Ballot Paper
-
బ్యాలెట్ కోసం చైతన్యం.. వారిని వణికిస్తోందిగా!
మర్కర్‌వాడీ అంటే కేవలం 1900 ఓట్లున్న కుగ్రామం. మహారాష్ట్ర సోలాపూర్ జిల్లాలో మల్షిరాస్ తహసీలులో ఉంటుందా పల్లె! ఎంత చిన్న పల్లె అయితేనేం.. ఇవాళ దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పాలకులలో వణుకు పుట్టిస్తోంది. బండారం బయటపడుతుందేమోననే భయాన్ని రేకెత్తిస్తోంది. ఆ చిన్న గ్రామంలోని ప్రజల్లో ఈవీఎంల పట్ల పుట్టిన అనుమానం.. తమ ‘తీర్పు’ను తామే బ్యాలెట్ పేపర్ల ద్వారా మరోసారి క్రాస్ చెక్ చేసుకోవాలని సంకల్పించిన చైతన్యం.. అధికారవర్గాలకు జడుపు తెప్పించింది. ప్రజలు స్వచ్ఛందంగా అలాంటి పోలింగును ప్లాన్ చేసుకోగా.. ఏకంగా మూడు రోజుల పాటూ పోలీసులు పెద్దసంఖ్యలో- ఆ చిన్న పల్లెలో మోహరించి- కర్ఫ్యూ ప్రకటించడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారుతోంది.వివరాల్లోకి వెళితే..ఈ మర్కర్‌వాడీ గ్రామం మల్షిరాస్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇటీవి మహా ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి ఉత్తమ్రావ్ జన్ఖడ్ 13,147 ఓట్ల మెజారిటీతో గెలిచారు. నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్) కు చెందిన ఆయన, బిజెపి అభ్యర్థి సిటింగ్ ఎమ్మెల్యే రామ్ సత్పుతే ని ఓడించారు. విజయం దక్కినా సరే ఆయన మర్కర్‌వాడీ గ్రామంలో పోలింగుమీద అనుమానం ఉండిపోయింది. ఆ గ్రామంలో తనకు ప్రజాబలం దండిగా ఉన్నదని, గత ఎన్నికల్లో తనకు ఆ గ్రామంలో చాలా మంచి మెజారిటీ వచ్చిందని ఈ సారి మాత్రం ఓట్లు తగ్గాయని ఆయనకు అనుమానం వచ్చింది. 1900 ఓట్ల ఆ చిన్న గ్రామంలో ఈసారి 1003 ఓట్లు బిజెపికి పడగా, ఎన్సీపీ (ఎస్పీ) జన్ఖడ్ కు కేవలం 843 ఓట్లు దక్కాయి. అందుకే ఆయన అంతా ఆశ్చర్యపోయారు. .గెలిచిన అభ్యర్థి మాత్రమే కాదు.. ఆ గ్రామస్తులకు కూడా అదే ఆశ్చర్యం కలిగింది. జన్ఖడ్ కు ఆ పల్లెలో పాపులారిటీ ఎక్కువనేది అక్కడి వారి మాట. కేవలం పాపులారిటీ మాత్రమే కాదు. ఆయనకు అక్కడ కులబలం కూడా మెండు! ఉత్తమ్రావ్ జన్ఖ్- ధన్‌గఢ్ కులానికి చెందిన వారు. ఆ పల్లెలో అధికసంఖ్యాకులు ఆ కులం వారే. వారందరికీ కూడా అనుమానం వచ్చింది. దాంతో అంతా కలిసి తహసీల్దార్ దగ్గరకు వెళ్లి రీఎలక్షన్ పెట్టాలని డిమాండ్ చేశారు. వారి విజ్ఞప్తిని యన తోసిపుచ్చడంతో.. ఈవీఎంలలో ఏదో మతలబు జరిగిఉండొచ్చునని, అందుకే బిజెపికి ఎక్కువ ఓట్లు పడ్డాయని అనుమానించిన గ్రామస్తులు తామే స్వయంగా బ్యాలెట్ పేపర్ తో మాక పోలింగ్ లాగా మంగళవారం నాడు పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. వారు సన్నాహాలు చేసుకునేలోగా ప్రభుత్వ వర్గాలకు వణుకు పుట్టింది.మోడీ సర్కారు తెచ్చిన కొత్త నేర చట్టాల్లోని భారతీయ నాగరిక్ సురక్ష సంహితలోని 163 సెక్షన్ ప్రకారం ఆ చిన్న గ్రామంలో కర్ఫ్యూ విధించారు. మంగళవారు వాళ్లు పోలింగ్ ప్లాన్ చేసుకోగా గురువారం వరకు కర్ఫ్యూ ఉంటుందని ప్రకటించి.. యాభై మంది సాయుధ పోలీసుల్ని మోహరించారు.మేం వేసిన ఓట్లు ఎలా మళ్లిపోయాయో చెక్ చేసుకోవడానికే ఈ ప్రయత్నం చేస్తున్నామని.. అధికారులు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా సరే.. పోలింగ్ నిర్వహించి తీరుతామని వారు పట్టుదలగా ఉన్నారు.ఆలోచన పుట్టిస్తున్న చైతన్యం..చిన్న పల్లె లోని ప్రజల్లో పుట్టిన చైతన్యం దేశ ప్రజలందరినీ ఇప్పుడు ఆలోచింపజేస్తోంది. వారేీ ప్రభుత్వాన్ని రీపోలింగ్ అడగడం లేదు. మాక పోలిగ్ తరహాలో తమలో తాము నిర్వహించుకోవాలనుకున్నారు. ఈవీఎంలో వచ్చిన ఓట్లకు, తాము బ్యాలెట్ ద్వారా ఓటు చేస్తే రాగల ఓట్లకు తేడాలను గమనించాలనుకున్నారు. ఈవీఎంల సత్యసంధతను పుటం వేయాలనుకున్నారు. అయితే ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం నిరపాయకరమైన వారి ప్రయత్నాన్ని మాత్రం అడ్డుకుంటోంది.ఒకవేళ ఈ ప్రయత్నాన్ని ఆపుచేయించాలని భావించినా సరే.. నలుగురు వ్యక్తులు ఒకచోట గుమికూడరాదు అని చెప్పే 144 సెక్షన్ విధిస్తే సరిపోయేదానికి ఏకంగా మూడురోజుల పాటు కర్ఫ్యూ పెట్టడం అంటే ఆందరికీ ఆశ్చర్యమే. చిన్న పల్లె మర్కర్‌వాడీ యంత్రాంగాన్ని అంతగా వణికిస్తూంటే.. ఈవీఎం ల విషయంలో సమ్ థింగ్ ఈజ్ ఫిషీ అని దేశం అనుకోకుండా ఎలా ఉంటుంది?.. ఎం.రాజేశ్వరి -
ఈవీఎంలు వద్దు.. మాకు బ్యాలెట్ పేపర్లే కావాలి: ఖర్గే కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారత్‌లో ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఈవీఎంలు వద్దు.. బ్యాలెట్ పేపర్లే తాము కోరుకుంటున్నట్లు అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో నిర్వహించిన ‘సంవిధాన్ రక్షక్ అభియాన్’ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బ్యాలెట్ పేపర్‌కు తిరిగి వచ్చేందుకు భారత్ జోడో యాత్ర తరహాలో ప్రచారం చేయాలని ఖర్గే ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఖర్గే మాట్లాడుతూ.. దేశంలో ఐక్యత కావాలంటే విద్వేషాలను విస్తరించడం మానుకోవాలని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కొందరు రాజ్యాంగాన్ని పొగిడి, దానికి నమస్కరించి భక్తిని ప్రదర్శిస్తుంటారని, లోపల మాత్రం రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారన్నారు. ఈ యాత్రలో ఆయనతో పాటు సమాజంలోని అన్నివర్గాల ప్రజలు కదిలివచ్చారని తెలిపారు.VIDEO | "Some people praise the Constitution, but only superficially; inside, they are undermining it. To protect the Constitution, Rahul Gandhi ji launched the Bharat Jodo Yatra, and to save democracy, all minorities came forward, which is why we were able to stop PM Modi.… pic.twitter.com/qrQfMQJKb8— Press Trust of India (@PTI_News) November 26, 2024మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు గాను 230 స్థానాలను కైవసం చేసుకొని అధికారాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల నిర్వహణలో బీజేపీ అవకతవకలకు కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. ఈవీఎంలను హ్యాక్ చేశారని ఆరోపించాయి. -
ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే పోటీ చేయను
ప్రొద్దుటూరు క్రైం : 2029లో బ్యాలెట్ పేపర్‌తో కాకుండా ఈవీఎంల ద్వారా ఎన్నికలను నిర్వహిస్తే పోటీ చేయనని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. పోటీ చేసినా ఫలితం ఉండదని, 2024లో మోసం చేసినట్టుగానే 2029 ఫలితాల్లోనూ మోసం జరుగుతుందని చెప్పారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించినప్పుడే స్వచ్ఛమైన ప్రజా తీర్పు తెలుస్తుందని చెప్పారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.నాలుగు నెలల కిందట జరిగిన ఏపీ ఎన్నికల్లో తీర్పు ఇచ్చింది ప్రజలు కాదని, ఈవీఎం మిషన్లే శాసనం చేశాయని కౌంటింగ్ అయిన అరగంటకే ప్రజలు ముక్తకంఠంతో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ‘మేము ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే ఆ ఓట్లన్నీ ఎక్కడికి పోయాయి’ అంటూ రాష్ట్ర ప్రజలంతా అయోమయంగా ప్రశ్నించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అప్పటికీ వైఎస్సార్సీపీ అధిష్టానంగానీ, అభ్యర్థులుగానీ ఫలితాలపై నోరు మెదపలేదన్నారు.దీనిపై ఎందరు అనుమానం వ్యక్త చేసినా కేంద్ర ఎన్నికల సంఘంలో ఉలుకూ పలుకూ లేదన్నారు. తమ అనుమానాలను నివృత్తి చేయాలని పోటీ చేసిన అభ్యర్థులు కోరినా ఎన్నికల సంఘం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ప్రజల్లో ఈవీఎంలపై ఉన్న అనుమానాలను సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని నివృత్తి చేయాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహిస్తే ప్రజల తీర్పు కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదని, టెక్నాలజీని ఉపయోగించుకుని అప్రజాస్వామిక వి«ధానంలో నాయకులు ఎన్నికవుతుంటారని ఆందోళన వ్యక్తం చేశారు. -
అనుమానం ఉందని ఎన్నికలపై ఆదేశాలివ్వలేం
న్యూఢిల్లీ: ఈవీఎంల పనితీరుపై అనుమానం ఉందనో, వాటిని నియంత్రణలోకి తీసుకుని ఫలితాలను తలకిందులు చేయొచ్చనే ఆరోపణలతోనో ఎన్నికల ప్రక్రియను నియంత్రించలేమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈవీఎంలో ‘మార్పులు’ చేసే ఆస్కారం ఉందని, అందుకే బ్యాలెట్ పేపర్ విధానమే ఉత్తమం అని వాదించే వారి ఆలోచనను మార్చలేమని కోర్టు వ్యాఖ్యానించింది.ఈవీఎంలో నమోదయ్యే ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చాలంటూ దాఖలైన పలు పిటిషన్లను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపంకర్ దత్తాల సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారించింది. పిటిషన్‌దారులు లేవనెత్తిన ప్రశ్నలపై తమ అనుమానాలను నివృత్తిచేసుకునేందుకు జడ్జీలు మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం అధికారి నితేశ్ వ్యాస్‌ను కోర్టుకు రప్పించి ఐదు ప్రశ్నలు సంధించారు. మైక్రోకంట్రోలర్లను ఎక్కడ బిగిస్తారు? వాటి ప్రోగ్రామ్‌ను మళ్లీ మార్చొచ్చా? అంటూ ప్రశ్నలు అడిగారు.బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్, కంట్రోల్ యూనిట్లలో మైక్రోకంట్రోలర్లను బిగిస్తామని, వాటి పోగ్రామ్‌ను సరిచేసేందుకు ఎవరైనా ఓపెన్ చేస్తే పనిచేయకుండాపోతాయని వ్యాస్ వివరణఇచ్చారు. ఈ వివరణతో అసిసోయేషన్ ఫర్ డెమొక్రట్రిక్ రిఫారŠమ్స్ తరఫు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ విభేదించారు. ఎన్నికల గుర్తులను అప్లోడ్ చేసేటపుడు తప్పుడు ప్రోగామ్‌ను అప్లోడ్ చేసే ఆస్కారముందని వాదించారు. దీనిపై జడ్జీ దత్తా కలి్పంచుకుని.. ‘ మీ ఆలోచనలను మేం మార్చలేం. ఈసీ వంటి రాజ్యాంగబద్ధ సంస్థను నియంత్రించలేం’’ అని వ్యాఖ్యానించారు. ఈవీఎంల సోర్స్ కోడ్‌ను బహిర్గతంచేయాలని మరో పిటిషనర్ తరఫు న్యాయవాది సంతోశ్ వాదించగా కుదరదని జడ్జీ తిరస్కరించారు. -
‘400 మందితో నామినేషన్ వేయిస్తా’
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గంలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలను నిర్వహించే మార్గాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ సింగ్ చెప్పారు. రాజ్‌గఢ్‌లోని కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాను ఇక్కడి నుంచి 400 మంది నామినేషన్లు వేసేలా కృషి చేస్తున్నానని, తద్వారా బ్యాలెట్ పేపర్ ద్వారా పోలింగ్ నిర్వహించే అవకాశముందని పేర్కొన్నారు. రాజ్‌గఢ్‌లోని కచ్నారియా గ్రామంలో దిగ్విజయ్ సింగ్ మాట్లాడారు. ‘ఇక్కడ బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని మీరు కోరుకుంటే ఒక మార్గం ఉంది . ఒక స్థానం నుండి 400 మంది అభ్యర్థులు పోటీ చేస్తే, బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తారు . దానికి నేను సిద్ధమవుతున్నాను’ అన్నారు. పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు చెల్లించాల్సిన సెక్యూరిటీ డిపాజిట్ వివరాలను కూడా దిగ్విజయ్ సింగ్ తెలిపారు. "రిజర్వ్డ్ కేటగిరీకి చెందని వారు రూ. 25,000, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు రూ. 12,500 డిపాజిట్ చేయాలి. ఇది దేశంలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరిగే ఒక సీటుకు దారి తీస్తుంది" అని చెప్పారు. ప్రజలు ఈ ప్రభుత్వంతో విసిగిపోయారు కాబట్టి ఈసారి ఎన్నికల్లో విజయం సాధించగలమన్నారు. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించడంపై దిగ్విజయ్ సింగ్ గతంలోనే అనుమానాలు లేవనెత్తారు. ఈవీఎంలపై ప్రజల అనుమానాలపై 2018లోనే ఏఐసీసీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని, వచ్చే సార్వత్రిక ఎన్నికలను బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నట్లు గత ఫిబ్రవరిలో దిగ్విజయ్ సింగ్ ఏఎన్ఐతో అన్నారు. -
ఇదేం బరితెగింపురా నాయనా..!
నాదెండ్ల (చిలకలూరిపేట): గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం కనపర్రులో శుక్రవారం టీడీపీ కార్యకర్త బరితెగించాడు. ఓ అంగన్వాడీ టీచర్ చేతిలో ఉన్న పోస్టల్ బ్యాలెట్ పత్రాన్ని టీడీపీ కార్యకర్త సోమేపల్లి అశోక్ బలవంతంగా లాక్కున్నాడు. ఆమెను బెదిరించి టీడీపీ మద్దతిస్తున్న అభ్యర్థి పేరు దగ్గర టిక్ చేసి తిరిగి ఇచ్చేశాడు. ఘటనపై ఆమె గ్రామ పెద్దలకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారించి కేసు నమోదు చేస్తానని ఎస్ఐ కేవీ నారాయణరెడ్డి చెప్పారు. (చదవండి: నిబంధనలు ఉల్లంఘించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే) బాబుకు జగన్ ఫోబియా -
నేడే తొలి సం'గ్రామం'
సాక్షి, అమరావతి: పార్టీ రహిత పంచాయతీ సమరంలో బ్యాలెట్ పేపర్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయనగరం మినహా మిగిలిన 12 జిల్లాల పరిధిలో జరగనున్న నేపథ్యంలో 2,723 సర్పంచి, 20,157 వార్డు సభ్యుల పదవులకు మంగళవారం ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ ముగిసిన వెంటనే అక్కడే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. తొలిసారిగా పంచాయతీ ఎన్నికలలోనూ ‘నోటా’గుర్తు ప్రవేశపెట్టారు. అయితే ఓట్ల లెక్కింపు సమయంలో నోటా గుర్తుకు వచ్చిన ఓట్లను పరిగణలోకి తీసుకోకుండా పోటీలో ఉన్న అభ్యర్థులలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు గెలుపొందినట్లు ప్రకటిస్తారు. కాగా బ్యాలెట్ పేపరులో అభ్యర్థుల గుర్తులు మారడంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు గ్రామాల్లో చివరి నిమిషంలో వార్డు సభ్యుల ఎన్నికలు మాత్రం ఆగిపోయాయి. ఇక్కడ సర్పంచ్ ఎన్నికలు యథాతథంగా జరగనున్నాయి. 525 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం.. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఏర్పాట్లన్నింటినీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అప్పగించారని, అందుకనుగుణంగా అంతా సిద్ధం చేసినట్లు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తొలివిడతలో 3,249 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్లు జారీ చేయగా 525 చోట్ల సర్పంచి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు చెప్పారు. నెల్లూరు జిల్లా వెలిచెర్ల గ్రామంలో సర్పంచి పదవికి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో మిగిలిన 2,723 చోట్ల సర్పంచి పదవులకు ఎన్నికలు జరుగుతున్నట్లు వివరించారు. ఆయా చోట్ల మొత్తం 7,506 మంది పోటీలో ఉన్నట్లు చెప్పారు. మొత్తం 32,502 వార్డు సభ్యుల పదవులకు ఈ విడతలో ఎన్నికలు జరుగుతుండగా 12,185 స్థానాలు ఏకగ్రీవమయ్యాయని, మరో 160 చోట్ల ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో మిగిలిన 20,157 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ద్వివేదీ తెలిపారు. వార్డు పదవులకు 43,601 మంది పోటీలో ఉన్నట్లు వివరించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నుంచి పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులను తీసుకెళ్తున్న సిబ్బంది అత్యంత సమస్యాత్మక కేంద్రాలు 3,594.. తొలివిడతలో 29,732 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు జరగనుండగా 3,594 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకంగా, మరో 3,458 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ ఎన్నికల కోసం 48,449 బ్యాలెట్ బాక్స్‌లను వినియోగిస్తుండగా 18,608 పెద్దవి , 8,503 మధ్య రకం, 21,338 చిన్న బ్యాలెట్ బాక్స్‌లను ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు తరలించినట్లు వివరించారు. పోలింగ్ విధులకు 83,736 మందిని, జోనల్, రూట్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లుగా 4,681 మందిని ఎన్నికల విధుల్లో వినియోగిస్తున్నట్లు చెప్పారు. కరోనా పాజిటివ్ వ్యక్తులకు చివరి గంట సేపు అవకాశం.. కోవిడ్ నిబంధనల ప్రకారం పోలింగ్ సిబ్బందికి మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లు, గ్లౌజులను కేంద్రాల వారీగా సిద్ధం చేసినట్లు ద్వివేది తెలిపారు. కరోనా పాజిటివ్ వ్యక్తుల కోసం పీపీఈ కిట్లు ఏర్పాటు చేశామని, పోలింగ్ చివరిలో గంట (2.30 నుంచి 3.30 గంటల మధ్య) పాటు వారు ఓటు వేసేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ విధుల్లో పాల్గొనే మహిళా సిబ్బందికి ప్రత్యేకంగా వసతుల కల్పనకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఓట్ల లెక్కింపుపై 52,285 మందికి శిక్షణ.. పోలింగ్ ముగిసిన అనంతరం ఆ కేంద్రాల వద్దే ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు 14,535 మంది సూపర్వైజర్లు, 37,750 ఇతర సిబ్బందికి కౌంటింగ్ అంశాలపై శిక్షణ ఇచ్చినట్లు ద్వివేది తెలిపారు. పోలింగ్ ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించేందుకు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో జిల్లాకొకరు చొప్పున ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. ఓటర్లంతా హక్కు వినియోగించుకోవాలి.. ఎన్నికల సరళిని ప్రత్యక్షంగా ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు కమిషనర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ స్టేషన్ల వద్ద పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోనున్నట్లు చెప్పారు. మొదటి దశ పోలింగ్ జరిగే గ్రామ పంచాయతీల్లో ఓటర్లంతా ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞఫ్తి చేశారు. కరోనా జాగ్రత్తలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో చర్చించిన తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి తెచ్చి చర్యలు చేపట్టినట్లు ద్వివేదీ విలేకరులకు తెలిపారు. రెండు గ్రామాల్లో వార్డు ఎన్నికలు నిలిపివేత: గిరిజా శంకర్ బ్యాలెట్ పేపరులో అభ్యర్థుల గుర్తులు మారడంతో పశ్చిమ గోదావరి జిల్లా బొప్పనపల్లి, వడ్డేగూడెంలో వార్డు సభ్యుల ఎన్నికలు నిలిచిపోయాయని, ఆ గ్రామాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే సమయంలో నిర్వహిస్తామని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. ఎన్నికల సందర్భంగా క్యూలైన్లో ఉండే ఓటర్లను ధర్మల్ స్క్రీనింగ్‌తో పరీక్షించిన అనంతరం పోలింగ్ కేంద్రాలలోకి అనుమతించనున్నట్లు తెలిపారు. టీడీపీ బరితెగింపుపై కమిషన్‌కు ఫిర్యాదు – ఎస్ఈసీ తక్షణమే స్పందించాలి: లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరింపులు, సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ పత్రాల ఉపసంహరణ లాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ తక్షణమే స్పందించి టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలపై సోమవారం ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్యే కుంభా రవి, అంకమరెడ్డి నారాయణమూర్తి, మనోహర్‌రెడ్డి, ఎన్.పద్మజ తదితరులు ఆయన వెంట ఉన్నారు. పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయడంతోపాటు నామినేషన్ల సందర్భంగా పార్టీ జెండాలు, కరపత్రాలు, డబ్బులను గ్రామాల్లో పంచుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్నారని అప్పిరెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల టీడీపీ నేతలు మద్యం, డబ్బులను పంచుతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నా నిమ్మగడ్డ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఉరవకొండ, పొన్నూరు, కుప్పంలో టీడీపీ డబ్బు పంపిణీ అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజవర్గం, గుంటూరు జిల్లా పొన్నూరు, చిత్తూరు జిల్లా కుప్పంలోని గ్రామాలలో టీడీపీ శ్రేణులు డబ్బులు పంచుతూ అక్రమాలకు పాల్పడుతున్నాయని అప్పిరెడ్డి చెప్పారు. ప్రొద్దుటూరులో ప్రత్యర్థి అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి దౌర్జన్యం చేసి గాయపరిచారన్నారు. 45 ఏళ్లుగా వరదరాజులరెడ్డి స్వగ్రామమైన కామనూరులో పంచాయతీ ఎన్నికలలో పోటీ లేకుండా వారి బంధువులు, అనుచరులు బెదిరించి ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వస్తున్నారన్నారు. ప్రస్తుతం కామనూరు పంచాయతీ బీసీలకు రిజర్వ్ కావడంతో వైఎస్సార్సీపీ అభిమాని షేక్ కరీమూన్ నామినేషన్ వేశారన్నారు. నామినేషన్ విత్‌డ్రా చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సోదరులు రాఘవరెడ్డి, భార్గవరెడ్డి, హనుమంతరెడ్డిలు తీవ్రంగా ఒత్తిడి చేశారని తెలిపారు. ఆమెకు మద్దతుగా నిలిచిన వైఎస్సార్సీపీ నేత బాలవరదరాజులరెడ్డి ఇంటికి వెళ్లి దాడికి పాల్పడ్డారని చెప్పారు. తక్షణమే ఎస్ఈసీ జోక్యం చేసుకొని షేక్ కరీమూన్‌కు రక్షణ కల్పించి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. వరదరాజులరెడ్డితో పాటు ఆయన సోదరులను తక్షణమే ఆరెస్ట్ చేయాలన్నారు. కళ్యాణదుర్గంలో అప్రజాస్వామికంగా ఏకగ్రీవం అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం కొండాపూరం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి లక్ష్మీదేవిని టీడీపీ నాయకులు చౌలం మల్లిఖార్జున, డాక్టర్ ఉన్నం మారుతీ చౌదరి, అనిల్ చౌదరి, పవన్ చౌదరి, ముత్యాలరెడ్డిలు బెదిరించి బలవంతంగా నామినేషన్ ఉపసంహరించుకునేలా చేశారని చెప్పారు. దీంతో టీడీపీ బలపరిచిన త్రివేణి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైందన్నారు. ఈ అప్రజాస్వామిక ఎన్నికను రద్దు చేసి లక్ష్మీదేవి అభ్యర్థిత్వాన్ని పునరుద్ధరించి తిరిగి ఎన్నికలు నిర్వహించాలన్నారు. పాడేరు ఏజన్సీలో పోలింగ్ సమయం మార్చాలి.. విశాఖపట్నం జిల్లా పాడేరు డివిజన్లో ఈనెల 17న తేదీన ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరపాలని తొలుత ఎస్ఈసీ నిర్ణయించారని చెప్పారు. కానీ ఇప్పుడు ఉదయం 6.30 నుండి మధ్యాహ్నం 1.30 వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుందని ప్రకటించారని, ఇది పర్వత ప్రాంతం కావడంతో ఓటర్లు కాలి నడకన కి.మీ దూరం ప్రయాణం చేసి పోలింగ్ స్టేషన్‌కి చేరుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. తొలుత ప్రకటించిన ప్రకారం పాత సమయాన్నే కొనసాగించాలని కోరారు. తొలి దశకు పటిష్ట బందోబస్తు తొలి విడతలో భాగంగా మంగళవారం పోలింగ్ జరగనున్న గ్రామాల్లో పోలీస్ విభాగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో రాష్ట్రస్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ప్రత్యేకంగా ఫ్లైయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశారు. సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి బాడీవోర్న్ కెమెరాలు, డ్రోన్లు, కాల్ సెంటర్, డయల్ 100 వంటి వాటిని వినియోగిస్తున్నారు. అలాగే సోమవారం ఏజెన్సీ ప్రాంతాలకు చేరిన పోలీసు బలగాలు గ్రామాల్లో తిరిగి.. ఓటు వేసేందుకు రావాలని ప్రజలకు అవగాహన కల్పించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టింగ్‌లు, తప్పుడు ప్రచారాలు చేసే వారిపైనా ప్రత్యేక నిఘా పెట్టారు. కాగా, 2013లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించినప్పటి నుంచి తొలిదశ పోలింగ్ ముందు రోజు వరకు 87 కేసులు నమోదైతే.. ఈసారి 44 కేసులే నమోదయ్యాయి. ఇక పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే అక్రమ మద్యానికి.. పోలీసులు, ఎస్ఈబీ సిబ్బంది సరిహద్దుల్లో చెక్ పెడుతున్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని డీజీపీ సవాంగ్ విజ్ఞప్తి చేశారు. -
బ్యాలెట్‌కు వెళ్లే ప్రసక్తే లేదు : సీఈసీ
న్యూఢిల్లీ : బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలను నిర్వహించే ప్రసక్తే లేదని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) సునీల్ అరోరా స్పష్టం చేశారు. ఈవీఎంలను ట్యాంపర్ చేయడం సాధ్యం కాదని తెలిపారు. బుధవారం టైమ్స్ నౌ సమిట్‌లో పాల్గొన్న సునీల్ ఆరోరా ఈ విషయాలను వెల్లడించారు. ఈవీఎంల పనితీరుపై ఆరోపణలు చేయడం సరికాదని ఆయన అన్నారు. ఇటువంటి ఆరోపణలను అడ్డుకట్టవేసేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల సంస్కరణలు, మోడల్ కోడ్‌పై చర్చించేందుకు రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీలతో సమావేశం కానున్నట్టు చెప్పారు. కారు, పెన్నులు మెరాయించినట్టు ఈవీఎంలలో కూడా సమస్యలు తలెత్తుత్తాయి.. కానీ వాటిని ట్యాంపరింగ్ చేసే అవకాశం లేదని సునీల్ ఆరోరా తెలిపారు. 20 ఏళ్లుగా ఈవీఎంలు వాడుకలో ఉన్నాయని.. తిరిగి బ్యాలెట్ పేపర్ విధానానికి వెళ్లే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు. సుప్రీం కోర్టుతో సహా వివిధ కోర్టులు ఈవీఎంల వాడాకాన్ని సమర్థించాయని గుర్తుచేశారు. కాగా, ఈవీఎంల పనితీరుపై కొన్ని రాజకీయ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం ఓటింగ్ శాతం వెల్లడించం ఆలస్యం కావడంతో ఈవీఎంల పనితీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఓటింగ్ శాతం వెల్లడి ఆలస్యం కావడంతో ఆప్ నేతలు విమర్శలు గుప్పించారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఎన్నికల సంఘం ఓటింగ్ శాతం ప్రకటించడానికి సిద్ధంగా లేకపోవడం చరిత్రలో ఇదే తొలిసారి అని ఎంపీ సంజయ్ సింగ్ విమర్శించారు. లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు కేవలం గంట వ్యవధిలోనే ఓటింగ్ శాతం వెల్లడించిన ఈసీ.. చిన్న రాష్ట్రమైన ఢిల్లీలో పోలింగ్ వివరాలు తెలిపేందుకు ఎందుకు ఇంత సమయం తీసుకుంటుందని ప్రశ్నించారు. -
మళ్లీ బ్యాలెట్‌కు వెళ్లం!
కోల్‌కతా: ప్రస్తుతం ఈవీఎంలను వినియోగించి జరుపుతున్న ఎన్నికల స్థానంలో బ్యాలెట్ పద్ధతిని ప్రవేశపెట్టే అవకాశం లేదని ఎన్నికల కమిషన్ చీఫ్ సునీల్ అరోరా స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు కూడా గతంలో పలుమార్లు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. తిరిగి బ్యాలెట్ పద్ధతిలోకి వెళ్లే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కశ్మీర్లో ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వగానే ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. వెస్ట్ బెంగాల్ నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ జురిడికల్ సైన్సెస్, ఐఐఎం కలకత్తాలు శుక్ర, శనివారాల్లో నిర్వహించిన కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జాతీయ పౌరుల సభ్యత్య కార్యక్రమం(ఎన్నార్సీ) పశ్చిమ బెంగాల్లో కూడా అమలు చేస్తారా అన్న ప్రశ్నకు, అస్సాంకు చెందిన ఎన్నార్సీనే ఇంకా కోర్టులో ఉందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్సు ఇచ్చే వరకు ఏమీ చెప్పలేమన్నారు. ఈవీఎంలను టాంపర్ చేసే అవకాశం ఉన్నందును బ్యాలెట్ పద్ధతిని తిరిగి ప్రవేశ పెట్టాలంటూ తృణమూల్ కాంగ్రెస్, తెలుగు దేశం, నేషనల్ కాన్ఫరెన్స్, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన వంటి పార్టీల అధ్యక్షులు, నాయకులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
సర్పంచ్ ఎన్నికలు: బ్యాలెట్ పేపర్‌పై మరో గుర్తు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జూలైలో జరగనున్న పంచాయితీ ఎన్నికల్లో దేశంలో తొలిసారిగా నోటా (పై వారెవరూ కాదు) ఆప్షన్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి.నాగిరెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇంతవరకూ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లోనే నోటా ఆప్షన్ ఉందని, తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో తొలిసారిగా ఈ ఆప్షన్‌ను ప్రవేశ పెడుతున్నామన్నారు. బ్యాలెట్ పేపర్ చివరన ‘నోటా’ గుర్తు ఉంటుందని, పైన పేర్కొన్న ఏ అభ్యర్థికీ ఓటు వేయడం ఇష్టం లేని వారు నోటాను ఎంచుకోవచ్చని ఆయన సూచించారు. నోటా వల్ల సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులపై ప్రజల్లో ఏమేరకు అసంతృప్తి ఉందో బయటపడే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 1 నాటికి బీసీ ఓటర్ల గణన పూర్తి ఎన్నికలు జరిగే గ్రామీణ ప్రాంతాల్లో నోటాపై ప్రజలకు అవగాహన కల్పించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. జూలై నెలాఖరు నాటికి ఎన్నికలు పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఇటీవల బెంగాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఘర్షణల కారణంగా 30 మంది చనిపోయారు. మన రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సమర్ధవంతంగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలు సజావుగా జరగడానికి ఇతర రాష్రాల నుంచి కూడా బలగాలను తీసుకురావాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరతామని అన్నారు. ఎన్నికలు ముగిసే వరకూ రాష్ట్రంలో కొత్తగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టొద్దని ప్రభుత్వాన్ని కోరతామన్నారు. రిజర్వేషన్ల ప్రాతిపదికన పంచాయతీ సీట్లను కేటాయించడానికి జూన్ 1నాటికి బీసీ ఓటర్ల గణన పూర్తవుతుందని నాగిరెడ్డి తెలిపారు. -
బుల్లెట్ నుంచి బ్యాలెట్‌కు...మళ్లీ బుల్లెట్ వైపు
న్యూఢిల్లీ: హింసాత్మక సంఘటనల మధ్య 1988 నుంచి రాష్ట్రపతి పాలనలో కొనసాగుతున్న కశ్మీర్లో 1996లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగుతాయని ఎవరూ ఊహించలేదు. ఆ రాష్ట్రంలో అనేక పర్యాయాలు రాష్ట్రపతి పాలనను పొడిగిస్తూ విసిగిపోయిన కేంద్ర ప్రభుత్వం కశ్మీర్లో ఎన్నికలు నిర్వహించేందుకు రిస్క్ తీసుకుంది. ఆనాటి ప్రయోగం విజయవంతం అవడంతో కశ్మీర్‌కు మరింత స్వయం ప్రతిపత్తిని కల్పిస్తామని, కశ్మీర్ స్వేచ్ఛను కోరుకుంటున్న తిరుగుబాటుదారులతో చర్చలు జరిపి కశ్మీర్ సమస్యకు రాజకీయ పరిష్కారం కనుక్కుంటామన్న వరుస హామీలతో వరుసగా ఎన్నికలు నిర్వహిస్తూ వచ్చారు. అప్పట్లో హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థతోని కూడా కేంద్రం చర్చలు జరిపింది. భారీగా పెరిగిన పోలింగ్ ఫలితంగా 2004, 2009, 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కశ్మీర్లో వరుసగా 35శాతం, 39 శాతం, 50 శాతం పోలింగ్ నమోదవుతూ వచ్చింది. రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఓట్ల శాతం మరింత మెరుగ్గా ఉండింది. 1996లో 53 శాతం, 2002లో 43 శాతం, 2008లో 61 శాతం, 2014లో 66 శాతం పోలింగ్ నమోదైంది. బుల్లెట్‌ను ఆశ్రయించిన కశ్మీర్ ప్రజలు క్రమంగా బ్యాలెట్‌వైపు మొగ్గుతున్నారని ఒక్క భారతే కాకుండా యావత్ ప్రపంచం నమ్ముతూ వచ్చింది. 9–11 టెర్రరిస్టుల దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ వైఖరిలో కూడా మార్పు వచ్చింది. ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ లాంటి ఎన్నికైన నాయకులతో చర్చలు జరపాలనుకుంది. వీరిద్దరు కూడా పాకిస్తాన్ వెళ్లి అక్కడి నాయకులతో కశ్మీర్ అంశంపై చర్చలు జరిపి వచ్చారు. 7 శాతానికి పడిపోయిన పోలింగ్ ఇటీవల శ్రీనగర్ పార్లమెంట్ సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో ఏడు శాతం ఓట్లు మాత్రమే నమోదవడం, ఆ తర్వాత 38 కేంద్రాల్లో జరిగిన రీ పోలింగ్‌లో కేవలం రెండు శాతం ఓట్లు మాత్రమే నమోదవడం ఒక్కసారిగా కశ్మీర్ ప్రజల వైఖరిలో వచ్చిన మార్పును తెలియజేస్తోంది. బుల్లెట్ నుంచి బ్యాలెట్ వైపుకు మళ్లిన ప్రజలు తిరిగి బుల్లెట్ వైపు వెళుతుండడమే ఆ మార్పుగా కనిపిస్తోంది. 2014లో జరిగిన పార్లమెంట్, కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గతంకన్నా ఉత్సాహంగా పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 50 శాతం, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 66 శాతం ఓట్లు నమోదవడం వారి ఉత్సాహానికి నిదర్శనం. కోరుకున్న ప్రభుత్వాలు రాలేదు రాష్ట్రానికి మరింత అటానమీ కల్పిస్తానన్న యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో, కశ్మీర్ స్వేచ్ఛకు కషిచేస్తానని చెప్పిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ సంపూర్ణ మెజారిటీతో రాష్ట్రంలో అధికారంలోకి రాకపోవడం కశ్మీర్ ప్రజలను నిరాశపర్చింది. హిందుత్వ బీజేపీ, శాంతియుతంగా కశ్మీర్ స్వేచ్ఛను కోరుకుంటున్న పీడీపీ పార్టీలు కలిస్తే తమ డిమాండ్ల పరిష్కారానికి కషి జరుగకపోతుందా అని కూడా ఆశించారు. కశ్మీర్‌కు మరింత అటానమీని కల్పించాల్సిన అంశాన్ని పక్కన పెట్టి కశ్మీర్‌ను భారత్‌లో పూర్తిగా విలీనం చేయాలని, ప్రత్యేక హక్కులను కల్పిస్తున్న 370 అధికరణను పూర్తిగా రద్దు చేయాలని బీజేపీ నాయకులు బహిరంగంగానే మాట్లాడడం మళ్లీ కశ్మీర్ యువతలో మంటలు రేపింది. ఎవరి మాట విననన్న మోదీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కలసి అప్పటి కశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ కశ్మీర్ అంశానికి సంబంధించి తాను ప్రపంచంలో ఎవరి సలహాలను వినే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు కూడా పరోక్షంగా మిలిటెంట్లకు మద్దతిస్తున్న కశ్మీర్ యువతను ప్రత్యక్ష మద్దతుకు పురిగొల్పాయి. కశ్మీర్ మిలిటెంట్ బుర్హాణి ఎన్కౌంటర్, పాకిస్తాన్ భూభాగంలో సర్జికల్ దాడులు, రాళ్లు రువ్వే యువకులను కూడా మిలిటెంట్లుగానే పరిగణిస్తామని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ హెచ్చరించడం తదితర పరిణామాలు కశ్మీర్ ప్రజలను ఎన్నికలకు దూరం చేశాయి. పర్యవసానంగా కశ్మీర్ సమస్యకు రాజకీయ పరిష్కారం లభించే అవకాశం కనుచూపు మేరలో లేకుండా పోయింది. -
ఫోటోల తారుమారుపై విచారణ
హైదరాబాద్: మహబూబ్‌నగర్– రంగారెడ్డి–హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నిక బ్యాలెట్లో ఫోటోల తారుమారుపై విచారణ ప్రారంభమైంది. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి జనార్ధన్ రెడ్డి మెమోలు జారీ చేశారు. బ్యాలెట్ పేపర్ ముద్రణ బాధ్యతలు నిర్వర్తించిన జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ జీ. రమేష్, ఎస్టేట్ ఆఫీసర్ సూర్యకుమార్, అడిషనల్ ఎస్టేట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి మెమోలు జారీ అయ్యాయి. గురువారం జరిగిన పోలింగ్‌లో ఉపయోగించిన బ్యాలెట్ పేపర్లో ఇద్దరు అభ్యర్థుల ఫొటోలు తారుమారు కావడం వలన పోలింగ్ రద్దయిన విషయం తెలిసిందే. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 19న(ఆదివారం) తిరిగి పోలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ప్రకటించారు. -
టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ రద్దు
-
టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ రద్దు
♦ బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల ఫొటోలు తారుమారు ♦ ఈసీ సూచన మేరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన భన్వర్‌లాల్ సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్– రంగారెడ్డి–హైదరాబాద్ ఉపాధ్యాయ నియో జకవర్గం ఎమ్మెల్సీ ఎన్నిక కోసం నిర్వహించిన పోలింగ్ అనూహ్యంగా రద్దయింది. గురు వారం జరిగిన ఈ పోలింగ్‌లో ఉపయోగించిన బ్యాలెట్ పేపర్లో ఇద్దరు అభ్యర్థుల ఫొటోలు తారుమారు కావడం దీనికి కారణమైంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 19న (ఆదివారం) తిరిగి పోలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ప్రకటించారు. పోలింగ్ మొదలయ్యాక గుర్తింపు.. రాష్ట్రంలోని ఎనిమిది కొత్త జిల్లాల పరిధిలో ఉన్న 126 పోలింగ్ కేంద్రాల్లో గురువారం ఉదయం 8 గంటలకు ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ మొదలైంది. మొత్తం 23,789 మంది ఓటర్లు ఉండగా.. ఓటు వేసేందుకు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో బారులు తీరారు. తీరా పోలింగ్ మొదలయ్యాక బ్యాలెట్ పేపర్లో మూడో నంబర్లో ఉన్న అభ్యర్థి ఆది లక్ష్మయ్య, తొమ్మిదో నంబర్లో ఉన్న పి.మాణిక్‌రెడ్డి ఫొటోలు తారుమారైనట్లు గుర్తించడంతో.. గందరగోళం మొదలైంది. అభ్యర్థులతోపాటు ఎన్నికల ఏజెంట్లు, అధికారులు వెంటనే దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణలో ఈ తప్పు జరిగినట్లు నిర్ధారించిన సీఈవో భన్వర్‌లాల్.. వెంటనే కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల కమిషన్ నుంచి తదుపరి ఆదేశాలు అందేంత వరకు అన్ని కేంద్రాల్లో పోలింగ్‌ను యథాతథంగా నిర్వహించారు. దాంతో ఈ ఎన్నిక రద్దవుతుందా.. లేదా అనే ఉత్కంఠ కొనసాగింది. మధ్యాహ్నం 12 గంటల వరకే ఈ ఉపాధ్యాయ నియోజకవర్గంలో దాదాపు 51 శాతం పోలింగ్ నమోదైంది కూడా. ఈలోగా ఎన్నికను రద్దు చేయవద్దంటూ కొందరు, రద్దు చేయాలని కొందరు అభ్యర్థులు పోటాపోటీగా ఎన్నికల కమిషన్‌కు వినతి పత్రాలు అందించారు. అయితే చివరికి కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి అందిన ఆదేశాల మేరకు ఎన్నికను రద్దు చేస్తున్నట్లు సాయంత్రం ఆరు గంటల సమయంలో భన్వర్‌లాల్ ప్రకటించారు. 19వ తేదీన రీపోలింగ్ నిర్వహిస్తామని.. ఓటర్లు తిరిగి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. విచారణకు ఆదేశించిన ఈసీ బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల ఫొటోలు తారుమారు కావడంపై కేంద్ర ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. ఎక్కడ పొరపాటు జరిగింది, ఎవరు బాధ్యులనే అంశాలతో వెంటనే నివేదిక ఇవ్వాలని సీఈవో భన్వర్‌లాల్‌ను ఆదేశించింది. మహబూబ్ నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో మొత్తం 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తొలిసారిగా బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల పేర్లతో పాటు వారి ఫొటోలను ముద్రించారు. కానీ ఇద్దరు అభ్యర్థుల ఫొటోలు తారుమారయ్యాయి. ఈ చిన్న పొరపాటుతో మళ్లీ ఎన్నికలు నిర్వహిం చాల్సి రావటంతో పాటు పోలింగ్ నిర్వహ ణకు వెచ్చించిన దాదాపు రూ.2 కోట్లు వృథా అయ్యాయి. మళ్లీ అంత ఖర్చు చేసి, ఎన్నిక నిర్వహించాల్సి రానుంది. ముద్రణలోనే తప్పిదం.. ‘‘బ్యాలెట్ పేపర్ ముద్రణ సమయంలోనే తప్పిదం జరిగింది. ముందు మాకు పంపించిన ప్రూఫ్‌లో అక్షరాల తప్పులు తప్ప ఫొటోలన్నీ సరిగ్గానే ఉన్నాయి. అక్షరాల్లో తప్పులు దిద్ది సవరించిన రెండో ప్రూఫ్‌లో ఫొటోలు తారుమారయ్యాయి. అక్షరాల్లో తప్పులు సరిచేశారా.. లేదా.. అని చూసుకున్న అధికారులు ఫోటోలు మారడాన్ని గమనించక పోవడంతో తప్పు దొర్లింది. చివరకు బ్యాలెట్ పేపర్లు సరిగా ఉన్నాయా.. లేదా అని పరిశీలించాల్సిన రిటర్నింగ్ అధికారి సైతం గుర్తించలేదు. చంచల్‌గూడ ప్రింటింగ్ ప్రెస్‌లో బ్యాలెట్ల ముద్రణ జరిగింది. మేం సరిగ్గా పంపిన ఫొటోలు ఎందుకు మారాయి, అక్కడి సిబ్బంది ప్రమేయమేమైనా ఉందా, దీనికి బాధ్యులెవరనే దానిపై విచారణ జరిపి.. ఈసీకి నివేదిస్తాం. ఈసీ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం..’’ – రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ -
శోభానాగిరెడ్డి పేరును తొలగించండి: టీడీపీ
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి శోభానాగిరెడ్డి పేరును బ్యాలెట్ పేపర్ నుంచి తొలగించాలని టీడీపీ ఎంపీ రమేశ్‌రాథోడ్ కోరారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి గురువారం ఓ వినతిపత్రం అందజేశారు. నిబంధనల ప్రకారం చనిపోయిన వ్యక్తిపేరు బ్యాలెట్ పేపర్లలో ఉండరాదని పేర్కొన్నారు. అదేవిధంగా చంద్రబాబు ఓటు చెల్లదంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ ప్రకటించడం బాధ్యతా రాహిత్యంగా ఉందని వ్యాఖ్యానించారు. -
ఈవీఎం..అదో అద్భుతం
సాక్షి, ముంబై: ఒకప్పుడు ఓటు వేయడమంటే పోలింగ్ బూత్‌లోకి వెళ్లడం, అక్కడ ఎన్నికల సిబ్బంది ఇచ్చిన పొడుగాటి బ్యాలెట్ పేపరుపై ఉన్న వివిధ గుర్తుల్లో తమకు నచ్చిన ఒక అభ్యర్థి గుర్తుపై ముద్ర వేయడం, ఆ తరువాత దాన్ని మడతపెట్టి అక్కడే ఉంచిన బ్యాలెట్ బాక్స్‌లో వేయడమనే తంతు ఉండేది. ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడికి కనీసం ఒకటి లేదా రెండు రోజుల సమయం పట్టేంది. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. బ్యాలెట్ పత్రాల ముద్రణ గత చరిత్ర. దాని స్థానంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం) లు అందుబాటులోకొచ్చాయి. ఎన్నికల ప్రక్రియతోపాటు లెక్కింపు, ఫలితాల వెల్లడి కొద్దిసేపట్లోనే ముగుస్తుంది. ఇందుకు ప్రధాన కారణం ఈవీఎంలే. దేశంలో 1982లో వీటిని కేరళలోని పరూర్ నియోజకవర్గం ఉప ఎన్నికకు తొలిసారిగా వినియోగించారు. ఎలా పనిచేస్తాయంటే.. ఈవీఎంలో అనేక కీలమైన విభాగాలుంటాయి. దీనిని వినియోగించడంద్వారా మనం ఎవరికి ఓటు వేశామనే విషయం సిబ్బందికి కూడా తెలియదు. మీట నొక్కగానే బీప్ శబ్దం వస్తుంది. దీంతో ఓటింగ్ ప్రక్రియ పూర్తయి లాక్ అవుతుంది. ఒకవేళ ఓటరు రెండోసారి నొక్కడానికి ప్రయత్నించినా అది సాధ్యం కాదు. రెండు మీటలు ఒకేసారి నొక్కితే దేనికీ ఓటు పడదు. ఆ తర్వాత సిబ్బంది తమవద్ద ఉన్న యంత్రం మీట నొక్కడంతో మరో వ్యక్తికి ఓటు వేసేందుకు మార్గం సుగమమవుతుంది. ఈవీఎంలు ఆరు వోల్టుల బ్యాటరీతో పనిచేస్తాయి. ఒకవేళ పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినా ఈ యంత్రాలకు అంతరాయం కలగదు. బ్యాటరీతో పనిచేయడంవల్ల మీటా నొక్కగానే ఈవీఎంకు అనుసంధానించిన కంప్యూటర్లో ఓటు నమోదవుతుంది. ఏ అభ్యర్థికి ఓటు వేశామో అందులో నమోదవుతుంది. ఇక ఒక్కో ఈవీఎంకు 3,840 ఓట్లను నమోదు చేసుకునే సామర్థ్యముంది. ఇలాంటి యంత్రాలు ఒక్కో పోలింగ్ కేంద్రంలో కనీసం ఒకటి లేదా రెండింటిని అందుబాటులో ఉంచుతారు. అదేవిధంగా ఒక్కో ఈవీఎంలో 16 గుర్తులు మాత్రమే ఉంటాయి. అంతకంటే ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు బరిలో దిగితే రెండు ఈవీఎంలు ఉంచుతారు. దీన్ని మొదటి ఈవీఎంతో అనుసంధానిస్తారు. ఇలా నాలుగు యంత్రాలను ఒకదానితో మరొకటి అనుసంధానించేందుకు వీలుంది. అంటే ఒకే నియోజక వర్గంలో 64 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ఇబ్బందేమీ ఉండదు. ప్రక్రియ ఎప్పటిలాగే కొనసాగుతుంది. -
నేడే తొలి పోరు
నల్లగొండ, న్యూస్‌లైన్, ప్రాదేశిక ఎన్నికల్లో తొలివిడత పోలింగ్ ఆదివారం జరగనుంది. సూర్యాపేట, మిర్యాలగూడ, దేవరకొండ డివిజన్ల పరిధిలోని 33 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ డివిజన్ల పరిధిలో ఎంపీటీసీ 473, జెడ్పీటీసీ 33 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఎంపీటీసీ 14 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 459 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి విడత పోరులో మొత్తం 11,94,433 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 5,96,704, మహిళలు 5,97,729 మంది ఉన్నారు. ఎంపీటీసీ స్థానాలకు 1,699 మంది అభ్యర్థులు, జెడ్పీటీసీ స్థానాలకు 213 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికలకు 3,292 బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు. 908 ప్రాంతాల్లో 1554 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. పోలింగ్ పూర్త్తయిన తర్వాత బ్యాలెట్ బాక్సులను నియోజకవర్గ కేంద్రాల్లోని స్ట్రాంగ్‌రూముల్లో భద్రపరుస్తారు. ఎన్నికలకు భారీ బందోబస్తు.. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. తొలి విడత ఎన్నికలకు పోలీస్ శాఖ నుంచి 4 వేల మంది సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. నియోజకవర్గానికి ఒక డీఎస్పీ, మండలానికి ఒక ఇన్స్పెక్టర్, మిగతా ఎస్ఐలు, ఇతర సిబ్బంది పాల్గొంటారు. జిల్లాస్థాయిలో ఎస్పీ, అదనపు ఎస్పీలు పనిచేస్తారు. సమస్యాత్మకంగా గుర్తించిన 825 గ్రామాల్లో ప్రత్యేకంగా స్ట్రైకింగ్ ఫోర్సు, మొబైల్ బృందాలను ఏర్పాటు చేశారు. వీరితో పాటు ఈ ప్రాంతాల్లో పోలింగ్ సరళిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా 247 మంది మైక్రో అబ్జర్వర్స్ను నియమించారు. వీరంతా కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన వారు. ఈ గ్రామాల్లో వెబ్ కాస్టింగ్, వీడియో చిత్రీకరణ ద్వారా పోలింగ్ సరళిని రికార్డు చేస్తారు. బ్యాలెట్ పత్రం తెలుపు - గులాబీ పార్టీల సింబల్‌తో జరుగుతున్న ఈ ఎన్నికల్లో జెడ్పీటీసీ అభ్యర్థులకు తెలుపు, ఎంపీటీసీ అభ్యర్థులకు గులాబీ రంగు ఉన్న బ్యాలెట్ పత్రాలను వినియోగిస్తారు. రెండింటిని కూడా ఒకే బ్యాలెట్ బాక్సులో వేయాలి. పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా ఓటర్లు ఆయా కేంద్రాల్లో క్యూలో ఉన్నట్లయితే వారికి ఓటు వేసేందుకు వీలుంటుంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయాన్ని మాత్రమే 6 గంటలకు పొడిగించారు.