కోస్గి (కొడంగల్) : ఓటంటే ఐదేళ్ల బతుకు. ఎలాంటి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలన్నా అది ఓటర్ల చేతుల్లోనే ఉంటది. అంతటి ప్రాముఖ్యత కలిగి ఓటును నోటుకో మద్యానికే అమ్ముకోవద్దు. సమర్ధవంతంగా సేవేచేసే వారిని ఎన్నుకునే అవకాశం ఓటర్లకు ఉంది. రాజకీయ నాయకుల తలరాతను మార్చేశక్తి ఓటుకు మాత్రమే ఉంది. అందుకే ఎన్నికల ప్రచారంలో నాయకులు సిత్ర విచిత్రాలు ఇప్పటికే మనం చూస్తున్నాం. 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ ఓటేసేందుకు అర్హులే. ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలనేదే ఈ కథనం...
స్టెప్-1
ఓటరు పోలింగ్‌బూత్ గదిలోకి ప్రవేశించిన అనంతరం ప్రిసైడింగ్ ఆఫీసర్, కంట్రోల్‌రూం యూనిట్‌ను సిద్ధం చేయగానే బ్యాలెట్ యూనిట్‌లో గ్రీన్‌సిగ్నల్ లైటింగ్ వెలుగుతుంది. బ్యాలెట్ యూనిట్‌లో టాప్‌లో గ్రీన్‌లైట్ కలిగిన అనంతరం మాత్రమే బ్యాలెట్ యూనిట్ ఓటును స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుంది. ఓటరు బ్యాలెట్ యూనిట్‌ను ముందుగా ఈ గ్రీన్ లైట్‌ను గమనించాల్సి ఉంటుంది.
స్టెప్-2
బ్యాలెట్ యూనిట్‌కు టాప్‌లో గ్రీన్‌లైట్ వచ్చిన తర్వాత ఓటేయాల్సి ఉంటుంది. ఇందుకు బ్యాలెట్ యూనిట్ ప్యానల్ మీద వరుసగా అభ్యర్థి పేరు, వారికి కేటాయించిన పార్టీ గుర్తు కనిపిస్తుంది. ఒకవేల స్వతంత్ర అభ్యర్థి అయితే వారికి కేటాయించిన గుర్తు కనిపిస్తుంది. దీని పక్కనే నీలిరంగులో ఉన్న బటన్ కనిపిస్తుంది. ఓటరు తనకు నచ్చిన అభ్యర్థి గుర్తు మీద బటన్ నొక్కితే ఓటు పడుతుంది
స్టెప్-3
ఎప్పుడైతే ఓటరు బ్యాలెట్ యూనిట్‌లో నీలిరంగు బటన్ నొక్కుతారో అప్పుడు ఓటరు ఎంచుకున్న అభ్యర్థిపేరు గుర్తుకు ఎదురుగా ఉన్న ఎర్రలైట్ వెలుగుతుంది. దీంతో ఓటు మిషన్‌లో నమోదవుతుంది.
స్టెప్-4
ఎప్పుడైతే బ్యాలెట్ యూనిట్లో ఎర్రలైట్ వెలుగుతుందో అప్పుడు పక్కనే ఉన్న వీవీ ప్యాట్ యూనిట్‌లో ఓటరు ఎన్నుకున్న అభ్యర్థి సీరియల్ నెంబర్ పేరు, గుర్తుతో ఒక బ్యాలెట్ పేపర్‌పై ప్రింట్ చూపిస్తుంది. ఈ ప్రింట్ పేపర్ వీవీ ప్యాట్‌లో ప్రత్యేకంగా రూపొందించి తెరలో ఏడు సెకన్లపాటు కనిపిస్తుంది. అనంతరం ఆటోమెటిక్‌గా స్లిప్ కట్‌అయి వీవీ పాయింట్‌లో ఉన్న డ్రాప్ బాక్సులో పడిపోతుంది. దాంతో ఓటేసే ప్రక్రియ పూర్తవుతుంది. ఒక వేళ ఓటరుకు బ్యాలెట్ స్లిప్ కనబడకపోయినా, బీఫ్ శబ్థం పెద్దగా వినిపించకపోయినా ప్రిసైడింగ్ ఆఫీసర్‌ను సంప్రదించవచ్చు. ఇలా చేయడం ద్వారా ఓటును సరైన పద్ధతిలో వినియోగించుకోవచ్చు.
బ్రహ్మాస్త్రంపై అవగాహన
Published Tue, Nov 6 2018 3:17 PM | Last Updated on Tue, Nov 6 2018 3:27 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment