
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్ శాసనసభ ఎన్నికల తొలిదశ పోలింగ్‌కు కొన్ని గంటలు మాత్రమే ఉన్న ఈ సమయంలో హార్ధిక్ పటేల్‌కు ఊహించని బిగ్ షాక్ తగిలింది. పటేదార్ అనామత్ అందోళన్ సమితి (పీఏఏఎస్)లో కీలక సభ్యుడు, హార్థిక్ పటేల్‌కు అత్యంత సన్నిహిత వ్యక్తి అయిన దినేష్ బంభూనియా పీఏఏఎస్‌కు రాజీనామా చేశారు. . పోలింగ్‌కు కొన్నిగంటలు మాత్రమే మిగులున్న ఈ సమయంలో పీఏఎస్‌ఎస్‌కు దినేష్ రాజీనామా చేయడం హార్ధిక్‌కు భారీ దెబ్బకు అని విశ్లేషకులు చెబుతున్నారు.
పటేల్ అనామత్ ఆందోళన్ సమితిలో దినేష్ ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా.. పటేల్ ఆందోళనలో కీలక పాత్ర పోషించిన అమ్మీష్, కేతన్‌లు గత నవంబర్‌లోనే పీఏఏఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ప్రస్తుం వారిద్దరు బీజేపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పీఏఏఎస్ కన్వీనర్ అయిన వరుణ్ పటేల్‌కూడా హార్థిక్‌కు దూరంమై.. బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. హార్థిక్ పటేల్‌కు సంబంధించిన సెక్స్ టేపులు విడుదలైన సమయంలో దినేష్.. అతనికి అండగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment