ఈవీఎం ట్యాంపర్‌ అయిందా? లేదా?.. చెక్‌ లిస్ట్‌తో చూసుకోండిలా.. | Kapil Sibal releases checklist to verify EVM tampered or not counting on June 4 | Sakshi
Sakshi News home page

ఈవీఎం ట్యాంపర్‌ అయిందా? లేదా?.. చెక్‌ లిస్ట్‌తో చూసుకోండిలా..

Published Mon, May 27 2024 10:50 AM | Last Updated on Mon, May 27 2024 10:50 AM

Kapil Sibal releases checklist to verify EVM tampered or not counting on June 4

ఢిల్లీ: లోక్‌ సభ ఎ‍న్నికల ఆరు విడతల పోలింగ్‌ పూర్తి అయింది. మరో విడత జూన్‌ 1తో ముగుస్తుంది. దేశ వ్యాప్తంగా జూన్‌  4న  ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎంపీ, సీనియర్‌ అడ్వకేట్‌ కపిల్‌ సిబల్‌  అన్ని రాజకీయ పార్టీ, సంబంధిత పోలింగ్‌ ఏజెంట్లు ఫలితాల రోజు తనిఖీ చేయాల్సిన అంశాల చెక్‌ లిస్ట్‌ విడుదల చేశారు. 

ఫలితాల రోజు ఓట్ల లెక్కింపు కోసం ఈవీఎం మిషన్లను తెరిచే క్రమంలో  పాటించాల్సిన సూచనలకు సంబంధించి ఓ  చార్ట్‌ తయారు చేసినట్లు తెలిపారు. ‘‘చాలా మంది ఈవీఎం ట్యాంపర్‌ అవడానికి అవకాశం ఉందని అంటున్నారు. నేను కచ్చితంగా చెప్పగలను ఈవీఎంలు ట్యాపర్‌ కావు. ప్రపంచంలో ఈవీఎం మిషన్‌ ఎక్కడా ట్యాంపర్‌ కాదు. అందుకే ఈ చెక్‌ లిస్ట్‌ను విడుదల చేశాం’’ అని కపిల్‌ సిబల్‌ అన్నారు.

చెక్‌ లిస్ట్‌ చార్ట్‌లోని తనిఖీ చేసే అంశాలు ఇవే..
1. చార్ట్‌లో కంట్రోల్‌ యూనిట్‌ నంబర్‌, బాలెట్‌ యూనిట్‌ నంబర్‌, వీవీప్యాట్‌ (VVPAT)ఐడీ  ఉంటాయి.
2. చార్ట్‌లో మూడో కాలమ్‌ చాలా ముఖ్యమైంది.4 జూన్‌2024 అని మూడో కాలమ్‌లో రాసి ఉంటుంది. ఈవీఎం మిషన్‌ తెరిచిన సమయాన్ని మూడో కాలమ్‌ కింద రాయాలి.
3. ఒక  ఒకవేల సమయంలో తేడా వస్తే.. ఆ ఈవీఎం మిషన్‌ అప్పటికే ఎక్కడో ఒక తెరిచినట్లుగా నిర్ధారణకు రావాలి. కంట్రోల్‌ యూనిట్‌(CU) సీరియల్‌ నంబర్‌ రాసి ఉన్న ఫార్మాట్‌లో ఉంటుంది.  అక్కడ ఉన్న నంబరల్‌ మ్యాచ్‌ చేసుకోవాలి.
4. మొత్తం పోలైన ఓట్ల లెక్కింపును జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే కౌంటింగ్‌ సమయంలో ఓట్లు తేలితే సమస్య ఎదురవుతుంది.
5. రెండు అంశాలు గుర్తుపెట్టుకోవాలి.. పై కాలమ్‌లో వెరిఫికేషన్‌ పూర్తి అయ్యే వరకు రిజల్ట్‌ బటన్ నొక్కకూడదు. సమయంలో తేడా వస్తే.. వెలువడిన రిజల్ట్‌ సమయం కూడా తప్పు అవుతుంది.
6. అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు అక్కడ కూర్చన్న తర్వాత జాగ్రత్తగా చెక్‌ లిస్ట్‌లోని మొదిటి కాలమ్‌ను పరిశీలించిన అనంతరం ఈవీఎంలను తెరవాలని కోరకుంటున్నాను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement