assom
-
ఒడిశా కులగణన రిపోర్టు..!
భువనేశ్వర్: కులగణన అంశంలో బిహార్ దారిలో ఒడిశా కూడా ముందడుగు వేస్తోంది. ఒడిశాలో ఇప్పటికే ఓబీసీ జాబితాను నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం లెక్కగట్టింది. ఆ జాబితాను ఎప్పుడు విడుదల చేయాలా..? అని ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఓబీసీ సెన్సెస్ రిపోర్టు అంశంలో రాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా వ్యవహరిస్తోందని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వెల్లడించారు. వెనకబడిన ఐదు ముస్లిం వర్గాలపై సర్వే చేయనున్నట్లు అసోం ఇప్పటికే ప్రకటించింది. సోషియో-ఎకానమిక్ సర్వే నిర్వహించి, దాని ఆధారంగా వారి అభివృద్ధికి పాటుపడనున్నట్లు స్పష్టం చేసింది. బిహార్‌లో కులగణన రిపోర్టును సీఎం నితీష్ కుమార్ ఇప్పటికే వెల్లడించారు. జనాభాలో దాదాపు 63 శాతం మంది ఓబీసీ, ఈబీసీ జాబితాకి చెందినవారేనని ఆ రిపోర్టు స్పష్టం చేసింది. బిహార్‌లో మొత్తం 13.07 కోట్ల మంది ఉంటే.. అందులో దాదాపు 36 శాతం ఈబీసీ(అతి ఎక్కువ వెనకబడిన తరగతి)కి చెందినవారేనని రాష్ట్ర అభివృద్ధి కమిషనర్ వివేక్ సింగ్ తెలిపారు. మిగిలినవారిలో 27.13 అత్యధికంగా ఓబీసీలు ఉన్నారని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: చైనా నుంచి నిధులు.. న్యూస్‌క్లిక్ ఫౌండర్‌కు రిమాండ్ -
రుణ ఎగవేత కేసు, మాజీ సీఎం కుమారుడు అరెస్ట్
గువహటి: రుణ ఎగవేత కేసులో అసోం మాజీ సీఎం హితేశ్వర్ సైకియా కుమారుడు, కాంగ్రెస్ నేత దేబబ్రత సైకియాకు ఎదురు దెబ్బ తగిలింది. పాతికేళ్ల నాటి 9 లక్షల రూపాయల లోన్ డిఫాల్ట్ కేసులో సైకియా సోదరడు అశోక్ సైకియాను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసేలో సమన్లు జారీ చేసినప్పటికీ కోర్టుకు హాజరు కానందున అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన తర్వాత ఈ చర్య తీసుకున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. సోమవారం కోర్టులో హాజరు పర్చనున్నామని గువహటి సీబీఐ అధికారులు తెలిపారు. దీనిపై హితేశ్వర్ అసోం కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రతిపక్ష నాయకుడు దేబబ్రత సైకియా స్పందించారు. అరెస్టు చేశారో లేదా అదుపులోకి తీసుకున్నారో అసలు అతడిని ఎక్కడికి తీసుకెళ్లారో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. అంతేకాదు పరిష్కారమై పోయిన చాలా పాత కేసు అని, బ్యాంక్ కోర్టుకు సమాచారం అందించకపోవడం బ్యాంకుది తప్పు దేబబ్రత అన్నారు. మరోవైపు 1996లో అస్సాం స్టేట్ కో-ఆపరేటివ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్ లిమిటెడ్ బ్యాంకు ద్వారా సంబంధిత రుణాన్ని తీసుకున్నానని వ్యాపారవేత్త అశోక్ సైకియా ఒక ప్రకటనలో తెలిపారు. అయితే 2011లో రుణాన్ని తిరిగి చెల్లించానని, ప్రస్తుతం టువంటి బకాయిలు పెండింగ్‌లో లేవని పేర్కొన్నారు. దీనికి సంబంధించి 2015 అక్టోబర్ 28న బ్యాంకు జనరల్ మేనేజర్ అధికారిక లేఖను కూడా ఆయన ప్రస్తావించారు. కానీ రుణ ఎగవేత అంటూ నిరాధార అరోపణలు ఎందుకు చేస్తున్నారో ప్రభుత్వానికి, సీబీఐకే తెలియాలంటూ ఎద్దేవాచేశారు. బీజేపీలోకి చేరునున్నట్టు బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నాయకులను సీబీఐ ద్వారా భయపెట్టే వ్యూహాన్ని బీజేపీ దేశవ్యాప్తంగా అమలు చేస్తోందని విమర్శించారు. కాగా కోల్‌కతా బ్రాంచ్‌లో అశోక్ సైకియాపై నమోదైన రెండు ఫిర్యాదుల మేరకు పల్టాన్ బజార్ పోలీస్ స్టేషన్లో గతంలో కేసు నమోదైంది. ఆ తరువాత 2001లో ఈ కేసు సీబీఐకి బదిలీ అయింది. దీంతో పాటు 2013లో మరో కేసులో దోషిగా నిర్ధారించబడ్డారు. -
యూట్యూబ్ చూసి.. దెబ్బకి సెలబ్రిటీ అయిపోయాడు!
యూట్యూబ్ వీడియోలనును ఖరీదైన అందులోనూ లాంబొర్గిని లాంటి విలాసవంతమైన స్పోర్ట్స్ కారును తయారుచేయడం సాధ్యమేనా? అంటే కృషి ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించాడు అసోంకు చెందిన ఒక మెకానిక్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా..సాధనమ్మున పనులు సమకూరును ధరణిలోన అన్నట్టు తాను అనుకున్నది సాధించి తీరాడు..తన డ్రీం కార్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయాడు. ఈ కారుతో సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారు. అస్సాంలోని కరీమ్గంజ్ జిల్లాలోని భంగా ప్రాంతానికి చెందిన మోటారు మెకానిక్ నూరుల్ హక్ (30 )ఈ అద్భుతానికి శ్రీకారం చుట్టాడు. భంగా ఏరియాలో ఎన్ మారుతి కార్ కేర్ అనే గ్యారేజీ నిర్వహించే నూరుల్‌కు స్పోర్ట్స్ కార్లంటే మోజు. అందులోనూ లంబోర్ఝిని అంటే మరీ ప్రాణం. ఎలాగైనా అలాంటి కారును నడపాలని, సొంతం చేసుకోవాలని కలలుకన్నాడు. ఇంతలో కరోనా సంక్షోభం, లాక్డౌన్ ఇబ్బందులు వచ్చి పడ్డాయి. పని లేకుండా ఇంట్లో కూర్చోవలసి వచ్చింది. తన డ్రీంకార్ తయారీపై దృష్టిపెట్టాడు.ఎట్టకేలకు తనకున్న తక్కువ వనరులోనే స్విఫ్ట్ కారు ఇంజీన్ మార్చి తన సొంత వెర్షన్నుతయారు చేయాలని నిర్ణయించు కున్నాడు. ఎట్టకేలకు తన పాత స్విఫ్ట్‌కారును ఇటాలియన్ లగ్జరీ కారు లగ్జరీ కారు లంబోర్ఘిని మోడల్లో తీర్చి దిద్దాడు. ఎనిమిది నెలలపాటు శ్రమించి తన ప్రాజెక్టును పూర్తి చేశాడు. దీని కోసం .రూ.6.2 లక్షలు ఖర్చు చేశానని నూరుల్ చెప్పాడు.అంతేకాదు తన నెక్ట్స్ టార్టెట్ కార్ లగ్జరీ స్పోర్ట్స్ కారు ఫెరారీ అని స్పష్టం చేశాడు. View this post on Instagram A post shared by Nurul Haque (@haquenurul786786) -
వారి కోసం స్టెప్పులేసిన డాక్టర్లు: వీడియో వైరల్
అసోం: కోవిడ్-19 సెకండ్ వేవ్ భయపెడుతున్న సమయంలో అసోంలోని కరోనా ఆసుపత్రి వైద్యులు మరోసారి వార్తల్లో నిలిచారు. సిల్చార్ వైద్యులు, ఆరోగ్య కార్యకర్తల బృందం పాటలు ,డాన్స్‌లతో కరోనా బాధితులను ఉత్సాహ పరిచేందుకు ప్రయత్నించిన తీరు పలువురు ప్రశంసలందుకుంటోంది. వీరితోపాటు కరోనాకు చికిత్స పొందుతున్నవారు కూడా కలిసి నృత్యం చేయడం విశేషంగా నిలిచింది. అంతేకాదు అత్యంత ఒత్తిడికి గురవుతున్న రోగుల కుటుంబ సభ్యులకు భరోసాతో నిస్తున్నారు. పీపీఈ కిట్లలో బెంగాలీ, హిందీ పాటలతోపాటు, జానపద పాటలకు వీరు వేసిన స్టెప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హమ్ హోంగే కామియాబ్తో పాటు, బరాక్ వ్యాలీ ప్రాంతంలో ప్రసిద్ధ జానపద నృత్యం ధమాయిల్ ను కూడా వారు ప్రదర్శించారు. దీంతో వైద్యులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అసోం, కాచర్ జిల్లాలోని సిల్చార్ ఎస్ఎం దేవ్ సివిల్ హాస్పిటల్ ఆరోగ్య సంరక్షణ నిపుణులు కోవిడ్-19తో బాధపడుతున్న పేషెంట్లను ఉత్సాహపరిచేందుకు నృత్యాలను ఒక సాధనంగా ఉపయోగించు కున్నారు. తద్వారా వారిలో ఉత్సాహాన్ని, మనోధైర్యాన్ని నింపేందుకు ప్రయత్నించారు. డాక్టర్ జూరీ శర్మ నాయకత్వంలోని ఈ బృందం పీపీఈ సూట్లలో రోగులతో కలిసి డ్యాన్స్ చేయడం కనిపించింది. కాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు దేశంలో సోమవారం కొత్తగా 1,00,636 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2,427 మరణాలు సంభవించాయి. -
అసోంలో భారీ భూకంపం: పరుగులు తీసిన జనం
-
అసోంలో భారీ భూకంపం: పరుగులు తీసిన జనం
గువాహటి: ఒకవైపు కరోనా మహమ్మారి తీవ్రత భయపెడుతోంది. మరోవైపు ఈశాన్య రాష్ట్రం అసోంను భారీ భూకంపం వణించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ అందించిన సమాచారం ప్రకారం రిక్టర్ స్కేల్‌పై 6.4 తీవ్రతతో బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. దీంతో భయాందోళనతో ప్రజలు పరుగులు తీశారు. పలుభవనాలు దెబ్బతిన్నాయి. చాలా చోట్ల రహదారులు బీటలు వారాయి. అసోంలోని తేజ్‌పూర్‌కు పశ్చిమాన 43 కిలోమీటర్లు, లోతు 17 కిలోమీటర్లు భూకంపం కేంద్రీకృతమై ఉన్నట్టు సమాచారం. అసోం, ఉత్తర బెంగాల్, ఈశాన్య ప్రాంతాలలోని గౌహతిలో ప్రకంపనలు సంభవించాయి.దీంతో సోషల్ మీడియాలో భూకంపం ఫోటోలు, వీడియోలు వెల్లువెత్తాయి. మరోవైపు దీనిపై అసోం ముఖ్యమంత్రి సరబానంద సోనోవాల్ కూడా ట్వీట్ చేశారు. భారీ భూకంపం సంభవించింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. అటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షా కూడా భూకంపంపై స్పందించారు. సీఎం సోనోవాల్‌తో మాట్లాడానని ప్రధాని ట్వీట్ చేశారు. అన్ని విధాలా కేంద్రం సహాయం చేస్తుందంటూ భరోసా ఇచ్చారు. ఈ ఆపద సమయంలో అసోం ప్రజల భద్రతపై ప్రార్థిస్తున్నానన్నారు. Spoke to Assam CM Shri @sarbanandsonwal Ji regarding the earthquake in parts of the state. Assured all possible help from the Centre. I pray for the well-being of the people of Assam. — Narendra Modi (@narendramodi) April 28, 2021 Earthquake of Magnitude:6.4, Occurred on 28-04-2021, 07:51:25 IST, Lat: 26.69 & Long: 92.36, Depth: 17 Km ,Location: 43km W of Tezpur, Assam, India for more information download the BhooKamp App https://t.co/sayMF9Gumd pic.twitter.com/lWRDtIAWh5 — National Center for Seismology (@NCS_Earthquake) April 28, 2021 Earthquake North East India Assam Taj Hotel Vivanta Guwahati Retweet#earthquake pic.twitter.com/ienCKz3Woc — gautam gada (@GautamGada) April 28, 2021 #earthquake in Assam Received this video from a friend claiming to be from Tezpur, the epicentre pic.twitter.com/7fnFiAJaY0 — Geetima Das Krishna (@GeetimaK) April 28, 2021 -
అసోంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ విజృంభణ
గువహటి: దేశంలోఒకవైపు కరోనా ఉధృతి కొనసాగుతుండగానే ప్రాణాంతక ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ (ఏఎస్ఎఫ్) అసోంను వణికిస్తోంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ఈ వ్యాధి విజృంభణను అడ్డుకునే చర్యల్లో భాగంగా ప్రభావిత ప్రాంతాల్లోని 12 వేల పందులను చంపేయాలని ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ ప్రభుత్వం బుధవారం (నిన్న) ఆదేశించారు. అంతేకాదు వాటి యజమానులకు తగిన విధంగా పరిహారం చెల్లించాలని అధికారులను కోరారు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశంలోని వివిధ ప్రాంతాలకు వీటిని సరఫరాను నిలిపివేశారు. పశుసంవర్ధక, పశువైద్య శాఖ సీనియర్ సమాచారం ప్రకారం రాష్ట్రంలోని ఇప్పటివరకు 14 జిల్లాల్లో 18 వేలకు పైగా పందులు మృత్యువాత పడ్డాయి. దీంతో సంబంధిత అధికారులతో సమావేశమైన సీఎం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, నిపుణుల అభిప్రాయం మేరకు బాధిత జిల్లాల్లో వరాహాలను వధించాలనే నిర్ణయం తీసుకున్నారు. దసరా ఉత్సవాలకు ముందే ఈ పని పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగు త్వరితగతిన శానిటైజేషన్ కార్యక్రమాలు చేపట్టాలని పశుసంవర్ధక, పశువైద్య విభాగాన్ని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఫాంలలో సర్వే నిర్వహించాలని, ఆరోగ్యకరమైన జంతువులకు ఈ వ్యాధి సంక్రమించకుండా జాగ్రత్తలు వహించాలని అధికారులు సీఎం అదేశించారు. ప్రభుత్వ ఆదేశాలతో14 జిల్లాల్లోని 30 బాధిత కేంద్రాల్లో కిలోమీటర్ పరిధిలో వరాహాలను సంహరించేందుకు నిర్ణయించామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వెంటనే డ్రైవ్ ప్రారంభించనున్నట్టు చెప్పారు. అలాగే సంబంధిత పరిహారాన్నిఆయా యజమానుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్టు తెలిపారు. ఇప్పటికే మొదటి విడత నిధిని కేంద్రం విడుదల చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కాగా 2019 జనాభా లెక్కల ప్రకారం, రాష్ట్రంలో వీటి సంఖ్య 21 లక్షలుగా ఉంది. ఇటీవలి కాలంలో ఈ సంఖ్య సుమారు 30 లక్షలకు పెరిగింది. రాష్ట్రంలో తొలిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరి చివరలో ఈ వ్యాధి వ్యాపించింది. 2019 ఏప్రిల్‌లో చైనాలోని జిజాంగ్ ప్రావిన్స్‌లోని ఒక గ్రామంలో (అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు) ఏఎస్ఎఫ్ ను గుర్తించగా, 1921లో కెన్యా, ఇథియోపియాలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ఉనికి తొలిసారి బైట పడింది. -
ఆ పాపకు కరోనా టెస్ట్ నెగెటివ్..
గౌహతి : అసోంలో అనుమానిత కోవిడ్-19 కేసుగా నమోదైన నాలుగేళ్ల చిన్నారికి రెండో సారి నిర్వహించిన పరీక్షలో కరోనా నెగెటివ్‌గా తేలడంలో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. తల్లి, సోదరితో కలిసి గురువారం రైలులో గురువారం అసోంకు వచ్చిన పాపకు జోర్హాత్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో నిర్వహించిన వైద్య పరీక్షలో కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే దిబ్రూగర్ జిల్లాలోని లహోవల్లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)కు చెందిన ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రానికి పాప శాంపిల్స్ పంపగా అక్కడ నిర్వహించిన పరీక్షలో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. పాపకు ఐసీఎంఆర్ ప్రాంతీయ కేంద్రంలో నిర్వహించిన పరీక్షలో కోవిడ్-19 నెగెటివ్‌గా వచ్చిందని జోహ్రాత్ డిప్యూటీ కమిషనర్ రోష్నీ అపరంజి కొరాటి తెలిపారు. నాలుగేళ్ల చిన్నారి తీవ్ర జ్వరం, దగ్గుతో బాధపడుతోందని చెప్పారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు 315కు చేరినప్పటికీ ఈశాన్య రాష్ట్రాల్లో ఇంతవరకూ ఒక్క కేసూ నమోదు కాలేదు. చదవండి : తినడం కంటే కొనడం ఎక్కువైంది -
ప్రేమించి పెళ్లాడి ఆపై..
న్యూఢిల్లీ : బాలికను ప్రేమించి పెళ్లాడిన యువకుడు ఆపై ఆమెను నడుస్తున్న రైలు నుంచి కిందకు తోసివేసిన ఘటన వెలుగుచూసింది. 18 ఏళ్ల బేబీ అనే బాలికను ప్రేమించి వివాహం చేసుకున్న హీరా (25) తన భార్యను వేగంగా కదులుతున్న రైలు నుంచి తోసివేసి, అనంతరం తానూ కిందకు దూకాడు. ఫతేగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే ట్రాక్స్‌పై స్పృహ కోల్పోయి పడిఉన్న జంటను పోలీసులు గుర్తించి వారిని కాపాడారు. దంపతులను జిల్లా ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. కాగా తాను హీరా ప్రేమించుకుని ఇంటి నుంచి బయటకు వచ్చి వివాహం చేసుకున్నామని బాబీ వెల్లడించిందని పోలీసులు తెలిపారు. మిస్డ్ కాల్స్‌తో మొదలైన తమ పరిచయం పెళ్లి వరకూ వచ్చిందని చెప్పారు. తాము ఇంటి నుంచి పారిపోయి ఈనెల 29న పట్నాలోని ఓ దేవాలయంలో పెళ్లి చేసుకున్నామని తెలిపారు. తాము హీరా స్వస్ధలం మొరదాబాద్ వెళ్లే రైలెక్కామని ట్రైన్ బరెల్లీ దాటగానే తనను హీరా తోసివేశాడని చెప్పుకొచ్చారు. కాగా బేబీ పరిస్థితివ విషమంగా ఉండటంతో ఆమెను లక్నో ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. -
మెగాస్టార్ రూ.50 లక్షల వరద సాయం
ముంబై : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచన్ అసోం వరద బాధితులకు రూ 50 లక్షల విరాళం ప్రకటించారు. ప్రజలంతా తమకు తోచిన సాయం చేయాలని పిలుపు ఇచ్చారు. వరదలు పోటెత్తి నష్టపోయిన అసోంకు ఊరటగా అమితాబ్ బచన్ రూ 51 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్‌కు పంపినందుకు ధన్యవాదాలు చెబుతూ ఆ రాష్ట్ర సీఎం శర్బానంద్ సోనోవాల్ ట్వీట్ చేశారు. అసోం ప్రజల తరపున తమకు బాసటగా నిలిచిన అమితాబ్ తమ ఔదార్యం చాటుకున్నారని అన్నారు. అసోం సీఎం శర్బానంద్ సోనోవాల్ ట్వీట్‌ను అమితాబ్ షేర్ చేస్తూ అసోం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నందున మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరారు. మరోవైపు వరదలతో దెబ్బతిన్న కజిరంగ పార్క్ పునరుద్ధరణ కోసం అంతకుముందు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ కోటి విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. -
మూడు రోజులైనా జాడ లేని విమానం
న్యూఢిల్లీ : గత మూడు రోజులుగా ఆచూకీ లభించని ఐఏఎఫ్ ఏఎన్-32 విమానం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 13 మంది సభ్యులతో కూడిన ఏఎన్-32 విమానం అసోంలోని జోర్హాట్ నుంచి సోమవారం మధ్యాహ్నం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఆచూకీ గల్లంతైంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని మెచుకా బేస్‌లో విమానం ల్యాండ్ కాకపోవడంతో గాలింపు చర్యలను ముమ్మరం చేసినా ఇప్పటివరకూ విమానం జాడ పసిగట్టలేకపోయారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని పశ్చిమ సియోంగ్ జిల్లాలోని కొండ ప్రాంతాల్లో పలు బృందాలు విమానం ఆచూకీ కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉండటంతో పాటు ప్రతికూల వాతావరణం గాలింపు చర్యలకు అవరోధంగా మారాయి. హెలికాఫ్టర్లు, ఇస్రో శాటిలైట్లు, నేవీకి చెందిన పీ-8ఐ విమానం సహా పలు బృందాలు గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యాయి. -
కారేపల్లి యువతి.. అసోంలో ...
కారేపల్లి (ఖమ్మం): కారేపల్లి యువతి.. అసోంలో మృతిచెందింది. ఆమె కుటుంబీకులు తెలిపిన వివరాలు... కారేపల్లి అంబేడ్కర్ సెంటర్‌కు చెందిన బాణోతు శిరీష(22), పేరుపల్లి గ్రామానికి చెందిన వరుసకు బావ అయిన అజ్మీర నరేష్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. నరేష్, బీఎస్ఎఫ్ (సరిహద్దు రక్షణ దళం) కానిస్టేబుల్‌గా అసోం రాష్ట్రంలో పనిచేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం ఆ దంపతులు ఇక్కడి నుంచి రైలులో అస్సాం బయల్దేరారు. మంగళవారం సాయంత్రం అక్కడకు చేరుకున్నారు. అప్పటికే ఆమె జ్వరంతో బాధపడుతోంది. ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందింది. అయినప్పటికీ జ్వరం తగ్గలేదు. అలాగే అసోం వెళ్లింది. మంగళవారం రాత్రి జ్వరం (డెంగీ) మరింత తీవ్రమైంది. అదే రోజు రాత్రి మృతిచెందింది. ఆమె తండ్రి జామ్లా నాయక్, టేకులపల్లి మండలంలో ఆర్ఐగా పనిచేస్తున్నారు. తల్లి జమున, గార్ల మండలంలోని ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. తమ కూతురు ఇక లేదన్న సమాచారాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. అసోం కోల్‌కతాకు, అక్కడి నుంచి సికింద్రాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు విమానంలో మృత దేహం చేరుకుటుందని, అక్కడి నుంచి అంబులెన్స్‌లో కారేపల్లికి గురువారం తెల్లవారుజామున తీసుకొస్తామని కుటుంబీకులు తెలిపారు. -
విమాన ప్రమాదంలో పైలట్ దుర్మరణం
టీ.నగర్: అసోం జరిగిన విమాన ప్రమాదంలో తాంబరానికి చెందిన పైలట్ సహా ఇద్దరు మృతి చెందారు. అసోం జోరహట్ వైమానికదళం నుంచి ఓ చిన్న విమానంలో వింగ్ కమాండర్ జైపాల్ జేమ్స్, టి.వత్సస్ నిఘా పనుల నిమిత్తం గురువారం మధ్యాహ్నం బయలుదేరారు. మజులి ఉత్తర ప్రాంతంలో బ్రహ్మపుత్ర నదిలో ఉన్న దీవి ప్రాంతానికి వెళుతుండగా విమానంలో హఠాత్తుగా సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ఈ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసేందుకు పైలట్లు ప్రయత్నించారు. ఆ సమయంలో విమానం ఇసుక దిబ్బను ఢీకొని పేలిపోయింది. ప్రమాదంలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. విమానం పేలుడును గమనించిన కొందరు వెంటనే పోలీసులకు సమాచారం తెలిపారు. సంఘటనా స్థలానికి వైమానిక దళ అధికారులు హుటాహుటిన చేరుకున్నారు. అయినప్పటికీ విమానం పూర్తిగా కాలిపోవడంతో ఆ విమానంలో ఉన్న పైలట్లను కాపాడేందుకు వీలు కాలేదని పోలీసులు తెలిపారు. తాంబరం పైలట్: మృతి చెందిన ఇద్దరిలో ఒకరు చెన్నై ఈస్ట్ తాంబరానికి చెందిన జయపాల్ జేమ్స్ (47) గా తెలిసింది. మరొకరి పేరు టి.వత్సస్. జేమ్స్ తండ్రి జయపాల్ వైమానిక దళంలో పని చేసి పదవీ విరమణ పొందారు. జేమ్స్‌కు భార్య గ్రేస్, కుమారుడు రోషన్, కుమార్తె రోస్మి ఉన్నారు. జేమ్స్ అంత్యక్రియలు బెంగళూరులో నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. దీని గురించి జేమ్స్ తండ్రి జయపాల్ మాట్లాడుతూ తన కుమారుడు జయపాల్ జేమ్స్ విమానంలో వెళుతూ ప్రమాదంలో మృతి చెందాడని, అతని భార్య, పిల్లలు బెంగళూరులో ఉన్నట్లు తెలిపారు. దీంతో అంత్యక్రియలు బెంగళూరులో జరుగుతాయన్నారు. తన కుమారుడు చిన్ననాటి నుంచి పైలట్‌గా చేరాలన్న ఆశతో వైమానికదళంలో చేరినట్లు తెలిపారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న ఈస్ట్ తాంబరం ప్రాంతానికి చెందిన పలువురు ప్రముఖులు జయపాల్‌ను కలిసి ఓదార్చారు. -
ఆ లెజెండరీ యాక్టర్ ఇక లేరు
గౌహతి: అస్సోంకు చెందిన లెజెండరీ యాక్టర్ బిజు ఫుకన్ (70) ఇక లేరు. గౌహతిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన బుధవారం తుది శ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా గుండె జబ్బుతో బాధపడుతున్న ఆయన శ్వాస సమస్యతో మరణిచినట్టు కుటుంబ సభ్యులు ప్రకటించారు. దీంతో ముఖ్యమంత్రి, గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపాన్ని ప్రకటించారు. పుకాన్ మరణంపై ముఖ్యమంత్రి సరబానందా సోనోవాల్ అసోం గవర్నర్ జగదీష్ ముఖి,మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ సహా ఇతర రాజకీయ ప్రముఖులు, ఇతర నటీనటులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. అస్సామీ చలన చిత్ర పరిశ్రమలో ఆయన లేని లోటు పూడ్చలేనిదంటూ, ఆయన అభిమానులకు, కుటుంబ సభ్యులకు గవర్నర్ సానుభూతిని ప్రకటించారు. అస్సామీ చలన చిత్ర పరిశ్రమకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన బిజూ ఫుకాన్ హఠాన్మరణం తనను ఎంతగానో బాధించిందన్నారు ముఖ్యమంత్రి . ఇది పరిశ్రమకు, మొత్తం సమాజానికి తీరని నష్టమని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ లాంఛనాలతో బిజు అంత్యక్రియలను నిర్వహిస్తామని సీఎం మీడియా సలహాదారు హృషికేష్ గోస్వామి ప్రకటించారు. కాగా అత్యంత ప్రముఖనటులలో ఒకరుగా నిలిచిన ఫుకాన్ అస్సామీ చలనచిత్ర పరిశ్రమకు అనేక సూపర్ హిట్ చిత్రాలనందించారు. ఉత్తమ కథానాయుకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును కూడా గెల్చుకున్నారు. 1970 ల నుంచి1990 ల వరకు కొన్ని బెంగాలీ చిత్రాలతో సహా 80 చిత్రాలలో నటించారు. ఆయన నటించిన చివరి చిత్రం ‘దూర్’ 2016లో విడుదలైంది. Saddened on the demise of noted Assamese actor Biju Phukan.His death is a great loss to the Assamese movie & cultural fraternity. RIP pic.twitter.com/zM2QTtCgV0 — Tarun Gogoi (@tarun_gogoi) November 22, 2017 I am deeply saddened to learn of the demise of noted Assamese actor Sri Biju Phukan. My prayers are with the bereaved family. May his soul rest in peace in heavenly abode pic.twitter.com/RRrzlYxnSv — Himanta Biswa Sarma (@himantabiswa) November 22, 2017 -
అసోంలో ఆరుగురు మిలిటెంట్లు హతం
దిస్పూర్: అసోంలో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఆరుగురు మిలిటెంట్లు హతమయ్యారు. వారిలో ఇద్దరు ఆ మిలిటెంట్ సంస్థ ఉన్నత శ్రేణి నాయకులు ఉన్నారు. శుక్రవారం వేకువ జామున ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసు అధికారులు చెప్పారు. వివరాల్లోకి వెళితే.. అసోంలోని ఆంగ్లాంగ్ జిల్లాలోని బాని పథార్ అటవీ ప్రాంతంలో పోలీసులు, సైనిక బలగాలు ఉమ్మడిగా తిరుగుబాటుదారుల ఏరివేత కార్యక్రమం ప్రారంభించారు. కర్బి పీపుల్స్ లిబరేషన్ టైగర్స్(కేపీటీఎల్)కు చెందిన తిరుగుబాటుదారులు బానిపథార్ ప్రాంతంలో సంచరిస్తున్నారని సమాచారం అందుకున్న బలగాలు, పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించగా వారికి కర్బి తిరుగుబాటుదారులు ఎదురుపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఇందులో ఆరుగురు మిలిటెంట్లు హతమయ్యారు. వేకువజామున జరిగిన ఈ ఎన్ కౌంటర్లో ఓ ఆర్మీ జవాను గాయపడగా అతడిని ఆస్పత్రికి తరలించారు. -
అస్సోంలో 12శాతం, బెంగాల్ లో 23శాతం
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో భాగంగా పశ్చి మ బెంగాల్, అసోం రాష్ట్రాలలో తొలి దశ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రజలు ఉత్సాహంగా తరలివచ్చి ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ చురుకుగా సాగుతోంది. ఉదయం 9 గంటలకు అసోంలో 12 శాతం పోలింగ్ నమోదు కాగా, పశ్చిమ బెంగాల్ లో 23 శాతం పోలింగ్ నమోదైంది. ఇక పశ్చిమ బెంగాల్ లో అక్కడక్కడ చెదురు మదురు సంఘటనలు నమోదయ్యాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారి తెలిపారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం మొరాయించడంతో కొంత గందరగోళం నెలకొంది. దీంతో అధికారులు పోలింగ్ ను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. 33 మంది అభ్యర్థులు బరిలో ఉన్న తొలి దశ ఎన్నికల్లో బెంగాల్ రాష్ట్రంలో 18 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 18 నియోజకవర్గాలల్లో తృణమూల్ కాంగ్రెస్-వామపక్ష కూటమి భారతీయ జనతా పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నారు. అస్సోంలో మొదటి రెండు గంటల్లో 12 శాతం పోలింగ్ శాతం నమోదయినట్టు ఎన్నికల కమిషన్ అధికారి తెలిపారు. ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ల ముందు బారులు తీరారు. ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్, భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి శరబానందా సొనవాల్ సహా 539 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్న మొదటి దశలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. అస్సోంలో 65 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 539 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఏప్రిల్ 11, 17, 21, 25, 30, మే 5 తేదీలలో మలిదశ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. -
'ఇక్కడ కూడా అదే రిపీటవుద్ది'
బార్పెటా: అసోంలో కూడా బీజేపీకి ఓటమి తప్పదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. మైనారిటీల మద్దతుతో తాము అసోంలో కూడా విజయభావుటా ఎగురవేస్తామని, బీజేపీని మరోసారి ఓడిస్తామని అన్నారు. బార్పెటా జిల్లాలోని ఓ ఆలయం నుంచి ఏడు కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభించిన ఆయన ఓ మసీదువద్ద ముగించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. ప్రధాని మోదీ లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదని అందుకే అసోం ప్రజలు ఆయనను తిరస్కరించడం ఖాయమని అన్నారు. బిహార్ ప్రజలు మోదీని తిరస్కరించి ఢిల్లీకి వెళ్లిపోండి అని చెప్పారని, అసోంలో కూడా అదే జరుగుతుందని చెప్పారు. బార్పెటా జిల్లాలో 70శాతం మంది ముస్లిం జనాభా ఉంది. -
కిడ్నాపైన ఏపీ కాంట్రాక్టర్ క్షేమంగా విడుదల
హైదరాబాద్/రాయచోటి/రామాపురం/సాక్షి,న్యూఢిల్లీ: అస్సాం లో కిడ్నాపైన ఆంధ్రప్రదేశ్ సివిల్ కాంట్రాక్టర్ పప్పిరెడ్డి మహేశ్వరరెడ్డి సోమవారం క్షేమంగా బయటపడ్డారు. బోడో మిలిటెంట్లుగా భావిస్తున్న కొంతమంది ఆయన్ను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. మహేశ్వరరెడ్డికి ఎలాంటి హాని తలపెట్టవద్దని కుటుంబ సభ్యులు, అక్కడి ప్రభుత్వ యంత్రాంగం, సైబరాబాద్ పోలీసులు, ప్రజా ప్రతినిధులు కోరడంతో ఆగంతకులు స్పందించారు. ఎలాంటి డిమాండ్లు చేయకుండా కిడ్నాపర్లు ఆయన్ను విడిచిపెట్టారు. తాను విడుదలైన విషయాన్ని మహేశ్వర్‌రెడ్డి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు అస్సాం బయలుదేరారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌కు రానున్నట్లు తెలుస్తోంది. -
మహేశ్వర్ రెడ్డి కుటుంబసభ్యులకు వైఎస్ జగన్ ఫోన్
హైదరాబాద్ : అసోంలో కిడ్నాప్ అయిన సివిల్ కాంట్రాక్టర్ మహేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఫోన్లో మాట్లాడారు. ఆయన ఈ సందర్బంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని మహేశ్వర్‌రెడ్డి కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ సూచించారు. కిడ్నాప్ వ్యవహారాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దృష్టికి తీసుకెళతామని ఆయన హామీ ఇచ్చారు. పార్టీ ఎంపీలు అవినాష్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి ఢిల్లీలో ఉండి ఈ ఘటనపై ఎప్పటికప్పుడు కేంద్రంతో సంప్రదింపులు జరపాలని వైఎస్ జగన్ ఆదేశించారు. కాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సివిల్ కాంట్రాక్టర్ మహేశ్వర్ రెడ్డిని అసోంలోని దివాస్ జిల్లా గౌడీ(అటవీ) ప్రాంతంలో బోడో మిలిటెంట్లు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. మహేశ్వరరెడ్డి స్వస్థలం వైఎస్సార్ జిల్లా రామాపురం మండలం హసనాపురం. క్లాస్‌వన్ కాంట్రాక్టర్ అయిన మహేశ్వరరెడ్డి హసనాపురం గ్రామానికి గతంలో సర్పంచ్‌గా కూడా పనిచేశారు. గత మూడేళ్ల నుంచి హైదరాబాద్ గచ్చిబౌలిలోని నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య సుభద్రమ్మ, కూతురు నిశిత, కొడుకు మంజునాథ్ ఉన్నారు. ప్రస్తుతం మహేశ్వరరెడ్డి గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్, అసోం రాష్ట్రాలలో ఐఎల్ఎఫ్ (రాంకీ కంపెనీ )లో సబ్ కాంట్రాక్టర్‌గా పనులు చేయిస్తున్నారు. -
కొనసాగుతున్న నాలుగోదశ పోలింగ్
న్యూఢిల్లీ :సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా నాలుగో దశ ఎన్నికల పోలింగ్ శనివారం కొనసాగుతోంది. నాలుగు రాష్ట్రాల్లోని ఏడు లోక్‌సభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే బారులు తీరుతున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏడు గంటల నుంచే సందడి కనిపిస్తోంది. గోవాలో ముఖ్యమంత్రి మనోహర్ పారీకర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నాలుగో దశ ఎన్నికల్లో అసోంలో మూడు, గోవాలో రెండు, త్రిపుర, సిక్కింలలో ఒక్కో స్థానానికి పోలింగ్ సాగుతోంది. వీటితో పాటు సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు సాగుతున్నాయి. మొత్తం 74 మంది అభ్యర్థులు బరిలో ఉండగా దాదాపు 50 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. -
ప్రారంభమైన మొదటి దశ పోలింగ్
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోలాహలం ఊపందుకుంది. ప్రచార పర్వం కొనసాగుతుండగానే పోలింగ్ పర్వానికి తెర లేచింది. తొమ్మిది దశల్లో సాగే పోలింగ్‌కు సంబంధించి తొలి దశ సోమవారం పోలింగ్ ప్రారంభమైంది. అసోం, త్రిపురల్లో జరుగుతున్న మొదటి దశ పోలింగ్‌కు ఓటర్లు అప్పుడే బారులు తీరుతున్నారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్‌లో ఓటు వేసేందుకు ప్రజలు ఉత్సాహంగా తరలి వస్తున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. మొదటి దశలో అసోంలో 5 లోక్‌సభ స్థానాలు, త్రిపురలో ఒక స్థానానికి పోలింగ్ జరగుతోంది. అసోంలో మొత్తం 14 స్థానాలుండగా 51 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అభ్యర్థుల్లో 5 గురు మహిళలకు చోటు లభించగా 13 మంది కోటీశ్వరులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దాదాపు 64 లక్షల మంది ఓటర్లు కాంగ్రెస్, బీజేపీ, ఏజేపీల భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు. అటు... త్రిపురలో 13 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో ఒక మహిళ అభ్యర్థి కూడా రంగంలో ఉన్నారు. -
'ఇది మాకు నూతన సంవత్సర కానుక'
చీరాల : ఇంజనీర్ అంకమ్మరావు విడుదలతో ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తన భర్త క్షేమంగా విడుదల కావటం చాలా ఆనందంగా ఉందని అంకమ్మరావు భార్య వాణి తెలిపారు. ఇది తమకు నూతన సంవత్సర కానుక అని ఆమె అన్నారు. అంకమ్మరావు తమతో ఫోన్లో మాట్లాడరని, ప్రస్తుతం అసోంలోనే ఉన్నారని, బుధవారం చీరాల వస్తారని తెలిపారు. తన భర్త బోడోల చెరలో ఉన్న ఈ పదిరోజులు తాము నరకం చూశామని వాణి కన్నీటి పర్యంతమయ్యారు. కాగా ఇంజనీర్ అంకమ్మరావును ఈ రోజు తెల్లవారుజామున... నాలుగు గంటలకు బోడో తీవ్రవాదులు విడుదల చేశారు. తాను క్షేమంగా వున్నట్లు కుటుంబ సభ్యులకు అంకమ్మరావు ఫోన్ చేసి చెప్పారు. ఈ నెల 22న అసోంలోని ఆమ్గురిలో అంకమ్మరావును బోడో తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే.