ద్విచక్రవాహనాల ఢీ : ఇద్దరి మృతి
Published Thu, Sep 26 2013 11:40 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
సాతులూరు (నాదెండ్ల), న్యూస్‌లైన్:వేగంగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొని.. ఇద్దరు మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం నాదెండ్ల మండలం సాతులూరు శివారు హోసన్న ప్రార్థనామందిరం సమీపంలో కర్నూలు-గుంటూరు రాష్ట్రరహదారిపై గురువారం రాత్రి జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. నాదెండ్ల మండలం చందవరం గ్రామానికి చెందిన భువనగిరి చినబ్రహ్మ య్య, కొలిపాక దుర్గ, గుమ్మడి అంకమ్మరావులు టైలరింగ్ పని చేస్తుంటారు. నరసరావుపేటలో చినబ్రహ్మయ్య సోదరుడు పెదబ్రహ్మయ్యకు టైలరింగ్ షాపు ఉంది. ఈ షాపులో ముగ్గురూ టైలరింగ్ పని ముగించుకుని ద్విచక్రవాహనంపై స్వగ్రా మం బయలుదేరారు.సాతులూరు నుంచి అదే గ్రామానికి చెందిన బత్తుల వాసు, అతని స్నేహితుడు పెదకాకానికి చెందిన షేక్ సుభానిలు పల్సర్‌పై నరసరావుపేట వెళుతున్నారు.
మార్గమధ్యంలోని సాతులూరు సమీపంలోని హోసన్న ప్రార్థనామందిరం వద్ద ఎదురెదురుగా వచ్చిన ఈ రెండువాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదం లో ద్వి చక్రవాహనాలు నడుపుతున్న భువనగిరి చిన్నబ్రహ్మయ్య (25), బత్తుల వాసు(35)లు అక్కడికక్కడే మృతిచెందా రు. మృతుడు వాసు మాచర్లలో ఇరిగేషన్ డిపార్టుమెంటులో పనిచేస్తున్నాడని తెలి సింది. పల్సర్‌పై ఉన్న షేక్ సుభాని, మరో ద్వి చక్రవాహనంపై ఉన్న అంకమ్మరావు, దుర్గారావులకు తీవ్రగాయాలయ్యా యి. అంకమ్మరావు పరిస్థితి విషమించడంతో గుంటూరు తరలించారు. గాయపడిన దుర్గారావు నరసరావుపేటలోని ప్రైవేటు వైద్యశాలలో, సుభాని ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. నాదెండ్ల ఎస్‌ఐ ఎస్.సాంబశివరావు ఘటనాస్థలాన్ని సందర్శించి, మృతదేహాలను నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు.
Advertisement