‘గుర్తుంచుకో చంద్రబాబూ.. అధికారం ఎల్లకాలం ఉండదు’ | Ex Minister Perni Nani Slams Chandrababu Govt | Sakshi
Sakshi News home page

‘గుర్తుంచుకో చంద్రబాబూ.. అధికారం ఎల్లకాలం ఉండదు’

Published Sat, Nov 30 2024 2:58 PM | Last Updated on Sat, Nov 30 2024 5:16 PM

Ex Minister Perni Nani Slams Chandrababu Govt

: రాష్ట్రంలో శాంతిభద్రతలను చంద్రబాబు సర్కార్‌ గాలికొదిలేసిందని.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకుందంటూ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు.

సాక్షి, కృష్ణా జిల్లా: రాష్ట్రంలో శాంతిభద్రతలను చంద్రబాబు సర్కార్‌ గాలికొదిలేసిందని.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకుందంటూ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తప్పుడు కేసులతో వైఎస్సార్‌సీపీ శ్రేణులను వేధించడానికే పోలీసులను వాడుతున్నారంటూ ధ్వజమెత్తారు.

‘‘పాత కేసులను తిరగదోడి.. తప్పుడు కేసులు పెడుతున్నారు. గన్నవరంలో 8 మంది వైఎస్సార్‌సీపీ నేతలను అక్రమంగా కేసుల్లో ఇరికించారు. న్యాయమూర్తి 307 కేసును తొలగించారు. కానీ బెయిల్ విషయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పచ్చ చొక్కాల ఒత్తిడికి లొంగిపోయారు. కుంటిసాకులతో రెండురోజుల పాటు కాలయాపన చేసి పోలీస్ కస్టడీ కోరారు. రెండు సార్లు విచారణ అయ్యాక ఏముందని పోలీస్ కస్టడీకి కోరుతున్నారు’’ అని పేర్ని నాని ప్రశ్నించారు.

..అమాయకులను తెచ్చి ముద్దాయిలను చేశారు. వైఎస్సార్‌సీపీ జెండా, జగన్ బొమ్మ పెట్టుకుని తిరగకుండా చేయాలని చూస్తున్నారు. అడ్డగోలుగా పోలీసులను వాడుతున్నారు. పాతకేసులను తిరగదోడుతున్నందుకు డీజీపీకి మా సూటిప్రశ్న. పాతకేసులకు సంబంధించి ఎస్సై, సీఐలను సస్పెండ్ చేశారా?. తప్పుడు ఉద్యోగం చేశావని ఒక్కరిపైనైనా చర్యలు తీసుకున్నారా?. చేసేవి దొంగ పనులు కాబట్టి చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఒక్కొక్కరి పై 10, 20 కేసులు పెడుతున్నారు.

తమతో పాపాలు చేయిస్తున్నారని కొందరు పోలీసు అధికారులు బాధపడుతున్నారు. ఖాకీ యూనిఫాం వేసుకుని తప్పుడు కేసులు పెట్టి పాపాలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు ఎల్లకాలం సీఎంగా ఉండడు. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ఈ రోజు పసుపు చొక్కేలేసుకుని అక్రమంగా వ్యవహరిస్తున్న అధికారులు తప్పకుండా చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని పేర్ని నాని హెచ్చరించారు.

గన్నవరంలో అక్రమంగా 8 మంది అరెస్ట్.. ఏపీ పోలీసులపై పేర్ని నాని ఫైర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement