ఎస్‌ఎ షుకూర్
ఆ పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి ప్రతిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. 54 ఏళ్ల చరిత్రలో ప్రస్తుతం తొలిసారి సర్పంచ్ పదవి ఏకగ్రీవం అయ్యింది. ఒకేఒక ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎస్‌ఎ షుకూర్ చరిత్ర సృష్టించారు. కాగా అక్కడ ఆది నుంచి ముస్లిం మైనారిటీల హవానే కొనసాగుతోంది.
పులిచెర్ల(కల్లూరు): మండలంలోని మేజర్ పంచాయతీ అయిన కల్లూరు 1965లో పంచాయతీగా ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు అన్నిసార్లు ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. ఆ ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలే ఆ గ్రామ సర్పంచ్‌లుగా ఎన్నిక అవుతున్నారు. ఇప్పుడు తొలిసారిగా ఈ గ్రామ సర్పంచ్‌గా వైఎస్సార్ సీపీ అభిమాని ఎస్‌ఎ షుకూర్ ఏకగ్రీవంగా ఎన్నికై రికార్డు సృష్టించారు. తొలి ఏకగ్రీవ సర్పంచ్‌గా ఆ పంచాయతీ చరిత్రలో ఆయన నిలి చిపోయారు. తొలిసారిగా 1967లో జరిగి న ఎన్నికల్లో నన్నే సాహెబ్ మొదటి సర్పంచ్‌గా గెలిచారు.
అనంతరం హెచ్‌ఎస్ గఫూ ర్ 19 ఏళ్లు సర్పంచ్‌గా పనిచేశారు. ఆ తరువాత టీఎస్. గఫర్, ఎస్‌ఏ జుబేర్‌సాహెబ్, పీఎస్ నజీర్, హెచ్‌ఎస్ పర్విన్, పీ ఎస్ నజీర్, హెచ్‌ఎస్ షబానా సర్పంచ్‌లుగా పనిచేశారు. ప్రస్తుతం ఎస్‌ఎ షు కూర్ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. ఈ పంచాయతీకి 54 ఏళ్ల తరువాత ప్రస్తుతం తొలిసారిగా పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. కాగా ఆది నుంచి ఇప్పటివరకు ముస్లిం మైనారిటీలే సర్పంచ్‌లుగా కొనసాగుతున్నారు.
చదవండి: తండ్రి ఎమ్మెల్సీ.. తనయుడు సర్పంచ్..
ఇవేం పాడు పనులు.. కానిస్టేబుల్‌కు దేహశుద్ధి
Comments
Please login to add a commentAdd a comment