాయి. నగర జనాభా ప్రస్తుతం ఇంచుమించు కోటిన్నరకు చేరుకుంది. పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగానే వాహనాల సంఖ్య 70 లక్షలు దాటింది. ఈ పదేళ్లలో ప్రజారవాణా విస్తరణకు నోచకపోవడం వల్లనే వ్యక్తిగత వాహనాల సంఖ్య భారీగా పెరిగినట్లు రవాణా రంగానికి చెందిన నిపుణులు అంచనా వేస్తున్నారు. బెంగళూరు వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో ప్రజా రవాణా గణనీయంగా అభివృద్ధి చెందితే హైదరాబాద్‌లో మాత్రం తగ్గుముఖం పట్టడం గమనార్హం. కిక్కిరిసిపోతున్న రహదారులు.. గ్రేటర్లో ఏటా సుమారు 2.5 లక్షల వాహనాలు కొత్తగా వచ్చి చేరుతున్నాయి. వీటిలో మూడొంతులకు పైగా వ్యక్తిగత వాహనాలే. ప్రజారవాణా వాహనాల విస్తరణ కనీసం 15 శాతం కూడా లేకపోవడం గమనార్హం. కోటిన్నర జనాభా ఉన్న నగరంలో వాహనాల సంఖ్య ప్రస్తుతం 71 లక్షలు దాటింది. రోజు రోజుకు వేల సంఖ్యలో రోడ్డెక్కుతున్న వాహనాలతో రహదారులు కిక్కిరిసిపోతున్నాయి. కోవిడ్ దృష్ట్యా వ్యక్తిగత వాహనాల వినియోగం భారీగా పెరిగింది. ఈ రెండేళ్లలోనే 5 లక్షలకు పైగా కొత్త వాహనాలు రోడ్డుపైకి వచ్చాయి. 2020లో 65 లక్షల వాహనాలు ఉంటే ఇప్పుడు 71 లక్షలు దాటాయి. యువతలో 80 శాతం మందికి బైక్ తప్పనిసరిగా మారింది. చదువు, ఉద్యోగ,వ్యాపార అవసరాలతో నిమిత్తం లేకుండా ఒక వయస్సుకు రాగానే పిల్లలకు బండి కొనివ్వడాన్ని తల్లిదండ్రులు గొప్పగా భావిస్తున్నారు. రవాణాశాఖలో నమోదైన 71 లక్షల వాహనాల్లో సుమారు 47 లక్షల వరకు బైక్‌లే కావడం గమనార్హం. మరో 20 లక్షల వరకు కార్లు ఉన్నాయి. మిగతా 5 లక్షల వాహనాల్లో ఆటోరిక్షాలు, క్యాబ్‌లు, సరుకు రవాణా వాహనాలు, స్కూల్ బస్సులు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు తదితర కేటగిరీలకు చెందిన వాహనాలు ఉన్నాయి. పదేళ్లలో రెట్టింపు... పదేళ్లలో జనాభా పెరిగింది. 2011 నాటి లెక్కల ప్రకారం 75 లక్షలు ఉంటే ఇప్పుడు కోటిన్నరకు చేరింది. సొంత వాహనాలు సైతం ఇంచుమించు జనాభాకు సమాంతరంగా పెరిగాయి. కానీ ప్రజారవాణా సదుపాయాలు మాత్రం ఈ పదేళ్లలో చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. 2012 నాటి లెక్కల ప్రకారం నగరంలోని 28 డిపోల పరిధిలో 3850 సిటీ బస్సులు ఉండేవి. ప్రతిరోజు సుమారు 32 లక్షల మంది ప్రయాణికులు ఈ బస్సుల్లో రాకపోకలు సాగించారు. మరో 8 లక్షల మంది ఆటోలను వినియోగించుకున్నారు. లక్ష మంది ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణం చేశారు. అంటే 75 లక్షల జనాభాలో కనీసం సగం మందికి ప్రజా రవాణా అందుబాటులో ఉంది. ఆర్టీఏ లెక్కల ప్రకారం పదేళ్ల క్రితం నగరంలో వ్యక్తిగత 33 లక్షల వరకు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 71 లక్షలు దాటింది. ఇప్పు‘ఢీ’లా... రోజుకు 3.5 లక్షల మంది ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేసే మెట్రో రైలు తప్ప ఈ పదేళ్లలో ఇతర రవాణా సదుపాయాలు ఏ మాత్రం మెరుగుపడలేదు. సిటీ బస్సుల సంఖ్య ఇంచుమించు సగానికి పడిపోయింది. 2550 బస్సులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. 16 లక్షల మంది మాత్రమే ప్రయాణం చేస్తున్నారు. కోవిడ్ దృష్ట్యా ఆటోలు, క్యాబ్‌ల వినియోగం బాగా తగ్గింది. ప్రస్తుతం ఈ రెండు కేటగిరీ వాహనాల్లో ప్రతిరోజు 5 లక్షల మంది మాత్రమే ప్రయాణం చేస్తున్నట్లు అంచనా. కోవిడ్‌తో ఎంఎంటీఎస్‌ల వినియోగం దారుణంగా పడిపోయింది. గతంలో రోజుకు 121 సర్వీసులు నడిస్తే ఇప్పుడు 75 మాత్రమే ఉన్నాయి. అప్పుడు లక్ష మంది ప్రయాణం చేశారు. ఇప్పుడు 25 వేల నుంచి 30 వేల మంది మాత్రమే ఎంఎంటీఎస్‌లను వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వ,ప్రైవేట్ రంగాలకు చెందిన ఉద్యోగులు, ఐటీ నిపుణులు, విద్యార్ధులు తదితర అన్ని వర్గాలకు మెట్రో రైలును ఏకైక పరిష్కారంగా భావించారు. కానీ ఈ ఐదేళ్లలో మెట్రో ప్రయాణికుల సంఖ్య ఏ మాత్రం మెరుగుపడలేదు. (చదవండి: టాఫిక్ సిగ్నల్.. ఇక ఆటోమేటిక్!) -
మాస్కు మస్ట్...ఆలస్యమైన అనుమతించరు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మాస్కుధారణ తప్పనిసరి అని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్ష కేంద్రాల్లో క్లీన్ అండ్ గ్రీన్‌తోపాటు శానిటైజేషన్ కార్యక్రమాలు పరీక్షలు పూర్తయ్యే వరకు కొనసాగే విధంగా చర్యలు చేపట్టింది. విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా సిట్టింగ్ ఏర్పాట్లు చేసింది. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలున్న వారికి ప్రత్యేకంగా ఐసోలేషన్ గదులు ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని పరీక్ష కేంద్రం ఆవరణలో, బయట నీడ లేకుంటే ప్రత్యేక షామియానాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంది. విద్యుత్, తాగునీటి సౌకర్యంతోపాటు అత్యవసర వైద్య సేవల కోసం ఆశా వర్కర్స్, ఏఎన్ఎంలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. డీహైడ్రేషన్ నుంచి విద్యార్థులను రక్షించేందుకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. పరీక్ష కేంద్రంలో వాటర్ బాటిల్ మాత్రమే అనుమతిస్తారు. సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను లోనికి అనుమతించరు. ఒక్క నిమిషం నిబంధన అమలు ఇంటర్మీడియట్ పరీక్షలకు ఈసారీ కూడా ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించకూడదనే నిబంధన విధించారు. పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలి. ఉదయం 8 నుంచే పరిశీలించి కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ట్రాఫిక్ సమస్య, పరీక్ష కేంద్రం గుర్తింపు సమస్యలను దృష్టిలో పెట్టుకొని ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించింది. టీఎస్‌బీఐఈ ఎగ్జామ్ సెంటర్ లోకేటర్ అనే మొబైల్ యాప్ ద్వారా పరీక్ష కేంద్రాన్ని సులువుగా గుర్తించవచ్చు. 3.76 లక్షల మంది విద్యార్థులు.. గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో సుమారు 3.76 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందు కోసం సుమారు 517 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి గదిలో 25 మంది విద్యార్థులకు ఒకరి చొప్పున 15,048 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్ష కేంద్రాల పర్యవేక్షణ కోసం కేంద్రానికి ఒక్కొక్కరి చొప్పున డిపార్ట్మెంట్ అధికారులు, చీఫ్ సూపరింటెండెట్లను కేటాయించారు. ప్రైవేటు పరీక్ష కేంద్రంలో అదనంగా అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెట్‌ను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా తనిఖీల కోసం సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా రంగంలోకి దించనున్నారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘాలో ఉండనున్నాయి. మాస్ కాపీయింగ్, అవకతవకలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. (చదవండి: సర్కారు వారి పాట) -
పక్కాగా లెక్క.. బడి బయట పిల్లలెందరు..?
సాక్షి,మేడ్చల్ జిల్లా: బడి ఈడు పిల్లల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని అమలు చేస్తున్నాయి. పలు కారణాలతో మధ్యలో బడిమానేసిన వారిని తిరిగి చదువు బాట పట్టించే చర్యలను విద్యాశాఖ తీసుకుంటోంది. ఇందులో భాగంగా బడిమానేసిన పిల్లల వివరాలు సేకరించాలని ఆదేశించింది. చదువుకు దూరమైన పాఠశాల స్థాయిలో 06–14. కళాశాల స్థాయిలో 15–19 ఏళ్ల వారిపై క్షేత్రస్థాయిలో సర్వే చేసేందుకు సిద్ధమవుతున్నారు. సీఆర్పీలు ఇంటింటికీ వెళ్లి ‘ప్రభంద’ పోర్టల్‌లో నమోదు చేయనున్నారు. నేటి నుంచి ప్రారంభం గ్రేటర్‌తో సహా శివారు రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల పరిధిలో 2,498 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, ఇందులో మేడ్చల్ జిల్లాలో 515, రంగారెడ్డి జిల్లాలో 1,301, హైదరాబాద్ జిల్లాలో 682 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ప్రతి పాఠశాలలో బడిమానేసిన విద్యార్థుల వివరాల జాబితా అందుబాటులో ఉంది. దీని ఆధారంగా పది, ఇంటర్, డిగ్రీ.. ఏ దశలో విద్యను మానేశారో స్పష్టంగా తేల్చనున్నారు. గురువారం నుంచి వచ్చే నెల 12 వరకు గ్రామపంచాయతీ, పురపాలక సంఘాలు, జీహెచ్ఎంసీ పరిధిలో విద్యాశాఖకు చెందిన ఐఈఆర్పీలు, సీఆర్పీలు క్షేత్రస్థాయి సర్వే నిర్వహించనున్నారు. ఉదయం..సాయంత్రం.. ఎండల తీవ్రత బడి బయట పిల్లల సర్వేపై ప్రభావం చూపనుంది. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో సర్వే చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. ఆసక్తి ఉన్న వారిని వృత్తి విద్యా కోర్సులో చేర్పించనున్నారు. ఉన్నత విద్యా ఫలాలు అందించి జీవితంలో స్థిరపడేలా చేయూతనివ్వనున్నారు. సర్వే వేగవంతం చేసేలా విద్యాశాఖ అధికారులు పర్యవేక్షిస్తారు. పక్కాగా వివరాల సేకరణ చదువుకునే వయస్సులో ఆర్థిక స్తోమత, కుటుంబ పరిస్థితుల కారణంగా పలువురు చిన్నారులు బడికి వెళ్లడంలేదు. ఉన్నత విద్య అభ్యసించాలనే వారి ఆశయం నెరవేరడం లేదు. ఈ సర్వేలో విద్యార్థి పేరు, ఆధార్, సెల్‌ఫోన్ నంబరు, ఏ తరగతిలో బడి మానేశారు. కారణాలు ఏమిటి..? తల్లి స్వశక్తి సంఘంలో సభ్యురాలిగా ఉందా? తల్లితండ్రుల వృత్తి, ప్రత్యేక అవసరాల పిల్లలు, వలస కూలీల పిల్లల సమాచారాన్ని సేకరించి నమోదు చేయనున్నారు. గత రెండేళ్లుగా కోవిడ్ కారణంగా సర్వే మొక్కబడిగా సాగింది. ప్రస్తుతం ఆయా వివరాల సేకరణ పక్కాగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.కొందరు ఇంటివద్దనే ఉంటూ కూలీ పనులకు వెళుతున్నారు. మరికొందరు కుల వృత్తిలో కొనసాగుతూ.. విద్యకు దూరమవుతున్నారు. గత సర్వేలో బడి బయట పిల్లల సంఖ్య –1226 బడి బయట పిల్లల వివరాలకు సంబంధించి 2020–21లో విద్యాశాఖ సర్వే నిర్వహించగా ,గ్రేటర్‌తో సహా శివారు జిల్లాల్లో 1226 మంది లెక్క తేల్చారు. ఇందులో మేడ్చల్ జిల్లాలో 294 , రంగారెడ్డి జిల్లాలో 413, హైదరాబాద్ జిల్లాలో 519 మంది ఉండగా, వీరందరికీ ఆయా పాఠశాలలు, సార్వత్రిక విద్యాలయాల్లో ప్రవేశాలు కల్పించి చదువుకునేలా విద్యాశాఖ చర్యలు తీసుకుంది. (చదవండి: జల్లు..ఝల్లు) -
గ్రేటర్ వాసులను బెంబేలెత్తించిన వాన... ధ్వంసమైన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు
సాక్షి, హైదరాబాద్: భారీ ఈదురుగాలులతో కురుస్తున్న వర్షాలు గ్రేటర్ వాసులను బెంబేలెత్తిస్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున గాలివానతో అనేక చోట్ల చెట్ల కొమ్మలు, హోర్డింగ్‌లు విరిగి లైన్లపై పడ్డాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 400పైగా 11 కేవీ ఫీడర్లు, 80కిపైగా 33 కేవీ ఫీడర్లు ట్రిప్పవగా, 60పైగా విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. మరో నాలుగు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడంతో సరఫరాకు తీవ్ర అంత రాయం ఏర్పడింది. విద్యుత్ సిబ్బంది అప్రమత్తమై కొన్ని చోట్ల సరఫరాను వెంటనే పునరుద్ధరించారు. మరికొన్ని చోట్ల రాత్రి అంధకారం తప్పలేదు. ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి వరకు కరెంట్ లేకపోవడంతో ముఖ్యంగా బహుళ అంతస్తుల భవనాల్లోని లిఫ్ట్‌లు, మంచినీటి సరఫరా మోటార్లు పని చేయకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. అత్యవసర సమయంలో 1912 కాల్ సెంటర్ మూగబోగా, కొంతమంది లైన్మెన్లు, ఇంజినీర్లు తమ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవడం గమనార్హం. 850 మెగావాట్లకు పడిపోయిన విద్యుత్ డిమాండ్ గ్రేటర్ జిల్లాల్లో చాలా వరకు ఓవర్‌హెడ్ లైన్లే. ఈ లైన్ల కిందే చెట్టు నాటుతుండటం, అవిపెరిగి పెద్దవై ఈదురుగా లులకు విరిగి పడుతుండటంతో తెగిపడుతున్నాయి. ప్రధాన వీధులు సహా శివారు ప్రాంతాల్లోనూ విచ్చలవిడిగా హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో చాలా వరకు విద్యుత్ లైన్లను ఆనుకుంటున్నాయి. ఫ్లెక్సీలు, బ్యానర్లు చిరిగి గాలికి ఎగిరి లైన్ల మధ్య చిక్కుకుంటున్నాయి. ఒకదానికొకటి ఆనుకోవడంతో షార్ట్‌సర్క్యూట్ తలెత్తి ఫీడర్లు ట్రిప్పవుతున్నాయి. తెల్లవారుజామున అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో ఇబ్బంది పడాల్సివ చ్చింది. వర్షం వెలియగానే కొన్ని చోట్ల సరఫరాను పునరుద్ధరించిన్పటికీ.. చెట్ల కొమ్మలు ఎక్కువగా ఉన్న సమస్యాత్మక ప్రాంతాల్లో ఆరేడు గంటలకుపైగా శ్రమించాల్సి వచ్చింది. ఆ సర్కిళ్లలోనే ఎక్కువ నష్టం ఈదురు గాలితో కూడిన వర్షానికి సరూర్‌నగర్, మేడ్చల్, సికింద్రాబాద్, హబ్సీగూడ సర్కిళ్ల పరిధిలోనే ఎక్కువ నష్టం వాటిల్లినట్లు డిస్కం ఇంజినీర్లు గుర్తించారు. ఎల్బీనగర్, నాగోలు, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, యాచారం, బీఎన్‌రెడ్డి, పసుమాముల, తుర్కయాంజాల్ పరిసర ప్రాంతాల్లోనే 37 విద్యుత్ స్తంభాలు నేలకూలినట్లు అధికారులు గుర్తించారు. చెట్ల కొమ్మలు, హోర్డింగ్‌లు ఎక్కువ ఉన్న కంటోన్మెంట్, బోయిన్పల్లి, ప్యారడైజ్, సైఫాబాద్, మెహిదీపట్నం, చార్మినార్, కాచిగూడ, ఆస్మాన్‌గడ్, ఓల్డ్‌మలక్‌పేట్, రాజేంద్రనగర్, సికింద్రాబాద్, శంషాబాద్, మీర్పేట్, బాలానగర్, ఉప్పల్, బోడుప్పల్, చర్లపల్లి, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో ఐదు 33 కేవీ, పదిహేను 11 కేవీ, 37 ఎల్టీ పోల్స్ నేలకూలాయి. అంతేకాదు సైబర్‌సిటీ సర్కిల్లో 11 ఫీడర్లు ట్రిప్పవగా, హబ్సీగూడలో 35 ఫీడర్లు, మేడ్చల్‌లో 35, రాజేంద్రనగర్‌లో 18, సరూర్‌నగర్‌లో 21, సికింద్రాబాద్‌లో 17, హైదరాబాద్ సౌత్‌లో 14, హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్లో 12, బంజారాహిల్స్‌లో ఐదు ఫీడర్లు ట్రిప్పయ్యాయి. ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా గ్రేటర్ జిల్లాల్లో సుమారు రూ.50 లక్షలకుపైగా ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనా. -
బాటసారి.. వేసారి
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరంలో ఫ్లై ఓవర్లు, ఇతర పనులకు రూ.25 వేల కోట్లకుపైగా నిధులు ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. నడిచేవారి కోసం కనీసం వందల కోట్లు ఖర్చయ్యే ఫుట్‌పాత్‌లు నిర్మించలేకపోతోంది. వాహనాలకు ఎక్కడా చిక్కులు ఉండరాదని సిగ్నల్‌ఫ్రీగా సాగేందుకు ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నట్లుగానే పాదచారులు సాఫీగా నడక సాగించేందుకు ఫుట్‌పాత్‌లు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో గతంలో 6 వేల కి.మీ మేర రహదారులుండగా, ప్రస్తుతం అవి 9100 కి.మీలకు పెరిగాయి. వీటిలో బీటీ, సీసీ, తదితరాలు ఉన్నాయి. రోడ్లు వాహనదారులకు సదుపాయం కాగా, నడిచేవారి కోసం రహదారి పక్కన ఫుట్‌పాత్‌లు లేవు. దీంతో తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. కారణాలు అనేకం.. నగరంలో కాలిబాటలు అందుబాటులో లేకపోవడానికి కారణాలు అనేకం ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో వాటి నిర్మాణాన్నే మరిచారు. ప్రధాన రహదారుల వెంబడి కొన్ని ప్రాంతాల్లో పేరుకు అవి కాలిబాటలైనా నడిచేవారికి ఉపయోగపడటం లేదు. వాటిపై వెలసిన దుకాణాలు, ట్రాన్స్ఫార్మర్లు, పబ్లిక్‌టాయ్‌లెట్లు.. వాటర్ ఏటీఎంలు, చెట్లు, అన్నపూర్ణ భోజన కేంద్రాలు తదితరాలతో 50 మీటర్లు కూడా సవ్యంగా నడిచే పరిస్థితి లేదు. ఈ దుస్థితి మారుస్తామని ఏళ్ల తరబడి ప్రకటనలు చేస్తున్న జీహెచ్ఎంసీ యంత్రాంగం పనులు మాత్రం చేయలేకపోతోంది. దీంతో పాదచారుల కష్టాలు తీరడం లేదు. గత రెండేళ్లలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొత్తగా ఫుట్‌పాత్‌ల నిర్మాణం చేపట్టడంతో పాటు అవి పాదచారులకు ఉపయోగపడేలా బొలార్డ్స్, రెయిలింగ్స్ వంటివి ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేప్పటికీ (2014–15) నగరంలో 452 కి.మీ ఫుట్‌పాత్‌లున్నాయి. గత సంవత్సరం (2021) వరకు 817 కి.మీ.లకు పెరిగాయి. అంటే 365 కి.మీ నిర్మించారు. జోన్‌కు కనీసం 10కి.మీ ఫుట్‌పాత్‌లు నిర్మించాలని రెండేళ్లక్రితం (2020) మంత్రి కేటీఆర్ ఆదేశించడంతో 75 కి.మీ మేర పనులు చేపట్టి వాటిల్లో 60 కి.మీ మేర పూర్తిచేశారు. మిగతా 15 కి.మీ పనులు ఇంకా పూర్తికావాల్సి ఉంది. సమగ్ర రోడ్డు నిర్వహణ పథకం(సీఆర్ఎంపీ)లో భాగంగా ప్రధాన రహదారుల మార్గాల్లో రోడ్ల బాధ్యతలు చేపట్టిన కాంట్రాక్టు ఏజెన్సీలు 60 కి.మీ.ల మేర ఫుట్‌ఫాత్‌లు నిర్మించాయి. వీటితో కలిపి గడచిన ఏడేళ్లలో మొత్తం 365 కి.మీ.ల ఫుట్‌పాత్‌లు నిర్మించారు. రోడ్ల వెంబడి తగిన స్థలం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఫుట్‌ఫాత్‌లు నిర్మించినట్లు అధికారులు పేర్కొన్నారు. (చదవండి: క్యాబ్.. ఓన్లీ క్యాష్!) -
నిరుద్యోగులకు బస్‌పాస్‌లో 20 శాతం రాయితీ
సాక్షి, హైదరాబాద్: పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగులకు బస్ పాస్‌ల్లో ఆర్టీసీ రాయితీ ప్రకటించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో మూడు నెలల పాస్‌లపై 20 శాతం చొప్పున రాయితీ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యాదగిరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం మూడు నెలల (క్వార్టర్లీ) ఆర్డినరీ బస్‌పాస్ రూ.3,450 ఉండగా.. 20 శాతం రాయితీ రూ.2800కు పాస్‌లు ఇస్తారు. మెట్రో మూడు నెలల పాస్ (క్వార్టర్లీ) ప్రస్తుతం రూ.3900. 20 శాతం డిస్కౌంట్ అనంతరం రూ.3120. రౌండెడ్ ఆఫ్‌తో రూ.3200కు పాస్‌లను పొందవచ్చు. పాస్‌ల కోసం తీసుకొనే గుర్తింపు కార్డుకు రూ.30 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఆర్టీసీ తాత్కాలిక బస్షెల్టర్లు రహదారుల విస్తరణ కారణంగా తొలగించిన బస్షెల్టర్ల స్థానంలో ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేసింది. తొలగించిన బస్షెల్టర్లను జీహెచ్ఎంసీ ఇప్పటి వరకు పునర్నిర్మించకపోవడంతో ప్రయాణికులు మండుటెండల్లో పడిగాపులు కాస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల సదుపాయం కోసం 24 బస్టాపుల్లో తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యాదగిరి తెలిపారు. భరత్‌నగర్ (ఎర్రగడ్డ వైపు), ప్రగతినగర్, ఎల్లంపేట్ క్రాస్‌రోడ్, ఆర్సీపురం, ఉప్పల్ (రేణుక వైన్స్), యాప్రాల్, కాచిగూడ క్రాస్‌రోడ్స్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, కొత్తగూడ ఎక్స్‌రోడ్స్, జియాగూడ గాంధీ విగ్రహం, నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి, అడిక్‌మెట్, నారాయణగూడ (హిమాయత్‌నగర్ వైపు), బర్కత్‌పురా పీఎఫ్ ఆఫీస్, అఫ్జల్‌గంజ్, జిల్లెలగూడ, జైపురికాలనీ, మన్నెగూడ, ఎల్బీనగర్, ఉప్పల్ క్రాస్‌రోడ్స్, ఉప్పల్ డిపో తదితర ప్రాంతాల్లో టెంట్లు వేసి తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. (చదవండి: పుట్టగానే ఆధార్!) -
Telangana: ఇంటర్ అలర్ట్
సాక్షి హైదరాబాద్: వచ్చే నెల 6వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కరోనా నిబంధనలు, ఎండల తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. పరీక్ష కేంద్రంలో గాలి, వెలుతురు ఉన్న గదులకు మాత్రమే అనుమతిస్తూ సింగిల్ బెంచీ (మూడు ఫీట్లు)కి ఒకరు, పెద్ద బెంచీ (ఐదు ఫీట్లు)కి ఇద్దరు విదార్థులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు మాస్కులు తప్పనిసరి. పరీక్ష కేంద్రంలో విద్యుత్, తాగునీటి సౌకర్యంతోపాటు అత్యవసర వైద్య సేవల కోసం ఆశావర్కర్స్, ఏఎన్ఎం అందుబాటులో ఉంటారు. డీహైడ్రేషన్ నుంచి రక్షించేందుకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచతున్నారు. పరీక్ష కేంద్రంలోని గదికి 25 మంది చొప్పున విద్యార్థులను కేటాయిస్తున్నారు. ప్రతి గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిర్వహణ తీరు పర్యవేక్షించనున్నారు. విద్యార్థులు పరీక్షే కేంద్రాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేరుకునేందుకు మొబైల్ యాప్ ద్వారా సెంటర్ లొకేషన్ గుర్తింపు ప్రక్రియకు వెసులుబాటు కల్పించారు. రెండు, మూడు రోజుల్లో మొబైల్ యాప్ వివరాలను బోర్డు అధికారులు ప్రకటించనున్నారు. 3.76 లక్షల మంది గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కలిపి సుమారు 3,76,245 మంది పరీక్షకు హజరు కానున్నారు. ఇందుకోసం సుమారు 517 కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లాలో ఫస్టియర్, సెకండియర్‌లో కలిపి 153,119 మంది, రంగారెడ్డి జిల్లాలో 115,366 మంది, మేడ్చల్ జిల్లాలో 1,07,760 మంది పరీక్షలకు హజరు కానున్నారు. ప్రతి 25 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్ చొప్పున నియమిస్తున్నారు. సెంటర్ ఒకరు చొప్పున డిపార్ట్మెంట్ అధికారులను, చీఫ్ సూపరింటెండెంట్లు, ప్రైవేటు విద్యా సంస్ధల కేంద్రాలకు అదనంగా అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెంట్లను నియమించారు. (చదవండి: జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో అక్రమాలు) -
క్లీన్ టెక్నాలజీ కేరాఫ్ టీహబ్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌కు మణిహారం టీహబ్ ఇప్పుడు క్లీన్ టెక్నాలజీ రంగంలోని స్టార్టప్ కంపెనీలను ఆకర్షిస్తోంది. కెనడాకు చెందిన ప్రతిష్టాత్మక కెనడా డిజిటల్ మీడియా నెట్‌వర్క్‌తో(పబ్లిక్ప్రైవేట్ ఇన్నోవేషన్ హబ్)తో టీహబ్ గతంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం ఇప్పుడు సత్ఫలితాన్నిస్తోంది. కెనడాలో బయో టెక్నాలజీ, క్లీన్ టెక్నాలజీ, బిజినెస్టు బిజినెస్ తదితర రంగాల్లో విశేషంగా కృషి చేస్తున్న అంకుర పరిశ్రమలను నగరానికి ఆహ్వానించేందుకు కెనడియన్ డిజిటల్ మీడియా నెట్వర్క్ (సీడీఎంఎన్)కు అనుబంధంగా పనిచేస్తున్న 26 సంస్థలను టీహబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రిడ్జి ప్రోగ్రాంకు ఎంపిక చేసినట్లు టీహబ్ ప్రతినిధులు తెలిపారు. ఆయా రంగాల్లో అత్యున్నత నాణ్యత ప్రమాణాలు, ఉత్పత్తుల సాధనే లక్ష్యంగా పనిచేసే సంస్థలకు భారత్‌లో మార్కెట్ అవకాశాలను చూపడంతోపాటు పలు పరిశ్రమలకు చేయూతనందించేందుకు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని టీహబ్ వర్గాలు పేర్కొన్నాయి. కెనడా నుంచి మెరుగైన సాంకేతికతను పొందడంతోపాటు ఇక్కడి చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించడం, నూతన అంకుర పరిశ్రమలకు జీవం పోయడమే ధ్యేయమన్నారు. ప్రధానంగా నిలకడగల అభివృద్ధి సాధన,హెల్త్‌కేర్ రంగంలో మరింత పురోగతి సాధించేందుకు ఈ కార్యక్రమం దోహదం చేస్తుందన్నారు. నూతన అంకుర పరిశ్రమల రాకతో ఉద్యోగవకాశాలు పెరగడంతోపాటు.. కెనడా, భారత దేశాల మధ్య వాణిజ్య బంధం మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు. కెనడాకు చెందిన కంపెనీలు టీహబ్ నుంచి కార్యకలాపాలు సాగించేందుకు కూడా అనువైన వాతావరణం ఏర్పాటు చేశామన్నారు. (చదవండి: ఫార్మా మహిళల భద్రతకు ‘షీ షటిల్స్’) -
హైదరాబాద్‌లో ఎండలు దంచికొడితే చిల్డ్ బీర్ పొంగాల్సిందే!
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. వేసవి తాపంతో అల్లాడుతున్న మద్యం ప్రియులు బార్లు, వైన్‌షాపుల వద్ద బారులు తీరుతున్నారు. నిప్పులు చెరిగే ఎండల బారి నుంచి ఉపశమనం కోసం చిల్డ్ బీర్‌ను ఆశ్రయిస్తున్నారు. దీంతో గత రెండు నెలలుగా గ్రేటర్లో బీర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. సాధారణ రోజుల్లో ‘కిక్’నిచ్చే మద్యం అమ్మకాలు తగ్గుముఖం పట్టగా బీర్ల అమ్మకాలు మాత్రం భారీగా పెరిగినట్లు ఆబ్కారీ వర్గాలు తెలిపాయి. మార్చి, ఏప్రిల్ నెలలో ఇప్పటి వరకు గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 21,68,537 కేస్ల బీర్ల విక్రయాలు జరిగాయి. అమ్మకాల్లో రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఆ ఒక్క జిల్లాలోనే ఈ నెలలో ఇప్పటి వరకు 7.57 లక్షల కేస్‌లకుపైగా బీర్లు అమ్ముడైనట్లు అధికారులు తెలిపారు. చదవండి👉: కన్నతండ్రి కళ్ల ముందే విగతజీవిలా మారితే.. దిక్కులు పిక్కటిల్లేలా చేసిన రోదన వేసవి ప్రభావంతో.. వేసవి దృష్ట్యా మద్యం అమ్మకాలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. గత నెలలో హైదరాబాద్‌లో 2.7 లక్షల కేస్లకు పైగా మద్యం విక్రయాలు జరగగా ఈ నెలలో ఇప్పటి వరకు 1.85 లక్షల కేస్లు మాత్రమే అమ్ముడయ్యాయి. రంగారెడ్డి జిల్లాలోనూ మద్యం విక్రయాలు 4.33 లక్షల కేస్ల నుంచి ఈ నెలలో 3.97 లక్షల కేస్లకు తగ్గాయి. మేడ్చల్ జిల్లాలోనూ మద్యం అమ్మకాలపై వేసవి ప్రభావం పడింది. మార్చిలో 82 వేలకుపైగా విక్రయించగా ఈ నెలలో 79 వేలకు పైగా మద్యం కేస్లు అమ్ముడయ్యాయి. ఆదాయంలోనూ ఈ తేడా కొట్టొచ్చినట్లు ఉంది. గత నెలలో రంగారెడ్డి జిల్లాలో అన్ని రకాల మద్యం, బీర్ల అమ్మకాలపై రూ.389 కోట్లకు పైగా ఆదాయం లభించింది. ఈ నెలలో ఇప్పటి వరకు రూ.398.32 కోట్ల ఆదాయం లభించినట్లు అధికారులు తెలిపారు. గ్రేటర్‌లోని మూడు జిల్లాల పరిధిలో బీర్ల అమ్మకాలే టాప్ గేర్‌లో దూసుకెళ్తున్నాయి. మే నెలలోనూ ఇదే హవా..? మరోవైపు వచ్చే మే నెలలోనూ ఐఎంఎల్ లిక్కర్ కంటే బీర్ల అమ్మకాలే ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది ఏప్రిల్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా 19.30 లక్షల కేస్ల బీర్ల విక్రయాలు జరిగాయి. ఈ నెలలో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 32.72 లక్షల కేస్ల బీర్లు అమ్ముడు కావడం గమనార్హం. మే నెలలోనూ అమ్మకాల్లో ఇదే ఒరవడి కొనసాగనుంది. -
అంచనాలకు మించి టెట్ దరఖాస్తులు...పరీక్ష కేంద్రాలు బ్లాక్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) కోసం పరీక్ష కేంద్రాల ఎంపికకు అవకాశం నిలిచిపోయింది. దరఖాస్తులు సమర్పించేందుకు మరో రెండురోజులు గడువు ఉండగానే హైదరాబాద్– రంగారెడ్డి– మేడ్చల్ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకునేందుకు అవకాశం లేకుండా బ్లాక్ అయింది. నగరం నుంచి అంచనాలకు మించి దరఖాస్తులు వస్తుండటంతో పరీక్ష కేంద్రాల జాబితా నుంచి గ్రేటర్ జిల్లాలు తొలగింపునకు గురయ్యాయి. వాస్తవంగా టెట్ పరీక్ష ఎంత మంది రాస్తారన్న అంశంపై సంబంధిత అధికారులు సరిగా అంచనా వేయలేకపోయారు. ఎగ్జామ్ సెంటర్ల ఏర్పాటు సంఖ్య అభ్యర్థులను ఇబ్బందుల్లో పడేసింది. టెట్ పరీక్ష కోసం గత నెల 26 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుండగా.. ఈ నెల 12తో గడువు ముగియనుంది. ఫీజు చెల్లింపునకు మాత్రం నేటితో (సోమవారం) ఆఖరిరోజు. పరీక్షకు హజరయ్యేందుకు ఆ¯న్లైన్లో టెట్ దరఖాస్తులు చేసుకోవాల్సి ఉండగా, సర్వర్ సమస్య, నెట్ సెంటర్లలో రద్దీ తదితర కారణాలతో ఆఖరులో దరఖాస్తు చేసుకోవచ్చని భావించిన వారితో పాటు ఇప్పటికే ఫీజు చెల్లించి అప్లికేషన్ పూర్తి చేయని వారికి సైతం షాక్ తగిలినట్లయింది. లక్ష మందికి పైగా.. మహానగర పరిధిలో సుమారు లక్ష మందికి పైగా బీఎడ్, డీఎడ్ కోర్సులు పూర్తి చేసిన, పూర్తి చేస్తున్న అభ్యర్థులు ఉన్నట్లు అంచనా. దీంతో కొత్త, పాత వారితో కలిపి దరఖాస్తులు సంఖ్య ఎగబాగుతున్నట్లు తెలుస్తోంది. పోటీ పరీక్షలకు నగరంలో కోచింగ్ తీసుకుంటున్న అభ్య ర్థులు సైతం టెట్ పరీక్ష కోసం ఇక్కడి కేంద్రాలను ఎంపిక చేసుకోవడంతో ఊహించిన దానికంటే అధికంగా దరఖాస్తులు నమోదవుతున్నాయి. వాస్తవంగా టీచర్ల పోస్టుల కోసం అయిదేళ్లుగా నోటిఫికేషన్ లేకుండాపోయింది. 2017లో టీఆర్టీ నిర్వహించగా.. ఇప్పటివరకు ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకపోవడంతో.. ప్రభుత్వం ఎలాగైనా టీచర్ పోస్టులను భర్తీ చేస్తుందనే నమ్మకంతో ఏటా బీఎడ్, డీఎడ్ కోర్సుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 47 ప్రభుత్వ, ప్రైవేట్ బీఈడీ కాలేజీలుండగా అందులో ప్రతి ఏటా 5,640 మంది విద్యార్థులు బీఈడీ కోర్సు పూర్తిచేస్తూ వస్తున్నారు. 12 డీఈడీ కళాశాలల్లో ఏటా 480 మంది కోర్సులను పూర్తిచేస్తున్నారు. బీఎడ్, డీఎడ్ కోర్సులు పూర్తి చేసి టెట్ కోసం ఎదురుచూస్తున్న వారితోపాటు పాత అభ్యర్థులు సైతం ఈసారి దరఖాస్తు చేసుకుంటుండంతో సంఖ్య మరింత ఎగబాగుతోంది. సొంత జిల్లాలో చాన్స్ మిస్.. టెట్ పరీక్ష కేంద్రాల జాబితాను హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు బ్లాక్ కావడంతో అభ్యర్థులు సొంత జిల్లాల్లో కాకుండా ఇతర జిల్లాల్లో పరీక్ష రాసేందుకు ఎగ్జామ్ సెంటర్లను ఎంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మహిళా అభ్యర్ధులైన గర్భిణులు, చిన్నపిల్లల తల్లులతో పాటు వికలాంగులకు ఇతర ప్రాంతాలకు వెళ్లి పరీక్ష రాయడం మరో పరీక్షగా తయారైంది. ఈసారి బీఈడీ అభ్యర్థులకు రెండు పేపర్లకు చా¯న్స్ ఉండడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండాల్సి ఉంటుంది. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అవకాశం ఉన్నా.. మహానగర పరిధిలో మరిన్ని పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు అవకాశం ఉన్నా.. జాబితా నుంచి నగర జిల్లాలు తొలగించడం విస్మయానికి గురిచేస్తోంది. నగరం చుట్టూ ఇంజినీరింగ్, ఇతర కాలేజీలు అధికంగా ఉన్నాయి. రాష్ట్రంలోనే సగానికిపైగా అభ్యర్థులు నగర పరిధిలోనే పరీక్షలు రాసేవారు. ఈసారి మాత్రం పరీక్ష కేంద్రాలు పరిమితి సంఖ్యలో కేటాయించి బ్లాక్ చేయడం పట్ల అభ్యర్థుల్లో నిరాశ నెలకొంది. మరోవైపు టెట్ అప్లికేషన్ల సందర్భంలో, ఇతర సమాచారం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్లు కూడా పనిచేయడం లేదు. టెట్ దరఖాస్తుల్లో ఎడిట్ ఆప్షన్‌కు అవకాశం లేకుండా పోవడం ఆందోళనకు గురిచేస్తోంది. అప్లికేషన్లలో టెక్నికల్, టైప్ ఎర్రర్స్‌తో పాటు ఫొటోలూ సరిగా రాలేదు. వాటిని సరిచేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ లేక అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. (చదవండి: చదివింపుల్లేవ్.. విదిలింపులే!) -
Hyderabad: 103 కిలోమీటర్లు.. రూ. 1200 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఇప్పటి వరకు గ్రేటర్ నగరంలోని ప్రధాన రహదారుల మార్గాల్లో నిర్మించిన స్లిప్, లింక్ రోడ్లతో కలిగిన ప్రయోజనాన్ని పరిగణనలోకి తీసుకున్న అధికారులు శివారు ప్రాంతాలపై దృష్టి సారించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నగరానికి చుట్టూ ఉన్న స్థానిక సంస్థల్లోని పది మున్సిపల్ కార్పొరేషన్లు/మున్సిపాలిటీల పరిధిలో సాఫీ ప్రయాణానికి అనువుగా 32 లింక్‌రోడ్లను ప్రతిపాదించారు. ముఖ్యంగా ఆయా ప్రాంతాల నుంచి ఔటర్‌రింగ్‌రోడ్ (ఓఆర్ఆర్) సర్వీసు రోడ్లకు రాకపోకలు సాగించేందుకు వీలుగా వీటిని నిర్మించేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు రీజినల్ రింగ్‌రోడ్, ఇంటింటికీ నీటి సరఫరా రెండో విడత పనులు జరగనుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో శివార్లలో పెరగనున్న ట్రాఫిక్ ఒత్తిడిని కూడా పరిగణనలోకి తీసుకొని వివిధ ప్రాంతాల్లో ప్రయాణ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ ప్రణాళిక రూపొందించారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఇటీవల శివారు ప్రాంతాలపై ఎక్కువ దృష్టి సారించడం.. గ్రేటర్ చుట్టూ ఉన్న ప్రాంతాలను కూడా గ్రేటర్లోవిగానే భావించి సదుపాయాలు కల్పిస్తామని పేర్కొనడం తెలిసిందే. ఆయన ఆదేశాలకనుగుణంగానే సంబంధిత అధికారులు ఈ ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రతిపాదిత లింక్‌రోడ్ల పొడవు దాదాపు 103 కిలోమీటర్ల కాగా, వీటి నిర్మాణానికి రూ.1200 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ నిధుల్ని ఎలా సమకూర్చుకోనున్నారో తెలియాల్సి ఉంది. చదవండి: (హైదరాబాద్: ఊపిరి ఉక్కిరిబిక్కిరి!.. ఏడాదికి 98 రోజులు అంతే) 80–100 అడుగులకు విస్తరణ లింక్ రోడ్లలో భాగంగా ఆయా మార్గాల్లో కొంత మేర రోడ్డు ఉండి ఎక్కడైనా లింక్ లోపిస్తే ఆ మేరకు కొత్తగా రోడ్డు నిర్మిస్తారు. రోడ్డు ఉన్నప్పటికీ, అధ్వా నంగా ఉంటే.. అభివృద్ధి చేసి బలపరుస్తారు. బాటిల్‌నెక్‌గా ఉన్న ప్రాంతాల్లో విస్తరిస్తారు. ప్రస్తుతం 20– 40 అడుగుల వెడల్పు మాత్రమే ఉన్న రోడ్లను నగరంలో మాదిరిగా 80– 100 అడుగుల వరకు విస్తరిస్తారు. ఎలాంటి ఆటంకాల్లేకుండా సాఫీ ప్రయాణమే లక్ష్యంగా వీటిని నిర్మించనున్నారు. ఎక్కడెక్కడ.. ఎన్ని రోడ్లు.. ఏ స్థానిక సంస్థ పరిధిలో ఎన్ని లింక్ రోడ్లకు ప్రతిపాదనలు రూపొందించారో వివరాలిలా ఉన్నాయి. బండ్లగూడ జాగీర్–6, కొత్తూరు–3, బడంగ్పేట్–3, శంషాబాద్–4, ఘట్కేసర్–3, దమ్మాయిగూడ–3, నాగారం–2, ఇబ్రహీంపట్నం–2, మణికొండ–2, జవహర్‌నగర్ కార్పొరేషన్–4. -
కోవిడ్ టీకా తీసుకునేందుకు టీనేజర్ల అనాసక్తి
గ్రేటర్ జిల్లాల్లో టీనేజర్లు కోవిడ్ టీకా తీసుకునేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి ఈ నెల 3 నుంచి ప్రత్యేక వ్యాక్సినేషన్ చేపట్టగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఇప్పటి వరకు దాదాపు 20 శాతం మంది టీనేజర్లు కూడా టీకా వేసుకోలేదు. ఒకవైపు కోవిడ్ కేసులు పెరుగుతుండగా..మరోవైపు టీకా వేసుకునేందుకు ముందుకు రాకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది సాక్షి హైదరాబాద్: తెలంగాణలోని ఇతర జిల్లాలతో పోలిస్తే గ్రేటర్ జిల్లాల్లోనే ఎక్కువ కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. అనేక మంది దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. కోవిడ్ నియంత్రణలో భాగంగా టీకాలు వేసుకుని ఇతర జిల్లాలకు మార్గదర్శకంగా నిలువాల్సిన వారు వైరస్‌ను లైట్‌గా తీసుకుంటున్నారు. కోవిన్ యాప్‌లో పేర్లు నమోదు చేసుకోవడంలోనే కాదు...టీకాలు వేసుకునేందుకు కూడా ఆశించిన స్థాయిలో ముందుకు రావడం లేదు. టీనేజర్లకు టీకాలు వేసే విషయంలో నిజామాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి వరుస స్థానాల్లో నిలవగా..22వ స్థానంలో హైదరాబాద్, 26వ స్థానంలో మేడ్చల్, 29వ స్థానంలో రంగారెడ్డి జిల్లాలు నిలవడం, మిగతా జిల్లాలతో పోలిస్తే రాజధాని జిల్లాలు వెనుకబడి పోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. టీకాలు వేసేందుకు వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నప్పటికీ...టీకా వేసుకుంటే జ్వరం, ఒంటి నొప్పులు వంటి కొత్త సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందనే అపోహతో తల్లిదండ్రులు ఇందుకు అంగీకరించకపోవడం కూడా టీకాల్లో వెనుకబడి పోవడానికి కారణమని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. వేసుకుంటారా..? వెనుకాడుతారా...? కోవిడ్ నియంత్రణలో భాగంగా 18 ఏళ్లు పైబడిన వారికి టీకాల కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటికే ఫస్ట్, సెకండ్ డోసు టీకాల విషయంలో ఆశించిన దానికంటే అధికశాతం వ్యాక్సినేషన్ పూర్తైంది. ఈ విషయంలో ఇతర జిల్లాలకు గ్రేటర్ జిల్లాలు మార్గదర్శకంగా నిలిచాయి. అయితే టీనేజర్లకు టీకాలు వేసే విషయంలో మాత్రం బాగా వెనుకబడ్డాయి. 15 నుంచి 17 ఏళ్లలోపు వారికి ప్రభుత్వం ఈ నెల 3వ తేదీ నుంచి కోవాగ్జిన్ టీకాలు వేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్ జిల్లాలో 1,84,822 మంది ఉన్నట్లు గుర్తించి, శుక్రవారం రోజు నాటికి 55,347 మందికి టీకాలు వేశారు. మేడ్చల్ జిల్లాలో 1,65,618 మంది లబ్ధిదారులు ఉండగా, వీరిలో ఇప్పటి వరకు 46,970 మందికి టీకాలు వేశారు. రంగారెడ్డి జిల్లాలో 1,77,102 మంది టీనేజర్లు ఉండగా, వీరిలో ఇప్పటి వరకు 35,104 మందికి మాత్రమే టీకాలు వేశారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు శనివారం నుంచి ఈ నెల 16 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కొన్ని ప్రైవేటు కాలేజీలు, విద్యాసంస్థల్లో టీకాలు వేస్తున్నప్పటికీ చాలా మంది ఆసక్తి చూపడం లేదు. సాధారణ రోజుల్లోనే ఆసక్తి చూపని వారు సెలవుల్లో స్వయంగా ఆరోగ్య కేంద్రాలకు చేరుకుని టీకాలు వేసుకుంటారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒక్కరోజే 1902 కేసులు గ్రేటర్ జిల్లాల్లో కోవిడ్ కేసులు రోజురోజుకు మరింత పెరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 1452 కేసులు నమోదు కాగా, మేడ్చల్ జిల్లాల్లో 232 కేసులు నమోదయ్యాయి. ఇక రంగారెడ్డి జిల్లాల్లో 218 కేసులు వెలుగు చూశాయి. దీంతో ఈ సంఖ్య 1902కు చేరడం గమనార్హం. ఒక వైపు కేసుల సంఖ్య పెరుగుతున్నా..సిటిజన్లు వైరస్‌ను లైట్‌గా తీసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. మాస్క్‌లు లేకుండా హోటళ్లు, షాపింగ్‌మాల్స్, మార్కెట్ల చుట్టూ తిరుగుతున్నారు. విందులు, వినోదాల్లో మునిగి తేలుతున్నారు. పెరుగుతున్న తీవ్రత ఒకరి నుంచి మరొకరికి వైరస్ విస్తరిస్తుండటం, కుటుంబ సభ్యులంతా అస్వస్థతకు గురై...ఆస్పత్రుల్లో చేరుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 1318 మంది చికిత్స పొందుతుండగా, వీరిలో 373 మంది ఆక్సిజన్ పడకలపై చికిత్స పొందుతుండగా, 945 మంది ఐసీయూ, వెంటిలేటర్ పడకలపై చికిత్స పొందుతుండటం గమనార్హం. కేసులు మరింత పెరుగుతుండటంతో నగరంలోని గాంధీ, టిమ్స్ సహా కింగ్‌కోఠి, ఫీవర్, ఛాతి ఆస్పత్రి, నిలోఫర్ ఆస్పత్రుల్లో వైద్యులు అ ప్రమత్తమయ్యారు. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలను సమకూర్చడంతో పాటు అవసరమైన ఆక్సిజన్ నిల్వలు ఉండేలా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుం టున్నారు. -
కరోనా సైరన్ మోత!... రికార్డు స్థాయిలో కేసులు
సాక్షి హైదరాబాద్: గ్రేటర్ జిల్లాల్లో కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గురువారం ఒక్కరోజే 1,588 కేసులు నిర్ధారణ అయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 1,214 మేడ్చల్ జిల్లాలో 161, రంగారెడ్డి జిల్లాల్లో 213 మంది వైరస్ బారిన పడటం ఆందోళనకు గురిచేస్తోంది. వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిన వారిలో తీవ్రమైన లక్షణాలేవీ లేకపోవడం, సాధారణ దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు మాత్రమే కన్పిస్తుండటం ఊరటనిచ్చే అంశంగా వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో కోవిడ్ చికిత్సలకు కేంద్రమైన గాంధీ, టిమ్స్, కింగ్‌కోఠి, ఫీవర్, ఛాతీ ఆస్పత్రి, నిలోఫర్ సహా అన్ని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో పని చేస్తున్న వైద్య సిబ్బంది సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది. అత్యవసరమైతే మినహా సాధారణ కారణాలకు సెలవులను మంజూరు చేయకూడదని ఆయా ఆస్పత్రులకు సూపరింటెండెంట్లకు తెలంగాణ వైద్యవిద్య సంచాలకులు ఆదేశాలు జారీ చేశారు. (చదవండి: కోవిడ్ వ్యాక్సిన్ వేసి కటకటాల్లోకి..!) -
వైరస్ టెన్షన్!.. తారస్థాయిలో విరుచుకుపడుతున్న థర్డ్‌వేవ్
సాక్షి హైదరాబాద్: ఊహించినట్లే జరుగుతోంది. గ్రేటర్లో థర్డ్‌వేవ్ తారస్థాయికి చేరుతోంది. ఒకవైపు డెల్టా.. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్లు గ్రేటర్‌వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. క్రిస్మస్, డిసెంబర్ 31 వేడుకల తర్వాత రికార్డు స్థాయిలో కేసులు నమోదువుతుండటం, చికిత్స కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు మరింత పెరుగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో తారస్థాయికి చేరిన కేసులు.. ఆగస్టు తర్వాత తగ్గుముఖం పట్టాయి. డిసెంబర్ మూడో వారం నుంచి మళ్లీ కేసుల సంఖ్య పెరుతూ వచ్చింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో మూడు రోజుల క్రితం.. 397 పాజిటివ్ కేసులు నమోదైతే.. తాజాగా బుధవారం ఒక్కరోజే 1,285 మందికి వైరస్ నిర్ధారణ కావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. హెచ్చరికలు బేఖాతరు.. కోవిడ్ టీకాలు అందుబాటులోకి రావడంతో పాటు వైరస్ తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం ఆగస్టు నుంచి కోవిడ్ ఆంక్షలను సడలిస్తూ వచ్చింది. ఫలితంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు పూర్తిస్థాయిలో పని చేయడం ప్రారంభించాయి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సెప్టెంబర్ నుంచి దశలవారీగా విద్యా సంస్థలను పునఃప్రారంభించింది. వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు సినిమా థియేటర్లు, పర్యాటక ప్రదేశాలు, హోటళ్లు పూర్తిస్థాయిలో తెరుచుకున్నాయి. కోవిడ్ నిబంధనల మేరకు రోజువారీ పనులు కొనసాగించాలని వైద్యులు సూచించినప్పటికీ.. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నామనే ధీమాతో వాటిని పూర్తిగా విస్మరించారు. వైద్యనిపుణుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ పుట్టిన రోజు, పెళ్లి రోజు, పండుగలు, పబ్బాల పేరుతో విందులు, వినోదాల్లో మునిగి తేలారు. రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులతో పాటు సభలు, సమావేశాలకు వచ్చిన కార్యకర్తలు సైతం మాస్కులను విస్మరించారు. భౌతిక దూరం అనే అంశాన్ని పూర్తిగా మరిచిపోయారు. శానిటైజర్‌తో ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోకపోవడం వల్ల వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా విస్తరించింది. మచ్చుకు కొన్ని కేసులు ఇలా.. మెయినాబాద్ మండల పరిధిలోని నాగిరెడ్డిగూడలోని ప్రముఖ క్రీడాకారిణి గుత్తా జ్వాల టెన్నిస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న వందమంది క్రీడాకారుల్లో ఇటీవల చెన్నైలో జరిగిన టెన్నిస్ పోటీలకు 40 మంది హాజరై వచ్చారు. వీరిలో స్థానికంగా ఉన్న ఓ ఇంటర్నేషనల్ స్కూలు విద్యార్థులు కూడా ఉన్నారు. టోర్నమెంట్‌కు వెళ్లి వచ్చిన తర్వాత వీరిలో ఆరుగురు క్రీడాకారులకు దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు బయటపడ్డాయి. మూడు రోజుల క్రితం వీరికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, వీరిలో నలుగురికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో శిక్షణ కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది. స్కూలు యాజమాన్యం కూడా ఆఫ్‌లైన్ క్లాసులను రద్దు చేసి, ఆన్లైన్లో పాఠాలు బోధిస్తోంది. నాదర్గుల్ సమీపంలో నివాసం ఉంటున్న డీఆర్డీఓకు చెందిన ఓ కీలక అధికారి ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఆ తర్వాత ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయనను స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించారు. అప్పటికే ఆయనకు సన్నిహితంగా తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు మెలగడంతో ఆ తర్వాత వారికి కూడా వైరస్ సోకింది. వైరస్ నిర్ధారణ అయినప్పటికీ.. లక్షణాల తీవ్రత పెద్దగా లేకపోవడంతో వారంతా హోం ఐసోలేషన్‌లోనే చికిత్స తీసుకున్నారు. శంషాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల దుబాయ్ వెళ్లి వచ్చాడు. ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత ర్యాండమ్ చెకప్‌లో భాగంగా ఆయన నుంచి నమూనాలు సేకరించి, పరీక్షించగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆ తర్వాత జరిపిన జీనోమ్ సీక్వెన్సీ పరీక్షల్లో ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు తేలింది. అప్పటికే ఆయన ఇంటికి చేరుకోవడం, కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలగడం వల్ల ఆయన ద్వారా ఆయన కుమారునికి, ఇతర కుటుంబ సభ్యులకు వైరస్ నిర్ధారణ అయింది. కోర్‌సిటీ కంటే.. శివారు ప్రాంతాల్లోనే.. నిజానికి ఫస్ట్, సెకండ్ వేవ్‌లో వైరస్ పూర్తిగా కోర్ సిటీకే పరిమితమైంది. ప్రస్తుతం శివారు ప్రాంతాల మున్సిపాలిటీలకు, మారుమూల గ్రామాలకు విస్తరించింది. సిటీ నుంచి శివారు ప్రాంతాలకు రాకపోకలు పెరిగింది. దీంతో పాటు వైరస్ శివారు ప్రాంతాలకు విస్తరించింది. సిటిజన్లతో పోలిస్తే.. శివారు బస్తీవాసుల్లో వైరస్‌పై సరైన అవగాహన లేదు. ఓ వర్గం ప్రజల్లో టీకాలపై ఇప్పటికీ మూఢ నమ్మకం నెలకొంది. దీనికి అపోహ తోడైంది. ఇప్పటికీ చాలా మంది టీకాలు వేసు కోకుండా దూరంగా ఉండిపోయారు. టీకా వేసుకోక పోవడానికి తోడు వీరిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల వీరు త్వరగా వైరస్ బారిన పడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఫంక్షన్ హాళ్లు, ప్రముఖ హోటళ్లు, ఐటీ అనుబంధ సంస్థలన్నీ ఓర్‌ఆర్‌ఆర్‌కు అటూఇటుగా విస్తరించి ఉండటం, ఇక్కడికి రాకపోకలు ఎక్కువగా జరుగుతుండటం కూడా రికార్డు స్థాయిలో కేసుల నమోదుకు మరో కారణమని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు వైరస్ నిర్ధారణ అయిన వారిలో పెద్దగా లక్షణాలు కన్పించకపోవడం, ఎక్కువ కేసులు ఉన్న ప్రాంతాలను గుర్తించి, కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించకపోవడం, ఈ విషయం తెలియక ప్రజలు తరచూ ఆయా ప్రాంతాల్లో సంచరిస్తుండటం, హోం ఐసోలేషన్‌లో ఉన్న వారిపై నిఘా కూడా లేకపోవడం, మందులు, కాయకూరలు, నిత్యవసరాల కొనుగోలు పేరుతో వీరంతా సాధారణ పౌరుల్లా బయట తిరుగుతుండటం కూడా ఆయా ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటానికి కారణ మ ని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏపీ, తెలంగాణ జిల్లాల నుంచే కాదు.. సరిహద్దు రాష్ట్రాల బాధితులు చికిత్స కోసం ఇక్కడికే వస్తున్నారు. వీరికి సహాయంగా వచ్చిన వారు ఆస్పత్రి ఆవరణలో సాధారణ రోగుల మధ్య తిరుగుతున్నారు. -
భద్రతకు డేంజర్ లోడ్ ఓవర్..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని దూలపల్లి నుంచి జీడిమెట్లకు రాకపోకలు సాగించే ప్రధాన రహదారి ఇది. పారిశ్రామిక వ్యర్థాలు ఈ మార్గంలో పెద్ద ఎత్తున రవాణా అవుతాయి. నిత్యం 5 వేలకుపైనే లారీలు, అంతకు పదింతలుపైనే ఇతర వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ఇంత కీలకమైన ఈ రోడ్డు చాలాచోట్ల గుంతల మయంగా మారింది. ఓవర్ లోడ్ వాహనాల కారణంగా.. కొత్తగా వేసిన మూడేళ్లలోనే ఈ స్థితికి చేరుకుందని స్థానికులు వాపోతున్నారు. నాసిరకం రోడ్లతో... ►సాధారణంగా సామర్థ్యానికి మించిన బరువుతో వాహనాన్ని నడిపేటప్పుడు డ్రైవర్లు వేగాన్ని సరిగా అదుపు చేయలేక ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఓవర్‌లోడ్ కారణంగా పటిష్టమైన రోడ్లపైనే వాహనాలు అదుపుతప్పుతుంటే.. నాసిరకం రోడ్లపై మరింతగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒకట్రెండు వర్షాలకే పెచ్చులూడే రోడ్లపై అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. ►రోడ్ల పునర్నిర్మాణం, మరమ్మతుల సమయంలో నాసిరకం సామగ్రిని వినియోగిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. పైగా హడావుడిగా నిర్మాణంతో నాణ్యతను గాలికి వదిలేస్తున్నారు. సాధారణంగా రోడ్ల నిర్మాణంలో తారువేసే సమయంలో అది కనీసం 100 డిగ్రీల నుంచి 120 డిగ్రీల (లేయింగ్ టెంపరేచర్) సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో ఉండాలని నిపుణులు చెప్తున్నారు. కానీ దూరంలో ఎక్కడో తయారుచేసి, ఓపెన్ ట్రక్కుల్లో తరలిస్తున్న తారు 90డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలోనే ఉంటోందని.. దానిని అలాగే పరిచి, రోలింగ్ చేస్తున్నారని అంటున్నారు. ఇక తారు నాణ్యత (బిటుమినస్ తార్) 4.5 శాతం నుంచి 5 శాతం వరకు ఉండాలని.. కానీ 3.5 శాతం నుంచి 4 శాతం వరకే ఉంటోందని పేర్కొంటున్నారు. ఇలాంటి తారును రోడ్డు రోలర్లతో తొక్కించడం వల్ల మొదట్లో బాగానే కనిపించినా.. కొద్దిరోజులకే దెబ్బతింటోందని స్పష్టం చేస్తున్నారు. చిన్నవానలకే రోడ్లకు పగుళ్లురావడం, పైపొర కొట్టుకుపోవడం వంటివి జరుగుతున్నాయని.. అలాంటి రోడ్లపై ఓవర్‌లోడ్ వాహనాలు తిరుగుతుండటంతో మరింత నష్టం కలుగుతోందని వివరిస్తున్నారు. ఓవర్ లోడ్‌తో వెళితే.. ►రహదారులపై వాహనాల బరువుతో పడే ఒత్తిడిని కిలోన్యూటన్ల (కిలోన్యూటన్ అంటే సుమారు 101 కిలోల బరువు)లో కొలుస్తారు. ఆయా రోడ్ల నిర్మాణ తీరు (అక్కడి నేల తీరు, వాడిన కంకర పరిమాణం, రోలింగ్, తారు (బిటుమినస్ తార్) నాణ్యత తదితర అంశాల)ను బట్టి అవి ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం ఎంత అనేది ఆధారపడి ఉంటుంది. గ్రామాల మధ్య నిర్మించే సాధారణ రోడ్ల సామర్థ్యానికి, భారీ హైవేల సామర్థ్యానికి చాలా తేడా ఉంటుంది. ►రోడ్లను నాసిరకంగా తక్కువ సామర్థ్యంతో నిర్మించినా, తక్కువ కెపాసిటీ ఉన్నరోడ్లపై పరిమితికి మించి ఓవర్‌లోడ్ వాహనాలు వెళ్లినా.. సదరు రోడ్లు దెబ్బతింటాయి. ►రాష్ట్రంలో 30 కిలోన్యూటన్ల సామర్థ్యానికి అనుగుణంగా రూపొందించిన రహదారులపై కూడా 60 కిలోన్యూటన్ల ఒత్తిడిపడే భారీ ఓవర్‌లోడ్ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు, ఇటీవల నిర్మించిన కొన్ని హైవేలు మినహా.. మిగతా రోడ్లన్నీ 40కిలోన్యూటన్లలోపు సామర్థ్యమున్న రోడ్లే కావడం గమనార్హం. ఇలాంటి ఈ రోడ్లపై ఇసుక, ఇటుక, కంకర, ఐరన్, గ్రానైట్స్, మార్బుల్స్ వంటి సామగ్రిని పరిమితికి మించిన బరువుతో తరలిస్తున్నారు. ►ఓవర్‌లోడ్ వాహనాల వల్ల రోడ్లపై ఒత్తిడి పెరగడం, ఆ వాహనాలు ప్రయాణిస్తున్నప్పుడు ఏర్పడే తీవ్ర వైబ్రేషన్ (ప్రకంపనాల)తో రోడ్ల బేస్ దెబ్బతింటుంది. పగుళ్లు ఏర్పడుతున్నాయి. ఆ పగుళ్లు, రంధ్రాల్లోకి వాన నీరు, గాలిచేరి రోడ్డు బలాన్ని, సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయని రహదారి భద్రతా నిపుణులు చెప్తున్నారు. ఇలా కొద్దిగా దెబ్బతిన్న రోడ్లు వాహనాల రాకపోకలు జరిగిన కొద్దీ మరింతగా పాడైపోయి.. పెద్ద పెద్ద గుంతలు పడతాయని స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక ప్రాంతాలు, నగర శివారు రహదారులు, లోపలి రోడ్లు కూడా ఇలా ఓవర్‌లోడ్ వాహనాల వల్ల దెబ్బతింటున్నాయని చెప్తున్నారు. ఇది రహదారి భద్రతకు ముప్పుగా పరిణమిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదమేంటి? నాణ్యమైన రోడ్లు కనీసం ఐదేళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉంటాయని, మరమ్మతులు చేస్తే మరో ఐదేళ్లపాటు వినియోగించుకోవచ్చని ఇంజనీరింగ్ నిపుణులు చెప్తున్నారు. కానీ ఓవర్‌లోడ్ వాహనాల వల్ల రెండు, మూడేళ్లకే మరమ్మతులు చేసినా దెబ్బతింటున్నాయి. ►ఓవర్‌లోడ్ కారణంగా డ్రైవర్లు వాహనాలను అదుపుచేయలేక ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు ఓవర్‌లోడ్, రోడ్లపై గుంతలు కలిసి వాహనాల టైర్లు పేలిపోయి ఇతర వాహనాలను ఢీకొట్టడం, బోల్తాపడటానికి కారణమవుతున్నాయి. ►రోడ్లపై తారు కొట్టుకుపోవడం, కంకర తేలడం, గుంతలు పడటం కారణంగా సాధారణ వాహనాలు కూడా అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నాయి. పగిడిపాల ఆంజనేయులు ఓవర్‌లోడ్ వాహనాలు రహదారి భద్రతకు పెనుముప్పుగా మారాయి. పరిమితికి మించిన బరువుతో పరుగులు తీస్తున్న సరుకు రవాణా లారీలు, ప్రైవేట్ బస్సుల కారణంగా రోడ్లు దెబ్బతింటున్నాయి. పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతున్నాయి. రహదారుల నిర్మాణంలో నాణ్యతా లోపాలు దీనికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ఈ పరిస్థితిపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో ప్రధాన రహదారులపై పరిస్థితిని గమనించింది. నిత్యం వేలకొద్దీ లారీల్లో ఇసుక, కంకర, మట్టి, గ్రానైట్, ఐరన్, మార్బుల్స్ తదితర సామగ్రిని పరిమితికి మించిన బరువుతో తరలిస్తున్నట్టు గుర్తించింది. ఈ వివరాలతో ప్రత్యేక కథనం.. వరంగల్ నుంచి వర్ధన్నపేట మీదుగా తొర్రూరు, మహబూబాబాద్‌కు వెళ్లే ప్రధాన రహదారి ఇది. నిత్యం ఆర్టీసీ బస్సులు, మైనింగ్ లారీలు, ఇతర వాహనాలు వేల సంఖ్యలో రాకపోకలు సాగిస్తాయి. ఓవర్‌లోడ్‌తో వెళ్లే మైనింగ్ లారీల కారణంగా రోడ్డు చాలా చోట్ల దెబ్బతిన్నది. దీనితో సాధారణ వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇది మహబూబ్‌నగర్ –చించొల్లి అంతరాష్ట్ర రహదారి దుస్థితి. ప్రస్తుతం రోడ్డు సామర్థ్యం 20 టన్నుల బరువులోపే. కానీ 30 టన్నులకుపైగా బరువుతో రోజూ వందలాది లారీలు ప్రయాణిస్తున్నాయి. దీనికితోడు రోడ్డు నాణ్యతా లోపం కారణంగా.. అడుగుకో గుంత అన్నట్టుగా తయారైంది. రోడ్ల సామర్థ్యం కాస్త పెరిగినా.. ఇటీవల కాలంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున రోడ్ల విస్తరణ జరిగింది. సామర్థ్యం ఎక్కువగా ఉండే నాలుగులైన్ల రహదారులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో గతంలో ఉన్న నిబంధనలను సవరించిన రవాణాశాఖ.. టైర్ల సంఖ్యకు అనుగుణంగా సుమారు 3 టన్నుల చొప్పున వాహనాల రవాణా బరువు పరిమితిని పెంచారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఓవర్‌లోడ్ రవాణాకు ఇది ఏమాత్రం దగ్గరగా లేదని నిపుణులు చెప్తున్నారు. ప్రత్యేకించి ఇసుక, కంకర, ఐరన్, గ్రానైట్ వంటి సామగ్రిని రవాణా చేస్తున్న వాహనాలు యథేచ్చగా లోడ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని స్పష్టం చేస్తున్నారు. ►ఒకవైపు రాజకీయ నాయకుల జోక్యం, మరోవైపు కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఏడాదిన్నర కాలంగా రవాణా శాఖ అధికారులు తనిఖీలను నిలిపివేశారు. దీంతో బాహాటంగానే ఓవర్‌లోడ్ సరుకు రవాణా సాగుతోంది. ►ఓవర్‌లోడ్, రోడ్లు దెబ్బతినడంపై రవాణా శాఖ ఉన్నతాధికారులను సంప్రదించడానికి ‘సాక్షి’ ప్రయత్నించగా.. వారి నుంచి స్పందన రాలేదు. నిబంధనలు ఏమిటి? ►రవాణాశాఖ నిబంధనల ప్రకారం.. 10 టైర్ల లారీల్లో కేవలం 25 టన్నుల సరుకు మాత్రమే తీసుకెళ్లాలి. కానీ 35 టన్నుల వరకు తరలిస్తున్నారు. ►12 టైర్ల వాహనాల్లో 32 టన్నుల వరకు అనుమతి ఉంటుంది. అయినా 45 టన్నుల వరకు ఇసుక, ఐరన్, గ్రానైట్ వంటివి రవాణా చేస్తున్నారు. ►6 టైర్ల సాధారణ లారీల్లో 18 టన్నుల వరకు బరువును తీసుకెళ్లవచ్చు. కానీ వాటిలో 25 టన్నుల వరకు వివిధ రకాల వస్తువులను రవాణా చేస్తున్నారు. ►హైదరాబాద్‌లోని జీడిమెట్ల, బాలానగర్, మియాపూర్, బొల్లారం, నాచారం, చర్లపల్లి, ఉప్పల్ తదితర పారిశ్రామిక ప్రాంతాల్లో రాకపోకలు సాగించే వివిధ రకాల రవాణా వాహనాలు, వ్యర్ధాల తరలింపు లారీలు పరిమితికి మించిన లోడ్‌తో రహదారి భద్రతకు సవాల్‌గా మారుతున్నాయి. ►చాలా వాహనాల్లో పరిమితికి మించి 10 నుంచి 20 టన్నుల మేర ఎక్కువ బరువును రవాణా చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు వెళ్లే రహదారిలో సుచిత్ర ప్రాంతం వద్ద రోడ్డు దుస్థితి ఇది. కనీసం 10 ఏళ్లు ఉండాల్సిన రోడ్డు.. వేసిన రెండు, మూడేళ్లకే చాలా చోట్ల గుంతలు పడి, తారు కొట్టుకుపోయి దెబ్బతిన్నదని స్థానికులు చెప్తున్నారు. ఈ ప్రాంతంలో నిత్యం వేల సంఖ్యలో భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. రోడ్లు ఇలా ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇసుక అక్రమ రవాణాతోనూ.. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి గ్రేటర్ హైదరాబాద్‌కు ఇసుక పెద్ద ఎత్తున రవాణా అవుతుంది. రోజూ కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాల నుంచి సుమారు 10 వేల లారీలు ఇసుకను తరలిస్తున్నాయి. కేవలం 18 టన్నుల సామర్ధ్యం ఉండే ఆ లారీల్లో 25 టన్నులకుపైగా ఇసుకను నింపి రవాణా చేస్తున్నారు. రోజూ రాత్రిళ్లు వేలాది లారీలు వేగంగా రహదారులపై ప్రయాణిస్తున్నాయి. ఉప్పల్, అల్వాల్, తిరుమలగిరి, కర్మన్‌ఘాట్, చంపాపేట్, కూకట్పల్లి తదితర అడ్డాలకు.. అక్కడి నుంచి వివిధ ప్రాంతాల్లో నిర్మిస్తున్న భవనాలకు ఇసుక రవాణా చేస్తున్నాయి. ఇలా ఓవర్‌లోడ్ తరలింపును అరికట్టడంలో రవాణాశాఖ విఫలమవుతోంది. కొందరు అధికారులు, సిబ్బంది లారీ యజమానుల నుంచి ముడుపులు తీసుకుని అనుమతులు ఇచ్చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. బస్సులా?.. సరుకు రవాణా వాహనాలా..? ప్రైవేటు బస్సులు చాలా వరకు సరుకు రవాణా వాహనాలుగా కూడా మారిపోతున్నాయి. లగేజీ బాక్సులతోపాటు బస్సుల టాప్‌పై కూడా సరుకులను నింపి రవాణా చేస్తున్నారు. ఓవైపు ప్రయాణికులు, వారి లగేజీకి తోడు అదనంగా సరుకులతో బస్సులు ఓవర్‌లోడ్‌తో ప్రయాణిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, ఏలూరు, చిత్తూరు, అనంతపురం, బెంగళూర్ తదితర ప్రాంతాలకు బట్టలు, ఐరన్, ద్విచక్ర వాహనాలు వంటివాటిని బస్సుల్లో తరలిస్తున్నారు. గతంలో హైదరాబాద్‌లోని ఎల్బీనగర్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు, బహదూర్‌పురా, లక్డీకాపూల్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో.. బస్సుల్లో తరలిస్తున్న ఇనుప షీట్లు, బట్టలు, వివిధ రకాల ఇనుప వస్తువులు, ఎలక్ట్రికల్ విడిభాగాలను గుర్తించడం గమనార్హం. ఇప్పటికీ కూకట్పల్లి, మియాపూర్, ఎస్సార్ నగర్ తదితర ప్రాంతాల నుంచి నిత్యం ప్రైవేట్ బస్సుల్లో క్వింటాళ్ల కొద్దీ సరుకు రవాణా జరుగుతూనే ఉంది. ఓవర్‌లోడ్‌తో రోడ్లకు పగుళ్లు ఇటీవల కాలంలో పలుచోట్ల రోడ్ల సామర్థ్యాన్ని పెంచారు. కానీ ఓవర్‌లోడ్ వాహనాల వల్ల రోడ్లు దెబ్బతింటున్నాయి. లక్ష టన్నుల బరువు మోయాల్సినరోడ్డుపై ఏకంగా కోట్ల టన్నుల బరువు మోపితే ఎలా ఉంటుంది? ఓవర్‌లోడ్ కారణంగా రోడ్ల బేస్మెంట్ నుంచి పగుళ్లు వచ్చి దెబ్బతింటాయి. అంతిమంగా రహదారి భద్రతకు ఇది ముప్పు. – ప్రొఫెసర్ గోపాల్‌నాయక్, రోడ్డు నిర్మాణ నిపుణుడు వాహనాలను నియంత్రించలేక ప్రమాదాలు ఓవర్‌లోడ్ వల్ల డ్రైవర్లు వాహనాలను నియంత్రించలేక పోతున్నారు. ప్రమాదాలను నివారించే అవకాశమున్న సందర్భాల్లో కూడా.. ఓవర్‌లోడ్ వల్ల వాహనాలను అదుపు చేయలేకపోతున్నారు. దీంతో చాలాచోట్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. భారీ వాహనాలు డివైడర్లను ఢీకొంటున్న సంఘటనల్లో చాలా వరకు ఓవర్‌లోడే ప్రధాన కారణం. – సి.రామచంద్రయ్య, రహదారి భద్రత నిపుణుడు -
చెత్తతో ‘ఎరువులు– వెలుగులు’
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌ను సరికొత్త ప్రణాళికలతో విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి కె.తారకరామారావు అన్నారు. గురువారం పట్టణ ప్రగతిపై శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘‘నగరంలో రోజు ఉత్పత్తి అవుతున్న చెత్తను వేరు చేస్తున్నాం. తడి చెత్తతో ఎరువులు, పొడి చెత్తతో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. తడిచెత్త కోసం కంపోస్టు యూనిట్లను, పొడిచెత్తతో జవహర్‌నగర్ సమీపంలో ప్రత్యేకంగా విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేశాం. త్వరలోనే మరో రెండు ప్లాంట్ల ఏర్పాటు చేస్తున్నాం. ఎస్ఆర్డీపీ కింద రూ.6వేల కోట్లు ఖర్చు చేసి 42 ప్రాజెక్టులు చేపట్టగా.. ఇప్పటికే 24 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నాం. ఇవన్నీ ప్రతిపక్ష సభ్యులకు కూడా కనిపిస్తాయి. కానీ వాళ్లు ఇలాంటి అభివృద్ధి పనులను చూడలేరు. నిద్రపోయే వాళ్లను లేపొచ్చు కానీ నిద్ర పోతున్నట్లు నటించే వాళ్లను లేపలేం’’అని అన్నారు. ‘‘జీహెచ్ఎంసీ పరిధిలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని అర్బన్ లోకల్ బాడీస్ అన్నింటా సమగ్ర అభివృద్ధి చేస్తున్నాం. రహదారులన్నీ ఎల్ఈడీ లైట్లతో అలంకరించాం. దీంతో గ్రేటర్ పరిధిలో రూ.130 కోట్లు, ఇతర యూఎల్బీలలో రూ.80కోట్లు విద్యుత్ ఖర్చు ఆదా అవుతోంది. మహబూబ్‌నగర్‌లో కేసీఆర్ ఇకో పార్కును ప్రారంభించాం. ప్రతి పట్టణంలో పార్కులు, లంగ్‌స్పేస్‌లు, ప్రకృతివనాలు ఏర్పాటు చేస్తున్నాం. పచ్చదనానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. కోవిడ్ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడొద్దని ఆస్తిపన్నులో రాయితీ ఇచ్చాం. అదేవిధంగా నీటి బిల్లుల్లో కూడా రాయితీలు ఇచ్చాం’’ అని వివరించారు. -
టీఆర్ఎస్.. తిరుగులేనిశక్తి
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల నాయకులపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పేరుకే బీజేపీ, కాంగ్రెస్ ఢిల్లీ పార్టీలని.. కానీ, చేసేవి చిల్లర పనులని ఎద్దేవా చేశారు. మంగళవారం జలవిహార్‌లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధి తమ ప్రభుత్వానికి ప్రాధాన్యతలని అన్నారు. టీ–కాంగ్రెస్, టీ–బీజేపీ ఏర్పాటు కేసీఆర్ పెట్టిన భిక్షేనని.. ఉమ్మడి రాష్ట్రంలో ఎవరూ పట్టించుకోని నేతలు కేసీఆర్ పుణ్యాన పదవులు రాగానే ఎగిరిపడుతున్నారని ధ్వజమెత్తారు. వయసులో పెద్దవారైన సీఎంపై ఇష్టారీతిగా మాట్లాడుతున్న నేతలకు గట్టిగా సమాధానం చెప్పాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏడేళ్లు ఒపిక పట్టినా.. ఇక నుంచి ఆ పరిస్థితి ఉండదన్నారు. మీరు ఇటుకలతో బదులి స్తే.. మేము రాళ్లతో జవాబు చెప్తామని పునరుద్ఘాటించారు. అరవై లక్షల పైచిలుకు సభ్యులతో టీఆర్ఎస్ పార్టీ సంస్థాగతంగా బలంగా ఉందని.. హుజూరాబాద్ ఎన్నిక పార్టీకి ఒక సమస్యే కాదని చెప్పారు. పేదలకు ఏం కావాలో సీఎంకు తెలుసునని, వారి ఆశీర్వాదం ఉన్నంత కాలం టీఆర్ఎస్కు ఏమీ కాదన్నారు. విపక్షాల విమర్శలను ఎదుర్కొనేందుకు పార్టీ కమిటీలు ఎక్కడికక్కడ పటిష్టంగా ఉండాలన్నారు. ఈ నెల 20 లోగా సంస్థాగత కమిటీల నియామకం పూర్తి చేసి.. దీపావళి తరువాత శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కమిటీలు ఏర్పాటు చేసి ముందుకెళ్లాలని సూచించారు. అన్ని ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ జయభేరీ.. అసెంబ్లీ ఎన్నికలు.. పంచాయతీ ఎన్నికలు.. జిల్లా పరిషత్ ఎన్నికలు.. పార్లమెంట్ ఎన్నికలు.. ఏదైనా ప్రజలు టీఆర్ఎస్కే పట్టం కట్టారని కేటీఆర్ చెప్పారు. ఏడేళ్లుగా పార్టీకి జనం బ్రహ్మరథం పడుతున్నారన్నారు. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న వారికి త్వరలో నామినేటెడ్ పోస్టులు కట్టబెడతామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కో ఆప్షన్ సభ్యుల నియామకం సైతం త్వరలోనే పూర్తిచేస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు, మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ‘చేనేత’కు రూ. 73.50 కోట్లు. నేత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా చేనేత కార్మికుల తలసరి ఆదాయం పెరుగుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని చేనేత, జౌళి రంగ అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన పథకాల అమలుపై మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. నేత కార్మికుల తలసరి ఆదాయం రూ.15 వేలకు పైగా పెంచేందుకు ప్రభుత్వ కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. నేత కార్మికుల సమస్యలపై గత నెలలో మంత్రులు కేటీఆర్, హరీశ్ నిర్వహించిన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలపై మళ్లీ మంగళవారం అధికారులతో భేటీ అయ్యారు. ‘చేనేత’సంక్షేమం కోసం కార్మిక సంఘాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను కేటీఆర్ ఆమోదించారు. ఈ పథకాల అమలుకు వీలుగా రూ.73.50 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిధులను చేనేత కార్మికులు, సహకార సంఘాలకు వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. సమావేశంలో చేనేత, జౌళి శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
నీటి పైపులైన్ల నుంచి విద్యుత్!
సాక్షి, హైదరాబాద్: భారీ నీటి పైపులైన్లలో టర్బైన్లు ఏర్పాటు చేసి.. విద్యుత్ ఉత్పత్తి చేసే దిశగా విద్యుత్ రంగ నిపుణులు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌కు కృష్ణా జలాలను తరలిస్తున్న పైపులైన్లలో నీటి ఒత్తిడి, వేగం ఏ మేరకు ఉంది, ఎంత విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు, ఏవైనా సమస్యలు ఉంటాయా అన్న దిశగా పరిశీలన జరుపుతున్నట్టు సమాచారం. కోదండాపూర్ నుంచి సాహెబ్ నగర్ (గ్రేటర్ శివారు) మార్గంలో 130 కిలోమీటర్ల పొడవునా ఉన్న పైపులైన్లలో నీటి ఒత్తిడి, వేగం ఎక్కువగా ఉన్నచోట టర్బైన్లను ఏర్పాటు చేయాలని.. వాటి నుంచి సుమారు 35 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని భావిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు సాంకేతిక పరిజ్ఞానం ఉండి, టర్బైన్ల ఏర్పాటుకు ముందుకొచ్చే సంస్థలను ఆహ్వానించాలని హైదరాబాద్ జల మండలి (వాటర్ బోర్డు) నిర్ణయించినట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. కరెంటు బిల్లుల భారం తగ్గించుకునేలా? జల మండలి ప్రస్తుతం హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి జలాల తరలింపు, నగరం నలుమూలలా సరఫరా కోసం సుమారు 200 మెగావాట్ల విద్యుత్‌ను వినియోగిస్తోంది. ఇందుకు నెలకు రూ.75కోట్ల మేర బిల్లులు చెల్లిస్తోంది. ఈ భారం తగ్గించుకునేందుకు నీటి పైపులైన్లలో విద్యుత్ ఉత్పత్తి అవకాశాలను పరిశీలిస్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, అమెరికా తదితర అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ తరహా సాంకేతికతను వినియోగి స్తున్నారు. సాగునీళ్లు, తాగునీళ్లతోపాటు పలుచోట్ల సీవరేజీ పైపులైన్లలో కూడా డైనమోలు అమర్చి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. అదే తరహాలో ఇక్కడ నీటి పైపులైన్లలో ఏర్పాటు చేయాలని జల మండలి భావిస్తోంది. తొలుత కృష్ణా జలాల పంపింగ్, గ్రావిటీ మెయిన్ పైపులైన్లలో టర్బైన్లు ఏర్పాటు చేసి.. అది సఫలమైతే గోదావరి పైపులైన్లలోనూ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందని అధికారవర్గాలు తెలిపాయి. అయితే.. ఈ టర్బైన్ల వల్ల నీటి సరఫరా వేగం తగ్గడం, పంపులు నిలిచిపోవడం వంటి సమస్యలు వస్తాయా, ఎలాంటి చోట్ల ఏర్పాటు చేయవచ్చు, ఇబ్బందులేమైనా వస్తే ఎలా అధిగమించాలన్న దానిపై అధ్యయనం జరుగుతున్నట్టు వెల్లడించాయి. ఇంకా పూర్తిస్థాయి ప్రతిపాదనలు సిద్ధం కావాల్సి ఉందని అంటున్నాయి. భారీ ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వద్ద ఉన్న పవర్ ప్లాంట్ల నుంచి విద్యుత్ ఉత్పత్తి అయిన తరహాలోనే.. పైపులైన్ల నుంచి కూడా ఉత్పత్తి అవుతుంది. ప్రాజెక్టుల వద్ద చాలా ఎత్తులో ఉండే నీళ్లను పవర్ ప్లాంట్‌లోకి పంపుతారు. అలా దూసుకొచ్చే నీళ్లు భారీ టర్బైన్లను వేగంగా తిప్పుతూ కిందికి వెళ్లిపోతాయి. ఈ క్రమంలో టర్బైన్లకు అమర్చిన భారీ డైనమోలలో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇదే తరహాలో నీళ్లు వేగంగా దూసుకెళ్లే పైపులైన్లలో అమర్చే హైడ్రోడైనమిక్ టర్బైన్ల నుంచి కరెంటు ఉత్పత్తి చేయవచ్చు. పైపులైన్లలో మాత్రమే కాకుండా నిరంతరం నీటి ప్రవాహం ఉండే కాల్వల వద్ద కూడా ఇలా కరెంటు ఉత్పత్తికి అవకాశం ఉంటుంది. ఏమిటీ డైనమో? యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే పరికరాలే డైనమోలు. సింపుల్‌గా చెప్పాలంటే.. మనం ఉపయోగించే ఫ్యాన్లు, నీటి మోటార్ల వంటివే. విద్యుత్ సరఫరా చేసినప్పుడు మోటార్‌కు ఉండే ఫ్యాన్ (షాఫ్ట్) తిరుగుతుంది. డైనమోలు దీనికి ప్రతిగా (రివర్సులో) పనిచేస్తాయి. డైనమోకు ఉండే ఫ్యాన్ (షాఫ్ట్)ను తిప్పితే.. దాని నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఉదాహరణకు వేగంగా ప్రవహిస్తున్న నీళ్లు టర్బైన్ను తిప్పుతాయి. దీంతో ఆ టర్బైన్‌కు అనుసంధానం చేసిన డైనమో షాఫ్ట్ కూడా తిరిగి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. డైనమోలో.. రెండు శక్తివంతమైన అయస్కాంతాలను రెండు వైపులా బిగిస్తారు.. మధ్యలో రాగి,అల్యూమినియం వంటి లోహపు తీగలను చుట్టలుగా చుట్టి ఒక కడ్డీ (షాఫ్ట్) ద్వారా వేలాడదీస్తారు. షాఫ్ట్ను తిప్పినప్పుడు లోహపు చుట్టలు కూడా తిరుగుతాయి. ఈ క్రమంలో అయస్కాంత శక్తి లోహపు తీగల్లో విద్యుత్‌ను పుట్టిస్తుంది. -
లైట్ తీసుకుంటే..ముప్పు ముందరే
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో చాలా మంది ప్రజలు కరోనా వైరస్‌ను లైట్‌గా తీసుకుంటున్నారు. ఇప్పటికే తమకు కోవిడ్ వచ్చిపోయి ఉంటుందని, యాంటిబాడీస్ కూడా పుష్కలంగా వృద్ధి చెంది ఉంటాయని అపోహ పడుతున్నారు. వైరస్ తమను ఏమీ చేయలేదనే ధీమాతో కనీసం మాస్క్ కూడా ధరించడం లేదు. భౌతిక దూరం, శానిటైజర్ల వినియోగం మర్చిపోయారు. ఫలితంగా ఒకరి తర్వాత మరొకరు వైరస్ కోరల్లో చిక్కుకుంటున్నారు. టెస్టులు సహా చికిత్సలను నిర్లక్ష్యం చేస్తూ, తీరా శ్వాస సంబంధ సమస్యలు తలెత్తిన తర్వాత ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన వారిని వైద్యులు వెంటిలేటర్‌పైకి తరలించాల్సి వస్తుంది. ప్రస్తుతం 1165 మంది వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక 1940 మంది ఆక్సిజన్‌పై, 952 మంది సాధారణ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. 4910 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. విధిగా కోవిడ్ నిబంధనలు పాటించడం, టీకా వేయించుకోవడం ఒక్కటే దీనికి పరిష్కారమని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. విధిగా టీకా వేయించుకోవాలి మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వైరస్ రూపాంతరం చెందుతోంది. గతంతో పోలిస్తే ఈసారి వైరస్ తీవ్రత కొంత ఎక్కువగా ఉంది. వైరస్‌లోడ్ అధికంగా ఉండటంతో రికవరీ రేటు కూడా తక్కువగా ఉంది. గతంలో వారం, రెండు వారాలకే కోలుకున్న వారు..ప్రస్తుతం మూడు వారాలైనా కోలుకోవడం లేదు. ఇలాంటి వారికి హై డోస్ యాంటీ బయాటిక్స్ వాడాల్సివస్తోంది. వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ విధిగా కోవిడ్ టీకా వేయించుకోవాలిని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారాం అన్నారు. ( చదవండి: వామ్మోకరోనా.. కంటి చూపు కోల్పోతున్నారు! ) -
ఔరా.. ముగ్గురేనా?
సాక్షి, హైదరాబాద్: కోటిమంది జనాభా ఉన్న మహా నగరంలో ఆహారకల్తీ నిరోధానికి తగిన యంత్రాంగం లేదు. కేవలం ముగ్గురంటే ముగ్గురే ఫుడ్ ఇన్స్పెక్టర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో అడ్డూఅదుపూ లేకుండా సాగుతోన్న కల్తీతో ప్రజలు తరచూ అనారోగ్యసమస్యల బారిన పడుతున్నారు. దాదాపుగా పదినెలలుగా కరోనా నేపథ్యంలో బయటి ఫుడ్ తినేవారు తగ్గినప్పటికీ..ఇప్పుడిప్పుడే తిరిగి హోటళ్లు, తదితర ప్రాంతాల్లో ఎగబడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కల్తీ జరగకుండా.. తగిన పరిశుభ్రతతో, ఇతరత్రా జాగ్రత్తలతో వ్యవహరించాల్సి ఉండగా అలాంటివేమీ కనిపించడం లేదు. తగినంతమంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు లేక తనిఖీలు జరగకపోవడం ఇందుకు ప్రధాన కారణం. 30 సర్కిళ్లకు 30 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉండాల్సి ఉండగా..పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రభుత్వం గత సంవత్సరం ఎంపిక చేసిన 20 మందికి శిక్షణ పూర్తికావాల్సి ఉంది. అందుకు మరో 40 రోజులు పట్టనుంది. అది పూర్తయితే కానీ వీరు విధులు నిర్వహించలేరు. జీహెచ్ఎంసీకి సంబంధించి మొత్తం 26 పోస్టులు మంజూరైనప్పటికీ , కోర్టు వివాదాలు ఇతరత్రా కారణాలతో 20 మందినే ఎంపిక చేశారు. ఆరు జోన్లకు ఆరుగురు గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్లు అవసరం కాగా, ప్రస్తుతం ముగ్గురే ఉన్నారు. వీరిలో ఇద్దరు రిటైరైనా పొడిగింపుతో కొనసాగుతున్నారు, రైగ్యులర్‌గా ఉన్నది ఒక్కరే. జీహెచ్ఎంసీ లెక్కల మేరకు నగరంలో.. చిన్న హోటళ్లు, కర్రీ పాయింట్లు : 10,000 సాధారణ నుంచి స్టార్ హోటళ్లు : 3,000 ఇతరత్రా తినుబండారాల దుకాణాలు: 2,000 ఏటా 230 శాంపిల్సే.. ఇన్ని ఈటరీస్ ఉన్నా ఏటా 230 శాంపిల్స్ మించి తీయలేకపోతున్నారు. పలు పర్యాయాలు కల్తీ గుర్తించినప్పటికీ, జరిమానాలు మించి పెద్దగా శిక్షలు పడటం లేదు. హోటళ్లలో పరిశుభ్రత నుంచి అన్నీ సవ్యంగా ఉండాలని, లేని పక్షంలో ఆటోమేటిక్‌గానే వేటికి ఎంత జరిమానానో పేర్కొంటూ చర్యలు తీసుకునేలా ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నించినా, కార్యరూపం దాల్చలేదు. స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ ఆర్డర్లపై జరిగే ఆహారాల్లోనూ కల్తీపై పలు ఫిర్యాదులందుతున్నాయి. పలు సంస్థల విజ్ఞప్తి.. ఆహారకల్తీ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఫోరమ్ ఫర్ గుడ్‌గవర్నెన్స్ సెక్రటరీ ఎం.పద్మనాభరెడ్డి మునిసిపల్ మంత్రి కేటీర్‌ను ఇటీవల కోరారు. కల్తీ ఫిర్యాదులకు ప్రత్యేక సెల్ ఏర్పాటుతోపాటు అదనంగా మరో ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని నివేదించారు. ఇతరత్రా సంస్థలు సైతం ఆహారకల్తీ నిరోధంతోపాటు కరోనా నేపథ్యంలో పరిసరాల పరిశుభ్రత, కనీస దూరం పాటింపు వంటివి అమలు చేయాలని కోరుతున్నాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ ఎక్కడ? ప్రజారోగ్య పరిరక్షణకు సంబంధించిన ఎఫ్ఎస్ఎస్ఏ (‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్–2002) గ్రేటర్లో అమలుకు నోచుకోలేదు. 2011 ఆగస్టు నుంచే ఇది అమల్లోకి వచ్చినప్పటికీ, నగరంలో అమలు కావడం లేదు. ఈ చట్టం మేరకు, ఆస్తిపన్ను వివరాల మాదిరిగా ప్రతి ఆహార విక్రయ కేంద్రం వివరాలు జీహెచ్ఎంసీ వద్ద ఆన్లైన్లో జాబితా ఉండాలి. నిర్ణీత వ్యవధుల్లో తనిఖీలు జరగాలి. కల్తీని గుర్తించేందుకు తగినన్ని పరీక్షల కేంద్రాలుండాలి. కల్తీ నిర్ధారణ అయినప్పుడు కఠిన శిక్షలుండాలి. ఇవేవీ అమలు కావడం లేదు. అంతటా కల్తీ.. ఆహారపదార్థాలు ఉత్పత్తయ్యే ప్రాంతం నుంచి మొదలుపెడితే ప్యాకింగ్, రవాణా, విక్రయం, వినియోగం దాకా ఎక్కడా కల్తీకి ఆస్కారం ఉండొద్దు. దీన్ని అమలు చేసేందుకు తగిన పరిపాలనాధికారులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ అవసరం ఉండగా, అమలు కావడం లేదు. -
గ్రేటర్లో పోలింగ్ 45.71%
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో 45.71 శాతం పోలింగ్ నమోదైనట్లు మంగళవారం రాత్రి ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అయితే పూర్తి స్థాయి పోలింగ్ వివరాలను బుధవారం ప్రకటించనున్నట్లు వెల్లడించింది. కాగా, కొన్ని డివిజన్లలో కనీసం 25 శాతం కూడా పోలింగ్ నమోదు కాలేదని తెలుస్తోంది. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.29 శాతం పోలింగ్ నమోదైంది. జీహెచ్ఎంసీలోని 149 డివిజన్ల పరిధిలో మంగళవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ ఆద్యం తం మందకొడిగా సాగింది. కరోనా భయానికి తోడు పార్టీలు, నేతల తీరుపై సరైన అభిప్రాయం లేక చాలామంది ఓటేసేందుకు అయిష్టత వ్యక్తం చేశారు. ఆయా డివిజన్లలో పోటీచేస్తున్న 1,122 మంది అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ పెట్టెల్లో నిక్షిప్తమైంది. పోలీసు భద్రత నడుమ బ్యాలెట్ పెట్టెలను స్ట్రాంగ్ రూంలకు తరలించారు. ఈ నెల 4న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలు ప్రకటిస్తారు. ఓల్డ్ మలక్‌పేటలో రీపోలింగ్.. ఓల్డ్ మలక్‌పేట డివిజన్ (నంబర్ 26) లో సీపీఐ అభ్యర్థి గుర్తు కంకి కొడవలిని బ్యాలెట్ పేపర్‌పై ముద్రించాల్సి ఉండ గా, పొరపాటున సీపీఎం గుర్తు సుత్తి కొడవలి, నక్షత్రం గుర్తు ముద్రించారు. సీపీఐ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ డివిజన్లో పోలింగ్‌ను నిలిపేసి 3న రీపోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. రీపోలింగ్‌లో ఓటర్ల మధ్య వేలుకు సిరా గుర్తు వేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఒక్క ఘటన మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కాగా, 3న రీపోలింగ్ నిర్వహిస్తుండడంతో ఆ రోజు సాయంత్రం 6 గంటల వరకు జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రకటించొద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఫిబ్రవరి 10 తర్వాతే.. ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకు ఉంది. ఆ తర్వా తే కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల ప్ర మాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఆలోగా ప్రభుత్వం చట్ట సవరణలు తీసుకొస్తే మాత్రం ముందే మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకునే అవకాశముంది. వారు ఫిబ్రవరి 10 తర్వాతే బా ధ్యతలు స్వీకరించాలి. దీనిపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అధికార వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 10 వరకు వేచి చూస్తే కొత్తగా ఎన్నికైనా కార్పొరేటర్లను ప్రలోభాలకు గురి చేసి వేరే పార్టీల వారు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చట్ట సవరణ ద్వారా ముందే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. భయంతోనే ఓటర్లు రాలేదా? సార్వత్రిక ఎన్నికల తరహాలో పార్టీలు హోరాహోరీ ప్రచారం నిర్వహించడం, వ్యక్తిగత దూషణలు, రెచ్చగొట్టే ప్రసంగాలు, అక్కడక్కడ ఘర్షణలకు సైతం దిగడంతో.. పోలింగ్ రోజు అవాంఛనీయ ఘటన లు, ఉద్రిక్తతలు తలెతొచ్చని చాలామంది ఓటు వేసేందుకు రాలేదని తెలుస్తోంది. అయితే చెదురు మదురు ఘటనలు తప్ప అంతటా పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో ప్రభుత్వ, పోలీస్ యంత్రాం గం ఊపిరి పీల్చుకుంది. కరోనా మహమ్మారి భయం వేధిస్తున్నా 48 వేల మంది పోలింగ్ సిబ్బంది, 52,500 మంది పోలీసు సిబ్బంది ఎన్నికల విధులను విజయవంతంగా నిర్వహించారు. -
గుడ్ న్యూస్ : నేటి నుంచి 50 శాతం బస్సులు
సాక్షి, హైదరాబాద్: ఒక వైపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందడి పుంజుకుంటోంది.మరోవైపు జంటనగరవాసులకు టీఆర్ఎస్ ప్రభుత్వం శుభవార్త అందించింది. నేటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 50 శాతం బస్సులు రోడెక్కాయి. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో నగరంలోని అన్ని రూట్లలో ఆర్టీసీ బస్సుల సర్వీసుల సంఖ్య పెంచామని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకూ గ్రేటర్ పరిధిలో 25శాతం బస్సులు మాత్రమే నడిచిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాల మేరకు 50 శాతం బస్సులు తిప్పుతున్నట్లు తెలిపిన గ్రేటర్ ఆర్టీసీ వెల్లడించింది. అలాగేబస్ పాస్ కౌంటర్లను కూడా 26కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉదయం 7.30 నుండి రాత్రి 8.15 వరకు బస్ పాస్ కౌంటర్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. కాగా కరోనా వైరస్ లాక్డౌన్ తర్వాత ప్రజా రవాణాకు కేంద్రం పూర్తి స్థాయిలో అనుమతి ఇచ్చినప్పటికీ తెలంగాణాలో వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా 25 శాతం బస్సులకు మాత్రమే అనుమతినిచ్చింది. కేసుల సంఖ్య ఇప్పుడు గణనీయంగా తగ్గిందంటూ సర్కార్ తాజా నిర్ణయం తీసుకుంది. దీంతో కరోనా మహమ్మారి కారణంగా సంక్షోభంలో పడిన ఆర్టీసీ ఆదాయం భారీగా పుంజుకుంటుందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు గత ఎనిమిది నెలలుగా మూతపడిన సినిమా థియేటర్లను తెరుచుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు సోమవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిన ఆయన సినిమా రంగానికి పలు ప్రోత్సాహకాలను ప్రకటించారు. -
కబ్జాలు చేస్తే ఇక జైలుకే...
సాక్షి, హైదరాబాద్ : ఇటీవలి వరదల్లో హైదరాబాద్‌లో జలవిలయంతో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. జనం కడగండ్లు, వాటిల్లిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని శాశ్వత పరిష్కారం చూపాలని భావిస్తోంది. గ్రేటర్‌తో పాటు ప్రధాన నగరాల్లో చెరువుల కబ్జాలు, కాల్వల ఆక్రమణల కారణంగా నివాస ప్రాంతాలన్నీ నీటమునిగిన నేపథ్యంలో ప్రధాన శాఖలతో కలిసి చెరువుల పరిరక్షణ చట్టం రూపొందించే కసరత్తు మొదలుపెట్టింది. కబ్జా చేస్తే నేరుగా కటకటాల్లోకి నెట్టేలా, అక్రమ నిర్మాణాలు చేస్తే వారంట్లు లేకుండా అరెస్ట్‌లు చేసేలా... కఠిన చర్యలకు వీలుకల్పిం చే చట్టాన్ని రూపొందించే పనిలో పడింది. అటు కబ్జాలు..ఇటు కన్నీళ్లు రాష్ట్రం ఏర్పడిన కొత్తలో... చెరువుల సమగ్ర సర్వే ద్వారా రాష్ట్రంలో 46,531 చెరువులను గుర్తించిన సమయంలోనే... వేలాది చెరువుల కింది శిఖం భూములు కబ్జా అయినట్లు నీటి పారుదల శాఖ తేల్చింది. చెరువు పూర్తి నిల్వ సామర్థ్యం (ఎఫ్టీఎల్) పరిధిలోకి కబ్జాలు చొచ్చుకురావడంతో చెరువుల పరిధి కుచించుకుపోయిందని నిర్ధారించింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కబ్జాలు ఎక్కువగా ఉన్నాయని, ఫీడర్ చానళ్లు, కాల్వలన్నింటినీ ఆక్రమించారని గుర్తించింది. రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో ఇది ఎక్కువని తేల్చింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు 185 చెరువులు ఉండగా ఇందులో సగం చెరువులు ఆక్రమణ దారుల గుప్పిట్లో ఉన్నాయని, 70 శాతానికి మించి చెరువులు కుచించుకుపోయాయని గుర్తించింది. భారీ వరద కొనసాగినప్పుడు కబ్జాల కారణంగా చెరువుల నుంచి నీరు బయటకి వెళ్లే మార్గాల్లేక కట్టలు తెగుతున్నా యి. ఇటీవలి వర్షాలతో గ్రేటర్ పరిధిలోనే 50 చెరువులు దెబ్బతినగా, 20 చెరువులు బాగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా మీర్‌పేటలోని పెద్దచెరువు, పుప్పాలగూడలోని భగీరథమ్మ చెరువు, మియాపూర్‌లోని కొత్తకుంట, గగన్ పాడ్‌లోని మామాడికుంట, షేక్‌పేటలోని శాతం చెరువు, అనుంగని చెరువులు ఎక్కువగా దెబ్బతినగా వీటి మరమ్మతులకే రూ.50 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. మొత్తంగా హైదరాబాద్ పరిధిలోనే 35 వేలకు పైగా కుటుంబాలు కొన్ని వారాల పాటు నీటి ముంపుతో అల్లల్లాడాయి. నాలాల పునరుద్ధరణ, ఆక్రమణలను తొలగించడం ద్వారా గ్రేటర్ పరిధిలో వరద ప్రవాహాన్ని క్రమబద్ధీకరించవచ్చని, తద్వారా ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పలువురు ఇంజనీర్లు, నిపుణులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలో ఇరిగేషన్, మున్సిపల్, జీహెచ్ఎంసీలు కలిసి చెరువుల రక్షణకు కొత్తచట్టాన్ని ఓ కొలిక్కి తెచ్చే పనిలో పడ్డాయి. అవసరమైతే పీడీ యాక్ట్ చెరువు పరిధి, శిఖం భూమిని కబ్జా చేస్తే నేరుగా జైలుకు పంపేలా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చట్టాన్ని తీసుకురానుంది. కబ్జాలతో పాటు చెరువులను కలుషితం చేసే, దెబ్బతీసే ఎలాంటి చర్యలకు పాల్పడినా శిక్ష పడనుంది. నీటి వనరులు కాపాడేలా గతంలో పార్లమెంట్ స్టాడింగ్ కమిటీలు చేసిన సిఫార్సులతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో చెరువుల ఆక్రమణల నివారణ చట్టాలను అధ్యయనం చేస్తోంది. ప్రభుత్వవర్గాల సమాచారం మేరకు చట్టంలోపొందుపర్చనున్న అంశాలివీ... ►ఎలాంటి వారంట్ లేకుండా అరెస్ట్ చేసేలా, కనీసం ఏడాది జైలుశిక్ష పడేలా ముసాయిదాను రూపొందిస్తోంది. ►చెరువులను నీటి నిల్వ కోసం మినహాయించి ఏ ఇతర అవసరాల కోసం వాడినా కఠినచర్యలుంటాయి. ► చెరువు సరిహద్దు నుంచి 30 మీటర్ల దూరం లోపల ఉన్న భూముల్లో ఎలాంటి వాణిజ్య, గృహ, పారిశ్రామిక సముదాయాలు నిర్మించొద్దు. అక్రమ నిర్మాణాలు చేపడితే వాటిని స్వాధీనం చేసుకోవచ్చు. ► చెరువుల్లోకి నీరు వచ్చే ప్రవాహమార్గాలకు ఎలాంటి ఆటంకం కలిగించొద్దు. మున్సిపల్ వ్యర్థాలు కానీ, బురద, రసాయన వ్యర్థాలను చెరువులో వేయొద్దు. ► ప్రభుత్వ అనుమతి లేకుండా చెరువు పరిధిలో ఎలాంటి రోడ్లు, బ్రిడ్జీల నిర్మాణం చేపట్టొద్దు. ► శుద్ధి చేయని జలాలను చెరువుల్లోకి పంపొద్దు. ► వీటిని ఎక్కడైనా ఉల్లంఘిస్తే.. ఆ ఆక్రమణకు ఉపయోగించే పరికరాలు, వస్తువులు, వాహనాలను సీజ్ చేసే అధికారాన్ని అధికారులకు కట్టబెట్టారు. ► ఆక్రమణదారులను ఎలాంటి వారంట్ లేకుండానే అరెస్టు చేసే, పీడీ యాక్టు పెట్టే అధికారం కూడా ఉంటుంది. ఈ చట్టం కింద నేరం రుజువైతే కనీసం ఏడాది జైలు శిక్ష పడేలా నిబంధనలు విధించారు. -
‘సోషల్’ కూత.. టీఆర్ఎస్ జోరు
సాక్షి, సిటీబ్యూరో: బల్దియా ఎన్నికలకు ఇంకా నాలుగు నెలలకుపైగా సమయం ఉంది. జరగాల్సిన బీసీ ఓటర్ల సర్వే..వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేసి ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యేందుకు కూడా ఎంతో సమయం పట్టే చాన్స్ ఉంది. సాధారణంగా ఏ ఎన్నికలకైనా ఎన్నికల నోటిఫికేషన్‌కు అటూ ఇటూగా ఆయా పార్టీలు ప్రచారాలు నిర్వహిస్తాయి. కానీ, బల్దియా ఎన్నికలకు మాత్రం సోషల్ మీడియాలో ఈపాటికే ప్రచారం మొదలైంది. ప్రత్యేకంగా అది ఎన్నికల కోసమని చెప్పకపోయినా ఇటీవల పలువురు టీఆర్ఎస్కు చెందిన నేతలు ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాల్లో గ్రేటర్ హైదరాబాద్‌లో జరిగిన పనుల గురించి పోస్ట్ చేస్తున్నారు. వాటిల్లో ముఖ్యంగా బయోడైవర్సిటీ పరిసరాల్లో, ఎల్బీనగర్ చుట్టుపక్కల పూర్తయిన ఫ్లై ఓవర్లతో కూడిన వీడియో క్లిప్‌లు ఉంచుతున్నారు. ఒకే స్క్రీన్‌లో నాలుగైదు ఫ్లై ఓవర్లను జోడిస్తున్నారు. వీటితోపాటు కొల్లూరు, రాంపల్లి తదితర ప్రాంతాల్లో భారీసంఖ్యలోని డబుల్‌ఇళ్లనూ ఉంచుతున్నారు. ఇక దుర్గం చెరువు కేబుల్‌బ్రిడ్జి ఎన్నో రోజులుగా ప్రచారంలో ఉంది. ఇవన్నీ ఎందుకంటే అధికార టీఆర్ఎస్ పార్టీకి రాబోయే బల్దియా ఎన్నికలకు లబ్ధిచేకూర్చేందుకేనని, అది ఎన్నికల ప్రచారమేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో చేసిన అభివృద్ధిని ఇలా ప్రజల ముందుంచడం ద్వారా ముందస్తుగానే దూసుకుపోయేందుకు టీఆర్ఎస్ శ్రేణులతోపాటు పార్టీ అభిమానులూ ఈ పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు కార్పొరేటర్లు తాము చేస్తున్న పనులు, క్షేత్రస్థాయి పర్యటనల ఫొటోలు, వీడియోక్లిప్స్‌తో ప్రత్యేక వాట్సప్ గ్రూప్‌లు నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తున్న యూట్యూబ్ చానెళ్లలోనూ తమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు తదితరమైనవి ఉంచుతున్నారు. మరోవైపు తమ సీటు తమకే తిరిగి దక్కేందుకుగాను మునిసిపల్ మంత్రి కేటీఆర్‌ను కలిసి తాము చేసిన పనులు, చేయనున్న పనుల గురించి వివరిస్తున్నారు. పనుల్లో దూకుడు.. తమ పరిధిలోని మౌలిక సదుపాయాలు,అభివృద్ధికి సంబంధించిన పనుల్ని సత్వరం పూర్తిచేయాల్సిందిగా అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. ఉన్నతస్థాయిలోని టీఆర్ఎస్ నేతలు సైతం పబ్లిక్‌టాయ్‌లెట్లు,పార్కుల వంటి పనులు వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో, వీలైనంత సత్వరం పూర్తిచేయాల్సిందిగా సూచిస్తున్నారు. ఇప్పటికే రూ.50 వేల కోట్ల అభివృద్ధి పనులు: మేయర్ దేశంలోని నివాసయోగ్య, ఉపాధి, తదితర అంశాలపై 34 నగరాల్లో హాలిడిఫై.కామ్ వెబ్సైట్ నిర్వహించిన సర్వేలో హైదరాబాద్ అత్యుత్తమ నగరంగా నిలవడంపై మేయర్ బొంతు రామ్మోహన్ హర్షం వ్యక్తం చేశారు. నగరంలో వివిధ రంగాల్లో రూ. 50 వేల కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని, రాబోయే ఐదేళ్లలో మరో రూ.40 వేల కోట్ల వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలోని నీటికొరత, విద్యుత్ సమస్యలు ఇప్పుడు లేవని, హైదరాబాద్ నగరం పెట్టుబడులు పుంజుకోవడానికి, నివాసయోగ్యతకు అనువైన నగరమని పేర్కొన్నారు. బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలి రాష్ట్రంలో నిర్వహించిన మునిసిపల్ ఎన్నికల తరహాలోనే రాబోయే బల్దియా ఎన్నికలను కూడా బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలని హైదరాబాద్ జిల్లా టీడీపీ నాయకులు కోరారు. ఈ మేరకు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు పి.సాయిబాబా ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నాయకులు రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఎన్నికల అధికారిని కలిసిన వారిలో నల్లెల కిశోర్, ముప్పిడి మధుకర్, పి.బాలరాజ్‌గౌడ్ తదితరులున్నారు. ఓటీఎస్ వినియోగించుకోండి : జీహెచ్ఎంసీ కమిషనర్ ఆస్తిపన్ను బకాయిలున్నవారికి బకాయిల వడ్డీలపై 90 శాతం రాయితీనిస్తూ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన వన్ టైమ్ సెటిల్మెంట్(ఓటీఎస్)ను వినియోగించుకోవాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ ఒక ప్రకటనలో విజ్ఞప్తిచేశారు. ప్రభుత్వం ఈస్కీమ్ గడువునుఅక్టోబర్ 31 వరకు పొడిగించినందున స్కీమ్ ప్రయోజనం పొందాల్సిందిగా సూచించారు. జీహెచ్ఎంసీలో ఇలాంటి బకాయిలున్నవారు మొత్తం 5.41 లక్షల భవనాల యజమానులుండగా, ఇప్పటి వరకు 78వేల మంది మాత్రమే ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. తద్వారా జీహెచ్ఎంసీకి దాదాపు రూ. 174 కోట్లు వసూలయ్యాయి. -
వచ్చే నెలాఖరుకల్లా అదుపులోకి..
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెలాఖరు నాటికి రాష్ట్రంలో కరోనా అదుపులోకి వస్తుందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఆయన వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) రమేశ్‌రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా పూర్తిగా అదుపులో ఉందని, కేసులు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. కొద్ది రోజుల్లో ఇంకా తగ్గుతాయని, వచ్చే నెలాఖరు నాటికి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ వైరస్ అదుపులోకి వస్తుందని తెలిపారు. సర్కారు సూచనలు, జాగ్రత్తలు పాటిస్తే ప్రజలు కొద్దిరోజుల్లో సాధారణ జీవితం గడిపే పరిస్థితులు వస్తాయన్నారు. బయట నుంచి తీసుకొచ్చే సామాన్లను శానిటైజ్ చేయనవసరం లేదన్నారు. వాటి నుంచి కరోనా సోకే ప్రమాదం చాలా తక్కువన్నారు. అలా అని జాగ్రత్తలు తీసుకోకపోతే అసలు రాకుండా ఉండదన్న గ్యారంటీ లేదని హెచ్చరించారు. వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందేనని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం 2 వేల మంది వైద్య సిబ్బంది మహమ్మారి బారినపడ్డారని ఆయన వివరించారు. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందన్నారు. సీజనల్ వ్యాధుల లక్షణాలు, కరోనా లక్షణాలు చాలా దగ్గరగా ఉంటాయని, అందువల్ల ప్రజలు ఏమాత్రం అనారోగ్యం బారినపడినా పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఒకరిద్దరికి రెండోసారి కరోనా... రాష్ట్రంలో ఒకరిద్దరికి రెండోసారి కరోనా వచ్చినట్లు తమ దృష్టికి వచ్చినట్లు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. దీనిపై తదుపరి పరిశోధన జరగాల్సి ఉందన్నారు. అయితే వారికి మొదటిసారి వచ్చినప్పుడు తప్పుగా పాజిటివ్ అని వచ్చిందా లేక నిజంగానే రెండోసారి వైరస్ సోకిందా అనే విషయాన్ని గుర్తించాల్సి ఉందన్నారు. తమ ఆఫీస్‌లోనూ ఒకతనికి మొదటిసారి వచ్చిందని, అప్పుడు అతనికి ఎలాంటి లక్షణాలు లేవన్నారు. కానీ ఇప్పుడు రెండోసారి లక్షణాలతో పాజిటివ్ వచ్చిందన్నారు. అయితే మొదటిసారి టెస్టుల్లో తప్పుడు పాజిటివ్ కూడా అయి ఉండొచ్చన్నారు. హాంకాంగ్‌లో కొందరికి రెండోసారి కరోనా వచ్చినట్లు నిరూపితమైందని, కాబట్టి రాష్ట్రంలోనూ వచ్చే అవకాశాలున్నాయన్నారు.‘హాంకాంగ్‌లో మొదటిసారి లోకల్ స్ట్రెయిన్‌తో వచ్చింది. ఆ తర్వాత యూరోపియన్ యూనియన్‌లోని స్ట్రెయిన్ వల్ల మళ్లీ అక్కడ వచ్చింది. ఇలాంటివి అరుదుగా జరుగుతాయి. మొదటిసారి వైరస్ సోకినప్పుడు ఉన్నంత ప్రభావం రెండోసారి ఉండట్లేదు’ అని శ్రీనివాసరావు వివరించారు. ప్రభుత్వ ప్యాకేజీ ప్రకారమే... ప్రైవేటు ఆస్పత్రుల్లోని అన్ని పడకల్లో ప్రభుత్వం ప్రతిపాదించిన ప్యాకేజీ ధరల ప్రకారమే కరోనా వైద్యం అందించాలని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సగం పడకలు తమకిష్టం వచ్చినట్లుగా చార్జీలు వసూలు చేసేందుకు అంగీక రించబోమన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులన్నింటిలో పడకలు నిండాకే ప్రైవేటులోని 50 శాతం పడకలు తీసుకొని తామే రోగుల్ని పంపుతామన్నారు. ప్రైవేటు ఆస్పత్రులు ఒకట్రెండు రోజుల్లో చర్చలకు వచ్చే అవకాశముందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టెస్టుల సంఖ్యను పెంచిందని, కేవలం ఈ నెలలోనే 5,62,461 కరోనా పరీక్షలు చేశామన్నారు. అన్ని జబ్బులకూ అన్ని చోట్లా చికిత్స: డాక్టర్ రమేశ్‌రెడ్డి అన్ని జిల్లా, బోధనాస్పత్రుల్లో సీజనల్ వ్యాధులతోపాటు ఇతర జబ్బులకు చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశామని డీఎంఈ రమేశ్‌రెడ్డి వెల్లడించారు. కరోనా చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి వైరస్ సోకితే నిమ్స్‌లో చికిత్స అందిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 16 మంది చనిపోయారని, వారికి బీమా లభించేలా బీమా కంపెనీలకు ప్రతిపాదనలు పంపామన్నారు. సేవలందిస్తూ మరణించిన వైద్య సిబ్బంది విషయంలో ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందన్నారు. -
‘గ్రేటర్’లో సాయంత్రం క్లినిక్‌లు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో సాయంత్రం క్లినిక్‌లను వెంటనే ప్రారంభించా లని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. రోజూ సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు ఈ క్లినిక్‌లలో బస్తీవాసులకు డాక్టర్లు అందుబాటులో ఉండాలన్నారు. గురువారం ఆయన వైద్య, ఆరోగ్యశాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశానికి వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ, ఇతర అధికారులు రమేష్‌రెడ్డి, డాక్టర్ శ్రీనివాసరావు, చంద్రశేఖర్‌రెడ్డి, డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, డాక్టర్ గంగాధర్ పాల్గొన్నారు. మంత్రి ఈటల మాట్లాడుతూ ఆసిఫాబాద్, భద్రాచలం పరిధిలో మలేరియా, జీహెచ్ఎంసీ, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో డెంగీ కేసులు ఎక్కువగా ఉంటాయని, దీనిపై శుక్రవారం అన్ని జిల్లాల వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్‌లో స్వైన్‌ఫ్లూ కేసులు కూడా వచ్చే అవకాశం ఉన్నందున అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు.. ► అన్ని మందులతో పాటు డెంగీ, ఇతర వ్యాధి నిర్ధారణ ర్యాపిడ్ కిట్లను అందుబాటులో ఉంచాలి. ► ప్రతి ఇంటికి ఫీవర్ సర్వే కొనసాగించాలి. ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటుచేయాలి. ► సిబ్బందిని, డాక్టర్లను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించాలి. ► ప్రతి డాక్టర్, సిబ్బంది ఆసుపత్రి దగ్గర్లోనే నివాసం ఉండాలి. మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి అదనపు వేతనమివ్వాలి. ► రోగులు రాని చోట నుంచి అవసరం ఉన్నచోటకు డాక్టర్లను మార్చాలి. వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. ► మున్సిపల్, పంచాయతీరాజ్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లతో కలిసి పనిచేయాలి. ఈ శాఖలతో త్వరలో సమావేశాలుంటాయి. ► అన్ని బోధనాసుపత్రులు, వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో కరోనాతో పాటు అన్ని జబ్బుల కు పడకలు కేటాయించాలి. అన్ని వైద్యసేవలు నిర్వహించాలి. ► ఫీవర్ ఆసుపత్రిని పూర్తిగా సీజనల్ జ్వరాల చికిత్సల కోసం సిద్ధంచేయాలి. ► ప్రతి గర్భిణికి ప్రసవ తేదీ ప్రకారం వైద్యసేవలందాలి. డెలివరీ డేట్ కంటే ముందే ఆసుపత్రికి తరలించాలి. ► 13 రకాల స్పెషాలిటీ డాక్టర్లను జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాలి. ► బ్లడ్‌బ్యాంకుల్లో రక్తం కొరత లేకుండా చూడాలి. ► జీతాలు పెండింగ్ ఉంచొద్దు. ప్రతి నెల మొదటి వారంలో అందేలా చూడాలి. -
నేటి నుంచి కరోనా పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి 50 వేల మందికి కరోనా పరీక్షలు చేసే కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం నుంచి తిరిగి ప్రారంభించనుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో తిరిగి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ఈనెల 16వ తేదీ నుంచి గ్రేటర్ హైదరాబాద్‌లోని అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో భారీ ఎత్తున కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయాల్సిందిగా సీఎం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈనెల 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్దేశించిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో 36 వేల శాంపిళ్లను తీసుకున్నారు. అందులో దాదాపు 27 వేలకు పైగా నమూనాలను పరిశీలించి ఫలితాలు ప్రకటించారు. మిగిలినవి పెండింగ్‌లో పడ్డాయి. ల్యాబ్‌ల్లో పరీక్షలు నిర్వహించే రోజువారీ సామర్థ్యం ఆ మేరకు లేకపోవడంతో తాత్కాలికంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. పెండింగ్‌పరీక్షలను పూర్తి చేయడంతో తిరిగి చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు. కొండాపూర్, బాలాపూర్, వనస్థలిపురం, గోల్కొండ, అంబర్‌పేట, రామంతపూర్‌లోని హోమియో ఆసుపత్రి, ఎర్రగడ్డ ఆయుర్వేదిక్, సరోజినీ ఆసుపత్రి తదితర నిర్దేశించినచోట్ల కరోనా శాంపిళ్లను స్వీకరిస్తారు. హైదరాబాద్ పరిధిలోని 30 నియోజకవర్గాల్లో ఇది కొనసాగనుంది. ప్రైవేటు ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు తప్పుల తడకగా ఉన్నాయంటూ ప్రభుత్వం స్పష్టం చేయడంతో వాటిపై ఇంకా సందిగ్దత కొనసాగుతోంది. లక్షణాలున్నవారు మాత్రమే పరీక్షలు చేయించుకోవాలని వైద్యారోగ్యశాఖ తెలిపింది. -
కరెంట్ బిల్లు.. పట్టుకుంటే షాక్
వనస్థలిపురానికి చెందిన ఓ వినియోగదారుడు 2019 మార్చిలో 175, ఏప్రిల్‌లో 175, మేలో 312 యూనిట్ల విద్యుత్‌ను ఖర్చుచేశాడు. ఆయన మార్చి, ఏప్రిల్ నెలల్లో 200 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించాడు కాబట్టి రెండో కేటగిరి కింద ఆయనకు ఒక్కో నెలకు రూ.713 చొప్పున బిల్లు వచ్చింది. మేలో 312 యూనిట్ల వినియోగంతో మూడో కేటగిరి కింద రూ.1,921 బిల్లు వచ్చింది. గతేడాది ఆ మూడు నెలల్లో 662 యూనిట్లకు మొత్తం రూ.3,346 బిల్లు వచ్చింది. ఇదే వినియోగదారుడు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో 657 యూనిట్లే కాల్చాడు. గతంతో పోలిస్తే ఐదు యూనిట్లు తగ్గాయి. కానీ, ఈ ఏడాది 3 నెలలకు కలిపి ఒకేసారి రీడింగ్ తీయడం, వచ్చిన మొత్తం యూనిట్లను 3 నెలల సగటుగా విభజించి బిల్లు వేయడంతో కేటగిరి సహా స్లాబ్‌రేట్ మారిపోయింది. ఫలితంగా రూ.3,630 బిల్లు వచ్చింది. గతంతో పోలిస్తే తాను తక్కువ విద్యుత్ వాడినా, బిల్లెందుకు పెరిగిందంటూ ఆధారాలతో సహా అధికారులను ప్రశ్నిస్తే.. స్పందన లేదు. ఈయనకే కాదు.. నెలకు 200 యూనిట్లలోపు వాడే 80 శాతం మంది వినియోగదారులకు ఇదే చేదు అనుభవం ఎదురవుతోంది. అధికారుల ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న అనుభవాలకు పొంతన ఉండట్లేదు. సాక్షి, హైదరాబాద్: విద్యుత్ బిల్లుల తీరుపై జనం గగ్గోలు పెడుతున్నారు. వీటిపై కొంతమంది నేరుగా సమీపంలోని విద్యుత్ రెవెన్యూ ఆఫీస్ (ఈఆర్ఓ) కేంద్రాలకు వెళ్లి, మరికొందరు ఆన్లైన్, ట్విట్టర్ వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాలుగు వేలకుపైగా ఫిర్యాదులందాయి. వాటిలో కొన్నిటిని పరిష్కరిస్తుంటే, మరికొన్నింటిని గాలికొదిలేస్తున్నారు. వినియోగదారులు ఆఫీసుకు వెళ్లి ఆరా తీస్తుంటే.. సరైన సమాధానం చెప్పేవారే కరువవుతున్నారు. 3 నెలల సగటు..మారిన స్లాబ్‌రేట్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 9 సర్కిళ్లు, 21 డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 53 లక్షల విద్యుత్ వినియోగదారులు ఉన్నా రు. వీరిలో 45 లక్షల మంది గృహ విద్యుత్ వినియోగదారులు. మరో ఏడున్నర లక్షల మంది వాణిజ్య వినియోగదారులు. చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలు మరో 50 వేల వరకు ఉన్నాయి. వీటి ద్వారా డిస్కంకు నెలకు సుమారు రూ.1,250 కోట్ల ఆదాయం వస్తోంది. గృహ విద్యుత్ వినియోగదారుల్లో 200 యూనిట్లలోపు వాడే వారే 80 శాతం మంది ఉంటారు. లాక్డౌన్ నేపథ్యంలో ఏ ప్రిల్, మే నెలల్లో మీటర్ రీడింగ్ తీయలేదు. తీరా మూడు నెలలకు కలిపి ఒకేసారి రీడింగ్ తీయడం, మొత్తం యూనిట్లను మూడు నెలలకు విభజించి లెక్కించడం వల్ల స్లాబ్‌రేట్ సహా కేటగిరీలు మారి బిల్లులు అమాంతం పెరిగిపోయాయి. గతంలో నెలకు రూ.500 లోపు వచ్చే బిల్లు ఈ మూడు నెలలకు కలిపి రూ.3 వేలకుపైగా రావడంతో వినియోగదారులు బిత్తరపోతున్నారు. డిస్కం మాత్రం.. లాక్డౌన్ సమయంలో కుటుంబసభ్యులం తా రోజంతా ఇళ్లలోనే ఉండటం, ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ ఆన్‌లో ఉంచడం వల్లే కరెంట్ వాడకం పెరిగి రెట్టింపు విద్యుత్ బిల్లులు వచ్చాయని అంటోంది. ఓ హెల్ప్‌లైన్ సెంటర్లో తన విద్యుత్ బిల్లుపై సంప్రదిస్తున్న వినియోగదారుడు 40% మంది ముందే చెల్లించినా.. లాక్డౌన్ నేపథ్యంలో ఏప్రిల్, మే నెలల్లో డిస్కం విద్యుత్ బిల్లులు జారీ చేయలేదు. కానీ గతేడాది ఏ నెలలో ఎంత చెల్లించారో, అవే చెల్లింపుల ఆధారంగా ఈ ఏడాది బిల్లులు చెల్లించాలని కోరింది. ఎప్పుడైనా చెల్లించేదే కదా అని భావించి 40 శాతం మంది ఆన్లైన్లో ముందే బిల్లులు చెల్లించా రు. వీరికెలాంటి మినహాయింపులు ఇవ్వలే దు. ఏ నెల బిల్లు ఆ నెలే చెల్లించినా.. 3 నెలలకు కలిపి ఒకేసారి రీడింగ్ తీయడం వల్ల వారంతా నష్టపోవాల్సి వచ్చింది. భారీగా పెరిగిన ఈ బిల్లులు చెల్లించే పరిస్థితుల్లో లేమంటూ వేలాది మంది వినియోగదారులు ఆన్లైన్, ట్విట్టర్ వేదికగా డిస్కంకు ఫిర్యాదు చేస్తున్నారు. కొందరు స్వయంగా సమీపంలోని ఈఆర్ఓలకు చేరుకుని, సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. వినియోగదారులకు సమాధానం చెప్పలేక, వారి ఆగ్రహాన్ని చల్లార్చలేక క్షేత్రస్థాయి సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఆ మూడుచోట్లా తప్ప ఫిర్యాదులపై పట్టింపేది? బంజారాహిల్స్, గ్రీన్లాండ్స్, సనత్‌నగర్ ఈఆర్ఓల పరిధిలో ఇప్పటివరకు 401 ఫి ర్యాదులు అందినట్లు తెలిసింది. అధికారులు ఆయా డివిజన్ల పరిధిలో ప్రత్యేక హెల్ప్‌డెస్కులు ఏర్పాటుచేశారు. ఆన్‌లైన్‌తో పాటు నేరుగా అందిన ఫిర్యాదులను ఎప్పటికప్పు డు రికార్డు చేస్తున్నారు. మొత్తం యూనిట్లు సహా మూడు నెలల సగటు, శ్లాబ్‌రేట్, వచ్చిన బిల్లులకు వివరణ ఇస్తున్నారు. రీడింగ్, బిల్లులో సాంకేతిక లోపాలుంటే అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. ఇతర సర్కిళ్లలో మాత్రం ఫిర్యాదులను అసలు పట్టించుకోవట్లేదనే విమర్శలున్నాయి. -
వారికి పాజిటివ్ ఎలా వచ్చిందబ్బా?
అతనికి 70 ఏళ్లు. అనారోగ్యంగా ఉంటే చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులు పరీక్షలు చేసి కరోనా లక్షణాలున్నట్లు గుర్తించారు. ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ఇటీవల విదేశాల నుంచి రాకపోకలు సాగించలేదు. దాదాపు నెల రోజులుగా ఇంటికే పరిమితమైన యాకుత్‌పురాకు చెందిన ఈ వృద్ధుడికి కరోనా ఎలా సంక్రమించిందో అంతుపట్టడంలేదు. ఇది ఇంకో కేసు... పక్షవాతంతో మంచానికే పరిమితమైపోయిన ఓ వ్యక్తికి కరోనా సోకింది. రెండు నెలలుగా కాలు కూడా బయటపెట్టని ఈ వ్యక్తికి వైరస్ సంక్రమించినట్లు తేలిన అనంతరం కుటుంబసభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. వారికి పాజిటివ్ రాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అదే సమయంలో బాధితుడికి వైరస్ ఎలా సంక్రమించిందనేది తేలక తలపట్టుకున్నారు. సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా విశ్వరూపం చూపుతున్న కరోనా మహమ్మారి గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. దగ్గు, తుమ్ములు, జ్వరం లక్షణాలతో బయటపడే ఈ వైరస్.. ఇటీవల ఇలాంటి లక్షణాల్లేనివారికి కూడా సోకుతున్నట్లు పరీక్షల్లో తేలింది. పాజిటివ్ వచ్చిన వారి కుటుంబసభ్యులు లేదా సన్నిహితంగా మెలిగినవారు పరీక్షలు చేయించుకుంటేనే ఇప్పటివరకు పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా కరోనా బాధితులతో సంబంధం లేని వారికీ వైరస్ సంక్రమిస్తున్నట్లు తేలింది. జంటనగరాల్లో ఈ తరహాలో 15 కేసుల వరకు నమోదు కావడంతో ప్రభుత్వానికి వైరస్ మూలాలు కనుగొనడం చిక్కుముడిగా మారింది. దీంతో ఈ మాయదారి వైరస్ ఎక్కడి నుంచి వ్యాప్తి చెందిందనే దానిపై ఆరా తీస్తున్నారు. అయితే, మూలాలు లేకుండా కరోనా బారిన పడడంతో ఇంకెంతమందికి ఇలాంటి లక్షణాలున్నాయోననే ఆందోళన వ్యక్తమవుతోంది. -
కడగండ్లు మిగిల్చిన అకాల వర్షం
సాక్షి, నెట్వర్క్: రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గురువారం కురిసిన అకాల వర్షాలు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. కోత కు వచ్చిన వరి పైర్లు నేలకొరిగాయి. కొన్ని చోట్ల మామిడి తోట లకు నష్టం వాటిల్లింది. ఇతర పంటలు కూడా దెబ్బతిన్నాయి. ► ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాల్వంచ, అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట, మణుగూరు, అశ్వాపురం, సత్తుపల్లి మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తో పాటు కల్లాల్లోని మిర్చి, మొక్కజొన్న పంట తడిసిపోయిం ది. కొన్నిచోట్ల మామిడి కాయలు నేలరాలాయి. ► సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. కొమురవెళ్లి మండలంలో వడగళ్లు పడ్డాయి. నంగునూరులో ధాన్యం నేలరాలింది. గజ్వేల్ మండలంలో వరి, మామిడితోటలకు నష్టం జరిగింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నష్టం అపారం యాదాద్రి భువనగిరి జిల్లాలో రాజాపేట, తుర్కపల్లి మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లిం ది. రాజాపేట మండలంలో మామిడి తోటలు దెబ్బతినగా తు ర్కపల్లి మండలంలో మామిడి తోటలతో పాటు వరికి తీరని నష్టం వాటిల్లింది. విద్యుత్æ స్తంభాలు కూలిపోవడంతో కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గాలులకు పలు చోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరి పడ్డాయి. చెట్లు కూలిపోయాయి. కోతకు వచ్చి న వరి పంట 2,963 ఎకరాల్లో పూర్తిగా ధ్వంసమైంది. నిమ్మ, మామిడి, కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. ఇక నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలో వడగండ్లతో కూడిన వర్షం కురవడంతో చేతికొచ్చిన వరిపైరు పూర్తిగా నేలపాలైంది. చింతపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో వసతులు లేకపోవడంతో ధాన్యం నీటిపాలైంది. అలాగే వింజమూరు, వర్కాల గ్రామాల్లో వరి పైరుకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఉమ్మడి పాలమూరులో భారీ నష్టం.. : మహబూబ్‌నగర్ జిల్లాలోని చిన్నచింతకుంట, మూసాపేట, అడ్డాకుల, రాజాపూర్, మహబూబ్‌నగర్ రూరల్, బాలానగర్ మండలాల్లో దాదాపు వెయ్యి ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని అంచనా. వనపర్తి జిల్లాలో రెండు గంటల పాటు భారీ వర్షం కురవడంతో పంటలకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. కొత్తకోట, వనపర్తి, పెద్దమందడి మం డలాల్లో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. శుక్రవారం ఉద్యాన, వ్యవసాయ శాఖ అధికారులు నష్టం వివరాల ను అంచనా వేయనున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మం డలంలోని ఖానాపూర్, పంచలింగాల, కర్ని, రుద్రసముద్రం, కాట్రెవ్‌పల్లి, మక్తల్ గ్రామాల్లో వెయ్యి ఎకరాల్లో పంట నేల వాలింది. నర్వ మండలం కొత్తపల్లి, జక్కన్నపల్లి, రాయికోడ్, నర్వ, యాంకి గ్రామాల్లో వడ్లు రాలిపోగా.. మామిడి తోటలు దెబ్బతిన్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లా చింతరేవుల, నర్సన్‌దొడ్డి, రేవులపల్లి, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో వడగండ్ల వానతో పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం ఉపరితల ద్రోణి ప్రభావంతో గురువారం గ్రేటర్ హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సాయంత్రం వేళ కురిసిన వర్షానికి పలు ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు పోటెత్తింది. తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. తూర్పు విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో నగరంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు ప్రకటించింది. కాగా అత్యధికంగా బొల్లారంలో 3.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. క్యాంప్ ఆఫీస్‌పై పిడుగు.. దేవరకొండ ఎమ్మెల్యేకు తప్పిన ముప్పు నల్లగొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రనాయక్ క్యాంప్ కార్యాలయం పెంట్‌హౌస్æ ప్రహరీపై గురువారం పిడుగుపడింది. పిడుగుపాటుకు క్యాంప్ కార్యాలయం పెంట్‌హౌస్ ప్రహరీ గోడ పాక్షికంగా దెబ్బతిన్నది. ఆ సమయంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కుటుంబసభ్యులతో కలసి భోజనం చేస్తున్నారు. ఎమ్మెల్యే, ఆయన కుటుంబసభ్యులు సురక్షితంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
'చెత్త' రికార్డు!
సాక్షి, హైదరాబాద్: ఐటీ హబ్‌గా, హైక్లాస్ సిటీగా ప్రసిద్ధికెక్కిన మన భాగ్యనగరం ఓ ‘చెత్త’రికార్డును కూడా సొంతం చేసుకుంది. ప్రపంచస్థాయి నగరంగా గుర్తింపు తెచ్చుకోవాలనే తపన ఉన్న మన హైదరాబాదీలకు చెత్త విషయంలో చిత్తశుద్ధి తక్కువేనని ఈ రికార్డు చెబుతోంది. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం దేశంలో చెత్తను ఉత్పత్తి చేస్తున్న నాలుగో నగరంగా మన హైదరాబాద్ గుర్తింపు పొందింది. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతి యేటా 16.4 లక్షల మెట్రిక్ టన్నుల ఘనవ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని ఆ నివేదికలో తేలింది. మన హైదరాబాద్ కన్నా ముందంజలో ఉన్న ఢిల్లీ (30.6 లక్షల ఎంటీ), బృహన్ముంబై (24.9 లక్షల ఎంటీ), చెన్నై (18.3 లక్షల ఎంటీ)లు మరింత చెత్త నగరాలని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో వెల్లడించింది. ఈ చెత్తలో ఆహార, హరిత వ్యర్థాలు 57 శాతం ఉండగా, కాగితాలు 10 శాతం, ప్లాస్టిక్ 8 శాతం, గాజు వ్యర్థాలు 4 శాతం, లోహాలు 3 శాతం, రబ్బరు, తోలు వ్యర్థాలు 2 శాతం, 15 శాతం ఇతర వ్యర్థాలున్నాయి. అమెరికాలో 263.7 లక్షల మెట్రిక్ టన్నులు.. 130 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ చెత్త ఉత్పత్తి చేస్తున్న దేశమని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. ప్రపంచంలోని మొత్తం చెత్తలో పదో వంతు భారత్‌లోనే పడేస్తున్నారని తెలి పింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న చైనా కన్నా భారత్‌లోనే ఎక్కువ చెత్త వస్తోందని, 2016 లెక్కల ప్రకారం చైనాలో ఏటా 220.4 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పడేస్తుంటే భారత్‌లో అది 277.1 లక్షల మెట్రిక్ టన్నులని తేల్చింది. మన తర్వాత అమెరికాలో ఏటా 263.7 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను అక్కడి ప్రజలు పడేస్తున్నారు. సగటున ఒక మనిషి పడేస్తున్న చెత్త విషయానికి వస్తే బెర్ముడాలో అత్యధికంగా ఒక్కో వ్యక్తి రోజుకు 4.5 కిలోల వ్యర్థాలను పడేస్తున్నాడు. ఆ తర్వాత అమెరికాలో 2.24 కిలోలు, రష్యాలో 1.13 కిలోలు, జపాన్‌లో 0.94 కిలోల చెత్త డస్ట్బిన్ల పాలవుతోంది. ఇవన్నీ ప్రపంచ సగటు 0.74 కిలోల కన్నా ఎక్కువ చెత్తను విసర్జిస్తున్న దేశాలుగా ప్రపంచ నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత ఇండోనేసియాలో ప్రతి పౌరుడు సగటున రోజుకు 0.68 కేజీలు, భారత్‌లో రోజుకు 0.57 కిలోలు, చైనా, పాకిస్తాన్లలో 0.43 కిలోలు, బంగ్లాదేశ్‌లో 0.28 కిలోల చెత్త వదిలేస్తున్నారు. 30 ఏళ్లలో ఎంత? 2030, 2050 నాటికి ఘన వ్యర్థాల ఉత్పత్తి ఎంత ఉంటుందనే అంచనా ప్రపంచబ్యాంకు వేసింది. మనం ఇక్కడా తగ్గడం లేదు. ప్రస్తుతం వదులుతున్న వ్యర్థాలకు రెండింతల చెత్త మరో 30 ఏళ్ల తర్వాత బయటపడేస్తామని ప్రపంచ బ్యాంకు చెబుతోంది. -
మురుగు శుద్ధిలో గ్రేటర్ నం.1
సాక్షి, హైదరాబాద్: మురుగునీటి శుద్ధిలో గ్రేటర్ హైదరాబాద్ నగరం మహానగరాలకు ఆదర్శంగా నిలుస్తోంది. మన సిటీలో నిత్యం గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల నుంచి వెలువడే మురుగు నీటిలో 43 శాతం శుద్ధి జరుగుతుండటం విశేషం. ఇటీవల ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఈపీటీఆర్ఐ) నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయం తేలింది. మహానగరాల్లో వెలువడే మురుగు నీటిని సాంకేతిక పద్ధతులతో శుద్ధి చేసి నిర్మాణ రంగం, పరిశ్రమలు, గార్డెనింగ్, వాహనాల క్లీనింగ్ వంటి అవసరాలకు వినియోగించాలని ఈపీటీఆర్ఐ తాజాగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కాగా దేశంలో పలు మెట్రో నగరాలకు మురుగు ముప్పు పొంచి ఉంది. రోజువారీగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల నుంచి వెలువడుతున్న మురుగు నీటిలో శుద్ధి ప్రక్రియ 40 శాతానికి మించకపోవడం ఆందోళన కలిగి స్తోంది. మెట్రో నగరాలైన ముంబైలో 40%, బెంగళూర్‌లో 39, చెన్నైలో 37, ఢిల్లీలో 35, కోల్‌కతాలో 34 శాతమే శుద్ధి జరుగుతున్నట్లు ఈ నివేదికలో స్పష్టం చేసింది. మురుగు మాస్టర్ ప్లాన్ ఇదీ... ఔటర్ రింగ్ రోడ్డు పరిధి వరకు విస్తరించిన మహానగరంలో మురుగు అవస్థలకు శాశ్వతంగా చరమగీతం పాడేందుకు సీవరేజి మాస్టర్‌ప్లాన్ సిద్ధమైంది. సిటిజన్లకు మురుగు అవస్థలు లేకుండా చూసేందుకు రూ.8 వేల కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర సీవరేజి మాస్టర్‌ప్లాన్ అమలు చేసేందుకు జలమండలి ముంబైకి చెందిన షా కన్సల్టెన్సీ నిపుణుల సౌజ న్యంతో ఈ మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేసింది. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో నిత్యం వెలువడుతోన్న 2,133 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసేందుకు ప్రతి రెండుమూడు చెరువులకు ఒకటి చొప్పున సుమారు రూ.5వేల కోట్ల అం చనా వ్యయంతో 65 వికేంద్రీకృత మురుగుశుద్ధి కేంద్రాలు నిర్మించనున్నారు. వీటిలోకి మురుగునీటిని మళ్లించేందుకు సుమారు రూ.3 వేల కోట్లతో ట్రంక్ మెయిన్, లేటరల్ మెయిన్ పైపులైన్లను ఏర్పాటు చేశారు. ఇందుకు వీలుగానగరాన్ని 48 సీవరేజి జోన్లుగా విభజించారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణం స్వీకరించి పూర్తిచేస్తే మహానగరానికి 2,036 సంవత్సరం వరకు మురుగు కష్టాలు ఉండవని జలమండలి వర్గాలు చెబుతున్నాయి. గ్రేటర్ ఆదర్శమిలా... గ్రేటర్ హైదరాబాద్‌లో నిత్యం వెలువడుతున్న 2వేల మిలియన్ లీటర్ల మురుగు నీటిలో 860 మిలియన్ లీటర్ల నీటిని 22 కేంద్రాల్లో శుద్ధి చేస్తున్నారు. ఈ నీటి నాణ్యతను పరిశీలించేందుకు వివిధ పరిశోధన సంస్థల సేవలను జలమండలి వినియోగిస్తోంది. నూతనంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని లింగంకుంట వద్ద మూవింగ్ బెడ్ బయోరియాక్టర్ అధునాతన సాంకేతికతతో మురుగుశుద్ధి కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెలాఖరులో దీన్ని ప్రారంభించనున్నారు. ఇదే స్ఫూర్తితో నగరంలో మురుగు మాస్టర్ ప్లాన్ అమలు చేసేందుకు జలమండలి ప్రణాళిక సిద్ధం చేసింది. వ్యర్థాలకు సరికొత్త అర్థం తెచ్చేలా.. గ్రేటర్ నగరంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఔటర్‌రింగ్ రోడ్డు పరిధి వరకు సమగ్ర మురుగునీటి మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేశాం. దీంతో శివారు వాసులకు మురుగునీటితో అవస్థలు తప్పనున్నాయి. గ్రేటర్లో పర్యావరణ పరిరక్షణ, హరిత వాతావరణం పెంపొందించడం, మూసీతోపాటు చెరువులు, కుంటలు తదితర విలువైన జలవనరులు కాలుష్యం బారిన పడకుండా కాపాడవచ్చు. మురుగు శుద్ధి కోసం నిర్మించనున్న ఎస్టీపీల్లో పర్యావరణహిత సాంకేతికత వినియోగించనున్నాం. -ఎం.దానకిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్, జలమండలి ఎండీ. -
వెతికేద్దాం.. వెలికితీద్దాం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ(టీఎస్ఎండీసీ) ఇతర ఆదాయ మార్గాలపై దృష్టి సారిస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ఇసుకతోపాటు ఇతర ఖనిజాల ద్వారా రూ.2,868.95 కోట్ల ఆదాయం సమకూరగా, ఇందులో ఇసుక వాటా రూ.2,837.32 కోట్లు. అయితే, దీర్ఘకాలంలో ఇసుక వెలికితీత క్రమంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను టీఎస్ఎండీసీ అన్వేషిస్తోంది. టీఎస్ఎండీసీకి కేంద్రం ఇదివరకే జాతీయ ఖనిజాన్వేషణ సంస్థ హోదాను కల్పించింది. దీంతో సూర్యాపేట, నల్లగొండ, వికారాబాద్ జిల్లాల్లో సున్నపురాయి బ్లాక్‌లలో వెలికితీత పనులను టీఎస్ఎండీసీకి అప్పగిస్తూ ఖనిజాన్వేషణ కోసం రూ.29 కోట్లను జాతీయ ఖనిజాన్వేషణ ట్రస్టు కేటాయించింది. సున్నపురాయి అన్వేషణకు సంబంధించి ఇప్పటికే తొలిదశలో ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన టీఎస్ఎండీసీ.. ప్రస్తుతం రెండోదశలో పూర్తి స్థాయిలో తనకు కేటాయించిన సున్నపురాయి బ్లాక్‌లలో అన్వేషణ ప్రారంభించింది. గ్రానైట్ వ్యాపారానికి మొగ్గు... నిర్మాణరంగంలో వినియోగించే గ్రానైట్‌కు స్థానికంగా, విదేశీ మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని గ్రానైట్ వ్యాపారంలోకి ప్రవేశించాలని టీఎస్ఎండీసీ భావిస్తోంది. దీని కోసం మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ‘బిజినెస్ డెవలప్మెంట్ సెల్’ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలోని ఆరు ప్రాంతాల్లోని 92.29 హెక్టార్లలో ప్రతీ ఏటా 36,400 క్యూబిక్ మీటర్ల గ్రానైట్‌ను వెలికితీయవచ్చని టెక్నో, కమర్షియల్ ఫీజిబిలిటీ నివేదిక ఆధారంగా అంచనాకు వచ్చింది. వంతడుపుల, తాళ్లపూసపల్లె, ఇనుగుర్తి, నమిలిగొండ, కొత్తగట్టులోని రెండుచోట్ల గ్రానైట్ నిల్వలున్నట్లు టీఎస్ఎండీసీ గుర్తించింది. రోడ్ మెటల్ యూనిట్లు... గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మాణరంగం ఊపుమీద ఉండటంతో బండరాళ్ల తరలింపు నిర్మాణదారులకు సమస్యగా మారింది. సహజ ఇసుక వినియోగం పెరగడంతో తరచూ కొరత ఎదురవుతోంది. దీంతో సహజ వినియోగాన్ని తగ్గించేందుకు కృత్రిమ ఇసుక వైపుగా వినియోగదారులను మళ్లించేందుకు టీఎస్ఎండీసీ ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోడ్ మెటల్ యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఖానామెట్, బండరావిరాల, యాచారంలో ఏర్పాటయ్యే ఈ యూనిట్ల ద్వారా కంకర, కృత్రిమ ఇసుకను విక్రయించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పర్యావరణ అనుమతుల కోసం జీహెచ్ఎంసీ, టీఎస్ఎండీసీ సంయుక్తంగా ప్రయ త్నాలు సాగిస్తున్నాయి. -
నెలకో బిల్లు గుండె గుబిల్లు
సాక్షి, హైదరాబాద్: ఇలా చాలా మంది వినియోగదారులకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. ఇష్టారాజ్యంగా మీటర్ చూడకుండానే బిల్లు వేయడం లేదా రోజులు పెంచి బిల్లు తీసి వేలకు వేలు వసూలు చేస్తున్నారు. కొన్నిచోట్ల వినియోగదారుడు ఖర్చు చేయని విద్యుత్‌కు కూడా ముందే బిల్లు వసూలు చేస్తున్నారు. దీనిపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. జాప్యంతో మారుతున్న స్లాబ్‌రేట్ ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 44,60,150 పైగా గృహ, 6,95,803పైగా వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. వీటికి ప్రతినెలా నిర్దిష్ట తేదీకే (30 రోజులకు) మీటర్ రీడింగ్ నమోదు చేయాలి. కానీ అధికారుల పర్యవేక్షణాలోపం, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల రెండుమూడు రోజులు ఆలస్యంగా మీటర్ రీడింగ్ నమోదు చేస్తు న్నారు. స్లాబ్‌రేట్ మారిపోయి విద్యుత్ బిల్లులు రెట్టింపు స్థాయిలో జారీ అవుతుండటంతో వినియోగదారులు నష్టపోవాల్సి వస్తోంది. కాగా, విద్యుత్ చౌర్యం, లైన్‌లాస్, ఇతర నష్టాలను నెలవారి బిల్లులు చెల్లించే వినియోగదారులపై రుద్దుతున్నట్లు ఆరోపణలున్నాయి. స్లాబ్‌రేట్ మార్చి బిల్లులు రెట్టింపుస్థాయిలో జారీ చేసి వందశాతం రెవెన్యూ కలెక్షన్ నమోదైనట్లు రికార్డుల్లో చూపిస్తుండటం కొసమెరుపు. - సైదాబాద్ వినయ్‌నగర్ కాలనీకి చెందిన ముచ్చా విజయకి సంబంధించిన గృహ విద్యుత్ కనెక్షన్ నెలవారీ బిల్లును జూన్ 7న జారీ చేశారు. బిల్లుపై ఉన్న ప్రీవియస్ కాలంలో (జూన్) 30,649 యూనిట్లు రికార్డ్ కాగా... జూలై 7న కూడా 30,649 యూనిట్లే రికార్డయింది. నెలలో వాడిన మొత్తం యూనిట్ల సంఖ్య జీరోగా చూపించి, మినిమం బిల్లు రూ.175 వేశారు. - ఇక ఆగస్టు 7న అదే సర్వీసు నంబర్‌పై మీటర్ రీడింగ్ తీసి, బిల్లు జారీ చేశారు. ప్రీవియస్, ప్రజెంట్ రీడింగ్‌లో మార్పు లేదు. కానీ 206 యూనిట్లు వాడినట్లు చూపించి, రూ.1,116 బిల్లు వేశారు. విజయకి అనుమానం వచ్చి మీటర్‌ను పరిశీలిస్తే.. అసలు విషయం బయటపడింది. మీటర్లో ప్రస్తుతం 30,507 యూనిట్లు మాత్రమే నమోదైనట్లు ఉంది. - ఇక ఇబ్రహీంపట్నంలో సరస్వతికి సంబంధించి బిల్లులో అన్నీ తప్పులే. ప్రీవియస్ బిల్లు 8419 ఉంటే, ప్రజెంట్ బిల్లు 91 గా చూపించారు. అలాగే 34 రోజులకు బిల్లు తీసి వంద యూనిట్లు దాటేలా చేశారు. దీంతో స్లాబ్ మారి బిల్లు అమాంతం పెరిగింది. -
బ్రాండ్ బాబులు!
సాక్షి, హైదరాబాద్: కొత్త బ్రాండు, హైఎండు.. నగరంలోకి వస్తే చాలు.. హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇందుకోసం ఎంత ఖర్చయినా చేసేందుకు సిటీలోని సంపన్నులు, యువత వెనుకాడటం లేదు. అందుకే సిటీలోకి ఏ కొత్త మోడల్ కారు వచ్చినా.. బైక్ వచ్చినా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. బుకింగ్‌లు వెల్లువెత్తుతున్నాయి.కొన్ని రోజుల క్రితమే నగరంలో షోరూంలను ప్రారంభించిన ఎంజీ హెక్టార్, కియా కార్లకు పెరిగిన డిమాండ్ దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. వీటి కోసం నెలలు ముందుగానే బుకింగ్ చేసుకోవాల్సి ఉంది. హైఎండ్ దూకుడు.. హై ఎండ్ కార్లు, బైక్‌ల అమ్మకాలు జోరు మీదున్నాయి. ధర ఎంత ఉన్నా కొనడానికి వాహన ప్రియులు వెనుకాడటంలేదు. 2017 నుంచి 2019 గణాంకాల ప్రకారం.. మెర్సిడెజ్ బెంజ్‌కు చెందిన జీఎల్ఎస్ 350డీ 4 మాటిక్ వాహనాలు 203 రిజిస్టరయ్యాయి. దీని ధర రూ.65 లక్షలకు పైనే ఉంది. అటు బీఎండబ్ల్యూ ఎక్స్ 5 ఎక్స్‌డ్రైవ్ 30డీ డీపీఈ విత్ ఎట్ 55 వాహనాలు 100 వరకు అమ్ముడయ్యాయి. దీని ధర రూ.55లక్షల వరకు ఉంది. వోల్వో ఎక్స్ సీ90 డీ5 వాహనాలు.. 80, బీఎండబ్ల్యూ 520డీ లగ్జరీ డబ్ల్యూ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ 69, వోల్వో ఎక్స్ సీ60 డీ5 వాహనాలు 61 చొప్పున ఈ రెండేళ్లలో అమ్ముడయ్యాయి. గతేడాది హై ఎండ్ కార్ల విక్రయాలు వెయ్యి దాటాయి. ద్విచక్రంలో దీనిదే పైచేయి.. హైఎండ్ ద్విచక్ర వాహనాల్లో హార్లీడేవిడ్సన్ రారాజులా దూసుకుపోతోంది. హార్లీడేవిడ్సన్ ఎక్స్‌జీ 750 వాహనాలు అత్యధికంగా 88 వరకు విక్రయించారు. హార్లిడేవిడ్‌సన్ ఎక్స్‌జీ 750ఏ వాహనాలు 73 వరకు అమ్ముడయ్యాయి. దీని ధర రూ.8.8లక్షల వరకు ఉంది. డీఎస్కే మోటార్ వీల్స్ టీఎన్‌ఏటీ 600 బ్రాండ్, కవాసకి హెవీ ఇండస్ (జపాన్), ఇండియా కవాసకి మోటార్స్‌కు చెందిన నింజా 650 తదితర బైక్‌ల అమ్మకాలు బాగా జరిగాయి. ఆర్టీఏ లెక్కల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్‌లో రూ.10 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన బైక్‌లు 426 ఉండగా, రూ.50 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన హై ఎండ్ కార్లు 5,061 రిజిస్టరయ్యాయి. అటు రెగ్యులర్ బైక్‌లు, కార్ల అమ్మకాలు గత కొద్ది రోజులుగా 15 శాతం నుంచి 20 శాతం వరకు తగ్గినట్లు నగరంలోని పలువురు ప్రముఖ షోరూమ్ డీలర్లు అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా వచ్చిన మార్పుల్లో భాగంగానే హైదరాబాద్‌లోనూ రెగ్యులర్ మోడళ్ల అమ్మకాలు మందగించాయని చెప్పారు. కాగా, 2020 ఏప్రిల్ నుంచి బీఎస్ –6 మోడల్ మార్కెట్లోకి రానున్న దృష్ట్యా చాలామంది వినియోగదారులు కార్ల కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు. -
మరో 5 లక్షల ఐటీ జాబ్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగానికి చిరునామాగా నిలిచిన గ్రేటర్ హైదరాబాద్... ఈ రంగంలో మరింతగా పురోగమిస్తోంది. రాబోయే నాలు గేళ్లలో ఐటీ కొలువులు మరో ఐదు లక్షల వరకు పెరిగే అవకాశాలున్నట్లు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) తాజాగా అంచనా వేస్తోంది. ప్రస్తుతం నగరం కేంద్రంగా సుమారు 600కుపైగా కంపెనీలు కార్యకలాపాలు కొనసాగిస్తుండగా ఈ సంస్థల్లో సుమారు 5.5 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం ఐటీ ఎగుమతులు రూ. లక్ష కోట్లు దాటాయి. శరవేగంగా వృద్ధి...: ఐటీ రంగానికి నగరంలోని మాదాపూర్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లా, హైటెక్ సిటీ తదితర ప్రాంతాలు కొంగు బంగారంగా నిలుస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో రాబోయే నాలుగేళ్లలో నూతనంగా సుమారు 50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన ఐటీ కార్యాలయాలు వెలిసే అవకాశాలున్నట్లు హైసియా ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఐటీ రంగంలో వస్తున్న మార్పులు, నూతన ప్రాజెక్టులకు అనుగుణంగా అవసరమైన నిపుణుల లభ్యత కూడా నగరంలో అందుబాటులో ఉండటంతో పలు బహుళజాతి ఐటీ కంపెనీలు నగరానికి వెల్లువలా తరలివస్తున్నాయని చెబుతున్నారు. భౌగోళిక అనుకూలతలు కూడా నగరంలో ఐటీ రంగం వృద్ధి చెందేందుకు కారణమని విశ్లేషిస్తున్నారు. కొలువుల జాతర... ఐటీ రంగంలో ప్రధానంగా డిమాండ్ అనూహ్యంగా పెరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా సైన్స్, ఏఆర్, వీఆర్, బ్లాక్‌చైన్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి సాఫ్ట్వేర్ల అభివృద్ధి, విస్తరణ ప్రాజెక్టులు చేపట్టే సంస్థలు నగరంలో తమ కార్యకలాపాలు సాగించేందుకు ముందుకొస్తున్నాయని హైసియా అధ్యక్షుడు భరణి ‘సాక్షి’కి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఐటీ, హార్డ్‌వేర్ పాలసీలు కూడా ఈ రంగం విస్తరణకు దోహదపడుతున్నాయన్నారు. ఐటీ రంగంలో నూతనంగా కొలువులు సాధించే పట్టభద్రులు ప్రారంభంలో రూ. 3–3.5 లక్షలు, కొంత అనుభవం గడిస్తే రూ. 6–8 లక్షల వరకు వార్షిక వేతనం పొందుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే నాలుగేళ్లలో ఐటీ కొలువులు మరో 5 లక్షల వరకు పెరిగే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఏటా నగరం నుంచి చేపట్టే ఐటీ ఎగుమతుల్లో 17 శాతం మేర వృద్ధి నమోదవుతోందని పేర్కొన్నారు. -
‘రింగు’తో నగరానికి హంగు..
సాక్షి: ఆర్ఆర్ఆర్ పనులు చేపట్టాలని కేంద్రం ఇప్పటికే మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. అధికారిక ఆదేశాలు ఎప్పుడు రానున్నాయి? గణపతిరెడ్డి: రెండు వారాల్లో కేంద్రం నుంచి లిఖితపూర్వక ఆదేశాలు రానున్నాయి. రీజినల్ రింగ్ నేపథ్యం వివరిస్తారా? గ్రేటర్ హైదరాబాద్‌కు భవిష్యత్తులో ఎదురయ్యే ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు మరో రింగ్ రోడ్ అవసరమన్న ఆలోచన ముఖ్యమంత్రి కేసీఆర్‌దే. ఆయన 2016లోనే ఈ ప్రతిపాదనను మాముందు ఉంచారు. రోజురోజుకు వేలాది కొత్తవాహనాలు రోడ్డు మీదకు వస్తున్న దరిమిలా.. ఇపుడున్న ఔటర్ రింగ్‌రోడ్ సామర్థ్యం సరిపోదని, భారీ వాహనాల రవాణాకు మరో కొత్త రింగు రోడ్డు (రీజినల్ రింగ్ రోడ్) కావాలని ఆయనే ప్రతిపాదించారు. రీజినల్ రింగురోడ్డుతో మారనున్న తెలంగాణ ముఖచిత్రం రోడ్డు ఆవశ్యకత ఏంటి? నగరం నుంచి ఉన్న జాతీయ రహదారులపై వాహనభారం తీర్చేందుకు ఔటర్ రింగ్‌రోడ్డుకు అంకురార్పణ జరిగింది. కొత్త వాహనాలు రోడ్డు మీదకు వస్తుండటంతో రాబోయే ఐదేళ్లలో ఓఆర్ఆర్ కేవలం నగర అవసరాలకే పరిమితమవనుంది. అపుడు ఓఆర్ఆర్పై ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతాయి. రోజురోజుకు పెరిగే అవసరాలను దృష్టిలో ఉంచుకుని జాతీయ రహదారులపై నిరాటంకమైన రవాణా ఉండాలంటే మరో రింగు రోడ్డు అనివార్యమైంది. అదే విషయాన్ని కేంద్రానికి వివరించి ఒప్పించగలిగాం. డీపీఆర్ పనులు ఎంతవరకు వచ్చాయి? డీపీఆర్ పనులు దాదాపుగా పూర్తికావచ్చాయి.మరో 10 రోజుల్లో నివేదిక రావొచ్చని అంచనా వేస్తున్నాం. దీనిపై అధికారులు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నారు. భూసేకరణ మొదలు పెట్టవచ్చని కేంద్రం చెప్పింది కదా? ఎంత భూమిని సేకరిస్తారు? మొత్తం 338 కిలోమీటర్లు ఉండే ఈ రోడ్డు కోసం 11,000 ఎకరాల భూమిని సేకరిస్తాం. ఇందుకోసం ప్రాజెక్టు వ్యయంలో రూ.2,500 కోట్లు అవుతాయని అంచనా వేస్తున్నాం. ఈ మార్గంలో ఇప్పటికే రోడ్డు అందుబాటులో ఉంది కదా? దాన్ని విస్తరిస్తారా? గణపతిరెడ్డి: ఉన్న రోడ్డును విస్తరించడం సవాలుతో కూడుకున్నది.పైగా అనేక వంపులు, మలుపులు ఎదురై ప్రయాణానికి ఆటంకం కలుగుతుంది.పైగా మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లింపులు, కోర్టు కేసులు, స్టేలు పనులకు ఆటంకంగా మారతాయి. న్యాయపరంగా, ఆర్థికంగా అనేక చిక్కులు ఎదురవుతాయి. అందుకే, మేం పూర్తిగా గ్రీన్‌ఫీల్డ్‌నే ఎంచుకోబోతున్నాం. ఇలాగైతే వంపులు లేని సాఫీ రోడ్డును నిర్మించగలం. భవిష్యత్‌లో నగర వాసులకు ఎదురయ్యే ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకే రీజినల్ రింగ్‌రోడ్ ప్రతిపాదన తెచ్చామని, 2016లోనే సీఎం కేసీఆర్ ఈ ఆలోచన చేశారని ఆర్అండ్బీ ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి చెప్పారు. ఇది కార్యరూపం దాలిస్తే ట్రాఫిక్ కష్టాలు తీరడమే కాకుండా, నగరం కాలుష్యరహితంగా కూడా మారుతుందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌కు మరో హారంగా భావిస్తున్న ఆర్ఆర్ఆర్పై గణపతిరెడ్డి తన అభిప్రాయాలు ‘సాక్షి’తో పంచుకున్నారు. మరో10 రోజుల్లో పూర్తికానున్న డీపీఆర్ ఈ రోడ్డు అధ్యయనానికి మోడల్‌గా మలేసియానే ఎందుకు ఎంచుకున్నారు? మలేసియాకు అధికారుల పర్యటన ఎపుడు?ఆ దేశంలో ఆర్థికాభివృద్ధిలో ఎక్స్‌ప్రెస్ హైవేల పాత్ర అద్భుతంగా ఉంది. ఆ విషయాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా చూశారు. అందుకే, ఎక్స్‌ప్రెస్ హైవేగా నిర్మించాలని సూచించారు. ఇటీవల ఎన్నికల కోడ్ కారణంగా వీరి పర్యటన ఆగిపోయింది. జనవరిలో పర్యటన ఖరారవుతుంది. అత్యాధునిక సదుపాయాలతో ఎక్స్‌ప్రెస్ హైవే ఎక్స్‌ప్రెస్ హైవేపై ఎలాంటి సదుపాయాలు ఉంటాయి? పూర్తిస్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ రహదారి నిర్మాణం కానుంది. 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో వాహనాలు వెళ్లేలా రోడ్డు సామర్థ్యం ఉంటుంది. రహదారిపై ప్రయాణానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటంకం ఉండదు. పెట్రోల్, అంబులెన్స్, పికప్ క్రేన్ 24 గంటలు అందుబాటులో ఉంటాయి. టోల్గేట్లకు అత్యాధునిక టచ్ అండ్ గో సిస్టంతో టోల్ వసూలు చేసేందుకు స్మార్ట్ కార్డులు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. రీజినల్ను కలుపుతూ రేడియల్‌రోడ్లు ఎన్ని వస్తాయి? ఇప్పటికే 10 రేడియల్ రోడ్లు ఉన్నాయి.దానికి లింకు రోడ్లు వేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే.స్థానిక అవసరాలకు అనుగుణంగా రాష్ట్రమే ప్రణాళికలు రూపొందిస్తుంది. ప్రాజెక్టు పూర్తికాగానే నగరం నుంచి పరిశ్రమలు తరలింపు ఈ రోడ్డుతో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది? నగరంలో పెరుగుతున్న జనాభా వల్ల పరిశ్రమల చుట్టూ నివాస ప్రాంతాలు ఏర్పడ్డాయి.ఈ హానికారక పరిశ్రమలతో అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇలాంటి ప్రమాదకర పరిశ్రమలను ఔటర్ అవతలికి తరలించేందుకు వీలుంది. ఫలితంగా నగరంలో వాయుకాలుష్యం తగ్గుముఖం పడుతుంది. ముఖ్యంగా నగరంలో పలు పరిశ్రమలు హానికారక రసాయనాలను మూసీలో వదులుతున్నాయి. ఇలాంటి పరిశ్రమల తరలింపు వల్ల మూసీ ప్రక్షాళన సులభతరమవుతుంది. అంతర్జాతీయ స్థాయి రోడ్డు సదుపాయాలు ఉండటం వల్ల ఐటీ, ఎగుమతులు, డ్రై పోర్టులు వచ్చి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రజల ఆర్థిక ప్రమాణాలు కూడా మెరుగుపడతాయి. -
ఓటిక్కడ.. ఓటరక్కడ
‘హలో..నేను శేరిలింగంపల్లి అభ్యర్థిని మాట్లాడుతున్నాను.. మీ ఓటు మా పార్టీకే వేయండి’ అని అమరావతిలో ఉన్న ఓ వ్యక్తికి ఫోన్ రావడంతో అవాక్కయ్యాడు. ‘మీకు, మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.. ఇట్లు మీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభ్యర్థి’ ఈ సందేశం చదివాక విజయవాడలో ఓ వ్యక్తి అయోమయంలో పడ్డాడు. తెలంగాణ ఎన్నికలకు ఆంధ్రాలో ప్రచారమేంటి.. అనుకుంటున్నారా? ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులు ఆశ్రయిస్తున్న ఆధునిక పద్ధతులే ఇందుకు కారణం. అసలు విషయం ఏంటంటే.. ఐవీఆర్ ద్వారా రికార్డు సందేశాలను, వాట్సాప్, ఎస్సెమ్మెస్ ద్వారా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ కారణంగా ఇందులో చాలా ఫోన్లు, సందేశాలు ఏపీకి వెళుతున్నాయి. కారణం ఏంటి? తెలంగాణలో.. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతాల్లో ఆంధ్రా ప్రాంతానికి చెందినవారు అధికంగా స్థిరపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉండగానే.. వీరంతా అటు తమ సొంత జిల్లాల్లో, ఇటు హైదరాబాద్‌లోని తమ నియోజకవర్గాల్లో ఓటు నమోదు చేయించుకున్నారు. ఇలాంటి ఓటర్లు దాదాపు 20 లక్షలకుపైగానే ఉంటారు. వృత్తి, ఉపాధి, వ్యాపారం, స్థానికత తదితర కారణాల వల్ల రాష్ట్ర విభజన నేపథ్యంలో వీరిలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, చిన్నవ్యాపారులు, పారిశ్రామిక కూలీలు తిరిగి ఏపీకి వెళ్లిపోయారు. వీరందరి ఫోన్లలో ఇపుడు తెలంగాణ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎవరు చేస్తున్నారు? కూకట్పల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మల్కాజిగిరి, మేడ్చల్, ఎల్బీనగర్, జూబ్లీహిల్స్, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో సెటిలర్లు అధికంగా ఉన్నారు. ఏపీలో రియల్ ఎస్టేట్ ఊపందుకోవడంతో అమరావతి పరిసర ప్రాంతాలవారు, కొత్త పరిశ్రమలు నెలకొల్పాలన్న ఆశతో ఎంట్రాప్రెన్యూర్లు, ఇలా రకరకాల కారణాలతో రాజధానిని వీడారు. వీరందరి ఫోన్లకి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పొద్దుపోయే దాకా ఏదో ఒక సమయంలో సందేశాలు, రికార్డెడ్ వాయిస్‌కాల్స్ వస్తున్నాయి. మరోవైపు ఇలాంటి ఓట్లను తొలగించాలని ఏపీలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. గతవారం విచారణకు వచ్చిన సందర్భంగా అనుమానాస్పదంగా ఉన్న దాదాపు 19 లక్షల ఓట్లపై విచారణ జరిపిస్తామని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి సిసోడియా న్యాయస్థానానికి హామీ ఇచ్చారు. 2024 వరకు ఇంతే.. రాష్ట్ర విభజనకు ముందు ఏపీ తెలంగాణ రెండూ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ పరిధిలోనే ఉండేవి. తరువాత రెండుగా విడిపోయాయి. కానీ, సర్కిల్ పరిధిలో ముందుగా చేసుకున్న ఒప్పందాల ప్రకారం.. 2024 వరకు ఈ రెండు ప్రాంతాల్లో ఎలాంటి రోమింగ్ చార్జీలు పడవు. ఈ కారణంగా అభ్యర్థులు వివిధ మార్గాల ద్వారా తాము సేకరించిన ఫోన్ నంబర్లకు ప్రచార సందేశాలు పంపుతుండటంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. రెండుచోట్లా ఓట్లు ఉండటం, ఏపీ తెలంగాణకు 2024 దాకా రోమింగ్ చార్జీలు పడకపోవడమూ మరో కారణం. అయినా, ఇపుడు దాదాపు అన్ని మొబైల్ నెట్‌వర్క్‌లు దేశవ్యాప్తంగా ఒకే రకమైన కాల్‌ఛార్జీలు వసూలు చేయడం కూడా వీరికి కలిసివస్తోంది. ముంపు మండలాలదీ అదే పరిస్థితి! విభజన చట్టం ప్రకారం ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ముంపు ప్రాంతాలుగా పరిగణిస్తూ ఏపీకి కేంద్రం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడు మండలాలు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో అంతర్భాగంగా ఉండేవి. భద్రాచలం నియోజకవర్గంలోని భద్రాచలం పట్టణం మినహా మిగతా మండలం అంతా, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాలు, పినపాక పరిధిలోని బూర్గంపాడు, అశ్వారావుపేట నియోజకవర్గంలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలను ఏపీలో కలిపారు. ఈ ఏడు మండలాల్లో 211 గ్రామాలు, 34 వేల కుటుంబాలు ఉన్నాయి. ఈ ఓటర్లను కూడా భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట నుంచి పోటీ పడుతోన్న వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు తమకు ఓటువేసి గెలిపించాలని ఎస్సెమ్మెస్‌లు, వాయిస్‌కాల్స్ ద్వారా కోరుతున్నారు. 34వేల కుటుంబాల్లో దాదాపు 1.20 లక్షల ఓట్లు ఉండొచ్చని అంచనా. -
చెరగని సిరా.. చెదరని ‘ముద్ర’
సాక్షి, హైదరాబాద్: మీ వేలికి ఉన్న సిరాచుక్క దేశ ప్రగతికి దిక్సూచి అన్నట్టుగా... ప్రజాస్వామ్య దేశాల్లో ఎన్నికల సమయంలో కీలకభూమిక పోషించడమే కాదు.. అందరికీ సుపరిచితమైన సిరా చుక్క తయారీకి గ్రేటర్ హైదరాబాద్ చిరునామాగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు వంద దేశాలతోపాటు మన దేశంలోని 29 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు రాష్ట్ర రాజధాని నగరం నుంచే సిరా చుక్క ఎగుమతి చేస్తుండటం విశేషం. నగరం కేంద్రంగా మూడు దశాబ్దాలకుపైగా ఈ మహాక్రతువును నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న సంస్థ రాయుడు లేబొరేటరీస్ కావడం విశేషం. వేలిపై సిరా చుక్క.. ఓటుకు చిహ్నం.. మనం ఓటేశామని చెప్పడానికి గుర్తు మాత్రమే కాదు.. దొంగ ఓట్లను నిరోధించే ఆయుధం కూడా సిరా చుక్కే. అందుకే, మన దేశంతోపాటు చాలా దేశాలు ఎన్నికలవేళ ఓటేసిన అభ్యర్థికి సిరా చుక్క పెట్టడం తప్పనిసరి చేశాయి. భారత ఎన్నికల సంఘంలోని నిబంధన 37(1) ప్రకారం ఓటు వేసిన వ్యక్తి ఎడమ చేయి చూపుడు వేలుపై సిరా గుర్తును పరిశీలించాల్సిన బాధ్యత పోలింగ్ అధికారిపై ఉంటుంది. ఒకవేళ ఓటరుకు ఎడమ చేయి చూపుడు వేలు లేనట్లయితే వేరే ఏ వేలుకైనా సిరా చుక్క పెట్టాలి. 100 దేశాలకు హైదరాబాద్ నుంచే ఎగుమతి... భారత్‌లో ప్రధానంగా రెండు సంస్థలు మాత్రమే ఎన్నికల సిరాను తయారు చేస్తున్నాయి. కర్ణాటకలోని మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్(ఎంపీవీఎల్) ఒకటికాగా.. హైదరాబాద్ ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియాలోని రాయుడు లేబొరేటరీస్ మరొకటి కావడం విశేషం. భారత ఎన్నికల సంఘం మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్‌తోపాటు రాయుడు లెబొరేటరీస్ తయారు చేస్తున్న సిరాను ఎక్కువగా వినియోగిస్తోంది. ’ఎన్నికల కోసం దాదాపు 100 దేశాలకు చెరగని సిరా(ఇండెలిబుల్ ఇంక్)ను సరఫరా చేస్తున్నాం. ఇండియా, శ్రీలంకతోపాటు దక్షిణాఫ్రికా, లిస్బెన్, మడగాస్కర్, నైజీరియా, మాలే, ఒమన్, మాల్దీవులు, మొజాంబిక్, రువాండా, జాంబియా, ఇథియోపియా, ఈస్టర్ తిమోర్ తదితర దేశాలు మా వినియోగదారులుగా ఉన్నాయి’ అని రాయుడు లేబొరేటరీస్ సీఈవో శశాంక్ రాయుడు ‘సాక్షి’కి తెలిపారు. భారత్‌లోని చాలా రాష్ట్రాల్లో జరిగే మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో తమ సిరానే ఉపయోగిస్తున్నారని చెప్పారు. 37 ఏళ్లుగా రాయుడు ల్యాబ్స్ ఇండెలిబుల్ ఇంక్‌ను తయారు చేస్తోందన్నారు. మొదట్లో సిరాను చిన్న(5 మి.లీ) బాటిల్స్‌లో నింపి సరఫరా చేసేవాళ్లమని, 2004 తర్వాత ఇంక్ మార్కర్లను తీసుకొచ్చామన్నారు. ఒక మార్కర్ లేదా ఒక ఇంకు సీసా 500 మంది ఓటర్ల వేళ్లకు సరిపోతుందని పేర్కొన్నారు. ఈ సాంకేతికతను తొలుత ప్రవేశపెట్టింది తమ రాయుడు లేబొరేటరీనేనని ఆయన వివరించారు. పల్స్ పోలియో కార్యక్రమంలోనూ.. పల్స్ పోలియో కార్యక్రమంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు గుర్తించేందుకు వారి వేలుపై సిరా చుక్క పెడుతుంటారు. డబ్ల్యూహెచ్‌వో కూడా ఇండెలిబుల్ ఇంక్ కోసం రాయుడు లేబొరేటరీస్ సంస్థతో దీర్ఘకాలిక ఒప్పం దం చేసుకుంది. ఏ దేశంలో పల్స్ పోలియో కార్యక్రమం జరిగినా అక్కడ ఈ సిరానే ఉపయోగిస్తుండటం విశేషం. ఇక యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం గుర్తింపు, యూనిసెఫ్‌తోపాటు, ఐఎస్వో 9001:2015, ఐఎస్వో 14001:2015, డబ్లు్యహెచ్‌వో–జీఎంపీ తదితర ధ్రువీకరణలను రాయుడు సంస్థ సాధించింది. అభివృద్ధి చెందిన జర్మ నీ తదితర దేశాలకు అల్ట్రా వయొలెట్ ఇంక్‌ను కూడా ఈ సంస్థ సరఫరా చేస్తోంది. అల్ట్రా వయొలెట్ సిరా అంటే.. ఈ సిరాచుక్క వేలిపై పెడితే కనిపించదు. కానీ ఓటరు వేలును అతినీలలోహిత కాంతి కింద పెట్టినప్పుడు దర్శనమిస్తుంది. అప్పుడు బోగస్ ఓటరును పసిగట్టే వీలుంటుంది. ఈ సిరా చుక్క ఈజీగా చెరిగిపోదు.. ఎన్నికల్లో వాడే సిరాను సెమి పర్మనెంట్ ఇంక్గా చెప్పొచ్చు. అంటే కొద్ది రోజులపాటు చెదిరిపోకుండా ఉండే సిరా అన్నమాట. ఈ సిరాలో కొన్ని రకాల రసాయనాలతోపాటు 10 నుంచి 18 శాతం వరకు సిల్వర్ నైట్రేట్ ఉంటుంది. ఇది వెలుతురు పడగానే గట్టిగా మారుతుంది. వేలుపై పెట్టిన తర్వాత మూడు నుంచి ఏడు రోజులపాటు చెదిరిపోకుండా ఉంటుందని శశాంక్ తెలిపారు. నాణ్యత, మన్నిక మా చిరునామా నాణ్యత, మన్నికతో కూడిన ఉత్పత్తులను తయారు చేయడమే మా లేబొరేటరీ ధ్యేయం. మూడున్నర దశాబ్దాల క్రితం కృష్ణా–గోదావరి ప్రింటింగ్ ఇంక్ పేరుతో మా సంస్థను స్థాపించాం. 1995లో సంస్థ పేరును రాయుడు లేబొరేటరీస్గా మార్చాం. ఎన్నికల సిరాతోపాటు అత్యాధునిక పద్ధతులను ఉపయోగించి సర్జికల్ మార్కర్లు, వాటర్ ఎరేజర్లు, ఇతర ఇంక్‌లను తయారు చేస్తున్నాం. మా ల్యాబ్‌లో ప్రస్తుతం 20 మంది పనిచేస్తున్నారు. ఏటా రూ.20 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నాం. –శశాంక్ వి.రాయుడు, సీఈవో, రాయుడు లేబొరేటరీస్ -
పెరిగిన ఓటర్లు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో జనాభా రోజురోజుకు పెరుగుతోంది. తాజా ఓటర్ల జాబితానే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఎప్పటికప్పుడు నగర జనాభా, ఓటర్ల సంఖ్యలో పురోగతి కనిపిస్తోంది. దాదాపు 7నెలల వ్యవధిలోనే మహేశ్వరం నియోజకవర్గ జనాభా 25శాతం పెరిగింది. అలాగే ఎల్బీనగర్లో 15శాతం, నాంపల్లిలో 6.5శాతం మేర ఓటర్లు పెరిగినట్లు తాజా ముసాయిదా జాబితాలో వెల్లడైంది. హైదరాబాద్ జిల్లాలో కొత్తగా ఎక్కువ మంది ఓటర్లుగా నమోదు చేసుకున్న నియోజకవర్గాల్లో నాంపల్లి, కార్వాన్లు అగ్రస్థానంలో ఉన్నాయి. జనవరి 20న ఓటర్ల తుది జాబితా అనంతరం... తాజా ముసాయిదా విడుదల వరకు నాంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 17,860 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. తుది జాబితా మేరకు నియోజకవర్గంలో 2,73,079 మంది ఓటర్లు ఉండగా... 6.5శాతం పెరిగారు. కార్వాన్ నియోజకవర్గంలో తుది జాబితా నాటికి 2,86,436 మంది ఓటర్లుండగా.. కొత్తగా 10,879(4శాతం) మంది నమోదు చేసుకున్నారు. ఇక శివార్లలోని మహేశ్వరం నియోజకవర్గంలో తుది జాబితా నాటికి 3,23,660 మంది ఓటర్లు ఉండగా... ప్రస్తుతం 4,02,442 మంది ఉన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో తుది జాబితాలో 4,01,137 మంది ఓటర్లుండగా... తాజా ముసాయిదాలో 4,65,154 మంది ఉన్నారు. నగర శివార్లలో వేగంగా విస్తరిస్తుండడంతో అక్కడ ఎక్కువ మంది నివాసం ఉంటున్నారు. మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే చాంద్రాయణగుట్టలో పురుషులతో దాదాపు సమానంగా మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక్కడ పురుషులు 1,49,348 మంది ఉండగా, మహిళలు 1,42,415 మంది ఉన్నారు. అలాగే కంటోన్మెంట్ నియోజకవర్గంలో పురుషులు 1,16,886 మంది కాగా... మహిళా ఓటర్లు 1,12,793 మంది. గ్రేటర్ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జూబ్లీహిల్స్, మల్కాజిగిరిలలో మాత్ర మే థర్డ్‌జెండర్స్ లేరు. మిగతా అన్ని నియోజకవర్గాల్లో కలిపి 840 మంది ఓటర్లున్నారు. తగ్గిన తొలగింపులు... గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల జాబితా నుంచి తొలగించిన వారు తక్కువ సంఖ్యలోనే ఉన్నారు. వివిధ వర్గాల నుంచి వెల్లువెత్తుతున్న విమర్శలు, కోర్టులకు వెళ్తుండడం తదితర కారణాలతో ఓటర్లను తొలగించేందుకు అధికారులు వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. మరోవైపు చాలామంది అధికారులు ఇంటింటి సర్వే చేయకుండానే ముసాయిదా రూపొందించారనే ఆరోపణలున్నాయి. ఇళ్లకు వెళ్లకుండానే తొలగిస్తే తీవ్ర సమస్యలు ఎదురవనుండడంతో చిరునామాలు మారినవారు, మరణించిన వారి పేర్లను అలాగే ఉంచారనే అభిప్రాయాలున్నాయి. -
అందరూ ఉన్న 'అనాథలు'!
సాక్షి, హైదరాబాద్ : సరిగ్గా ఆరు నెలల క్రితం సికింద్రాబాద్ రేతిఫైల్ బస్‌స్టేషన్ వద్ద ఓ పెద్దాయన అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వయసు 75 పైనే ఉంటుంది. ఓ స్వచ్ఛంద సంస్థకు సమాచారం ఇవ్వడంతో వారు గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. రెండు రోజుల తర్వాత స్పృహలోకి వచ్చాడు. స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు ఆరా తీయగా.. ఆయనకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నట్లు తెలిసింది. ఒక కొడుకు ఖమ్మంలో, మరో ఇద్దరు హైదరాబాద్‌లో ఉంటున్నారు. వారికి సమాచారం ఇవ్వగా.. ఎవరూ రాలేదు. గాంధీలో చికిత్స పొందుతూనే ఆ పెద్దాయన కన్నుమూశాడు. అందరూ ఉండి కూడా ఓ అనాథగా లోకాన్ని విడిచి వెళ్లాడు. ఒక రిటైర్డ్ అధికారి, ఆయన భార్య మల్కాజిగిరిలో ఉంటున్నారు. ఇద్దరు కొడుకులూ అమెరికాలో స్థిరపడ్డారు. ఇటీవల అనారోగ్యంతో రిటైర్డ్ అధికారి భార్య కన్నుమూసింది. ఓ కొడుకు మాత్రమే వచ్చాడు. రాను, పోను విమానం టికెట్లు బుక్ చేసుకుని మరీ వచ్చాడు. తల్లి చితికి నిప్పంటించేందుకు అంగీకరించలేదు. చివరికి ఆ పెద్దాయనే భార్యకు అంత్యక్రియలు నిర్వహించాడు. అదే రోజు రాత్రి ఆ కొడుకు అమెరికాకు వెళ్లిపోయాడు. కొన్ని రోజుల క్రితం ఓ సుపుత్రుడు తన 80 ఏళ్ల తల్లిని అడిక్‌మెట్ బస్టాపులో వదిలేసి వెళ్లాడు. అప్పటికే తీవ్రమైన డిమెన్షియాతో బాధపడుతున్న ఆ పెద్దావిడ.. తన వివరాలను కూడా మరిచిపోయింది. ఒక స్వచ్ఛంద సంస్థ గుర్తించి ఆమెను ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో చేర్పించింది. తర్వాత తెలిసిన వివరాల ప్రకారం ఇద్దరు కొడుకులు ఆమెను నెలకొకరు చొప్పున పోషించారు. ఇటీవల ఆమెకు డిమెన్షియా రావడంతో నగలు, నగదు అన్నీ తీసుకొని బస్టాపులో వదిలి వెళ్లారు. చికిత్స అనంతరం స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులే ఆమెను ఒక వృద్ధాశ్రమంలో చేర్పించారు. ఇలా వీరే కాదు.. హైదరాబాద్‌లో ఎంతోమంది వృద్ధుల పరిస్థితి ఇదే. జీవిత చరమాంకంలో పిల్లల నిరాదరణకే గురై అనాథల్లా బతుకుతున్నారు. కొడుకులు, కోడళ్ల వేధింపులను భరించలేక కొందరు ఇళ్లను వదిలేసి వీధుల్లోకి వస్తున్నారు. మరికొందరిని తమ పుత్రరత్నాలే వీధుల్లో వదిలేసి వెళ్తున్నారు. కాలధర్మం చేసిన కన్నవాళ్లకు అంత్యక్రియలు చేయాల్సిన నైతిక ధర్మాన్ని కూడా కొందరు విస్మరిస్తున్నారు. ఒంటరి వృద్ధులకు దినదినగండం.. గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 15 లక్షల మందికి పైగా సీనియర్ సిటిజన్స్ ఉన్నట్లు అంచనా. వారిలో కనీసం 2 లక్షల మంది ఒంటరిగానే ఉంటున్నారు. ఎలాంటి ఆధారం లేక, అయిన వాళ్ల పలకరింపులు లేక బిక్కుబిక్కుమంటూ బతికేస్తున్నారు. ఇదే అదనుగా వృద్ధులు ఒంటరిగా ఉండే ఇళ్లల్లో దొంగలు దాడులకు దిగుతున్నారు. హత్యలకు పాల్పడుతున్నారు. నగలు, డబ్బు దోచుకెళ్తున్నారు. చట్టం ఏం చెబుతోంది... - వృద్ధుల సంక్షేమ చట్టంలోని 6వ సెక్షన్ ప్రకారం సీనియర్ సిటిజన్స్ ప్రాణ, ఆస్తి రక్షణ బాధ్యత పోలీసులదే. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒంటరిగా ఉన్న వయోధికుల జాబితాను రూపొందించాలి. - వారానికి రెండు సార్లు బీట్ కానిస్టేబుళ్లు వాళ్ల ఇళ్లకు వెళ్లి పలకరించాలి. రిజిస్టర్లో సంతకం తీసుకోవాలి. వారి యోగక్షేమాలను కనుక్కోవాలి. - కాలనీ కమిటీల తరహాలోనే స్థానికంగా యూత్ కమిటీలను ఏర్పాటు చేయాలి. రాత్రిపూట వృద్ధులకు మందులు, వైద్యం వంటి సహాయాన్ని అందజేసే బాధ్యతను ఈ కమిటీల ద్వారా నిర్వహించాలి. కానీ ఈ నిబంధనల్లో ఏ ఒక్కటీ పోలీసులు పాటించడం లేదు. నెలకు 15 మంది వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు పటిష్టమైన చట్టాలను రూపొందించినప్పటికీ అవి అమలుకు నోచుకోవడం లేదు. ఇక పెద్దల బాధ్యతను కొడుకులు, కూతుళ్లు భారంగా భావిస్తున్నారు. ఆస్తులను తమ పేరిట బదలాయించుకుని.. తర్వాత వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నారు. కొందరైతే నిర్దాక్షిణ్యంగా బస్టాపుల్లో, పుణ్యక్షేత్రాల్లో వదిలేసి చేతులు దులుపుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఇలా ప్రతి నెలా 10 నుంచి 15 మంది సీనియర్ సిటిజన్స్ అనాథల్లా చనిపోతున్నట్లు హెల్పేజ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేస్తోంది. వృద్ధాశ్రమాల్లో చనిపోయిన వాళ్లకు ఆశ్రమ నిర్వాహకులు, సత్యహరిశ్చంద్ర ఫౌండేషన్ వంటి సంస్థలే అంత్యక్రియలు నిర్వహిస్తున్నాయని ఆ సంస్థ ప్రతినిధి శ్యామ్‌కుమార్ ‘సాక్షి’తో చెప్పారు. హెల్పేజ్ ఇండియా నిర్వహిస్తున్న సహాయ కేంద్రానికి సీనియర్ సిటిజన్స్ నుంచి ప్రతి నెలా వచ్చే 300 ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం కొడుకులు, కోడళ్లు, కుటుంబ సభ్యుల వేధింపులకు సంబంధించినవే కావడం గమనార్హం. మరోవైపు పోలీస్ స్టేషన్లకు వెళ్లే వృద్ధులను చిన్నచూపు చూస్తున్నారని, వాళ్లను మనుషులుగా కూడా గుర్తించడం లేదని స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అధికారుల తీరు మారాలి.. వృద్ధుల సంరక్షణ చట్టం బలంగానే ఉంది. కానీ అమలు కావట్లేదు. గ్రేటర్లో ఒంటరిగా ఉండే వృద్ధుల రక్షణ గురించి 2007లో అప్పుటి కమిషనర్, ప్రస్తుత డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిశాం. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో సీనియర్ల జాబితాను రూపొందించి, రక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. – వుప్పల గోపాల్‌రావు, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వైద్యులకు చిన్నచూపేల? అనారోగ్యంతో ఉన్న వృద్ధులను ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేర్పించి వైద్యం చేయించడం సవాల్‌గా మారుతోంది. సహాయకులు, పోలీసులు ఉంటే తప్ప వైద్యం చేయబోమని వైద్యులు అంటున్నారు. కొడుకులు, కోడళ్లు తరిమేస్తే బయటకు వచ్చిన వాళ్లకు ఎవరు సహాయకులుగా ఉంటారు. కొన్నిసార్లు 108 సిబ్బంది కూడా ఇబ్బంది పెడుతున్నారు. – శ్యామ్‌కుమార్, హెల్పేజ్ ఇండియా -
కోరలు చాస్తున్న కాలుష్యం
సాక్షి, హైదరాబాద్: సూక్ష్మ ధూళికణాల కాలుష్యంతో గ్రేటర్ హైదరాబాద్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఏటేటా పెరుగుతోన్న వాయు కాలుష్యంతో ఊపిరితిత్తులు, ఇతర శ్వాసకోశ వ్యాధులతో నగరవాసులు సతమతమవుతున్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ప్రమాణాల ప్రకారం ఘనపు మీటరు గాలిలో సూక్ష్మ ధూళికణాల మోతాదు 15 మైక్రోగ్రాములకు మించరాదు. కానీ మహానగరంలో ఘనపు మీటరు గాలిలో 2016లో 40, 2017లో 49, 2018 జూన్ నాటికి 52 మైక్రోగ్రాముల మేర నమోదవడం గమనార్హం. ఈ సూక్ష్మ ధూళికణాలు తీవ్ర శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతున్నట్లు వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ప్రధానంగా మోటారు వాహనాల నుంచి వెలువడుతున్న కాలుష్యంతోనే గాలిలో సూక్ష్మ ధూళికణాలు పెరుగుతున్నాయని ఈ నివేదిక స్పష్టం చేయడం గమనార్హం. కాలుష్యానికి కారణాలివే.. ♦ ప్రధానంగా మోటారు వాహనాల నుంచి వెలువడుతోన్న పొగ ద్వారా 50% సూక్ష్మ ధూళికణాలు గాలిలో చేరుతున్నాయని నివేదిక వెల్లడించింది. ♦ మరో 11 శాతం రహదారులపై ఎగిసిపడుతున్న దుమ్ము, ధూళి కారణం. ♦ చెత్తను బహిరంగంగా తగలబెడుతుండడంతో 7 శాతం సూక్ష్మ ధూళికణాలు వెలువడుతున్నాయి. ♦ పరిశ్రమల నుంచి వెలువడుతోన్న పొగ, ఇతర ఉద్గారాల కారణంగా మరో 33 శాతం ♦ గ్రేటర్ పరిధిలో సుమారు 50 లక్షలకు పైగా ఉన్న వాహనాలు విడుదల చేస్తున్న పొగ, రహదారులపై రేగుతున్న దుమ్ము. ♦ శివారు ప్రాంతాల్లో నిర్మాణ సంబంధ కార్యకలాపాలు పెరగడంతో, గాలిలో సూక్ష్మ ధూళికణాలు పెరిగి, సమీప ప్రాంత వాసుల ఊపిరితిత్తుల్లోకి చేరుతున్నాయి. ♦ బాలానగర్, ఉప్పల్, జూబ్లీహిల్స్, చార్మినార్, ప్యారడైజ్, జూపార్క్, పంజగుట్ట, కూకట్పల్లి, చిక్కడపల్లి, ఎంజీబీఎస్ ప్రాంతాల్లో వాయుకాలుష్యం శృతిమించుతున్నట్లు తేలింది. ♦ ఆయా కూడళ్లలో ఏడాదికి సగం రోజులు అంటే 183 రోజులపాటు కాలుష్య మేఘాలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు వెల్లడైంది. ♦ బాలానగర్, ఉప్పల్ ప్రాంతాల్లో ఏడాదికి 200 రోజులకు పైగా కాలుష్య ఉధృతి ఉన్నట్లు తేలింది. ♦ గ్రేటర్ పరిధిలోని 50 లక్షల వాహనాల్లో ఏటా సుమారు 109.5 కోట్ల లీటర్ల పెట్రోలు, 120.45 కోట్ల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తుండడంతో పొగ తీవ్రత ఏటేటా పెరుగుతూనే ఉంది. ♦ గ్రేటర్ పరిధిలో పదిహేనేళ్లకు పైబడిన కాలం చెల్లిన వాహనాలు 10 లక్షల వరకు ఉన్నాయి. ఇవన్నీ రోడ్లను ముంచెత్తుతుండడంతో పొగ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ♦ వాహనాల సంఖ్య లక్షలు దాటినా, గ్రేటర్లో 10 వేల కిలోమీటర్ల రహదారులే అందుబాటులో ఉన్నాయి. దీంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ పెరిగి సగటు వాహన వేగం గంటకు 12 కి.మీ.కి పడిపోతుంది. ఇదే తరుణంలో ఇంధన వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. ♦ వాహనాల నుంచి వెలువడుతున్న పొగ నుంచి కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్‌డయాక్సైడ్, అమ్మోనియా, బెంజీన్, టోలిన్, ఆర్‌ఎస్‌పీఎం (ధూళిరేణువులు) వంటి కాలుష్య ఉద్గారాలు వాతావరణంలోకి విడుదలవుతున్నాయి. ధూళి కాలుష్యంతో అనర్థాలివే.. ♦ పీఎం10, పీఎం 2.5, ఆర్‌ఎస్‌పీఎం సూక్ష్మ ధూళి రేణువులు పీల్చే గాలిద్వారా నేరుగా ఊపిరితిత్తుల్లో చేరి శ్వాసకోశవ్యాధులు, పొడిదగ్గు, బ్రాంకైటిస్‌కు కారణమవుతున్నాయి. ♦ చికాకు, అసహనం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది. ♦ తలనొప్పి, పార్శ్వపు నొప్పి కలుగుతుంది. ♦ ధూళి కాలుష్య మోతాదు పెరుగుతుంటే ఊపిరితిత్తుల కేన్సర్లు పెరిగే ప్రమాదం ఉంది. ♦ ముఖానికి, ముక్కుకు మాస్క్‌లు, కళ్ల రక్షణకు అద్దాలు ఉపయోగించడం ద్వారా ఆర్‌ఎస్‌పీఎం వల్ల కలిగే దుష్ప్రభావాలను కొంతమేర నివారించే అవకాశాలుంటాయని వైద్యులు చెబుతున్నారు. -
పెట్రోల్ బంకులపై కొరడా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అక్రమాలు, అవకతవకలకు పాల్పడుతున్న పెట్రోల్ బంకులపై తూనికలు కొలతల శాఖ కొరడా ఝుళిపించింది. పెట్రోల్ బంకుల మోసాలపై కొద్దీకాలంగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు జరిపారు. దాదాపు 70 బంకుల్లో తనిఖీలు చేయగా..నిబంధనలు ఉల్లంఘించిన 15 బంకులపై కేసులు నమోదు చేశారు. ఇందులో 12 బంకుల్లో డీజిల్ తక్కువగా పోస్తుండటం తోనూ , లైసెన్స్ రెన్యువల్ చేసుకోని మరో 3 బంకులపై కేసులు నమోదు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్ దగ్గర ఉన్న ఐడీపీఎల్ ఫార్చ్యూన్ ఫ్యుయల్ హెచ్పీసీ పెట్రోల్ బంకులో అసిస్టెంట్ కంట్రోలర్ జగన్మోహన్ ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. ఇందులో 5 లీటర్ల డీజిల్‌కు 300 ఎంఎల్ తక్కువగా పోస్తున్నారని గుర్తించి కేసు నమోదు చేశారు. పెట్రోల్ బంకుల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. -
స్వచ్ఛ ర్యాంకింగ్‌లో గ్రేటర్‌కు 27వ స్థానం
సాక్షి, సిటీబ్యూరో: స్వచ్ఛ సర్వేక్షణ్–2018లో హైదరాబాద్ 27వ ర్యాంక్‌లో నిలిచింది. లక్ష జనాభాపైబడిన నగరాల్లో గ్రేటర్‌కు ఈ ర్యాంకు ప్రకటించారు. గతేడాది జనాభాతో సంబంధం లేకుండా 434 నగరాల్లో హైదరాబాద్ 22వ స్థానంలో నిలవగా, ఈసారి లక్ష జనాభా మించిన 500 నగరాలతో పోటీపడి 27వ స్థానంలో నిలిచింది. గతం కంటే ఈసారి మరింత ఉన్నత ర్యాంక్‌ను సాధించేందుకు ఎంతో కృషి చేసి, దేశంలోనే ఘనవ్యర్థాల నిర్వహణలో ఉత్తమ రాజధానిగా అగ్రస్థానంలో నిలిచిన హైదరాబాద్.. స్వచ్ఛ ర్యాంకింగ్ల్లో మాత్రం పడిపోయింది. అయితే ఇతర మెట్రో నగరాలైన బెంగళూరు, కోల్కత్తా, చెన్నై కంటే ముందంజలోనే ఉండడం గమనార్హం. గత సంవత్సరం 29వ స్థానంలో నిలిచిన గ్రేటర్ ముంబై ఈసారి 18వ స్థానంలో నిలిచి, హైదరాబాద్ కంటే ముందుంది. తెలంగాణలోని ఇతర కార్పొరేషన్లు, మునిసిపాలిటీల కంటే జీహెచ్ఎంసీ ముందంజలో నిలిచింది. గతంలో చిన్న పట్టణాలు, పెద్ద నగరాలు అన్నింటికీ కలిపి స్వచ్ఛ ర్యాంకులు ప్రకటించగా, ఈసారి లక్ష జనాభా మించిన నగరాలకు ప్రత్యేకంగా ర్యాంకులు ప్రకటించింది. స్వచ్ఛ కార్యక్రమాల అమలులో జీహెచ్ఎంసీ ముందున్నా.. ప్రజల ఫీడ్‌బ్యాక్‌లో మార్కులు తగ్గినందున ఓవరాల్ ర్యాంక్ తగ్గింది. దీంతో ఈ సంవత్సరం ప్రజలను మరింత ఎక్కువగా భాగస్వాములను చేసేందుకు జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ప్రజాస్పందన తగ్గినందునే.. ప్రస్తుత 2018 స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మొత్తం మూడు విభాగాలకు కలిపి 4,000 మార్కులకు నిర్వహించిన సర్వేలో జీహెచ్ఎంసీకి 3,083 మార్కులు వచ్చాయి. వీటిలో సేవల ప్రగతికి 1400 మార్కులకు 973 లభించగా, స్వచ్ఛతకు నగరవాసుల స్పందనకు కేటాయించిన 1400 మార్కుల్లో 942 మాత్రమే వచ్చాయి. స్వచ్ఛ భారత్ మిషన్ ప్రతినిధులు స్వచ్ఛ కార్యక్రమాలపై నేరుగా జరిపిన క్షేత్రస్థాయి పరిశీలనలో 1200 మార్కులకు 1177 వచ్చాయి. 2016లో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగరానికి 2000 మార్కుల్లో 1355 (67.70శాతం), 2017లో 1605 (80శాతం) మార్కులు, ప్రస్తుత 2018లో 4000 మార్కులకు 3,083 మార్కులు (77శాతం) లభించాయి. రాష్ట్రంలోని ఇతర కార్పొరేషన్ల ర్యాంకులు.. గ్రేటర్ హైదరాబాద్‌కు 27వ స్థానం అనంతరం వరంగల్ కార్పొరేషన్‌కు 31వ స్థానం, సూర్యాపేట మున్సిపాలిటీ 45వ స్థానం, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 73 స్థానంలోను నిలిచాయి. ఇప్పటి దాకా జరిగిన స్వచ్ఛ ర్యాంకింగ్‌లో పాల్గొన్న పట్టణాలు, గ్రేటర్ ర్యాంకు ఇలా.. సంవత్సరం పట్టణాలు జీహెచ్ఎంసీ 2015 476 275 2016 73 19 2017 434 22 2018 500 27 ఈసారి మొత్తం 4041 నగరాలో స్వచ్ఛ ర్యాంకింగ్‌లో పాల్గొనగా, లక్ష జనాభా దాటిన నగరాలకు ప్రత్యేకంగా ర్యాంకులు ఇచ్చారు. దేశంలోని వివిధ కార్పొరేషన్ల ర్యాంకుల తీరిదీ.. నగరం 2017 2018 హైదరాబాద్ 22 27 గ్రేటర్ ముంబై 29 18 బెంగళూర్ 210 216 చెన్నై 235 100 ప్రజల భాగస్వామ్యం పెంచుతాం స్వచ్ఛ కార్యక్రమాల అమల్లో మంచి మార్కులే వచ్చినప్పటికీ, కేవలం ప్రజా స్పందన మార్కులే తగ్గాయి. ఈ అనుభవంతో ఈ ఏడాది వారి భాగస్వామ్యం పెంచుతాం. గతేడాది ఐదు లక్షల మంది విద్యార్థులతో చైతన్య కార్యక్రమాలు నిర్వహించగా, ఈసారి పది లక్షల మందికి అవగాహన కల్పిస్తాం. అలాగే నగరంలోని నాలుగున్నర లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలను కూడా భాగస్వాములను చేస్తాం. ఈ సంవత్సరం స్వచ్ఛ కార్యక్రమాలను జూన్ 5న పర్యావరణ దినోత్సవంనాడే ప్రారంభించాం. ఇందులో భాగంగా కాలనీలతో పాటు పాఠశాలలు, కార్యాలయాలు, హోటళ్లు, ఫంక్షన్ హాళ్లకు కూడా స్వచ్ఛ ర్యాంకింగ్ ఇవ్వాలని నిర్ణయించాం. – డా.బి.జనార్దన్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ -
రేసు గుర్రాలెక్కడ?
సాక్షి,సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) గెలుపు గుర్రాలతో ఎన్నికల రణంలోకి దిగే వ్యూహానికి తెర లేపింది. మాజీ మంత్రి దానం నాగేందర్‌తో పాటు నగరంలో సగం నియోజకవర్గాలను కొత్త నేతలతో నింపే దిశగా పావులు కదుపుతోంది. గడిచిన సాధారణ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో మల్కాజిగిరి, సికింద్రాబాద్, పటాన్చెరు శాసనసభ స్థానాలనే గెలుచుకున్న టీఆర్ఎస్.. తదనంతరం టీడీపీ ఎమ్మెల్యేలందరినీ పార్టీలో చేర్చుకొని ఆయా నియోకజవర్గాల్లో బలపడే ప్రయత్నం చేస్తోంది. వచ్చే సాధారణ ఎన్నికలను ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ పక్షాన ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజిగిరి, ముషీరాబాద్, ఖైరతాబాద్, గోషామహల్, నాంపల్లి, కార్వాన్, మలక్‌పేట తదితర నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు బలమైన నాయకులు కనిపించడం లేదు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో బలమైన నేతల కోసం వేట ప్రారంభించిన టీఆర్ఎస్.. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ నాయకులను తమ వైపు తిప్పుకునే ప్రణాళికను సిద్ధం చేసింది. దీంతో గత మూడేళ్లుగా టీఆర్ఎస్లో చేరే ప్రయత్నాలు చేస్తున్న దానం నాగేందర్‌కు ఎట్టకేలకు ‘గ్రీన్ సిగ్నల్’ ఇవ్వడంతో పాటు మిగిలిన నియోజకవర్గాల్లోనూ ‘ఆపరేషన్ ఆకర్‡్ష’ను అమలు చేయాలని భావిస్తోంది. ముఖ్యంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని చేర్చుకునే అంశాన్ని సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. సుధీర్‌రెడ్డి సైతం గడిచిన కొన్నాళ్లుగా నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు సైతం దూరంగానే ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా సుధీర్‌రెడ్డి సేవలను విస్తృత స్థాయిలో వాడుకునే విషయంలో ఫెయిలైందన్న భావన కూడా పార్టీ క్యాడర్లో వ్యక్తమవుతోంది. పార్టీ మారే విషయంలో సుధీర్‌రెడ్డి ఇప్పటికిప్పుడు నిర్ణయాన్ని ప్రకటించకుండా మరికొంత సమయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా ఉప్పల్ నియోజకవర్గంలోనూ టీఆర్ఎస్కు బలమైన నాయకుల కొరత తీవ్రంగా ఉంది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండారి లక్ష్మారెడ్డి అధికార టీఆర్ఎస్, బీజేపీ నాయకుల కంటే విస్తృత కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ఇక్కడ కూడా అధికార పార్టీ బలమైన నాయకుడి కోసం పావులు కదిపే యోచనలో ఉంది. మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించిన ఎమ్మెల్యే కనకారెడ్డి సైతం వివిధ కారణాలతో క్యాడర్‌కు, జనానికి దూరంగా ఉండడం.. ఈ నియోకజవర్గంలో ఎమ్మెల్సీ హన్మంతరావు హడావుడి పెరగడం వల్ల మధ్యే మార్గంగా ప్రముఖ విద్యా సంస్థలకు అధిపతిగా ఉన్న ఓ యువ నాయకుడిని ఇక్కడి నుంచి పోటీకి దింపాలన్న చర్చ టీఆర్ఎస్లో సాగుతోంది. ఇక గోషామహల్, అంబర్‌పేట, ముషీరాబాద్‌లలో బీజేపీ ఎమ్మెల్యేలకు దీటుగా పనిచేసే నాయకులు కూడా ప్రస్తుతానికి టీఆర్ఎస్లో కనిపించడం లేదు. దీంతో ఈ మూడు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీ నేతలకు గాలం వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. హైదరాబాద్ లోక్‌సభ పరిధిలోని మలక్‌పేట, కార్వాన్, చంద్రాయణగుట్ట, బహుదూర్‌పురా, యాకుత్‌పురాలో బలమైన నేతల కోసం వేట సాగుతోంది. ఆ ఎమ్మెల్యేలకు ప్రత్యామ్నాయంగా.. టీడీపీ తరఫున విజయం సాధించి టీఆర్ఎస్లో చేరిన కూకట్పల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, జూబ్లిహిల్స్, కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్ తదితర నియోజకవర్గాల్లోనూ అవసరమైతే ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ఎంచుకునే ఛాన్స్ ఉండాలని పార్టీ ముఖ్య నాయకులు భావిస్తున్నట్లు సమాచారం. సీఎం నిర్వహించిన అంతర్గత సర్వేల్లో ఆశించిన స్థాయిలో మార్కులు పొందలేని ఎమ్మెల్యేల స్థానే వారు సూచించిన కొత్త అభ్యర్థులను ప్రతిపాదించే అవకాశం ఉందని పార్టీ ముఖ్య నేతలు పేర్కొంటున్నారు. -
హైదరాబాద్‌లో హైటెక్ బస్‌స్టాపులు
సాక్షి, హైదరాబాద్ : ఎయిర్కండీషనింగ్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, ఏటీఎం, కాఫీ మిషన్లు, వైఫై, సీసీ టీవీ, టాయిలెట్లు ఇవన్నీ ఇప్పటిదాక మనం ఎయిర్‌పోర్టులో లేదా మెట్రో స్టేషన్లలోనే చూసేవాళ్లం. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ బస్‌స్టాపుల్లో కూడా ఈ సౌకర్యాలన్నీ అందుబాటులోకి వస్తున్నాయి. విశ్వనగరంగా రూపొందుతున్న గ్రేటర్ హైదరాబాద్‌లో అత్యాధునిక హంగులతో బస్‌స్టాపులను(బస్షెల్టర్లను) ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఈ మేరకు ప్రయాణికులకు అత్యంత మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఏసీ, వైఫై, ఏటీఎం, సీసీ టీవీ, మొబైల్ చార్జింగ్, టాయిలెట్లు ఉండేలా ఆధునిక బస్షెల్టర్లను ఏర్పాటు చేస్తోంది. పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేసిన ఏసీ బస్‌షెల్టర్‌ను శిల్పారామం వద్ద రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు. ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ ఆఫీసు దగ్గర, కూకట్‌పల్లికి దగ్గరిలో కేపీహెచ్‌బీ వద్ద మరో రెండు ఆధునిక లేదా గ్రేడ్ 1 బస్షెల్టర్లు తుది దశలో ఉన్నాయి. వీటిని కూడా త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 826 ఆధునిక బస్షెల్టర్లను నాలుగు ప్యాకేజీలలో జీహెచ్ఎంసీ నిర్మిస్తోంది. వీటిలో మొదటి గ్రేడ్‌లో అడ్వాన్స్డ్ ఏసీ బస్షెల్టర్లను నిర్మిస్తున్నారు. కేవలం పాశ్చాత్య దేశాల్లోని ప్రముఖ నగరాల్లో మాత్రమే ఈ విధమైన బస్షెల్టర్లు అందుబాటులో ఉన్నాయి. గ్రేడ్-2 బస్షెల్టర్లలో డస్ట్బిన్లు, టాయిలెట్లు, మొబైల్ చార్జింగ్ పాయింట్లు, తాగునీటి సౌకర్యం, వైఫై, ఫ్యాన్లు, టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. గ్రేడ్-3 బస్‌షెల్టర్‌లో డస్ట్‌బిన్, మొబైల్ చార్జింగ్ పాయింట్, టాయిలెట్స్, తాగునీటి సౌకర్యం ఉండనుంది. గ్రేడ్-4లో కేవలం బస్షెల్టర్తో పాటు డస్ట్బిన్లే ఉంటాయి. మొత్తం నాలుగు ప్యాకేజీలుగా 826 బస్షెల్టర్లను విభజించి టెండర్ ద్వారా వివిధ ఏజెన్సీలకు అప్పగించారు. అత్యాధునిక బస్షెల్టర్లతో ఏర్పాటు చేయడం వల్ల హైదరాబాద్ నగరం ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లో మాదిరిగా నగరవాసులకు మెరుగైన సౌకర్యం ఏర్పడుతుందని నగర మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. -
ఆ ఐదు.. డేంజర్ !
మహానగరం వాయు కాలుష్య కోరల్లో చిక్కుకుంది.గ్రేటర్లో 150 డివిజన్లు ఉండగా... ఒకే ఒక్క డివిజన్ బంజారాహిల్స్‌లో మాత్రమే మెరుగైన వాయు నాణ్యత ఉంది. ఈ డివిజన్ అసలే వాయు కాలుష్యం (డార్క్‌గ్రీన్) లేకుండా, పచ్చదనంతో కళకళలాడుతోంది. ఇక ఐదు డివిజన్లు అత్యంత వాయు కాలుష్యం (రెడ్ కేటగిరీ), 65 డివిజన్లు తీవ్ర వాయు కాలుష్యం (ఆరెంజ్ కేటగిరీ), 60 డివిజన్లు మోస్తరు వాయు కాలుష్యం (ఎల్లో కేటగిరీ), 19 డివిజన్లు తక్కువ వాయు కాలుష్యం (లైట్ గ్రీన్)లోకొట్టుమిట్టాడుతున్నాయి. నగరంలో పట్టణ పరిపాలనపై అధ్యయనం చేస్తున్న ‘లఖీర్’ సంస్థ తాజా అధ్యయనంలో ఈ మేరకు వెల్లడైంది. సాక్షి, సిటీబ్యూరో : బేగంపేట్, మోండా మార్కెట్, కేపీహెచ్‌బీ కాలనీ, జీడిమెట్ల, ఈస్ట్ ఆనంద్‌బాగ్ డివిజన్లు అత్యంత కాలుష్య కాసారంగా మారినట్లు ఈ సర్వే పేర్కొంది. బేగంపేట్, మోండా మార్కెట్లలో ట్రాఫిక్ రద్దీ కారణంగా వాహనాల నుంచి వెలువడే కాలుష్యం అధికంగా ఉందని తెలిపింది. ఇక జీడిమెట్ల, కేపీహెచ్‌బీ కాలనీ, ఈస్ట్ ఆనంద్‌బాగ్ ప్రాంతాల్లో పరిశ్రమల నుంచి వెలువడుతున్న ఉద్గారాలతో వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్నట్లు వెల్లడించింది. అయితే ఢిల్లీ, చెన్నై, బెంగళూర్ నగరాలతో పోలిస్తే గ్రేటర్లో వాయు కాలుష్యం తీవ్రత తక్కువేనని ఈ అధ్యయనం తెలిపింది. ఇక వాయు కాలుష్య తీవ్రత అసలే లేని డివిజన్లలో బంజారాహిల్స్‌అగ్రభాగాన నిలవడం విశేషం. హరిత వాతావరణం, పార్కులు అధికంగా ఉన్న డివిజన్లలో పీల్చే గాలి నాణ్యత (ఎయిర్ క్వాలిటీ) మెరుగ్గా ఉన్నట్లు ఇది పేర్కొంది. ప్రధానంగా కేబీఆర్ పార్క్‌తో బంజారాహిల్స్ డివిజన్లో వాయుకాలుష్యం గణనీయంగా తగ్గిందంది. గచ్చిబౌలి, తార్నాక తదితర ప్రాంతాల్లోనూ వాయు కాలుష్య తీవ్రత తగ్గడానికి ప్రధాన కారణం.. అక్కడ హరిత వాతావరణం అధికంగా ఉండడమేనంది. పీసీబీ ప్రేక్షకపాత్ర... పీసీబీ నగరంలో నాలుగు చోట్ల నిరంతరం వాయుకాలుష్య ఉద్గారాలను లెక్కించే అధునాతన వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతాల్లో మాత్రమే నిరంతరాయంగా ఆన్లైన్లో వాయు కాలుష్య నాణ్యతను లెక్కిస్తోంది. మరో 21 చోట్ల వాయు కాలుష్యాన్ని సంప్రదాయ పద్ధతుల్లో లెక్కిస్తోంది. అత్యంత కాలుష్యం, మోస్తరు కాలుష్యం ఉన్న ప్రాంతాలను గుర్తించి మ్యాపింగ్ చేయడం.. ప్రజలను అప్రమత్తం చేసే విషయంలో పీసీబీ (కాలుష్య నియంత్రణ మండలి) ప్రేక్షకపాత్రకే పరిమితమవుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొబైల్ యాప్ ఏదీ? నగరంలో దుమ్ము, ధూళితో పాటు వాయు కాలుష్యం ముక్కుపుటాలను అదరగొడుతోంది. కాలుష్య మేఘాలు సిటీజనుల ఊపిరితిత్తులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సిటీలోని వివిధ ప్రాంతాల్లో రోజువారీగా నమోదవుతున్న కాలుష్యం వివరాలను ప్రతి ఒక్కరూ తెలుసుకునేందుకు మొబైల్ యాప్ విడుదల చేస్తామని పీసీబీ ఏడాది క్రితం ఆర్భాటంగా ప్రకటించింది. కానీ ఇప్పటివరకు ఈ విషయంలో పురోగతి లేదు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వాయుకాలుష్యం అవధులు దాటడంతో నగరవాసులకు స్వచ్ఛమైన గాలి కరువైంది. నగరంలో వాహనాల సంఖ్య 50 లక్షలకు చేరువైంది. ఇందులో కాలం చెల్లిన వాహనాలు సుమారు 15 లక్షలు. వీటి నుంచి వెలువడుతోన్న పొగలో ప్రమాదకర వాయువులున్నాయి. మరోవైపు పరిశ్రమలు వెదజల్లుతోన్న వాయు కాలుష్యంతో సిటీజనులకు స్వచ్ఛమైన ప్రాణవాయువు దూరమవుతోంది. సమాచారలేమి... హెచ్‌సీయూ, సనత్‌నగర్, పాశమైలారం, జూపార్క్ ప్రాంతాల్లో ‘కంటిన్యూయస్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ’ అధునాతన యంత్రాలతో పీసీబీ నిరంతరం వాయుకాలుష్యం నమోదు చేస్తోంది. ఈ యంత్రాలతో గాలిలోని కార్బన్‌డైయాక్సైడ్, కార్బన్‌మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, బెంజిన్, టోలిన్ లాంటి కాలుష్య కారకాల మోతాదును నిత్యం లెక్కిస్తోంది. మరో 21 నివాస, వాణిజ్య,పారిశ్రామిక ప్రాంతాల్లో డస్ట్ శాంప్లర్ లాంటి యంత్రాలతో దుమ్ము, ధూళి ఇతర కాలుష్యాలను లెక్కగడుతోంది. కానీ ఈ సమాచారాన్ని సిటీజనులు తెలుసుకోవాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలోనే మొబైల్ యాప్ రూపొందించాలన్న అంశం తెరమీదకు వచ్చింది. పీసీబీ లెక్కగడుతోన్న కాలుష్య మోతాదులను అన్ని వర్గాల ప్రజలు తెలుసుకోవడం ద్వారా తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. ఇందుకు మొబైల్ యాప్ ఒక్కటే ఏకైక పరిష్కారం. కానీ ఈ విషయంలో పీసీబీ నిర్లక్ష్యం సిటీజనులకు శాపంగా మారింది. -
వైఫై వర్రీ!
గ్రేటర్లో ఉచిత వైఫై సేవలు అలంకారప్రాయంగా మారాయి. బీఎస్ఎన్ఎల్– క్వాడ్జెన్ సంస్థలు సంయుక్తంగా మహానగరంలో 86 చోట్ల ఏర్పాటు చేసిన ఫ్రీ వై–ఫై హాట్‌స్పాట్స్‌లో 16 మినహా ఎక్కడా తొలి 15 నిమిషాలు ఉచిత డేటా వినియోగం(యాక్సెస్) అమలు కావడం లేదు. దాదాపు 70 హాట్‌స్పాట్స్ వద్ద ఉచిత వైఫై సేవలు అందడం లేదని ‘సాక్షి’ బృందం క్షేత్రస్థాయి పరిశీలనలో తేలడం గమనార్హం. మార్చి నెలలో వై–ఫై హాట్‌స్పాట్స్ వద్ద 16,941 మంది మాత్రమే 1798.85 జీబీ డేటా వినియోగించుకున్నట్లు వెల్లడైంది. సాక్షి, సిటీబ్యూరో: ఆన్లైన్లో నిర్ణీత డేటా వినియోగానికి సంబంధించి రీఛార్జీ చేసుకున్నవారికి మాత్రం నిరంతరాయంగా వై–ఫై సేవలు అందుబాటులోకి వస్తుండడం గమనార్హం. ఇక ఉచిత వై–ఫై వినియోగంలో నగరంలోని చారిత్రక, దర్శనీయ స్థలాలు అగ్రభాగాన నిలిచాయి. ప్రధానంగా చార్మినార్, ట్యాంక్‌బండ్, జూపార్క్, గోల్కొండ ఫోర్ట్, సాలార్జంగ్ మ్యూజియంలు తొలి ఐదు స్థానాలు దక్కించుకోవడం విశేషం. సిగ్నల్ వీక్..ఉచితం అంతంతే.. గ్రేటర్ పరిధిలో బీఎస్ఎన్ఎల్–క్వాడ్జెన్ సంస్థలు సంయుక్తంగా 86 చోట్ల వై–ఫై హాట్‌స్పాట్స్‌ను ఏడాది క్రితం ఏర్పాటుచేశాయి. వీటి వద్ద ఏకకాలంలో 300 మంది డేటాను వినియోగించుకునేందుకు వీలుగా 194 యాక్సెస్ పాయింట్లు ఏర్పాటుచేశారు. తొలుత 15 నిమిషాలు ఉచితంగా అందుతాయని ఆర్భాటంగా ప్రకటించారు. కానీ 16 చోట్ల మినహా దాదాపు 70 హాట్‌స్పాట్స్ వద్ద ఈ పరిస్థితి లేదని ‘సాక్షి’ బృందం క్షేత్రస్థాయి పరిశీలనలో తేలడం గమనార్హం. ప్రధానంగా ఎంజీబీఎస్, జేబీఎస్, నెక్లెస్‌రోడ్ వంటి అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఉచిత వై–ఫై సేవలకు వీక్సిగ్నల్ ప్రతిబంధకంగా మారింది. ఆన్లైన్లో నిర్ణీత డేటా వినియోగానికి సంబంధించి రీఛార్జీ చేసుకున్నవారికే సేవలు అందుతుండడం గమనార్హం. మార్చి నెలలో మొత్తం 86 వై–ఫై హాట్‌స్పాట్స్ వద్ద 16,941 మంది మాత్రమే 1798.85 గిగాబైట్ల డేటా వినియోగించుకున్నట్లు తాజా గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. వై–ఫై వినియోగంలో సమస్యలివీ.. ఉచిత ౖÐð ఫైఫై సేవల వినియోగం విషయంలో పలు మార్లు సమస్యలు ఎదురవుతున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. ఒకేసారి వందలాదిమంది వినియోగదారులు వైఫై సేవలు పొందేందుకు ప్రయత్నిస్తే వారికి నిరాశే ఎదురవుతోంది. స్పీడ్ తగ్గుతోందని,ఒక్కోసారి వై.ఫై కనెక్ట్కావడం లేదని నక్లెస్రోడ్పై వైఫై సేవలు వినియోగిస్తున్న పలువురు వినియోగదారులు ‘సాక్షి’కి తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగినపుడు సేవలు పొందడం వీలుపడడంలేదని చెబుతున్నారు. హాట్‌స్పాట్ పరికరాల సామర్థ్యాన్ని పెంచాలని కోరుతున్నారు. విస్తరణ ఆలస్యమేనా..? గ్రేటర్ పరిధిలో మరో 240 ప్రాంతాల్లో వై–ఫై హాట్స్పాట్లను ఏర్పాటుచేయాలని బీఎస్ఎన్ఎల్ నిర్ణయించింది. కానీ వీటి ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం నుంచి మూడునెలలుగా అనుమతులు ఆలస్యమౌతుండడం,హాట్స్పాట్ల ఏర్పాటు,వాణిజ్య ప్రకటనలు, ఉచిత విద్యుత్ కనెక్షన్,రోడ్‌కటింగ్ అనుమతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండడంతో ఈ పనులు ఆలస్యమౌతున్నట్లు తెలిసింది. ప్రభుత్వపరమైన సహకారం అందితే మరో మూడునెలల్లోగా అనుకున్న ప్రకారం మరో 240 హాట్‌స్పాట్ పరికరాలను ఏర్పాటు చేస్తామని బీఎస్ఎన్ఎల్ సంస్థ చెబుతోంది. ఒక్కోచోట హాట్‌స్పాట్ ఏర్పాటుకు సుమారు లక్ష రూపాయలు అవసరమౌతాయని పేర్కొంది.నగరంలో తమ సంస్థకు 4500 కి.మీ మేర ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అందుబాటులో ఉందని ప్రకటించింది. వినోదం, సినిమాలకే అధికప్రాధాన్యం.. ఇక వైఫై వినియోగానికి వస్తే చాలామంది వినియోగదారులు సినిమాలు,పాటలు వీక్షించేందుకు యూట్యూబ్ లాంటి సైట్లను ఆశ్రయిస్తున్నారట..మరికొంతమంది వివిధ బస్సు,రైళ్ల వేళలు,రిజర్వేషన్ల వివరాలను తెలుసుకుంటున్నారట. ఇలా వినియోగించుకోవాలి... ♦ మీ స్మార్ట్‌ఫోన్‌లో వైఫై ఆప్షన్‌పై క్లిక్‌చేసి మీ మొబైల్నెంబరును,ఈమెయిల్ అడ్రస్ టైప్‌చేసి సబ్మిట్చేయాలి. ♦ ఆతరవాత మీ మొబైల్‌కు యూజర్‌నేమ్,పాస్వర్డ్ ఎస్ఎంఎస్ రూపంలో అందుతాయి. ♦ రెండో బాక్సులో యూజర్‌నేమ్,పాస్వర్డ్ టైప్‌చేసి లాగిన్ కావాలి. అపుడు 15 నిమిషాలు ఉచిత వైఫై సేవలు అందుతాయి. ♦ ఆతరవాత వైఫై సేవలను వినియోగిచేందుకు ప్రతి అరగంటకు రూ.30 ఛార్జీ అవుతుంది. ఈ మొత్తాన్ని ఆన్లైన్లో చెల్లించవచ్చు. లేదా హాట్స్పాట్లున్నచోట బీఎస్ఎన్ఎల్ కూపన్లను కొనుగోలు చేయవచ్చు. బీఎస్ఎన్ఎల్ హాట్‌స్పాట్స్ ఏర్పాటుచేసిన ప్రాంతాలు కొన్ని.. ♦ సంజీవయ్యపార్క్,బిర్లామందిర్, బిర్లాప్లా నిటోరియం,బిర్లా సైన్స్ మ్యూజియం,నిమ్స్,పబ్లిక్‌గార్డెన్,చార్మినార్,గాంధీఆస్పత్రి,తారామతిబారాదరి,ప్లాజాహోటల్,సరూర్‌నగర్,ప్యాట్నీ,సీఎస్సీ తార్నాక,సీఎస్సీ గౌలీగూడా,కెపిహెచ్బి,లింగంపల్లి,జూబ్లీహిల్స్,కుషాయిగూడా,నాంపల్లి,అమీర్‌పేట్,మాదాపూర్,టోలిచౌకి,మేడ్చల్,పంజాగుట్ట,బీఎస్ఎన్ఎల్భవన్,సీటీఓ,ఎర్రగడ్డ,ఆబిడ్స్,తిరుమలగిరి,కొంపల్లి,ముషీరాబాద్, ♦ సాలార్జంగ్ మ్యూజియం, జూపార్క్, గోల్కొండఫోర్ట్, ప్రెస్‌క్లబ్,నానక్‌రాంగూడ. -
ఐటీ బేజార్..!
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ), బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్(బీపీవో), నాలెడ్జ్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్(కేపీవో) రంగాలకు కొంగుబంగారంగా నిలిచిన హైదరాబాద్ మహానగరంలో ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఉద్యోగాల కల్పనలో ఐటీ రంగం వెనుకబడింది. తాజాగా ఐటీ రంగంలో వృద్ధిరేటు మైనస్ 6 శాతంగా నమోదైనట్లు నౌకరి డాట్‌కామ్ తాజా సర్వేలో వెల్లడైంది. ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య కాలంలో వివిధ రంగాల్లో ఉద్యోగాల కల్పన ట్రెండ్‌పై జరిపిన అధ్యయనానికి సంబంధించిన వివరాలను నౌకరీ డాట్‌కామ్ ఇటీవల వెల్లడించింది. గ్రేటర్లో తగ్గుతున్న ఐటీ కొలువులు.. బహుళ జాతి, దేశీయ దిగ్గజ సంస్థలకు చెందిన సుమారు వెయ్యి సాఫ్ట్వేర్ కంపెనీల బ్రాంచీలు గ్రేటర్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఆయా కంపెనీల్లో సుమారు 6 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. అయితే కంపెనీల విస్తరణ ప్రణాళికలు ఏటా ఆశించిన మేరకు అమలు కాకపోవడం.. కొత్త ప్రాజెక్టులు చేజిక్కకపోవడం.. అంతర్జాతీయంగా మార్కెట్ ఆశించిన స్థాయిలో లేకపోవడం తదితర కారణాలతో కొలువుల్లో మందగమనం నమోదైనట్లు ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో గ్రేటర్ పరిధిలో నిర్మించ తలపెట్టిన ఐటీఐఆర్ ప్రాజెక్టు నాలుగేళ్లుగా సాకారం కాకపోవడం.. దీనికి కేంద్రం తాజా బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం కూడా ఐటీ రంగం వృద్ధికి ప్రతిబంధకంగా మారిందని అంటున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఐటీ, హార్డ్‌వేర్ పాలసీ, టీఎస్ఐపాస్ రాకతో ఐటీ రంగంతోపాటు పారిశ్రామిక రంగాలు ఇప్పుడిప్పుడే పురోగమిస్తున్నాయని, త్వరలోనే ఆయా రంగాల్లో క్రమంగా వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. గ్రేటర్లో ఇతర రంగాల దూకుడు.. గ్రేటర్ పరిధిలో ఐటీ రంగంతో పోలిస్తే ఇన్సూరెన్స్ రంగంలో గణనీయమైన వృద్ధి నమోదైంది. బీమా రంగంలో 73 శాతం వృద్ధి నమోదవడం విశేషం. దేశ, విదేశాలకు చెందిన ఇన్సూరెన్స్ సంస్థలు నగరంలో వాహన, వ్యక్తిగత, ఆరోగ్య బీమా రంగంలో విభిన్న పాలసీలను ప్రవేశపెడుతున్నాయి. ఈ పాలసీలను వినియోగదారుల వద్దకు చేర్చేందుకు పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్కు శ్రీకారం చుట్టినట్లు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక ఆటోమొబైల్ రంగంలో 44 శాతం, నిర్మాణ రంగంలో 41 శాతం, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సెక్టార్లో 40 శాతం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమల్లో 34 శాతం, ఫార్మా రంగంలో 14 శాతం, బీపీవో రంగంలో 9 శాతం వృద్ధి నమోదైనట్లు నౌకరీ డాట్‌కామ్ సర్వేలో తేలింది. మెట్రో నగరాల్లో ఉద్యోగాల కల్పనలో వృద్ధి శాతం ఇలా.. నగరం ర్యాంకు వృద్ధి శాతం కోల్‌కతా 1 34 ఢిల్లీ 2 20 ముంబై 3 18 హైదరాబాద్ 4 06 బెంగళూరు 5 05 చెన్నై 5 05 పుణే 6 01 సేవా, పారిశ్రామిక రంగాల్లో గణనీయ వృద్ధి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌లో మెరుగైన స్థానం సాధించడంతో హైదరాబాద్‌లో పరిశ్రమల స్థాపనకు బీమా కంపెనీలతో పాటు తయారీ రంగ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. టీఎస్ఐపాస్, ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్, ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆయా రంగాల్లో వృద్ధిరేటు శరవేగంగా పెరుగుతోంది. – శ్రీనివాస్, ఫ్యాప్సీ అధ్యక్షుడు -
ఖాళీ స్థలాలు..ఇక బ్యూటీ స్పాట్స్!
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఖాళీ స్థలాలు ఇక బ్యూటీ స్పాట్లుగా మారనున్నాయి. ఇవి చెత్త డంప్‌లుగా మారకుండా సర్వాంగ సుందరంగా మార్చేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. ప్రభుత్వ, ప్రయివేటు ఖాళీ స్థలాల్లో సైతం చెత్తను వేయకుండా కట్టడి చేసేందుకు ఒక బృహృత్తర ప్రణాళిక రూపొందించింది. ముందుగా ప్రభుత్వ ఖాళీ స్థలాలను పరిరక్షించేందుకు వాటి చుట్టూ కీపాండ్ వాల్స్ నిర్మాణం చేపట్టి అందమైన పూల మొక్కలు, షో చెట్లు పెంచాలని నిర్ణయించింది. ఇందులో స్థానికుల సహాయ సహకారాలు, భాగస్వామ్యం ఉండేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనుంది. దీంతో విలువైన స్థలాలను పరిరక్షించడంతో పాటు వీటిని ఆట స్థలాలు, పార్కులుగా అభివృద్ధి చేసి ముందు తరాలకు అందించేందుకు వీలవుతుందని జీహెచ్ఎంసీ భావిస్తోంది. ఈమేరకు ఆయా స్థలాల సుందరీకరణపై నెలరోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించింది. సాక్షి, సిటీబ్యూరో: నగరంలో చాలా ప్రాంతాఆల్లో ఉన్న ఖాళీ స్థలాల్లో చెత్తను వేయడం ద్వారా అవి మురికి, చెత్త డంపింగ్ యార్డులుగా మారుతున్నాయి. ఫలితంగా దోమల ఉత్పత్తికి కేంద్రాలుగా రూపాంతరం చెందుతున్నాయి. ఈ ఖాళీ స్థలాలో వేసే డంపింగ్ పై నగర వాసుల నుంచి పెద్ద ఎత్తున జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు అందడం సర్వసాధారణంగా మారాయి. నేటి నుంచి సుందరీకరణ మాసం నగరంలోని ఖాళీ స్థలాల సుందరీకరణ కోసం ఒక నెల రోజులు ప్రత్యేకంగా కేటాయించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. అందులో భాగంగా ఈ నెల 12వ తేదీ నుండి ఏప్రిల్ 12వ తేదీ వరకు ఖాళీ స్థలాల సుందరీకరణ మాసంగా పాటించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి డిప్యూటి, జోనల్ కమిషనర్లను ఆదేశించారు. నగరంలోని తమ పరిధిలో ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించాలని, వాటిలో జీహెచ్ఎంసీకి చెందిన ఖాళీ స్థలాలు అయితే వెంటనే ప్రహారీ గోడలను తగు అనుమతితో నిర్మించి మొక్కలను నాటించడం, మంచి ప్లే గ్రౌండ్లుగా మార్చాలని ఆదేశించారు. ఖాళీ స్థలాలు ప్రైవేట్ వ్యక్తులకు చెందినవి అయితే ఆ స్థలం యజమానులను పొరుగువారితో కలిసి గుర్తించనున్నారు. ఆయా గుర్తించిన ఖాళీ స్థలాల్లో తిరిగి చెత్త వేయకుండా బోర్డులను ప్రదర్శిస్తారు. ఖాళీ స్థలాల ఇంటి యజమానులతో ప్రహరీ గోడలను నిర్మించే విధంగా చర్యలు చేపట్టి తిరిగి ఎవ్వరు కూడా చెత్తను వేయకుండా పొరుగు ఇంటి వారికి కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ప్రతి ఖాళీ స్థలాలను ఒక జవాను లేదా ఎస్.ఎఫ్.ఏ లేదా ఇతర కార్మికుడిని ఇన్చార్జిగా నియమిస్తారు. ఎవ్వరూ కూడా చెత్త వేయకుండా నిరోధిస్తారు. అదేవిధంగా ఖాళీ స్థలాల్లో చెత్త వేయడం వల్ల అధికంగా సమస్యలు ఎదుర్కొనే వారిని గుర్తించి వారిని స్వచ్ఛ రాయబారిగా నియమించనున్నారు. ఈ ఖాళీ స్థలాలు పార్కింగ్‌కు అనుకూలంగా ఉంటే పార్కింగ్ ఏర్పాటు చేయించేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఈ మేరకు కమిషనర్ డా.బి. జనార్దన్‌రెడ్డి డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీచేశారు. -
మహిళా మేలుకో!
విశ్వనగరంలోనూ భద్రత కరువే అన్ని రంగాల్లోనూ రెండో స్థానంలోనే మహిళలు ఆధునికత ఓ వైపు..అకృత్యాలు మరోవైపుఇంకా కొనసాగుతున్న వరకట్న వేధింపులు ఐటీ నుంచి అడ్డా కూలీ వరకు అంతటా వివక్షే.. వేతనాల్లోనూ భారీ వ్యత్యాసం యథేచ్ఛగా లింగనిర్ధారణ, భ్రూణ హత్యలు గృహ హింసపై ఏటా 14 వేల కేసులు నమోదు భరోసా ఇవ్వని కఠిన చట్టాలు హైదరాబాద్ అంతర్జాతీయ మహానగరంగా ఘనకీర్తిని అందుకుంది. మొత్తం ప్రపంచాన్నే తనవైపు తిప్పుకుంది. అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలను విశేషంగా ఆకర్షిస్తోంది. పారిశ్రామిక పెట్టుబడులకు స్వర్గధామంగా నిలిచింది. వందల ఏళ్ల క్రితమే నగరంలో మొదలైన మానవ ప్రస్థానం, వికసించిన నాగరికత హైదరాబాద్‌ను ఒక అద్భుతమైన ఆధునిక మహానగరంగా తీర్చిదిద్దాయి. అలాంటి నాగరిక నగరంలో మహిళల రక్షణ ఇప్పటికీ ప్రశ్నార్థకమే. అడుగడుగునా రాజ్యమేలుతున్న అభద్రత, ఆధిపత్యం, వేతనాల్లో భారీ వ్యత్యాసాలు, సమాన హోదా, సమాన హక్కులకు చోటులేని సామాజిక జీవనం సవాళ్లు విసురుతున్నాయి. విశ్వనగరం వైపు అడుగులు వేస్తున్నప్పటికీ అతివల అభ్యున్నతిలో మాత్రం వెనుకడుగే వేస్తోంది. అనేక రంగాల్లో మహిళలు అద్భుతాలు సృష్టిస్తున్నారు. అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. కానీ సమాజంలోని పురుషాధిపత్య భావజాలంలో, విలువల్లో ఆశించిన మార్పులు రానందున ఇప్పటికీ మగాడి చేతుల్లో హింస ఒక ఆయుధంగా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో భాగ్యనగరంలో మహిళల సాధికారత.. భద్రత..వివక్ష.. విజయాలు.. అపజయాలపై నేటి నుంచి ‘సాక్షి’ స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. ప్రత్యేక కథనాలు అందిస్తోంది. మరోవైపు కష్టాలకు ఎదురొడ్డి..ఆత్మ విశ్వాసంతో ఆయా రంగాల్లో విజయం సాధించిన నగర మహిళల గాథలు.. గ్రేటర్ జనాభా సుమారు కోటికి చేరువైంది. ఇందులో 40 శాతానికి పైగా మహిళలు ఉన్నారు. ప్రతి వెయ్యి మంది పురుషులకు 929 మంది ఉన్నట్లు అంచనా. ప్రభుత్వ, ప్రైవేట్, సంఘటిత, అసంఘటిత రంగాల్లో లక్షలాది మంది మహిళలు తమ ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తున్నారు. మహానగర అభివృద్ధిలో భాగమవుతున్నారు. నగరంలో సుమారు 850 ఐటీ పరిశ్రమల్లో 4.5లక్షల మంది ఐటీ నిపుణులుంటే, వారిలో 35శాతం వరకు మహిళలున్నారు. విధానాల రూపకల్పన, అమల్లోనూ మహిళా అధికారులు, ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగానూ రాణిస్తున్నారు. అయితే వివిధ రంగాల్లో మహిళలకు అవకాశాలు పెరుగుతున్నప్పటికీ, వాటిని అందుకోవడంలో పురుషాధిపత్యం ప్రతిబంధకంగానే ఉంది. పెళ్లికి ముందు ఐటీ నిపుణులుగా గొప్ప ప్రతిభను చూపిన అమ్మాయిలు... వివాహానంతరం ఇళ్లకే పరిమతమవుతున్నారు. విశాలమైన ప్రపంచంలోంచి ఇరుకైన చట్రంలోకి జారిపోతున్నారు. ఇదంతా నగరంలో మహిళల స్థానాన్ని ప్రతిబింబిస్తోంది. సిటీలోనూ భ్రూణ హత్యలు... నిజానికి మహిళలపై హింస... అత్యంత అమానవీయమైన లింగనిర్ధరణ పరీక్షలతోనే మొదలవుతోంది. బలమైన చట్టాలున్నప్పటికీ సిటీలోనూ లింగనిర్ధరణ పరీక్షలు, భ్రూణ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు సమాజంలో అమ్మాయిలకు భద్రత ఉండదనే ఒకే ఒక్క కారణంతో... చాలామంది అమ్మాయిలను కనేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇక చాలామంది తల్లిదండ్రులు తమ కూతుళ్లను ఉన్నత చదువులు చదివించేందుకూ భయపడుతున్నారంటే ఇంటా, బయటా హింస ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. గృహహింస వ్యతిరేక చట్టం వంటివి వచ్చినప్పటికీ వరకట్న, అత్తింటి వేధింపులను ఎదురించేందుకు ఎవరూ సాహసం చేయలేకపోతున్నారు. ఏటా 14వేల కేసులు... మహిళా భద్రతా కమిటీ అనేక రక్షణ చర్యలు చేపట్టింది. సిటీ బస్సుల్లో పార్టీషన్ డోర్లు ఏర్పాటు చేసింది. షీ బృందాలు రంగంలో ఉన్నాయి. ఐటీ కారిడార్‌లో సీసీ కెమెరాల నిఘా ఉంది. అయినప్పటికీ మహిళా ఉద్యోగులు నిర్భయంగా, ఆత్మస్థ్యైంతో తిరగలేకపోతున్నారు. ఒంటరి ప్రయాణమంటేనే భయపడుతున్నారు. సోషల్ మీడియా సైతం మహిళల భద్రతకు సవాళ్ల విసురుతోంది. నగరంలో వివిధ రూపాల్లో మహిళలు ఎదుర్కొంటున్న హింసపై ఏటా సగటున 12వేల నుంచి 14వేల కేసులు నమోదువుతున్నాయి. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు వెనకడుగు వేస్తున్నవాళ్లు, మౌనంగా హింస, ఈవ్‌టీజింగ్‌ను భరిస్తున్నవాళ్లు ఇంకా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. మరోవైపు నిందితుల అరెస్టు, కోర్టు విచారణ, చార్జిషీట్ దాఖలు, శిక్షల అమలు నత్తనడకన సాగుతుండడం మహిళలను నిరాశకు గురి చేస్తోంది. మహిళలకు న్యాయం జరిగే విషయంలో న్యాయమూర్తుల కొరత కూడా ఒక సమస్య. అమెరికా లాంటి దేశాల్లో ప్రతి 10లక్షల జానాభాకు 150మంది న్యాయమూర్తులుంటే.. మన దగ్గర కనీసం 15మంది కూడా లేకపోవడంతో మహిళలకు న్యాయస్థానాల్లోనూ న్యాయం దక్కడం లేదు. కేసుల విషయంలో విపరీతంగా జాప్యం జరుగుతోందని న్యాయనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడ్డా కూలీల్లోనూ వివక్షే... బతుకుదెరువు కోసం రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి నగరానికి వచ్చే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. దీంతో నగరంలోని అనేక కూడళ్లు వలస కూలీల అడ్డాలుగా మారాయి. ఒక అంచనా ప్రకారం నగర జనాభాలో 40లక్షలకు పైగా ఉపాధి కోసం వచ్చినవాళ్లే. వీరిలో సుమారు 15లక్షల మంది మహిళలు. వీరంతా నిర్మాణ రంగం, అసంఘటిత పారిశ్రామిక కార్మికులుగా కొనసాగుతున్నారు. జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, బాలానగర్, జగద్గిరిగుట్ట, ఉప్పల్, నాచారం, చర్లపల్లి తదతర పారిశ్రామిక ప్రాంతాల్లో పురుషులతో పాటు మహిళలు పని చేస్తున్నారు. కానీ వేతనాల్లో మాత్రం చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. మగవారికి ఒక రోజు కూలీ రూ.700 –రూ.1000 వరకు లభిస్తే, మహిళలకు మాత్రం రూ.300–రూ.500. ఐటీలోనూ అంతే..? ఒక్క అసంఘటిత రంగంలోనే కాదు.. ఐటీ రంగంలోనూ వేతనాల తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఒకే రకమైన పనికి రెండు రకాల వేతనాలు అమలవుతున్నాయి. ఇద్దరూ సాంకేతిక నిపుణులే అయినప్పటికీ పురుషులకు రూ.75వేల వేతనం లభిస్తే, మహిళలకు మాత్రం రూ.50వేలు లభించడంపై ఐటీ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. పదోన్నతుల్లోనూ ఈ వివక్ష కొనసాగుతోంది. ఒకే కేడర్‌లో ఉన్నవారికి వేర్వేరు పదోన్నతులు లభించడం మహిళా నిపుణులను నిరాశా నిస్పృహలకు గురిచేస్తోంది. పాతబస్తీలో మారని పరిస్థితి... ఓవైపు నగరమంతా ఆధునికత వైపు పరుగులు పెడుతుంటే... పాతబస్తీలో మాత్రం ఇంకా నిరక్షరాస్యత, అజ్ఞానం, మూఢనమ్మకాలు మహిళల పాలిట శాపంగానే ఉన్నాయి. చదువుకుంటున్న అమ్మాయిల సంఖ్య చాలా తక్కువ. చిన్నారులు అక్రమ రవాణాకు గురవుతున్నారు. అరబ్‌షేక్‌ల దాష్టీకానికి, అకృత్యాలకు బలవుతున్నారు. మహిళలపై లైంగిక హింస, దోపిడీ, దౌర్జన్యాలను మగవాడు ఒక హక్కుగా భావించే దుర్మార్గమైన పరిస్థితులు నగరాన్ని పట్టిపీడిస్తూనే ఉన్నాయి. ఒక్క పాతబస్తీలోనే కాదు... ఇతర ప్రాంతాల్లోనూ మహిళలపై హింస ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల హయత్‌నగర్‌లో ఓ వ్యక్తి కాబోయే భార్యను అనుమానించి హతమార్చిన సంఘటన, తనను ప్రేమించడం లేదని లాలాగూడలో ఓ యువతిని గొంతుకోసి చంపేసిన దుర్మార్గుడి ఉదంతం, జిల్లెలగూడవాసి హరీష్ తనను ప్రశ్నించినందుకు భార్యను, పిల్లలను గొంతునులిమి చంపిన ఘటనలు ప్రతి ఒక్కరినీ కలచివేశాయి. మరోవైపు వివాహేతర సంబంధాల్లోనూ మహిళలు బలవుతున్నారు. -
ఇల్లెక్కడో చెప్పరూ!
గ్రేటర్లో ‘ఇంటి చిరునామా’ చిక్కడం లేదు. ఏదైనా వీధికి వెళ్లి ఓ ఇంటి అడ్రస్ పట్టుకోవడం గగనమవుతోంది. ఇంటి నెంబర్‌తో సహా పూర్తి చిరునామా ఉన్నా...ఆ ఆనవాళ్లు మాత్రం ఆయా ప్రదేశాల్లో దొరకడం లేదు. గజిబిజి గల్లీలు.. క్రమపద్ధతిలో లేని వీధి నెంబర్లు, గందరగోళం కాలనీలు, ఒక్క డోర్ నెంబరుతోనే ఎన్నోఆబ్లిక్లను చేర్చుతూ పెరిగిపోయిన అదనపు ఇళ్లే ఇందుకు కారణం. 40 ఏళ్ల క్రితం నాటి డోర్ నెంబర్లే ఇంకా కొనసాగిస్తుండడం..కొత్తపద్ధతుల్లో ఇంటి నెంబర్లు వేయక పోవడం వల్ల సిటీజనులు నానా పాట్లు పడుతున్నారు. సాక్షి, సిటీబ్యూరో : విశ్వనగరంగా ఎదుగుతోన్న హైదరాబాద్ వివిధ అంశాల్లో నెంబర్‌వన్‌గా నిలుస్తోంది. అయినప్పటికీ.. నగరంలో చిరునామా తిప్పలు మాత్రం తప్పడం లేదు. ఇంటి నెంబరుతో సహా పూర్తి చిరునామా ఉన్నా గ్రేటర్లో కావాల్సిన ఇంటిని వెతుక్కోలేక ప్రజలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. నలభయ్యేళ్ల నాటి ఇంటినెంబర్ల తీరులో ఇంతవరకు మార్పురాలేదు. ఈ దుస్థితి తప్పించేందుకు ఆధునిక ఇంటి నెంబర్లను అమలు చేసేందుకు దశాబ్దం క్రితమే ప్రయత్నాలు ప్రారంభించినా, ఆ ప్రాజెక్టు అర్ధాంతరంగా ఆగిపోయింది. పూర్తిస్థాయి సర్వేనే జరగలేదు. కొత్త రాష్ట్రం ఏర్పాటయ్యాక..అందివచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని డిజిటల్ ఇంటినెంబర్లను తెరపైకి తెచ్చారు. టెండర్ల దశ వరకొచ్చినా ఇవి టెండరుదార్లలో ఒకరు కోర్టుకెళ్లడంతో పెండింగ్‌లో పడింది. తాజాగా తిరిగి టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతున్నారు. టెండర్లు పూర్తయి, ఎంపికైన సంస్థ గ్రేటర్‌లోని 21 లక్షల ఇళ్ల సర్వే పూర్తిచేసి..కొత్త డిజిటల్ ఇంటినెంబర్లు అందుబాటులోకి తేవడానికి దాదాపు రెండేళ్లు పట్టే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. దశాబ్దానికి పైగా.. దాదాపు దశాబ్దం క్రితమే నగరంలోని ఇళ్లు, రోడ్లు, వీధుల పేర్లు, నెంబరింగ్కోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు. వివిధ నగరాల్లోని ఇంటినెంబర్ల తీరును పరిశీలించిన ఈ విభాగం నగరానికి అనుకూలమైన విధానానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా వీధి ప్రారంభంలో ఇంటినెంబర్లను సూచించే సైన్‌బోర్డులు వాటిపై ప్రాంతం(లొకాలిటీ)పేరు, వీధినెంబరు, వీధిలో ఎన్ని ఇళ్లున్నాయో తెలిసే ఏర్పాట్లు చేశారు. అప్పట్లో 647 లొకాలిటీలను గుర్తించినప్పటికీ, కేవలం 3 లొకాలిటీల్లో మాత్రం కొత్త ఇంటినెంబర్లు వేశారు. ఇంటినెంబర్ల పేరిట దాదాపు రూ.2 కోట్లు ఖర్చు చేశారు. పథకాన్ని అర్ధంతరంగా ఆపివేశారు. ఆ తర్వాత దాదాపు రెండేళ్ల క్రితం ఆధునిక డిజిటల్ నెంబర్ల కోసం టెండర్లు పిలిచారు. టెండరుదార్లలో ఒకరు కోర్టుకెళ్లడంతో ఆ ప్రక్రియ అంతటితో నిలిచిపోయింది. తిరిగి మరోమారు కొత్త టెండర్లను ఆహ్వానించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. అంతలోనే ప్రపంచబ్యాంకు నిధులతో తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఇంటినెంబర్ల ప్రక్రియకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సంబంధిత అధికారి తెలిపారు. అందులో భాగంగానే జీహెచ్ఎంసీలోనూ సర్వే చేపట్టనున్నారు. డిజిటల్ నెంబర్లు అందుబాటులోకి వస్తే నగరంలోని ఏ ఇంటి చిరునామానైనా తేలిగ్గా కనుక్కోవచ్చు. ఉపయోగాలెన్నో.. డిజిటల్ ఇంటినెంబర్ల విధానం విద్యుత్, జలమండలి, పోస్టల్, కొరియర్ తదితర సంస్థలకు ప్రయోజనకరం. సులభంగా చిరునామాకు చేరుకోవచ్చు. ఆయా సంస్థలందించే ఆధార్‌తో సహా అనుసంధానిస్తే బకాయిదారులు ఎక్కడికీ తప్పించుకోలేరని జీహెచ్ఎంసీలోని ఓ అధికారి పేర్కొన్నారు. తద్వారా జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను, ట్రేడ్‌లైసెన్సుల ఫీజుల్ని నూరు శాతం వసూలు చేసే వీలుంది. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు పోలీసు, ఫైర్ సర్వీసు, అంబులెన్సులు త్వరితంగా చేరుకోవచ్చు. ♦ దేశంలో బెంగళూరు, విజయవాడల్లో మాత్రమే ఇప్పటి వరకు డిజిటల్ నెంబర్ల ప్రక్రియ ప్రారంభమైంది. ♦ జీహెచ్ఎంఈలో ఆధునిక ఇంటినెంబర్ల ప్రక్రియను ప్రారంభించినప్పుడు 18 సర్కిళ్లుండగా, 30కి పెరిగాయి. ఇళ్లు కూడా లక్షల సంఖ్యలో పెరిగాయి. ప్రస్తుతమున్న 5 జోన్లు ఇంకా పెరగనున్నాయి. క్లౌడ్‌బేస్డ్ టెక్నాలజీతో డిజిటల్ నెంబర్లు ♦ యూనిక్ స్మార్ట్ అడ్రసింగ్ సొల్యూషన్ ఫర్ అర్బన్ డ్వెలింగ్స్ (యూఎస్ఏఎస్యూడీ)గా పిలిచే ఈ ప్రాజెక్ట్‌లో క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీని వినియోగించుకుంటారు. ♦ మొబైల్ ఫోన్/ ఆన్లైన్ ద్వారా సైతం ఈజీగా చిరునామా తెలిసేలా స్మార్ట్ విధానంలో డిజిటల్ ఇంటినెంబర్లను వినియోగంలోకి తేవడం లక్ష్యం. ♦ అన్ని ఇళ్ల æ అడ్రస్‌లు తేలిగ్గా తెలుసుకునేలా, జీపీఎస్ ,గూగుల్ మ్యాప్స్ ద్వారా నేవిగేషన్ ఉండేలా ప్రాజెక్ట్ పూర్తిచేయాలి. ♦ పైలట్ ప్రాజెక్టుగా ఒక ఏజెన్సీ దాదాపు ఏడాదిన్నర క్రితం గగన్‌మహల్‌లోని 500ఇళ్లకు డిజిటల్ ఇంటినెంబర్లను ఇచ్చింది. నగరవ్యాప్తంగా అమలు చేసేందుకు జీహెచ్ఎంసీ టెండర్లు పిలిచేలోగా రాష్ట్రమంతా చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో బ్రేక్‌పడింది. ♦ జీహెచ్ఎంసీ విస్తీర్ణం దాదాపు 625 చ.కి.మీలు కాగా 21 లక్షల ఇళ్లున్నట్లు అంచనా. ♦ సర్వే కోసం ఒక్కో ఇంటికి దాదాపు రూ.40 అంచనాతో టెండర్లు అహ్వానించనున్నట్లు సమాచారం. 21 లక్షల ఇళ్ల చిరునామాలు.. ♦ అన్ని రహదారులు, వీధులు, తదితరమైన వాటిని శాటిలైట్ చిత్రాలతో సహా బేస్ మ్యాప్‌ను రూపొందించాల్సి ఉంటుంది. ఇందుకుగాను సమగ్ర సర్వే నిర్వహిస్తారు. సర్వేలో భాగంగా , ఇంటికి దగ్గర్లోని ప్రముఖ ప్రాంతం, వీధిపేరు, సబ్లొకాలిటీ, లొకాలిటీలతో పాటు పిన్‌కోడ్ నెంబర్ కూడా సేకరించాలి. ♦ ఖాళీ ప్లాట్లను సైతం గుర్తించి నెంబర్లు ఇస్తారు. ఇంటి నెంబర్లు అస్తవ్యస్తం జీహెచ్ఎంసీ అధికారులు కేటాయించిన ఇంటినెంబర్లు పూర్తిగా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇంటి నెంబర్ల ఆధారంగా చిరునామా కనుక్కోవడం ఇబ్బందికరంగా పరిణమించింది. ఎంసీహెచ్ హయాంలో కేవలం 4 నెంబర్లతో కూడిన నెంబర్ల కేటాయింపు మాత్రమే సహేతుకంగా ఉండేది. 1970 నుంచి జరుగుతున్న ఇంటినెంబర్ల కేటాయింపులో ఎంతమాత్రం క్రమపద్ధతి లేదు. – నగరపు శ్యాం, అధ్యక్షుడు ఇందిరానగర్ కాలనీ సంక్షేమ సంఘం (సీతాఫల్మండి డివిజన్) -
మంటగలుస్తున్న మానవత్వం
పనిచేయడం లేదని భర్తను ప్రశ్నించిన భార్యతో సహా ఇద్దరు పిల్లలను హత్య చేసిన హరీందర్... సహజీవనం చేస్తున్న అమ్మాయి తన భార్యకు ఫోన్ చేసి వేధిస్తోందని ఆమెను, ఆమె కూతురు, తల్లిని అమానుషంగా చంపేసిన మధు... అనుమానంతో వివాహం చేసుకోబోయే అమ్మాయిని బండరాయితో మోది హతమార్చిన మోతీలాల్... చదువు ఒత్తిడిలో పాఠశాల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన పదో తరగతి విద్యార్థి... తల్లి సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన మరో విద్యార్థి... గ్రేటర్లో ఇటీవల చోటుచేసుకున్న ఈ సంఘటనలు సిటీజనులను కలచి వేస్తున్నాయి. నగరంలో ప్రతిరోజు ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు జరగడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఆర్థిక ఇబ్బందులు, అనుమానాలు, ఒత్తిడి, మానసిక క్షోభ, మూఢనమ్మకాలు... ఇలా కారణాలేవైనా ఇటీవల చోటుచేసుకున్న ఈ హత్యలు, ఆత్మహత్యలు మంటగలసిపోతున్న మానవ సంబంధాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. సాక్షి, సిటీబ్యూరో : క్షణికావేశంలో మృగమవుతున్న మనిషి... బంధాలను మరిచి యముడవుతున్నాడు. ‘నా అన్న వాళ్లనే..’ నరికి చంపేస్తున్నాడు. ఓచోట భార్యాపిల్లలను, మరోచోట నిండు గర్భిణిని, ఇంకోచోట అమ్మాయిని, మూఢనమ్మకాలతో పసికందును... హతమార్చిన ఘటనలు భాగ్యనగరంలో కలకలం సృష్టిస్తున్నాయి. స్వార్థంతో, క్షణికావేశంలో జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు.. వందల ఏళ్ల నాటి మానవీయ విలువల నిర్మాణాన్ని కూల్చేస్తున్నాయి. గత 10రోజుల్లో ఈ ఘటనల్లో ఏడుగురు చిన్నారులు, ఎనిమిది మంది మహిళలు హతమయ్యారు. ఎందుకిలా..? మనుషులు, విలువలు ఉనికి కోల్పోతున్నాయి. ప్రేమానుబంధాలు, మమతానురాగాలు శిథిలమవుతున్నాయి. కలహాలే కలిసి జీవిస్తున్నాయి. మనస్పర్థలు, ఘర్షణలే గాలివానలవుతున్నాయి. ‘నేను మాత్రమే’ బాగుండాలనే స్వార్థపూరితమైన దృక్పథం, తన సుఖ సంతోషాలకు ఎవరడ్డొచ్చినా భరించలేని అసహనం, విచ్ఛిన్నమవుతున్న కుటుంబ సంస్కృతి, ఆశలు, ఆశయాలను, అహాలను సంతృప్తి పర్చలేని దాంపత్య జీవితం... మొదలు నరికిన చెట్టులా కూలిపోతోంది. ఇలాంటి సంఘటనల్లో ఒకప్పుడు ఒకరి నుంచి ఒకరు విడిపోవాలని కోరుకునేవారు. ఇప్పుడలా కాదు. తనకు అడ్డుగా ఉన్న దాన్ని తొలగించుకోవడమే లక్ష్యంగా హత్యలకు పాల్పడుతున్నారు. మగవాళ్లలో బలంగా ఉండే ఈ లక్షణం అక్కడక్కడా మహిళల్లోనూ కనిపిస్తోంది. వివాహేతర సంబంధాల్లో మనుషులు ఎంతటి తెగింపునకైనా పాల్పడుతున్నారు. ఇలాంటి ఉదంతాల్లో పిల్లలు సైతం వాళ్ల క్రూరత్వానికి బలవుతున్నారు. అసహనం.. అనుమానం.. క్షణికావేశం అపర్ణ అనే మహిళను రెండో వివాహం చేసుకొని రహస్యంగా కాపురం చేస్తున్న మధు... ఆ వ్యవహారం బయటకుపొక్కి గొడవలకు దారితీయడంతో గత నెల 30న అపర్ణను, ఆమె తల్లి విజయమ్మను, కూతురు కార్తికేయను హతమార్చి తలుపులు వేసి తాపీగా వెళ్లిపోయాడు. రెండు రోజుల క్రితం ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిళ్ల నేపథ్యంలో హరీందర్ జిల్లెలగూడలో భార్యాపిల్లలను హతమార్చాడు. వారం కింద హయత్‌నగర్‌లో మోతీలాల్ అనే వ్యక్తి తనకు కాబోయే భార్యపై అనుమానంతో ఆమెను చంపేశాడు. ఈ సంఘటనల అన్నింటిలోనూ విపరీతమైన అసహనం, తనకు అడ్డుగా ఉన్నారని భావిస్తే కట్టుకున్న భార్య, పిల్లలను సైతం తొలగించుకొనే మానసిక ఉన్మాద ప్రవృత్తి కారణమని మనస్తత్వ, సామాజిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ఉన్మాద ప్రవృత్తితో అనుబంధాలు, సామాజిక విలువలు హతమవుతున్నాయి. ఒకప్పటి ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు లేకపోవడం, వ్యక్తులపై ఎలాంటి సామాజిక నియంత్రణ కూడా లేకపోవడం.. ఈ రకమైన నేరాలకు ఆజ్యం పోస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తరచూ విసిగిస్తే... భాగస్వామిని తరచూ విసిగిస్తూ మాట్లాడుతుంటే ఆ స్థితిని మానసిక పరిభాషలో ‘డెల్యూషన్’ అంటారు. ఇలాంటి ప్రవర్తన కలవారే హత్యలకు పాల్పడుతుంటారు. భార్య ప్రవర్తన ఎంత బాగున్నా.. ఏదో ఒక విషయంలో వేధింపులకు గురిచేస్తుంటారు. ఇవే చివరకు హత్యలకు దారితీస్తాయని మానసిక వైద్యనిపుణులు విశ్లేషిస్తున్నారు. సినిమాలు, సీరియళ్లలో చూపే వివాహేతర సంబంధాలు తమ ఇంట్లోనూ జరుగుతున్నాయని అపోహ పడడం, మద్యానికి బానిసవడం... ఆ దృక్పథంలో నేరాలకు పాల్పడడం జరుగుతోందని పేర్కొంటున్నారు. నిందితులు విచారణలో కొంచమైనా పశ్చాత్తాపం లేకుండా తాము చేసిన నేరాలను విపులంగా వివరించడం గమనార్హం. సామాజిక నియంత్రణ అవసరం ఈ అమానవీయమైన సంక్షోభాన్ని తొలగించి, ఉన్నత విలువలను స్థాపించేందుకు ఒక సామాజిక నియంత్రణ వ్యవస్థ అవసరం. మెగా సిటీలు, మహానగరాలు ఉనికిలోకి వచ్చిన తరువాత ఈ సామాజిక నియంత్రణ లేకుండా పోయింది. సోషల్ మీడియా అందుకు మరింత ఆజ్యం పోస్తోంది. మనిషి ప్రకృతితో మమేకమయ్యే జీవన విధానం, విలువల స్థాపనతో మాత్రమే ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. ఇలాంటి దారుణాలు తగ్గుముఖం పడుతాయి. – ప్రొఫెసర్ నాగేశ్వర్ సమష్టి జీవన విధానం అలవడాలి మనుషుల కంటే వస్తువులు, సుఖం, వ్యక్తిగత ఆనందాలే ముఖ్యమయ్యాయి. నూతన ఆర్థిక విధానాలు, వస్తు వినిమయవాద సంస్కృతి ఇందుకు కారణం. దీంతో సహజమైన మనిషి లక్షణాలు చనిపోయి, మృగాల్లా మారుతున్నారు. మరోవైపు డబ్బుకున్న గుర్తింపు మనుషులకు లేకపోవడంతో ఆత్మన్యూనతకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి విపరీత ధోరణులు తొలగిపోవాలంటే సమాజంలో సమష్టి జీవన విధానం అలవడాలి. ప్రత్యామ్నాయ ఆర్థిక, రాజకీయ విలువలతోనే అది సాధ్యం. – ప్రొఫెసర్ హరగోపాల్ వాస్తవాన్ని గుర్తించలేని అజ్ఞానం శక్తికి మించిన భారీ అంచనాలు, ఆర్థికంగా బాగా సంపాదించాలనే కోరికల కారణంగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. వాస్తవ పరిస్థితులను సరిగ్గా అంచనా వేయలేని అజ్ఞానం ఇది. ఈ ఒత్తిడి నుంచి బయటపడేందుకు సిగరెట్, ఆల్కహాల్, వివాహేతర సంబంధాల లాంటి దురలవాట్లకు బానిసలవుతున్నారు. మనస్తత్వ పరిభాషలో దీనిని ‘కోపింగ్ మెకానిజం’ అంటారు. ఒక దుస్థితి నుంచి బయటపడేందుకు మరో దుస్థితిని ఎంపిక చేసుకోవడం. ఈ క్రమంలో జరిగే కలహాల కారణంగా అహం దెబ్బతిని దారుణాలకు పాల్పడుతున్నారు. ఇది సైకోపథాలజీ మనస్తత్వం. కుటుంబ సంబంధాలు బలోపేతం కావాలంటే పెళ్లికి ముందే కౌన్సెలింగ్ అవసరం. – డాక్టర్ సి.వీరేందర్, మనస్తత్వ నిపుణులు ఒత్తిడి.. ఒంటరితనం ఒత్తిడి, ఒంటరితనమే ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో డిప్రెషన్ బాధితులే అధికంగా ఉంటున్నారు. కుటుంబాలు విచ్ఛిన్నమవడం, సమస్యలను ఎదుర్కోలేకపోవడం, పిల్లలను అతి గారాభం చేయడం, ఆర్థిక ఇబ్బందులు తదితర కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. డిప్రెషన్ బాధితులు, సున్నిత మనస్కులు, హార్మోన్ల అసమతుల్యంతో బాధపడుతున్న వారికి తప్పనిసరిగా కౌన్సెలింగ్ ఇప్పించాలి. – డాక్టర్ అనితా రాయిరాల, సైక్రియాట్రిస్ట్, రిమ్స్ జీవితం విలువ తెలియాలి ఇలాంటి దారుణాలను అరికట్టాలంటే ప్రతి ఒక్కరికీ జీవితం విలువ తెలియాలి. ఆ విలువలను నేర్పే విధంగా విద్యావిధానంలో, సామాజికంగా మార్పు రావాలి. నైతిక విలువలను చిన్నప్పటి నుంచి అలవర్చాలి. తల్లిదండ్రుల పెంపకంలో, మీడియాలోనూ మార్పులు అవసరం. నేరాలను నియంత్రించే విధంగా మీడియా బాధ్యతాయుతమైన పాత్రను నిర్వహించాలి. – లలితాదాస్, సైకాలజిస్ట్ -
బెగ్గింగ్ మాఫియాపై చర్యలు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో విజృంభిస్తున్న బెగ్గింగ్ మాఫియాపై శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై బాలల హక్కుల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. పిల్లలను భిక్షగాళ్ల మాఫియా నుంచి రక్షించి పునరావాసం కల్పించాలని ఈ మేరకు రాష్ట్ర డీజీపీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ శనివారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌ను ఆమోదించిన మానవ హక్కుల కమిషన్.. ఏప్రిల్ 11లోగా బెగ్గింగ్ మాఫియాపై తగిన చర్యలు చేపట్టి, నివేదిక ఇవ్వాలని రాష్ట్ర డీజీపీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. -
గ్రేటర్ కాంగ్రెస్‌పై తర్జనభర్జన
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ పనితీరుపై టీపీసీసీ ఆందోళన చెందుతోంది. రాష్ట్రంలోని పాత పది జిల్లాల్లో పార్టీ వరుస కార్యక్రమాలతో ఊపు తెచ్చేందుకు యత్నిస్తుండగా, కీలకమైన గ్రేటర్లో నెలకొన్న పరిస్థితిపై తర్జనభర్జన పడుతోంది. గ్రేటర్ పరిధిలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు లోక్‌సభా స్థానాలున్నాయి. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక్క డివిజన్‌లోనే విజయం సాధించింది. ఇది ఆ పార్టీ మనోస్థైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఆ తర్వాత ఆ పార్టీ బలాబలాలు పెరిగినట్టుగా అధినాయకత్వానికి విశ్వాసం కలగడంలేదు. పార్టీకి ముఖ్య నేతలు గ్రేటర్లో చాలా మంది ఉన్నా, ఏ ఇద్దరూ కలసి చర్చించుకునే పరిస్థితి లేకపోవడం టీపీసీసీకి సంకటంగా మారింది. గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి గతంలోనే రాజీనామా చేసినట్టుగా మాజీమంత్రి దానం నాగేందర్ ప్రకటించినా అది ఆమోదం పొందలేదు. మాజీ మంత్రులు మర్రి శశిధర్‌రెడ్డి, ఎం.ముఖేశ్ గౌడ్, మాజీ ఎంపీ ఎం.అంజన్‌కుమార్ యాదవ్ తదితర ముఖ్యనేతలు ఉన్నా పార్టీ బలోపేతం కోసం చేపడుతున్న కార్యక్రమాలేవీ కనిపించడం లేదని టీపీసీసీ అసంతృప్తిగా ఉంది. నియోజకవర్గాల ఇన్చార్జీల పనితీరుపై కూడా టీపీసీసీ పెదవి విరు స్తోంది. ఏఐసీసీ స్థాయి నేత వీహెచ్, రాజ్యసభ సభ్యుడు ఖాన్ వంటివారు కూడా పార్టీ విస్తరణ కోసం కృషి చేయడంలేదని టీపీసీసీ ముఖ్యులు అసంతృప్తిగా ఉన్నారు. దీంతో పార్టీ బలోపేతానికి అనుసరించే వ్యూహంపై టీపీసీసీ మల్లగుల్లాలు పడుతోంది. ముందుగా నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, నేతల పనితీరుపై అధ్యయనం చేసి, బలోపేతానికి చర్యలు తీసుకోవడం మేలని నేతలు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. నాయకుల పనితీరు, అంకితభావం, సమర్థతను బట్టి వచ్చే ఎన్నికల్లో వారికి ప్రాధాన్యత ఉండొచ్చని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో అవకాశం వస్తుందనే విశ్వాసం కలిగినవారే పార్టీ బలో పేతానికి కృషి చేస్తారని టీపీసీసీ భావిస్తోంది. ఏఐసీసీ, టీపీసీసీ పునర్వ్యవస్థీకరణ తర్వాత గ్రేటర్ కాంగ్రెస్‌పై దృíష్టి కేంద్రీకరించాలని భావిస్తోంది. -
ఇచట దొంగలకు శిక్షణ ఇవ్వబడును!
దొంగతనం చేయడంలో వారికి పెట్టింది పేరు. చోరీలు ఎలా చేయాలో నేర్పేందుకు ఇక్కడ శిక్షణ పాఠశాలలే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. దొంగతనం చేస్తూ బతకడమే ఈ బస్తీవాసుల జీవనం. వీరిలో మార్పు తెచ్చేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నాయి. కరడుగట్టిన 25 మంది మాన్గార్ బస్తీ నేరగాళ్లు పోలీసుల ఎదుట సోమవారం లొంగిపోయారు. ఈ నేపథ్యంలో అసలీ బస్తీ కథేంటి? చోర కళలో ఆరితేరడంలో అంతర్యమేమిటి? వీరి జీవనంలో మార్పు తీసుకొచ్చేందుకు పోలీసులు చేస్తున్న కృషి తదితర అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. మాన్గార్ బస్తీలో దొంగల బడులు చోర కళలో శిక్షణనిస్తున్న పాఠశాలలు ఇక్కడి వారికి ఇదే వృత్తి మార్పు కోసం పోలీసుల ప్రయత్నం స్వచ్ఛంద సంస్థల సహకారంతో సేవా కార్యక్రమాలు సాక్షి, నాంపల్లి: రెండు శతాబ్దాల క్రితం మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 500 కుటుంబాలు హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాన్గార్ బస్తీలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నాయి. ఇక్కడి పిల్లలు చదువుకునేందుకు ఇష్టపడరు. పెద్దలు సైతం వీరిని బడికి పంపించరు. కానీ దొంగతనాలు నేర్పే బడికి మాత్రం పంపిస్తారు. బస్తీలో పదుల సంఖ్యలో ఈ పాఠశాలలున్నాయి. ఇక్కడ చోర కళ మాత్రమే నేర్పిస్తారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల మెడలోని గొలుసు ఎలా తెంచుకోవాలి? జేబులు కత్తిరించి, ఎలా బయటపడాలో ప్రాక్టీస్ చేయిస్తారు. ‘నాయకుడి’ నరకం.. ప్రతిరోజూ ఈ దొంగల ముఠాలు ఆర్టీసీ బస్సుల్లో, రైళ్లలో, ర్యాలీలు, పాదయాత్రలలో సంచరిస్తాయి. కొన్ని ముఠాలు జాతరలు, దేవాలయాల వద్ద తిష్టవేస్తాయి. దొంగలించిన సొమ్మంతా ముఠా నాయకుడికి అం దజేస్తారు. ఈ క్రమంలో దొంగ పోలీసులకు చిక్కితే విడిపించడానికి అవసరమయ్యే ఖర్చు, తల్లిదండ్రుల పోషణ, వైద్య ఖర్చులు అన్నీ ముఠా నాయకుడే చెల్లిస్తాడు. చెల్లించిన పైకానికి 30 శాతం వడ్డీ వసూలు చేస్తాడు. అసలు, వడ్డీ చెల్లించకుంటే పిల్లలు వారి అధీనంలోనే ఉండాలంటాడు. ఇలా తీసుకున్న డబ్బు చెల్లించలేక, ఇచ్చిన మాటను కాదనలేక, ఎదురించినా బస్తీలో ఇవ ుడలేక ఎంతో మంది తమ కుటుంబాలను చేతులారా నిర్వీర్యం చేసుకుంటున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు కృషి.. నేరాలను అదుపు చేయడానికి రెండేళ్ల క్రితం ఈ బస్తీ నుంచే పోలీసులు కట్టడి ముట్టడి (కార్డన్ సెర్చ్)కి శ్రీకారం చుట్టారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో 70 శాతం చైన్ స్నాచింగ్ కేసులు తగ్గాయి. పోలీసుల వరుస దాడులు, కేసుల నమోదు, పీడీ యాక్టులతో సగం మంది నేరాలు మానేసి, ఉపాధి పనుల బాట పట్టారు. బస్తీ ప్రజల్లో మార్పు తీసుకొచ్చేందుకు పోలీసులు నిరంతరం తపిస్తున్నారు. ఇందులో భాగంగానే మాన్గార్ బస్తీలో లయన్స్ క్లబ్, స్వచ్ఛంద సంస్థల సహకారంతో సామూహిక అన్నదానాలు, దుస్తుల పంపిణీ, అవగాహన సదస్సులు, హెల్త్ క్యాంపులు, ఉద్యోగ మేళాలు చేపడుతున్నారు. జీవితాలు నాశనం చేసుకోవద్దు.. తరతరాలుగా దొంగతనాలు చేస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దొంగతనాలు చేస్తూ ఫైనాన్సియర్లను బతికిస్తున్నారు. తాతముత్తాతల వృత్తినే మళ్లీ ఎంచుకుని జీవించడం సరికాదు. నేర ప్రవృత్తిని వీడనాడాలి. పిల్లలను బాగా చదివించుకోవాలని బస్తీవాసులను కోరుతున్నాం. – వెంకటేశ్వరరావు, డీసీపీ నేరగాళ్ల చిట్టా ఇదీ.. మాతంగి సునీల్.. మాతంగి సునీల్ అలియాస్ మదన్ 40 కేసుల్లో నిందితుడు. జంటనగరాల్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఇతనిపై కేసులున్నాయి. చాలాసార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. అయినా పద్ధతి మార లేదు. కాంబ్లే దీపక్.. మాన్గార్ బస్తీకి చెందిన కాంబ్లే దీపక్ అలియాస్ బోకుడు. ఇతనిపై 50 కేసులున్నాయి. కరడుగట్టిన నేరస్తుడిగా పేరుంది. ఇతని కోసం పోలీసులు గాలిస్తున్నా ఫలితం లేకుండాపోతోంది. ఆకాష్.. ఆకాష్ అలియాస్ బాండియా నేరాలు చేయడంలో సిద్ధహస్తుడు. 50 కేసులున్నాయి. క్షణాల్లోనే మెడలోని గొలుసులు తెంచేస్తాడు. అనేకసార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. అయినా ఎలాంటి మార్పులేదు. నర్సింహ.. హెచ్. నర్సింçహ అలియాస్ మొగిలి 60 కేసుల్లో నిందితుడు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో తిష్ట వేసి ప్రయాణికుల బ్యాగులు, లగేజీలు దోచుకెళ్తాడు. పలుమార్లు జైలుశిక్ష అనుభవించి బయటకు వ చ్చాడు. పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నాడు. నాడె గోపి.. నాడె గోపి అలియాస్ ఫయాజ్ 25 కేసుల్లో నిందితుడు. దోపిడీ కేసుల్లో నేరస్తుడు. నగరంలోని పలు పోలీస్స్టేషన్లలో కేసులు న్నాయి. పోలీసులకు చిక్కకుండా సవాల్‌గా నిలిచాడు. మాన్గార్‌బస్తీ మారుతోంది! కరుడుగట్టిన 25 మంది నేరగాళ్ల లొంగుబాటు నగర పోలీసు చరిత్రలో తొలిసారిగా సరెండర్లు లొంగిపోయిన వారిపై 32 ఠాణాల్లో 200 కేసులు సాక్షి,సిటీబ్యూరో: మాన్గార్‌బస్తీ... ఈ పేరు చెబి తే పోలీసులు సైతం ఉలిక్కిపడతారు. చైన్ స్నాచింగ్, పిక్ పాకెటింగ్, దోపిడీ, దొంగతనాలు చేసే నేరగాళ్ళకు కేరాఫ్ అడ్రస్. ఎన్నిసార్లు జైలుకు వెళ్ళినా, చివరకు పీడీ యాక్ట్‌లు ప్రయోగించినా వీరిలో మార్పు కనిపించేది కాదు. ఈ ప్రాంతంలో రైడింగ్‌కు వెళ్లి సురక్షితంగా తిరిగి వచ్చిన పోలీసులు లేరనే చెప్పవచ్చు. హబీబ్‌నగర్ పోలీసులు ఆరు నెలల కృషి ఫలితంగా ఇలాంటి ఘరానా నేరచరిత్ర ఉన్న ఆ ప్రాంతంలో మార్పు వస్తోంది. నగర పోలీసు చరిత్రలోనే తొలిసారిగా 25 మంది కరుడుగట్టిన మాన్గార్‌బస్తీ నేరగాళ్ళు సోమవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరికి పునరావాసం కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు పశ్చిమ మండల డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. వీరంతా కేవలం లొంగిపోవడం మాత్రమే కాదని... ఇకపై నేరాలు సైతం చేయమంటూ పోలీసుల ఎదుట ప్రమాణం చేశారు. ఈ ఘనత హబీబ్‌నగర్ ఇన్స్పెక్టర్ పరవస్తు మధుకర్స్వామికే దక్కుతుంది. కొన్నేళ్ళ క్రితం మహా రాష్ట్ర, కర్నాటకల నుంచి వచ్చి ఈ బస్తీలో స్ధిరపడిన వారిలో అత్యధికులు నేరప్రవృత్తినే ఎంచుకున్నారు. వీరిలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేపట్టిన పోలీసులు వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇవ్వడం ప్రారంభించారు. ప్రవర్తన మార్చుకున్న వారికి ఉపాధి కల్పించడానికి ‘జాబ్ కనెక్ట్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తద్వారా ఇప్పటికే అనేక మందికి కార్పొరేట్ కంపెనీలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ఉద్యోగాలు ఇప్పించారు. మాన్గార్‌బస్తీ నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నేరాలు చేస్తున్న ఎనిమిది ప్రధాన గ్యాంగులను గుర్తించిన పోలీసులు వాటినే ‘టార్గెట్’గా చేసుకున్నారు. వివిధ నేరాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న వీటిలోని 25 మంది సభ్యులను సన్మార్గంలోకి తీసుకురావాలని నిర్ణయించు కున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాలు అవలంభిస్తూ వారితో కలిసి సహపంక్తి భోజనాలు చేస్తూ తమపై నమ్మకం పెంచుకున్నారు. ప్రవృత్తిని మార్చుకుంటే భవిష్యత్తులోనూ పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బం దులు ఉండవంటూ భరోసా ఇచ్చారు. ఫలితంగా ఆ 25 మందీ సోమవారం డీసీపీ ఎదుట లొంగిపోయారు. వీరు ఇప్పటికే సిటీలోని 32 ఠాణాల పరిధిలో నమోదైన 200 కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్ళివ చ్చారు. వివిధ పోలీసుస్టేషన్లలో 106 నాన్–బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. మరో 194 కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నారు. ఒక్కొక్కరి పై పదుల సంఖ్యలోనే కేసులు ఉన్నాయి. వీటిలో జేబు దొంగతనాల నుంచి దోపిడీల వరకు వివిధ నేరాలకు సంబంధించినవి ఉన్నాయి. ప్రస్తుతం వీరందరినీ కోర్టు ముందు హాజరుపరునున్నారు. లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించడంతో పాటు సొత్తు రికవరీ చేసి బాధితులకు అందించనున్నారు. వీరికి ఉద్యోగాలతో పాటు జీవనోపాధి కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు. ఈ విధానాన్ని కోనసాగిస్తూ మిగిలిన నేరగాళ్ళు సైతం మారేందుకు ఆస్కారం ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు కేవలం మావోయిస్టుల విషయంలో మాత్రమే అనుసరించే సరెండర్ పాలసీని మాన్గార్‌బస్తీ నేరగాళ్ళకూ వర్తిం చడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఆటో పర్మిట్ల బ్లాక్.. డ్రైవర్లకు షాక్!
సాక్షి,హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో ఆటో పర్మిట్ల దందాకు మళ్లీ తెరలేచింది. నగరంలో కొత్త ఆటో పర్మిట్లు విడుదలైన ప్రతిసారీ నిరుపేద డ్రైవర్ల సొమ్మును ఫైనాన్షియర్లు, డీలర్లు కొల్లగొడుతున్నారు. ఆటోమొబైల్ తయారీదారులు నిర్ణయించిన ధర ప్రకారం ఒక ఆటోరిక్షా రూ.1.25 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు డ్రైవర్‌కు లభించాలి. కానీ, కొందరు ఫైనాన్షియర్లు, డీలర్లు కుమ్మక్కై బినామీ ఆటోడ్రైవర్ల పేరుతో పర్మిట్లను బ్లాక్ చేస్తున్నారు. తరువాత ఒక్కో ఆటోను రూ.2.5 లక్షలకు విక్రయిస్తున్నారు. ఎలాగైనా సొంతంగా ఆటోరిక్షాను సంపాదించుకోవాలనుకునే డ్రైవర్లు ఫైనాన్షియర్ల చక్రవడ్డీకీ, ధనదాహానికి బలవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా మరో 686 కొత్త ఆటోలకు అనుమతినిచ్చింది. తాజాగా మరో జీవో విడుదల: నగరంలో వాహన కాలుష్యాన్ని అరికట్టడంలో భాగంగా 2002లో కొత్త ఆటోలపై అధికారులు నిషేధం విధించారు. ఈ నిషేధమే ఆటోడీలర్లు, ఫైనాన్షియర్లకు కాసులు కురిపిస్తోంది. నగరంలోని సుమారు 1.4 లక్షల ఆటోల్లో 80 శాతం ఇప్పటికీ ఫైనాన్షియర్ల గుప్పిట్లోనే ఉన్నాయి. చక్రవడ్డీకి అప్పులిచ్చి ఆటోడ్రైవర్లకు ఆటోలను కట్టబెట్టడం, వాళ్లు డబ్బులు చెల్లించుకోలేని స్థితిలో తిరిగి వాటిని స్వాధీనం చేసుకొని మరో డ్రైవర్‌కు విక్రయించడం, అక్కడా అప్పు చెల్లించకుంటే జప్తు చేయడం సర్వసాధారణంగా మారింది. గతంలో ఇవ్వగా మిగిలిపోయిన 686 పర్మిట్లకు ప్రభుత్వం రెండు రోజుల క్రితం అనుమతినిస్తూ జీవో విడుదల చేసింది. ఈ పర్మిట్లపై ఇప్పటికే బినామీ పేర్లతో ప్రొసీడింగ్స్ సంపాదించిన ఫైనాన్షియర్లు తాజాగా దందాకు తెరలేపారు. ఆర్టీఏలోనే ప్రొసీడింగ్స్ ఇవ్వాలి... ఆటోడ్రైవర్లపై దోపిడీని అరికట్టి బ్లాక్ మార్కెట్‌కు అవకాశం లేకుండా ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయంలోనే నిజమైన ఆటోడ్రైవర్లను గుర్తించి ప్రొసీడింగ్స్ (అనుమతి పత్రాలు) ఇవ్వాలని ఆటోసంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. దందాకు ఆస్కారమిచ్చేవిధంగా ఇప్పటివరకు షోరూమ్‌లలో ప్రొసీడింగ్స్ ఇచ్చేవారని తెలంగాణ ఆటోడ్రైవర్ల సంఘం అధ్యక్షుడు వి.మారయ్య, తెలంగాణ ఆటోడ్రైవర్ల సంక్షేమ సంఘం నాయకులు ఎ.సత్తిరెడ్డి, అమానుల్లాఖాన్ పేర్కొన్నారు. ప్రొసీడింగ్ల జారీలో ఎలాంటి లోపాలకు తావు లేకుండా రవాణా అధికారులు శ్రద్ధ చూపాలని కోరారు. -
గ్రేటర్లో పోలీస్ రోబో
‘ఇనుములో ఒక హృదయం మొలిచెనే...’ అందరికీ సుపరిచితమైన ‘రోబో’ సినిమాలోని పాట ఇది. కానీ ఇక ‘ఇనుములో ఒక పోలీస్ మొలిచెనే...’ అని పాడుకోవాల్సిందే! అవును మరి.. త్వరలోనే నగర భద్రత విభాగంలో రోబో చేరనుంది. గ్రేటర్లో పోలీస్ రోబోల ప్రాజెక్ట్ శరవేగంగా జరుగుతోంది. టీ–హబ్ వేదికగా అంకురించిన ఈ ఆలోచన... త్వరలోనే అమల్లోకి రానుంది. టీ–హబ్‌లో 6 నెలల క్రితం ఈ రోబో ఆలోచన మొగ్గ తొడిగింది. ప్రస్తుతం గచ్చిబౌలిలోని హెచ్–బోట్స్ సంస్థ ప్రయోగశాలలో రోబో నిర్మాణ పనులు వడివడిగా జరుగుతున్నాయి. ప్రభుత్వం శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్న తరుణంలో.. తక్కువ ఖర్చుతో ఈ రోబోను సృష్టించేందుకు ఈ సంస్థకు చెందిన 20 మంది నిపుణుల బృందం ఎంతో శ్రమిస్తోంది. ఇనుము, కార్బన్ ఫైబర్ ముడి సరుకుగా వీటిని తయారు చేస్తున్నారు. డిసెంబర్ నెలాఖరులోగా ఈ రోబోల తయారీ పూర్తి కానుంది. ఆ తర్వాత నాలుగు నెలలు బహిరంగ ప్రదేశాల్లో దీని పనితీరును శాస్త్రీయంగా పరీక్షిస్తారు. వచ్చే ఏడాది మే నెలలో నగర పోలీసు బృందంలోకి ఈ రోబోను చేర్చే దిశగా పనులు జరుగుతున్నాయి. పోలీస్ శాఖ అవసరాలకు అనుగుణంగా వీటిని రూపొందిస్తున్నారు. ఇదేం చేస్తుంది? ⇒ కృత్రిమ మేధస్సుతో ఈ రోబో పని చేస్తుంది. ⇒ పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తుంది. ⇒ ప్రజలతో సంప్రదింపులు జరుపుతుంది. వారి ఫిర్యాదు స్టేటస్ ఏ స్థాయిలో ఉందో చిన్న క్లిక్‌తో తెలుపుతుంది. ⇒ మిస్సింగ్ వస్తువులను వెతికేందుకు సాయపడుతుంది. ⇒ పేలుడు పదార్థాలను గుర్తిస్తుంది. ⇒ పోలీస్ శాఖను డిజిటలైజేషన్ చేసేందుకు దోహదం చేస్తుంది. ⇒ తప్పుడు ఫిర్యాదులు, అపరిచిత వ్యక్తుల మిస్డ్కాల్స్ను చిటికెలో గుర్తిస్తుంది. సృష్టికర్తలు వీరే... హెచ్–బోట్స్ సంస్థ సీఈఓ పీఎస్వీ కిషన్ మెకానికల్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రులు. రోబోటిక్స్ తయారీ, పరిశోధన అంశాల్లో ప్రత్యేక కోర్సులు అభ్యసించారు. ఈ రంగంలో తొమ్మిదేళ్ల అనుభవం ఉంది. ఈ రోబో తయారీ బృందంలో హర్ష, అభిషేక్, అన్వేష్, రామ్, టోన్సీ, శశి, వినోద్, ముత్యాలరావు తదితరులు ఉన్నారు. వీరిలో కొందరు డిజైన్, మరికొందరు సాంకేతిక అంశాల్లో సేవలందిస్తున్నారు. ఫుల్ డిమాండ్.. ఈ పోలీస్ రోబోకు ఫుల్ డిమాండ్ ఉంది. ఇప్పటికే గ్రేటర్ పోలీసులతో పాటు కర్నాటక పోలీస్ విభాగం, షార్జా పోలీసులు దీని పనితీరుపై ఆరా తీసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. భవిష్యత్‌లో మాల్స్‌లోనూ వీటిని విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 20 రోబోటిక్ ఉత్పత్తులను తమ సంస్థ తయారు చేసిందన్నారు. లక్ష్యం.. రోబోటిక్ హబ్ 2020 నాటికి దేశవ్యాప్తంగా రోబోల తయారీకి 70 ప్రయోగశాలలు ఏర్పాటు చేసి.. వ్యవసాయం, హెల్త్‌కేర్, శాంతి భద్రతల విభాగంలో సేవలందించే రోబోలను పెద్ద ఎత్తున తయారు చేయాలనేదే మా సంకల్పం. దేశా>న్ని రోబోటిక్స్ హబ్‌గా మార్చాలన్నదే మా లక్ష్యం. – పీఎస్వీ కిషన్, హెచ్–బోట్స్ రోబోటిక్స్ సంస్థ సీఈఓ ధర రూ.3.5 లక్షలు – రూ.5 లక్షలు అతి తక్కువ ఖర్చుతో రోబోలను తయారు చేయడం, కృత్రిమ మేధస్సుతో అవి సమర్థవంతంగా పనిచేసేలా చేయడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని పోలీస్ రోబో సృష్టికర్త, హెచ్–బోట్స్ సంస్థ సీఈఓ కిషన్ ‘సాక్షి’కి తెలిపారు. దీని బరువు 40 కిలోలు కాగా, ఖరీదు రూ.3.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉంటుందన్నారు. ప్రోటోటైప్ రోబోను ఇనుముతో తయారు చేస్తామని, ఇక పోలీస్ రోబోను మాత్రం ఇనుము, కార్బన్‌ఫైబర్ మెటీరియల్‌తో రూపొందిస్తున్నట్లు చెప్పారు. -
స్తంభించిన క్యాబ్స్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో క్యాబ్ సర్వీసులు స్తంభించాయి. ఐటీ కారిడార్, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తదితర ప్రధాన మార్గాలతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో రాకపోకలు సాగించే సుమారు 60 వేల ఓలా, ఉబర్ క్యాబ్ సర్వీసులు సోమవారం ఒక రోజు స్వచ్ఛంద బంద్ పాటించాయి. ఫైనాన్షియర్ల వేధింపుల వల్ల ఇటీవల పలువురు డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడటం, ఓలా, ఉబర్ సంస్థల వైఖరి, ఈ రంగంలో పెరిగిన పోటీ వల్ల సరైన ఉపాధి లభించకపోవడం వంటి కారణాలతో వేలాది మంది డ్రైవర్లు ఆందోళనకు దిగారు. సికింద్రాబాద్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, శంషాబాద్ విమానాశ్రయంలో ధర్నాకు దిగారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి 11వ తేదీ వరకూ క్యాబ్ డ్రైవర్లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ధర్నాలు, ఆమరణ నిరాహార దీక్షలు, నిరవధికంగా క్యాబ్‌ల నిలిపివేతతో నిరసన చేపట్టారు. అయినా క్యాబ్ డ్రైవర్ల సమస్యలకు పరిష్కారం లభించలేదు. గడిచిన 2 నెలల్లో నలుగురు డ్రైవర్లు అప్పుల బాధతో చనిపోయారు. ఈ నేపథ్యంలో ‘ఓలా, ఉబర్ హఠావో, క్యాబ్ డ్రైవర్ బచావో’ నినాదంతో క్యాబ్ డ్రైవర్లు మళ్లీ ఆందోళన బాట పట్టారు. భరోసా లేని ఉపాధి.. నగరంలో నాలుగేళ్ల క్రితం ఓలా, ఉబర్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. డ్రైవర్లకు మొదట్లో భారీగా ఆదాయం లభించింది. ప్రోత్సాహకాలు, కమిషన్లు తదితర రూపాల్లో నెలకు రూ.60 వేలకుపైగా ఆర్జించారు. అప్పట్లో ఉబర్‌లో 10 వేల వాహనాలు, ఓలాలో మరో 5 వేల వాహనాలు ఉండేవి. గత రెండేళ్లలో వాహనాల సంఖ్య సుమారు 1.5 లక్షలకు చేరింది. ఓలా, ఉబర్ క్రమంగా కమీషన్లు, రాయితీలు, ప్రోత్సాహకాల్లో కోత విధించాయి. ఏడాది క్రితం నెలకు కనీసం రూ.40 వేలు సంపాదించిన డ్రైవర్లు.. ఇప్పుడు రూ.25 వేలు కూడా సంపాదించలేకపోతున్నట్లు తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ ఆందోళన వ్యక్తం చేశారు. లీజు వాహనాలతో చిక్కులు.. ఓలా, ఉబర్ సంస్థలు స్వయంగా కొన్ని వాహనాలను లీజుకు తీసుకున్నాయి. ఇలా భారీ సంఖ్యలో వాహనాలు వచ్చి చేరడంతో తమ ఉపాధికి విఘాతం కలిగిందనేది డ్రైవర్ల మరో ఆరోపణ. ‘లీజు వాహనాలు తమ సంస్థకు చెందినవి కావడంతో ప్రోత్సాహకాలు, ట్రిప్పులు వాటికి ఎక్కువగా ఇచ్చి, మాకు తక్కువగా ఇస్తున్నారు. దీంతో టార్గెట్లు పూర్తి చేయలేకపోతున్నాయి’ అని డ్రైవర్ మహేందర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇవీ డిమాండ్లు.. - ఓలా, ఉబర్ సంస్థల స్థానంలో డ్రైవర్ల అసోసియేషన్‌ను గుర్తించి వారే స్వయంగా నిర్వహించుకునేలా ఒక యాప్‌ను రూపొందించి ఇవ్వాలి. - అంతర్జాతీయ క్యాబ్ సంస్థలు ప్రభుత్వానికి 5% కమీషన్ చెల్లిస్తుండగా తాము 10% చెల్లించేందుకు అను మతివ్వాలి. - ఫైనాన్షియర్ల వేధింపుల నుంచి విముక్తి కల్పించాలి. - ఆత్మహత్యలకు పాల్పడిన డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలి. ప్రభుత్వమే పరిష్కరించాలి ఏడాది నుంచి మేము ఇదే డిమాండ్‌పై ఆందోళన చేస్తున్నాం. ప్రైవేట్ దోపిడీ సంస్థల స్థానంలో డ్రైవర్లకే యాప్‌ను అప్పగించాలి. ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరించకుండా అక్రమ కేసులతో వేధిస్తోంది. – శివ, అధ్యక్షుడు, రాష్ట్ర క్యాబ్ డ్రైవర్స్, ఓనర్స్ అసోసియేషన్ భద్రత కల్పించాలి క్యాబ్ డ్రైవర్లకు భద్రత లేకుండా పో యింది. క్యాబ్ సంస్థలు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. పోలీసుల వేధింపులు కూడా భరించలేకపోతున్నాం. ఇది అన్యాయం. డ్రైవర్లకు భద్రత కల్పించాలి. – సిద్ధార్థగౌడ్, క్యాబ్ డ్రైవర్ ఫైనాన్షియర్ల వేధింపులతో ఆజ్యం ఇటీవల డ్రైవర్లపై ఫైనాన్షియర్ల వేధింపులు పెరిగాయి. నెల నెలా వాయిదాలు చెల్లించకపోవడంతో సదరు సంస్థలు వాహనాలను జప్తు చేస్తున్నాయి. ఒక్క నెల బాకీ ఉన్నా వాహనాలను తీసుకెళ్తున్నారని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తమకు భద్రత కల్పించడంతో పాటు, ఉపాధికి భరోసా లభించేలా ప్రభుత్వమే ఒక ప్రత్యేకమైన మొబైల్ యాప్‌ను రూపొందించి ఇవ్వాలని కోరుతున్నారు. -
జీహెచ్ఎంసీ వాహనదారులకు శుభవార్త
గ్రేటర్ హైదరాబాద్‌లోని వాహనదారులకు శుభవార్త. ఇకపై నగరంలో ఎక్కడకు వెళ్లినా పార్కింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లతో పాటు వివిధ వాణిజ్య సంస్థల్లో వాహనాలకు పార్కింగ్ ఫీజును వసూలు చేయరు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని కార్పొరేషన్లలో పార్కింగ్ పాలసీపై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా నగరంలో సినిమాహాళ్లు, షాపింగ్ మాల్స్‌లో పార్కింగ్ దోపిడీ అంశం ప్రస్తావనకు రాగా, ఇకపై ఎలాంటి ఫీజు వసూలు చేయరాదని నిర్ణయించినట్లు తెలిసింది. పార్కింగ్ పాలసీలో ఈ ఉచిత అంశం లేకపోయినా.. దీనికి సంబంధించి త్వరలోనే ప్రత్యేక జీవో జారీ కానున్నట్లు మున్సిపల్ శాఖ అధికారి ఒకరు తెలిపారు. కొత్త సంవత్సరంలోగా ఈ ఫ్రీ పార్కింగ్ అమలులోకి వచ్చే అవకాశం ఉంది. – సాక్షి, హైదరాబాద్ బిల్లులో మినహాయింపు.. నగరంలో పార్కింగ్ జులుంపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ.పది సరుకు కొన్నా రూ.20 నుంచి రూ.50 పార్కింగ్ ఫీజు చెల్లించాల్సి వస్తోంది. ఈ దోపిడీపై కొందరు పోలీస్ స్టేషన్లను ఆశ్రయించారు. వీటిని పరిగణనలోకి తీసుకుని తాజా నిర్ణయం తీసుకున్నారు. ఆయా వాణిజ్య సంస్థల్లో కొనుగోళ్లకు వెళ్లిన వారికే ఈ ఉచిత సదుపాయం కల్పించేందుకు, ఇతరులు పార్కింగ్ ప్రదేశాల్లో గంటల తరబడి పార్కింగ్ చేయకుండా ఉండేందుకు ఆయా దుకాణాలకు వెళ్లిన వారికి బిల్లులో పార్కింగ్ ఫీజు మేరకు మినహాయింపు ఇవ్వనున్నారు. నగరంలోని కొన్ని మాల్స్‌లో ఇప్పటికే ఈ పద్ధతి అమలులో ఉంది. సెల్లార్లో పార్కింగ్ చేయగానే ఫీజు వసూలు చేసి రసీదు ఇస్తారు. షాపింగ్ ముగిశాక బిల్లు చెల్లించేటప్పుడు రసీదు చూపిస్తే ఆ మేరకు బిల్లులో మినహాయింపు ఇస్తున్నారు. సినిమా థియేటర్లలో సినిమా టికెట్‌ను చూపిస్తే సరిపోతుంది. ఈ విధానాన్ని నగరంతోపాటు రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలో అమలు చేయనున్నారు. ఆర్టీసీ.. రైల్వే స్టేషన్లలో..? ప్రైవేట్ వాణిజ్య సంస్థలే ఉచిత పార్కింగ్ కల్పిస్తున్నప్పుడు ఆర్టీసీ, రైల్వే, మెట్రో రైలు స్టేషన్లలోనూ ఫ్రీ పార్కింగ్ కల్పించాలనే డిమాండ్ వస్తోంది. రైల్వే ప్లాట్ఫారం టికెట్ కొనుగోలు చేసినవారు దాన్ని చూపితే సరిపోతుందని, ఆర్టీసీ బస్టాండ్లలో రోజుల తరబడి పార్కింగ్ చేయకుండా ఉండేలా తగిన విధానాలు రూపొందించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 134 పార్కింగ్ లాట్లలో ఇప్పటికే అమలు పార్కింగ్ సమస్యల పరిష్కారానికి జీహెచ్ఎంసీలో ఇప్పటికే పలు చర్యలు చేప ట్టారు. రోడ్ల వెంబడి పార్కింగ్ లాట్లలో ఫీజుల్ని ఎత్తివేశారు. గత ఏడాది అక్టోబర్ నుంచి 134 పార్కింగ్ లాట్లలో ఫీజును ఎత్తేశారు. జీహెచ్ఎంసీ నిబంధనల మేరకు వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే సముదాయాల్లో కొనుగోళ్లకు వచ్చేవారికి ఉచిత పార్కింగ్ కల్పించాల్సి ఉండటంతో సినిమాహాళ్లతోపాటు హోటళ్లు, రెస్టారెంట్లు, వినోద కేంద్రాలు తదితర ప్రాంతాల్లోనూ ఫ్రీ పార్కింగ్‌ను అమలు చేసే దిశలో అధికారులు ఉన్నారు. కమ్యూనిటీ పార్కింగ్.. నగరంలోని ప్రధాన రహదారుల్లో పార్కింగ్ సమస్యను తీర్చడానికి ట్రాఫిక్ పోలీసులు కమ్యూనిటీ పార్కింగ్ విధానాన్ని ప్రతిపాదించారు. షాపింగ్ కాంప్లెక్స్‌లు, వాణిజ్య ప్రాంతాలు ఎక్కువగా ఉన్న చోట ఖాళీ ప్రాంతాన్ని గుర్తించి, కమ్యూనిటీ పార్కింగ్ ప్రాంతంగా ప్రకటిస్తారు. ఆ ప్రాంతంలో అవసరమైన మౌలిక వసతుల కల్పన, మూడు షిఫ్టుల్లో పని చేసేలా సెక్యూరిటీ ఏర్పాటు, ఆ ప్రాంతం నిర్వహణ బాధ్యతల్ని స్థానిక వర్తక సంఘాలకు అప్పగించాలి. దీనిపై త్వరలో తగు చర్యలు తీసుకోనున్నారు. -
అసలే కాలుష్యం..ఆపై క్యుములోనింబస్!
-
అసలే కాలుష్యం.. ఆపై క్యుములోనింబస్!
సాక్షి, హైదరాబాద్: అసలే వాహనాల పొగ, దుమ్ము, ధూళి, కాలుష్యం.. మరోవైపు దట్టంగా పరుచుకుంటున్న క్యుములోనింబస్ మేఘాలు.. సన్నగా, తరచూ కురుస్తూన్న ఉన్న వాన జల్లులు.. మొత్తంగా గ్రేటర్ హైదరాబాద్ ఉక్కిరిబిక్కిరవుతోంది. భూ ఉపరితలానికి కేవలం 0.9 కిలోమీటర్ల తక్కువ ఎత్తులోనే దట్టమైన క్యుములోనింబస్, నింబోస్ట్రేటస్ మేఘాలు ఏర్పడడంతో పట్టపగలే చీకటి కమ్ముకుంటోంది. దీంతో పొగ, దుమ్ము, కాలుష్యం వంటివి ఎక్కడికక్కడే నిలిచిపోయి.. ఊపిరాడని స్థితి నెలకొంటోంది. కాలుష్యం స్థాయిలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనైతే జనం ఇక్కట్లుపడుతున్నారు. దాదాపు మూడు రోజులుగా నెలకొన్న ఈ పరిస్థితి కారణంగా.. అస్తమా, సైనస్ వంటి శ్వాసకోశ, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు సతమతమవుతున్నారు. ఉపరితల ఆవర్తనం, క్యుములోనింబస్ మేఘాలతో నగర వాతావరణంలో తీవ్రమార్పులు చోటుచేసుకున్నట్లు బేగంపేట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త రాజారావు వెల్లడించారు. మరోవైపు క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో.. గురువారం హైదరాబాద్ వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని.. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని రాజారావు తెలిపారు. ఈ నేపథ్యంలో.. జీహెచ్ఎంసీ అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. కాలుష్యం.. కారుమబ్బులు హైదరాబాద్‌లో వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో కాలుష్యం శ్రుతి మించుతోంది. పీఎం (పర్టిక్యులేట్ మేటర్) అవశేషాలు పెరిగిపోతున్నాయి. వాతావరణం సాధారణంగా ఉంటే దుమ్ము, ధూళి, పర్టిక్యులేట్ మేటర్ వంటివి భూ ఉపరితలంపై చేరిపోతాయి. వాహనాల పొగ, విష వాయువులు వాతావరణంలో కలసిపోతాయి. కానీ దట్టంగా మేఘాలు ఆవరించి ఉండడంతో వాతావరణం బంధించినట్లుగా మారిపోయింది. దీనికితోడు తరచూ వర్షం కురుస్తుండడంతో ఇబ్బందిగా మారింది. కాలుష్యాలు వర్షపు నీటిలో చేరడం, రోడ్లపైన నిలిచిన నీరు, చెత్తా చెదారం కారణంగా దుర్వాసన వంటివి దీనికి తోడయ్యాయి. వీటన్నింటి మధ్యా ఊపిరాడని పరిస్థితి నెలకొంటోంది. కోరలు చాస్తున్న కాలుష్యం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కాలుష్యం మోతాదుకు మించి నమోదవుతోంది. సుమారు 45 లక్షలకుపైగా ఉన్న వాహనాలు వెదజల్లుతున్న పొగ, రహదారులపై రేగుతున్న దుమ్ముతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నా యి. ఘనపు మీటరు గాలిలో ధూళికణాలు (పీఎం 10) మోతాదు 60 మైక్రో గ్రాములకు మించరాదు. కానీ పలు చోట్ల అంతకు రెట్టింపు స్థాయిలో ధూళి కాలుష్యం వెలువడుతోందని కాలుష్య నియంత్రణ మండలి తాజా అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా బాలానగర్, ఉప్పల్, జూబ్లీహిల్స్, చార్మినార్, ప్యారడైజ్, జూపార్క్, పంజాగుట్ట, కూకట్పల్లి, చిక్కడపల్లి, ఎంజీబీఎస్ ప్రాంతాల్లో వాయు కాలుష్యం శ్రుతి మించినట్లు తేలింది. కాలుష్యానికి కారణాలెన్నో.. ► గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వాహనాల సంఖ్య 45 లక్షలకు చేరింది. వీటికి ఏటా సుమారు 109.5 కోట్ల లీటర్ల పెట్రోల్, 120.45 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగిస్తారని అంచనా. దీంతో వాయు కాలుష్యం పెరిగిపోతోంది. పదిహేనేళ్లకు పైబడిన కాలం చెల్లిన వాహనాలు 10 లక్షల వరకు ఉన్నాయి. వీటితోనూ ఇబ్బందే. ►వాహనాల సంఖ్యతో రహదారులు సరిపోక.. ట్రాఫిక్ రద్దీ పెరుతోంది. దాంతో ఇంధన వినియోగం పెరగడంతోపాటు దుమ్ము, ధూళి ఎగసిపడుతున్నాయి. ►శివార్లలోను ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి. వాటి నుంచి వెలువడుతున్న కాలుష్యం పెరిగిపోతోంది. కాలుష్య ఉద్గారాలతో అనర్థాలివే.. ► వాతావరణంలో చేరే విష వాయువులు, దుమ్ము, ధూళి వంటి వాటి కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయ ని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ► టోలిన్, బెంజీన్ వంటి కలుషితాల ద్వారా కేన్సర్, రక్తహీనత, టీబీ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ► సల్ఫర్ డయాక్సైడ్ శ్వాసకోశాలకు చికాకు కలిగించి బ్రాంకైటిస్‌కు కారణమవుతోంది. ► నైట్రోజన్ డయాక్సైడ్ కారణంగా కళ్లు, ముక్కు మండుతాయి. ఊపిరితిత్తుల సమస్య తలెత్తుతుంది. ► అమ్మోనియా మోతాదు పెరగడం వల్ల కళ్లమంట, శ్వాస వ్యవస్థ దెబ్బతినడం జరుగుతుంది. ► పీఎం10, పీఎం 2.5, ఆర్‌ఎస్‌పీఎం ధూళి రేణువులు ఊపిరితిత్తుల్లో చేరి తీవ్రమైన వ్యాధులు వస్తాయి. కేన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇక పర్టిక్యులేట్ మేటర్ కళ్లలోకి చేరడంతో కంటి సమస్యలు తలెత్తుతాయి. -
సెప్టెంబర్ 5న సెలవు
సాక్షి, హైదరాబాద్ : గణేష్ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 5ను సెలవురోజుగా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిమజ్జన రద్దీ ఎక్కువగా ఉండే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు మాత్రమే ఈ సెలవు వర్తించనుంది. సెప్టెంబర్ 5న సెలవు ఇచ్చినందున ఈ నెల 9న(రెండో శనివారం) ఉద్యోగులంతా పనిచేయాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
గ్రేటర్‌కు సింగూరు, మంజీరా నీళ్లు
వెంటనే విడుదల చేయాలని కేసీఆర్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ తాగునీటి అవసరాలకు సింగూరు, మంజీరా జలాలను తరలించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. నాగార్జునసాగర్‌లో నీటి నిల్వలు అడుగంటిన నేపథ్యంలో హైదరాబాద్, నల్లగొండ జిల్లాలకు మంచి నీటి సరఫరా కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ మేరకు సమీక్ష జరిపారు. సింగూరు, మంజీరా జలాశయాల నుంచి హైదరాబాద్‌కు నిత్యం 90 మిలియన్ గ్యాలన్ల నీటిని వదలాలని, నాగార్జున సాగర్ నుంచి అక్కంపల్లి ద్వారా ఉదయ సముద్రానికి వారం రోజులపాటు 90 మిలియన్ గ్యాలన్ల చొప్పున నీరు వదిలి నల్లగొండ జిల్లాకు తాగునీరివ్వాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఈఎన్సీ మురళీధర్ రావును ఆదేశించారు. మంగళవారం రాత్రి నుంచే నీటి విడుదల జరగాలని సూచించారు. కృష్ణా నదిలో ఈసారి ఆశించిన స్థాయిలో వరద రాలేదని, నాగార్జున సాగర్‌లో నీరు డెడ్ స్టోరేజీ కంటే తక్కువగా ఉందని, ఈ నీటిని జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. కృష్ణా నది నీళ్లపై ఆధారపడిన హైదరాబాద్, నల్లగొండ జిల్లాలకు మంచి నీటి సరఫరాకు ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం వెల్లడించారు. -
రాష్ట్రంలో కొత్త విద్యుత్ సర్కిళ్లు!
మరో 21 సర్కిల్ కార్యాలయాల ఏర్పాటు - 15 నుంచి 36కు పెరిగిన డిస్కంల ఆపరేషన్స్ సర్కిళ్లు - గ్రేటర్ హైదరాబాద్‌లో కొత్తగా 4 సర్కిళ్లు - కొత్త జిల్లాలకు అనుగుణంగా డిస్కంల అధికార వికేంద్రీకరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాలకు అనుగుణంగా రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు అధికార వికేంద్రీకరణ చేపట్టాయి. ఉమ్మడి జిల్లాల ఆపరేషన్స్ సర్కిల్ కార్యాలయాల ఆధ్వర్యంలోనే కొత్త జిల్లాల్లో విద్యుత్ పంపిణీ వ్యవహారాలను డిస్కంలు పర్యవేక్షిస్తుండగా, తాజాగా కొత్త జిల్లాల్లో సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్)ల పరిధిలో ఇప్పటివరకు మొత్తం 15 ఆపరేషన్స్ సర్కిల్ కార్యాలయాలుండగా, తాజాగా మరో 21 కొత్త సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. దీంతో రాష్ట్రంలో విద్యుత్ సర్కిల్ కార్యాలయాల సంఖ్య 36కు పెరిగింది. గ్రేటర్ పరిధిలో 6 సర్కిల్ కార్యాలయాలు ఉండగా.. పెంపులో భాగంగా 4 కొత్త సర్కిళ్లు ఏర్పాటయ్యాయి. విద్యుత్ సర్కిల్ కార్యాలయాల పర్యవేక్షణలోనే క్షేత్రస్థాయి వరకు విద్యుత్ సరఫరా జరుగుతుంది. విద్యుత్ పంపిణీలో అంతరాయాలను సరిదిద్దడం, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు, విద్యుత్ బిల్లుల వసూళ్లు తదితర కీలక బాధ్యతలను విద్యుత్ సర్కిల్ కార్యాలయాలు పర్యవేక్షిస్తున్నాయి. ఒకేసారి వీటి సంఖ్య భారీగా పెంచడంతో క్షేత్రస్థాయి వరకు సర్కిల్ కార్యాలయాల సేవలు అందనున్నాయి. ఈ కార్యాలయాలకు సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ) స్థాయి అధికారులను నియమిస్తూ డిస్కంలు ఉత్తర్వులిచ్చాయి. భారీ ఎత్తున డివిజనల్ ఇంజ నీర్లను ఎస్ఈలుగా పదోన్నతులు కల్పించాయి. దక్షిణ డిస్కం పరిధిలో.. టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలో 10 సర్కిల్ కార్యాలయాలుండగా, కొత్తగా మరో 9 కార్యాలయాలను సంస్థ యాజమాన్యం ఏర్పాటు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్, హైదరాబాద్ నార్త్, రంగారెడ్డి ఈస్ట్, రంగారెడ్డి నార్త్, రంగా రెడ్డి సౌత్ సర్కిల్ కార్యాలయాలున్నాయి. తాజా గా గ్రేటర్ పరిధిలో 4 సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నార్త్ సర్కిల్‌ను రెండుగా విభజించి బంజారాహిల్స్, సికింద్రాబాద్ సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. సరూర్‌నగర్, రాజేంద్రనగర్, సైబర్ సిటీ సర్కిళ్లను ఏర్పాటు చేసింది. రంగారెడ్డి సౌత్ సర్కిల్ పేరును వికారాబాద్‌గా మార్చింది. గ్రామీణ ఉమ్మడి జిల్లాలైన నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్‌లతోపాటు సిద్దిపేటలో ఒక్కో సర్కిల్ కార్యాలయం ఉండగా, ఇప్పుడు యాదాద్రి, సూర్యాపేట, గద్వాల్, నాగర్ కర్నూల్, వనపర్తి, మెదక్‌లలో కొత్త సర్కిల్లను ఏర్పాటు చేసింది. ఉత్తర తెలంగాణ డిస్కం పరిధిలో.. టీఎస్ఎన్పీడీసీఎల్ పరిధిలో 5 సర్కిళ్లు ఉండగా, తాజాగా మరో 10 కొత్త సర్కిళ్లు ఏర్పాటయ్యా యి. గతంలో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ సర్కిళ్లు ఉండగా, కొత్తగా నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, జగి త్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కామారెడ్డి, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, భద్రాద్రి సర్కిళ్లను ఏర్పాటు చేసింది. వరంగల్ సర్కిల్‌ను వరంగల్ అర్బన్‌గా పేరు మార్చింది. దీంతో టీఎస్ఎన్పీడీసీఎల్ పరిధిలో సర్కిళ్ల సంఖ్య 17కి పెరిగింది. -
స్కూళ్ల వద్దే బస్‌పాస్‌లు
►గ్రేటర్ ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు ►60 వేల మందికి ఉచిత బస్‌పాస్‌లు ►15 లక్షల మందికి పాస్‌లే లక్ష్యం... సిటీబ్యూరో: విద్యార్థుల బస్‌పాస్‌ల కోసం గ్రేటర్ ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఈ ఏడాది సుమారు 15 లక్షల మందికి వివిధ రకాల బస్‌పాస్‌లు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. గతేడాది 13.8 లక్షల మంది విద్యార్థులకు పాస్‌లను అందజేయగా, ఈ ఏడాది మరో 1.2 లక్షల మంది అదనంగా పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు ఉచిత, రూట్, స్టూడెంట్ జనరల్, స్టూడెంట్ గ్రేటర్, స్టూడెంట్ స్పెషల్, స్టూడెంట్ ఎక్స్‌క్లూజివ్, డిస్ట్రిక్ట్, తదితర కేటగిరీల పాస్‌ల కోసం ఈనెల 10 నుంచి తెలంగాణ ఆర్టీసీ వెబ్సైట్ జ్టి్టp:// ౌn జీn్ఛ. ్టటట్టఛిp్చటట. జీn లో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థుల నుంచి అందిన దరఖాస్తుల పరిశీలన, విద్యాసంస్థల నిర్ధారణ అనంతరం 4 రోజుల వ్యవధిలో పాస్‌లు జారీ చేస్తారు. ఆర్టీసీకి వచ్చిన దరఖాస్తులను స్టూడెంట్ కోడ్ నెంబర్ ఆధారంగా ఆన్లైన్లో ఆయా విద్యాసంస్థలు నిర్ధారించుకొని తిరిగి ఆర్టీసీకి ఫార్వర్డ్ చేసే సదుపాయం ఉంది. బోగస్ పాస్‌ల ఏరివేతలో భాగంగా విద్యాసంస్థల ఆన్లైన్ ధ్రువీకరణను తప్పనిసరి చేశారు. ఉచిత పాస్‌లపై స్పెషల్ క్యాంపెయిన్... మరోవైపు గ్రేటర్ హైదరాబాద్‌లోని సుమారు 65 వేల మంది విద్యార్థులకు ఉచిత బస్‌పాస్‌లు అందజేసేందుకు ఆర్టీసీ ఈ నెల 15 నుంచి 30 వరకు ఉచిత బస్‌పాస్ పక్షోత్సవాలు నిర్వహించనుంది. నగరంలోని అన్ని డిపోల మేనేజర్లు, అధికారులు తమ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లి ఉచిత పాస్‌ల కోసం పిల్లల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. 12 ఏళ్ల వయస్సు వరకు బాలురకు, వయస్సుతో నిమిత్తం లేకుండా పదో తరగతి వరకు బాలికలకు ఆర్టీసీ ఉచిత పాస్‌లు అందజేయనున్నట్టు ఆర్టీసీ ఈడీ తెలిపారు. బస్సు పాస్ జారీ కేంద్రాలివే.. నగరంలోని సికింద్రాబాద్ రెతిఫైల్, గౌలిగూడ సీబీఎస్, సనత్‌నగర్, దిల్సుఖ్నగర్, ఇబ్రహీంపట్నం, అఫ్జల్‌గంజ్, ఈసీఎల్ క్రాస్‌రోడ్స్, మెహిదీపట్నం, ఉప్పల్, చార్మినార్, మేడ్చల్, కాచిగూడ, కూకట్పల్లి బస్‌స్టేషన్, షాపూర్‌నగర్, బీహెచ్ఈఎల్–కీర్తిమహల్, హయత్‌నగర్, శంషాబాద్, మిధాని కేంద్రాల నుంచి బస్‌పాస్‌లు పొందవచ్చు. అడ్మినిస్ట్రేటివ్ కోడ్ తప్పనిసరి.... అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు తప్పనిసరిగా ఆర్టీసీ నుంచి బస్‌పాస్ కోడ్ పొందాలి. ఇందుకోసం విద్యాసంస్థలు సకాలంలో అడ్మినిస్ట్రేటివ్ ఫీజు చెల్లించి కోడ్‌ను పునరుద్ధరించుకోవాలని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తమ్ తెలిపారు. పాత కోడ్ పునరుద్ధరణ, కొత్త కోడ్ తీసుకునేందుకు జూబ్లీబస్‌స్టేషన్, 2వ అంతస్తులోని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ కార్యాలయంలో సంప్రదించవచ్చు. పూర్తి వివరాల కోసం ఫోన్ నెం.8008204216ను సంప్రదించాలి. -
సీబీఎస్ఈలో ‘గ్రేటర్’ విద్యార్థుల హవా
సాక్షి, హైదరాబాద్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పదో తరగతి ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ విద్యార్థులు ఎక్కువ మంది పదికి పది గ్రేడ్లు సాధించారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ నుంచి పరీక్షకు హాజరైన 149 మంది విద్యార్థుల్లో 78 మంది ఏ–1 గ్రేడ్ సాధించగా ఇందులో 43 మంది 10/10 జీపీఏతో తమ ఘనతను చాటుకున్నారు. ఇక ఆంధ్ర మహిళా సభ పి.ఓబుల్‌రెడ్డి పబ్లిక్ స్కూల్లో 193 మంది విద్యార్థుల్లో 20 శాతం మంది, భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్ విద్యాశ్రమంలో 263 మంది విద్యార్థుల్లో 81 మంది 10/10 సీజీపీఏ సాధించి స్కూల్ టాపర్లుగా నిలిచారు. మెరీడియన్ స్కూల్లో 46 మంది విద్యార్థులు 10/10 సీజీపీఏతో జయకేతనం ఎగుర వేశారు. సనత్‌నగర్ హిందూ పబ్లిక్ స్కూల్లో 189 మంది విద్యార్థుల్లో 37 మంది, హిమాయత్‌నగర్ ఆక్స్ఫర్డ్ గ్రామర్ హైస్కూల్‌కు చెందిన నేహా అంజుమ్, మానిష్ కుమార్దాస్లు పదికి పది పాయింట్లు సాధించారు. -
రూ.5 వేల కోట్లతో నగరాల అభివృద్ధి
- మున్సిపల్ కమిషనర్లతో సమీక్షలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ - జిల్లా కేంద్రాలుగా మారిన పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు - మున్సిపాలిటీలుగా పెద్దపల్లి, భూపాలపల్లి, ఆసిఫాబాద్ - అభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయనానికి కమిటీ - భవిష్యత్ అవసరాలకు తగ్గట్లు రోడ్ల విస్తరణ చేపట్టాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో రూ.5 వేల కోట్ల రుణంతో అభివృద్ధి, మౌలిక సదుపాయాలను కల్పించనున్నామని పుర పాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. మిషన్ భగీరథ పథకం అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పొందిన రుణాలకు ఈ రూ.5 వేల కోట్లు అదనమని తెలిపారు. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం కోసం 8 మందితో కమిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. సోమవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టరేట్‌లో మున్సిపల్ కమిషనర్లతో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేప ట్టిన పలు కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని, పురపాలనలో సైతం దేశం మెచ్చుకునే విధంగా పురోగతి సాధిం చాలని ఆకాంక్షించారు. ప్రజలు ప్రభుత్వం నుంచి అద్భుతాలు, చమత్కారాలు ఆశించ డంలేదని, కనీస సదుపాయాలు కోరుకుం టున్నారని పేర్కొన్నారు. పట్టణాల్లో తాగునీటి సరఫరా, శ్మశానాలు, మార్కెట్లు, బస్ బేల ఏర్పాటు తదితర మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. మున్సిపాలిటీల్లో సిటిజన్ సర్వీస్ సెంటర్లు జిల్లా కేంద్రాలుగా ఏర్పడిన పట్టణాల్లో భవిష్యత్ అవసరాలకు తగ్గట్లు రోడ్ల విస్తరణ చేపట్టాలని కేటీఆర్ సూచించారు. మున్సి పాలిటీ కార్యాలయాలకు సమస్యలు, ఫిర్యా దులతో వచ్చే వారితో స్పందించాల్సిన తీరు బాగుండాలని, ఇందుకోసం ప్రతి మున్సి పాలిటీలోని గ్రౌండ్ ఫ్లోర్లో సిటిజన్ సర్వీస్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రతి మున్సిపాలిటీకి రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో నిర్మించిన మహాప్రస్థానం ఆధునిక శ్మశానవాటిక తరహాలోనే నగరంలో మరో 10 శ్మశానాలను ఏర్పాటు చేయను న్నామని వెల్లడించారు. రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లోనూ ఈ తరహా శ్మశానాల ఏర్పా టు కు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచిం చారు. పబ్లిక్ స్థలాల్లో అనధికార హోర్డింగుల ఏర్పాటుపై ఉక్కుపాదం మోపా లని ఆదేశించారు. పట్టణాల్లో డంప్ యార్డులను అభివృద్ధి చేయా లని, అక్కడ సువాసనలు వెదజల్లే మొక్కలు నాటాలని సూచించారు. పారి శుధ్య పనులు చేసే కార్మికులకు తప్పనిసరిగా రేడియం జాకెట్లు, బూట్లు, గ్లౌజులు వంటి రక్షణ పరికరాలు అందించాలని పేర్కొన్నారు. ఈ ఏడాది పనులన్నీ పూర్తి చేస్తాం అభివృద్ధి పనులు పూర్తి చేయడంలో పురపాలక శాఖ ఈ ఏడాది గొప్ప పురోగతి సాధిస్తోందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది జూన్ 1 నాటికి రాష్ట్రంలోని అన్ని నగ రాలు, పట్టణాలను బహిరంగ మలవిసర్జన రహిత ప్రాంతాలు(ఓడీఎఫ్)గా తీర్చిదిద్దుతామని, వచ్చే ఏడాది వేసవిలోగా పట్టణాల్లో మిషన్ భగీరథ పనులు పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాలకు కేంద్రాలైన నాగర్‌కర్నూల్, జనగామ వంటి చిన్న పట్టణా లను భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లు అభివృద్ధి పరుస్తామని చెప్పారు. జిల్లా కేంద్రాలుగా మారిన పెద్దపల్లి, భూపాల పల్లి, ఆసిఫాబాద్ నగర పంచాయతీలను మున్సిపాలి టీలుగా హోదా పెంచుతామని చెప్పారు. కొత్త జిల్లా కేంద్రాల అభివృద్ధికి కావాల్సిన నిధులు కేటాయి స్తామని, పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత మున్సి పల్ కమిషనర్లదేనని అన్నారు. సమావేశంలో పురపాలక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, డైరెక్టర్ శ్రీదేవి, పబ్లిక్ హెల్త్ ఇంజ నీరింగ్ విభాగం ఈఎన్సీ ధన్ సింగ్ పాల్గొన్నారు. -
గ్రేటర్లో ఆఫీస్ స్పేస్.. హాట్ కేక్!
- ముంబై తరువాతి స్థానంలో హైదరాబాద్ - ఢిల్లీ, బెంగళూరులను వెనక్కి నెట్టిన మహానగరం - ఇండియా ఆఫీస్ మార్కెట్ వ్యూరిపోర్ట్ నివేదికలో వెల్లడి సాక్షి, హైదరాబాద్: అవకాశాల హబ్‌గా మారిన గ్రేటర్ హైదరాబాద్‌లో ఇప్పుడు ఆఫీస్ స్పేస్ (కార్యాలయ ప్రదేశం) హాట్ కేక్ అయింది. ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలను నెలకొల్పేందుకు అవసరమైన స్థలాలకు ఇటీవలి కాలంలో డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. దేశ వ్యాప్తంగా ఈ ఏడాది తొలి త్రైమాసికం (జనవరి–మార్చి మధ్య)లో 31 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అవసరం కాగా... ఇందులో ముంబై తరవాత హైదరాబాద్ నగరంలో అత్యధిక డిమాండ్ ఉండడం విశేషం. ముంబైలో 12 లక్షలు, నగరంలో 11 లక్షల అడుగుల మేర ఆఫీస్ స్పేస్ అవసరముందని ‘ఇండియా ఆఫీస్ మార్కెట్ వ్యూ రిపోర్ట్–2017’తాజా సర్వేలో తెలిపింది. విస్తరిస్తున్న వాణిజ్య ప్రాంతం... ప్రధానంగా హైటెక్‌సిటీ, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, రాయదుర్గం, మణికొండ, కూకట్పల్లి ప్రాంతాల్లో డిమాండ్ అధికంగా ఉందని నివేదిక పేర్కొంది. ఈ ప్రాంతాలను సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌గా పిలవడం తెలిసిందే. ఇక నానక్‌రామ్‌గూడలో నిర్మాణంలో ఉన్న రెండు భారీ ఐటీ సెజ్‌లలో కూడా అవస రమైన స్థలాలు దక్కించుకునేందుకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. బంజారాహిల్స్ ప్రాంతంలో మధ్యతరహా ఐటీ కేంద్రాలు విస్తరిస్తుండటంతో ఈ ప్రాంతంలోనూ ఆఫీస్ స్పేస్ హాట్‌కేక్ అయింది. ప్రధానంగా డిమాండ్ ఉన్నదిక్కడే... ► ఐటీ కారిడార్: కార్వీ సంస్థ ఒక లక్ష చదరపు అడుగుల స్థలాన్ని ఇటీవల లీజుకు తీసుకుంది. ► మైహోమ్ హబ్ ఫేజ్–2: 43 వేల చదరపు అడుగుల స్థలాన్ని ప్రైమేరా మెడికల్ టెక్నాలజీస్ సంస్థ అద్దెకు తీసుకుంది. ► ఐటీ కారిడార్‌లోని వెస్ట్రన్ పెర్ల్: 38 వేల చదరపు అడుగుల స్థలాన్ని వర్క్ఫెల్లా అనే సంస్థ లీజుకు తీసుకుంది. నగరంలో అధిక డిమాండ్ ఎందుకంటే... ► నగరంలో ఐటీరంగం శరవేగంగా విస్తరిస్తుండడంతో ఐటీ కారిడార్‌లో ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ అనూహ్యంగా పెరగడం ► దేశ, విదేశాలకు చెందిన పలు ఐటీ, బీపీఓ, కేపీఓ ఆధారిత పరిశ్రమలు సిటీకి క్యూ కడుతుండడం ► నూతన ఆవిష్కరణలకు నిలయంగా మారి న స్టార్టప్ కంపెనీలు గ్రేటర్‌కు వెల్లువెత్తడం ► ఐటీకారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో ఆఫీస్ స్పేస్‌కు ఇటీవలి కాలంలో డిమాండ్ అధికం కావడంతో ఈ ప్రాంతంలో అద్దెలు సైతం 10 శాతం మేర పెరగడం గమనార్హం. ► రియల్ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్, జీఎస్టీ విధానం కూడా వాణిజ్య భవంతుల విస్తరణకు దోహదం చేస్తున్నట్లు రియల్ఎస్టేట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ► నగరంలో వివిష్ట భౌగోళిక వాతావరణం. సునామీ, వరదలు, భూకంపాల వంటి విపత్తులకు ఆస్కారం లేకపోవడం. ► సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉండడం, వేసవిలోనూ సాయంత్రం వేళ వాతావరణం ఆహ్లాదంగా మారడం. ► ఐటీ, అనుబంధ రంగాల్లో పని చేసేందుకు అవసరమైన మానవవనరులు పుష్కలంగా లభించడం. ► తెలంగాణా ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఐటీ, హార్డ్‌వేర్, టీఎస్ఐపాస్ పాలసీలు వివిధ బహుళజాతి సంస్థలను నగరానికి విశేషంగా ఆకర్షించడం. -
ఓల్డ్.. గోల్డే..
లేటు వయసులో లేటెస్టు జాబ్ - అరవై దాటినా.. రెస్ట్‌కు నో చెబుతున్న సీనియర్ సిటిజన్స్ - యువతకు పోటాపోటీగా ఉద్యోగాల వేట - గ్రేటర్ హైదరాబాద్‌లో నయా ట్రెండ్ మొదటిసారి ఉద్యోగంలో చేరడం ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే.. రెండోసారి ఉద్యోగంలో చేరడం.. అది కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత చేరడాన్ని సెకండ్ ఇన్నింగ్స్ అనాల్సిందే కదా. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో నడుస్తున్న నయా ట్రెండ్ ఈ మాటలకు ఊతమిస్తోంది. పనిలోనే తమకు అంతులేని ఆనందం ఉందంటున్నారు గ్రేటర్‌లోని సీనియర్ సిటిజన్స్. అరవయ్యో వడిలోనూ క్షణం తీరిక లేకుండా పనిలో నిమగ్నమవడం ఎంతో సంతృప్తినిస్తోందని చాటి చెబుతున్నారు. ఇలాంటి వారికి ఉద్యోగాలు వెదికిపెట్టడానికి బోలెడన్ని వెబ్సైట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య సుమారు 60 వేల మంది ఆయా సైట్లలో పేర్లు నమోదు చేసుకుని ఉద్యోగాల వేటలో యూత్‌కు తీసిపోమని సవాల్ విసురుతున్నారు. – సాక్షి, హైదరాబాద్ భారం కాదు.. వరం.. దేశంలో ప్రస్తుతం 60 ఏళ్లకు మించి వయస్సున్నవారు సుమారు 10.3 కోట్ల మంది ఉన్నట్లు అంచనా. వీరి సంఖ్య 2021 నాటికి 17 కోట్లకు చేరే అవకాశాలున్నాయి. ప్రస్తుత తరుణంలో వైద్యపరీక్షలు, ఆరోగ్య పరిరక్షణ చర్యలు, ఆధునిక చికిత్సా పద్ధతులు అందుబాటులోకి రావడంతో సగటు జీవనకాలం 65 ఏళ్లకు పెరిగింది. దీంతో వయో వృద్ధులు పనిచేసేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్‌పై మక్కువతో పనిచేస్తున్నా.. రాష్ట్ర భవిష్యత్‌కు నా వంతుగా చేయూతనందించేందుకు పదవీ విరమణ తర్వాత కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నా. సమాజం కోసం పని చేయాలన్న ఆలోచనే నన్ను ముందుకు నడిపిస్తోంది. చదువుకునే రోజుల్లో విద్యార్థి నేతగా తెలంగాణ కోసం ఉద్యమించా. ఇప్పుడు బంగారు తెలంగాణ నిర్మాణం కోసం శ్రమిస్తున్నా. – డాక్టర్ కేవీ రమణాచారి,రిటైర్డ్ ఐఏఎస్, రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు. మానసిక, శారీరక ఆరోగ్యం కోసమే.. శారీరకంగా, మానసికంగా చురుకుగా ఉండేందుకే పదవీ విరమణ చేసిన తర్వాత కూడా పనిచేస్తున్నా. నాకున్న అనుభవంతో కంపెనీ లాభాల బాటలో పయనించేందుకు సలహాలు, సూచనలు ఇస్తున్నా. నిరంతరం పనిచేస్తుండడం ఆనందంగా ఉంది. – ఆనంద్‌రెడ్డి,జలమండలి రిటైర్డ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎవరికీ భారం కాకూడదనే.. కొడుకు, కూతురుకు భారం కాకూడదన్న ఉద్దేశంతో ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగిగా చేరా. ఎవరిపైనా ఆధారపడకుండా జీవించడం సంతృప్తినిస్తోంది. – మల్లారెడ్డి, రిటైర్డ్ అకౌంట్స్ అధికారి, ఆర్టీసీ పనిలోనే ఆనందం.. ఖాళీగా కూర్చుంటే మెదడు చెత్త ఆలోచనలకు నిలయంగా మారుతుందన్న ఫిలాసఫీని గ్రేటర్ సీనియర్ సిటిజన్లు వంటబట్టించుకున్నారు. దీంతో పదవీ విరమణ పొందిన పలువురు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఇంటికి పరిమితమైపోకుండా.. వీలైతే పదవీ విరమణ పొందిన సంస్థలోనో.. లేదా మరోచోట తక్కువ వేతనానికైనా పని చేసేందుకు సై అంటున్నారు. వీరికి ఉద్యోగాలను వెదికిపెట్టేందుకు ‘నాట్ రిటైర్డ్.ఇన్’, మనీక్రాషర్స్.కామ్, న్యూరిటైర్మెంట్.కామ్, మాన్స్టర్.కామ్ తదితర సైట్లు ముందుకొస్తున్నాయి. ఒకసారి నిర్ణీత ఫీజు చెల్లించి నమోదు చేసుకుంటే.. ఉద్యోగం వచ్చేవరకు ఆఫర్లను అందిస్తున్నాయి. ఇలాంటి వారు తమ అనుభవం, అర్హతలను బట్టి రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు వేతనాలు పొందుతున్నారు. 30 శాతం మంది నో రి‘టైర్డ్’.. పదవీ విమరణ పొందినవారంతా ఇలా ఉద్యోగాల వేటలో ఉన్నారనుకుంటే పొరబాటే. 30 శాతం మంది ఉద్యోగాల అన్వేషణలో ఉంటే.. మరో 60 శాతం మంది సామాజిక సేవ, గార్డెనింగ్, ప్రకృతి వ్యవసాయం, కళారంగం తదితర వ్యాపకాల్లో కాలక్షేపం చేస్తున్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. మరికొందరు ఆరోగ్య రీత్యా విశ్రాంతికి.. మరికొందరు మనవళ్లు, మనవరాళ్లతో ఆనందంగా గడిపేందుకు ప్రాధాన్యతనిస్తున్నట్లు తేలింది. సెకండ్ ఇన్నింగ్స్.. ఎందుకంటే.. ► పనిచేస్తూ ఉంటే శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందన్న నమ్మకం. ► కొడుకులు, కూతుళ్లకు భారం కాకుండా.. తమ కాళ్లపై తాము నిలబడాలనుకునే మనస్తత్వం. ► కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పనిచేయాల్సి రావడం. ► విదేశాల్లో ఉంటున్న సంతానం వద్దకు వెళ్లి అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఇమడలేకపోవడం. ► తమ అనుభవం, విజ్ఞానంతో అద్భుతాలు సృష్టించవచ్చన్న విశ్వాసం. ► పలువురికి స్ఫూర్తినిచ్చి ఆదర్శంగా నిలవాలనుకునే వ్యక్తిత్వం. -
ఆటోలు ఆగాయి..
- నేడు గ్రేటర్లో నిలిచిపోనున్న 1.4 లక్షల ఆటోలు - థర్డ్‌పార్టీ బీమా పెంపునకు వ్యతిరేకంగా ఆటోసంఘాల నిరసన సాక్షి, హైదరాబాద్: భారీగా పెంచిన థర్డ్‌పార్టీ బీమా ప్రీమియంకు వ్యతిరేకంగా ఆటో సంఘాలు శనివారం ఆటో బంద్ తలపెట్టాయి. దీంతో గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 1.4 లక్షల ఆటోలు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి. దాదాపు 15 లక్షల మంది ప్రయాణికులపై ఈ ప్రభావం పడనుంది. థర్డ్ పార్టీ బీమా ప్రీమియం పెంపును ఉపసంహరించాలని, ఓలా, ఉబర్ వంటి క్యాబ్‌లను రద్దు చేయాలని కోరుతూ ఆటో సంఘాలు ఈ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, సీఐటీయూ, తెలంగాణ ఆటో డ్రైవర్ల సంక్షేమ సంఘం తదితర కార్మిక సంఘాలతో కూడిన ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించనున్నట్లు ఏఐటీయూసీ కార్యదర్శి బి.వెంకటేశం తెలిపారు. లక్షలాది మంది నిరుపేద ఆటో డ్రైవర్లు ఇప్పటికే ఫైనాన్షియర్ల దోపిడీ, పెరిగిన నిత్యావసరాల ధరలతో దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, దీనికితోడు బీమా ప్రీమియం పెంపు మరింత భారం వారిపై మోపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బంద్ సందర్భంగా ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ అదనపు బస్సులు... ఆటోల బంద్ నేపథ్యంలో నగరంలోని ప్రధాన ప్రాంతాల నుంచి అదనపు బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ పురుషోత్తమ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంజీబీఎస్, జేబీఎస్, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ల నుంచి 500 బస్సులు అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. -
ఒక్కరోజులో అమ్ముడైనవి.. 10,500
-
ఒక్కరోజులో అమ్ముడైనవి.. 10,500
- నగరంలో భారీగా బీఎస్–3 వాహన విక్రయాలు - ఆకట్టుకున్న ఆఫర్లు.. షోరూమ్‌లకు పోటెత్తిన జనం సాక్షి, హైదరాబాద్ ఆఫర్ల హోరుతో వాహన షోరూమ్‌లన్నీ కళకళలాడాయి. ద్విచక్ర వాహనాలు, కార్లపైన భారీ ఆఫర్లు ప్రకటించడంతో జనం షోరూమ్‌లకు పరుగులు తీశారు. శుక్రవారం ఒక్కరోజే 10,500 వాహనాల విక్రయాలు జరుగగా.. తాత్కాలిక రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. భారత్ స్టేజ్ –3 వాహనాల అమ్మకాల ఆఖరి రోజైన శుక్రవారం హైదరాబాద్‌లోని ఆటోమోబైల్ షోరూమ్‌లు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. తమ వద్ద ఉన్న స్టాక్ కంటే ఎక్కువ మంది బుకింగ్‌ల కోసం బారులు తీరడంతో పలుచోట్ల షోరూమ్ డీలర్లు నో స్టాక్ బోర్డులు పెట్టేశారు. కొన్ని షోరూమ్‌లలో బినామీల పేరిట వాహనాలను బుక్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. బీఎస్–3 వాహనాలపైన ఏప్రిల్ 1వ తేదీ శనివారం నుంచి నిషేధం కొనసాగనున్న నేపథ్యంలో వాటి అమ్మకాలకు శుక్రవారం ఒక్క రోజే గడువు మిగిలి ఉండడంతో విక్రయాలు విపరీతంగా సాగాయి. ఏప్రిల్ 1 నుంచి కేవలం బీఎస్–4 వాహనాలను మాత్రమే విక్రయించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆటోమోబైల్ కంపెనీలు ఈ వాహనాలపైన భారీ ఆఫర్లను ప్రకటించడం వినియోగదారులను ఆకట్టుకుంది. ద్విచక్రవాహనాలపై రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు డిస్కౌంట్ ఇవ్వగా, కార్లపైన రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు ఇచ్చారు. ఒక్క రోజే 10 వేల వాహనాల విక్రయాలు... గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 150 షోరూమ్‌లు, వాటి అనుబంధంగా మరో 200 సబ్షోరూమ్లు ఉన్నాయి. ప్రతి రోజు సగటున 1,000 నుంచి 1,500 వాహనాలు అమ్ముడవుతాయి. కానీ బీఎస్–3 వాహనాల రద్దు నేపథ్యంలో గురువారం 9,800 వాహనాల అమ్మకాలు జరిగితే.. శుక్రవారం ఆ సంఖ్య 10,500 దాటింది. వీటిలో 8,950 వరకు ద్విచక్రవాహనాలు కాగా మిగతా వాటిలో కార్లు, ఇతర వాహనాలు ఉన్నాయి. బినామీ పేర్లతో అమ్మకాలు... మరోవైపు పలు షోరూమ్‌లు బినామీ అమ్మకాలకు తెరలేపినట్లు ఆరోణలు వెల్లువెత్తాయి. రెండు రోజులుగా తమ షోరూమ్‌లలో పని చేసే సిబ్బంది, తెలిసిన వ్యక్తుల పేరిట వాహనాలను తాత్కాలిక రిజిస్ట్రేషన్లు చేసినట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆఫర్లు ఆకర్శించినా.. చాలా చోట్ల నో స్టాక్ బోర్డులే దర్శనమిచ్చాయి. ఇక శనివారం నుంచి అన్ని రకాల ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, ఇతర తేలికపాటి వాహనాలన్నీ బీఎస్–4 ప్రమాణాల మేరకు తయారు చేసినవి మాత్రమే విక్రయించవలసి ఉంటుంది. -
లారీకి బ్రేక్..
- గురువారం ఉదయం 6 గంటల నుంచి లారీలు బంద్ - దక్షిణాది రాష్ట్రాల లారీ యజమానుల సంఘం సమ్మె ప్రభావం - నగరానికి నిలిచిపోనున్న నిత్యావసర వస్తువుల సరఫరా - పాలు, కూరగాయలు, మంచినీరు, మందులు, పెట్రోల్‌కు మినహాయింపు సాక్షి, హైదరాబాద్: భారీగా పెంచిన బీమా ప్రీమియాన్ని తగ్గించాలనే ప్రధాన డిమాండ్‌తో దక్షిణాది రాష్ట్రాల లారీ యజమానుల సంఘం చేపట్టిన సమ్మెతో లారీలకు బ్రేక్ పడింది. సరుకు లోడింగ్, అన్లోడింగ్ వంటి పనులు బుధవారం అర్ధరాత్రి నుంచి నిలిచిపోయాయి. గురువారం ఉదయం 6 గంటల నుంచి లారీల బంద్ చేపట్టనున్నట్లు ఇప్పటికే పలు లారీ యాజమాన్య సంఘాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆటో గూడ్స్ వాహనాలు మినహా అన్ని రకాల తేలికపాటి, మధ్యతరహా, భారీ సరుకు రవాణా వాహనాలన్నీ బంద్‌లో పాల్గొంటాయని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి తెలిపారు. దీంతో తెలంగాణ అంతటా సుమారు 2.5 లక్షల వాహనాలు, గ్రేటర్ హైదరాబాద్‌లో 70 వేల వాహనాలు నిలిచిపోనున్నాయి. ప్రతి రోజు బియ్యం, పప్పులు, అల్లం, వెల్లుల్లి, ఉల్లి, పసుపు, సిమెంట్, ఐరన్, బొగ్గు వంటి వివిధ రకాల వస్తువులను హైదరాబాద్‌కు తరలించే సుమారు 5 వేల లారీల రాకపోకలు నిలిచిపోనున్నాయి. అత్యవసర వస్తువులైన పాలు, కూరగాయలు, మంచినీరు, మందులు, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ సరఫరాను మాత్రం ప్రస్తుతం సమ్మె నుంచి మినహాయించారు. వారం రోజుల్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా కనిపించకపోతే అత్యవసర సరుకుల రవాణాను సైతం నిలిపివేయనున్నట్లు లారీ సంఘాలు పేర్కొన్నాయి. డీసీఎంలు వంటి వాహనాలు కూడా సమ్మెకు మద్దతిస్తున్న దృష్ట్యా దక్షిణాది రాష్ట్రాల నుంచే కాక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య సరుకు రవాణాపైనా ప్రభావం కనిపించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలకు వర్తించేలా సింగిల్ పర్మిట్ విధానాన్ని అమలు చేయాలని, టోల్ ట్యాక్స్‌ను తగ్గించాలని, త్రైమాసిక పన్నును హేతుబద్ధీకరించాలని స్థానిక లారీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రత్యామ్నాయంపై దృష్టి సారించని సర్కార్ లారీల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదు. రవాణా మంత్రి మహేందర్ రెడ్డితో జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిసి సమ్మె అనివార్యమైన దశలో ప్రత్యామ్నాయంపై దృష్టి సారించకపోవడం గమనార్హం. నగరానికి ప్రతిరోజూ సరఫరా అయ్యే సుమారు 500 లారీల బియ్యం, 200 లారీల ఉల్లి, అల్లం వెల్లుల్లి తదితర వస్తువులు నిలిచిపోనున్నాయి. కర్నూలు, నాందేడ్, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి నగరానికి ఉల్లి సరఫరా.. ఏపీ నుంచి బియ్యం రవాణా నిలిచిపోనుంది. నగర శివార్ల లోని కెమికల్ ఫ్యాక్టరీలకు అవసరమయ్యే 200 లారీల బొగ్గు రవాణాకూ బ్రేక్ పడనుంది. -
రేపటి నుంచి లారీల నిరవధిక సమ్మె
రోజూ ఐదు వేల లారీలకు బ్రేక్! సాక్షి, హైదరాబాద్: భారీగా పెంచిన బీమా ప్రీమియాన్ని తగ్గించాలని, తెలుగు రాష్ట్రాలకు వర్తించే సింగిల్ పర్మిట్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ లారీ యాజమాన్య సంఘాలు గురువారం నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నాయి. రవాణా మంత్రి మహేందర్‌రెడ్డితో జరిపిన చర్చలు సైతం అసంపూర్తిగా ముగియడంతో సమ్మె దిశగా లారీ సంఘాలు కార్యాచరణకు సన్నద్ధమవుతు న్నాయి. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు లారీ లను రోడ్డెక్కించబోమని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసి యేషన్ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల లారీ యజమానుల సంఘంతో కలసి ఈ సమ్మెలో పాల్గొనబోతున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో ఈ నెల 30 నుంచి గ్రేటర్ హైదరాబాద్‌కు రోజు రాకపోకలు సాగించే సుమారు 5వేల లారీలు స్తంభించనున్నాయి. అంతర్రాష్ట్ర లారీ యజమానులు చేపట్టనున్న ఈ సమ్మెకు స్థానిక లారీల యజమానులు కూడా మద్దతునిచ్చే అవకాశం ఉంది. లారీ సంఘాల ప్రధాన డిమాండ్లివి.. ► ప్రైవేట్ బీమా సంస్థల ఒత్తిడి మేరకు థర్డ్ పార్టీ బీమాను ఏప్రిల్ ఒకటి నుంచి 50 శాతం పెంచే ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలి. ► దేశ వ్యాప్తంగా డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు ఏకీకృతంగా ఉండేలా చూడాలి. ► 15 ఏళ్లు నిండిన లారీల పర్మిట్ల రద్దుపై పునరాలోచించాలి. ► తెలుగు రాష్ట్రాల్లో అమలయ్యేలా సింగిల్ పర్మిట్‌కు అవకాశం కల్పించాలి. ► ఉమ్మడి రాష్ట్రానికి చెల్లుబాటయ్యేలా చెల్లించిన క్వార్టర్లీ ట్యాక్స్‌ను తగ్గించి తెలంగాణ పరిధికి అనుగుణంగా కొత్త పన్ను విధానాన్ని అమలు చేయాలి. ► లారీల్లో ఓవర్‌లోడ్‌కు లారీ యజమానులను కాకుండా వినియోగదారులు బాధ్యత వహించేలా చట్టాల్లో మార్పులు చేయాలి. -
వందేళ్ల వనరు!
‘గ్రేటర్’ దాహార్తిని తీర్చనున్న ‘కేశవాపూర్’ రిజర్వాయర్ సమగ్ర ప్రాజెక్టు నివేదిక రెడీ - ఆరు నెలల్లోగా భూసేకరణ దిశగా వడివడిగా అడుగులు - అటవీ భూమి సేకరణపైనే దృష్టి - పాములపర్తిసాగర్ నుంచి 20 టీఎంసీల గోదావరి జలాలను ఈ రిజర్వాయర్‌కు తరలించేందుకు ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: త్వరలో గ్రేటర్ హైదరాబాద్ దాహార్తి తీరనుంది. ఎండాకాలం కూడా తాగు నీరు సమృద్ధిగా లభించనుంది. మరో వందేళ్లవరకు మహానగరానికి తాగునీటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు శామీర్‌పేట్ మండలం కేశవాపూర్‌లో ప్రభుత్వం నిర్మించతలపెట్టిన భారీ స్టోరేజి రిజర్వాయర్ నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధమైంది. జలమండలి ఆధ్వర్యంలో సుమారు రూ.7,770 కోట్ల అంచనా వ్యయంతో 20 టీఎంసీల గోదావరి జలాల నిల్వసామర్థ్యంతో దీన్ని నిర్మించనున్నారు. ఈ రిజర్వాయర్‌కు అవసరమైన అటవీ, ప్రైవేటు భూములను ఆరునెలల్లోగా సేకరించే అంశంపై రెవెన్యూ, జలమండలి యంత్రాంగం దృష్టిసారించింది. ఈ రిజర్వాయర్‌కు ప్రధానంగా కొండపోచమ్మ సాగర్ నుంచి గోదా వరి జలాలను తరలించి నింపేందుకు వీలుగా ఏర్పా ట్లు చేయనున్నారు. ఈ రిజర్వాయర్ నిర్మాణానికి సం బంధించి సాంకేతిక అంశాలు, డిజైన్లు, డ్రాయింగ్స్, పైప్‌లైన్స్, నీటిశుద్ధికేంద్రాలు, శుద్ధిచేసిన నీటిని ఘన్పూర్ రిజర్వాయర్‌కు తరలించే పైప్లైన్ల ఏర్పాటు.. తదితర అంశాలను వ్యాప్కోస్ సంస్థ సమగ్ర ప్రాజెక్టు నివేదికలో పొందుపరిచి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పనులు చేపట్టేందుకు జలమండలి సన్నద్ధమౌతోంది. భూసేకరణ దిశగా వడివడిగా అడుగులు... ఈ రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన 3,822 ఎకరాల భూమిలో 918.84 ఎకరాల మేర అటవీ భూమి ఉంది. మిగతాది ప్రైవేటు వ్యక్తులకు సంబంధించింది. ప్రభుత్వం అనుమతిస్తే ఈ భూమిని ఆరు నెలల్లో సేకరించేందుకు రెవెన్యూ యంత్రాంగం సన్నద్ధమౌతోంది. భూసేకరణ, పరిహారం చెల్లింపునకు సుమారు రూ.518.7 కోట్ల అంచనా వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. రాబోయే వందేళ్లకు గ్రేటర్‌కు జల భాగ్యం... విశ్వనగరం బాటలో పయనిస్తున్న మహానగర జనా భా కోటికి చేరువైంది. పదేళ్లలో జనాభా అనూహ్యంగా పెరిగే అవకాశముంది. కోట్లాది జనాభా తాగునీటి అవసరాలకు మరో వందేళ్లపాటు ఢోకాలేకుండా చూసేందుకు ప్రభుత్వం ఈ భారీ స్టోరేజి రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. చుట్టూ సహజసిద్ధమైన కొండలు, మధ్యలో జలసిరులు కొలువై ఉండేలా అందమైన రాతి ఆనకట్టతో ఈ రిజర్వాయర్ నిర్మాణానికి డిజైన్లు సిద్ధమయ్యాయి. దీంతోపాటు చౌటుప్పల్ మండలం(యాదాద్రి జిల్లా) లోని దండుమల్కాపూర్లోనూ మరో 20 టీఎంసీల కృష్ణా జలాల నిల్వకు మరో భారీ స్టోరేజి రిజర్వాయర్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. అయితే కేశవాపూర్ రిజర్వాయర్ నిర్మాణాన్ని పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించాలని ప్రభుత్వం యోచి స్తోంది. అయితే ప్రభుత్వం బడ్జెటరీ నిధులు కేటాయిం చడం లేదా హడ్కో, జైకా, ప్రపంచ బ్యాంకు, ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వంటి ఆర్థిక సంస్థల నుంచి రుణ సేకరణ లేదా, కేంద్ర ప్రభుత్వ గ్రాంటుతో ఈ రిజర్వాయర్‌ను నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రావాటర్ తరలింపునకు ఏర్పాటు చేసే ప్రధాన పైప్‌లైన్ పొడవు: 18.2 కి.మీ నీటిశుద్ధి కేంద్రం: 172 మిలియన్ గ్యాలన్ల నీటిని శుద్ధిచేసేందుకు వీలుగా నిర్మాణం రావాటర్ తరలింపునకు ఏర్పాటు చేసే పంపులు,వాటి సామర్థ్యం: 16 మెగావాట్ల సామర్థ్యంగల 4 పంప్‌లు శుద్ధిచేసిన నీటి తరలింపునకు ఏర్పాటు చేసే పంపులు, వాటి సామర్థ్యం: 2 మెగా వాట్ల సామర్థ్యంగల 8 పంప్‌లు శుద్ధిచేసిన నీటిని తరలించేందుకు ఏర్పాటు చేసే పైప్లైన్లు: 8 కి.మీ మార్గంలో 3,000 డయా వ్యాసార్థం గలవి సీడబ్ల్యూఆర్(క్రాప్ వాటర్ రిక్వైర్మెంట్):80 మిలియన్ లీటర్లు