Nadendla
-
ఇదేం బరితెగింపురా నాయనా..!
నాదెండ్ల (చిలకలూరిపేట): గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం కనపర్రులో శుక్రవారం టీడీపీ కార్యకర్త బరితెగించాడు. ఓ అంగన్వాడీ టీచర్ చేతిలో ఉన్న పోస్టల్ బ్యాలెట్ పత్రాన్ని టీడీపీ కార్యకర్త సోమేపల్లి అశోక్ బలవంతంగా లాక్కున్నాడు. ఆమెను బెదిరించి టీడీపీ మద్దతిస్తున్న అభ్యర్థి పేరు దగ్గర టిక్ చేసి తిరిగి ఇచ్చేశాడు. ఘటనపై ఆమె గ్రామ పెద్దలకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారించి కేసు నమోదు చేస్తానని ఎస్ఐ కేవీ నారాయణరెడ్డి చెప్పారు. (చదవండి: నిబంధనలు ఉల్లంఘించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే) బాబుకు జగన్ ఫోబియా -
వాగు మింగేసింది
సాక్షి, నాదెండ్ల(గుంటూరు) : మండలంలోని సంక్రాంతిపాడు వద్ద నక్కవాగులో గల్లంతైన యువ రైతు మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. సంక్రాంతిపాడు గ్రామానికి చెందిన ప్రత్తి సాంబశివరావు కుమారుడు శ్రీకాంత్ (29) రెండేళ్ల క్రితం గుంటూరు సమీపంలోని బుడంపాడు గ్రామానికి చెందిన స్వప్నతో వివాహమైంది. అరెకరం సొంత భూమికి తోడు మరి కొంత కౌలుకు తీసుకుని తండ్రితో కలిసి పంటలు సాగు చేస్తున్నాడు. గురువారం ఉదయం తండ్రితో కలిసి బ్రిడ్జి మీదుగా పొలానికి వెళ్లి తిరిగి వస్తూ వాగు దాటేందుకు ప్రయత్నించాడు. వాగు ఉధృతికి అదుపుతప్పి పడిపోయాడు. అదే సమయంలో ద్విచక్రవాహనాలపై వెళ్తున్న రైతులు చూసి రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. నాదెండ్ల ఇన్చార్జి తహసీల్దార్ నాంచారయ్య, డిప్యూటీ తహసీల్దార్ సురేష్, ఎస్ఐ చెన్నకేశవులు, అగ్నిమాపక దళ అధికారి చంద్రమౌళి సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లను తెప్పించారు. ఈలోగా రైతులే శ్రీకాంత్ మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అక్రమ ఇసుక, మట్టి తవ్వకాలతోనే ప్రమాదాలు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నాయకులు అడ్డగోలుగా ఇసుక, మట్టి తవ్వకాలు జరిపారు. నక్కవాగులో పెద్ద ఎత్తున ఇసుక తవ్వటంతో గుంతలు ఏర్పడ్డాయి. వాగు ఉధృతి కారణంగా శ్రీకాంత్ ఈ గుంతల్లో పడి మృతి చెందాడు. గల్లంతైన బాలిక మృత్యుఒడికి.. సత్తెనపల్లి: మండలంలోని పాకాలపాడు వాగులో గల్లంతైన విద్యార్థిని పెరవల్లి భువనేశ్వరి (11) మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని గురువారం రెంటపాళ్ళ వద్ద వాగులో పోలీసులు, అగ్నిమాపక, రెవెన్యూ అధికారులు గుర్తించారు. చందవరం గ్రామానికి చెందిన బాలిక ఐదో తరగతి చదువుతోంది. అమ్మమ్మ పార్వతితోపాటు దుస్తులు శుభ్రం చేసేందుకు పాకాలపాడులోని శివాలయం వెనుక ఉన్న వాగుకు బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో వెళ్లింది. కాలు జారి వాగులో పడి కొట్టుకుపోయింది. బాలిక మృతితో అమ్మమ్మ, తాతయ్య, తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఘటన పలువురిని కలిచివేసింది. మృతదేహాన్ని అధికారులు పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. -
వైఎస్సార్సీపీ నేతపై హత్యాయత్నం
నాదెండ్ల : గుంటూరు జిల్లా నాదెండ్లకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నల్లమోతు అమరేశ్వరరావుపై హత్యాయత్నం జరిగింది. బాధితుడు అమరేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు బుధవారం రాత్రి సుమారు 10 గంటలప్పుడు చిలకలూరిపేట నుంచి గణపవరం మీదుగా స్వగ్రామమైన నాదెండ్లకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గణపవరం సమీపంలో కుప్పగంజివాగు మలుపు వద్ద వెనుక నుంచి రెండు ద్విచక్ర వాహనాలపై వెంబడించిన నలుగురు వ్యక్తులు అమరేశ్వరరావును ఆపి ‘ఏరా.. మా ఊళ్లో మా వాళ్లకే ఎదురొస్తున్నావంట.. నీ అంతు చూస్తాం’ అంటూ కత్తితో దాడి చేశారు. అమరేశ్వరరావు కుడి చేతికి గాయమైంది. బాధితుడు వారి నుంచి తప్పించుకుని స్థానికుల సహాయంతో చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రిలో చేరి, చికిత్స చేయించుకున్న అనంతరం నాదెండ్లకు తిరిగి వెళ్లాడు. చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బారావు, ఎస్ఐ చెన్నకేశవులు అమరేశ్వరరావు ఇంటికి వెళ్లి వివరాలు నమోదు చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడికి పాల్పడ్డారని బాధితుడు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని గురువారం అమరేశ్వరరావును పరామర్శించారు. ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
ఎంత పెద్ద కొండచిలువో..!
నాదెండ్ల: మండల కేంద్రమైన నాదెండ్ల గ్రామంలో శనివారం భారీ కొండచిలువను హతమార్చారు. గ్రామంలో నాలుగు వైపులా కొండలు, గుట్టలు ఉండటంతో జెండా చెట్టు సమీపంలోని నాగూర్వలి అనే వ్యక్తి పుల్లలవామి నుంచి 4 అడుగుల కొండచిలువ బయటకొచ్చింది. దీన్ని చూసిన స్థానికులు చంపేందుకు ప్రయత్నించగా, కొద్దినిమిషాలకే 12 అడుగుల పొడవు గల తల్లి కొండచిలువ బయటకొచ్చింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. కొద్దిసేపటికి రెండు కొండ చిలువలను హతమార్చారు. -
ఐదుగురిపై కత్తితో దాడి
పాతకక్షలే కారణం నలుగురు మహిళలు, బాలుడికి గాయాలు ఇద్దరి పరిస్థితి విషమం నాదెండ్ల బీసీ కాలనీలో ఘటన నాదెండ్ల: పాతకక్షల నేపథ్యంలో ఉన్మాదిగా మారిన యువకుడు నలుగురు మహిళలను, ఒక బాలుడిని కత్తితో విచక్షణా రహితంగా దాడిచేసి గాయపరిచిన సంఘటన మండల కేంద్రమైన నాదెండ్లలో శుక్రవారం సంచలనం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామంలోని బీసీకాలనీ ఉరవకట్ట సెంటర్లో నివాసం ఉండే అలుగునీడి వినోద్ కుమార్ ఇంటిఎదురుగా నివాసం ఉంటున్న నలుగురు మహిళలను, ఒక బాలుడిని కత్తితో దాడిచేసి గాయపరిచాడు. పాతకక్షలే కారణం.. బీసీ కాలనీలో నివాసం ఉండే అలుగునీడి శివయ్య కుమారుడు వినోద్‌కుమార్ తిమ్మాపురంలోని ఓ స్పిన్నింగ్‌మిల్లులో ఎలక్ట్రికల్ పనులు చేస్తున్నాడు. ఎదురింట్లో ఉన్న షేక్ నాగార్జున కుటుంబంతో వీరికి పాత కక్షలు ఉన్నాయి. గత ఏడాది వినోద్ కుమార్ తల్లి పూర్ణమ అనారోగ్యంతో మతి చెందారు. గురువారం ఆమె మొదటి వర్ధంతి జరుపుకున్నారు. తన తల్లి మరణానికి ఎదురింటివారి వేధింపులే కారణమని భావించిన వినోద్ కుమార్ వారిపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య గురువారం రాత్రి వివాదం కొనసాగింది. శుక్రవారం ఉదయం కూడా ఇరుకుటుంబాల మధ్య కలహాలు జరిగాయి. దీంతో వినోద్‌కుమార్ చిలకలూరిపేటకు వచ్చి కొబ్బరిబోండాలు నరికే కత్తి కొలుగోలు చేసి ఇంటికి చేరుకున్నాడు. ఉదయం 10గంటల సమయంలో ఎదురింట్లో పురుషులు ఎవరూ లేని సమయం చూసి వారి ఇంట్లోకి చొరబడ్డాడు. నాగార్జున తల్లి షేక్‌నాగూర్‌బీ, భార్య షేక్ బాజీ, ఆరేళ్ల కుమారుడు షేక్ సాయిపై కత్తితో వినోద్‌కుమార్ దాడి చేశాడు. పెద్దగా కేకలు వినబడటంతో పక్కనే నివాసం ఉంటున్న బాజీ తల్లి మస్తాన్‌బీ, మరో మహిళ షేక్ బీబీజాన్ అడ్డుకోవటానికి ప్రయత్నించగా వారిపై కూడా దాడికి పాల్పడ్డాడు. ఇరుగుపొరుగువారు గుమిగూడి వినోద్ చేతిలోని కత్తిని లాక్కోవడంతో జేబులో దాచుకున్న మరో చిన్న కత్తిని బయటికి తీశాడు. ఆ కత్తిని కూడా స్థానికులు లాక్కొని నిందితుడిని పోలీసులకు అప్పగించారు. గాయపడిన షేక్ నాగుర్‌బీ, మస్తాన్‌బీలను చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. షేక్ బాజీ, షేక్ సాయి, షేక్ బీబీజాన్‌లను 108 వాహనంలో కోండ్రుపాడులోని కేఎంసీ ఆస్పత్రికి తరలించారు.వీరిలో షేక్ బాజీ, షేక్ మస్తాన్‌బీల పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. తన తల్లి మనస్థాపానికి గురై మరణించిందని, అందుకే వారిపై కక్ష తీర్చుకోవటానికిదాడిచేసినట్టు పోలీసుల అదుపులో ఉన్న వినోద్‌కుమార్ చెప్పాడు. -
నాదెండ్లలో ఉన్మాది వీరంగం
గుంటూరు : గుంటూరు జిల్లా నాదెండ్లలో శుక్రవారం ఉన్మాది వీరంగం సృష్టించాడు. స్థానికంగా నివసిస్తున్న ఇద్దరు మహిళలపై కత్తితో దాడి చేశాడు. దీంతో మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... ఉన్మాదిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... ఉన్మాదిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి తమదైన శైలిలో పోలీసులు విచారిస్తున్నారు. -
పేకాట శిబిరంపై దాడి..ఐదు మంది అరెస్ట్
నాదెండ్ల: పేకాట శిబిరంపై దాడిచేసి ఐదు మంది పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన బుధవారం గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం సందవరంలో జరిగింది. వారిని అరెస్ట్ చేయడంతో పాటు రూ.72 వేలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
ద్విచక్రవాహనాల ఢీ : ఇద్దరి మృతి
సాతులూరు (నాదెండ్ల), న్యూస్‌లైన్:వేగంగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొని.. ఇద్దరు మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం నాదెండ్ల మండలం సాతులూరు శివారు హోసన్న ప్రార్థనామందిరం సమీపంలో కర్నూలు-గుంటూరు రాష్ట్రరహదారిపై గురువారం రాత్రి జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. నాదెండ్ల మండలం చందవరం గ్రామానికి చెందిన భువనగిరి చినబ్రహ్మ య్య, కొలిపాక దుర్గ, గుమ్మడి అంకమ్మరావులు టైలరింగ్ పని చేస్తుంటారు. నరసరావుపేటలో చినబ్రహ్మయ్య సోదరుడు పెదబ్రహ్మయ్యకు టైలరింగ్ షాపు ఉంది. ఈ షాపులో ముగ్గురూ టైలరింగ్ పని ముగించుకుని ద్విచక్రవాహనంపై స్వగ్రా మం బయలుదేరారు.సాతులూరు నుంచి అదే గ్రామానికి చెందిన బత్తుల వాసు, అతని స్నేహితుడు పెదకాకానికి చెందిన షేక్ సుభానిలు పల్సర్‌పై నరసరావుపేట వెళుతున్నారు. మార్గమధ్యంలోని సాతులూరు సమీపంలోని హోసన్న ప్రార్థనామందిరం వద్ద ఎదురెదురుగా వచ్చిన ఈ రెండువాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదం లో ద్వి చక్రవాహనాలు నడుపుతున్న భువనగిరి చిన్నబ్రహ్మయ్య (25), బత్తుల వాసు(35)లు అక్కడికక్కడే మృతిచెందా రు. మృతుడు వాసు మాచర్లలో ఇరిగేషన్ డిపార్టుమెంటులో పనిచేస్తున్నాడని తెలి సింది. పల్సర్‌పై ఉన్న షేక్ సుభాని, మరో ద్వి చక్రవాహనంపై ఉన్న అంకమ్మరావు, దుర్గారావులకు తీవ్రగాయాలయ్యా యి. అంకమ్మరావు పరిస్థితి విషమించడంతో గుంటూరు తరలించారు. గాయపడిన దుర్గారావు నరసరావుపేటలోని ప్రైవేటు వైద్యశాలలో, సుభాని ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. నాదెండ్ల ఎస్ఐ ఎస్.సాంబశివరావు ఘటనాస్థలాన్ని సందర్శించి, మృతదేహాలను నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు.