సాక్షి, హైదరాబాద్: అక్టోబరు 16న వరంగల్‌లో సింహగర్జన సభ ఏర్పాటు చేసి.. అదే రోజు బీఆర్‌ఎస్ మేనిఫెస్టోను ప్రకటిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే తొలి అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే.
నేడు శ్రావణ మాసం మంచి ముహూర్తం కావడంతో ఇదే శుభఘడియగా భావించి మధ్యాహ్నం 2.38 గంటలకు తర్వాత అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 105 స్థానాల్లో బీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థుల్లో పెద్దగా మార్పులు చేర్పులూ చేయలేదని తెలిపారు. అయితే మొత్తంగా తొమ్మిది స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను మార్చారు. ఇదిలా ఉండగా సీఎం గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్ల నుంచి పోటీలోకి దిగనున్నారు. నాలుగు స్థానాలకు అభ్యర్థుల్ని పెండింగ్ పెట్టారు.
చదవండి: BRS List: వివాదాలున్నా వాళ్లకే టికెట్లు
బీఆర్ఎస్ సముద్రం లాంటింది
అవకాశాలు రాని అభ్యర్థులు హడావిడీ చేసి భవిష్యత్తును పాడుచేసుకోవద్దు అని హితవు పలికారు. పార్టీలోనే ఉండి, అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో తమకు కూడా అవకాశాలు ఉంటాయని చెప్పారు. టికెట్లు రానంత మాత్రాన చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. బీఆర్‌ఎస్ సముద్రం లాంటిదని, పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికీ అవకాశాలుంటాయని చెప్పారు.
రాజకీయ జీవితమంటే ఎమ్మెల్యేగా పని చేయడమే కాదని, ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎంపీ, నామినేటెడ్.. ఇలా అనేక అవకాశాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. చాలా మంది జిల్లా పరిషత్ ఛైర్మన్లు అయ్యే అవకాశం ఉంటుందని, గతంలో అలా చేశాం కూడా అని చెప్పారు. ఈ ఎన్నికల్లోనూ అఖండ విజయం సాధించి తెలంగాణను మరిన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
చదవండి: ‘హైదరాబాద్‌లోని మొత్తం 29 స్థానాల్లో బీఆర్‌ఎస్, మజ్లిసే గెలుపు’
ఎన్నికలంటే ఇతర పార్టీలకు ఒక గేమ్
— BRS Party (@BRSparty) August 21, 2023
మాకు మాత్రం ఒక టాస్క్
- బీఆర్ఎస్ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్ pic.twitter.com/PQcfVb0kI6
ఎన్నికలంటే బీఆర్‌ఎస్‌కు ఓ టాస్క్
ఎన్నికలంటే ఇతర పార్టీలకు పొలిటికల్ గేమ్ అని, బీఆర్‌ఎస్‌కు మాత్రం ఓ టాస్క్ అని కేసీఆర్ తెలిపారు. ఎన్నికలను ఒక పవిత్రమైన యజ్ఞంలా ముందుకు తీసుకెళ్తామన్నారు. పూర్తి స్థాయిలో చర్చించి, సంపూర్ణ అవగాహనతోనే అభ్యర్థుల జాబితాను ప్రకటించామన్నారు. నర్సాపుర్, జనగామ, నాంపల్లి, గోషామహల్ స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయని, రాబోయే నాలుగు రోజుల్లో కమిటీ మరోసారి భేటీ అయ్యి, ఈ స్థానాల్లోనూ అభ్యర్థులను వెల్లడిస్తామన్నారు. సీట్లు ప్రకటించిన అభ్యర్థులు పూర్తిగా ప్రజల్లో ఉన్నందునే గుర్తింపు ఇచ్చి మరోసారి టికెట్లు కేటాయించామన్నారు. టికెట్లు పొందిన వారందరికీ అభినందనలు తెలుపుతూ.. అద్భుత విజయం సాధించాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment