భువనేశ్వర్: కులగణన అంశంలో బిహార్ దారిలో ఒడిశా కూడా ముందడుగు వేస్తోంది. ఒడిశాలో ఇప్పటికే ఓబీసీ జాబితాను నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం లెక్కగట్టింది. ఆ జాబితాను ఎప్పుడు విడుదల చేయాలా..? అని ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఓబీసీ సెన్సెస్ రిపోర్టు అంశంలో రాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా వ్యవహరిస్తోందని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వెల్లడించారు.
వెనకబడిన ఐదు ముస్లిం వర్గాలపై సర్వే చేయనున్నట్లు అసోం ఇప్పటికే ప్రకటించింది. సోషియో-ఎకానమిక్ సర్వే నిర్వహించి, దాని ఆధారంగా వారి అభివృద్ధికి పాటుపడనున్నట్లు స్పష్టం చేసింది. బిహార్‌లో కులగణన రిపోర్టును సీఎం నితీష్ కుమార్ ఇప్పటికే వెల్లడించారు. జనాభాలో దాదాపు 63 శాతం మంది ఓబీసీ, ఈబీసీ జాబితాకి చెందినవారేనని ఆ రిపోర్టు స్పష్టం చేసింది.
బిహార్‌లో మొత్తం 13.07 కోట్ల మంది ఉంటే.. అందులో దాదాపు 36 శాతం ఈబీసీ(అతి ఎక్కువ వెనకబడిన తరగతి)కి చెందినవారేనని రాష్ట్ర అభివృద్ధి కమిషనర్ వివేక్ సింగ్ తెలిపారు. మిగిలినవారిలో 27.13 అత్యధికంగా ఓబీసీలు ఉన్నారని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: చైనా నుంచి నిధులు.. న్యూస్‌క్లిక్ ఫౌండర్‌కు రిమాండ్
Comments
Please login to add a commentAdd a comment