PAAS protest
-
హార్ధిక్ పటేల్‌కు బిగ్ షాక్!?
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్ శాసనసభ ఎన్నికల తొలిదశ పోలింగ్‌కు కొన్ని గంటలు మాత్రమే ఉన్న ఈ సమయంలో హార్ధిక్ పటేల్‌కు ఊహించని బిగ్ షాక్ తగిలింది. పటేదార్ అనామత్ అందోళన్ సమితి (పీఏఏఎస్)లో కీలక సభ్యుడు, హార్థిక్ పటేల్‌కు అత్యంత సన్నిహిత వ్యక్తి అయిన దినేష్ బంభూనియా పీఏఏఎస్కు రాజీనామా చేశారు. . పోలింగ్‌కు కొన్నిగంటలు మాత్రమే మిగులున్న ఈ సమయంలో పీఏఎస్ఎస్కు దినేష్ రాజీనామా చేయడం హార్ధిక్‌కు భారీ దెబ్బకు అని విశ్లేషకులు చెబుతున్నారు. పటేల్ అనామత్ ఆందోళన్ సమితిలో దినేష్ ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా.. పటేల్ ఆందోళనలో కీలక పాత్ర పోషించిన అమ్మీష్, కేతన్‌లు గత నవంబర్లోనే పీఏఏఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ప్రస్తుం వారిద్దరు బీజేపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పీఏఏఎస్ కన్వీనర్ అయిన వరుణ్ పటేల్‌కూడా హార్థిక్కు దూరంమై.. బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. హార్థిక్ పటేల్‌కు సంబంధించిన సెక్స్ టేపులు విడుదలైన సమయంలో దినేష్.. అతనికి అండగా నిలిచారు. -
సీఎం సభలో వినూత్న ప్రయోగం
రాజ్‌కోట్: గుజరాత్ సీఎంగా విజయ్ రూపానీ హాజరైన సభలో పటీదార్ అనామత్ ఆందోళన సమితి(పీఏఏఎస్) కార్యకర్తలు నిరసన తెలపకుండా నిర్వాహకులు వినూత్న ప్రయోగం చేశారు. జాస్దాన్ తాలుకాలోని ఆట్కోట్ గ్రామంలో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రికి విజయ్ రూపానీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు 25 వేల మంది హాజరైయ్యారు. పటేల్ సామాజిక వర్గానికి పట్టున్న ప్రాంతం కావడంతో సభకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 25 మంది పీఏఏఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. సభలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ కుర్చీలను ఒకదానితో ఒకటి తాళ్లతో కట్టేశారు. ఇలా ఎందుకు కట్టారే అర్థంకాక సభకు హాజరైన వారు జుట్టుపీక్కున్నారు. పీఏఏఎస్ కార్యకర్తలు ఆందోళన చేయకుండా పోలీసులు ఇలా చేశారని తెలుసుకుని ముక్కుపై వేలేసుకున్నారు. అంతకుముందు సూరత్ లో విజయ్ రూపానీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొన్న సభలో ప్లాస్టిక్ కుర్చీలను విసిరేసి పీఏఏఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈసారి అలాంటి అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో కుర్చీలను పోలీసులు తాళ్లతో కట్టేశారు. అంతేకాదు కుర్చీలు కూడా తక్కువగా వేశారు. ఎక్కువ మందిని కార్పెట్ మీద కూర్చొబెట్టారు.