సాక్షి, తిరుపతి: చంద్రబాబు సర్కార్ అరాచకాలు పెరిగిపోతున్నాయని టీటీడీ మాజీ ఛైర్మన్, వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. శేఖర్‌రెడ్డి భవనం కూల్చి లోబరుచుకున్నారు. కార్పొరేటర్ డాక్టర్ అనీష్ రాయల్‌ను కూటమి నేతలు బెదిరిస్తున్నారు. 8వ డివిజన్ కార్పొరేటర్ మునిరామిరెడ్డిని బిల్డింగ్ కూల్చి వేస్తామని కూటమి నేతలు బెదిరిస్తున్నారు.
‘‘మంత్రి అనగాని సత్య ప్రసాద్ నీచ రాజకీయాలు చేస్తున్నారు. లోకేష్ రాజ్యాంగం రాష్ట్రంలో నడుస్తోందంటూ మంత్రి అనగాని కార్పొరేటర్లను బెదిరిస్తున్నారు. సనాతన ధర్మం కాపాడతానని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ ఎక్కడ ఉన్నారు?. తిరుపతి రాజకీయాలు పవిత్రంగా ఉండటం మీకు ఇష్టం లేదా?. మీ కూటమి నాయకులే మిమ్మల్ని అసహ్యించుకుంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు పాలన ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు.
..చంపడం ఒక్కటే మిగిలింది.. కార్పొరేటర్లు బెదిరింపులకు పాల్పడుతున్నారు. పోలీసులను కూడా బెదిరిస్తున్నారు. విప్ జారీ చేశాం. విప్ ధిక్కరిస్తే పదవులు కూడా కోల్పోతారు. ఆర్థికపరంగా దెబ్బతీస్తూ.. కార్పొరేటర్లను బెదిరిస్తున్నారు. విప్‌ను ధిక్కరిస్తే కచ్చితంగా కార్పొరేటర్లు పదవులు కోల్పోతారు. ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకు వెళ్తాం. హౌస్ మోషన్ పిటిషన్ కూడా హైకోర్టులో దాఖలు చేశాం. డిప్యూటీ మేయర్ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేలా..వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లకు పోలీసు భద్రత కల్పించాలని కోరాం’’ అని భూమన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment