threats politics
-
ఇంత అరాచకమా?.. ‘కూటమి’ మితిమీరిపోతుంది: భూమన
సాక్షి, తిరుపతి: చంద్రబాబు సర్కార్ అరాచకాలు పెరిగిపోతున్నాయని టీటీడీ మాజీ ఛైర్మన్, వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. శేఖర్‌రెడ్డి భవనం కూల్చి లోబరుచుకున్నారు. కార్పొరేటర్ డాక్టర్ అనీష్ రాయల్‌ను కూటమి నేతలు బెదిరిస్తున్నారు. 8వ డివిజన్ కార్పొరేటర్ మునిరామిరెడ్డిని బిల్డింగ్ కూల్చి వేస్తామని కూటమి నేతలు బెదిరిస్తున్నారు.‘‘మంత్రి అనగాని సత్య ప్రసాద్ నీచ రాజకీయాలు చేస్తున్నారు. లోకేష్ రాజ్యాంగం రాష్ట్రంలో నడుస్తోందంటూ మంత్రి అనగాని కార్పొరేటర్లను బెదిరిస్తున్నారు. సనాతన ధర్మం కాపాడతానని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ ఎక్కడ ఉన్నారు?. తిరుపతి రాజకీయాలు పవిత్రంగా ఉండటం మీకు ఇష్టం లేదా?. మీ కూటమి నాయకులే మిమ్మల్ని అసహ్యించుకుంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు పాలన ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు...చంపడం ఒక్కటే మిగిలింది.. కార్పొరేటర్లు బెదిరింపులకు పాల్పడుతున్నారు. పోలీసులను కూడా బెదిరిస్తున్నారు. విప్ జారీ చేశాం. విప్ ధిక్కరిస్తే పదవులు కూడా కోల్పోతారు. ఆర్థికపరంగా దెబ్బతీస్తూ.. కార్పొరేటర్లను బెదిరిస్తున్నారు. విప్‌ను ధిక్కరిస్తే కచ్చితంగా కార్పొరేటర్లు పదవులు కోల్పోతారు. ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకు వెళ్తాం. హౌస్ మోషన్ పిటిషన్ కూడా హైకోర్టులో దాఖలు చేశాం. డిప్యూటీ మేయర్ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేలా..వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు పోలీసు భద్రత కల్పించాలని కోరాం’’ అని భూమన తెలిపారు. -
మనకడ్డేంటి.. ఆక్రమించండి..
కామవరపుకోట: కూటమి ప్రభుత్వం రాగానే ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో మొదలైన టీడీపీ నేతల అరాచకాలు, భూ కబ్జాలకు అడ్డూఅదుపు కనిపించడంలేదు. అధికారులను కూడా బెదిరిస్తూ యథేచ్ఛగా అక్రమాలు కొనసాగిస్తున్నారు. దేవుడి భూములను సైతం చెరబడుతున్నారు. గతంలో ఎవరూ ఇంతగా బరితెగించేవారు కాదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇలాంటి కబ్జాలను అరికట్టడానికే వైఎస్ జగన్మోహన్రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారని, కానీ టీడీపీ నాయకులు దానిపై తప్పుడు ప్రచారం చేసి ఇప్పుడిలా అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొంటున్నారు. ఇటీవల తెలుగుదేశం నేతలు పాల్పడిన భూ అక్రమాల్లో కొన్ని.. » జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు వెళ్లే ప్రధాన రహదారి వెంబడి కొత్తూరు చెక్‌పోస్ట్ సెంటర్లో శ్రీవీరభద్రస్వామి ఆలయానికి సంబంధించి సర్వే నంబర్ 702/4లో 97 సెంట్ల భూమి ఉంది. దానివిలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.10 కోట్లకుపైనే. ఆ స్థలంలో 1,950 గజాలను 2021లో స్థానికుడైన వందనపు లక్ష్మణరావుకు.. ఏడాదికి రూ.11.40 లక్షలు చెల్లించే విధంగా 11 సంవత్సరాలకు దేవదాయశాఖ లీజుకు ఇచ్చింది. ఆ స్థలంలో షాపులు నిర్మించి అద్దెకిస్తున్న ఆయన కూటమి ప్రభుత్వం రాగానే మిగిలిన భూమిని కూడా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అంతకుముందు లీజును కూడా అధికారులు నామమాత్రపు ధరకు తగ్గించినట్లు తెలిసింది. » ఈ ఆలయ భూమిలోనే కామవరపుకోట మండలం వెంకటాపురానికి చెందిన శ్రీనివాసరావు తెలుగుదేశం అండదండలతో కారు సర్వీసింగ్ సెంటర్ కోసం భారీ షెడ్డు నిర్మించాడు. భూమి కబ్జాచేసి షెడ్డు వేసినా దేవదాయశాఖ అధికారులు స్పందించలేదు. » కామవరపుకోట మండలం కొత్తూరు సమీపంలోగల రాఫిన్ రియల్ ఎస్టేట్ ఎదురుగా జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు ప్రధాన రహదారిని అనుకుని సర్వే నంబరు 390/1లో 5.70 ఎకరాల భూమి ఉంది. ఇది గతంలో భూదాన కార్యక్రమంలో భాగంగా కొత్తూరు గ్రామానికి చెందిన మేడంకి అర్జయ్యకు ప్రభుత్వం ఇచ్చింది. అతడికి భార్య సుశీల, కుమారుడు రవీంద్ర, కుమార్తె ఉన్నారు. అర్జయ్య మృతిచెందడంతో ఆ భూమిని తన పేరిట మార్చుకున్న సుశీల.. 2019లో కుమారుడు రవీంద్ర పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించింది. 2020లో రవీంద్ర అనారోగ్యంతో మృతిచెందాడు. కూటమి అధికారంలోకి రాగానే.. రూ.10 కోట్ల విలువైన ఆ భూమిని కబ్జా చేయాలని కామవరపుకోటకు చెందిన ఓ డాక్యుమెంట్ రైటర్ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఒక మహిళను అడ్డుపెట్టుకుని ఆ భూమిని బొర్రంపాలెం గ్రామానికి చెందిన ఒక భూస్వామికి అమ్మడానికి ప్రయత్నిస్తున్నాడని సుశీల ఆరోపిస్తోంది. » టీడీపీ నాయకుడు, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, ఆయన సోదరుడు, అనుచరులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఏలూరుకు చెందిన ఈడుపుగంటి హరిభగవాన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆవేదన వ్యక్తం చేశారు. టి.నరసాపురం మండలం బొర్రంపాలెం నుంచి కామవరపుకోట వెళ్లే రోడ్డు వెంబడి 15 ఎకరాల పామాయిల్ తోటను హరిభగవాన్ బ్యాంకు ఆన్లైన్ వేలంలో రూ.3.70 కోట్లకు పాడుకున్నారు. తను ఆ భూమిలోకి వెళ్లకుండా గంటా మురళి, ఆయన సోదరుడు, అనుచరులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని హరిభగవాన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. » కొయ్యలగూడెం మండలం రాజవరం గ్రామానికి చెందిన దళితుడైన బిరుదుగట్ల కృష్ణమూర్తికి జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురం రెవెన్యూ పరిధిలో 597/3లో 2.10 ఎకరాల భూమి ఉంది. దాన్లో పామాయిల్ సాగు చేస్తున్నాడు. ఆ భూమిని కబ్జా చేసేందుకు యర్రంపేటకు చెందిన తెలుగుదేశం వర్గీయుడు చెరుకూరి సత్యజానకి నరసింహారావు ప్రయత్నిస్తున్నాడు. కృష్ణమూరి్తని పొలంలోకి వెళ్లకుండా అడ్డుకుని దౌర్జన్యం చేశాడు. కృష్ణమూర్తి అధికారుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా, మానసికంగా నలిగిపోతున్నాడు.ఆలయ భూములను పరిరక్షించాలికూటమి ప్రభుత్వం రాగానే టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పేదల భూములను కబ్జా చేసేందుకు తెగబడుతున్నారు. దేవాలయ భూములను సైతం ఆక్రమించేందుకు తెరతీశారు. ప్రభుత్వం స్పందించి బాధితులకు న్యాయం చేసి, వారికి రక్షణ కల్పించడంతో పాటు కబ్జాదారుల నుంచి ఆలయ భూములను పరిరక్షించాలి. – కంభం విజయరాజు, వైఎస్సార్సీపీ నియోజకవర్గ కన్వీనర్, చింతలపూడి రక్షణ కల్పించండిబ్యాంకు వేలంలో భూమిని ఆన్లైన్లో కోర్టు ద్వారా డబ్బులు చెల్లించి కొనుగోలు చేశాను. స్థానిక టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, ఆయన సోదరుడు, అనుచరులు నాపై దౌర్జన్యం చేసి, భూమిని ఆక్రమించేందుకుప్రయత్నిస్తున్నారు. వారినుంచి నాకు రక్షణ కల్పించండి. – ఈడుపుగంటి హరిభగవాన్, చైత్ర హాస్పిటల్ యజమాని, ఏలూరు న్యాయం చేయండిమా తాతల నుంచి నాకు సంక్రమించిన భూమిలో పామాయిల్ సాగుచేస్తున్నాను. టీడీపీ నాయకుడు చిలుకూరి సత్యజానకి నరసింహారావు దళితుడినైన నాపై దౌర్జన్యం చేసి నా పొలం ఆక్రమించాడు. దీనిపై అధికారుల చుట్టూ తిరుగుతున్నా వారు పట్టించుకోవడం లేదు. నరసింహారావు నుంచి నాకు రక్షణ కల్పించి, న్యాయం చేయండి. – బిరుదుగడ్ల కృష్ణమూర్తి, రాజవరం -
చంపేస్తా!.. జర్నలిస్టులకు టీడీపీ ఎమ్మెల్యే భార్య బెదిరింపులు
సాక్షి, తిరుపతి జిల్లా: ఎమ్మెల్యే పులివర్తి నాని భార్య సుధారెడ్డి నుంచి ప్రాణ హాని ఉందని.. రక్షణ కల్పించాలంటూ చంద్రగిరి జర్నలిస్టులు పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్ "చంద్రగిరి రాజకీయం" గ్రూప్‌ను డిలీట్ చేయాలని, లేకుంటే చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారని సీఐ సుబ్బరామిరెడ్డికి పాత్రికేయులు ఫిర్యాదు చేశారు."చంద్రగిరి రాజకీయం" వాట్సాప్ గ్రూప్‌లో ఎమ్మెల్యే నానికి వ్యతిరేకంగా పోస్ట్‌లు పెడుతున్నారంటూ ఈ నెల 13న సుధారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అడ్మిన్లుగా ఉన్న వారిని ఐదుగురు జర్నలిస్టులపై ఆమె కేసు పెట్టారు. మెసేజ్‌లు పెట్టిన వారిని వదిలివేసి, తమపై కేసులు పెట్టడం ఏంటీ? అంటూ బాధిత జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు.ఇదీ చదవండి: తిరుపతిలో మిస్సింగ్ కలకలం.. హైదరాబాద్‌కి బాలిక? -
టీడీపీ నేతల బెదిరింపులతో మహిళ ఆత్మహత్యాయత్నం
ఒంగోలు టౌన్: ప్రేమపేరుతో వెంటపడి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఒక బాలికను గర్భిణిని చేశాడు దర్శి నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకుడి కుమారుడు. తమకు న్యాయం చేయమంటూ వేడుకున్న బాధిత బాలిక కుటుంబ సభ్యులపై బెదిరింపులకు దిగడంతో భయాందోళనకు గురైన బాలిక తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం ఒంగోలులోని ఒక ప్రైవేటు వైద్యశాలలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. బాధిత బాలిక తండ్రి కథనం ప్రకారం.. కావలికి చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె కావలిలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతుండగా, చిన్న కుమార్తె దర్శి సమీప గ్రామంలో అమ్మమ్మ దగ్గర ఉంటూ 7వ తరగతి చదువుకుంటోంది. కొద్దిరోజులుగా గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఏనిగంటి కోటేశ్వరరావు కుమారుడు వరుణ్ చౌదరి ప్రేమ పేరుతో బాలిక వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. శారీరకంగా లోబరుచుకొని గర్భిణిని చేశాడు. ఈ విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఆగస్టులో దర్శి పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి వరుణ్ చౌదరిని అరెస్టు చేశారు.రూ.50 వేలు ఇస్తా తీసుకొని వెళ్లు ...బాలికను గర్భిణిని చేసిన వరుణ్ చౌదరి తండ్రి కొద్ది రోజులుగా రాజీ ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టాడని బాలిక తండ్రి చెబుతున్నారు. రాజంపల్లికి చెందిన తెలుగుదేశం నాయకులను మధ్యవర్తులుగా రాయబారానికి పంపించాడన్నారు. వారి ద్వారా డబ్బులు ఇస్తానంటూ ఆశ పెట్టాడని, అయితే ఇందుకు అంగీకరించలేదని, తమకు డబ్బులు ఏమీ వద్దని, తమ కూతురిని పెళ్లి చేసుకోవాలని కోరామన్నాడు. దాంతో అగ్గిమీద గుగ్గిలమైన కోటేశ్వరరావు రూ.50 వేలు ఇస్తా, తీసుకొని పోండి. పెళ్లి అంటే ఎదురు కేసు పెట్టి బాలికను, బాలిక తల్లిని బజారుకీడుస్తానంటూ రెచ్చి పోయాడని ఆరోపించాడు. చెప్పినట్లు విని రాజీకి వస్తే సరేసరి లేకపోతే ఇబ్బందులు పడతావంటూ బెదిరింపులకు దిగాడన్నాడు. ఈ క్రమంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కావలిలో తన ఇంటిపై దాడి చేసి కొట్టారాని వాపోయాడు. కేసులో రాజీ పడాలని, లేకుంటే నిన్ను, నీ భార్యను చంపుతామని బెదిరించి వెళ్లారని ఆరోపించాడు. వెంటనే బాలిక తండ్రి కావలి వన్‌టౌన్ సీఐకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పామన్నాడు. వెంటనే ఎస్సై వచ్చి జరిగిన విషయం అడిగి తెలుసుకుని, చుట్టుపక్కల విచారించి వెళ్లారని తెలిపాడు.బాలిక తల్లి ఆత్మహత్యా యత్నం..ఈ ఘటనలతో బాలిక తల్లి భయాందోళనకు గురైంది. ఈ నెల 2వ తేదీ ఎలుకల మందు తిని ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే ఆమెను కావలి ఆస్పత్రికి తరలించి వైద్యం చేశారు. మెరుగైన చికిత్స కోసం శుక్రవారం ఒంగోలులోని ఒక ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఆమెను ఎమర్జన్సీ వార్డులో ఉంచి కృతిమ శ్వాస అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉందని, లివర్ చెడిపోయిందని, ప్లేట్లెట్స్ కూడా తగ్గిపోతున్నాయని, రక్తపోటు తరచుగా పడిపోతుందని వైద్యులు తెలిపారు. ఒకవైపున నిండా పద్నాలుగేళ్ల వయసు కూడా లేని కుమార్తె నిండు గర్భంతో ఉంది. చిన్న వయసు కావడంతో కాన్పు ప్రమాదం కావచ్చని, సిజేరియన్ చేసినా ప్రాణాలకు ముప్పు రావచ్చని వైద్యులు చెబుతున్నారని, మరోవైపు ఆత్మహత్యా యత్నం చేసిన భార్య చావు బతుకుల మధ్య పోరాడుతోందని బాలిక తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి అండ చూసుకునే కోటేశ్వరరావు రెచ్చి పోతున్నాడని ఆరోపిస్తున్నారు. -
బెదిరింపులు తట్టుకోలేక వీసీల రాజీనామా
వెంకటాచలం/గుంటూరు (ఏఎన్‌యూ)/కడప (వైవీయూ): కొత్తగా ఏర్పాటైన టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు శ్రుతిమించాయి. చివరకు ఉన్నత విద్య అందించే విశ్వవిద్యాలయాలపైనా కర్రపెత్తనం ప్రారంభించింది. వర్సిటీల వీసీలను తప్పుకోవాలంటూ బెదిరింపులకు దిగడమేగాక తీవ్ర వేధింపులకు గురిచేస్తుండడంతో తట్టుకోలేక వారు రాజీనామాలు సమర్పిస్తున్నారు. ఇప్పటికే పలు వర్సిటీల వీసీలు రాజీనామా చేయగా.. తాజాగా మరికొందరు అదే బాటపట్టారు.టీడీపీ నేతల వేధింపులను తట్టుకోలేక నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ వీసీ జీఎం సుందరవల్లి, రిజిస్ట్రార్ పి.రామచంద్రారెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాలను రాష్ట్ర గవర్నర్ కార్యాలయానికి శుక్రవారం పంపించారు. ఈ నెల 5న టీడీపీ, టీఎన్ఎస్ఎఫ్ నేతలు విశ్వవిద్యాలయంలోకి చొరబడి వీసీ, రిజిస్ట్రార్లతో పాటు అధ్యాపక బృందాలపై దాడి చేశారు. అభివృద్ధి పనుల శిలాఫలకాలను ధ్వంసం చేశారు. కాగా.. యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ రాజీనామా చేసి వెళ్లిపోవాలని విద్యాశాఖ మంత్రి పీఏ ఫోన్ ద్వారా ఈ నెల 25వ తేదీ నుంచి ఒత్తిడి చేస్తున్నారు. దీంతో వారిద్దరూ రాజీనామాలు సమర్పించారు.అదే బాటలో వైవీయూ వీసీకడపలోని యోగివేమన విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ చింతా సుధాకర్ గవర్నర్ కార్యాలయానికి రాజీనామా సమర్పించారు. కాగా.. రిజిస్ట్రార్ వైసీ వెంకట సుబ్బయ్య రాజీనామాను వీసీ ఆమోదించారు. టీడీపీకి చెందిన ఓ వ్యక్తి విద్యాశాఖ మంత్రి ఓఎస్డీగా తాను చేరబోతున్నానని, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నియమితులైన వీసీలు, రిజిస్ట్రార్లు రాజీనామాలు సమర్పించాలంటూ ఫోన్లు చేశారు. అనధికార ఓఎస్డీ ఫోన్‌కాల్స్ పట్టించుకోవాల్సిన పనిలేదని భావించారు. అయితే, తర్వాత రోజు వీసీల వాట్సా‹³ గ్రూపుల్లో సైతం అందరూ రాజీనామాలు సమర్పించాలని వీసీలు, రిజిస్ట్రార్లపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీనికి తోడు అధికార పార్టీ అనుబంధ విద్యార్థి సంఘాలను విశ్వవిద్యాలయాలపైకి ఉసిగొల్పి అనవసర రాద్ధాంతం చేస్తూ వచ్చారు. వైఎస్సార్ వర్సిటీ రిజిస్ట్రార్ రాజీనామాకడప నగరంలోని వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం (వైఎస్సార్ ఏఎఫ్‌యూ) రిజిస్ట్రార్ ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి జూన్ 5న పదవికి రాజీనామా చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీప బంధువు కావడంతో ఈయనపై లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులను ఉసిగొల్పారు. తాజాగా శనివారం ఆయన రాజీనామాను ఏఎఫ్‌యూ వైస్ చాన్సలర్ బానోతు ఆంజనేయప్రసాద్ ఆమోదించారు. దీంతో ఆయన తిరిగి మాతృవిశ్వవిద్యాలయం వైవీయూలో బయో టెక్నాలజీ ఆచార్యులుగా చేరారు. కాగా.. వైఎస్సార్ ఏఎఫ్‌యూ వైస్ చాన్సలర్ బానోతు ఆంజనేయప్రసాద్ సైతం సోమవారం రాజీనామా చేయనున్నట్టు సమాచారం.ఏఎన్‌యూ వీసీ రాజీనామాకు నిర్ణయంరాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ) వీసీ పదవికి రాజీనామా చేయనున్నట్టు వీసీ పి.రాజశేఖర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్ని యూనివర్సిటీల వైస్ చాన్సలర్లు రాజీనామా చేస్తున్న తరుణంలో తన రాజీనామా లేఖను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు శనివారం పేర్కొన్నారు. -
ఏయ్.. రాజీనామా చేయ్! ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డికి బెదిరింపులు
సాక్షి, విశాఖపట్టణం: ఆంధ్ర యునివర్సిటీ వైఎస్ చాన్స్‌లర్ పీవీజీడీ ప్రసాద్ రెడ్డికి గత కొన్ని రోజులుగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. తక్షణమే తన పదవి రాజీనామా చేయాలంటూ కాల్స్ వస్తున్నాయి. ఇలా హైదరాబాద్ కి చెందిన మాధవనాయుడు అనే వ్యక్తి ఏయూ రిజిస్టర్డ్ ఆఫీస్‌కు ఫోన్ చేసి బెదిరింపులకు దిగ్గుతున్నాడని యూనివర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. పీవీజీడీ ప్రసాద్ రెడ్డిని వీసీ పదవికి తక్షణమే రాజీనామా చేసి విదేశాలకు వెళ్లిపోవాలని లేకుంటే తీవ్ర చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నట్లు సమాచారం. -
Russia: ప్రతిపక్ష నేతలకు పుతిన్ భయం..!
మాస్కో: పుతిన్ విమర్శకుడు, రష్యా ప్రతిపక్షనేత అలెక్సీ నావల్ని(47) శుక్రవారం దేశంలోని ఆర్కిటిక్ జైలులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు అనుమానాస్పద స్థితిలో మరణించిన,జైలు శిక్షలు పడిన, దేశ బహిష్కరణకు గురైన రష్యా ప్రతిపక్షనేతల ఉదంతాలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. పుతిన్ తీవ్ర విమర్శకుడిగా పేరొందిన మాజీ డిప్యూటీ సీఎం బొరిస్ నెమ్సోవ్ 2015లో మాస్కోలోని క్రెమ్లిన్ భవనం సమీపంలోని బ్రిడ్జిపై నడుస్తూ వెళుతుండగా దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. ఈ కేసులో ఐదుగురికి శిక్ష పడినప్పటికీ వీరి వెనుక ఉన్న మాస్టర్‌మైండ్ ఎవరన్నది ఇప్పటికీ తెలియలేదు. నెమ్సోవ్ మంచి వక్త. పుతిన్ విధానాలను తీవ్రంగా విమర్శించడమే కాక ఎప్పటికప్పుడు ఆందోళనలు నిర్వహించేవారు. రష్యా ప్రతిపక్ష నేతల్లో ఒకరైనా వ్లాదిమిర్ కరాముర్జా(42)కు 2023 ఏప్రిల్‌లో సుదీర్ఘంగా 23 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ జైలు శిక్షను కేవలం రష్యా ఉక్రెయిన్, యుద్ధంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను దేశద్రోహం కేసులో విధించారు. ఉక్రెయిన్‌పై రష్యా చేసిన దాడి మీద విమర్శలు చేసినందుకుగాను మరో ప్రతిపక్ష నేత ఇల్యా యాషిన్కు 2022 డిసెంబర్లో ఎనిమిదిన్నర సంవత్సరాల జైలు శిక్ష పడింది. తాజాగా జైలులో మరణించిన నావల్ని అనుచరుడు లిలియా చన్యాషెవాకు 2023లో ఏడున్నరేళ్ల జైలు శిక్ష విధించారు. పుతిన్‌ను విమర్శించి దేశ బహిష్కరణకు గురైన వారు కూడా చాలా మందే ఉన్నారు. ఆయిల్ రంగంలో వ్యాపార దిగ్గజం మిఖాలీ పదేళ్ల జైలు శిక్ష తర్వాత లండన్ వెళ్లిపోయారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైన తర్వాత విమర్శలు గుప్పించిన వారందరూ ఇప్పుడు ప్రపంచంలోని పలు దేశాలకు వెళ్లి బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. పుతిన్‌కు వ్యతిరేకంగా వార్తలు రాసిన ఇండిపెండెంట్ మీడియా జర్నలిస్టులపై చాలా మంది మీద ఫారెన్ ఏజెంట్లుగా ముద్ర వేశారు. ఇదీ చదవండి.. జైలులోనే మృతి చెందిన పుతిన్ ప్రత్యర్థి నావల్ని -
డీప్‌ఫేక్‌తో భారత్‌కు ముప్పు: మోదీ
ఢిల్లీ: ప్రస్తుతం భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పులలో డీప్‌ఫేక్‌లు ఒకటని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇవి సమాజంలో గందరగోళానికి కారణమవుతాయని అన్నారు. ఈ సమస్యపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రధాని కోరారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ మేరకు మాట్లాడారు. ఈ అంశంపై పౌరులు, మీడియా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ‘‘డీప్‌ఫేక్ వీడియోలు మన వ్యవస్థకు పెనుముప్పుగా మారుతున్నాయి. ఇవి సమాజంలో గందరగోళానికి కారణమవుతున్నాయి. ఇటీవల నేను పాట పాడినట్లుగా ఓ వీడియో వైరల్ అయ్యింది. ఈ డీప్‌ఫేక్ వీడియోలపై మీడియా, సోషల్ మీడియా ప్రజలకు అవగాహన కల్పించాలి’’ అని ప్రధాని మోదీ అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో డీప్‌ఫేక్‌లు ప్రజాస్వామ్య సమగ్రతకు సవాళ్లను విసురుతున్నాయి. నకిలీ, నిజమైన క్లిప్‌ల మధ్య తేడాను గుర్తించడం కష్టతరం చేస్తుంది. రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకుని చిత్రాలు, నకిలీ వీడియోలను సృష్టిస్తుంది. ఇదీ చదవండి: -
మొదట్లో భూకబ్జాలు..సెటిల్మెంట్లు ఆపై మోసాలు...బెదిరింపులు
సాక్షి, హైదరాబాద్: మొదట్లో భూకబ్జాలు, సెటిల్మెంట్లు చేశాడు.. అవి సెట్ కాలేదు...దీంతో ఐఆర్ఎస్ అధికారి అవతారం ఎత్తి సినీ ప్రొడ్యూసర్లను బెదిరించాడు.. చివరకు వ్యభిచారదందా కూడా నిర్వహించాడు.. మోసాలు, బెదిరింపులకు లెక్కేలేదు. మాదాపూర్‌లోని ఓ అపార్ట్మెంట్లో రేవ్‌పార్టీ నిర్వహిస్తూ గురువారం తెలంగాణస్టేట్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకు (టీఎస్–నాబ్) చిక్కిన ఫిల్మ్ ఫైనాన్షియర్ కారుమూరి వెంకటరత్నారెడ్డి అలియాస్ వెంకటరమణారెడ్డి ఘనచరిత్ర ఇది. ఇతడితోసహా చిక్కిన ముగ్గురిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన గుడిమల్కాపూర్ పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. గుంటూరులోని నెహ్రూనగర్‌కు చెందిన వెంకటరత్నారెడ్డి డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. చేసేందుకు ఏ ఉద్యోగమూ దొర కలేదు. దీంతో బతుకుతెరు వుకు స్నేహితులతో కలిసి భవన శిథిలాల తొలగింపు వ్యాపారంలోకి దిగాడు. అందులోనూ నష్టాలు రావడంతో మోసాలు చేసి డబ్బు దండుకోవాలని పథకం వేశాడు. నకిలీ ఐఆర్ఎస్ అధికారిగా అవతారమెత్తి.. నకిలీ ఐఆర్ఎస్ అధికారి అవతారం ఎత్తిన వెంకటరత్నారెడ్డి ఆ పేరుతో సినీ నిర్మాతలు సి.కల్యాణ్, రమేష్‌ల నుంచి రూ.30 లక్షలు వసూలు చేశాడు. దీనిపై బంజారాహిల్స్ ఠాణాలో కేసు నమోదైంది. తిరుమలలో దర్శనానికి కేవీ.రత్నారెడ్డి పేరుతో ఐఆర్ఎస్ అధికారిగా నకిలీ గుర్తింపుకార్డు తయారు చేసుకున్నాడు. దీని ఆధారంగా తనతో సహా 9 మందికి బ్రేక్ దర్శనం టిక్కెట్లు ఇవ్వాలని దరఖాస్తు చేసి చిక్కాడు. ఓ ఐఆర్ఎస్ అధికారిణిని వివాహం చేసుకొని మోసం చేసిన ఆరోపణలు ఉన్నాయి. ఎన్నారై మహిళలను టార్గెట్ చేసి.. ఎన్నారై మహిళలను టార్గెట్‌గా చేసుకుని, తానూ ఎన్నారైనే అంటూ నమ్మబలికి పెళ్లి పేరుతో మోసాలకు తెరలేపాడు. భర్త నుంచి విడాకులు తీసుకుని అమెరికాలో ఉంటున్న నగరానికి చెందిన ఓ మహిళ భారత్‌మాట్రిమోనీలో ఇతగాడి ప్రొఫైల్ చూసి వివాహమాడింది. ఆమెతో పాటు అమెరికా వెళ్లిన వెంకట్ కేవలం 20 రోజులే కాపురం చేశాడు. ఆపై అత్యవసర పని ఉందని, ఆమె నుంచి రూ.20 లక్షలు తీసుకుని ఇక్కడకు వచ్చాడు. ఆ తర్వాత పత్తా లేకపోవడంతో ప్రొఫైల్‌ను ఇంటర్నెట్లో సెర్చ్ చేసిన బాధితురాలి మేనమామ అతడికి నేరచరిత్ర ఉందని, తల్లి, భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్టు తెలుసుకున్నాడు. దీంతో ఆయన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్టు చేశారు. మరో ముగ్గురు ఎన్నారై మహిళలకు ఇతగాడు ఎర వేసినట్టు అప్పట్లో తేలింది. వెంకట్‌పై జూబ్లీహిల్స్ పరిధిలో వ్యభిచార కేసు కూడా ఉంది. విదేశీ మద్యం అక్రమఅమ్మకం, తాను గుంటూరు ఎస్పీ గన్‌మెన్ అని చెప్పి మోసం చేయడం, దొంగ పాస్‌పోర్టు పొందడం సహా ఇతడిపై ఏపీ, తెలంగాణల్లోని వివిధ ఠాణాల్లో 25 కేసులు నమోదయ్యాయి. వీటిలో కొన్ని రాజీ కాగా, మరికొన్ని వీగిపోయాయి. 10 కేసులు వివిధ దశల్లో ఉన్నాయి. ఆ 18 మంది కోసం వేట ముమ్మరం వెంకట్‌తోపాటు అరెస్టు అయిన బాలాజీ కాల్‌డేటాను పరిశీలించిన టీఎస్–నాబ్ అధికారులు 18 మంది డ్రగ్స్ వినియోగదారులను గుర్తించారు. విశాఖకు చెందిన రామ్‌తో పాటు బెంగళూరులో ఉంటున్న నైజీరియన్లు అమ్మోది చికూడి ముగుముల్, ఇగ్వారే, థామస్ అన్హాల నుంచి వీరు డ్రగ్స్ ఖరీదు చేస్తున్నట్టు నిర్ధారించి గాలిస్తున్నారు. వీరి కస్టమర్లు రామ్‌చంద్, అర్జున్, రవి ఉప్పలపా టి, సుశాంత్‌రెడ్డి, ఇంద్రతేజ, కల్హర్రెడ్డి, సురే ష్, రామ్‌కుమార్, ప్రణీత్, సందీప్, సూర్య, శ్వేత, కార్తిక్, నర్సింగ్, ఇటాచి, మహ్మద్‌అ జామ్, అమ్‌జద్‌ల కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. వెంకట్ దగ్గర డ్రగ్స్ కొన్నవారిలో నటులు, ప్రముఖులున్నట్టు అనుమానిస్తున్న అధికారులు ఆరా తీస్తున్నా రు. గతంలో ఇతగాడు ఏపీకి చెందిన ఓ ఎంపీ పేరు చెప్పి నగరంలో భారీ వసూళ్లకు పాల్పడినట్టు తెలుస్తోంది. సినీ, రాజకీయ ప్రముఖులను పార్టీలకు పిలిచి బురిడీ కొట్టించేవాడు. కొన్నాళ్లుగా ఫిల్మ్ ఫైనాన్షియర్ అవతారం ఎత్తి డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నాడు. -
బూతు ‘కూన’ల బరితెగింపు.. విద్యుత్తు శాఖ ఏఈకి బెదిరింపులు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అధికారంలో లేకున్నా వారి ఆగడాలకు అంతులేదు. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించడం, దూషించడం ‘బూతుల బ్రదర్స్’కు నిత్యకృత్యంగా మారింది. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆగడాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. గతంలో పలువురు ప్రభుత్వ అధికారులను దుర్భాషలాడిన రవికుమార్ తాజాగా పొందూరు విద్యుత్తు శాఖ ఏఈని ఫోన్లో బెదిరించిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం చేయాలని లేదా..? ‘కాస్త మర్యాదగా ఉద్యోగాలు చేయడం నేర్చుకో..! నీకు సర్విసు లేదా? ఉద్యోగం చేయవా నువ్వు...? (రాయలేని భాషలో తిడుతూ) నాకు రూల్స్ చెబుతావా? తమాషాలు దొబ్బుతున్నావా? విద్యుత్ మీటర్ విషయంలో నా మనిషికే నోటీసు ఇస్తావా? డిస్ కనెక్ట్ చెయ్.. జీవితంలో ఇంత పెద్ద తప్పు చేశానా అని బాధపడే రోజు వస్తుంది చూడు నీకు... గుర్తు పెట్టుకో.. నువ్వు ముందు నోటీసు విత్‌డ్రా చేసుకో. ఎవడా డీఈ...? నా కొడుకు.. ఆడికి చెప్పు.. మళ్లీ నీకు చెబుతున్నా వెధవ వేషాలు వేశావా.. మళ్లీ జీవితంలో కోలుకోలేవు..’ అంటూ పొందూరు ఎలక్ట్రికల్ ఏఈ పైడి దుర్గా ప్రసాద్‌ను కూన రవికుమార్ బెదిరించాడు. ఈ ఘటన మూడు నెలల క్రితం జరగ్గా ఆ సంభాషణ ఆలస్యంగా వెలుగు చూసింది. ఇలాంటి వ్యక్తులు పొరపాటున ఎన్నికైతే ప్రజలను, ఉద్యోగులను బతకనిస్తారా? అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. తాజా బాగోతమిది పొందూరులో ‘గరుడ’ పేరుతో రెస్టారెంట్‌ను ఏర్పాటు చేసిన టీడీపీ ఎంపీటీసీ బాడాన గిరి అనుమతి లేకుండా విద్యుత్ మీటర్‌ను అమర్చారు. పంచాయతీ అనుమతి లేదని లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందడంతో వివరణ ఇవ్వాలని ఎలక్ట్రికల్ ఏఈ పైడి దుర్గా ప్రసాద్ నోటీసు ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన కూన రవికుమార్ ఫోన్ చేసి అసభ్యంగా దూషించారు. ఈ అవమానాన్ని భరించలేక విద్యుత్ శాఖ అధికారి కుమిలిపోయారు. కూన బ్రదర్స్‌కు ఆనవాయితీనే.. ♦ శ్రీకాకుళం సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన ఆర్ఈసీహెచ్ ప్రసాద్‌ను గతంలో కూన రవికుమార్ నోటికొచ్చినట్టు దూషించారు. నీకు ఉద్యోగం, యూనిఫాం లేకుండా చేస్తా... ఆఫ్టర్ టూ అండ్ ఆఫ్ ఇయర్స్ నీకు ఉద్యోగం ఉండదు.. గుర్తుపెట్టుకో అంటూ బెదిరించారు. ♦ కోవిడ్ సమయంలో మందీ మార్బలంతో పోలీసు స్టేషన్‌కు వచ్చిన రవికుమార్ శంకరగిరి మాన్యాలు పట్టిస్తానంటూ పోలీస్ అధికారులను బెదిరించారు. ‘మీ స్థాయి ఎంత..? మీరు ఎంత..?’ అంటూ నరసన్నపేట సీఐ, ఎస్లనుద్దేశించి నోరు పారేసుకున్నారు. ♦ పొందూరులో టీడీపీ కార్యాలయం నిర్వహిస్తున్న భవనాన్ని ఖాళీ చేయాలని కోరినందుకు ఆ ఇంటి యజమానికి ఫోన్లో వార్నింగ్ ఇచ్చారు. ♦ పింఛన్ల విషయంలో తన మాట వినలేదని మండల కార్యాలయంలోనే సరుబుజ్జిలి ఎంపీడీవో, ఈవోపీఆర్డీకి వార్నింగ్ ఇచ్చారు. ఆఫీసులోనే తలుపులు వేసి మరీ బాదేస్తా.. నన్ను ఎవరూ ఆపలేరు. చెట్టుకు కట్టి కాల్చేస్తా.. చెప్పింది చేయకపోతే నేనేంటో చూపిస్తానంటూ బెదిరించారు. ♦ పనుల విషయంలో తాను చెప్పినట్లు వినకుంటే కుర్చిలో కూర్చున్నా లాక్కుని వచ్చి తంతానంటూ పంచాయతీ కార్యదర్శులను కూన రవికుమార్ భయపెట్టారు. ♦ ఒక బిల్లు విషయంలో సరుబుజ్జిలి ఇన్చార్జి ఈవోపీఆర్డీపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ♦ మట్టి అక్రమంగా తరలించిన వాహనాలను విడిచిపెట్టలేదని పొందూరు తహసీల్దార్‌పై బెదిరింపులకు పాల్పడ్డారు. ‘పట్టుకున్న వాహనాలను విడిచి పెట్టకపోతే లంచం డిమాండ్ చేశావని నీమీద కంప్లైంట్ చేస్తా. చెప్పు ఎంత కావాలి...? పది వేలు కావాలా? లక్ష కావాలా? ఎంత కావాలి...? ప్రాసెస్ గురించి నాకు చెబుతున్నావా? అంటూ రాయలేని భాషలో ఏకంగా ఎమ్మార్వోను దూషించారు. ♦కూన రవికుమార్ తమ్ముడు కూన వెంకట సత్యనారాయణ ఇటీవల పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ కెసీహెచ్ మహంతిపై దాడి చేసే వరకు వెళ్లారు. తాను చేసిన పనులకు సంబంధించి ఏఈ అభ్యంతరం వ్యక్తం చేయడంతో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కార్యాలయంలోనే దౌర్జన్యం చేశారు. ‘ఎంత ధైర్యం రా...! నాకే నోటీసు ఇస్తావా..? ఏమనుకుంటున్నావ్.. నేను కూన రవికుమార్ బ్రదర్‌ని.. జాగ్రత్త... ఇక్కడే పాతేస్తా... ’ అంటూ సత్యనారాయణ రెచ్చిపోయాడు. -
‘ప్రభ’ తొలగి.. పన్నాగాలు.. ఉనికి కాపాడుకునేందుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి పాట్లు
♦టీడీపీ హయాంలో జిల్లాలో పనిచేసిన మైనింగ్ ఏడీ నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తుండేవారు. తమ గ్రానైట్ దోపిడీకి ఏడీ అడ్డు తగులుతున్నారని జేసీ సోదరుల (దివాకర్‌రెడ్డి – ప్రభాకర్‌రెడ్డి) ప్రధాన అనుచరుడు ఎస్.వి.రవీంద్రారెడ్డితో ఏడీని తీవ్రస్థాయిలో బెదిరించారు. లారీలతో గుద్ది చంపుతామని బెదిరించడమే కాకుండా అవినీతి మరకలంటించారు. చదవండి: సైకోలా అయ్యన్న తీరు ♦ఇటీవల బదిలీపై వెళ్లిన తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్రెడ్డిని కూడా ప్రభాకర్‌రెడ్డి టార్గెట్ చేశారు. చీటికిమాటికి.. అయినదానికి కానిదానికి బ్లాక్మెయిల్ చేశారు. మున్సిపల్ కార్యాలయ పరిపాలనా విభాగాల సిబ్బందిపైనా నోరు పారేసుకున్నారు. ♦తాజాగా డీఎస్పీ వీఎన్కే చైతన్య శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుండడంతో జేసీ ప్రభాకర్‌రెడ్డికి మింగుడు పడటం లేదు. సోషల్ మీడియా వేదికగా డీఎస్పీపై విమర్శలు గుప్పిస్తూ అవినీతి మరక అంటించేందుకు సిద్ధమయ్యారు. ♦అధికార యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకోవడం ద్వారా తన పనులు సజావుగా, సాఫీగా చేసుకునేందుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి కుట్రలకు తెరలేపుతున్నారు. మాట వినని అధికారులను, పోలీసులను బెదిరించడం, వారి బంధువులకు వార్నింగ్ ఇవ్వడం చేస్తున్నారు. తాడిపత్రి అర్బన్: కళ్లు పెద్దవి చేస్తూ.. ఆవేశంతో ఊగిపోతూ.. నోటి దురుసుతో రాజకీయ నాయకులను రెచ్చగొట్టడం.. అధికారులు, ఉద్యోగుల ఆత్మస్థైర్యం దెబ్బతీయడం మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి నైజం. ఆయన వ్యవహార శైలి నచ్చక అనుచరులు ఒక్కొక్కరుగా టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. దీంతో నిరాశానిస్పృహలకు లోనైన ప్రభాకర్‌రెడ్డి ఆత్మరక్షణలో పడ్డారు. తాడిపత్రిలో తన ప్రాభవం కనుమరుగైపోతుండటంతో తిరిగి పట్టు సాధించుకునేందుకు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. తాను చైర్మన్ అని, మున్సిపల్ పరిధిలోని వ్యవహారాలన్నీ తన కనుసన్నల్లోనే జరగాలని, అధికారులందరూ తాను చెప్పినట్లే వినాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఈయన అహంకార ధోరణితో అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. కుదిరితే బేరం.. లేకుంటే బ్లాక్మెయిల్ జేసీ ప్రభాకర్‌రెడ్డి తాను చెప్పిన పనులు చేయించుకోవడం కోసం అధికారులతో మొదట బేరానికి వెళ్లడం.. కుదరకపోతే బ్లాక్మెయిల్ చేయడం సర్వసాధారణం. ముందుగా తన అనుచరులతో అధికారులకు ఫోన్ చేయించి, వారి ద్వారా నజరానాలు పంపి బేరం కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. అధికారులు వాటిని తిరస్కరిస్తే ఇక తనదైన శైలిలో బెదిరింపులకు దిగుతారు. దీంతో నిక్కచ్చిగా పనిచేసే అధికారులు జేసీ తీరుతో ఇబ్బంది పడుతున్నారు. అధికారుల బంధువులకు బెదిరింపులు! అధికారుల వద్ద తన ఆటలు సాగవని తెలుసుకున్న ప్రభాకర్‌రెడ్డి.. అధికారుల బంధువులు ఎవరున్నారు.. వారు ఎక్కడ ఉంటున్నారన్న సమాచారం సేకరించి వారిని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. తాడిపత్రి సబ్‌డివిజన్‌లో పని చేస్తున్న ఓ ఎస్ఐ సమీప బంధువు వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం నక్కలపల్లిలో ఉంటున్నారు. మూడ్రోజుల క్రితం ఆ ఎస్ఐ బంధువుకు జేసీ అనుచరుడు మల్లికార్జునరెడ్డి ఫోన్ చేసి ‘మీవాడు హద్దు మీరి ప్రవర్తిస్తున్నాడు.. జాగ్రత్తగా ఉండమ’ని హెచ్చరించినట్లు సమాచారం. ఇందుకు ఆ ఎస్ఐ బంధువు భయపడకుండా దీటుగా సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. •సబ్ డివిజన్లో పనిచేస్తున్న ఎస్ఐలు, వారి బంధువుల వివరాలను సేకరిస్తున్నారు. ఆ తర్వాత వారు సివిల్ పంచాయితీలు చేసి లంచాలు తీసుకుంటున్నారని సోషల్ మీడియా వేదికగా నిరాధార ఆరోపణలు చేసి మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. •ఇటీవల ఓ సీఐని బెదిరించినట్లు తెలిసింది. ‘నా అనుచరులపై దాడి చేస్తే మేం కూడా వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లపై దాడి చేస్తాం...మీరేమి చేస్తారో చూస్తాం’ అని ఆ సీఐని ఫోన్లో బెదిరించినట్లు సమాచారం. •గన్నెవారిపల్లి కాలనీలో ఇటీవల ప్రభుత్వ అనుమతులు లేకుండానే జేసీ అనుచరులు భూగర్భ డ్రెయినేజీ మరమ్మతు పనులు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి అడ్డుకోవడంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహించారు. వారికి ఫోన్ చేసి ‘నా మనుషులు చేసే కాంట్రాక్టు పనులను అడ్డుకుంటారా!’ అంటూ బూతులు తిట్టినట్లు తెలిసింది. దీంతో అధికారులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. •మున్సిపల్ ఎన్నికల్లో మొసలి కన్నీరు కార్చిన జేసీ ప్రభాకర్‌రెడ్డికి అధికారం కట్టబెడితే ఇలా అధికారులపై బెదిరింపులకు దిగడమేంటని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
కుప్పంలో అసలు ఏం జరిగింది?.. చంద్రబాబు హై డ్రామా ఆ భయంతోనేనా..?
సాక్షి, చిత్తూరు జిల్లా: కుప్పం వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన నిజ స్వరూపం బయట పెట్టుకున్నారు. కుప్పంలో తెలుగుదేశం గూండాల దాడులకు అనుగుణంగా చంద్రబాబు వీరంగం ఆడారు. కుప్పంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎలా కాపురాలు చేస్తారో చూస్తానని బెదిరించారు. పార్టీ శ్రేణులను శాంతియుతంగా ఉండాలని తాను చెప్పలేనని పార్టీ నేతలు యోధుల్లా ధైర్యంగా తయారవ్వాలని బాబు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డితో సహా మంత్రులను ఉద్దేశించి ఖబడ్దార్ దమ్ముంటే కుప్పం రండి తేల్చుకుందాం అంటూ తొడగొట్టారు. రాజకీయాల్లో అర్ధ శతాబ్ధిగా ఉన్న నాయకుడు ఇటువంటి నేలబారు రౌడీ భాష మాట్లాడ్డంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: ‘కుప్పంలో టీడీపీ అరాచకం.. చంద్రబాబే ప్రథమ ముద్దాయి’ కుప్పం నియోజక వర్గం తన చేజారిపోతోందేమోనన్న భయంతో చంద్రబాబు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. స్థానిక సంస్థల్లో కుప్పం ప్రజలు తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించడంతో ఆయన తట్టుకోలేకపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకూ ఎదురుగాలి తప్పదని కంగారు పడుతోన్న వేళ కుప్పం అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడుం బిగించడంతో చంద్రబాబు వెన్నులో చలిమొదలైంది. ఈనేపథ్యంలోనే కుప్పంలో టీడీపీ శ్రేణుల చేత గూండాగిరీ చేయించిన చంద్రబాబు వారికి వత్తాసుగా తాను కూడా వీరంగం ఆడేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రిపైనా, పోలీసులపైనా నోటికొచ్చింది అనేశారు. సీనియర్ పొలిటీషయన్ అని చెప్పుకునే చంద్రబాబు భాష చూసి జనం ముక్కున వేలేసుకున్నారు. ముఖ్యమంత్రీ ఖబడ్దార్.. ఏయ్ డీజీపీ జాగ్రత్త.. ఎస్పీ...ఏమనుకుంటున్నావ్? తమాషాగా ఉందా?. కుప్పంలో కాపురాలు చేస్తారా? చెయ్యండి చూద్దాం. పోలీసుల కతలు రెండు నిముషాల్లో తేల్చేస్తా. ఏ ఒక్కరినీ వదిలిపెట్టం. అందరి అంతు చూస్తాం. ఇవీ నాలుగున్నర దశాబ్ధాల రాజకీయ చరిత్ర మూటకట్టురకున్న పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడి నేలబారు మాటలు. టీడీపీ కార్యకర్తలకూ కోపం వస్తుంది. ఓ స్థాయి దాటితే ఆ కోపాన్ని నేను కూడా కంట్రోల్ చేయలేను. కార్యకర్తలను పిరికిగా ఉండమని చెప్పలేను ప్రతీ కార్యకర్తా ఒక యోధుడిలా తయారు కావాలి. యువత ముందుకు రావాలి. ఇవీ హుందాగా మెలగాల్సిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు. ఈ చౌకబారు రౌడీ భాష అంతా కూడా చంద్రబాబు నాయుడి సొంత నియోజక వర్గం అయిన కుప్పంలోనివే. విషయం ఏంటంటే 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏనాడూ కుప్పం నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. అందుకే స్థానిక ఎన్నికల్లో ప్రజలు టీడీపీని ఘోరంగా ఓడించారు. మరో పక్క జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో భాగంగా కుప్పం నియోజక వర్గంలోనూ అభివృద్ధి కార్యక్రమాలకు నడుం బిగించింది. కుప్పాన్ని రెవిన్యూ డివిజన్‌గా ప్రకటించి కుప్పం తలరాత మార్చారు జగన్మోహన్ రెడ్డి. నిన్న కాక మొన్ననే కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం 66 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది ప్రభుత్వం. ఆ అభివృద్ధి పథకాలు పూర్తి అయితే కుప్పం ప్రజలు తనని అటకెక్కించేస్తారని కంగారు పడుతున్నారు చంద్రబాబు. ఇప్పటికే తాను సొంతంగా నిర్వహించుకున్న సర్వేలో కుప్పం నియోజక వర్గంలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలవడం చాలా కష్టమని తేలినట్లు సమాచారం. ఆయన ఆ టెన్షన్లో ఉంటే.. మరో వైపు జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాలు గెలుచుకోవాలన్న లక్ష్యంలో భాగంగా కుప్పం నియోజక వర్గంపైనా ప్రత్యేక దృష్టి సారించారు. ఇక కుప్పం కూడా తనకు మిగలదన్న భయం చంద్రబాబు నాయుడికి కొద్ది రోజులుగా నిద్రలేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కుప్పంలో తరుచుగా పర్యటిస్తోన్న చంద్రబాబు బుధవారం ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలు వీధి గూండాల్లా ఊరిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానుల ఇళ్లపై దాడులకు దిగారు. అడ్డొచ్చిన వారిని చితక బాదారు. రాళ్ల దాడి చేశారు. మొత్తం మీద రచ్చ రచ్చ చేశారు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడి సమక్షంలోనే జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడులు చేస్తోంటే చంద్రబాబు నాయుడు వారించలేదు. తమాషా చూశారు. ఈ సమయంలోనే పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి కొంత సద్దుమణిగింది. టీడీపీ గూండాయిజానికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేశారు. తమ పార్టీ శ్రేణుల దాడులను చూస్తూ గడిపిన చంద్రబాబు నాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు తమపై దాడులు చేశారని గగ్గోలు పెట్టారు. కుప్పంలో ఎన్నడైనా రౌడీయిజం చూశామా? ఎన్నడైనా ఇలాంటి దాడులు చూశామా? అంటూ బుగ్గలు నొక్కుకుంటూ చంద్రబాబు హై డ్రామా నడిపారు. టీడీపీ కార్యకర్తలు పేట్రేగిపోయి దాడులు చేస్తోంటే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో చంద్రబాబు కోపం అంతా పోలీసులపై పడింది. పోలీసులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు చంద్రబాబు. మిస్టర్ ఎస్పీ ఎక్కడున్నావు నువ్వు? నేను తలచుకుంటే మీ ఇంటిని కొట్టలేనా? అంటూ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు చెలరేగుతాయని పరోక్షంగా హెచ్చరించారు. ‘మీ ఇళ్లు కూలిస్తే .. మీ కుటుంబ సభ్యులను నడి రోడ్డుపై అవమానిస్తే అప్పుడు తెలుస్తుంది మీకు ‘ అంటూ తన స్థాయి మరిచి హెచ్చరించారు. ఈ పోలీసులకన్నా బ్రిటిష్ వాళ్లే నయం అంటూ చంద్రబాబు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులకు కొవ్వెక్కిపోయిందన్నారు చంద్రబాబు. రానున్న రోజుల్లో నేను వీధుల్లోకి వస్తా ఎవరొస్తారో చూస్తా అంటూ వీధి రౌడీలా సవాల్ చేశారు. మా కార్యకర్తల జోలికి వస్తే మీ ఇంటికి వస్తా వేలమందిని వేసుకుని వస్తా మీ అంతు చూస్తా అంటూ బాలయ్య సినిమా టైప్ డైలాగ్ వదిలారు చంద్రబాబు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ వారిని పరోక్షంగా రెచ్చగొట్టారు చంద్రబాబు. ‘ మీకూ కోపం వస్తుంది. దాన్ని నేను కూడా కంట్రోల్ చేయలేను. ఆ విషయాన్ని పోలీసులు గుర్తుంచుకుంటే వారికే మంచిది అని హెచ్చరిక స్వరంతో అన్నారు చంద్రబాబు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సహా ప్రభుత్వ సలహాదారులంతా దమ్ముంటే కుప్పానికి రండి అంటూ సవాల్ విసిరారు చంద్రబాబు. అందరి అంతూ తేలుస్తానని వార్నింగ్ ఇచ్చారు. అందరికీ కాలం చెల్లిందంటూ దిగజారుడు భాష ప్రయోగించారు. అసలు కుప్పంలో మీరంతా కాపురాలు ఎలా చేస్తారో నేనూ చూస్తా అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలను హెచ్చరించారు. చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తోంటే ఆయన ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో అర్ధం అవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆయన వాడిన భాష చూస్తోంటే ఆయనకు మతి స్థిమితం తప్పలేదు కదా అన్న అనుమానాలు వస్తున్నాయంటున్నారు రాజకీయ పండితులు. ఆయన పరుష పదజాలాన్ని చూస్తోంటే ఆయన ఎంతకైనా దిగజారగలరని అర్ధం అవుతోందని వారంటున్నారు. రౌడీయిజం చేసింది తెలుగుదేశమే. హింసాయుత ఘటనలతో బీభత్సం సృష్టించింది ఎల్లో గూండాలే. వారిని రెచ్చగొట్టి వైఎస్సార్ కాంగ్రెస్‌పై దాడులు చేయించింది చంద్రబాబే. అన్నీ వారే చేసి కుప్పంలో ఏదో జరిగిపోతోందన్నట్లు హై డ్రామా ఆడుతోందీ చంద్రబాబే అంటున్నారు పాలక పక్ష నేతలు. తన స్థాయికి కానీ తన హోదాకు కానీ తగని విధంగా చిల్లరగా వ్యవహరించడం చంద్రబాబుకు కొత్త కాదంటున్నారు వారు. గతంలోనూ చంద్రబాబు నాయుడు ఇలాంటి దిగజారుడు రాజకీయాలే చేసి ప్రజల నుండి నిరాకరణకు గురయ్యారని అందుకే ఇపుడు ప్రతిపక్షంలో ఉన్నారని వారు గుర్తు చేస్తున్నారు. అయినా చంద్రబాబు నాయుడు గుణపాఠం నేర్వకుండా మరింత పాతాళానికి దిగజారుతున్నారని వారు దుయ్యబడుతున్నారు. చదవండి: చంపడానికి టీడీపీ గూండాలు వచ్చారు.. ప్రాణహాని ఉంది: ఎంపీపీ అశ్విని -
‘అంతుచూస్తాం.. దిక్కున్న చోట చెప్పుకో’.. రెచ్చిపోయిన టీడీపీ నేతలు
కేవీబీపురం(చిత్తూరు జిల్లా): మహిళా సర్పంచ్‌పై టీడీపీ మూకలు దాడులకు తెగబడ్డాయి. ఫ్లెక్సీల తొలగింపుపై ప్రశ్నించినందుకు పచ్చతమ్ముళ్లు విచక్షణ, మర్యాద మరచి అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వివరాలు.. అంజూరు సర్పంచ్ శ్రీజయ ప్రజలకు నూతన సంవత్సరం, సంక్రాతి శుభాకాంక్షలు తెలుపుతూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. దీన్ని సహించలేని స్థానిక టీడీపీ నేత శివయ్య తన అనుచరులతో బ్యానర్లను ధ్వంసం చేయించారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ శ్రీజయ సంబంధిత వ్యక్తులను ప్రశ్నించారు. చదవండి: బోడికొండపై 'దండు'యాత్ర.. రెచ్చిపోయిన టీడీపీ నేతలు శివయ్య, మోహన్, అనుచరులు దిక్కున చోట చెప్పుకోమంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. మంగళవారం అర్ధరాత్రి సర్పంచ్ ఇంటిపై రాళ్లతో దాడులకు దిగారు. తమకు అడ్డొస్తే చంపేస్తామని బెదిరింపులకు దిగారు. ఈ క్రమంలో జయశ్రీ కింద పడిపోయారు. ఆమె భర్త సురేష్ టీడీపీ మూకలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల రంగ ప్రవేశంతో అల్లరి మూకలు పరారయ్యాయి. ఈ ఘటనకు పాల్పడిన వారిలో మాతయ్య అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. శివయ్య, మోహన్ల ప్రోద్భలంతోనే తాను బ్యానర్లను తొలగించినట్లు పోలీసులకు తెలిపాడు. టీడీపీ నేతల నుంచి తమకు రక్షణ కల్పించాలని సర్పంచ్ జయశ్రీ పోలీసులను రాత పూర్వకంగా కోరారు. దీనిపై ఎస్ఐ నాగార్జునరెడ్డిని వివరణ కోరగా.. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. -
కుప్పంలో సీఐలకు చంద్రబాబు బెదిరింపు
-
కుప్పంలో సీఐలకు చంద్రబాబు బెదిరింపు
సాక్షి, చిత్తూరు: కుప్పంలో సీఐలపై చంద్రబాబు బెదిరింపు ధోరణి ప్రదర్శించారు. తాను బస చేస్తున్న బస్సులోకి పిలిపించుకుని కుప్పం అర్బన్ సీఐ, రూరల్ సీఐలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేనంటే ఏమనుకుంటున్నారంటూ మండిపడ్డారు. వచ్చేది మా ప్రభుత్వమే.. జాగ్రత్తగా ఉండాలంటూ చంద్రబాబు అసహనం వ్యక్తం చేయగా.. మేం రూల్స్ ప్రకారమే నడుచుకుంటున్నామని సీఐలు ధీటుగా సమాధానం ఇచ్చారు. చదవండి: బద్వేల్లో టీడీపీ కుట్ర రాజకీయాలు -
దుగ్గిరాలలో టీడీపీ నీచ రాజకీయాలు
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో టీడీపీ నీచ రాజకీయాలకు దిగింది. వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన ఇద్దరు బీసీ మహిళలను, కొంతమంది ఎంపీటీసీలను తమవైపు తిప్పుకునేందుకు సొమ్ములు ఆశ చూపి భంగపడిన నారా లోకేశ్ బృందం.. చివరకుబెదిరింపులకు దిగుతోంది. నారా లోకేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరిలో ఘోర పరాజయం పొందిన నాటినుంచీ మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగకుండా కోర్టులను ఆశ్రయిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్న విషయం విదితమే. దుగ్గిరాల మండల పరిధిలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీకి మెజారిటీ స్థానాలు దక్కినప్పటికీ.. గెలిచిన వారిలో బీసీ మహిళ లేకపోవడంతో శుక్రవారం జరిగిన ఎంపీపీ ఎన్నికలకు టీడీపీ ఎంపీటీసీలంతా గైర్హాజరయ్యారు. ఎలాగైనా ఎంపీపీ పదవిని దక్కించుకోవాలన్న ఉద్దేశంతో గెలిచిన టీడీపీ అభ్యర్ధులందరినీ విజయవాడలోని నోవా టెల్ హోటల్లో ఏర్పాటు చేసిన క్యాంప్‌నకు తరలించారు. ఆ తరువాత అక్కడి నుంచి వారిని సికింద్రాబాద్ తరలించారు. ఎంపీటీసీలకు బెదిరింపులు వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన ఇద్దరు బీసీ మహిళలను, మరికొందరు ఎంపీటీసీలను టీడీపీ వైపు తిప్పుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తూ బేరసారాలు కొనసాగిస్తున్నారు. ఇద్దరు బీసీ మహిళలకు రూ.50 లక్షలకు పైగా ఇస్తామంటూ టీడీపీ నేతలు ఆశ చూపినప్పటికీ వారు సున్నితంగా తిరస్కరించారు. నాయకుల బేరసారాలు ఫలించకపోవడంతో లోకేశ్ బృందం రంగంలోకి దిగింది. బీసీ మహిళా ఎంపీటీసీలకు, ఇతర సభ్యులకు వారి కుల పెద్దలతో ఫోన్లు చేయించి బేరసారాలు చేస్తున్నారు. మరోవైపు వారి బంధువులను ఇళ్లకు పంపించి బెదిరించే కార్యక్రమాలు చేపట్టారు. ఇంకోపక్క ‘భవిష్యత్‌లో మనకు ఇలాంటి అవకాశం రాదు. ఇప్పుడే డబ్బులు సంపాదించుకోవాలి, రేపు పదవి ఉంటుందో ఉండదో. పదవి లేకపోతే ఎవరూ మనవంక చూడరు. లోకేశ్ బాబుకు మద్దతు పలకండి. నాలుగేళ్ల తరువాత జగన్ ఉండడు. జగన్ లేకపోతే వైఎస్సార్ సీపీ ఉండదు’ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. అధికార పార్టీలో ఉన్నప్పటికీ మేమిచ్చిన డబ్బులు తీసుకుంటే మీరు ఎంపీపీ అయిన తరువాత అభివృద్ధి పనులు ఏం చేసినా సంతకానికి ఒక రేటు ఉంటుందంటూ ఆశ చూపిస్తున్నారు. వారి ప్రలోభాలకు లొంగని వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు తాము ఎట్టి పరిస్థితుల్లో పార్టీని వీడేది లేదని తెగేసి చెబుతున్నారు. శుక్రవారం వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యుడి కుటుంబ సభ్యులతో టీడీపీ నేతలు మాట్లాడిన ఆడియో లీక్ అయ్యింది. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అవినీతి సంపదతో నీతిబాహ్యమైన పద్ధతులతో దుగ్గిరాల ఎంపీపీ పదవిని దక్కించుకునేందుకు చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు ఛీదరించుకుంటున్నారు. -
నీ అంతు చూస్తా.. టీడీపీ నాయకుడి వీరంగం
ఎన్పీకుంట(అనంతపురం): మండలంలోని పి.కొత్తపల్లి పంచాయతీ సర్వసభ్య సమావేశంలో టీడీపీ నాయకుడు వీరంగం సృష్టించాడు. ఏకంగా పంచాయతీ కార్యదర్శిని చంపుతానని బెదిరించాడు. ఘటనకు సంబంధించి మన స్థాపం చెందిన పంచాయతీ కార్యదర్శులు పోలీసులను ఆశ్రయించారు. వివరాలు... పి.కొత్తపల్లి పంచాయతీ సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించారు. పంచాయతీ పరిధిలోని అల్లుగుంటివారిపల్లిలో ఇంటింటికీ కొళ్లాయి కనెక్షన్లు, ఫెర్రర్ కాలనీలో వేసిన సీసీ రోడ్లు, మల్లెంవారిపల్లి, హరిజనవాడలో తాగునీటి పథకం మోటారు మరమ్మతు పనులు, బ్లీచింగ్, శానిటేషన్ తదితర పనులపై రూపొందించిన తీర్మానంపై ఓటింగ్ చేపట్టారు. పది మంది సభ్యులు ఉన్న ఈ పంచాయతీలో సర్పంచ్, నలుగురు వార్డు సభ్యులు టీడీపీ మద్దతుదారులు ఉండగా, మరో ఆరుగురు సభ్యులు వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఉన్నారు. ఈ క్రమంలో ఆరుగురు సభ్యులు సీసీ రోడ్లు, కొళాయి కనెక్షన్లకు ఆమోదం తెలిపారు. మిగిలిన పనులకు ఆమోదం తెలపకపోవడంతో తీర్మానం వీగిపోయింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేనని సర్పంచ్ మల్లెం చంద్రకళ బావ, స్థానిక టీడీపీ నేత శ్రీరాములు నాయుడు, బంధువు భాస్కరనాయుడు సభ మధ్యలో ప్రవేశించి గందరగోళం సృష్టించారు. పంచాయతీ కార్యదర్శి హరీష్‌ని దుర్భాషలాడుతూ అంతు చూస్తానని బెదిరించాడు. కేసు నమోదు: ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం కాక, చంపుతానంటూ బెదిరించిన టీడీపీ నేత, మాజీ సర్పంచ్ శ్రీరాములు నాయుడు తీరును ఖండిస్తూ పి.కొత్తపల్లి పంచాయతీ కార్యదర్శి హరీష్‌తో కలిసి పలువురు కార్యదర్శులు గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఎస్ఐ వెంకటేశ్వర్లు శ్రీరాములునాయుడిపై 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
పేట్రేగిన టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు..
సాక్షి, అనంతపురం: టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వర్గీయులు ఆగడాలు మితిమీరిపోయాయి. టీడీపీ మద్దతుదారులకు ఓట్లు వేస్తేనే సాగు, తాగునీరు ఇస్తామని బెదిరింపులకు దిగారు. టీడీపీ ఓడిపోతే తమ భూముల నుంచి హంద్రీనీవా నీరు వదలమని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పేరు చెరువుకు నీరు కావాలంటే టీడీపీకి ఓట్లు వేయాలని హుకుం జారీ చేశారు. ఉరవకొండ నియోజకవర్గంలో ఓటర్లను పయ్యావుల వర్గీయులు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. కాగా, పంచాయతీ ఎన్నికల్లో తమకు పోటీ లేకుండా చేసుకునేందుకు ప్రత్యర్థి అభ్యర్థులను కడతేరుస్తామని పయ్యావుల కేశవ్ అనుచరులు.. బెదిరింపులకు దిగడంతో ఈ నెల 10న బాధితులు పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. చదవండి: అచ్చెన్నా ఒళ్లు దగ్గర పెట్టుకో.. విజయవాడ టీడీపీలో తారస్థాయికి విభేదాలు.. -
మాట వినకపోతే చంపేస్తాం.. బాబు పీఏ బెదిరింపులు..
కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. అధినేత పీఏ ఆదేశాలతో రెచ్చిపోతున్నారు. వైఎస్సార్సీపీ మద్దతుదారులపై బెదిరింపులకు దిగుతున్నారు. పోటీ నుంచి తప్పుకోవాలని అల్టిమేటం జారీ చేస్తున్నారు. మాట వినకుంటే హతమారుస్తామనే స్థాయికి దిగారు. దీంతో నామినేషన్ వేసిన అభ్యర్థులు భయాందోళనకు గురవుతున్నారు. తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సాక్షి, తిరుపతి: కుప్పంలో చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ ఆగడాలకు అంతే లేకుండా పోయింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా ఘనత వహించిన మనోహర్ తాజాగా పంచాయతీ ఎన్నికల్లోనూ దౌర్జన్యకాండ కొనసాగిస్తున్నాడు. టీడీపీకి వ్యతిరేకంగా నామినేషన్ వేసిన వారిని బెదిరిస్తున్నాడు. అందులో భాగంగా కుప్పం మండలం వి.మిట్టపల్లె పంచాయతీకి నామినేషన్ వేసిన వైఎస్సార్సీపీ అభిమాని అంజలికి హెచ్చరికలు జారీ చేశాడు. టీడీపీ మద్దతుతో పోటీచేస్తున్న శివలక్ష్మి భర్త మంజునాథ్‌తో కలిసి అంజలి ఇంటికి వెళ్లి మరీ దాడికి పాల్పడ్డాడు. నామినేషన్ ఉపసంహరించుకోకుంటే చంపేస్తామని బెదిరించాడు. దీనిపై శుక్రవారం బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. దందాల్లో ఆరితేరాడు చంద్రబాబు పీఏ మనోహర్ కుప్పం కేంద్రంగా పలమనేరు, మరి కొన్ని ప్రాంతాల్లో టీడీపీ వ్యవహారాలను చూస్తుంటాడు. చంద్రబాబు అండతో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ విషయంలో ప్రధానంగా రూ.1.6కోట్ల తిరుపతి గంగమ్మ ఆలయ నిధుల దుర్వినియోగం కేసుపై విచారణ సాగుతోంది. ఇదికాక పలు భూకుంభకోణాల్లో తన వంతు పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బెదిరింపుల పర్వం! నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభిమానుల ఏకగ్రీవమయ్యే పంచాయతీల్లో మనోహర్ డబ్బు ఎరవేసి అనామకులతో నామినేషన్ వేయిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అలాగే టీడీపీ మద్దతు అభ్యర్థులు బరిలో ఉన్నచోట్ల పోటీకి నామినేషన్ వేసిన వారిని బెదిరిస్తున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. సర్పంచ్ అభ్యర్థులను ఎంపిక చేయడం దగ్గర నుంచి ఆర్థిక వ్యవహారాల వరకు మనోహర్ చూసుకుంటున్నట్లు టీడీపీ నేతలే వెల్లడిస్తున్నారు. ఏదిఏమైనా మనోహర్ ఆగడాలు శ్రుతి మించుతున్నాయని కుప్పంవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: ఇదేం.. బరితెగింపు నాయనా..!) నిబంధనలు ఉల్లంఘించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే -
ఇదేం బరితెగింపురా నాయనా..!
నాదెండ్ల (చిలకలూరిపేట): గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం కనపర్రులో శుక్రవారం టీడీపీ కార్యకర్త బరితెగించాడు. ఓ అంగన్వాడీ టీచర్ చేతిలో ఉన్న పోస్టల్ బ్యాలెట్ పత్రాన్ని టీడీపీ కార్యకర్త సోమేపల్లి అశోక్ బలవంతంగా లాక్కున్నాడు. ఆమెను బెదిరించి టీడీపీ మద్దతిస్తున్న అభ్యర్థి పేరు దగ్గర టిక్ చేసి తిరిగి ఇచ్చేశాడు. ఘటనపై ఆమె గ్రామ పెద్దలకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారించి కేసు నమోదు చేస్తానని ఎస్ఐ కేవీ నారాయణరెడ్డి చెప్పారు. (చదవండి: నిబంధనలు ఉల్లంఘించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే) బాబుకు జగన్ ఫోబియా -
నామినేషన్ వేస్తే చంపేస్తాం!
రేణిగుంట(చిత్తూరు జిల్లా): మండలంలోని జి.పాళెం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్ధమైన ఝాన్సీరాణి అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు నేరుగా ఇంటికే బెదిరించారు. నామినేషన్ వేస్తే హతమారుస్తామని హెచ్చరించారు. గాజులమండ్యం పోలీసుల కథనం మేరకు.. జి.పాళెం పంచాయతీ సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు వైఎస్సార్సీపీ అభిమాని నారాయణరెడ్డి భార్య ఝాన్సీరాణి ఆసక్తి చూపించారు. గురువారం నామినేషన్ వేసేందుకు సన్నాహాలు చేసుకున్నారు. అయితే బుధవారం సాయంత్రం నలుగురు వ్యక్తులు నేరుగా ఆమె ఇంటికి వెళ్లి నామినేషన్ వేయవద్దని సూచించారు. మాట వినకుండా నామినేషన్ వేస్తే చంపేస్తామని బెదిరించారు. దీంతో భయాందోళనకు గురైన ఝాన్సీరాణి వెంటనే ఎంపీడీఓ కార్యాలయ ఏఓ హరిబాబుకు సమాచారం అందించింది. ఆయన సూచన మేరకు బాధితురాలు గాజులమండ్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. (చదవండి: కోరి తెచ్చుకుంటే కొంప ముంచాయి!) పేట్రేగిన టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు.. -
పేట్రేగిన టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు..
ఉరవకొండ: ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అనుచరుల ఆగడాలు మితిమీరిపోయాయి. పంచాయతీ ఎన్నికల్లో తమకు పోటీ లేకుండా చేసుకునేందుకు ప్రత్యర్థి అభ్యర్థులను కడతేరుస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. దీనిపై బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది. మేజర్ పంచాయతీలో ఆధిపత్య పోరు.. పెద్ద కౌకుంట్ల మేజర్ పంచాయతీలో దశాబ్దాలుగా టీడీపీ ఆధిపత్య పోరు సాగిస్తోంది. 14 వార్డులున్న పెద్ద కౌకుంట్ల పంచాయతీలో చిన్న కౌకుంట్ల, వై.రాంపురం, మైలారంపల్లి, రాచేపల్లి గ్రామాలు మజారా గ్రామాలుగా ఉన్నాయి. ఎప్పుడు పంచాయతీ ఎన్నికలు వచ్చినా.. ఏకపక్షంగా టీడీపీ వారే అన్ని స్థానాలు దక్కించుకునే వారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాల పట్ల పలువురు ఆకర్షితులై.. ఈ సారి పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఆధిపత్యానికి చెక్ పెట్టాలని భావించారు. ఇందులో భాగంగా 14 వార్డులకు గాను 10 వార్డుల్లో అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. మిగిలిన నాలుగు వార్డుల్లో ప్రత్యర్థి అభ్యర్థులు నామినేషన్ వేయకుండా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. చివరి నిమిషంలో టీడీపీ నాయకుల కుట్రలు భగ్నం చేస్తూ ఈ నాలుగు వార్డుల్లోనూ పోటీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. విత్‌డ్రాలకు నేటితో ఆఖరు.. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు విత్‌డ్రా చేసుకునేందుకు గురువారంతో గడువు ముగియనుంది. ఈ నెల 17న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే తమ ఆధిపత్యం నిలబెట్టుకునేందుకు కుట్ర రాజకీయాలకు టీడీపీ తెరలేపింది. ప్రత్యర్థి అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని విత్‌డ్రా చేసుకోవాలని, లేకుంటే కిడ్నాప్ చేసి, అంతు చూస్తామంటూ ప్రత్యక్ష బెదిరింపులకు దిగారు. మాట వినకపోతే... పెద్ద కౌకుంట్ల పంచాయతీ 11వ వార్డు అభ్యర్థిగా రాచేపల్లి గ్రామానికి చెందిన పెన్నోబులేసు నామినేషన్ వేశాడు. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు శంకరయ్య, వేలూరి నారాయణస్వామి (పయ్యావుల అనుచరులు) బుధవారం ఉదయం పెన్నోబులేసు ఇంటికి వెళ్లి నామినేషన్ విత్‌డ్రా చేసుకోవాలని హెచ్చరించారు. దీనిపై అభ్యర్థి కుటుంబసభ్యులు నిరాకరించడంతో రెచ్చిపోయిన వారు.. ‘మా మాట వినకపోతే నీ కొడుకును కిడ్నాప్ చేసి అంతు చూస్తాం’ అంటూ పెన్నోబిలేసు తల్లిదండ్రులను బెదిరించారు. ఘటనతో భయభ్రాంతులకు గురైన పెన్నోబిలేసు కుటుంబసభ్యులు.. తమకు శంకరయ్య, నారాయణస్వామి నుంచి ప్రాణహాని ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. (చదవండి: జగన్ ప్రభంజనాన్ని ఆపలేరు) గెలవలేక టీడీపీ నేతల అరాచకాలు -
మాజీ ఎమ్మెల్యే వరద స్వగ్రామంలో ఉద్రిక్తత
సాక్షి, ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సొంత పంచాయతీ కామనూరు గ్రామంలో ఆదివారం సాయంత్రం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వరద సోదరులు నంద్యాల రాఘవరెడ్డి, భార్గవరెడ్డి, హనుమంతరెడ్డితోపాటు మరికొంతమంది కలిసి వైఎస్సార్సీపీ నాయకుడు నంద్యాల బాలవరదరాజులరెడ్డి ఇంటిపైకెళ్లి దౌర్జన్యం చేశారు. సెల్‌ఫోన్ లాక్కుని మహిళలను దూషించి భయాందోళనకు గురిచేశారు. ఓటింగ్ ఎలా జరుగుతుందో చూస్తామని బెదిరించారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. గత 40 ఏళ్లుగా కామనూరు గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరగకుండా వరదరాజులరెడ్డి వర్గీయులు అడ్డుపడుతూ వచ్చారు. 1,700 ఓట్లు గల పంచాయతీలో కామనూరు, రాధానగర్, నక్కలదిన్నె గ్రామాలున్నాయి. ప్రస్తుతం సర్పంచ్ పదవిని బీసీ కేటగిరీకి కేటాయించడంతో వైఎస్సార్ అభిమాని షేక్ కరీమూన్ నామినేషన్ వేశారు. సర్పంచ్‌తోపాటు మొత్తం 8 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తమ పంచాయతీలోనే ఎన్నికలు జరిపేలా చేస్తారా అని వరద వర్గీయులు గుంపులుగా వెళ్లి దౌర్జన్యానికి పాల్పడ్డారు. -
జాగ్రత్త.. ఎవడక్కడ.. ఎవరాయ్ అక్కడ..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం /నరసన్నపేట: ‘జాగ్రత్త.. ఇలాగే ఉంటుందనుకుంటున్నారా.. లిస్టు ఎక్కిపోతే మీరు శంకరిగిరి మాన్యాల్లో ఉంటారు జాగ్రత్త... ఎవడక్కడ.. ఎవరాయ్ అక్కడ.. ఏంటీ మీరు డిస్కస్ చేసేది.. నువ్వు డిస్కస్ చేసేదేంటి? మీ స్థాయి ఎంత ..మీరు ఎంత’ అని నరసన్నపేట సీఐ, ఎస్‌లను ఉద్దేశించి మాజీ విప్, టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ అధ్యక్షుడు కూన రవికుమార్ నోరు పారేసుకున్నారు. దీంతో పోలీసులతో పాటు సీఐ, ఎస్ఐలు నిశ్చేష్టులయ్యారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదా స్పై ఫిర్యాదు చేయడానికి వచ్చిన టీడీపీ నాయకులు మూకుమ్మడిగా పోలీస్ స్టేషన్లోకి వచ్చేందుకు ప్రయత్నించగా కోవిడ్ నిబంధనల మేరకు ముగ్గురే లోపలకు వచ్చి ఫిర్యాదు ఇవ్వాలంటూ పోలీసులు గేట్‌ను క్లోజ్ చేశారు. దీంతో కోపోద్రిక్తులైన కూన రవికుమార్ తదితరులు పోలీసు లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా కూన రవికుమార్ మరోమారు తన నిజ స్వరూపం ప్రదర్శించారు. అయితే పోలీసులు సంయమనం పాటించారు. దీంతో వారంతా గేట్ వద్దే బైటాయించి పోలీసులపై దుర్భాషలాడారు. (చదవండి: ఆగని టీడీపీ నేత ‘కూన’ ఆగడాలు) కూన రవికుమార్కి ఇదేమీ కొత్త కాదు. నోటి దురుసుతో మాట్లాడటం ఆయనకు అలవాటైపోయింది. ఆ మధ్య ఎంపీడీఓను, ఆ తర్వాత పంచాయతీ విస్తరణా«ధికారులు, వీఆర్ఓలను, తదుపరి తహసీల్దార్‌ను ఇష్టారీతిన తిట్టారు. ఇప్పటికే ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. బెయిల్‌పై బయట ఉన్నారు. కానీ ఆయన తీరులో మాత్రం మా ర్పు రాలేదు. ఇన్ని కేసులు, ఆరోపణలు ఉన్నా చంద్రబాబు ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టారు. దీంతో ఏకంగా పోలీసులపైనే విరుచుకుపడ్డారు. (చదవండి: అంతే వీరు.. మారదు తీరు) కూన బాగోతమిది పొందూరులో టీడీపీ కార్యాలయంగా నడుస్తున్న తన భవనాన్ని ఖాళీ చేయాలని కోరినందుకు ఆ ఇంటి యజమానికి ఫోన్లోనే వార్నింగ్ ఇచ్చారు. అంతకుముందు పింఛన్ల విషయంలో తన మాట వినలేదని మండల కార్యాలయంలోనే సరుబుజ్జిలి ఎంపీడీఓ, ఈఓపీఆర్డీని బెదిరించారు. పనుల విషయంలో తాను చెప్పినట్టు వినకపోతే కురీ్చలో కూర్చున్నా లాక్కుని వచ్చి తంతాను నా కొడకల్లారా అంటూ రెచ్చిపోయారు. ఒక బిల్లు విషయంలో సరుబుజ్జిలి ఇన్చార్జి ఈఓపీఆర్డీపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. అంతేకాకుండా మట్టిని అక్రమంగా తరలించిన వాహనాలు విడిచిపెట్టలేదని పొందూరు తహసీల్దార్‌ను బెదరింపులతో పాటు బ్లాక్‌మెయిల్‌కు దిగారు. తాజాగా పోలీసులతోనూ ఇష్టారీతిన మాట్లాడారు. కరోనా నిబంధనల దృష్ట్యా గేటు వేస్తే వీరంగం సృష్టించారు. చివరికి ఉన్నతాధికారుల అనుమతి, శాంతి భద్రతల దృష్ట్యా కొద్ది మందిని పోలీసులు లోపలికి అనుమతించడంతో ఫిర్యాదు ఇచ్చి వెనుదిరిగారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్యే అశోక్, పార్టీ సీనియర్ నాయకులు కళా వెంకటరావు, మాజీ ఎమ్మెల్లే బగ్గు రమణమూర్తి, చౌదరి బాబ్జీలు ఉన్నారు. -
ఆగని టీడీపీ నేత ‘కూన’ ఆగడాలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్ తన పంథా మార్చుకోవడం లేదు. ఇప్పటికే మూడు పర్యాయాలు ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి అరెస్టై... బెయిళ్లతో బయట తిరుగుతున్న రవికుమార్.. ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు. నోటిని అదుపులో పెట్టుకోకుండా ఫోనుల్లోనే బెదిరింపులకు దిగుతున్నారు. ఇక తన మాట వినని వారు ఎదురుగా కనబడితే ఇంకెంత దురుసుగా వ్యవహరిస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. తనను ఎవరేం చేయలేరు... మహా అయితే కేసులు పెడతారు... బెయిల్‌పై వచ్చేయవచ్చు అనే ధోరణితో రెచ్చిపోతున్నారు. జిల్లాలో వివాదాస్పద నాయకుల్లో తన తర్వాతే ఎవరైనా అన్నట్టుగా కూన రవికుమార్ వ్యవహరిస్తున్నారు. ఇంటి యజమానికి బెదిరింపు పొందూరులో టీడీపీ కార్యాలయంగా నడుస్తున్న తన భవనాన్ని ఖాళీ చేయాలని కోరినందుకు ఆ ఇంటి యజమానికి ఫోన్లోనే వారి్నంగ్ ఇచ్చారు. ‘నేను ఖాళీ చేయను. నువ్వు మర్యాదగా బిహేవ్ చేస్తే పరవాలేదు, నువ్వేగాని అక్కడేమైనా చేస్తే చాలా సీరియస్‌గా ఉంటుంద’ని బెదిరించా రు. తన ఇబ్బందుల గురించి ఆలోచించమని గుడ్ల మోహ న్ అడిగితే ‘నాకనవసరం, నీ గురించేంటి తొక్క.. ఆలోచించేద’ని కూన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘సరే మీ ఇష్టం సార్’ అని గుడ్ల మోహన్ అంటూ ఉండగా ‘నువ్వు గాని మర్యాద తప్పి ప్రవర్తిస్తే నేనూ మర్యాద తప్పుతాన’ని మళ్లీ బెదిరించారు. ‘మీరు ఏది చేస్తే అది చేసేయండి.. చంపేస్తే చంపేయండి సార్’ అని గుడ్ల మోహన్ అనడంతో ‘అంతే చేస్తాను. నువ్వు గనక బిల్డింగ్ దగ్గరకు వస్తే అంతే చేస్తా’ అని ఫోన్ కాల్ ముగించారు. మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఖాళీ చేయనని చెబుతున్న భవనం ఇదే.. (ఇన్సెట్) గుడ్ల మోహన్, భవన యజమాని ఈ ఫోన్ సంభాషణ చూస్తుంటే రవికుమార్‌కు ఏదైనా ఇస్తే.. మళ్లీ తిరిగి తీసుకోవడం కష్టమే’ అన్న భావన కలిగించడంతోపాటు ఇచ్చినదేదైనా వదులుకోవల్సిందే అన్నట్టుగా స్పష్టమవుతోంది. పొరపాటున ఎవరైనా తనకు గాని, తన అండ ఉన్న వారికి గాని ఇళ్లు గాని ఏదైనా చేబదులు గానీ ఇస్తే అంతే సంగతులు అనుకునే పరిస్థితి కనబడుతోంది. మొన్నటి వరకు మండల స్థాయి అధికారులను బెదిరించిన సంఘటనలు చూశాం. ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల బెదిరింపులకు కూడా దిగుతున్నారు. ఆయనెప్పుడు ఎవర్ని ఏమంటారో.. ఏం చేస్తారో.. తెలియని పరిస్థితి నెలకొంది. ప్రతి ఒక్కరూ తాను చెప్పినట్టుగానే నడుచుకోవాలని హుకుం జారీ చేస్తున్నారు. అధికారంలో లేనప్పుడే ఇలా వ్యవహరిస్తున్నారంటే.. అధికారంలో ఉన్నప్పుడు ఇంకెంత రెచ్చిపోయేవారో అర్థం చేసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. అది నోరు కాదు... పింఛన్ల విషయంలో తన మాట వినలేదని మండల కార్యాలయంలోనే సరుబుజ్జిలి ఎంపీడీఓ, ఈఓపీఆర్డీకి వార్నింగ్ ఇచ్చారు. ఆఫీసులోనే ‘తలుపులు వేసి మరీ బాదేస్తాను. నన్ను ఎవరూ ఆపలేరు. చెట్టుకు కట్టి కాల్చేస్తాను. చెప్పింది చేయకపోతే నేనెంటో చూపిస్తానం’టూ బెదిరించారు. పనుల విషయంలో తాను చెప్పినట్టు వినకపోతే ‘కురీ్చలో కూర్చున్నా లాక్కుని వచ్చి తంతాను నా కొడకల్లారా’ అని పంచాయతీ కార్యదర్శులను కూన రవికుమార్ భయపెట్టారు. ఒక బిల్లు విషయంలో సరుబుజ్జిలి ఇన్చార్జి ఈఓపీఆర్డీపై అంతెత్తున లేచారు. ‘నీకెంత ఒళ్లు బలిసిందిరా నా కొడకా... నిన్ను గొయ్యి తీసి పాతకపోతే నా పేరు కూన రవికుమారే కాదు. నీ బతుకెంతరా నా కొడకా...’ అంటూ తీవ్ర ఆగ్రహావేశాలు చూపించారు. మొన్నటికి మొన్న మట్టిని అక్రమంగా తరలించిన వాహనాలు విడిచిపెట్టలేదని పొందూరు తహశీల్దార్‌కు బెదరింపులతోపాటు బ్లాక్‌మెయిల్‌కు దిగారు. ‘పట్టుకున్న వాహనాలు విడిచి పెట్టకపోతే లంచం డిమాండ్ చేశావని నీ మీద కంప్లయింట్ చేస్తాను. చెప్పు ఎంత కావాలి... పది వేలు కావాలా, లక్ష కావాలా ఎంత కావాలి... ప్రాసెస్ గురించి నాకు చెబుతున్నావా?’ అంటూ రాయలేని భాషలో ఒక మండల మేజి్రస్టేట్గా ఉన్న పొందూరులో పనిచేసిన తహసీల్దార్‌ను ఇష్టారీతిన మాట్లాడారు. తాజాగా ఒకప్పుడు తనకు సన్నిహితునిగా ఉన్న గుడ్ల మోహన్ అనే వ్యక్తి తన భవనాన్ని ఖాళీ చేయమన్నందుకు నోటికొచ్చినట్టు మాట్లాడి బెదిరింపులకు దిగారు. తనతోపాటు లేరని, ప్రస్తుతం వైఎస్సార్సీపీలో ఉన్నారనే అక్కసో మరేంటో తెలియదు గాని భవనం ఖాళీ చేయమన్నందుకు దురుసుగా మాట్లాడారు. ఈ రకంగా తరచూ బెదిరింపులకు దిగడంతో స్థానికులు భయపడుతున్నారు. కూన రవికుమార్ అంటేనే హడలెత్తిపోతున్నారు. ఉద్యోగులైతే మరింత ఆందోళన చెందుతున్నారు. ఎన్ని కేసులు నమోదైనా తన తీరు మారలేదని బాధితులు వాపోతున్నారు. తప్పులు చేసి, దౌర్జన్యాలకు పాల్పడి.. పోలీసులు చర్య తీసుకోబోతే.. ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఎదురుదాడికి దిగడం, హల్చల్ చేయడం రవికుమార్‌తోపాటు ఆ పార్టీ వర్గాలకు అలవాటైపోయింది. కూన రవికుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు పొందూరు: మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ తనను ఫోన్లో బెదిరించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుడ్ల మోహన్ ఫిర్యాదు చేశారని ఎస్సై కొల్లి రామకృష్ణ తెలిపారు. మండల కేంద్రంలో గుడ్ల మోహన్‌కు చెందిన భవనంలో చాలా ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కొనసాగుతోందని చెప్పారు. గతంలో టీడీపీలో ఉన్నప్పటి నుంచి కార్యాలయం ఉందని, కొన్ని నెలల క్రితం తాను వైఎస్సార్సీపీలో చేరానని అందుకే పార్టీ కార్యాలయం రంగులు మార్చేందుకు ప్రయత్నించామని ఫిర్యాదులో ఉంది. భవనానికి రంగులు మారుస్తుండగా కూన రవికుమార్ ఫోన్ చేసి బెదిరించారని, బిల్డింగ్ వద్దకు వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారని ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు చేశారు. -
అడ్డంగా దొరికి.. ఎదురుదాడి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తహసీల్దార్‌పై నోరు పారేసుకుని అడ్డంగా దొరికిపోయిన టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్ తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఎదురు దాడికి దిగారు. మూడు రోజులుగా పరారీలో ఉన్న రవికుమార్ బుధవారం ఉదయం పొందూరు పోలీసు స్టేషన్లో లొంగిపోయే సమయంలో ప్రత్యారోపణలకు దిగారు. తన మాట వినని వారిని అవినీతి అధికారులని, తానెవరినీ వదలనని అంటూనే.. వారికి అండగా నిలుస్తున్న ఉద్యోగ సంఘాలను టార్గెట్ చేశారు. వాస్తవానికి గోరింట గ్రామంలోని రామసాగరం చెరువులో మట్టి అక్రమ తరలింపు వ్యవహారంలోనే కాదు అంతకుముందు కూడా తహసీల్దార్ రామకృష్ణపై బెదిరింపులకు దిగారు. చెరువు వ్యవహారంతోపాటు మరో రెండు విషయాల్లో తహసీల్దార్ తమకు అడ్డంకిగా నిలిచారని టార్గెట్ చేసుకున్నారు. దారికి తెచ్చుకోవడమే లక్ష్యంగా... కూన రవికుమార్ తొలి నుంచి ఉద్యోగులపై దుందుడుకు వైఖరిని ప్రదర్శిస్తూనే ఉన్నారు. భయపెట్టి దారికి తెచ్చుకోవాలని చూస్తున్నారు. వీఆర్ఓలు, ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ, తహసీల్దార్... ఇలా ప్రతి ఒక్కరినీ బెదిరించి తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలనుకుంటారు. అధికారం లేకపోయినా తన మాటే చెల్లుబాటు కావాలని, తాను చెప్పినట్టు చేయాలని హుకుం జారీ చేయడం అలవాటుగా మారిపోయింది. ఎవరైతే తన మాటను వినరో వారిని టార్గెట్ చేసుకుని తొలుత లంచాలు ఎర చూపడం, ఇంకా లెక్క చేయకపోతే బూతు పురాణాలకు దిగడం, అంతకీ లొంగకపోతే అవినీతి ముద్ర వేసి పబ్బం గడుపు కోవాలని చూస్తున్నారు. గతంలో సరుబుజ్జిలి ఎంపీడీఓ విషయంలోనూ, ఈఓపీఆర్డీ విషయంలోనూ, వీఆర్ఓల విషయంలోనూ ఇదేరకంగా వ్యవహరించి నోటికొచ్చినట్టు తిట్టి ఆడియోల ద్వారా దొరికిపోయారు. అయినా తన వైఖరి మార్చుకోకుండా ఎన్ని కేసులు పెట్టినా ఏమవుతుందని, బెయిల్‌పై వచ్చేస్తానన్న ధీమాతో నోటికి పనిచెబుతూనే ఉన్నారు. చివరికి రవికుమార్ బెదిరింపులతో ఉద్యోగులంతా భయపడిపోతున్నారు. వారి అనుచరులు ఏం చేయిస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇది తొలిసారి కాదు.. తహసీల్దార్ రామకృష్ణను బెదిరించడం ఇది తొలిసారి కాదు. దీనికి ముందు రెండు ఘటనలు జరిగాయి. వాటిలోనూ తహసీల్దార్‌ను దురుసుగా మాట్లాడారన్న వాదనలున్నాయి. కూన రవికుమార్ స్వగ్రామమైన పెనుబర్తిలో తన ఇంటి వెనక రెండు ఎకరాల గ్రామ కంఠం భూమి ఉంది. ఆ గ్రామంలో మరెక్కడా ప్రభుత్వ స్థలం లేకపోవడంతో 31మంది పేదల ఇళ్ల స్థలాల కోసం ఆ గ్రామ కంఠాన్ని ప్రతిపాదించారు. ఖాళీగా ఉన్న స్థలం కావడంతో సామాజిక పోరంబోకుగా గుర్తించి పేదల స్థలాల కోసం కేటాయించేందుకు గ్రామంలో తీర్మానం కూడా చేశారు. కానీ, రవికుమార్ వెనకుండి తన అనుయాయులు కొందర్ని రంగంలోకి దించి, ఆ భూమి తమ స్వాధీనంలో ఉందని చెప్పి అడ్డు తగలడం ప్రారంభించారు. ఉపాధి నిధుల కింద చేపట్టిన చదును పనులను అడ్డుకున్నారు. దీంతో వారందరికీ తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు. వాటికి సమాధానం ఇవ్వకుండా ఈ విషయంలో కోర్టుకు వెళ్లారు. ఇందులో తాము జోక్యం చేసుకోలేమని, నోటీసులు ఇచ్చిన తహసీల్దార్‌కు సమాధానం ఇచ్చుకోవాలని కోర్టు స్పష్టం చేయడంతో కంగుతిన్నారు. దీంతో అధికారులు ఆ గ్రామ కంఠాన్ని పేదల ఇళ్ల స్థలాల కోసం సిద్ధం చేసే పనిలో పడ్డారు. కూన రవికుమార్‌కు ఇదంతా రుచించలేదు. తహసీల్దార్‌ను లక్ష్యంగా చేసుకుని నోరు పారేసుకోవడం ప్రారంభించారు. ఇక, ఆ తర్వాత పెనుబర్తి పంచాయతీ పరిధిలో అలమాజీపేటలో ప్రభుత్వ నిధులతో వేస్తున్న రోడ్డుకు అడ్డంగా రవికుమార్ అనుయాయులు గోడ కట్టేశారు. దీని విషయంలోనూ తహసీల్దార్ ముందుకెళ్లడంతో ఆ సమయంలో కూడా రవికుమార్ బెదిరింపులకు దిగారు. తాజాగా గోరింట గ్రామంలోని రామసాగరం చెరువులో రవికుమార్ సోదరుడికి చెందిన రెండు జేసీబీలు, నాలుగు టిప్పర్లతో మట్టిని అక్రమంగా తవ్వుతుండగా వీఆర్ఓ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు తహసీల్దార్ అక్కడికి చేరుకుని వాహనాలను సీజ్ చేశారు. దీన్ని జీరి్ణంచుకోలేని కూన రవికుమార్ ఏకంగా ఫోన్లో ఇష్టారీతిన విరుచుకుపడ్డారు. కూన రవికుమార్ దుర్భాషలతోపాటు.. కొంతమంది తరుచూ వెంబడిస్తుండటం, ఫోన్లో సతాయించడంతో భరించలేక టీడీపీ నేత నోటి దురుసు ఆడియోను తహసీల్దార్ బయటపెట్టారు. వాస్తవంగా రామసాగరం చెరువులో ఉపాధి హామీ పథకం కింద కూలీల చేత మట్టి తవ్వకాలు జరపాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా కూన రవి సోదరుడు, మరికొంతమంది జేసీబీతో తవ్వకాలు జరిపి, లారీల ద్వారా అక్రమంగా తరలిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చెరువుల్లో జేసీబీతో తవ్వకాలు చేపట్టకూడదు. అందుకు భిన్నంగా చేసి ఇప్పుడు చెరువులో మట్టిని ఎందుకు తరలించకూడదని, తరలిస్తే తప్పేముందని వితండవాదానికి దిగుతున్నారు. అంతేకాకుండా తహసీల్దార్ అవినీతి పరుడని, అవినీతిపరులైన ఉద్యోగులను వదలనని, వారికి ఉద్యోగ సంఘాలు వత్తాసు పలుకుతున్నాయని ఎదురు దాడికి దిగడం చర్చనీయాంశమైంది. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు కారణాలు వెతుకుతున్నారని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. అధికారులంటే అంత చులకనా? పొందూరు: తహసీల్దార్ రామకృష్ణను బెదిరించిన కేసులో బుధవారం పోలీసుల ఎదుట లొంగిపోయిన టీడీపీ నాయకుడు కూన రవికుమార్ ప్రభుత్వ అధికారులను ఉద్దేశించి మాట్లాడిన మాటల పట్ల నిరసన వ్యక్తమవుతోంది. పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం, అధికారులపై తప్పుడు ఆరోపణలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల గౌరవం లేకుండా మాట్లాడారు. తహసీల్దార్‌ను ఏకవచనంతో సంబోధించడాన్ని అందరూ ఆక్షేపిస్తున్నారు. రవికుమార్ తహసీల్దార్ రామకృష్ణపై చేసిన వ్యాఖ్యలను పలువురు ఖండిస్తున్నారు. అడ్డంగా దొరికి ఎదురుదాడికి దిగడం తగదని, క్షమాపణ చెబితే పరువు నిలుస్తుందని హితవు పలుకుతున్నారు. గతంలో గ్రామ కంఠం భూమి విషయంలో, నిర్మాణంలో ఉన్న రోడ్డుకు అడ్డంగా తన అనుయాయులు కట్టిన గోడకు అభ్యంతరం పెట్టిన విషయంలో తహసీల్దార్‌పై కోపం పెంచుకొని.. ఇప్పుడు అతనిపై అవినీతి ఆరోపణలు చేయడం తగదని వారంటున్నారు. పొందూరు స్టేషన్లో లొంగిపోతూ రవికుమార్ తహసీల్దార్ రామకృష్ణపై విమర్శలు చేశారు. అవినీతి ఆరోపణలున్న అతనిని ఉద్యోగ సంఘాలు వెనకేసుకు రావడం తగదని సమర్థించుకోజూశారు. -
పీఎస్‌లో లొంగిపోయిన కూన రవికూమార్
-
లొంగిపోయిన టీడీపీ నేత కూన రవికుమార్
సాక్షి, శ్రీకాకుళం: టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్ పొందూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. తహసీల్దార్‌ను ఫోన్లో దుర్భాషలాడిన కూన రవికుమార్, మూడురోజుల నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం గోరింట గ్రామంలో రామసాగరం చెరువులోని మట్టిని లోడ్ చేస్తున్న వాహనాలను సీజ్ చేసినందుకు తహసీల్దార్ తామరాపల్లి రామకృష్ణపై దురుసుగా ప్రవర్తించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కూన రవికుమార్, అతని సోదరులు, అనుచరులపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. వాహనాలను విడిచిపెట్టాలని.. లేకుంటే లంచం డిమాండ్ చేసినట్టు ఫిర్యాదు చేస్తానని కూన రవికుమార్ తహసీల్దార్‌ను బెదిరించినప్పటి ఆడియో క్లిప్పింగ్ ఆదివారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇది కూన రవికుమార్ నోటి నుంచి జాలు వారిన బూతు పురాణం.. మట్టిని అక్రమంగా తరలించిన వాహనాలు విడిచిపెట్టు. లేకపోతే లంచం డిమాండ్ చేశావని నీ మీద కంప్లైంట్ చేస్తాను. వెధవా... నువ్వు సీజ్ చేశావ్. కానీ కంప్లైంట్ చేయలేదని నాకు తెలుసు. చెప్పు ఎంత కావాలి... పది వేలు కావాలా, లక్ష కావాలా ఎంత కావాలి... ప్రాసెస్ గురించి నాకు చెబుతున్నావా? ఇది పొందూరు మండల మేజిస్ట్రేట్‌కు బెదిరింపు.. నీకెంత ఒళ్లు బలిసిందిరా నా కొడకా... నిన్ను గొయ్యి తీసి పాతకపోతే నా పేరు కూన రవికుమారే కాదు. నీ బతుకెంతరా నా కొడకా... ఈ ఏడాది మార్చి 1వ తేదీన సరుబు జ్జిలి ఇన్చార్జి ఈఓపీఆర్డీగా పనిచేస్తున్న వ్యక్తికి ఫోన్లో హెచ్చరిక ఆఫీసులో తలుపులు వేసి మరీ బాదేస్తాను. నన్ను ఎవరూ ఆపలేరు. చెట్టుకు కట్టి కాల్చేస్తాను. చెప్పింది చేయకపోతే నేనెంటో చూపిస్తా... ఆ మధ్య సరుబుజ్జిలి ఎంపీడీఓ, ఈఓపీఆర్డీలకు ఇచ్చిన వార్నింగ్ చెప్పినట్టు వినకపోతే కుర్చీలో కూర్చున్నా.. లాక్కుని వచ్చి తంతాను నా కొడకల్లారా... పంచాయతీ కార్యదర్శులపై తిట్ల దండకం.. -
‘కూన’ కోసం గాలింపు
మట్టిని అక్రమంగా తరలించిన వాహనాలు విడిచిపెట్టు. లేకపోతే లంచం డిమాండ్ చేశావని నీ మీద కంప్లైంట్ చేస్తాను. వెధవా... నువ్వు సీజ్ చేశావ్. కానీ కంప్లైంట్ చేయలేదని నాకు తెలుసు. చెప్పు ఎంత కావాలి... పది వేలు కావాలా, లక్ష కావాలా ఎంత కావాలి... ప్రాసెస్ గురించి నాకు చెబుతున్నావా? ఇది పొందూరు మండల మేజిస్ట్రేట్‌కు బెదిరింపు.. నీకెంత ఒళ్లు బలిసిందిరా నా కొడకా... నిన్ను గొయ్యి తీసి పాతకపోతే నా పేరు కూన రవికుమారే కాదు. నీ బతుకెంతరా నా కొడకా... ఈ ఏడాది మార్చి 1వ తేదీన సరుబు జ్జిలి ఇన్చార్జి ఈఓపీఆర్డీగా పనిచేస్తున్న వ్యక్తికి ఫోన్లో హెచ్చరిక ఆఫీసులో తలుపులు వేసి మరీ బాదేస్తాను. నన్ను ఎవరూ ఆపలేరు. చెట్టుకు కట్టి కాల్చేస్తాను. చెప్పింది చేయకపోతే నేనెంటో చూపిస్తా... ఆ మధ్య సరుబుజ్జిలి ఎంపీడీఓ, ఈఓపీఆర్డీలకు ఇచ్చిన వార్నింగ్ చెప్పినట్టు వినకపోతే కుర్చీలో కూర్చున్నా.. లాక్కుని వచ్చి తంతాను నా కొడకల్లారా... పంచాయతీ కార్యదర్శులపై తిట్ల దండకం.. ఇది టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్ నోటి నుంచి జాలు వారిన బూతు పురాణం. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కూన రవికుమార్ ఆగడాలకు అడ్డు అదుపూ లేకుండాపోతోంది. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తున్నారు. అంతం చేస్తానని భయపెడుతున్నారు. ‘ఏమవుతుంది.. మహా అయితే కేసు పెడతారు... బెయిల్‌పై వచ్చేస్తాను’ అన్న ధీమాతో నిర్భీతిగా వ్యవహరిస్తున్నారు. తాజా ఘటన మరింత ఆశ్చర్యం కల్గిస్తుంది. అందితే జుత్తు లేకపోతే కాలు అన్నట్టుగా బెదిరింపులతో దారికొస్తే ఫర్వాలేదు... లేదంటే లంచం పేరుతో ఇరికించవచ్చన్న ధోరణి చూసి ఉద్యోగులు విస్తుపోతున్నారు. గోరింట గ్రామంలోని రామసాగరం చెరువులో రవికుమార్ సోదరుడికి చెందిన రెండు జేసీబీలు, నాలుగు టిప్పర్లతో మట్టిని అక్రమంగా తవ్వుతుండగా వీఆర్ఓ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు తహసీల్దార్ అక్కడికి చేరుకుని వాహనాలను సీజ్ చేశారు. దీన్ని జీర్ణించుకోలేని కూన రవికుమార్ ఏకంగా పొందూరు తహసీల్దార్ రామకృష్ణను బెదిరించారు. ఇప్పటికే రెండు కేసుల్లో అరెస్టయి బెయిల్‌పై వచ్చారు. అయినా ఆయనలో మార్పు రాలేదు. ఉద్యోగులను, అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తాను చెప్పినట్టు వినకపోతే దుర్భాషలాడి బెదిరించడం టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్‌కు అలవాటైపోయింది. కూన రవికుమార్ రౌడీయిజాన్ని చూసి ఉద్యోగులు వణికిపోతున్నారు. ఆయన నుంచి ప్రాణహాని ఉందని ఆందోళన పడుతున్నారు. రౌడీషీట్ తెరవాలని ఉద్యోగుల డిమాండ్ కూన రవికుమార్ వ్యవహారం జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆయన రాజకీయ నాయకుడా ? వీధి రౌడీయా అని పెదవి విరుస్తున్నారు. బాధ్యత గల నాయకుడెవరూ బెదిరింపులకు దిగరని, రౌడీయిజం చేద్దానుకునే వారే చంపుతాను, పాతేస్తాను, వెదవా అంటూ బెదిరిస్తారని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగులను బెదిరిస్తూ, భయాందోళనకు గురిచేస్తున్న కూన రవికుమార్ దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని, ఇలాంటి వ్యక్తిపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని, గతంలో ఇచ్చిన బెయిల్ రద్దు చేసి జైలుకు పంపించాలని ఉద్యోగులంతా డిమాండ్ చేస్తున్నారు. అజ్ఞాతంలో రవికుమార్.. కేసు నమోదు పొందూరు తహసీల్దార్‌ను బెదిరించిన ఘటనపై వచ్చిన ఫిర్యాదు మేరకు కూన రవికుమార్, ఆయన సోదరుడు కూన వెంకట సత్యారావు, చంద్రారెడ్డి మరో ఇద్దరిపైనా పొందూరు పోలీసులు కేసు నమోదు చేశారు. 353, 506 రెడ్‌విత్ 34సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. కూన రవికుమార్ పట్టుకోవడానికి ఆమదాలవలస, శ్రీకాకుళంలో గాలింపు చేపట్టారు. కాకపోతే అప్పటికే రవికుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కూన రవికుమార్ ఇళ్లల్లోనూ, బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు. కానీ, రవికుమార్ ఆచూకీ దొరకలేదు. ఎవరో సన్నిహితుల ఇళ్లల్లోనే దాక్కుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ‘కూన’ కోసం గాలింపు ఆమదాలవలస: టీడీపీ నాయకుడు, మాజీ విప్ కూన రవికుమార్, అతని అనుచరులు తనను ఫోన్లో బెదిరించినట్టు పొందూరు పూర్వ తహసీల్దారు టి.రామకృష్ణ పొందూరు పోలీస్‌స్టేషన్‌కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు ప్రారంభించారు. అరెస్టుకు రంగం సిద్ధమవడంతో రవికుమార్ సహా నలుగురు వ్యక్తులు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ కేసు విచారణలో భాగంగా సోమవారం జె.ఆర్.పురం సీఐ మల్లేశ్వరరావు, పొందూరు ఎస్ఐ డి.విజయ్‌కుమార్, పోలీసు సిబ్బంది ఆమదాలవలస పట్టణంలో దర్యాప్తు చేశారు. కేసులో అరెస్ట్ చేయాల్సిన చంద్రారెడ్డి అనే టీడీపీ కార్యకర్త, కాంట్రాక్టర్ ఆమదాలవలస పట్టణంలోని కొత్తకోటవారి వీధిలో నివాసముంటున్నాడన్న సంగతి తెలుసుకున్న పోలీసులు ఆయన ఇంటి వద్దకు వచ్చి తనిఖీ చేశారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో సుమారు గంట సమయంపాటు ఇంటి వద్ద వేచి ఉండి తిరిగి వెళ్లిపోయారు. ఆమదాలవలస సీఐ ప్రసాదరావు పట్టణంలోని టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులను పిలిపించి విచారణ జరిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఉపేక్షించబోమని హెచ్చరించారు. తెల్లారేసరికే పరార్ శ్రీకాకుళం: పొందూరు తహసీల్దార్‌ను బెదిరించిన కేసులో అరెస్టు చేసేందుకు నగరంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న కూన రవికుమార్ ఇంటికి సోమవారం తెల్లవారుజామునే పోలీసులు వెళ్లారు. అయితే అప్పటికే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రవికుమార్ కుటుంబ సభ్యులు పోలీసులను అడ్డగించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము వచ్చామని పోలీసులు చెప్పి ఇల్లంతా వెతికారు. గతంలో ఓ ఎంపీడీవోను, మరికొందరిని దుర్భాషలాడినప్పుడు పోలీసులు రవికుమార్‌ను అరెస్టు చేసేందుకు ఆయని ఇంటికి వెళ్లిన సందర్భంగా జరిగిన తంతే సోమవారం కూడా జరిగింది. అప్పట్లో నెల రోజులకి పైగా పోలీసుల కళ్లుకప్పి రవికుమార్ అజ్ఞాతంలో ఉన్న విషయం తెలిసిందే. -
ప్రాణహాని ఉంది..రక్షణ కల్పించండి
పంజగుట్ట: ఆంధ్రప్రదేశ్‌లోని సినీ రంగంలో అవకాశాలు రావాలంటే తమ నవ్యాంధ్ర ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్‌లో సభ్యులై ఉండాలని, తనకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత సన్నిహితుడని ఆయన సూచన మేరకే చాంబర్‌ను స్థాపించినట్టు చెప్పుకోవడమేగాక.. సుమారు 2 వేల మంది నుంచి రూ.2 కోట్లకు పైగా వసూలు చేసి ప్రశ్నించినందుకు తమపైనే అక్రమ కేసులు పెడుతున్నారని బాధితులు వాపోయారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చీకటిపల్లి సాగర్, చరణ్ ప్రభాకర్, గోవిందరాజు, మహాలక్ష్మి, శాంతిప్రియ తమ గోడును వెళ్లబోసుకున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2016లో సుద్దపల్లి వెంకటేశ్వర్రావు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు సూచనల మేరకే ఏపీలో కూడా ఫిలిం చాంబర్ ఏర్పాటు చేసినట్లు చెప్పాడన్నారు. దానికి నవ్యాంధ్ర ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్‌గా పేరు పెట్టామని ప్రచారం చేసుకున్నాడు. చంద్రబాబుతో దిగిన ఫొటోలు, ఆయనతో మాట్లాడిన వీడియోలు, అతను ఇచ్చిన ప్రకటనలు చూసి సినీ రంగంలో అవకాశాలు దొరుకుతాయన్న ఆశతో తాము సభ్యత్వం కింద రూ.2001, కార్డు పేరుతో రూ.50 వేల నుండి రూ.లక్ష, అవకాశాల కోసమని లక్షల రూపాయలు వసూలు చేశారన్నారు. వెంకటేశ్వర్రావు శ్రీనగర్‌కాలనీ కవిత అపార్ట్మెంట్లో కార్యాలయాన్ని తెరిచి ఇక్కడ నుంచే కార్యకలాపాలు సాగించాడన్నారు. కార్డు తీసుకుంటే 10 లక్షల ఆరోగ్య బీమా, చంద్రబాబుతో చెప్పి అమరావతిలో డబుల్ బెడ్రూం సౌకర్యం కల్పిస్తామని నమ్మబలికాడన్నారు. సినీనటి కవిత కూడా ఇతడి భాధితురాలే అని, ఆమె కూడా ఇతనిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. వెంకటేశ్వర్రావు మోసాలను గ్రహించి గుంటూరు, విజయవాడ, తిరుపతి, బంజారాహిల్స్, సైబర్ క్రైమ్ పోలీసులతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదు చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌ను కలిసి పూర్తి ఆధారాలతో అతను చేస్తున్న మోసాలగూర్చి వివరించామని, ఆయన వెంటనే స్పందించి అతనిపై కేసు నమోదు చేయించి, కారు సీజ్ చేసి, బ్యాంకు అకౌంట్లపై ఆరా తీçస్తున్నారన్నారు. కాగా తనవెనుక పెద్దలు ఉన్నారని భయపెడుతున్నాడరి బాధితులు పేర్కొన్నారు. కాగా గతనెల 16న వెంకటేశ్వర్రావు అమీర్‌పేటలో తమకు కనిపించగా అతడిని పంజగుట్ట పోలీసులకు అప్పగించామన్నారు. అప్పటికే ఇతని కోసం నగరంలో వెదుకుతున్న తిరుపతి పోలీసులు వచ్చి అతడిని తిరుపతికి తీసుకువెళ్లి రిమాండ్ చేశారన్నారు. కాగా వెంకటేశ్వర్రావు బయటకు వచ్చి అతడిపై తాము దాడి చేశామని పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో అక్రమ కేసు పెట్టాడని వాపోయారు. అతడి నుంచి తమకు ప్రాణహాని ఉందని, తమలా ఇంకెవ్వరూ మోసపోవద్దని, ప్రభుత్వం రక్షణ కల్పించాలని బాధితులు కోరారు. -
‘నాకు ప్రచారం చేసేవారికి ప్రాణహాని’
బెంగళూరు: తన తరఫున ఎన్నికల్లో ప్రచారం చేసే వారికి ప్రాణహాని కలిగే అవకాశం ఉందని సినీ నటి, మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుమలత అంబరీష్ ఆరోపించారు. ఆదివారం ఆమె మండ్యాలో మీడియాతో మాట్లాడారు. తనకు మద్దతు తెలిపిన వారందరినీ టార్గెట్ చేసి వేధింపులకు గురి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తన తరఫున ఎన్నికల్లో ప్రచారం చేసిన సినీ నటులు భవిష్యత్‌లో పశ్చాత్తాపపడాల్సి ఉంటుందని కొందరు రాజకీయనేతలన్నారు. దీనిలో ఉన్న ఆంతర్యమేమిటని ఆమె ప్రశ్నించారు. ఈ ప్రకటనలో తన మద్దతుదారులకు హాని తలపెట్టాలనే ఉద్దేశం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. -
నెల్లూరులో.. బ్యాలెట్‌కు బెదిరింపులు
నెల్లూరు(పొగతోట): ప్రజాక్షేత్రంలో గెలవలేమని గుర్తించిన టీడీపీ నేతలు ఎన్నికల్లో విజయానికి తొక్కని అడ్డదారులు లేవు. ఓటర్ల ప్రలోభాలకు తెరతీసిన అధికార పక్షం తాజాగా పోస్టల్ బ్యాలెట్‌నూ వదల్లేదు. ఉద్యోగులను బెదిరించి, ప్రలోభ పెట్టేందుకు సైతం వెనుకాడడం లేదు. ఉదయగిరి, ఆత్మకూరుల్లో అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి ఉద్యోగులు టీడీపీకి ఓటు వేసేలా చేసుకున్నారన్న ఆరోపణలు వినిపించాయి. ఇదిలా ఉంటే ఎన్జీఓ సంఘం రాష్ట్ర నాయకుడు అశోక్‌బాబు గురువారం నెల్లూరులో మకాం వేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అధికార పార్టీకి అనుకూలంగా వేసేలా ఉద్యోగ సంఘాలపై ఒత్తిడి తీసుకు వచ్చారు. ఆయన చర్యలను వ్యతిరేకించిన వారిపై బెదిరింపులకు పాల్పడినట్టు సమాచారం. నిబంధనలకు గాలికొదిలేసి అశోక్‌బాబు వ్యవహరించడంపై తీవ్రస్థాయిలో వి మర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక మంత్రి నా రాయణ మరో అడుగు ముందుకేశారు. నగరంలోని అంగన్వాడీలను, మెప్మా సిబ్బందిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చి తనకు అనుకూలంగా ఓట్లు వేసుకునేందుకు యత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారిని బెది రింపులకు సైతం పాల్పడుతున్నట్టు సమాచారం. ఎన్నికల అధికారులు జోక్యం చేసుకోవాలని ప్రజలు, వివిధ రాజకీయ పక్షాలు కోరుతున్నాయి. ఇక రెండు రోజులే.. పోస్టల్ బ్యాలెట్ తీసుకునేందుకు రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నెల 6వ తేదీలోపు పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంది. ఆర్ఓ కేంద్రాలు పోస్టల్ బ్యాలెట్ తీసుకునే ఉద్యోగులతో కిక్కిరిసిపోయాయి. జిల్లా వ్యాప్తంగా 24 వేల మంది ఎన్నికల విధులకు హాజరుకానున్నారు. వీరంతా పోస్టల్ బ్యాలెట్ తీసుకోవాల్సి ఉంది. గురువారం వరకు జిల్లా వ్యాప్తంగా 5,590 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ తీసుకున్నారు. అందులో 3,679 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకుని ఆర్ఓ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన బాక్స్‌లో వేశారు. ఇంకా సుమారు 18 వేల మందికిపైగా ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంది. దరఖాస్తులు చేసుకున్న ఉద్యోగులకు నేరుగా కాని లేదా పోస్టల్ ద్వారా కాని బ్యాలెట్ పంపిస్తారు. పోస్టల్ బ్యాలెట్ కోసం ఉద్యోగులు ఆర్ఓ కార్యాలయాలకు చేరుకోవడంతో రద్దీ పెరిగిపోయింది. ఆర్ఓ కార్యాలయాల వద్ద టీడీపీ అభ్యర్థుల వర్గీయులు చేరి, పోస్టల్ బ్యాలెట్‌ను రూ.2500 నుంచి రూ.4 వేలకు ఇవ్వాలని ప్రలోభాలు పెడుతున్నారు. అలా ఇవ్వమన్న వారిని సంబంధిత శాఖల అధికారుల ద్వారా బెదిరిస్తున్నారు. దీంతో కొంత మంది ఈ చిరాకులు భరించలేక బ్యాలెట్ ఇచ్చి వెళ్లిపోతున్నారు. అందరికీ తెలిసిన ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించి పోస్టల్ బ్యాలెట్ సేకరిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ తీసుకునే ప్రాంతాల్లో రాజకీయ నాయకులు ఉండకూడదని ఎన్నికల అధికారులు ఆదేశించినా వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికార పార్టీ నాయకులు పోస్టల్ బ్యాలెట్ ఇవ్వని ఉద్యోగులపై ఒత్తిళ్లు చేయిస్తు దౌర్జన్యాలకు దిగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్‌కు రెండు రోజులే సమయం ఉండడంతో ఉద్యోగులు పరుగులు తీస్తున్నారు. నియోజకవర్గం పోస్టల్ బ్యాలెట్ తీసుకున్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించినఉద్యోగులు కావలి 394 155 ఆత్మకూరు 348 69 కోవూరు 318 292 నెల్లూరు సిటీ 793 787 నెల్లూరు రూరల్ 970 715 సర్వేపల్లి 821 659 గూడూరు 703 0 సూళ్లూరుపేట 753 753 వెంకటగిరి 275 164 ఉదయగిరి 215 85 మొత్తం 5,590 3,679 -
సూదికొండ క్వారీపై బెదిరింపులు
శ్రీకాకుళం, కంచిలి: మండలంలోని మండపల్లి పంచాయతీ బంజిరినారాయణపురం గ్రామానికి ఆనుకొని ఉన్న సూదికొండలో క్వారీ అనుమతులపై గ్రామస్తులు విభేదిస్తున్న నేపథ్యంలో సంబంధిత క్వారీ కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో పోలీసులు, అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. అనుమతులు వచ్చిన క్వారీని అడ్డుకోవడం చట్టరీత్యా నేరమని, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలని సూచించినట్లు చెబుతున్నారు. సూదికొండ వద్దకు సోంపేట సీఐ పి.తిరుమలరావు, కంచిలి ఎస్ఐ ఎం.హరికృష్ణ, నలుగురు కానిస్టేబుళ్లు, మండల సర్వేయర్ నాగేశ్వరరావు, టెక్కలి మైన్స్ అధికారి రవికుమార్, క్వారీ అనుమతులు పొందిన కాంట్రాక్టర్ సతీష్‌రెడ్డిలు సోమవారం వెళ్లి గ్రామస్తులను పిలిపించి మాట్లాడారు. క్వారీ తవ్వకాలను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించగా, తవ్వకాలు చేపడితే జీవనోపాధిని కోల్పోతామని చెప్పినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. దీనిపై తీరుమారకపోతే వేరేవిధంగా ఉంటుందని హెచ్చరించినట్లు గ్రామస్తులు రాష్ట్ర మానవహక్కుల వేదికకు ఫిర్యాదు చేశారు. దీంతో మానవహక్కుల వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు బీన ఢిల్లీరావు సోమవారం రాత్రి బంజిరినారాయణపురం గ్రామానికి వెళ్లి గ్రామస్తులను పరామర్శించారు. అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గొద్గని, గ్రామస్తుల సమ్మతి లేకుండా కొండలో క్వారీ తవ్వకాలకు అనుమతించడం సరికాదని, ఈ విషయమై నిరసన తెలియజేస్తున్న గ్రామస్తులను బెదిరించడం ప్రజాస్వామ్య రుద్ధమని బీన ఢిల్లీరావు విలేకర్లతో పేర్కొన్నారు. మానవహక్కుల వేదిక ఈ అంశంపై పూర్తి నిబద్ధతతో వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. గ్రీన్ట్రిబ్యునల్లో ఫిర్యాదు చేస్తాం.. బంజరినారాయణపురం సూదికొండలో అడ్డగోలుగా ఇచ్చిన అనుమతుల్ని రద్దుచేయించే అంశంపై గ్రీన్‌ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు రాష్ట్ర మానవ హక్కుల వేదిక ఉపాధ్యక్షుడు కె.వి.జగన్నాథరావు పేర్కొన్నారు. గ్రామస్తులను పోలీసులు, అధికారులు బెదిరించడం సరికాదన్నారు. ఇక్కడికి కూతవేటు దూరంలో రూ.20కోట్లు వెచ్చించి ఎన్.టి.ఆర్.సుజలస్రవంతి పథకం మదర్ప్లాంట్ను భూగర్భజలాలు సమృద్ధిగా ఉన్నాయనే కారణంతో ఏర్పాటు చేశారని, లక్షల్లో మాత్రమే ఆదాయం వచ్చే గ్రానైట్ తవ్వకాలకోసం ఇంతటి మహత్తర పథకాన్ని కూడా నాశనం చేయడం తగదన్నారు. పరిశీలనకే వెళ్లాం: సీఐ తిరుమలరావు బంజిరినారాయణపురం కొండలో తవ్వకాల విషయమై వివిధ పత్రికల్లో సోమవారం కథనాలు రావడంతో క్షేత్రస్థాయిలో విషయం తెలసుకోవడానికి మాత్రమే గ్రామానికి వెళ్లామని సోంపేట సీఐ పి.తిరుమలరావు విలేకరులకు చెప్పారు. క్వారీ తవ్వకాలకు అనుమతులున్నప్పుడు ఎవరు అడ్డుకున్నా చట్టరీత్యా నేరమని, అలా కాదని అభ్యంతరాలుంటే న్యాయపరంగా వెళ్లవచ్చని స్పష్టం చేశారు. ఈ విషయాన్నే గ్రామస్తులకు తెలియజేశామని పేర్కొన్నారు. -
చిన్నాచితకా మనిషిని కాను
పశ్చిమగోదావరి, ఏలూరు (మెట్రో): పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నామంటూ ఉన్నతాధికారుల వద్ద గొప్పలు.. ఏదైనా చిన్న పొరపాటు జరిగితే దానిని కార్యదర్శులపైకి నెట్టి వారిపై చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు.. వాస్తవాలు రాసే సాక్షి విలేకరికి బెదిరింపులు.. నేను ఏదైనా చేస్తానంటూ హూంకరింపులు.. ఇవీ పంచాయతీల్లో ప్రజల సొమ్మును అప్పనంగా ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేస్తున్న ‘చిన్న’ అధికారి లీలలు. అప్పనంగా ప్రైవేటు సంస్థలకు.. జిల్లా పంచాయతీ కార్యాలయంలో షాడో కలెక్టర్‌గా వ్యవహరిస్తున్న డివిజనల్ స్థాయిచిన్న అధికారి లీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఈ అధికారి పంచాయతీలను సుందరంగా తీర్చిదిద్దుతున్నామంటూ ఉన్నతాధికారుల వద్ద గొప్పలు పోతున్నారు. పారిశుధ్యం నిమిత్తం ప్రవేశపెట్టిన ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్‌లను ఎక్కువ ధరకు కొని నిధులు గోల్మాల్ చేసిందే కాక.. వాటిని స్కానింగ్ చేసేందుకు ఏర్పాటు చేసిన సంస్థకు అప్పనంగా నిధులు దోచిపెడుతున్నారు. పంచాయతీల్లో పారిశుధ్య పనులు చేయకున్నా.. ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించకున్నా.. ఆర్ఎఫ్ఐడి ట్యాగ్‌లను మాత్రం తప్పనిసరిగా స్కానింగ్ చేయాలంటూ కార్యదర్శులపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. ఒక్కో స్కానింగ్‌కు రూ.3.50 చొప్పున అప్పనంగా కట్టబెడుతున్నారు. కార్యదర్శులంటే ‘చిన్న’చూపు ఈ అధికారి కార్యదర్శులంటే చిన్నచూపు చూస్తున్నారు. ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్లు స్కానింగ్ చేయని కార్యదర్శులపై విరుచుకుపడుతున్నారు. పంచాయతీల్లో చెత్త సేకరించే సిబ్బంది లేకపోవడం, గ్రీన్వెహికల్ సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడం వల్ల పారిశుధ్య పనులు సాగడం లేదు. అయినా ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్లు స్కాన్ చేయాలని కార్యదర్శులను ఆదేశిస్తున్నారు. మాట వినని కార్యర్శులను దుర్భాషలాడుతున్నారు. పంచాయతీలపై ప్రైవేటు వ్యక్తుల పెత్తనం జిల్లాలో ప్రతి మండలంలోనూ ఈ అధికారి ప్రైవేటుగా శానిటరీ ఇన్స్పెక్టర్ అంటూ కొంతమందిని నియమించి వారి ద్వారా కార్యదర్శులపై పెత్తనం చెలాయిస్తున్నారు. అంతే కాకుండా డివిజనల్ పంచాయతీ అధికారులనూ అజమాయిషీ చేస్తున్నారు. దీంతో ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తున్నామో అర్థంకాని పరిస్థితి పంచాయతీ క్షేత్రస్థాయి అధికారుల్లో నెలకొంది. ‘ప్రత్యేక’ పోస్టుతో మెమోలు ఈ అధికారి ఏ జిల్లాలోనూ లేని విధంగా పరిశుభ్రతపై ప్రత్యేక పోస్టును సృష్టించుకుని కార్యదర్శులకు మెమోలు జారీ చేయడమూ అధికారయంత్రాంగంలో చర్చనీయాంశమవుతోంది. అయినా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంచాయతీ ఉద్యోగులకు ఎన్జీఓల అండ ఈ అధికారి వల్ల జిల్లాలో ఎక్కడైనా పంచాయతీ ఉద్యోగులు ఇబ్బందులు పడితే తమ దృష్టికి తీసుకురావాలని, ఏ ఉన్నతాధికారి వల్ల ఇబ్బందులకు గురికావద్దని జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ కార్యదర్శి చోడగిరి శ్రీనివాస్ చెప్పారు. ఉద్యోగులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ‘సాక్షి’కి బెదిరింపులు తన లీలలపై ‘సాక్షి’లో కథనాలు రావడంతో చిన్న అధికారికి కోపమొచ్చింది. ఆదివారం ‘సాక్షి’ విలేకరికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. ‘మీరు రాసుకుంటే.. నాలాంటి మెంటలోడు ఉంటాడు ఏదైనా చేయొచ్చుగా.. నేను ఏదైనా చేస్తా’ అంటూ హెచ్చరించారు. దూషణలకు దిగారు. -
పచ్చటి నంద్యాలకు.. రక్తపు మరకలు
♦ ప్రశాంతతకు నెలవైన ప్రాంతంలో అలజడి ♦ మూడేళ్లుగా అదుపు తప్పిన శాంతిభద్రతలు ♦ ‘ఆళ్లగడ్డ రాజకీయం’ అరువొస్తోందా? ♦ భయాందోళన చెందుతున్న ప్రజలు నంద్యాల: నంద్యాల.. ప్రశాంతతకు మారుపేరు. పచ్చదనానికి చిరునామా. కోనసీమను తలపించే వాతావరణం. పైరుగాలులతో పరవశించే పల్లెలు..వ్యాపారాలు, విద్యాసంస్థలతో కళకళలాడే పట్టణం. ఇదంతా 2014 ఎన్నికలకు ముందు మాట. నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నంద్యాలలో అలజడి రేగుతోంది. గొడవలు, బ్లాక్ మెయిలింగ్, బెదిరింపులు రాజకీయాలు, హత్యాయత్నాలు క్రమేణా పెరిగిపోతున్నాయి. ఇలాంటివి నంద్యాల ప్రజలు గతంలో ఎన్నడూ చూసి ఎరుగరు. ఆళ్లగడ్డ నాయకులు నంద్యాల వాకిట్లో అడుగుపెట్టడంతో ఇక్కడి పరిస్థితులు ఆందోళనకరంగా తయారయ్యాయని ప్రజలు అంటున్నారు. దీనికంతటికీ ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీయేనని మండిపడుతున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ ఇక్కడ ఓటు కూడా లేని ఆళ్లగడ్డకు చెందిన భూమా బ్రహ్మానందరెడ్డిని తన అభ్యర్థిగా బరిలోకి దించింది. దీంతో నియోజకవర్గంలో అలజడి ఎక్కువైంది. ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం చంద్రబాబు ఇక్కడి ప్రజలను భయపెట్టి గెలిచేందుకు మంత్రులను, ఎమ్మెల్యేలను, ఇతర కీలక నేతలను నంద్యాలలోనే తిష్ట వేయించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలను చూసి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దివంగత ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు గతంలో నంద్యాల పార్లమెంటు స్థానం నుంచి రెండు సార్లు పోటీ చేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఆయన ఉప ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో ప్రధాన మంత్రిగా ఉన్నారు. అయినా ఎవరి ప్రచారం వారు చేసుకున్నారే తప్ప ఎలాంటి గొడవలు, ఘర్షణలు, అధికార దుర్వినియోగం వంటివి లేవు. ఒక్క చిన్న కేసు కూడా నమోదు కాలేదంటే ఎన్నికలు ఎంత ప్రశాంతంగా జరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఈ ఉప ఎన్నిక కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. టీడీపీ నాయకులు పోలీసులను, అధికారులను అడ్డం పెట్టుకొని ఓటర్లను భయపెట్టి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే ప్రలోభాలకు తెరలేపారు. నోటిఫికేషన్ వచ్చాక బెదిరింపులూ మొదలుపెట్టారు. ప్రశాంత జీవనం సాగిస్తున్న వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు, నాయకుల ఇళ్లలో అర్ధరాత్రి సమయాల్లో పోలీసులతో సోదాలు చేయించారు. ఇళ్లలో మారణాయుధాలు, డబ్బులు ఉన్నాయంటూ పోలీసులు హల్చల్ చేసి..వారిని భయభ్రాంతులకు గురిచేశారు. ఇంతటితో ఆగకుండా కేసులు పెట్టించడం, తలలు పగలగొట్టడం, హత్యలు చేయడానికి సైతం వెనుకాడకపోవడం వంటి సంఘటనలతో నంద్యాల ఉలిక్కి పడుతోంది. పట్టణంలో 40వేల మంది ఆర్యవైశ్యులు, 68వేల మంది ముస్లింలు కేవలం వ్యాపారాలనే నమ్ముకుని జీవిస్తున్నారు. వీరిలో సైతం ప్రస్తుతం భయాందోళనలు మొదలయ్యాయి. ఎన్నికల్లో ఓడిపోతే ‘మీ అంతు చూస్తామం’టూ టీడీపీ నేతలు బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఆళ్లగడ్డ నాయకులు నంద్యాలకు ఎందుకు వచ్చార్రా బాబూ.. మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారం’టూ వారు వాపోతున్నారు.