డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కుమార్తె! | Former Cm Prafulla Kumar Mahanta Daughter Hit Driver With Slipper | Sakshi
Sakshi News home page

డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కుమార్తె!

Published Tue, Mar 4 2025 7:53 PM | Last Updated on Tue, Mar 4 2025 8:16 PM

Former Cm Prafulla Kumar Mahanta Daughter Hit Driver With Slipper

గౌహతి: ఓ ఆటోడ్రైవర్‌ను మాజీ సీఎం కుమార్తె చెప్పుతో కొట్టిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. హై సెక్యూరిటీ మధ్య డ్రైవర్‌ను మొకాళ్లపై కూర్చొబెట్టి మాజీ సీఎం కుమార్తె చెప్పుతో కొడుతున్న దృశ్యాల్ని స్థానికులు వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

అస్సాం రాజధాని గౌహతిలోని శివారు ప్రాంతమైన డిస్పూర్‌లోని రాష్ట్ర ప్రజాప్రతినిధులు నివాసం ఉండే ఎమ్మెల్యే హాస్టల్‌లో మాజీ సీఎం ప్రఫుల్ల కుమార్ మహంత కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రఫుల్ల కుమార్‌ మహంత కుమార్తె ప్రజోయితా కశ్యప్ ఆటోడ్రైవర్‌ను దుర్భాషలాడుతూ చితక బాదారు.

ఈ ఘటన వెలుగులోకి ప్రజోయితా కశ్యప్‌ స్పందించారు. బాధితుడు తన ఇంట్లో సుదీర్ఘకాలంగా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఎప్పుడూ తాగుతూ ఉంటాడు. తాగిన ప్రతీసారి నా గురించి చెడుగా మాట్లాడేవాడు. ఇది సరైన పద్దతి కాదని పలు మార్లు చెప్పా.ఈ విషయం అందరికి తెలుసు.

ఈ రోజు మద్యం మత్తులో మా ఇంటి బాదాడు. అందుకే కొట్టా’నని తెలిపారు. అయితే, అసభ్యంగా ప్రవర్తించే డ్రైవర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారా? బాధితుడు ప్రభుత్వ డ్రైవరా? ప్రైవేట్‌ డ్రైవరా? అని ప్రశ్నిస్తే ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.

 అస్సాం గణ పరిషత్ మాజీ అధ్యక్షుడు ప్రఫుల్లకుమార్ మహంత రెండుసార్లు అస్సాం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement