OBC category
-
ఒడిశా కులగణన రిపోర్టు..!
భువనేశ్వర్: కులగణన అంశంలో బిహార్ దారిలో ఒడిశా కూడా ముందడుగు వేస్తోంది. ఒడిశాలో ఇప్పటికే ఓబీసీ జాబితాను నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం లెక్కగట్టింది. ఆ జాబితాను ఎప్పుడు విడుదల చేయాలా..? అని ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఓబీసీ సెన్సెస్ రిపోర్టు అంశంలో రాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా వ్యవహరిస్తోందని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వెల్లడించారు. వెనకబడిన ఐదు ముస్లిం వర్గాలపై సర్వే చేయనున్నట్లు అసోం ఇప్పటికే ప్రకటించింది. సోషియో-ఎకానమిక్ సర్వే నిర్వహించి, దాని ఆధారంగా వారి అభివృద్ధికి పాటుపడనున్నట్లు స్పష్టం చేసింది. బిహార్‌లో కులగణన రిపోర్టును సీఎం నితీష్ కుమార్ ఇప్పటికే వెల్లడించారు. జనాభాలో దాదాపు 63 శాతం మంది ఓబీసీ, ఈబీసీ జాబితాకి చెందినవారేనని ఆ రిపోర్టు స్పష్టం చేసింది. బిహార్‌లో మొత్తం 13.07 కోట్ల మంది ఉంటే.. అందులో దాదాపు 36 శాతం ఈబీసీ(అతి ఎక్కువ వెనకబడిన తరగతి)కి చెందినవారేనని రాష్ట్ర అభివృద్ధి కమిషనర్ వివేక్ సింగ్ తెలిపారు. మిగిలినవారిలో 27.13 అత్యధికంగా ఓబీసీలు ఉన్నారని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: చైనా నుంచి నిధులు.. న్యూస్‌క్లిక్ ఫౌండర్‌కు రిమాండ్ -
‘యూపీ సర్కార్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం’
లక్నో : పదిహేడు ఓబీసీ కులాలను ఎస్సీల్లో చేర్చుతూ యూపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. ఈ నిర్ణయాన్ని బీఎస్పీ చీఫ్ మాయావతి ఇప్పటికే తప్పుపట్టగా, కేంద్ర సామాజిక న్యాయమంత్రి థావర్ చంద్ గెహ్లోత్ సైతం యూపీ సర్కార్ నిర్ణయం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. 17 అత్యంత వెనుకబడిన కులాలకు ఎస్సీ సర్టిఫికెట్లు జారీ చేయాలన్న యూపీ ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని రాజ్యసభలో మాట్లాడుతూ ఆయన స్పష్టం చేశారు. కోర్టు సైతం సహేతుకం కాదని ప్రకటించిన ఈ నిర్ణయాన్ని యూపీ ప్రభుత్వం వెనక్కితీసుకోవాలని మంత్రి కోరారు. రాజ్యాంగ నిబంధనలను పక్కనపెట్టి యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని బీఎస్పీ సభ్యుడు సతీష్ మిశ్రా ఈ అంశాన్ని సభలో లేవనెత్తారు. రాజ్యాంగంలోని 341 సెక్షన్ ప్రకారం రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారానే ఎస్సీ జాబితాలో ఎలాంటి మార్పుచేర్పులైనా చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. -
‘వారిని ఎస్సీల్లో చేర్చడం రాజ్యాంగవిరుద్ధం’
లక్నో : యూపీ ప్రభుత్వం 17 ఓబీసీ కులాలను ఎస్సీల్లో చేర్చుతూ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని బీఎస్పీ చీఫ్ మాయావతి మండిపడ్డారు. ఎస్సీ క్యాటగిరీలో ఏ ప్రభుత్వమైనా మార్పుచేర్పులను రాజ్యాంగంలోని 341 ఆర్టికల్ నిరోధిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఆ 17 ఓబీసీ వర్గాలు ప్రస్తుతం అటు ఓబీసీలు..ఇటు ఎస్సీలు కాకుండా పోయారని, వారికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరవని చెప్పారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఆమె యూపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం 341 ఆర్టికల్‌కు అనుగుణంగా చర్యలు చేపట్టి రాజ్యాంగ ప్రక్రియకు అనుగుణంగా ఈ కులాలను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఆమె కోరారు. ఎస్సీ కోటాను సైతం అదే నిష్పత్తిలో పెంచాలని మాయావతి సూచించారు. గతంలో ఎస్పీ ప్రభుత్వం ఇదే తరహా ఉత్తర్వులు ఇచ్చిన సమయంలోనూ దాన్ని వ్యతిరేకించానని ఆమె గుర్తుచేశారు. కాగా యూపీ ప్రభుత్వం రాజ్‌భర్, మల్లా, ప్రజాపతి, కుమ్హర్ వంటి 17 ఓబీసీ కులాలను ఎస్సీ కేటగిరీలో చేర్చుతూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
ప్రాజెక్టులను అడ్డుకోవడానికే కూటమి
సాక్షి,మిరుదొడ్డి(దుబ్బాక): తెలంగాణలో ఉన్న బీడు భూములను సస్యశ్యామలం చేయడానికి తలపెట్టిన ప్రాజెక్టు నిర్మాణాలను అడ్డుకోవడానికే మహాకూటమి పేరుతో కుట్రలు పన్నుతున్నారని దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిధిలోని మల్లుపల్లిలో మంగళవారం ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. డప్పు చప్పుళ్లతో రామలింగారెడ్డికి పలు కుల సంఘాల సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. గొల్ల కురుమ సంఘం సభ్యులు రామలింగాడ్డిని గొంగడి కప్పి గొర్రెపిల్లతో ఘనంగా సన్మానించారు. మహిళలు మంగళహారతులు, విజయ తిలకాలు దిద్ది ఆశిర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాకూటమి పేరుతో వచ్చే నాయకులను గెలిపిస్తే సాగు నీటిని అందించే ప్రాజెక్టు నిర్మాణాలు ఆగిపోతాయని ఆరోపించారు. దీంతో తెలంగాణలో సాగు నీరు లేక వ్యవసాయం నల్లేరుపై నడకలాగా మారే ప్రమాదం పొంచి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్ని మహాకూటములు ఎదరువచ్చి నిలిచినా ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. వ్యవసాయ రంగంలో నెలకొన్న ఒడిదుడుకులకు గుర్తించిన కేసీఆర్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నాడన్నారు. మరో సారి అధికారంలోకి వస్తే వ్యవసపాయ రంగానికి కావాల్సిన సాగు నీటితో పాటు ఎకరానికి రూ.10 వేలు పంట సాయంగా అందిస్తాడన్నారు. రైతుబంధు, రైతు బీమా దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రజలు మరోసారి తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే దుబ్బాక నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధిబాటలో నిలుపుతామన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు పూర్తయి నీళ్లొస్తే దుబ్బాక రైతాంగం కష్టాలు తీరుతాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కవిత, వైస్ ఎంపీపీ తుమ్మల బాల్‌రాజు, ఎంపీటీసీలు సుక్క శ్రీనివాస్, గొట్టం భైరయ్య, ధార స్వామి, టీఆర్ఎస్ నాయకులు పంజాల శ్రీనివాస్‌గౌడ్, లింగాల వెంకట్‌రెడ్డి, కాలేరు శ్రీనివాస్, బుర్ర లింగంగౌడ్, వల్లాల సత్యనారాయణ, ఎల్లం, దుబ్బరాజం, లింగం, ఎల్ముల స్వామి, గంగాధర్, అంజిరెడ్డి పాల్గొన్నారు. -
ఓబీసీ బిల్లుపై కాంగ్రెస్ వైఖరేంటి..?
సాక్షి, న్యూఢిల్లీ : ఓబీసీ బిల్లుపై తమ పార్టీ వైఖరి వెల్లడించాలని బీజేపీ చీఫ్ అమిత్ షా కాంగ్రెస్‌ను డిమాండ్ చేశారు. జాతీయ పౌరుల జాబితా (ఎన్ఆర్సీ) వ్యవహారంలో విపక్షం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఓబీసీ సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొంది ప్రస్తుతం రాజ్యసభ ముందున్న విషయం తెలిసిందే. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ తరహాలో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించే దిశగా ఈ సవరణ చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఓబీసీ బిల్లుపై తన వైఖరి వెల్లడిస్తే బీసీల ప్రయోజనాలపై ఆ పార్టీ చిత్తశుద్ధి ఏపాటిదో వెల్లడవుతుందని అమిత్ షా డిమాండ్ చేశారు. ఎన్ఆర్సీ అంశంపై అమిత్ షా స్పందిస్తూ బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన వారిని తిప్పిపంపేందుకు తాము కట్టుబడిఉన్నామని స్పష్టం చేశారు. చొరబాటుదారులు దేశంలోనే ఉండాలని విపక్షాలు కోరుకుంటున్నాయా అని ప్రశ్నించారు. -
‘చెత్త’ కుటుంబం నుంచి ఎయిమ్స్‌కు
భోపాల్: చెత్త ఏరుకునే వ్యక్తి కుమారుడు ఎన్నో కష్టనష్టాలకోర్చి తొలి ప్రయత్నంలోనే ప్రతిష్టాత్మక ఎయిమ్స్ లో సీటు సాధించి పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నాడు. మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌కు చెందిన ఆశారాం చౌదరి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ప్రవేశపరీక్షలో ఓబీసీ కేటగిరిలో జాతీయ స్థాయిలో 141వ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. జాతీయ స్థాయిలో అతని ర్యాంకు 707. జోధ్‌పూర్‌లోని ఎయిమ్స్‌లో సీటు రావడంతో కళాశాలలో చేరేందుకు ఆశారాం రాజస్తాన్ వెళ్లాడు. అతని వైద్య విద్యకయ్యే ఖర్చు మొత్తాన్నీ భరించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ముందుకొచ్చింది. జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)లోనూ ఆశారాం ఓబీసీ కేటగిరీలో జాతీయ స్థాయిలో 803 ర్యాంకు సాధించాడు. ఆశారాం గురించి తెలుసుకున్న సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. అతణ్ని కార్యాలయానికి పిలిపించి అభినందించి, తొలి సాయంగా 25 వేల రూపాయలు అందజేయాల్సిందిగా దేవాస్ జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ పాండేను ఆదేశించారు. శనివారమే ఆశారాం జోధ్‌పూర్ బయల్దేరాడు. అతనికి తోడుగా ప్రభుత్వమే ఓ అధికారిని పంపించింది. చెప్పలేనంత సంతోషంగా ఉంది: ఆశారాం ఎయిమ్స్‌లో సీటు రావడంతో తనకు మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉందని ఆశారాం అంటున్నాడు. ‘మా నాన్న చెత్త ఏరుకుంటూ, ఎన్నో కష్టాలు పడుతూ మా కుటుంబాన్ని పోషిస్తున్నారు. తమ్ముడు పన్నెండో తరగతి, చెల్లెలు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. మా ఇంటికి విద్యుత్తు కనెక్షన్‌గానీ, మరుగుదొడ్డిగానీ లేదు’ అని ఆశారాం తన కుటుంబ దుర్భర పరిస్థితిని వివరించాడు. న్యూరాలజిస్ట్ కావాలన్నదే తన లక్ష్యమనీ, ఎంబీబీఎస్ తర్వాత ఎంఎస్ చదివి సొంత ఊరిలోనే వైద్యశాల ప్రారంభించి ప్రజలకు మంచి వైద్యం అందిస్తానని ఆశారాం వెల్లడించాడు. తమ ఊరిలోని వైద్యుడు దుర్గా శంకర్ కుమావత్ తనకు ఎంతో సాయం చేశాడనీ, ఆయనే తన హీరో అని వివరించాడు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఆశారాంకు ఓ లేఖ రాసి అభినందించారు. ‘నీలాంటి వాళ్లు ఎందరికో ఆదర్శంగా మారుతారు’ అని రాహుల్ ఆ లేఖలో పేర్కొన్నారు. -
ఆ 15 మందికి రుణ మాఫీ..
సాక్షి, న్యూఢిల్లీ : మోదీ సర్కార్ రైతులు, చిన్న వ్యాపారులను విస్మరించి, బడా పారిశ్రామికవేత్తలకే దోచిపెడుతోంని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. పార్టీ ఓబీసీ విభాగం కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ పేదలు, అణగారిన వర్గాల శ్రమఫలితాన్ని ఇతరులు అనుభవిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతరులు చేసిన పనులను ప్రధాని మోదీ తన ఘనతగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. నైపుణ్యాలు కలిగిన ప్రజలకు భారత్‌లో ఆదరణ లేదని, రైతులు కష్టించి పనిచేసినా వారెప్పుడు ప్రధాని కార్యాలయంలో కనిపించరని అన్నారు. కేవలం 15 మంది పారిశ్రామికవేత్తలకు మోదీ సర్కార్ రూ 2.5లక్షల కోట్లు ఇచ్చిందని, కానీ రైతుకు మాత్రం మొండిచేయి చూపిందని ఆరోపించారు. 15 మంది సంపన్నులకు రుణాలు మాఫీ చేసిన మోదీ ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతు రుణాలను మాత్రం మాఫీ చేయడం లేదని విమర్శించారు. దేశంలో ఓబీసీ ఎంతో నైపుణ్యాలు కలిగిన వారైనా ప్రభుత్వం వారికి సరైన చేయూత ఇవ్వడం లేదని రాహుల్ ఆరోపించారు. -
ఓబీసీ వర్గీకరణతోనే సరైన న్యాయం
సాక్షి, హైదరాబాద్: ఓబీసీ వర్గీకరణతోనే వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం అన్నారు. ఆదివారం లక్డీకాపూల్‌లో జరిగిన బీసీ ఉద్యోగుల సంఘం, బీసీ ప్రతినిధుల సంఘం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉన్నాయన్నారు. వర్గీకరణపై త్వరలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని, ఇందులో ఓబీసీల డిమాండ్లు స్పష్టం చేయాలని బీసీ సంక్షేమ సంఘానికి సూచించారు. బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పించేందుకు కృషి చేస్తున్నామని, వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రవేశపెడతామని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ జనాభాలో బీసీలే అధికంగా ఉన్నారని, వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. బీసీల కోసం రాష్ట్ర ప్రభుత్వం వినూత్న సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. -
'మా డిమాండ్ నెరవేర్చకుంటే...'
అహ్మదాబాద్: గుజరాత్ లో పటేల్ సామాజిక వర్గాన్ని ఓబీసీ కోటాలో చేర్చే వరకు తమ పోరాటం ఆగదని హార్దిక్ పటేల్ స్పష్టం చేశారు. తమ లక్ష్యం నెరవేరే వరకు ప్రభుత్వంతో చర్చలు జరపబోమన్నారు. పటేల్ లను ఓబీసీలో చేర్చాలన్నదే తమ డిమాండ్ అని, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేయమని తాము కోరడం లేదని తెలిపారు. తమను ఇతర వెనుకబడిన కులాల జాబితాలో చేర్చకుంటే మొత్తం ఓబీసీ కోటాను రద్దు చేయాలని హార్దిక్ అన్నట్టు వచ్చిన వార్తల గురించి అడిగినప్పుడు ఆయనీ విధంగా స్పందించారు. తమ లక్ష్యం కోసం ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గుజ్జర్ నాయకులను కలిసి తమ పోరాటానికి మద్దతు తెలపాలని కోరడానికి ఢిల్లీ వెళుతున్నట్టు హార్దిక్ తెలిపారు. తమ డిమాండ్ నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీ కమలం వాడిపోతుందని హెచ్చరించారు. బికాం గ్రాడ్యుయేట్ అయిన 22 ఏళ్ల హార్దిక్ పటేల్ పటేల్ రిజర్వేషన్ల ఉద్యమంతో పతాక శీర్షికాలకు ఎక్కాడు.