న్యూఢిల్లీ: ఈవీఎంల పనితీరుపై అనుమానం ఉందనో, వాటిని నియంత్రణలోకి తీసుకుని ఫలితాలను తలకిందులు చేయొచ్చనే ఆరోపణలతోనో ఎన్నికల ప్రక్రియను నియంత్రించలేమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈవీఎంలో ‘మార్పులు’ చేసే ఆస్కారం ఉందని, అందుకే బ్యాలెట్ పేపర్ విధానమే ఉత్తమం అని వాదించే వారి ఆలోచనను మార్చలేమని కోర్టు వ్యాఖ్యానించింది.
ఈవీఎంలో నమోదయ్యే ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చాలంటూ దాఖలైన పలు పిటిషన్లను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపంకర్ దత్తాల సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారించింది. పిటిషన్‌దారులు లేవనెత్తిన ప్రశ్నలపై తమ అనుమానాలను నివృత్తిచేసుకునేందుకు జడ్జీలు మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం అధికారి నితేశ్ వ్యాస్‌ను కోర్టుకు రప్పించి ఐదు ప్రశ్నలు సంధించారు. మైక్రోకంట్రోలర్లను ఎక్కడ బిగిస్తారు? వాటి ప్రోగ్రామ్‌ను మళ్లీ మార్చొచ్చా? అంటూ ప్రశ్నలు అడిగారు.
బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్, కంట్రోల్ యూనిట్లలో మైక్రోకంట్రోలర్లను బిగిస్తామని, వాటి పోగ్రామ్‌ను సరిచేసేందుకు ఎవరైనా ఓపెన్ చేస్తే పనిచేయకుండాపోతాయని వ్యాస్ వివరణఇచ్చారు. ఈ వివరణతో అసిసోయేషన్ ఫర్ డెమొక్రట్రిక్ రిఫారŠమ్స్ తరఫు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ విభేదించారు. ఎన్నికల గుర్తులను అప్‌లోడ్ చేసేటపుడు తప్పుడు ప్రోగామ్‌ను అప్‌లోడ్ చేసే ఆస్కారముందని వాదించారు. దీనిపై జడ్జీ దత్తా కలి్పంచుకుని.. ‘ మీ ఆలోచనలను మేం మార్చలేం. ఈసీ వంటి రాజ్యాంగబద్ధ సంస్థను నియంత్రించలేం’’ అని వ్యాఖ్యానించారు. ఈవీఎంల సోర్స్ కోడ్‌ను బహిర్గతంచేయాలని మరో పిటిషనర్ తరఫు న్యాయవాది సంతోశ్ వాదించగా కుదరదని జడ్జీ తిరస్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment