పీడకులకూ రిజర్వేషన్లేనా? | mahesh vijapurkar, reservations, patel community | Sakshi
Sakshi News home page

పీడకులకూ రిజర్వేషన్లేనా?

Published Mon, Aug 31 2015 1:00 AM | Last Updated on Sun, Sep 3 2017 8:25 AM

పీడకులకూ రిజర్వేషన్లేనా?

పీడకులకూ రిజర్వేషన్లేనా?

 రిజర్వేషన్ ఒక పిల్లాడికి కాలేజీ డిగ్రీని పొందడంలో, ఉద్యోగాన్ని, తర్వాత ప్రమోషన్‌ను పొందటంలోనూ సహాయపడవచ్చు. కానీ వెనుకబడిన సామాజిక బృందం మొత్తానికి ఇతర వర్గాలతో సమాన స్థాయికి రిజర్వేషన్ తీసుకురాలేదు.
 
విద్య, ఉద్యోగ రంగాల్లో తన సామాజిక వర్గం రిజర్వే షన్లను పొందనట్లయితే, కోటా విధానాన్నే పూర్తిగా రద్దు చేయాల్సి ఉంటుందని అహ్మదాబాద్ ర్యాలీలో హార్దిక్ పటేల్ ప్రకటించి నప్పుడు,అది ప్రారంభంలో, అప్పుడే ఎక్కడినుంచో ఊడి పడిన నవజాత నేత నుంచి వచ్చిన వాగాడంబర పదజాలంగా కనిపించింది. అయితే,  వార్తాపత్రికల ఇంటర్వ్యూలలో, ప్రత్యేకించి ‘ది హిందూ’లో ‘మాకూ కావాలి లేకపోతే ఎవరికీ ఉండకూడదు’ అంటూ పటేల్  పదే పదే నొక్కి చెప్పినప్పుడు మొత్తం విషయం కొత్త రూపు దాల్చింది.
 
దేశంలో అమలవుతున్న రిజర్వేషన్లలో కుల ప్రాతి పదిక వ్యవస్థకు వ్యతిరేకంగా వినిపిస్తున్న మర్మ రధ్వనులు ప్రస్తుతం వేగం పుంజుకున్నాయి. అయితే ఈ పరిస్థితి ఎంతవరకు వెళతుంది, ఎక్కడ ముగుస్తుం ది అనేది ఊహామాత్రంగానే ఉంటోంది. సాధారణంగా చూస్తే కాస్త సంపన్న సామాజిక వర్గాలకు చెందినట్లు కనిపిస్తున్నప్పటికీ రాజస్థాన్ జాట్‌లూ, మహారాష్ట్ర మరాఠాలు సైతం తమకూ రిజర్వేషన్ కావాలని ఎప్పటినుంచో డిమాండు చేస్తూవస్తున్నారు. ఈ వాస్తవం ఒక కొత్త దృక్కోణంకి సంబంధించి అందరి కళ్లూ తెరిపించాలి: ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న వ్యవస్థ అందిరికీ ఆమోదనీయంగా ఉంటోందా?

 ప్రతి ఒక్క పటేల్, జాట్ లేక మరాఠా వ్యక్తి సంప న్నుడు కాకపోవచ్చు లేదా ఇతరులతో సమానంగా వీరందరినీ ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలంటే రిజర్వేషన్ కోటా రూపంలో మద్దతు అవసరం లేకపో వచ్చు. అయితే అన్ని సామాజిక వర్గాలలో ఇలాంటి మద్దతు అవసరమైన వారు ఉండవచ్చు కానీ అనుమ తించిన దామాషాలో ఎదురవుతున్న అడ్డంకులు (సుప్రీంకోర్టు మొత్తం రిజర్వేషన్లను 49 శాతానికి మించకూడదని ఆదేశించింది) వీరి అవకాశాలను హరించివేస్తున్నాయి. షెడ్యూల్ కులాలు, తెగలకు మల్లే వీరు కూడా చాలా కాలంగా వెనుకబడి ఉంటున్నారు.

 పార్లమెంటు, శాసనసభల్లో రాజకీయ ప్రాతిని ధ్యం కోసం షెడ్యూల్ కులాలు, తెగలకు రిజర్వేషన్లు కల్పిస్తూ నిబంధనలు రూపొందించినప్పుడు, మొదట్లో దాన్ని పదేళ్ల కాలానికే పరిమితం చేశారు. కానీ తర్వాత దీన్ని క్రమానుగతంగా పెంచుకుంటూ వచ్చారు. విద్య, ఉపాధిలో ప్రవేశానికి సంబంధించినంతవరకు అది తాత్కాలికమే కానీ దీనికి నిర్దిష్టమైన ఏర్పాటు ఉండేది కాదు. స్థిర హక్కులను వెనక్కి తీసుకోవడానికి కష్టమ య్యే విధంగా వీటిని శాశ్వతంగా కొనసాగించడానికే నిర్ణయించుకున్నట్లు కనిపిస్తున్నాయి. కోటా కారణంగా అధికారంలోకి వచ్చిన వారు ఆ విధానాన్ని విరమిం చడానికి ఇష్టపడటం లేదు. ఈ కోణంలోంచే హార్దిక్ పటేల్ దృక్పథం కాస్త సందర్భసహితంగా కనిపిస్తోంది.

 ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ అధికారంలోకి తుపాను లా దూసుకువచ్చినప్పుడు దానికి ముఖ్య కారణాలలో ఒకటి ఏమిటంటే కాంగ్రెస్ పాలనలో ఓబీసీలను నిర్లక్ష్యం చేయడం, ఎస్సీలు, ఎస్టీలను బలిపించడం అని అప్పట్లో పేర్కొనేవారు. తమను వ్యవస్థ పక్కకు తోసివేసిందని పటేల్ వర్గీయులు భావిస్తున్నారు కాబట్టే తమ హక్కును సాధించుకోవడానికి చూస్తున్నారన్న వాదనను గుజరాత్ పరిణామాలు తీసుకువస్తున్నాయి. ఇవి రాజస్థాన్‌లో జాట్‌లు, మహారాష్ట్రలో మరాఠాలు చేసినట్లుగానే ఉన్నాయి. వెనుకబడిన వర్గాలతో పోల్చి చూసుకున్నప్పుడు నష్టపోతున్న స్థితిలో తమను తాము కుదించుకోవడమే పరిహాసప్రాయంగా ఉంటోంది. తమకు తాము కొత్త ముద్రలో చూసుకోవడానికి క్రియా శీలకంగా ప్రయత్నిస్తున్నందుకు వారేమీ ఆందోళన చెందటం లేదు. పురుష లక్షణం ఇప్పుడు నిస్స హాయతను ప్రకటిస్తోంది. ఈ అంశంపై ప్రాంతీయ వార్తా చానల్‌లో ఒక మరాఠా వ్యాఖ్యాతను ప్రశ్నిం చారు. అందుకు ఆ వ్యాఖ్యాత ఇచ్చిన వివరణ ఆశ్చర్యం కలిగించింది.

మరాఠాలు అత్యంత క్రియాశీలకంగా రాజకీయాల్లో మునిగితేలినందున వారు విద్యను నిర్లక్ష్యం చేశారని, వారి గత సంపద ఆవిరైపోయిం దన్నది ఆ వివరణ సారాంశం. అందుకే తమ సామా జిక వర్గానికి కోటా కావాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే తమ అజ్ఞానం నుంచి వారు తమకు తాముగా విముక్తి పొందాలి. అందుకే వారు కొత్తగా కనుక్కున్న నిస్సహాయత్వంలోకి తమను తాము జార్చుకోవడాన్ని అనుమతించేసుకుంటున్నార న్నది పెద్దగా గుర్తింపు పొందలేదు. అయితే మరాఠాలు ఒకప్పుడు పాలకులుగా ఉండేవారు. అధికార చట్రంలో వీరికి విస్తృత ప్రాతినిధ్యం ఉండేది.

 స్పష్టంగానే, స్వాతంత్య్రానంతరం తాము పొంది న ప్రయోజనాలనుంచి ఇప్పుడు దూరమైనట్లు పటేళ్లు భావిస్తున్నట్లుంది. 1950ల ప్రారంభంలో కౌలుదార్లుగా పనిచేస్తున్న దశ నుంచి వారు భూ యజమానులుగా మారారు. వ్యవసాయానికి వీరు కొత్త శక్తినిచ్చారు. సౌరాష్ట్రలో వేరుశనగ సాగు మిగులుకు దారితీసి అది పరిశ్రమలోకి వెళ్లింది. వారెంత శక్తివంతులయ్యారంటే 1980ల మధ్యలో గుజరాత్‌లో రగుల్కొన్న మత ఘర్షణ లకు, రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనకు పటేళ్లే కారణ మని తప్పుపట్టారు. కాని ఇప్పుడు ఈ పటేళ్లే పూర్తి వ్యతిరేక దిశకు మారి తమకే కోటాలు కావాలని కోరు కుంటున్నారు. కాని ఆ కోటాలను కొత్త రీతిలో చూస్తున్నారు.

 స్వాతంత్య్రం వచ్చి దాదాపు 70 ఏళ్ల తర్వాత కూడా మన దేశం తన  పౌరులకు సమానావకాశాలు కల్పించలేకపోతోందంటే, ఎస్సీలు, ఎస్టీలు ఇప్పటికీ వెనుకబడి ఉంటున్నారంటే మనల్ని మనం పాలించు కోవడంలో తీవ్రమైన తప్పు జరుగుతోంది. కోటా కల్పించిన తర్వాత కూడా ఒక ఎస్సీ లేక ఎస్టీ నేటికీ ప్రయోజనం పొందలేకపోతున్నారు కానీ, పీడక వర్గాలుగా మనం చెప్పుకుంటున్న వారు  తమ మాజీ పీడితుల నుంచి ప్రస్తుతం అభద్రతను ఫీలవుతుండట మే విచిత్రం. కొంతవరకు బ్రాహ్మణులు కూడా తమ దురవస్థను చాటి చెబుతున్నారు.
 రిజర్వేషన్ అనేది ఒక పిల్లాడికి కాలేజీ డిగ్రీని పొం దడంలో, ఉద్యోగాన్ని, తర్వాత ప్రమోషన్‌ను కూడా పొందటంలో సహాయపడవచ్చు. కానీ పీడిత కమ్యూ నిటీ మొత్తాన్ని ఇతర వర్గాలతో సమాన స్థాయికి రిజర్వేషన్ తీసుకురాలేదు.

రిజర్వేషన్ అనేది తమ సొంత సామాజిక బృందాలకు వారిని ప్రతినిధులుగా చేయవచ్చు. పార్లమెంటు, అసెంబ్లీలలో రిజర్వుడ్ స్థానాలు ఉన్నాయని గుర్తుంచుకోండి. కానీ తామెక్కడి నుంచి వచ్చారో ఆ పీడిత వర్గాలతో సంబంధం లేని ఒక క్రీమీలేయర్‌ను రిజర్వేషన్ సృష్టించిపెట్టింది. పీడిత వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు చెప్పుకుంటున్న వారు వారికి మీటగా మాత్రమే ఉంటున్నారు. అంతకు మించి ఈ క్రీమీలేయర్‌కు ప్రాధాన్యం లేదు.    
 

http://img.sakshi.net/images/cms/2015-08/71440963289_Unknown.jpg
మహేష్ విజాపుర్కార్
(వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
 ఈమెయిల్: mvijapurkar@gmail.com)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement