‘అంతుచూస్తాం.. దిక్కున్న చోట చెప్పుకో’.. రెచ్చిపోయిన టీడీపీ నేతలు | TDP Leaders Threaten On Women Sarpanch In Chittoor District | Sakshi
Sakshi News home page

‘అంతుచూస్తాం.. దిక్కున్న చోట చెప్పుకో’.. రెచ్చిపోయిన టీడీపీ నేతలు

Dec 23 2021 9:49 AM | Updated on Dec 23 2021 10:33 AM

TDP Leaders Threaten On Women Sarpanch In Chittoor District - Sakshi

టీడీపీ నేతలు ధ్వంసం చేసిన బ్యానర్‌ 

మహిళా సర్పంచ్‌పై టీడీపీ మూకలు దాడులకు తెగబడ్డాయి. ఫ్లెక్సీల తొలగింపుపై ప్రశ్నించినందుకు పచ్చతమ్ముళ్లు విచక్షణ, మర్యాద మరచి అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.

కేవీబీపురం(చిత్తూరు జిల్లా): మహిళా సర్పంచ్‌పై టీడీపీ మూకలు దాడులకు తెగబడ్డాయి. ఫ్లెక్సీల తొలగింపుపై ప్రశ్నించినందుకు పచ్చతమ్ముళ్లు విచక్షణ, మర్యాద మరచి అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వివరాలు.. అంజూరు సర్పంచ్‌ శ్రీజయ ప్రజలకు నూతన సంవత్సరం, సంక్రాతి శుభాకాంక్షలు తెలుపుతూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. దీన్ని సహించలేని స్థానిక టీడీపీ నేత శివయ్య తన అనుచరులతో బ్యానర్లను ధ్వంసం చేయించారు. విషయం తెలుసుకున్న సర్పంచ్‌ శ్రీజయ సంబంధిత వ్యక్తులను ప్రశ్నించారు.

చదవండి: బోడికొండపై 'దండు'యాత్ర..

రెచ్చిపోయిన టీడీపీ నేతలు శివయ్య, మోహన్, అనుచరులు దిక్కున చోట చెప్పుకోమంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. మంగళవారం అర్ధరాత్రి సర్పంచ్‌ ఇంటిపై రాళ్లతో దాడులకు దిగారు. తమకు అడ్డొస్తే చంపేస్తామని బెదిరింపులకు దిగారు. ఈ క్రమంలో జయశ్రీ కింద పడిపోయారు. ఆమె భర్త సురేష్‌ టీడీపీ మూకలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల రంగ ప్రవేశంతో అల్లరి మూకలు పరారయ్యాయి. ఈ ఘటనకు పాల్పడిన వారిలో మాతయ్య అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. శివయ్య, మోహన్‌ల ప్రోద్భలంతోనే తాను బ్యానర్లను తొలగించినట్లు పోలీసులకు తెలిపాడు. టీడీపీ నేతల నుంచి తమకు రక్షణ కల్పించాలని సర్పంచ్‌ జయశ్రీ పోలీసులను రాత పూర్వకంగా కోరారు. దీనిపై ఎస్‌ఐ నాగార్జునరెడ్డిని వివరణ కోరగా.. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement