ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. బీజేపీ మేనిఫెస్టో కోసం దేశ యువత తమ ఆలోచనలను పంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నమో యాప్‌లో యువత తమ అభిప్రాయాలను పంచుకోవాలని ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. న్యూ ఓటర్స్ కాన్ఫరెన్స్‌ని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు.
ఈ విధంగా సలహాలను అందించిన వారిలో కొందరిని మోదీ భవిష్యత్‌లో కలవనున్నట్లు చెప్పారు. నమో యాప్‌లో తమ అభిప్రాయాలను తెలియజేయాలని మోదీ విజ్ఞప్తి చేశారు. యువత తమ వినూత్న ఆలోచనలను narendramodi.in వెబ్‌సైట్‌లో కూడా షేర్ చేయవచ్చని ప్రధాని మోదీ అన్నారు. భారతదేశంలోని యువత తప్పనిసరిగా ఓటు వేయడానికి ఉత్సాహంగా ఉండాలని ప్రధాని మోదీ కోరారు.
ప్రజల భాగస్వామ్యం ఉంటే ప్రభుత్వం, ప్రజల మధ్య సహకారం పెరుగుతుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రజా భాగస్వామ్యంతో బీజేపీ మేనిఫెస్టోని రూపొందిస్తే భారత భవిష్యత్తును సరైన దిశగా నడిపిస్తుందని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: పెళ్లికి ముందే విడాకులు: బీజేపీ
Comments
Please login to add a commentAdd a comment