EVM errors
-
ఈవీఎం ట్యాంపర్ అయిందా? లేదా?.. చెక్ లిస్ట్‌తో చూసుకోండిలా..
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల ఆరు విడతల పోలింగ్ పూర్తి అయింది. మరో విడత జూన్ 1తో ముగుస్తుంది. దేశ వ్యాప్తంగా జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎంపీ, సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ అన్ని రాజకీయ పార్టీ, సంబంధిత పోలింగ్ ఏజెంట్లు ఫలితాల రోజు తనిఖీ చేయాల్సిన అంశాల చెక్ లిస్ట్ విడుదల చేశారు. ఫలితాల రోజు ఓట్ల లెక్కింపు కోసం ఈవీఎం మిషన్లను తెరిచే క్రమంలో పాటించాల్సిన సూచనలకు సంబంధించి ఓ చార్ట్ తయారు చేసినట్లు తెలిపారు. ‘‘చాలా మంది ఈవీఎం ట్యాంపర్ అవడానికి అవకాశం ఉందని అంటున్నారు. నేను కచ్చితంగా చెప్పగలను ఈవీఎంలు ట్యాపర్ కావు. ప్రపంచంలో ఈవీఎం మిషన్ ఎక్కడా ట్యాంపర్ కాదు. అందుకే ఈ చెక్ లిస్ట్‌ను విడుదల చేశాం’’ అని కపిల్ సిబల్ అన్నారు.చెక్ లిస్ట్ చార్ట్‌లోని తనిఖీ చేసే అంశాలు ఇవే..1. చార్ట్‌లో కంట్రోల్ యూనిట్ నంబర్, బాలెట్ యూనిట్ నంబర్, వీవీప్యాట్ (VVPAT)ఐడీ ఉంటాయి.2. చార్ట్‌లో మూడో కాలమ్ చాలా ముఖ్యమైంది.4 జూన్2024 అని మూడో కాలమ్‌లో రాసి ఉంటుంది. ఈవీఎం మిషన్ తెరిచిన సమయాన్ని మూడో కాలమ్ కింద రాయాలి.3. ఒక ఒకవేల సమయంలో తేడా వస్తే.. ఆ ఈవీఎం మిషన్ అప్పటికే ఎక్కడో ఒక తెరిచినట్లుగా నిర్ధారణకు రావాలి. కంట్రోల్ యూనిట్(CU) సీరియల్ నంబర్ రాసి ఉన్న ఫార్మాట్లో ఉంటుంది. అక్కడ ఉన్న నంబరల్ మ్యాచ్ చేసుకోవాలి.4. మొత్తం పోలైన ఓట్ల లెక్కింపును జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే కౌంటింగ్ సమయంలో ఓట్లు తేలితే సమస్య ఎదురవుతుంది.5. రెండు అంశాలు గుర్తుపెట్టుకోవాలి.. పై కాలమ్‌లో వెరిఫికేషన్ పూర్తి అయ్యే వరకు రిజల్ట్ బటన్ నొక్కకూడదు. సమయంలో తేడా వస్తే.. వెలువడిన రిజల్ట్ సమయం కూడా తప్పు అవుతుంది.6. అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు అక్కడ కూర్చన్న తర్వాత జాగ్రత్తగా చెక్ లిస్ట్‌లోని మొదిటి కాలమ్‌ను పరిశీలించిన అనంతరం ఈవీఎంలను తెరవాలని కోరకుంటున్నాను.#WATCH: Kapil Sibal's EVM ADVICE To Political Parties, Candidates Ahead Of June 4 COUNTING Kapil Sibal Explains What Polling Agents and Leaders of #IndiaAlliance should do before EVM Machines are Opened For Counting.!🎯IMPORTANT UPDATES:▪️I have made a chart for all the… pic.twitter.com/WigELsaH7W— Gururaj Anjan (@Anjan94150697) May 26, 2024 -
ఓటు వేయకుండానే వెనుదిరిగిన సీఎం జోరాంతంగా.. ఆ తర్వాత
ఐజ్వాల్: ఈవీఎం మొరాయించడంతో మిజోరాం సీఎం జోరాంతంగా ఓటు వేయకుండానే వెనుదిరిగారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి కాసేపు వేచి ఉన్న సీఎం.. అప్పటికీ ఈవీఎం పనిచేయకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చారు. మీడియా సమావేశం తర్వాత మళ్లీ తన ఓటు హక్కుని వినియోగించుకుంటానని స్పష్టం చేశారు. మరికాసేపటి తర్వాత మళ్లీ వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నేడు మిజోరాంలో 40 స్థానాల్లో నేడు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7:00 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. రాజకీయ ప్రముఖుల నుంచి సామాన్య జనం పోలింగ్‌లో పాల్గొన్నారు. ఐజ్వాల్ నార్త్-II అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 19-ఐజ్వాల్ వెంగ్లాయ్ పోలింగ్ స్టేషన్లో ఈరోజు ఉదయం తన ఓటు వేయడానికి సీఎం జోరాంతంగా వెళ్లారు. అదే సమయంలో ఈవీఎం మొరాయించింది. తప్పని స్థితిలో సీఎం జోరాంతంగా వెనుదిరిగారు. మీడియా సమావేశం తర్వాత మళ్లీ తన ఓటు హక్కుని వినియోగించుకుంటానని తెలిపారు. కాసేపయ్యాక మళ్లీ వచ్చి ఓటు వేశారు. రాష్ట్రంలో అసెంబ్లీలోని 40 స్థానాలకు గాను 18 మంది మహిళలు, 27 మంది స్వతంత్రులు సహా 174 మంది అభ్యర్థులు బరిలో దిగారు. మొత్తం 8.57 లక్షల ఓటర్లకుగాను 1,276 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఇదీ చదవండి: ఎన్నికల వేళ మవోయిస్టు పేలుళ్లు.. సీఆర్పీఎఫ్ జవాన్‌కి గాయాలు -
'ఏటీఎంలే హ్యాక్ చేస్తుంటే.. ఈవీఎంలు ఒక లెక్కా?'
సాక్షి, అహ్మదాబాద్ : గుజరాత్ ఎన్నికల్లో తాను కాంగ్రెస్ పార్టీ విజయంకోసం కీలకంగా పనిచేశానని పటేల్ ఉద్యమకారుడు హార్ధిక్ పటేల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి గతంలో 33శాతం ఓట్ల శాతం ఉండేదని అది ఇప్పుడు 43శాతానికి పెరిగిందన్నారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడం వల్లే బీజేపీ గెలిచిందని ఆరోపించారు. మరో 12 నుంచి 13 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రావాల్సి ఉందని కానీ బీజేపీ మోసం వల్ల అవి రాలేదన్నారు. 'వాస్తవానికి బీజేపీకి 82 సీట్లు మాత్రమే రావాలి. వారిని పటేళ్లు, ఓబీసీలు, దళితులు, వ్యాపారులు వ్యతిరేకించారు. అలాంటప్పుడు ఇంకెవరు వారిని నమ్మి ఓటు వేస్తారు. నేను నా పోరాటాన్ని కొనసాగిస్తాను. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై దర్యాప్తు చేయించాలని ప్రతిపక్ష నేతలందరికీ లేఖలు రాస్తాను. అలాగే బ్యాలెట్ పేపర్‌తోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తాను. దేశ భవిష్యత్తును నిర్ణయించేది ఈవీఎంలేనా.. ఏటీఎంలనే హ్యాకింగ్ చేస్తున్నారు.. అలాంటి ఈవీఎంలు ఒక లెక్కనా.. వాటిని హ్యాకింగ్ చేయలేరా. సూరత్, రాజ్‌కోట్, అహ్మదాబాద్‌లలో కచ్చితంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు' అని హార్ధిక్ అన్నారు. -
13న రీ పోలింగ్
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈవీఎం లోపాల కారణంగా జిల్లాలోని ఎనిమిది పోలింగ్ కేంద్రాలలో ఈ నెల 13న రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఎన్నికల సంఘం తగు ఆదేశాలు జారీ చేసిందన్నారు.