'మా డిమాండ్ నెరవేర్చకుంటే...' | Hardik Patel rules out negotiations, says not against quota | Sakshi
Sakshi News home page

'మా డిమాండ్ నెరవేర్చకుంటే...'

Published Fri, Aug 28 2015 6:50 PM | Last Updated on Sun, Sep 3 2017 8:18 AM

'మా డిమాండ్ నెరవేర్చకుంటే...'

'మా డిమాండ్ నెరవేర్చకుంటే...'

అహ్మదాబాద్: గుజరాత్ లో పటేల్ సామాజిక వర్గాన్ని ఓబీసీ కోటాలో చేర్చే వరకు తమ పోరాటం ఆగదని హార్దిక్ పటేల్ స్పష్టం చేశారు. తమ లక్ష్యం నెరవేరే వరకు ప్రభుత్వంతో చర్చలు జరపబోమన్నారు. పటేల్ లను ఓబీసీలో చేర్చాలన్నదే తమ  డిమాండ్ అని, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేయమని తాము కోరడం లేదని తెలిపారు. తమను ఇతర వెనుకబడిన కులాల జాబితాలో చేర్చకుంటే మొత్తం ఓబీసీ కోటాను రద్దు చేయాలని హార్దిక్ అన్నట్టు వచ్చిన వార్తల గురించి అడిగినప్పుడు ఆయనీ విధంగా స్పందించారు.

తమ లక్ష్యం కోసం ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గుజ్జర్ నాయకులను కలిసి తమ పోరాటానికి మద్దతు తెలపాలని కోరడానికి ఢిల్లీ వెళుతున్నట్టు హార్దిక్ తెలిపారు. తమ డిమాండ్ నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీ కమలం వాడిపోతుందని హెచ్చరించారు. బికాం గ్రాడ్యుయేట్ అయిన 22 ఏళ్ల హార్దిక్ పటేల్ పటేల్ రిజర్వేషన్ల ఉద్యమంతో పతాక శీర్షికాలకు ఎక్కాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement