hardik patel
-
Gujarat Assembly Election 2022: సౌరాష్ట్ర ఎవరికి సై?
సౌరాష్ట్ర.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలక ప్రాంతం. పటీదార్ల ఉద్యమానికి కేంద్ర బిందువు. ఈ ఉద్యమ ప్రభావంతో గత ఎన్నికల్లో ఈ ప్రాంతంపై పట్టు కోల్పోయిన బీజేపీ తిరిగి పూర్వవైభవం సాధించడానికి ప్రయత్నిస్తోంది. మరి సౌరాష్ట్ర ఓటర్లు ఎవరకి జై కొడతారు...? సౌరాష్ట్ర కేంద్రంగా 2015లో మొదలైన పటీదార్ (పటేళ్లు) ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిపడింది. రాష్ట్రంలో అగ్రకులమైన పటేళ్లను ఒబిసిలో చేర్చాలని, వారికి కూడా విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో యువ నాయకుడు హార్థిక్ పటేల్ నేతృత్వంలో సాగిన ఉద్యమం 2017 ఎన్నికల్లో బీజేపీని బాగా దెబ్బ తీసింది. సౌరాష్ట్రలో పటీదార్లు, ఒబీసీ ఓటర్ల సంఖ్య ఎక్కువ. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పటీదార్లు చేసిన ఉద్యమంతో 2017 ఎన్నికల్లో మొత్తం 48 స్థానాలకు గాను 19 సీట్లను మాత్రమే గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో హార్దిక్ పటేల్ కాంగ్రెస్‌కు వెలుపల నుంచి మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ ఏకంగా 28 స్థానాలను గెలుచుకొని తన పట్టు పెంచుకుంది. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీని 99 స్థానాలకే పరిమితం చేయగలిగింది. ఇప్పుడపా మాదిరి భావోద్వేగ పరిస్థితుల్లేవు. పటీదార్ల ఉద్యమం చల్లారింది. హార్దిక్ పటేల్ కాంగ్రెస్‌లో చేరినా 2019 ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటూ గెలవలేకపోయింది. హార్దిక్ ఇప్పుడు బీజేపీలో చేరారు. విరమ్గమ్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బరిలోకి దిగింది. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బగా మారేలా ఉన్నాయి. సౌరాష్ట్రలో పటీదార్లు, కొలి జనాభా 40% దాకా ఉంది. 18 అసెంబ్లీ స్థానాల్లో పటీదార్ల ఓట్లు, 10 అసెంబ్లీ స్థానాల్లో కొలి వర్గం ఓట్లు నిర్ణయాత్మకం. ఓబీసీ, క్షత్రియులు, మత్స్యకారులు కూడా ప్రభావం చూపించగలరు. ‘‘సౌరాష్ట్ర యువ ఓటర్లు ఈసారి ఆప్‌వైపు మొగ్గుతున్నారు. పటీదార్లు వ్యాపారాలంతా ఆప్‌కు అవకాశమిద్దామని అనుకుంటున్నారు. కొలి, ఇతర ఓబీసీ ఓటర్లు కాంగ్రెస్‌కి ఓటేయొచ్చు’’ అని రాజకీయ విశ్లేషకుడు దిలీప్ గొహ్లి అభిప్రాయపడ్డారు. బీజేపీ ఓబీసీ మంత్రం సౌరాష్ట్రలో 48 సీట్లలో సగానికిపైగా స్థానాల్లో పటేళ్ల ఆధిక్యం ఉంది. హార్దిక్ వంటి నాయకుల్ని బీజేపీ తమ వైపు తిప్పుకున్నా పటేళ్లలో ఉపకులాల కారణంగా అందరూ బీజేపీ వైపుండే పరిస్థితి లేదు. దీంతో బీజేపీ ఓబీసీలకు టిక్కెట్లు ఎక్కువ ఇచ్చింది. 2017 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంపయ్యారు. పటీదార్, కొలి, అహిర్ సామాజిక వర్గాలకు చెందిన కున్వర్జీ బవాలియా, బ్రిజేశ్ మెర్జా, చవడ వంటి అగ్రనాయకులూ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. సంపన్న సౌరాష్ట్ర సౌరాష్ట్ర ప్రాంతం మొదట్నుంచి సంపన్న ప్రాంతమే. అరేబియా తీరంలో ఉండే ఈ ప్రాంతంలో సహజవనరులు చాలా ఎక్కువ. నీటి లభ్యత ఎక్కువగా ఉండడం వల్ల పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. ఇటీవల కాలంలో కరువు కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతోంది.2019లో సర్దార్ సరోవర్ డ్యామ్ దగ్గర నర్మద నది నుంచి నీళ్ల ట్యాంకర్లతో సరఫరా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ ప్రాంతంలో 11 జిల్లాలున్నాయి. సురేంద్రనగర్, మోర్బీ, రాజ్‌కోట్, జామ్‌నగర్, దేవ్‌భూమి ద్వారక, పోర్బందర్, జునాగఢ్, గిర్ సోమ్‌నాథ్, అమ్రేలి, భావనగర్, బోతాడ్.. ఈ 11 జిల్లాలకు గాను బీజేపీ 2017 ఎన్నికల్లో మోర్బీ, గిర్ సోమ్‌నాథ్, అమ్రేలి జిల్లాల్లో ఒక్క సీటు సాధించలేకపోయింది. ఈ సారి ఎన్నికల్లో అధిక ధరలు, రైతు సమస్యలు, నిరుద్యోగం, నీటి సమస్య కీలకం కానున్నాయి. – సాక్షి నేషనల్ డెస్క్ -
బీజేపీ ‘పటీదార్ పవర్’.. వర్కవుట్ అయ్యేనా?
హార్దిక్ పటేల్. ఒకప్పుడు బీజేపీని వ్యతిరేకించిన పటీదార్ నాయకుడు. పటీదార్లను ఓబీసీలుగా గుర్తించాలంటూ కమళదళంపై గళమెత్తిన నేత. ఇప్పుడు ఆ పార్టీ విధానాలకే జై కొడుతున్నారు. కాంగ్రెస్‌ను వీడిన ఆయన, ఇప్పుడు బీజేపీ గూటికి చేరుతున్నారు. హార్దిక్‌పై గుజరాత్లో బీజేపీ ఎందుకు భారీ ఆశలు పెట్టుకుంది. ఆయన చేరికతో అక్కడ పార్టీ మరింత బలం పుంజుకుంటుందా? ఎవరీ పటీదార్లు? గుజరాత్లో వారికి ఎందుకంత ప్రాధాన్యం...? పటీదార్లు తాము శ్రీరాముని వారసులమని చెప్పుకుంటారు. వీరిలో లేవా, కడ్వా అని ప్రధానంగా రెండు ఉపకులాలున్నాయి. రాముడి కవల పిల్లలైన లవకుశల్లో లవుడి సంతతి లేవా పటేల్స్ కాగా, కడవా పటేల్స్ కుశుడి సంతతి అంటారు. లేవాలు సౌరాష్ట్ర, మధ్య గుజరాత్లో అధికంగా ఉంటే, ఉత్తర గుజరాత్లో కడ్వాల ప్రాబల్యం ఎక్కువ. పటీదార్లలో 80% మంది లేవా, కడ్వా పటేల్స్. మిగతా 20%లో సత్పంతి, అంజన వంటి ఉపకులాలున్నాయి. ఒకప్పుడు వ్యవసాయదారులైన వీరు ప్రస్తుతం అన్ని రకాల వ్యాపారాల్లోనూ బాగా ఎదిగి ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారారు. హర్దిక్ బలం ఎంతంటే.. గుజరాత్ రాజకీయాల్లో ఉవ్వెత్తున ఎగిసిన కెరటంలా దూసుకొచ్చిన యువ నాయకుడు హార్దిక్ పటేల్. 2015 ముందు వరకు ఆయన పేరు ఎవరికీ తెలీదు. రాష్ట్రంలో అగ్రకుల జాబితాలో ఉన్న పటీదార్లను ఓబీసీలోకి చేర్చాలని, విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్‌తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఉద్యమ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నిప్పులు చెరిగే ప్రసంగాలతో బీజేపీ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతూ యూత్‌లో ఫాలోయింగ్ సంపాదించారు. పటేల్ ఉద్యమం సందర్భంగా రాష్ట్రంలో హింస, గృహ దహనాలు, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం జరిగాయి. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆయనపై బీజేపీ దేశద్రోహం సహా ఎన్నో కేసులు పెట్టింది. బెయిల్‌పై బయటికొచ్చాక కూడా కేంద్రంలో, గుజరాత్లో అధికారంలో ఉన్న బీజేపీ విధానాలపై విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు బయటి నుంచి మద్దతిచ్చారు. కాంగ్రెస్ గెలవకపోయినా పటీదార్ల ఓట్లను భారీగా చీల్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు హార్దిక్ కాంగ్రెస్‌లో చేరారు. కానీ గుజరాత్లో 26 లోక్‌సభ సీట్లలో కాంగ్రెష్ ఒక్కటీ నెగ్గలేదు. 2020లో హార్దిక్‌ను పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కాంగ్రెస్ నియమించింది. కానీ ఆ తర్వాత ఆశించిన ప్రాధాన్యం లభించక మూడేళ్లలోనే పార్టీ వీడే పరిస్థితులు వచ్చాయి. ముందునుంచే హార్దిక్‌పై కన్ను నెల క్రితం కాంగ్రెస్‌కు గుడ్ బై కొట్టిన హార్డిక్, ఆ సందర్భంగా సోనియాగాంధీకి రాసిన లేఖలో ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణం తదితరాలను ప్రశంసించారు. దాంతో ఆయన బీజేపీలో చేరతారని అప్పుడే భావించారు. పార్టీ కూడా ఆయన్ను చేర్చుకోవడానికి చాలాకాలంగా ప్రయత్నిస్తూనే ఉంది. అందులో భాగంగా 2015 కోటా ఆందోళన సమయంలో ఆయనపై పెట్టిన కొన్ని కేసుల్ని వెనక్కు తీసుకుంది. రాష్ట్రంలో 20 ఏళ్లుగా అధికారంలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడానికి అన్ని మార్గాలనూ బీజేపీ వెదుకుతోంది. అందులో భాగంగా అత్యంత కీలకమైన పటీదార్ల ఓట్లపై దృష్టి పెట్టింది. 28 ఏళ్ల హార్దిక్ చేరికతో యువత, రైతులు పార్టీ పట్ల మరింతగా ఆకర్షితులవుతారని అంచనా వేస్తోంది. కోటా కేసుల్లో హార్దిక్‌ను దోషిగా తేలుస్తూ వచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో ఆయన ఎన్నికల్లో పోటీకి లైన్ క్లియరైంది. గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సి.ఆర్.పాటిల్ సమక్షంలో హార్దిక్ పార్టీలో చేరనున్నారు. ఎన్నికల్లో ప్రభావమెంత? పటీదార్లు గుజరాత్లో అత్యంత శక్తిమంతమైన సామాజికవర్గం. రాష్ట్ర జనాభాలో వీళ్లు 15% దాకా ఉంటారు. ఠాకూర్ల తర్వాత వీరి సంఖ్యే ఎక్కువ. మొత్తం 182 అసెంబ్లీ సీట్లలో 70 చోట్ల పటీదార్ల ఓట్లు గెలుపోటములపై ప్రభావం చూపిస్తాయి. అయితే ఎన్నికల్లో వీరంతా ఒకేతాటిపై వచ్చి ఓటేయరు. ఉపకులాలూ ఉండటంతో వీరిలోనూ విభేదాలున్నాయి. లేవా పటేల్స్ మొదట్నుంచీ బీజేపీకి గట్టి మద్దతుదార్లు. కడ్వా ఉప కులానికి చెందిన హార్దిక్ 2017 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతివ్వడంతో వారంతా ఆ పార్టీ వైపు మళ్లారు. బీజేపీ గెలిచినా సీట్లు 115 నుంచి 99కి పడిపోయాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇటీవలి కేబినెట్ మార్పుచేర్పుల్లో ఏకంగా పటేల్ వర్గానికి చెందిన ఏడుగురికి బీజేపీ స్థానం కల్పించింది. హార్దిక్ చేరికతో కడ్వా పటీదార్ల ఓట్లు ఈసారి తమకేనని నమ్మకం పెట్టుకుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జీవితంలో మూడేళ్లు వృథా
అహ్మదాబాద్: కాంగ్రెస్‌లో ఉండి తన జీవితంలో మూడేళ్లు వృథా చేసుకున్నానని గుజరాత్ పటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ వాపోయారు. ఆయన బుధవారం కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ కుల రాజకీయాలు చేస్తోందని హార్దిక్ మండిపడ్డారు. గురువారం అహ్మదాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. గుజరాత్లో అధికార బీజేపీ లేదా ఆమ్ ఆద్మీ పార్టీ లేదా మరో రాజకీయ పార్టీలో చేరికపై నిర్ణయం తీసుకోలేదనన్నారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల ప్రయోజనాల కోసమేనని పేర్కొన్నారు. ఆయోధ్యలో రామమందిర నిర్మాణం, జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు వంటి ఘనతలు బీజేపీ సాధించిందంటూ ప్రశంసల వర్షం కురిపించారు. కాంగ్రెస్‌లో ముందుచూపు లేని నేతలు ఉన్నారని, గుజరాత్ ప్రజలపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ సిద్ధాంతం.. వాడుకో, వదిలించుకో గుజరాత్లో తనను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించినప్పటికీ ఏనాడూ సరైన పని అప్పగించలేదని, గౌరవం కల్పించలేదని హార్దిక్ ఆక్షేపించారు. పటీదార్ కోటా ఉద్యమంతో గుజరాత్లో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంతగానో లాభపడిందన్నారు. అయినప్పటికీ కీలకపార్టీ కార్యక్రమాలకు తనను ఆహ్వానించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్ కాంగ్రెస్‌లో 25 ఏళ్లుగా 7–8 మందే పెత్తనం చెలాయిస్తున్నారన్నారు. సెకండ్ క్యాడర్ నేతలకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. వాడుకో, వదిలించుకో.. ఇదే కాంగ్రెస్ సిద్ధాంతమని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌కు ఇప్పుడు కావాల్సింది చింతన్(మేధోమథనం) కాదు, చింత అని హార్దిక్ పటేల్ వ్యాఖ్యానించారు. హార్దిక్ పటేల్‌కు జైలు భయం: కాంగ్రెస్ హార్దిక్ వ్యాఖ్యలను గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీష్ ఠాకూర్ తిప్పికొట్టారు. బీజేపీ స్క్రిప్ట్ ప్రకారమే రాజీనామా పత్రం తయారు చేసుకున్నాడని విమర్శించారు. అతడిపై దేశద్రోహం కేసు నమోదయ్యిందని గుర్తుచేశారు. జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న భయంతోనే కాంగ్రెస్‌ను వీడాడన్నారు. -
గుజరాత్ కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. హార్దిక్ పటేల్ రాజీనామా
అహ్మదాబాద్: గుజరాత్లో కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పటీదర్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ట్విటర్ వేదికగా ప్రకటించారు.. ఈ మేరకు రాజీనామా లేఖను షేర్ చేశారు. ‘కాంగ్రెస్ పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నాను. ‘నా నిర్ణయాన్ని నా సహచరులు గుజరాత్ ప్రజలు స్వాగతిస్తారనని నమ్ముతున్నాను. కాంగ్రెస్ నుంచి బయటకు రావడం ద్వారా భవిష్యత్తులో గుజరాత్ కోసం సానుకూలంగా పనిచేయగలనని విశ్వసిస్తున్నాను’ అని ట్విటర్లో రాసుకొచ్చారు. కాగా మరి కొద్ది నెలల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో హార్దిక్ పటేల్ రాజీనామా చేయడం కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలినట్లైంది. అంతేగాక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన హార్దిక్ పటేల్ బీజేపీ లేదా ఆమ్ ఆద్మీ పార్టీలో చేరతారనే ప్రచారం సాగుతోంది. ఈ విషయమై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక రాజీనామా నేపథ్యంలో గుజరాత్లో పార్టీ పరిస్థితిని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వివరిస్తూ సుధీర్ఘ లేఖ రాశారు. చాలాకాలంగా కాంగ్రెస్ హైకమాండ్ తీరుపై ఆగ్రహంగా ఉన్న హార్దిక్ పార్టీ సీనియర్ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. భారత్‌లో క్లిష్ట పరిస్థితుల్లో అవసరం వచ్చినప్పుడు మన నేతలు విదేశాల్లో ఉన్నారని రాహుల్ గాంధీని ఉద్ధేశించి విమర్శించారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుజరాత్ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని, తమ మొబైల్ చూసుకుంటూ కాలం గడిపేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకత్వానికి గుజరాత్‌పై ఆసక్తి లేదని అన్నారు. గుజరాత్ కాంగ్రెస్ లీడర్లు ఢిల్లీ నుంచి వచ్చిన నాయకులకు సేవలు చేయడంలో మునిగిపోయారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను సరైన దిశలో ముందుకు నడిపించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఆ పార్టీ ఎల్లప్పుడూ దేశ, సమాజ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. అందుకే ప్రతిచోట పార్టీ తిరస్కరణకు గురవుతోందన్నారు. చదవండి: రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు గత కొంత కాలంగా హార్దిక్ కాంగ్రెస్‌ను వీడుతారంటూ ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. 2019లో కాంగ్రెస్‌లో చేరిన హార్దిక్‌ను పార్టీ నాయకత్వం నిర్లక్ష్యం చేస్తోందని, పట్టించుకోలేదని బహిరంగంగా వెల్లడించారు. పీసీసీ సమావేశాలకు కూడా తనను ఆహ్వానించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.. ఈ నేపథ్యంలో హార్దిక పటేల్ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. గుజరాత్‌లోని పటీదార్ ఆందోళన ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చిన హార్దిక్ పటేల్‌కు తగిన గౌరవం లభించని కారణంగా పార్టీని వీడినట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. -
ఒక చట్టం... వేల వివాదాలు
124ఏ. బ్రిటిష్ వలస పాలకుల కాలం నాటి దేశద్రోహం చట్టం. సుప్రీంకోర్టు స్టే నేపథ్యంలో దీనిపై అంతటా చర్చ జరుగుతోంది. మన దేశంలో ఇది దుర్వినియోగమవుతుండటం నిజమేనా...? సెక్షన్ 124 ఏలో ఏముంది? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంపై ఎవరైనా మాటలతో, చేతలతో, సంకేతాలతో, ప్రదర్శనలతో, విద్వేషపూరిత వ్యాఖ్యలతో శత్రుత్వాన్ని ప్రదర్శిస్తే దేశద్రోహ నేరం కిందకి వస్తుంది. దీని కింద కేసు నమోదైతే బెయిల్ లభించదు. ముందస్తు నోటీసులు లేకుండా అరెస్టు చేయవచ్చు. నేరం రుజువైతే మూడేళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. దేశ ద్రోహం కేసులు ఎదుర్కొన్న వారు ప్రభుత్వోద్యోగాలకు అనర్హులు. ఎందుకు తెచ్చారు ? స్వాతంత్య్ర పోరాట సమయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహ జ్వాలల్ని అణిచేసేందుకు ఈ చట్టాన్ని తెచ్చారు. బ్రిటిషిండియా తొలి లా కమిషనర్ థామస్ మెకాలే రూపొందించిన ఈ చట్టాన్ని 1890లో 124ఏ సెక్షన్ కింద భారత శిక్షా స్మృతిలో చేర్చారు. దీనికింద 1891లో తొలిసారిగా జోగేంద్ర చంద్రబోస్ అనే పత్రికా సంపాదకుడిపై కేసు పెట్టారు. తర్వాత తిలక్ మొదలుకుని గాంధీ దాకా ప్రముఖులెందరో కూడా ఈ చట్టం కింద జైలుపాలయ్యారు. బ్రిటన్ మాత్రం దీన్ని 2009లో రద్దు చేసింది. ఆస్ట్రేలియా, సింగపూర్ కూడా ఈ చట్టాన్ని రద్దు చేశాయి. దిశ రవి నుంచి వరవరరావు వరకు కేంద్రంలో మోదీ ప్రభుత్వం రాజకీయంగా ఎదురు తిరిగిన వారిపై దేశద్రోహ చట్టాన్ని విస్తృతంగా ప్రయోగిస్తోందన్న ఆరోపణలున్నాయి. కశ్మీర్‌పై వ్యాఖ్యలు చేసినందుకు అరుంధతి రాయ్, రైతు ఉద్యమానికి మద్దతుగా టూల్ కిట్ రూపొందించిన సామాజిక కార్యకర్త దిశ రవి, హత్రాస్‌లో 19 ఏళ్ల దళిత మహిళ గ్యాంగ్ రేప్ కవరేజీకి వెళ్లిన జర్నలిస్టు సిద్దిఖి కపన్, పటీదార్ కోటా ఆందోళనలో పాల్గొన్న హార్దిక్ పటేల్, భీమా–కొరెగావ్ కేసులో సామాజిక కార్యకర్తలు సుధా భరద్వాజ్, వరవరరావు, కరోనా సంక్షోభంపై వ్యాఖ్యలకు జర్నలిస్టు వినోద్ దువా తదితరులపై దేశద్రోహ ఆరోపణలు మోపారు. ► 2015–20 మధ్య దేశవ్యాప్తంగా సెక్షన్ 124ఏ కింద 356 కేసులు నమోదయ్యాయి ► ఈ ఆరేళ్లలో 548 మంది అరెస్టయ్యారు. ఆరుగురికి మాత్రమే శిక్ష పడింది. ► 2010–20 మధ్య బిహార్‌లో 168, తమిళనాడులో 139, యూపీలో 115, జార్ఖండ్‌లో 62, కర్నాటకలో 50, ఒడిశాలో 30 కేసులు నమోదయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హార్ధిక్ పటేల్(గుజరాత్ కాంగ్రెస్) రాయని డైరీ
కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్‌ని పక్కన పెట్టేసే విధానం ఒక దారుణమైన విలక్షణతను కలిగి ఉంటుంది. హఠాత్తుగా ఒకరోజు ఆ వర్కింగ్ ప్రెసిడెంట్‌కి వర్క్ ఇవ్వడం మానేస్తారు! వర్క్‌ల ప్రారంభోత్సవాలు ఏవైనా ఉంటే అక్కడికి పిలవడం మానేస్తారు. వర్క్ ఎందుకు ఇవ్వందీ చెప్పరు. వర్క్‌ల ప్రారంభోత్సవాలకు ఎందుకు పిలవందీ చెప్పరు. రాహుల్‌కి చెప్పుకుందామని ఢిల్లీ వెళితే, అప్పటికే అక్కడ వేరే స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒకరు తన సమస్యను చెప్పుకోడానికి ప్రయత్నిస్తూ కనిపిస్తారు! ‘‘మా దగ్గరికి వచ్చేయొచ్చు కదా.. కాంగ్రెస్‌లోనే ఉండి నీ టైమ్ వేస్ట్ చేసుకోవడం ఎందుకు.. డిసెంబర్లో ఎన్నికలు పెట్టుకుని..’’ అన్నారు గోపాల్ ఇతాలియా. ‘ఆప్’కి గుజరాత్ స్టేట్ చీఫ్ అతడు. ‘‘మీ పేరు గోపాల్ ఇతాలియానే అయినా నాకు మిమ్మల్ని నరేశ్ పతేలియా అని పిలవాలనిపిస్తోంది..’’ అన్నాను. ‘‘నరేశ్ పతేలియానా!! నరేశ్ పటేల్ కదా ఆయన?!’’ అన్నారు ఇతాలియా. ‘‘అవును నరేశ్ పటేలే! అతణ్ణి లోపలికి తీసుకోడానికి నన్ను బయటికి పంపాలనో, నన్ను బయటికి పంపడానికి అతణ్ణి లోపలికి తీసుకోవాలనో ప్లాన్ చేస్తున్నారు మా వాళ్లు. నేనిప్పుడు మీతో వచ్చేస్తే.. లోపలికి రావడానికి పటేల్‌కి, లోపలికి తీసుకోడానికి మా పార్టీకి మీరు హెల్ప్ చేసినవాళ్లవుతారు. అప్పుడు మీరు నాకెప్పటికీ పతేలియాలా గుర్తుండిపోతారు తప్ప ఇతాలియాలా కాదు..’’ అన్నాను. ‘‘మీ పార్టీకో, నరేశ్ పటేల్కో దారి క్లియర్ చేయడానికి నేనెందుకు నిన్ను రమ్మని అడుగుతాను హార్దిక్? కేజ్రీవాల్ నిన్ను అడుగుతున్నారు. ‘ఆప్’లోకి వచ్చేయ్. ఫీల్ ద లీడర్షిప్..’’ అన్నారు ఇతాలియా. ‘‘నేను రాలేను. మా నాన్నగారి పేరు భరత్. నా చిన్నప్పట్నుంచే ఆయన కాంగ్రెస్ కార్యకర్త’’ అన్నాను. ‘‘లైఫ్‌లో ఇలాంటివి ఉంటూనే ఉంటాయి హార్దిక్. మనకూ ఒక లైఫ్ ఉంటుంది కదా. రేపు నువ్వూ.. నీ కొడుకునో, కూతుర్నో ‘మా తాతగారు భరత్. మా నాన్నగారి చిన్నప్పట్నుంచే మా తాతగారు కాంగ్రెస్ కార్యకర్త’ అనే చెప్పుకోనిస్తావా? మన గురించి చెప్పుకోడానికి ఏమీ లేనప్పుడే మన పిల్లలు వాళ్ల తాతగారి గురించి, ముత్తాతగారి గురించి చెప్పుకుంటారు. ఇంకేం ఆలోచించకు వచ్చేయ్..’’ అన్నారు ఇతాలియా. ఇతాలియా వెళ్లాక చూసుకుంటే ఫోన్లో మెసేజ్! ‘ఒకసారి పార్టీ ఆఫీస్‌కి వచ్చి వెళ్లడం కుదురుతుందా హార్దిక్..’ అని జగదీశ్ థాకర్. గుజరాత్‌కి నేను వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే జగదీశ్ థాకర్ ప్రెసిడెంట్. ‘‘పార్టీ గురించి బయట నువ్వేదో బ్యాడ్‌గా మాట్లాడుతున్నావట?!’’ అన్నారు థాకర్.. పార్టీ ఆఫీస్‌కి నేను వెళ్లీవెళ్లగానే. ‘‘బ్యాడ్‌గా ఏమీ మాట్లాడలేదు, బ్యాడ్‌గా ఫీల్ అవుతూ మాట్లాడి ఉంటాను’’ అన్నాను. థాకర్ పక్కనే రఘుశర్మ కూర్చొని ఉన్నారు. రఘుశర్మ పక్కన మనీష్ దోషి ఉన్నారు. శర్మ స్టేట్ ఇన్చార్జ్. మనీష్ స్టేట్ అధికార ప్రతినిధి. ‘‘హార్దిక్.. ఒకమాట. ఇంతప్పుడు నిన్ను పార్టీలోకి తెచ్చి, అంతలోనే కాంగ్రెస్ నిన్ను వర్కింగ్ ప్రెసిడెంట్‌ని చేసిందంటే.. అది నీకు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కాదా? గుడ్ని వదిలేసి, బ్యాడ్‌ని పట్టుకుంటావేంటి?’’ అన్నారు శర్మ. ‘‘2017లో నన్ను తెచ్చారు. 2022లో నా మీదకు నరేశ్ పటేల్‌ను తెస్తున్నారు. 2027లో నరేశ్ పటేల్ మీదకు మరొక పటేల్‌ని తెస్తారు. ఇది నాకు గుడ్ అనిపించలేదు..’’ అన్నాను. ‘‘సరే, ‘ఆప్’లోకి ఎప్పుడు వెళ్తున్నావ్?’’ అన్నారు థాకర్ సడన్‌గా! ఆయన అలా అంటున్నప్పుడు పార్టీలోని విలక్షణత ఆయన ముఖంలో ప్రతిఫలించింది. ‘‘అవును.. ఎప్పుడు?’’ అన్నారు శర్మ, దోషి వెంటవెంటనే! నన్ను రప్పించుకోడానికి కేజ్రీవాల్ పడని తొందర కంటే, నన్ను పంపించడానికి కాంగ్రెస్ పడుతున్న తొందరే ఎక్కువగా కనిపిస్తోంది!! -
హార్దిక్‌కు ‘ఆప్’ ఆహ్వానం
అహ్మదాబాద్: కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న గుజరాత్ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు హార్దిక్ పటేల్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ ఆహ్వానం పలికింది. ‘‘ఆయన సొంతగానే పెద్ద నాయకుడిగా ఎదిగారు. అలాంటి నాయకులు మాకు కావాలి. అందుకే మా పార్టీలో చేరాలని కోరుతున్నాం’’ అని గుజరాత్ ఆప్ నేత గోపాల్ ఇతాలియా శుక్రవారం చెప్పారు. గుజరాత్లో పాటిదార్ రిజర్వేషన్ల ఉద్యమంతో తెరపైకి వచ్చిన హార్దిక్ పటేల్ కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. -
Hardik Patel: గుజరాత్ కాంగ్రెస్ నన్ను వేధిస్తోంది
అహ్మదాబాద్: గుజరాత్ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు హార్దిక్ పటేల్ తన వ్యాఖ్యలతో రాజకీయ కాక పుట్టించారు. రాష్ట్ర పార్టీ నాయకులు తనను వేధిస్తున్నారని, తాను పార్టీ విడిచి వెళ్లాలని చూస్తున్నారని ఆరోపించారు.కాంగ్రెస్ అధిష్టానం కూడా తనను పట్టించుకోవడం లేదని ఆయన వాపోయారు. రాష్ట్ర పార్టీ తనను వేధిస్తోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రాష్ట్రంలో గుర్తింపు ఉన్న ఖొదాల్దమ్ టెంపుల్ ట్రస్ట్ చైర్మన్ నరేష్ పటేల్‌ను పార్టీలో చేర్చుకోవడానికి కాంగ్రెస్ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ పరిణామాలతో హార్దిక్ పటేల్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ‘‘2017లో మీరు హార్దిక్‌ని ఉపయోగించుకున్నారు. 2022 వచ్చేసరికి మీకు నరేష్ కావాల్సి వచ్చారు. 2027లో మరో పాటిదార్ నాయకుడు కోసం చూస్తారు. హార్దిక్ పటేల్‌నే శక్తిమంతుడిగా మీరు తయారు చెయ్యలేరా?’’ అంటూ అధిష్టానాన్ని ప్రశ్నించారు. చదవండి: (మీలో ఒక్కడిలా ఉంటా...మీ కోసం ఎందాకైనా వస్తా: తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి) -
నన్ను పట్టించుకోవడం లేదు.. కొత్త పెళ్లికొడుకులా ఉన్నా..
అహ్మదాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న గుజరాత్లో కాంగ్రెస్ పార్టీకి తలనొప్పులు తప్పడం లేదు. ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. గుజరాత్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్ బుధవారం సొంత పార్టీ నాయకులపై విరుచుకుపడ్డారు. సీనియర్ నాయకులు తనను పక్కన పెట్టారని, పార్టీ కోసం తన నైపుణ్యాలను ఉపయోగించుకోవడం లేదని ఆరోపించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న కొత్త పెళ్లికొడుకులా.. పార్టీలో తన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పీసీసీ సమావేశాలకు తనను పిలవడం లేదని, పార్టీ నిర్ణయాలు తీసుకునే ముందు సంప్రదించడం లేదని.. అలాంటప్పుడు వర్కింగ్ ప్రెసిడింట్‌గా ఉండి ప్రయోజనం ఏంటని అన్నారు. ‘వర్కింగ్ ప్రెసిడెంట్ సహా పంజాబ్ కాంగ్రెస్ నేతల బృందం ఇటీవల సోనియా గాంధీని కలిశారు. గుజరాత్ కాంగ్రెస్‌లో వర్కింగ్ ప్రెసిడెంట్‌కు అలాంటి గౌరవం ఎందుకు లభించద’ని ప్రశ్నించారు. కొత్తవారి కోసం పాకులాట పార్టీలో ముందు నుంచి ఉన్న వారిని వదిలేసి కొత్తవారి కోసం పాకులాడుతున్నారని మండిపడ్డారు. ఖోడల్ధామ్ ట్రస్ట్ అధ్యక్షుడు నరేశ్ పటేల్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘2017లో మా వల్ల (పటేల్ సంఘం) కాంగ్రెస్ లాభపడింది. ఇప్పుడు, నేను టెలివిజన్‌లో చూస్తున్నట్లుగా, పార్టీ 2022కి నరేష్ పటేల్‌ను చేర్చుకోవాలని కోరుకుంటోంది. 2027కి కొత్త పటేల్ కోసం వారు వెతకరని నేను ఆశిస్తున్నాను. ఇప్పటికే పార్టీలో ఉన్న నేతలను ఎందుకు ఉపయోగించుకోలేద’ని హార్దిక్ పటేల్ ప్రశ్నించారు. ఒకవేళ నరేశ్ పటేల్‌ను పార్టీలో చేర్చుకోవాలనుకుంటే ఆ పని వెంటనే పూర్తి చేయాలని, నాన్చుడు ధోరణి సరికాదన్నారు. (క్లిక్: యూపీలో ఏం జరిగిందో చూశారుగా!: సీఎం యోగి) హార్దిక్‌తో చర్చిస్తా: ఠాకూర్ 2015 అల్లర్ల కేసులో సెషన్స్ కోర్టు తనకు విధించిన శిక్షను సుప్రీం కోర్టు నిలిపివేయడంతో తాజా ఎన్నికల్లో పోటీ చేసేందుకు హార్దిక్ పటేల్ రెడీ అవుతున్నారు. కాగా, పటేల్ వ్యాఖ్యలపై గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీష్ ఠాకూర్ స్పందించారు. హార్దిక్ లేవనెత్తిన అంశాలపై చర్చించేందుకు సిద్ధమని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలా, వద్దా అనే దానిపై నరేశ్ పటేల్ నిర్ణయించుకోవాలన్నారు. మంచి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతుందని స్పష్టం చేశారు. -
హక్కుల భంగం.. ఇదా మీ తీరు?
సోషల్ నెట్ వర్కింగ్ వెబ్సైట్లు ఫేస్బుక్, ట్విట్టర్లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...! పెద్ద మార్పు ట్యునీషియా నూతన ప్రధానమంత్రిగా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్, జియాలజిస్ట్ నజ్లా బూడెన్ రమధానే నియమితులయ్యారు. దీనితో అరబ్ ప్రపంచంలో మహిళను ప్రధాన మంత్రిని చేసిన మొదటి దేశంగా ట్యునిషీయా నిలిచింది. – అర్షియా మాలిక్, రచయిత అవసరమైన పోరాటం మూడేళ్ల తర్వాత ఇండియాలోని మీటూ ఉద్యమాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే, ఎక్కువగా నిరాశ వైపే మనసు మొగ్గు తోంది. కానీ దాని అన్ని లోపాలతో కలుపుకొని అది విలువైన ఉద్యమం. – నమితా భండారే, జర్నలిస్ట్ ఇదా మీ తీరు? హాథ్రస్ అత్యాచార బాధితురాలిని బలవంతంగా దహనం చేయడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె కుటుంబం సూర్యాస్తమయం లోగా ఖననం కావాలని కోరుకుంది; దహనం కాదు; ఎందుకంటే ఆమె అవివాహిత కాబట్టి. ‘హిందూ విశ్వాసాల’ పట్ల ఎంతో పట్టింపు ఉన్న ఉత్తరప్రదేశ్ అధికార వ్యవస్థ బాధితురాలి కుటుంబ నమ్మకాలను, రాజ్యాంగాన్ని బాహాటంగా తోసిపుచ్చింది. ఇదంతా కూడా ‘చట్టం’ పేరు మీదుగానే జరిగింది. – తనుశ్రీ పాండే, జర్నలిస్ట్ హక్కుల భంగం నమ్మండి, నమ్మకపోండి. గుజరాత్‌లోని మహేసాణా జిల్లాలోకి ప్రవేశించడానికి నన్ను ఆరేళ్లుగా అనుమతించడం లేదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 నాకు హామీ ఇచ్చిన నా స్వేచ్ఛా సంచార హక్కు ఏమైనట్టు? – హార్దిక్ పటేల్, కాంగ్రెస్ నాయకుడు టాటా ఎయిర్ ఇంతకుముందు చెప్పాను, మళ్లీ చెబుతున్నాను. దానికి ఉన్న అన్ని సమస్యలను పక్కన పెడితే, ఎయిర్ ఇండియా బహుశా విమానం లోపలి భోజనం విషయంలోనూ; దురుసైన ప్రయాణీకుల మూకతో తియ్యగా వ్యవహరించే సర్వీసులోనూ అత్యుత్తమం. టాటాల ఆధ్వర్యంలో అది మరింత మెరుగవుతుందని ఆశిస్తాను. – వీర్ దాస్, కమెడియన్ అందుకా సంతోషం? అన్నట్టూ, పెట్రోలు ధరలు వరుసగా రెండు రోజుల పాటు పెరిగాయి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఏదీ నియం త్రణలో లేదు. అయినా వాళ్ల ఓటర్లు సంతోషంగా ఉన్నారు; ఎందుకంటే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు సంక్షోభంలో ఉన్నాయి కాబట్టి. – సంగీతా నంబీ, రచయిత్రి మాట మరిచారా? పాశ్చాత్య దేశాలు తలుచుకుంటే ఇంకా బాగా చేయగలవు. యూరోపియన్ యూనియన్ దేశాలు కేవలం 4.4 కోట్ల డోసుల కరోనా వైరస్ టీకాలను మాత్రమే మిగతా ప్రపంచానికి పంపించాయి. సెప్టెంబర్ 30 నాటి ఒక నివేదిక మేరకు, ఆ దేశాలు పంచుకుంటామని చేసిన 50 కోట్ల డోసుల వాగ్దానంలో ఇది తొమ్మిది శాతం మాత్రమే. – నికోలా స్మిత్, జర్నలిస్ట్ -
హార్దిక్ పటేల్‌తో భేటీ అయిన రాహుల్
గాంధీనగర్ : కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్‌గాంధీ గుజరాత్లో పర్యటిస్తున్నారు. ‘అమిత్‌షా నేరస్తుడు’ అని లోక్‌సభ ఎన్నికల ర్యాలీలో అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్‌పై అహ్మదాబాద్ హైకోర్టులో పరువునష్టం దావాకు పిటిషన్ దాఖలైంది. ఈ కేసు విచారణలో భాగంగా శుక్రవారం ఆయన అహ్మదాబాద్ వచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్, మరికొంత మంది స్థానిక నేతలతో కలిసి ఓ రెస్టారెంట్లో భేటీ అయ్యారు. ఈ సమావేశం నేపథ్యంలో రాహుల్‌ను కలిసేందుకు జనం ఎగబడ్డారు. మరోవైపు లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా దొంగలంతా మోదీలే ఎందుకవుతారని రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా.. దొంగలందరికీ మోదీ అన్న ఇంటిపేరు సహజంగా ఉంటుందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ సూరత్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. ఇక ఆరెస్సెస్ శక్తులు రాజకీయ కుట్రల్లో భాగంగానే తనను టార్గెట్ చేస్తున్నాయని రాహుల్ ఆరోపిస్తున్నారు. (చదవండి : నేను ఏ తప్పూ చేయలేదు: రాహుల్ గాంధీ) -
చౌకీదార్ కోసం నేపాల్‌కు వెళ్తా..కానీ
అహ్మదాబాద్ : సామాజిక మాధ్యమాల్లో ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ నేతలు చేపట్టిన మై బీ చౌకీదార్ ఉద్యమంపై కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశాన్ని జాగ్రత్తగా చూసుకునే ప్రధాన మంత్రి మాత్రమే ఉండాలని కోరుకుంటానే తప్ప చౌకీదార్లను కాదని ఆయన ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఈరోజు దేశ వ్యాప్తంగా మూడో విడత పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గుజరాత్‌లోని సురేంద్రనగర్ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్‌లో హార్దిక్ పటేల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘ నాకు చౌకీదార్(వాచ్మెన్) అవసరం ఉంటే... నేను నేపాల్‌కు వెళ్తాను. దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే, యువతకు విద్య, ఉపాధి కల్పించి దేశాన్ని దృఢంగా మార్చే ప్రధాని ఉండాలని కోరుకుంటాను. ప్రస్తుతం నాకు కావాల్సింది ప్రధాని మాత్రమే. చౌకీదార్ కాదు అంటూ హార్దిక్ పటేల్ నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. ఆఖరికి ఆమె కూడా పోటీ చేస్తుంది.. నేనే.. ‘ నేను అస్సలు సంతోషంగా లేను. ఆఖరికి సాధ్వీ ప్రగ్యా కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నేను మాత్రం అనర్హుడినయ్యాను. ఇది చాలా తప్పుడు సంకేతాలు ఇస్తోంది. అసలు ఇలా జరగాల్సింది కాదు అంటూ హార్దిక్ పటేల్ అసహనం వ్యక్తం చేశారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. మాలేగావ్ పేలుళ్ల కేసుతో సంబంధం ఉన్న సాధ్విని బీజేపీ భోపాల్‌లో పోటీకి దింపడాన్ని విమర్శించారు. తమను మోసం చేస్తున్న బీజేపీకి ప్రజలు ఓటు ద్వారా సమాధానం చెబుతారని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసిన గుజరాత్లో బీజేపీ ఇప్పుడు 10 నుంచి 12 సీట్లు మాత్రమే గెలుస్తుందని జోస్యం చెప్పారు. కాగా 2015లో పటీదార్ రిజర్వేషన్ ఉద్యమం సందర్భంగా జరిగిన దాడి వెనుక హార్దిక్ ప్రోద్బలం ఉందంటూ నమోదైన కేసులో విస్నగర్ సెషన్స్ కోర్టు హార్దిక్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. హార్దిక్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా శిక్షను కొట్టేసిన కోర్టు.. దోషిత్వాన్ని అలాగే ఉంచింది. మార్చిలో కాంగ్రెస్‌లో చేరిన హార్దిక్.. జామ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగాలనుకున్నారు. అయితే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం.. రెండు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడిన వ్యక్తి(దోషిత్వంపై న్యాయస్థానం స్టే ఇవ్వని పరిస్థితుల్లో) ఎన్నికల్లో పోటీకి అనర్హుడుగా పరిగణిస్తారన్న సంగతి తెలిసిందే. దీంతో హార్ధిక్ ఆశలు ఆవిరయ్యాయి. -
‘అందుకే హార్దిక్ చెంప చెళ్లుమనిపించా’
అహ్మదాబాద్: ‘పటీదార్ ఉద్యమం నడుస్తున్నపుడు నా భార్య గర్భవతి. ఆమెకు ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నాను. ఆ సమయంలో పటీదార్ ఉద్యమం కారణంగా చాలా ఇబ్బందులు పడ్డాల్సి వచ్చింది. హార్దిక్ పటేల్‌పై దాడి చేయాలని అప్పుడే అనుకున్నాను. ఎలాగైనా అతడికి తగిన గుణపాఠం చెప్పాలని గట్టిగా భావించాను’.. ఇవి హార్దిక్ పటేల్‌ను చెంప దెబ్బ కొట్టిన తరుణ్ గజ్జర్ అనే వ్యక్తి చెప్పిన మాటలు. గుజరాత్‌లోని సురేంద్రనగర్‌లో శుక్రవారం ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తుండగా హార్దిక్ పటేల్‌పై తరుణ్ గజ్జర్ హఠాత్తుగా దాడి చేశాడు. ఊహించని పరిణామంతో హార్దిక్ బిత్తరపోయారు. దాడికి పాల్పడిన తరుణ్‌ను కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుకుంటూ అక్కడి నుంచి తీసుకుపోయారు. గాయాలపాలైన అతడు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. హార్దిక్ పటేల్‌పై దాడి చేయడానికి గల కారణాలను మీడియాకు వివరించాడు. తరుణ్ గజ్జర్ సామాన్య పౌరుడని, అతడికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని సురేంద్రనగర్ ఎస్పీ మహేంద్ర బాఘేదియా తెలిపారు. చట్టప్రకారం అతడిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. (చదవండి: హార్దిక్ పటేల్ చెంప చెళ్లు!) -
హార్దిక్ పటేల్ చెంప చెళ్లు!
అహ్మద్‌బాద్ : కాంగ్రెస్‌నేత, పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా సురేందర్ నగర్ జిల్లా నిర్వహించిన జన ఆక్రోష్ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సభలో హార్దిక్ పటేల్ మాట్లాడుతుండగా... ఓ వ్యక్తి ఆయన చెంపపై కొట్టారు. ఊహించని ఘటనతో హార్దిక్ అవాక్కవ్వగా.. కాంగ్రెస్ కార్యకర్తలు ఆ వ్యక్తిని చితకబాదారు. నిన్న(గురువారం) బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై బూటు దాడి జరిగిన మరుసటి రోజే హార్దిక్‌పై మరో అంగతకుడు చేయిచేసుకోవడం గమనార్హం. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జీవీఎల్ మీడియాతో మాట్లాడుతుండగా ఒక వ్యక్తి ఆయనపైకి రెండు బూట్లు విసిరాడు. మొదటి బూటు జీవీఎల్‌కు దూరంగా వెళ్లగా.. రెండోది ఆయనకు అతి సమీపం నుంచి వెళ్లింది. ఇక మార్చిలో కాంగ్రెస్‌లో చేరిన హార్దిక్.. జామ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగాలనుకున్నారు. కానీ 2015లో పటీదార్ రిజర్వేషన్ ఉద్యమం సందర్భంగా జరిగిన దాడి వెనుక హార్దిక్ ప్రోద్బలం ఉందంటూ మెహ్సనా జిల్లా పోలీసులు కేసులువేశారు. 2018లో విచారించిన విస్నగర్ సెషన్స్ కోర్టు హార్దిక్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో హార్దిక్ ఆశలు అడియాశలయ్యాయి. అయినా కాంగ్రెస్ తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. -
‘బ్రెయిన్ లేదనుకుంటున్నారా.. ఏడుస్తూ కూర్చోను’
ముంబై : ‘బాలీవుడ్ నుంచి వచ్చాను కదా అని నాకు మెదడు లేదని అనుకుంటున్నారేమో. ఇష్టం వచ్చినట్లు చేస్తే సహించేది లేదు. ఇండస్ట్రీలో భాగమైనందుకు నేను ఇప్పటికీ గర్వంగా ఫీలవుతున్నా’ అని ముంబై నార్త్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఊర్మిళా మటోంద్కర్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అంధేరీలో ఏర్పాటు చేసిన ‘యూత్ మీట్’కు పాటిదార్ ఉద్యమ నాయకుడు హార్ధిక్ పటేల్‌తో కలిసి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీ యువతను వినియోగించుకుందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం యువతకు ఎటువంటి ప్రయోజనాలు చేకూర్చలేదని మండిపడ్డారు. రాజకీయాల్లోకి ప్రవేశించగానే కొంతమంది తనను విపరీతంగా ట్రోల్ చేశారని.. అయితే అంతమాత్రాన ఏడుస్తూ కూర్చోనని పేర్కొన్నారు. ఇటువంటి వేదికలపై ఆ విషయాలను ప్రస్తావించి సానుభూతి పొందాలనుకోవడం లేదని.. ఎంపీగా గెలిచితీరతానే నమ్మకం ఉందని ఊర్మిళ చెప్పుకొచ్చారు. కాగా ముంబై నార్త్ నియోజకవర్గంలో గుజరాతీలు అధిక సంఖ్యలో ఉన్న నేపథ్యంలో ఊర్మిళ, ముంబై నార్త్ వెస్ట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి తరపున ప్రచారం చేసేందుకు హార్ధిక్ పటేల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ 2014లో యూత్‌కు మోదీ పట్ల బాగా క్రేజ్ ఉండేది. కానీ అధికారంలోకి రాగానే హామీలను తుంగలో తొక్కి ఆయన యువతను మోసం చేశారు. ఇందుకు తగిన సమాధానం చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది’ అని ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ఇక వికీపీడియాలోని ఊర్మిళ ప్రొఫైల్ పేజీలో ఆమె పేరు, మతం, తల్లిదండ్రుల వివరాలు, కుటుంబ నేపథ్యాన్ని మార్చేసి కొంతమంది ఆకతాయిలు తప్పుడు వివరాలను అప్లోడ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఊర్మిళ కుటుంబ సభ్యులు మండిపడగా, బీజేపీ సోషల్‌మీడియా విభాగం ఈ నీచమైన ప్రచారానికి దిగిందని కాంగ్రెస్ విమర్శించింది. ఊర్మిళ ప్రస్తుత పేరు మరియమ్ అక్తర్ మిర్ అనీ, 2015లో ఆమె కశ్మీరీ వ్యాపారవేత్త మొహసీన్ అక్తర్ మిర్‌ను పెళ్లిచేసుకున్నారంటూ ట్రోల్ చేశారు. -
హార్దిక్ పటేల్‌కు సుప్రీంషాక్
న్యూఢిల్లీ: పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్(25)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2015 నాటి దాడి కేసులో ఆయన దోషిత్వంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆయన ఆశలు నీరుగారినట్లే. 2015లో పటీదార్ రిజర్వేషన్ ఉద్యమం సందర్భంగా జరిగిన దాడి వెనుక హార్దిక్ ప్రోద్బలం ఉందంటూ మెహ్సనా జిల్లా పోలీసులు కేసులువేశారు. 2018లో విచారించిన విస్నగర్ సెషన్స్ కోర్టు హార్దిక్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. హార్దిక్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా శిక్షను కొట్టేసిన కోర్టు.. దోషిత్వాన్ని అలాగే ఉంచింది. మార్చిలో కాంగ్రెస్‌లో చేరిన హార్దిక్.. జామ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగాలనుకున్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం.. రెండు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడిన వ్యక్తి(దోషిత్వంపై న్యాయస్థానం స్టే ఇవ్వని పరిస్థితుల్లో) ఎన్నికల్లో పోటీకి అనర్హుడు. -
హార్దిక్ పటేల్‌కు హైకోర్టు షాక్
అహ్మదాబాద్: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధమైన పటీదార్ ఉద్యమకారుడు హార్దిక్ పటేల్‌కు గుజరాత్ హైకోర్టు షాక్ ఇచ్చింది. 2015లో ఓ అల్లర్ల కేసులో దిగువ కోర్టు దోషిగా తేలుస్తూ ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని హార్దిక్ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం తిరస్కరించింది. ఈ కేసు విచారణ సందర్భంగా హార్దిక్ పటేల్‌పై 17 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని గుజరాత్ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. వీటిలో రెండు దేశద్రోహం కేసులు కూడా ఉన్నాయని వెల్లడించింది. హార్దిక్‌కు నేరచరిత్ర ఉందని పేర్కొంది. దీంతో హార్దిక్ పటేల్‌పై నమోదైన కేసులో స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. పటీదార్ రిజర్వేషన్ ఉద్యమంలో భాగంగా 2015, జూలైలో ఆందోళనకారులు బీజేపీ ఎమ్మెల్యే హృషీకేశ్ పటేల్ కార్యాలయంపై దాడిచేశారు. ఈ కేసును విచారించిన విస్నగర్ సెషన్స్ కోర్టు హార్దిక్‌ను దోషిగా తేలుస్తూ రెండేళ్ల జైలుశిక్ష విధించింది. దీంతో హార్దిక్ గతేడాది గుజరాత్ హైకోర్టును ఆశ్రయించడంతో ఆయన శిక్షపై స్టే విధించిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేళ్లు అంతకంటే ఎక్కువకాలం జైలుశిక్ష పడ్డవారు ఎన్నికల్లో పోటీకి అనర్హులవుతారు. ఈ నేపథ్యంలోనే హార్దిక్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన హార్దిక్ జామ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా తనను దోషిగా తేలుస్తూ విస్నగర్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. గుజరాత్లో నామినేషన్ల దాఖలుకు గడువు ఏప్రిల్ -
ఎ‘టాక్’! కొత్త గళాలు.. ప్రశ్నించే గొంతుకలు..
చైతన్యానికి నిదర్శనం ప్రశ్నించడమైతే.. అన్ని రకాల ప్రశ్నలను ఆహ్వానించడం ప్రజాస్వామ్యానికి పుష్టినిస్తుంది! అందుకే.. ప్రపంచంలోనే అతిపెద్దదైన భారత ప్రజాస్వామ్యంలో.. అసమ్మతికి తావు, ప్రాధాన్యం ఎక్కువే ఉండాలి. అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించే బాధ్యత ప్రతిపక్షాలదైతే.. అది కాస్తా విఫలమైనప్పుడు పౌర సమాజం తన గొంతుకనివ్వాలి. ప్రజాస్వామ్యంలో మూలస్తంభాలుగా భావించే వ్యవస్థలు రకరకాల కారణాలతో రాజీ పడిపోతున్నఈ తరుణంలో.. మేమున్నామంటూ కొందరు ముందుకొస్తున్నారు!. ప్రజాస్వామ్యమంటే.. నేతలు, ఎన్నికలు మాత్రమే కాదు.. అంశాలపై గళమెత్తడం కూడా అంటున్న వీరు వినిపిస్తున్న కొత్త గళాలివిగో... ఓటరే అసలు దేవుడు: ప్రకాశ్‌రాజ్ ఒక్క సంఘటన మన జీవిత గమనాన్నిమార్చే స్తుందంటారు. ప్రకాశ్‌రాజ్ విషయంలోజరిగింది అచ్చంగా ఇదే. నటుడిగా ఐదారు భాషల్లోనటిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్న సమయంలో చిన్ననాటి స్నేహితురాలు.. అదీ తన గురువుగాభావించి పూజించిన లంకేశ్ కూతురు గౌరి.. ఇంటి ముందే దారుణమైన హత్యకు గురికావడంప్రకాశ్ను దేశంలోనే శక్తిమంతుడైన వ్యక్తిని కూడా ఢీకొనేలా చేసింది. జస్ట్ ఆస్కింగ్ పేరుతో ప్రకాశ్‌రాజ్ వేసిన ప్రశ్నలు చాలా మౌలికమైనవి. కర్రుకాల్చివాతపెట్టడమెలాగో బాగా తెలిసిన ప్రకాశ్రాజ్రాజకీయాలు కులం, మతం, ప్రాంతాల ఆధారంగా కాకుండా సామాన్యుడి అవసరాలు, బాగు చుట్టూజరగాలని కోరుకుంటారు. ప్రకాశ్ ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయ బరిలోకీ దిగేశారు. బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాశ్ ఇప్పటికే సమాజంలోని అన్ని వర్గాల వారిని కలుస్తూప్రచారం కూడా మొదలుపెట్టారు. పార్లమెంటు సభ్యుడంటే ఢిల్లీలో కూర్చుని రాజకీయం మాత్రమే చేయడం కాదంటున్న ఈ నటుడుమురికివాడల్లోని అతి సామాన్యుల కష్టాలకూ స్పందించాలని అంటున్నారు. రామమందిర రాజకీయాలకు కాకుండా సామాన్య రైతుల కష్టాలను తీర్చడమే ముఖ్యమని స్పష్టంగా చెబుతున్న ప్రకాశ్ఎన్నికల్లో ఏమాత్రం విజయం సాధిస్తారో వేచి చూడాల్సిందే!! దళిత హక్కుల గళం: జిగ్నేశ్ మెవానీ ఎస్సీ, ఎస్టీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని బహిరంగంగా వ్యాఖ్యానించగల ముఖ్యమంత్రులున్న ఈ దేశంలో దళితుడిగా పుట్టిన ప్రతివాడికీ విచక్షణ అంటే ఏమిటో స్పష్టంగా తెలుసని కుండబద్దలు కొట్టగలిగే జిగ్నేశ్ మెవానీ కూడా ఉన్నాడు! చర్మకారుడిగా తాత అనుభవాలు కదలించాయో.. పొట్టకూటి కోసం అహ్మదాబాద్ మున్సిపాలిటీలో అన్ని రకాల పనులూ చేసిన తండ్రి కష్టాలు ఆలోచనలు రేకెత్తించాయో తెలియదుగానీ.. ముంబైలో కొంతకాలం విలేకరిగానూ పనిచేసిన జిగ్నేశ్ ఆ తరువాతి కాలంలో న్యాయవాదిగా దళితుల హక్కుల కోసం ఉద్యమాలు ప్రారంభించాడు. గుజరాత్‌లోని ఊనాలో దళితులకు జరిగిన అవమానాన్ని తీవ్రంగా నిరసించిన జిగ్నేశ్ అధికారంలో ఉన్న వారికి వ్యతిరేకంగా గళమెత్తి, ఉద్యమించాడు. కమ్యూనిస్టు నేత ముకుల్ సిన్హా, గాంధేయ వాది చున్నీభాయ్ వేద్ వద్ద ఉద్యమ పాఠాలు నేర్చుకున్న జిగ్నేశ్ 2016 నాటి ‘‘దళిత్ అస్మిత్ యాత్ర’’తో ప్రాచుర్యంలోకి వచ్చారు. దేశంలో దళితులపై వివక్ష పోవాలన్నా, సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగాలన్నా కార్పొరేట్ సంస్థలకు బదులు దళితులకు భూమి పంపిణీ జరగాలని అంటున్నారు. ఇందుకోసం వ్యవస్థాగత మార్పులూ తప్పనిసరి అన్నది జిగ్నేశ్ వాదన. దళిత్ అస్మిత యాత్ర తరువాత జరిగిన ఎన్నికల్లో జిగ్నేశ్ గుజరాత్‌లోని వడ్గామ్ నుంచి అసెంబ్లీ బరిలో దిగి విజయం సాధించారు. తరువాతి కాలంలో దేశవ్యాప్తంగా దళితులను తమ హక్కుల సాధనకు ఉద్యమించేలా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని భీమా కొరేగావ్‌లో ఘర్షణలకు కారణమయ్యాడని పోలీసులు కేసులు పెట్టినా.. అతడి ప్రమేయమేమీ లేదని కోర్టు ఆ కేసును కొట్టేసింది. రోడ్డెక్కిన పాటీదార్: హార్దిక్ పటేల్ రెండేళ్ల క్రితం జరిగిన గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ అత్తెసరు ఆధిక్యంతో ఇంకోసారి పగ్గాలు చేపట్టింది. దేశం మొత్తం మోదీ గాలులు వీస్తున్న 2017లో గుజరాత్లో బీజేపీని నిలువరించిన యువనేతగా హార్దిక్ పటేల్‌ను వర్ణిస్తారు విశ్లేషకులు. పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలన్న ఆందోళనకు నేతృత్వం వహించిన హార్దిక్ పటేల్ ఆలోచనలు ఇతరుల కంటే చాలా భిన్నం. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈయన. మంచి మార్కులు సంపాదించుకున్నా తన చెల్లికి స్కాలర్షిప్ రాకపోవడం.. తక్కువ మార్కులతోనే ఓబీసీల్లోని చెల్లి స్నేహితురాలికి దక్కడం.. యువ హార్దిక్ పటేల్‌కు ఏమాత్రం నచ్చలేదు. రిజర్వేషన్లు కొందరికి మాత్రమే ఉపయోగపడుతున్నాయని ఆందోళన చేపట్టిన హార్దిక్.. ఓబీసీ కోటాలో తమకూ రిజర్వేషన్లు కల్పించాలని.. అలా కుదరని పక్షంలో అందరికీ ప్రత్యేక కోటాలు తీసేయాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం వేలమంది యువకులతో నిర్వహించిన పాటీదార్ అనామత్ ఆందోళన్ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఓబీసీ వర్గపు నేత అల్బేశ్ ఠాకూర్, దళిత ఉద్యమ నేత జిగ్నేశ్ మెవానీతో కలిసి పలు ఉద్యమాల్లో పాల్గొన్న హార్దిక్ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాడు. రాజ్యాంగంపై ఒట్టేసి..: కన్హయ్య కుమార్ మూడేళ్ల క్రితం జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా దేశమంతా పరిచయమైన వ్యక్తి. పీహెచ్డీ విద్యార్థులకిచ్చే భృతిని తగ్గించడంపై ఢిల్లీ వీధులకెక్కిన కన్హయ్య కుమార్ తరువాతి కాలంలో దేశద్రోహం కేసులు ఎదుర్కోవడం.. అరెస్ట్ కావడం ఇటీవలి పరిణామాలే. ఇవన్నీ ఒక ఎత్తయితే.. బెయిల్‌పై విడుదలయ్యాక జేఎన్‌యూలో తోటి విద్యార్థులను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం.. చతురోక్తులు, మాట విరుపులతో మోదీ, అప్పటి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీపై ఎక్కుపెట్టిన విమర్శలు దేశంలో సరికొత్త చర్చకు దారితీశాయి. కన్హయ్య కుమార్ నమ్మేది.. ప్రచారం చేసేది.. రాజకీయ నేతలు అనుసరించాలని కోరుకుంటున్నదీ ఒక్కటే. భారత ప్రజలందరి కోసం రాసుకున్న రాజ్యాంగాన్ని తు.చ. అమలు చేయమని! ఎన్నికల సమయంలో చేసిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలందరూ ప్రశ్నించాలన్నది అతని సిద్ధాంతం. బిహార్‌లోని బేగూసరాయిలోని భూమిహార్ కుటుంబం నుంచి వచ్చారీయన. జేఎన్‌యూలో పీహెచ్డీ చేసే సమయానికి ఆయన ఆలోచన తీరులో గణనీయమైన మార్పు వచ్చింది. రాజ్యాంగం రూపంలో అంబేడ్కర్ దళితులకు కల్పించిన రక్షణను, వామపక్ష సిద్ధాంతాలను కలిపి కన్హయ్య కుమార్ ప్రతిపాదిస్తున్న ‘‘లాల్.. నీల్’’ నినాదాన్ని ఇప్పుడు వామపక్ష పార్టీలు ప్రచారం చేస్తూండటం గమనార్హం. 2019 ఎన్నికల బరిలోనూ నిలుస్తున్న ఈ యువనేత భారత రాజకీయ వ్యవస్థలో సరికొత్త, ప్రస్ఫుటమైన గళమవుతారనడంలో సందేహం లేదు. గిరిజనుల మరో గొంతుక: సోనీ సూరి బస్తర్ జిల్లాలో ఒకప్పుడు ఓ సామాన్య ఉపాధ్యాయురాలి పేరు సోనీ సూరి! మరి ఇప్పుడు..? దాదాపు 17 రాష్ట్రాల్లో గిరిజన హక్కుల కోసం పోరాడుతున్న ధీర వనిత. ఒకపక్క నక్సలైట్లు.. ఇంకోవైపు వారిని వెంటాడుతూండే పోలీసుల మధ్య నలిగిపోతూ మాన ప్రాణాలను కోల్పోతున్న గిరిజనులకు అండగా నిలవడం ఈమె వృత్తి, ప్రవృత్తి కూడా. తమతో కలిసిపోవాల్సిందిగా మావోయిస్టులు కోరినప్పుడు.. తమకు ఇన్ఫార్మర్గా పనిచేయాలని పోలీసులు ఆదేశించినప్పుడూ సోని సూరి చెప్పిన మాట ఒక్కటే. ఇద్దరికీ సమాన దూరంలో ఉండటం తన విధానమని కుండబద్దలు కొట్టింది. అందుకు తన భర్తను పోగొట్టుకుంది. అత్యాచారాలకు గురైంది. ఎనిమిది పోలీసు కేసులు ఎదుర్కొంది. చివరకు సుప్రీంకోర్టు తలుపు తట్టి మరీ తాను పోలీసుల చేతిలో అత్యాచారానికి గురయ్యానని.. అది తన హక్కులను కాలరాయడమేనని వాదించి విజేతగా నిలిచింది. ఆ తరువాతి కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఎన్నికల బరిలోనూ నిలిచింది. సోనీ తండ్రిని మావోయిస్టులు కాల్చేస్తే.. సానుభూతి పరుడన్న నెపంతో పోలీసులు భర్తను ఎత్తుకెళ్లిపోయి.. హింసించిన కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అయినాసరే నమ్మిన సిద్ధాంతాల కోసం, గిరిజనుల హక్కుల కోసం సోనీ సూరి ఛత్తీస్‌గఢ్‌లో పోరాడుతూనే ఉన్నారు. ఈ మధ్యలో ఆమెపై యాసిడ్ దాడి కూడా జరిగింది. కశ్మీర్ కి కలీ షెహలా రషీద్ షోరా కశ్మీర్ సమస్య పేరు చెప్పగానే అందరికీ గుర్తుకొచ్చేది ఉగ్రవాదం మాత్రమే కావచ్చు. అయితే ఈ ఉగ్రవాదాన్ని అణచివేసే లక్ష్యంతో అక్కడ ఏర్పాటు చేసిన రక్షణ దళాలు హద్దుమీరి ప్రవర్తిస్తుంటాయని.. మానవ హక్కులను తోసిరాజంటాయని చాలామంది చెబుతుంటారు. కశ్మీర్‌లోనే పుట్టి పెరిగి.. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి నేతగా ఎదిగిన షెహలా రషీద్.. కన్హయ్య కుమార్, ఉమర్ ఖాలిద్ అరెస్ట్‌కు నిరసనగా చేసిన ఉద్యమంతో వెలుగులోకి వచ్చారు. అంతకుముందు కూడా కశ్మీర్లో మానవ హక్కుల పరిస్థితిపై.. ముఖ్యంగా మైనర్ విచారణ ఖైదీలకు మద్దతుగా గళమెత్తారు షెహలా రషీద్. పీహెచ్డీ విద్యార్థులకు ఇచ్చే భృతిని తగ్గించిన సందర్భంలో ‘‘ఆక్యుపై యూజీసీ’’ పేరిట షెహలా తదితరులు చేసిన ఉద్యమం అందరికీ తెలిసిందే. 2015లో జేఎన్‌యూ ఎన్నికల్లో ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున బరిలో దిగిన షెహలా అత్యధిక మెజార్టీతో గెలుపొంది రికార్డు సృష్టించారు. మంచి వక్తగా పేరొందిన ఈ కశ్మీరీ మహిళ వివాదాలకు కొత్తేమీ కాదు. ఒక ఫేస్బుక్ పోస్ట్‌లో మహమ్మద్ ప్రవక్తను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన ఆరోపణపై 2017లో షెహలాపై ఒక కేసు నమోదైంది. కన్హయ్య కుమార్‌పై దేశద్రోహం కేసు సందర్భంగానూ షెహలా చేసిన పలు వ్యాఖ్యలు దుమారం రేపాయి. పల్లె నాడి పట్టినోడు: సాయినాథ్ ‘‘పల్లె కన్నీరు పెడుతోందో.. కనిపించని కుట్రల’’... పదిహేనేళ్ల క్రితం ఆంధ్ర రాష్ట్రాన్ని కుదిపేసిన పాట. భారతీయ ఆత్మగా చెప్పుకునే పల్లెల్లోని కష్టాలకు ఈ పాట అద్దం పట్టింది. అయితే దశాబ్దాలుగా జర్నలిస్టుగా.. ఫొటో జర్నలిస్టుగా ఇదే పని చేస్తున్న పాలగుమ్మి సాయినాథ్ గురించి మాత్రం కొందరికే తెలుసు. కరువు, ఆకలి గురించి సాయినాథ్కు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదేమో అని నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ లాంటి వాళ్లే చెబుతున్నారంటే ఈ వ్యక్తి సామర్థ్యం ఏమిటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పీపుల్స్ ఆర్కై వ్ ఆఫ్ రూరల్ ఇండియా (పరి) పేరుతో సాయినాథ్ నడుపుతున్న ఓ వెబ్సైట్ దేశంలో అన్నదాతకు జరుగుతున్న నష్టమేమిటన్నది భిన్నకోణాల్లో వివరిస్తుంది. రైతు ఆత్మహత్యలు.. అందుకు దారితీస్తున్న కారణాలను వివరిస్తూ వేర్వేరు సమావేశాల్లో సాయినాథ్ చేసిన ప్రసంగాలు అత్యంత ఆసక్తికరమైనవంటే అతిశయోక్తి కాదు. ‘‘సుప్రీంకోర్టు జడ్జీలందరికీ కనీసం ఓ పోలీస్ కానిస్టేబుల్‌కు ఉన్నన్ని అధికారాలు కూడా లేవు. కానిస్టేబుల్ అటో ఇటో తేల్చేస్తాడు. చట్టాలను తిరగరాసే శక్తిలేని సుప్రీంకోర్టు జడ్జీలు రెండువైపులా వాదనలను వినడం మాత్రమే చేయగలరు. కానిస్టేబుల్ మాత్రం తనదైన చట్టాన్ని సిద్ధం చేసుకోగలడు. ఏమైనా చేయగలడు’’ అంటారు సాయినాథ్. ప్రభుత్వ విధాన లోపాల కారణంగానే దేశంలో వ్యవసాయం సంక్షోభంలో ఉందని విస్పష్టంగా ఎలుగెత్తే సాయినాథ్ కార్పొరేట్ సంస్థలు సిద్ధం చేసిన గ్యాట్, డబ్ల్యూటీవో చట్టాల దుష్ప్రభావాలను రైతులు అనుభవిస్తున్నారని అంటారు. శ్రామిక బాంధవి: సుధా భరద్వాజ్ పుట్టిందేమో అమెరికా. పదకొండేళ్ల ప్రాయంలోనే భారత్‌కు తిరిగొచ్చారు. 18 నిండేసరికి అమెరికన్ పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఐఐటీ చదువుతూ.. కార్మికుల కష్టాలకు కదిలిపోయారు. న్యాయవాదిగానూ మారిపోయాడు. ఇదీ హక్కుల ఉద్యమకారిణి సుధా భరద్వాజ్ స్థూల పరిచయం. 30 ఏళ్లుగా ఛత్తీస్‌గఢ్‌లో స్థిర నివాసం ఏర్పరచుకుని ఛత్తీస్‌గఢ్ ముక్తిమోర్చా తరఫున పనిచేస్తున్నారు. భిలాయి ప్రాంతంలోని గనుల్లో కార్మికుల వేతనాలను దోచుకుంటున్న ప్రభుత్వ అధికారులపై కేసులు కట్టి న్యాయం కోసం పోరాడారు. గత ఏడాది జూలైలో రిపబ్లిక్ టీవీలో సుధా భరద్వాజ్‌పై వెలువడిన కథనం ఒకటి ఆమె అరెస్ట్‌కు దారితీసింది. మావోయిస్టు నేత ప్రకాశ్‌కు సుధా భరద్వాజ్ ఒక లేఖ రాసినట్లు.. ‘‘కశ్మీర్ తరహా పరిస్థితిని సృష్టించాలని అందులో పేర్కొన్నట్లు ఆర్ణబ్ గోస్వామి ఆరోపించారు. దీన్ని తీవ్రంగా ఖండించిన సుధా భరద్వాజ్.. భీమా కోరేగావ్ అల్లర్ల విషయంలో పోలీసుల తీరును తప్పు పట్టినందుకే తనపై తప్పుడు ఆరోపణలు మోపుతున్నారన్నది సుధ వాదన. దేశమంటే మనుషులోయ్: ఖాలిద్ పార్లమెంటుపై ఉగ్రదాడి నిందితుడు అఫ్జల్ గురుపై జేఎన్‌యూలో ఒక కార్యక్రమం నిర్వహించడం ద్వారా వివాదాల్లోకి.. ప్రాచుర్యంలోకి వచ్చిన ఉమర్ ఖాలిద్ దేశ భిన్నత్వంలో ఏకత్వాన్ని గట్టిగా నమ్ముతారు. కాలేజీ రోజుల్లో భిన్న సంస్కృతులు, వ్యక్తులతో భిన్నత్వానికి పరిచయమైన ఉమర్.. తరువాతి కాలంలో దేశం ఎదుర్కొంటున్న సమస్యలను, సమాజంలో వేర్వేరు వర్గాల వారికి జరుగుతున్న అన్యాయాలపై గళమెత్తడం మొదలుపెట్టారు. ఆర్థిక సరళీకరణల తరువాత దేశం అగ్రరాజ్యంగా ఎదుగుతోందన్న ప్రచారం జరుగుతున్న దశలోనూ కొన్ని వర్గాల వారు పొట్టగడిపేందుకు పడుతున్న కష్టాలు తనను కలచివేశాయని. దేశభక్తి అంటే.. వీరి కోసం పోరాడడమే అని గట్టిగా విశ్వసించి అనుసరిస్తున్నారు ఉమర్. రాజ్యాంగం కులమతాలకు అతీతంగా పనిచేయాలని.. స్పష్టం చేస్తూండగా. చేసే పని ఆధారంగా, కులం, వర్గం, మతం ఆధారంగా సమాజం విడిపోయి ఉండటం కూడా నిష్టు్టర సత్యమని.. రాజకీయాలు ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చేందుకు ఉపయోగపడాలని.. అంతరాలను, అసమానతలను మరింత పెంచేలా ఉండకూడదన్నది ఉమర్ విస్పష్ట అభిప్రాయం. దేశాన్ని ముక్కలు చేసే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై దేశద్రోహం కేసు ఎదుర్కొంటున్న ఉమర్ ఖాలిద్ ప్రభుత్వాలు లాభాపేక్ష కలిగిన కార్పొరేట్లకు మద్దతుగా నిలవరాదని అంటారు. భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన వారెన్ ఆండర్సన్‌ను అప్పటి అధికార పక్షం విమానంలో దేశం దాటిస్తే.. మోదీ ప్రభుత్వం నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ తదితరులను దాటించేసిందని ఆరోపిస్తారు. -
కాంగ్రెస్‌లోకి హార్దిక్
సాక్షి, అహ్మదాబాద్ : పటీదార్ రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిసింది. ఈ నెల 12న కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరతారనే సమాచారం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని గతంలోనే హార్దిక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్ జామ్‌నగర్ నియోజకవర్గం నుంచి హార్దిక్ పోటీ చేస్తారని ఆయన సన్నిహుతులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో పుణమ్బన్ మాడమ్ బీజేపీ తరఫున ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు. పటేల్ పార్టీలో చేరుతున్న సందర్భంగా అహ్మదాబాద్‌లో సీడబ్ల్యూసీ మీటింగ్‌ని ఏర్పాటు చేసి అనంతరం పార్టీ సీనియర్ నాయకులతో పబ్లిక్ ర్యాలీని నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలిసింది. గత కొద్ది కాలం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో పట్టు కోసం కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీకి గట్టి పోటీనే ఇచ్చింది. (చదవండి : ఇక ఢిల్లీలో పోరాడతా: హార్దిక్) -
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తా
-
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తా : హార్దిక్
సాక్షి,న్యూఢిల్లీ : పటీదార్ రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికలల్లో పోటీకి సిద్ధమయ్యారు. లక్నోలో నిర్వహించిన ర్యాలీలో హర్దిక్ ఈ విషయాన్ని వెల్లడించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లోనే పోటీ చేసేందుకు హార్దిక్ పటేల్ ప్రయత్నించారు, కానీ వయస్సు సరిపోని కారణంగా పోటీకి దూరంగా నిలిచారు. ఇప్పుడు 25ఏళ్ల వయసు దాటడంతో ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు హర్దిక్ సిద్ధమయ్యారు. అయితే ఏ స్థానం నుంచి అతను పోటీ చేస్తాడన్న విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. (చిన్ననాటి స్నేహితురాలితో హార్ధిక్ పెళ్లి) గుజరాత్‌లోని అమ్రేలీ లేదా మెహసానా స్థానం నుంచి పోటీ చేస్తాడన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అమ్రేలి నుంచి అభ్యర్థిని నిలబెట్టకుండా హార్దిక్ పటేల్‌కు ఇవ్వనున్నట్లు సమాచారం. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అమ్రేలీ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న అయిదు స్థానాల్లో పటేదార్లు గెలిచారు. దీంతో హార్థిక్ ఆ స్థానం నుంచే పోటీపడే అవకాశాలు ఉన్నాయి. -
ఇంటివాడైన హార్దిక్ పటేల్..
బాల్య స్నేహితురాలు కింజాల్ పారిఖ్‌ను వివాహమాడిన పటీదార్ రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్. అహ్మదాబాద్‌కు 130 కిలోమీటర్ల దూరంలోని దిగ్సార్ అనే గ్రామంలో ఆదివారం ఈ వేడుక జరిగింది. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట కుటుంబ సభ్యుల అనుమతితో ఒక్కటయ్యారు. -
చిన్ననాటి స్నేహితురాలితో హార్ధిక్ పెళ్లి
అహ్మదాబాద్: పటీదార్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ ఓ ఇంటివాడయ్యాడు. ఆయన తన చిన్ననాటి స్నేహితురాలు కింజల్ పారిక్‌ను ఆదివారం వివాహం చేసుకున్నారు. సురేంద్రనగర్ జిల్లా దిగ్సార్ గ్రామంలోని ఓ దేవాలయంలో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. పటేల్ సంప్రాదాయం ప్రకారం జరిగిన ఈ వేడుకకు దగ్గరి బంధువులు, కొద్దిమంది స్నేహితులు హాజరయ్యారు. పెళ్లి అనంతరం హార్ధిక్ మాట్లాడుతూ.. ‘నా కుటుంబ జీవితంలో ఇది రెండో ఇన్నింగ్స్. ప్రతి ఒక్కరు సమాన అవకాశాలు పొందాలనేదే నా కోరిక. పురుషులకు, మహిళలకు సమాన హక్కులు ఉంటాయని.. నేను నా భార్యకు ప్రామిస్ చేశాను. ఇకపై మేమిద్దరం ఈ దేశ నవ నిర్మాణం కోసం పోరాడతామ’ని తెలిపారు. కింజాల్, తాను ప్రేమించుకున్న విషయాన్ని హార్ధిక్ ఇదివరకే వెల్లడించిన సంగతి తెలిసిందే. తొలుత కింజల్ తనకు ప్రపోజ్ చేసిందన్న హార్ధిక్.. పెద్దల అంగీకారంతో తాము పెళ్లి చేసుకుంటున్నట్టు తెలిపారు. హార్ధిక్ స్వగ్రామం అహ్మదాబాద్ జిల్లాలోని చందన్ నగరి కాగా, కింజల్ ఆ ఊరికి సమీపంలోని విరంగం గ్రామానికి చెందినవారు. ప్రస్తుతం కింజల్ కుటుంబం సూరత్‌లో నివాసం ఉంటుంది. ఆమె తంద్రి దిలీప్ పారిక్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. డిగ్రీ పూర్తిచేసిన కింజల్.. ప్రస్తుతం లా చదువుతున్నారు. -
‘అలాగైతే అందరి పేర్లూ రామ్‌గా మార్చాలి’
అహ్మదాబాద్ : బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నగరాల పేర్లను మార్చడం పట్ల పటేల్ ఉద్యమ నేత హార్థిక్ పటేల్ తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. యోగి ఆదిత్యానాథ్ సర్కార్ అలహాబాద్, ఫైజాబాద్ నగరాల పేర్లను మార్చడాన్ని పటేల్ ప్రస్తావిస్తూ పేర్లు మార్చినంత మాత్రన సమస్యలు పరిష్కారమైతే భారతీయులందరి పేర్లను రాముడిగా మార్చాలని చురకలు వేశారు. నగరాల పేర్లను మార్చడంతో దేశం సుసంపన్నమైతే ఇక దేశంలోని 125 కోట్ల మంది భారతీయుల పేర్లను రాముడిగా మార్చాలని వ్యాఖ్యానించారు. దేశంలో నిరుద్యోగం, రైతుల సమస్యలు వంటి ఎన్నో అంశాలు ప్రధానంగా ముందుకొస్తుంటే ప్రభుత్వం మాత్రం పేర్లు, విగ్రహాల పట్ల ఆసక్తిగా ఉందని ఎద్దేవా చేశారు. ఫైజాబాద్ జిల్లాను అయోధ్యగా మారుస్తున్నట్టు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఇటీవల ప్రకటించిన క్రమంలో హార్ధిక్ పటేల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అంతకుముందు అలహాబాద్ పేరును ప్రయాగ రాజ్‌గా యూపీ ప్రభుత్వం మార్చిన సంగతి తెలిసిందే. ఇక ముజఫర్‌నగర్ పేరును లక్ష్మీనగర్‌గా, గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌ను కర్ణావతిగా మార్చాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
పోటీ పరీక్ష: దీక్ష విరమణకు నీళ్లిచ్చిందెవరు?
అహ్మదాబాద్: ఓ పోటీ పరీక్షలో అడిగిన ప్రశ్న ఆ పరీక్ష రాస్తున్న అభ్యర్థులను ఆశ్చర్యానికి గురిచేసింది. గుజరాత్లో రైతులకు రుణమాఫీ, పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలంటూ పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) నేత హార్ధిక్ పటేల్ నిరహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. అయితే గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో క్లర్క్ పోస్టులకు ఆదివారం నిర్వహించిన పోటీ పరీక్షలో ఇటీవల దీక్షలో ఉన్న హార్ధిక్‌కు నీరు అందజేసి మద్దతు తెలిపింది ఎవరనే ప్రశ్నను అడిగారు. ఈ ప్రశ్నకు నాలుగు ఐచ్ఛికాలు.. శరద్ యాదవ్, శతృజ్ఞ సిన్హా, లాలూ ప్రసాద్‌యాదవ్, విజయ్ రూపానీ కూడా ఇచ్చారు. అందులో సరైన సమాధానం మాజీ కేంద్రమంత్రి శరద్ యాదవ్. ఈ సంగతి అటు ఉంచితే.. పరీక్షలో ఈ రకమైన ప్రశ్న రావడం గుజరాత్లో చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 25న నిరహార దీక్ష చేపట్టిన హార్ధిక్ సెప్టెంబర్ 6వ తేదీ నుంచి మంచి నీళ్లు కూడా తీసుకోవడం మానేశాడు. దీంతో అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. సెప్టెంబర్ 7వ తేదీన ఆస్పత్రికి తరలించారు. ఆ మరుసటి రోజు హాస్పిటల్లో హార్ధిక్‌ను పరామర్శించిన శరద్ యాదవ్ అతనికి నీరు అందజేశారు. కాగా హార్ధిక్ సెప్టెంబర్ 12వ తేదీన దీక్షను విరమించారు. పోటీ పరీక్షలో ఈ ప్రశ్న రావడంపై గాంధీనగర్ మేయర్‌ను ప్రశ్నించగా.. దీనిపై తనకు సమాచారం లేదన్నారు. మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నిక కాబడిన ప్రతినిధులు ఎవరు ఈ పరీక్షల్లో జోక్యం చేసుకోలేదని తెలిపారు.