సూపర్‌-6.. సూపర్‌-10 పేరుతో ‘కూటమి’ మరో మోసం: పేర్ని నాని | Perni Nani Comments On Chandrababu Frauds | Sakshi
Sakshi News home page

సూపర్‌-6.. సూపర్‌-10 పేరుతో ‘కూటమి’ మరో మోసం: పేర్ని నాని

Published Sat, Apr 27 2024 4:24 PM | Last Updated on Sat, Apr 27 2024 4:24 PM

Perni Nani Comments On Chandrababu Frauds

సాక్షి, గుంటూరు: మరోసారి కూటమి మోసం చేసే ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సూపర్‌-6, సూపర్‌-10 పేరుతో మరోసారి మోసానికి తెరలేపారన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, 2014లో చంద్రబాబు మాయమాటలు చెప్పారు.. ప్రజల్ని నమ్మించి టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2019లో ఇచ్చిన హామీలను సీఎం జగన్‌ అమలు చేశారు. మరోసారి ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేస్తామన్నారు.

2019లో ఇచ్చిన మేనిఫెస్టోను 99 శాతం అమలు చేశాం: మంత్రి ధర్మాన
శ్రీకాకుళం: మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ మేనిఫెస్టో ను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావిస్తామన్నారు. 2019లో ఇచ్చిన మేనిఫెస్టోను 99 శాతం అమలు చేశాం. మేనిఫెస్టోను చంద్రబాబు హేళనగా తీసుకుంటారు. 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పి 20 వేలు కూడా ఇవ్వలేదు. 2014లో చంద్రబాబు మహిళల రుణాలు రద్దు చేస్తామన్నారు. నమ్మి ఓటేసిన మహిళలను చంద్రబాబు మోసం చేశారు’’ అని మంత్రి ధర్మాన మండిపడ్డారు.

మోసం చేయకుండా చేసేవి మాత్రమే మేనిఫెస్టోలో పెట్టాం: మంత్రి బొత్స
విశాఖపట్నం: అన్ని వర్గాలకు మంచి జరిగేలా వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ‘‘మోసం చేయకుండా చేసేవి మాత్రమే మేనిఫెస్టోలో పెట్టాం. గత మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చారు. విద్యా, వైద్యం, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. పేద ఆత్మ గౌరవాన్ని పెంపొందించేలా పథకాలు ఉన్నాయి. లంచాలు, వివక్ష లేకుండా డీబీటీ ద్వారా నగదు జమ చేశాం. గతంలో చంద్రబాబు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశారు. చంద్రబాబు మాయ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.. ఇచ్చిన ప్రతి మాటలను సీఎం జగన్‌ నిలబెట్టుకున్నారు. సీఎం జగన్‌ మేనిఫెస్టోలో పెట్టని అంశాలు కూడా అమలు చేశారు’’ అని మంత్రి బొత్స అన్నారు. 

ప్రజలను కష్టాల నుంచి బయట పడేసే మేనిఫెస్టో ఇది: తమ్మినేని సీతారాం 
సంస్కరణల దిశగా వైసీపీ విధానాలు వెళ్తున్నాయి. మేనిఫెస్టోలో విశాఖను క్యాపిటల్ టౌన్‌గా ప్రకటించడం సంతోషం. ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు అంతా విశాఖ రాజధాని కావాలని కోరుకుంటున్నారు. చంద్రబాబుది కాపీ మేనిఫెస్టో. టీడీపీలాగా సాధ్యం కానీ హామీలు ఇవ్వలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement