
సాక్షి, అనంతపురం: టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వర్గీయులు ఆగడాలు మితిమీరిపోయాయి. టీడీపీ మద్దతుదారులకు ఓట్లు వేస్తేనే సాగు, తాగునీరు ఇస్తామని బెదిరింపులకు దిగారు. టీడీపీ ఓడిపోతే తమ భూముల నుంచి హంద్రీనీవా నీరు వదలమని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పేరు చెరువుకు నీరు కావాలంటే టీడీపీకి ఓట్లు వేయాలని హుకుం జారీ చేశారు. ఉరవకొండ నియోజకవర్గంలో ఓటర్లను పయ్యావుల వర్గీయులు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. కాగా, పంచాయతీ ఎన్నికల్లో తమకు పోటీ లేకుండా చేసుకునేందుకు ప్రత్యర్థి అభ్యర్థులను కడతేరుస్తామని పయ్యావుల కేశవ్ అనుచరులు.. బెదిరింపులకు దిగడంతో ఈ నెల 10న బాధితులు పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
చదవండి: అచ్చెన్నా ఒళ్లు దగ్గర పెట్టుకో..
విజయవాడ టీడీపీలో తారస్థాయికి విభేదాలు..