Panchayat elections
-
మిగిలింది రిజర్వేషన్ల లెక్కే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. స్థానిక సంస్థల్లో అమలు చేసే రిజర్వేషన్ల లెక్క తేలడమే మిగిలింది. బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం ఏర్పాటైన డెడికేటెడ్ బీసీ కమిషన్ సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. సోమవారం ఈ మేరకు ప్రత్యేక సమావేశం జరగనుంది. కమిషన్ నివేదికలో చేసిన సిఫార్సులకు అనుగుణంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.మరోవైపు ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలనే నిబంధన ఉండటంతో.. ఆ మేరకు రిజర్వేషన్లకు ఖరారు చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,848 గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ స్థానాలు 5,817, ఎంపీపీలు 570, జెడ్పీటీసీ స్థానాలు 570 ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామ పంచాయతీలన్నీ ఎస్టీలకు రిజర్వ్ చేస్తారు. మిగతా ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయిస్తారు. సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి మొత్తం రిజర్వేషన్లు 50శాతానికి మించకుండా ఉండేలా చర్యలు చేపట్టనున్నట్టు అధికారులు చెబుతున్నారు. మరోవైపు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సైతం స్థానిక ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి ప్రాథమిక నివేదికను సిద్ధం చేసుకుంది.బీసీ రిజర్వేషన్లు 23శాతంలోపే..!రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రకారం.. రాష్ట్ర జనాభాలో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ) 17.43 శాతం, షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) 10.45 శాతం ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి, అదే సమయంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదు. దీనితో ఎస్సీలకు 17.43 శాతం, ఎస్టీలకు 10.45 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి. వీటిని మినహాయిస్తే.. బీసీలకు 22.12 శాతమే రిజర్వేషన్లు అందుతాయి. ఇందులో డెడికేటెడ్ బీసీ కమిషన్ ఇచ్చే నివేదికకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అయితే కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చేలా చర్యలు చేపట్టాలనే డిమాండ్ వస్తోంది.రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నద్ధంస్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నద్ధమైంది. ఈ నెల 10న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఓటర్ల జాబితాలను జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లలో పరిశీలన కోసం ప్రదర్శించాలని ఆదేశిస్తూ.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ చైర్మన్ రాణీ కుముదిని ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు. గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితాలను ఎంపీటీసీ, జెడ్పీటీసీ నియోజకవర్గాల వారీగా విభజించేలా చర్యలు తీసుకో వాలని సూచించారు. ఎన్నికల నిర్వహణపై 11న జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. పోలింగ్ అధికారులు, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు, ఎన్నికల సిబ్బందికి శిక్షణ కూడా కొనసాగుతోంది. ఈనెల 15న పోలింగ్ స్టేషన్ల తుది జాబితాలను ప్రచురించనున్నారు. మొత్తంగా ఎన్నికలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. -
స్థానిక సమరానికి సై
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 15వ తేదీలోపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న అంచనాలతో కేడర్‌ను కదిలించే పనిలో పడ్డాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ అధిష్టానాలు గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు కార్యాచరణ రూపొందించుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల్లో కూడా కదలిక కనిపిస్తోంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వారంలోపే ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఏర్పాట్లు చేసుకుంటోంది. బీసీ రిజర్వేషన్ల ఖరారు దిశలో డెడికేటెడ్ బీసీ కమిషన్ కూడా నేడు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.కాంగ్రెస్‌కు కీలకం: అధికార కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎన్నికలు కీలకం మారాయి. రాష్ట్రంలో పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసుకోవడం, తమ ఏడాది పాలనపై ప్రజలు సంతృప్తిగానే ఉన్నారని నిరూపించుకునేందుకు ఈ ఎన్నికలు కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ నెలరోజులుగా ఈ ఎన్నికల కోసం కసరత్తు చేస్తోంది. అభ్యర్థులను గెలిపించే బాధ్యతను ఎమ్మెల్యేల భుజాలపై పెట్టింది. కనీసం 80 శాతం స్థానాలు గెలిపించాలని ఎమ్మెల్యేలకు సీఎం, పీసీసీ అధ్యక్షుడు నిర్దేశించారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు ఎన్నికల బిజీలో పడిపోయారు. ప్రభుత్వ వ్యతిరేకతపై బీఆర్ఎస్ ఆశలుప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా స్థానిక ఎన్నికల కోసం సిద్ధమవుతోంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేని స్థితిలో పడిపోయిన ఆ పార్టీ.. స్థానిక ఎన్నికల్లోనైనా పట్టు నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉంది. కేడర్, లీడర్లను చైతన్యపరిచే పనిలో పడింది. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తోంది. వికారాబాద్, సిర్పూర్ సమావేశాల్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎవరికి టికెట్లు ఇచ్చినా అందరూ కలసి పనిచేయాలని స్పష్టంచేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను సద్వినియోగం చేసుకొని ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. -
ముందు పరిషత్.. తర్వాత పంచాయతీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. రాజకీయ పార్టీల గుర్తులపై జరిగే మండల పరిషత్ (ఎంపీటీసీ), జిల్లా పరిషత్ (జెడ్పీటీసీ) ఎన్నికలను తొలుత నిర్వహించాలని.. అనంతరం పార్టీల గుర్తులు లేకుండా జరిగే గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలిసింది. మరోవైపు ఈ రెండింటినీ కొన్నిరోజుల అంతరంతో జరపాలనే ప్రతిపాదనతోపాటు.. వీలైతే సమాంతరంగా ఒకేసారి నిర్వహించాలనే ఆలోచన కూడా ఉ న్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత రాకున్నా.. తొలుత పరిషత్‌లకు, తర్వాత పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే అవకాశమే ఎక్కువని అధికార వర్గాలు చెబుతున్నాయి. మంగళవారం ఉదయం జరిగే రాష్ట్ర కేబినెట్ భేటీ, తర్వాత నిర్వహించే శాసనసభ ప్రత్యేక సమావేశంలో స్థానిక ఎన్నికలకు సంబంధించి స్పష్టత వస్తుందని వివరిస్తున్నాయి. రిజర్వేషన్ల పెంపుపై తీర్మానం చేసి.. సమగ్ర కుటుంబ సర్వే, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు (ప్రస్తుతమున్న 28 శాతం నుంచి 42 శాతానికి), ఎస్సీ వర్గీకరణ నివేదిక తదితర అంశాలపై మంగళవారం కేబినెట్లో భేటీలో చర్చించి, నిర్ణయాలు తీసుకోనున్నారు. అనంతరం బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో చర్చించి తీర్మానం చేస్తారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చూస్తే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలుపుకొని 50శాతానికి మించకూడదు. కానీ రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితులు, కులగణన, బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదికల ఆధారంగా బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి, ఆమోదం కోసం పార్లమెంటుకు పంపే అవకాశం ఉంది. అందులోనూ న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా పంచాయతీలు, మండలాలు, జిల్లాల్లో స్థానికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్లు కల్పించే అవకాశం కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ నెల 15లోగా షెడ్యూల్! స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ నెల 15వ తేదీలోగా షెడ్యూల్ విడుదల కానున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. రెండు వారాల్లో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు.. తర్వాత వారం గడువిచ్చి గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తిచేయవచ్చని అంటున్నాయి. వచ్చే నెల మొదట్లో ఇంటర్ పరీక్షలు, 21 నుంచి టెన్త్ పరీక్షలు ఉన్నందున.. టెన్త్ పరీక్షలు మొదలయ్యేలోగా స్థానిక ఎన్నికల ప్రక్రియ ముగించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. రాజకీయ పార్టీల గుర్తులపై ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి, వాటిని ఒక విడతలో ముగించాలని భావిస్తున్నట్టు తెలిసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా, అభ్యర్థులంతా స్వతంత్రులుగానే పోటీ చేసే విధానంలో జరుగుతాయి కాబట్టి.. వాటిని విడిగా నిర్వహించనున్నట్టు సమాచారం. పంచాయతీ ఎన్నికలను గతంలో మాదిరిగా మూడు విడతల్లో నిర్వహించి.. ఏ విడతకు ఆ విడతలో పోలింగ్ ముగిశాక సాయంత్రమే ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. 2018లో నిర్వహించిన విధంగానే ఈసారి కూడా బ్యాలెట్ పేపర్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలుత పార్టీ గుర్తులపై జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తే రాజకీయంగా ప్రయోజనకరంగా ఉంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పేర్కొన్న నేపథ్యంలో.. దీనివైపు మొగ్గుచూపుతున్నట్టు తెలిసింది. ఎంపీటీసీ స్థానాల పునర్విభజనపై సమీక్ష రాష్ట్రంలో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (ఎంపీటీసీ) స్థానాల పునర్విభజనకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ (పీఆర్ ఆర్డీ) అధికారులు చర్యలు చేపట్టారు. ఒక్కో మండలంలో కనీసం ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉండేలా చూడటం, రాష్ట్రవ్యాప్తంగా కొన్ని గ్రామాలను సమీపంలోని మున్సిపాలిటీల్లో విలీనం చేసిన నేపథ్యంలో మార్పులు చేర్పులు, కొత్తగా ఏర్పడిన 34 మండలాల్లో ఎంపీటీసీ సీట్ల పునర్వ్యవస్థీకరణ తదితర అంశాలపై సోమవారం కసరత్తు పూర్తి చేశారు. జిల్లాల వారీగా పునర్విభజన (కార్వింగ్) చేసిన ఎంపీటీసీ స్థానాల వివరాలతో మండల పరిషత్ కార్యాలయాల్లో తుది జాబితాలను ప్రచురించారు. ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తీరుపై అన్ని జిల్లాల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు (ఏసీఎల్బీ), ఇతర అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్ టెలీకాన్ఫరెన్స్, గూగుల్ మీట్లు నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేయడం, గ్రామ పంచాయతీల మ్యాపింగ్, ఎంపీటీసీ స్థానాలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటర్ల లెక్కలు, పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, ఎన్నికలు జరిపేందుకు అందుబాటులో ఉన్న సిబ్బంది, బ్యాలెట్ బాక్స్‌లు, ఇతర రవాణా ఏర్పాట్లు, రిటర్నింగ్ అధికారుల (ఆర్వోల) నియామకం, ఆర్వోలు, సిబ్బందికి శిక్షణ, బ్యాలెట్ పేపర్ల ముద్రణ తదితర అంశాలపై సమీక్షించారు. -
స్థానిక ఎన్నికలకు ‘భరోసా’ దిశగా..!
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలు, వాటికి ముందే రైతు భరోసా, ఇతర పథకాల అమలు ప్రధాన ఎజెండాగా శనివారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ భేటీలో చర్చ జరిగినట్టు తెలిసింది. త్వరలో గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న తరుణంలో.. ఎన్నికలను ఎదుర్కొనేందుకు అవసరమైన కీలక అంశాలపై రెండు గంటలకుపైగా చర్చించినట్టు సమాచారం. అయితే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసినా.. ఆ డబ్బు నేరుగా రైతులకు వెళ్లలేదని, రైతులకు నేరుగా సాయం అందకుండా స్థానిక ఎన్నికలకు వెళ్లడం ఇబ్బందికరమని కొందరు మంత్రులు అభిప్రాయపడినట్టు తెలిసింది. ‘రైతు భరోసా’ పథకాన్ని అమలు చేశాకే స్థానిక ఎన్నికలకు వెళితే మంచిదని సూచించినట్టు సమాచారం.ఈ పథకం అమలు తీరు ఎలా ఉండాలన్న దానిపై దాదాపు మంత్రులంతా తమ అభిప్రాయాలను వెల్లడించినట్టు తెలిసింది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని గతంలో ఏటా రూ.10 వేలు పెట్టుబడి సాయం ఇవ్వగా ఇప్పుడు రూ.12 వేలకు పెంచుదామని... భూమిలేని వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తున్నందున ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని సీఎం, డిప్యూటీ సీఎంలు వివరించినట్టు సమాచారం. ఈ మేరకు రూ.12 వేలు రైతు భరోసా ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.ఇందిరమ్మ ఇళ్ల విషయంలోనూ..: ఇక రుణమాఫీ అనుకున్న ప్రకారం చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయని.. రుణమున్న ప్రతి రైతుకు మాఫీ జరగలేదనే చర్చ జరుగుతోందని కొందరు మంత్రులు ప్రస్తావించినట్టు తెలిసింది. రైతు రుణమాఫీ కోసం రూ.31 వేలకోట్లు అవసరమనే అంచనాల నేపథ్యంలో రూ.21 వేల కోట్లే ఇచ్చామని, ఇంత తేడా ఎలా వచ్చిందని కేబినెట్ భేటీకి హాజరైన ఉన్నతాధికారులను ఓ మంత్రి అడిగినట్టు సమాచారం.ఇలాంటి సమయంలో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టినా ప్రయోజనం ఉండకపోవచ్చని... ఎంపిక కాని వారి నుంచి ప్రతికూలత ఎదురవుతుందనే చర్చ జరిగినట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసేవరకు ఇందిరమ్మ ఇళ్ల పంపిణీని వాయిదా వేయాలనే అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. మరోవైపు కొత్త రేషన్‌కార్డుల జారీ చాలా ముఖ్యమని, వెంటనే ఈ ప్రక్రియను ప్రారంభించాలనే చర్చ జరిగినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఈ నెల 26వ తేదీ నుంచి రూ.12 వేలు రైతు భరోసా, రూ.12 వేల ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీకి నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. -
ఫిబ్రవరిలో ‘స్థానిక’ సమరం..?
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఎన్నికల నిర్వహ ణకు ప్రాథమిక కసరత్తు కూడా కొంత ప్రారంభమైనట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. కొత్త సంవత్సరంలో సంక్రాంతి పండుగ సమయంలో జనవరి 14న ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేస్తే, ఆ తర్వాత 21 రోజుల్లో (ఫిబ్రవరి మొదటి వారంలో) ఎన్నికలు నిర్వహించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఈ ఎన్నికలను బ్యాలెట్ పత్రాలతో మూడు విడతల్లో నిర్వహించే విషయంలో మాత్రం ఇప్పటికే ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.స్థానిక ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన అమల్లో ఉండగా... ఈసారి ఇద్దరికంటే ఎక్కువ పిల్లలున్నవారు కూడా పోటీ చేసేందుకు అవకాశం కల్పించనున్నట్టు సమాచారం. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి మండలానికి కనీసం ఐదు గ్రామపంచాయతీలు (ఎంపీటీసీ స్థానాలు) ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. డిసెంబర్ రెండోవారంలో నిర్వహించనున్న అసెంబ్లీ సమావేశాల్లో‡ ఈ రెండు అంశాలపై బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకొనేందుకు పంచాయతీరాజ్‌శాఖ కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం. బీసీ రిజర్వేషన్లపై మల్లగుల్లాలుస్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌పార్టీ హామీ ఇచ్చింది. ప్రస్తుతం గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 22 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. దానిని 42 శాతానికి పెంచడం వల్ల అన్ని రకాల రిజర్వేషన్లు 50 శాతానికి మించుతాయి. దీనివల్ల రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న సుప్రీంకోర్టు తీర్పునకు అడ్డంకిగా మారుతుందన్న అభిప్రా యం కూడా వ్యక్తమవుతోంది. జనాభా మేరకు రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటుచేసి కుల గణనను చేపట్టిన సంగతి విదితమే. తాజా లెక్కలకు అనుగుణంగా బీసీల రిజర్వేషన్ల శాతాన్ని ఖరారు చేస్తూ బీసీ కమిషన్ తుది నిర్ణయం తీసుకోవాలి.ఆ రిజర్వేషన్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పంపిస్తే.. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీచేస్తుంది. ఈ నోటిఫికేషన్ జారీ అయ్యాక 21 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది. గత జనవరి 31తో సర్పంచ్ల పదవీకాలం ముగిసింది. జూలై మొదటివారంలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీ, జడ్పీ చైర్పర్సన్ల పదవీ కాలం కూడా ముగిసింది. గ్రామపంచాయతీ పాలక మండళ్ల పదవీకాలం ముందుగా ముగిసినందున, ఎన్నికలు కూడా ముందుగా వాటికే నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారని సమాచారం. రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామ పంచాయతీలు, 538 జడ్పీటీసీలు, 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. -
స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడువు ముగిసిన గ్రామపంచాయతీలు, మండల పరిషత్, జిల్లా ప్రజాపరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన నిర్ధారిస్తారన్న దానిపై ప్రభుత్వపరంగా ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. రిజర్వేషన్ల ఖరారుకు కుల గణన ప్రాతిపదికగా తీసుకోవాలా.. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సిద్ధం చేసిన తాజా ఓటర్ల జాబితాను లెక్కలోకి తీసుకోవాలా.. అన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం తేల్చుకోలేకపోతోంది. కాగా ఈ నెలతో బీసీ కమిషన్ కాలపరిమితి ముగియనుండగా.. ఎన్నికలు నిర్వహించాల్సిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం వచ్చే నెలతో ముగియనుంది. కులగణనతో ఆలస్యం... కులగణన ద్వారా రాష్ట్రంలోని జిల్లాలు, మండలాలు, గ్రామాల స్థాయి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభాపై లెక్కలు తీసి రిజర్వేషన్ల నిర్ధారణ అనేది సుదీర్ఘ కసరత్తుతో పాటు చాలా రోజులు పట్టనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా తాజా ఓటర్ల జాబితాలు తీసుకుని మండలాలు, గ్రామస్థాయిల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభాపై అంచనాకు వచ్చి స్థానిక స్థాయిలోనే రిజర్వేషన్ల ఖరారు అనేది ఇప్పుడు ప్రభుత్వం ఎదుట మార్గాంతరంగా ఉంది.ఈ ప్రక్రియను పంచాయతీరాజ్, ›గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా చేపడితే 2, 3 నెలల్లోగా ఓటర్ల జాబితాల ఆధారంగా రిజర్వేషన్లు నిర్థారించేందుకు అవకాశముందని అటు బీసీ కమిషన్, ఇటు అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు గరిష్టంగా 21 శాతమే రిజర్వేషన్లు అందుతున్నాయి. అయితే ఈ రిజర్వేషన్లను వారి జనాభాకు అనుగుణంగా 42 శాతానికి పెంచుతామని, ఉప కులాల వారీగా కూడా రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీనిచి్చన విషయం తెలిసిందే. ఈ హామీ అమలుకు రాష్ట్ర బీసీ కమిష¯Œన్ ద్వారా చర్యలు చేపట్టాల్సి ఉంది.సుప్రీంకోర్టు గతంలోనే ‘ట్రిపుల్ టెస్ట్’పేరిట స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు, ఇతర గ్రూపులకు రిజర్వేషన్లపై మార్గదర్శకాలు జారీ చేసింది. స్థానిక సంస్థల పరిధిలో ఆయా గ్రూపుల వెనుకబాటుతనంపై బీసీ కమిష¯న్ ద్వారా విచారణ జరపాలని, ఆయా చోట్ల (స్థానిక స్థాయిలో) ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఏయే నిష్పత్తిలో రిజర్వేషన్లు ఇవ్వాలో తేల్చాలని పేర్కొంది. మొత్తంగా రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా చూడాలని స్పష్టం చేయడంతో బీసీ కమిషన్ కసరత్తుకు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ అమలు ఏ మేరకు సాధ్యమనే మీమాంస వ్యక్తమవుతోంది. సీఎం వచ్చాక స్పష్టత వస్తుందా? ఈ నెలాఖరుతో రాష్ట్ర బీసీ కమిష¯న్Œ చైర్మన్, సభ్యుల పదవీ కాలం పూర్తి కానుండగా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి పదవీకాలం సెపె్టంబర్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో బీసీ కమిషన్ చైర్మన్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తే ఈ ఎన్నికలను సజావుగా సకాలంలో పూర్తి చేసే అవకాశం ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ నెల 14 తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి, సీఎస్ల ప్రతినిధి బృందం యూఎస్, దక్షిణ కొరియాల పర్యటన నుంచి తిరిగి వచ్చాక దీనిపై స్పష్టత వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
రుణమాఫీ తర్వాతే పంచాయతీ ఎన్నికలు!
సాక్షి, న్యూఢిల్లీ: రైతు రుణమాఫీ తర్వాతే పంచాయతీ ఎన్నికలకు వెళ్లనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. అలా అయితేనే తమకు కూడా ప్రయోజనం ఉంటుందనే ఆలోచన ఉందన్నారు. మూసీ పరీవాహాక ప్రాంతాన్ని 55 కి.మీ. మేర అభివృద్ధి చేస్తున్నామని, కింద రోడ్డు మార్గం, సైక్లింగ్, పైన మెట్రో వెళ్లేలా ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. ఏపీ రాజధాని అమరావతి హైదరాబాద్‌కు ఎంతమాత్రం పోటీ కాదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.అమరావతిలో రాజధాని నిర్మాణం, భవనాల నిర్మాణం తర్వాత 10 వేల ఎకరాలే రియల్ ఎస్టేట్‌కు ఉంటుందని, అందులోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కష్టమనేది తన ఆలోచన అని అన్నారు. అక్కడ పెట్టుబడి పెట్టేకన్నా హైదరాబాద్ శివారు ప్రాంతాలు, వరంగల్‌లో పెట్టుబడి పెట్టడం మంచిదని సలహా ఇస్తున్నట్లు చెప్పారు. లేదా పక్క రాష్ట్రాలైన బెంగళూరు, చెన్నైలలోనూ పెట్టుబడి పెట్టుకోవచ్చని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన సీఎం రేవంత్.. మీడియా సమావేశంలో వివరాలు నిర్వహించారు. అనంతరం విలేకరులతో కాసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మూసీ అభివృద్ధి.. నా మార్క్ ‘మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, కేసీఆర్ హైదరాబాద్‌లో చేసిన అభివృద్ధికి ఓ మార్క్ ఉంది. ఇలా నా మార్క్ ఏంటనేది చెప్పాల్సి వస్తే మూసీ నది అభివృద్ధేనని చెప్తా. మూసీ పరీవాహక ప్రాంతం పరిధిలో 10 వేలకుపైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. వారందరికీ డబుల్ బెడ్రూం ఫ్లాట్లు లేదా లేదా నష్టపరిహారం చెల్లిస్తాం.మధ్యమధ్యలో ఎస్టీపీలు కట్టి నీటిని శుద్ధి చేసి మూసీలోకి వదిలేలా చేస్తున్నాం. 36 నెలల్లో పూర్తి చేయాలనేది నా ఉద్దేశం. 12–15 కీ.మీ.లకు ఒక క్లస్టర్ లెక్కన 4 కస్టర్లుగా విభజించి 4 కంపెనీలకు ఇద్దామనే ఆలోచన చేస్తున్నాం. మూసీ ప్రాజెక్టును మరింత హుందాగా డిజైన్ చేసేందుకు ఆగస్టులో దక్షిణ కొరియా, జపాన్ వెళ్లి అక్కడి రివర్ డెవలప్మెంట్ మోడల్‌ను చూసి మరిన్ని ఆలోచనలు చేస్తాం. మొత్తం మూసీ నది అభివృద్ధే రేవంత్ మార్క్ అనేలా అభివృద్ధి చేసి చూపిస్తా’అని రేవంత్ వివరించారు. గండిపేటకు ట్రంక్ లైన్.. ‘మంచినీటి నిల్వ కోసం గోదావరి, కృష్ణా నుంచి గండిపేటకు ట్రంక్ లైన్ వేస్తున్నాం. త్వరలో టెండర్లు పిలుస్తాం. అలాగే రీజనల్ రింగ్ రోడ్డు కూడా నిర్మిస్తున్నాం. ఈ ప్రాజెక్టుపై కూడా కేంద్రంతో చర్చలు జరుగుతున్నాయి. త్వరలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టాల్సి ఉన్నందున రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అవసరాల గురించి ప్రధాని మొదలు కేంద్ర మంత్రులందరినీ నేను, నాతో పాటు మంత్రులు కలుస్తున్నాం. కేంద్రం తెలంగాణకు సాయం చేస్తుందనే నమ్మకం ఉంది. ఎన్నికలు అయిపోయినందున ఇప్పుడు రాష్ట్రాభివృద్ధే మా ధ్యేయం. అందుకే అందరినీ కలుస్తున్నాం..’అని సీఎం చెప్పారు. మరికొన్ని అంశాలపై ⇒ వివాదం లేకుండా పోటీ పరీక్షలన్నీ నిర్వహించామని సీఎం అన్నారు. తమకు మంచి పేరు వస్తుందనే గ్రూప్–1 విషయంలో బీఆర్ఎస్ అనవసర రచ్చకు తెరలేపి నిరుద్యోగుల్ని ఉసిగొల్పుతోందని రేవంత్ ఆరోపించారు. అయితే గ్రూప్–1 గురించి ఎవరో ఏదో చెప్పారని చేసుకుంటూ వెళ్లలేమని.. అలా వెళ్తే కోర్టులు ఆక్షేపిస్తాయని చెప్పారు. ⇒ లోక్‌సభ ఎన్నికలకు ముందే రాష్ట్రానికి ఎక్కువ సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్‌లు కావాలని ప్రధానిని కోరానని.. ఇప్పుడు ఎన్నికలు ముగియడంతో త్వరలో కొత్త బ్యాచ్‌కు చెందిన వారిని కేంద్రం తెలంగాణకు కేటాయించే అవకాశం ఉందన్నారు. ⇒ కత్తి పట్టుకున్న వాడు కత్తికే బలైనట్లు కేసీఆర్ పరిస్థితి ఉందని రేవంత్ వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డ వ్యక్తి ఆ కేసుకే పట్టుబడేలా ఉన్నారని పేర్కొన్నారు. తనకు ఎవరి ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం లేదని.. తన ప్రభుత్వానికి ఢోకా లేదన్నారు.పదేళ్లు నేనే సీఎం..ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో పదేళ్లకు ఒకమారు, ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాలు మారే ట్రెండ్ కొనసాగుతోందని, ఈ లెక్కన పదేళ్లపాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగతానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పదేళ్లపాటు కాంగ్రెస్‌కు వచ్చే ఢోకా ఏమీ లేదని చెప్పారు. ‘తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల మార్పు విషయంలో భిన్నమైన ట్రెండ్ నడుస్తోంది. తెలంగాణలో పదేళ్లకు ఒకమారు ప్రభుత్వాలు మారి తే, ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్లకు ఒకమారు ప్రభు త్వం మారుతోంది. ఈ లెక్కన తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లపాటు కచ్చి తంగా కొనసాగుతుంది. నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతా’అని రేవంత్ వ్యాఖ్యానించారు.ఈవీఎంలపై అప్పుడు టీడీపీయే ప్రశ్నించిందిసార్వత్రిక ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎంల) ట్యాంపరింగ్‌కు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌కు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో వాటి ట్యాంపరింగ్ జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఈవీఎం ట్యాపరింగ్లు జరిగినట్లు వస్తున్న వార్తలపై అభిప్రాయం ఏమిటని మీడియా అడగ్గా సీఎం రేవంత్ వివరంగా బదులిచ్చారు. ‘2009లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ట్యాంపరింగ్ జరుగుతోందని ప్రశ్నించిందే టీడీపీ (అప్పుడు నేను ఆ పారీ్టలోనే ఉన్నా). ఢిల్లీలోని కానిస్టిట్యూషనల్ క్లబ్ ఆఫ్ ఇండియాలో దీనిపై సెమినార్ నిర్వహించి అవగాహన కలి్పంచాం. అప్పట్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌కు సంబంధించి అరెస్టులు కూడా జరిగాయి..’అని అన్నారు. ఎలా జరగొచ్చంటే.. ‘ఎన్నికలకు ముందురోజు ప్రతి నియోజకవర్గానికి ఈవీఎంలను తీసుకొచ్చి పంపినీ కేంద్రంలో ఉంచుతారు. పోలింగ్‌కు అవసరమైన ఈవీఎంల కంటే 15 శాతం ఈవీఎలను ఎక్కువగానే కేటాయిస్తారు. ఎన్నికల రోజు ఎక్కడైనా ఈవీఎంలు మొరాయిస్తే ఆ ఈవీఎంల స్థానంలో వాటిని ఉపయోగించుకోవడానికి ఆ 15 శాతం ఈవీఎంలను అదనంగా ఇస్తారు. ఈవీఎంల పంపిణీ కేంద్రం నుంచి పోలింగ్ రోజు ఈవీఎంలను పోలింగ్ బూత్‌లకు తరలిస్తారు.అదనంగా తెచి్చన 15 శాతం ఈవీఎంలను మాత్రం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లోనే ఉంచుతారు. పోలింగ్ ముగిశాక ఈవీఎంలన్నీ స్ట్రాంగ్ రూమ్‌కు కాకుండా తొలుత డి్రస్టిబ్యూషన్ సెంటర్‌కే వస్తాయి. అక్కడే రాత్రంతా ఉంచుతారు. ఆ రాత్రి ఈవీఎంలను అటుఇటూ మార్చేలా ఏదైనా జరగొచ్చు కదా? పంపిణీ కేంద్రం బయట పోలీసులు కాపలాగా ఉంటే లోపల ఇంటర్, డిగ్రీ చేసిన వాళ్లు వాటిని తనిఖీ చేయడానికి ఉంటారు. మన చేతిలో అధికారం, బలం ఉంటే మనకు ఇష్టమైన వ్యక్తుల్ని అక్కడ డ్యూటీకి వేసుకొనే అవకాశం కూడా ఉంది. పోలింగ్ ముగిసిన మర్నాడు ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్‌కు వెళ్తున్నాయి..’అని రేవంత్ తెలిపారు. ట్యాంపరింగ్ ఏ రకంగా చేస్తారో చెప్పలేం‘ఈవీఎంల ట్యాంపరింగ్‌ను ఎక్కడో కూర్చుని చేశారా లేక చిప్‌లలోకి ఏదైనా ఫ్రీక్వెన్సీని పంపారా అనేది మనం చెప్పలేము. చిప్‌లోకి లోఫ్రీక్వెన్సీ అయితే ఒకలాగా, హైఫ్రీక్వెన్సీ అయితే మరోలాగా ఈవీఎంలను ఆపరేట్ చేయొచ్చు. కంపెనీ తయారు చేసే ప్రొగ్రామ్నిబట్టే ఈవీఎం పనిచేస్తుంది. ప్రోగ్రాం రీరైడ్ చేయాలంటే మిషన్ చేతికి రావాల్సి ఉంటుంది. అయితే సిగ్నల్ ద్వారా ట్యాంపరింగ్ చేస్తున్నారా లేదా అనేది నాకు తెలియదు.ఫ్రీక్వెన్సీ ఉంటే ఒకలా, లేకపోతే ఇంకోలా దేనికి దానికే ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంటుంది. గెలుపోటముల కోసం 100 శాతం మెషీన్లను ట్యాంపరింగ్ చేయాల్సిన అవసరం లేదు. జనరల్‌గా 10 శాతం ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉండొచ్చు. అంటే 10 వేల ఓట్ల వ్యవధిలోనే గెలుపోటములను డిసైడ్ చేయొచ్చు కదా’అని రేవంత్ చెప్పారు. -
జెడ్పీ చైర్మన్, ఎంపీపీ పదవులకు ప్రత్యక్ష ఎన్నిక!
సాక్షి, అమరావతి : జెడ్పీ చైర్పర్సన్, మండలాధ్యక్ష పదవులకు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికల నిర్వహణపై కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది. అవసరమైతే రాజ్యాంగంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలకు ఉద్దేశించిన ఆర్టికల్ 243 (సీ) క్లాజ్ 5 (బీ)కి సవరణలు చేయాలని ఆలోచన చేస్తోంది. ఇందుకోసం అన్ని రాష్ట్రాల్లో పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం ఉండే అన్ని వర్గాల ప్రతినిధులతో చర్చించేందుకు వచ్చే నెల 4, 5 తేదీల్లో హైదరాబాద్‌లో జాతీయ స్థాయి వర్క్‌షాప్ నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లోని జాతీయ పంచాయతీరాజ్ శిక్షణ సంస్థలో ఈ ప్రత్యేక వర్క్‌షాప్ జరుగుతుంది. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అడిషనల్ సెక్రటరీ చంద్రశేఖర్‌కుమార్ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు (సీఎస్‌లు), పంచాయతీరాజ్ శాఖ విభాగాధిపతులకు ఇటీవల లేఖలు కూడా రాశారు. కేంద్రం సవరణ చేసినా, సగం రాష్ట్రాలు ఆమోదం తర్వాతే అమల్లోకి ఒకవేళ.. కేంద్రం ఇప్పుడు దేశమంతటా జెడ్పీ చైర్పర్సన్, ఎంపీపీ పదవులకు ప్రత్యక్ష విధానంలో ఎన్నుకొనేలా రాజ్యాంగ సవరణ చేసినా.., అది అమలులోకి రావాలంటే సగానికి పైగా రాష్ట్రాలు ఆమోదం తెలపాలని పంచాయతీరాజ్ శాఖ అదికారులు చెప్పారు. అన్ని దశల ప్రక్రియ పూర్తవడానికి చాలా కాలం పడుతుందని తెలిపారు. రాష్ట్రం నుంచి 9 మంది.. అన్ని రాష్ట్రాల నుంచి 261 మంది.. ఈ వర్క్‌షాప్‌లో పాల్గొని సూచనలు చేసేందుకు అన్ని రాష్ట్రాల నుంచి జెడ్పీ చైర్పర్సన్, ఎంపీపీ, గ్రామ పంచాయతీ సర్పంచుల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఎంపిక చేయాలని కేంద్రం లేఖలో పేర్కొంది. వీరితో పాటు రాష్ట్రాల పంచాయతీరాజ్ శాఖ అధికారులు, జెడ్పీ సీఈవోలు, ఎంపీడీవోలు (చాలా రాష్ట్రాల్లో బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ – బీడీవోలు అంటారు), రాష్ట్రాల్లోని పంచాయతీరాజ్ శాఖ శిక్షణ సంస్థ ప్రతినిధులు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొనాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మొత్తం 9 మంది హాజరవనున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి మొత్తం 261 మంది పాల్గొనాలని ఆ లేఖలో పేర్కొన్నారు. 1995కి ముందు ఆ పదవులకు రాష్ట్రంలోనూ ప్రత్యక్ష ఎన్నికలే.. రాష్ట్రంలో ప్రస్తుతం జెడ్పీ చైర్మన్, మండలాధ్యక్షులను పరోక్ష పద్ధతిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీలు ఎన్నుకొంటున్నారు. 1995కి ముందు కొంతకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ పదవులకు ప్రత్యక్ష పద్దతిలోనే నేరుగా ప్రజలే ఎన్నుకొనేవారు. స్థానిక సంస్థలకు ప్రత్యేకాధికారాలు కల్పిస్తూ 1994లో కేంద్రం తీసుకొచ్చిన 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా ఈ ఎన్నికల విధివిధానాల్లో మార్పులు చేశారు. దాని ప్రకారం పరోక్ష పద్ధతిలో ఎన్నుకోవాలని నిర్దేశించారు. గ్రామ పంచాయతీలలో సర్పంచి పదవులకు మాత్రం రాష్ట్రాల ఇష్టానుసారం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్నుకోవచ్చని కేంద్రం ఆ సవరణల్లో పేర్కొంది. ఈ సవరణల మేరకు అన్ని రాష్ట్రాలు రాష్ట్రస్థాయిలో కొత్త పంచాయతీరాజ్ చట్టాలను తీసుకొచ్చాయి. ఆ మేరకు మన రాష్ట్రంలో గ్రామ పంచాయతీ సర్పంచిని ప్రత్యక్ష విధానంలో, జెడ్పీ చైర్పర్సన్, మండలాధ్యక్షులను పరోక్ష పద్ధతిలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీల ద్వారా ఎన్నుకొనేలా 1995లో కొత్త పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చిం ది. -
తాడిపత్రిలో వైఎస్సార్సీపీ హవా.. జేసీ బ్రదర్స్‌కు ఎదురుదెబ్బ
సాక్షి, అనంతపురం జిల్లా: తాడిపత్రిలో జేసీ బ్రదర్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. జేసీ సొంత మండలం పెద్దపప్పూరులో టీడీపీ ఓటమి చెందింది. దేవునుప్పలపాడు పంచాయతీలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు కాటమయ్య గెలుపొందారు.తాడిపత్రి నియోజకవర్గంలో ఐదు వార్డుల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ఘన విజయం సాధించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో జరిగిన పంచాయితీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఒక్కొక్కటిగా ఫలితాలు వెలువడుతున్నాయి. మెజార్టీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు.. బలపర్చిన అభ్యర్థులే జయకేతనం ఎగరేస్తున్నారు. మొత్తం 35 సర్పంచ్, 245 వార్డు మెంబర్ల స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. -
ఏలూరు, ప.గో.జిల్లాలో పంచాయతీ ఉపఎన్నికలు
అమరావతి: ఏలూరు, పశ్చిమ గోదావరి జిలాల్లో మొత్తం నాలుగు సర్పంచ్ స్థానాలకు 31 వార్డు స్థానాలకు నేడు పంచాయతీ ఉపఎన్నికలు జరగనున్నాయి. ఏర్పాట్లన్నీ పూర్తి కాగా ఉదయం 7 గంటలకే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది గత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనంతరం ఖాళీ అయిన స్థానాల భర్తీ కోసం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా ఈరోజు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఏలూరు జిల్లాలో మొతం 3 సర్పంచ్ స్థానాలకు 21 వార్డులకు అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక సర్పంచ్ స్థానానికి 10 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఎన్నికల ప్రక్రియ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలనుంచి కౌంటిం ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు రిటర్నింగ్ అధికారి. ఏలూరు జిల్లాలో ఆగిరిపల్లి మండలంలోని అడవినెక్కలం, పెదపాడు మండలం వీరమ్మకుంట, ముదినేపల్లి మండలంలోని వణిదురు సర్పంచ్ స్థానాలకు, అలాగే 21 వార్డులకు.. పశ్చిమగోదావరి జిల్లాలో ఇరగవరం మండలం కావలిపురం సర్పంచ్ పదవికి, 10 వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలు పూర్తయిన వెంటనే జరగాల్సిన కౌంటింగ్ ప్రక్రియకు కూడా అని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏలూరు జిల్లాలో మొత్తం 4 సర్పంచ్ స్థానాలు, 47 వార్డు మెంబర్లకు గాను శ్రీనివాసపురం సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది. అలాగే 12 వార్డులు ఏకగ్రీవం కాగా, 12 వార్డులకు సింగిల్ నామినేషన్లు, మరో రెండు వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాకపోవడంతో 21 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వీటి కోసం 33 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి 160 మంది సిబ్బందిని నియమించారు. ఏలూరు జిల్లాలో 11,114 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాలు, 120 మంది సిబ్బందిని నియమించారు. -
పశ్చిమ బెంగాల్: ఎన్నికల్లో రక్తచరిత్ర.. ఎందుకీ హింస?
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల వేళ హింస రాజుకోవడం కొత్త కాదు. కాల్పులు, బాంబుల మోత, గృహదహనాలు, రాళ్లు విసురుకోవడాలు, బ్యాలెట్ బాక్స్‌లకు నిప్పు పెట్టడం వంటి ఘటనలు సర్వసాధారణం. రాజకీయ పార్టీల మధ్య యుద్ధ వాతావరణంలో ఎన్నికలు జరగడం ఒక రివాజుగా మారింది. ఏ ఎన్నికలైనా, ఎవరు అధికారంలో ఉన్నా ఒక రక్తచరిత్రను తలపిస్తూ ఉంటాయి. కుల, మతపరమైన హింస దేశంలో మిగిలిన ప్రాంతాల్లో కనిపిస్తే రాజకీయ పార్టీల వారీగా ప్రజల్లో ఇక్కడ విభజన ఎక్కువ. ఎన్నికల వేళ ఈ విభేదాలు మరింత ముదిరి హింసకు దారి తీస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం నేతృత్వంలో ఎన్నికలు జరగడం, ఎన్నికల సంఘం అధికార పార్టీ చెప్పు చేతుల్లో ఉండడం ఎన్నికల హింసకు ఒక కారణమేనని రాజకీయ విశ్లేషకుడు స్నిగ్ధేందు భట్టాచార్య వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు చాలా ఎక్కువని, అందుకే ఎన్నికల సమయంలో హింస రాజుకుంటోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల కాలంలో బీజేపీ బెంగాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 77 సీట్లు గెలుచుకొని బలమైన ప్రతిపక్షంగా నిలిచింది. రాజకీయ కక్షసాధింపులే కేంద్రంగా ఉన్న బెంగాల్లో మైనార్టీ బుజ్జగింపు చర్యలు, మతపరమైన రాజకీయాలు తోడు కావడంతో హింస ప్రజ్వరిల్లింది. టీఎంసీ కార్యకర్త హత్యకి ప్రతీకారంగా 2021 మార్చిలో బిర్భూమ్ జిల్లాలో ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. లోక్‌సభ ఎన్నికలకి లిట్మస్ టెస్ట్ వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ఈ పంచాయతీ ఎన్నికలు అన్ని పార్టీలకు విషమ పరీక్షే. కాంగ్రెస్, లెఫ్ట్‌లతో చేతులు కలిపిన టీఎంసీ ఒకవైపు, బీజేపీ మరోవైపు రెండు శిబిరాలుగా మారిపోవడంతో ఘర్షణలు మరింతగా పెరుగుతున్నాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ టీఎంసీ అత్యధిక మెజార్టీతో గెలుపొందింది. అప్పట్నుంచి టీఎంసీ, బీజేపీ మధ్య రాజకీయ పోరు పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఎస్ఎస్సీ, బొగ్గు స్మగ్లింగ్ కేసుల్లో టీఎంసీ నేతలు అరెస్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై సీబీఐ గురిపెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికల్లో అమీతుమీకి ఇరుపక్షాలు సిద్ధపడడం హింసను పెంచుతోంది. భద్రత ఇలా.. ► పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ మళ్లీ రక్తమోడింది. కేంద్ర బలగాలు రంగంలోకి దింపాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో రాష్ట్రంలోని 61,636 పోలింగ్ స్టేషన్లలో భారీగా భద్రతా ఏర్పాట్లు, ముందస్తు అరెస్ట్‌లు, ఆయుధాల స్వా«దీనం వంటి చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. కాంగ్రెస్, ఆ తర్వాత లెఫ్ట్, ఇప్పుడు టీఎంసీ.. అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా బుల్లెట్ పేలకుండా బ్యాలెట్ ప్రక్రియ పూర్తి కావడం లేదు. పంచాయతీల్లో రాజకీయ నాయకులు తమ ధనబలం, కండబలంతో ఎన్నికలు గెలుస్తూ వస్తున్నారే తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. సుదీర్ఘంగా మూడు దశాబ్దాల పాటు సీపీఐ(ఎం) రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడే ఎన్నికల హింస తారాస్థాయికి చేరుకుంది. ధనబలం.. ► ఇటీవల పంచాయతీలకు నిధుల కేటాయింపు గణనీయంగా పెరగడం హింసకు ఒక కారణంగా మారింది. ఒక జిల్లా కౌన్సిల్ ఐదేళ్లలో రూ.500 కోట్లు ఖర్చు పెట్టొచ్చు. ఒక గ్రామ పంచాయతీ రూ.5–15 కోట్లు ఖర్చు పెట్టుకునే వీలుంది. ప్రతీ ఏడాది గ్రామీణాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.4 వేల కోట్లు కేటాయిస్తుంది. అందుకే పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం ఎంతటి మూల్యాన్ని చెల్లించడానికైనా అన్ని రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. ► గత నెల జూన్ 8 – 27 మధ్య బెంగాల్లో జరిగిన ఘర్షణల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 337 మందికి గాయాలయ్యాయి. ► 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ బెంగాల్లోనే 38 వరకు మరణించారు. ► 2018లో పశ్చిమ బెంగాల్లో రాజకీయ హత్యలు 13 వరకు జరిగాయి. అదే ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసాకాండలో 30 మంది మరణిస్తే, 12 మంది పోలింగ్ రోజునే ప్రాణాలు కోల్పోయారు. ► 2011లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు మిడ్నాపూర్‌లో జరిగిన ఘర్షణల్లో 14 మంది మరణించారు. ► లెఫ్ట్ అధికారంలో ఉన్న సమయంలో 2003లో 70 మంది 2008లో 36 మంది మరణించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Poll violence in Bengal: బెంగాల్ పంచాయతీ హింసాత్మకం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలు రక్తసిక్తమయ్యాయి. తుపాకీ పేలుళ్లు, బాంబుల మోతలు, పేలుడు పదార్థాల విస్ఫోటనాలతో శనివారం రాష్ట్రం దద్దరిల్లింది. ఈ హింసాత్మక ఘటనల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎనిమిది మంది టీఎంసీ కార్యకర్తలు. బీజేపీ, సీపీఐ(ఎం), కాంగ్రెస్, ఐఎస్ఎఫ్ పార్టీలకు చెందిన వారు మరణించారు. కొన్ని చోట్ల బ్యాలెట్ బాక్స్‌లు ఎత్తుకొని పోవడం, వాటికి నిప్పు పెట్టడం వంటి ఘటనలు కూడా జరిగాయి. ముర్షీదాబాద్, నాడియా, కూచ్ బెహార్, జిల్లాలతో పాటు దక్షిణ 24 పరగణాలోని భాంగార్, నందిగ్రామ్‌లు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. గవర్నర్ ఆనంద బోస్ ఉత్తర 24 పరగణా జిల్లాలో స్వయంగా కొన్ని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. అక్కడ పరిస్థితుల్ని పర్యవేక్షించారు. మృతి చెందిన వారిలో బీజేపీకి పోలింగ్ ఏజెంట్ మధాబ్ బిశ్వాస్ కూచ్‌బెహార్ జిల్లాలో జరిగిన ఘర్షణలో మరణించారు. ఉత్తర దింజాపూర్‌లోని గోల్‌పోఖార్‌లో టీఎంసీ, కాంగ్రెస్ మద్య ఘర్షణల్లో టీఎంసీ పంచాయతీ అధ్యక్షురాలి భర్తను హత్య చేశారు. ముర్షీదాబాద్‌లో శుక్రవారం అర్ధరాత్రి చెలరేగిన హింసలో టీఎంసీ కార్యకర్త బాబర్ అలీ, ఖర్గామ్ ప్రాంతంలో టీఎంసీ కార్యకర్త సబీరుద్దీన్, కూచ్ బెహార్ జిల్లా తుఫాన్గంజ్లో బూతు కమిటీ సభ్యుడు గణేశ్ సర్కార్ మరణించినట్టుగా అధికారులు వెల్లడించారు. వీరందరిపైనే బీజేపీ కార్యకర్తలే దాడులు చేసి చంపేశారని టీఎంసీ ఆరోపించింది. మూడంచెలున్న పంచాయతీల్లో 73,887 సీట్లకు ఎన్నికలు జరిగాయి. 2 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. పార్టీల పరస్పర ఆరోపణలు ఎన్నికల్లో హింసకు మీరు కారణమంటే మీరేనని బీజేపీ, టీఎంసీలు ఒకరినొకరు నిందించుకున్నాయి. ఈ స్థాయిలో హింస చెలరేగితే కేంద్ర బలగాలు ఏం చేస్తున్నాయని టీఎంసీ మంత్రి శశిపంజా ప్రశ్నించారు. కేంద్ర బలగాలు ఎందుకు మోహరించాయని, టీఎంసీ కార్యకర్తల్ని హత్య చేస్తూ ఉంటే ఆ బలగాలు ఏం చేస్తున్నాయని నిలదీశారు. మరోవైపు రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి పాలనలో ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతాయని అన్నారు. ఈ ఘర్షణలకు టీఎంసీ కారణమంటూ బీజేపీ చేసిన ఆరోపణల్ని తోసిపుచ్చారు. హింసకు తామే కారణమైతే అంత మంది టీఎంసీ కార్యకర్తలు ఎందుకు చనిపోతారని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్లో బాంబుల సంస్కృతి‡ భారత ప్రజాస్వామ్యానికి మాయని మచ్చలా మారిందని, అంతర్జాతీయంగా దేశం పరువు పోతోందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. హత్యలు చేయడం ద్వారా అధికారంలోకి రావచ్చని మమత భావిస్తున్నారని ఆరోపించారు. హత్యల కారణంగా ఎన్నికల్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తూ హైకోర్టులో కాంగ్రెస్ నాయకుడు కౌస్తవ్ బగ్చి ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలంటూ కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరారు. -
ఇదేం విడ్డూరం! ఎన్నికైంది ఒకళ్లు... ప్రమాణ స్వీకారం చేసింది మరోకళ్లు
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలోని గైసాబాద్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక వివాదం తెరపైకి వచ్చింది. ఈ మేరకు గైసాబాద్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడు అంచెల ఎన్నికలు జరిగాయి. అయితే ఆ ఎన్నికల్లో సర్పంచ్‌గా షెడ్యూల్డ్ కులానికి చెందని ఒక మహిళ ఎన్నికైంది. అంతేకాదు ఆ ఎన్నికల్లో ఆమె తోపాటు మరికొంతమంది మహిళలు పంచాయతీ సభ్యులగా ఎన్నికయ్యారు ఐతే ప్రమాణా స్వీకారోత్సవానికి ఎన్నికైన మహిళలెవరూ హాజరు కాలేదు. పైగా ఆయా మహిళల స్థానంలో వారి భర్తలే ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు సంబంధిత అధికారి కూడా ఆయా మహిళల భర్తల చేత ప్రమాణ స్వీకారం చేయించినట్లు ఫిర్యాదుల వచ్చాయి. దీంతో జిల్లా యంత్రాంగం సంబంధిత అధికారులను నిజానిజాలు విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు దామోహ గ్రామ పంచాయతీ ఎన్నికల చీఫ్ ఎగ్జూక్యూటివ్ ఆఫీసర్ అజయ్ శ్రీవాస్తవ్ నిబంధనలకు విరుద్ధంగా ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అంతేకాదు ఈ ఘటనపై వివరణాత్మక నివేదికను ఇవ్వాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించామని, నివేదిక వచ్చిన వెంటనే పంచాయతీ సెక్రటరీ పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. (చదవండి: ఎంత ఘోరం.. నాలుగో అంతస్తు నుంచి చిన్నారిని పడేసిన తల్లి!) -
ఆ మూడు రోజులు మద్యం బంద్: ఎందుకు? ఎక్కడ?
పనాజీ: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు నెలలో మూడు రోజుల పాటు మద్యం అమ్మకాలపై నిషేధం విధించింది. ఆగస్టులో గోవా పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 9, 10, 12 తేదీలను డ్రై డేలుగా పాటిస్తామని ఆర్థిక కార్యదర్శి ప్రణబ్ భట్ శుక్రవారం ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. గోవాలోని 186 పంచాయతీ సంస్థలకు ఆగస్టు 10న ఎన్నికలు జరగనున్నాయి. 12వ తేదీన లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 9,10,12 తేదీల్లో 'డ్రై డే' అమల్లోకి వస్తుందని సర్కార్ ప్రకటించింది. ఆగస్టు 9,10, 12 తేదీల్లో మద్యం అమ్మకాలను నిలిపి వేయాలని మద్యం దుకాణదారులకు ఆదేశించారు. లైసెన్సు పొందిన బార్ అండ్ రెస్టారెంట్లలో కూడా మద్యం అమ్మకాలు నిషేధమని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేవలం ఆహారాన్ని అందించడానికి మాత్రమే ఆయా దుకాణాలను తెరవాలని చెప్పింది. ఈ విషయాన్ని తెలిపేలా ఒక బోర్డును కూడా ప్రదర్శించాలని నోటిఫికేషన్ పేర్కొంది. చదవండి : ట్విటర్ డీల్ వివాదం: మస్క్ మరో కీలక నిర్ణయం విలీనమా.. నో వే! కావాలంటే వారు వెళ్లిపోవచ్చు! -
నన్ను గెలిపించనప్పుడు నా డబ్బులు ఇచ్చేయండి! బెదిరిస్తున్న వ్యక్తి
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని రాజు దయమా అనే వ్యక్తి ప్రజలను బెదిరిస్తూ..హింసిస్తున్నందుకుగానూ పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇంతకీ ఆ వ్యక్తి ఏం చేశాడంటే...రాజు మానస తహసీల్‌లోని దేవరాన్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి పోటీ చేసి ఓడిపోయాడు. దీంతో అతను తాను ఎన్నికల్లో గెలవలేదు కాబట్టి తన డబ్బులు తనకిచ్చేయమంటూ ప్రజలను బెదిరించడం మొదలు పెట్టాడు. రాజు ప్రజలను బెదరించడమే కాకుండా హింసించడం వంటి పనులు కూడా చేశాడు. అందుకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో ఈ ఘటన వెలుగు చూసింది. రాజు పంచాయితీ ఎన్నికల్లో ఓడిపోయాను కాబట్టి తన వద్ద తీసుకున్న డబ్బులను వెనక్కి ఇచ్చేయాల్సిందే.. అంటూ ప్రజల వద్ద నుంచి సుమారు రూ. 4 లక్షలు వరకు వసూలు చేశాడని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు రాజు, అతని సహచరుడి పై ఎన్నికల్లో డబ్బు పంచినందుకు, ప్రజలను డబ్బు ఇచ్చేయమంటూ.. ఇబ్బందిపెట్టినందుకుగానూ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. (చదవండి: లాలూ యాదవ్ కుమారుడి విచిత్రమైన అభ్యర్థన... తిరస్కరించిన పోలీసులు) -
పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా 21 ఏళ్ల అమ్మాయి!
21-year-old Ujjain Girl: మధ్యప్రదేశ్‌లోని చింతామన్ జవాసియా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవి కోసం అదే గ్రామానికి చెందిన ఎనిమిది మంది మహిళా అభ్యర్థులు పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో తన సమీప అభ్యర్థిని ఓడించి 487 ఓట్ల ఆధిక్యంతో గెలిచిని అతి పిన్న వయస్కురాలిగా ఉజ్జయినికి చెందిన 21 ఏళ్ల అమ్మయిగా లతికా దాగర్ రికార్డు సృష్టించారు. లతికా మాస్ కమ్యూనికేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేశారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ...గ్రామ అభివృద్ధికి కృషి చేయడమే తన లక్ష్యంగా ఈ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశానని చెప్పారు. అంతేకాదు ఆమె మేనిఫెస్టోలో తాగునీరు, డ్రైన్, వీధిలైట్ల సమస్యలను పరిష్కరిస్తానని, ఇళ్లు లేని కుటుంబాలకు గృహనిర్మాణ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందంటూ పలు రకాలు హామీలు ఇచ్చి మరీ గెలుపొందారు. అంతేకాదు మూడంచెల పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన మధ్యప్రదేశ్‌లోని అతి పిన్న వయస్కురాలైన మహిళా సర్పంచ్‌గా రికార్డు సృష్టించింది. ఆమె ఈ రికార్డును యాదృచ్ఛికంగా తన పుట్టిన రోజుకు ఒక రోజు ముందు ఈ రికార్డును కైవసం చేసుకోవడం విశేషం. (చదవండి: ఐదేళ్లుగా అమ్మాయి కోసం చూసి చూసి.. చివరికి ఇలా..!) -
రాజధాని గ్రామాలు పంచాయతీ పరిధిలోకి రావు
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంత గ్రామాలు పంచాయతీ పరిధిలోకి రావని, మునిసిపాలిటీ పరిధిలోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అందుకే ఆ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదని తెలిపింది. రాజధాని ప్రాంత ఏర్పాటు ప్రక్రియలో పలు లోపాలున్నాయని, వాటిని సరిదిద్దుతున్నామని చెప్పింది. గ్రామ సభలు నిర్వహించకపోవడం, పంచాయతీలు తీర్మానాలు చేయకపోవడం వంటి లోపాలను సరిదిద్దాల్సి ఉందంది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, ఎన్నికలు నిర్వహించకపోతే ఆ గ్రామాల ప్రజలు వారి సమస్యలను ఏ ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లాలని ప్రశ్నించింది. ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) స్వతంత్రంగా వ్యవహరిస్తున్నట్లు లేదని, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు ఉందని వ్యాఖ్యానించింది. ఎన్నికల నిర్వహణపై వైఖరి ఏమిటో స్పష్టంగా చెప్పాలని ఎస్ఈసీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు మండలాల్లోని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ తుళ్లూరుకు చెందిన కొమ్మినేని కోటేశ్వరరావు, మరికొందరు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ దేవానంద్ విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది కె.శ్రీనివాసమూర్తి వాదనలు వినిపిస్తూ, ఎస్ఈసీ ఎన్నికలు నిర్వహించాల్సిన రాజ్యాంగ బాధ్యతను నిర్వర్తించకుండా రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకుంటోందన్నారు. ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి వాదనలు వినిపిస్తూ, రాజధాని పరిధిలోని గ్రామాలన్నీ మునిసిపాలిటీ పరిధిలోకి వస్తాయని, అందువల్ల పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రశ్నే తలెత్తదన్నారు. ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ, ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నందున ఎన్నికలు సాధ్యం కావని ప్రభుత్వం చెప్పిందన్నారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి, సీఆర్డీఏ తిరిగి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై వైఖరి ఏమిటో తెలుసుకుని చెప్పాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు. -
టీడీపీ నేతల బరితెగింపు
పెనుకొండ(అనంతపురం జిల్లా): టీడీపీ నాయకులు బరి తెగించారు. ఎన్నికల్లో ప్రజా మద్దతు లేకపోవడంతో అడ్డదారుల్లో వెళుతున్నారు. పెనుకొండ నగర పంచాయతీకి తొలిసారిగా జరుగుతున్న ఎన్నికల్లో వారి ఆగడాలు శ్రుతిమించాయి. ఓటర్లను భారీఎత్తున ప్రలోభాలకు గురి చేస్తున్నారు. డబ్బు, మద్యం, ఇతరత్రా నజరానాలు ఎర వేస్తున్నారు. మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, కాలవ శ్రీనివాసులు, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యేలు ఈరన్న, కందికుంట వెంకటప్రసాద్, ఉన్నం హనుమంతరాయ చౌదరితో పాటు టీడీపీ నేతలు పరిటాల శ్రీరామ్ తదితరులు మూడు వారాలుగా పెనుకొండలోనే మకాం వేశారు. ఒక్కొక్కరు ఒక్కో వార్డు బాధ్యతలు తీసుకుని, ఆ పరిధిలోని ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కర్ణాటక నుంచి భారీ ఎత్తున మద్యం తెప్పించి రహస్య ప్రాంతాల్లో నిల్వ చేశారు. అక్కడి నుంచి ఓటర్లకు పంచి పెడుతున్నారు. ఇదివరకే ఒకటో వార్డులో స్వయాన బీటీ నాయుడు వాహనంలోనే మద్యం దొరకడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయినా జంకకుండా టీడీపీ నేతలు ప్రలోభపర్వం సాగిస్తున్నారు. ప్రతికూల పరిస్థితులు ఉన్న వార్డుల్లో ఏకంగా ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5వేల దాకా పంచినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రచారం చివరిరోజైన శనివారం రోడ్‌షోలకు ఎస్పీ ఎవ్వరికీ అనుమతి ఇవ్వలేదు. దీంతో వైఎస్సార్సీపీ తరఫున మంత్రి శంకరనారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్ రోడ్‌షో నిర్ణయాన్ని ఉపసంహరించుకుని..ప్రచారానికే పరిమితమయ్యారు. టీడీపీ నేతలు మాత్రం పోలీసుల ఆంక్షలను యథేచ్ఛగా ఉల్లంఘించారు. వంద వాహనాలతో పట్టణంలో హల్చల్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. నగర పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నేతలు సార్వత్రిక ఎన్నికలకు మించి చేస్తున్న హడావుడి, ఆగడాలపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. -
గేదెపై వచ్చి మరీ అభ్యర్థి నామినేషన్.. ఎందుకంటే?
పాట్నా: పంచాయతీ ఎన్నికలతో బిహార్ రాజకీయ వాతావరణం వేడివేడిగా ఉంది. ఇప్పటికే ఆర్జేడీ యువ నాయకుడు తేజస్వి యాదవ్ ఓ గ్రామంలో మహిళలకు డబ్బులు పంచుతున్న వీడియో తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై విచారణ కొనసాగుతోంది. అయితే తాజాగా ఓ అభ్యర్థి పెరుగుతున్న పెట్రోల్ ధరలపై ఆందోళన వ్యక్తం చేస్తూ వినూత్న రీతిలో నిరసన చేపట్టాడు. ఊరేగింపుగా గేదెపై వెళ్లి నామినేషన్ దాఖలు చేశాడు. చదవండి: రజనీకాంత్ స్టైల్లో మంత్రి హరీశ్‌రావు డ్యాన్స్ కఠియార్ జిల్లా హసన్‌గంజ్ పంచాయతీలోని రామ్‌పూర్ గ్రామస్తుడు మహ్మద్ ఆజాద్ ఆలం. ఓ పాడి రైతు. పాడి పశువులను పెంచి పోషిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఈసారి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో సోమవారం నామినేషన్ వేసేందుకు గేదెపై వెళ్లాడు. అలా ఎందుకు వెళ్లాడని ఆరా తీస్తే.. ‘పెట్రోల్ ధరల పెరుగుదల’ కారణంగా చెప్పాడు. చదవండి: అమ్మా దొంగా ఇక్కడున్నావా? చిన్నారి బిస్కెట్ దొంగతనం వైరల్ ‘పెరుగుతున్న పెట్రోల్ ధరలు నేను భరించలేకపోతున్నా. నేను పాడి రైతును. నేను గేదెపై మాత్రమే ప్రయాణించగలను’ అని అభ్యర్థి ఆలం మీడియాకు తెలిపాడు. అయితే పోటీ చేస్తున్న స్థానం నుంచి గెలిస్తే ఏం చేస్తాడో కూడా చెప్పాడు. గెలిస్తే తాను వైద్య రంగంపై దృష్టి సారిస్తానని ఆలం చెప్పాడు. కాగా బిహార్‌లో 11 దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. డిసెంబర్ 12న చివరి దశ జరగనుంది. #WATCH | Bihar Panchayat Polls 2021: Azad Alam, a candidate from Katihar district's Rampur panchayat arrived to file his nomination on a buffalo yesterday pic.twitter.com/CBIF0bbqPl — ANI (@ANI) September 13, 2021 -
యూపీలో మొదలైన ఓట్ల ఆట
పంచాయతీ ఎన్నికల తొలివిడతలో ప్రతికూలతను సానుకూలంగా మార్చుకోవడంలో యూపీ ప్రతిపక్షం చాతుర్యం, కౌశలం ప్రదర్శించినప్పటికీ, బీజేపీతో సమానంగా పోటీ పడటంలో... పార్టీనీ లేదా కూటమినీ సిద్ధం చేయడంలో అది సుదీర్ఘ ప్రయత్నాలు మొదలెట్టాల్సి ఉంటుంది. యూపీ సీఎం ఆదిత్యనాథ్ ముందస్తు రాజకీయ చర్యలతో మిగతా పార్టీలకంటే ప్రయోజనం పొందడంలో బీజేపీ ముందంజలో ఉంటున్నట్లే లెక్క. పంచాయతీ ఎన్నికల్లో గెలిచామనీ, వైరస్‌ను రాష్ట్రం నుంచి నిర్మూలించేశామనీ అతిశయోక్తులు చెబుతున్నప్పటికీ ప్రజాగ్రహం, వేదనను ఇవి తొలగించడం లేదు. క్షేత్రస్థాయిలో ప్రజల్లో గూడుకట్టుకుని ఉన్న ఈ మనోభావాలను బీజేపీకి, యోగి ఆదిత్యనాథ్‌కి వ్యతిరేకంగా యూపీ ప్రతిపక్షాలు మల్చగలవా అనేది ప్రశ్న. ఉల్లాసం, ఆనందం తర్వాత నిరాశ, నిస్పృహ వెంటాడుతాయి. దాంతోపాటు గాల్లో తేలియాడుతున్న మన కాళ్లు కూడా నేలమీదకొస్తాయి. సరిగ్గా ఈవిధంగానే ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వంపై వనరులు, కండబలం, హస్తలాఘవం, నిర్బంధం, అధికార దుర్వినియోగం గురించి ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినప్పటికీ, పంచాయతీ ఎన్నికల అంతిమ ఫలితాల నేపథ్యంలో వాటికి అర్థం ఏమిటన్న అంశం విషయంలో అవి కఠిన వాస్తవాలతో ఘర్షణ పడాల్సివచ్చింది. గ్రామస్థాయి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడానికి ఈ ఏప్రిల్ నెలలో ప్రత్యక్షంగా జరిగిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ తొలిదశలో సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీలు రెండూ విజయాలు సాధించాయి. ఓటర్లు ఎస్పీ, ఆర్ఎల్డీ పార్టీలకు విశిష్టంగా ప్రాధాన్యతనిచ్చారు. తర్వాత స్థానాల్లో బీజేపీ, బీఎస్పీలను నిలిపారు. ఇకపోతే కాంగ్రెస్ తదితర పార్టీలు తర్వాత స్థానాల్లో నిలిచి వెనుకబడ్డాయి. కానీ మండల ప్రముఖ్‌లను, జిల్లా పంచాయతీ ప్రెసిడెంట్లను ఎన్నుకునే సమయానికి ఈ విజయగాథ తీరు కాస్తా మారిపోయింది. వీరిని పరోక్ష ఎన్నికల ద్వారా గ్రామ స్థాయి పంచాయతీ ప్రతినిధులు ఎన్నుకున్నారు. డబ్బు, కండబలం ఉపయోగించి ఫలితాలను తారుమారు చేసేందుకు ఎక్కువ అవకాశముండే ఈ రెండవ, మూడవ స్థాయి ఎన్నికల్లో గెలుపొందడంలో అధికార బీజేపీ ముందంజలో నిలిచింది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో పార్టీ చిహ్నాలతో పోరాడటం జరగదు. అయినప్పటికీ ఏ అభ్యర్థి ఏ పార్టీ మద్దతు పొందారు అనేది అందరికీ తెలిసే ఉంటుంది. రాజకీయంగా ప్రస్తుతం ఉన్న ట్రెండ్ పంచాయతీ ఎన్నికల్లో కొనసాగింది కూడా. తార్కికంగా చూస్తే, ఎస్పీ, ఆర్ఎల్డీ పార్టీలు మద్దతిచ్చిన అభ్యర్థుల నుంచి ఎలక్టోరల్ కాలేజీని రూపొందిస్తారు కాబట్టి బీజేపీ సాధారణంగా బ్లాక్, పంచాయతీ అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోవాల్సి ఉంది. కానీ అభ్యర్థులను బెదిరిం చడం, హింస, దాడికి పాల్పడ్డారని ప్రతిపక్షాలు ధ్వజమెత్తినప్పటికీ, బీజేపీ బ్లాక్ స్థాయిలో (75కు గాను 67 స్థానాలు) జిల్లా పంచాయతీల్లో (825కి గాను 635 స్థానాలు) అధ్యక్ష పదవులను గెల్చి చక్కటి మెజారిటీ సాధించింది. వచ్చే సంవత్సరం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా సహాయపడే గ్రామీణ ప్రాతినిధ్య సంస్థలపై బీజేపీ తన పట్టు నిలుపుకున్నట్లయింది. బీజేపీ ఎంతగా ప్రయత్నించినప్పటికీ, ఉత్తరప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో కలిసి పనిచేసిన ఎస్పీ, ఆర్ఎల్డీ పార్టీలు ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించాయి. గతంలో హిందుత్వ ఆధిపత్య రాజకీయ వాతావరణంలో తనపై పడిన మైనారిటీ అనుకూల ముద్రను చెరిపేసుకోవడంలో స్పష్టత ప్రదర్శించినట్లు కనిపించిన సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఇప్పుడు ముస్లింలపై దృష్టి పెట్టారు. యూపీ రాజధానిలోని పార్టీ కార్యాలయంలో అఖిలేష్ తొలి సమావేశం ప్రధానంగా ముస్లింలైన చేనేతకారులతో, లక్నో సమీపంలోని మలిహాబాద్కి చెందిన మామిడితోటల పెంపకందార్లతో జరగడం విశేషం. ‘ప్రజాతీర్పును కొల్లగొట్టారు’, ‘రామాలయ విరాళాలు దొంగిలించారు’, ‘కోవిడ్–19 నిర్వహణలో వైఫల్యం చెందారు’ అనే నినాదాలతో బీజీపీపై, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లపై అఖిలేష్ విరుచుకుపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లోలాగా ప్రతికూలతను సానుకూలంగా మార్చుకోవడంలో యూపీ ప్రతిపక్షం చాతుర్యం ప్రదర్శించినప్పటికీ, బీజేపీతో పోటీ పడటానికి లేదా కూటమిని సిద్ధం చేయడంలో సుదీర్ఘ ప్రయత్నాలు మొదలెట్టాల్సి ఉంటుంది. తాను తీసుకొస్తున్న జనాభా విధానం ఏ మతాన్ని కూడా గాయపర్చకూడదనే భావానికి బీజేపీ స్థిరంగా దూరం జరుగుతున్నందున నూతన జనాభా పాలసీ ఇప్పుడు మైనారిటీలను భయపెడుతోంది. బీజేపీ నేతలు కొందరు ఎమర్జెన్సీ కాలానికి తిరిగి వెళుతూ ‘మనమిద్దరం, మనకిద్దరు’ అనే సంజయ్ గాంధీ నినాదాన్ని వెలుగులోకి తీసుకురావడం గమనార్హం. అత్యవసర పరిస్థితిలో ముస్లింలను సామూహికంగా, నిర్బంధంగా కుటుంబ నియంత్రణకు బలవంతపెట్టడంతో 1977 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఉత్తరాదిలో మట్టిగరిచిపోయింది. యూపీలో విభిన్న సామాజిక వర్గాలను రాజకీయపరంగా చీల్చివేయాలనే తన ప్రాథమిక ఎజెండాను ముందుకు తీసుకుపోవడానికి అవసరమైన ప్రతీ చర్యను చేపట్టే విషయంలో యోగి ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. కాగా, నాలుగేళ్లుగా గాఢనిద్రలో ఉండి గత వారమే మేల్కొన్న బహుజన్ సమాజ్ పార్టీ బ్రాహ్మణుల మనస్సును గెల్చుకోవడానికి తన పథకాన్ని ప్రకటించింది. అనేక కారణాల వల్ల యోగిపట్ల బ్రాహ్మణులు ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాన్పూర్‌కి చెందిన సవర్ణుడు, తన ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మిశ్రా తోడ్పాటుతో 2007 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణుల హృదయాలను గెల్చుకోవడంలో బీఎస్పీ ప్రెసిడెంట్ మాయావతి విజయం సాధించారు. ఆయనకు బ్రాహ్మణ సమాజంతో చక్కటి అనుసంధానం కలిగి ఉండటం మాయావతికి ఎంతగానో కలిసొచ్చింది. ఆనాటి ఎన్నికల్లో 51 మంది బ్రాహ్మణ అభ్యర్థులను మాయావతి నిలబెడితే 20 స్థానాల్లో వారు గెలవడం సంచలనం కలిగించింది. కానీ 2017లో బీఎస్పీ నిలబెట్టిన 52 మంది బ్రాహ్మణ అభ్యర్థుల్లో నలుగురు మాత్రమే గెలుపొందారు. పైగా బ్రాహ్మణ సమాజం ఇప్పుడు బీజేపీవైపు తిరిగిపోయింది. బ్రాహ్మణులను బీజేపీకి దూరం చేయాలంటే మాయావతి వారికి విశ్వసనీయ సందేశం పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యూపీలోని సంక్లిష్ట సామాజిక చట్రంలో ప్రస్తుతం బ్రాహ్మణుల మనస్సు గెల్చుకోవాలనుకుంటున్న మాయావతి సామర్థ్యం ముందుగా తన కీలకమైన దళిత ఓట్లను నిలిపి ఉంచుకోవడం పైనే ఆధారపడి ఉంటుంది. నిజానికి 2014 నుంచి యూపీలోని పలు దళిత ఉపకులాలు బీజేపీ వైపు తిరిగిపోయాయి. పైగా సహరాన్‌పూర్‌కి చెందిన యువ లాయర్, కార్యకర్త చంద్రశేఖర్ ఆజాద్ రావన్ తాను స్థాపించిన ఆజాద్ సమాజ్ పార్టీ పతాక కింద దళిత ఓట్లను రాబట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మాయా వతికంటే చాలా చిన్నవాడే అయినప్పటికీ, కులాలవారీగా జన గణన చేయాలని, ప్రమోషన్లలో రిజర్వేషన్ల కోసం చట్టాన్ని రూపొందించాలని ఆజాద్ చర్చకు పెడుతున్నారు. కానీ బీఎస్పీ సంవత్సరాలుగా ఈ అంశంపై సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఉండటం గమనార్హం. మరోవైపున కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా చాలా కాలం తర్వాత ఉత్తరప్రదేశ్‌లో మూడురోజుల పర్యటన చేశారు. యూపీపై మరింత ఎక్కువ సమయం గడుపుతానని ఆమె గతంలో ప్రకటించి ఉన్నారు. ఆమె ప్రస్తుత పర్యటనలో చిన్నచిన్న పార్టీలతో పొత్తుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నదని సంకేతాలు వెలువరించారు. కానీ అదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలను పణంగా పెట్టి ఎవరితోనూ పొత్తు కుదుర్చుకోమని ఆమె స్పష్టం చేశారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి నిజంగానే యూపీలో బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ పార్టీలకు లాగా కార్యకర్తలు ఉన్నట్లయితే, 1989 నుంచి యూపీలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ చతికిలబడిపోవడానికి బదులుగా రాజ కీయ క్రీడలో ఆ పార్టీ కూడా కొనసాగుతూ వచ్చేది. మరోవైపున కరోనా సెకండ్ వేవ్ నియంత్రణలో విఫలమై ప్రజ లను వారి ఖర్మానికి వారిని వదిలేశారని యూపీ సీఎం తీవ్ర విమర్శల పాలైనప్పటికీ తనలోని సహజాతాల కారణంగా వచ్చే ముందస్తు ప్రయోజనాలను బీజేపీ కొనసాగిస్తూ వస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో విజయాన్ని, వైరస్ నిర్మూలనను తన గొప్పగా యోగి ఆదిత్యనాథ్ ప్రకటిస్తున్నప్పటికీ, అది ప్రజాగ్రహాన్ని, వారి వేదనను చల్లార్చడానికి సరిపోదు. మరి క్షేత్రస్థాయిలో ప్రజల మనోభావాలను ప్రతిపక్షం సొంతం చేసుకుని బీజేపీ, ఆదిత్యనాథ్‌లకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించగలదా అనేది భవిష్యత్తులో తేలాల్సి ఉంది. రాధికా రామశేషన్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు -
ఐఏఎస్ ఆఫీసర్ దౌర్జన్యం.. రిపోర్టర్ వెంటపడి మరీ దాడి
UP Block Panchayat Chief Elections స్థానిక సంస్థల ఎన్నికలు దాడుల పర్వంగా మారిపోయాయి. ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో వరుస దాడుల ఘటనలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఎలక్షన్ విధుల్లో ఉన్న ఓ పోలీస్ అధికారి తనను బీజేపీ కార్యకర్తలు కొట్టాడనే ఫిర్యాదు చేయగా.. మరో ఘటనలో ఐఏఎస్ అధికారి ఓ టీవీ రిపోర్ట్‌ను వెంటపడి మరీ బాదాడు. ఆ ఘటనా వీడియో సర్క్యూలేట్ అవుతోంది. లక్నో: మియాగంజ్‌లో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఉన్నావ్ ఛీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్(సీడీవో) అయిన దివ్యాన్షు పటేల్.. ఓ టీవీ రిప్టోరన్‌ను వెంటపడి మరీ కొట్టాడు. సెల్‌ఫోన్‌తో షూట్ చేస్తుండగా తన అధికార జులుం ప్రదర్శించాడు. దివ్యాన్షు వెంట ఉన్న బీజేపీ కార్యకర్తలు కూడా అతనిపై తలా ఓ చెయ్యి వేశారు. ఇది గమనించిన పోలీసులు ఆ నేతలను అడ్డగించే ప్రయత్నం చేశారు. ఓటింగ్‌లో పాల్గొనకుండా లోకల్ కౌన్సిల్ సభ్యులను కొందరిని కిడ్నాప్ చేశారని, ఆ వ్యవహారంలో దివ్యాన్షు ప్రమేయం ఉందని, ఆ ఘటనను వీడియో తీసినందుకే తనపై దివ్యాన్షు దాడి చేశాడని బాధితుడు కృష్ణ తివారీ ఆరోపిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఘటనపై స్పందించేందుకు దివ్యాన్షు నిరాకరించగా.. ఈ వ్యవహారంపై ఉన్నావ్ కలెక్టర్ స్పందించారు. జర్నలిస్ట్‌తో మాట్లాడానని, అతని నుంచి ఫిర్యాదును స్వీకరించానని, పారదర్శకంగా దర్యాప్తు జరిపిస్తానని ఉన్నావ్ జిల్లా మెజిస్రే్టట్ రవీంద్ర కుమార్ హామీ ఇచ్చారు. కాగా, యూపీ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు చాలానే జరిగినట్లు ప్రతిపక్షాల నుంచి ఫిర్యాదులు అందుతుండగా, మిత్రపక్షాలతో కలిసి 635 పంచాయితీ చీఫ్ స్థానాలు గెల్చుకున్న బీజేపీ ఈ విజయాన్ని ‘చరిత్రాత్మక విజయం’గా అభివర్ణించుకుంటోంది. भाजपा के MLA और ज़िलाध्यक्ष बम लेकर पुलिस वालों पर हमला कर रहे हैं ! ये है भाजपा के गुंडो का असली चेहरा ! #यूपी_में_गुंडाराज #नहीं_चाहिए_भाजपा pic.twitter.com/l4yg5Gcc0Z — Anshuman Singh. (@AnshumanSP) July 10, 2021 -
BSP: మాయావతి కీలక నిర్ణయం
లక్నో: బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ జిల్లా పంచాయత్ ఎన్నికల్లో తాము పోటీచేయమని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికలపైనే పూర్తిగా దృష్టి సారించాలనుకుంటున్నామని, అందుకే స్థానిక ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు మాయావతి సోమవారం విలేకరులతో మాట్లాడుతూ... రానున్న ఎన్నికల్లో బీఎస్పీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నానన్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా.. ‘‘ఉత్తర్‌ప్రదేశ్ రక్షణే ధ్యేయం’’ అన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా పంచాయత్ ఎన్నికల్లో పోటీ చేయడం కంటే కూడా నియోజకవర్గాలపై దృష్టి సారించి, కేడర్ బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మాయావతి వెల్లడించారు. నిజానికి, ఈ ఎన్నికలు పారదర్శకంగా జరిగి ఉంటే పోటీ చేసే విషయం గురించి ఆలోచించే వాళ్లమని, కానీ ఇప్పుడు ఈ పరిస్థితి లేదంటూ ప్రభుత్వాన్ని విమర్శించారు. కాగా మాయావతి నిర్ణయంపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ, అధికార బీజేపీకి సహకరించేందుకే మాయావతి పంచాయత్ ఎన్నికల బరిలో నిలవడం లేదని ఆరోపించింది. ఈ మేరకు... యూపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అశోక్ సింగ్ ట్విటర్ వేదికగా... ‘‘బీజేపీకి ఎప్పుడు సాయం కావాలన్నా మాయావతి ఈ విధంగా ఎన్నికల నుంచి తప్పుకొంటూ ఉంటారు. జిల్లా పంచాయత్ ఎన్నికల్లో పోటీ చేయం అన్న ప్రకటన కూడా ఈ కోవకు చెందినదే’’ అని విమర్శించారు. ఇందుకు స్పందనగా... బీఎస్పీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే జిల్లా పంచాయతీ సభ్యులు చచ్చినట్లు తమ పార్టీలో చేరతారని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాయావతి బదులిచ్చారు. కాగా జూలై 3న యూపీలో జిల్లా పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా... ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన 3 వేల మంది సభ్యులు జిల్లా పంచాయతీ చీఫ్‌లను ఎన్నుకోనున్నారు. చదవండి: ఎంఐఎంతో పొత్తుండదని మాయావతి స్పష్టీకరణ -
ఓటేయలేదుగా ఊరు విడిచి పోండి: ఓ నాయకుడి దౌర్జన్యం
హుబ్లీ: పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయలేదని ఓ వ్యక్తి సదరు గ్రామానికి చెందిన వారిని గ్రామం విడిచి వెళ్లాలని హుకుం జారీ చేశాడు. హుబ్లీ తాలూకా తిమ్మసాగర అంచటకేరి గ్రామ పంచాయతీ సభ్యుడు సహదేవప్ప తమను ఊరు విడిచి వెళ్లాలని రోజూ వేధిస్తున్నాడని ఆ గ్రామ ప్రముఖులు మంజునాథ్ తదితరులు మీడియా ఎదుట వాపోయారు. ప్రభుత్వం స్థలంలో వీరు ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు. దివంగత శివళ్లి మంత్రిగా ఉన్న సమయంలో ఇక్కడ రోడ్లు, తాగునీటి సదుపాయం కల్పించారు. ఈ క్రమంలోనే వీరికి ఇళ్ల పట్టాలు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆయన మరణాంతరం పరిస్థితి మారిపోయింది. గ్రామ పంచాయతీ సభ్యుడు సహదేవప్ప, మల్లవ్వ జంబాళ మాకు ఓటు వేయలేదంటూ నిత్యం వేధిస్తున్నారని మేము ఎక్కడి వెళ్లాలని బాధితులు వాపోయారు. చదవండి: ముఖ్యమంత్రిని పంపేందుకు ముహూర్తం పెట్టాం -
UP Panchayat Election Result 2021: బీజేపీకి మరో ఎదురుదెబ్బ
లక్నో: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించలేక డీలాపడ్డ బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో చేదు అనుభవం ఎదురయ్యింది. జిల్లా పరిషత్ ఎన్నికల్లో ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ కంటే వెనుకంజలో నిలిచింది. మొత్తం 3,050 స్థానాలకు గాను బీజేపీ మద్దతుదారులు కేవలం 599 స్థానాల్లోనే గెలిచారు. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) 790, బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ)354 సీట్లల్లో పాగా వేశాయి. ఇక కాంగ్రెస్ పార్టీ 60 స్థానాల్లో జెండా ఎగురవేసింది. 1,247 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ స్థానం వారణాసి, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంత జిల్లా గోరఖ్‌పూర్‌లోనూ బీజేపీని ప్రజలు తిరస్కరించడం గమనార్హం. కీలకమైన జిల్లాల్లో ఆ పార్టీ ప్రజల మనసులను గెలుచుకోలేకపోయింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. వైరస్‌ను కట్టడి చేయడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమయ్యిందన్న ఆరోపణలున్నాయి. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇకమీదట అయినా మేల్కోనకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. పార్టీ సీట్లు బీజేపీ 599 ఎస్పీ 790 బీఎస్పీ 354 కాంగ్రెస్ 60 ఇతరులు 1,247 మొత్తం 3,050 -
ఘోరం: 577 మంది టీచర్లు కరోనాకు బలి
లక్నో: మహమ్మారి కరోనా వైరస్ రెండో దశ కల్లోలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితులు దయనీయంగా మారాయి. కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తున్నా ఆ రాష్ట్రంలో ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున కరోనా బారినపడుతున్నారు. అయితే ఒక్క ప్రభుత్వ ఉపాధ్యాయులే కరోనా బారినపడి ఏకంగా 577 మంది చనిపోయారంట. ఈ విషయాన్ని ఆ రాష్ట్రానికి చెందిన ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. ‘కరోనా బారిన అంతమంది ఉపాధ్యాయులు చనిపోయారు.. దయచేసి ఎన్నికలు వాయిదా వేయండి’ అంటూ ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి విన్నవిస్తున్నాయి. ఈ మేరకు గురువారం యూపీ శిక్షక్ మహాసంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు దినేశ్ చంద్ర శర్మ తమ ప్రతినిధులతో కలిసి ఎన్నికల సంఘానికి వినతిపత్రం ఇచ్చారు. మే 2వ తేదీన జరగాల్సిన ఓట్ల లెక్కింపును వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల మృతిపై ఓ నివేదిక ఎన్నికల సంఘానికి సమర్పించారు. 71 జిల్లాల్లో 577 మంది ఉపాధ్యాయులు మృత్యువాత పడ్డారని నివేదికలో ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు ప్రస్తావించారు. పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు పెద్ద ఎత్తున కరోనా సోకిందని దినేశ్‌చంద్ర శర్మ తెలిపారు. అంతకుముందు మంగళవారం ఏప్రిల్ 27వ తేదీన హైకోర్టు ఉపాధ్యాయుల మరణాలపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ విధంగా ఆ రాష్ట్రంలో కరోనా బారినపడి ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున మరణిస్తున్నారు. అయితే ఉపాధ్యాయుల విజ్ఞప్తిని మన్నించి ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపును వాయిదా వేస్తుందా లేదో వేచి చూడాలి. చదవండి: ఆక్సిజన్ సిలిండర్ కోసం 24 గంటల్లో 1,300 కి.మీ జర్నీ చదవండి: ఇప్పటివరకు లాక్డౌన్ ప్రకటించిన రాష్ట్రాలు ఇవే.. -
ఊరిని మార్చడం కోసం 81 ఏళ్ల వృద్ధురాలు
ఊరే ముందు పుట్టిందో, రాణిదేవే ముందు పుట్టారో ఆ ఊళ్లో ఎవరికీ తెలియదు. ఊళ్లోని చెట్టూ పుట్టా, చేనూ చెరువూ, కొండా కోన ఆమె కళ్ల ముందే ఎదిగాయి. ఎదగకుండా ఉన్నది మాత్రం ఊరే. ఎదగని ఆ ఊరిని చూస్తూ.. ఇక చూస్తూ ఊరుకోకూడదని నిర్ణయించుకున్నారు రాణి దేవి. రాణిదేవి బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్ సభ్యురాలో, లేక ‘గ్రామ ప్రధాన్’నో కానవసరం లేదు. ఆమెకై ఆమె వెళ్లి అడిగితే గ్రామంలోని ఏ ప్రభుత్వ ఉద్యోగి, అధికారి అయినా వెంటనే కుర్చీలోంచి లేచి, ఎదురెళ్లి ఆమెకు నమస్తే పెట్టి, అవసరమైన పని చేసిపెట్టేంత గౌరవనీయమైన పెద్ద వయసులో ఉన్నారు రాణిదేవి. 81 ఏళ్లు! అసలైతే ప్రభుత్వమే ఆమె దగ్గరకు రావాలి. ఆమె ప్రభుత్వం దగ్గరకు వెళ్లే అవసరం లేదు. ఉందీ అంటే ఆ గ్రామంలో ప్రభుత్వం సరిగా పని చేయడం లేదనే! ఎలాగంటే ఒక వృద్ధ మహిళ అడిగితేనే లక్ష్య పెట్టని ప్రభుత్వ సిబ్బంది.. తక్కినవారు అడిగితే పని చేసి పెడతారా?! అలా చేసి పెట్టి ఉంటే ఈ ఎనభై ఏళ్లలో.. రాణిదేవికి ఊహ తెలిసినప్పటి నుంచైతే.. ఈ డెబ్బై ఏళ్లలో రుద్రాపూర్ ఎంతో అభివృద్ధి చెంది ఉండాలి. అభివృద్ధి అంటే పెద్దగా ఏం కాదు.. మంచి రోడ్లు, మంచి నీరు, శుభ్రమైన పరిసరాలు.. ఇలా మనిషి మనుగడకు అవసరమైన కనీస వసతులు. కానీ రుద్రాపూర్‌లో ఏడు దశాబ్దాలుగా ఇవేవీ లేవు. చిత్రంగా ఉంటుంది.. వచ్చి వెళ్లిన పాలకులు, అధికారులు ఏం చేసినట్లు?! ∙∙ ఏం చేయలేదని, ఏం చెయ్యరు కూడానని చివరికి రాణిదేవే బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్ సభ్యురాలిగా నిలబడేందుకు నామినేషన్ వేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఏప్రిల్ 15 నుంచి విడతల వారిగా పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. మే 2 న కౌంటింగ్. అదే రోజు ఫలితాలు రావచ్చు. ఏ పంచాయితీకి ఏ ఫలితం వచ్చినా.. కాన్పూర్ జిల్లా చౌబేపుర్ బ్లాక్ కౌన్సిల్ సభ్యురాలిగా రాణిదేవి గెలవడం అత్యుత్తమ ఫలితం అవుతుంది. రాణిదేవి స్వగ్రామమైన రుద్రాపూర్ ఆ బ్లాక్ పరిధిలోనిది. ఆమె గెలుపు ఎలా అత్యుత్తమమైన ఫలితం అవుతుందో చూడండి. ఆమేమీ అధికారం కోసం, పదవి కోసం, నాలుగు రాళ్లు సంపాదించుకోవడం కోసం ఈ వయసులో నామినేషన్ వేయలేదు. ఏదైనా ఒక పార్టీ తరఫున అసలే పోటీ చేయడం లేదు. తనకై తను సొంతంగా, స్వతంత్ర అభ్యర్థిగా, ఊరిని మార్చడం కోసం ఎన్నికల్లో నిలబడ్డారు. ‘‘నన్ను గెలిపిస్తే ఊరిని నివాస యోగ్యం చేస్తాను’’ అని రాణిదేవి అంటున్నారు. మంచి మాటే! ఆకాశాన్ని కిందికి తెస్తాం, భూమిని పైకి తీసుకెళతాం అని హామీలు ఇవ్వడం కాకుండా.. ఊళ్లో నివాసం ఉండే పరిస్థితుల్ని కల్పిస్తాను అని రాణిదేవి అనడం.. ‘ఊరొదిలి ఎక్కడికీ వెళ్లనవసరం లేదు’ అని నమ్మకమైన హామీని ఇవ్వడమే. అయినా రుద్రాపూర్ గ్రామ ప్రజలు ఊరెందుకు వదలి వెళ్లాల్సి వస్తుంది?! ∙∙ ఇన్నేళ్లుగా ఊరిని చూస్తూనే ఉన్నారు కదా రాణిదేవి.. ఊళ్లో సరైన రోడ్లు లేవు. ఆ ఊళ్లో కాలి నడక కూడా మనిషిని కిందపడేస్తుంది. ఎగుడు దిగుడు దిబ్బలే అక్కడి రహదారులు. ఎక్కడ పడితే అక్కడ చెత్త కొండలా పేరుకుపోయి ఉంటుంది. ఊరి నిండా మురికి కుంటలే. అంత ‘సౌకర్యవంతంగా’ ఉంటే దోమలు తమ సంతతి ని వృద్ధి చేసుకోకుండా ఉంటాయా, మనుషుల్ని ఆసుపత్రులకు చేర్చకుండా ఉంటాయా?! పరిశుభ్రత అన్న మాటే కనిపించదు. చెప్పీ చెప్పీ ఊళ్లో వాళ్ల నోళ్లు పోయాయి తప్పితే, వాళ్ల ఓట్లతో గెలిచిన పంచాయితీ పాలకులు సక్రమంగా చెత్తను ఎత్తి పారేయించింది లేదు. మురికి కాలవల్ని సాఫీగా పారించింది లేదు. దోమల్ని తరిమిందీ లేదు. ‘‘ఇదిగో ఈ దుస్థితినంతా పోగొట్టి ఊరిని చక్కబరుస్తాను’’ అంటున్నారు రాణిదేవి పట్టుపట్టినట్లుగా. ‘‘పూర్వపు పాలకుల వైఫల్యాలను మా అమ్మ ఎత్తి చూపించడమే కాకుండా, ఎత్తి పారేయబోతున్నారు కూడా’’ అని రాణిదేవి కుమారుడు చాంద్ పాల్ అంటున్నారు. రాణిదేవి మనవరాలు కూడా తన నానమ్మను గెలిపిస్తే ఊరెంత వెలిగిపోతుందో చెబుతూ ఆమె తరఫున ప్రచారం చేస్తోంది. అయితే ఎవరూ ‘ఓట్ ఫర్’ అని చెప్పకుండానే... రుద్రాపుర్ బ్లాక్‌లోని వారంతా ఇప్పటికే మూకుమ్మడిగా రాణిదేవికే ఓటు వేయాలని తీర్మానించుకున్నారు. -
వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ నేతల దాడి
మాచవరం (గురజాల): ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారనే అక్కసుతో రెండు కుటుంబాల మధ్య గొడవను అడ్డుపెట్టుకొని వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై పోలీస్ స్టేషన్లోనే టీడీపీ నేతలు దాడిచేశారు. గుంటూరు జిల్లా మాచవరం పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ సంఘటన సంచలనం కలిగించింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మాచవరం మండలం కొత్తపాలెం దళితవాడలో ఇద్దరు చిన్నారుల మధ్య పాఠశాలలో వివాదం తలెత్తిన నేపథ్యంలో పత్తిపాటి మోషే, ఏకుల లక్ష్మయ్య కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. తనపై దాడి చేశారంటూ మోషే ఈ నెల ఒకటిన ఏకుల లక్ష్మయ్యపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీన్ని మనసులో పెట్టుకుని ఆదివారం మోషే కుటుంబసభ్యులపై ఏకుల లక్ష్మయ్య గొడవకు దిగాడు. ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. దీనిపై ఫిర్యాదు చేసేందుకు మోషే, అతడి భార్య ప్రమీల బంధువులతో కలసి మాచవరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అది గమనించిన గ్రామ సర్పంచ్ గుదె రామారావు, టీడీపీ నాయకుడు యామని రామారావు, మరికొందరు నేతలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తున్న మోషే, ప్రమీల, చావా ఏసోబు, ఫీల్డ్ అసిస్టెంట్ నరేంద్రలపై దాడి చేశారు. పోలీస్‌స్టేషన్‌లోనే దుర్భాషలాడుతూ చొక్కాలు చింపి కొట్టారు. పోలీస్ సిబ్బంది వారించేందుకు ప్రయత్నించినా పట్టించుకోలేదు. అంతటితో ఆగకుండా వారే పోలీస్‌స్టేషన్ ఎదుట రోడ్డుపై కొద్దిసేపు బైఠాయించారు. సమాచారం తెలుసుకున్న రూరల్ సీఐ పీవీ ఆంజనేయులు, రాజుపాలెం, బెల్లంకొండ, పిడుగురాళ్ల ఎస్ఐలు అమీర్, రాజశేఖర్, చరణ్ పోలీస్ సిబ్బందితో గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. డీఎస్పీ విజయభాస్కర్‌రెడ్డి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి బాధితులతో మాట్లాడారు. టీడీపీ నేతల నుంచి తమకు ప్రాణాపాయం ఉందని, రక్షణ కల్పించాలని బాధితులు ఆయనకు విన్నవించుకున్నారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. ప్రమీల, నరేంద్ర, లక్ష్మయ్యల ఫిర్యాదుల మేరకు కేసులు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రాజా తెలిపారు. -
ఓట్ ఫర్ మిస్ ఇండియా
మిస్ ఇండియా–2015 లో ‘మిస్ బాడీ బ్యూటిఫుల్’ టైటిల్ విజేత దీక్ష యూపీ పంచాయితీ ఎన్నికల్లో జాన్పుర్ లోని బక్షా‘గ్రామ ప్రధాన్’గా పోటీ చేస్తున్నారు. నాలుగు విడతల ఆ ఎన్నికల్లో మొదటి విడతలోనే జాన్పుర్ జిల్లా ఉంది. పోలింగ్ ఏప్రిల్ 15 న. మే 2న ఫలితాల వెల్లడి. ‘‘నా చిన్నప్పుడు జాన్పుర్ ఎలా ఉందో ఈ రోజుకీ అలానే ఉంది. ఆ పరిస్థితిని మార్చేందుకే నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను’’ అని దీక్ష (24) అంటున్నారు. వాస్తవానికి దీక్ష ఇప్పటికే తన కెరీర్‌ని నిర్మించుకునే క్రమంలో వయసుకు మించిన గుర్తింపే తెచ్చుకున్నారు. ప్రధానంగా ఆమె మోడల్. పెద్ద పెద్ద కంపెనీలకు మోడలింగ్ ఇచ్చారు. త్వరలోనే వెబ్ సీరీస్‌లో కనిపించబోతున్నారు. ‘ఇష్క్ తేరా’ అనే ఒక సినిమా కథను రాసి, సినిమాగా తెరకు ఎక్కించేందుకు దర్శక నిర్మాతల కోసం చూస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె విడుదల చేసిన మ్యూజిక్ ఆల్బమ్ ‘రబ్బా మెహర్ కరే’కు నెట్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఇవన్నీ చేస్తున్న దీక్ష ఇప్పుడిక పంచాయితీ ఎన్నికల్లో గ్రామ ప్రధాన్‌గా పోటీ చేస్తున్నారు. ఆమె పోటీ చేస్తున్నది 26 వ నెంబరు వార్డు అభ్యర్థిగా. ఆ వార్డు పేరు బక్షా. దీక్ష పుట్టింది అక్కడే.. బక్షా ప్రాంతంలోని చిత్తోరి గ్రామంలో. ఆ గ్రామం జాన్పుర్ జిల్లా పరిధిలోకి వస్తుంది. బక్షా గ్రామ ప్రధాన్‌గా గెలిచి, క్రమంగా జాన్పుర్ జిల్లా అభివృద్ధికి తన వంతుగా కృషి జరపాలని దీక్ష ఆశిస్తున్నారు. అందుకు కారణం ఆమె చిన్నప్పుడు జాన్పుర్ ఎలా ఉందో ఇప్పటికీ ఏ అభివృద్ధీ జరగకుండా అలాగే ఉండటం! మిస్ ఇండియా 2015లో ‘మిస్ బాడీ బ్యూటిఫుల్’గా టైటిల్ గెలుచుకున్నప్పుడు దీ„ý వయసు 18. అప్పుడు ఆమె ముంబైలో బి.ఎ.సెకండ్ ఇయర్ చదువుతున్నారు. అప్పుడే ఫ్రెండ్స్ ప్రోద్బలంతో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నారు. ఆమె తండ్రి జితేంద్ర సింగ్ బిజినెస్‌మేన్. ముంబై, గోవా, రాజస్థాన్‌లలో వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. అలా వాళ్ల కుటుంబం ఉత్తరప్రదేశ్‌లోని జాన్పుర్ నుంచి ముంబైకి మారింది. దీక్ష ఇష్టాలు, ఆసక్తులు కూడా మారి మోడలింగ్ రంగంలోకి వెళ్లిపోయారు. ముంబైలో ఉంటున్న దీక్ష తరచు జాన్పుర్ వస్తుంటారు. ఈసారి అలా వచ్చినప్పుడే పంచాయితీ ఎన్నికల్లో నిలబడాలన్న ఆలోచన ఆమెకు కలిగింది. ‘‘చదువుకున్న అమ్మాయి కదా. నువ్వు గ్రామ ప్రధాన్ అయితే గ్రామం బాగుపడుతుంది. అంతే కాదు.. రాజకీయాల్లో నువ్వు పైపైకి ఎదిగిన కొద్దీ ఊరు, జిల్లా, రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతాయి’’ అని ఊళ్లోని పెద్దలు మద్దతు ఇచ్చారు. తల్లి, తండ్రి కూడా సరేనన్నారు. అంతే.. ఏప్రిల్ 3 న నామినేషన్ వేశారు దీక్ష. ఆమె ఆ ఊళ్లో మూడో తరగతి వరకు చదివారు. గ్రామ ప్రధాన్‌గా ఎన్నికైతే కనుక అదే ఊరి చేత అభివృద్ధి అక్షరాలను దిద్దించబోతారు దీక్ష. -
కనిపించని తమ్ముళ్లు.. టీడీపీ డీలా!
చిత్తూరు అర్బన్: పంచాయతీ ఎన్నికల ఫలితాలతో బేజారైన తమ్ముళ్లు మున్ని‘పోల్స్’కు దూరంగా ఉన్నారు. 30 మందికి పైగా సిట్టింగ్ కార్పొరేటర్లు పోటీకి వెనుకంజ వేసినట్లు తెలుస్తోంది. మార్చి 2, 3 తేదీల్లో ఉపసంహరణ ప్రక్రియ పూర్తయితే అసలు పోటీలో ఎవరైనా ఉంటారా అనే ప్రశ్న టీడీపీ నేతలను వేధిస్తోంది సిట్టింగులు దూరం చిత్తూరు నగరపాలక సంస్థకు మొదటిసారిగా 2014లో ఎన్నికలు నిర్వహించారు. అప్పట్లో 30కి పైగా స్థానాలను టీడీపీ గెలుచుకుంది. ఆ పార్టీ అభ్యర్థి కటారి అనురాధ చిత్తూరు తొలి మేయర్‌గా పీఠం అధిష్టించారు. అయితే ఆమెకు మేయర్ పదవి మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. అనురాధ, ఆమె భర్త కటారి మోహన్‌ను వారి రక్తసంబం«దీకులే మట్టుపెట్టారు. అనంతరం నలుగురు మహిళా కార్పొరేటర్ల భర్తలు కార్పొరేషన్‌ను తమ చెప్పుచేతల్లోకి తీసుకున్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రూ.కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. చిత్తూరు ప్రజలు ఏకపక్షంగా మద్దతుగా పలికి ఆరణి శ్రీనివాసులును ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఈక్రమంలో ప్రస్తుతం కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వచ్చాయి. అయితే నాడు కోట్లు కొల్లగొట్టినవారు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. బాధ్యత తీసుకుంటే దాచుకున్న మూటలను బయటకు తీయాల్సివస్తుందని ఇంటికే పరిమితమయ్యారు. టీడీపీలో ఆందోళన టీడీపీ తరఫున అభ్యర్థులు దొరకకపోవడంతో ఆ పార్టీ నేతలు అనామకులతో నామినేషన్లు వేయించారు. బతిమిలాడి.. డబ్బులిచ్చి బరిలో దించిన తమ్ముళ్లు ఇప్పుడు కనిపించకపోవడంతో చిత్తూరు టీడీపీలో ఆందోళన మొదలైంది. ఇప్పటి వరకు నగర పార్టీకి అధ్యక్షుడినే నియమించకపోవడంతో ఎవరికి వారు తమ కెందుకులే అని పక్కకు తప్పుకుంటున్నారు. ప్రస్తుత కీలక సమయంలో నూ కనీసం పార్టీ కార్యాలయానికి వచ్చేవారు కూడా కనిపించడంలేదు. దీంతో చిత్తూరు నగర టీడీపీలో నిస్తేజం ఆవరించింది. మరోవైపు వైఎస్సార్సీపీ మొత్తం 50 డివిజన్లుకు అభ్యర్థులను ప్రకటించేసింది. పోటీలో దిగిన అభ్యర్థులు ప్రచా రంలో దూసుకుపోతున్నారు. ఈ పరిణామాలను గమనించిన టీడీపీ జిల్లా నాయకులు కింకర్తవ్యం అంటూ మధనపడుతున్నారు. ఎవరికి వారు దూరంగా ఉండిపోతున్నారు. చదవండి: బాబు ఊకదంపుడు.. జారుకున్న జనం! చంద్రబాబు మేనిఫెస్టో.. ఓ 420 వ్యవహారం -
తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లాయి : అంబటి
సాక్షి, తాడేపల్లి : పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు భారీ ఎత్తున గెలిచినా, చంద్రబాబు మాత్రం తామే గెలిచామంటూ టపాసులు కాల్చాడం చాలా విడ్డూరంగా ఉందని రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..'టీడీపీ ఆవిర్భాం నుంచి కంచుకోటగా ఉన్న పంచాయతీల్లో కూడా వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడింది. కుప్పంలో టీడీపీ కేవలం 14 పంచాయతీలు మాత్రమే గెలిచారు. రాష్ట్రమంతా ఇలానే ఉన్నా చంద్రబాబు మాత్రం ప్రజస్వామ్యం ఓడిందంటున్నారు. నామినేషన్ వేయడానికి కూడా కుప్పం వెళ్లని చంద్రబాబుని జగన్ కుప్పం రప్పించారు. ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు బజారు బజారు తిరుగుతున్నారు...ఇది జగన్మోహన్ రెడ్డి గొప్పదనం' అని అంబటి రాంబాబు అన్నారు. మున్సిపల్ ఎన్నికలు కూడా వదిలేసి చంద్రబాబు కుప్పంలో తిష్ట వేశారని, బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ బొమ్మలు పెట్టుకుని కుప్పంలో సైతం తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్‌ను ప్రచారానికి తీసుకెళ్లి, ఓడిన తర్వాత పక్కన పెట్టారని, చివరికి ఆయన సినిమాలు కూడా చూడవద్దని సూచించిన చంద్రబాబు..ఇప్పుడు ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకున్నాడని ధ్వజమెత్తారు. 'నేను పులివెందులకు నీళ్లిచ్చాను...ఇప్పుడు కుప్పానికి నీళ్లివ్వండి అంటాడు.నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేశావ్...పులివెందులకు నువ్వు నీళ్లిచింది ఎప్పుడు..?' అని అంబటి ప్రశ్నించారు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లాయని తెలుగు తమ్ముళ్లు గుర్తించాలన్నారు. 'పుంగనూరులో పోటీ చేస్తాను అని అంటాడు... అంటే కుప్పాన్ని వదిలేసావా..? ఈ రోజు పచ్చకాగితాల మేనిఫెస్టో రిలీజ్ చేశారు. 2014లో విడుదల చేసిన మేనిఫెస్టోలో ఒక్కటన్నా అమలు చేశావా? అధికారంలో ఉన్నప్పుడు అమలు చేయలేని నువ్వు అధికారంలో లేనప్పుడు ఎలా అమలు చేస్తావు? లోకేష్ ఏదేదో మాట్లాడుతున్నారు..ఆయన ఏమి మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదు. జగన్ గారి గన్‌లో బుల్లెట్స్ లేకపోతే నువ్వు మంగళగిరిలో ఒడిపోయావా? ఆయన గన్‌లో బుల్లెట్స్ లేకపోతే కుప్పంలో 14 పంచాయతీలకు పరిమితం అయ్యారా? భువనేశ్వరి గారికి సూచన చేస్తున్నా...మీ కుమారుడిని ఎవరికైనా చూపించండి. లోకేష్ ముఖ్యమంత్రి కావడం సాధ్యమయ్యే పని కాదు అని మీరన్నా గుర్తించండి. నారా వారి కుటుంబానికి మానసిక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని లోకేష్ బాబాయిని చూస్తే తెలుస్తోంది. అందరూ ముఖ్యమంత్రుల కుమారులు ముఖ్యమంత్రులు కాలేరు. ఐడెంటిటీ క్రైసిస్ వల్ల లోకేష్ పదవీ కాంక్షతో మాట్లాడుతున్నట్లున్నారు' అని పేర్కొన్నారు. జనసేనకు మమ్మల్ని ప్రశ్నించే హక్కు లేదు, ఎదో మేము అప్పుడప్పుడు విమర్శిస్తున్నాం కాబట్టి జనసేన ఉన్నట్లు ప్రజలకి తెలుస్తోందని అంబటి అన్నారు. చదవండి : (చంద్రబాబూ.. నువ్వో చచ్చిన విషసర్పం) (బాబు బూతు పురాణం: రెచ్చగొట్టి.. రచ్చచేసి! ) -
నేడు కుప్పానికి బాబు: మేము రాలేం బాబోయ్!
కుప్పం ఫలితాలు చంద్రబాబును నియోజకవర్గానికి పరుగులు పెట్టించాయి. అధినేత పర్యటనపై టీడీపీ శ్రేణులు విముఖత ప్రదర్శిస్తున్నాయి. మేము రాలేం బాబోయ్ అని తేల్చిచెబుతున్నాయి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని లాభం లేదని స్పష్టం చేస్తున్నాయి. ప్రజావిశ్వాసం కోల్పోయాక సమీక్ష సమావేశాలతో ప్రయోజనం లేదని వెల్లడిస్తున్నాయి. బాబు తీరుతో విసిగిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల పరాభవానికి ముఖ్య నాయకుల తీరే కారణమని విశ్లేషిస్తున్నాయి. నమ్మించి నట్టేట ముంచేశారని మండిపడుతున్నాయి. సాక్షి, తిరుపతి: కుప్పం పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మూడు రోజలు పర్యటనకు రానున్నారు. ఓటమిపై సమీక్షించేందుకు నియోజకవర్గ కేంద్రంలో పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా కుప్పంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కీలక నాయకులు పీఏ మనోహర్, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, మునిరత్నంపై ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థులు, కార్యకర్తలు తీవ్రస్థాయి విరుచుకుపడ్డారు. ఘోర ఓటమికి మీ ముగ్గురి తీరే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దగ్గర ఆర్థిక వనరులు లేవని, సర్పంచ్ బరిలో నిలబడలేమని ఎంత చెప్పినా వినిపించుకోకుండా పోటీకి దించారని వాపోయారు. దీంతో అప్పులపాలు కావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ప్రచారానికి కూడా రాలేదని నిరసన తెలిపారు. ఈ పరిస్థితుల్లో పార్టీ కోసం తామెందుకు కష్టపడాలని నిలదీశారు. టీడీపీ అధికారంలో ఉన్నపుడు పదవులు అనుభవించి, కోట్లరూపాయలు సంపాదించిన నాయకులు, ఇప్పుడు కాడి పారేశారని మండిపడ్డారు. మా గోడు వినరు! చంద్రబాబు పర్యటనకు తాము హాజరు కాలేమని కార్యకర్తలు తేలి్చచెబుతున్నారు. ఒకవేళ సమావేశానికి వచ్చినా బాబు చెప్పిన మాటలు విని రావటం తప్పితే, తమ గోడు వినే పరిస్థితి ఉండదని వెల్లడిస్తున్నారు. నాయకత్వం మారితేనే కుప్పంలో పార్టీ స్థితి మెరుగుపడుతుందని స్పష్టం చేస్తున్నారు. నేడు కుప్పానికి బాబు కుప్పం: నియోజకవర్గంలో మూడు రోజు పర్యటన నిమిత్తం గురువారం కుప్పం రానున్నట్లు టీడీపీ పార్టీ వర్గాలు తెలిపాయి.గురువారం ఉదయం గుడుపల్లె మండలం రాళ్ల గంగమ్మ ఆలయంలో నిర్వహించే కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 4 గంటలకు కుప్పం టీడీపీ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమవుతారు. రాత్రి ఆర్ అండ్ బీ అతిథిగృహంలో బస చేస్తారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు రామకుప్పంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి హాజరవుతారు. మధ్యాహ్నం శాంతిపురంలోని ఓ ప్రైవేటు కల్యాణమండపంలో నిర్వహించే కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. శనివారం ఉదయం కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని కార్యాకర్తలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం విజయవాడకు తిరుగుప్రయాణమవుతారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగుతోంది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయటం మంచిది కాదని చెప్పినా వినిపించుకోలేదు. ఆర్థిక సాయం చేస్తామని పోరుపెట్టి పోటీకి నిలబెట్టారు. తీరా నమ్మి నామినేషన్ వేస్తే తిరిగి చూడలేదు. పొలం తాకట్టు పెట్టి ఎన్నికల్లో ఖర్చుపెట్టా. చివరకు ఓడిపోయి అప్పుల పాలయ్యా. అంతా అయిపోయిన తర్వాత చంద్రబాబు వచ్చి ఏం చేస్తారు. కుప్పం నియోజకవర్గంలో ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి ఆక్రోశం మా నాయన జమీందారులాంటివాడు. రాజకీయాల్లోకి రాక ముందే మాకు చాలా ఆస్తులున్నాయి. పాలిటిక్స్‌లోకి వచ్చిన తర్వాత చాలా పోగొట్టుకున్నా. పెట్రోలు బంకుల వంటి ఆదాయ వనరులను కోల్పోయా. చివరకు అప్పులే మిగిలాయి. ఇకపై నాకు ఇన్చార్జి పదవి అక్కర్లేదు. రాజీనామా చేసేస్తా. – కుప్పం టీడీపీ ఇన్చార్జి పీఎస్ మునిరత్నం ఆవేదన చదవండి: ‘పంచాయతీ’ ఫలితం.. బాబుకు భయం టీడీపీ సినిమా ముగిసింది -
ఎమ్మెల్యే గద్దె స్వగ్రామంలో టీడీపీకి ఆశాభంగం
గన్నవరం(కృష్ణా జిల్లా): టీడీపీకి చెందిన విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు స్వగ్రామమైన మండలంలోని అల్లాపురంలో ఆ పార్టీ మద్దతు ఇచ్చిన సర్పంచ్ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారు. ఆ గ్రామ పంచాయతీలో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారుడైన సర్పంచ్ అభ్యర్థి డొక్కు సాంబశివ వెంకన్నబాబు 1,119 ఓట్లు సాధించి స్వతంత్ర అభ్యర్థి వీరాకుమారిపై 836 ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు. టీడీపీ మద్దతు ఇచ్చిన చిక్కవరపు నాగమణి 40 ఓట్లతో మూడో స్థానంలో నిలవడంతో పాటు డిపాజిట్‌ను కోల్పోయారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పుట్టి పెరిగిన అల్లాపురంలో టీడీపీ ఘోర ఓటమి చెందడం పట్ల ప్రజలు చర్చించుకుంటున్నారు. చదవండి: గెలుపును జీర్ణించుకోలేక టీడీపీ దాష్టీకం.. ‘పంచాయతీ’ ఫలితం.. బాబుకు భయం -
గెలుపును జీర్ణించుకోలేక టీడీపీ దాష్టీకం..
రణస్థలం(శ్రీకాకుళం జిల్లా): పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారుకు ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో తట్టుకోలేని టీడీపీ వర్గీయులు హింసకు తెగబడ్డారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం చిల్లపేటరాజాంలో బీభత్సం సృష్టించారు. పోలీ సుల మీద కూడా కర్రలు, రాళ్లు, సీసాలతో దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో గ్రామానికి చేరుకున్న ప్రత్యేక పోలీసు బలగాలు దొరికినవారిని దొరికినట్టు చితకబాదాయి. సర్పంచ్‌గా గెలిచిన వైఎస్సార్సీపీ మద్దతుదారు అసిరితల్లి భర్తను కొట్టడంతో ఆయన చేయి విరిగింది. ఈ ఘటనకు సంబంధించి 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలిలా ఉన్నాయి.. ఆదివారం జరిగిన చిల్లపేటరాజాం పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారు కంబపు అసిరితల్లి 49 ఓట్ల మెజారిటీతో సర్పంచ్‌గా గెలుపొందారు. అయితే కొందరు వ్యక్తులు టీడీపీ మద్దతుదారులు గెలుపొందినట్లు పుకార్లు సృష్టిం చారు. దీంతో రెండు వర్గాలు గొడవకు దిగాయి. దీనిపై సమాచారం అందుకున్న ఎస్ఈబీ పోలీసు లు రాత్రి 11 గంటల సమయంలో గ్రామానికి చేరుకొని ఇరువర్గాల వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఓటమిని జీర్ణించుకోలేని టీడీపీ వర్గీయులు పోలీసులపై కర్రలతో దాడికి పాల్పడడంతోపాటు రాళ్లు, సీసాలు విసరడంతో ముగ్గురు కానిస్టేబుళ్లతోపాటు ఎస్ఐ అశోక్‌బాబుకు గాయాలయ్యాయి. దీంతో ఎస్పీ అమిత్ బర్దార్ నేతృత్వంలో భారీ సంఖ్యలో ప్రత్యేక పోలీసు బలగాలు చిల్లపేటరాజాం చేరుకున్నాయి. విచక్షణ కోల్పోయిన ప్రత్యేక బలగాలు.. గ్రామానికి చేరుకున్న ప్రత్యేక పోలీసు బలగాలు పరిస్థితిని అదుపుచేసే క్రమంలో కనిపించిన ప్రతి ఒక్కరిపై లాఠీ ఝుళిపించాయి. ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య ఇంటింటికీ వెళ్లి దొరికినవాళ్లను దొరికినట్టు పోలీసులు చితకబాదారు. ఘర్షణ నెలకొనడంతో గెలిచిన సర్పంచ్ అభ్యర్థి అసిరితల్లి, ఆమె భర్త నర్సింహులు రెడ్డి ముందుగానే వారి ఇంటికి చేరుకున్నారు. సర్పంచ్ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆమె భర్తను విచక్షణారహితంగా కొట్టారు. ఆయన ఇంటినంతా చిందరవందర చేశారు. లాఠీదెబ్బలకు నర్సింహులు రెడ్డి చేయి విరిగిపోయింది. సర్పంచ్ ఇంటితోపాటు చాలా ఇళ్లల్లో ఇదే పరిస్థితి కనిపించింది. దీంతో గ్రామస్తులంతా తీవ్ర భయాందోళనకు లోనై తలో దిక్కుకు పరుగులు తీశారు. కార్లు, ఆటోల అద్దాలు పగిలిపోయి వీధుల్లో భీతావహ పరిస్థితి నెలకొంది. 50కి పైగా బైకులు ధ్వంసమయ్యాయి. ఘర్షణతో సంబంధం లేనివారిని పోలీసులు కొట్టడంపై గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లల్లోకి ప్రవేశించి కిటికీలు, టీవీలు, ఇతర విలువైన వస్తువులను పోలీసులు ధ్వంసం చేయడాన్ని ఖండించారు. జేఆర్‌పురం పోలీసులు ఇప్పటివరకు 11 మందిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జేఆర్‌పురం ఎస్ఐ వాసునారాయణ తెలిపారు. బాధితులకు అండగా ఉంటాం చిల్లపేటరాజాంలో బాధితులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ భరోసా ఇచ్చారు. గాయపడినవారిని ఆయన సోమవారం పరామ ర్శించారు. పోలీసులు సామాన్యులను శిక్షించడం చాలా బాధాకరమన్నారు. చదవండి: ఉరకలేస్తున్న వైఎస్సార్ సీపీ.. నిస్తేజంలో టీడీపీ 13 మంది దుర్గ గుడి ఉద్యోగులు సస్పెన్షన్.. -
‘పంచాయతీ’ ఫలితం.. బాబుకు భయం
కుప్పం (చిత్తూరు జిల్లా): నియోజకవర్గంలో రాజకీయ చరిత్ర తిరగబడింది. టీడీపీ ఆవిర్భాం నుంచి కంచుకోటగా ఉన్న పంచాయతీల్లో కూడా వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడింది. ఈ ఫలితాలు చంద్రబాబును భయపెట్టాయి. కుప్పం నియోజకవర్గంలో 89 పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా, 74 పంచాయతీల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. పది పంచాయతీల్లో అయి తే టీడీపీ డిపాజిట్లు గల్లంతయ్యాయి. బాబు గుండె కాయ అన్ని చెప్పుకునే గుడుపల్లె మండలంలో 13 పంచాయతీలు వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుంది. కొన్ని పంచాయతీల్లో టీడీపీ త్రిబుల్ డిజిట్ దాటలేకపోయింది. గుడుపల్లె మండల గుండ్లసాగరం పంచాయతీల్లో కేవలం 15 ఓట్లు మాత్రమే టీడీపీకి వచ్చాయి, దాసమానపల్లెలో 98 ఓట్లు, కెంచనబళ్ల పంచాయతీల్లో 39 ఓట్లు, 121 పెద్దూరు 197 ఓట్లు మాత్రమే టీడీపీకి వచ్చింది. కంచుకోటగా ఉన్న కుప్పం నియోజవవర్గంలో టీడీపీ ఎదురు దెబ్బతగిలింది. కరోనాలో కన్నెత్తి చూడని బాబు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన సమయంలో సొంత నియోజకవర్గం వైపు చంద్రబాబు కన్నెత్తి చూడలేదు. ఆ ఫలితంగా పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు ఆయనకు సొంత నియోజక వర్గం గుర్తుకు వచ్చింది. ఫలితాలు వెలువడిన వారం తిరక్కముందే కుప్పం పర్యటనకు పరుగులు తీయడం బాబు అధైర్యానికి నిదర్శంగా తెలుస్తోంది. 35 ఏళ్లు రాజకీయ భవిష్యత్ కల్పించిన కుప్పం ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కనికరించని బాబు కేవలం పార్టీ దెబ్బతింటే మాత్రం ప్రజలు గుర్తుకు వచ్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 25,26 తేదీల్లో చంద్రబాబు కుప్పం రాక రాష్ట్ర ప్రతిపక్ష నేత, కుప్పం శాసనసభ్యుడు చంద్రబాబు నాయుడు ఈ నెల 25, 26 తేదీల్లో కుప్పంలో పర్యటిస్తున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపారు. రెండు రోజులు పాటు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పర్యటించి, పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సమీక్షించనున్నట్లు సమాచారం. చదవండి: ఉరకలేస్తున్న వైఎస్సార్ సీపీ.. నిస్తేజంలో టీడీపీ బాబు గారూ ఇంకా ఎందుకు అబద్దాలు -
ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు: ఎస్ఈసీ
-
మంత్రి రామచంద్రారెడ్డిని అభినందించిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో గెలుపొందడంపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సీఎం వైఎస్ జగన్ అభినందించారు. మంత్రులు, ఎమ్మెల్యేల భేటీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన కృష్ణా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల భేటీ సోమవారం జరిగింది. మున్సిపల్ ఎన్నికలపై మంత్రి పెద్దిరెడ్డి వారికి దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు ప్రభంజనం సృష్టించారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ పనితీరుకు పంచాయతీ ఫలితాలే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ‘‘ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఏదో సాధించాలని చతికిలపడ్డారు. టీడీపీ పునాదులు కదులుతున్నా అసత్య కథనాలు రాయిస్తున్నారు. 80.37 శాతం పంచాయతీలను వైఎస్సార్ సీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. ఎన్నికలు సజావుగా జరిగితే 90 శాతానికి పైగా గెలిచేవాళ్లం. సీఎం జగన్ సుపరిపాలనకు ప్రజలు పట్టం కట్టారు. ప్రజాస్వామ్యానికి అద్దం పట్టేలా ఫలితాలు వచ్చాయి. కుప్పం ఫలితాలే చంద్రబాబుపై వ్యతిరేకతకు నిదర్శనం. మున్సిపల్ ఎన్నికల్లో ఇంతకంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని’ మంత్రి పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చదవండి: టీడీపీ బరితెగింపు: మాకే ఎదురు నిలబడతారా.. నేనే చూసుకుంటా.. నేతలకు బాబు ఫోన్లు..! -
టీడీపీ బరితెగింపు: మాకే ఎదురు నిలబడతారా..
సాక్షి, గుంటూరు: తొలి మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం, నాలుగో విడత ఎన్నికల్లోనూ ఓటమి తప్పదన్న అక్కసుతో టీడీపీ నాయకులు కుట్రలకు తెరతీశారు. పోలింగ్ ప్రక్రియకు విఘాతం కలిగించడంతో పాటు శాంతి భద్రతల సమస్యలు తలెత్తేలా చేసేందుకు ప్రయత్నించారు. వైఎస్సార్ సీపీ శ్రేణులే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. తమకు ఓటు వేయకపోతే అంతు చూస్తామని ఎస్సీ, ఎస్టీ ఓటర్లను బెదిరించడంతో పాటు, దాడులకు తెగబడ్డారు. వృద్ధుడికి సాయం చేసినందుకు... సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామం ఎస్సీ కాలనీలోని పోలింగ్ బూత్‌లో నడవడానికి ఇబ్బంది పడుతున్న వృద్ధుడికి వైఎస్సార్ సీపీ మద్దతుదారుడి ఏజెంట్‌గా ఉన్న ఫకీరయ్య సాయం చేయడాన్ని తప్పు బట్టిన టీడీపీ ఏజెంట్లు అతనితో వాగ్వాదానికి దిగారు. కురీ్చతో దాడికి పాల్పడ్డారు. దీంతో ఫీకీరయ్య తరఫు వారు కూడా ప్రతిదాడికి దిగారు. ఈ ఘటనలో ఫకీరయ్య గాయపడ్డాడు. పోలీసులు స్పందించి ఇరువర్గాలను శాంతింపజేశారు. గాయపడిన ఫకీరయ్యను ఆస్పత్రికి తరలించారు. తమకు ఓటు వేయలేదని దాడి పెదకూరపాడు మండలం కంభంపాడు ఎస్సీ కాలనీకి చెందిన దివ్యాంగుడు ప్రభాకర్‌కు సాయంగా అతని సోదరుడు ప్రసన్నకుమార్ పోలింగ్ బూత్‌కు వెళ్లాడు. ప్రభాకర్ స్వయంగా ఓటు వేయడానికి ఇబ్బందిపడటంతో టీడీపీ మద్దతు ఏజెంట్లు ఓటు వేయడానికి వీళ్లేదని అడ్డుకున్నారు. దీంతో ప్రభాకర్‌ను తీసుకుని ప్రసన్నకుమార్ పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వస్తుండగా బాబాయి వరసైన సురేష్ విషయం తెలుసుకుని తిరిగి పోలింగ్ బూత్‌లోకి తీసుకెళ్లాడు. సురేష్ గట్టిగా ప్రశ్నించడంతో ఓటు వేయడానికి పోలింగ్ ఆఫీసర్ అనుమతించాడు. ప్రభాకర్‌తో ఓటు వేయించి ఇంటికి వెళ్తుండగా టీడీపీ వర్గీయులు వారిని కులం పేరుతో దూషించి, తమకు వ్యతిరేకంగా ఓటు వేస్తారా అని దాడికి పాల్పడ్డారు. దీంతో సురేష్ పెదకూరపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లు వేస్తున్నారని ప్రశ్నించినందుకు.. సత్తెనపల్లి మండలం ఫణిదంలో టీడీపీ వర్గీయులు దొంగ ఓట్లు వేస్తున్నారని సమాచారం అందడంతో వైఎస్సార్ సీపీ వర్గీయులు పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణులతో టీడీపీ వర్గీయులు వాగ్వాదానికి, కవి్వంపు చర్యలకు పాల్పడ్డారు. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. అమరావతి మండలం ఉంగుటూరు పోలింగ్ కేంద్రంలోకి టీడీపీ వర్గీయులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశిస్తుండగా వైఎస్సార్సీపీ వర్గీయులు అడ్డుకున్నారు. చావపాడులో ఓటు వేయడానికి ఉంగుటూరు పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసిన 15 మంది రాగా వైఎస్సార్ సీపీ వర్గీయులు గుర్తించి అడ్డుకున్నారు. సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడు గ్రామంలో పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల లోపు నిబంధనలకు విరుద్ధంగా గుంపులుగా చేరిన టీడీపీ నాయకులను ఇదేంటని ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ శ్రేణులతో వాగ్వాదానికి దిగారు. ముప్పాళ్ల మండలం మాదలలో కవి్వంపు చర్యలకు పాల్పడ్డారు. మాకే ఎదురు నిలబడతారా అంటూ దాడి సత్తెనపల్లి: ‘దళితులు మాకే ఎదురు నిలబతారా?’ అంటూ సత్తెనపల్లి మండలం లక్ష్మీపురంలో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. లక్ష్మీపురం పంచాయతీలో వైఎస్సార్ సీపీ మద్దతుదారుడు ఆచంట సుబ్బారావు, టీడీపీ మద్దతుదారుడు వల్లెపల్లి శ్రీనివాసరావు పోటీచేశారు. టీడీపీ మద్దతుదారుడు శ్రీనివాసరావు 110 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అంతే టీడీపీ వర్గీయులు రెచ్చిపోయారు. రెండు ట్రాక్టర్లతో విజయోత్సవం నిర్వహిస్తూ బాణ సంచా కాల్చారు. దళితుల గృహాల వద్దకు రాగానే ‘మాకే ఎదురు నిలబడతారా, కులం తక్కువోళ్లు మేము చెప్పినట్టు చేయాలి’ అంటూ డీపీకి చెందిన మేడూరి కన్న, మేడూరి రవి, బొద్దులూరి చంద్రశేఖర్, పంచు మర్తి శ్రీనివాసరావు, బొద్దులూరి శేఖర్, బొత్తులూరి శ్రీను, కొర్లకుంట నరేంద్ర, బొద్దులూరి అశోక్, కనగాల సందీప్, గోగినేని రామకృష్ణ, అల్లంనేని ప్రసాద్, జి.రమేష్, కె.నరేంద్ర, బి.శ్రీను మరో పది మంది కర్రలతో దాడులకు దిగారు. దీంతో ఎస్సీ కాలనీకి చెందిన నందం వెంకటేశ్వరరావు, నందం సాంబశివరావు, పి.బెంజిమన్, తారా జయమ్మ, కె.సామ్రాజ్యం గాయపడ్డారు. నందం వెంకటేశ్వరరావు, బాధి తులు సత్తెనపల్లి రూరల్ పోలీసులకు ఆదివారం రాత్రి ఫిర్యాదు చేశారు. ఓడిపోయామనే దుగ్ధతో... సత్తెనపల్లి మండలం పాకాలపాడులో టీడీపీ మద్దతుదారుడు కె.సాంబయ్యపై వైఎస్సార్ సీపీ మద్దతుదారుడు తిప్పిరెడ్డి వెంకటరెడ్డి 353 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అనంతరం వైఎస్సార్సీపీ మద్దతుదారులు గ్రామంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి సంబరాలు చేస్తుండగా టీడీపీ మద్దతుదారుడు సాంబయ్య తాలూకు కొందరు రాళ్లు రువ్వి ఘర్షణకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడు కె.నర్సిరెడ్డికి గాయాలయ్యాయి. సత్తెనపల్లి రూరల్ పోలీసులు గ్రామాన్ని సందర్శించి ఆందోళనకారులను చెదరగొట్టారు. చదవండి: నేనే చూసుకుంటా.. నేతలకు బాబు ఫోన్లు..! పుదిపట్లలో దొంగ ఓట్ల ఎఫెక్ట్..! -
పుదిపట్లలో దొంగ ఓట్ల ఎఫెక్ట్..!
తిరుపతి రూరల్: మండలంలోని పుదిపట్లలో ఊహించినట్లే జరిగింది. ఊరు, పేరు, ఇంటి నంబర్లు లేని వందలాది దొంగ ఓట్లను తొలగించకుండానే ఎన్నికలు జరిగాయి. దొంగ ఓట్లకు నకిలీ ఆధార్‌కార్డులను సృష్టించారు. అందుకోసం ఏకంగా మీ–సేవ కేంద్రాన్నే స్థావరంగా మార్చుకున్నారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే మీ–సేవ కేంద్రంలో దొంగ ఆధార్‌కార్డులను తయారు చేస్తూ ఆదివారం పుదిపట్ల సర్పంచ్ ఇండిపెండెంట్ అభ్యర్థి బడి సుధాయాదవ్ అనుచరులు పట్టుబడ్డారు. స్థానికులు ఫిర్యాదుతో ఎంఆర్‌పల్లె పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. వారిలో బడి సుధా యాదవ్, వెంకటముని మునిచంద్రా, రవీంద్ర, మణికంఠ ఉన్నారు. వివరాల్లోకి వెళ్లితే.. పుదిపట్లలో దాదాపు 1,262 దొంగ ఓట్లు ఉన్నట్లు ఎన్నికల కమిషన్‌కు స్థానికులు ఫిర్యాదు చేశారు. విచారణలో ద,త,మ,ప, ర, ఖ....ఇలా గుర్తు తెలియని పేర్లతో ఓటరు జాబితా ఉన్నా అధికారులు పట్టించుకోలేదు. ఒకే వ్యక్తి సెల్ నంబర్‌తో 470కు పైగా ఓట్లు ఉన్నట్లు గుర్తించినా చర్యలు లేవు. 0, 00, 000, 0000.... ఊర్లో లేని ఇలాంటివే ఇంటి నంబర్లుగా పెట్టి జాబితాను నింపేశారు. వాటిని ప్రక్షాళన చేయాలని మొ త్తుకున్నా పట్టించుకోలేదు. ఆదివారం పుదిపట్ల లో ఓటింగ్ జరిగింది. ఊహించినట్లుగానే దొంగ ఓట్లు వేసేందుకు బయట వ్యక్తులు వచ్చారు. వారిని ఊరు, పేరు లేని వారి ఓటరు కార్డును చూసి మరోక గుర్తింపు కార్డు చూపించాలని ఏజెంట్లు, పోలింగ్ అధికారులు అడిగారు. దీంతో ఆధార్‌కార్డులను చూపించారు. డూప్లికేట్ తరహాలో ఉన్న ఆధార్ అడ్రస్‌లపై స్థానికులకు అనుమానం వచ్చింది. దీంతో ఆరా తీశారు. దొంగ ఓటు వేసేందుకు వచ్చిన వ్యక్తిని నిలదీయడంతో నకిలీ ఆధార్‌కార్డుల గుట్టు బయటపడింది. ఫొటో ఉంచి, అడ్రస్ మార్చి.... దొంగ ఆధార్ కార్డులతో.. దొంగ అడ్రస్‌లతో ఓటరుగా నమోదు అయిన వ్యక్తులు, ఓటరు కార్డుతో పాటు గుర్తింపు కార్డు కోసం అడ్డదారులు తొక్కారు. అందుకోసం పేరూరు స్టాఫ్ క్వార్టర్స్ వద్ద ఉన్న మణికంఠ అనే వ్యక్తి మీ– సేవ కేంద్రాన్ని అడ్డగా మార్చుకున్నారు. ఫొటో మా త్రం ఉంచుకుని, పుదిపట్ల అడ్రస్‌తో నకిలీ ఆధార్‌కార్డులను తయారు చేసుకున్నారు. అక్కడ దాదాపు 500కు పైగా నకిలీ ఆధార్‌కార్డులు బయటపడ్డాయి. అక్కడే పుదిపట్ల సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బడి సుధాయాదవ్ అనుచరులు ఉన్నారు. వాళ్లే తమకు నకిలీ ఆధార్‌కార్డులు తయారు చేశారని చంద్రమౌళి అనే వ్యక్తి ఒప్పుకున్నాడు. దీంతో మీ– సేవ నిర్వాహకుడు మణికంఠతోపాటు ఐదుగురిపై ఎంఆర్‌పల్లె పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మొత్తం ఘటనలో కీలకమైన బడి సుధాయాదవ్ పుదిపట్ల సర్పంచ్‌గా గెలిచాడు. అతనిపై కూడా కేసు న మోదు అయ్యింది. దీంతో అతన్ని డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. చదవండి: నేనే చూసుకుంటా.. నేతలకు బాబు ఫోన్లు..! నడిరోడ్డుపై విజయవాడ టీడీపీ నేతల రచ్చ -
ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు: ఎస్ఈసీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసిందన్నారు. 90 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 50 వేల మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ పక్కనపెట్టి ఉద్యోగులు పనిచేశారని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ పూర్తిగా సహకరించారని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పనిచేశారని పేర్కొన్నారు. ప్రతి విడతలో 80 శాతం మంది ఓటింగ్‌లో పాల్గొన్నారని ఎస్ఈసీ వెల్లడించారు. చదవండి: పంచాయతీల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం పులివెందుల ‘పంచ్’ అదిరింది -
భార్యకు ప్రసవ వేదన.. భర్తకు విధి నిర్వహణ!
జామి(శృంగవరపుకోట): ఓ వైపు భార్య ప్రసవ వేదన అనుభవిస్తూ ఆస్పత్రిలో సతమతమవుతోంది.. అదే సమయంలో భర్త మాత్రం విధి నిర్వహణలో తలమునకలై ఉన్నారు. విజయనగరం జిల్లా జామి ఎస్ఐ ఎస్.సుదర్శన్ భార్య గౌతమి ఆదివారం పురిటి నొప్పులతో ఆస్పత్రిలో చేరారు. అయితే ఎస్ఐ మాత్రం పంచాయతీ ఎన్నికల విధుల్లో భాగంగా వృద్ధులను మోసుకుని మరీ పోలింగ్ కేంద్రం వద్దకు తీసుకెళ్లే పనిలో నిమగ్నమయ్యారు. చివరకు తన భార్య పాపకు జన్మనిచ్చినట్టు సమాచారం అందగానే ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. చదవండి: ముక్కు మూసుకున్న అధికారులు: ‘నారాయణ’పై సీరియస్ ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ -
ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ
సాక్షి, అనంతపురం: పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యే బాలకృష్ణకు ఘోర పరాభవం ఎదురైంది. హిందూపురం నియోజకవర్గంలో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. హిందూపురంలోని 38 స్థానాల్లో 30 చోట్ల వైఎస్సార్ సీపీ మద్దతుదారుల విజయం సాధించారు. పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారధికి షాక్ తగిలింది. ఆయన సొంత పంచాయతీ రొద్దంలో టీడీపీ ఓటమి పాలైంది. బీకే పార్థసారధి సొంత వార్డు మరువపల్లిలోనూ టీడీపీకి పరాభవం ఎదురైంది. పెనుకొండలోని 80 స్థానాల్లో 71 చోట్ల వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయకేతనం ఎగరవేశారు. హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పకు చేదు అనుభవం ఎదురైంది. నిమ్మల కిష్టప్ప సొంత పంచాయతీ వెంకటరమణపల్లిలో టీడీపీ ఓటమి చెందింది. మడకశిర మాజీ ఎమ్మెల్యే ఈరన్నకు పరాభవం ఎదురైంది. సొంత పంచాయతీ మద్దనకుంటలో టీడీపీ ఓటమి పాలైంది. చదవండి: పులివెందుల ‘పంచ్’ అదిరింది మాజీ మంత్రి ‘బండారు’కు ఘోర పరాభవం -
లైవ్: తుది విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు..
సాక్షి, అమరావతి : నాల్గవ విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన నాల్గవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 3.30 వరకు కొనసాగింది. నాలుగు గంటల ప్రాంతంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ఆఖరి విడతలో 3,299 పంచాయతీల్లో ఎన్నికలకు నోటిఫికేషన్లు జారీ కాగా 554 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 2,743 పంచాయతీలు, 22,423 వార్డుల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పంచాయతీల వారీగా ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకూ ఓవరాల్‌గా వైఎస్సార్సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు 2,291 మంది విజయం సాధించగా, టీడీపీ మద్దతు దారులు 417 చోట్ల గెలుపొందారు. బీజేపీ మద్దతుదారులు 61, ఇతరులు 75 చోట్ల గెలుపొందారు. జిల్లాల వారీగా నాల్గవ విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల వివరాలు ప్రస్తుతానికి ఇలా ఉన్నాయి.. పార్టీ మద్దతుదారుల వారీగా విజయాలు జిల్లా వైఎస్సార్సీపీ టీడీపీ బీజేపీ ఇతరులు శ్రీకాకుళం 149 24 2 5 విజయనగరం 202 32 2 1 విశాఖ 68 18 1 1 తూర్పు గోదావరి 96 29 21 28 పశ్చిమ గోదావరి 152 41 5 4 కృష్ణా 162 39 1 5 గుంటూరు 153 59 5 4 ప్రకాశం 164 26 0 6 నెల్లూరు 158 14 2 1 చిత్తూరు 324 44 0 8 కర్నూలు 271 49 0 11 అనంతపురం 139 24 0 2 వైఎస్సార్ జిల్లా 203 0 19 2 -
జనం ముందు కత్తులు.. తెర వెనుక పొత్తులు
అమలాపురం (తూర్పుగోదావరి): జనం ముందు కత్తులు దూసుకోవడం.. తెర వెనుక పొత్తులు పెట్టుకోవడం టీడీపీ, జనసేనలకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. పార్టీ అగ్రనాయకుల నుంచి సామాన్య కార్యకర్తల వరకూ ఇదే పంథా అవలంబిస్తున్నారు. అమరావతి నుంచి అల్లవరం వరకూ తెరచాటు పొత్తులకు తెర లేపుతున్నారు. మొదటి రెండు విడతల పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు భారీ విజయాలు సాధించారు. పల్లె పోరు ఫలితాల్లో అంచనాలు తలకిందులు కావడంతో కనీసం నాలుగో విడతైనా కొన్ని విజయాలు సాధించి పరువు నిలుపుకోవాలనే లక్ష్యంతో టీడీపీ, జనసేన పార్టీలు పలు పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు తెర వెనుక పొత్తులు పెట్టుకుంటున్నాయి. దీనిపై ప్రజల్లో విమర్శలు రాకుండా ఆ పార్టీల మద్దతుదారులకు ‘స్వతంత్ర’ ముసుగు వేస్తున్నారు. స్వతంత్రంగా పోటీ చేస్తున్న వారికి మద్దతు ఇవ్వాలంటూ చెప్పుకొంటున్నారు. కోనసీమలోని మేజర్ పంచాయతీల్లో ఒకటైన అల్లవరం మండలం బెండమూర్లంకలో టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంది. టీడీపీ మద్దతుతో సర్పంచ్‌గా పోటీ పడుతున్న దొమ్మేటి పద్మకు జనసేన మద్దతు తెలిపింది. దీనిపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. అంబాజీపేట మండలం మాచవరంలో రెండు పారీ్టలూ కలసి అభ్యరి్థని నిలిపాయి. టీడీపీకి చెందిన నాగాబత్తుల సుబ్బారావు సతీమణి శాంతకుమారి పోటీ చేస్తుండగా, జనసేన బహిరంగ మద్దతు ఇస్తోంది. అభ్యర్థికి స్వతంత్ర ముసుగు వేసింది. ఈ రెండు పార్టీలూ వచ్చే ఎన్నికలకు సైతం తెర వెనుక పొత్తులను అప్పుడే సిద్ధం చేసుకుంటున్నాయి. ఎంపీటీసీ ఎన్నికల్లో రెండు స్థానాలకు జనసేనకు మద్దతు ఇచ్చేలా.. సహకార సంఘ ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చేలా రెండు పారీ్టల్లో ఒకరిద్దరు నాయకులు కలసి ఒప్పందాలు చేసుకోవడం ఇరు పారీ్టల కార్యకర్తల్లో వ్యతిరేకతను తీసుకువస్తోంది. ఉప్పలగుప్తం మండలం చినగాడవిల్లిలో టీడీపీకి చెందిన పినిశెట్టి వెంకట రెడ్డినాయుడు పోటీ చేస్తుండగా టీడీపీ మద్దతు ఇస్తోంది. అమలాపురం మండలంలో చిందాడగరువు, జనుపల్లి, భట్నవిల్లి, గున్నేపల్లి, సాకుర్రు, ఈదరపల్లి; ఆత్రేయపురం మండలం మెర్లపాలెం, ర్యాలి గ్రామాల్లో కూడా ఈ రెండు పార్టీలూ పరస్పరం తెర వెనుక సహకరించుకుంటున్నాయి. ఐ.పోలవరంలో టీడీపీ మద్దతుతో పోటీ చేస్తున్న రాయపురెడ్డి నీలకంఠేశ్వరరావుకు జనసేన మద్దతు ఇస్తోంది. కొత్తపేట మండలం మందపల్లి, పి.గన్నవరం మండలం ఎల్.గన్నవరం, రాజోలు మండలం కాట్రేనిపాడు పంచాయతీల్లో రెండు పార్టీలూ కలసి ఉమ్మడి అభ్యర్థులను పోటీ పెట్టాయి. చదవండి: ప్రలోభాలతో ఓటర్లకు టీడీపీ ఎర నాలుగో దశ: పెనుగొలనులో టీడీపీకి ఎదురుదెబ్బ -
వైఎస్సార్సీపీ శ్రేణులపై జనసేన రాళ్ల దాడి
ముప్పాళ్ల(సత్తెనపల్లి): ఎన్నికల ప్రచారం ముగియడంతో గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం దమ్మాలపాడు గ్రామంలో శనివారం వైఎస్సార్సీపీ అభిమానులు ఏడో వార్డు మీదుగా నడిచి వెళుతున్నారు. అక్కడే ఉన్న జనసేన పార్టీ శ్రేణులు వచ్చి వాదనకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇదే సమయంలో జనసేన శ్రేణులు రాళ్లతో దాడికి దిగారు. దీంతో ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు రాళ్లతో దాడులు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వచ్చి ఇరువర్గాల వారిని తరిమివేశారు. దాడిలో వైఎస్సార్సీపీకి చెందిన శ్యామల చిననాగిరెడ్డి, బద్దిగం శ్రీనివాసరెడ్డి, గంజి శ్రీను, తమ్మినేని పిచ్చిరెడ్డి, వెన్నా శివారెడ్డి, చల్లా వీరారెడ్డి, మంచికంటి మోహన్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. జనసేనకు చెందిన సూరంశెట్టి సతీష్, నల్లపునేని వెంకటేశ్వర్లు, యర్రంశెట్టి శివ, కోడె భుజంగనాయుడు, శిరిగిరి రాజు, కుమ్మరి శ్రీను, సువారపు గోవిందరావుకు గాయాలయ్యాయి. రూరల్ సీఐ బి.నరసింహారావు గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. పరస్పరం ఫిర్యాదులు చేíసుకున్నట్లు ఎస్ఐ ఎం.నజీర్‌బేగ్ తెలిపారు. బరితెగిస్తున్న టీడీపీ నేతలు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో ఓటమిని తట్టుకోలేక టీడీపీ నేతలు హద్దు మీరుతున్నారు. ఎచ్చెర్ల మండలంలోని కుప్పిలి పంచాయతీ నుంచి టీడీపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అలుపున భారతి భర్త అలుపన నాగిరెడ్డి కుప్పిలి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త మింది రామప్పడును ఫోన్లో తీవ్ర పదజాలంతో దూషించడమే కాకుండా చంపేస్తానంటూ బెదిరించారు. అలాగే పోలాకి మండలం బెలమర పంచాయతీ పరిధిలో టీడీపీకి చెందిన చింతు గోవిందరావు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తుంటే ఫొటోలు తీశాడని ‘సాక్షి’ విలేకరి షణ్ముఖరావుపై టీడీపీ నాయకులు దాడి చేశారు. మొబైల్ లాక్కోవడమే కాకుండా బుడ్డా రాంబాబు అనే వ్యక్తి ఏకంగా చంపేస్తానంటూ బెదిరించారు. చదవండి: ప్రలోభాలతో ఓటర్లకు టీడీపీ ఎర నాలుగో దశ: పెనుగొలనులో టీడీపీకి ఎదురుదెబ్బ -
ప్రలోభాలతో ఓటర్లకు టీడీపీ ఎర
నగరంపాలెం(గుంటూరు): పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఓటర్లకు స్టీల్ గిన్నెలను పంపిణీ చేసేందుకు సిద్ధమైన నలుగురిని అరెస్టు చేసినట్లు గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..ఈ నెల 19వ తేదీన మేడికొండూరు గ్రామ పంచాయతీలోని ఇంద్రియానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద గుంటూరు–హైదరాబాద్ రాష్ట్ర రహదారిపై దక్షిణ జోన్ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి, సీఐ ఎన్.మహతి సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 400 స్టీల్ గిన్నెలను గుర్తించి దర్యాప్తు వేగవంతం చేశారు. టీడీపీ సానుభూతి పరులుగా గుర్తింపు పొందిన ఇంద్రియానగర్ వాసులు బద్దెపోగు శివప్రసాద్, పెడిపాగా లూర్ధు, చెరుకూరి చెంచయ్య, చెరుకూరి లాజర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నేరం రుజువు కావడంతో ఆ నలుగురిని అరెస్టు చేసి, 400 స్టీలు గిన్నెలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, అరెస్టయిన నలుగురిలో ఒకరైన బద్దెపోగు శివప్రసాద్ అభ్యర్థి. గ్రామ పంచాయతీలోని 10వ వార్డు ఓటర్లకు పంపిణీ చేసేందుకు వాటిని తెచ్చారు. సీజ్ చేసిన గిన్నెలను అర్బన్ ఎస్పీ పరిశీలించారు. చీరలు పంచుతూ పట్టుబడిన టీడీపీ తోటపల్లిగూడూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా తోటపలి్లడూగూడూరు మండలం పోట్లపూడి పంచాయతీకి టీడీపీ మద్దతిచ్చిన సర్పంచ్ అభ్యర్థి నాశిన కల్పన తరఫున శనివారం రాత్రి గ్రామంలో ఓటర్లకు చీరలను పంచిపెట్టారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అజ్మతుల్లాఖాన్,ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి 34 చీరలు, రెండు మోటారు బైక్‌లు,కరపత్రాలను స్వాధీనం చేసుకుని ఇద్దరు టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు. టీడీపీ, జనసేన చీరలు, డబ్బు పంపిణీ ! పెదకాకాని(పొన్నూరు): పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు బలపరచిన అభ్యర్థులకు ఓట్లు వేయాలని కోరుతూ డబ్బు, చీరలు పంపిణీ చేస్తున్న కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండల పరిధిలోని ఉప్పలపాడు గ్రామంలో టీడీపీ కార్యకర్తలు ఓటుకు రూ.1000 చొప్పున డబ్బు పంపిణీ చేయడంతో పాటు ఆ పార్టీ బలపరచిన అభ్యర్థులకు సంబంధించిన కరపత్రాలు, నగదు పంపిణీ చేస్తుండగా పోలీసులు స్టేషన్‌కు తరలించారు. వారిలో మున్నంగి నాగరాజు, కాకాని అన్వేష్‌కుమార్, మున్నంగి నాగప్రసాద్ ఉన్నారు. గోళ్ళమూడి గ్రామంలో జనసేన బలపరచిన వార్డు అభ్యర్థి పసుపులేటి శ్రీనివాసరావు చీరలు పంపిణీ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఓట్ల లెక్కింపులో అవకతవకలపై ఆర్వోకు నోటీసులు కారంచేడు: పంచాయతీ ఎన్నికల లెక్కింపుల్లో అవకతవకలు జరిగాయని ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామ సర్పంచ్ అభ్యర్థి, వైఎస్సార్సీపీ సానుభూతి పరురాలు కుంబా సుజాత ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో రిటర్నింగ్ అ«ధికారి లింగరాజు సుధాకరరావుతో పాటు సిబ్బందికి ఈ నెల 24వ తేదీన ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసినట్లు తహసీల్దారు సీతారత్నం, ఎంపీడీవో ఎం.నాగభూషణరావు తెలిపారు. చదవండి: నాలుగో దశ: పెనుగొలనులో టీడీపీకి ఎదురుదెబ్బ జెడ్పీ అధికారులపై టీడీపీ నేతల దౌర్జన్యం -
నాలుగో దశ: పెనుగొలనులో టీడీపీకి ఎదురుదెబ్బ
సాక్షి, కృష్ణా జిల్లా: నాలుగో దశ (తుది విడత) పంచాయతీ ఎన్నికల్లో గంపలగూడెం మండలంలోని పెనుగొలను గ్రామంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ అధిష్టానం తీరుపై ఆ పార్టీ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఆర్థిక సాయం చేస్తామని పార్టీ నాయకులు తమను పట్టించుకోలేదని మండిపడ్డారు. టీడీపీ వైఖరిని నిరసిస్తూ పార్టీ గ్రామ అధ్యక్షుడు కోటా హరిబాబు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ బలపరిచిన అభ్యర్థి జ్యోతి ఎన్నికలను బహిష్కరించారు. కాగా, పంచాయతీ ఎన్నికల్లో ప్రజాతీర్పు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడంతో ఓటమిని జీర్ణించుకోలేక టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు. ఆ పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారు. ఇప్పటివరకు జరిగిన మూడు దశల పంచాయతీ ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ అభిమానులు పెద్ద ఎత్తున విజయం సాధించారు. టీడీపీ ముఖ్య నేతల నియోజకవర్గాల్లో సహా అన్నింటా ఆ పార్టీ కుదేలైంది. బీజేపీ, జనసేన పార్టీలు బలపరిచిన అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. చదవండి: జెడ్పీ అధికారులపై టీడీపీ నేతల దౌర్జన్యం టీడీపీకి పరాభవం: నాటి పాపాలే.. నేటి శాపాలు! -
ఓటు వేయలేదని గునపాలతో దాడి చేశారు
-
ఓటు వేయలేదని గునపాలతో దాడి చేశారు
సాక్షి, శ్రీకాకుళం: పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని తెలుగుదేశం నేతలు రాష్ట్రవ్యాప్తంగా దాడులకు తెగబడుతున్నారు. టీడీపీ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. జిల్లాలోని కింతలి పంచాయతీ ఖాజీపేటలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. తమ మద్దతుదారులకు ఓట్లు వేయలేదని అక్కసుతో గత అర్ధరాత్రి యాదవ వీధిలో కర్రలు, గునపాలతో బీభత్సం సృష్టించారు. కొందరి ఇళ్లపై దాడులు చేసి కరెంటు మీటర్లు, ఇంటి తలుపులు, కిటికీలు, రెండు బైకులను ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో నలుగురు గాయలపాలవడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబాలను వైఎస్సార్సీపీ నేతలు తమ్మినేని చిరంజీవి నాగ్, పప్పల వెంకటరమణ శనివారం పరామర్శించారు. చదవండి: టీడీపీకి పరాభవం: నాటి పాపాలే.. నేటి శాపాలు! పేదల గూటికి టీడీపీ గండి! -
ఓటర్లంతా ఎస్సీ.. బీసీ సర్పంచ్ !
శ్రీకాళహస్తి రూరల్: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లి పంచాయతీ సర్పంచ్‌గా ఖాదర్‌బీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ గ్రామంలో అన్నీ ఎస్సీ కుటుంబాలే నివసిస్తున్నాయి. 677 మంది ఓటర్లున్న ఈ పంచాయతీ సర్పంచ్ పదవిని బీసీలకు కేటాయించారు. ఓటర్లంతా ఎస్సీలే కావడంతో మొదట్లో సందిగ్ధానికి గురయ్యారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదరి దామతోటి ముని మైనార్టీ వర్గానికి చెందిన ఖాదర్‌బీని వివాహం చేసుకున్నారు. ఆమెది బీసీ వర్గం కావడంతో సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. పోటీలేకపో వడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చదవండి: విశాఖ ఘటనలో ఏపీ సర్కార్ పనితీరు భేష్ మా జాబితా తప్పని నిరూపించగలవా! -
మా జాబితా తప్పని నిరూపించగలవా!
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన వైఎస్సార్సీపీ అభిమానుల వివరాలన్నీ వెబ్సైట్లో ఉంచామని, దమ్ము ధైర్యం ఉంటే ఇందులో ఏ ఒక్కటైనా తప్పుందని నిరూపించగలరా అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. చంద్రబాబు ఓటమిని హుందాగా ఒప్పుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఏజెన్సీలో మొత్తం పంచాయతీలు తామే కైవసం చేసుకున్నామని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన ట్విట్టర్లో శుక్రవారం ఘాటుగా స్పందించారు. ప్రజలు చీత్కరించినా ఇంకా ఎవరిని మభ్యపెడతారని ఆయన ప్రశి్నంచారు. వైఎస్సార్సీపీ మద్దతుదారులకు వచ్చిన మెజారిటీతో పోలిస్తే టీడీపీ ఎక్కడా కనీస స్థాయిలో పోటీ పడలేదని పేర్కొన్నారు. ‘మావాళ్ల వివరాలను వెల్లడించడంలో మేమింత పారదర్శకంగా ఉంటే.. టీడీపీ గెలిచిన వారి వివరాలు ఎందుకు చెప్పడం లేదో అర్థం కావడం లేదు’ అన్నారు. వైఎస్ జగన్ ప్రజా సంక్షేమానికి ప్రజలు పెద్దఎత్తున తీర్పు ఇస్తే.. దీన్ని అపహాస్యం చేయడం శోచనీయమని వ్యాఖ్యానించారు. తిమ్మిని బమ్మిని చేస్తే ప్రజలు నమ్ముతారనే భ్రమ నుంచి చంద్రబాబు ఇంకా బయటపడలేదని ఎద్దేవా చేశారు. దశాబ్దాలుగా గెలిపించిన కుప్పం ప్రజలే డబ్బుల మాయలోఓట్లేశారని అవమానించిన చంద్రబాబును ప్రజలు ఎందుకు క్షమించాలని ప్రశ్నించారు. పిల్లనిచి్చన మామను, ఓట్లేసిన ప్రజలను వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు న్యాయమేనా అన్నారు. ఆయనకున్న సంస్కారం ఇదేనన్నారు. చదవండి: విశాఖ ఘటనలో ఏపీ సర్కార్ పనితీరు భేష్ సొల్లు కబుర్లతో శునకానందం: కొడాలి నాని -
అటు కుక్కర్లు.. ఇటు ప్లాస్టిక్ స్టూళ్లకు డిమాండ్
అమలాపురం టౌన్: పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని మార్కెట్లో కుక్కర్లు...ప్లాస్టిక్ స్టూల్స్కు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వార్డుల అభ్యర్థులకు ఈ గుర్తులను కేటాయించడంతో ఆయా అభ్యర్థుల్లో కొందరు ఓటర్లకు తమ గుర్తును తెలియజేస్తూ వారికి నిజమైన కుక్కర్లు, ప్లాస్టిక్ స్టూల్స్ నజరానాగా ఇచ్చేస్తున్నారు. ఎన్నికల్లో కేటాయించిన గుర్తుల నమూనాలు అవసరమైతే పెద్దవిగా తయారు చేయించి ఓటర్లను ఆకర్షించేలా ప్రదర్శిస్తున్నారు. సర్పంచ్ అభ్యర్థులకు కేటాయించిన ఉంగరం, కత్తెర, మంచం తదితర గుర్తులను పెద్దవిగా నమూనా తయారు చేయించి వాటినే ప్రచారాల్లో విరివిగా ఉపయోగించుకుంటున్నారు. కొందరు సర్పంచ్ అభ్యర్థులు బుల్లి మంచాల నమూనాలు, లేదా వాస్తవ మంచాలతోనే ప్రచారం చేస్తున్నారు. వార్డుల అభ్యర్థులకు కేటాయించిన కొన్ని గుర్తుల్లో ముఖ్యంగా కుక్కర్, స్టూలు గుర్తులను నమూనాగానే కాకుండా అసలైన కుక్కర్లు, ప్లాస్టిక్ స్టూల్స్‌ను కొనుగోలు చేసి మరీ ఓటర్లకు అందిస్తున్నారు. నాలుగో విడతగా అమలాపురం డివిజన్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో పలు గ్రామాల్లోని వార్డుల్లో ఈ వ్యవహారం నడుస్తోంది. వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో చాలా మంది తమకు గుర్తులు కేటాయించిన తక్షణమే ఇలా కుక్కర్లు, ప్లాస్టిక్ స్టూల్స్ కొనుగోళ్లు చేయడంతో మార్కెట్లో వీటికి డిమాండ్ పెరిగింది. పి.గన్నవరం మండలంలోని ఓ మేజర్ పంచాయతీలో రెండు వార్డుల్లో పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులు కుక్కర్లు, ప్లాస్టిక్ స్టూల్స్ తొలి రోజు కొనుగోలు చేసి కొందరు ఓటర్లకు పంచిపెట్టినా, మర్నాడు మిగిలిన ఓటర్లకు పంచిపెట్టేందుకు మార్కెట్‌కు వెళితే కుక్కర్లు, ప్లాస్టిక్ స్టూల్స్ స్టాక్ లేదన్న సమాధానంతో నిరుత్సాహ పడ్డారు. కోనసీమలో అన్ని మండలాల్లో ముఖ్యంగా మేజర్ పంచాయతీల వార్డుల అభ్యర్థుల్లో చాలా మంది కుక్కర్లు, ప్లాస్టిక్ స్టూల్స్ ఇచ్చే ఓట్లు అడుగుతున్నారు. ఇలా ఇస్తున్న గ్రామాల్లో ఓటర్లు చమత్కారంగా జోక్‌లు వేసుకుంటున్నారు. ఉంగరం (రింగ్) గుర్తు వచ్చిన సర్పంచ్ అభ్యర్థులు ఒక్కో బంగారం ఉంగరం ఓటర్లకు ఇస్తే ఎంత బాగుంటుందని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. -
ఏం చేస్తావో తేల్చుకో బాబు..!
సాక్షి, తిరుపతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా ఓటమిని అంగీకరించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం చంద్రగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ, తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో 82.27 శాతం, రెండోదశలో 80 శాతానికి పైగా స్థానాల్లో వైఎస్సార్ సీపీ గెలిచిందన్నారు. కుప్పంలో టీడీపీ కుప్పకూలిందని, వైఎస్సార్సీపీ 75 స్థానాల్లో విజయం సాధించిందన్నారు. కుప్పంలో టీడీపీ 14 స్థానాలకే పరిమితమైందన్నారు. కుప్పంలో టీడీపీకి వచ్చిన 14 స్థానాలూ అరకొర మెజార్టీతో వచ్చినవేనని ఆయన పేర్కొన్నారు. ‘‘కుప్పంలో మేం చేసిన అభివృద్ధే విజయానికి కారణం. చంద్రబాబు.. కుప్పంలోనే మెజారిటీ సాధించలేకపోయారు. చంద్రబాబు ఇప్పటికైనా ఓటమిని అంగీకరించాలి. తన పదవి నుంచి తప్పుకుంటే బాగుంటుంది.చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా? లేక రాజీనామా చేస్తారా అనేది తేల్చుకోవాలి. చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మాట్లాడాలని’’ మంత్రి పెద్దిరెడ్డి హితవు పలికారు. చదవండి: చంద్రబాబుకు భారీ షాక్: కుప్పంలో టీడీపీ ఢమాల్ -
అదే ఆనవాయితీ.. వారే సర్పంచ్‌లు..
మార్కాపురం: ఆ గ్రామంలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సర్పంచిగా ఎన్నికయ్యేది మాత్రం ఆ ఒక్క కుటుంబ సభ్యులే. 1965 నుంచీ రిజర్వేషన్లు మారినప్పుడు మినహా జనరల్‌కు కేటాయించిన ప్రతిసారీ వారే విజయం సాధించారు. మార్కాపురం నియోజకవర్గం తర్లుపాడు మండలం గొల్లపల్లి పంచాయతీకి చెందిన యక్కంటి వారిది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. 1965లో యక్కంటి రామిరెడ్డి సర్పంచిగా ఎన్నికయ్యారు. 1967లో ఆయన మరణంతో వచ్చిన బై ఎలక్షన్స్‌లో ఆయన కుమారుడు యక్కంటి వెంకటరెడ్డి సర్పంచిగా ఎన్నికై 1987 వరకు 20 ఏళ్లపాటు పదవీ బాధ్యతలు నిర్వర్తించాడు. ఆ తర్వాత 1995 నుంచి 2000 సంవత్సరం వరకు వెంకటరెడ్డి కుమారుడు యక్కంటి రామిరెడ్డి సర్పంచిగా పని చేశారు. ఆ పదవీ కాలం ముగిసిన వెంటనే 2001 నుంచి 2005 వరకు ఆయనే ఎంపీటీటీగా పనిచేశారు. 2005 నుంచి 2010 వరకు రామిరెడ్డి భార్య వెంకట లక్ష్మమ్మ ఎంపీటీసీగా పని చేశారు. మధ్యలో ఒక దఫా రిజర్వేషన్లు మరడంతో విరామం రాగా మళ్లీ 2014లో జనరల్ మహిళగా రిజర్వ్ అయిన పంచాయతీ ఎన్నికల్లో యక్కంటి వెంకట లక్ష్మమ్మ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పదవీ కాలం ముగుస్తున్న దశలో ఆమె అనారోగ్యంతో మృతి చెందారు. తాజా పంచాయతీ ఎన్నికల్లోనూ పంచాయతీ గొల్లపల్లి జనరల్ మహిళకు రిజర్వ్ కావడతో రామిరెడ్డి, వెంకటలక్ష్మమ్మ దంపతుల కుమార్తె శ్రావణిని సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్ సీపీ మద్దతుతో పోటీలో నిలిపారు. బీటెక్ చదివిన శ్రావణి 21 ఏళ్ల వయసులోనే గొల్లపల్లి గ్రామ సర్పంచిగా ఎన్నికై ఆ కుటుంబ ఆనవాయితీని కాపాడింది. చదవండి: 54 ఏళ్ల చరిత్రలో.. ఒకే ఒక్కడు ఇవేం పాడు పనులు.. కానిస్టేబుల్‌కు దేహశుద్ధి -
54 ఏళ్ల చరిత్రలో.. ఒకే ఒక్కడు
ఆ పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి ప్రతిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. 54 ఏళ్ల చరిత్రలో ప్రస్తుతం తొలిసారి సర్పంచ్ పదవి ఏకగ్రీవం అయ్యింది. ఒకేఒక ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎస్ఎ షుకూర్ చరిత్ర సృష్టించారు. కాగా అక్కడ ఆది నుంచి ముస్లిం మైనారిటీల హవానే కొనసాగుతోంది. పులిచెర్ల(కల్లూరు): మండలంలోని మేజర్ పంచాయతీ అయిన కల్లూరు 1965లో పంచాయతీగా ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు అన్నిసార్లు ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. ఆ ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలే ఆ గ్రామ సర్పంచ్‌లుగా ఎన్నిక అవుతున్నారు. ఇప్పుడు తొలిసారిగా ఈ గ్రామ సర్పంచ్‌గా వైఎస్సార్ సీపీ అభిమాని ఎస్ఎ షుకూర్ ఏకగ్రీవంగా ఎన్నికై రికార్డు సృష్టించారు. తొలి ఏకగ్రీవ సర్పంచ్‌గా ఆ పంచాయతీ చరిత్రలో ఆయన నిలి చిపోయారు. తొలిసారిగా 1967లో జరిగి న ఎన్నికల్లో నన్నే సాహెబ్ మొదటి సర్పంచ్‌గా గెలిచారు. అనంతరం హెచ్ఎస్ గఫూ ర్ 19 ఏళ్లు సర్పంచ్‌గా పనిచేశారు. ఆ తరువాత టీఎస్. గఫర్, ఎస్ఏ జుబేర్‌సాహెబ్, పీఎస్ నజీర్, హెచ్ఎస్ పర్విన్, పీ ఎస్ నజీర్, హెచ్ఎస్ షబానా సర్పంచ్‌లుగా పనిచేశారు. ప్రస్తుతం ఎస్ఎ షు కూర్ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. ఈ పంచాయతీకి 54 ఏళ్ల తరువాత ప్రస్తుతం తొలిసారిగా పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. కాగా ఆది నుంచి ఇప్పటివరకు ముస్లిం మైనారిటీలే సర్పంచ్‌లుగా కొనసాగుతున్నారు. చదవండి: తండ్రి ఎమ్మెల్సీ.. తనయుడు సర్పంచ్.. ఇవేం పాడు పనులు.. కానిస్టేబుల్‌కు దేహశుద్ధి -
తుది విడతలో 553 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం
సాక్షి, అమరావతి: చివరి విడతగా ఈనెల 21న జరగాల్సిన గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 553 పంచాయతీ సర్పంచ్ పదవులు ఏకగ్రీవమైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించింది. తుది విడతలో జిల్లాల వారీగా ఏకగ్రీవమైన సర్పంచ్, వార్డు స్థానాల సంఖ్యతోపాటు మిగిలినచోట్ల ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నారన్న వివరాలను బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. నాలుగో విడతలో మొత్తం 3,299 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్లు జారీకాగా.. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. 553 పంచాయతీల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. రెండు పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు ఒక్కరు కూడా నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో మిగిలిన 2,744 చోట్ల సర్పంచ్ స్థానాలకు ఈ నెల 21వ తేదీన చివరి పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మొత్తం 7,475 మంది అభ్యర్ధులు సర్పంచ్ పదవులకు పోటీలో ఉన్నారు. చివరి విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో 33,435 వార్డులున్నాయి. వీటిలో 10,921 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 22,422 వార్డుల్లో ఈ నెల 21న జరగనున్న ఎన్నికల బరిలో 49,083 మంది పోటీలో ఉన్నారు. మిగిలిన 92 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. చదవండి: ప్రభంజనం: వైఎస్సార్సీపీ సంబరాలు.. పేదలపై భారం మోపలేం.. -
ప్రభంజనం: వైఎస్సార్సీపీ సంబరాలు..
సాక్షి, అమరావతి: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభిమానులు అఖండ విజయం సాధించడంతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం రాత్రి సంబరాలు జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చి నృత్యాలు చేశారు. ‘వైఎస్ జగన్ నాయకత్వం వర్ధిల్లాలి.. జై జగన్’ నినాదాలు మిన్నంటగా తాడేపల్లి ప్రాంతమంతా మార్మోగింది. ఆనందోత్సాహాల మధ్య ఒకరినొకరు ఆలింగనం చేసుకుని మిఠాయిలు పంచుకున్నారు. పార్టీ జెండాలను రెపరెపలాడిస్తూ ‘వైఎస్సార్సీపీ’ జిందాబాద్ అంటూ నినదించారు. సంతోషంతో పూలు జల్లుకుంటూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. బాణసంచా మోతలతో తాడేపల్లి ప్రాంతం దద్ధరిల్లింది. పురపాలక ఎన్నికల్లోనూ ఇదే ప్రభంజనం: మంత్రి బొత్స మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో వెల్లువెత్తిన విజయ ప్రభంజనమే త్వరలో జరిగే పురపాలక ఎన్నికల్లోనూ కొనసాగుతుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో నూరు శాతం స్థానాల్లో విజయ సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు. మొదటి, రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 80 శాతం, మూడో విడత ఎన్నికల్లో 90 శాతం వైఎస్సార్సీపీ అభిమానులు విజయం సాధించడం ఆనంద దాయకమన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాల వల్లే ప్రజలు ఈ ఫలితాలు ఇస్తున్నారన్నారు. కుప్పంలో ఎవరికి ఎక్కువ స్థానాలొచ్చాయో చంద్రబాబుకు తెలియదా అని బొత్స ప్రశ్నించారు. ముందే ఊహించాం: కన్నబాబు మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. కుప్పంలో వచ్చిన ఫలితాలు తమకేమీ ఆశ్చర్యం అనిపించలేదన్నారు. కుప్పంలో చంద్రబాబు కోట కూలుతుందని ముందే ఊహించామని చెప్పారు. కుప్పం అయినా ఇచ్ఛాపురం అయినా ఇవే ఫలితాలు పునరావృతమవుతాయన్నారు. టీడీపీ అంతర్జాతీయ పార్టీ అని, ఏపీలో కాకపోయినా.. అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో పోటీచేసే అవకాశం చంద్రబాబుకు ఉంటుందన్నారు. చంద్రబాబు ఇక పక్క రాష్ట్రాలు, దేశాలకు వెళ్లి పోటీ చేయాల్సిందేనని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఉదయభాను తదితరులు పాల్గొన్నారు. చదవండి: చంద్రబాబుకు భారీ షాక్: కుప్పంలో టీడీపీ ఢమాల్ కుప్పం కూడా చెప్పింది.. గుడ్ బై బాబూ -
చంద్రబాబుకు భారీ షాక్: కుప్పంలో టీడీపీ ఢమాల్
-
లైవ్: మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు..
సాక్షి, అమరావతి : బుధవారం ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 3.30 వరకు కొనసాగింది. నాలుగు గంటల ప్రాంతంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. 13 జిల్లాల్లోని 20 డివిజన్లు 160 మండలాల్లో మొత్తం 3221 పంచాయతీలు ఉండగా.. 579 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 2,639 సర్పంచ్,19,553 వార్డులలో ఓట్ల లెక్కింపు మొదలైంది. పంచాయతీల వారీగా ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకూ ఓవరాల్‌గా వైఎస్సార్సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు 2,291 మంది విజయం సాధించగా, టీడీపీ మద్దతు దారులు 263 చోట్ల గెలుపొందారు. బీజేపీ మద్దతుదారులు 13, ఇతరులు 96 చోట్ల గెలుపొందారు. జిల్లాల వారీగా మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల వివరాలు ప్రస్తుతానికి ఇలా ఉన్నాయి.. జిల్లా పార్టీ మద్దతుదారులు వైఎస్సార్సీపీ టీడీపీ బీజేపీ ఇతరులు శ్రీకాకుళం 195 37 0 0 విజయనగరం 196 9 0 1 విశాఖ 153 45 5 26 తూర్పు గోదావరి 123 15 1 23 పశ్చిమ గోదావరి 100 19 1 10 కృష్ణా 138 8 4 4 గుంటూరు 130 3 1 0 ప్రకాశం 152 23 0 0 నెల్లూరు 276 12 0 0 చిత్తూరు 193 18 0 0 కర్నూలు 191 25 1 12 అనంతపురం 188 25 0 10 వైఎస్సార్ జిల్లా 156 24 0 4 -
ఏపీలో మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఫోటోలు
-
నడిరోడ్డుపై టీడీపీ కార్యకర్తల వీరంగం
సాక్షి, విజయవాడ తూర్పు: ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో రాజకీయ విలువలకు విరుద్దంగా టీడీపీ నాయకులు నడిరోడ్డుపై రచ్చ చేశారు. సేకరించిన వివరాల ప్రకారం.. తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్‌కు టీడీపీ తరుపున కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండపనేని వాణి, అదే పార్టీకి చెందిన బొండా ఉమా అనుచరుడైన కోనేరు వాసుకు కొన్నేళ్లుగా ఆస్తి, సరిహద్దు వివాదం కొనసాగుతుంది. గుణదలలోని పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్నటువంటి ఆస్తికి ఎప్పటి నుంచో సరిహద్దు తగాదాలు చోటు చేసుకున్నాయి. మంగళవారం రాత్రి మరో మారు ఇరు వర్గాల మధ్య తగాదా మొదలైంది. వివాదం పెరిగి పెద్దది కావడంతో కొండపనేని వాణి కుమారుడు శ్రీకాంత్, కోనేరు వాసులు పరస్పరం దాడులకు దిగారు. ఒకరిపై మరోకరు నడిరోడ్డుపై దాడులకు పాల్పడ్డారు. కాగా స్థానిక సమస్యలు తెలుసుకునేందుకు అదే సమయంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ అభ్యర్థి భీమిశెట్టి ప్రవల్లిక పర్యటన కొనసాగుతుంది. ఇంటింటికి తిరుగుతూ స్థానికులను కలుస్తూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ప్రచారంలో ఉన్నారు. టీడీపీ నాయకుల మధ్య రేగిన గొడవను రాజకీయం చేస్తూ వైఎస్సార్ సీపీ నాయకులపై రుద్దే ప్రయత్నం చేశారు. దీనికి వత్తాసు పలుకుతూ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు తమ కార్యకర్తలు చేసిన రచ్చను సమర్ధించారు. ఏ ప్రమేయం లేకపోయినా వైఎస్సార్ సీపీ నాయకులు గొడవకు కారణమంటూ బురద చల్లే ప్రయత్నం చేశారు. ఈ మేరకు మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా టీడీపీ అభ్యర్థి వాణిని ప్రోత్సహించారు. వివరాలు సేకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎన్నికల నేప«థ్యంలో టీడీపీ నాయకులు తమపై అనవసరపు రాద్దాంతం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్ ఎన్నికలలో ఏలా అయినా గెలుపొందాలనే దురుద్దేశంతో టీడీపీ నాయులు ఇలాంటి చౌకబారు ఎత్తుగడలకు పాల్పడుతున్నారని స్థానికులు అభిప్రాయపడుతుండటం చర్చనీయాంశంగా మారింది.. విజయవాడ టీడీపీలో చీలిక ‘మీరంతా తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. అటో.. ఇటో.. ఎటో.. నిర్ణయించుకోండి. ఉంటే మాతో ఉండండి. లేదా ఎంపీతోనైనా వెళ్లిపోండి. ఏదో ఒక వైపు మాత్రమే నిలవాలి. అటూ ఇటూ రెండువైపులా ఉంటామంటే ఇక ఏమాత్రం కుదరదు. ఇందులో మొహమాటం ఏమీలేదు’ అని విజయవాడ నగర టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగుల్‌మీరాలు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులకు హకుం జారీచేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ పేరిట వారివురు కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశానికి 18 మంది కార్పొరేట్ అభ్యర్థులు, 19 మంది పార్టీ డివిజన్ అధ్యక్షులు హాజరయ్యారు. టార్గెట్ కేశినేని.. ప్రధానంగా ఎంపీని లక్ష్యంగా చేసుకుని సమావేశాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. కాగా మరో సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ సమావేశానికి గైర్హాజరు కావడంతో పాటు కేశినేని భవన్లో ఎంపీ కేశినేని నానితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తూర్పు శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ కూడా ఎంపీని ప్రత్యేకంగా కలవడం నగర టీడీపీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. లోకేష్ జోక్యంతోనే.. విజయవాడ టీడీపీ నాయకులు గ్రూపు తగాదాలతో తల్లడిల్లుతున్న నేపథ్యంలో తాజాగా ఎన్నికల నగారా మరింత అగ్గి రాజేసింది. అధిష్టానం ఆశీస్సులతో, ముఖ్యంగా లోకేష్ జోక్యంతోనే తాజా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని, ఈ పరిస్థితులను ఎంపీ కేశినేని నాని వర్గం తీవ్రంగా పరిగణిస్తోంది. పెత్తనాన్ని జీర్ణించుకోలేక.. పశ్చిమంలో టీడీపీ నాయకత్వం అక్కడి సీనియర్ నాయకులైన బుద్దా, జలీల్, మీరాలకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అప్పగించకపోగా నియోజకవర్గాన్ని సమన్వయ పరచుకోవాలని ఎంపీ కేశినేనికి గతంలో సూచించారు. దీంతో డివిజన్ ప్రెసిడెంట్లు, కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక దాదాపు ఎంపీ కనుసన్నల్లోనే జరిగింది. తమ నియోజకవర్గంలో కేశినేని పెత్తనాన్ని జీర్ణించుకోలేని బుద్దా, మీరాలు సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జి బొండా ఉమా, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌లతో చేతులు కలిపారు. సీనియర్ నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమ, ఇటీవలి కాలంలో లోకేష్‌తో అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న కొమ్మారెడ్డి పట్టాభిరాంలు కూడా పై గ్రూపుతో జతకట్టారు. కేశినేనికి ఇవన్నీ జీర్ణించుకోలేని పరిణామాలుగా మారాయి. మాకే అధిష్టానం మద్దతు ‘మన నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్జీలు అధిక శాతంలో ఉన్నారు. వారొచ్చి మనపై పెత్తనం చేస్తామంటే మనం ఎందుకు అంగీకరించాలి’ అని బుద్ధా, మీరాలు ప్రశ్నించినట్లు తెలిసింది. శ్వేతను మేయర్ అభ్యర్థిగా ప్రకటించలేదని చెబుతూ.. అధిష్టానం ఆశీస్సులు లేకపోతే మేం ఈ సమావేశాన్ని నిర్వహించగలమా అని నాయకులు ఇరువురూ ప్రస్తావించినట్లు సమాచారం. గూండారపు హరిబాబు కూతురు పూజిత గెలవలేదని, ఆమె స్థానంలో శివశర్మను పోటీలో నిలపాలని ఎంపీ కేశినేని ప్రతిపాదిస్తున్నారని చర్చకు లేవనెత్తగా ఆయన కార్పొరేట్ అభ్యర్థులు అందర్నీ గెలిపించగలరా అని నాయకులు ఎద్దేవా చేశారని తెలిసింది. పశ్చిమ నేతల భేటీలో.. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ నాయకులతో భేటీ అయిన బుద్దా, మీరాలు తమ అజెండాను స్పష్టంగా వెల్లడించారు. ఎంపీ కేశినేని కుమార్తె శ్వేతను మేయర్ అభ్యర్థిగా పార్టీ అధినేత ప్రకటించలేదని, ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబు తమందరి సమక్షంలో వెల్లడించారని స్పష్టం చేశారు. శ్వేత పేరు ఎంపీ స్వయం ప్రకటితమని, ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చేశారు. మేయర్ అభ్యర్థి ఫలానా వారని తేలిన పక్షంలో తమ ఎన్నికల ఖర్చుకు ఇస్తారని ఒకరిద్దరు ప్రస్తావించగా ఎంపీ కేశినేని ఇచ్చే మొత్తం కన్నా తాము రెండింతలు ఎక్కువగానే సమకూర్చుతామని బుద్దా, మీరాలు పోటీదారులకు భరోసా ఇచ్చారని ‘సాక్షి’కి అభ్యర్థులు తెలిపారు. -
పేట్రేగిన టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు..
సాక్షి, అనంతపురం: టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వర్గీయులు ఆగడాలు మితిమీరిపోయాయి. టీడీపీ మద్దతుదారులకు ఓట్లు వేస్తేనే సాగు, తాగునీరు ఇస్తామని బెదిరింపులకు దిగారు. టీడీపీ ఓడిపోతే తమ భూముల నుంచి హంద్రీనీవా నీరు వదలమని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పేరు చెరువుకు నీరు కావాలంటే టీడీపీకి ఓట్లు వేయాలని హుకుం జారీ చేశారు. ఉరవకొండ నియోజకవర్గంలో ఓటర్లను పయ్యావుల వర్గీయులు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. కాగా, పంచాయతీ ఎన్నికల్లో తమకు పోటీ లేకుండా చేసుకునేందుకు ప్రత్యర్థి అభ్యర్థులను కడతేరుస్తామని పయ్యావుల కేశవ్ అనుచరులు.. బెదిరింపులకు దిగడంతో ఈ నెల 10న బాధితులు పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. చదవండి: అచ్చెన్నా ఒళ్లు దగ్గర పెట్టుకో.. విజయవాడ టీడీపీలో తారస్థాయికి విభేదాలు.. -
తిత్లీ పాపం.. టీడీపీకి కోలుకోలేని దెబ్బ..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఉద్దానంలో టీడీపీ పతనం పతాక స్థాయికి చేరుకుంది. ఒకప్పుడు ఊరూరా చక్రం తిప్పిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు కనీసం వార్డు మెంబర్ స్థానాన్ని కూడా దక్కించుకోలేని దీన స్థితికి చేరుకున్నారు. దశాబ్దాల తరబడి పాలించిన వారు పనులు చేయకపోవడం, ఆపత్కాలంలో అక్రమాలకు పాల్పడడం పతనానికి హేతువులయ్యాయి. ముఖ్యంగా తిత్లీ తుఫాన్ పరిహారంలో చేసిన అక్రమాలు టీడీపీని కోలుకోలేని విధంగా దెబ్బకొట్టాయి. పరిహారం పంపిణీలో అర్హులకు అన్యాయం చేసి, అనర్హులకు లబ్ధి చేకూర్చిన టీడీపీ నేతలకు ఉద్దానం ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. ఏకపక్షంగా ఓట్లేసి టీడీపీ మద్దతుదారులుగా పోటీ చేసిన వారందరినీ కసి తీరా ఓడించారు. ఒంటరి మహిళల పింఛన్ల అక్రమాలు జరిగిన ప్రాంతాల్లో కూడా టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. మరోవైపు సంక్షేమ పథకాలు, ఉద్దానం అభివృద్ధికి పాటు పడుతున్న వైఎస్సార్సీపీ మద్దతుదారులను ప్రజలు నెత్తిన పెట్టుకున్నారు. ఆ పార్టీ మద్దతుదారులుగా పోటీ చేసిన వారిని అధిక సంఖ్యలో గెలిపించుకు న్నారు. తిత్లీ తుఫాన్ సమయంలో టీడీపీ నేతల పాల్పడిన అవినీతి అంతా ఇంతా కాదు. భూమి లేని వారికి, నష్టం జరగని వారికి పరిహారం ఇప్పించి, వాస్తవంగా భూములుండి, నష్టపోయిన వారికి అన్యాయం చేశారు. ఈ పాపంలో పాలు పంచుకున్న వారందరికీ తాజా పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారు. ఎమ్మెల్యేలు అచ్చెన్నాయు డు, బెందాళం అశోక్, మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామ సుందర్ శివాజీ కుటుంబీకులకు ప్రజలు షాకిచ్చా రు. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ స్వ గ్రామం ఉన్న కవిటి మేజర్ పంచాయతీలో వైఎస్సార్సీపీ మద్దతుదారు భారీ మెజారిటీతో విజ యం సాధించారు. ఈ మేజర్ పంచాయతీలో కూన రవికుమార్, బెందాళం అశోక్‌లు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేశారు. అయినా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అలాగే, గౌతు శ్యామ్ సుందర్ శివాజీ స్వగ్రామమైన సోంపేట పంచాయతీలోనైతే ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెజార్టీతో వైఎస్సార్సీపీ మద్దతుదారు విజయం సాధించారు. ఇక్కడ 18 వార్డులుండగా ఒక్కటి కూడా టీడీపీ గెలుచుకోలేకపోయింది. వైఎస్సార్సీపీ పూర్తిగా స్వీప్ చేసింది. తిత్లీ అక్రమాలకు పాల్పడ్డ వారిలో పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్న మాజీ ఎంపీపీ చిత్రాడ శ్రీనివాసరావు బలపరిచిన అభ్యర్థి ఓటమి పాలవ్వడం ఇక్కడ చర్చనీయాంశమైంది. పెద్ద శ్రీరాంపురంలో ప్రతి సారి గెలిచిన టీడీపీ ఈసారి మట్టి కరిచింది. బల్లెడ సుమన్ అనే సామాన్యుడి చేతిలో టీడీపీకి చెందిన సీనియర్ నేత మాదిన రామారావు ఓడిపోయారు. అలాగే, కంచిలి మండలంలోని చిన్న కొజ్జరియా, పెద్ద కొజ్జరియ, శ్రీరాంపురం, జాడు పూడి తదితర గ్రామాల్లో టీడీపీ మద్దతుదారులు ఘోరంగా ఓడిపోవడానికి తిత్లీ అక్రమాలే కారణంగా చెప్పుకోవచ్చు. ఒంటరి పింఛన్ల అక్రమాలు.. భర్తలున్న టీడీపీ మహిళలకు ఒంటరి మహిళల పింఛన్లు మంజూరు చేసి లబ్ధి చేకూర్చిన వైనం కూడా ఎన్నికల్లో ప్రభావం చూపింది. కళ్ల ముందే అనర్హులకు పింఛన్లు ఇవ్వడంపై ప్రజలు కన్నెర్ర చేశారు. ముఖ్యంగా పింఛన్ల అక్రమాలు జరిగిన బూర్జపాడు, ఈదుపురం, లొద్దపుట్టి, మండపల్లిలో టీడీపీ నేతలు ఘోరంగా ఓడిపోయారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో 98 పంచాయతీలకు గాను 83 పంచాయతీలను, పలాస నియోజకవర్గంలో 95 పంచాయతీలకు గాను 87 పంచాయతీలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుందంటే టీడీపీ అక్రమాలు ఎన్నికల్లో ఎంత ప్రభావం చూపాయో అర్థం చేసుకోవచ్చు. ప్రగతి పరుగులు.. ఉద్దానం ఏరియాలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కూడా టీడీపీ పునాదులను పెకిలించేశాయి. కిడ్నీ సమస్య పరిష్కారానికి చేస్తు న్న కృషి, స్వచ్ఛమైన తాగునీరందించేందుకు చేపడుతున్న కార్యక్రమాలు ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రభావం చూపాయి. ముఖ్యంగా కిడ్నీ రోగుల కోసం ఏర్పాటు చేస్తున్న రీసెర్చ్ సెంటర్, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్లు ఎన్నికల్లో ప్రజలను ఆలోచింప చేశాయి. అలాగే ఉద్దానం ఏరియాలో స్వచ్ఛమైన తాగునీరందించేందుకు చేపడుతున్న రూ.700కోట్ల మంచినీటి ప్రాజెక్టు, మత్స్యకారుల కోసం నిర్మిస్తున్న మంచినీళ్లపేట జెట్టీ, కిడ్నీ రోగులకు రూ. 10వేల పింఛను, ఇవన్నీ ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కారణమయ్యాయి. వైఎస్సార్సీపీ మద్దతుదారులకు మందసలో 2965 ఓట్ల మెజారీ్ట, సోంపేటలో 2841 ఓట్ల మెజారీ్ట, కవిటిలో 1700పైగా ఓట్ల మెజార్టీ వచ్చిందంటే ఆషామాషీ కాదు. పూండి గోవిందపురంలో ఎప్పుడూ టీడీపీయే గెలిచేది. జమీందారి వ్యవస్థ కొనసాగేది. ఆయనెవరు బొట్టు పెడితే వాళ్లే గెలిచేవారు. ఈసారి ఆ పరిస్థితి మారింది. అక్కడ వైఎస్సార్సీపీ గెలిచింది. లక్ష్మీపురం పంచాయతీలో టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కృష్ణమూర్తినాయుడు కుటుంబీకులు గెలిచేవారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. సోంపేట, మందస, మెట్టూరు, గుణుపల్లి, చీపురుపల్లి, రేయపాడు నగరంపల్లిలో ప్రతి సారి టీడీపీయే గెలిచేది. తొలిసారిగా ఘోరంగా ఓటమి పాలైంది. (చదవండి: విజయవాడ టీడీపీలో తారస్థాయికి విభేదాలు) మరింత వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు.. -
టీడీపీ ప్రలోభాలపై చర్యలు తీసుకోవాలి: వైఎస్సార్సీపీ
విజయవాడ: పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అక్రమాలకు పాల్పడుతున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా విజయవాడలో ఎన్నికల సంఘం కార్యదర్శి కన్నబాబును సోమవారం వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధులు నారాయణమూర్తి, రాజశేఖర్ రెడ్డి కలిసి వినతిపత్రం సమర్పించారు. టీడీపీ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం గోవిందాపురం, వెల్లంక పంచాయతీలలో రీకౌంటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచుతూ ప్రలోభాలకు టీడీపీ మద్దతుదారులు గురి చేస్తున్నారని ఆరోపించారు. అలా చేస్తున్న తెలుగు దేశం పార్టీ మద్దతుదారులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఎన్నికల సంఘాన్ని కోరారు. చిత్తూరు జిల్లా తిమ్మాపురం వడ్డేపల్లి గ్రామాల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తల కుటుంబాలపై టీడీపీ చేసిన దాడులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
ఓటమి ఎరుగని ‘సర్పంచ్’ ఫ్యామిలీ అది!
కొమరోలు: అక్కడ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 పర్యాయాల పాటు ఒక్క కుటుంబం వారే సర్పంచ్‌గా ఉంటున్నారు. పార్టీలు ఏవైనా సర్పంచ్ పదవి ఆ కుటుంబాన్ని వరిస్తుంది. 1956 నుంచి గత స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఆ కుటుంబానికి గ్రామపంచాయతీ ప్రజలు పట్టం కడుతున్నారు. కొమరోలు మండలం రెడ్డిచెర్ల పంచాయతీలో ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. 1956లో మొదటగా రెడ్డిచెర్ల బాలవీరంరాజు సర్పంచ్‌గా గెలిచారు. అనంతరం బాలవీరంరాజు కుమారుడు లక్ష్మీనరసరాజు ఎన్నికయ్యారు. అనంతరం 5 పర్యాయాలు వారి కుటుంబంలోని రెడ్డిచెర్ల వెంకటేశ్వరరాజు సర్పంచ్‌గా ఉన్నారు. 1970 నుంచి 1976 వరకు వెంకటేశ్వరరాజు సర్పంచ్‌గా ఉండగా, 1983–87 వరకు మళ్లీ ఆయనే ఏకగ్రీవ సర్పంచ్‌గా ఉన్నారు. తరువాత 1987–1992 వరకు కూడా ఆయనే ఉన్నారు. 1995–2000 వరకు వెంకటేశ్వరరాజు భార్య అంజనమ్మ సర్పంచ్‌గా ఉన్నారు. అనంతరం రిజర్వేషన్ల ప్రాతిపదిక రావడంతో రెండు దఫాలు ఓసీ, ఎస్సీలకు వచ్చాయి. దీంతో పోటీలో నిలువలేదు. 2006–2011, 2014–2019లో వెంకటేశ్వరరాజు సర్పంచ్‌గా గెలుపొందారు. ఇప్పటి వరకు వీరి కుటుంబం గ్రామసర్పంచ్ ఎన్నికల్లో ఓటమి పాలు కాలేదు. వెంకటేశ్వరరాజు ఈమధ్య అనారోగ్యంతో మృతిచెందడంతో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో రెడ్డిచెర్ల గ్రామపంచాయతీకి బీసీ రాగా వెంకటేశ్వరరాజు కోడలు రెడ్డిచెర్ల ఉమాదేవి వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యరి్థగా పోటీలో నిలిచారు. (చదవండి: హతవిధీ.. ‘గుర్తు’ తప్పింది!) ఓటమిని జీర్ణించుకోలేక రోడ్డును తవ్వేశారు! -
ఇదేందయ్యా ఇది.. ఇదెప్పుడూ చూడలా!
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లా నరసింగ పాడు గ్రామంలోని ఓ పోలింగ్ కేంద్రంలో వార్డు అభ్యర్థులిద్దరు గుర్తులు తారుమారయ్యాయని రగడ నెలకొంది. అధికారులు రంగంలోకి దిగి ఆరా తీయగా.. ఇద్దరు అభ్యర్థులకు కేటాయించిన గుర్తుల్ని వారే పొరపాటు పడి ఒకరి గుర్తును మరొకరు ప్రచారం చేసుకున్నారు. వారికి అధికారికంగా కేటాయించిన అసలు గుర్తులేమిటో అధికారులు వివరించడంతో నాలుక్కరుచుకోవడం అభ్యర్థుల వంతయ్యింది. అభ్యర్థుల్లో ఒకరైన సకినాల ఏడుకొండలుకు గౌను, మరో అభ్యర్థి పొదిలి వెంకటేశ్వర్లుకు ప్రెషర్ కుక్కర్‌ను అధికారులు కేటాయించగా.. అభ్యర్థులు పొరబడి పోటీ అభ్యర్థి గుర్తును తమదిగా ప్రచారం చేసుకున్నారు. (చదవండి: ఓటమిని జీర్ణించుకోలేక రోడ్డును తవ్వేశారు!) ప్రజా తీర్పును వక్రీకరిస్తావా? -
‘ఎప్పుడైనా ఓకే.. అందుకు సిద్ధం’
సాక్షి, విశాఖపట్నం: ఎస్ఈసీ ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. మాయ, మోసం, దగాలో టీడీపీ పుంజుకుంటోందని ఆయన విమర్శించారు. మొదటిదశలో 3,244, రెండో దశలో 3,328 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయని తెలిపారు. రెండో దశ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 2639, టీడీపీ 536, బీజేపీ 6,జనసేన 36, ఇతరులు 108 స్థానాలు గెలిచారని తెలిపారు. ఏకగ్రీవాలతో కలిసి వైఎస్సార్సీపీ మద్దతుదారులు 2,639 మంది గెలిచారని ఆయన వెల్లడించారు. చంద్రబాబులా అంకెలగారడీ చెప్పడం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. టీడీపీ దాడులు హేయమైన చర్య: మంత్రి బాలినేని ప్రకాశం: పంచాయతీ ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభంజనం స్పష్టమైందని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్లే వైఎస్సార్ సీపీ మద్దతుదారులను ప్రజలు గెలిపించారని తెలిపారు. టీడీపీ ఆధిపత్యం గ్రామాల్లో కూడా వైఎస్సార్ సీపీ మద్దతుదారులు విజయం సాధించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్సీపీదే గెలుపు అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అద్దంకి నియోజకవర్గంలో ఓటమిని తట్టుకోలేకే వైఎస్సార్ సీపీ నేతలపై దాడికి పాల్పడ్డారని, టీడీపీ దాడులు హేయమైన చర్య అని మంత్రి బాలినేని మండిపడ్డారు. (చదవండి: ఆ దమ్ము టీడీపీకి ఉందా..?: పెద్దిరెడ్డి సవాల్) పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ సీనియర్లకు ఎదురుదెబ్బ -
ఓటమి జీర్ణించుకోలేక.. రెచ్చిపోతున్న టీడీపీ నేతలు
సాక్షి, ప్రకాశం/గుంటూరు: ఓటమిని జీర్ణించుకోలేక టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు. ప్రకాశం జిల్లా ఎస్ఎల్.గుడిపాడు, వైదన గ్రామాల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారుల విజయం సాధించగా, ఓర్చుకోలేని టీడీపీ నేతలు.. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి చేశారు. కారుతో పాటు రెండు బైకులను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. గ్రామాల్లో ఉంటే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. టీడీపీ నేతల దాడులపై వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు: జిల్లాలో వినుకొండ మండలం విట్టంరాజుపల్లిలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. విట్టంరాజుపల్లిలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు సుజాత గెలుపొందగా, ఓటమిని జీర్ణించుకోలేక వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ కార్యకర్తలను ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పరామర్శించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లపై రాళ్ల దాడి.. జిల్లాలోని నూజెండ్ల మండ లంలో టీడీపీ నేతలు బరితెగించారు. ములకలూరులో వైఎస్సార్ సీపీ మద్దతుదారు కోటేశ్వరమ్మ విజయం సాధించగా, ఓటమిని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు.. వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లపై రాళ్ల దాడికి పాల్పడ్డారు.టీ డీపీ నేతల రాళ్ల దాడిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. (చదవండి: పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ సీనియర్లకు ఎదురుదెబ్బ) ఆ దమ్ము టీడీపీకి ఉందా..?: పెద్దిరెడ్డి సవాల్ -
ఫలితాలపై చంద్రబాబువి తప్పుడు లెక్కలు
-
ఆ దమ్ము టీడీపీకి ఉందా..?: పెద్దిరెడ్డి సవాల్
సాక్షి, చిత్తూరు: ఎన్నికల్లో గెలిచే దమ్ము, ధైర్యం టీడీపీకి లేదని రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు సహా టీడీపీ నేతలు పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభంజనం స్పష్టమైందని.. వైఎస్సార్ సీపీ మద్దతుదారులు ఘన విజయాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు. మూడు, నాలుగో విడతల్లో కూడా ఇలాంటి ఫలితాలే వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పుంగనూరు, తంబల్లపల్లి, మాచర్లలో ఎన్నికలు నిలిపేయాలని టీడీపీ నేతలు కోరడం సిగ్గు చేటని మంత్రి ధ్వజమెత్తారు. ఎన్నికల్లో గెలవలేక టీడీపీ కోర్టుల్లో కేసులు వేస్తోందని, చంద్రబాబు తానా అంటే కొన్ని ఛానల్స్, పత్రికలు తందానా అంటున్నాయని విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు దమ్ముంటే ప్రజల మద్దతుతో ఎన్నికల్లో గెలవాలని పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. ఎన్నికల ఫలితాలపై చంద్రబాబువి తప్పుడు లెక్కలని మంత్రి పెద్దిరెడ్డి కొట్టి పారేశారు. ఆయన.. కుంభకర్ణుడు కన్నా ఎక్కువ: మంత్రి వెల్లంపల్లి విజయవాడ: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనకు ప్రజలు పట్టం కట్టారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో మరో పార్టీ లేకుండా ప్రజలు తీర్పు చెప్పారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో రెండో దశలో కూడా వైఎస్సార్ సీపీ మద్దతుదారులు ఘన విజయం సాధించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్సార్ సీపీదే గెలుపు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా విజయవాడలోని 64 డివిజన్లు వైఎస్సార్ సీపీదే గెలుపు అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలో లక్షమంది ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత తమదేనన్నారు. రూ.600 కోట్లతో విజయవాడలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని.. కుంభకర్ణుడు కన్నా ఎక్కువ అని వెల్లంపల్లి ఎద్దేవా చేశారు. కేశినేని నాని ఎంపీగా ఉండి నిధులు తేలేని అసమర్థుడని.. మేయర్ పీఠం అంచులకు కూడా ఆయన రాలేడని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దుయ్యబట్టారు. (చదవండి: పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ సీనియర్లకు ఎదురుదెబ్బ) టీడీపీ కంచుకోటలు బద్దలు -
పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ సీనియర్లకు ఎదురుదెబ్బ
సాక్షి, అనంతపురం: పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ సీనియర్లకు ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రులు పరిటాల సునీత, కాల్వ శ్రీనివాస్, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌లకు స్థానిక ఎన్నికలు గట్టి షాకే ఇచ్చాయి. పరిటాల సొంత మండలం రామగిరిలో వైఎస్సార్ సీపీ మద్దతుదారుల పాగా వేయడంతో 26 ఏళ్ల పరిటాల ఆధిపత్యానికి చెక్ పడింది. మండలంలో 7 స్థానాల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు గెలిచారు. రామగిరి, పేరూరు, కుంటిమద్ది, పోలేపల్లి, కొండాపురం, గంతిమర్రి, చెర్లోపల్లి, ఎంసీ పల్లి పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఘన విజయం సాధించారు. ధర్మవరం నియోజకవర్గంలోని 70 పంచాయతీల్లో 63 వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు గెలుపొందారు. రాయదుర్గం బాధ్యతలు చూస్తున్న మాజీ మంత్రి కాల్వకు ఘోర పరాభవం ఎదురయ్యింది. రాయదుర్గం నియోజకవర్గంలో 87 పంచాయతీ లకు గాను 70 స్థానాల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారుల విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. ఉరవకొండ నియోజకవర్గం బెలుగుప్ప మండలంలో పయ్యావుల పట్టుకోల్పోయారు. బెలుగుప్పలోని 19 పంచాయతీల్లో 15 స్థానాల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు జయకేతనం ఎగరవేశారు. కళ్యాణదుర్గం టీడీపీ ఇంఛార్జ్ ఉమామహేశ్వర్‌నాయుడు సొంత పంచాయతీ అంకంపల్లిలో టీడీపీ ఓటమి పాలైంది. (చదవండి: గందరగోళమే లక్ష్యం.. ఓడినా నాదే పైచేయి!) టీడీపీ కంచుకోటలు బద్దలు -
కొంప ముంచిన ‘పదకొండు’
తిరుపతి రూరల్: మనిషికి మతిమరుపనేది సహజం. జాగ్రత్తగా ఉండాల్సిన చోటా పొర పాట్లు చేస్తుంటారు. అచ్చం అలాంటిదే స్థానిక సమరంలో చోటు చేసుకుంది. తిరుపతి రూర ల్ మండలం పెరుమాళ్లపల్లె పంచాయతీలో రెండో విడత ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులు నామినేషన్ పత్రం డిక్లరేషన్‌లో 11వ తేదీ వేయడం మరిచిపోయారు. దీంతో అందరి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. (చదవండి: అక్కడ అలా లేదు.. మెడలో రెండు పార్టీలు!) గందరగోళమే లక్ష్యం.. ఓడినా నాదే పైచేయి! -
అక్కడ అలా లేదు.. మెడలో రెండు పార్టీలు!
కోడూరు (అవనిగడ్డ): పంచాయతీ ఎన్నికలు.. పైగా పార్టీలకు అతీతం.. కానీ అక్కడ అలాలేదు. ఆ అభ్యర్థి మెడలో ఏకంగా రెండు పార్టీల కండువాలు వేసుకుని ప్రచారం చేయడం చర్చనీయాంశంగా మారింది. కృష్ణా జిల్లా కోడూరు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న మద్దూరి సునీత మెడలో టీడీపీ, జనసేన పార్టీ కండువాలు వేసుకుని ప్రచారం చేస్తుండటంపై స్థానికులు నివ్వెరపోతున్నారు. (చదవండి: ఒక ఊరు.. మూడు గ్రామాలు.. రెండు పంచాయతీలు!) గందరగోళమే లక్ష్యం.. ఓడినా నాదే పైచేయి! -
ఒక ఊరు.. మూడు గ్రామాలు.. రెండు పంచాయతీలు!
కొమరోలు: చూడ్డానికి ఒకే ఊరిలా ఉంటుంది.. కానీ మూడు గ్రామాలు కలిసిన ఊరది. ఆ ఊర్లో రెండు పంచాయతీలున్నాయి. అక్కడి ఓటర్లు ఇద ్దరు సర్పంచ్‌లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఆ మూడు ఊర్లు రెండు మండలాలుగా విభజిం చడంతో ఈ విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని ఓ ఊరు, గిద్దలూరు మండల పరిధిలోని రెండు ఊర్ల కలయికగా పొదలకొండపల్లె గ్రామం ఏర్పడింది. మూడు గ్రామాల కలయికతో విస్తీర్ణం పెద్దదిగా ఉంటుంది. గిద్దలూరు మండల పరిధిలో క్రిష్ణం రాజుపల్లె, పొదలకొండపల్లె గ్రామాలు భౌగోళికంగా కలిసి ఉండగా, కొమరోలు మండల పరిధిలో పొట్టిరెడ్డిపల్లె గ్రామం కూడా ఆ గ్రామాల్లోనే మిళితమై ఉంది. ఈ గ్రామాలను తంబళ్లపల్లె గ్రామానికి వెళ్లే రహదారి రెండు మండలాలుగా వేరు చేస్తుంది. పొట్టిరెడ్డిపల్లె గ్రామంలోని 311 మంది ఓటర్లు, కొమరోలు మండలంలోని 3 కి.మీ దూరంలో ఉన్న ద్వారకచర్ల పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేస్తారు. క్రిష్ణంరాజుపల్లె్ల, పొదలకొండపల్లె గ్రామాల్లోని 1,950 మంది పొదలకొండపల్లె గ్రామంలో ఓటేస్తారు. (చదవండి: గందరగోళమే లక్ష్యం.. ఓడినా నాదే పైచేయి!) ఎన్టీఆర్ అత్తగారి ఊళ్లో టీడీపీ ఓటమి -
గందరగోళమే లక్ష్యం.. ఓడినా నాదే పైచేయి!
సాక్షి, అమరావతి: రెండో దశ పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రజలు టీడీపీకి చెంపపెట్టు లాంటి తీర్పు చెప్పినా ఆ పార్టీ అధిష్టానం, నాయకులు మభ్యపుచ్చుకుంటూ విజయం సాధించినట్లు ప్రచారం చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తొలిదశ ఎన్నికల్లోనూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన పరివారం ఇలాగే వ్యవహరించిన విషయం తెలిసిందే. తాజాగా వెలువడ్డ పంచాయతీ ఫలితాల్లో దాదాపు అన్నిచోట్లా వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయభేరీ మోగించినా టీడీపీ నేతలు మాత్రం మంగళగిరిలోని తమ పార్టీ కార్యాలయంలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకోవడం గమనార్హం. అత్యధిక పంచాయతీలను గెలుచుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫలితాలు పూర్తిగా వెలువడే వరకు ఎదురు చూడాలని సంయమనం పాటిస్తుండగా టీడీపీ నాయకులు మాత్రం ఓడిపోయి కూడా జబ్బలు చరుచుకుంటూ మభ్యపుచ్చుకోవడం పట్ల ఆ పార్టీ సీనియర్ నాయకులే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వైఎస్సార్ సీపీ మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటగా టీడీపీ సోషల్ మీడియా వింగ్ మాత్రం తాము ప్రభంజనం సృష్టించినట్లు ప్రచారానికి తెర తీసింది. ఫలితాల టేబుల్ అంటూ రాత్రి 9 గంటల తర్వాత టీడీపీ కార్యాలయం ఒక జాబితాను మీడియాకు లీక్ చేసింది. అందులో టీడీపీ 343 పంచాయతీలను గెలుచుకుందని, వైఎస్సార్సీపీ 546 పంచాయతీల్లో నెగ్గిందని పేర్కొంది. ఇలా రకరకాల ప్రచారాల ద్వారా గందరగోళానికి గురి చేసే ఎత్తుగడను చంద్రబాబు బృందం అనుసరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. (చదవండి: ఎన్టీఆర్ అత్తగారి ఊళ్లో టీడీపీ ఓటమి) టీడీపీ కంచుకోటలు బద్దలు -
‘కృష్ణా’లో ఫలితం తేల్చిన ఒక్క ఓటు..
సాక్షి, అమరావతిబ్యూరో: కృష్ణా జిల్లాలోని అతిచిన్న పంచాయతీ అయిన నందివాడ మండలం గండేపూడి గ్రామ పంచాయతీకి శనివారం ఎన్నిక జరిగింది. అక్కడ బరిలో నిలిచిన సర్పంచి అభ్యర్థి ఒకే ఒక్క ఓటుతో విజయం సాధించారు. ఈ గ్రామ జనాభా 196 కాగా ఓటర్లు 150 మంది. సర్పంచి పదవి కోసం వైఎస్సార్సీపీ మద్దతుదారు కర్నాటిక సత్యనారాయణ, టీడీపీ బలపరచిన భీమవరపు పార్వతిలు పోటీ పడ్డారు. 150 ఓట్లలో 142 ఓట్లు పోలయ్యాయి. వీటిలో సత్యనారాయణకు 71 ఓట్లు, పార్వతికి 70 ఓట్లు పోలవగా నోటాకు ఒక ఓటు వేశారు. దీంతో సత్యనారాయణ ఒక్క ఓటు మెజారిటీతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. అతి తక్కువ ఓట్లున్న ఈ గ్రామ ఫలితమే జిల్లాలో తొలిసారిగా వెలువడింది. కాగా, తొలివిడతలో విజయవాడ డివిజన్లోకెల్లా చిన్న గ్రామమైన కంకిపాడు మండలం కందలంపాడు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి బాయిరెడ్డి నాగరాజు ఒక్క ఓటుతోనే గెలుపొందారు. నాగరాజుకు 103, ప్రత్యర్థి సుబ్రహ్మణ్యంకు 102 ఓట్లు వచ్చాయి. దీంతో నాగరాజు ఒక్క ఓటు మెజార్టీతో సర్పంచి పదవి దక్కించుకున్నారు. (చదవండి: ఎన్టీఆర్ అత్తగారి ఊళ్లో టీడీపీ ఓటమి) మూడో విడత ఏకగ్రీవాల జోరు -
పంచాయతీ ఎన్నిక: వైఎస్సార్ సీపీ ప్రభంజనం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలలోనూ వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ప్రభంజనం కొనసాగుతోంది. ఇప్పటివరకు 1299 పైగా స్ధానాల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. జిల్లా విజయం సాధించిన స్థానాలు శ్రీకాకుళం 144 విజయనగరం 91 విశాఖ 99 తూర్పు గోదావరి 58 పశ్చిమ గోదావరి 57 కృష్ణా 67 గుంటూరు 119 ప్రకాశం 120 నెల్లూరు 95 చిత్తూరు 101 కర్నూలు 177 అనంతపురం 96 వైఎస్సార్ జిల్లా 75 -
పెళ్లి దుస్తుల్లోనే పోలింగ్ కేంద్రానికి..
శ్రీకాకుళం: జిల్లాలో కొత్తగా పెళ్లైన జంటలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పలాస మండలం బొడ్డపాడులో ఓ జంట ఓటు వేయడానికి రాగా, వజ్రపుకొత్తూరు మండలం చిన్నవంక గ్రామపంచాయతీ పరిధిలోని గుల్లలపాడు గ్రామానికి చెందిన మరొక జంట కూడా తమ ఓటు వేయడానికి పెళ్లి దుస్తుల్లోనే పోలింగ్ కేంద్రానికి వచ్చింది. బొడ్డపాడులో రమేష్, సింధూల వివాహం జరిగిన వెంటనే ఓటు హక్కును వినియోగించుకోగా, మరొక జంట గౌతమీ-యోగేశ్వరరావులు తమ ఓటును వేశారు. వివాహం జరిగిన అనంతరం తన భర్తతో కలసి చిన్నవంక పోలింగ్ బూత్ కి చేరుకొని గౌతమీ.. ఓటు వినియోగించుకున్న అనంతరం మురిపింటివాని పేట చేరుకొని అక్కడ వరుడు యోగేశ్వరరావు ఓటును వినియోగించుకున్నారు. నూతన దంపతులు ఓటు హక్కును వినియోగించుకోవడం పట్ల జిల్లా కలెక్టర్ జె నివాస్ అభినందించారు. వీరు యువతకు ఆదర్శప్రాయంగా నిలిచారని ప్రశంసించారు. కాగా, రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. శనివారం మధ్యాహ్నం గం. 3.30వరకూ పోలింగ్ జరగ్గా, నాలుగు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. రెండో దశలో 539 చోట్ల సర్పంచి పదవులు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. దాంతో రెండో విడతలో 2,786 పంచాయతీలు, 20,817 వార్డులకు పోలింగ్ జరిగింది. -
ఏపీ పంచాయతీ ఎన్నికలు: ఫలితాలపై ఉత్కంఠ
-
ఏపీ: రెండో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇలా..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఒక్కోక్కటిగా వెలువడుతున్నాయి. శనివారం మధ్యాహ్నం గం. 3.30వరకూ పోలింగ్ జరగ్గా, నాలుగు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. రెండో దశలో 539 చోట్ల సర్పంచి పదవులు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. దాంతో రెండో విడతలో 2,786 పంచాయతీలు, 20,817 వార్డులకు పోలింగ్ జరిగింది. ఇప్పటివరకూ ఓవరాల్‌గా వైఎస్సార్సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు 2,477 మంది విజయం సాధించగా, టీడీపీ మద్దతు దారులు 500 చోట్ల గెలుపొందారు. బీజేపీ మద్దతుదారులు 14, ఇతరులు 38 చోట్ల గెలుపొందారు. రెండో విడతలో మొత్తంగా 3,328 పంచాయతీ ఎన్నికల ఫలితాల వివరాలు ప్రస్తుతానికి ఇలా.. జిల్లా పార్టీ మద్దతుదారులు వైఎస్సార్సీపీ టీడీపీ బీజేపీ ఇతరులు శ్రీకాకుళం 243 28 0 1 విజయనగరం 284 63 1 12 విశాఖ 189 58 1 2 తూర్పు గోదావరి 153 24 7 2 పశ్చిమ గోదావరి 128 23 3 2 కృష్ణా 144 35 1 4 గుంటూరు 177 42 0 3 ప్రకాశం 228 36 0 0 నెల్లూరు 166 22 0 2 చిత్తూరు 232 38 1 4 కర్నూలు 184 40 0 3 అనంతపురం 226 51 0 0 వైఎస్సార్ జిల్లా 150 19 0 3 -
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బరితెగింపు..