ఫోటోల తారుమారుపై విచారణ
హైదరాబాద్: మహబూబ్‌నగర్– రంగారెడ్డి–హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నిక బ్యాలెట్‌లో ఫోటోల తారుమారుపై విచారణ ప్రారంభమైంది. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి జనార్ధన్ రెడ్డి మెమోలు జారీ చేశారు. బ్యాలెట్ పేపర్ ముద్రణ బాధ్యతలు నిర్వర్తించిన జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ జీ. రమేష్, ఎస్టేట్ ఆఫీసర్ సూర్యకుమార్, అడిషనల్ ఎస్టేట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి మెమోలు జారీ అయ్యాయి.
గురువారం జరిగిన పోలింగ్‌లో ఉపయోగించిన బ్యాలెట్ పేపర్‌లో ఇద్దరు అభ్యర్థుల ఫొటోలు తారుమారు కావడం వలన పోలింగ్ రద్దయిన విషయం తెలిసిందే. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 19న(ఆదివారం) తిరిగి పోలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ప్రకటించారు.