సాక్షి, అహ్మదాబాద్ : గుజరాత్ ఎన్నికల్లో తాను కాంగ్రెస్ పార్టీ విజయంకోసం కీలకంగా పనిచేశానని పటేల్ ఉద్యమకారుడు హార్ధిక్ పటేల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి గతంలో 33శాతం ఓట్ల శాతం ఉండేదని అది ఇప్పుడు 43శాతానికి పెరిగిందన్నారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడం వల్లే బీజేపీ గెలిచిందని ఆరోపించారు. మరో 12 నుంచి 13 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రావాల్సి ఉందని కానీ బీజేపీ మోసం వల్ల అవి రాలేదన్నారు.
'వాస్తవానికి బీజేపీకి 82 సీట్లు మాత్రమే రావాలి. వారిని పటేళ్లు, ఓబీసీలు, దళితులు, వ్యాపారులు వ్యతిరేకించారు. అలాంటప్పుడు ఇంకెవరు వారిని నమ్మి ఓటు వేస్తారు. నేను నా పోరాటాన్ని కొనసాగిస్తాను. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై దర్యాప్తు చేయించాలని ప్రతిపక్ష నేతలందరికీ లేఖలు రాస్తాను. అలాగే బ్యాలెట్ పేపర్‌తోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తాను. దేశ భవిష్యత్తును నిర్ణయించేది ఈవీఎంలేనా.. ఏటీఎంలనే హ్యాకింగ్ చేస్తున్నారు.. అలాంటి ఈవీఎంలు ఒక లెక్కనా.. వాటిని హ్యాకింగ్ చేయలేరా. సూరత్, రాజ్‌కోట్, అహ్మదాబాద్‌లలో కచ్చితంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు' అని హార్ధిక్ అన్నారు.
'ఏటీఎంలే హ్యాక్ చేస్తుంటే.. ఈవీఎంలు ఒక లెక్కా?'
Published Wed, Dec 20 2017 9:30 AM | Last Updated on Tue, Aug 21 2018 2:39 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment