menifesto
-
జార్ఖండ్: జేఎంఎం కూటమీ మేనిఫెస్టో.. ఎన్ని హామీలంటే?
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ-ఎం కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉమ్మడి మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీఎం హేమంత్ సోరెన్ పాల్గొన్నారు. ఉమ్మడి మేనిఫెస్టోలో ఏడు హామీలు పొందుపర్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో మేం మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనంతరం ప్రాధాన్యతాపరంగా ఈ 7 హామీలను అమలు చేస్తాం. ఇవాళ మహాఘటబంధన్ నాయకులందరూ సమావేశమై.. ఈ మేనిఫెస్టో ప్రజల ముందుకు తీసుకువచ్చాం’ అని అన్నారు.జేఎంఎం నేతృత్వంలోని కూటమి.. జార్ఖండ్ పౌరులకు ఇచ్చిన ఏడు హామీలు ఇవే..1. 1932 నాటి ఖతియాన్ విధానాన్ని ఆధారంగా సర్నా మత నియమావళి అమలు చేయటం.2. డిసెంబర్ 2024 నుంచి మైయా సమ్మాన్ పథకం కింద రూ.2,500 అందించడం.3. మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణ కోసం వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటు చేయటం.4. ఒక్కో కుటుంబానికి రూ.450 చొప్పున ఎల్పీజీ సిలిండర్లు, ఒక్కో వ్యక్తికి రేషన్ పరిమాణాన్ని 7 కిలోలకు పెంచటం.5. 10 లక్షల మంది యువకులకు ఉపాధి, రూ. 15 లక్షల వరకు కుటుంబ ఆరోగ్య భృతి కల్పించటం.6. ప్రతి బ్లాక్‌లో డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలు ఏర్పాటు. ప్రతి జిల్లాలో 500 ఎకరాల ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయటం.7. బియ్యం ఎంఎస్పీ రూ.2,400 నుంచి రూ.3,200కి పెంచడంతో పాటు ఇతర పంటల రేట్లను 50 శాతానికి పెంపుఇక.. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 23న వెల్లడికానున్నాయి. -
సూపర్-6.. సూపర్-10 పేరుతో ‘కూటమి’ మరో మోసం: పేర్ని నాని
సాక్షి, గుంటూరు: మరోసారి కూటమి మోసం చేసే ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సూపర్-6, సూపర్-10 పేరుతో మరోసారి మోసానికి తెరలేపారన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, 2014లో చంద్రబాబు మాయమాటలు చెప్పారు.. ప్రజల్ని నమ్మించి టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2019లో ఇచ్చిన హామీలను సీఎం జగన్ అమలు చేశారు. మరోసారి ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేస్తామన్నారు.2019లో ఇచ్చిన మేనిఫెస్టోను 99 శాతం అమలు చేశాం: మంత్రి ధర్మానశ్రీకాకుళం: మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ మేనిఫెస్టో ను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావిస్తామన్నారు. 2019లో ఇచ్చిన మేనిఫెస్టోను 99 శాతం అమలు చేశాం. మేనిఫెస్టోను చంద్రబాబు హేళనగా తీసుకుంటారు. 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పి 20 వేలు కూడా ఇవ్వలేదు. 2014లో చంద్రబాబు మహిళల రుణాలు రద్దు చేస్తామన్నారు. నమ్మి ఓటేసిన మహిళలను చంద్రబాబు మోసం చేశారు’’ అని మంత్రి ధర్మాన మండిపడ్డారు.మోసం చేయకుండా చేసేవి మాత్రమే మేనిఫెస్టోలో పెట్టాం: మంత్రి బొత్సవిశాఖపట్నం: అన్ని వర్గాలకు మంచి జరిగేలా వైఎస్సార్సీపీ మేనిఫెస్టో ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ‘‘మోసం చేయకుండా చేసేవి మాత్రమే మేనిఫెస్టోలో పెట్టాం. గత మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చారు. విద్యా, వైద్యం, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. పేద ఆత్మ గౌరవాన్ని పెంపొందించేలా పథకాలు ఉన్నాయి. లంచాలు, వివక్ష లేకుండా డీబీటీ ద్వారా నగదు జమ చేశాం. గతంలో చంద్రబాబు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశారు. చంద్రబాబు మాయ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.. ఇచ్చిన ప్రతి మాటలను సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. సీఎం జగన్ మేనిఫెస్టోలో పెట్టని అంశాలు కూడా అమలు చేశారు’’ అని మంత్రి బొత్స అన్నారు. ప్రజలను కష్టాల నుంచి బయట పడేసే మేనిఫెస్టో ఇది: తమ్మినేని సీతారాం సంస్కరణల దిశగా వైసీపీ విధానాలు వెళ్తున్నాయి. మేనిఫెస్టోలో విశాఖను క్యాపిటల్ టౌన్‌గా ప్రకటించడం సంతోషం. ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు అంతా విశాఖ రాజధాని కావాలని కోరుకుంటున్నారు. చంద్రబాబుది కాపీ మేనిఫెస్టో. టీడీపీలాగా సాధ్యం కానీ హామీలు ఇవ్వలేదు. -
జగన్ మేనిఫెస్టో...కీలకాంశాలు ఇవే..
-
మరి కాసేపట్లో జగన్ మేనిఫెస్టో
-
బీజేపీ మేనిఫెస్టోపై మల్లికార్జున ఖర్గే విమర్శలు
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీ విడుదలచేసిన మేనిఫెస్టోపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు. గత పదేళ్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేదల కోస చేసిందేమీ లేదని విమర్శించారు. గత ఎన్నికల సందర్భంగా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. ఆ హామీని కూడా నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. మరోవైపు.. పంటల మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తూ.. దేశవ్యాప్తంగా రైతులు రోడ్డు ఎక్కి ధర్నా చేశారని విషయాన్ని ఖర్గే గుర్తుచేశారు. ‘యువతకు ఉద్యోగాల కల్పన కోసం ఎదురు చూస్తోంది. మరోవైపు ద్రవ్యోల్బణం పెరుగుతోంది. అయినా ఈ సమస్యలు మాత్రం ప్రధాని మోదీకి పట్టడం లేదు. మోదీ ప్రధానిగా కొనసాగిన ఈపదేళ్ల కాలంలో దేశంలోని ప్రజలందరికీ ప్రయోజనం చేకూర్చే ఒక్క మంచి పని కూడా చేయలేదు. మోదీ దేశ ప్రజలకు ఏం చేయలేదని కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఇక.. ఈసారి బీజేపీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో నమ్మదగినది కాదు’ అని మల్లికార్జున ఖర్గే విమర్శలు చేశారు. ప్రధాని మోదీ ఇవాళ ‘సంకల్ప పత్ర’ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన విషయం తెలిసిందే. ‘‘మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీగా పూర్తయ్యే గ్యారెంటీ. 70 ఏళ్లు పైబడిన వారికి ఉచిత వైద్యం అందిస్తాం. పేదల జీవితాలు మార్చడమే మోదీ ఇచ్చే గ్యారెంటీ. ఇచ్చిన ప్రతీ హామీని బీజేపీ నెరవేరుస్తుంది. ముద్ర రుణాల పరిమితి రూ.20 లక్షలకు పెంపు. ముద్ర పథకం ద్వారా కోట్ల మందికి ఉపాధి దక్కింది. మహిళలను లక్షాధికారులుగా చేయడమే మా లక్ష్యం. వ్యవసాయంలో టెక్నాలజీని పోత్సహిస్తున్నాం’’ అని ప్రధాని మోదీ వివరించారు. -
జగన్ అనే నేను - హామీ ఇస్తున్నాను..YSRCP 2024 మేనిఫెస్టో
-
25 గ్యారంటీల మేనిఫెస్టోకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదం
న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. మూడున్నర గంటలకుపైగా ఈ సమావేశంలో మేనిఫెస్టోపై చర్చించారు. మొత్తం 25 గ్యారంటీల అమలుకు సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపింది. ‘పాంచ్ న్యాయ్’ పేరుతో అయిదు అంశాలతో మొత్తం 25 గ్యారంటీల మేనిఫెస్టోను ఖరారు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు కీలక నేతలు హాజరయ్యారు. తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు సైతం సాయంత్రం పాల్గొన్నారు. ఇప్పటికే రైతులు, మహిళలు, యువత, బలహీన వర్గాలే లక్ష్యంగా ‘హిస్సేదారి న్యాయ్’, ’కిసాన్ న్యాయ్’, ’నారీ న్యాయ్’, ’శ్రామిక్ న్యాయ్’,’యువ న్యాయ్’ పేరిట హామీలను ప్రకటించిన విషయం తెలిసిందే. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం, రైతులకు వడ్డీలేని రుణాలు, ప్రస్తుతం కేంద్రం అందిస్తున్న సాయం పెంపు, యువత కోసం 30 లక్షల ఉద్యోగాల భర్తీ, ప్రభుత్వ లేక ప్రైవేట్ రంగంలో 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ప్రతి డిప్లొమా లేక డిగ్రీ హోల్డర్‌కు అప్రెంటిస్ షిప్ శిక్షణకు రూ.లక్ష సాయం, 30 ఏళ్లలోపు యువత స్టార్టప్‌లకు నిధులు సమకూర్చడానికి రూ.5,000 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు, పేపర్ లీకేజీల నివారణకు ప్రత్యేక చట్టం, మహిళల కోసం నిరుపేద కుటుంబంలోని ఒక మహిళకు ఏడాదికి రూ.లక్ష సాయం వంటి 25 హామీలపై చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు. మేనిఫెస్టోలోని 25 గ్యారంటీలు హిస్సేదారి న్యాయ్: 1. సామాజిక, ఆర్థిక అంశాలతోపాటు కులాల ఆధారంగా జన గణన. 2. రాజ్యాంగ సవరణ ఆధారంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ప్రస్తుతమున్న 50 శాతం గరిష్ట పరిమితి తొలగింపు. 3. జనాభాకు అనుగుణంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కోసం స్పెషల్ బడ్జెట్. 4 అటవీ హక్కుల వివాదాలకు ఏడాదిలోపు పరిష్కారం. 5. గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను షెడ్యూల్డ్ ఏరియాగా గుర్తింపు. కిసాన్ న్యాయ్ : . 1. స్వామినాథన్ ఫార్ములా ప్రకారం పంటలకు గిట్టుబాటు ధరకు చట్టబద్ధత. 2. రుణమాఫీ కమిషన్ ఏర్పాటు. 3. పంట నష్టపోయిన 30 రోజుల్లో బీమా పరిహారం చెల్లింపు. 4. రైతులు లబ్ధి పొందేలా సుస్థిర ఎగుమతి దిగుమతి విధానం 5. వ్యవసాయ ఇన్‌పుట్స్‌పై జీఎస్టీ మాఫీ. శ్రామిక్ న్యాయ్ : 1. రైట్ టు హెల్త్ చట్టం 2. రోజుకు 400 రూపాయల కనీస వేతనం- ఉపాధి హామీ పథకంలో సైతం 3. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం అమలు 4. అసంఘటిత రంగ కార్మికులకు జీవిత బీమా యాక్సిడెంట్ భీమ 5. ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాలు నిలుపుదల యువ న్యాయ్: 1. 30 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ 2. యువతకు ఏడాది అప్రెంటిస్ట్ షిప్ - ఏడాదికి లక్ష రూపాయలు,(నెలకు 8,500 చెల్లింపు) 3. పేపర్ లీక్ అరికట్టేందుకు కఠినమైన చట్టం 4. గిగ్ వర్కర్ల సామాజిక భద్రతకు చర్యలు 5. యువత స్టార్టప్ కోసం ఐదు వేల కోట్లు కేటాయింపు నారీ న్యాయ 1. ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళకు ఏడాదికి లక్ష రూపాయల ఆర్థిక సాయం. 2. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు. 3. ఆశ, అంగన్వాడి, మిడ్ డే మీల్ వర్కర్లకు ఇచ్చే జీతంలో కేంద్రం వాటా రెట్టింపు. 4. మహిళల హక్కుల రక్షణ కోసం ప్రతి గ్రామంలో అధికారి మైత్రి ఏర్పాటు 5. వర్కింగ్ విమెన్ కోసం సావిత్రిబాయి పూలే పేరుతో హాస్టళ్ల పెంపు #YuvaNYAY 1. #BhartiBharosa : 30 lakh new central government jobs, according to a jobs calendar 2. #PehliNaukriPakki : One year apprenticeship for all educated youth, at Rs. 1 lakh/year (Rs. 8,500/month) 3. Paper Leak se Mukti: Law to completely end all paper leaks… pic.twitter.com/Pc4OvYgFdG — Jairam Ramesh (@Jairam_Ramesh) March 18, 2024 -
ఉత్కంఠ రేపుతున్న వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో
-
2014లో టీడీపీ మేనిఫెస్టో ఒకసారి యూట్యూబ్ లో చూడండి
-
బీజేపీ మేనిఫెస్టోకు సలహాలివ్వండి.. యువతకు మోదీ పిలుపు
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. బీజేపీ మేనిఫెస్టో కోసం దేశ యువత తమ ఆలోచనలను పంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నమో యాప్‌లో యువత తమ అభిప్రాయాలను పంచుకోవాలని ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. న్యూ ఓటర్స్ కాన్ఫరెన్స్ని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ విధంగా సలహాలను అందించిన వారిలో కొందరిని మోదీ భవిష్యత్‌లో కలవనున్నట్లు చెప్పారు. నమో యాప్‌లో తమ అభిప్రాయాలను తెలియజేయాలని మోదీ విజ్ఞప్తి చేశారు. యువత తమ వినూత్న ఆలోచనలను narendramodi.in వెబ్సైట్లో కూడా షేర్ చేయవచ్చని ప్రధాని మోదీ అన్నారు. భారతదేశంలోని యువత తప్పనిసరిగా ఓటు వేయడానికి ఉత్సాహంగా ఉండాలని ప్రధాని మోదీ కోరారు. ప్రజల భాగస్వామ్యం ఉంటే ప్రభుత్వం, ప్రజల మధ్య సహకారం పెరుగుతుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రజా భాగస్వామ్యంతో బీజేపీ మేనిఫెస్టోని రూపొందిస్తే భారత భవిష్యత్తును సరైన దిశగా నడిపిస్తుందని అభిప్రాయపడ్డారు. ఇదీ చదవండి: పెళ్లికి ముందే విడాకులు: బీజేపీ -
మేనిఫెస్టోలపై చర్చకు వచ్చే దమ్ముందా?: జోగి రమేష్ సవాల్
సాక్షి, తాడేపల్లి: తెలుగుదేశం పార్టీకి తెగులు పట్టిందని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. టీడీపీ దివాళా తీసిందని అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసే దమ్ము, ధైర్యం లేదనీ తెలుసని ఎద్దేవా చేశారు. పొత్తుల పేరుతో అందరి కాళ్లు పట్టుకుంటూ చంద్రబాబు తిరుగుతున్నారని దుయ్యబట్టారు. అలాంటి పార్టీకి చెందిన అచ్చెన్నాయుడు వైస్సార్సీపీ మేనిఫెస్టో ఫెయిల్ అయిందని ఆరోపించటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. 99.5% హామీలను అమలు చేసిన నేత సీఎం జగన్మోహన్రెడ్డి అని చెప్పిన జోగి రమేష్.. దీనిని తాము నిరూపిస్తామని తెలిపారు. మేనిఫస్టోలపై చర్చకు వచ్చే దమ్ముందా? అని ప్రశ్నించారు. టీడీపీ 2014 నాటి మేనిఫెస్టో, వైఎస్సార్సీపీ 2019 నాటి మేనిఫెస్టో మీద చర్చకు రాగలరా?అని ప్రశ్నించారు. మేనిఫెస్టో అంటే తమకు బైబిల్, ఖురాన్, భగవద్గీతతో సమానమని తెలిపారు. మేనిఫెస్టో అమలు చేశాం కాబట్టే ధైర్యంగా ప్రతి ఇంటికీ వెళ్ళి మళ్ళీ ఓట్లు అడగగలుగుతున్నామన్నారు. చరిత్రలో ఎవరైనా ఎన్నికల తర్వాత ఇలా ఇంటికి వెళ్ళి అమలు చేసిన కార్యక్రమాల గురించి చెప్పారా? అని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. చంద్రబాబులాగా మేనిఫెస్టోని నెట్ నుంచి తొలగించలేదని దుయ్యబట్టారు. మేనిఫెస్టోని చించి శనక్కాయల పొట్లాలుగా మార్చలేదని మండిపడ్డారు. 2014లో మేనిఫెస్టోని అమలు చేయలేదు కాబట్టే చంద్రబాబును జనం చిత్తుచిత్తుగా ఓడించారని గుర్తు చేశారు. ‘అసలు చంద్రబాబుకు ఏపీతో ఏం పని?. ఈ రాష్ట్రంలో ఆధార్ కార్డు ఉందా?. ఇల్లు, డోర్ నెంబర్ ఉందా?. ఇలాంటి అడ్రస్ లేని వ్యక్తులు మా గురించి మాట్లాడటానికి సిగ్గుండాలి. రైతులు, డ్రాక్రా మహిళలకు రుణమాఫీ పేరుతో దారుణంగా మోసం చేశారు. నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేశారు. అలాంటి మోసకారి, దుర్మార్గుడు అయినందునే చంద్రబాబుకు ఈ గతి పట్టింది. 30 లక్షల మందికి ఇళ్లు కట్టిస్తున్న జగన్ లాంటి సీఎం దేశంలో ఎక్కడైనా ఉన్నారా?. అసలు చంద్రబాబు చెప్పుకోవడానికి ఒక్క పథకమైనా ఉందా?. ‘చంద్రబాబు దిక్కుమాలిన మేనిఫెస్టోని అసలు ఎవరైనా నమ్ముతారా?. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మోకాళ్ల మీద నడిచినా ఆ పాపం పోదు. మళ్ళీ ఈరోజు మహిళలకు ఉచిత ప్రయాణమని అంటున్నారు. మేము ఎలాంటి ప్రకటనా చేయకపోయినా మాపై ఆరోపణలు చేస్తున్నారు. రామోజీ, రాధాకృష్ణ, చంద్రబాబు, పవన్, లోకేష్ ఉండేది, తినేది హైదరాబాదులో. అక్కడ కూర్చుని ఏపీలో రాజకీయాలు చేయటం ఏంటి?. ఈ ఎన్నికల తర్వాత వారు ఈవైపు ఇక కన్నెత్తి కూడా చూడరు’ అని జోగి రమేష్ విమర్శించారు. చదవండి: అర్హులకే నంది అవార్డులు.. ఎవరికీ అన్యాయం జరగదు: పోసాని -
కాంగ్రెస్ మేనిఫెస్టోలో మరికొన్ని కీలకాంశాలు
-
వాళ్లకు అభ్యర్థులే లేరు - మంత్రి కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి సుమారు 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేరని.. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 29 సీట్లలో 25చోట్ల ఈ రోజు వరకూ అభ్యర్థులు లేరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల నుంచి ఎవరైనా వస్తారా అని కాంగ్రెస్ ఎదురుచూస్తోందని.. చాలాచోట్ల ఇప్పటికే ఆశలు వదులుకుని నామమాత్ర పోటీకి సిద్ధమవుతోందని విమర్శించారు. కాంగ్రెస్‌లో ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికే టికెట్ వచ్చే పరిస్థితి ఉందని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రగతిభవన్‌లో మీడియాతో చిట్‌చాట్ చేశారు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. కేటీఆర్ చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కాంగ్రెస్‌లో టికెట్‌కు రూ.15 కోట్లు, ఖర్చులకు మరో రూ.10 కోట్లు దగ్గర పెట్టుకోవాలని ఓ నేతకు చెప్పారట. డబ్బు సంచులను నమ్ముకుని చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చేవారు గొప్పవారనే భావ దారిద్య్రం కాంగ్రెస్‌లో కనిపిస్తోంది. బెంగళూరులోని ఓ కార్పోరేటర్ భర్త ఇంట్లో రూ.42 కోట్ల నగదు దొరికింది. ఇప్పటికే మరో రూ.8 కోట్లు కొడంగల్‌లో రేవంత్‌రెడ్డికి చేరినట్టు మాకు అనధికార సమాచారం ఉంది. కష్టపడి సాధించుకున్న తెలంగాణను ఎవరి చేతిలో పెట్టాలో ప్రజలు ఆలోచించుకోవాలి. అమిత్‌షా క్షమాపణ చెప్పాలి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సిగ్గులేకుండా తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై అబద్ధాలు చెప్తున్నారు. ఆయన రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ప్రధాని మోదీ ఏదో పవిత్రాత్మ అయినట్టుగా ఏ రాష్ట్రానికి వెళ్లినా అవినీతి ప్రభుత్వాలే అంటూ మాట్లాడుతున్నారు. బీజేపీ తొమ్మిదిన్నరేళ్లలో చేసినది ఏమీ లేకనే రజాకార్లు, హిందూ ముస్లిం అంటూ రెచ్చగొడుతున్నారు. బీజేపీకి రాష్ట్రంలోని 110 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతవడం ఖాయం. ఒక గుజరాతీ (వల్లబ్‌భాయ్ పటేల్) తెలంగాణకు విముక్తి ప్రసాదించారని, మరో గుజరాతీ స్వేచ్ఛ ప్రసాదిస్తారని మోదీ అహంకారంతో మాట్లాడుతున్నారు. తెలంగాణ దాస్య శృంఖలాలు తెంచిన ఘనత కేసీఆర్‌దే. రాహుల్ లీడర్ కాదు ఎవరో ఇచ్చింది చదివే రీడర్ మాత్రమే. తెలంగాణలో మిషనరీలు, మసీదుల మీద దాడులు జరగలేదు. హైదరాబాద్ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. జాతీయ పార్టీగా ఎదగాలని అనుకుంటున్న మేం ఎవరికీ తొత్తుగా పనిచేయాల్సిన అవసరం లేదు. ఇది తెలంగాణ గల్లీకి, ఢిల్లీ అహంకారానికి, గుజరాతీ బలుపునకు జరుగుతున్న పోరాటం. అందరికీ మేలు కలిగేలా మేనిఫెస్టో.. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో రైతులు, మహిళలు, దళితులు, బీసీలు, మైనారిటీలతో పాటు యువతపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. సామాజిక భద్రతకు పెద్దపీట వేసేలా.. మధ్య, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు మేలు కలిగేలా మేనిఫెస్టో విశిష్టంగా ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని దీనిని రూపొందించాం. సీఎం కేసీఆర్ వంద వరకు సభల్లో పాల్గొంటారు. నేను, హరీశ్‌రావు, సీనియర్ మంత్రులు స్టార్ క్యాంపెయినర్లుగా పనిచేస్తాం. కక్ష సాధింపు మా విధానం కాదు కాంగ్రెస్ నేతల ఇళ్ల మీద ఐటీ, సీబీఐ దాడులు ఎందుకు జరగడం లేదు? రేవంత్ ఇంటి చుట్టూ కబ్జాలు, సొసైటీల్లో కుంభకోణాలు తెలియవా? మేం కక్ష సాధింపు రాజకీయాలు చేయడం లేదు. మా అతి మంచితనం ప్రస్తుత రాజకీయాల్లో ఓల్డ్ ఫ్యాషన్‌గా కనిపిస్తోంది. రాష్ట్రంలో అధికారుల బదిలీలపై ఎన్నికల సంఘం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. గజ్వేల్‌లో ఈటల రాజేందర్‌తోపాటు రాష్ట్రంలో వైఎస్సార్సీపీ, ప్రజాశాంతి పార్టీతోపాటు రాహుల్, మోదీ ఎవరు పోటీ చేసినా స్వాగతిస్తాం. ఓవర్‌లోడ్‌తో వలసలు సహజమే.. చేరికలతో మా పార్టీ ఓవర్‌లోడ్ అయిన మాట వాస్తవం. బహుళ నాయకత్వం ఉన్నచోట వేరే పార్టీల్లోకి వలసలు సహజం. కాంగ్రెస్‌లో టికెట్లు ప్రకటించగానే తన్నుకుచస్తారు. కాంగ్రెస్‌లో ఇప్పటికే ఒకతను ఎల్బీ స్టేడియంలో సీఎంగా ప్రమాణం చేసేందుకు ముహూర్తాలు పెట్టుకున్నడు. ఒక మీడియా అధిపతి సమక్షంలో కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు నేతలు తలో ఏడాదిన్నర చొప్పున సీఎం పదవి అనుభవించేలా ఒప్పందం చేసుకున్నారు. చివరి ఆరు నెలలు లాటరీ పద్ధతిలో పనిచేస్తారట. ముదిరాజ్‌లకు పదవులు ఇస్తాం సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇవ్వడంతో ముదిరాజ్‌లకు అవకాశం కల్పించలేకపోయాం. 2014, 18లలో మా పార్టీ నుంచి ఈటల రాజేందర్ ఒక్కరే ముదిరాజ్ కమ్యూనిటీకి చెందినవారు. ఆయన పార్టీ నుంచి వెళ్లిన తర్వాత రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాశ్‌కు మండలి డిప్యూటీ చైర్మన్ హోదాతో కేబినెట్ ర్యాంకు ఇచ్చాం. భవిష్యత్తులో ముదిరాజ్‌లకు రాజ్యసభ, శాసనమండలిలో గౌరవ ప్రదమైన పదవులు ఇస్తాం. ఈ విషయాన్ని బూతద్దంలో పెట్టి చూడటం సరికాదు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాతో కలసి పనిచేసేందుకు ఆసక్తి చూపితే.. నేను వ్యక్తిగతంగా వెళ్లి ఆహ్వానిస్తా..’’ అని కేటీఆర్ చెప్పారు. కామారెడ్డిలో కేసీఆర్ పోటీచేయడం వెనుక ఒక వ్యూహం ఉంటుందని.. ఆయన ఒక మ్యాన్ ఆఫ్ మిస్టరీ అని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రకటించిన సీట్లలో మార్పు చేర్పులు ఉంటాయా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. దీనిపై ఇప్పటికే సీఎం స్పష్టత ఇచ్చారని.. ఉంటే ఒకట్రెండు మార్పులు ఉండొచ్చన్నట్టుగా కేటీఆర్ సమాధానమిచ్చారు. -
95 నుంచి 105 స్థానాల్లో గెలుస్తాం.. అక్టోబర్ 16న బీఆర్ఎస్ మేనిఫెస్టో
సాక్షి, హైదరాబాద్: అక్టోబరు 16న వరంగల్‌లో సింహగర్జన సభ ఏర్పాటు చేసి.. అదే రోజు బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రకటిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే తొలి అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. నేడు శ్రావణ మాసం మంచి ముహూర్తం కావడంతో ఇదే శుభఘడియగా భావించి మధ్యాహ్నం 2.38 గంటలకు తర్వాత అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 105 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థుల్లో పెద్దగా మార్పులు చేర్పులూ చేయలేదని తెలిపారు. అయితే మొత్తంగా తొమ్మిది స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను మార్చారు. ఇదిలా ఉండగా సీఎం గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్ల నుంచి పోటీలోకి దిగనున్నారు. నాలుగు స్థానాలకు అభ్యర్థుల్ని పెండింగ్ పెట్టారు. చదవండి: BRS List: వివాదాలున్నా వాళ్లకే టికెట్లు బీఆర్ఎస్ సముద్రం లాంటింది అవకాశాలు రాని అభ్యర్థులు హడావిడీ చేసి భవిష్యత్తును పాడుచేసుకోవద్దు అని హితవు పలికారు. పార్టీలోనే ఉండి, అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో తమకు కూడా అవకాశాలు ఉంటాయని చెప్పారు. టికెట్లు రానంత మాత్రాన చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. బీఆర్ఎస్ సముద్రం లాంటిదని, పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికీ అవకాశాలుంటాయని చెప్పారు. రాజకీయ జీవితమంటే ఎమ్మెల్యేగా పని చేయడమే కాదని, ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎంపీ, నామినేటెడ్.. ఇలా అనేక అవకాశాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. చాలా మంది జిల్లా పరిషత్ ఛైర్మన్లు అయ్యే అవకాశం ఉంటుందని, గతంలో అలా చేశాం కూడా అని చెప్పారు. ఈ ఎన్నికల్లోనూ అఖండ విజయం సాధించి తెలంగాణను మరిన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. చదవండి: ‘హైదరాబాద్‌లోని మొత్తం 29 స్థానాల్లో బీఆర్ఎస్, మజ్లిసే గెలుపు’ ఎన్నికలంటే ఇతర పార్టీలకు ఒక గేమ్ మాకు మాత్రం ఒక టాస్క్ - బీఆర్ఎస్ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్ pic.twitter.com/PQcfVb0kI6 — BRS Party (@BRSparty) August 21, 2023 ఎన్నికలంటే బీఆర్ఎస్కు ఓ టాస్క్ ఎన్నికలంటే ఇతర పార్టీలకు పొలిటికల్ గేమ్ అని, బీఆర్ఎస్కు మాత్రం ఓ టాస్క్ అని కేసీఆర్ తెలిపారు. ఎన్నికలను ఒక పవిత్రమైన యజ్ఞంలా ముందుకు తీసుకెళ్తామన్నారు. పూర్తి స్థాయిలో చర్చించి, సంపూర్ణ అవగాహనతోనే అభ్యర్థుల జాబితాను ప్రకటించామన్నారు. నర్సాపుర్, జనగామ, నాంపల్లి, గోషామహల్ స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయని, రాబోయే నాలుగు రోజుల్లో కమిటీ మరోసారి భేటీ అయ్యి, ఈ స్థానాల్లోనూ అభ్యర్థులను వెల్లడిస్తామన్నారు. సీట్లు ప్రకటించిన అభ్యర్థులు పూర్తిగా ప్రజల్లో ఉన్నందునే గుర్తింపు ఇచ్చి మరోసారి టికెట్లు కేటాయించామన్నారు. టికెట్లు పొందిన వారందరికీ అభినందనలు తెలుపుతూ.. అద్భుత విజయం సాధించాలని ఆకాంక్షించారు. -
‘వైఎస్ జగన్‌ది మేనిఫెస్టో.. చంద్రబాబుది మోసఫెస్టో’
సాక్షి, గుంటూరు: వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చింది మేనిఫెస్టో అయితే చంద్రబాబు ప్రవేశపెట్టింది మోసఫెస్టోనని మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఈ అంశాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని అన్నారు. మేనిఫెస్టో గురించి చంద్రబాబు మాట్లాడుతుంటే సిగ్గేస్తోందని విమర్శించారు. గతంలో చంద్రబాబు ఎంతమంది పేదలను దనవంతులుగా చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. వాగ్ధానాలు చేసి మోసగించిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. వైఎస్ జగన్ మేనిఫెస్టో.. చంద్రబాబు మోసఫెస్టోపై ఇంటింటా చర్చ జరగాలని అన్నారు. గుంటూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘మేనిఫెస్టో అంటే జగన్’ అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ చర్చలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, ఆర్థికరంగ విశ్లేషకులు పాపారావు, మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీలు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, యేసు రత్నం, మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఆదివారం అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లో సీఎం జగన్ ట్రెండ్ సెట్టర్. ఆయన పాలన ప్రజలకు స్వర్గం.. బాబు, ఎల్లో మీడియాకు నరకం. రాజకీయ నాయకులు భష్టు పట్టించిన మేనిఫెస్టోకు పవిత్రత తెచ్చిన వ్యక్తి సీఎ జగన్. జగన్ మోహన్ రెడ్డి రెండు పేజీల మేనిఫెస్టో ఇచ్చారు. అందులో పేర్కొన్నట్లే సంక్షేమ ఫలాలను ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజలకు ఇస్తున్నాం. మీకు మేలు చేస్తేనే ఓటేయమని అడుగుతున్నాం. పేదలకు మేలు చేస్తే ఓటేయండి...లేకపోతే వద్దని దమ్ముగా చెప్పిన ఒకే ఒక్కడు వైఎస్ జగన్మోహన్రెడ్డి’ అని అంబటి వ్యాఖ్యానించారు. చదవండి: ఇంకా 25 మంది కాంటాక్ట్‌లోకి రాలేదు: మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు టీడీపీ కుట్రలను బహిర్గతం: డొక్కా మాణిక్య వరప్రసాద్ చెప్పిన ప్రతి అంశాన్ని అమలు పరచిన గొప్ప ముఖ్యమంత్రి జగన్ అని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. మేనిఫెస్టో అంటే బైబిలు, ఖురాన్, భగవద్గీత అని ముఖ్యమంత్రి అన్నారని.. అందుకే మేనిఫెస్టో అంటే జగన్‌దేనని అన్నారు. ప్రజలను మోసపూరిత మాటలతో చంద్రబాబు మోసం చేస్తున్నారని విమర్శించారు. గుంటూరు జిల్లాలోని ప్రజలకు నిజానిజాలు తెలిపి టీడీపీ కుట్రలను బహిర్గతం చేయాలనే ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలు చించేశారు: ఎమ్మెల్సీఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ‘రాజకీయ పార్టీలు తాము గెలిచిన తరువాత ప్రజలకు చేయబోయే పథకాలను తెలియజేస్తారు.కొన్ని పార్టీలు ఎన్నికలకు ముందు విడుదల చేసిన మేనిఫెస్టో గెలిచిన తరువాత చించుతున్నారు. గతంలో చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోను ప్రజలు చెక్ చేస్తే అప్పటికే దానిని చించారని గుర్తించారు. వైఎస్సార్సీపీ తీసుకు వచ్చిన మేనిఫెస్టోను నాయకుల ముందు ఉంచి ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించి 98 శాతం అమలు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్’ మేనిఫెస్టోను వెబ్సైట్ నుంచి మాయం చేసిన వ్యక్తి చంద్రబాబు: కొమ్మినేని శ్రీనివాసరావు గతంలో చంద్రబాబు మేనిఫెస్టోలో చెప్పింది ఒక్కటి కూడా అమలు కాలేదని, 2019లో వైఎస్ జగన్ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీ అంశం అమలు చేశారని ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. తన మేనిఫెస్టోను వెబ్ సైట్ నుంచి మాయం చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ కొమ్మినేని దుయ్యబట్టారు. ‘‘మేనిఫెస్టోను భగద్గీత,ఖురాన్,బైబిల్ గా భావించిన వ్యక్తి సీఎం జగన్. మేనిఫెస్టో అంటే సీఎం జగన్ దృష్టిలో ప్రజలకు ఇచ్చిన హామీ. మేనిఫెస్టో అంటే చంద్రబాబు దృష్టిలో ప్రజలను నమ్మించే ఓ కాగితం. దేశమంటే మట్టికాదోయ్.. మనుషులోయ్ అన్నారు గురజాడ.. ఆయన మాటలను తూచా తప్పకుండా పాటిస్తున్న వ్యక్తి వైఎస్ జగన్. ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు మరోసారి సిద్ధమయ్యారు. సోనియా గాంధీని ఎదిరించి సీఎం జగన్ ఎన్నో ఇబ్బందులు పడ్డారు’’ అని కొమ్మినేని అన్నారు. చంద్రబాబు మేనిఫెస్టో కలగూరగంప: ఆర్ధిక రంగ విశ్లేషకులు పాపారావు వైఎస్ జగన్ మేనిఫెస్టోను తప్పుపట్టిన చంద్రబాబు ఇప్పుడు అదే మేనిఫెస్టోను ఫాలో అవుతున్నాడు. ఏపీ శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేశారు. చంద్రబాబు మేనిఫెస్టో కలగూరగంప. జగన్ అవునన్నదల్లా చంద్రబాబు కాదన్నాడు. జగన్ ఎస్ అంటే నో అన్నాడు..నో అంటే ఎస్ అన్నాడు. చంద్రబాబు మేనిఫెస్టోపై ఆయన పార్టీలోనూ చర్చ జరగడం లేదు. మేనిఫెస్టోలో చెప్పిందే జగన్ చేస్తున్నాడు. పేద ప్రజలను మోసం చేయడం లేదు. ఆయన వల్ల ఎవరూ దగాపడలేదు. అమరావతిలో పేదలకు ఇళ్లిస్తామంటే చంద్రబాబు చీదరించుకున్నాడు. పేదలు అమరావతిలో ఉండకూడదా? జనానికి ఉపయోగపడేలా రాజకీయం చేయాలి. పేదలకు వ్యతిరేకంగా భావజాలంతో ఉన్న వారిని తరిమికొట్టాలి మళ్లీ జగనే సీఎం: మర్రి రాజశేఖర్ మేనిఫెస్టోను తూచ తప్పకుండా అమలు చేస్తున్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి జగన్ అని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పేర్కొన్నారు. సీఎ జగన్ మేనిఫెస్టోకు ఒక విలువ తెచ్చారని ప్రశంసించారు. భారతదేశానికే ఆదర్శవంతమైన వైఎస్ జగన్.. చంద్రబాబులాగా అబద్ధాలు చెప్పుంటే 2014లో సీఎం అయ్యుండేవారని అన్నారు. ఒక్కరూపాయి కూడా లంచం తీసుకోకుండా ప్రజలకు సేవలు అందేలా చేస్తున్న వ్యక్తి వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోకు ప్రజల నుంచి స్పందన రావడం లేదని ఈ రాష్ట్రానికి మళ్లీ జగనే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. -
ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తాం: సజ్జల
సాక్షి,తాడేపల్లి: ఎన్నికల ముందు ఇచ్చే హామీలు పవిత్రంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 100కు వందశాతం అమలయ్యేలా ఉండాలన్నారు. మ్యానిఫెస్టో తయారీకి ముందే రాజకీయ పార్టీలు ఆచరణ సాధ్యం పరిశీలించాలని సూచించారు. తాము గతంలో చెప్పినవి 98శాతం పైగా పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. అంతకుముందు అడ్డగోలుగా హామీలు ఇచ్చి చంద్రబాబు ప్రజలు నష్టపోయేలా చేశారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కొత్త పార్టీల వల్ల పోటీ పెరిగి తమ పనితీరును మరింత మెరుగు పరుచుకోవచ్చన్నారు. ప్రజల అంశాలపై విధానపరమైన అంశాలతో పార్టీలు వస్తే మంచిదేనన్నారు. కొత్త పార్టీల రాకపై మేము విశ్లేషించమని తెలిపారు. తమది రాజకీయం కోసం రాజకీయ ఎత్తుగడలు వేసే పార్టీ కాదని స్పష్టం చేశారు. ప్రతి అంశాన్ని పారదర్శకంగా చేస్తున్నామని, అందుకే ప్రజలు తమను సొంతం చేసుకున్నారన్నారు. చదవండి: ఆదాయాలను సమకూరుస్తున్న శాఖలపై సీఎం జగన్ సమీక్ష ‘మా విధానం మాకు ఉంది, మేము ప్రజల కోసం రాజకీయం చేస్తున్నాం. కాబట్టి ప్రజలు మాకే మద్దతు ఇస్తారని నమ్ముతున్నాం. అంతిమ నిర్ణేతలు ప్రజలే. రాష్ట్ర అభ్యున్నతే ముఖ్యం. పక్క రాష్ట్రాల గురించి మేము మాట్లాడటం లేదు. వాళ్లు అక్కడి విషయాలు వదిలేసి మా గురించి ఎందుకు విమర్శలు చేస్తున్నారు. భవిష్యత్తు రాజకీయాల కోసం వాళ్లు అలా చేస్తున్నారేమో మాకు తెలియదు. తెలంగాణ నేతలు మా గురించి మాట్లాడటంతోనే మేము స్పందించాల్సి వచ్చింది. మేము ఇక్కడి వ్యవహారాలకు మాత్రమే కట్టుబడి ఉన్నాం. మేము ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు. అందరూ బాగుండాలనేదే వైఎస్సార్ సీపీ సిద్ధాంతం. అమరావతి ఉద్యమం పేరుతో చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. అభివృద్ధి వికేంద్రీకరణ విధానం ఎందుకు ఎత్తుకున్నామో ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇది చారిత్రాత్మక పరిణామం. చంద్రబాబు రుణమాఫీ హామీ ఇచ్చి అమలు చేయలేదు.’ అని సజ్జల పేర్కొన్నారు. -
మేనిఫెస్టోను పవిత్రగ్రంథంగా భావించిన సీఎం వై యస్ జగన్
-
బీజేపీ వరాల జల్లు.. ఉచిత స్కూటీలు
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ఓటర్లపై బీజేపీ వరాల జల్లు కురిపించింది. హస్తిన అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో బీజేపీ ఎన్నికల మేనిఫేస్టోని శుక్రవారం విడుదల చేసింది. వీటిలోని ముఖ్య అంశాలను ఆ పార్టీ చీఫ్ మనోజ్ తివారీ మీడియా ముందు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ యోజన పథకాన్ని అధికారంలోకి రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే కాలేజీకి వెళ్లే విద్యార్థినులకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలు, పాఠశాల పిల్లలకు సైకిల్స్ పంపిణి చేస్తామన్నారు. ఢిల్లీ నివసించే పేదలు గోదుమలు కొనుక్కోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. వారికి కేవలం రెండు రూపాయాలకే కేజీ గోదుమ పిండి సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, ప్రకాశ్ జవడేకర్, మనోజ్ తివారీ బీజేపీ నేతలు పాల్గొన్నారు. బీజేపీ ప్రకటించిన మేనిఫేస్టోలని ముఖ్య అంశాలు.. బీజేపీ అధికారంలోకి వస్తే ఢిల్లీ వ్యాప్తంగా కొత్తగా 200 కాలేజీలు ఏర్పాటు చేస్తాం. రాబోయే ఐదేళ్లలో కనీసం 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఎస్సీ, ఎస్టీ బీసీ, అగ్రవర్ణ పేదల కోసం వేర్వరుగా డెవెలప్మెంట్ బోర్డులు పిల్లల పెళ్లిళ్ల కోసం, ఒంటరి మహిళలకు ఆర్థిక సహాయం ఢిల్లీ-యమునా వికాస్ బోర్డు, 20 సూత్రాల పథకంలో నిర్మించిన ఇళ్లకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అప్‌లకు పోత్సాహంతో పాటు ఫిట్ ఇండియా-ఫిట్ ఢిల్లీ పథకం అమలు ఢిల్లీలో అక్రమ నివాసాలుగా ఉన్న 1728 కాలనీలోని ప్రజలకు ఉచిత ఇళ్ల పట్టాలు ఇస్తాం మంచినీటి సమస్యను పరిష్కరిస్తాం విద్యా, వైద్య, ఆరోగ్యంలో ఢిల్లీని మొదటి స్థానంలో నిలుపుతాం -
ఉగాది కానుక.. మేనిఫెస్టో..
సాక్షి ప్రతినిధి, కాకినాడ/అమలాపురం: ‘మేనిఫెస్టో అంటే కులానికొక పేజీ కాదు. వెబ్సైట్లో ఎప్పుడూ ఉండాలి. దానిని కనిపించకుండా తీసేస్తే మోసం చేసినట్టే. గత మేనిఫెస్టోలో 650 హామీలిచ్చి టీడీపీ మోసం చేసింది. వెబ్సైట్లో మేనిఫెస్టోను కూడా తీసేసింది. దానిలోని అంశాలను ఎందుకు అమలు చేయలేదని ప్రజలు అడగాలి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సమయంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రజల్ని ఆలోచింపజేశాయి. ఉగాది పండగ నాడు ఆయన విడుదల చేసిన మేనిఫెస్టోపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇది అన్ని వర్గాలకూ మేలు చేసేదిగా ఉందని పలువురు కితాబు ఇస్తున్నారు. ‘మేనిఫెస్టో విడుదల చేయడమే కాకుండా దానిలో పెట్టిన అంశాలు అమలు చేసినప్పుడే విలువ ఉంటుంది. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలు చేసి చూపించి ప్రజలను ఓట్లు అడిగే పరిస్థితి రావాలి’ అని జగన్ చెప్పడం మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. వైఎస్ ఫ్యామిలీ మాట ఇస్తే నిలబడుతుందని, తమ బతుకులకు భరోసా వచ్చిందని అన్నీ వర్గాల వారూ అంటున్నారు. రైతుకు వరాలు రైతు భరోసా పథకం కింద రైతుకు పెట్టుబడి సహాయం కల్పిస్తారు. తొలి ఏడాది మినహా మిగిలిన నాలుగేళ్లూ ఏటా మే నెలలో రూ.12,500 చొప్పున రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు. దీనివల్ల తొలకరి వరి సాగుతో పాటు ఉద్యాన, వాణిజ్య పంటల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. దీనివల్ల జిల్లాలో 4.50 లక్షల మంది వరి, 80 వేల మంది కొబ్బరి, 25 వేల మంది ఆయిల్‌పామ్, మరో 30 వేల మంది ఉద్యాన పంటల రైతులు, 29 వేల మంది కూరగాయలు పండించే రైతులకు, ఏజెన్సీలో కొండపోడు వ్యవసాయం చేసే రైతులకు.. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలో కనీసం 6.50 లక్షల మంది రైతులకు రైతు భరోసా వల్ల మేలు కలగనుంది. వీరందరూ ఏటా రూ.812.50 కోట్ల మేర పెట్టుబడి సహాయం పొందనున్నారు. వరిసాగుకు ఎకరాకు రూ.35 వేల వరకూ పెట్టుబడి అవుతుంది. డెల్టాలో రెండు పంటలు పండిస్తుండగా, మెట్ట, ఏజెన్సీల్లో ఒక పంట పండుతోంది. రైతుకు రూ.12,500 అంటే ఎకరం, అరెకరం ఉన్న చిన్న, సన్నకారు రైతులకు సాగుకు అయ్యే పెట్టుబడిలో మూడో వంతు అందినట్టే. పంటల బీమా కోసం ఖరీఫ్‌లో రైతు చెల్లించే 2 శాతం, రబీలో 1.50 శాతాన్ని ప్రభుత్వమే నేరుగా చెల్లిస్తుంది. బ్యాంకుల నుంచి రుణాలు పొందిన రైతులకు బ్యాంకులే బీమా చేయిస్తాయి. కౌలుదారులు, రుణాలు పొందలేని జిల్లాలోని సుమారు 1.80 లక్షల మంది రైతులు కూడా బీమా పరిధిలోకి రానున్నారు. దీనివల్ల రైతులకు ఖరీఫ్‌లో రూ.720, రబీలో రూ.540 చొప్పున కలిసిరానుంది. రైతులకు ఉచితంగా బోర్లు వేయడం వల్ల మెట్ట, ఏజెన్సీ రైతులకు మేలు జరగనుంది. మెట్టలో ప్రాంతాలనుబట్టి బోరు వేసేందుకు రూ.50 వేల నుంచి రూ.1.50 లక్షల వరకూ ఖర్చవుతుంది. ఆ మేరకు రైతులకు ప్రయోజనం కలగనుంది. వ్యవసాయానికి పగటి పూట తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా వల్ల జిల్లాలో సుమారు 2.50 లక్షల మంది రైతులకు మేలు జరగనుంది. మెట్ట, ఏజెన్సీలో వరితో పాటు వాణిజ్య పంటల రైతులు, కోనసీమలో కొబ్బరి రైతులకు దీనివల్ల ప్రయోజనం కలగనుంది. ఇప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఏడు గంటల పాటు అది కూడా విడతల వారీగా మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తోంది. ఆక్వా రైతులు వినియోగించే విద్యుత్‌కు యూనిట్‌కు రూ.1.50 చొప్పున మాత్రమే వసూలు చేస్తామని జగన్ ప్రకటించారు. గడచిన ఆరు నెలల నుంచి ఇది రూ.2గా ఉంది. అంతకుముందు రూ.4 ఉండేది. యూనిట్‌కు అర్ధరూపాయి తగ్గడం వల్ల జిల్లాలోని 16 వేల మంది ఆక్వా రైతులకు మేలు జరగనుంది. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని ప్రకటించడం వల్ల జిల్లాలోని అన్ని పంటల రైతులకూ భరోసా లభించింది. పంటల కనీస మద్దతు ధరలు తగ్గే అవకాశం లేనందున వ్యవసాయంలో నష్టాలు చూసే అవకాశం ఉండదని రైతులు భావిస్తున్నారు. మొత్తం మీద సుమారు 6.50 లక్షల మంది రైతులకు దీనివలన మేలు జరగనుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రూ.4 వేల కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తమవుతోంది. దీనివలన తూర్పు, మధ్య డెల్టాలతో పాటు పిఠాపురం బ్రాంచ్ కెనాల్(పీబీసీ)లో 2.80 లక్షల ఎకరాల మేర ముంపు బారిన పడి నష్టపోయే రైతులకు అన్నివిధాలా మేలు జరగనుంది. ప్రకృతి వైపరీత్యాలకు భయపడి తీరంలో ఏటా ఐదు వేల ఎకరాల్లో వరి సాగు చేయని విషయం తెలిసిందే. నియోజకవర్గ కేంద్రాల్లో గోదాములు, శీతల గిడ్డంగుల ఏర్పాటు వల్ల రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను వాటిల్లో నిల్వ చేసుకునే సౌలభ్యం కలుగుతుంది. రెండో ఏడాది నుంచి సహకార డైరీకి పాలు పోసే రైతులకు లీటరుకు రూ.4 బోనస్ ఇవ్వనున్నారు. దీనివల్ల జిల్లాలో సుమారు 3.50 లక్షల మంది పాడిరైతులకు ప్రయోజనం కలగనుంది. ప్రమాదవశాత్తూ లేదా ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు వైఎస్సార్బీమా ద్వారా రూ.7 లక్షల పరిహారం అందించనున్నారు. వీటితో పాటు రైతు ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ రద్దు, నకిలీ విత్తనాలు, కల్తీ పురుగు మందుల నివారణకు చట్టం చేయడం, దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లోనే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ మంజూరు, కౌలు రైతులకు, భూ యజమానులకు ఇబ్బందులు లేకుండా పంటపై హక్కు, పంట రుణాలు, కౌలు రైతులకు పంట కాల వ్యవధిలో అన్ని రాయితీలు, సబ్సిడీలు అందిస్తామనడం వంటివన్నీ మేలు చేసేవిగా ఉన్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇతర విశేషాలివీ.. అన్ని రకాల వ్యాధులూ ఆరోగ్యశ్రీ పరిధిలోకి. రెండేళ్లలో కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపర్చడం. బీసీ సంక్షేమానికి ఏటా రూ.15 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.75 వేల కోట్ల కేటాయింపు. రాజకీయ ఎదుగుదల కోసం నామినేటెడ్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్. నామినేటెడ్ కాంట్రాక్ట్ పనుల్లో 50 శాతం కేటాయింపు. బీసీ చెల్లెమ్మల వివాహానికి ప్రస్తుతం ఇస్తున్న రూ.35 వేలు రూ.50 వేలకు పెంపు. ప్రమాదవశాత్తూ మరణించిన బీసీ కులాల వారికి రూ.5 లక్షల పరిహారం నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం. మత్స్యకారులకు వేట భృతి రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంపు ప్రమాదవశాత్తూ మరణించిన మత్స్యకారుల కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం. మగ్గం ఉన్న చేనేత కుటుంబానికి ఏటా రూ.24 వేలు కులవృత్తిదారులు, తోపుడు బండ్లతో ఫుట్‌పాత్‌లపై వ్యాపారం చేసుకునేవారికి సున్నా వడ్డీకే రూ.10 వేల రుణం. కాపులకు ఏడాదికి రూ.2 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.10 వేల కోట్ల కేటాయింపు. ఇంకా వివిధ మతాల వారు, ఉద్యోగులు, ఇతర వర్గాల వారికి కూడా మేలు చేసే విధంగా రూపొందించిన వైఎస్సార్ సీపీ మేనిఫెస్టో పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అన్ని వర్గాలకూ ఆమోదయోగ్యమైనదిగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టో అన్ని వర్గాలకూ ఆమోదయోగ్యంగా ఉంది. రైతులకు రూ.50 వేలు, వడ్డీలేని రుణాలు, ఉచితంగా బోర్లు వేయడం మంచి నిర్ణయం. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయడం వల్ల రైతులకు ఎంతో ఉపయోగం. ఆరోగ్యశ్రీకి పూర్వవైభవం. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి రూ.10 వేలు ఫించన్ వంటి పథకాలు బాగున్నాయి. – గొల్ల చిన్ని, రాజోలు మహిళలకు, విద్యార్థులకు భరోసా మేనిఫెస్టో మహిళలకు, విద్యార్థులకు మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి వెల్లడించిన అమ్మ ఒడి పథకం, మహిళలకు దశలవారీగా రూ.75 వేలు రుణం, పేదలందరికీ పక్కా ఇళ్లు, ఆ ఇళ్లను అక్కచెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేయడం బాగున్నాయి. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్లు, గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి ఉద్యోగ కల్పన వంటివి ఆకట్టుకుంటున్నాయి. – వీరా బుజ్జి, మెరకపాలెం -
మా జెండా ఈ ఎజెండాకే..
సాక్షి నెట్వర్క్: ఎన్నికలు వచ్చాయంటే నేతల మాటలు కోటలు దాటుతాయి. ప్రజల ముందుకు వచ్చి అడక్కుండానే వాగ్దానాలు చేసేస్తుంటారు.. హామీల వర్షం కురిపిస్తారు. ‘సారూ.. వర్షం వచ్చిందంటే మా వీధి మొత్తం నీట మునిగిపోతుంది.. నాలా విస్తరణ చేయించండి’ అంటే ‘అదెంత పని.. చేసేద్దాం’ అంటారు. గెలిచాక అటువైపు చూడనే చూడరు. ఏ ఎన్నికలు వచ్చినా ప్రచారానికి వచ్చే అభ్యర్థులకు ప్రజల విన్నపాలు మామూలే. గెలిచిన నేతల నిర్లక్ష్యం కూడా అంతే. కానీ ఈసారి గ్రేటర్ ఓటర్లు నాయకుల ముందుకు కొన్ని డిమాండ్లు తెస్తున్నారు. అవి పరిష్కరించే వారికే తమ ఓటంటున్నారు. ఎల్బీనగర్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు చినుకు పడితే ఉలిక్కిపడే పరిస్థితి. దీన్ని శాశ్వతంగా పరిష్కరించే రావాలంటున్నారు. కూకట్‌పల్లిలో ట్రాఫిక్ కష్టాలు తీరేందుకు రోడ్లు విస్తరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గత తొమ్మిదేళ్లుగా ఆధునికీకరణకు నోచుకోని బేగంబజార్ మచ్చి మార్కెట్‌ను సరిచేయమంటున్నారు. శేరిలింగంపల్లిలోని ఐటీ కారిడార్‌లో వాహన విస్పోటం.. ఫలితంగా ఎదురవుతున్న ట్రాఫిక్ కష్టాలు తొలగించాలంటున్నారు. కంటోన్మెంట్లో భవన నిర్మాణ అనుమతులను సరళతరం చేసి ప్రజలకు ఊరట కల్పించమని విజ్ఞప్తి చేస్తున్నారు. పాతబస్తీలోని చారిత్రక ప్రదేశాల్లో సందర్శకులకు పార్కింగ్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ సరైన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకా నగరంలోని పలు నియోజకవర్గాల్లోని సమస్యలపై ‘ప్రజల మేనిఫెస్టో’ఎలా ఉందో తెలియాలంటే చార్మినార్:పార్కింగ్ పరేషాన్.. చార్మినార్, మక్కామసీదు, సాలార్జంగ్ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్‌లను సందర్శించడానికి వచ్చే పర్యాటకులతో పాటు చిరు వ్యాపారాల నుంచి హోల్‌సేల్ మార్కెట్లకు వచ్చే వినియోగదారుల సౌకర్యార్థం సరైన పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో వాహనదారులు, స్థానికులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. చార్మినార్ సమీపంలో జీహెచ్ఎంసీ మల్టీలెవల్ పార్కింగ్‌ను నిర్మించాలి. ఆటస్థలాలను అందుబాటులోకి తేవాలి. మల్టీలెవల్ పార్కింగ్ ఏర్పాటు చేయాలి.. ప్రపంచ పర్యాటక ప్రాంతమైన చార్మినార్‌లో జీహెచ్ఎంసీ మల్టీ లెవల్ పార్కింగ్‌ను నిర్మించాలి. వ్యాపారస్తుల వాహనాలతో పాటు వినియోగదారుల వాహనాల పార్కింగ్ కోసం మల్టీ లెవల్ పార్కింగ్ ఎంతో అవసరం. – షేక్ ముస్తాక్, శాలిబండ ఆట స్థలాలు కావాలి.. పాతబస్తీలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఆట స్థలాలు అందుబాటులో లేవు. క్రీడా మైదానాలు లేకపోవడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ సైతం చేయలేక పోతున్నాం. – షేక్ నహీం, సయ్యద్ అలీ ఛబుత్రా కంటోన్మెంట్: ఇళ్లను క్రమబద్ధీకరించాలి కంటోన్మెంట్లో కఠినమైన భవన నిర్మాణ నిబంధనల సాకుతో 90శాతం ఇళ్లు అక్రమ నిర్మాణాల జాబితాలో ఉన్నాయి. వీటిని క్రమబద్ధీకరించాలని కొన్నేళ్లుగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాల్లో వెలసిన బస్తీలు, నివాసాల్లోని వారికి బోర్డు ఎన్నికల్లో ఓటుహక్కు తొలగించారు. ఈ మేరకు ఓటుహక్కు కోల్పోయిన 28,123 మంది భూ బదలాయింపు ద్వారా తమ నివాస స్థలాలకు పట్టాల కోసం నేతల్ని అభ్యర్థిస్తున్నారు. పరిమితిని పెంచాలి.. భవన నిర్మాణాలకు సంబంధించి ప్రస్తుతమున్న 1.5 ఎఫ్ఎస్ఐ పరిమితిని పెంచడంతో పాటు, అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించాలి. తద్వారా 90 శాతం కంటోన్మెంట్ వాసులకు ఉపశమనం కలుగుతుంది.– సతీష్ గుప్తా, వాసవీ కాలనీ అధ్యక్షుడు భూ బదలాయింపు చేపట్టాలి.. కేంద్ర ప్రభుత్వ స్థలాల్లో ఉంటున్నామన్న నెపంతో పలు బస్తీలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. మడ్‌ఫోర్ట్ అంబేద్కర్ హట్స్‌లో నేటికీ విద్యుత్ సదుపాయం లేదు. భూబదలాయింపు చేపడితేనే మాలాంటి వారికి పట్టాలు దక్కుతాయి.– అశోక్, అంబేడ్కర్ హట్స్ వాసి ఎల్బీనగర్: ముంపు ముప్పు ఎల్బీనగర్ పరిధిలోని పలు డివిజన్లలో లోతట్టు వాసులు చినుకు పడితే ఉలిక్కిపడే పరిస్థితి నెలకొంది. ముంపు సమస్య ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రస్తుతం ఎన్నికల వేళ ఎల్బీనగర్ నియోజకవర్గంలో ప్రధా ఎజండా ముంపు సమస్యే. గత ఎన్నికల్లో పార్టీల ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలన్నీ నీటిమీద రాతల్లాగానే మిగిలాయి. ఇప్పటికీ ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి నోచుకోవడంలేదు. వరద కాల్వల ఆక్రమణలతోనే.. వర్షం నీరు చెరువులోకి తెచ్చే కాల్వలన్నీ ఆక్రమణలకు గురి కావడంతో వరద నీరు ఇళ్లలోకి వస్తోంది. దీంతో సాహెబ్‌నగర్‌లోని, కప్పల చెరువు, బతుకమ్మ కుంటల నుంచి వచ్చే వర్షం నీరు ఆంధ్రకేసరి నగర్, శారదానగర్, కమలానగర్, రాఘవేంద్ర కాలనీ, పద్మావతి కాలనీల్లోని ఇళ్లలోకి, బస్‌డిపో, కోర్టు ఆవరణలోకి వస్తోంది. – దాసరమోని శ్రీనివాస్, హయత్‌నగర్ కూకట్పల్లి: ట్రాఫిక్ కష్టాలు.. కూకట్‌పల్లిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చేపట్టిన ప్లైఓవర్లు పూర్తి కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. జేఎన్టీయూ నుంచి మలేసియాటౌన్‌షిప్ వరకు నిర్మించే ప్లైఓవర్ తుది దశలో ఉంది. బాలానగర్ ప్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభ దశలో ఉంది. మూసాపేట చౌరస్తా నుంచి ఆంజనేయనగర్వరకు రోడ్డు పూర్తిస్థాయిలో విస్తరణ కాలేదు. కొన్నేళ్లుగా దీని పనులు కొనసాగుతునే ఉన్నాయి. హైటెక్ సిటీకి వెళ్లే ఐటీ ఉద్యోగులు, వాహనదారులు ట్రాఫిక్‌తో ఇబ్బందుల పాలవుతున్నారు. ఏళ్ల తరబడిగా ఇబ్బందులు.. మూసాపేట చౌరస్తా నుంచి ఆంజనేయనగర్‌కాలనీ చౌరస్తా వరకు రోడ్డు వెడల్పు పనులు కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతునే ఉన్నాయి. కూకట్‌పల్లిలో ట్రాఫిక్ ఉండటంతో హైటెక్ సిటీకి వెళ్లే ఐటీ ఉద్యోగులు మూసాపేట చౌరస్తా నుంచి వెళ్తుంటారు. సంవత్సరాల తరబడి పనులు కొనసాగుతునే ఉన్నాయి. – సంతోష్, భరత్‌నగర్‌కాలనీ రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలి.. బోరబండ నుంచి పర్వత్‌నగర్ చౌరస్తా వరకూ ఇరుకు రోడ్డుతో తరచూ ట్రాఫిక్ సమస్యతో పాటు నిత్యం గంటల తరబడి ట్రాఫిక్ చక్రబంధంలో ఇరుక్కు పోవాల్సిన పరిస్ధితి నెలకొంది. రహదారి విస్తరణ పనులకు మోక్షం కలగడంలేదు. – సీహెచ్. వంశీప్రసాద్, పర్వత్‌నగర్ చాంద్రాయణగుట్ట:పూర్తికాని ఆర్యూబీ ఉప్పుగూడ రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. బార్కాస్‌లో నిర్మిస్తున్న ఈ– లైబ్రరీ నిర్మాణం కూడా ఏడేళ్లుగా సాగుతూనే ఉంది. రాజన్నబావి, ఛత్రినాక ప్రాంతాల్లో వరదముంపు తీవ్ర స్థాయిలో ఉంది. శేరిలింగంపల్లి: ఐటీకారిడార్‌లో నిత్య నరకం.. ఐటీ కారిడార్‌ను ట్రాఫిక్ సమస్య పట్టిపీడిస్తోంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రధాన రహదారులు ట్రాఫిక్ దిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. వాహనదారులు కిలో మీటరు ప్రయాణం చేయాలన్నా విసిగివేసారుతున్నారు. పరిష్కారం చూపించాలి.. ఐటీ కారిడార్‌లో కిలో మీటర్ ప్రయాణించాలంటే పది నిమిషాల సమయం పడుతోంది. ఉదయం, సాయంత్రం సమయాల్లో రాకపోకలు సాగించే ఐటీ ఉద్యోగులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. – కె. శ్రీనివాస్‌రెడ్డి, సాఫ్ట్వేర్ ఇంజినీర్ మల్కాజిగిరి: కొలిక్కిరాని ఆర్యూబీ ఈస్ట్ ఆనంద్‌బాగ్ ఆర్యూబీ నిర్మాణం కొలిక్కి రావడంలేదు. ఇది ఇప్పటికీ పూర్తికాలేదు. రామకృష్ణాపురం, సఫిల్‌గూడ చెరువు, బండచెరువు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. సఫిల్‌గూడ చెరువు వద్ద ఉన్న ఎస్టీపీ సామర్థ్యాన్ని పెంచాలి. మల్కాజిగిరిలో ప్రభుత్వ ఆస్పత్రిని ఏర్పాటు చేసినా అందులో పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడంలేదు. గోషామహల్: శిలాఫలకానికే పరిమితం బేగంబజార్ మచ్చి మార్కెట్ ఆధునికీకరణకు నోచుకోవడంలేదు. 9 ఏళ్లుగా ఈ సమస్యకు పరిష్కారం లభించడం లేదు. రామ్మనోహర్ లోహియా కమ్యూనిటీ హాల్ ఆధునికీకరణ కోసం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్, కార్పొరేటర్ ముఖేశ్సింగ్లు శిలాఫలకం వేసి ఏడాది గడిచినా దీని పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. మహేశ్వరం: తాగునీటి కటకట.. ♦ గ్రామీణ ప్రాంతాల్లో అధ్వానంగా మారిన రహదారులు ♦ మీర్పేట్, జిల్లెలగూడలలో కాలుష్య కాసారాలుగా చెరువులు ♦ డ్రైనేజీ వ్యవస్థ కొరవడి రోడ్లపై పారుతున్న మురుగునీరు ♦ మీర్పేట్, బడంగ్పేట్, జల్పల్లి, మహేశ్వరం, కందుకూరులలో తాగునీటి సమస్యలు ♦ చిన్నపాటి వర్షాలకే ముంపునకు గురవుతున్న కాలనీలు మలక్‌పేట్: మురుగుతో సతమతం.. ♦ ట్రాఫిక్‌జాంతో వాహనదారుల సతమతం ♦ డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం స్థానికుల ఎదురుచూపులు ♦ కాలనీలలో రోడ్లపై మురుగు ప్రవాహం.. ♦ విస్తరణకు నోచుకోని ప్రధాన రహదారులు.. -
కర్నాటక ఎన్నికలు: బీజేపీ మెనిఫేస్టో విడుదల
-
224 స్థానాలు.. 225 మేనిఫెస్టోలు
సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, జేడీఎస్ పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే ప్రచారాలతో హోరెత్తిస్తున్న పార్టీలు.. నామినేషన్ల ప్రక్రియ పూర్తైన నేపథ్యంలో మేనిఫెస్టోలు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. ఓటర్ల నాడి తెలుసుకునేందుకు అనుభవఙ్ఞులైన నాయకులను రంగంలోకి దింపడం ద్వారా విజయానికి బాటలు వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీ.. 224 నియోజక వర్గాలు.. 225 మేనిఫెస్టోలు ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని భావిస్తున్న బీజేపీ.. అదే స్థాయిలో ప్రయత్నాలు కొనసాగిస్తోంది. రాష్ట్రమంతటికీ ఒకటి, ఒక్కో నియోజక వర్గానికి ఒకటి చొప్పున మేనిఫెస్టోలు రూపొందించనున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి వామన్ ఆచార్య తెలిపారు. ఇందుకోసం 500 మంది నిపుణుల అభిప్రాయం స్వీకరించినట్లు సమాచారం. సుమారు 3 లక్షల మందిపై ఆఫ్‌లైన్, ఆన్లైన్లో సర్వే నిర్వహించామని పార్టీ నేత డాక్టర్ అశ్వథ్‌నారాయణ్ తెలిపారు. జిల్లా స్థాయి నాయకులు తమ తమ నియోజక వర్గానికి సంబంధించిన మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత రాష్ట్రస్థాయి మేనిఫెస్టోను విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. మంగళూరులో రాహుల్ గాంధీ.. మంగళూరులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. బీజేపీ ప్రధాన ఓటు బ్యాంకుగా భావిస్తున్నమంగళూరులో ఎటువంటి హామీలతో రాహుల్ ఓటర్లను ఆకర్షిస్తారో చూడాల్సిందే. శ్యామ్ పిట్రోడా, పృథ్వీరాజ్ చౌహాన్, మల్లికార్జున ఖర్గేల నేతృత్వంలో కాంగ్రెస్ మేనిఫెస్టోను రూపొందిస్తున్నారు. ఈ నెల 28 తర్వాత రాష్ట్రమంతటికీ కలిపి ఒకటి, బెంగళూరు, బెలగామ్, గుల్బర్గా, మైసూర్ ప్రాంతాలకు ఒకటి చొప్పున మేనిఫెస్టోలు విడుదల చేయనున్నారు. 2013 ఎన్నికల్లో చేసిన 165 వాగ్దానాలే తమ విజయానికి కారణమని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఈసారి కూడా అదే పంథాను అనుసరించేందుకు సిద్ధమైంది. బెంగళూరు సిటీ కోసం ప్రత్యేకంగా సీనియర్ నేత వీరప్ప మొయిలీ నాయకత్వంలో మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేసింది. అభివృద్ధి, సామాజిక న్యాయం, వ్యవసాయ రంగంలో మార్పులు ప్రధాన అంశాలుగా మేనిఫెస్టో రూపొందిస్తున్నామని మొయిలీ తెలిపారు. రిటైర్డ్ ఐఏఎస్ ఆధ్వర్యంలో జేడీఎస్.. జేడీఎస్ కూడా వారం రోజుల్లోగా తమ ప్రణాళికను ప్రకటించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ సుబ్రహ్మణ్య నేతృత్వంలో రూపొందనున్న మేనిఫెస్టోలో.. వ్యవసాయం, పరిశ్రమలు, నీటి వనరులు, మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించనున్నట్లు సమాచారం. -
మేనిఫెస్టో హామీలపై అబద్ధాలు
-
మేనిఫెస్టో హామీలపై అబద్ధాలు
మహానాడులో అవే ప్రసంగాలు.. ► రాజకీయ అంశాలపై స్పష్టత ఇవ్వని బాబు ► అధినేత మొదలు నేతలందరిదీ అదే తీరు విశాఖ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తయిన తర్వాత జరుగుతున్న మహానాడులో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలుపై సవివరమైన సమీక్ష జరుగుతుందని ఆశించిన వారికి నిరాశ ఎదురయ్యింది. ఏం చేయకపోయినా.. ఏదో చేసినట్లు, ఏవేవో ఘన‘కార్యాలు’ సాధించినట్లు గొప్పలు చెప్పుకోవడం పట్ల తెలుగుదేశం శ్రేణుల్లోనే విస్మయం వ్యక్తమయ్యింది. మహానాడు ఎప్పటి మాదిరిగానే పూర్తిగా భజన వేదికగా మారిపోయిందన్న విమర్శలు వినిపించాయి. అధినేత చంద్రబాబును కీర్తించడం, రాష్ట్రంలో పార్టీ ఘనకార్యాలయాలు చేసిందంటూ ఊదరగొట్టడం, ప్రతిపక్ష పార్టీలను విమర్శించడం మినహా ఎక్కడా కొత్తదనం కనిపించలేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యమైన అంశాలు విడిచిపెట్టి.. ప్యాకేజీ కోసమే ప్రత్యేక హోదాను ఫణంగా పెట్టిన చంద్రబాబు తాజాగా ప్యాకేజీ విషయంలోనూ కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టారని పరిశీలకులు పేర్కొంటున్నారు. హోదా కోసం తాను ముందుండి పోరాడాల్సిన ముఖ్యమంత్రి ఆ బాధ్యతను విస్మరించి ప్రజలకు వెన్నుపోటు పొడవడమే కాక ఇపుడు నెపాన్ని పూర్తిగా కేంద్రంపై నెట్టేసేందుకు ప్రయత్నించడం విశేషం. విభజన చట్టంలోని అంశాల అమలుకు చిత్తశుద్ధితో ప్రయత్నించకుండా, నిధులు రాబట్టేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకుం డా మహానాడులో ఊకదంపుడు ప్రకటనలతో నెట్టుకొచ్చేందుకు ప్రయత్నిం చడం స్పష్టంగా కనిపించిందని విశ్లేషకులంటున్నారు. పార్టీకోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని ప్రకటించిన చంద్రబాబు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎంత దీనస్థితిలో ఉందో చెప్పకనే చెప్పారు. ఇక ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ఎన్టీఆర్ జపం చేయడం కొసమెరుపు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని చంద్రబాబునాయుడు మహానాడు ప్రసంగాలలో డిమాండ్ చేయడం తప్ప అందుకోసం ఆ తర్వాత చిత్తశుద్ధితో ప్రయత్నించిన దాఖలాలు లేవు. యథాప్రకారం అవే విషయాలు... చంద్రబాబునాయుడు యధాప్రకారం గంటన్నరసేపు మాట్లాడడం బోర్ కొట్టించిందని కార్యకర్తలే వ్యాఖ్యానించడం గమనార్హం. చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలోనే కార్యకర్తలు, నాయకులు అటూ ఇటూ తిరగడం, తమలో తాము చర్చించుకోవడం కనిపించింది. ఆయన మాట్లాడుతున్న సమయంలోనే చాలామంది సభ మధ్యలో నుంచి బయటకు వెళ్లిపోయారు. ప్రస్తుత రాజకీయాలు, తెలుగుదేశం అనుసరిస్తున్న వైఖరిపై కార్యకర్తలు, నాయకుల్లో అనేక అనుమానాలున్నా వాటిని నివృత్తి చేసే ప్రయత్నాన్ని చంద్రబాబు ఏమాత్రం చేయలేదు. ప్రతిరోజూ టెలీకాన్ఫరెన్స్‌తో మొదలు పెట్టి అన్ని సమీక్షల్లోనూ చెప్పే పాత విషయాలనే ఇక్కడా ఒకటికి రెండుసార్లు చెప్పడంతో ఆ పార్టీ నేతలు ఇక్కడా అదే గోలా అని చర్చించుకోవడం కనిపించింది. రెండురోజులపాటు కలెక్టర్ల సదస్సులో చెప్పిన విషయాలనే ఇక్కడా చెప్పారు. పార్టీ భవిష్యత్తు, దేశ భవిష్యత్తు కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు పాత పల్లవినే వినిపించారు. ప్రత్యేక హోదాపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నా దానివల్ల ఏమీ ఒరగదని, అందుకే దానికి సమానమైన ప్యాకేజీ తీసుకున్నామన్నారు. ఇక టీడీపీ నేతలు వర్ల రామయ్య, తెలంగాణ నేత అమర్నాథ్ తదితరులు సుదీర్ఘంగా ప్రసంగించి విసుగెత్తించారు. మేనిఫెస్టో హామీలపై అబద్దాలు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసినట్లు మహానాడు వేదికగా చంద్రబాబునాయుడు అబద్దాలు వల్లె వేశారని విమర్శకులంటున్నారు. ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను కూడా అమలు చేశామని, దీంతో రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని పదేపదే చెప్పినా కార్యకర్తల నుంచి ఎటువంటి స్పందనా కనిపించకపోవడమే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. మహానాడుకు 26 వేల మంది వస్తారని ప్రచారం చేసినా ఆ స్థాయిలో కార్యకర్తలు రాలేదు. పది వేల మంది కూడా రాలేదని టీడీపీ నాయకులే చర్చించుకుంటున్నారు. వచ్చిన వారు కూడా చాలామంది సభలోకి రాకుండానే వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. టీడీపీ తెలంగాణ నాయకుడు రేవంత్‌రెడ్డి పేరు ప్రస్తావించినప్పుడు కార్యకర్తలు పెద్దగా కేకలు వేసి స్పందించడంతో చంద్రబాబునాయుడు అసహనంగా చూడడం చర్చనీయాంశమైంది. మహానాడు జరుగుతున్న ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో సరిపడా బాత్రూమ్లు ఏర్పాటు చేయకపోవడంతో టీడీపీ కార్యకర్తలు పరిసర ప్రాంతాలన్నింటినీ యధేచ్చగా వాడేసుకున్నారు. -
సామాన్యుల కష్టాలన్నీ తీరుస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: విద్యుత్ చార్జీలు 30 శాతం తగ్గింపు, కూరగాయల ధరల నియంత్రణ, సబ్సిడీపై అదనపు గ్యాస్ి సలిండర్లు, ఢిల్లీకి పూర్తి రాష్ట్రస్థాయి హోదా వంటి హామీలతో సామాన్యులను ఆకట్టుకునేలా ఢి ల్లీ విధానసభ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ విడుదల చేసింది. పార్టీ ఢిల్లీ ప్రదేశ్ కార్యాలయంలో మంగళవారం మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్‌తో పాటు పార్టీ ఢి ల్లీ సీఎం అభ్యర్థి డాక్టర్ హర్షవర్ధన్, నగరశాఖ అధ్యక్షుడు విజయ్ గోయల్, విజయేంద్ర గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ వాసుల నుంచి సేకరించిన అభిప్రాయాలు ప్రతిబింబించేలా, వారి కష్టాలు తీర్చేలా మేనిఫెస్టోను రూపొందించినట్టు డాక్టర్ హర్షవర్ధన్ వివరించారు. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు: ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోపే పూర్తిస్థాయి రాష్ట్రహోదా కల్పనకు కృషి నిత్యావసరాలు, కూరగాయల ధరలు తగ్గించేందుకు చర్యలు ప్రతి ఇంటిపై సోలార్ విద్యుత్ ఉత్పాదక వ్యవస్థ ఏర్పాటు ద్వారా ఢిల్లీని విద్యుత్ కొరత లేని రాష్ట్రంగా మార్చడం ప్రస్తుతం సబ్సిడీపై ఇస్తున్న తొమ్మిది సిలిండర్లకు అదనంగా మరో మూడు పంపిణీ ‘ఎసెన్షియల్ డ్రగ్ పాలసీ’ అమలులో భాగంగా అత్యవసరమైన 25 రకాల మందులను ఢిల్లీవాసులందరికీ ఉచితంగా అందుబాటులోకి తేవడం. ఢిల్లీలోని అన్ని జిల్లాల్లో ట్రామా కేంద్రాల ఏర్పాటు మోనో రైలును అందుబాటులోకి తేవడం, మెట్రో రైలును అన్ని ప్రాంతాలకు విస్తరింపజేయడం.