సాక్షి, అహ్మదాబాద్ : గుజరాత్ శాసనసభ ఎన్నికల వేళ మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా పటీదార్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ భారతీయ జనతాపార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉగ్రవాదం, హిందూ-ముస్లిం, గోవధ అంశాలనే లక్ష్యం చేసుకుని రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోందని హార్ధిక్ పటేల్ విమర్శించారు.
ఇదిలా ఉండగా గుజరాత్‌లో పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించే అంశంపై పటీదార్ అనామత్ ఆందోళన్ సమతి (పీఏఏఎస్) నేత హార్ధిక్ పటేల్, గుజరాత్ రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపారు. అయితే ఈ చర్చల్లో రిజర్వేషన్లపై ఎటువంటి ఒప్పందాలు కుదరలేదు. దీంతో రిజర్వేషన్లపై మరోమారు నవంబర్ 7న కాంగ్రెస్ పార్టీతో హర్ధిక్ పటేల్ చర్చించనున్నారు. నవంబర్ 7న జరిగే చర్చలే ఆఖరివని.. మళ్లీ ఆంశంపై కాంగ్రెస్ పార్టీతో చర్చలు ఉండవని హార్ధిక్ పటేల్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment