అహ్మదాబాద్: గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సూరత్‌లో చేపట్టిన ర్యాలీలో పాల్గొనకుంటే ఐదు కోట్లు ఇస్తానని ఓ వ్యాపారవేత్త ఆఫర్ చేశాడని పటిదార్ అనామత్ ఆందోళన్ సమితి నేత హార్ధిక్ పటేల్ ఆరోపించారు. ఇక ఈ ర్యాలీలో 13 లక్షల మంది పాల్గొన్నారని, పటీదార్ నేతలంతా కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతున్నారని తెలిపారు. పటీదార్ వర్గం ఈ సారి బీజేపీకి ఓటువేయడం లేదన్నారు. అలాగే ఆప్, ఎన్సీపీ, స్వతంత్ర్య అభ్యర్థుల ఉచ్చులో కూడ పడరని చెప్పారు.
అంతకు ముందు ర్యాలీలో ప్రసంగించిన హార్ధిక్ ప్రజలను ఉద్దేశించి బీజేపీకి ఓటు వేయవద్దని బంధువులకు పోన్ చేసి చెప్పాలని కోరారు. పటీదార్ల ఆందోళనను పట్టించుకోని ప్రభుత్వానికి ఆరు కోట్ల పటీదార్ వర్గ ప్రజలు దూరమయ్యారనే వార్త డిసెంబర్ 19న అన్ని చానెళ్లలో చూడాలని ఉందని తెలిపారు.
వాజ్‌పెయ్ బీజేపీ.. అమిత్ షా బీజేపీ వేరు..
రైతులు, పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన వాజ్‌పెయ్-కేశుబాయ్‌ల బీజేపీ వేరని, ప్రస్తుతం ఉన్నబీజేపీ వేరన్నారు. అమిత్ షా సారథ్యంలో నడుస్తున్న బీజేపీలో అందరు అవివేకులేనని ఎద్దేవ చేశారు. 21 ఏళ్లు పాలించిన బీజేపీ ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. సూరత్‌లో రెండు ప్రభుత్వ ఆసుపత్రులు, ఒక ప్రభుత్వ పాఠశాల ఉందన్నారు. ఇవి కాంగ్రెస్ హయాంలోనే నిర్మించారని, మరీ బీజేపీ ఎంచేసిందని, మరో ఆసుపత్రిని ఎందుకు నిర్మించలేదని హార్ధిక్ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment