Patel community
-
విజయ్ రూపానీ రాజీనామా: కొత్త సీఎం రేసులో ఉన్నది వీరే
-
విజయ్ రూపానీ రాజీనామా: కొత్త సీఎం రేసులో ఉన్నది వీరే
గాంధీనగర్: మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గుజరాత్ బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ శనివారం రాజీనామా చేశారు. రాష్ట్ర గవర్నర్‌ని కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. మోదీ నాయకత్వంలో గుజరాత్ అభివృద్ధి కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అయితే అనారోగ్య కారణాలతోనే విజయ్ రూపానీ రాజీనామా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నప్పటికీ అసలు కారణం వేరే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బొటాబొటీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ.. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే గుజరాత్లో బలమైన పటేల్ సామాజిక వర్గానికి దగ్గరయ్యేందుకే రూపానీతో రాజీనామా చేయించినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలో పటేల్ సామాజిక వర్గానికి చెందిన హార్ధిక్ పటేల్ బీజేపీని బెంబేలెత్తించిన సంగతి తెలిసిందే. తమ సామాజిక వర్గాన్ని ఓబీసీ జాబితాలో చేర్చాలని ఆయన భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కానీ, పటేళ్లను ఓబీసీ జాబితాలో చేర్చితే రిజర్వేషన్లు 50 శాతానికి మించుతాయి. దీంతో అధికార బీజేపీ వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోయింది. 15 శాతం జనాభా.. మద్దతు లేకుంటే కష్టమే.. గుజరాత్లో అధికార బీజేపీకి పటేళ్లు గట్టి మద్దతుదార్లు. ఆ రాష్ట్ర జనాభాలో ఈ సామాజికవర్గం వారు 15 శాతం మంది ఉన్నారు. గుజరాత్లో రాజకీయ, వ్యాపార రంగాల్లో పటేల్ సామాజికవర్గం వారు కీలక స్థాయిలో ఉన్నారు. ఈ క్రమంలోనే పటేళ్లకు మరింత ప్రాధాన్యం కల్పించి.. వారికి దగ్గరవ్వాలని బీజేపీ చూస్తోంది. ఇక రూపానీ రాజీనామాతో ఖాళీ అయిన సీఎం పీఠాన్ని ఎవరికి కట్టబెడతారనే చర్చ ఊపందుకుంది. కొత్త ముఖ్యమంత్రి రేసులో నితిన్ పటేల్, సీఆర్ పటేల్, ఆర్సీ ఫాల్దూ, మన్సుఖ్ మాండవియా ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. చదవండి: గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజీనామా మమతా బెనర్జీపై పోటీకి ప్రియాంకా -
పటేళ్లను పట్టేందుకు బీజేపీ వ్యూహం
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని భూస్వాములైన పాటేదార్ లేదా పటేళ్లను మళ్లీ మంచి చేసుకునేందుకు భారతీయ జనతా పార్టీ మంగళవారం నుంచి భారీ ఎత్తున కసరత్తు చేపట్టనుంది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా రంగంలో తమకూ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ హార్ధిక్ పటేల్ ఆధ్వర్యంలో పటేల్ కమ్యూనిటీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన నేపథ్యంలో వారు పాలకపక్ష బీజేపీకి బాగా దూరమైన విషయం తెల్సిందే. అయితే ఈ కార్యక్రమానికి మాస్టర్ పార్టీ వ్యూహకర్తగా పేరు మోసిన పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనంది బెన్ పటేల్ దూరంగా ఉండనున్నారు. ఎన్నికలకు ముందు పటేళ్లను మళ్లీ పార్టీలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో రేపు, అంటే సెప్టెంబర్ 26వ తేదీన ఎంపిక చేసిన పటేల్ నాయకులతో గాంధీనగర్‌లో చర్చలు జరపనున్నారు. ఈ సమావేశానికి హార్ధిక్ పటేల్‌ను పిలవక పోవడం గమనార్హం. అనంతరం రాష్ట్రంలో నిర్వహించనున్న రెండు ర్యాలీలకు ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించనున్నారు. ఈ రెండు ర్యాలీలకు డిప్యూటి ముఖ్యమంత్రి నితిన్ పటేల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జితూభాయ్ వఘానీలు నాయకత్వం వహించనున్నారు. వీరిరువురు కూడా పటేల్ నాయకులే. మొదటి యాత్ర సర్ధార్ పటేల్ జన్మస్థలమైన కరమ్సద్ నుంచి అక్టోబర్ ఒకటవ తేదీన, రెండవ యాత్ర అక్టోబర్ రెండవ తేదీన జాతిపిత మహాత్మా గాంధీ జన్మస్థలమైన పోర్బందర్ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ రెండు యాత్రలు కూడా పటేళ్లు ఎక్కువగా ఉండే నివాస ప్రాంతాల గుండా సాగి అక్టోబర్ 15వ తేదీన ముగుస్తాయి. మంగళవారం గాంధీనగర్‌లో జరుగనున్న పటేళ్ల సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రుపాని కూడా హాజరవుతున్నారు. వివిధ సామాజిక సంఘాలకు నాయకత్వం వహిస్తున్న పటేళ్ల కమ్యూనిటీ నాయకులు దాదాపు వందమంది రేపటి సమావేశానికి హాజరవుతారని భావిస్తున్నారు. 2016, సెప్టెంబర్ నెలలోనే పటేల్ కమ్యూనిటీని మళ్లీ హక్కున చేర్చుకునేందుకు సూరత్‌లో బీజేపీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ నాటి సమావేశంలో ప్రధాన వక్తగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొని మాట్లాడారు. ఆరోజున అమిత్ షాకు వ్యతిరేకంగా పాటిదార్ యువత సమావేశంలో విధ్వంసం సష్టించి వేదికపైకి కుర్చీలు విసిరారు. షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్‌లో మారణకాండ సృష్టించిన బ్రిటిష్ సైనికాధికారి జనరల్ డయ్యర్‌తో ఆయన్ని పోల్చారు. దాంతో ఆయన తన ప్రసంగాన్ని అర్ధంతరంగా ముగించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన గత మార్చి నెలలో అహ్మదాబాద్ నుంచి సోమ్‌నాథ్ వెళుతుండగా పటేళ్లు ఆయనపై కోడి గుడ్లతో దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే గుజరాత్ ముఖ్యమంత్రి పదవి నుంచి ఆనంది బెన్ పటేల్‌ను తొలగించి ఆమె స్థానంలో అమిత్ షా విధేయుడైన విజయ్ రుపానిని నియమించారు. ఈ పాత అనుభవాలను దృష్టిలో పెట్టుకొనే పటేళ్ల సమీకరణ కార్యక్రమానికి అమిత్ షా దూరంగా ఉన్నారు. -
హార్దిక్ అదృశ్యం.. హైడ్రామా!
రిజర్వేషన్ ఉద్యమాన్ని నిలిపేయాలని హెచ్చరించారంటున్న పటేల్ నేత అహ్మదాబాద్: గుజరాత్ పటేల్ సామాజిక వర్గ నేత హార్దిక్ పటేల్ అదృశ్యం అంశం హైడ్రామా నడుమ సుఖాంతమైంది. సురేంద్రనగర్ జిల్లా, ధ్రంగద్ర పట్టణ సమీపంలోని హైవేపై బుధవారం ఉదయం ఆయన ప్రత్యక్షమయ్యారు. కొందరు సాయుధులు తనను కార్లో అపహరించారని ఆయన చెబుతున్నారు. పటేళ్లను ఓబీసీలో చేర్చాలని ఉద్యమిస్తున్న హార్దిక్ మంగళవారం బయాద్ తాలూకాలో అనుమతి లేకుండా సభను నిర్వహిస్తుండటంతో ఆయనను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. కానీ అనుచరుల సాయంతో ఆయన తప్పించుకున్నారు. అనంతరం, మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత హార్దిక్ అనుచరుడు దినేశ్ పటేల్ హార్దిక్‌ను పోలీసులు నిర్బంధించారని హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కేజే ఠాకూర్ల ధర్మాసనం రాత్రి 2.40 గంటల దాకా దీనిపై విచారణ జరిపింది. హార్దిక్‌ను అరెస్ట్ చేయలేదని పోలీసులు ధర్మాసనానికి చెప్పడంతో, ఆయన ఎక్కడున్నాడో గుర్తించి, హాజరుపర్చాలని కోర్టు ఆదేశించిం ది. బుధవారం మధ్యాహ్నం తాను ధ్రంగద్ర హైవేపై ఉన్నానని హార్దిక్ తన అనుచరులకు సమాచారమిచ్చారు. బయాద్ పట్టణంలో కొందరు తనను అపహరించి, రిజర్వేషన్ ఉద్యమాన్ని నిలిపేయకుంటే చంపేస్తామని బెదిరిం చి, ఉదయం హైవేపై వదిలేసారని చెప్పారు. -
హార్దిక్ పటేల్ అరెస్టు.. పోలీసుల హైడ్రామా!
అహ్మదాబాద్: ఓబీసీ రిజర్వేషన్లలో పటేళ్లను చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని గత కొద్ది రోజులుగా తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తున్న గుజరాత్ యువకుడు హార్దిక్ పటేల్ అరెస్టు విషయంలో ఓ హైడ్రామా చోటుచేసుకుంది. ఓ గ్రామంలో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించాడని పోలీసులు ఆయనను, అతడి అనుచరులను అరెస్టు చేశారని హార్దిక్ పటేల్ తరుపు న్యాయవాది ఆరోపించగా పోలీసులు మాత్రం తాము ఏ అరెస్టు చేయలేదని, అరెస్టు చేసేందుకు వెళ్లగానే ఆయన అక్కడి నుంచి ఓ వాహనంలో తన అనుచరులతో కలిసి పారిపోయాడని, తాను ఎక్కడ ఉన్నాడన్న సమాచారం కూడా లేదని అన్నారు. అయితే, న్యాయవాది రాత్రి సమయంలో కోర్టును సంప్రదించగా అర్థరాత్రి 2.30 గంటల ప్రాంతంలో పోలీసులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. గురువారం కోర్టు కార్యకలాపాలు ప్రారంభం అయ్యే సమయానికి పోలీసులు హార్దిక్‌ను కోర్టు ముందు ప్రవేశ పెట్టాలని చెప్పారు. అయితే, ఇలా కోర్టు ఆదేశించిన కొన్ని గంటల్లోనే హార్దిక్ పటేల్ కనిపించడం గమనార్హం. పటేల్ సామాజికవర్గానికి రిజర్వేషన్లు ఇవ్వాలంటూ.. రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్న హార్దిక్ పటేల్... ఆ క్రమంలో అరవల్లి జిల్లా తెన్పూర్ గ్రామంలో సభ నిర్వహించారు. ఐతే సభకు ముందస్తు అనుమతి తీసుకోలేదంటూ.. పోలీసులు అక్కడే హార్దిక్ పటేల్‌ను అరెస్టు చేసినట్లు సమాచారం. అయితే, ఆయన తమ ఇంకా దొరకలేదన్నట్లుగా గాంధీనగర్, సబర్కంతా, అరవల్లి జిల్లాల్లో పోలీసువర్గాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉద్యమం ఆపేయాల్సింగా ఆయనను పోలీసులు బెదిరించినట్లు సమాచారం. ఈలోగా హార్దిక్ బయట కనిపించారు. అయితే, ఇప్పటి వరకు ఆయనను అరెస్టు చేసినట్లు అధికారికంగా పోలీసులు ప్రకటించకపోయినా.. అంతకుముందే అదుపులోకి తీసుకొని వదిలిపెట్టినట్లు తెలుస్తోంది. -
హార్దిక్ పటేల్ అరెస్టు.. పోలీసుల హైడ్రామా!
-
పీడకులకూ రిజర్వేషన్లేనా?
రిజర్వేషన్ ఒక పిల్లాడికి కాలేజీ డిగ్రీని పొందడంలో, ఉద్యోగాన్ని, తర్వాత ప్రమోషన్‌ను పొందటంలోనూ సహాయపడవచ్చు. కానీ వెనుకబడిన సామాజిక బృందం మొత్తానికి ఇతర వర్గాలతో సమాన స్థాయికి రిజర్వేషన్ తీసుకురాలేదు. విద్య, ఉద్యోగ రంగాల్లో తన సామాజిక వర్గం రిజర్వే షన్లను పొందనట్లయితే, కోటా విధానాన్నే పూర్తిగా రద్దు చేయాల్సి ఉంటుందని అహ్మదాబాద్ ర్యాలీలో హార్దిక్ పటేల్ ప్రకటించి నప్పుడు,అది ప్రారంభంలో, అప్పుడే ఎక్కడినుంచో ఊడి పడిన నవజాత నేత నుంచి వచ్చిన వాగాడంబర పదజాలంగా కనిపించింది. అయితే, వార్తాపత్రికల ఇంటర్వ్యూలలో, ప్రత్యేకించి ‘ది హిందూ’లో ‘మాకూ కావాలి లేకపోతే ఎవరికీ ఉండకూడదు’ అంటూ పటేల్ పదే పదే నొక్కి చెప్పినప్పుడు మొత్తం విషయం కొత్త రూపు దాల్చింది. దేశంలో అమలవుతున్న రిజర్వేషన్లలో కుల ప్రాతి పదిక వ్యవస్థకు వ్యతిరేకంగా వినిపిస్తున్న మర్మ రధ్వనులు ప్రస్తుతం వేగం పుంజుకున్నాయి. అయితే ఈ పరిస్థితి ఎంతవరకు వెళతుంది, ఎక్కడ ముగుస్తుం ది అనేది ఊహామాత్రంగానే ఉంటోంది. సాధారణంగా చూస్తే కాస్త సంపన్న సామాజిక వర్గాలకు చెందినట్లు కనిపిస్తున్నప్పటికీ రాజస్థాన్ జాట్‌లూ, మహారాష్ట్ర మరాఠాలు సైతం తమకూ రిజర్వేషన్ కావాలని ఎప్పటినుంచో డిమాండు చేస్తూవస్తున్నారు. ఈ వాస్తవం ఒక కొత్త దృక్కోణంకి సంబంధించి అందరి కళ్లూ తెరిపించాలి: ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న వ్యవస్థ అందిరికీ ఆమోదనీయంగా ఉంటోందా? ప్రతి ఒక్క పటేల్, జాట్ లేక మరాఠా వ్యక్తి సంప న్నుడు కాకపోవచ్చు లేదా ఇతరులతో సమానంగా వీరందరినీ ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలంటే రిజర్వేషన్ కోటా రూపంలో మద్దతు అవసరం లేకపో వచ్చు. అయితే అన్ని సామాజిక వర్గాలలో ఇలాంటి మద్దతు అవసరమైన వారు ఉండవచ్చు కానీ అనుమ తించిన దామాషాలో ఎదురవుతున్న అడ్డంకులు (సుప్రీంకోర్టు మొత్తం రిజర్వేషన్లను 49 శాతానికి మించకూడదని ఆదేశించింది) వీరి అవకాశాలను హరించివేస్తున్నాయి. షెడ్యూల్ కులాలు, తెగలకు మల్లే వీరు కూడా చాలా కాలంగా వెనుకబడి ఉంటున్నారు. పార్లమెంటు, శాసనసభల్లో రాజకీయ ప్రాతిని ధ్యం కోసం షెడ్యూల్ కులాలు, తెగలకు రిజర్వేషన్లు కల్పిస్తూ నిబంధనలు రూపొందించినప్పుడు, మొదట్లో దాన్ని పదేళ్ల కాలానికే పరిమితం చేశారు. కానీ తర్వాత దీన్ని క్రమానుగతంగా పెంచుకుంటూ వచ్చారు. విద్య, ఉపాధిలో ప్రవేశానికి సంబంధించినంతవరకు అది తాత్కాలికమే కానీ దీనికి నిర్దిష్టమైన ఏర్పాటు ఉండేది కాదు. స్థిర హక్కులను వెనక్కి తీసుకోవడానికి కష్టమ య్యే విధంగా వీటిని శాశ్వతంగా కొనసాగించడానికే నిర్ణయించుకున్నట్లు కనిపిస్తున్నాయి. కోటా కారణంగా అధికారంలోకి వచ్చిన వారు ఆ విధానాన్ని విరమిం చడానికి ఇష్టపడటం లేదు. ఈ కోణంలోంచే హార్దిక్ పటేల్ దృక్పథం కాస్త సందర్భసహితంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ అధికారంలోకి తుపాను లా దూసుకువచ్చినప్పుడు దానికి ముఖ్య కారణాలలో ఒకటి ఏమిటంటే కాంగ్రెస్ పాలనలో ఓబీసీలను నిర్లక్ష్యం చేయడం, ఎస్సీలు, ఎస్టీలను బలిపించడం అని అప్పట్లో పేర్కొనేవారు. తమను వ్యవస్థ పక్కకు తోసివేసిందని పటేల్ వర్గీయులు భావిస్తున్నారు కాబట్టే తమ హక్కును సాధించుకోవడానికి చూస్తున్నారన్న వాదనను గుజరాత్ పరిణామాలు తీసుకువస్తున్నాయి. ఇవి రాజస్థాన్‌లో జాట్లు, మహారాష్ట్రలో మరాఠాలు చేసినట్లుగానే ఉన్నాయి. వెనుకబడిన వర్గాలతో పోల్చి చూసుకున్నప్పుడు నష్టపోతున్న స్థితిలో తమను తాము కుదించుకోవడమే పరిహాసప్రాయంగా ఉంటోంది. తమకు తాము కొత్త ముద్రలో చూసుకోవడానికి క్రియా శీలకంగా ప్రయత్నిస్తున్నందుకు వారేమీ ఆందోళన చెందటం లేదు. పురుష లక్షణం ఇప్పుడు నిస్స హాయతను ప్రకటిస్తోంది. ఈ అంశంపై ప్రాంతీయ వార్తా చానల్లో ఒక మరాఠా వ్యాఖ్యాతను ప్రశ్నిం చారు. అందుకు ఆ వ్యాఖ్యాత ఇచ్చిన వివరణ ఆశ్చర్యం కలిగించింది. మరాఠాలు అత్యంత క్రియాశీలకంగా రాజకీయాల్లో మునిగితేలినందున వారు విద్యను నిర్లక్ష్యం చేశారని, వారి గత సంపద ఆవిరైపోయిం దన్నది ఆ వివరణ సారాంశం. అందుకే తమ సామా జిక వర్గానికి కోటా కావాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే తమ అజ్ఞానం నుంచి వారు తమకు తాముగా విముక్తి పొందాలి. అందుకే వారు కొత్తగా కనుక్కున్న నిస్సహాయత్వంలోకి తమను తాము జార్చుకోవడాన్ని అనుమతించేసుకుంటున్నార న్నది పెద్దగా గుర్తింపు పొందలేదు. అయితే మరాఠాలు ఒకప్పుడు పాలకులుగా ఉండేవారు. అధికార చట్రంలో వీరికి విస్తృత ప్రాతినిధ్యం ఉండేది. స్పష్టంగానే, స్వాతంత్య్రానంతరం తాము పొంది న ప్రయోజనాలనుంచి ఇప్పుడు దూరమైనట్లు పటేళ్లు భావిస్తున్నట్లుంది. 1950ల ప్రారంభంలో కౌలుదార్లుగా పనిచేస్తున్న దశ నుంచి వారు భూ యజమానులుగా మారారు. వ్యవసాయానికి వీరు కొత్త శక్తినిచ్చారు. సౌరాష్ట్రలో వేరుశనగ సాగు మిగులుకు దారితీసి అది పరిశ్రమలోకి వెళ్లింది. వారెంత శక్తివంతులయ్యారంటే 1980ల మధ్యలో గుజరాత్లో రగుల్కొన్న మత ఘర్షణ లకు, రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనకు పటేళ్లే కారణ మని తప్పుపట్టారు. కాని ఇప్పుడు ఈ పటేళ్లే పూర్తి వ్యతిరేక దిశకు మారి తమకే కోటాలు కావాలని కోరు కుంటున్నారు. కాని ఆ కోటాలను కొత్త రీతిలో చూస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చి దాదాపు 70 ఏళ్ల తర్వాత కూడా మన దేశం తన పౌరులకు సమానావకాశాలు కల్పించలేకపోతోందంటే, ఎస్సీలు, ఎస్టీలు ఇప్పటికీ వెనుకబడి ఉంటున్నారంటే మనల్ని మనం పాలించు కోవడంలో తీవ్రమైన తప్పు జరుగుతోంది. కోటా కల్పించిన తర్వాత కూడా ఒక ఎస్సీ లేక ఎస్టీ నేటికీ ప్రయోజనం పొందలేకపోతున్నారు కానీ, పీడక వర్గాలుగా మనం చెప్పుకుంటున్న వారు తమ మాజీ పీడితుల నుంచి ప్రస్తుతం అభద్రతను ఫీలవుతుండట మే విచిత్రం. కొంతవరకు బ్రాహ్మణులు కూడా తమ దురవస్థను చాటి చెబుతున్నారు. రిజర్వేషన్ అనేది ఒక పిల్లాడికి కాలేజీ డిగ్రీని పొం దడంలో, ఉద్యోగాన్ని, తర్వాత ప్రమోషన్‌ను కూడా పొందటంలో సహాయపడవచ్చు. కానీ పీడిత కమ్యూ నిటీ మొత్తాన్ని ఇతర వర్గాలతో సమాన స్థాయికి రిజర్వేషన్ తీసుకురాలేదు. రిజర్వేషన్ అనేది తమ సొంత సామాజిక బృందాలకు వారిని ప్రతినిధులుగా చేయవచ్చు. పార్లమెంటు, అసెంబ్లీలలో రిజర్వుడ్ స్థానాలు ఉన్నాయని గుర్తుంచుకోండి. కానీ తామెక్కడి నుంచి వచ్చారో ఆ పీడిత వర్గాలతో సంబంధం లేని ఒక క్రీమీలేయర్‌ను రిజర్వేషన్ సృష్టించిపెట్టింది. పీడిత వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు చెప్పుకుంటున్న వారు వారికి మీటగా మాత్రమే ఉంటున్నారు. అంతకు మించి ఈ క్రీమీలేయర్‌కు ప్రాధాన్యం లేదు. మహేష్ విజాపుర్కార్ (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్: mvijapurkar@gmail.com) -
'మా డిమాండ్ నెరవేర్చకుంటే...'
అహ్మదాబాద్: గుజరాత్ లో పటేల్ సామాజిక వర్గాన్ని ఓబీసీ కోటాలో చేర్చే వరకు తమ పోరాటం ఆగదని హార్దిక్ పటేల్ స్పష్టం చేశారు. తమ లక్ష్యం నెరవేరే వరకు ప్రభుత్వంతో చర్చలు జరపబోమన్నారు. పటేల్ లను ఓబీసీలో చేర్చాలన్నదే తమ డిమాండ్ అని, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేయమని తాము కోరడం లేదని తెలిపారు. తమను ఇతర వెనుకబడిన కులాల జాబితాలో చేర్చకుంటే మొత్తం ఓబీసీ కోటాను రద్దు చేయాలని హార్దిక్ అన్నట్టు వచ్చిన వార్తల గురించి అడిగినప్పుడు ఆయనీ విధంగా స్పందించారు. తమ లక్ష్యం కోసం ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గుజ్జర్ నాయకులను కలిసి తమ పోరాటానికి మద్దతు తెలపాలని కోరడానికి ఢిల్లీ వెళుతున్నట్టు హార్దిక్ తెలిపారు. తమ డిమాండ్ నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీ కమలం వాడిపోతుందని హెచ్చరించారు. బికాం గ్రాడ్యుయేట్ అయిన 22 ఏళ్ల హార్దిక్ పటేల్ పటేల్ రిజర్వేషన్ల ఉద్యమంతో పతాక శీర్షికాలకు ఎక్కాడు. -
అమెరికాలో పండనున్న ‘పటేళ్ల’ పంట
అమెరికాలో అత్యంత విజయవంతమైన సామాజికవర్గాలలో గుజరాత్‌కు చెందిన పటేల్ కమ్యూనిటీ ఒకటి. ఆ దేశంలోని మొత్తం మోటల్స్ (హోటళ్లు)లో సగం వరకు వీళ్లే నిర్వహిస్తున్నారు. 20వ శతాబ్దికి ముందు ఎలాంటి వ్యాపార చరిత్ర లేని పటేళ్లు పరదేశంలో హోటల్ రంగంలో పూర్తి ఆధిపత్యం చలాయించడమే ఒక విశేషం. ఇప్పుడు అమెరికా వలస విధానంపై ఆ దేశాధ్యక్షుడు ఒబామా జారీ చేసిన తాజా డిక్రీ పటేళ్ల పంట పండించనుంది. దాదాపు 30 ఏళ్ల క్రితం నేను పాఠశా లలో చదువుతున్నప్పుడు నా స్నేహితుడు అమెరికాకు వెళ్లేందుకు వీసాకోసం దర ఖాస్తు చేస్తూ తన చివరి పేరును మార్చు కున్నాడు. అతడు పటేల్. అదే పేరుతో దరఖాస్తు చేసినట్లయితే తన వీసాను తిరస్కరించే అవకాశం ఖచ్చితంగా ఉం దని అతడు భావించాడు. అది నిజమో కాదో నాకయితే తెలీదు (నేను కూడా 16 సంవత్సరాల వయసులోనే దరఖాస్తు చేసి వీసా పొందాను). కానీ అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న పటేళ్లు అప్పటికే చాలామంది ఉండేవారన్న మాట నిజం. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తాజాగా అమెరికా వలస విధానంలో ప్రకటించిన మార్పు అమెరికాలోని అక్రమ వలస దారులకు ప్రత్యేకించి 5 లక్షల మంది భారతీయుల ప్రతిపత్తిని చట్ట బద్ధం చేయనుంది. వీరిలో చాలామంది గుజరాత్‌కి చెందిన పటేల్ సామాజిక వర్గానికి చెందినవారే. వలసవిధానంలో మార్పుచేస్తూ ఒబామా ఇచ్చిన ఆదేశం 41 లక్షలమంది అమెరికా సంతతి పిల్లల తల్లిదండ్రులకు, ఇమ్మిగ్రేషన్ పత్రాలు లేకుండా అమెరికాకు వచ్చిన 3 లక్షల మంది పిల్లలకు వరంగా మారిందని మీడియా సమాచారం. అమెరికాలో నివసిస్తూ దేశ ఆర్థికాభివృద్ధికి పాటుపడుతున్న నిపుణత కలిగిన వలస ఉద్యోగులు, పట్టభద్రులు, ఔత్సాహిక వ్యాపారవేత్తలకు సదవకా శాన్ని కల్పిస్తూ ఒబామా వలస విధానంలో విస్తృత మార్పులను ప్రకటించారు. అమెరికాను ఇతర ప్రపంచ దేశాల కంటే ముందు నిలపడంలో మరింత పారదర్శకతతో వ్యవహరించడానికి ఇది వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు. గత సంవత్సరం ప్రకటించిన ఒక నివేదిక ప్రకారం అమెరికాలో 1.5 లక్షల మంది పటేళ్లు ఉన్నారని అంచనా. అయితే చాలామంది పటేళ్లు తమ చివరి పేర్లకు అమిన్ వంటి పేర్లను ఉపయోగిస్తున్నం దున వీరి సంఖ్య 2 లక్షల వరకు ఉండవచ్చు. అమెరికాలో ఉన్న పటేల్ వర్గీయులలో చాలామంది చట్టబద్ధంగా వచ్చినవారే. అమెరికాలో అత్యంత విజయవంతమైన సామాజిక వర్గాలలో వీరిదీ ఒకటి. అమెరికాలోని మొత్తం మోటల్స్ (హోటళ్లు) లో సగం వరకు భారతీయులు.. అందులోనూ పటేల్ సామాజికవర్గమే నిర్వహిస్తోం దని 1999లో తుంకు వరదరాజన్ అనే విలేకరి న్యూయార్క్ టైమ్స్‌లో రాశారు. పటేళ్లు ఎవరంటే, ‘వైశ్యులు లేదా వర్తకులు. అరేబియన్ సముద్రం పక్కన ఉండే భారతీయ రాష్ట్రం గుజరాత్లో మధ్యయుగాల్లో రాజులకు చెల్లించవలసిన పదో వంతు పన్నును లెక్కించడానికి వీరిని నియమించేవారు. వీరి మూలం గుజరాత్. వీరి రక్తంలోనే వ్యాపారం నిండి ఉంటుందని భారతీయులలో చాలా మంది ప్రజల నమ్మకం. పటేళ్లు కూడా దీన్ని నమ్ముతున్నట్లే కనిపిస్తారు’ అని ఆ విలేకరి రాశారు. ఇది నిజం కాదు. స్వయంగా పటేల్ వర్గీయులే నమ్మేసేటంత స్థాయిలో వారు తమ గురించి తాము తారస్థాయిలో ప్రచారం చేసుకున్నట్లు చెప్పుకునే కల్పనాగాథల నుండి ఇవి పుట్టుకొచ్చాయి. వాస్తవానికి పటేళ్లు కూడా పాటిల్, రెడ్లు, యాదవులు, గౌడలు, జాట్లు వంటి ఇతర రైతాంగ కులాల్లో భాగమైన రైతులు. నాలుగు కిందిస్థాయి సవర్ణులు లేదా గుర్తింపు పొందిన కులాల నుండి వీరు వచ్చారు. మనుస్మృతిలో వీరిని శూద్రులుగా పేర్కొన్నారు. అయితే పటేళ్లు ఈ నాలుగు సామాజిక బృందాలతో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటారు. ఎందుకంటే వీరు శాకాహారులు, పైగా వీరు వ్యాపారంవైపు మొగ్గు చూపారు. అయితే వీరికి వ్యాపారం ఒక వారసత్వంగా రాలేదు. 20వ శతాబ్దికి ముందు వీరికి ఎలాంటి వ్యాపార చరిత్రా లేదు. కానీ జైన్ వ్యాపారుల ఆధిపత్యంలో ఉన్న గుజరాత్లో వ్యాపార సంప్రదాయాన్ని వీరు పుణికిపుచ్చుకున్నారు. అయితే పటేళ్లు హార్డ్‌వేర్ స్టోర్లు, పెట్ షాపులు, ఔషధ విక్రయ సంస్థలలో ప్రవేశించకుండా మోటల్స్‌లో తమ అదృష్టాన్ని ఎందుకు చూసుకున్నారు అనే అంశాన్ని న్యూయార్క్ టైమ్స్ రచయిత వరద రాజన్ సరిగా అర్థం చేసుకోలేకపోయారు. ఒక కారణం ఏదంటే మోటల్స్ వ్యాపార స్థాయి విభిన్నమైనది. పైగా మోటల్స్ను విస్తరించుకోవచ్చు. రెండో కారణం ఏమిటంటే మోటల్స్ వ్యాపారం పటేళ్లకు ద్వంద్వ గుర్తింపును తెచ్చిపెడుతుంది. మోటల్స్ కౌంటర్ నుంచి వీరు అమెరికాతో వ్యవహరిస్తారు. కౌం టర్ వెనుక కిచెన్‌లో కధీ-బాత్ (గుజరాత్ ఆహారం) వంట వండ టం, టెలివిజన్లలో రామాయణం, బాలీవుడ్ సినిమాలను చూడటం ద్వారా వీరు అమెరికాలోనే భారత్‌ను పునఃసృష్టి చేయగలరు. మోటల్ వ్యాపారం మేధస్సు కంటే కష్టపడటం అవసరమైన వ్యాపారం. పటేళ్లు దాన్నే కోరుకున్నారు. అందుకనే అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటున్న పటేల్ సైతం ఆ దేశానికి సంపద లాంటి వాడు. ఎందుకంటే అతడు తనకు, తన కమ్యూనిటీకి కట్టుబడి ఉంటాడు తప్పితే దేశానికి అతడు ఉపద్రవం, కంటకం కాదు. పైగా, పాశ్చాత్య ప్రపంచంలో భారతీయ వలస ప్రజలకు పాకిస్థానీయులు, బంగ్లాదేశీయుల కంటే మించిన మంచి పేరుంది. దీనికి ఒక కారణం ఏమిటంటే సాధారణంగా వలస భారతీయులు ఉన్నత సామాజికవర్గానికి సంబంధించిన వారై ఉండటం. పైగా అన్ని అర్హతలూ కలిగిన వృత్తి జీవుల్లా కనిపిస్తారు. మరొక కారణం ఏమిటంటే ప్రత్యేకించి యూరప్‌లోని పాకిస్థానీ, బంగ్లాదేశీ వలస దారులలో చాలామంది తీవ్ర మతాభినివేశం కలిగి ఉన్నారు. వీరు అరబ్ బృందాలతో జత కట్టారు. దీంతో వీరు హానికరంగా తయారయ్యారు. వీరిలో నిరుద్యోగం పరాకాష్టకు చేరింది. దీంతో పాకిస్థానీ, బంగ్లాదేశీ వలసదారులను ఆతిథ్య దేశం లేదా ఖండం ఒక ఉపద్రవంగా చూస్తోంది. నా పాకిస్థానీ మిత్రుడొకరు ఇటీవల ఒక విషయం చెప్పారు. ప్రత్యేకించి అమెరికాలో ఉన్న కొంతమంది పాకిస్థానీయులు ఇటీవలి సంవత్సరాల్లో పాకిస్థాన్‌తో ముడిపడి ఉంటే వచ్చే సమస్యలనుండి తప్పించుకోవడం కోసం ఫక్తు భారతీయుల్లా వ్యవహరిస్తున్నారట. మరోవైపున యూరప్‌లోని ఉపఖండ రెస్టారెంట్లలో చాలా వాటిని బంగ్లాదేశీయులు సమర్థవంతంగా నడుపుతున్నారు కానీ ఇవి ఇండియన్ రెస్టారెంట్లుగా గుర్తింపు పొందాయి. బంగ్లాదేశ్ అంటే ఎక్కడుంది, వాళ్లెవరు అనే పరిజ్ఞానం లేకపోవడం వల్ల కావచ్చు.. యూరప్‌లో ఇండియన్ బ్రాండ్ మరింత ఆకర్షణీయంగా మారింది. మూడో కారణం ఏమిటంటే భారతీయ ఆహారంగా పశ్చిమ దేశాలకు పరిచితమైనది బెంగాలీ ఆహారమే. ఈ నేపథ్యంలో అమెరికా వలస విధానంపై ఒబామా జారీ చేసిన తాజా డిక్రీ మూడు ఉపఖండ బృందాలకూ దోహదపడు తుంది కానీ, భారతీయులు ప్రత్యేకించి పటేళ్లకే ఇది ఎక్కువగా ఉపకరిస్తుంది. పటేల్ కమ్యూనిటీకి, అమెరికా సంయుక్త రాష్ట్రాలకు కూడా ఇది మంగళకరమైన వార్తే. (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత) - ఆకార్ పటేల్