
నాదెండ్ల (చిలకలూరిపేట): గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం కనపర్రులో శుక్రవారం టీడీపీ కార్యకర్త బరితెగించాడు. ఓ అంగన్‌వాడీ టీచర్ చేతిలో ఉన్న పోస్టల్ బ్యాలెట్ పత్రాన్ని టీడీపీ కార్యకర్త సోమేపల్లి అశోక్ బలవంతంగా లాక్కున్నాడు. ఆమెను బెదిరించి టీడీపీ మద్దతిస్తున్న అభ్యర్థి పేరు దగ్గర టిక్ చేసి తిరిగి ఇచ్చేశాడు. ఘటనపై ఆమె గ్రామ పెద్దలకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారించి కేసు నమోదు చేస్తానని ఎస్‌ఐ కేవీ నారాయణరెడ్డి చెప్పారు.
(చదవండి: నిబంధనలు ఉల్లంఘించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే)
బాబుకు జగన్ ఫోబియా