Evm machines
-
‘సుప్రీం’ బోనులో ఈసీ
ఎన్నికల షెడ్యూల్ ప్రకటన సందర్భాల్లో తప్ప వినబడని ఎన్నికల సంఘం(ఈసీ) పేరు ఇటీవలి కాలంలో తరచు వార్తల్లోకెక్కుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ మొదలుకొని ప్రచారం వరకూ... ఆ తర్వాత ఎన్నికల్లో పోలైన వోట్ల శాతం, వాటి లెక్కింపు, ఫలితాల ప్రకటన వరకూ అన్ని దశల్లోనూ ఈసీపై నిందలు తప్పటం లేదు. తాజాగా ప్రజాతంత్ర సంస్కరణల సంఘం (ఏడీఆర్) దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం విచారిస్తున్న సందర్భంగా ఈవీఎంల పరిశీలన ప్రక్రియ అమల వుతుండగా వాటి డేటాను తొలగించవద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించాల్సి వచ్చింది. నిరుడు ఏప్రిల్‌లో ఈ విషయమై ఇచ్చిన ఆదేశాలను సరిగా అర్థం చేసుకుని, సక్రమంగా పాటిస్తే ఇలా చెప్పించుకోవాల్సిన స్థితి ఈసీకి ఉండేది కాదు. ఈవీఎంలనూ, దానికి అనుసంధానించి వుండే ఇతర యూనిట్లనూ భద్రపరిచే విషయమై సుప్రీంకోర్టు అప్పట్లో కీలక ఆదేశాలిచ్చింది. అవి సరిగా పాటించటం లేదని ఏడీఆర్ మరోసారి కోర్టును ఆశ్రయించింది. ఎన్నికల్లో పరాజితులై 2, 3 స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు కనుక ఆ ఎన్నికను సవాలు చేసిన సందర్భాల్లో తనిఖీ చేయడానికి అనువుగా ఈవీఎంలతోపాటు, వాటిలో పార్టీల గుర్తులను లోడ్ చేయటానికి ఉపయోగించే సింబల్ లోడింగ్ యూనిట్ (ఎస్ఎల్యూ)లను సైతం 45 రోజులపాటు భద్రపరచాలని సుప్రీంకోర్టు ఈసీని ఆదేశించింది. ఎన్నికల ఫలితంపై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయటానికి పరాజిత అభ్యర్థులకుండే 45 రోజుల వ్యవధిని దృష్టిలో పెట్టుకుని ధర్మాసనం ఇలా ఆదేశించింది. అసెంబ్లీ నియో జకవర్గ పరిధిలోని 5 శాతం ఈవీఎంలు, ఎస్‌ఎల్‌యూలను ఇంజనీర్ల, ఉత్పత్తిదారుల సమక్షంలో తనిఖీకి అనుమతించవచ్చని సూచించింది. వీవీ ప్యాట్ స్లిప్‌లను లెక్కించే యంత్రాలు సమకూర్చు కునే ఆలోచన చేయాలని కూడా ఆ సందర్భంగా కోరింది. ఈ ఆదేశాల ఆంతర్యమేమిటో సుస్పష్టం. ఎన్నికలు న్యాయబద్ధంగా జరగడమే కాదు... అలా జరిగినట్టు కనబడాలంటే అంతా పారదర్శకంగా ఉండాలన్నది ధర్మాసనం ఉద్దేశం. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల అనంతరం ఈవీఎంలూ, వీవీప్యాట్‌లూ, ఎస్ఎల్యూల పరిశీలన విషయంలో ఈసీ కొన్ని నియమ నిబంధనలు విడుదల చేసింది. న్యాయస్థానం ఆదేశాలకూ, ఆ నియమ నిబంధనలకూ ఎక్కడా పొంతన లేదు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనూ 5 శాతం ఈవీఎంలు తనిఖీ చేయాలని ధర్మాసనం ఇచ్చిన ఆదేశానికి ఈసీ వేరే రకమైన భాష్యం చెప్పింది. వినియోగించిన ఈవీఎంలలో ఏ పార్టీకి ఎన్ని వోట్లు లభించాయో చూసి, వీవీ ప్యాట్ స్లిప్‌లు దానికి అనుగుణమైన సంఖ్యలో ఉన్నాయా లేదా అన్నది తేలిస్తే వేరే రకంగా ఉండేది. కానీ ఈసీ చేసిందల్లా ఇతరత్రా గుర్తులతో మళ్లీ నమూనా పోలింగ్ నిర్వహించి ఈవీఎంల డేటాకూ, వీవీప్యాట్ స్లిప్‌ల సంఖ్యకూ మధ్య తేడా లేదని నిరూపిస్తే చాలని భావించింది. అంతేకాదు... ఆ నమూనా పోలింగ్ కోసం ఈవీఎంలలోని డేటాను ఖాళీ చేసింది! ఈవీఎంలు సరిచూడాలని అభ్య ర్థులు కోరటం అంటే తమ సమక్షంలో ఈవీఎంలలో ఉన్న సాఫ్ట్‌వేర్‌నూ, హార్డ్వేర్నూ ఇంజనీర్లు పరిశీలించాలని... వీవీ ప్యాట్ స్లిప్‌ల సంఖ్య ఈవీఎంల డేటాతో సరిపోయిందో లేదో చూడాలని అడగటం. ఈసీ అనుసరించిన ప్రక్రియకూ, అభ్యర్థులు కోరుకునేదానికీ పొంతన ఎక్కడైనా ఉందా? ఈ మాత్రానికే అభ్యర్థులనుంచి ఈవీఎంకు రూ. 40,000 చొప్పున వసూలు చేయటం సిగ్గనిపించ లేదా? చిత్రమేమంటే... ఒక్కో ఈవీఎం తయారీకి ఖర్చయ్యేది కేవలం రూ. 30,000! గత లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, ఒడిశాల నుంచి 11 మంది అభ్యర్థులు ఈవీఎంలూ, వీవీప్యాట్ స్లిప్‌ల పరిశీలన కావాలన్నారని, అంతా పూర్తయ్యాక ఎక్కడా తేడా కనబడలేదని ఈసీ తేల్చింది. దేశవ్యాప్తంగా చూస్తే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇటువంటి అభ్యర్థనలే 83 వరకూ రాగా, అంతా సవ్యంగానే ఉన్నదని నిర్ధారణ అయిందని వివరించింది. ఆంధ్రప్రదేశ్‌లో 45 రోజులలోపు ఈవీఎంల డేటా తొలగించరాదన్న నిబంధనను సైతం ఈసీ ఉల్లంఘించింది. ఒకపక్క ఈవీఎంల పనితీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతుండగా ఇలా చేయటం అనుమానాలను మరింత పెంచుతుందన్న ఇంగితజ్ఞానం దానికి లేకపోయింది.మేమిచ్చిన ఆదేశాలేమిటో, మీరు అనుసరించిన ప్రక్రియేమిటో వివరిస్తూ వచ్చే నెల 3లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఈసీని ఆదేశించటం హర్షించదగ్గది. అసలు 45 రోజుల్లోపే డేటాను ఎందుకు తొలగించాల్సివచ్చిందో కూడా ఈసీనుంచి సంజాయిషీ కోరాలి. ఇక పోలింగ్ శాతంపై ఈసీ విడుదల చేసిన ప్రకటనలు మరింత చిత్రంగా ఉన్నాయి. ఏడు దశల్లో జరిగిన పోలింగ్‌లో 3.2 శాతం నుంచి 6.32 శాతం వరకూ వోట్లు పెరిగినట్టు ఈసీ తేల్చింది. ఈ పెరిగిన వోట్ల శాతం ఆంధ్రప్రదేశ్‌లో 12.54 శాతం, ఒడిశాలో 12.48 శాతం ఉంది. పోలింగ్ ముగిసిన రాత్రి ఏపీలో 68 శాతం వోట్లు పోలయ్యాయని ప్రకటించగా, తుది ప్రకటనలో అది కాస్తా 81 శాతానికి ఎగబాకింది. ఈవీఎంల చార్జింగ్ పెరగటం మరో కథ! ఈ మార్పుల వెనకున్న మంత్రమేమిటో చెప్తే అందరూ విని తరిస్తారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ ఎంతో నిష్ఠగా నిర్వహించాల్సిన క్రతువు. ఒక రాజ్యాంగ సంస్థ అయివుండి, నిష్పక్షపాతంగా, నిక్కచ్చిగా వ్యవహరించాల్సిన ఈసీ అందుకు భిన్నమైన పోకడలను ప్రదర్శించటం దానికి ఎంతమాత్రమూ గౌరవప్రదం కాదు. ఈసీ తీరు గమనించాక చాలామంది మళ్లీ బ్యాలెట్ పత్రాలకు మళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. ఈసీ బాణీ మారకపోతే చివరకు బ్యాలెట్ పత్రం విధానం కోసం జనం ఎలుగెత్తే రోజులు రావటం ఖాయం. -
ఇది మాయ కాక మరేమిటి?
నిరూపించ లేనంత మాత్రాన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రా (ఈవీఎం)ల వినియోగ ప్రక్రియలో తప్పులే లేవనో, తప్పిదాలకు ఆస్కారమే లేదనో ధ్రువీకరించినట్టు కాదు. అభియోగాలు మోపేవారు అందుకు హేతువును, తమ సందేహాలకు కారణాలను, తగు సాక్ష్యాధారాలను సంబంధిత వ్యవస్థల దృష్టికి తీసుకు రావాలి. వాటిని స్వీకరించి బాధ్యులైన వ్యక్తులు, సంస్థలు లోతుగా పరిశీలన జర పాలి. అభియోగాలకు ఆధారాలున్నాయో లేదో, అవి తప్పో, కాదో తేల్చాలి. ఈ మొత్తం ప్రక్రియలో పారదర్శకత, జవాబు దారీతనం ముఖ్యం. అది జరగటం లేదు.అయిందానికి, కానిదానికి నిత్యం పరస్పరం విమర్శించుకునే రాజకీయ పార్టీలు ఈవీఎంల విషయంలో అనుసరించే ద్వంద్వ వైఖరి వారి ఆరోపణలకు పస లేకుండా చేస్తోంది. దాంతో వివాదం ప్రాధాన్యత లేకుండా పోతోంది. కానీ, కొన్ని రాజకీయేతర తటస్థ సంఘాలు, సంస్థలు కూడా అభ్యంతరాలు లేవనెత్తాయి. పోలింగ్ శాతాల సమాచారంలో వ్యత్యాసాలను ఎత్తిచూపుతూ, బహిరంగ ప్రజాభిప్రాయానికి విరుద్ధ ఫలితాలనూ... ఈవీఎంల దుర్వినియోగానికి గల ఆస్కారాన్నీ అవి ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చినా... తగిన స్పందన లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఓట్ ఫర్ డెమాక్రసీ (వీఎఫ్‌డీ), అసోసియేషన్ ఫర్ డెమాక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్), సిటిజన్ కమిషన్ ఆన్ ఎలక్షన్ (సీసీఈ) వంటి పౌర సంఘాలు నిర్దిష్టంగా ఫిర్యాదులు చేసినా వాటిని పరిగణనలోకి తీసుకుంటున్న దాఖలాలు లేవు. రాజకీయ పక్షాల నుంచే కాక ప్రజాసంఘాలు, సంస్థల నుంచి నిర్దిష్ట ఆరోపణలు చేసినపుడు కూడా ‘నిరాధారం’, ‘దురుద్దేశ పూర్వకం’ అంటూ, కనీస విచారణైనా జరుపకుండానే ఎన్నికల సంఘం కొట్టిపారేస్తోందన్నది వారిపై ప్రధాన అభియోగం!ఓటు వ్యత్యాసాల పైనే సందేహాలుసాయంత్రం వరకు పోలింగ్ సరళి ఒక విధంగా ఉండి, ముగింపు సమయాల్లో అనూహ్య, అసాధారణ ఓటింగ్ శాతాలు నమోదు కావడం, అలా ఎన్నికల అధికారి రాత్రి ఇచ్చిన గణాంకాలకు భిన్నంగా ఓట్ల లెక్కింపు ముందరి ‘లెక్క’తేలడం పట్ల సందేహాలున్నాయి. కొన్ని నియోజక వర్గాల్లో ఈ ఓట్ల వ్యత్యాసం భారీగా ఉంటోంది. ఇది సార్వ త్రిక ఎన్నికల్లోనే కాకుండా హరియాణా, జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీల ఎన్నికల సందర్భంగానూ వెల్లడయిందనేది విమర్శ. గణాంకాలు వారి వాదనకు బలం చేకూర్చేవిగానే ఉన్నాయి. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఇలా, ఆఖరు నిమి షపు ఓట్ల వ్యత్యాసం పది శాతానికి పైగా ఉన్న పది జిల్లాల్లోని 44 అసెంబ్లీ స్థానాల్లో 37 ఎన్డీయే పక్షాలు గెలిచాయి. కానీ వ్యత్యాసం 10 శాతం కన్నా తక్కువగా ఉన్న 12 జిల్లాల్లోని 46 సీట్లలో ఎన్డీయే కూటమి 11 సీట్లు మాత్రమే గెలువగలిగింది. ఇటువంటి పరిస్థితి సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ ప్రతిబింబించిందని విమర్శకులంటారు. ఆఖరు నిమిషపు పోలింగ్ శాతపు పెరుగుదల వరుసగా ఐదు విడతల్లో 0.21%, 0.34%, 0.23%, 0.01%, 0.25% నామ మాత్రంగానే ఉండ టంతో ఎన్డీయే కూటమికి రాజకీయంగా ఇదేమీ లాభించ లేదనేది విశ్లేషణ! అందుకే, అక్కడ లోక్ సభ స్థానాల సంఖ్య 62 నుంచి ఈ సారి 36కి పడిపోయింది. జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తొలివిడతలో ‘ఆఖరు నిమిషపు ఓటింగ్ శాతం’ పెరుగుదల 1.79% నమోదుకాగా బీజేపీ 43లో 17 అసెంబ్లీ స్థానాలు నెగ్గింది. కానీ, రెండో విడత పోలింగ్ సందర్భంగా ఓటింగ్ శాతం పెరుగుదల 0.86%కి పరిమితమైనందునేమో, 38లో 7 సీట్లు మాత్రమే గెలువగలిగింది. ఇదంతా ఈవీఎంల మాయా జాలమే అని విమర్శకులంటారు.కళ్లకు కట్టినట్టు గణాంకాలుమహారాష్ట్రలోని అకోట్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాష్ట్ర ఎన్నికల ముఖ్యాధికారిచ్చిన సమాచారం ప్రకారం, పోలింగ్ ప్రక్రియ అన్ని విధాలుగా ముగిసేటప్పటికి ఈవీఎం ద్వారా 2,12,690 ఓట్లు పోలయ్యాయి. లెక్కింపు రోజున ఈవీఎం నుంచి రాబట్టిన ఓట్ల సంఖ్య 2,36,234. అంటే, వ్యత్యాసం 23.544 ఓట్లు. గెలిచిన బీజేపీ అభ్యర్థికి దక్కిన ఆధిక్యత 18,851 ఓట్లు! ఇలా రాష్ట్రవ్యాప్తంగా గమనిస్తే, పోలింగ్ రోజు రాత్రి పొద్దుపోయిన తర్వాత ఎన్నికల సంఘం వారి ‘యాప్’ ద్వారా వెల్లడైన గణాంకాల కన్నా ఓట్ల లెక్కింపు రోజున రమారమి పెరిగిన సంఖ్య ఉన్న నియోజకవర్గాలు తక్కువలో తక్కువ 95 ఉన్నాయనేది వారి వాదన. ఒకే విడత పోలింగ్ జరిగిన నవంబరు 20, సాయంత్రం 6.15 గంటలకు ఒకసారీ, రాత్రి 11.45 గంటలకు ఒకసారీ ఎన్నికల సంఘం అధికారికంగా ఓటింగ్ శాతాలను వెల్లడించింది. సాయంత్రం సమాచారం వెల్లడించే సమయానికి ఇంకా కొన్ని పోలింగ్ స్టేషన్లలో గడువు లోపల ‘క్యూ’లో చేరిన వారందరూ ఓటు వేసే వరకు, ఎంత సమయమైనా ఓటింగ్ ప్రక్రియ కొనసాగు తుందని పేర్కొన్నారు. ప్రక్రియ పూర్తయిన తర్వాత తుది గణాంకాలు రాత్రి ప్రకటించిన సమాచారంలో పేర్కొన్నారు. 288 నియోజకవర్గాల్లో సాయంత్రానికి 58.22% (5,64,88,024 ఓట్లు) పోలయినట్టు తెలిపిన అధికారులు రాత్రి అయ్యేటప్పటికి 65.02% (6,30,85,732 ఓట్లు) నమోదైనట్టు చెప్పారు. అంటే, వ్యత్యాసం 65,97,708 ఓట్లన్న మాట! నవంబరు 22న ఓట్ల లెక్కింపునకు కొన్ని గంటలు ముందు, ‘యాప్’ వెల్లడించిన సమాచారం ప్రకారం, రాష్ట్ర మంతటా నమోదైన ఓట్ల సంఖ్య 6,40,85,095. అప్పుడు పోలింగ్ శాతం 66.05%కి చేరింది. ఏమిటీ వ్యత్యాసాలన్న ప్రశ్న ఈవీఎంలపై శంకకు తావిస్తోంది. 288 నియోజక వర్గాల్లోని 1,00,186 పోలింగ్ బూత్‌లలో సగటున 76 ఓట్ల చొప్పున 76 లక్షల ఓటర్లు, ఎలా గడువు తర్వాత ‘క్యూ’ల్లో నిలుచొని ఓటు వేసి ఉంటారనే ప్రశ్న తలెత్తడం సహజం!సందేహాలను నివృత్తి చేసేవిధంగా ఎన్నికల సంఘం సమా ధానం ఇవ్వాలనే డిమాండ్ వస్తోంది. చైతన్యమే దారిదీపం మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా మాల్శిరాస్ తాలూకా మార్కడ్వాడి అనే చిన్న గ్రామంలో జనం తిరగబడ్డారు. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని, ఓట్ల లెక్కింపు తర్వాత ఆరోపిస్తూ గ్రామస్థులు బ్యాలెట్ ద్వారా ‘మళ్లీ పోలింగ్’ జరపాలని వారికి వారే నిర్ణయించారు. కానీ పోలీస్ ఆంక్షలు విధించి సదరు రీపోల్ను అధికారులు జరుగనీయ లేదు. 13 వేల ఓట్ల ఆధిక్యతతో ఎన్సీపీ (శరద్ పవార్) అభ్యర్థి ఉత్తమ్రావ్ జన్కర్ ఎమ్మెల్యేగా ఎన్నికయి కూడా... ఆ గ్రామంలో ఈవీఎం అవకతవకలతో నష్టం జరిగిందని ఆరో పించారు. కులాల వారిగా, విధేయత పరంగా చూసినా... గ్రామంలో తనకు ఆధిక్యత ఉండగా, తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రామ్ సత్పతే (బీజేపీ)కి 160 ఓట్లు ఎక్కువ రావటం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. రీపోల్ నిర్వహణకు ప్రేరణ కల్పించారు. తమ ఫిర్యాదుకు ఎన్నికల సంఘం స్పందించనందునే రీపోల్ ఆలోచనని గ్రామ ముఖ్యులు పేర్కొన్నారు. రాజకీయ పార్టీల కార్యకర్తలు పోలింగ్ ఏజెంట్లుగా పోలింగ్ ముగిసే సమయంలో, కౌంటింగ్ ఏజెంట్లుగా ఓట్ల లెక్కింపు మొదలెట్టేప్పుడు ఆ యా కేంద్రాల్లో ఉంటారు. వారీ లెక్కలు సరి చూసుకుంటే ఏ ఇబ్బందీ ఉండదనే వాదనొకటుంది. ఈవీఎంలలో మాయ ఉందంటే... దానికి సాక్ష్యాలు, ఆధారాలు కావాలి. అనుమానాలు, గణాంకాల్లో సందేహాలు న్నాయంటే దానికి బాధ్యుల నుంచి సమాధానాలు రావాలి. ప్రజలకు కావాల్సింది... పారదర్శక పాలనా వ్యవస్థలూ, పాలకుల నుంచి జవాబుదారీతనం... దట్సాల్!దిలీప్ రెడ్డి వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్,పీపుల్స్ పల్స్ రీసెర్చి సంస్థ డైరెక్టర్ -
EVMల పనితీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి : వైఎస్ జగన్
-
ఈవీఎంలతో గెలుస్తామంటే కుదరదు అక్కడ!
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు అలియాస్ EVMలు. ప్రతీ ఐదేళ్లకొకసారి ఇవి మనల్ని పలకరిస్తుంటాయి. అయితే వాటి ద్వారా పడిన ప్రతీ ఓటుకు నిజంగా భద్రత ఉంటుందా?. ఈవీఎంలను హ్యక్ చేసి మెజారిటీ ప్రజలిచ్చిన తీర్పును మార్చే అవకాశాలు ఏమాత్రం లేవా? అనే అనుమానాలు కలగడం సహజమే. మొన్నీమధ్య ఏపీ ఎన్నికల టైంలో.. అంతకు ముందు.. మన దేశం సహా ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల టైంలో ఈ తరహా ప్రశ్నలెన్నో తలెత్తాయి. అందుకేనేమో.. అమెరికాలాంటి అగ్రదేశం గత రెండు దశాబ్దాల ప్రయత్నాలతో ఎన్నికల విధానాన్ని ఈవీఎంల నుంచి మళ్లీ బ్యాలెట్‌కు తెచ్చుకుంది. నవంబర్ 5వ తేదీన జరగబోయే పోలింగ్ బ్యాలెట్ పేపర్ల ద్వారానే జరగబోతోంది. 95 శాతం రిజిస్టర్డ్ ఓటర్లు అక్కడ పేపర్‌పై టిక్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. 69.9 శాతం ఓటర్లు హ్యాండ్మార్క్డ్ పేపర్ బ్యాలెట్స్ విధానంలో ఓటేయొచ్చని, అలాగే బ్యాలెట్ మార్కింగ్ డివైజ్లతో(డిజిటల్ బ్యాలెట్.. ఓటేసి అప్పటికప్పుడే ఆ ప్రింట్ బయటకు తీయొచ్చు కూడా) కూడిన పేపర్బ్యాలెట్ ఓటింగ్ వైపు మరో 25.1 శాతం మంది మొగ్గుచూపిస్తారని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ లెక్కన.. కేవలం ఐదు శాతం ఓటర్లు మాత్రం మన దగ్గర ఈవీఎంల తరహా డైరెక్ట్ రికార్డింగ్ ఎలక్ట్రానిక్(DRE) ద్వారా ఓటేసే ఛాన్స్ ఉంది.అక్కడ ఏరకంగా ప్రయత్నించినా ప్రజా తీర్పును మార్చడానికి వీలుండదన్నమాట. ఈవీఎంల మేనిపులేషన్తో గెలవడం అక్కడ ఎంతమాత్రం కుదరదన్నమాట. సాంకేతికతను ముందుగా పుణికిపుచ్చుకునే అమెరికాలో.. ఈ తరహా ఓటింగ్ ఇంకా జరుగుతుండడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే.. అమెరికాలో 2000 సంవత్సరం దాకా పేపర్ బ్యాలెట్స్ ఓటింగ్ జరిగేది. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ వైపు అడుగులేసింది. ఓటర్లు డీఆర్ఈ లేదంటే పేపర్ బ్యాలెట్ ద్వారా ఓటేసే వీలు కల్పించారు. 2006 మధ్యంతర ఎన్నికల టైంలో 41.9 శాతం ఓటింగ్ డీఆర్ఈ వ్యవస్థ ద్వారానే జరిగింది. అయితే విదేశీ కుట్రలకు అవకాశం, హ్యాకింగ్ ఆరోపణల నేపథ్యంలో డీఆర్ఈపై అక్కడి ఓటర్లలోనూ నమ్మకం సన్నగిల్లింది. 2008 ఎన్నికల నుంచి డీఆర్ఈను ఓటర్లు తిరస్కరిస్తూ వచ్చారు. 2016 అమెరికా ఎన్నికల టైంలో రష్యా జోక్యం ఆరోపణలతో పూర్తిగా వాటిని పక్కన పడేశారు అక్కడి ఓటర్లు.అందుకే అనుమానాలుఈవీఎం 'అన్లాకింగ్'పై రాజకీయ దుమారం కొత్తేం కాదు. మన దేశంలో ఈసీ అందుకు అవకాశమే లేదని చెబుతున్నా.. కొన్ని ఎన్నికల ఫలితాలతో ప్రజల్లోనూ వాటి వాడకంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఏపీ ఎన్నికల ఫలితాల టైంలో నడిచిన చర్చే ఇందుకు ఉదాహరణ. ఈ తరుణంలో ఆధునిక ఈవీఎంల వాడకం బదులు సంప్రదాయ రీతిలో పేపర్ బ్యాలెట్‌ను ఉపయోగించాలనే అంశాన్ని కొందరు తెరపై తెచ్చారు. ఈ క్రమంలో..ఇదీ చదవండి: ఈవీఎంలపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్ఎలక్ట్రానిక్స్, ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల మీద సమారు అరవై ఏళ్ల పాటు నేను పనిచేశాను. ఈవీఎం యంత్రాల వ్యవస్థనూ క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యమే. దీని వల్ల ఫలితాలు తామరుమారవుతాయి. ఈవీఎంల కంటే పాత బ్యాలెట్ పేపర్ విధానమే చాలా ఉత్తమమైంది. ఇందులో అయితే ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు జరగవు. బ్యాలెట్ విధానాన్నే ఎన్నికల్లో అనుసరించాలి.:::కాంగ్రెస్ నేత శ్యామ్పిట్రోడాభారత్లో వాడే ఈవీఎంలు అమెరికాలో వాడే తరహావి కావు. ఇక్కడి ఈవీఎంలు కంప్యూటర్ ప్లాట్‌ఫాం మీద తయారు చేయలేదు. వాటికి బయటి నుంచి ఎలాంటి నెట్‌వర్క్‌తో అనుసంధానించే అవకాశమే లేదు. రీ ప్రోగ్రామింగ్ కూడా వీలు లేదు. ఇలాంటి పరికరాలను హహ్యాక్ చేయడం కుదరదు. కావాలంటే ప్రపంచ దేశాలు భారత ఈవీఎంలను వారి ఎన్నికల్లో వాడుకోవచ్చు.:: కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్భారత్లో వాడుతున్న ఈవీఎంలకు సైబర్ సెక్యూరిటీ పరంగా ఎలాంటి రక్షణ ఉందనేది మనకెవరికీ తెలియదు. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ సిస్టమ్‌కు సంబంధించి ఈవీఎంలు ISO 27001 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనేది నిపుణులు తేల్చాలి. ఈవీఎంల భద్రతకు ఎలాంటి సైబర్ సెక్యూరిటీ ప్రోటోకాల్‌ను వాడుతున్నారనేది ఇప్పటివరకు బహిర్గతమవలేదు. ఎవరికీ తెలియదు.::: సైబర్ లా నిపుణుడు పవన్ దుగ్గల్ఈవీఎంలను మనం తొలగించాలి. వీటిని వ్యక్తులు లేదంటే ఏఐ సాయంతో హ్యాక్ చేసే ప్రమాదం. ఇది ఏ దేశానికైనా నష్టమే కలిగిస్తుంది.:: ప్రముఖ బిలీయనీర్ ఎలాన్ మస్క్ఇదీ చదవండి: మీకు తెలుసా? ఈ దేశాల్లో పేపర్ బ్యాలెటే ముద్దునిపుణుల నుంచి సామాన్యుల దాకా ఈవీఎంల వాడకంపై ఎవరి అభిప్రాయాలు వారు చెబుతుంటారు. కానీ, ఈ మధ్యకాలంలో పాపులర్ టెక్నాలజీ నిపుణులు కూడా వాటి పని తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తుండడం చూస్తున్నాం. దీంతో ఈవీఎంలపై అనుమానాలకు శాస్త్రీయ నివృత్తి అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. ఈవీఎంలపై ఇంతమంది ఇన్ని అభిప్రాయాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నపుడు ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ వాడితేనే బెటరని సామాన్యులతో పాటు పార్టీల అధినేతలు సూచిస్తున్నారు. ఈవీఎంలు వాడకంలో అయ్యే ఖర్చుతో పోలిస్తే బ్యాలెట్ విధానంలో ఖర్చు కొద్దిగా పెరిగినప్పటికీ, ఎన్నికల ప్రక్రియ కొంత ఆలస్యమైనప్పటికీ ఓటర్లకు ప్రజాస్వామ్యంపై పూర్తి నమ్మకం కలగాలంటే బ్యాలెట్ పేపరే బెస్ట్ అనే వాదన వినిపిస్తోంది. ‘‘పేపర్ బ్యాలెట్‌తో ఓటర్ల విశ్వాసాన్ని పెంచవచ్చు. మనలాంటి ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటమే కాకుండా అభివృద్ధి చెందేలా చూడాలి. రెండింటినీ నిర్ధారించడానికి ఏకైక మార్గం, పేపర్ బ్యాలెట్‌కి తిరిగి వెళ్లడం. USA, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, నార్వే మరియు డెన్మార్క్‌లతో సహా చాలా అభివృద్ధి చెందిన దేశాలు పేపర్ బ్యాలెట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు, మనం ప్రపంచంలోని ఇతర దేశాలతో మార్పులు చేసి పేపర్ వైపు వెళ్లే సమయం ఇది. బ్యాలెట్, ఇది ఓటర్ల విశ్వాసాన్ని పెంచుతుంది. విశ్వాసాన్ని నింపేందుకు చట్టసభ సభ్యులు ముందుకు రావాలి’’:::హర్యానా ఎన్నికలపై.. ఎగ్జిట్‌పోల్స్‌కు విరుద్ధంగా వెలువడిన ఫలితాలపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ట్వీట్ -
ఈవీఎంల సహాయంతో కాదయ్యా సార్ అన్నది!
-
ఈవీఎంల హ్యాకింగ్ చాలా సులభం: ఎలన్ మస్క్
సాక్షి, అమరావతి: ఈవీఎంలను (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు) చాలా సులభంగా హ్యాక్ చేయవచ్చని టెక్ దిగ్గజం, టెస్లా అధినేత ఎలన్ మస్క్ పునరుద్ఘాటించారు. పారదర్శకత కోసం బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహించాలని మరోసారి గట్టిగా సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంతో ఇష్టపడే నిపుణుడిగా తాను ఈ మాట చెబుతున్నట్లు స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ తరపున ప్రచారం నిర్వహిస్తున్న ఎలన్ మస్క్ రెండు రోజుల క్రితం పెన్సిల్వేనియాలోని ఫిలడెలి్ఫయాలో జరిగిన బహిరంగ సభలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.ఓ అభ్యర్థి గెలిచేలా రీ ప్రోగ్రామింగ్ చేయవచ్చు..ఈవీఎంల పనితీరుపై ఎలన్ మస్క్ తొలి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈవీఎంలలో కాలం చెల్లిన మైక్రోసాఫ్ట్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నారని, దీంతో వీటిని హ్యాక్ చేయడం అత్యంత సులభమని, ఈ విషయాన్ని ఒక టెక్నాలజీ నిపుణుడిగా చెబుతున్నట్లు జూలైలో మస్క్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. 2017లో సెనేట్ ఇంటెలిజెన్స్ విచారణలో ఈ విషయం బయటపడిందని, ఓ అభ్యర్థి గెలిచే విధంగా ఓట్లను దొంగిలిస్తూ ఈవీఎంలను రీ ప్రోగ్రామింగ్ చేయవచ్చని స్పష్టం చేశారు. అమెరికా ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ సహా మరే విధంగానూ ఎల్రక్టానిక్ ఓటింగ్ పద్ధతిని వినియోగించకూడదని మస్క్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.ఈవీఎంల సాఫ్ట్వేర్ ఉత్తమం కాదు.. ‘ఈవీఎంలను చాలా సులభంగా హ్యాక్ చేయవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వం ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌ను ఇంకా చాలా తేలిగ్గా హ్యాక్ చేయవచ్చు. నాకు కంప్యూటర్ అంటే ఇష్టం. అయితే కంప్యూటర్లు ఓటింగ్ ట్యాబ్‌లేషన్‌ను కలిగి ఉండకూడదు. ఈవీఎంల్లో వినియోగిస్తున్న సాఫ్ట్వేర్ ఉత్తమమైనది కాదు. ఎన్నికల్లో పేపరు బ్యాలెట్లు మాత్రమే ఉపయోగించాలి. ప్రతి వ్యక్తి నేరుగా పోలింగ్ బూత్ వద్దకు వచ్చి లైన్లో నిలబడి ఓటింగ్ హక్కు వినియోగించుకోవాలి’ అని మస్క్ పేర్కొన్నారు. ఈవీఎంల ద్వారా భారత్‌లో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ తీరుపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా ఎలన్ మస్క్ వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారి తీశాయి. ఈవీఎంల ద్వారా కాకుండా పారదర్శకత కోసం బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సైతం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. -
ఈవీఎంలపై సందేహాలను ఈసీ నివృత్తి చేయాలి: ఎంపీ కపిల్ సిబల్
న్యూఢిల్లీ: హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలలో తేడాలపై కాంగ్రెస్ లేవనెత్తిన సందేహాలను ఎన్నికల సంఘం (ఈసీ) నివృత్తి చేయాలని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ గురు, శుక్రవారాల్లో ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈసీకి ఆధారాలు అందజేస్తున్నామని, తమ సందేహాలను ఎన్నికల సంఘం నివృత్తి చేయాల్సి ఉందని కపిల్ సిబల్ అన్నారు. ‘ఈవీఎంల దుర్వినియోగం జరుగుతోందనే భావిస్తున్నా. అయితే అది ఏమేరకు జరుగుతోందనేది నేను చెప్పలేను. ఈవీఎంల వాడకానికి నేను మొదటినుంచి వ్యతిరేకమే. పారదర్శకత లేనిదేనైనా ఆమోదయోగ్యం కాదు’ అని కాంగ్రెస్ మాజీ నాయకుడు సిబల్ అన్నారు. హరియాణాలో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయని కాంగ్రెస్ ఆరోపించింది. ఈవీఎంల బ్యాటరీలు 80 శాతం కంటే తక్కువ ఉన్నచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యాన్ని కనబర్చారని, 99 శాతం చార్జింగ్ ఉన్న ఈవీఎంలలో బీజేపీకి అనుకూల ఫలితాలు వచ్చాయనేది కాంగ్రెస్ ఆరోపణ. -
ఏపీ ఎన్నికల్లో ఈవీఎంల గోల్ మాల్
-
BIG Queation: ఈసీ బండారం బట్టబయలు.. సుప్రీం ఆర్డర్లు పక్కనపెట్టి లెక్కలు చెప్పమంటే నీళ్లు నములుతూ..
-
ఆగిపోయిన ఈవీఎంల లెక్కింపు బయటకు వచ్చిన బాలినేని
-
నిలిచిపోయిన ఈవీఎం వెరిఫికేషన్
-
మాక్ పోలింగ్ వెరిఫికేషన్ ఏర్పాట్లపై బాలినేని అభ్యంతరం
-
నేడు ఒంగోలులో EVM చెకింగ్ అండ్ రీ వెరిఫికేషన్ ప్రక్రియ
-
ఈవీఎంల గోల్మాల్.. తెరపైకి బ్యాలెట్.. ఇది అత్యవసర సమస్యే!
దేశ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎంలు) చర్చనీయాంశం అవుతున్నాయి. అంతర్జాతీయ సాంకేతిక నిపుణుడు ఎలాన్ మస్క్, మరో ప్రముఖుడు శ్యామ్ పిట్రోడా, ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తదితరులు ఈవీఎంలపై చేసిన ట్వీట్ లు సహజంగానే అందరి దృష్టిని ఆకరర్షిస్తాయి. న్యాయం చేయడం కాదు.. న్యాయం జరిగినట్లు కనిపించాలన్న సూత్రాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉటంకించారు. అలాగే ప్రజాస్వామ్యం ఉందని అనుకోవడం కాకుండా, ప్రజాస్వామ్యం నిస్సందేహంగా అమలు అవుతున్నట్లు కనిపించాలని ఆయన అన్నారు.ప్రపంచవ్యాప్తంగా, ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్న దేశాలలో ఈవీఎం ల బదులు, బాలెట్ పత్రాలనే వాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య స్పూర్తిని కాపాడడానికి మనం కూడా ఆ దిశగా వెళ్లాలని ఆయన అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ట్వీట్ చేయడంపై అధికార పక్షం తెలుగుదేశం అభ్యంతరం చెప్పవచ్చు. ఆ ప్రకారమే ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా మాట్లాడలేదు కానీ, ఆయన ఆ పార్టీ నేతలు కొందరు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. 2019 ఎన్నికలలో 151 సీట్లతో వైఎస్సార్సీపీ గెలిచిన ఘట్టాన్ని వారు ప్రస్తావిస్తున్నారు.విశేషం ఏమిటంటే 2009, 2019లలో టీడీపీ ఓడిపోయినప్పుడు తెలుగుదేశం పార్టీ ఈవీఎంలపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. 2009 లో అయితే చంద్రబాబు తన అనుచరుడు ఒకరు తీసుకు వచ్చిన ఈవీఎం తో అవి ఎలా హాక్ చేయవచ్చో తెలియచేస్తూ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ తర్వాత 2014లో విభజిత ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఆయన ఏమీ మాట్లాడలేదు. వైఎస్సార్సీపీ 67 సీట్లకే పరిమితం అయింది. అయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దానిపై ఏమీ ఆరోపణ చేయలేదు. ప్రతిపక్షంగా వ్యవహరించి ప్రజాక్షేత్రంలో పని చేసుకుంటూ సాగారు. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. అప్పుడు టీడీపీ ఈవీఎం లపై అనుమానాలు వ్యక్తం చేయకపోలేదు.ఆ సమయంలో సహజంగానే వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. 2024లో వైఎస్సార్సీపీ మామూలుగా ఓడిపోయి ఉంటే పెద్దగా పట్టించుకునేవారు కాదు. ప్రజలలో వ్యతిరేకత ఏర్పడిందేమోలే అనుకునేవారు. అలాకాకుండా ఎవరూ ఊహించని రీతిలో కేవలం పదకుండు స్థానాలకే వైఎస్సార్సీపీ పరిమితం అవడంతో ఈవీఎం లపై అనుమానాలు పెల్లుబుకుతున్నాయి. నిజానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఆ స్థాయిలో ప్రజలలో వ్యతిరేకత లేదన్నది ఎక్కువమంది అభిప్రాయం. 2014లోనే 67 సీట్లు వస్తే, ఐదేళ్ల అధికారం తర్వాత, అనేక హామీలు అమలు చేసిన తర్వాత కేవలం 11 సీట్లే ఎలా వస్తాయన్నది పలువురి ప్రశ్నగా ఉంది.ఈవీఎం లపై సందేహాలు వచ్చినా, ప్రభుత్వపరంగా, లేదా పార్టీపరంగా జరిగిన లోటుపాట్లపైనే వైఎస్సార్సీపీ వర్గాలు దృష్టి పెట్టి చర్చించుకున్నాయి. కానీ ప్రపంచ ప్రఖ్యాత సాంకేతిక నిపుణుడు, టెస్లా కార్ల అధిపతి ఎలాన్ మస్క్ ఈవీఎం లపై చేసిన వ్యాఖ్యలతో అందరిలోను దీనిపై ఆలోచన ఆరంభం అయింది. ఆయన ఈవీఎం లను హాక్ చేయడం, టాంపర్ చేయడం సాధ్యమేనని వ్యాఖ్యానించారు. దానిని మరో నిపుణుడు, భారత్ లో కంప్యూటర్ల శకం ఆరంభించడంలో కీలక పాత్ర పోషించిన శ్యామ్ పిట్రోడా కూడా బలపరిచారు. తాను అరవై ఏళ్లుగా ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్నానని, ఈవీఎం ల పనితీరును అధ్యయనం చేశానని, వాటిని మానిప్యులేట్ చేయడం సాద్యమేనని పేర్కొన్నారు. పేపర్ బాలెట్ వైపు వెళ్లడమే శ్రేయస్కరమని ఆయన వ్యాఖ్యానించారు. తదుపరి దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు కూడా ఈవీఎం లపై ఆరోపణలు చేయడం ఆరంభించాయి.శివసేన నేత ఆదిత్య ఠాక్రే అయితే నేరుగా బీజేపీ ఈవీఎం లను ట్యాంపర్ చేసిందని ఆరోపించారు. కాగా దేశంలో ఎన్నికల అవసరాలకు అరవైలక్షల ఈవీఎం లను సరఫరా చేశామని సంబంధిత సంస్థలు చెబుతుంటే, నలభై లక్షల ఈవీఎం లే తమ వద్ద ఉన్నాయని, మిగిలిన 20 లక్షల ఈవీఎం ల సంగతి తమకు తెలియదని ఎన్నికల సంఘం చెబుతోంది. దీంతో ఇదంతా మిస్టరీగా మారింది. కర్నాటకలో ఈవీఎం ల గోల్ మాల్ జరిగిందని కాంగ్రెస్ నేత, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆరోపించారు. అందువల్లే కర్నాటకలో కాంగ్రెస్ కు తక్కువ పార్లమెంటు సీట్లు వచ్చాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈవీఎం ల టాంపరింగ్ జరిగిందా? హాకింగ్ జరిగిందా? లేక ఈవీఎం లను మార్చివేశారా? అన్న అనుమానాలు ప్రజలలో వ్యాపిస్తున్నాయి.ఈ సందర్భంలో ఏపీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ వెల్లడిచేసిన విషయాలు మరింత సంచలనంగా ఉన్నాయి. ముఖ్యంగా రాయలసీమలో ఒక గ్రామంలో జరిగిన అనుభవాన్ని ఆయన వివరించారు. ఆ గ్రామంలో ఎప్పుడూ రిగ్గింగ్ లేదా కొందరు కూర్చుని ఓట్లు ఎవరికి వేయాలా అన్నది డిసైడ్ చేసి ఆ ప్రకారం చేస్తుంటారట. అందులో ఒక పార్టీకి అధిక ఓట్లు వేసి, ఎదుటి పార్టీకి కూడా కొన్ని ఓట్లు వేస్తారట. కానీ చిత్రంగా తాము తక్కువ ఓట్లు వేసిన పార్టీకి మెజార్టీ వచ్చినట్లు కౌంటింగ్ లో వెల్లడైందని, ఇదెలా సాద్యమని వారు ప్రశ్నిస్తున్నారట. ఆ గ్రామం, తనకు చెప్పిన వ్యక్తుల గురించి బహిరంగంగా వెల్లడించి ఎన్నికల కమిషన్ ను ఉండవల్లి అరుణకుమార్ నిలదీయగలిగితే, దీనిపై ఆయన న్యాయపోరాటం చేయగలిగితే మరో చరిత్రను సృష్టించినవారు అవుతారు. ఆయనకు ఆయా రాజకీయ పక్షాలు సహకరిస్తే మంచిదే. సీపీఐ నేత కే నారాయణ కూడా ఇదే తరహాలో ఈవీఎం లను వ్యతిరేకిస్తూ బాలట్ పత్రాలే బెటర్ అని స్పష్టం చేస్తున్నారు. అదే టైమ్ లో రాజీవ్ చంద్రశేఖరన్ అనే ప్రముఖుడు మాత్రం ఈ వాదనలను అంగీకరించలేదు. ఎలాన్ మస్క్ చెప్పినట్లు ఏ దేశంలో అయినా టాంపరింగ్ జరుగుతుందేమో కానీ, ఇండియాలో కాదని అన్నారు. ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్ నిర్దిష్టమైన ప్రకటన చేసినట్లు కనిపించలేదు. ఈవీఎం లను సెల్ ఫోన్ ద్వారా మార్చవచ్చని కొందరు, చిప్ లను రహస్యంగా మార్చే అవకాశం ఉందని మరికొందరు, నెట్ కనెక్షన్ లేకపోయినా టాంపర్ చేయవచ్చని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేకంగా కొన్ని రాష్ట్రాలను ఎంపిక చేసుకుని ఈ మానిప్యులేషన్ జరిగిందా అన్నది కొందరి ప్రశ్నగా ఉంది.ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీకి బాగా తక్కువ సంఖ్యలో సీట్లు రావడంతో పలువురు ఆసక్తి కొద్ది ఆరా తీస్తున్నారు. ఆ క్రమంలో అనేక చోట్ల ప్రజలు తాము వైఎస్సార్సీపీకి ఓట్లు వేశామని, అయినా మెజార్టీ టీడీపీకి ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్న ఘట్టాలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. హిందుపూర్ లో వైఎస్సార్సీపీ ప్రాతినిద్యం వహిస్తున్న ఒక వార్డులో ఈ పార్టీకి ఒకే ఓటు వచ్చినట్లు నమోదు అవడం విస్తుపరచింది. 2019లో ఎన్నికల సమయానికి, 2024 ఎన్నికలనాటి పరిస్థితులకు చాలా తేడా ఉందన్న విశ్లేషణలు వస్తున్నాయి. 2019లో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత నెలకొంది. బీజేపీ, జనసేనలు టీడీపీకి దూరం అయ్యాయి. రుణమాఫీ, కాపుల రిజర్వేషన్ వంటి హామీలు నెరవేర్చకపోవడంతో టీడీపీ బాగా అన్ పాపులర్ అయింది.2024లో అందుకు భిన్నమైన వాతావరణం ఉంది. ప్రజలకు నవరత్నాల పేరుతో ఏ హామీలు ఇచ్చారో వాటినన్నిటిని అమలు చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. సిద్దం సభలు, బస్ యాత్ర వంటివి బాగా విజయవంతం అయ్యాయి. పేద వర్గాలన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచాయన్న భావన ఉంది. ప్రతిపక్ష దుష్ప్రచారం ప్రభావం కొంత పడినా, అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోయేంత కాదన్నది ఎక్కువ మంది అభిప్రాయం. టీడీపీ కూటమికి, వైఎస్సార్సీపీకి మధ్య నువ్వా, నేనా అన్నంతగా పోటీ ఉండవచ్చని ఎక్కువ సర్వే సంస్థలు అంచనా వేశాయి. అందుకు విరుద్దంగా ఫలితాలు రావడం అందరిని ఆశ్చర్యపరచింది.కొంతమంది కూటమి పెద్దలు అసెంబ్లీ సీట్లపై పందాలు కాసిన తీరు, మెజార్టీలపై కూడా బెట్టింగ్ లు కాసిన వైనం కూడా అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. అసలు బీజేపీ గెలిచే అవకాశం ఉండదనుకున్న ఒక నియోజకవర్గంలో, తమకు ఇన్నివేల మెజార్టీ వస్తుందంటూ కొందరు నేతలు పందాలు కాశారట. 2019లో వైఎస్సార్సీపీ గెలిచినా మెజార్టీలు కొద్ది నియోజకవర్గాలలో మినహా మరీ అతిగా లేవు. అలాంటిది ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్దులకు వచ్చిన మెజార్టీలు అనూహ్యంగా ఉన్నాయి. అనేకమందికి ఏభైవేలకుపైగా మెజార్టీలు రావడం విస్తుపరుస్తోంది.ఈ నేపథ్యంలోనే ఈవీఎం ల టాంపరింగ్ పై ప్రజలలో డౌట్లు మొదలయ్యాయని అంటున్నారు. మాబోటి వాళ్లం కూడా ఈవీఎం ల టాంపరింగ్ సాధ్యం కాదేమో అనుకున్నప్పటికీ, గత కొద్ది సంవత్సరాలలో టెక్నాలజీ మరింతగా వృద్ది చెందడం, సైబర్ నేరాలు బాగా పెరగడం, హాకింగ్ పై వస్తున్న కథనాల నేపథ్యంలో ఈవీఎం లు కూడా వీటికి అతీతం కాదేమోనన్న డౌటుకు రావల్సి వస్తోంది. అందులోను అంతర్జాతీయ స్థాయి నిపుణులు వ్యక్తం చేస్తున్న అనుమానాల నేపథ్యంలో ఎన్నికల సంఘం వీటిని నివృత్తి చేయడానికి గాను చర్యలు చేపడితే బాగుంటుందనిపిస్తుంది.ఇందుకోసం ఎలాన్ మస్క్ వంటివారిని, భారత్ కు చెందిన కొందరునిపుణులను పిలిచి ఈవీఎం ల ప్రామాణికత, హాకింగ్ అవకాశం ఉందా? లేదా? అనేదానిపై ప్రాక్టికల్ ప్రజెంటేషన్లు తీసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకోవడం అవసరం అనిపిస్తుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలి. తద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత పరిపుష్టం చేయాలని చెప్పాలి. నిజంగానే ఈవీఎం లు ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని తేలితే బాలట్ పత్రాలవైపు మొగ్గు చూపవచ్చు. అమెరికా, జపాన్ వంటి దేశాలలో బాలెట్ పత్రాలనే వాడుతున్నారు.ఇండియాలో బాలెట్ పత్రాల సిస్టమ్ ఉన్నప్పుడు రిగ్గింగ్ వంటి సమస్యలు ఎదురయ్యేవి. వాటిని అరికట్టే విధంగా చర్యలు చేపట్టవచ్చన్నది ఈ పద్ధతికి అనుకూలంగా ఉన్నవారి భావన. మొత్తం మీద ఈవీఎం లపై వచ్చిన డౌట్లను తీర్చకపోతే ఎన్నికల సంఘం తీరుపై కూడా అనుమానాలు వస్తాయి. ఏపీలో ఎన్నికల సంఘం వ్యవహరించిన శైలిపై అనేక ఫిర్యాదులు ఉన్నాయి. కూటమిలోని పార్టీలకు కమిషన్ సహకరించిందన్న అభియోగాలు వచ్చాయి. అందువల్ల ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా పనిచేస్తోందన్న నమ్మకం కలగాలంటే ఈవీఎం లపై వచ్చిన సందేహాలన్నిటిని పరిష్కరించడం అత్యవసరమని చెప్పక తప్పదు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఈవీఎలం భద్రత.. వెరిఫికేషన్ కోసం ఈసీకి ఎనిమిది దరఖాస్తులు
న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల సమయంలో ఈవీఎంల భద్రతపై చర్చ తారా స్థాయికి చేరింది. ఎన్నికల ఫలితాల అనంతరం ఈవీఎంల అంశం దేశ వ్యాప్తంగా మరోసారి దుమారం రేగింది. ఈ క్రమంలో తాజాగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో సంబంధించి మొత్తం ఈవీఎంల తనిఖీ, వెరిఫికేషన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి పదకొండు దరఖాస్తులు అందాయి.ఇందులో లోక్‌సభ ఈవీఎంల కోసం ఎనిమిది, అసెంబ్లీ ఈవీఎంల కోసం మూడు దరఖాస్తులు వచ్చాయి. వైఎస్సార్సీపీ నుంచి విజయనగరంలోని బొబ్బిలి, నెల్లిమర్లలోని ఒక పోలింగ్ కేంద్రంలో వెరిఫికేషన్ కోసం దరఖాస్తు వచ్చింది. అలాగే వైఎస్సార్సీపీ తరపున గజపతినగరం అసెంబ్లీలోని ఒక పోలింగ్ కేంద్రం, ఒంగోలులోని 12 పోలింగ్ కేంద్రాలలో వెరిఫికేషన్ కోసం దరఖాస్తులు అందాయయి.తెలంగాణలో జహీరాబాద్ పార్లమెంట్లో 23 పోలింగ్ కేంద్రాలలో బీజేపీ వెరిఫికేషన్ కోరింది. ఒడిశాలో 12 పోలింగ్ కేంద్రాలలో బీజేడీ వెరిఫికేషన్ కోరింది. అయితే ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేసిన నాలుగు వారాలలో వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. -
ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమే: సెంథిల్
తిరువళ్లూరు: ఈవీఎంల ట్యాంపరింగ్‌పై కాంగ్రెస్ పారీ్టకి ఉన్న అనుమానాల వెనుక బలమైన కారణాలు ఉన్నాయని తిరువళ్లూరు పార్లమెంట్ సభ్యుడు, మాజీ ఐఏఎస్ అధికారి శశికాంత్ సెంథిల్ స్పష్టం చేశారు. ప్రభుత్వ అతిథి గృహంలో బుధవారం కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంథిల్ విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచి్చన తరువాత అన్ని వర్గాల ప్రజలను టార్గెట్ చేసి, కొన్ని వర్గాలకు పంచిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై మాతో పాటు సాధారణ ప్రజలకు కూడా అనుమానం ఉంది. తాము వేసిన ఓటు ఎక్కడికి వెళ్తుందోనని ఆలోచన చేసే స్థాయికి చేరారు. దేశంలో ఈవీఎంలు లేకపోయి ఉంటే బీజేపీ హ్యాట్రిక్ సాధించేదా..? అని ప్రశ్నించారు. ఈవీఎంలను నిషేధించాలన్న తమ పార్టీ విధానానికి ఇప్పటికి కట్టుబడి ఉన్నామన్నారు. ఈవీఎంలను హ్యాక్ చేయడం కుదరదన్న వారే ఎలాన్ మస్క్ సవాలుకు తోక ముడిచారన్నారు. -
ఈవీఎం ట్యాంపరింగ్ పై రాహుల్ గాంధీ, మస్క్ సంచలన వ్యాఖ్యలు
-
హ్యాకింగ్ సాధ్యమేనా ?
-
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను హ్యాక్ చేయొచ్చు, ఎన్నికల్లో వీటిని ఉపయోగించొద్దు... స్పేస్ ఎక్స్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పష్టీకరణ... ఈవీఎంలు బ్లాక్బాక్సుల్లాంటివేనన్న రాహుల్ గాంధీ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
Elon Musk: హ్యాక్ చేయొచ్చు..!
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) పనితీరు, పారదర్శకతపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈవీఎంలలో నమోదైన ఫలితాలను సులభంగా తారుమారు చేయొచ్చని, ఎన్నికల్లో వీటిని ఉపయోగించకపోవడమే మంచిదని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీల యజమాని, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సైతం ఈవీఎంలపై స్పందించారు. ఈ మేరకు తాజాగా ‘ఎక్స్’లో తన అభిప్రాయం వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వినియోగిస్తున్న ఈవీఎంల పనితీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యంత్రాలను హ్యాక్ చేసేందుకు ఆస్కారం ఉందన్నారు. మస్క్ అభిప్రాయాన్ని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మాజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఖండించారు. భారత్‌లో ఉపయోగిస్తున్న ఈవీంఎలు పూర్తిగా సురక్షితమేనని తేల్చిచెప్పారు. దీనిపై మస్క్ ఘాటుగా స్పందించారు. ఏదైనా హ్యాక్ చేయొచ్చని పేర్కొన్నారు. ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాందీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌లు కూడా ఆదివారం స్పందించారు. ఈవీఎంలు ఎవరూ తనిఖీ చేయలేని బ్లాక్‌బాక్సుల్లాంటివేనని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. ‘ఎక్స్’లో ఎలాన్ మస్క్ చేసిన పోస్టును తన ‘ఎక్స్’ ఖాతాల్లో రాహుల్ షేర్ చేశారు. ఈవీఎంల విశ్వసనీయతను అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. రిస్క్ చిన్నదైనా పరిణామం పెద్దదే మనుషులు లేదా కృత్రిమ మేధ(ఏఐ)తో ఈవీఎంలను హ్యాక్ చేసేందుకు ఆస్కారం ఉంది. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను వాడొద్దు. ఎన్నికల నుంచి ఈ యంత్రాలను దూరంగా ఉంచాలి. ఈవీఎంలను హ్యాక్ చేసే రిస్క్ తక్కువగా ఉన్నప్పటికీ అది ముమ్మాటికీ హ్యాకింగే అవుతుంది. రిస్క్ చిన్నదైనా అది పెద్ద పరిణామానికి దారితీస్తుంది.– ఎలాన్ మస్క్, స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీల అధినేత ఎన్నికల ప్రక్రియపై అనుమానాలున్నాయి భారత్‌లో ఉపయోగిస్తున్న ఈవీఎంలు బ్లాక్‌బాక్సుల్లాంటివే. వాటిని తనిఖీ చేయడానికి ఎవరినీ అనుమతించరు. మన దేశంలో అమల్లో ఉన్న ఎన్నికల ప్రక్రియపై తీవ్ర ఆందోళనలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవస్థల్లో జవాబుదారీతనం, పారదర్శకత లోపించినప్పుడు ప్రజాస్వామ్యం ఓ బూటకంగానే మిగిలిపోతుంది – ‘ఎక్స్’లో రాహుల్ గాంధీ ఈవీఎంలు పూర్తి సురక్షితం పూర్తిగా సురక్షితమైన ఎల్రక్టానిక్ పరికరాలను, డిజిటల్ హార్డ్‌వేర్‌ను ఎవరూ తయారు చేయలేరన్న సాధారణ అభిప్రాయం ప్రజల్లో ఉంది. అలా అను కోవడం పొరపాటు. ఈవీఎంలపై ఎలాన్ మస్క్ వ్యక్తం చేసిన భయాందోళలు సమంజసం కాదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను హ్యాక్ చేయడం అమెరికాతోపాటు ఇతర దేశాల్లో సాధ్యమవుతుందేమో గానీ ఇండియాలో ఎంతమాత్రం వీలుపడదు. ఇతర దేశాల్లో ఇంటర్నెట్తో అనుసంధానించిన ఓటింగ్ యంత్రాలను వాడుతుంటారు. ఇండియాలో అలాంటి పరిస్థితి లేదు. ఇంటర్నెట్తో కనెక్ట్ చేసినప్పుడు అవకతవకలు జరిగే అవకాశం ఉండొచ్చు. ఇండియాలో ఈవీఎంలకు ఇంటర్నెట్తో గానీ, బ్లూటూత్‌తో గానీ, వై–ఫైతోగానీ ఎలాంటి అనుసంధానం ఉండదు. ఇవి పూర్తిగా సురక్షితమైనవి. ఫ్యాక్టరీలో పోగ్రామ్ చేసిన ఈవీఎం కంట్రోలర్లను బయట రీప్రోగ్రామింగ్ చేయడం సాధ్యం కాదు. ఇండియాలో ఉపయోగిస్తున్న ఈవీఎంలు, వాటి భద్రత గురించి ఎలాన్ మస్‌్కకు ట్యూషన్ చెప్పడానికి నేను సిద్ధమే – రాజీవ్ చంద్రశేఖర్, కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మాజీ సహాయ మంత్రి ‘‘ఏదైనా(ఏ ఎల్రక్టానిక్ పరికరమైనా) హ్యాక్ చేయొచ్చు’’ – రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యలపై ఎలాన్ మస్క్ ప్రతిస్పందన ఈవీఎంలకు స్వస్తి పలకాలి టెక్నాలజీ అనేది సమస్యలను పరిష్కరించేలా ఉండాలి. అదే టెక్నాలజీ ఒక సమస్యగా మారినప్పుడు దాన్ని పక్కనపెట్టమే మంచిది. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని నిపుణులు ఇప్పటికే నిరూపించారు. ప్రపంచవ్యాప్తంగా ఈవీఎంలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నా యి. ఓటింగ్ యంత్రాలను హ్యాక్ చేస్తున్నట్లు సందేహాలున్నాయి. ఈవీఎం ట్యాంపరింగ్‌పై ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ నిపుణులు సైతం బహిరంగంగా ప్రకటనలు చేశారు. అలాంటప్పుడు మన దేశంలో ఈవీఎంలను బలవంతంగా ఉపయోగించాల్సిన అవసరం ఏమిటి? దీనిపై అధికార బీజేపీ సమాధానం ఇవ్వాలి. ఈవీఎంలకు స్వస్తి పలకాలి. భవిష్యత్తులో జరిగే ఎన్నికలను బ్యాలెట్ పేపర్లతోనే నిర్వహించాలి. – ‘ఎక్స్’లో అఖిలేష్ యాదవ్ దమ్ముంటే హ్యాక్ చేసి చూపించండి ఎలాన్ మస్క్ గానీ, ఇంకెవరైనా గానీ ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని చెబుతున్న వ్యక్తులు భారత ఎన్నికల సంఘాన్ని సంప్రదించాలి. అక్కడ ఈవీఎంను తీసుకొని హ్యాక్ చేసి చూపించాలి. ఇదే మా చాలెంజ్. భారతదేశ ప్రజాస్వామ్యం గురించి రాహుల్ గాంధీ ఎందుకు ఎలాన్ మస్‌్కకు ఫిర్యాదు చేస్తున్నారు? మస్క్ ఏం చేయగలరు? ప్రపంచం ముందు కన్నీళ్లు పెట్టుకోవడం, భారతదేశ ప్రతిష్టను దిగజార్చడం కాంగ్రెస్ డీఎన్ఏలో ఒక భాగమా? వారసత్వ రాజకీయాలను ప్రజలు వరుసగా మూడోసారి తిరస్కరించారు. అయినా ఆ విషయం కాంగ్రెస్‌కు అర్థం కావడం లేదు? – అమిత్ మాలవీయ, బీజేపీ ఐటీ విభాగం ఇన్చార్జి -
ఈవీఎంలు రద్దు చేయాలంటూ ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
-
ఈవీఎంలు రద్దు చేయాలి: మస్క్ సంచలన వ్యాఖ్యలు
ప్రపంచంలోని చాలాదేశాల్లో ఓటింగ్ ప్రక్రియకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ (EVM) ఉపయోగిస్తున్నారు. దీనిపైన ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత 'ఇలాన్ మస్క్' (Elon Musk) కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ఓ ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.ఇటీవల ప్యూర్టో రికో దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో అవకతవకలు జరిగాయని ఇండిపెండెంట్ ప్రెసిడెంట్ అభ్యర్థి రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ తన ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందిస్తూ.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు సంబంధించిన వందల కొద్దీ ఓటింగ్ అక్రమాలను ఎదుర్కొన్నట్లు వివరాయించారు. అదృష్టవశాత్తూ, పేపర్ ట్రయిల్ ఉంది కాబట్టి సమస్యను గుర్తించి ఓట్ల లెక్కలు సరిచేసినట్లు చెప్పారు. ఎన్నికల్లో ఈవీఎంల వాడకాన్ని వదిలేసి మళ్ళీ పేపర్ బ్యాలెట్లకు తిరిగి రావాలని ఆయన పేర్కొన్నారు.రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ ట్వీట్ మీద మస్క్ స్పందిస్తూ.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను రద్దు చేయాలి. వీటిని ఎవరైనా ఏఐ టెక్నాలజీ ఉపయోగించి హ్యాక్ చేసే ప్రమాదం ఉందని అన్నారు. ఇది ఒక దేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంటుందని మస్క్ అన్నారు.మస్క్ చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. మస్క్ అబ్రిప్రాయంతో చాలామంది ఏకీభవిస్తున్నారు. నిజానికి ఈవీఎంలో ఎంత సేఫ్టీ టెక్నాలజీలను ఉపయోగించి తయారు చేసినా.. అంతకు మించిన టెక్నాలజీతో హ్యాక్ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఎన్నికల విషయంలో పేపర్ ఓటింగ్ ఉత్తమం అని పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు.We should eliminate electronic voting machines. The risk of being hacked by humans or AI, while small, is still too high. https://t.co/PHzJsoXpLh— Elon Musk (@elonmusk) June 15, 2024 -
ఈవీఎం ట్యాంపర్ అయిందా? లేదా?.. చెక్ లిస్ట్‌తో చూసుకోండిలా..
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల ఆరు విడతల పోలింగ్ పూర్తి అయింది. మరో విడత జూన్ 1తో ముగుస్తుంది. దేశ వ్యాప్తంగా జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎంపీ, సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ అన్ని రాజకీయ పార్టీ, సంబంధిత పోలింగ్ ఏజెంట్లు ఫలితాల రోజు తనిఖీ చేయాల్సిన అంశాల చెక్ లిస్ట్ విడుదల చేశారు. ఫలితాల రోజు ఓట్ల లెక్కింపు కోసం ఈవీఎం మిషన్లను తెరిచే క్రమంలో పాటించాల్సిన సూచనలకు సంబంధించి ఓ చార్ట్ తయారు చేసినట్లు తెలిపారు. ‘‘చాలా మంది ఈవీఎం ట్యాంపర్ అవడానికి అవకాశం ఉందని అంటున్నారు. నేను కచ్చితంగా చెప్పగలను ఈవీఎంలు ట్యాపర్ కావు. ప్రపంచంలో ఈవీఎం మిషన్ ఎక్కడా ట్యాంపర్ కాదు. అందుకే ఈ చెక్ లిస్ట్‌ను విడుదల చేశాం’’ అని కపిల్ సిబల్ అన్నారు.చెక్ లిస్ట్ చార్ట్‌లోని తనిఖీ చేసే అంశాలు ఇవే..1. చార్ట్‌లో కంట్రోల్ యూనిట్ నంబర్, బాలెట్ యూనిట్ నంబర్, వీవీప్యాట్ (VVPAT)ఐడీ ఉంటాయి.2. చార్ట్‌లో మూడో కాలమ్ చాలా ముఖ్యమైంది.4 జూన్2024 అని మూడో కాలమ్‌లో రాసి ఉంటుంది. ఈవీఎం మిషన్ తెరిచిన సమయాన్ని మూడో కాలమ్ కింద రాయాలి.3. ఒక ఒకవేల సమయంలో తేడా వస్తే.. ఆ ఈవీఎం మిషన్ అప్పటికే ఎక్కడో ఒక తెరిచినట్లుగా నిర్ధారణకు రావాలి. కంట్రోల్ యూనిట్(CU) సీరియల్ నంబర్ రాసి ఉన్న ఫార్మాట్లో ఉంటుంది. అక్కడ ఉన్న నంబరల్ మ్యాచ్ చేసుకోవాలి.4. మొత్తం పోలైన ఓట్ల లెక్కింపును జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే కౌంటింగ్ సమయంలో ఓట్లు తేలితే సమస్య ఎదురవుతుంది.5. రెండు అంశాలు గుర్తుపెట్టుకోవాలి.. పై కాలమ్‌లో వెరిఫికేషన్ పూర్తి అయ్యే వరకు రిజల్ట్ బటన్ నొక్కకూడదు. సమయంలో తేడా వస్తే.. వెలువడిన రిజల్ట్ సమయం కూడా తప్పు అవుతుంది.6. అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు అక్కడ కూర్చన్న తర్వాత జాగ్రత్తగా చెక్ లిస్ట్‌లోని మొదిటి కాలమ్‌ను పరిశీలించిన అనంతరం ఈవీఎంలను తెరవాలని కోరకుంటున్నాను.#WATCH: Kapil Sibal's EVM ADVICE To Political Parties, Candidates Ahead Of June 4 COUNTING Kapil Sibal Explains What Polling Agents and Leaders of #IndiaAlliance should do before EVM Machines are Opened For Counting.!🎯IMPORTANT UPDATES:▪️I have made a chart for all the… pic.twitter.com/WigELsaH7W— Gururaj Anjan (@Anjan94150697) May 26, 2024 -
ఈవీఎం లు ధ్వంసం చేసిన టీడీపీ నేతలకు రిమాండ్
-
వైఎస్ఆర్ జిల్లాలో మొదలైన ఈవీఎంల పంపిణీ
-
లెక్క తేలింది.. పోరు మిగిలింది..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో మరో అంకం పూర్తయ్యింది. బరిలో నిలిచే అభ్యర్థుల సంఖ్య తేలింది. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో తుది పోరులో తలపడే అభ్యర్థుల సంఖ్యపై స్పష్టత వచ్చింది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 28 మంది, పెద్దపల్లిలో 42 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇందులో ప్రధాన పార్టీలకు చెందినవారితో పాటు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. సోమవారం నామినేషన్ ఉపసంహరణకు చివరిరోజు కావడంతో కరీంనగర్లో ఐదుగురు, పెద్దపల్లిలో ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు విత్‌డ్రా చేసుకున్నారు. ఈ మేరకు ఫాం–5 పూరించి ఆర్వోలకు అందజేశారు. దీంతో రిటర్నింగ్ అధికారులు వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, స్వతంత్ర అభ్యర్థుల సమక్షంలో ఇండిపెండెంట్ అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు.కరీంనగర్లో 2, పెద్దపల్లిలో 3 ఈవీఎంలుఒక స్థానంలో 15మంది అభ్యర్థులకు మించితే రెండు ఈవీఎంలను ఉపయోగించాల్సి ఉంటుంది. పెద్దపల్లి బరిలో 42మంది ఉండటంతో మూడు ఈవీఎంలు, కరీంనగర్లో 28మంది అభ్యర్థులే ఉండటంతో రెండు ఈవీఎంలను ఉపయోగించాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. స్వతంత్ర అభ్యర్థులను ఎన్నికల బరిలో నుంచి తప్పించేందుకు ప్రధాన పార్టీల నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతోనే ఈసారి గతంలో కంటే ఎక్కువ మంది బరిలో నిలిచినట్లు తెలుస్తోంది.చీలిక ఓట్ల లెక్కల్లో అభ్యర్థులు2019లో పెద్దపల్లి లోక్‌సభ బరిలో 18 మంది అభ్యర్థులుండగా, ఈసారి 42 మంది పోటీలో ఉన్నారు. 2019లో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 15 మంది పోటీలో ఉండగా ఈసారి 28మంది ప్రధాన పా ర్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా బరి లో ఉన్నారు. పెద్దపల్లి పరిధిలో ప్రధాన పార్టీలకు రె బల్ అభ్యర్థుల బెడద లేదు. అయితే కరీంనగర్లో కాంగ్రెస్ టిక్కెట్ ఆశించి భంగపడిన అల్గిరెడ్డి ప్ర వీణ్‌రెడ్డి రెబల్ అభ్యర్థిగా పోటీలో దిగుతున్నారు. దీంతో రెబల్ అభ్యర్థితో పాటు చిన్న పార్టీలు, స్వ తంత్ర అభ్యర్థులు ఓట్లు సాధించనున్నారు. వీరి ఓ ట్ల చీలిక వల్ల ఏ పార్టీకి నష్టం చేకూరుతుంది? ఎంత మేరకు వీరి ప్రభావం ఉండనుందనే లెక్కలపై అ న్ని పార్టీల్లో జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి.నేటి నుంచి పెరగనున్న ప్రచార జోరు..ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మేరకు కీలక ఘట్టం ముగియడంతో అభ్యర్థులెవరో తేలిపోయింది. ప్రధాన పార్టీలతో పాటు, ఇతర చిన్న పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు మంగళవారం నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. ఎలాగైనా ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు తమ ప్రణాళికను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రచారాన్ని మరింత వేడెక్కించే పనిలో పడ్డారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటున్నారు.ఇవి చదవండి: లెక్క లేదంటే.. వేటే..! -
అనుమానం ఉందని ఎన్నికలపై ఆదేశాలివ్వలేం
న్యూఢిల్లీ: ఈవీఎంల పనితీరుపై అనుమానం ఉందనో, వాటిని నియంత్రణలోకి తీసుకుని ఫలితాలను తలకిందులు చేయొచ్చనే ఆరోపణలతోనో ఎన్నికల ప్రక్రియను నియంత్రించలేమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈవీఎంలో ‘మార్పులు’ చేసే ఆస్కారం ఉందని, అందుకే బ్యాలెట్ పేపర్ విధానమే ఉత్తమం అని వాదించే వారి ఆలోచనను మార్చలేమని కోర్టు వ్యాఖ్యానించింది.ఈవీఎంలో నమోదయ్యే ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చాలంటూ దాఖలైన పలు పిటిషన్లను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపంకర్ దత్తాల సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారించింది. పిటిషన్‌దారులు లేవనెత్తిన ప్రశ్నలపై తమ అనుమానాలను నివృత్తిచేసుకునేందుకు జడ్జీలు మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం అధికారి నితేశ్ వ్యాస్‌ను కోర్టుకు రప్పించి ఐదు ప్రశ్నలు సంధించారు. మైక్రోకంట్రోలర్లను ఎక్కడ బిగిస్తారు? వాటి ప్రోగ్రామ్‌ను మళ్లీ మార్చొచ్చా? అంటూ ప్రశ్నలు అడిగారు.బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్, కంట్రోల్ యూనిట్లలో మైక్రోకంట్రోలర్లను బిగిస్తామని, వాటి పోగ్రామ్‌ను సరిచేసేందుకు ఎవరైనా ఓపెన్ చేస్తే పనిచేయకుండాపోతాయని వ్యాస్ వివరణఇచ్చారు. ఈ వివరణతో అసిసోయేషన్ ఫర్ డెమొక్రట్రిక్ రిఫారŠమ్స్ తరఫు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ విభేదించారు. ఎన్నికల గుర్తులను అప్లోడ్ చేసేటపుడు తప్పుడు ప్రోగామ్‌ను అప్లోడ్ చేసే ఆస్కారముందని వాదించారు. దీనిపై జడ్జీ దత్తా కలి్పంచుకుని.. ‘ మీ ఆలోచనలను మేం మార్చలేం. ఈసీ వంటి రాజ్యాంగబద్ధ సంస్థను నియంత్రించలేం’’ అని వ్యాఖ్యానించారు. ఈవీఎంల సోర్స్ కోడ్‌ను బహిర్గతంచేయాలని మరో పిటిషనర్ తరఫు న్యాయవాది సంతోశ్ వాదించగా కుదరదని జడ్జీ తిరస్కరించారు. -
ఈసీ తీరుపై సీఐసీ విస్మయం
న్యూఢిల్లీ: సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద ఈవీఎం, వీవీప్యాట్ల పనితీరు, విశ్వసనీయతను ప్రశ్నిస్తూ అడిగిన సమాచారాన్ని ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేంద్ర ఎన్నికల సంఘాన్ని కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) తీవ్రంగా తప్పుబట్టింది. చట్టాన్ని ఉల్లంఘించినందుకు లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఈసీని సీఐసీ ఆదేశించింది. ఈవీఎంల పనితీరు, ఓట్ల లెక్కింపు ప్రక్రియపై తాము లేవనెత్తిన అనుమానాలను నివృత్తిచేసేలా సమాచారం ఇవ్వాలని మాజీ ఐఏఎస్ అధికారి ఎంజీ దేవసహాయం సహా ప్రముఖ సాంకేతికవిద్యా నిపుణులు, ఐఐటీ, ఐఐఎంలలోని విద్యావేత్తలు, మాజీ ప్రభుత్వ ఉన్నతాధికారులు 2022 మే రెండో తేదీన ఈసీకి ఆర్టీఐ చట్టంకింద దరఖాస్తు పెట్టుకోవడం తెల్సిందే. తమ ఆర్టీఐ దరఖాస్తుపై ఈసీ ఏ మేరకు చర్యలు తీసుకుందని 2022 నవంబర్ 22న దేవసహాయం మరోసారి ఆర్టీఐ కింద సమాచారం అడిగారు. 30 రోజుల్లోపు సమాధానం ఇవ్వాల్సి ఉన్నా ఈసీ సమాధానం ఇవ్వలేదు. దీంతో ఆయన సీఐసీను ఆశ్రయించారు. దేవసహాయానికి ఎందుకు మీ స్పందన తెలపలేదు? అని ఈసీలోని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌కు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ హీరాలాల్ సమరియా అడగ్గా ఆయన సమాధానం ఇవ్వలేదు. ‘‘ ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానం ఇవ్వకుండా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్(పీఐఓ) వ్యవహరించిన తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. దీనిపై 30 రోజుల్లోగా పాయింట్లవారీగా వివరణ ఇవ్వండి’ అని ఈసీని సీఐసీ ఆదేశించింది. -
ఈవీఎంల వినియోగంలో సందేహాలను నివృత్తి పర్చిన ఈసీఐఎల్ బృందం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల నిర్వహణ (EVM Management System-EMS 2.0) వాటి వినియోగంలో నోడల్ అధికారులు ఎదుర్కొంటున్న సందేహాలను, సమస్యలను హైదరాబాద్ నుంచి ఆన్లైన్ ఈసీఐఎల్ అధికారుల బృందం సభ్యులు సీనియర్ డి.జి.ఎం. ఎ.పి.రాజు, ఇంజనీర్ సి జి ఆదిత్య నివృత్తి చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర సచివాలయంలో రెండో రౌండ్ శిక్షణ కార్యక్రమం జరిగింది. అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఎమ్.ఎన్. హరెంధిర ప్రసాద్ నేతృత్వంలో జరిగి ఈ శిక్షణా కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన ఈవీఎం నోడల్ అధికారులు, సాంకేతిక సహాయకులు ప్రత్యక్షంగాను ,అరుణాచల ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాలకు చెందిన అధికారులు ఆన్ లైన్ ద్వారా పాల్గొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 9న జరిగిన మొదటి రౌండ్ శిక్షణా కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల నిర్వహణ మరియు వాటి వినియోగంపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఈవీఎం నోడల్ అధికారులకు, సాంకేతిక సహాయకులకు ఈసీఐఎల్ అధికారుల బృందం సమగ్ర అవగాహన కల్పించడం జరిగింది. అయితే క్షేత్ర స్థాయిలో ఈవీఎంల వినియోగంలో అధికారులకు, సాంకేతిక సహాయకులకు ఎదురైన సమస్యలు, సందేహాలను నివృత్తి పర్చేందుకు నెల రోజుల తదుపరి రెండో రౌండ్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈవీఎంల నిర్వహణలో సాదారణంగా ఎదురయ్యే సాంకేతిక సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలో మరొసారి ఈ శిక్షణా కార్యక్రమంలో ఈసీఐఎల్ అధికారుల బృందం వివరించింది. అదే విధంగా జిల్లాల వారీగా ఈవీఎం నోడల్ అధికారులు, సాంకేతిక సహాయకులు అడిగిన పలు సందేహాలకు, సమస్యలకు ఈసీఐఎల్ అధికారుల బృందం సభ్యులు సీనియర్ డి.జి.ఎం. ఎ.పి.రాజు, ఇంజనీర్ సి జి ఆదిత్య సమగ్రమైన వివరణను ఇచ్చారు. అసిస్టెంట్ సీఈవో పి.తాతబ్బాయ్ తో పాటు అన్ని జిల్లాలకు చెందిన ఈవీఎం నోడల్ అధికారులు, సాంకేతిక సహాయకులు ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. -
Election Commission of India: ప్రతి 15 ఏళ్లకు రూ.10 వేల కోట్లు కావాలి
న్యూఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు అవసరమైన వనరులపై కేంద్ర ఎన్నికల సంఘం అంచనాలు వేస్తోంది. ఒకే విడతలో లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరపాల్సి వస్తే కొత్త ఈవీఎంల కొనుగోలుకు ప్రతి 15 ఏళ్లకు రూ.10 వేల కోట్లు అవసరమవుతాయని లెక్కలు కట్టింది. ఒక్కో ఈవీఎం జీవిత కాలం 15 ఏళ్లు కాగా, ఒక్కో మెషీన్‌ను మూడు సార్లు వాడుకోవచ్చని తెలిపింది. ఏకకాలంలో జరిపే ఎన్నికలకు దేశవ్యాప్తంగా 11.80 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒక్కో పోలింగ్ బూత్‌లో జత ఈవీఎంలు.. ఒకటి లోక్‌సభకు, మరోటి శాసనసభ నియోజకవర్గానికి అవసరమవుతాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని బ్యాలెట్ యూనిట్(బీయూ)లు 46,75,100, కంట్రోల్ యూనిట్(సీయూ)లు 33,62,300, వీవీప్యాట్లు 36,62,600 అవసరమవుతాయని కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే తెలిపింది. కనీసం ఒక బీయూ, ఒక సీయూ, ఒక వీవీప్యాట్లను కలిపి ఒక ఈవీఎంగా పరిగణిస్తారు. ఒక బీయూ ఖరీదు రూ.7,900, ఒక సీయూ ఖరీదు రూ.9,800, ఒక వీవీప్యాట్ ఖరీదు రూ.16,000గా తాజాగా నిర్ణయించింది. అదనంగా పోలింగ్, భద్రతా సిబ్బంది, ఈవీఎంల నిర్వహణ కేంద్రాలు, మరిన్ని వాహనాలు అవసరమవుతాయని కూడా ఎన్నికల సంఘం పేర్కొంది. కొత్తగా ఈవీఎల తయారీ, ఇతర సౌకర్యాలను సమకూర్చుకున్నాక 2029లో మాత్రమే మొదటి జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు అవకాశం ఉందని స్పష్టం చేసింది. -
స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్ట భద్రత
-
స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర పటిష్ట బందోబస్త్
-
తుంగతుర్తిలో ఈవీఎంల తరలింపుపై హైటెన్షన్
-
ఎస్కార్ట్ లేకుండానే ఈవీఎంల తరలింపు.. అడ్డుకున్న గ్రామస్తులు
నాగారం: నాగారం మండలం పేరబోయినగూడెంలో గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత అధికారులు ఎస్కార్ట్ లేకుండా ఈవీఎంలను తరలిస్తుండటంతో గ్రామస్తులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.పేరబోయినగూడెం గ్రామంలో సాయంత్రం 5:10గంటలకు పోలింగ్ ముగిసింది. అధికారులు ఎస్కార్ట్ లేకుండానే ఈవీఎం బాక్సులను మినీ బస్సులో ఐదు కిలో మీటర్ల దూరంలో ఉన్న నరసింహులగూడెం వరకు తరలించారు. అదే మాదిరిగా నరసింహులగూడెంలో ఉన్న ఈవీఎంను కూడా మినీ బస్సులో తరలించేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో సెక్టోరియల్ అధికారి అదనపు ఈవీఎంలను తన కారులో వేసుకుని నర్సింహులగూడేనికి చేరుకున్నాడు. ఇదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామస్తులు కారులో ఉన్న ఖాళీ ఈవీఎంలను గమనించి ఎక్కడివి అని ప్రశ్నించారు. ఈ క్రమంలో సెక్టోరియల్ అధికారి అదనపు ఖాళీ ఈవీఎంలు అని చెప్పే ప్రయత్నం చేస్తుండగానే ఎస్కార్ట్ లేకుండా ఈవీఎం బాక్సులను తరలించవద్దని ఆందోళనకు దిగారు. కారులో ఉన్న ఖాళీ ఈవీఎంలు పోలింగ్ అయిన ఈవీఎంల స్థానంలో మార్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. దీంతో సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సెక్టోరియల్ అధికారి వెంట అదనపు ఏవీఎంలు ఉంటాయని గ్రామస్తులకు వివరించే ప్రయత్నిం చేశారు. అయినా ఆందోళన విరమించకుండా బాక్సులు తారుమారు చేసే కుట్ర చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు అక్కడి నుంచి ఎస్కార్ట్ వాహనం ఇచ్చి ఈవీఎంలను తరలించారు. గ్రామస్తులు అనుమానంతో ఈవీఎంలు తరలిస్తున్న వాహనాన్ని భద్రపరిచే స్థలం తుంగతుర్తి వరకు వెంబడించారు. సెక్టోరియల్ అధికారి కారు అద్దాలు ధ్వంసం తుంగతుర్తి గోదాం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు అధికసంఖ్యలో గుమిగూడి ఈవీఎంలు తరలిస్తున్న సెక్టోరియల్ అధికారి కారును అడ్డగించారు. అనంతరం కారు అద్దాలను ధ్వంసం చేశారు. తమ ఎదుట ఖాళీ ఈవీఎంలను ఓపెన్ చేయాలని ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని అదుపుచేసి ఈవీఎంలను గోదాముకు తరలించారు. ఈ విషయంపై తమకు వివరణ ఇవ్వాలని కార్యకర్తలు ఆర్వో వెంకట్‌రెడ్డి, డీఎస్పీ రవిలను కోరారు. దీంతో వారు కాంగ్రెస్ నాయకులకు, ఏజెంట్ల ఎదుట ఖాళీ ఈవీఎంలను తెరిచి వారి అనుమానాన్ని నివృత్తి చేశారు. -
ఈవీఎంలలో సమస్యలు.. సీఈవోకు లేఖ రాసిన కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఒక్కోచోట ఓటు వేయడానికి కనీసం 10 సెకన్ల సమయం పడుతోందని ఓటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా ఎన్నికల అధికారులకు, స్టేట్ ఎన్నికల కమిషన్‌కు వరుస ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే, ఈవీఎంల విషయమై సీఈవో వికాస్‌రాజ్.. డీఈవోలతో కోఆర్డీనేట్ అయ్యారు. మరోవైపు.. ఈవీఎంల మొరాయింపుపై సీఈవో వికాస్‌రాజ్‌కు కాంగ్రెస్ లేఖ రాసింది. ఈ క్రమంలో ఈవీఎంలలో ఉన్న సమస్యలను పరిష్కరించేలా చూడాలని కోరారు. లేనిపక్షంలో పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సమయాన్ని పెంచాలని కాంగ్రెస్ నేతలు సీఈవోను కోరారు. ఇదిఆల ఉండగా.. హైదరాబాద్‌లో మందకోడిగా పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కేవలం 21 శాతం పోలింగ్ నమోదు.. అత్యధికంగా మెదక్‌లో 51 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, తెలంగాణవ్యాప్తంగా 37 శాతం పోలింగ్ జరిగినట్టు ఎన్నికల అధికారులు చెబుతున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. కాగా, సాయంత్రం పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. -
ఆలస్యంగా పోలింగ్.. ఓటర్ల ఎదురుచూపులు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. దీంతో, కొన్నిచోట్ల ఇంకా పోలింగ్ ప్రారంభం కాలేదు. ►కామారెడ్డిలో ఇంకా ప్రారంభం కాని పోలింగ్.. 30 నిమిషాలు దాటిన ఇంకా ఓటింగ్ ప్రారంభం కాలేదు. ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ నిలిచిపోయింది. #WATCH | Telangana Elections | Voting halted for the last 30 minutes at Booth No. 253, R&B Building in Kamareddy Assembly constituency due to a malfunction of the EVM machine here. pic.twitter.com/2EOcA0n0Uq — ANI (@ANI) November 30, 2023 ►ఈవీఎంల మొరాయింపులపై టెక్నికల్ టీమ్స్‌ను అలర్ట్ చేస్తున్న సీఈసీ. ఈవీఎంల మొరాయింపులపై మానిటరింగ్ చేస్తున్న జాయింట్ సీఈవో. ఈవీఎం మొరాయిస్తే టెక్నికల్ ఏర్పాటు చేసిన ఈసీ. ఒక్కో సెగ్మెంట్‌కు ముగ్గురు ఇంజనీర్లను నియమించిన ఎలక్షన్ కమిషన్. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 400 మంది ఈవీఎం టెక్నికల్ టీమ్స్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ► ఎన్నికల విధుల్లో 2.5 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. ►పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్‌లో కూడా పోలింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ►సూర్యాపేట, ఖమ్మం జిల్లాలోని పలు చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ►మెదక్ జిల్లా ఎల్లాపురంలో ఇంకా ప్రారంభంకాని ఓటింగ్ ►ఇక, ఎన్నికల సిబ్బందికి సరైన ట్రైనింగ్ ఇవ్వకపోవడంతోనే పోలింగ్‌కు అంతరాయం ఏర్పడిందని పలువురు చెబుతున్నారు. ► మరోవైపు.. ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. #WATCH | Telangana Elections | A senior citizen being helped to arrive at a polling booth, in a wheelchair, in Jubilee Hills. The state is voting for the Assembly elections today. pic.twitter.com/KsrFJLjmCb — ANI (@ANI) November 30, 2023 #WATCH | Actor Allu Arjun after casting his vote in Hyderabad's Jubilee Hills area#TelanganaElections2023 pic.twitter.com/YbIrZxo5VM — ANI (@ANI) November 30, 2023 ►రెజిమెంటల్ బజార్ హైస్కూల్లో పనిచేయని ఈవీఎం ►సికింద్రాబాద్..కంటోన్మెంట్ నియోజకవర్గం రెజిమెంటల్ బజార్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బూత్ నెంబర్ 209లో పనిచేయని ఈవీఎం. ఇంకా ప్రారంభం కానీ ఓటింగ్ ప్రక్రియ. ►ఓటు హక్కు వినియోగించడానికి ఎదురుచూస్తున్న ఓటర్లు. ►స్టేషన్‌ఘన్‌పూర్‌లో మొరాయించిన ఈవీఎం ►జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని 117వ బూత్‌లో ఈవీఎం మొరాయించింది. దీంతో ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు. పోలింగ్ ప్రారంభమై 33 నిమిషాలు కావస్తున్నా ఇప్పటివరకు అధికారులు పట్టించుకోవడం లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
'ఈవీఎం' విశేషాల గురించి.. మీకు పూర్తిగా తెలుసా..!?
సాక్షి, ఆదిలాబాద్: సమర్థవంత ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనేక సంస్కరణలు చేపట్టింది. ఇందులో భాగంగా బ్యాలెట్ బాక్స్ మొదలు ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్) వరకు ఓటింగ్ విధానంలో మార్పులు తెచ్చింది. ఈవీఎం, వీవీప్యాట్, నోటా లాంటి నూతన విధానాలతో పారదర్శక ఓటింగ్‌కు భరోసానిస్తోంది. 1999 ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాల ముద్రణకు 7,700 టన్నుల కాగితం వాడారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ కోసం ఈవీఎం వాడడంతో 10 వేల టన్నుల కాగితం మిగిలింది. ఈవీఎంలను మొదటిసారిగా 1982లో కేరళ రాష్ట్రంలోని పర్వూర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించారు. ఈవీఎంలపై నెలకొన్న సందేహాలకు నివృత్తిగా పలు సమాధానాలను ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో పొందుపర్చింది. నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎం విశేషాలపై కథనం.. ఈవీఎం అంటే? ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్. ఇది ఎన్నికల్లో పోలైన ఓట్లను ఎలక్ట్రానిక్ పద్ధతిలో రికార్డు చేయడంతో పాటు లెక్కించే పరికరం. ఈవీఎంలో బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్‌తో పాటు జతగా వీవీప్యాట్ (ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్) ఉంటుంది. రవాణా సులభం.. బ్యాలెట్ బాక్సులతో పోలిస్తే ఈవీఎంల రవాణ చాలా సులభం. తేలికంగా, పోర్టబుల్‌గా ఉండడంతో దూరంగా, రోడ్డు సౌకర్యం లేనిప్రాంతాలకు సైతం వీటిని సులభంగా తరలించవచ్చు. గరిష్టంగా అభ్యర్థుల సంఖ్య, వేసే ఓట్లు.. ఈవీఎం బ్యాలెట్ యూనిట్లో నోటాతో పాటు 15 మంది అభ్యర్థుల పేర్లు మాత్రమే ఉంటాయి. ఒకవే ళ అంతకంటే ఎక్కువ అభ్యర్థులు బరిలో ఉంటే మ రో బ్యాలెట్ యూనిట్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ఇలా ఒక ఈవీఎంకు 24 బ్యాలెట్ యూని ట్లు అనుసంధానించవచ్చు. తద్వారా 384 మంది అభ్యర్థుల వరకు సేవలు అందిస్తుంది. ఇక ఓట్ల విషయానికి వస్తే గరిష్టంగా 2 వేల ఓట్లను రికార్డు చేస్తుంది. కానీ ఎన్నికల్లో సాధారణంగా 1500 ఓట్లను నమోదు చేయడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. విద్యుత్ లేని ప్రాంతాల్లో.. ఈవీఎంలకు విద్యుత్ సరఫరా అవసరం లేదు. ఈవీఎం, వీవీప్యాట్లకు సొంతంగా బ్యాటరీ/పవర్–ప్యాక్ సౌకర్యం ఉండడంతో విద్యుత్ సరఫరా లేని ప్రాంతాల్లో సైతం వీటిని వినియోగించవచ్చు. నిర్ధారించుకున్న తర్వాతే పోలింగ్.. పోలింగ్ ప్రారంభానికి ముందు కంట్రోల్ యూనిట్లో రిజల్ట్ బటన్‌ను నొక్కి ఇప్పటికే ‘దాచిన’ ఓట్లేవీ నమోదు కాలేదని ప్రిసైడింగ్ అధికారి హాజరైన పో లింగ్ ఏజెంట్లకు ప్రదర్శిస్తారు. వీవీప్యాట్ డ్రాప్బా క్స్ తెరిచి ఖాళీగా ఉందని చూపుతారు. వారి సమక్షంలో కనీసం 50 ఓట్లతో మాక్ పోల్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆ ఫలితాన్ని క్లియర్ చేసి అసలు పోల్ ప్రారంభించే ముందు పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్‌కు సీలు వేస్తారు. పోలైన ఓట్ల సంఖ్య ఇలా తెలుసుకోవచ్చు.. ఈవీఎం కంట్రోల్ యూనిట్లో ఫలితం బటన్‌తో పాటు, టోటల్ బటన్ ఉంటుంది. పోల్ సమయంలో ఎప్పుడైనా ఈ బటన్ నొక్కితే అప్పటి వరకు పోలైన మొత్తం ఓట్ల సంఖ్య తెలుస్తుంది. పోలింగ్ ముగియగానే క్లోజ్ బటన్ నొక్కితే మెషిన్ ఇకపై ఓట్లను అంగీకరించదు. ఈవీఎంల భద్రత.. పోలింగ్ తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లో సె క్యూరిటీ బలగాల పహారాలో భద్రపరుస్తారు. అభ్యర్థులు నియమించిన ఏజెంట్లు కౌంటింగ్ వరకు ఈవీఎంలను 24 గంటలూ చూసేందుకు అనుమతిస్తారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌లకు తాళాలు వేసి ఎన్నికల అధికారులతో పాటు అభ్యర్థులు లేదా వారి ప్రతినిధుల సంతకాలతో సీలు వేస్తారు. కౌంటింగ్ డే.. కౌంటింగ్ రోజున అభ్యర్థులు/వారి ప్రతినిధులు, రిటర్నింగ్ అధికారి, ఎన్నికల సంఘం పరిశీలకుల సమక్షంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ తెరుస్తారు. అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. లెక్కింపు పూర్తయిన తర్వాత, వీవీప్యాట్ స్లిప్‌లను బయటకు తీసి, అభ్యర్థులు/వారి ప్రతినిధుల సమక్షంలో నల్లటి కవరులో భద్రపరుస్తారు. ఓటరు ఫిర్యాదు చేయవచ్చు.. ఓటరు ఓటును నమోదు చేసిన తర్వాత వీవీప్యాట్‌లో కనిపించే పేపర్ స్లిప్‌లో ఓటు వేసిన అభ్యర్థి కాకుండా వేరే అభ్యర్థి పేరు, గుర్తు వచ్చినట్లయితే రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. నిజమని తేలితే ఆ ఓటింగ్ యంత్రంలో తరువాతి ఓట్ల నమోదును నిలిపివేసి రిటర్నింగ్ అధికారి ఇచ్చిన ఆదేశాల ప్రకారం నడుచుకుంటారు. ఓటు ఎలా వేయవచ్చు? ఈవీఎం ఓటింగ్ విధానంలో కంట్రోల్ యూ నిట్ ప్రిసైడింగ్ అధికారి వద్ద, బ్యాలెట్ యూ నిట్, వీవీప్యాట్ ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఉంటుంది. బ్యాలెట్ యూనిట్‌పై ఓటరు తన కు నచ్చిన అభ్యర్థి గుర్తుకు ఎదురుగా ఉన్న బ్లూబటన్ నొక్కగానే ఎరుపురంగు లైట్ మె రుస్తుంది. ఎంపిక చేసుకున్న అభ్యర్థి సీరియ ల్ నంబర్, పేరు, గుర్తు చూపించే పేపర్ స్లిప్ వీవీప్యాట్ విండో ద్వారా సుమారు 7 సెకన్ల పాటు కనిపించి డ్రాప్‌బాక్స్‌లో పడగానే కొద్దిసేపు బీప్ అనే శబ్దం వస్తుంది. దీంతో ఓటు నమోదైందని తెలుసుకోవచ్చు. ఈవీఎం మొరాయిస్తే.. పోలింగ్ సమయంలో బ్యాలెట్, కంట్రోల్ యూనిట్ క్రమం తప్పితే బ్యాలట్, కంట్రోల్ యూనిట్‌తో పాటు వీవీప్యాట్‌తో కూడిన కొత్త సెట్ ఏర్పాటు చేస్తారు. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో రిజర్వ్ దశ నుంచి పనిచేయని దశ వరకు నమోదైన ఓట్లు, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ బ్యాలెట్ స్లిప్‌లు కంపార్ట్మెంట్ మెమరీలో భద్రంగా ఉంటాయి. వీవీప్యాట్ మాత్రమే పనిచేయకపోతే కంట్రోల్ యూనిట్లో నమోదైన ఓట్లు దాని మెమరీలో భద్రంగా ఉంటాయి. దీంతో రిజర్వ్ మెషిన్ల నుంచి పనిచేయని వీవీప్యాట్ తొలగించి మరొకటి ఏర్పాటు చేసిన తర్వాత పోలింగ్ తిరిగి ప్రారంభిస్తారు. ఏదైనా సాంకేతిక కారణాలతో కంట్రోల్ యూనిట్లలో నమోదైన ఓట్లను నిర్ధారించకపోతే కంట్రోల్ యూనిట్ వీవీప్యాట్ స్లిప్‌లను లెక్కిస్తారు. -
బ్యాలెట్ పేపర్ నుంచి.. ఎం–2 ఈవీఎంల దాకా..!
సాక్షి, కామారెడ్డి: దొంగ ఓట్లను నియంత్రించడానికి నాటి కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ టీఎన్ శేషణ్ విశేషంగా కృషి చేశారు. ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణల్లో బ్యాలెట్ పేపర్‌కు బదులు ఈవీఎంల వినియోగం ప్రధానమైనది. ఎన్నికల సమయంలో పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు, పార్టీ గుర్తులతో ముద్రించిన బ్యాలెట్ పేపర్‌ను మొదట్లో ఉపయోగించే వారు. ఓటరు తాను ఓటు వేయాలనుకునే అభ్యర్థి పార్టీ గుర్తుపై స్టాంప్ వేసి బ్యాలెట్ పేపర్‌ను బాక్సులో వేసే వారు. అనంతరం ఎన్నికల అధికారులు బ్యాలెట్ పేపర్లను లెక్కించి విజేతలను ప్రకటించేవారు. దీంతో ఓట్ల లెక్కింపు కష్టంగా మారేది. ఈ సమస్యను అధిగమించేందుకు టీఎన్ శేషణ్ హయాంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎ)తో ఓటు వేసే పద్ధతిని ప్రవేశపెట్టారు. మొదట్లో ఎం–1 టైప్ ఈవీఎంలు రాగా, 2006 తర్వాత ఎం–2 ఈవీఎంలు వచ్చాయి. 2013 తర్వాత ఎం–3 ఈవీఎంలు వాడకంలోకి వచ్చాయి. ఇప్పుడు ఓటరు తాను వేసిన గుర్తుకే ఓటు పడిందా లేదా అన్నది తెలుసుకోడానికి ఓటర్ వెరిఫికేబుల్ ప్యాట్‌ను ప్రవేశపెట్టారు. 16 మందికి మించితే బ్యాలెట్.. ఈవీఎంలను ఉపయోగించే మొదటి రోజుల్లో 16 మంది అభ్యర్థులకు మించితే బ్యాలెట్ పేపర్‌ను వాడేవారు. నూతనంగా ఈవీఎంలు ప్రవేశపెట్టినప్పుడు ఎం–1 టైప్ ఈవీఎంలు కావడంతో ఓ కంట్రోల్ యూనిట్ ద్వారా ఒక బ్యాలెట్ యూనిట్‌కే కనెక్షన్ ఇవ్వగలిగేవారు. ఒక ఈవీఎంలో 16 మంది అభ్యర్థుల పేర్లు, గుర్తులే వచ్చేవి. అంతకన్నా ఎక్కువ అభ్యర్థులు బరిలో ఉంటే బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించేవారు. 2006 తర్వాత ఎం–2 టైప్ ఈవీఎంలు వచ్చాయి. వీటికి ఒక కంట్రోల్ యూనిట్‌కు నాలుగు ఈవీఎంలు కనెక్షన్ ఇవ్వవచ్చు. దీంతో ఒక నియోజకవర్గంలో 64 మంది పోటీ చేసినా ఈవీఎంల ద్వారా ఓటింగ్ నిర్వహణకు వెసులుబాటు కలిగింది. 2013 తర్వాత ఎం–3 ఈవీఎంలు అందుబాటులోకి రావడంతో ఒక కంట్రోల్ యూనిట్‌కు 24 బ్యాలెట్ యూనిట్ల కనెక్షన్లు ఇవ్వొచ్చు. దీంతో 384 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నా ఈవీఎంలతోనే ఓటింగ్ సాధ్యమవడానికి అవకాశం కలిగింది. ఈవీఎంల సామర్థ్యం, పనితీరును ఎంత మెరుగుపరిచినా తాను వేసిన గుర్తుకు ఓటు పడిందో లేదోనన్న అనుమానం ఇటు ఓటర్లలో అటు రాజకీయ పార్టీల నాయకుల్లోనూ ఉండేది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తేవి. అలాంటి ఆరోపణలు, అనుమానాలకు ఆస్కారం లేకుండా నూతనంగా వీవా ప్యాట్లను ప్రవేశపెట్టారు. దీంతో ఓటరు తాను వేసిన గుర్తుకు ఓటు పడిందా లేదా అన్నది వీవీ ప్యాట్‌లో చూసి నిర్ధారించుకొనే అవకాశం కలిగింది. ఓటరు ఓటు వేసిన వెంటనే వీవీ ప్యాట్‌లో ఏడు సెకండ్ల పాటు అతను ఓటు వేసిన పార్టీ గుర్తు కనిపిస్తుంది. ఇవి కూడా చదవండి: 'ఈవీఎం' విశేషాల గురించి.. మీకు పూర్తిగా తెలుసా..!? -
ఓటు వేయకుండానే వెనుదిరిగిన సీఎం జోరాంతంగా.. ఆ తర్వాత
ఐజ్వాల్: ఈవీఎం మొరాయించడంతో మిజోరాం సీఎం జోరాంతంగా ఓటు వేయకుండానే వెనుదిరిగారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి కాసేపు వేచి ఉన్న సీఎం.. అప్పటికీ ఈవీఎం పనిచేయకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చారు. మీడియా సమావేశం తర్వాత మళ్లీ తన ఓటు హక్కుని వినియోగించుకుంటానని స్పష్టం చేశారు. మరికాసేపటి తర్వాత మళ్లీ వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నేడు మిజోరాంలో 40 స్థానాల్లో నేడు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7:00 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. రాజకీయ ప్రముఖుల నుంచి సామాన్య జనం పోలింగ్‌లో పాల్గొన్నారు. ఐజ్వాల్ నార్త్-II అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 19-ఐజ్వాల్ వెంగ్లాయ్ పోలింగ్ స్టేషన్లో ఈరోజు ఉదయం తన ఓటు వేయడానికి సీఎం జోరాంతంగా వెళ్లారు. అదే సమయంలో ఈవీఎం మొరాయించింది. తప్పని స్థితిలో సీఎం జోరాంతంగా వెనుదిరిగారు. మీడియా సమావేశం తర్వాత మళ్లీ తన ఓటు హక్కుని వినియోగించుకుంటానని తెలిపారు. కాసేపయ్యాక మళ్లీ వచ్చి ఓటు వేశారు. రాష్ట్రంలో అసెంబ్లీలోని 40 స్థానాలకు గాను 18 మంది మహిళలు, 27 మంది స్వతంత్రులు సహా 174 మంది అభ్యర్థులు బరిలో దిగారు. మొత్తం 8.57 లక్షల ఓటర్లకుగాను 1,276 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఇదీ చదవండి: ఎన్నికల వేళ మవోయిస్టు పేలుళ్లు.. సీఆర్పీఎఫ్ జవాన్‌కి గాయాలు -
TS Election 2023: 'ఈవీఎం'లపై ఓటర్లకు అవగాహన తప్పనిసరి..
ఆదిలాబాద్: శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)లపై అధికార యంత్రాంగం అవగాహన కల్పిస్తోంది. ఓటర్ల సందేహాలను నివృత్తి చేస్తోంది. ఓటింగ్‌లో కచ్చితత్వానికి వినియోగిస్తున్న వీవీ పాట్లపైనా వివరిస్తోంది. ఈవీఎంలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో చెల్లని ఓట్లకు చెక్ పడింది. భారీయెత్తున కాగితం వినియోగమూ తగ్గింది. ఎప్పటికప్పుడు మార్పులు.. ఈవీఎంలో కంట్రోల్ యూనిట్, బ్యాలెటింగ్ యూనిట్ ఉంటాయి. ఐదు మీటర్ల కేబుల్‌తో ఈ రెండింటిని అనుసంధానం చేస్తారు. బ్యా లెటింగ్ యూనిట్లో 16 మంది అభ్యర్థుల గుర్తులు, పేర్లుంటాయి. 2006 కంటే ముందు ఎం1, ఆ తర్వాత ఎం2 ఈవీఎంలు ఉండగా.. నాలుగు బ్యాలెటింగ్ యూనిట్లను అనుసంధానం చేయడం ద్వారా గరిష్టంగా 64 మంది(నోటాతో కలిపి) అభ్యర్థులు బరిలో ఉన్నా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. 2006 తర్వాత ఎం3 ఈవీఎంలను తయారు చేయగా.. 24 బ్యాలెటింగ్ యూనిట్లను అనుసంధానం చేయడం ద్వారా గరిష్టంగా నోటాతో కలిపి 384 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా ఎన్నికలు నిర్వహించవచ్చు. ఒకే కంట్రోల్ యూనిట్ అవసరం అవుతుంది. అలా మొదలై ఇలా.. బ్యాలెట్ బాక్సు, పేపర్ స్థానంలో ఈవీఎం తీసుకు రావడానికి ఎన్నికల సంఘం 1977లో హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్)ను సంప్రదించింది. దీంతో 1979లో నమూనా ఈవీఎంను రూపొందించింది. దీన్ని ఎన్నికల సంఘం 1980 ఆగస్టు 6న రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ప్రదర్శించింది. ప్రభుత్వ రంగంలోని మరో సంస్థ బెంగళూర్‌లోని భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్(బెల్)తో కలిసి ఈసీఐఎల్ ఈవీఎలను తయారు చేసింది. వినియోగంలోకి.. 1982లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఈవీఎంలను మొదటిసారి వినియోగించారు. కానీ వినియోగానికి సంబంధించి నిర్దిష్ట చట్టం లేకపోవడంతో ఆ ఎన్నికలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఎన్నికల్లో ఈవీఎంల వినియోగానికి సంబంధించి ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని పార్లమెంటులో 1989లో సవరించారు. ఆ తర్వాత 1998లో మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లోని 25 శాసనసభ నియోజకవర్గాల్లో ఈవీఎంలను వినియోగించారు. 1999 ఎన్నికల్లో 45 పార్లమెంటరీ స్థానాల్లో, 2000లో హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో 45 అసెంబ్లీ స్థానాల్లో వినియోగించారు. 2001లో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమబంగాల్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో అన్ని స్థానాల్లో ఈవీఎంలను ఉపయోగించారు. అప్పటి నుంచి ప్రతీ ఎన్నికల్లో ఎన్నికల సంఘం ఈవీఎంలనే వినియోగిస్తోంది. 2004లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో దేశంలోని 543 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈవీఎంలు వినియోగించారు. ఓటు కచ్చితత్వం.. ఓటు కచ్చితత్వానికి వీవీ ప్యాట్(ఓటరు వెరిఫైయేబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్) వినియోగిస్తున్నారు. ఓటు వేయగానే ఒక స్లిప్పై సీరియల్ నంబరు, అభ్యర్థి పేరు, గుర్తు ప్రింట్ అయి బాక్సులో పడుతుంది. 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంల్లో 315కోట్ల ఓట్లు పోలయ్యాయి. ఒకే ఎన్నిక.. 25వేల బ్యాలెట్ యూనిట్లు 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి అత్యధికంగా 185మంది బరిలో నిలిచారు. పార్లమెంటు నియోజకవర్గంలోని 1,788 పోలింగ్ కేంద్రాల్లో మొత్తంగా 25వేల బ్యాలెటింగ్ యూనిట్లు, 2000 కంట్రోల్ యూని ట్లు, 2000 వీవీప్యాట్లు వినియోగించి ఎన్నిక నిర్వహించారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 12బ్యాలెట్ యూనిట్లు, ఒక కంట్రోల్ యూనిట్, ఒక వీవీ ప్యాట్ అమర్చారు. రికార్డు స్థాయిలో అభ్యర్థులు బరిలో నిలిచినా ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించడం దేశంలోనే ఇది మొదటిసారి. కలెక్టరేట్లలో అవగాహన.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది అసెంబ్లీ స్థా నాలు ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముధోల్, ఖా నాపూర్, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్, ఆసిఫాబాద్, సిర్పూర్ ఉన్నాయి. ఎన్నికలు రానున్న నే పథ్యంలో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమురంభీం జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్లలో ఈవీఎంలను ప్రదర్శిస్తూ సంబంధిత అధికారు లు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. -
ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ కసరత్తు
-
నల్గొండ జిల్లాలో 19 నుంచి ఈవీఎంల మొదటి లెవల్ తనిఖీలు ప్రారంభం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మరో నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అందుకు అవసరమైన ఏర్పాట్లపై కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈవీఎంల పరిశీలన ఈనెల 19వ తేదీన నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఓటరు జాబితా ముసాయిదా సవరణ కార్యక్రమం కొనసాగుతోంది. అక్టోబర్ 4న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. ఇక ఇప్పటికే ఎన్నికల నియమావళి మేరకు అధికారులను కూడా బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే. జూలై 31వ తేదీలోగా బదిలీలు చేయాల్సి ఉంది. దీంతో యంత్రాంగం బదిలీల కార్యాచరణపై కూడా కసరత్తు మొదలుపెట్టింది. వేగంగా ఓటరు జాబితా రివిజన్ ఓటరు జాబితా స్పెషల్ సమ్మర్ రివిజన్ కార్యక్రమం జిల్లాలో వేగంగా సాగుతోంది. 2023 అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించనుంది. మరోవైపు ఓటును ఒకచోటనుంచి మరో చోటికి బదిలీ చేసుకోవడంతోపాటు రెండు ఓట్లు ఉన్నవాటిని తొలగించడం, చనిపోయిన వారి ఓట్లు కూడా తొలగించే కార్యక్రమం నిర్వహిస్తోంది. వాటిపై వచ్చిన ఫిర్యాదులను కూడా పరిష్కరించి అక్టోబర్ నాలుగో తేదీన తుది ఓటరు జాబితాను ప్రకటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ జాబితా ఆధారంగానే ఎన్నికలు జరగనున్నాయి. 19 నుంచి పరిశీలన ఈనెల 19వ తేదీ నుంచి ఈవీఎంల పరిశీలన కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈసీఐఎల్ కంపెనీ నుంచి ఈవీఎంలు జిల్లాకు వచ్చాయి. అందులో 3,158 బ్యాలెట్ యూనిట్లు, 2,466 కంట్రోల్ యూనిట్లు 2,667 వీవీ ప్యాట్లు ఉన్నాయి. వాటన్నింటికి ఈనెల 19 నుంచి జూన్ 7వ తేదీ వరకు మొదటి లెవల్ చెకింగ్ చేపట్టనున్నారు. ఈ ప్రక్రియను చేపట్టేందుకు ఈసీఐఎల్ కంపెనీకి చెందిన 15 మంది ఇంజనీర్లు రానున్నారు. గతంలో వాడిన యంత్రాలు మహారాష్ట్రకు.. జిల్లాలో గతంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్, నాగార్జునసాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో వాడిన బీహెచ్ఈఎల్ కంపెనీకి చెందిన ఓటింగ్ యంత్రాలను మహారాష్ట్రలోని చంద్రపురి జిల్లాకు పంపుతున్నారు. ఇందులో 1,940 బ్యాలెట్ యూనిట్లు, 644 కంట్రోల్ యూనిట్లు, 677 వీవీ ప్యాట్లు ఉన్నాయి. వాటన్నింటిని కొన్ని బీహెచ్ఈఎల్ కంపెనీకి పంపగా మిగిలిన వాటిని మహారాష్ట్రకు పంపుతున్నారు. జూలై 31లోగా బదిలీలు పూర్తి చేసేలా.. ఎన్నికల సంఘం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మూడేళ్లు ఒకే చోట పనిచేసిన ఉద్యోగులను బదిలీ చేయాలని ఆదేశించింది. అదేవిధంగా సొంత జిల్లాలో పనిచేసే అధికారులను బదిలీ చేయనున్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా పనిచేసి సస్పెండ్‌కు గురైన వారికి వచ్చే ఎన్నికల్లో విధులను అప్పగించరాదని ఆదేశించింది. వాటన్నింటిని దృష్టిలో ఉంచుకొని జూలై 31లోగా బదిలీ ప్రక్రియను పూర్తి చేసి ఎన్నికల సంఘానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా యంత్రాంగం ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించింది. -
ఎన్నికల అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి
సుభాష్‌నగర్ : సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ఎన్నికల నిర్వహణ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపై దృష్టి కేంద్రీ కరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ సూచించారు. ఓటరు జాబితాలో తమ పేరు తొలగించారని అర్హులైన ఏ ఒక్క ఓటరు నుంచి ఫిర్యాదులు రాకుండా చూడాలని, జాబితా పూర్తి పారదర్శకంగా ఉండేలా పరిశీలించాలన్నారు. కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. ఎన్నికల ఏడాది కావడంతో ఓటరు జాబితా పునఃపరిశీలించుకుని లోటుపాట్లు ఉంటే వెంటనే సరి చేసుకోవాలని తెలిపారు. 2018, 2019 ఎన్నికల సమయంలో ఓటరు జాబితాతో పోలిస్తే, ఓటర్ల సంఖ్య తగ్గినట్లయితే అందుకు గల కారణాలు పరిశీలించాలని, క్షేత్రస్థాయిలో సిబ్బంది ఇంటింటికీ తిరిగి పరిశీలన జరిపే ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఓటర్ల మార్పులు–చేర్పులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని, ఈనెల 23 నాటికి ఇంటింటి సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్తగా ఓటు హక్కు పొందిన వారికి పోస్టల్ శాఖ ద్వారా ఓటరు గుర్తింపు కార్డు అందించే ప్రక్రియ కొనసాగించాలన్నారు. ఇప్పటికే ఈవీఎంల ప్రాథమిక పరిశీలన ప్రక్రియ ఆయా జిల్లాల్లో ప్రారంభమైందని గుర్తుచేశారు. జూలై 01 నాటికి పరిశీలన ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. పోలింగ్ స్టేషన్లు గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని, తప్పనిసరిగా ర్యాంపులు ఏర్పాటు చేయించాలన్నారు. గత ఎన్నికల్లో రాష్ట్ర సగటు కంటే తక్కువ పోలింగ్ నమోదైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ఎన్నికల నియమావళి తు.చ తప్పకుండా అమలయ్యేలా చూడాలని, భద్రతాపరమైన ఏర్పాట్లపై దృష్టి కేంద్రీకరించాలని డీజీపీ అంజనీకుమార్ యాదవ్ పోలీస్ కమిషనర్లు, ఎస్పీలకు సూచించారు. కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, ఇన్చార్జి సీపీ ప్రవీణ్ కుమార్, ట్రెయినీ అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి, నియోజకవర్గాల ఎన్నికల అధికారులు డీఆర్డీవో చందర్, జెడ్పీ సీఈవో గోవింద్, ఆర్డీవోలు రవి, రాజేశ్వర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్ తదితరులు పాల్గొన్నారు. -
కర్ణాటక కాంగ్రెస్ కమిటీకి ఈసీ లేఖ
ఢిల్లీ: మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయి ఓటింగ్ శాతంతో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. శనివారం(మే 13న) వెలువడబోయే ఫలితాలపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే.. సర్వేలన్నీ దాదాపుగా అనుకూలంగా వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలు ట్యాంపరింగ్‌కు గురయ్యాయని ఆరోపించడం.. దానికి బదులుగా ఎన్నికల సంఘం లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేంద్రం ఎన్నికల సంఘం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలపై స్పందించింది. కర్ణాటక ఎన్నికల్లో వాడిన ఈవీఎంలన్నీ కొత్తవేనని, క్షుణ్ణంగా తనిఖీలు చేశాకే వాటిని ఎన్నికల్లో ఉపయోగించామని కాంగ్రెస్‌కు రాసిన లేఖలో స్పష్టం చేసింది. కాంగ్రెస్ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ఉపయోగించిన ఈవీఎంలను గతంలో దక్షిణాఫ్రికాలో ఎన్నికల కోసం ఉపయోగించారని!. వాటిని తెప్పించి కనీసం పనితీరును పరిశీలించకుండా కర్ణాటక ఎన్నికలకు ఉపయోగించారని. అయితే ఈసీ ఈ అనుమానాల్ని, ఆరోపణల్ని ఖండించింది. ఈవీఎంలను తాము సౌతాఫ్రికాకు ఎన్నడూ పంపలేదని స్పష్టం చేసింది. అంతేకాదు ఎన్నికల కోసం వాడిన ఈవీఎంలు కొత్తవేనన్న విషయం కాంగ్రెస్‌కు తెలుసని ఈసీ పేర్కొంది. ఈ విషయంలో కాంగ్రెస్ చేస్తున్నది నిరాధారాపూరిత ఆరోపణలని, ఉద్దేశపూర్వకంగా కనిపిస్తున్న ఆ ఆరోపణల వెనుక కుట్ర దాగి ఉండొచ్చని, మే 15 సాయంత్రం ఐదు గంటలలోపు ఆ ఆరోపణల వెనుక ఉన్నవాళ్ల పేర్లను, వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలంటూ కర్ణాటక కాంగ్రెస్ కమిటీని లేఖలో ఈసీ కోరింది. -
స్ట్రాంగ్ రూమ్స్ లో ఈవీఎంలు...
-
కర్ణాటక ఎన్నికలో రచ్చ రచ్చ...
-
రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్‌పై అనుమానాలు.. నో చెప్పిన ప్రతిపక్షాలు
సాక్షి, ఢిల్లీ: రాజకీయ పార్టీలతో సీఈసీ సమావేశం ముగిసింది. రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్‌పై ఎన్నికల సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 8 జాతీయ పార్టీలు, 40 ప్రాంతీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. కాగా, ఈ సమావేశం సందర్బంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆర్వీఎం నమూనాకు ప్రదర్శించింది. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు ఆర్వీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశాయి. వలస ఓటర్లపై శాస్త్రీయ సర్వే లేకుండా వారికి ఎలా గుర్తిస్తారని రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించాయి. దీంతో, అన్ని రాష్ట్రాల్లో సమావేశాలు నిర్వహించాలని పార్టీలు ఎన్నికల సంఘాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 26 వరకు రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా తెలిపేందుకు ఎన్నికల సంఘం గడువు పెంచింది. -
పాక్‌లో ప్రవాసుల ఓటు హక్కు రద్దు చేసే సవరణ బిల్లు
Pakistan To Ban Overseas Citizens From Voting, Stops Use Of EVMs: ఎలక్ట్రానిక్ యంత్రాల(ఈవీఎం)ల వినియోగాన్ని నిలిపేయడం తోపాటు, ప్రవాసులు ఓటు హక్కు రద్దు చేస్తు పాక్ నేషనల్ అసెంబ్లీ ఒక కొత్త చట్ట సవరణ బిల్లును ఆమోదించింది. అంతేకాదు సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించడాని కంటే ముందు స్థానిక ఉప ఎన్నికల్లో మరిన్ని పైలెట్ ప్రాజెక్టులు నిర్వహించడమే ఈ బిల్లు మొదటి లక్ష్యంగా పేర్కొంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ముర్తాజా జావేద్ అబ్బాసీ సమర్పించిన ఎన్నికల చట్ట సవరణ బిల్లు 2022ను దిగువ సభలో మెజారిటీ ఓట్లతో ఆమోదిం పొందింది. ఐతే ఈ బిల్లును కేవలం గ్రాండ్ డెమోక్రటిక్ అలయన్స్ సభ్యులు మాత్రమే వ్యతిరేకించారు. ఈ మేరకు ముస్లిం లీగ్ నవాజ్(పీఎంఎల్ఎన్) మంత్రి అజం నజీర్ తరార్ ఈ బిల్లు ప్రాముఖ్యతను వివరిస్తూ....ఎన్నికల చట్టం 2017 సవరణలకు ముందు ఉన్న విధంగా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా ఈ బిల్లు చేస్తుందని చెప్పారు. ఈ బిల్లు చట్టంలోని సెక్షన్ 94, 107కి సంబంధించిన సవరణలని తెలిపారు. అంతేకాదు గత పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్(పీటీఐ) ప్రభుత్వం ఎన్నికల చట్టం 2017కి పలు సవరణలు చేసిందని గుర్తు చేశారు. అలాగే పాకిస్తాన్ ఎన్నికల సంఘం(ఈసీపీ) కూడా తక్కువ సమయంలో ఈవీఎంల ద్వారా ఎలాంటి గ్రౌండ్ వర్క్ లేకుండా ఎన్నికలు నిర్వహించలేమంటూ అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేందుకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని కూడా స్పష్టం చేశారు. ఐతే పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. అంతేకాదు పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ (పీఎంఎల్ఎన్) ప్రధాన మంత్రి షెహబాజ్ షెరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వ తిరోగమన చర్యగా పేర్కొంది. పీటీఐతొమ్మిది మిలియన్లకు పైగా పాకిస్తానీ విదేశీయులకు ఓటు హక్కును కల్పిస్తే ఈ దుండగుల ప్రభుత్వం వాటిని హరించే లక్ష్యంతో సవరణలు చేసిందంటూ ఆరోపణలు గుప్పించింది. -
22 స్థానిక సంస్థల ఎన్నికలు ఈవీఎంలతోనే
సాక్షి, అమరావతి: గతంలో ఎన్నికలు జరగని 22 నగరపాలక సంస్థలు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఈవీఎంల విధానంలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 17 నగరపాలక సంస్థలు, 106 మునిసిపాలిటీలు, నగర పంచాయతీలున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో కాకినాడ కార్పొ రేషన్ ఎన్నికలు జరిగాయి. వైఎస్సార్సీపీ అధికా రంలోకి వచ్చిన తరువాత గత ఏడాది మార్చిలో 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలకు, నవంబర్‌లో నెల్లూరు నగరపాలక సంస్థకు, 12 పుర పాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించింది. ఈ రెండు విడతల్లోను బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు జరిగాయి. కోర్టు కేసుల కా రణంగా రాజమహేంద్రవరం (రాజమండ్రి), శ్రీకా కుళం, మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థల్లో ను, ఆముదాలవలస, రాజాం (శ్రీకాకుళం జిల్లా), తణుకు, పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, చింతలపూడి (పశ్చిమగోదావరి), వైఎస్సార్ తాడి గడప, గుడివాడ (కృష్ణా), బాపట్ల, పొన్నూరు, నర సరావుపేట (గుంటూరు), కందుకూరు, పొదిలి (ప్రకాశం), కావలి, గూడూరు, అల్లూరు (నెల్లూరు), బి.కొత్తకోట, శ్రీకాళహస్తి (చిత్తూరు జిల్లా) పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగలేదు. కోర్టు కేసులు కొలిక్కి వస్తే వీలైనంత త్వరగా వీటికి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నాహాలు చేస్తోంది. ఉమ్మడి ఏపీలో ఈవీఎంల విధానంలోనే.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వారం రోజుల కిందట తన కార్యాలయ అధికారులతో సమావేశం నిర్వహించి ఈవీఎంల విధానంలో ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మునిసిపల్ ఎన్నికలు ఈవీఎంల విధానంలో నిర్వహించిన విషయాన్ని అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. దాదాపు 8 వేల ఈవీఎంలు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. 22 నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చినా నాలుగువేల బూత్‌లలోనే పోలింగ్ ఉంటుందని, ఇందుకు ఆ ఈవీఎంలు సరిపోతాయని వివరించారు. అసెంబ్లీ, లోకసభ ఎన్నికలను ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లతో కలిపి ఉండే మిషన్లతో నిర్వహిస్తున్నారని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద వీవీప్యాట్లు లేని పాత ఈవీఎంలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా ఈవీఎంలకు వీవీప్యాట్లను అనుసంధానం చేసే అంశంపై ప్రభుత్వరంగ సంస్థ ఈసీఐఎల్‌ను సంప్రదించి తదుపరి చర్యలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. కోర్టు కేసులపైనా దృష్టి ఎన్నికలు జరగని 22 నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులు ఎప్పటికప్పుడు మునిసిపల్‌శాఖ అధికారులతో సంప్రదిస్తున్నారు. నెలరోజుల కిందట నీలం సాహ్ని మునిసిపల్‌శాఖ అకారులతో సమావేశమై ఆయా కేసుల పరిస్థితి గురించి తెలుసుకున్నారు. -
అనగనగా.. ఓ ఈవీఎం.. దీని జీవితకాలమెంతో తెలుసా?
సాక్షి, కరీంనగర్: ప్రజాస్వామ్య దేశంలో ఓటు వజ్రాయుధం. ప్రభుత్వాలను నిలబెట్టాలన్నా.. పడగొట్టాలన్నా.. ఈ ఓటుతోనే సాధ్యం. దేశంలో 18సంవత్సరాలు నిండిన ప్రతీ భారతీయుడికి ఓటేయడం ప్రాథమికంగా రాజ్యాంగం కల్పించే హక్కు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన చాలా ఏళ్ల వరకు బ్యాలెట్ (కాగితం)తోనే ప్రజలు ఓటు వేసేవారు. సాంకేతికతకు అనుగుణంగా ఓటింగ్ విధానంలోనూ మార్పులు వచ్చాయి. కాగితంతో లెక్కింపు, భద్రపరచడం తదితర కారణాలతో ఓటింగ్ ప్రక్రియ అధిక సమయం తీసుకుంటుందని కేంద్రం గుర్తించింది. అందుకే, దేశంలో 1982 నుంచి ఈవీఎంలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈవీఎంలు అంటే ఏంటి? ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. ఈవీఎంలు మొదటిసారిగా కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించారు. ఈవీఎంలో రెండు భాగాలు ఉంటాయి. మొదటిది కంట్రోల్ యూనిట్ కాగా, రెండవది బ్యాలెటింగ్ యూనిట్. కంట్రోల్, బ్యాలెటింగ్ యూనిట్లను ఒకేసారి కనెక్ట్ చేస్తారు. కంట్రోల్ యూనిట్ పోలింగ్ బూత్ ఆఫీసర్ వద్ద ఉంటుంది. బ్యాలెటింగ్ యూనిట్లో ఓటర్లు ఓటు వేస్తారు. కంట్రోల్ యూనిట్లో ఉన్న బ్యాలెట్ బటన్ పోలింగ్ బూత్ ఆఫీసర్ ప్రెస్ చేసినప్పుడు మాత్రమే బ్యాలెటింగ్ యూనిట్లో ఓటరు ఓటు వేయగలడు. చదవండి: ఈ విషయం తెలుసా..? టీఆర్ఎస్కు మూడు గుర్తులు ►ఒక్కసారి బ్యాలెట్ యూనిట్లో ఓటరు పక్కనున్న అభ్యర్థి బటన్ క్లిక్ చేయగానే లైట్ వెలుగుతుంది. వెంటనే బజర్ సౌండ్ వస్తుంది. తర్వాత ఈవీఎం లాక్ అవుతుంది. పోలింగ్ బూత్ ఆఫీసర్ కంట్రోల్ యూనిట్లో బటన్ ప్రెస్ చేస్తే తిరిగి ఓపెన్ అవుతుంది. ►ఈవీఎంలు నిమిషానికి ఐదు ఓట్లు మాత్రమే పరిమితం చేస్తాయి. ఈవీఎంలు 6 ఓల్ట్ అల్కాలైన్ బ్యాటరీల ద్వారా పనిచేస్తాయి. ఒక్కో బ్యాలెట్ యూనిట్లో 16 క్యాండెట్స్‌ను ఉంచవచ్చు. అలా నాలుగు బ్యాలెట్ యూనిట్లను కనెక్ట్ చేయవచ్చు. చదవండి: Huzurabad Bypoll: వీళ్లు అభ్యర్థులే కానీ ఇక్కడ ఓటేసుకోలేరు.. ►ఒక్క నియోజకవర్గంలో 64 మంది క్యాండెట్స్కే పరిమితం ఉంటుంది. ఒకవేళ 64 మందికి పైగా క్యాండెట్స్ ఉంటే ఆ నియోజకవర్గంలో బ్యాలెట్ పేపర్లతో ఓటింగ్ నిర్వహిస్తారు. ఒక్క ఈవీఎం 3,840 ఓట్లను స్టోర్ చేస్తుంది. ఈవీఎంలు హాక్ అవ్వవు. ఈ సాఫ్ట్‌వేర్‌ను సిలికాన్ చిప్‌లో ఉంచేస్తారు. ►ఈవీఎంలు అక్కడక్కడా టాంపరింగ్ అవుతున్నాయని వార్తలు రావడంతో ఎలక్షన్ కమిషన్ ఓటరు– వెరిఫైడ్ పేపర్ అడిట్ ట్రయల్ (వీవీప్యాట్) అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల ఓటరు బ్యాలెటింగ్ యూనిట్ బటన్ నొక్కగానే దేనికి ఓటు వేశాడో ఒక పేపర్‌పైనే ప్రింట్ అవుతుంది. ఇది కొన్ని సెకన్లు ఉండి వెళ్లిపోతుంది. ఓటరు సరిగ్గా ఓటు వేశాడో లేదో చూసుకోవచ్చు. వీవీప్యాట్లు సీజ్ చేసి ఉంటాయి. ఈవీఎం టాంపరింగ్ అయిందని అనుమానం వస్తే వీవీప్యాట్‌లో ప్రింట్ అయిన ఓట్లను బ్యాలెట్ పేపర్‌లాగా లెక్కిస్తారు. ►ఈవీఎంలను మన దేశానికి చెందిన రెండు కంపెనీలు తయారు చేస్తాయి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) బెంగళూరు, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), హైదరాబాద్. ఈవీఎంలకు వాడే సాఫ్ట్వేర్ కోడ్ అందులో పనిచేసే ఇంజినీర్లకు మాత్రమే తెలుసు. ఈవీఎంలలో మూడు మోడల్స్ ఉన్నాయి. ►మొదటి మోడల్‌ను 1989–2006 వరకు మ్యాన్‌ఫ్యాక్చర్ చేశారు. దీనిని 2014 ఎన్నికల్లో చివరిగా వినియోగించారు. రెండో మోడల్ 2006 నుంచి 2012 వరకు మ్యాన్‌ఫ్యాక్చర్ చేశారు. మూడో మోడల్ 2013లో మ్యాన్ ఫ్యాక్చర్ చేయగా, ప్రస్తుతం దీనినే ఉపయోస్తున్నారు. ఇది ట్యాంపర్ ప్రూఫ్ మోడల్. ప్రతీ ఈవీఎం మ్యాన్‌ఫ్యాక్చర్ చేసిన తరువాత రాజకీయ పార్టీల ఎదుట చెక్ చేస్తారు. పోలింగ్ అయిపోయిన తరువాత కంట్రోల్ యూనిట్లో ఉన్న క్లోజ్ బటన్‌ను ప్రెస్ చేస్తారు. దీంతో ఈవీఎం సీల్ అవుతుంది. ►ఒక్కసారి మ్యాన్‌ఫ్యాక్చర్ చేసిన ఈవీఎంలను 15 సంవత్సరాల వరకు వినియోగిస్తారు. తరువాత ఈవీఎంలో చిప్స్‌ను ఎలక్షన్ ఆఫీసుకు అప్పగిస్తారు. -
‘ఎన్నికల’ పిటిషన్ల దాఖలుకు టైమ్‌లైన్ విధించండి
న్యూఢిల్లీ: అస్సాం, కేరళ, ఢిల్లీ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పిటిషన్లు దాఖలు చేయడానికి నిర్ధిష్టమైన గడువు(టైమ్‌లైన్) విధించాలని కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలు, వీవీప్యాట్లు ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నాయని పేర్కొంది. ఆయా రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి పిటిషన్లు దాఖలు చేయడానికి కోవిడ్–19 సెకండ్ వేవ్ కారణంగా గడువును పెంచుతూ న్యాయస్థానం ఉత్తర్వులిచ్చిందని, ఫలితంగా 6 రాష్ట్రాల ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలు, వీవీప్యాట్లను తాము ఇంకా భద్రపర్చాల్చి వస్తోందని పేర్కొంది. త్వరలో జరగబోయే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు పెద్దసంఖ్యలో ఈవీఎంలు, వీవీప్యాట్లు అవసరమని తెలియజేసింది. ఈ మేరకు బుధవారం సుప్రీంకోర్టులో ఒక వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై తక్షణమే విచారణ చేపట్టాలని కోరింది. ఎన్నికల సంఘం వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పందించింది. దీనిపై వచ్చేవారం విచారణ చేపడతామని స్పష్టం చేసింది. 6 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951 కింద పిటిషన్లు దాఖలు చేయడానికి గడువును పెంచుతూ సుప్రీంకోర్టు ఈ ఏడాది ఏప్రిల్ 27న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ గడువును పెంచుతున్నట్లు కోర్టు ప్రకటించింది. ఎన్నికైన అభ్యర్థులపై, ఎన్నికల ప్రక్రియపై అభ్యంతరాలుంటే ఎవరైనా సరే కోర్టును ఆశ్రయించవచ్చు. కోర్టులో విచారణ ముగిసి, తీర్పు వచ్చేదాకా సదరు ఈవీఎంలు, వీవీప్యాట్లను భద్రపర్చాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే. కోర్టులు వాటిని సాక్ష్యంగా పరిగణిస్తాయి. సాధారణ పరిస్థితుల్లో ఫలితాలు ప్రకటించిన 45 రోజుల్లోగా పిటిషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ 27న సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వు వల్ల భారీ సంఖ్యలో ఈవీఎంలు, వీవీప్యాట్లు ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నాయి. త్వరలో జరగబోయే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం వాటిని విడుదల చేయాలని ఎన్నికల సంఘం కోరుతోంది. -
దీదీ ఓటమి ఖాయం
బంకురా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓడిపోవడం ఖాయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. ఓటమిని ఆమె ముందే ఊహించారు కాబట్టే సాకు కోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) పనితీరును ప్రశ్నిస్తున్నారని చెప్పారు. ఈవీఎంలతో జరిగిన ఎన్నికల్లోనే ఆమె పదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చారని గుర్తుచేశారు. ప్రధాని మోదీ ఆదివారం బెంగాల్‌లోని బంకురాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. బెంగాల్లో అసలైన మార్పు (అసోల్ పరివర్తన్) కచ్చితంగా వస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధితోపాటు యువత ఆకాంక్షలను నెరవేర్చడానికి మార్పు తప్పనిసరి అని అన్నారు. బెంగాల్లో అవినీతి ఆట ఇక సాగదని వ్యాఖ్యానించారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం కావాలి మమతా బెనర్జీ తన తలపై కాలితో తన్నుతున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ చిత్రీకరించిన వాల్ పోస్టర్లను నరేంద్ర మోదీ ప్రస్తావించారు. ‘‘130 కోట్ల మంది ప్రజల ఎదుట ఎల్లప్పుడూ శిరస్సు వంచుతూనే ఉంటా. నా తలపై మమతా బెనర్జీ కాలు పెట్టొచ్చు, నన్ను తన్నొచ్చు. కానీ, బెంగాల్ ప్రజల కలలను తన్ని పారేస్తానంటే మాత్రం అనుమతించే ప్రసక్తే లేదు’’ అని ఘాటుగా హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్ నిధి వంటి పథకాలను బెంగాల్లో దీదీ ప్రభుత్వం అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. స్కీమ్‌లపై బీజేపీ నడుస్తుండగా, స్కామ్‌లపై తృణమూల్ కాంగ్రెస్ నడుస్తోందని ఆరోపించారు. మమతా బెనర్జీ పదేళ్లుగా బెంగాల్ ప్రజల జీవితాలతో అడుకుంటున్నారన్నారు. ఇక ఆమె ఆట ముగిసి, అభివృద్ధి మొదలవుతుందని పేర్కొన్నారు. బెంగాల్ ప్రగతి కోసం డబుల్ ఇంజన్ ప్రభుత్వం (కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ సర్కారు) కావాలన్నారు. ప్రజలకు అవినీతి రహిత సేవలు, అభివృద్ధి కోసం బీజేపీ అధికారంలోకి రావాలని చెప్పారు. -
బిహార్‌లో ఈవీఎంలను ట్యాంపర్ చేశారా!?
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని 58 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఫలితాలు రావడం ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు బిహార్‌లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి 127 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, 105 స్థానాల్లో ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ ముందంజలో ఉంది. ఇక మధ్యప్రదేశ్‌లోని 28 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ 19 స్థానాల్లో, కాంగ్రెస్ 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో పది రౌండ్లు ముగిసేటప్పటికీ పాలకపక్ష టీఆర్ఎస్కంటే బీజేపీ అభ్యర్థి 3,734 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతోంది. బిహార్‌లో పాలకపక్షమైన జేడీయు–బీజేపీ కూటమి ఓడిపోతుందని, ఆర్జేడీ–కాంగ్రెస్ కూటమి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ తెలియజేయగా, వెలువడుతున్న ఫలితాల తీరు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. బిహార్ పోలింగ్‌లో అక్రమాలకు పాలకపక్షం వ్యూహం పన్నిందని, అందుకు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిందని ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణల్లో నిజం లేకపోలేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్కసారే పలు యంత్రాలను ట్యాంపరింగ్ చేయడం కుదరదని, అయితే వేర్వేరుగా ఏ ఈవీఎంనైనా ట్యాంపరింగ్ చేయవచ్చని పలువురు సాంకేతిక నిపుణులు ఇది వరకే సాక్ష్యాధారాలతో నిరూపించారు. (చదవండి: నితీష్‌కు సీఎం పీఠం దక్కుతుందా?) ఎన్నికల్లో భారీ సంఖ్యలో ఈవీంలను ఉపయోగిస్తారు కనుక, వాటన్నింటిని ట్యాంపరింగ్ చేయడం సాధ్యం కాదని నిపుణులే స్పష్టం చేశారు. అయితే ఫలితాలను తారుమారు చేయాలంటే అన్ని ఈవీఎంలను ట్యాంపర్ చేయాల్సిన అవసరం లేదని, అలా చేయడం వల్ల అనుమానాలొస్తాయని, అవసరమైన నియోజక వర్గాల్లో, అవసరమైన చోట కొన్ని ఈవీఎంల చొప్పున ట్యాంపరింగ్ చేయడం ద్వారా ఆశించిన ఫలితాలు సాధించవచ్చని ఎన్నికల విశ్లేషకులు పేర్కొన్నారు. బీహార్‌లోని 40 లోక్‌సభ స్థానాలకు 2019లో జరిగిన ఎన్నికల్లో 39 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడం పట్ల పెద్ద ఎత్తున ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ నాడు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ సారి అసెంబ్లీ ఎన్నికలపై కూడా తనకు విశ్వాసం లేదని, ఈవీఎంలన్నీ ‘మోదీ ఓటింగ్ మెషిన్లే’ అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గత బుధవారం విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి వచ్చిన ఆరోపణలను దృష్టిలో పెట్టుకొని ఈసారి బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఈవీఎం (ఎం2) వెర్షన్‌ను కాకుండా వాటిని ఈవీఎం (ఎం3) వెర్షన్‌గా అభివద్ధి చేసి ఉపయోగించారు. అయితే, వాటన్నింటికి ‘ఓటర్ వెరిఫైడ్ ఆడిట్ ట్రయల్ స్లిప్స్’ లేవు. 50 శాతం ఈవీఎంలకు ఆ సౌకర్యం ఉండాలంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తూ వస్తోంది. ఈ విషయమై సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించింది. ఇరువర్గాల వాదనలను విన్న సుప్రీం కోర్టు, మధ్యేమార్గంగా ప్రతి నియోజకవర్గానికి ఓట్ల ఆడిట్ ట్రయల్స్‌కు అవకాశం ఉన్న ఐదు ఈవీఎంల చొప్పున ఉపయోగించాల్సిందిగా ఆదేశించింది. ఈ నేపథ్యంలో బీహార్ ఎన్నికల ఫలితాల తీరు, ఎగ్జిట్ పోల్ ఫలితాలకు భిన్నంగా ఉండడంతో ఈవీఎంల పనితీరుపై అనుమానాలు రెట్టింపవుతున్నాయి. (చదవండి: ఒకవేళ ఓడితే.. కారణాలు ఇవే!) -
ఈవీఎంలా.. బ్యాలెటా?
సాక్షి, హైదరాబాద్: నాలుగైదు నెలల్లో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కోవిడ్ నేపథ్యంలో ఈవీఎంలను వినియోగించాలా? బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించాలా? అనే అంశంపై అధికారులు యోచిస్తున్నారు. దీంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఆన్‌లైన్‌ను ఎక్కువగా వినియోగించుకోవాలని, ప్రజల్లో అవగాహన పెంచి, పోలింగ్ శాతం పెరిగేందుకు కృషి చేయాలని భావిస్తున్నారు. నూతనంగా ఎంపికైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి శుక్రవారం జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల సంసిద్ధత, కోవిడ్ నేపథ్యంలో దురయ్యే సవాళ్లు, తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో భాగంగా నిర్వహించాల్సిన వివిధ పనుల గురించి జోనల్ నుంచి సర్కిల్ స్థాయి అధికారులకు శిక్షణ నిచ్చేందుకు కార్యాచరణ రూపొందించాలన్నారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ అప్లికేషన్స్‌పై ఎన్నికల విధుల్లోని వారు తగిన అవగాహన కలిగి ఉండాలని, ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్ సిబ్బ ంది ర్యాండమైజేషన్ తదితర అంశాలు తెలిసి ఉండాలన్నారు. ఎన్నికలు పారదర్శకంగా, పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించేందుకు, పోలింగ్ ప్రక్రియ త్వరితంగా జరిగేందుకు టెక్నాలజీని ఎక్కువగా వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికలు సక్రమంగా నిర్వహించేందుకు సీజీజీ సహకారంతో ఫేస్ రికగ్నిషన్, తదితరమైనవి వినియోగించుకోవాలన్నారు.గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.29 శాతం పోలింగ్ మాత్రమే జరిగిందని, ఈసారి పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఇంటెన్సివ్ ఓటర్ అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్‌కు సూచించారు. ఇందుకు ఎన్జీఓలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, ఇతర పౌరసేవల సహకారం తీసుకోవాలన్నారు. కోవిడ్ కారణంగా ఎన్నికల సందర్భంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎన్నికల సంఘం జారీ చేసే మార్గదర్శకాలను పాటించాలని పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా ఈవీఎంలా.. లేక బ్యాలెట్లా అన్నదానిపై చాలాసేపు చర్చించారు. దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎన్నికల నిర్వహణ, కార్యాచరణకు సంబంధించి అక్టోబర్ రెండో వారంలో జోనల్, డిప్యూటీ కమిషనర్లతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో అడిషనల్ సీఈఓ జ్యోతి బుద్ధప్రకాశ్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఎన్నికల సంఘం వినూత్న నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం వినూత్న ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్ సమయంలో వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా కట్టదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే 65 ఏళ్ల పైబడిన వాళ్లతో పాటు కోవిడ్ బాధితులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించిన ఈసీ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఈవీఎం బటన్ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయించింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయానికి ఈ ప్రయోగాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ మధ్య ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలింగ్ సందర్భంగా కరోనా వ్యాప్తి చెందకుండా ఈసీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. (కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం) పోలింగ్ కేంద్రాలకు వచ్చే వారికి ఖాదీ మాస్కులతో పాటు శాటిటైజర్ కూడా చేయనుంది. ఓటింగ్ కేంద్రాల్లో ఎక్కువ మంది గుమిగూడకుండా ఉండేందుకు అదనంగా 45 శాతం పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేయనుంది. అలాగే ఒక్కో పోలింగ్ కేంద్రంలో వెయ్యి మంది ఓటర్లకు మాత్రమే అవకాశం కల్పించనుంది. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు అధికారులు పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేయనున్నారు. మరోవైపు ప్రాణాంతక కరోనా వైరస్ ఇప్పట్లో తగ్గే అవకాశం కనిపించకపోవడంతో జాగ్రత్తలు పాటిస్తూనే ఎన్నికల నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. -
ఎన్నికల్లో బ్లాక్‌చైన్ వ్యవస్థ
న్యూఢిల్లీ: ఐఐటీ మద్రాస్‌తో కలసి బ్లాక్ చైన్ వ్యవస్థపై పనిచేస్తున్నామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా చెప్పారు. ఢిల్లీలో బుధవారం జరిగిన ‘టైమ్స్ నౌ సమిట్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈవీఎంల గురించి పలు విషయాలు మాట్లాడారు. బ్లాక్‌చైన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే ఒక ఓటర్ వేరే రాష్ట్రంలో ఉండి కూడా తమ రాష్ట్రంలోని ఎన్నికల్లో ఓటేయవచ్చని చెప్పారు. ఉదాహరణకు రాజస్తాన్‌కు చెందిన వ్యక్తి చైన్నైలో ఉద్యోగం చేస్తుంటే, రాజస్తాన్‌లో జరిగే ఎన్నికలకు చైన్నైలోనే ఓటేయవచ్చు. కారు లేదా పెన్నులాగే ఈవీఎంలు కూడా మొరాయించవచ్చేమోగానీ టాంపర్ చేయడం అసాధ్యమని చెప్పారు. -
బీజేపీలో అత్యంత నిజాయితీపరుడు ఆయనే..
న్యూఢిల్లీ : ఈవీఎంల్లో ఏ బటన్ నొక్కినా ప్రతి ఓటూ పాలక పార్టీకే వెళుతుందని హర్యానా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ఓ బీజేపీ అభ్యర్థి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ వ్యాఖ్యలు చేసి ఈసీ నోటీసులు అందుకున్న ఎమ్మెల్యే బక్షిత్ సింగ్ విర్క్‌ను ఉద్దేశిస్తూ బీజేపీలో అత్యంత నిజాయితీపరుడు ఆయనేనని రాహుల్ వ్యాఖ్యానించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుండగా రాహుల్ ఈ మేరకు ట్వీట్ చేయడంతో పాటు బీజేపీ ఎమ్మెల్యే చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియోను పోస్ట్ చేశారు. కాగా తాను పోటీ చేస్తున్న అసంధ్ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ బీజేపీ అభ్యర్ధి బక్షిత్ సింగ్ విర్క్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మీలో ఎవరు ఓటు వేసేందుకు వెళ్లినా మాకు తెలుస్తుంది..మాకు తెలియదని అనుకోకండి..మీరు ఎవరికి ఓటేశారో తెలుసుకోవాలనుకుంటే మేం తెలుసుకోగలం ఎందుకంటే మోదీజీ చాలా తెలివైనవారు..మనోహర్ లాల్ (హర్యానా సీఎం) తెలివైన వార’ంటూ ఆయన మాట్లాడుతున్న వీడియో ఆన్లైన్లో వైరల్ అయింది. మీరు ఎవరికి ఓటు వేసిన అది కమలం గుర్తుకే వెళుతుంది..ఈవీఎంల్లో మేం ఇందుకు తగిన ఏర్పాటు చేశామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ వీడియోపై తీవ్రంగా స్పందించిన ఈసీ బీజేపీ అభ్యర్థి విర్క్‌కు నోటీసులు జారీ చేసింది. అసంద్ నియోజకవర్గంలో పోలింగ్ పర్యవేక్షణకు ప్రత్యేక అబ్జర్వర్‌ను నియమించింది. కాగా తాను మాట్లాడినట్టు నకిలీ వీడియోను వైరల్ చేస్తున్నారని, ఈవీఎంలపై తాను ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని ఆయన వివరణ ఇచ్చారు. -
టెన్షన్..టెన్షన్
నరాలు తెగే ఉత్కంఠ.. గెలిచేదెవరంటూ చర్చోపచర్చలు.. పందెంరాయుళ్ల బెట్టింగులు.. తమ అభ్యర్థే గెలుస్తాడంటే.. కాదు తమవాడే అంటూ సాగిన సవాళ్లు.. ప్రతి సవాళ్లకు మరో 24 గంటల్లో తెరపడనుంది. హోరాహోరీగా పోరాడిన అభ్యర్థుల భవితవ్యంపై ఓటర్లు ఇచ్చిన తీర్పు గురువారం వెలువడనుంది. పోటీలో ఉన్న అభ్యర్థులు ఇన్ని రోజులు పైకి బాగానే కనబడ్డా లోలోపల మాత్రం ఫలితాలపై ఆందోళనతోనే ఉన్నారు. చిత్తూరు అర్బన్: జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంటు స్థానాల ఫలితాలు వెలువడ్డానికి ఒక్క రోజు మిగిలి ఉంది. ఈ ఏడాది మార్చి 10న సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడం, ఏప్రిల్ 11న తొలి విడతలో జిల్లాలోని ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగడం చకచకా జరిగిపోయాయి. అయితే తుది విడత ఎన్నికలు పూర్తయితే తప్ప ఓట్ల లెక్కింపు చేపట్టకూడదనే నిబంధన ఉండటంతో పోటీలో ఉన్న రాజకీయ పార్టీల అభ్యర్థులు ఒకింత డీలా పడిపోయారనే చెప్పాలి. ఇప్పుడు ఓట్లేస్తే 43 రోజుల తర్వా త ఫలితాలు చెబుతారా అంటూ నిట్టూర్చారు. కానీ కాలచక్రం గిర్రున తిరిగింది. 43 రోజుల్లో 42 రోజులు చకచకా గడిచిపోయాయి. ఫలితాలు వెలువడే రోజు వచ్చేస్తోందని డీలాపడ్డ అభ్యర్థులే ఎగిరి గంతేస్తున్నారు. ఆ గంతుల్లో పలువురు అభ్యర్థులు కాస్త ఆందోళన, కొంచెం ధైర్యం, మరికొంత మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నారు. తొలి ఓట్లు పోస్టల్ బ్యాలెట్లే.. ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 8 గంటలకు ప్రాంరభమవుతుంది. ఈవీఎం యంత్రాలను లెక్కింపు కేంద్రాల్లో ఉంచిన తర్వాత ప్రిసైండింగ్ అధికారులు, రిటర్నింగ్ అధికారుల సమక్షంలో తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెల్ ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఈవీఎంలను లెక్కిస్తారు. ఇది పూర్తయ్యాక ప్రతి నియోజకవర్గంలోని 5 వీవీప్యాట్లలో ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇందులో తేడా వస్తే మళ్లీ లెక్కిస్తారు. అప్పటికే తేడా ఉంటే వీవీప్యాట్దే తుదిగా పరిగణనలోకి తీసుకుంటారు. ఇలా అన్ని నియోజకవర్గాల్లో తుది ఫలితాలు రావడానికి రాత్రి 8 గంటలు పట్టే అవకాశముంది. అయితే ఏకపక్షంగా అభ్యర్థులకు తొలిరౌండ్ నుంచే ఆధిక్యం కొనసాగితే ఓట్ల లెక్కింపు ప్రారంభమైన గంటన్నరలో ఫలితం తెలిసిపోతుంది. మెజారిటీపై లెక్కలు.. ఇప్పటికే జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పోటీచేసిన అభ్యర్థుల్లో కొందరు ధీమాగా ఉన్నారు. గెలుపు దాదాపు ఖరారైపోయిందని, మిగిలింది మెజారిటీ ఎంతొస్తుందనే దానిపైనే లెక్కలు వేసుకుంటున్నారు. ఇందులో మండలాల వారీగా ఏయే ప్రాంతంలో ఎంత మెజారిటీ వస్తుంది..? అక్కడున్న సామాజికవర్గాల వారీగా ఓట్ల వివరాలు, కలిసొచ్చే అనుకూల అంశాలు, మెజారిటీ రాకపోవడానికి ప్రతికూల అంశాలపై బేరీజు వేస్తున్నారు. కొన్నిచోట్ల అయితే మొన్నటి వరకు 20 వేల ఓట్ల మెజారిటీతో తానే గెలుస్తానని ధీమాగా ఉన్న అభ్యర్థులు గెలిస్తే చాలు దేవుడా అంటూ కార్యకర్తల వద్ద దిగాలు పడుతున్నారు. ఏది ఏమైనా ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఆంక్షలు.. ఇక ఓట్ల లెక్కింపు నేపథ్యంలో జిల్లాలో ఆంక్షలు విధించారు. 23వ తేదీ జిల్లాలో ఎక్కడా మద్యం దుకాణాలు తెరవడానికి వీల్లేదు. బార్లు సైతం మూసేయాలి. ఎక్కడైనా మద్యం విక్రయించినట్లు తెలిస్తే నిర్వాహకులపై క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. దుకాణాన్ని సీజ్ చేస్తారు. అలాగే గెలిచిన అభ్యర్థులు ఊరేగింపులు చేసుకోవడం.. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎదుటివారిని రెచ్చగొట్టేలా ప్రవర్తించినా చర్యలు తీసుకుంటారు. కౌంటింగ్‌కు సర్వం సిద్ధం చిత్తూరు కలెక్టరేట్ : ఓట్ల లెక్కింపునకు సమయం 24 గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఫలితాలపై రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ ప్రక్రియ గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుం ది. ఏప్రిల్ 11న జరిగిన ఈవీఎంలన్నింటినీ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న సీతమ్స్, ఎస్వీ సెట్ కళాశాలల్లోని స్ట్రాంగ్ రూములలో భద్రపరిచారు. వాటికి సీసీ కెమెరాలు, కేంద్ర బలగాల పహారాలో ఉంచారు. జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న మంగళవారం సాయంత్రం ఆర్వోలకు సీతమ్స్ కౌంటింగ్ కేంద్రంలో శిక్షణ కల్పించారు. ఎస్వీ సెట్ కళాశాలలో డెప్యూటీ ఎన్నికల అధికారి గిరీష ఏర్పాట్లను పరిశీలించారు. -
వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై ఆదేశాలు ఇవ్వలేం..
సాక్షి, అమరావతి: ఓట్ల లెక్కింపు సందర్భంగా ముందు ఈవీఎంలను కాకుండా వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఒకవేళ వీవీ ప్యాట్లకు, ఈవీఎంలకు మధ్య తేడాలుంటే.. అసెంబ్లీ లేదా పార్లమెంట్ నియోజకవర్గంలోని మొత్తం వీవీ ప్యాట్లను లెక్కించేలా ఆదేశాలు జారీ చేయాలన్న అభ్యర్థనను సైతం తోసిపుచ్చింది. ఈ విషయాల్లో ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినందున, అందుకు విరుద్ధంగా తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ గుడిసేవ శ్యాంప్రసాద్, జస్టిస్ కొంగర విజయలక్ష్మీలతో కూడిన హైకోర్టు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు పేర్కొనగా.. కొట్టేస్తున్నట్లుగా పేర్కొనవద్దని, పిటిషన్‌ను మూసివేస్తున్నట్లు పేర్కొనాలని పిటిషనర్ బాలాజీ అభ్యర్థించారు. దీంతో ధర్మాసనం ఈ పిటిషన్‌ను మూసేస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఈవీఎంల కన్నా ముందు వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించేలా ఆదేశాలు ఇవ్వడంతో పాటు, తేడాలు వచ్చినప్పుడు నియోజకవర్గంలోని మొత్తం వీవీ ప్యాట్లను లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ న్యాయవాది యలమంజుల బాలాజీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై జస్టిస్ శ్యాంప్రసాద్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా బాలాజీ వాదనలు వినిపించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో, పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఓ అసెంబ్లీ సెగ్మెంట్లో ఐదు వీవీ ప్యాట్లను లెక్కించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, ఈ ఆదేశాల అమలు కోసం ఎన్నికల సంఘం ఎటువంటి సర్క్యులర్‌ను జారీ చేయలేదని తెలిపారు. వీవీ ప్యాట్లు, ఈవీఎంలకు మధ్య తేడాలు వస్తే, వాటిని అధిగమించేందుకు ఏం చేస్తారన్న విషయంపై ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వడం లేదన్నారు. అలా చేయడం నిబంధనలకు విరుద్ధం ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అవినాశ్ దేశాయ్ స్పందిస్తూ... ఎన్నికల నిబంధనల ప్రకారం ముందు ఈవీఎంలనే లెక్కించాల్సి ఉందన్నారు. ముందు వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించడం చట్ట విరుద్ధమవుతుందని కోర్టుకు నివేదించారు. ఖర్చు చేయక ముందే ఆడిట్ చేయడం ఏ విధంగా సాధ్యం కాదో, ఈవీఎంలను లెక్కించకుండా వీవీ ప్యాట్లను లెక్కించడం కూడా సాధ్యం కాదని వివరించారు. వీవీ ప్యాట్ల లెక్కింపు విషయంలో సుప్రీంకోర్టు ఇప్పటికే రెండుసార్లు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని గుర్తుచేశారు. తాజాగా మంగళవారం కూడా మొత్తం వీవీ ప్యాట్లను లెక్కించాలంటూ దాఖలైన వ్యాజ్యాన్ని కూడా సుప్రీంకోర్టు కొట్టేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి నియోజకవర్గంలో ఐదు వీవీ ప్యాట్లను లెక్కించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, ఈ ఆదేశాల అమలుకు అన్నీ ఏర్పాట్లు చేశామని చెప్పారు. పిటిషనర్ చేస్తున్న అభ్యర్థన సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉందన్నారు. ఈ విషయంలో ఏ ఆదేశాలు ఇచ్చినా సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని తెలిపారు. అవినాశ్ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం, ఈ పిటిషన్‌పై ఏ రకమైన ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. వీవీ ప్యాట్ల లెక్కింపు విషయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పుడు, అందుకు విరుద్ధంగా తాము ఆదేశాలు ఎలా జారీ చేయగలమంటూ పిటిషన్‌ను మూసివేస్తూ ఉత్తర్వులిచ్చింది. -
కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ అడిషనల్ డీజీ (లా అండ్ ఆర్డర్), ఎలక్షన్ నోడల్ అధికారి జితేందర్ వెల్లడించారు. మంగళవారం ఆయన డీజీపీ కార్యాలయంలో మరో నోడల్ అధికారి ఎస్పీ సుమతితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జితేందర్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 11న తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలకు జరిగిన ఎన్నికల లెక్కింపు ప్రక్రియను 23వ తేదీన చేపట్టనున్న నేపథ్యంలో బందోబస్తుపరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. 34,603 పోలింగ్ స్టేషన్లలో 18,526 పోలింగ్ స్థానాల్లో ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయన్నారు. ఎన్నికల అనంతరం ఎన్నికల నిబంధనల ప్రకారం.. 37 ప్రాంతాల్లో 123 స్ట్రాంగ్‌రూమ్‌లకు ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను కేంద్ర బలగాల పహారా మధ్య తరలించామని చెప్పారు. వీటికి 40 రోజులుగా సివిల్, ఏఆర్, ఎస్పీఎఫ్, కేంద్ర బలగాలతో మూడంచెల భద్రతను కొనసాగిస్తున్నామని తెలిపారు. 13 కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలతో భద్రతను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. దాదాపు 10 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్.. కౌంటింగ్ జరుగుతున్న ప్రాంతంలో ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జితేందర్ తెలిపారు. కేంద్ర బలగాల పహారా మధ్య ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తామని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో జనసంచారంపై నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. సరైన అనుమతి లేకుండా కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించడం కుదరదని వెల్లడించారు. ఒకవేళ అనుమతి ఉన్నా.. మొబైల్ ఫోన్లు లోపలికి తీసుకెళ్లడానికి వీల్లేదని తెలిపారు. ప్రతీ కేంద్రం వద్ద స్థానిక అవసరాలకు అనుగుణంగా భద్రతా చర్యలు చేపట్టామని.. ప్రతీ కేంద్రానికి డీఎస్పీ స్థాయి అధికారి భద్రతా చర్యలకు ఇన్చార్జిగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. కమిషనర్లు, ఎస్పీలు ఎప్పటికప్పుడు బందోబస్తును పర్యవేక్షిస్తారని వివరించారు. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి తప్పనిసరి.. ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి తప్పనిసరి అని జితేందర్ స్పష్టం చేశారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశాలు ఉండటంతో ర్యాలీలు చేపట్టాలనుకున్నవారు పోలీసులను ముందుగా సంప్రదించి, అనుమతి తీసుకుంటే తామే బందోబస్తు కూడా కల్పిస్తామని వెల్లడించారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు సహకరించిన తెలంగాణ ప్రజలకు జితేందర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రశాంత వాతావరణంలోనే పూర్తవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నిజామాబాద్‌పై ప్రత్యేక దృష్టి.. నిజామాబాద్‌లో ఈవీఎం యంత్రాలు, పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండటంతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జితేందర్ వెల్లడించారు. అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతో నిజామాబాద్ ఫలితం మిగిలిన అన్ని స్థానాల కంటే ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలిపారు. దీనికితోడు సున్నిత ప్రాంతాల్లో కమిషనర్లు, ఎస్పీలు ప్రత్యేక చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ పార్లమెంటు స్థానంలోనూ ఇలాంటి ఏర్పాట్లే చేశామని వెల్లడించారు. -
ఇక 2 రోజులే!
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఇక రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. కొన్ని గంటలు గడిస్తే ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఫలితాలపై రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. గురువారం ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల బందోబస్తు ఏర్పాటుచేశారు. సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి కేంద్ర, రాష్ట్ర బలగాలతో భద్రత కల్పించారు. ఈనెల 23వ తేదీ మధ్యాహ్నం తర్వాత ఫలితాలు వెలువడే అవకాశాలు కన్పిస్తున్నాయి. చిత్తూరు కలెక్టరేట్: ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రెండు రోజులే గడువు ఉండడంతో జిల్లా ఎన్నికల యంత్రాంగం కసరత్తును వేగవంతం చేసింది. కౌంటింగ్ సజావుగా జరిగేందుకు సర్వం సిద్ధం చేసింది. జిల్లాలోని 3,800 పోలింగ్ కేంద్రాల్లో ఉపయోగించిన ఈవీఎంలను ఉంచిన జిల్లా కేంద్రానికి సరిహద్దులోని సీతమ్స్, ఎస్వీసెట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఈనెల 23న లెక్కింపు ప్రక్రియ సాగనుంది. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 పార్లమెంట్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఆ రెండు కేంద్రాల్లో జరగనుంది. కలెక్టరేట్ నుంచి, ఇతర శాఖల నుంచి అవసరమైన కంప్యూటర్లను అక్కడికి తరలించారు. ఆయా నియోజకవర్గాల ఆర్వోలు కౌంటింగ్ ప్రక్రియను 100 శాతం పూర్తిచేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్నకు నివేదికలను పంపుతున్నారు. ఈసీ అనుమతి ప్రకారం ప్రతి నియోజకవర్గం కౌంటింగ్ బ్లాక్‌లో పార్లమెంట్‌కు, అసెంబ్లీకి వేర్వేరుగా కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటుచేశారు. 23న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొదట సర్వీస్ ఓట్లు, తర్వాత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. 12 గంటల తర్వాత తొలి ఫలితం, రెండున్నర తర్వాత చివరి ఫలితం వెలువడే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కో రౌండ్‌కి 15 నిమిషాల సమయం పడుతుందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఒక్క గంటలో 4 రౌండ్లు లెక్కింపు పూర్తి అవుతుందని వెల్లడిస్తున్నారు. – జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి ఒక కౌంటింగ్ కేంద్రం చొప్పున ఏర్పాటు చేశారు. – ఒక్కో నియోజకవర్గం కౌంటింగ్ కేంద్రంలో ఈసీ అనుమతి ప్రకారం పార్లమెంట్‌కు, అసెంబ్లీకి టేబుళ్లు ఏర్పాటు చేశారు. 500 పోస్టల్ బ్యాలెట్లకు ఒక టేబుల్‌ను ఏర్పాటు చేశారు. రిటర్నింగ్ అధికారికి మరో అదనపు టేబుల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. – జిల్లాలోని 14 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలకు 450 టేబుళ్లు ఏర్పాటు చేశారు. – ఒక్కో టేబుల్‌కు కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్తో పాటు ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. – స్ట్రాంగ్ రూంలో ఉన్న ఈవీఎంలను రౌండ్ల వారీగా ఆయా టేబుళ్ల వద్దకు తీసుకొచ్చేందుకు టేబుల్‌కు ఒకరు చొప్పున సిబ్బందిని నియమించారు. వారికి ప్రత్యేక డ్రెస్‌కోడ్‌ను ఏర్పాటు చేశారు. – ఆర్వోతో పాటు అబ్జర్వర్లు ఆయా నియోజకవర్గం కౌంటింగ్ కేంద్రంలో ఉంటారు. – ప్రతి టేబుల్‌కు పోటీచేసిన అభ్యర్థులకు సంబంధించి ఒక్కో ఏజెంట్ చొప్పున ఆ నియోజకవర్గానికి ఎన్ని టేబుళ్లు ఉన్నాయో అంతమంది ఏజెంట్లు – కౌంటింగ్‌కు ముందు ప్రిసైడింగ్ అధికారి సంతకంతో ఉన్న 17 సి ఫారం వివరాలను కౌంటింగ్‌కు ముందు ఏజెంట్లకు తెలియజేస్తారు. – 17 సి ఫారంలో ఈవీఎంల వారీగా పోల్ అయిన ఓట్ల వివరాలు ఉంటాయి.(పోలింగ్ పూర్తయ్యాక ఫారం 17 సి లో నమోదు చేస్తారు). – పోల్ అయిన ఓట్లు ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లు సమానంగా ఉన్నాయో, లేదో సరి చూసుకుంటారు. – అవన్నీ టేబుళ్ల వారీగా కౌంటింగ్ సూపర్వైజర్ నోట్ చేసుకోవడంతో పాటు ఏజెంట్లకు కూడా చూపించి వారి సంతకాలు తీసుకుంటారు. వాటిని ఏజెంట్లు రాసుకున్న తర్వాత ఈవీఎంల సీల్‌ను తొలగించి ఫలితాల బటన్ నొక్కుతారు. – వెంటనే అభ్యర్థుల వారీగా వారికి పోల్ అయిన ఓట్లు వెలువడుతాయి. ఒక్కో రౌండ్లో 14 ఈవీఎంల ఫలితాలు వెలువడుతాయి. – పోలింగ్ కేంద్రాల సంఖ్య, ఓటర్ల సంఖ్య ను బట్టి రౌండ్ల సంఖ్య ఉంటుంది. – కౌంటింగ్ పూర్తయిన అనంతరం అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో ప్రతి నియోజకవర్గంలో ఐదు పోలింగ్ బూత్‌లను లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు. ఎంపిక చేసే ఐదు వీవీ ప్యాట్లలోని ఓటరు స్లిప్పులను లెక్కించనున్నారు. తుది ఫలితాలు 23 వ తేదీ అర్ధరాత్రి వెలువడుతాయని జిల్లా ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ముఖ్యమైన ఫారాలు ఇవే ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి అనుమతితోపాటు ఏపార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి.. విజయ ధ్రువపత్రానికి కొన్ని ఫారాలను ఎన్నికల సంఘం నిర్ధేశించింది. అవి.. ఫారం–18 : కౌంటింగ్ ఏజెంట్ నియామక ధ్రువపత్రం. ఎన్నికల అధికారి (ఆర్వో) జారీచేసిన ఈ ధ్రువపత్రం ఉంటేనే రాజకీయ పార్టీల ఏజెంట్లను పోలింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు. అనెగ్జర్ –38 : ఓట్ల లెక్కింపుకు నియమితులైన పర్యవేక్షకులకు, సహాయకులకు జారీ చేసే ధ్రువపత్రాన్ని అనెగ్జర్ –38 అంటారు. అనెగ్జర్ –ఏ : ఎంపిక చేసిన ఐదు వీవీ ప్యాట్ల వివరాలు అందులో ఉంటాయి. అనెగ్జర్ – బి : వీవీ ప్యాట్లలోని స్లిప్పుల లెక్కింపు, తరువాత ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో ఎన్నికల సంఘం నుంచి నియమితులైన అబ్జర్వర్ ధ్రువీకరించే పత్రం ఇది. ఫారం–21సీ– ఓట్ల లెక్కింపు అనంతరం వెలువడే ఫలితాలను ఇందులో నమోదు చేస్తారు. ఫారం–21 ఈ– నియోజకవర్గంలో ఏ పార్టీకి.. అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి. ఎవరు విజయం సాధించారనే సమగ్ర వివరాలు ఇందులో ఉంటాయి. ఫారం 22 –విజయం సాధించిన అభ్యర్థికి ఎన్నికల అధికారి జారీచేసే ధ్రువపత్రం ఇది. దీని ద్వారానే చట్టసభల్లో సభ్యులుగా ఎంపికవుతారు. అనగ్జర్–58 – పార్టు–1 లో పోలింగ్ బూత్‌ల వారీగా ఓట్లు, పోలైన ఓట్ల వివరా>లుంటాయి. పార్టు 2 లో పోలింగ్ కేంద్రాల వారీగా ఓట్ల లెక్కింపు, గెలుపొందిన వారి వివరాలు ఉంటాయి. అనగ్జర్–39– తుది ఫలితం వివరాలు ఇందులో సమగ్రంగా ఉంటాయి. పోలింగ్ కేంద్రాల వారీగా ఓట్ల అధిక్యాలు నోటాతో సహా పొందుపరుస్తారు. ఆర్వో సంతకం చేసిన తరువాత అధికారికంగా దీన్ని విడుదల చేస్తారు. -
ఫలితాల అనంతరం టీడీపీని కాంగ్రెస్‌లో విలీనం
-
చంద్రబాబుకు చురకలు అంటించిన మోదీ
-
ఓటర్లను హెచ్చరించిన మేనకా గాంధీ
-
ఓటు గుట్టు తెలిస్తే ఏమవుతుంది?
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ లోక్‌సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న మేనకా గాంధీ సోమవారం పిలిభిత్ జిల్లా వాసులతో మాట్లాడుతూ తనకు వచ్చిన ఓట్ల ప్రాతిపదికన ఆయా ప్రాంతాలను ఏబీసీడీలుగా విభజించి అభివద్ధి కార్యక్రమాలను అమలు చేస్తానని హెచ్చరించిన విషయం తెల్సిందే. అంటే, ఎక్కువ ఓట్లు వచ్చిన ప్రాంతాలను ‘ఏ’ కేటగిరీగా తక్కువ ఓట్లు వచ్చిన ప్రాంతాలను ‘డీ’ కేటగిరీలుగా విభజిస్తానని చెప్పడం. అంతకుముందు వారం ఆమె ముస్లిం ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ తనకు ఓట్లేస్తేనే ముస్లిం బాగోగులు గురించి చూస్తనని హెచ్చరించడమే కాకుండా, ఏ యాభై, వందో ఓట్లేసి పనుల కోసం తన దగ్గరికొస్తే అప్పుడు వారి పని చెబుతానని కూడా హెచ్చరించారు. ఆమె హెచ్చరికల వెనకనున్న ఉచితానుచితాలను, తప్పొప్పులను ప్రస్తుతానికి పక్కన పెడితే ఏ ప్రాంతంలో ఏ పార్టీకి, ఏ అభ్యర్థికి ఓట్లు వేశారనే విషయం బయటకు తెలియడం వల్ల ఎంత ముప్పుందో, ఓటు గుట్టును గుట్టుగా ఉంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు ఎంత అవసరమో చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 1951లోని ప్రజా ప్రాతినిథ్య చట్టం ఓటును గోప్యంగా ఉంచేందుకు గ్యారంటీగా ‘రహస్య బ్యాలెట్’ విధానాన్ని తీసుకొచ్చింది. రహస్య బ్యాలెట్ నిర్వహించినప్పటికీ గ్రామాల్లో లేదా చిన్న, చిన్న బూతుల్లో ఏ అభ్యర్థికి ఓటు వేశారన్న విషయం తెలిసిపోతుండడంతో, ఓ ప్రాంతం, ఓ బ్లాక్ నుంచి తీసుకొచ్చిన పోలింగ్ డబ్బాలన్నింటిని ఓ చోట చేర్చి వాటిలోని ఓట్లను మిశ్రమం చేసి లెక్కించాలని ప్రజాప్రాతినిధ్య చట్టానికి 1961లో ఓ సవరణ తీసుకొచ్చారు. అంటే ఏ ప్రాంతంలో ఏ అభ్యర్థికి ఎక్కువ లేదా తక్కువ ఓట్లు వచ్చాయో తెలుసుకునే అవకాశం లేకుండా ఉండాలన్న ఉద్దేశమే సవరణ లక్ష్యం. ఈ విధానం 2009 వరకు కొనసాగింది. ఈవీఎంల ప్రవేశంతో సీన్ మారింది! 2009 ఎన్నికల నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)ను ప్రవేశపెట్టడం ద్వారా ఓటు గోప్యత తగ్గుతూ వచ్చింది. సాధారణంగా వెయ్యి నుంచి 1500 ఓటర్లకు ఒక ఈవీఎంను ఏర్పాటు చేస్తారు. అయితే ఒక్కో ఈవీఎంలో 200 నుంచి 600 వరకు ఓట్లు నమోదు అవుతున్నాయి. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ప్రతి పోలింగ్ అధికారి ‘ఫామ్20’ నింపాలి. పోలింగ్ కేంద్రంలో ఎన్ని ఈవీఎంలు ఉపయోగించారో, ఒక్కో ఈవీఎంలో ఎన్ని ఓట్లు పడ్డాయో ఆ ఫామ్‌లో తెలియజేయాలి. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏ ప్రాంతం, ఏ పోలింగ్ బూత్, ఏ ఈవీఎంలో అభ్యర్థులకు ఎలా వచ్చాయో తెలిసిపోతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద, పార్టీల వద్ద పోలింగ్ కేంద్రం ప్రాతిపదికన చిరునామాలతో సహా ఓటర్ల జాబితా లభిస్తుంది. ఆ జాబితా ఆధారంగా ఏ కులస్థులు, ఏ మతస్థులు, పురుషులు లేదా మహిళలు ఎవరికి ఓటు వేశారో సులభంగానే తెలుసుకోవచ్చు. ఓటర్ల జాబితాలో కుల, మతాల ప్రస్థావన ఉండకపోయినా రాజకీయ పార్టీలు సమకూర్చుకున్న డేటాలో ఆ వివరాలు ఉంటున్నాయి. చిన్న పోలింగ్ కేంద్రాలలో ఎవరు, ఎవరికి ఓటు వేశారో ఇంకా సులువుగా తెలుసుకోవచ్చు. ఎప్పుడూ బీజేపీకే ఆ ఓటు గుజరాత్‌లోని గిరి అడవుల్లో బనేజ్ తండాలో ఒకే ఒక ఓటరు ఉన్నారు. భరత్‌దాస్ దర్శన్‌దాస్ అనే 55 ఏళ్ల ఆ ఓటరు గత కొన్ని పర్యాయాలుగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకే ఓటు వేస్తున్నారు. అలాగే అరుణాచల్ ప్రదేశ్‌లోని మాలేగామ్ పర్వతాల్లో సొకేలా తయాంగ్ అనే 39 ఏళ్ల ఏకైక ఓటరు కోసం ప్రత్యేక పోలీంగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 11వ తేదీన ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపున ఆమె ఎవరికి ఓటు వేశారో సులభంగా తెలిసి పోతుంది. (చదవండి: ఒక్క ఓటు కోసం ఆరుగురు సిబ్బంది) అమిత్ షా ఆదేశాలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మీదున్న వ్యతిరేకతను ఎదుర్కోవడానికి వీలుగా కేంద్ర సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న దేశంలోని 22 కోట్ల మందిని ప్రత్యక్షంగా కలుసుకొని ఓట్లను కోరాల్సిందిగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల పార్టీ కార్యకర్తలను ఆదేశించారు. నేటి డిజిటల్ యుగంలో లబ్ధిదారుల్లో ఓటర్లను గుర్తించడం కష్టం కాదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ‘సేవామిత్ర’ యాప్ ద్వారా ఓటర్లలో ప్రభుత్వ లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రయత్నించిన విషయం తెల్సిందే. తీవ్రమైన పర్యవసనాలు ఏ ఓటరు ఎవరికి ఓటు వేశారో తెలిసిపోతే తీవ్రమైన పర్యవసానాలు ఉంటాయి. మేనకా గాంధీ హెచ్చరించినట్లు ఓటు వేయని వారిపై కక్ష సాధించవచ్చు. వారికి ఎలాంటి ప్రభుత్వ సాయం అందకుండా చేయవచ్చు. ఇంకేమైనా చేయవచ్చు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం జేడీయూ కార్యకర్తలు నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ సందర్భంగా తమ పార్టీ అభ్యర్థికి ఎందుకు ఓటు వేయలేదంటూ ఓ ప్రాంతం ఓటర్లను చితక బాదారు. ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా పునరావతం కావచ్చు! పరిష్కారం ఏమిటీ ? ఈవీఎంలను ప్రవేశపెట్టడానికి ముందు నుంచే, అంటే 2008 నుంచి ఈవీఎంలను విడివిడిగా కాకుండా కలిపి లెక్కించేందుకు వాటికి ‘టోటలైజర్’ను అనుసంధించాలనే డిమాండ్ వస్తోంది. బూత్ స్థాయిలో 14 ఈవీఎంలకు ఒక టోటలైజర్‌ను అనుసంధానించవచ్చని కూడా నిపుణులు తేల్చారు. టోటలైజర్ ఓట్ల లెక్కింపును ‘క్లస్టర్ కౌంటింగ్’ అని కూడా వ్యవహరిస్తారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ విధానాన్ని అమలుకు ప్రతిపాదించగా 2017లో బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకించింది. దీని వల్ల పెద్ద ప్రయోజనం ఉండదని ఉన్నత స్థాయి కమిటీ ద్వారా తేలిందని సుప్రీం కోర్టు ముందు వాదించింది. అలా తేల్చిన కమిటీ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీల కమిటీ. ఇదే విషయమై 2018లో క్లస్టర్ కౌంటింగ్ కోసం ఓ ఎన్జీవో సంస్థ సుప్రీం కోర్టులో పిటిషన్ వేయగా, విచారించకుండానే కోర్టు దాన్ని కొట్టివేసింది. యాభై శాతం ఓటింగ్ యంత్రాలకు ఓటర్ వెరీఫైయింగ్ (వీవీపీఏటీ) స్లిప్‌లు ఉండాలని డిమాండ్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తామంటూ ఆదివారం నాడు ప్రతిపక్ష పార్టీలు ప్రకటించాయి. వాటికన్నా కూడా ఈ ‘క్లస్టర్ కౌంటింగ్’ అత్యవసరం. ఈ ఎన్నికలకు క్లస్టర్ కౌంటింగ్ సాధ్యం కాదు కనుక, ‘ఫొమ్ 20’ నింపకుండానైనా చూడాలి. -
ప్రజాస్వామ్యానికి అవమానం ఓటర్లకు అపహాస్యం
శ్రీకాకుళం పాతబస్టాండ్: గత ఎన్నికల కన్నా ఎక్కువ పోలింగ్ శాతం నమోదైంది. మహిళలు బారులు దీరి ఓట్లేశారు. యువ ఓటర్లు తొలిసారి ఓటు హక్కును వినియోగించుకొని మురిసిపోయారు. ఇంకు మార్కు ఉన్న వేలును చూపుతూ ఫొటోలు దిగారు. తొలిసారిగా వీవీ ప్యాట్లను ఏర్పాటు చేయడంతో ఎవరికి ఓటు వేశామో తెలుసుకున్నామని, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని అందరూ అభిప్రాయం వ్యక్తం చేశారు. వాస్తవం ఇలా ఉండగా చంద్రబాబు ఎన్నికల సంఘంపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం సర్వత్రా విమర్శలపాలైంది. ఈసీపై ఆయన అక్కసంతా ఓటర్లపై మళ్లించడంతో ప్రజల్లో నిరసన వ్యక్తమవుతోంది. 2009 సాధారణ ఎన్నికల్లో జిల్లాలో 74.42 శాతం పోలింగ్ నమోదైంది. 2014లో 75.02 శాతం ఓట్లు పడ్డాయి. ఈసారి 76.35 శాతం పోలింగ్ నమోదు కావడం వెల్లివిరిసిన ఓటరు చైతన్యానికి ప్రతీక. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసేసరికి క్యూలో ఉన్నవారందరికీ ఎంత వేళైనా పోలింగ్‌కు అనుమతించడంతో ఇది సాధ్యమైంది. ఈవీఎంలు మొరాయించడం మొదట్లో చికాకు కలిగించినా.. తర్వాత ఎన్నికల సిబ్బంది దిద్దుబాటు చర్యలతో అందరూ సజావుగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. అయితే ఈసీని చిన్నబుచ్చుతూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా తమను విమర్శించడమేనని ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. వీవీ ప్యాట్లతో పారదర్శకత ఈసారి ఎన్నికల్లో వీవీ ప్యాట్లను వినియోగించారు. గతంలో కేవలం బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్లు మాత్రమే ఉండేవి. అప్పుడు ఓటరు ఏ అభ్యర్థ్ధికి ఓటు వేశారో తెలియని పరిస్థితి ఉంది. ఈవిధానంలోనే గత 2014 ఎన్నికలు జరిగాయి. అప్పుడు చాలామంది వారు వేసిన ఓటుపై పలు సందేహాలు వ్యక్తం చేశారు. అయితే ఈసారి జరిగిన ఎన్నికల్లో ప్రజల్లో ఓటుపై ఎటువంటి సందేహాలు లేకుండా చేసేందుకు, వారు వేసిన ఓటు వారికి కనిపించే విధంగా, పారదర్శకంగా వివి ప్యాట్లను ఎన్నికల కమిషన్ తీసుకువచ్చింది. దీంతో వారు వేసిన ఓటు గుర్తు వీవీప్యాట్‌లో కన్పించడంతో ఓటరు సంతృప్తిని వ్యక్తం చేశారు. వృద్ధుల కోసం వీల్ చైర్లు వంటి సదుపాయాలు ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తమైంది. గతంలో ఓటు వేయని కొన్ని వర్గాలు ముఖ్యంగా వృద్ధులు, ఉద్యోగులు సైతం ఈసారి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ఎన్నికల విధానం ఆధునికీకరణ, పారదర్శకత తేవడంతో ప్రజల్లో ఈవీఎం ఓటింగ్ విధానంపై నమ్మకం కలిగింది. ఓటమి భయంతోనే టీడీపీ నేతల విమర్శలు టీడీపీ నాయకులకు ఓటమి భయం పట్టుకొంది. ఎగ్జిట్ పోల్ సర్వేలు, ఇంటిలిజెన్స్ రిపోర్టు ఇప్పటికే ఓటమిని ఖరారు చేశాయి. దీంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి నుంచి పార్టీ గ్రామ స్థాయి కార్యకర్త వరకు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. మేధావులు చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. అధికారులు తప్పులు చేసి ఉంటే దానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి వుంటుందని తేల్చిచెప్పారు. 2014లో కూడా ఈవీఎంల ద్వారానే ఎన్నికలు జరిగాయి. అయితే అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు వ్యక్తం చేస్తున్నారని అంతా నిలదీస్తున్నారు. అంతేకాదు ఎన్నికలు జరుగుతున్న సమయంలో టీడీపీ నాయకులు వారి అధికారాన్ని అడ్డుపెట్టుకొని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడడం, పోలింగ్ అ«ధికారులపై ఒత్తిడి తేవడం, బెదిరింపులకు పాల్పడడం విమర్శలపాలైంది. రికార్డు స్థాయి పోలింగ్ గత ఎన్నికలతో పోల్చితే ఈసారి పోలింగ్ ఎక్కువ జరిగింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పోస్టల్ బ్యాలెట్లో ఈసారి ఉద్యోగులు ఎక్కువగా పాల్గొన్నారు. 21 వేలు పోస్టల్ బ్యాలెట్లు, మరో 16 వేలు సర్వీసు ఓట్లు జారీ చేశారు. ఇవే 37 వేల వరకూ ఉన్నాయి. జిల్లాలో అత్యధికంగా ఎచ్చెర్లలో 84.30 శాతం, నరసన్నపేటలో 80 శాతం పోలింగ్ నమోదైంది. దాదాపు అన్నిచోట్లా మహిళలే ఎక్కువగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈవీఎంలు భద్రం పోలింగ్ ముగిశాక ఈవీఎంలు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లను ఎచ్చెర్లలోని శ్రీశివానీ ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరిచారు. జిల్లాలోని పది నియోజక వర్గాల నుంచి మిషన్లను బస్సుల్లో తీసుకువచ్చి ఇక్కడ ఉంచారు. ఎన్నికల ప్రత్యేకాధికారులు, కేంద్ర బలగాల పర్యవేక్షణలో భద్రతకు అన్ని చర్యలు తీసుకున్నారు. ఓటమి భయంతోనే.. తాజా ఎన్నికల్లో అద్భుతంగా పోలింగ్ జరిగింది. నా అంచనా ప్రకారం ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఓటమి ఖాయమనే సంకేతాలు రావడంతో ఏదో ఒక రాద్ధాంతం చేద్దామని చంద్రబాబు చూస్తున్నాడు. తాను చెప్పిందే వేదం... అన్నట్లుగా నియంతలాగానే వ్యవహరిస్తున్నాడు. ప్రజాసామ్యాన్ని ఖూనీ చేసిన ఆయనే.. ఎప్పుడూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మాట్లాడుతుంటాడు. తాజా ఎన్నికల్లో ఈవీఎంలు మొరాయించినప్పటికీ పోలింగ్ ప్రక్రియ సాఫీగా సాగింది. ఎవరు ఎవరికి ఓటేసేరో కూడా ప్రత్యేక మిషన్ ద్వారా తెలిసిపోయింది. నేను కూడా ఓటేసి చూసుకున్నాను. తాను గెలిస్తే సక్రమం...ప్రత్యర్ధులు గెలిస్తే అక్రమం అన్న రీతిలో చంద్రబాబు చెబుతున్నాడు. పోలింగ్ సరళిపై అనవసర అనుమానాలు రేకెత్తించి, కేంద్ర ప్రభుత్వం ఏదో చేయించిందని చెబుతున్నాడు. గతంలో ఈయన అలాగే గెలిచాడా.... అంటే ఏం చెబుతాడు? – గొండు నరసింగరావు, మాజీ ఎమ్మెల్సీ -
ఎందుకింత రాద్ధాంతం?
పోలింగ్ ముగిసిన తర్వాత యుద్ధవాతావరణం ముగుస్తుందనీ, శాంతి, సద్భావం వెల్లివిరుస్తాయనీ ఆశించినవారికి దిగ్భ్రాంతి కలిగించే సన్నివేశాలు ఆంధ్రప్రదేశ్‌లో సాక్షాత్కరిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు చంద్రబాబునాయుడు శుక్రవారం రెండు గంటల సేపు మీడియాతో మాట్లాడిన తర్వాత అప్రజాస్వామికమైన ఆయన వ్యాఖ్యలపైన స్పందించక తప్పడం లేదు. ప్రతిపక్ష నేతను నేరస్థుడు అంటూ అభివర్ణించడం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సహనిందితుడనీ, కోవర్టు అనీ నిందించడం చూసినవారికి ముఖ్యమంత్రి మాన సిక స్థితిపైన అనుమానం కలుగకమానదు. తాను ముఖ్యమంత్రి, ఒక ప్రాంతీయ పార్టీకి అధినేత కనుక ఏమి మాట్లాడినా చెల్లుతుందని భావిస్తున్నట్టున్నారు. గురువారం ఉదయం పోలింగ్ ఆరంభమైన కొద్దిసేపటికే ముప్పయ్ శాతం ఎల క్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్ (ఈవీఎం)లు పని చేయలేదనీ, ఈ సమస్యను ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదీ కావాలనే సృష్టించినట్టు కనిపిస్తున్నదనీ చంద్రబాబు ధ్వజమెత్తారు. మొత్తం 92 వేల పైచిలుకు ఈవీఎంలు ఆంధ్రప్రదేశ్‌లో వినియోగిం చారు. 380 ఈవీఎంలు ఉదయం మొరాయించాయనీ, వాటిలో 330 ఈవీఎం లను మార్చి కొత్తవి ఏర్పాటు చేశామనీ, తక్కినవాటిని బాగు చేయించి వెంటనే ఉపయోగించామనీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీ వివరించినా ఈ దుష్ప్రచారానికి అడ్డుకట్ట పడలేదు. అంతకుముందు ఎన్నికల ప్రధా నాధికారి కార్యాలయం ఎదుట ధర్నా చేయడం, ఆయననూ, కేంద్ర ఎన్నికల సంఘాన్నీ దుర్భాషలాడటం అసహనం హద్దు మీరిందనడానికి నిదర్శనం. కొన్ని వారాలుగా ముఖ్యమంత్రి విపరీత మానసిక ధోరణిని గమనించినవారికి ఆయనను వైఫల్య భీతి వేధిస్తున్నదని గ్రహించి ఉంటారు. రాజకీయ నాయకులు ఎన్నికలలో విజ యం సాధించి అధికారంలోకి వస్తారు. ఓడిపోతే అధికారం నుంచి తప్పుకుం టారు. ఇది సర్వసాధారణం. అధికారం తమ జన్మహక్కు అనీ, ఇతరులకు దాన్ని ఆశించే హక్కు లేదనే వితండవాదాన్ని చంద్రబాబు తల కెక్కించుకున్నారు. ఈవీఎంలపై ఇంత అపనమ్మకమా? వాస్తవానికి ఎన్నికల ఫలితాల కోసం మరి 40 రోజులు నిరీక్షించాలి. అంత వరకూ ఎవరి అంచనాలు వారివి. ఎవరి లెక్కలు వారివి. విజయాన్నీ, పరాజయాన్నీ ఎట్లా స్వీకరించాలో తెలిసినవాడే ప్రజానాయకుడు. అన్ని ప్రజాస్వామ్య వ్యవ స్థలూ పరస్పరం సహకరించుకుంటేనే కథ సజావుగా నడుస్తుంది. ద్వివేదీతో సహ కరించకపోగా ఆయనను శత్రువుల జాబితాలో చేర్చారు చంద్రబాబు. ఎన్నికల ప్రధానాధికారితో సహా ఆయనకు సహకరించే ఉద్యోగులందరూ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వారే. ఎన్నికల నిర్వహణకోసం ప్రభుత్వోగులతో పాటు అంగన్వాడీ, ఆశావర్కర్లనీ, నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థల ఉద్యోగులనూ నియమిం చింది రాష్ట్ర ప్రభుత్వమే. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు చెడిపోతే మరమ్మతు చేయడానికి బిఇఎల్ నుంచి వచ్చిన అధికారులు శిక్షణనిచ్చింది స్థానిక మెకాని క్లకే. వారి సామర్థ్యాన్ని శంకిస్తూ, ‘మెకానిక్‌లు మరమ్మతు చేస్తున్నారా, మేని ప్యులేట్ చేస్తున్నారా, వేర్ ఆర్ వుయ్ గోయింగ్?’ అంటూ ముఖ్యమంత్రి ఆవే శపడితే ఏట్లా అర్థం చేసుకోవాలి? తన శత్రువుల జాబితాను చంద్రబాబు రోజు రోజుకీ పెంచుకుంటూ పోతున్నారు. మొన్నటి వరకూ జగన్, మోదీ, కేసీఆర్ ఆ జాబితాలో ఉండేవారు. ఇప్పుడు ద్వివేదీ, చీఫ్ సెక్రటరీగా నియమితుడైన ఎల్వి సుబ్రహ్మణ్యం, ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా కూడా ఆ జాబితాలో చేరిపోయారు. తాను ఎవరిని తిడితే వారిని ప్రతిపక్ష నాయకుడు కూడా తిట్టాలని ముఖ్యమంత్రి భావిస్తారు. తిట్టకపోతే వారితో కుమ్మక్కు అయినట్టు నిందిస్తారు. ‘ఎన్నికల ప్రధానాధికారిని జగన్ ఒక్క మాటైనా అన్నాడా?’ అన్నది అందు కోసమే. ద్వివేదీని దబాయించడం, సుబ్రహ్మణ్యంని కోవర్టు అనీ, కోఎక్యూజ్డ్ అనీ నిందించడం ముఖ్యమంత్రి సంస్కారానికి అద్దం పడుతుంది. నిందితుడికీ, దోషికీ భేదం పాటించకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడటం భావ్యమా? కాంగ్రెస్ నాయకులతో చేతులు కలిపి తానే సీబీఐతో పెట్టించిన అనేక బూటకపు కేసుల్లో ఒకదానిలో సుబ్రహ్మణ్యం నిర్దోషి అంటూ హైకోర్టు ప్రకటించిన తర్వాత కూడా ‘సహనిందితుడు’ అంటూ అభివర్ణించడం ఏ సంస్కారానికి నిదర్శనం? ఓటుకు కోట్ల కేసులో ‘మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ...’ అంటూ మాట్లాడిన చంద్రబాబుని ఏమని పిలవాలి? ఢిల్లీలో కూడా అదే ప్రవర. జగన్‌పైన 31 కేసులు ఉన్నాయనీ, తనపైన ఒక్క కేసు కూడా లేదనీ ప్రకటన. జగన్‌పైన ఉన్న కేసులన్నీ చంద్రబాబు పెట్టించినవీ, చంద్రబాబు ప్రభుత్వం పెట్టినవే. చంద్రబాబు న్యాయవ్యవస్థలోని పరిస్థితులను వినియోగించుకొని 17 కేసుల్లో స్టే తెచ్చుకున్న సంగతి ఎవరూ మర చిపోలేదు. మూడున్నర దశాబ్దాలుగా ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యం నడ వడికను దూరం నుంచి గమనిస్తున్న నాబోటి పాత్రి కేయులకు ఆయన ఎంత నిజాయితీపరుడైన అధికారో, ఎంత ముక్కు సూటిగా వ్యవహరిస్తారో తెలుసు. వావిలాల గోపాలకృష్ణయ్య ఆశీస్సులతో పాటు ఆయన విలువలను సైతం గుండె నిండా నింపుకొని ఎన్ని సమస్యలు ఎదురైనా చలించకుండా కర్తవ్య నిర్వహణ చేస్తున్న అధికారిని పట్టుకొని అనరాని మాటలు అనడం ముఖ్యమంత్రి పదవికి శోభనిస్తుందా? ఒక సీఎస్ ఒక డీజీపీని కలుసుకుంటే ముఖ్యమంత్రికి అభ్యం తరం ఎందుకు ఉండాలి? ఇది ప్రభుత్వ వ్యవహారాలలో సర్వసాధారణం. ‘ఎక్క డికి పోతున్నాం మనం? ఇట్ ఈజ్ మాకరీ ఆఫ్ డెమాక్రసీ’ అంటూ తీవ్రంగా ఆక్షేపించడంలో ఏమైనా అర్థం ఉన్నదా? చంద్రబాబుకు నిజాయితీపరులైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులంటే పడనట్టు కనిపిస్తున్నది. చీఫ్ సెక్రటరీలుగా పని చేసిన ఐవైఆర్ కృష్ణారావు, అజేయకల్లం అంటే పడదు. ప్రస్తుత చీఫ్ సెక్రటరీ అంటే వైరిభావం. తనకు విధేయంగా ఉంటూ, తాను చెప్పినట్టు చేసినందుకు మాజీ చీఫ్ సెక్రటరీ అనీల్‌చంద్రపునేఠా, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మూల్యం చెల్లించడం చూశాం. డీజీపీ ఠాకూర్ ఢిల్లీ వెళ్ళి ఎన్నికల కమిషన్ సభ్యు లను రెండు విడతల కలుసుకొని తిరిగి వచ్చారు. పరాజయం అంగీకరిస్తున్నట్లేనా? ఎన్నికల సమయంలో అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించడం కొత్త కాదు. ద్రోణంరాజు సత్యనారాయణ మృతి కారణంగా 2006లో విశాఖ సౌత్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా ఒక రిటర్నింగ్ ఆఫీసర్ని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ ప్రకాశ్ ఎన్నికల సంఘానికి చెప్పకుండా మార్చి వేశారు. మార్చిన తర్వాత చెప్పారు. ఫలితంగా ప్రవీణ్‌ను ఎన్నికలకు దూరంగా పెట్టి కలె క్టర్‌గా అనీల్ కుమార్సింఘాల్ని నియమించారు. అదే ప్రవీణ్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు వికారాబాద్ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. లోగడ చేసిన తప్పిదం కారణంగా ఆయనను ఆ ఎన్నికలలో కూడా బదిలీ చేశారు. ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు ఫిర్యాదు మేరకు 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఎస్ఎస్పీ యాదవ్‌ను ఎన్నికల విధుల నుంచి తప్పించి ఆయన స్థానంలో ఏకే మహంతిని డీజీపీగా నియమించినప్పుడు నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నికల సంఘాన్ని కానీ, ప్రతిపక్ష నాయకుడిని కానీ పల్లెత్తు మాట అనలేదు. కానీ ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కొనేశారంటూ బాబు అడ్డగోలుగా వ్యాఖ్యానించడం దిగ్భ్రాంతి కలిగిస్తున్నది. ఇలా అమ్ముడుపోతారని నిందించడం విజ్ఞుల లక్షణమేనా? ఈ పరుష పదజాలం బాబు దుగ్ధకు నిదర్శనం. ఆయనకు తెలియకుండానే మనసులో ఉన్నమాట బయటపడుతు న్నది. ‘అయిదేళ్ళు లోట స్పాండ్ నుంచి పరిపాలిస్తాడు’ అంటే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందనీ, జగన్ ముఖ్య మంత్రి అవుతారనీ ఒప్పుకున్నట్టే కదా! అపోజిషన్‌లో ఉన్నవాడికి అంత డబ్బు ఎక్కడినుంచి వచ్చింది? అంటే అధికారంలో ఉన్న తనకు డబ్బు వచ్చినట్టే కదా! ఓటమి భయం, ఆక్రోశం అనాలోచితంగా, అతిగా మాట్లాడిస్తుంది. కొన్ని భయాలూ, కొన్ని నిజాలూ, కొన్ని అర్థంపర్థంలేని మాటలూ దొర్లుతాయి. ఈవీఎంలో చిప్ తయారు చేసినవాడు తనకు అపకారం చేస్తాడని అనుకుంటారు. తనను ఓడించేందుకే ఎన్నికలు మొదటి దశలో పెట్టారంటూ ఎన్నికల కమిషన్ని తప్పుపడుతున్నారు. ‘నా ఓటు నాకే పడిందో లేదో నాకు తెలియదు’ అన్నారు. అమరావతిలో ఓటు చేసిన బాబు ఓటు ఆయనకు పడదు. ఆయన కొడుకు, మంగళగిరి నియోజక వర్గంలో టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్‌కు పడి ఉంటుంది. చిత్రం ఏమిటంటే అధికారంలో ఉన్న వ్యక్తి ప్రతిపక్ష నాయకుడిలాగా రెచ్చిపోతున్నారు. ప్రతిపక్ష నాయకుడు నిబ్బరంగా ఉన్నారు. పోలింగ్ రోజున కొన్ని చోట్ల టీడీపీ, ౖవైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. గతంతో పోల్చితే ఈసారి హింస కొంతమేర తగ్గిందంటూ ముఖ్యమంత్రికి ఇష్టుడైన డీజీపీ ఠాకూర్ వ్యాఖ్యానించారు. చనిపోయిన ఇద్దరిలో ఒకరు వైసీపీకీ, ఇంకొకరు టీడీపీకీ చెందినవారు. వాస్తవాలు ఇట్లా ఉంటే, జగన్నీ, వైసీపీ నాయకులనూ నిష్కారణంగా దూషిస్తూ హింసాకాండ యావత్తూ వైసీపీ ఒక పథకం ప్రకారం చేయించిందని చెప్పడం అదరగండపు ధోరణి. నేరం చేసి ఎదుటివారిపైన నిందవేయడం, అధికారంలో ఉంటూ ప్రతిపక్ష నేతగా వ్యవహరించడం చంద్ర బాబుకి బాగా తెలిసిన విద్య. పరాకాష్టకు చేరిన ప్రభుత్వ వ్యతిరేకత ఎన్నికలలో గెలిచేందుకు చంద్రబాబు అన్ని రకాల ఎత్తుగడలూ అమలు పరి చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడం కోసం కాంగ్రెస్, జనసేనలు విడివిడిగా పోటీ చేసే విధంగా వ్యూహరచన చే శారు. జనసేనతో సర్దుబాట్లు చేసుకున్నారు. కేఏ పాల్ అనే ఒక విచిత్రవీరుడిని రంగంలో ప్రవేశపెట్టి అతడి పార్టీకి వైఎస్ ఆర్సీపీ ఎన్నికల చిహ్నమైన ఫ్యాన్‌ను పోలిన ఫ్యాన్సహిత హెలికాప్టర్ చిహ్నం సంపాదించిపెట్టారు. ఆయన అభ్యర్థులు వైసీపీ అభ్యర్థులు వేసుకునే డిజైన్ కండువాలనే వేసుకునే విధంగా ఏర్పాటు చేశారు. వైసీపీ అభ్యర్థుల పేర్లు గల అనామకులకు టిక్కెట్లు ఇప్పించారు. ఎన్నికలు పది రోజులు ఉన్నాయనగా డ్వాక్రా మహిళలకు రెండు చెక్కులు ఇచ్చారు. అన్నదాతా సుఖీభవ పథకం కింద రెండు వాయిదాలు ఇస్తానని చెప్పి ఒక వాయిదా సొమ్ము వారి ఖాతాలలో వేశారు. ఇన్ని చేసినా పరాజయభీతి పీడిస్తున్నదంటే ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. పరాజయం అనివార్యమని ఆయనకు నెల రోజుల కిందటే తెలిసిపోయింది. పోలింగ్ రోజున ఓటర్లు అత్యధిక సంఖ్యలో హాజరు కావడంతో తన అనుమానం రూఢి అయింది. అందుకే అందరిపైనా ఒంటికాలు మీద లేవడం. ఉదయం పది గంటలలోపే 30 శాతం ఈవిఎం మెషీన్లు పనిచేయడం లేదంటూ గగ్గోలు పెట్టడం కూడా ఓటమికి సాకు వెతుక్కునే ప్రయత్నమే. మొత్తం 92వేల పైచిలుకు ఈవిఎంలు ఉంటే వాటిలో 30 శాతం అంటే ఎన్నో లెక్క కట్టే మాట్లాడారా? కేవలం 380 ఈవీఎంలు మొరా యించాయనీ, వాటిలో చాలావరకూ కొత్త ఈవీఎంలు ఏర్పాటు చేశామనీ, తక్కినవాటిని బాగు చేయించామనీ ద్వివేదీ చెప్పారు. అయినా బాబు ధోరణి మారలేదు. ఢిల్లీలోనూ అదే పాట. ద్వివేదీ ఓటు వేయలేకపోయారని సీఎం ప్రచారం చేశారు. ఆయన గురువారం నాలుగు గంటలకు ఓటు వేసినట్టు వీడియో సాక్ష్యం విడుదల చేశారు. అయినా సరే అబద్ధాలు ఆగడం లేదు. ఆగడాలకు అంతులేదు. పోలింగ్ పూర్తియిన తర్వాత కూడా గ్రామాలలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులపైన టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారంటే వారు తమ అధినేతను అనుసరిస్తున్నారని భావించాలి. సహనిందితుడూ, కోవర్టు అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంని నిందించడం, ఈసీని తూర్పారబట్టడం రాజ్యాంగ ఉల్లంఘనే. రాజ్యాంగం 324 అధికరణ కింద ఎన్ని కల సంఘానికి దఖలు పరచిన అధికారాలను వినియోగించుకొని ప్రజా ప్రాతినిధ్య చట్టం (రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్) కిందా, భారత శిక్షాస్మృతి (ఇండియన్ పీనల్ కోడ్) కిందా చంద్రబాబుlపైన కేసులు పెట్టవచ్చు. సుబ్ర హ్మణ్యంపైన విమర్శలు చేసిన తీరు ఎన్నికల సంఘానికి పరువునష్టం కలి గించినట్టే. ఎన్నికల సంఘాన్ని ధిక్క రించినట్టే. ఇలా ధిక్కరించే అధికారం సీఎంకి కాదు కదా ప్రధానికిSసైతం లేదు. ఈ ఎన్నికలలో టీడీపీ ఓడిపోతుందో లేదో మే 23న మాత్రమే వెల్లడి అవుతుంది. ఈ లోగా ఓటమిని ఎట్లా స్వీకరించాలో చంద్రబాబు నేర్చుకున్నా, ఆయనకు హితైషులు నచ్చజెప్పినా ఆయనకు మంచిది. 2014లో పోటాపోటీగా జరిగిన ఎన్నికలలో ఓడిపోయినప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత హుందాగా ఫలితాన్ని ఆమోదించారు. బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా వ్యవహ రిస్తామని చెప్పారు. 42 ఏళ్ళ యువకుడు అయిదేళ్ళ కిందట ఎంత సంయమ నంతో, రాజ్యాంగంపట్ల, ఎన్నికల ప్రక్రియపట్ల గౌరవంతో వినమ్రంగా ఓటమిని అంగీకరించారు. ఇప్పుడు ఓడిపోతామనే అనుమానంతోనే 68 ఏళ్ళ చంద్రబాబు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. ఏది పడితే అది మాట్లాడుతున్నారు. పరిణతి లేని నేతగా వ్యవహరిస్తున్నారు. మే 23న ఆయన అనుమానం నిజమైతే ఏమి చేస్తారోనని ఆందోళనగా ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -కె. రామచంద్రమూర్తి -
ఈవీఎంలపై విచారణ జరపండి
సాక్షి, న్యూఢిలీ: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి భద్రతను పర్యవేక్షించే ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేసి తన రక్షణ వ్యవస్థకు విఘాతం కలిగించారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈవీఎంల ద్వారా ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోందని, ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే పేపర్ బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. మొత్తం 618 కేంద్రాల్లో అడ్జర్న్డ్ పోల్ (వివిధ కారణాలతో పోలింగ్‌కు విఘాతం కలిగితే వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి తిరిగి ఎన్నిక నిర్వహించడం) చేపట్టాలని కోరారు. చంద్రబాబు శనివారం మధ్యాహ్నం పలువురు మంత్రులు, పార్టీ సహచరులతో కలిసి ఢిల్లీలో కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈసీ) సునీల్ అరోరాతో సుదీర్ఘంగా సమావేశమై 18 పేజీల వినతిపత్రం అందజేశారు. పేపర్ బ్యాలెట్‌తోనే ఎన్నికలు నిర్వహించాలని, ఈవీఎంలను హ్యాకింగ్ చేసిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, ఈవీఎంల మొరాయింపుపై విచారణ నిర్వహించాలని, ఫామ్ – 7 దరఖాస్తులకు సంబంధించి ఐపీ చిరునామాను రాష్ట్ర పోలీసులకు అందచేయాలని సీఈసీని కోరారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలపై ఇండిపెండెంట్ ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... అధికారులను ఎందుకు బదిలీ చేశారు? ‘‘ఈసీ ద్వారా జరిగిన అవకతవకలు, పక్షపాత వైఖరిపై తీవ్ర అసంతృప్తి, నిరసన తెలియజేశా. ఒక పద్ధతి లేకుండా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం మాట వినకుండా, నేరస్తులు ఇష్టానుసారంగా పిటిషన్లు ఇస్తే దానికి అనుగుణంగా అధికారులను బదిలీలు చేయడం, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఐటీ, ఈడీ దాడులు చేసినప్పుడు ఈసీ గమ్మున కూర్చోవడం, ఏపీ ప్రజానీకంపై మూకుమ్మడి దాడి చేయడాన్ని ఖండిస్తూ నిరసన తెలిపా. ఏకే శర్మ పనికి రాడని పంపిస్తే ఆయనను పరిశీలకుడిగా నియమించడం, కడప ఎస్పీని మార్చడం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మార్చడం చేశారు. మార్చి ఎవరిని నియమించారు? జగన్మోహన్రెడ్డి కేసులో నిందితుడిని వేశారు. ఇలాంటి తప్పుడు పనులు చేస్తూ ఎక్కడికి పోతున్నారు మీరు..? యంత్రాంగాన్ని డీమోరలైజ్ చేశారు. తొలుత ఈవీఎంలు మొరాయించాయి. అవి ప్రారంభమయ్యే సమయానికి స్పీకర్‌పై, ఎమ్మెల్యేలపై దాడులు చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత అరాచకం ఎన్నడూ లేదు. తొలిసారి జరిగింది. దీనికి కారణం ఎవరు? ఎన్నికల సంఘం బాధ్యత తీసుకుంటుందా? మీ ఇష్టారీతిన బదిలీలు చేసి ఏపీని రావణకాష్టం చేశారు. దుర్మార్గంగా ప్రవర్తించారు. రెచ్చిపోయి రౌడీలంతా రోడ్డు మీదకు చేరారు. చేతగానితనం వల్ల మీరు పూర్తిగా విఫలమయ్యారు. ఒంటి గంటకు మిషన్లు పెట్టారు. మేం పోలింగ్ వాయిదా వేయాలని అడిగితే వినలేదు. మధ్యాహ్నం 3.30, 4.30 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. క్యూలో నిలబడిన వాళ్లంతా రాతింబవళ్లూ చంటిపిల్లలను చంకనేసుకుని అవస్థలు పడ్డారు. ఎవరిది బాధ్యత? ఈసీది కాదా? ఓటర్లు బిచ్చగాళ్లా? ఓటర్లను గౌరవంగా చూసే బాధ్యత లేదా? సాయంత్రం 5 గంటలకు ఒక పిలుపునిస్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని సామాన్య ప్రజానీకం కంకణం కట్టుకుని వచ్చి క్యూలో నిలబడ్డారు. ఈవీఎంలపై సామాన్యులకు సందేహం ఉంది. వీవీ ప్యాట్లపై సందేహం ఉంది. సుప్రీం కోర్టు అడిగితే వీవీప్యాట్ పత్రాలు లెక్కించేందుకు ఆరు రోజులు పడుతుందని చెప్పారు. ఇలా ఇష్టారీతిన ప్రవర్తిస్తే ఎలా? ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా ఉండాలి. ఈవీఎంల మీద ఎప్పటి నుంచో పోరాడాం. మేం పోరాడితేనే వీవీ ప్యాట్లు వచ్చాయి. వీవీ ప్యాట్లు కూడా సరికాదని ఎప్పుడో చెప్పాం. పేపర్ బ్యాలెట్లే ఈ దేశానికి సరైన నిర్ణయం. పేపర్ బ్యాలెట్లపై అందరికీ ఒక అవగాహన ఉంటుంది. ఎక్కడెక్కడో పట్టుకొచ్చి ఆపరేట్ చేయమంటే ఎలా చేస్తారు? థర్మల్ పేపర్ మీద చాలా అనుమానం ఉంది. ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారు. అందుకే వచ్చాం. రాష్ట్రంలో జరిగిన అవకతవకలను దేశానికి చెప్పాలని వచ్చాం. ప్రజాస్వామ్యవాదులందరూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి’’ అని పేర్కొన్నారు. ఈవీఎంలను ఎవరు మానిప్యులేట్ చేశారు? ఓడిపోతామనే భయంతోనే చంద్రబాబు హడావుడి చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శించటాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. ‘ఈవీఎంలు పనిచేయకపోతే ప్రతిపక్షాలు ఎందుకు అడగలేదు? హింస జరిగితే ఎందుకు మాట్లాడలేదు? హింస మీరే చేశారా? రాత్రి మూడు గంటలకు ఎవరు ఓటేశారు? వాళ్లంతా ప్రెస్టీజ్‌గా తీసుకున్నారు. మోదీ, కేసీఆర్, జగన్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని తిరుగుబాటు చేశారు. తెల్లవారుజాము వరకు ఓట్లేశారంటే చరిత్రలో ఎప్పుడు ఇలా జరగలేదు. లేటుగా పోలింగ్ జరిగిన కేంద్రాల్లో అడ్జర్న్డ్ పోల్గా ప్రకటించాలి. ఫారం– 7ఏపై తప్పనిసరిగా చర్య తీసుకోవాలి. తొలి గంటలో పోలింగ్ ఎందుకు జరగలేదు? ఎవరు హ్యాకింగ్ చేశారు? ఎవరు మానిప్యులేట్ చేశారు? వీటికి సమాధానం కావాలి. ఇలాంటిది జరగకుండా ఉండాలంటే పేపర్ బ్యాలెట్ రావాలి..’ అని బదులిచ్చారు. 50 శాతం వీవీ ప్యాట్ల పత్రాలు లెక్కించాలి ‘అన్ని రాజకీయ పార్టీలు, మేధావులతో మాట్లాడతా. జాతీయ స్థాయిలో డిబేట్ చేస్తా. వీవీ ప్యాట్ల పత్రాలు లెక్కించేందుకు ఎందుకు ఇబ్బంది పడుతున్నారని ప్రశ్నిస్తున్నా. 50 శాతం వీవీ ప్యాట్ల పత్రాలను లెక్కించాలి..’ అని పేర్కొన్నారు. ‘హింస రెండు వైపులా జరగలేదు. మావాళ్లు త్యాగాలు చేశారు. అవతల రౌడీలు వస్తే పారిపోయారనుకోండి ఏమవుతుంది? ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు బలయ్యారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం భారీగా తరలివచ్చి ఓటింగ్‌లో పాల్గొన్నారు..’ అని మరో ప్రశ్నకు బదులిచ్చారు. నేడు ఢిల్లీలో సీఎం, విపక్ష నేతల భేటీ ఈవీఎంల పనితీరు, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై చంద్రబాబు, ఇతర విపక్ష నేతలు ఆదివారం ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఉదయం 11.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఈ సమావేశం జరగనుంది. 12.30 గంటలకు నేతలు మీడియాతో మాట్లాడనున్నారు. -
పోలింగ్ రోజున ఇవి పాటించాలి..
సాక్షి, కొత్తగూడెం: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ రోజున ఓటు హక్కు వినియోగించుకునే జిల్లా ఓటర్లకు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. స్త్రీ, పురుషులు వేర్వేరుగా క్యూలైన్ పాటించి పోలీసు శాఖ వారికి సహకరించాలి. పోలింగ్ స్టేషన్‌కు వచ్చే ఓటర్లు సెల్‌ఫోన్ తీసుకు రావొద్దు. మద్యం సేవించి ఓటు వేయడానికి రాకూడదు. పోలింగ్ కేంద్రానికి ఎలాంటి మారణాయుధాలు, వాటర్ బాటిళ్లు, ఇంక్ బాటిళ్లు తీసుకురావొద్దు. రాజకీయ పార్టీలకు చెందిన స్టిక్కర్లు, టోపీలు, కండువాలు, జెండాలు తదితర వాటితో పోలింగ్ కేంద్రానికి రావొద్దు. ఓటర్ కార్డుపై ఓటరు వివరాలు అన్నీ సరిగ్గా ఉంటే ఓటర్ ఐడీ కార్డుతో ఓటు వేయవచ్చు. లేదంటే ఇతర గుర్తింపు కార్డుల్లో కొన్ని చూయించాలి. పోలింగ్ కేంద్రం నుంచి 100 మీటర్లు మార్కు చేయబడిన లైనులోపల మాత్రమే ఓటర్లకు ప్రవేశం. ఓటు వేసిన వెంటనే తిరిగి పోలింగ్ కేంద్రం విడిచి వెళ్లిపోయి మరొక ఓటరుకు అవకాశం ఇవ్వాలి. పోలింగ్ కేంద్రం నుంచి 200 మీటర్లు అవతల ఓటు వేయడానికి వచ్చిన వారి వాహనాలను పార్క్ చేయాలి. పోలింగ్ కేంద్రం నుంచి 200 మీటర్ల అవతల మాత్రమే రాజకీయ పార్టీ వారు నీడనిచ్చే లాంటివి ఏర్పాటు చేసుకుని ఒక చిన్న టేబుల్, రెండు కుర్చీలతోపాటు ఇద్దరు మాత్రమే ఉండాలి. పార్టీ జెండాలు కానీ, గుర్తులు కానీ బ్యానర్లుగాని ప్రదర్శించకూడదు. ఏ పార్టీ వారు కూడా ఎటువంటి టెంట్లను ఏర్పాటు చేయకూడదు. టిఫిన్లు, భోజనాలు తదితరవి ఓటర్లకు సరఫరా చేయరాదు. ఓటర్ స్లిప్పులు ఇచ్చేవారు ఎటువంటి పార్టీ గుర్తులు లేకుండా తెల్లని కాగితంలో ముద్రించనవి మాత్రమే ఇవ్వాలి. అభ్యర్థి పేర్లు మొదలైనవి కలిగిన వాటిపై ఇవ్వకూడదు. -
నిజామాబాద్‌లో.. పోలింగ్ ప్రతిష్టాత్మకం
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి అసాధారణ పరిస్థితులు నెలకొనడంతో పోలింగ్ నిర్వహణ కోసం ఎన్నికల సంఘం యుద్ధప్రాతిపదికన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈవీఎంల చరిత్రలోనే తొలిసారిగా 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో ఈ స్థానం పోలింగ్ నిర్వహణ ఎన్నికల సంఘానికి సవాల్‌గా మారింది. దీంతో అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది. పోలింగ్‌కు కేవలం వారం రోజులే గడువుండటంతో ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఈ స్థానం పోలింగ్ ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా ఆరా తీస్తోంది. అనేక ఊహాగానాలు, ఉత్కంఠకు తెరదించుతూ నిజామాబాద్ స్థానానికి ఈవీఎంల ద్వారానే షెడ్యూల్ ప్రకారమే పోలింగ్ నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసిన నేప థ్యంలో పోలింగ్ ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ధునాతన ఎం–3 రకం ఈవీఎంలను జిల్లాకు తెప్పించింది. వీటి పనితీరును పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ లు ఈసీఐఎల్, బెల్ కంపెనీలకు చెందిన ఇంజినీర్లు జిల్లా కు చేరుకున్నారు. సుమారు 600 మంది పైగా ఇంజినీర్లు వీటి పరిశీలన కోసం నగరానికి వచ్చారు. కొందరు ఇంజనీర్లను జగిత్యాల జిల్లాకు పంపినట్లు తెలుస్తోంది. వీరికి నగరంలోని వివిధ ప్రాంతాల్లో వసతి సౌకర్యం కల్పించారు. ప్రైవేటు హోటళ్లు, లాడ్జీలు, హాస్టళ్లను కేటాయించారు. ప్రారంభమైన ఫస్ట్ లెవల్ చెకింగ్.. నియోజకవర్గం పరిధిలో మొత్తం 1,788 పోలింగ్ కేంద్రాలున్నాయి. 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక్కో కంట్రోల్ యూనిట్, వీవీపీఏటీలతో పాటు 12 బ్యాలె ట్ యూనిట్లను అమర్చి పోలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈవీఎంలు ప్రత్యేక కంటెనర్లలో బుధవారం జిల్లాకు వచ్చాయి. నగర శివారులోని విజయలక్ష్మి గార్డెన్లో అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షం లో ఫస్ట్ లెవల్ చెకింగ్ (ఎఫ్ఎల్సీ) ప్రక్రియ చేపట్టారు. ర్యాండమ్ చెకింగ్ వంటి ప్రక్రి యలను నిర్వహించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈవీఎంలలో బ్యాలె ట్ పేపర్ అమర్చడం వంటివి చేయాల్సి ఉంటుంది. వారం రోజులే గడువుండటంతో మూడు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాకు కేంద్ర ఎన్నికల ఉన్నతాధికారులు.. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్ సుదీప్‌జైన్ బుధవారం జిల్లాకు చేరుకున్నారు. హెలిక్యాప్టర్ ద్వారా నిజామాబాద్‌కు వచ్చిన ఆయన ఏర్పాట్లను దగ్గరుండి సమీక్షిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అదనపు సీఈఓ బుద్ద ప్రకాష్, ఈసీఐ కన్సల్టెంట్ నిఖిల్‌కుమార్ లు కూడా జిల్లాకు చేరుకున్నారు. పార్లమెంట్ నియోజకవర్గం ప్రత్యేక అధికారిగా నియమితులైన రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా కూడా జిల్లాకు వచ్చారు. సాంకేతిక నిపుణుల సేవల వినియోగం.. ఈ ఎన్నికల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక కంట్రోల్ యూనిట్, ఒక వీవీ ప్యాట్, 12 బ్యాలెట్ యూనిట్స్ ఉపయోగిస్తామన్నామని సుదీప్‌జైన్ పేర్కొన్నారు. సాంకేతిక కారణాల వల్ల సమస్య వస్తే దానినే మార్చడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అంటే 12 బీయుఎస్లో ఒక బ్యాలెట్ యూనిట్ సమస్య వస్తే దాని స్థానంలో అక్కడే మరో బ్యాలెట్ యూనిట్ అమర్చాలని, దీనికి అవసరమైన సాంకేతికత చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంతో మంది నిష్ణాతులు, అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణు లు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నందున వారి సేవలను ఉపయోగించుకోవడానికి అవకాశం ఉందన్నారు. అధికారులు అత్యంత నమ్మకంగా విధులు నిర్వర్తించాలన్నారు. ప్రపంచంలోనే మొదటిసారి : నిజామాబాద్ లోక్‌సభ నియోజక వర్గం ఎన్నిక ఒక చరిత్రకు నాంది కానున్నదని కేంద్ర డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సుదీప్‌జైన్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఎన్నికల సం ఘం ఉన్నతాధికారులతో కలిసి కలెక్టరేట్లో ఎన్ఎల్ఎమ్టీ నిష్ణాతులతో సమావేశమయ్యారు. సుదీప్‌జైన్ మాట్లాడుతూ దేశంలో ఇప్పటివరకు ఎం–2 ఈవీఎంఎస్ ద్వా రా, నాలుగు బ్యాలెట్ యూనిట్లతో మాత్రమే ఎన్నికలు నిర్వహించామన్నారు.ఇక్కడ 185 మంది బరిలో ఉండటంతో ఎం–3 ఈవీఎంలతో 12 బ్యాలెట్ యూనిట్లను ఏర్పాటు చేసి ఎన్నికలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రపంచంలో ఇంత వరకు ఎం–3 ద్వారా ఎన్నికలు నిర్వహించలేదన్నారు. ఒక చరిత్రకు నిజామాబాద్ పార్లమెంట్ నియోజక వర్గం వేదిక అవుతుందని చెప్పారు. వందల సంఖ్యలో సాంకేతిక నిపుణులు : ఈసీ కన్సల్టెంట్ నిఖిల్‌కుమార్ ఎన్నికల్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా సరైన పద్ధతులలో నిబంధనల ప్రకారం పోలింగ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎన్నికల సంఘం కన్సల్టెంట్ నిఖిల్ కుమార్ పేర్కొన్నారు. వందల సంఖ్యలో ఈసీఐఎల్, బెల్ నిపుణు లు ఈ ఎన్నికల్లో విధులు నిర్వహిస్తూ సాంకేతిక సహకారం అందించనున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిజామాబాద్ లోక్‌సభ స్థానం పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇందుకు అధికారులను సన్నద్ధం చేశామని, రాష్ట్ర ఎన్నికల సంఘం అదనపు సీఈవో బుద్ద ప్రకాష్, ఎన్నికల సాధారణ పరిశీలకులు గౌరవ్ దాలియా, ప్రత్యేక అధికారి రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా, సీపీ కార్తికేయ, సంయుక్త కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, బెల్, ఈసీఐఎల్ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో కలకలం; డమ్మీ ఈవీఎంలు పట్టివేత
ఇబ్రహీంపట్నం (మైలవరం): సరైన బిల్లులు లేకుండా తరలిస్తున్న 2,400 డమ్మీ ఈవీఎంలను కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు తుమ్మలపాలెం చెక్‌పోస్ట్ వద్ద మంగళవారం తెల్లవారుజామున స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పి.రామాంజనేయులుకు చెందిన వ్యక్తులు వీటిని తరలిస్తుండగా తనిఖీల్లో పట్టుకున్నారు. విషయాన్ని మండల ఎన్నికల నియమావళి అధికారి, ఎంపీడీవో రామప్రసన్న దృష్టికి తీసుకెళ్లారు. స్వాధీనం చేసుకున్న డమ్మీ ఈవీఎంలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఒక్కొక్క ఈవీఎం రూ.16కు కొనుగోలు చేసినట్లు సంబంధిత వ్యక్తులు బిల్లులు చూపించారు. అయితే ఒక ఈవీఎం ఖరీదు సుమారు రూ.100 వరకు ఉంటుందని గుర్తించిన అధికారులు 2,400 ఈవీఎంలకు రూ.2.40 లక్షలు ఖర్చును భీమవరం టీడీపీ అభ్యర్థి పి.రామాంజనేయులు ఖర్చులో జమచేసి ఎన్నికల కమిషన్‌కు నివేదిక పంపించారు. -
నిజామాబాద్‌లో.. ఈవీఎంలతోనే పోలింగ్!
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి పోలింగ్ నిర్వహణపై స్పష్టత వచ్చింది. ఈవీఎంల ద్వారానే పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. నిర్ణీత తేదీనే ఎన్నిక నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించినట్లు అధికార వర్గాల తెలిసింది. సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ ఎంపీ స్థానంలో భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉన్న విషయం తెలిసిందే. పసుపు, ఎర్రజొన్న రైతులు నామినేషన్లు దాఖలు చేయడంతో అభ్యర్థుల సంఖ్య 185కి చేరింది. దీంతో సాధారణ ఈవీఎంల ద్వారా పోలింగ్ నిర్వహణ సాధ్యపడడం లేదు. బ్యాలెట్ ద్వారా పోలింగ్ జరపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం మొదట్లో భావించింది. దీనికంటే అధునాతన ఈవీఎంల ద్వారానే పోలింగ్ జరపడం ఉత్తమం అని భావించిన ఎన్నికల సంఘం.. ఈ మేరకు ఆదివారం స్పష్టతనిచ్చింది. 11 న పోలింగ్! పార్లమెంట్ ఎన్నికల బరిలో 185 మంది ఉండడంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఎం–3 ఈవీఎంలను వినియోగించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఎం–3 ఈవీఎంల కోసం అధికారులు అన్వేషించారు. వివిధ రాష్ట్రాల నుంచి ఎం–3 ఈవీఎంలను తెప్పించాలనుకున్నారు. నియోజకవర్గంలో మొత్తం 1,788 పోలింగ్ బూత్‌లకు సరిపడా ఈవీఎంలను మళ్లీ సేకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు 26,820 బ్యాలెట్ యూనిట్లు, 2,240 కంట్రోల్ యూనిట్లు, 2600 వీవీ ప్యాట్లు అందించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఈసీఐఎల్‌ను ఆదేశించింది. అవి జిల్లాకు చేరగానే వాటిని ఫస్ట్ లెవల్ చెకప్, ర్యాండమ్ చెకింగ్ వంటి ప్రక్రియలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక ఇంజినీర్లతోపాటు అదనపు ఇంజినీర్లు అవసరం. ఈ ప్రక్రియ అంతా జరగాలంటే కొంత సమయం పట్టే అవకాశాలున్నాయి. అయినా నిర్ణీత తేదీనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఈవీఎంల అవగాహన కేంద్రం ఎత్తివేత.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై ఓటర్లలో అవగాహన కలిగించేందుకు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఈవీఎం అవగాహన కేంద్రాన్ని ఎత్తేశారు. బ్యాలెట్ యూనిట్, వీవీపీఏటీ, కంట్రోల్ యూనిట్ వంటి వాటిపై కలెక్టరేట్‌కు వచ్చే వారికి అవగాహన కల్పించేందుకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటన సందర్భంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ యంత్ర పరికరాలను తీసేశామని, ఈసీ ఆదేశాలిచ్చాక మళ్లీ ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా పోలింగ్ నిర్వహణపై ఆ విధులు నిర్వర్తించనున్న అధికారులు, సిబ్బందికి తొలి విడత శిక్షణ ఇప్పటికే పూర్తి చేసిన అధికారయంత్రాంగం.. రెండో విడత శిక్షణపై సందిగ్ధత నెలకొంది. పోలింగ్ తేదీకి కొద్ది రోజుల ముందు సిబ్బందికి ప్రత్యేకంగా రెండోసారి శిక్షణ తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది. శిక్షణ తరగతులపై జిల్లా అధికారులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. -
అనంతపురం: నామినేషన్ల ఉపసంహరణ
సాక్షి,అనంతపురం అర్బన్: నామినేషన్ల ఉపసంహరణ గురువారం ముగిసింది. అనంతపురం, హిందూపురం పార్లమెంట్ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసి ఆమోదం పొందిన 23 మంది అభ్యర్థుల్లో ఒక్కరూ తమ నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదు. ఇక 14 అసెంబ్లీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసి ఆమోదం పొందిన 199 మంది అభ్యర్థుల్లో బుధవారం ఆరుగురు, గురువారం 29 మంది.. మొత్తంగా 35 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. చివరకు అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గానికి 14 మంది అభ్యర్థులు ఎన్నికల పోటీలో నిలవగా.. హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గానికి 9 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక 14 అసెంబ్లీ నియోజవకర్గాలకు 164 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అత్యధికంగా ఉరవకొండ, కళ్యాణదుర్గం, పుట్టపర్తి, ధర్మవరం నియోజవర్గాల్లో 15 మంది చొప్పున ఎన్నికల బరిలో ఉన్నారు. అత్యల్పంగా మడకశిర నియోజకవర్గంలో ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదనపు ఈవీఎంల అవసరం లేదు ఒక ఈవీఎంలో 16 మంది అభ్యర్థులకు స్థానం ఉంటుంది. అయితే జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో 15 మంది అభ్యర్థులు, మిగిలిన నియోజకవర్గాల్లో 15 కంటే తక్కువ మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ లెక్కనñ జిల్లాలోని 14 నియోజవర్గాల్లోనూ అదనపు ఈవీఎంల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదు. పార్లమెంట్ స్థానాలకు బరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు అనంతపురం పార్లమెంట్: తలారి రంగయ్య (వైఎస్సార్సీపీ), జేసీ పవన్‌రెడ్డి (టీడీపీ), డి.జగదీశ్ (సీపీఐ), హంస దేవినేని (బీజేపీ), కె.రాజీవ్‌రెడ్డి (కాంగ్రెస్), జి.లలిత (ఎస్‌యుసీఐ) హిందూపురం పార్లమెంట్: గోరంట్ల మాధవ్ (వైఎస్సార్సీపీ), నిమ్మల కిష్టప్ప (టీడీపీ), ఎం.ఎస్.పార్థసారథి (బీజేపీ), కె.టి.శ్రీధర్ (కాంగ్రెస్) స్వతంత్ర అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు అనంతపురం, హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గాలకు పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థులకు ఆయా పార్లమెంట్ల రిటర్నింగ్ అధికారులు కలెక్టర్ జి.వీరపాండియన్, జాయింట్ కలెక్టర్ ఎస్.డిల్లీరావు గుర్తులు కేటాయించారు. అసెంబ్లీ స్థానాలకు పోటీ ఇలా.. నియోజకవర్గం బరిలో అభ్యర్థులు రాయదుర్గం 11 ఉరవకొండ 15 గుంతకల్ 12 శింగనమల 9 అనంతపురం 12 కళ్యాణదుర్గం 15 రాప్తాడు 10 మడకశిర 7 హిందూపురం 11 పెనుకొండ 11 పుట్టపర్తి 15 ధర్మవరం 15 కదిరి 11 -
అదనపు ఈవీఎంల కేటాయింపు
మోర్తాడ్(బాల్కొండ): పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ రోజు ఈవీఎంలు మొరాయిస్తే వెంటనే మరో ఈవీఎంను ఏర్పాటు చేయడానికి ప్రతి నియోజకవర్గానికి అదనపు ఈవీఎంలను కేటాయిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఒకవైపు కొనసాగుతుండగా పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు మరోవైపు వేగంగా సాగుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోయినా ఈవీఎంలను కేటాయించి వాటిని శాసనసభ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు కేటాయిస్తున్నారు. నామినేషన్ల విత్‌డ్రాలు పూర్తయిన తరువాత బరిలో ఉండే అభ్యర్థుల పేర్లు వారికి కేటాయించే గుర్తులను అధికారులు ప్రకటించనున్నారు. అయితే శాసనసభ నియోజకవర్గాల వారీగా ఈవీఎంలను కేటాయించి వాటిని భద్రపరచనున్నారు. ఇందులో భాగంగా ఒక్కో నియోజకవర్గానికి అవసరమైన ఈవీఎంలతో పాటు అదనంగా మరికొన్నింటిని అందుబాటులో ఉంచడానికి ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల పరిధిలో 1,919 పోలింగ్ కేంద్రాలు ఉండగా ప్రతి నియోజకవర్గానికి ఓటర్ల సంఖ్య ప్రకారం ఈవీఎంలను కేటాయిస్తున్నారు. అంతేకాకుండా అనుకోకుండా ఈవీఎంలు మొరాయించి పోలింగ్ ప్రక్రియ నిలిచిపోతే మళ్లీ కొనసాగించడానికి ముందస్తు చర్యలను తీసుకుంటున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాలకు ఈవీఎంలు చేరుకోగా నియోజకవర్గాల వారీగా వాటిని కేటాయిస్తున్నారు. ఒక్కో నియోజకవర్గానికి 10 నుంచి 20 శాతం అదనపు ఈవీఎంలు కేటాయిస్తున్నారు. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా విడుదలైన తరువాత శాసనసభ నియోజకవర్గాలకు కేటాయించిన ఈవీఎంలను ర్యాండమైజేషన్ చేస్తారు. ఆ తరువాత అభ్యర్థుల వివరాలు, కేటాయించిన గుర్తులను చేర్చి సాంకేతిక సమస్యలు ఉన్నాయో లేవో అని పరిశీలించి భద్రపరుస్తారు. పోలింగ్ ఏప్రిల్ 11న జరుగనున్న దృష్టా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. -
ఈవీఎంల వయసు 37ఏళ్లు
సాక్షి, కర్నూలు(వైఎస్ఆర్ సర్కిల్): స్వతంత్ర భారతావనిలో ఎన్నికలను తొలుత పేపర్ బ్యాలెట్ ద్వారా నిర్వహించేవారు. అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానం సద్వినియోగం చేసుకుంటూ ఎన్నికల నిర్వహణలో పారదర్శకతకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లను ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. దేశంలో మొదటి సాధారణ ఎన్నికలు 1951లో జరుగగా.. ఆ సమయంలో బ్యాలెట్ విధానం ఉంది. 1982లో తొలిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)ను అందుబాటులోకి వచ్చింది. ప్రప్రథమంగా కేరళలో వాటిని వినియోగించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ వీటి నిర్వహణలో లోపాలు, సందేహాలతో కొంత కాలం కొట్టుమిట్టాడి ఆ తర్వాత నిలదొక్కుకుంది. 2004 ఎన్నికల నుంచి వాటిని పూర్తిస్థాయిలో వినియోగిస్తోంది. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తుండటంతో మరింత పారదర్శకత కోసం 2013 నుంచి వీవీప్యాట్ (ఓటర్ వెరిఫయిబుల్ పేపర్ అడిట్ ట్రయల్)ను ఈవీఎంలకు అనుసంధానం చేశారు. - మొదటిసారి కేరళ రాష్ట్రంలోని ఉత్తర పెర్వూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 1982 మే 19న వినియోగించారు. - ఆ తర్వాత దేశ వ్యాప్తంగా పది నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో వీటిని వినియోగించారు. - ఈవీఎంలను ఉపయోగించ వద్దని 1984 మే 5వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. - ఈవీఎంల వాడకానికి 1988లో ప్రజామోదం లభించింది. - ఈవీఎంల వాడకాన్ని 1988 డిసెంబర్లో సెక్షన్ 61ఏ ద్వారా కేంద్రం ప్రజాప్రాతినిధ్య చట్టంలో చేర్చి సవరణ చేశారు. ఆ తర్వాత 1989 మార్చి 15న అమలులోకి రావడంతో సుప్రీంకోర్టు కూడా తర్వాత సమర్థించింది. - 1990 జనవరిలో ఎన్నికల సంస్కరణల కమిటీ (ఈఆర్సీ)ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదే ఏడాది ఏప్రిల్‌లో ఈవీఎంల వినియోగాన్ని సాంకేతిక నిపుణల కమిటీ సమర్థించింది. - 1999, 2004లో వివిధ రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఈవీఎంల వాడకాన్ని వినియోగించారు. - లోక్‌సభకు 2004–14 మధ్య జరిగిన మూడు ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించారు. - వీవీ ప్యాట్లను ఈవీఎంలకు అనుసంధానం చేయాలని 2013 ఆగస్టు 14న నిర్ణయించారు. - నాగాలాండ్ రాష్ట్రంలోని ఆక్సె అసెంబ్లీ నియోజకవర్గానికి 2013 సెప్టెంబర్ 4న జరిగిన ఎన్నికల్లో వీవీ ప్యాట్లను మొదటి సారిగా వినియోగించారు. - దశల వారీగా వీవీ ప్యాట్లను వినియోగించాలని 2013 అక్టోబరు 8న సుప్రీం కోర్టు ఆదేశించింది. అప్పటి నుంచి వీవీ ప్యాట్లను ఎన్నికల్లో వినియోగిస్తున్నారు. - 2017 ఏప్రిల్‌లో రూ. 3173.47 కోట్లతో 16.15లక్షల వీవీ ప్యాట్ల కొనుగోలుకు ప్రభుత్వం ఆమోదించింది. దీంతో ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో కూడా వీవీ ప్యాట్లను వినియోగించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. -
ఈవీఎంలపై విస్తృత అవగాహన
ఈవీఎంలు, వీవీప్యాట్లపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రజల్లో విస్తృతఅవగాహన కల్పించేందుకు చైతన్యబృందాలతో ప్రచారం నిర్వహించనున్నారు. ఈమేరకు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఏర్పాట్లు చేశారు. సాక్షి, సిటీబ్యూరో: ఈవీఎంలు, వీవీప్యాట్లపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు చైతన్య బృందాలతో ప్రచారం నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లపై మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 92 చైతన్య బృందాలతో ఈవీఎంలపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు స్వీప్ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రాజకీయ పార్టీల నుంచి వచ్చిన సూచనల కనుగుణంగా సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు పోలింగ్‌కు హాజరయ్యేందుకు తగిన సదుపాయాలు కల్పిస్తామన్నారు. జిల్లాలో ప్రస్తుతమున్న 41,62,215 మంది ఓటర్లతోపాటు ఈ నెల 15లోపు దరఖాస్తు చేసుకునే వారికి పోలింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. ఆ తర్వాత దరఖాస్తు చేసుకునే వారికి ఓటు వేసే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. నామినేషన్ల స్వీకరణకు చివరి రోజైన మార్చి 25వ తేదీకి 10 రోజుల ముందుగా అంటే మార్చి 15 వరకు స్వీకరించిన క్లెయిమ్స్, అభ్యంతరాలను పరిశీలించడం జరుగుతుందన్నారు. ఓటర్ల జాబితాలో పేరున్నదీ? లేనిదీ? సరిచూసుకోవాల్సిందిగా ఆస్తిపన్ను చెల్లింపుదారుల మొబైల్ నంబర్లకు ఇప్పటికే ఎస్ఎంఎస్లు పంపించామన్నారు. ఎన్‌వీఎస్‌వీ పోర్టల్, సీఈఓ వెబ్సైట్లలో తమ పేర్లను చెక్ చేసుకోవాలని సూచించారు. జిల్లాలో మొత్తం 3,976 పోలింగ్ కేంద్రాలుంటాయన్నారు. ప్రచారానికి సంబంధించి ఎకోఫ్రెండ్లి సామగ్రినే వా డాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసిందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్టంగా అమలు చేయడానికి హైదరాబాద్ జిల్లాలో 374 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 42 స్టాటిక్ çసర్వైలెన్స్ టీమ్స్, 42 వీడియో సర్వైలెన్స్ టీమ్స్, 14 వీడియో వ్యూయింగ్ టీమ్స్, 14 అకౌంటింగ్ టీమ్‌లను ఏర్పాటు చేశామని వివరించారు. 10 వాహనాలకే అనుమతి... నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ... మంగళవారం రూ.90 లక్షలు స్వాధీనం చేసుకున్నామన్నారు. నగరంలో ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఏవిధమైన అనుమతులు కావాలన్నా ఈ–సువిధ అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు 7వేల మంది పోలీసు సిబ్బందికి ప్రత్యేక శిక్షణనిచ్చామన్నారు. రోడ్ షోలకు 10వాహనాలకు మించి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మాణిక్‌రాజ్ కోరారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్, సికింద్రాబాద్ లోక్‌సభ రిటర్నింగ్ ఆఫీసర్ రవి, అడిషనల్ పోలీస్ కమిషనర్ శిఖాగోయల్, ఆయా పార్టీల నాయకులు ఎంఎస్ ప్రభాకర్, జాఫ్రీ, మర్రి శశిధర్‌రెడ్డి, వనం రమేశ్, పి.వెంకటరమణ పాల్గొన్నారు. సిబ్బందికీ అవగాహన అవసరం... ఈవీఎంలు, వీవీప్యాట్లపై ఎన్నికల సిబ్బందికి కూడా తగిన అవగాహన లేదని.. వారికీ తగిన శిక్షణ అవసరమని రాజకీయ పార్టీల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. పోలైన ఓట్లకు సంబంధించి ఈవీఎంల లెక్కకు, ఏజెంట్ల లెక్కకు, వీవీప్యాట్లలో లెక్కకు తేడా ఎందుకు ఉంటోందని ప్రశ్నించారు. ఎన్నికల అధికారులు అవగాహనలేమితో వీవీప్యాట్లలోని స్లిప్‌లను తొలగించారని గుర్తుచేశారు. పోలింగ్ ముగిశాక గంటలు గడిస్తే గానీ శాతం ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఆయా అంశాలకు సంబంధించిన ధరల పట్టిక వాస్తవంగా లేదని, సవరించాలని కోరారు. ఓటరు స్లిప్‌ల పంపిణీ సక్రమంగా జరపాలన్నారు. సున్నిత ప్రాంతాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎన్నికల విధుల్లోని వారికి నాణ్యమైన ఆహారాన్ని సరిపడా అందించాలని సూచించారు. -
నియంత్రించే.. ‘యంత్రుడు’
సాక్షి, ఎడ్లపాడు: ఇప్పటి వరకు పోలింగ్ స్టేషన్లో రెండు రకాల యంత్రాలు మాత్రమే ఉండేవి. వాటిలో ఒకటి కంట్రోల్ యూనిట్ (సీయూ) యంత్రం, మరొకటి బ్యాలెట్ యూనిట్ (బీయూ) యంత్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఓటింగ్ యంత్రాల నిర్వహణ పారదర్శకంగా ఉండేందుకు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అదనంగా ‘ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్’ అనే మూడో యంత్రాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. సింపుల్ వీవీ ప్యాట్‌గా పిలిచే ఈ కొత్త యంత్రంపై వినియోగం, ఉపయోగాలపై ఈవీఎంల ద్వారా ఓటు వేసే విధానంపై మాస్టర్ ట్రైనీలు, ఎలక్ట్రోరల్ అధికారులు జిల్లాలోని అన్ని మండలాల్లోనూ శిక్షణ, అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. వీవీ ప్యాట్‌తో ప్రయోజనాలు... ఎన్నికల కేంద్రంలో బ్యాలెట్ యూనిట్‌పై ఓటు వేయగానే తక్షణమే తాను ఏ అభ్యర్థికి ఓటు వేసింది..ఏ గుర్తు బటన్ నొక్కిన వివరాలు వీవీ ప్యాట్ యంత్రంలోని చిన్నపాటి కంప్యూటర్ తెరపై స్పష్టంగా కనిపిస్తాయి. ఈ సమాచారం ఓటరుకు కేవలం ఏడు సెకన్ల కాలం మాత్రమే నిలుస్తుంది. ఏడు సెకన్లు పూర్తికాగానే ఆ తెరపై సమాచారం అదృశ్యమైపోతుంది. ఇలా అదృశ్యమైన సమాచారం మరుక్షణమే ఓ చిన్న కాగితంపై ముద్రణై అదే యంత్రంలోని అడుగుభాగాన ఉన్న ఖాళీ బాక్సులో పడుతుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మరుక్షణమే ఆ ఓటు సమాచారం పోలింగ్ అధికారి వద్ద ఉంటే కంట్రోల్ యూనిట్‌కు చేరుతుంది. గత ఎన్నికల్లో బ్యాలెట్ యూనిట్లో ఓటు వేయగానే అది కంట్రోల్ యూనిట్లోకి వెళ్లి నిక్షిప్తమయ్యేది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య వీవీ ప్యాట్ విధులు ఉంటాయి. ఎప్పుడైనా ఎవరైనా ఓటరు తన ఓటుపై అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. ఏదైనా పార్టీ లేదా ఎవరైనా అభ్యర్థి ఫలానా బూత్‌లో పడిన ఓట్లపై తమకు అనుమానాలు ఉన్నాయని అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు వీవీప్యాట్‌లో నమోదైన కాగితాల ఆధారంగా పరిశీలించే వెసులుబాటును ఎన్నికల సంఘం కల్పిస్తోంది. ఇటీవల కాలంలో దేశంలో జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మూడు యంత్రాలతోనే పోలింగ్ నిర్వహించారు. ఈసారి కొత్తగా ప్రవేశపెడుతున్న వీవీప్యాట్ల పని తీరు, ప్రయోజనంపై ఓటర్లకు క్షేత్రస్థాయిలో అవగాహనయ్యేలా ప్రచారం, శిక్షణ ఇవ్వాలని ఎలక్ట్రోరల్ అధికారులకు ఎన్నికల సంఘం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఓటింగ్‌పరంగా ఎదురయ్యే సమస్యలకు పూర్తి స్థాయి పరిష్కారం క్షణాల్లో లభ్యమయ్యే అవకాశాన్ని ఎన్నికల సంఘం అందుబాటులోకి తెస్తోంది. -
ఓటు హక్కు వినియోగించుకోవాలి
సాక్షి, మొగల్రాజపురం(విజయవాడ తూర్పు) : ఓటు హక్కును అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అప్పుడే ప్రజాస్వామ్యంలో అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ అన్నారు. ఓటు హక్కు వినియోగంతో పాటుగా ఓటింగ్ యంత్రాలపై అవగాహన కార్యక్రమం పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో మౌలిక సదుపాయాలు సాధించుకోవడంతో పాటుగా ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు హక్కు ఎంతో విలువ ఉందన్నారు. ఎన్నికల బరిలో నిలబడిన అభ్యర్థుల్లో ఎవరికి ఓటు వేయడం ఇష్టం లేని పక్షంలో నోటా వినియోగించుకోవచ్చునని చెప్పారు. క్రిమినల్ చరిత్ర తెలియజేయాల్సిందే... తాజాగా సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం ఎన్నికల పోటీలో ఉన్న ప్రతి అభ్యర్థి తనపై ఉన్న కేసుల వివరాలను కూడా తప్పనిసరిగా అఫిడవిట్లో పేర్కొనాల్సిందేనని స్పష్టం చేసిందని ఇంతియాజ్ తెలిపారు. బాహుబలిలా.... ఎన్నికల ఓటింగ్ యంత్రాల అవగాహనలో భాగంగా ఏర్పాటు చేసిన సదస్సులో కలెక్టర్ విద్యార్థులకు ఆసక్తి కలిగించడానికి బాహుబలి సినిమాతో పాటుగా మిసిసిపి మషాలా అనే ఇంగ్లిష్ సినిమాలోని అంశాలను ప్రస్తావించారు. కెన్యాలోని ఒక నియంత నాయకుడు అయితే ఆ పాలన ఎలా సాగుతుందోననే అంశాలతో మిసిసిపి మషాలా సినిమాలో చూపించారని అప్పుడు ఓటు విలువ తనకు తెలిసిందని చెప్పారు. మొదటి సారిగా వివి ప్యాట్ల వినియోగం ఓటర్ వెరిఫేబుల్ పేపర్ ఆడిట్ వేర్ (వీవీ ప్యాట్)ను మన రాష్ట్రంలో మొదటి సారిగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఉపయోగిస్తున్నామని, ఈవీఎంలో ఓటరు ఎవరికి ఓటు వేశారో ఈ ప్యాట్‌లో ఏడు సెకన్ల పాటు ఓటరుకు కనిపిస్తోందని చెప్పారు. ఫారం–7 కింద 25 కేసులు నమోదు చేశాం.. జిల్లా పరిధిలో ఒకరి పేరుతో ఉన్న ఓటును తొలగించమని కొంత మంది ఫారం–7 ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. ఈ విధంగా దరఖాస్తు ఎవరు చేశారనే విషయంపై విచారణ జరుగుతుంది. తప్పుగా దరఖాస్తు చేసిన వారిపై జిల్లాలో 25 కేసులు నమోదు చేశాం. విచారణ జరిపిన చర్యలు తీసుకుంటామని సదస్సు అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. సదస్సులో తూర్పు నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి సి.గురుప్రకాష్, తహసీల్దార్ లలిత, సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.రమేష్ పాల్గొన్నారు. సదస్సు అనంతరం ఎన్నికల ప్రచార వాహనాలను కలెక్టర్ పరిశీలించారు. -
ప్రజాస్వామ్య సంస్థలను అవమానించింది
చెన్నై: భారత ప్రజాస్వామ్య మనుగడకు కీలకమైన ఆర్మీ, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) వంటి ప్రతిష్టాత్మక సంస్థలను కాంగ్రెస్ పార్టీ అవమానించిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. రఫేల్ ఫైటర్ జెట్ల కొనుగోలు కేసులో సుప్రీంకోర్టు క్లీన్చిట్ ఇచ్చినప్పటికీ ఆ పార్టీ నేతలు తనపై తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ప్రజల్లో ఎన్నికల ముందు అనుమానాలు రేకెత్తించేందుకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై కాంగ్రెస్ నేతలు రాద్ధాంతం చేస్తారనీ, తీరా ఫలితాలు తమకు అనుకూలంగా వస్తే సంతోషంగా స్వీకరిస్తారని ఎద్దేవా చేశారు. తమిళనాడు, పుదుచ్చేరిలోని బీజేపీ బూత్‌స్థాయి కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన మోదీ.. ప్రతిపక్ష కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాగ్, ఆర్మీలను అవమానించారు.. భారత ఆర్మీ చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్, యూపీఏ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న బొగ్గు కుంభకోణాలను ప్రస్తావిస్తూ.. ‘కాంగ్రెస్ నేతలకు ఎన్నికల సంఘం(ఈసీ), ఈవీఎంలతోనే సమస్య అని మీరు అనుకుంటూ ఉంటే ఒక్కక్షణం ఆగండి. వాళ్లు ఆర్మీ, కాగ్ సహా దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు కీలకంగా ఉన్న ప్రతీ సంస్థను అవమానించారు. రఫేల్ ఫైటర్ జెట్ల కేసులో సుప్రీంకోర్టు తమకు అనుకూలంగా తీర్పును ఇవ్వకపోవడంతో దాన్ని వ్యతిరేకిస్తున్నారు. తమ బెదిరింపులకు లొంగకుండా నిజాయితీగా వ్యవహరించినందుకు గతంలో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తినే(జస్టిస్ దీపక్ మిశ్రా) అభిశంసన ద్వారా తొలగించేందుకు యత్నించారు’ అని తెలిపారు. కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ప్రజల్లోకి వాస్తవాలను తీసుకెళ్లాలనీ, కాంగ్రెస్ నైజాన్ని బయటపెట్టాలని ఓ బీజేపీ కార్యకర్త అడిగిన ప్రశ్నకు మోదీ సమాధానం ఇచ్చారు. ఈవీఎంల విషయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాల వ్యవహారశైలి.. పిల్లాడు పరీక్షల్లో ఫెయిల్ అయితే ఆ త ప్పంతా అతను చదువుకున్న స్కూలు, పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుడు, పరీక్షల నిర్వాహకుడిదే అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ను భారత్ క్షమించదు.. భారత ప్రజాస్వామ్యం ఉనికికి గతంలోనూ ఓసారి(1975 ఎమర్జెన్సీ పాలన) ప్రమాదం ఎదురైనప్పటికీ, ప్రజలు దాన్ని కాపాడుకున్నారని ప్రధాని మోదీ అన్నారు. ‘బీజేపీ కార్యకర్తలు ప్రజల్లో మమేకమై కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏ అప్పటికీ, ఇప్పటికీ మారలేదని వివరించాలి. ఎమర్జెన్సీ సమయంలో ప్రజలు తిరగబడటంతో ఆ పార్టీ నేతలు ఇప్పుడు మరింత జిత్తులమారిగా తయారయ్యారు. కానీ ప్రజాస్వా్యమ్యంతో ఆటలాడితే భారత్ ఈసారి కాంగ్రెస్‌ను క్షమించదు’ అని అన్నారు. -
వ్యవస్ధలను మేనేజ్ చేయడం చంద్రబాబుకు అలవాటు